JioCinema
-
ఓటీటీలో థ్రిల్లర్ సినిమా.. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు
అమెరికన్ థ్రిల్లర్ సినిమా 'స్ట్రేంజ్ డార్లింగ్'(Strange Darling ) తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని ప్రచారంలో ఉంది. కానీ, ఆ విషయాన్ని దర్శకుడు జె.టి. మోల్నర్ ధృవీకరించలేదు ఆపై తిరస్కరించలేదు. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో (Amazon Prime Video) పాటు బుక్‌మైషోలో కూడా తెలుగు వర్షన్ రన్ అవుతుంది. అయితే తాజాగా జియో సినిమా(JioCinema) ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా స్ట్రేంజ్ డార్లింగ్ మూవీ తాజాగా తెలుగు స్ట్రీమింగ్కు వచ్చేసింది.గతేడాది ఆగస్టు 23న విడుదలైన స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రానికి హాలీవుడ్లో మంచి రెస్పాన్సే వచ్చింది. ఐఎమ్బిడి రేంటిగ్ కూడా 7కు పైగా ఉండటంతో నెటిజన్లు కూడా ఆసక్తి చూపారు. కానీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా కలెక్షన్స్‌ను అయితే రాబట్టలేకపోయింది. అయితే, థ్రిల్లింగ్‌తో పాటు బోల్డ్ సినిమాలను ఇష్టపడే వారిని మాత్రం నిరుత్సాహపరచలేదని చెప్పవచ్చు. జె.టి. మోల్నర్ తెరకెక్కించిన ఈ మూవీలో విల్లా ఫిజ్గెరాల్డ్, కైల్ గాల్నెర్ ప్రధాన పాత్రలలో మెప్పించారు.సినిమా నిడివి కేవలం 1:35 గంటలు మాత్రమే ఉంటుంది. ఇద్దరి మధ్య వన్ నైట్ స్టాండ్‌తో ప్రారంభమైన ఈ కథ ఫైనల్‌గా అనేక మలుపులు తిరుగుతుంది. ఫ్యామిలీతో పాటుగా కూర్చొని చూసే సినిమా ఎంతమాత్రం కాదు. అలాంటి పొరపాటైతే చేయకండని రివ్యూవర్లు కూడా చెప్పారు. స్ట్రేంజ్ డార్లింగ్ మూవీలో ది లేడీ పాత్రలో విల్లా ఫిట్గెరాల్డ్ నటించగా.. డెమోన్ క్యారెక్టర్‌ను గాల్నెర్ పోషించారు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో చిత్రం ఉంటుంది. థియేటర్స్‌లో చూసేంత సినిమా అయితే కాదని చెప్పవచ్చు. కానీ, ఓటీటీలో మాత్రం పక్క చూసేయవచ్చు. చివరి 40 నిమిషాలు మరీ వైలెంట్‌గా మూవీ మారిపోతుంది. ఓటీటీలో ఔట్‌స్టాండింగ్ మూవీ అని చెప్పవచ్చు. ఈ వీకెండ్లో అమెజాన్, జియో సినిమాలో మీరూ చూసేయండి. -
రూ.1కే హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.. ఎక్కడో తెలుసా..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన జియోసినిమా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరను తగ్గించింది. క్రికెట్ మ్యాచ్‌ల వంటి లైవ్ ప్రోగ్రామింగ్‌ను ఉచితంగా అందిస్తున్న కంపెనీ కేవలం రోజూ రూ.1కే హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలను అందించనుంది.రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ యాజమాన్యంలోని ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ జియోసినిమా దాని సబ్‌స్క్రిప్షన్‌ను మూడింట రెండు వంతులు తగ్గించి నెలకు రూ.29కి చేర్చింది. ఈ ప్లాన్‌లో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌తోపాటు 4K క్వాలిటీ, విదేశీ సినిమాలు, టీవీ సిరీస్‌లు, పిల్లల ప్రోగ్రామ్‌లను ఐదు భాషల్లో అందిస్తున్నట్లు వయాకామ్18 డిజిటల్ విభాగం సీఈఓ కిరణ్ మణి తెలిపారు. ‘నాలుగు డివైజ్‌ల్లో ఏకకాలంలో జియోసినిమాను యాక్సెస్ చేసేలా నెలకు రూ.89తో ఫ్యామిలీప్యాక్ను తీసుకొచ్చాం. జియోసినిమా చూడడం కుటుంబ సభ్యులకు అలవాటుగా మార్చడానికి సరసమైన ధరలతో సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందుబాటులో ఉంచాం. పిల్లల కంటెంట్‌తో కూడిన అతిపెద్ద లైబ్రరీ కూడా ఇందులో ఉంది’ అని మణి అన్నారు.ఇదీ చదవండి: నెట్ లేకుండానే ఫైల్ షేరింగ్.. ప్రముఖ కంపెనీ కొత్త ఫీచర్1 బిలియన్(100 కోట్లు) ప్లస్ వీక్షకుల కోసం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, సోనీ గ్రూప్, అమెజాన్ ప్రైమ్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు పోటీ పడుతున్నాయి. తాజాగా జియో సినిమా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మీడియా సంస్థల మధ్య పోటీని మరింత తీవ్రతరం చేస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాల్ట్ డిస్నీ విలీనానికి రిలయన్స్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జియోసినిమా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఉచితంగా ప్రసారం చేస్తోంది. -
వీకెండ్లో సినిమాల జాతర.. ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు చిన్న సినిమాలు వచ్చేస్తున్నాయి. సుందరం మాస్టర్, ఆర్జీవీ వ్యూహం, మమ్ముట్టి భ్రమయుగం థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు ఓటీటీ ప్రియులను అలరించే చిత్రాలు సిద్ధమయ్యాయి. అయితే గత రెండు వారాల్లో సంక్రాంతి సినిమాలు ఓటీటీల్లో సందడి చేశాయి. ఇక ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఆడియన్స్ ఓటీటీ వైపే చూస్తున్నారు. ఈ వీకెండ్లోనూ ఓటీటీ ప్రియులను అలరించేందుకు కొత్త చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఇందులో టాలీవుడ్ సినిమాలు లేనప్పటికీ.. డబ్బింగ్ మూవీస్ కాస్తా ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నాయి. వాటిలో పోచర్, మలైకోట్టై వాలిబన్, ది బరీడ్ ట్రూత్ లాంటి చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో దేశాన్ని కుదిపేసిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా వస్తోన్న ది బరీడ్ ట్రూత్‌పై అందరి కళ్లు ఉన్నాయి. వీటితో పాటు క్రైమ్ థ్రిల్లర్స్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. మరి ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మీరు కూడా చూసేయండి. ఈ వీకెండ్లో స్ట్రీమింగ్కు రానున్న చిత్రాలివే.. నెట్‌ఫ్లిక్స్ అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22 సౌత్ పా(ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 22 త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23 మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23 ఫార్ములా- 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23 ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23 ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్- ఫిబ్రవరి 23 మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ - ఫిబ్రవరి 24 అమెజాన్ ప్రైమ్ ది వించెస్టర్స్- ఫిబ్రవరి 22 పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23 అపార్ట్మెంట్ 404- (థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 23 ది సెకండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ ది గెలాక్సీ(కార్టూన్ సిరీస్)- ఫిబ్రవరి 23 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మలకోట్టై వాలిబన్- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23 జియో సినిమా సమ్మర్ హౌస్ సీజన్-8 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 23 లయన్స్ గేట్ ప్లే సా ఎక్స్(అమెరికన్ హారర్ ఫిల్మ్)- ఫిబ్రవరి 23 -
మరో ఓటీటీకి బ్లాక్‌బస్టర్ మూవీ.. కేవలం వారు మాత్రమే చూసే ఛాన్స్!
గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రం ఓపెన్ హైమర్. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ నామినేషన్స్‌లో ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఇటీవల ప్రకటించిన బాఫ్టా అవార్డుల్లో ఏడింటిని కైవసం చేసుకుంది. అయితే ఇప్పటికే ఓటీటీకి వచ్చేసిన ఓపెన్ హైమర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ కేవలం రెంట్ విధానంలో మాత్రం చూసే అవకాశం ఉంది. దీంతో తాజాగా మరో ఓటీటీకి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు. థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత హాలీవుడ్ మూవీ జియో సినిమాలో రాబోతోంది. మార్చి 21 నుంచి ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని జియో సినిమా అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే జియో ప్రీమియమ్ కస్టమర్స్ మాత్రమే ఓపెన్‌హైమర్ మూవీని ఓటీటీలో చూడవచ్చు. ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. 13 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ ఇటీవల ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్‌లో ఓపెన్ హైమర్ ఓరేంజ్‌లో అదరగొట్టింది. ఏకంగా పదమూడు విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న మూవీగా ఓపెన్ హైమర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కనీసం పది వరకు ఆస్కార్ అవార్డులు దక్కే అవకాశం ఉందని హాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాదిలో లాస్ ఎంజిల్స్ వేదికగా మార్చి 11న ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు. ఓపెన్ హైమర్ కథేంటంటే.. అణుబాంబు సృష్టికర్త ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీని తెరకెక్కించాడు. రెండో ప్రపంచయుద్ద సమయంలో అణుబాంబును తయారు చేయడానికి ఓపెన్ హైమర్ ఎలాంటి ప్రయోగాలు చేశాడు? తనను తాను ప్రపంచవినాశకారిగా ఓపెన్ హైమర్ ఎందుకు ప్రకటించుకోవాల్సి వచ్చిందనే కోణంలో రూపొందించారు. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్‌గా సిలియన్ మార్ఫీ, అమెరికా అధ్యక్షుడు లూయిస్ స్ట్రాస్‌గా రాబర్ట్ డౌనీ నటించారు. -
ఓటీటీకి స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించి చిత్రం '800'. ఈ చిత్రంలో స్లమ్ గాడ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా.. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించారు. అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సినీ ప్రేక్షకులతో పాటు క్రికెట్ అభిమానులను అలరించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళం, తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో రిలీజ్ కానుంది. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 800 కథేంటంటే.. ముత్తయ్య మురళీధరన్ అంటే 800 వికెట్లు తీసిన ఏకైన క్రికెటర్‌గానే అందరికి తెలుసు.అయితే ఈ 800 వికెట్లు తీయడానికి వెనుక ఆయన పడిన కష్టమేంటి? తమిళనాడు నుంచి వలస వెళ్లి శ్రీలంకలో సెటిల్ అయిన మురళీధరన్ ఫ్యామిలీ.. అక్కడ ఎలాంటి వివక్షకు గురైంది? వివక్షను, అవమానాలను తట్టుకొని శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న మురళీధరన్.. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. తొలిసారి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన మురళీధరన్.. జట్టు నుంచి ఎలా స్థానాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘చకింగ్ ’అవమానాలను ఎలా అధిగమించాడు? తన బౌలింగ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఎలా నిరూపించుకున్నాడు? శ్రీలంకలోని ఎల్టీటీఈ సమస్యపై ప్రభాకరన్‌తో ఎలాంటి చర్చలు జరిపాడు? ఆ ఆలోచన ఎలా వచ్చింది? 1000 వికెట్లు తీసే సామర్థ్యం ఉన్నప్పటికీ..ముందుగానే ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ‘800’ సినిమా చూడాల్సిందే. கிரிக்கெட் உலகை புரட்டி போட்ட #MuthiahMuralidaran என்னும் மாமனிதனின் உண்மை கதை. டிசம்பர் 2 முதல் #800 திரைப்படத்தை #JioCinema-வில் இலவசமாய் காணுங்கள்#800onJioCinema@Murali_800 @Mahima_Nambiar #MadhurrMittal @MovieTrainMP pic.twitter.com/as03GoaPyn — JioCinema (@JioCinema) November 14, 2023 -
IND VS AUS: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త
భారత క్రికెట్ అభిమానులకు రిలయెన్స్ వారి జియో సినిమా శుభవార్త చెప్పింది. ఈ నెల 22, 24, 27 తేదీల్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జియో సినిమా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్‌లను ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ సిరీస్ కోసం జియో సినిమా ప్రత్యేక కామెంటేటర్స్ ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందులో సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ఆకాశ్ చోప్రా, అమిత్ మిశ్రా, హనుమ విహారి, కిరణ్ మోరె, అనిరుద్ శ్రీకాంత్, శరణ్‌దీప్ సింగ్ తదితర మాజీ భారత క్రికెటర్లు ఉన్నారు. సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీలో, రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇండోర్‌లో, మూడో వన్డేలో రాజ్‌కోట్‌లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ ముగియగానే భారత్‌లోనే వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. అక్టోబర్ 5న జరిగే ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. కాగా, రిలయెన్స్ అనుబంధ సంస్థ అయిన వయాకామ్18 బీసీసీఐ మీడియా హక్కులను 5963 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే నుంచే బీసీసీఐతో వయాకామ్ ప్రయాణం మొదలుకానుంది. వాయకామ్ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి) టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కులను కూడా సొంతం చేసుకుంది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు స్పోర్ట్స్ 18 ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. ఇవే మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా ఇదివరకే ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను (ఐపీఎల్ డిజిటల్ రైట్స్) కూడా దక్కించుకుంది. -
IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు!
ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ ప్రకటనల ఆదాయం భారీ వృద్ధిని సాధించింది. ఏకంగా రూ.10,120 కోట్లు ఆర్జించింది. ఇందులో బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానులు, ప్రసారకర్తలు నేరుగా 65 శాతం ఆర్జించగా, మిగిలిన 35 శాతం ఆదాయం పరోక్షంగా వచ్చినట్లు ఓ నివేదిక పేర్కొంది. రూ. 4700 కోట్లు మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ ‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీకి చెందిన స్ట్రీమింగ్ రైట్స్ హోల్డర్ జియోసినిమా (JioCinema), టీవీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ప్రకటనల ద్వారా రూ. 4700 కోట్లు ఆర్జించాయి. రూ. 1450 కోట్లు ఫ్రాంచైజీలకు, రూ. 430 కోట్లు బీసీసీఐకి దక్కాయి. బీసీసీఐ, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లు.. ప్రకటనల మొత్తం ఆదాయంలో 65 శాతం ప్రత్యక్షంగా ఆర్జించగా మిగిలిన 35 శాతం పరోక్ష ఆదాయం అంటే సోషల్ మీడియా, సాంప్రదాయ మీడియా, ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చిందని నివేదిక పేర్కొంది. ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లకూ.. ఐపీఎల్ 2023లో డ్రీమ్ 11 వంటి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు రూ.2,800 కోట్లు ఆర్జించాయని నివేదిక పేర్కొంది. 2022 సీజన్లో రూ. 2,250 కోట్లు ఉన్న వీటి స్థూల ఆదాయం 24 శాతం పెరిగింది. కాగా ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ గత ఏడాది జూన్‌లో రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! -
ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2023 పోరులో ముంబై ఇండియన్స్ ట్రోఫీని గెలుచుకునే చివరి అవకాశాన్ని చేజేతులారా జార విడిచుకుంది. ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ సతీమణి, నీతా అంబానీ యాజమాన్యంలోని ఐపీఎల్ జట్టు గత రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయాన్ని మూట గట్టుకుని టైటిల్ పోరును నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారవ సీజన్ ద్వారా అంబానీ కుటుంబం ఎంత ఆర్జించింది అనేది హాట్‌టాపిక్‌గా నిలిచింది. టాప్ సక్సెస్ఫుల్ టీంగా భావించే ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీలు ఎన్ని వేల కోట్లు సంపాదించారు అనేదే లేటెస్ట్ టాక్. (మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? ) ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్‌లో 100 శాతం వాటాతో నీతా, ముఖేష్ అంబానీలే ఏకైక యజమానులుగా ఉన్నారు. మిలియన్ల డాలర్లు 2008లో ఈ జట్టును కొనుగోలు చేశారు. తొలి సీజన్లో జట్టు కొనుగోలుకు రూ. 916 కోట్లు వెచ్చించారు.ఇప్పటివరకు ఐదు టైటిళ్లను సాధించి, 2023 వరకు అత్యధిక సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్‌లను గెలుచుకుని ఆదాయం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గిందిలేదు. పెద్ద సంఖ్యలో స్పాన్సర్లను పొందిన జట్టు కూడా ఇదే. ది ట్రిబ్యూన్ ప్రకారం, ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యుయేషన్ రూ. 10,070 కోట్లకు పైమాటే. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 200 కోట్లుపెరిగింది. ఇప్పటివరకు అత్యంత లాభదాయకమైన జట్టు కూడా ముంబై ఇండియన్స్. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా వృద్ధిని నమోదు చేసిన ఏకైక జట్టు. (ఈస్ట్ హైదరాబాద్ రయ్ రయ్! ఎందుకో తెలుసా?) దీంతోపాటు టిక్కెట్ ధరలతో పాటు మీడియా స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనల సంపాదన కూడా భారీగానే ఉంది. ఇది అంతా ఒక ఎత్తయితే మరో ప్రధాన ఆదాయ వనరు జియో సినిమాకు విక్రయించిన ఐపీఎల్ హక్కుల ద్వారా ఆర్జించింది మరో ఎత్తు. తొలి ఐదు వారాల్లోనే జియోసినిమా రికార్డు స్థాయిలో 1300 కోట్ల వీడియో వీక్షణలను అందుకోవడం గమనార్హం. (Shantanu Narayen:189 బిలియన్ డాలర్ల కంపెనీకి సారధి: రోజుకు రూ.70 లక్షలు సంపాదన) రిలయన్స్ బ్రాండ్ Viacom18, Jio సినిమా ఐపీఎల్ టెలికాస్టింగ్ హక్కులను రూ. 22,290 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు జియో సినిమా ఐపిఎల్‌ని మొదటి హోస్ట్ చేయడం ద్వారా రూ. 23,000 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించింది. రాబోయే కొన్ని సంవత్సరాలలో వేల కోట్లను కూడా ఆర్జించనుందని అంచనా. దీంతో పాటు గ్లోబల్ ఫ్రాంచైజీల ద్వారా కూడా భారీ ఆదాయాన్నే సాధిస్తోంది రిలయన్స్. ఇదీ చదవండి: చేసిన పాపం ఎక్కడికి పోతుంది సుందరా! అనుభవించు: నెటిజన్లు ఫైర్ ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ న్యూస్, బిజినెస్అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
ఓటీటీలో బూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు సినిమాలకు ధీటుగా తయారవుతున్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరో హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్‌పై ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా ఓటీటీల కోసమే చిత్రాలను రూపొందిస్తున్న పరిస్థితి నెలకొంది. దర్శకుడు విజయ్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం బూ. ఈ థ్రిల్లర్ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తమిళం, తెలుగు భాషల్లో శనివారం నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీని గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు విజయ్ పేర్కొంటూ.. ఈ సినిమాను కరోనా సమయంలో రూపొందించినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన రామాంజనేయులు, ఎం. రాజశేఖర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ చిత్ర ఓటీటీ హక్కులను పొందిన జియో స్టూడియోకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ చిత్రంలో నటుడు విశ్వక్సేన్, నటి రకుల్ ప్రీతిసింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, రెబా మౌనిక జాన్, మంజిమా మోహన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారని పేర్కొన్నారు. జీవీ. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, సందీప్ చాయాగ్రహణం అందించారని తెలిపారు. చదవండి: త్రివిక్రమ్‌పై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు -
జియో సినిమా రికార్డ్ బద్దలు!
IPL 2023 CSK-GT match: జియో సినిమా (JioCinema) యాప్ తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో మే 23న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జియో సినిమాలో అత్యధిక వీక్షకుల సంఖ్యను సాధించింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో జియోసినిమా యాప్ ఏకకాల వీక్షకుల సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంది. కాగా ఈ ప్లేఆఫ్ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. జియో సినిమాలో ఇంతకుముందున్న వీవర్స్ రికార్డు 2.4 కోట్లు. ఇది ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మ్యాచ్ సందర్భంగా నమోదైంది. భారతదేశంలోని వీక్షకులందరికీ జియో సినిమా ఐపీఎల్ 2023ని ఉచితంగా ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 1300 కోట్ల వీవ్స్ వీక్షకుల ఎంగేజ్మెంట్ పరంగా జియో సినిమా రోజూ కొత్త మైలురాళ్లను దాటుతూనే ఉంది. ఈ యాప్‌లో మొత్తం వీక్షణలు ఇప్పటికే 1300 కోట్లను దాటాయి. ఇది ప్రపంచ రికార్డు అని ఆ కంపెనీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్ట్రీమింగ్ యాప్ ఐపీఎల్ కారణంగా రోజూ లక్షల కొద్దీ కొత్త వీక్షకులను సంపాదిస్తూనే ఉంది. ఒక్కో ప్రేక్షకుడికి ఒక్కో మ్యాచ్‌కి సగటు స్ట్రీమింగ్ సమయం ఇప్పటికే 60 నిమిషాలు దాటిపోయిందని కంపెనీ పేర్కొంది. ఇక స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనదారుల పరంగా జియో సినిమా 26 మార్క్యూ స్పాన్సర్లను సాధించగలిగింది. ఏ క్రీడా ఈవెంట్‌కైనా ఇదే అత్యధికం. ఇదీ చదవండి: జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ విలవిల.. టాటా చెప్పేస్తున్న లక్షల సబ్స్క్రైబర్లు -
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న యంగ్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యంగ్ హీరో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హారర్ మూవీ 'బూ'. డైరెక్టర్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడం లేదని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: చంపేస్తామని బెదిరించారు.. అడల్ట్ ఇండస్ట్రీలో ఇబ్బందులపై హీరోయిన్!) ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈనెల 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. (ఇది చదవండి: మెగాస్టార్ 'భోళాశంకర్'.. ఫోటోలు లీక్ చేసిన చిరు!) The next time you get a hiccup don’t look for water, look around, it could be a ghost! Exclusive World Premiere | May 27th @officialjiocinema#StreamingFree #BooOnJioCinema #JioCinema #BOOhttps://t.co/3oIFMqmZhR@Rakulpreet @VishwakSenActor @Nivetha_tweets @akash_megha… — Manjima Mohan (@mohan_manjima) May 23, 2023 -
జియో సినిమా షాకిచ్చిందిగా: ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ షురూ
సాక్షి, ముంబై: జియో సినిమా వినియోగదారులకు షాకిచ్చింది. ఊహించినట్టుగానే ఇప్పటిదాకా వినియోగదారులకు ఉచిత సబ్స్క్రిప్షన్లను అందిస్తున్న జియో సినిమా తాజాగా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది, దేశీయ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ , డిస్నీ వంటి ప్రపంచ ప్రత్యర్థులతో పోరాడేందుకు ఉచిత కంటెంట్ మోడల్ నుండి వైదొలిగింది. (మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి) దీని ప్రకారం జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ సంవత్సరానికి రూ. 999గా ఉంది. ఇది ఏకకాలంలో నాలుగు పరికరాల్లో కూడా పని చేస్తుంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవల ద్వారా HBO, మ్యాక్స్ ఒరిజినల్, Warner Bros ప్రత్యేకమైన కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఏడాది ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది . త్వరలోనే నెలవారీ ప్లాన్లు ప్రారంభించనుందని తెలుస్తోంది. జియో సినిమా, ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని ప్లాట్‌పాం జియోసినిమా పేరుతో ఓటీటీలో కూడా దూసుకొచ్చింది.మొదట్లో టెలికాం సేవలను ఉచితంగా అందించిన జియో, ఆ తరువాత పెయిడ్ సేవలను మొదలు పెట్టింది. అచ్చంగా ఆలాగే జియో సినిమా మొదట తన సేవలను ఉచితంగానే కస్టమర్లకు అందించింది. ముఖ్యంగా FIFA వరల్డ్ కప్ , IPL 2023ని ఉచితంగా స్ట్రీమింగ్‌తో మరింత ఆదరణ పొందింది. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్) కాగా జియో దెబ్బకు డిస్నీ ఏకంగా 84 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌లో 2శాతం క్షీణతను నమోదు చేసింది. మరోవైపు ప్రత్యర్థులతో ధీటుగా కంటెంట్ అందించేందకు జియో సినిమా a వివిధ ప్రొడక్షన్ స్టూడియోలతో చర్చలు జరుపుతోందనీ, రాబోయే నెలల్లో డజన్ల కొద్దీ టీవీ షోలు, మూవీలను హిందీ , తదితర భాషలలో పరిచయం చేయాలని యోచిస్తోందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. -
జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ విలవిల.. టాటా చెప్పేస్తున్న లక్షల సబ్స్క్రైబర్లు
కొత్తగా వచ్చిన స్ట్రీమింగ్ యాప్ జియోసినిమా (JioCinema) దెబ్బకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) విలవిలాడుతోంది. మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లను కోల్పోతోంది. జియోసినిమా మార్కెట్లో ప్రజాదరణ పెరుగుతున్న స్ట్రీమింగ్ యాప్‌గా మారింది. 2023 మొదటి త్రైమాసికంలో 10 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల వీక్షకుల నుంచి ఈ స్థాయిలో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా అందించడం. ఇదే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆసియాలో దాని సబ్‌స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో 4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఏకంగా 8.4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు హాట్‌స్టార్‌కు బై బై చెప్పేశారు. సబ్స్క్రైబర్లు బై..బై కంపెనీ ఆదాయ నివేదిక ప్రకారం.. 2023 మొదటి త్రైమాసికంలో డిస్నీ ప్లస్ పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 3.8 మిలియన్లు తగ్గి 57.5 మిలియన్లకు పడిపోయింది. అంతకుముందు త్రైమాసికంలోనూ 4 మిలియన్లకుపైగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది. 2023 ఏప్రిల్ 1 నాటికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 52.9 మిలియన్ల పెయిడ్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. క్యూ2లో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ఒక్కో పెయిడ్ సబ్‌స్క్రైబర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం 0.74 నుంచి 0.59 డాలర్లు తగ్గింది. జియోసినిమాకు కలిసొచ్చిన ఐపీఎల్ జియో సినిమా విజయానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది, ముఖ్యమైనది జియో సినిమా ప్రతిఒక్కరికీ ఉచితం. ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఛార్జ్ లేదు. అదే డిస్నీ హాట్‌స్టార్ ను వీక్షించాలంటే సబ్స్క్రిప్షన్ ఛార్జ్ చెల్లించాలి. జియో సినిమా విజయానికి అసలు కారణం ఐపీఎల్ ను ఉచితంగా చూసే అవకాశం. ఏదైనా ఉచితంగా వస్తున్నప్పుడు ఎవరైనా దాని కోసం ఎందుకు చెల్లించాలనుకుంటున్నారు? ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
ఓటీటీకి వచ్చేస్తున్న 'తోడేలు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'భేడియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరిట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. (ఇది చదవండి: ‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’) అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈనెల 26 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి నటించింది. (ఇది చదవండి: మనిషి తోడేలుగా మారితే ఏమవుతుంది.. ఆసక్తిగా భేడియా ట్రైలర్) కథేంటంటే.. ఢిల్లీకి చెందిన భాస్కర్(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) కలిసి అరుణాచల్‌కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్‌కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థియేటర్లలో సినిమా చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
జియో సినిమా ఉచితం కాదు.. ఇకపై డబ్బులు కట్టాల్సిందే!
ఐపీఎల్ సీజన్లో వినియోగదారుల్ని ఉచితంగా అలరిస్తున్న జియో సినిమా ఇకపై మరింత కాస్ట్లీగా మారనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఫ్రీగా జియో సినిమాను వీక్షించిన యూజర్లు డబ్బులు చెల్లించడం చర్చకు దారితీసింది. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలతో ఆదరణ పొందిన జియో సినిమా ఇప్పుడు దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు గట్టిపోటీ ఇవ్వనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు మే 28తో ముగియనున్నాయి. ఆలోపే కొత్త కంటెంట్‌ను యాడ్ చేసి యూజర్లకు అందించనున్నట్లు రిలయన్స్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ తరుణంలో జియో సినిమా తన యూజర్లకు డైలీ, గోల్డ్, ప్లాటినమ్ అంటూ మూడు ప్లాన్ లను అందించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకరోజు ప్లాన్ రూ.29 కాగా, 93 శాతం డిస్కౌంట్‌తో రూ.2కే అందించనున్నట్లు పేర్కొన్నాయి. ఇక గోల్డ్ ప్లాన్ రూ.299 కాగా, రూ.99కే పొందవచ్చు. 12 నెలల ప్లాటినమ్ ప్లాన్ ధర రూ.1199 ఉండగా, దానిని రూ.599కే సొంతం చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో నాలుగు డివైజ్‌లలో వీక్షించడంతో పాటు.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే సమయంలో ఎలాంటి ప్రకటనలు ప్రసారం అవ్వవని తెలుస్తోంది. కాగా, ఈ సరికొత్త ప్లాన్లపై జియో స్పందించాల్సి ఉంది. -
జియో సినిమాపై రిలయన్స్ కీలక నిర్ణయం
నెట్‌ఫ్లిక్స్, వాల్డిస్నీ వంటి గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌పామ్స్‌కు చెక్ పెట్టేందుకు రిలయన్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారంతో పాపులారిటీ పొందిన జియో సినిమాను లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌గా మార్చడానికి కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా జియో సినిమా యాప్‌లోకి 100కి పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లు అందుబాటులోకి తేనున్నది. తద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా రిలయన్స్ మీడియా కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్ పాండే మాట్లాడుతూ.. ఐపీఎల్ ద్వారా జియో సినిమా యాప్‌కు వచ్చిన ఆదరణ కొనసాగించడానికి జియో సినిమా యాప్‌లో కొత్త కంటెంట్ జత చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లను జియో యాప్ ద్వారా ఉచితంగా ప్రేక్షకులు.. కొత్త కంటెంట్ జత చేశాక చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామన్నారు. అయితే ఎంత చార్జీ వసూలు చేయాలన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. మరోవైపు వచ్చేనెల 28తో ఐపీఎల్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. అప్పటికల్లా కొత్త కంటెంట్ యాడ్ చేయాలని రిలయన్స్ భావిస్తున్నట్లు జ్యోతి దేశ్ పాండే తెలిపారు. జియో సినిమా యాప్‌లో కొత్త కంటెంట్ మీద వీక్షకులందరికీ అందుబాటు ధరలో చార్జీ విధిస్తామన్నారు. -
జియో సంచలనం.. మొన్న సౌతాఫ్రికా లీగ్, ఇప్పుడు ఐపీఎల్! ఫ్రీ?!
FIFA World Cup 2022- SA20 2023- IPL 2023:ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త! ఐపీఎల్-2023 సీజన్ మ్యాచ్‌లను ఎలాంటి ప్రత్యేకమైన ఫీజు లేకుండానే డిజిటల్ మాధ్యమంలో చూసే అవకాశం రానుంది. ఇందుకు సంబంధించి రిలయన్స్ గ్రూపు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్-18 రూ. 23, 758 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియోసినిమా యాప్‌లో ఫ్రీగా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిఫా, సౌతాఫ్రికా లీగ్ ఇటీవల ముగిసిన సాకర్ మెగా టోర్నీ ఫిఫా వరల్డ్‌కప్-2022ను ఇప్పటికే జియో సినియా యాప్‌లో విజయవంతంగా ప్రసారం చేశారు. టీవీ ఛానెళ్లు స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్18 హెచ్డీలో ప్రేక్షకులు ఈ ఫుట్‌బాల్ సమరాన్ని వీక్షించగా.. డిజిటల్ యూజర్లకు జియో సినిమాలో ఈ వెసలుబాటు దక్కింది. మరోవైపు.. జనవరి 10న మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్ మ్యాచ్‌లను జియో సినిమాలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇదే తరహాలో ఐపీఎల్-2023ని కూడా జియో సినిమా యాప్‌లో ప్రసారం చేసేందుకు వయాకామ్ ప్లాన్ చేస్తున్నట్లు ది హిందూ బిజినెస్‌లైన్ కథనం పేర్కొంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఐపీఎల్ మ్యాచ్‌లను డిజిటల్ మీడియాలో ఫ్రీగా ప్రసారం చేసిన తొలి సంస్థగా రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికినట్లవుతుంది. అంతేగాక.. టీవీ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ గ్రూప్‌నకు భారీ షాకిచ్చినట్లవుతుంది. 6️⃣ teams 3️⃣3️⃣ matches ♾️ entertainment Enjoy the thrilling 🏏 season as #SA20 is HERE 💥@sa20_league action from Jan 10 to Feb 11 👉🏻 LIVE on #JioCinema, #Sports18 & @colorstvtamil 📺📲#SA20League #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/Jo3FkSJysw — JioCinema (@JioCinema) January 12, 2023