గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రం ఓపెన్ హైమర్. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ నామినేషన్స్‌లో ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఇటీవల ప్రకటించిన బాఫ్టా అవార్డుల్లో ఏడింటిని కైవసం చేసుకుంది. అయితే ఇప్పటికే ఓటీటీకి వచ్చేసిన ఓపెన్ హైమర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ కేవలం రెంట్ విధానంలో మాత్రం చూసే అవకాశం ఉంది.
దీంతో తాజాగా మరో ఓటీటీకి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత హాలీవుడ్ మూవీ జియో సినిమాలో రాబోతోంది. మార్చి 21 నుంచి ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని జియో సినిమా అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే జియో ప్రీమియమ్ కస్టమర్స్ మాత్రమే ఓపెన్‌హైమర్ మూవీని ఓటీటీలో చూడవచ్చు. ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
13 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్
ఇటీవల ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్‌లో ఓపెన్ హైమర్ ఓరేంజ్‌లో అదరగొట్టింది. ఏకంగా పదమూడు విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న మూవీగా ఓపెన్ హైమర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కనీసం పది వరకు ఆస్కార్ అవార్డులు దక్కే అవకాశం ఉందని హాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాదిలో లాస్ ఎంజిల్స్ వేదికగా మార్చి 11న ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు.
ఓపెన్ హైమర్ కథేంటంటే..
అణుబాంబు సృష్టికర్త ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీని తెరకెక్కించాడు. రెండో ప్రపంచయుద్ద సమయంలో అణుబాంబును తయారు చేయడానికి ఓపెన్ హైమర్ ఎలాంటి ప్రయోగాలు చేశాడు? తనను తాను ప్రపంచవినాశకారిగా ఓపెన్ హైమర్ ఎందుకు ప్రకటించుకోవాల్సి వచ్చిందనే కోణంలో రూపొందించారు. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్‌గా సిలియన్ మార్ఫీ, అమెరికా అధ్యక్షుడు లూయిస్ స్ట్రాస్‌గా రాబర్ట్ డౌనీ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment