Oppenheimer
-
ఓటీటీలోకి 'ఓపెన్‌హైమర్' తెలుగు వర్షన్ వచ్చేసింది
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఓపెన్‌హైమర్’ తెలుగు అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ హిట్ సినిమా తాజాగా ఓటీటీలో తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. అణు బాంబును కనుగొన్న శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా చేసుకుని ‘ఓపెన్ హైమర్’ను రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇంగ్లీష్,హిందీ వర్షన్లో రూ. 119 రెంట్ విధానంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఓపెన్‌హైమర్.. మార్చి 21 నుంచి జియో సినిమాలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటుగా ఇంగ్లీష్,తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. జియో సినిమా వినియోగదారులు అయితే ఎలాంటి రెంట్ లేకుండా ఈ చిత్రాన్ని చూడొచ్చు. 96వ ఆస్కార్ వేడుకల్లో ‘ఓపెన్‌హైమర్’ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం సహా ఏడు విభాగాల్లో అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫి, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగాల్లోనూ ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది. రూ. 835 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.7,600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
సెప్టెంబరులో స్టార్ట్
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆపెన్ హైమర్’ చిత్రంలో మంచి నటన కనబరచి 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్నారు నటుడు సీలియన్ మర్ఫీ. దీంతో సీలియన్ తర్వాతి చిత్రాలపై హాలీవుడ్లో ఫోకస్ పెరిగింది. కాగా సీలియన్ నటించనున్న కొత్త చిత్రం సెప్టెంబరులో స్టార్ట్ కానున్నట్లు హాలీవుడ్ సమా చారం. హాలీవుడ్ హిట్ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’ ఆధారంగా ఓ సినిమా తీయాలనుకుంటున్నారు ఈ సిరీస్ రూపకర్త స్టీవెన్ నైట్. ‘పీకీ బ్లైండర్స్’ ఆధారంగా ఈ సినిమాను సెప్టెంబరులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ‘పీకీ బ్లైండర్స్’ సిరీస్‌లో థామస్ షేల్బేగా నటించిన సీలియన్ మర్ఫీ ఈ సినిమాలోనూ నటిస్తారన్నట్లుగా స్టీవెన్ ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా 2025 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీకి ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల ప్రకటించిన 96వ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు క్లాసిక్స్ తీసిన ఇతడు.. తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌లో ఉన్న ఆయన.. తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆస్కార్‌లో అవార్డులు కొల్లగొట్టిన ఓపెన్ హైమర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కానీ రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నుంచి జియో సినిమాలో ఉచితంగానే చూసేయొచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. Keep the awards season spirit alive by binge-watching these cult movies! 🏆✨ Get ready to witness the cinematic phenomenon of Oppenheimer, streaming on #JioCinema March 21 onwards. pic.twitter.com/PUBSIFn94m — JioCinema (@JioCinema) March 18, 2024 -
ఆస్కార్ వేదికపై అణు బాంబు మోత
అణు బాంబు సౌండ్ అదిరింది.. క్రిస్టోఫర్ కల నిజమైంది... ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు ఆకర్షణగా నిలిచింది. ఫేక్ చప్పట్లతో మెస్సీ (శునకం), ఆమిర్ ఖాన్ ‘పీకే’ తరహాలో జాన్ ప్రత్యక్షం కావడం చర్చలకు దారి తీసింది.ఇలా ఆనందాలు, వింతలు, విడ్డూరాలతో ఆస్కార్ అవార్డు వేడుక జరిగింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. విజేతల వివరాలు: • ఉత్తమ చిత్రం: (ఆపెన్ హైమర్) • దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఆపెన్ హైమర్) • నటుడు: సిలియన్ మర్ఫీ (ఆపెన్ హైమర్) • నటి: ఎమ్మాస్టోన్ (పూర్ థింగ్స్) • సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఆపెన్ హైమర్) • సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) • సినిమాటోగ్రఫీ: ఆపెన్ హైమర్ • డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్ • హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) • అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్ ) • ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) • యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్ • కాస్ట్యూమ్ డిజైన్ : హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) • ప్రోడక్షన్ డిజైన్ : జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) • ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఆపెన్ హైమర్) • విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ • డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది లాస్ట్ రిపేర్ షాప్ • ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఆపెన్ హైమర్ • సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఒరిజినల్ సాంగ్: వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) • లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్. రాబర్ట్ జూనియర్, డేవైన్ జో రాండాల్ఫ్, ఎమ్మా స్టోన్, సిలియన్ మర్ఫీ ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్ ఆపెన్‌హైమర్ జీవితంతో రూపొందిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఆపెన్‌హైమర్’ మోత ఆస్కార్ వేదికపై బాగా వినిపించింది. దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్‌తో ఆస్కార్ అవార్డును ముద్దాడేలా చేసింది. మార్చి 10న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆపెన్‌హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి విజయఢంకా మోగించింది. మొత్తం పదమూడు నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు దర్శకుడు, నటుడు, సహాయనటుడు, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డు దక్కింది. అలాగే పదకొండు నామినేషన్లు దక్కించుకున్న ‘పూర్ థింగ్స్’ సినిమాకు నాలుగు విభాగాల్లో, హిస్టారికల్ డ్రామా ‘జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకు రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ‘ఆపెన్‌హైమర్’కు పోటీగా నిలుస్తుందనుకున్న ‘బార్బీ’ సినిమాకు 8 నామినేషన్లు దక్కినా, ఒక్క అవార్డు (బెస్ట్ ఒరిజినల్ సాంగ్)తో సరిపెట్టుకుంది, పది నామినేషన్లు దక్కించుకున్న ‘కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాకి ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నిలిచిన సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటి రాండాల్ఫ్ తొలిసారి ఆస్కార్‌ని ముద్దాడారు. గతంలో ‘లా లా ల్యాండ్’కి ఉత్తమ నటిగా ఆస్కార్ అందు కున్న ఎమ్మా స్టోన్ ఇప్పుడు ఇదే విభాగానికి అవార్డుని అందుకున్నారు. భారత సంతతికి చెందిన నిషా తెరకెక్కించిన ‘టు కిల్ ఎ టైగర్’ డాక్యుమెంటరీ ఆస్కార్ సాధించలేకపోయింది. ఇక అవార్డు విజేతల జాబితా ఈ విధంగా... స్వీట్ సర్ప్రైజ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. 96వ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ విజువల్స్ కనిపించాయి. వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్ సీక్వెన్స్ అంటూ ఆస్కార్ వేదికపై ప్రదర్శించిన విజువల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’లోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లు రెండుసార్లు కనిపించాయి. ‘టైటానిక్’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘చార్లీ చాప్లిన్’, ‘బస్టర్ కీటన్’ వంటి హాలీవుడ్ క్లాసిక్ చిత్రాల యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ‘ఆర్ఆర్ఆర్’లోని యాక్షన్ విజువల్స్ ప్లే కావడం విశేషం. అలాగే ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?’ను విజేతగా ప్రకటించే ముందు ప్లే చేసిన కొన్ని సాంగ్స్ విజువల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట కనిపించింది. ఈ సందర్భంగా.. ‘‘వరల్డ్ స్టంట్ సీక్వెన్స్‌లకు నివాళిగా ప్లే చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో ‘ఆర్ఆర్ఆర్’ స్టంట్ సీక్వెన్స్‌లు ఉండటం స్వీట్ సర్ప్రైజ్లా ఉంది’’ అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మించారు. నా కళ్లు చెబుతున్నాయి... – అల్ పచినో మామూలుగా విజేతలను ప్రకటించే ముందు పోటీలో ఉన్నవారి పేర్లు చెప్పి, చివరిగా విజేత పేరు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రముఖ నటుడు 83 ఏళ్ల అల్ పచినో ఈ విధానాన్ని అనుసరించలేదు. ఈ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఫేమ్ ఉత్తమ చిత్రాన్ని ప్రకటించడానికి వేదికపైకి వచ్చారు. ఈ విభాగంలో పది చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ చిత్రాల పేర్లు చెప్పకుండా.. ‘ఇదిగో..’ అంటూ మెల్లిగా ఎన్వలప్ కవర్ని ఓపెన్ చేస్తూ.. నా కళ్లు చెబుతున్నాయి టైప్‌లో నా కళ్లకు ‘ఆపెన్‌హైమర్’ కనబడుతోంది అనగానే వీక్షకుల నుంచి కరతాళ ధ్వనులు వినిపించాయి. అయితే అల్ పచినో ఈ విధంగా ప్రకటించడంతో.. అవార్డు ఈ సినిమాకే వచ్చిందా? అనే సందేహంలో కొందరు ఉండిపోయారు. అంతలోనే ‘అవును.. అవును..’ అన్నారు. అయితే అల్ పచినో ఇలా ప్రకటించడం పట్ల పలువురు విమర్శించారు. ఆస్కార్ అవార్డుల జాబితాలో ప్రధానమైన విభాగంలో పోటీ పడిన చిత్రాల పేర్లు చెప్పకుండా, పైగా వేడుకలో చివరి అవార్డు కాబట్టి కాస్తయినా సస్పెన్స్ మెయిన్టైన్ చేయకుండా చెప్పడం బాగాలేదని అంటున్నారు. ఇలా సాదా సీదా ప్రకటనతో ఆస్కార్ అవార్డు వేడుక ముగిసింది. నోలన్ కల నెరవేరెగా... ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ చరిత్ర కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎందుకంటే నోలన్ తీసిన సినిమాలు ఆస్కార్ అవార్డుల కోసం 49 నామినేషన్లు దక్కించుకుని, 18 అవార్డులను సాధించాయి. కానీ క్రిస్టోఫర్ నోలన్‌కు మాత్రం 95వ ఆస్కార్ అవార్డుల వరకూ ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. తొలిసారి 2002లో ‘మెమెంటో’ సినిమాకు గాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో 74వ ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకున్నారు నోలన్... నిరాశే ఎదురైంది. ఆ తర్వాత 83వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఇన్సెప్షన్’ సినిమాకు బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో నామినేషన్లు దక్కినా అవార్డులు రాలేదు. 90వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ విభాగాల్లో నోలన్ ‘డంకిర్క్’ సినిమాకు నామినేషన్లు దక్కినా ఆస్కార్ అవార్డు దక్కలేదు. చివరికి నోలన్ కల ‘ఆపెన్‌హైమర్’తో నెరవేరింది. ఈ ప్రయాణంలో నేనూ భాగం అని... – క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ వేదికపై క్రిస్టోఫర్ నోలన్ మాట్లాడుతూ – ‘‘మా సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్లతో పాటు యూనిట్ అందరికీ ధన్యవాదాలు. ఇక మా కుటుంబాన్ని, ఈ సినిమాను నిర్మించిన మా నిర్మాత ఎమ్మా థామస్‌తో (భార్య ఎమ్మా పేరును ప్రస్తావించగానే ఒక్కసారిగా నవ్వులు) పాటు నా సోదరుడికి థ్యాంక్స్ చె΄్పాలి. మా సినిమాలో సత్తా ఉందని నమ్మి, డిస్ట్రిబ్యూట్ చేసిన యూనీవర్సల్ స్టూడియోస్‌కు ధన్యవాదాలు. సినిమా చరిత్ర వందేళ్లకు చేరువ అవుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ ఈ ప్రయాణం తాలూకు సినిమాల్లో నేను కూడా ఓ అర్థవంతమైన భాగం అని భావించి, నన్ను గుర్తించిన ఆస్కార్ కమిటీకి ధన్యవాదాలు’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... భార్యాభర్త నోలన్, ఎమ్మా దర్శక–నిర్మాతలుగా ఒకేసారి ఆస్కార్ అవార్డులు సాధించారు. అణుబాంబు విస్ఫోటనం నేపథ్యంలోని ‘ఆపెన్‌హైమర్’లో నటించి, అవార్డు దక్కించుకున్న మర్ఫీ తన అవార్డును ప్రపంచ శాంతి ఆకాంక్షించేవారికి అంకితమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జీవితంలో తనకు ఎంతో అండగా నిలిచిన తన భార్య సుసాన్ డౌన్‌కి అవార్డుని అంకితం ఇస్తున్నట్లుగా ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ తెలిపారు. ‘‘నేను నా జీవితంలో మరోలా (స్లిమ్‌గా) ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే... నేను నాలానే ఉండాలి’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రాండాల్ఫ్ నేనీ సినిమా చేసి ఉండాల్సింది కాదు – ఎమ్ చెర్నోవ్ ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘20 డేస్ ఇన్ మరియోపోల్’ చిత్రం ఆస్కార్ అవార్డును సాధించింది. ఈ అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో చిత్రదర్శకుడు ఎమ్ చెర్నోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రలో ఇది తొలి ఆస్కార్ అవార్డు. ఇందుకు గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఈ సినిమాను నేను చేసి ఉండకూడదని అనుకుంటున్నాను. బహుశా ఈ వేదికపై ఇలా మాట్లాడుతున్న తొలి దర్శకుడిని నేనేమో. మా ఉక్రెయిన్‌పై దాడులు చేయకుండా, మా నగరాలను ఆక్రమించకుండా ఉండేందుకు బదులుగా రష్యావారికి ఈ అవార్డు ఇస్తాను. నేను చరిత్రను, గతాన్ని మార్చలేను. కానీ కొందరు ప్రతిభావంతులతో కలిసి ఓ కొత్త రికార్డును సృష్టించగలం. అప్పుడు నిజం గెలుస్తుంది. జీవితాలను త్యాగం చేసిన మరియోపోల్ ప్రజలు గుర్తుండిపోతారు. సినిమా జ్ఞాపకాలను ఏర్పరుస్తుంది. జ్ఞాపకాలు చరిత్రను నెలకొల్పుతాయి’’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు చెర్నోవ్. ఆమిర్ ‘పీకే’ని తలపించేలా జాన్ సెనా ఆస్కార్ అవార్డు వేడుకలో జరిగిన ఓ ఘటన ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాని గుర్తు చేసింది. ఈ చిత్రంలో ఆమిర్ ఓ సీన్లో తన శరీరానికి ముందు భాగంలో ఓ రేడియో అడ్డుపెట్టుకుని అర్ధనగ్నంగా నటించారు. ఆస్కార్ వేదికపై ఇలాంటి సీనే రిపీట్ అయింది. స్టార్ రెజ్లర్ (డబ్ల్యూడబ్ల్యూఈ) జాన్ సెనా అర్ధనగ్నంగా ప్రత్యక్షమై షాక్ ఇచ్చారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును ప్రకటించేందుకు జాన్ సెనా ఇలా అర్ధనగ్నంగా రావడం చర్చనీయాంశంగా మారింది. తన శరీరానికి ముందు భాగంలో విజేత వివరాలు ఉండే ఎన్వలప్ కవర్‌ను మాత్రమే అడ్డుపెట్టుకొని వేదికపైకి రావడంతో సభికులందరూ తెగ నవ్వుకున్నారు. అయితే తాను ఇలా రావడానికి కారణం ఉందన్నారు జాన్ సెనా. ‘పురుషుడి శరీరం కూడా జోక్ కాదని, అలానే కాస్ట్యూమ్స్ అనేవి ముఖ్యం అని తెలియజెప్పేందుకే ఇలా వచ్చా’ అన్నారు సెనా. అనంతరం ‘పూర్ థింగ్స్’ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో అవార్డును ప్రకటించారు. 1974 సీన్ రిపీట్ దాదాపు 50 ఏళ్ల క్రితం (1974) జరిగిన ఆస్కార్ వేడుకల్లో నటి ఎలిజబెత్ టేలర్‌ను పరిచయం చేస్తుండగా ఓ వ్యక్తి నగ్నంగా వేదికపైకి దూసుకు రావడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా జాన్ సెనా ప్రవర్తనతో నాటి ఘటనను కొందరు గుర్తుకు తెచ్చుకున్నారు. ఫేక్ క్లాప్‌తో శునకానందం ఆస్కార్ వేడుకలో ఈ ఏడాది ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షించింది. సభికులతో పాటు క్లాప్స్ కొట్టిన ఈ శునకం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆస్కార్ కోసం పలు విభాగాల్లో పోటీ పడిన సినిమాల్లో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ ఒకటి. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెస్సీ (శునకం)ని అవార్డు వేడుకకు తీసుకొచ్చింది యూనిట్. ‘ఆపెన్ హైమర్’కి రాబర్డ్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకుంటున్నప్పుడు అందరితో పాటు మెస్సీ చప్పట్లు కొట్టడం ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ శునకం కూర్చున్న కుర్చీ కింద ఓ వ్యక్తి ఉండి, ఫేక్ చేతులతో క్లాప్ కొట్టాడు. అవి శునకం కాలిని పోలి ఉండటంతో మెస్సీయే చప్పట్లు కొట్టిందని భావించారంతా. -
'అవన్నీ ఫేక్ అవార్డ్స్'.. ఆస్కార్ వేళ హీరోయిన్ సంచలన కామెంట్స్!
ఆస్కార్ అవార్డ్ విన్నర్‌పై బాలీవుడ్ భామ యామీ గౌతమ్ ప్రశంసలు కురిపించింది. తాజాగా 96వ అకాడమీ అవార్డ్ వేడుకల్లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ హవా అవార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఓపెన్ హైమర్ హీరో సిలియన్ మర్ఫీ అవార్డ్‌ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలిపింది యామీ గౌతమ్. అయితే ఊహించని విధంగా ఇండియా ఫిల్మ్ అవార్డులపై తన అక్కసును ప్రదర్శించింది. ఇండియా ఫిల్మ్ అవార్డులు నకిలీవంటూ యామీ గౌతమ్ విమర్శించింది. ఈ మేరకు తన ట్విటర్లో రాసుకొచ్చింది. అందుకే గత కొన్నేళ్లుగా ఇండియాలో జరిగే అవార్డు షోలకు తాను హాజరు కావడం లేదని తెలిపింది. అలాంటి ఫేక్ అవార్డులపై తనకు నమ్మకం లేదని వెల్లడించింది. కానీ ఈ రోజు ఒక అసాధారణ నటుడిని చూస్తుంటే తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ దక్కించుకున్న మీ ప్రతిభ అన్నింటికంటే అత్యుత్తమంగా నిలుస్తుందని ట్విటర్లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా యామీకి 2022లో ప్రముఖ అవార్డ్ తనకు దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఇది చూసిన అభిమానులు భిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా.. యామీ గౌతమ్ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ ఆమెకు ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో యామితో పాటు ప్రియమణి, అరుణ్ గోవిల్ కూడా నటించారు. Having no belief in any of the current fake “filmy” awards, since the last few years, I stopped attending them but today i am feeling really happy for an extraordinary actor who stands for patience, resilience & so many more emotions. Watching him being honoured on the biggest… — Yami Gautam Dhar (@yamigautam) March 11, 2024 -
అంగరంగ వైభవంగా ఆస్కార్స్-2024 వేడుక.. ఈ ఫొటోలు చూశారా?
-
ఆస్కార్‌లో 'ఓపెన్ హైమర్' సెన్సేషన్.. ఈ సినిమా ఎందుకంత స్పెషల్?
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమా గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఏకంగా ఆస్కార్ వచ్చేంతలా ఈ మూవీలో ఏముంది? ప్రత్యేకత ఏంటి? హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు క్లాసిక్స్ తీసిన ఇతడు.. తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌లో ఇప్పుడు తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?) సాధారణంగా హాలీవుడ్ సినిమాలంటే గ్రాఫిక్స్ కచ్చితంగా ఉంటాయి. కానీ 'ఓపెన్ హైమర్' కోసం అన్ని రియల్‌గా తీశారు. న్యూక్లియర్ బాంబు పేలుడు సీన్స్ కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ లాంటివి చేయకుండానే తీయడం విశేషం. అలానే ఇంగ్లీష్ సినిమాల నిడివి గంటన్నర లేదంటే రెండు గంటల్లోపే ఉంటుంది. 'ఓపెన్ హైమర్' మాత్రం దాదాపు మూడు గంటలకు పైగా నిడివితో తీశారు. గతేడాది జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు అనమాట. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) ఇప్పుడంతా కలర్ ఫార్మాట్లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు తీస్తున్నారు. 'ఓపెన్ హైమర్'లో కొన్ని సీన్స్ మాత్రం బ్లాక్ అండ్ వైట్‌లో తీశారు. అలా ఇది తొలి బ్లాక్ అండ్ వైట్ ఐమాక్స్ మూవీగా రికార్డ్ సృష్టించింది. ఇదే సినిమాలోని రొమాంటిక్ సన్నివేశంలో భారతీయ మతగ్రంథాలు ఉండటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది సరికాదని చాలామంది భారతీయ ప్రేక్షకుల విమర్శలు చేశారు. ఆ సీన్ తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. ఇన్ని విశేషాలున్న సినిమా.. మన ప్రేక్షకుల్లో ముప్పావంతు మందికి నచ్చలేదు! ఇది ఇక్కడ ట్విస్ట్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?
ఆస్కార్ అవార్డుల వేడుక.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈసారి అన్ని పురస్కారాలు హాలీవుడ్ సినిమాలకే దక్కాయి. వేరే భాషల చిత్రాల ఈ పురస్కారాన్ని అందుకోలేకపోయాయి. అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. దీనితో పాటు పలు హిట్ చిత్రాలని కూడా ఈ అవార్డులు వరించాయి. మరి ఈ సినిమాలు చూడాలంటే ఎలా? ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఆస్కార్ వచ్చిందంటే ఆ మూవీలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈసారి 'ఓపెన్ హైమర్', 'బార్బీ', 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్' తదితర చిత్రాలు ఆస్కార్ దక్కించుకున్నాయి. వీటితోపాటు 'అమెరికన్ ఫిక్షన్', 'ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్', 'ది హోల్డోవర్స్' లాంటి మనకు పెద్దగా తెలియని సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. ఇంతకీ ఇవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే? ఓపెన్ హైమర్ - జియో సినిమా (తెలుగు-మార్చి 21) & అమెజాన్ ప్రైమ్ (రెంట్) పూర్ థింగ్స్ - హాట్‌స్టార్ (ఇంగ్లీష్) ది హోల్డోవర్స్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ బార్బీ - జియో సినిమా అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ గాడ్జిల్లా మైనస్ వన్ - ప్రస్తుతం అందుబాటులో లేదు అమెరికన్ ఫిక్షన్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ 20 డేస్ ఇన్ మరియూపోల్ - అమెజాన్ ప్రైమ్ (ఇదీ చదవండి: ఆస్కార్ ఒరిజినల్ సాంగ్.. గతేడాది 'ఆర్ఆర్ఆర్'కి.. మరి ఇప్పుడు?) -
ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్
96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి భారతీయ సినిమాలు గానీ భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ పురస్కారాలేం దక్కలేదు. మరోవైపు చాలామంది ఊహించినట్లే 'ఓపెన్ హైమర్' సినిమాకు ప్రధాన విభాగాల్లో ఏకంగా ఏడు అవార్డులు రావడం విశేషం. దీనితో పాటు 'పూర్ థింగ్స్' అనే సినిమాకు నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయనేది పూర్తి జాబితా ఇదిగో.. ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్ ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్) ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటుడు – రాబర్డ్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటి – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్– 20 డేస్ ఇన్ మరియూపోల్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – ది బాయ్ అండ్ ది హిరాన్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్న్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా) బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్) బెస్ట్ సౌండ్ – ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ – నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం-ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- వార్ ఈజ్ ఓవర్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్) G.O.A.T #ChristopherNolan Won His First Ever #Oscars For #Oppenheimer 🥹❤️🔥pic.twitter.com/ygyZM2uBhj — Saloon Kada Shanmugam (@saloon_kada) March 11, 2024 -
అస్కార్ బరిలో ఉన్న పది సినిమాలు ఇవే
-
మరో ఓటీటీకి బ్లాక్‌బస్టర్ మూవీ.. కేవలం వారు మాత్రమే చూసే ఛాన్స్!
గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రం ఓపెన్ హైమర్. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ నామినేషన్స్‌లో ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఇటీవల ప్రకటించిన బాఫ్టా అవార్డుల్లో ఏడింటిని కైవసం చేసుకుంది. అయితే ఇప్పటికే ఓటీటీకి వచ్చేసిన ఓపెన్ హైమర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ కేవలం రెంట్ విధానంలో మాత్రం చూసే అవకాశం ఉంది. దీంతో తాజాగా మరో ఓటీటీకి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు. థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత హాలీవుడ్ మూవీ జియో సినిమాలో రాబోతోంది. మార్చి 21 నుంచి ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని జియో సినిమా అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే జియో ప్రీమియమ్ కస్టమర్స్ మాత్రమే ఓపెన్‌హైమర్ మూవీని ఓటీటీలో చూడవచ్చు. ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. 13 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ ఇటీవల ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్‌లో ఓపెన్ హైమర్ ఓరేంజ్‌లో అదరగొట్టింది. ఏకంగా పదమూడు విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న మూవీగా ఓపెన్ హైమర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కనీసం పది వరకు ఆస్కార్ అవార్డులు దక్కే అవకాశం ఉందని హాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాదిలో లాస్ ఎంజిల్స్ వేదికగా మార్చి 11న ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు. ఓపెన్ హైమర్ కథేంటంటే.. అణుబాంబు సృష్టికర్త ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీని తెరకెక్కించాడు. రెండో ప్రపంచయుద్ద సమయంలో అణుబాంబును తయారు చేయడానికి ఓపెన్ హైమర్ ఎలాంటి ప్రయోగాలు చేశాడు? తనను తాను ప్రపంచవినాశకారిగా ఓపెన్ హైమర్ ఎందుకు ప్రకటించుకోవాల్సి వచ్చిందనే కోణంలో రూపొందించారు. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్‌గా సిలియన్ మార్ఫీ, అమెరికా అధ్యక్షుడు లూయిస్ స్ట్రాస్‌గా రాబర్ట్ డౌనీ నటించారు. -
బాఫ్టాలో మెరిసిన దీపికా పదుకోన్
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఒప్పెన్ హైమర్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల (బాఫ్టా) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. దేశం నుంచి దీపికా పదుకోన్ ఈ వేడుకల్లో పాల్గొని, ‘నాన్ ఇంగ్లిష్’ విభాగంలో ఉత్తమ చిత్రానికి (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) అవార్డు అందజేశారు. ఇక ‘భాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో పురస్కారాలు అందుకుని సత్తా చాటింది. అవార్డులతో ‘ఒప్పెన్ హైమర్’ టీమ్ ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, సహాయనటుడు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల్లో ‘ఒప్పెన్ హైమర్’కి అవార్డులు దక్కాయి. క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డు ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం తాజాగా బాఫ్టాలో ఏడు పురస్కారాలు దక్కించుకుని, వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో 13 విభాగాల్లో పోటీలో ఉంది. ఇక ‘బాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ తర్వాత ‘పూర్ థింగ్స్’ మూవీ అధికంగా ఐదు (కాస్ట్యూమ్, మేకప్, హెయిర్–స్టైలింగ్,ప్రోడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో) అవార్డులను పొందింది. ఆ తర్వాత ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి. భారతీయత ఉట్టిపడేలా... ‘భాఫ్టా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయ నటి దీపికా కావడం విశేషం. ఈ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరలో మెరిశారు దీపికా పదుకోన్. ‘చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది’ అనే ప్రశంసలు ఈ బ్యూటీ సొంతమయ్యాయి. ఈ వేడుకలో బ్యాక్ స్టేజీలో దీపికా దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపికా పదుకోన్ పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో దీపిక ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటను ఆమె ఆస్కార్ వేదికపై పరిచయం చేశారు. -
బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ 2024 విన్నర్స్.. ఆ హిట్ సినిమాదే పైచేయి
క్రిస్టోఫర్ నోలన్ ఆధారంగా తెరకెక్కిన ఓపెన్‌హైమర్ బయోపిక్ మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. 77వ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు (BAFTA) వేడుకల్లో తన సత్తా చాటింది. 2024 ఏడాదికి సంబంధించి ఓపెన్‌హైమర్ అవార్డ్స్‌లో అగ్రగామిగా నిలిచింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా ఏడు అవార్డులను గెలుచుకుంది. నోలన్‌కు దర్శకుడిగా ఇదే తొలి BAFTA అవార్డు కావడం విషేశం. బాఫ్టా ఫిల్మ్ 2024 అవార్డుల వేడుక లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో జరిగింది. పూర్ థింగ్స్ లో తన నటనకు గాను ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఓపెన్ హైమర్‌లో మనోజ్ఞ నటనకు సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. పూర్ థింగ్స్ చిత్రానికి సంబంధించి కాస్ట్యూమ్, మేకప్, హెయిర్-స్టైలింగ్, ప్రొడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో ఐదు బాఫ్టా అవార్డులను పొందింది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న 'ఓపెన్‌హైమర్' వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఇవన్నీ చూస్తే ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్‌హైమర్ పంట పండటం ఖాయం అని చెప్పవచ్చు. BAFTA అవార్డు విజేతలు ఉత్తమ చిత్రం: ఓపెన్‌హైమర్ ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్) ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్) ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్) ఉత్తమ సహాయ నటి: డావిన్ జాయ్ రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) ఉత్తమ కాస్ట్యూమ్: హోలీ వాడింగ్టన్ (పూర్ థింగ్స్) ఉత్తమ బ్రిటిష్ చిత్రం: జోనాథన్ గ్లేజర్, జేమ్స్ విల్సన్ (క్రాబ్ డే) ఉత్తమ సినిమాటోగ్రఫీ: హోట్ వాన్ హోటిమా (ఓపెన్‌హైమర్) ఉత్తమ ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్) ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రిట్, ఆర్థర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ ) ఉత్తమ విజువల్స్: సైమన్ హ్యూస్ (పూర్ థింగ్స్ ) ఉత్తమ డాక్యుమెంటరీ: 20 డేస్ ఇన్ మరియోపోల్ Oh boy! Cillian Murphy collects his Leading Actor BAFTA for Oppenheimer 🙌 #EEBAFTAs pic.twitter.com/M5pjKhtrqZ — BAFTA (@BAFTA) February 18, 2024 Your Leading Actress winner is Emma Stone! #EEBAFTAs pic.twitter.com/Gyk48SQXrZ — BAFTA (@BAFTA) February 18, 2024 -
ఉత్తమ చిత్రంగా నిలిచిన ఆ సినిమా.. ఏకంగా ఐదు అవార్డులు!
గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ సినిమా 'ఓపెన్‌హైమర్'. ఇండియాలోనూ ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త 'రాబర్ట్ జె ఓపెన్ హైమర్' జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. తాజాగా ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఓపెన్ హైమర్ సత్తా చాటింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ చిత్రం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే మార్గరెట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన బార్బీ మూవీ సైతం పలు అవార్డులను సొంతం చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వివరాలు ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్ ఉత్తమ కామెడీ చిత్రం- పూర్ థింగ్స్ ఉత్తమ దర్శకుడు - క్రిస్టఫర్ నోలన్(ఓపెన్‌హైమర్) ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్ సాగ్ ట్రైట్, ఆర్ధర్ హరారి ( అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) ఉత్తమ నటుడు- సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్) ఉత్తమ నటి - లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్) ఉత్తమ హాస్య నటి - ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ హాస్య నటుడు - పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్) ఉత్తమ సహాయనటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్) ఉత్తమ సహాయనటి - డావిన్ జాయ్ రాండోల్ఫ్(ది హోల్డోవర్స్) ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - లుడ్విగ్ గోరాన్సన్(ఓపెన్‌హైమర్) ఉత్తమ ఆంగ్లేతర చిత్రం - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - వాట్ వాస్ ఐ మేడ్ (బార్బీ) ఉత్తమ యానిమేటెడ్ చిత్రం - ది బాయ్ అండ్ ది హెరాన్ బాక్సాఫీస్ అచీవ్మెంట్ అవార్డు - వార్నర్ బ్రదర్స్(బార్బీ) -
ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు
ప్రపంచకప్ అయిపోయింది. టీమిండియా ఓడిపోయింది. దీంతో సోమవారం నుంచి ఎవరి పనుల్లో వాళ్లుపడిపోతారు. మూవీ లవర్స్ మాత్రం కొత్త సినిమాల సంగతి చూద్దామని ఫిక్స్ అవుతారు. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం 'ఆదికేశవ', 'కోటబొమ్మాళి పీఎస్', 'ధృవనక్షత్రం' లాంటి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం దాదాపు 24 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్‌పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!) ఓటీటీలో ఈ వారం విడుదలయ్యే మూవీస్ చూసుకుంటే.. 'ద గుడ్ ఓల్డ్ డేస్' తెలుగు సిరీస్ తప్పితే డబ్బింగ్ బొమ్మలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 'స్క్విడ్ గేమ్' సిరీస్ సెకండ్ సీజన్, 'ద విలేజ్' సిరీస్‌తో పాటు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ఒపెన్ హైమర్', తెలుగు డబ్బింగ్ మూవీ 'ఒడియన్'.. ఈ వారం రిలీజ్ అవుతున్న వాటిలో చెప్పుకోదగ్గవిగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏయే మూవీస్.. ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (నవంబరు 20 నుంచి 26వరకు) నెట్‌ఫ్లిక్స్ స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 20 లియో (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 21 స్క్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22 మై డామెన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 23 పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23 ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) - నవంబరు 24 ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) - నవంబరు 24 లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) - నవంబరు 24 గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 24 ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 26 అమెజాన్ ప్రైమ్ ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) - నవంబరు 24 ద విలేజ్ (తమిళ సిరీస్) - నవంబరు 24 అమెజాన్ మినీ టీవీ స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) - నవంబరు 22 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21 చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 23 (రూమర్ డేట్) జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 24 జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23 బుక్ మై షో ఒపన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 22 UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) - నవంబరు 24 సోనీ లివ్ చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24 సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24 ఆహా అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ (ఎనిమల్ టీమ్ ఎపిసోడ్) - నవంబరు 24 ఆపిల్ ప్లస్ టీవీ హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - నవంబరు 22 ఈ-విన్ ఒడియన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 24 (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ) -
ఓటీటీకి వచ్చేస్తోన్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కించిన హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమర్. ఈ ఏడాది జూలైలో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ హాలీవుడ్ మూవీ తాజాగా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఓటీటీ రిలీజ్‌కు మరో పది రోజులు ఉండగానే ఈ మూవీ ఆన్లైన్లో లీకైంది. గురువారం రోజే హెచ్డీ వర్షన్ ఆన్ లైన్లో దర్శనమివ్వడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జూలై 21న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది హాలీవుడ్లో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: ఏడాదిగా వెయిటింగ్.. ఎస్ చెప్పిన పవిత్ర.. నిశ్చితార్థం ఫోటో వైరల్) అణుబాంబును కనిపెట్టిన సైంటిస్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీని తెరకెక్కించాడు. అణుబాంబును కనిపెట్టడంలో ఓపెన్హైపర్ ఎదురైన సంఘటనలను ఈ సినిమాలో చూపించారు. కాగా.. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్, మాట్ డామన్ కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ) Oppenheimer is yours to own on 4K, Blu-ray™, and Digital November 21. Christopher Nolan’s global blockbuster premieres at home with over 3 hours of special features. pic.twitter.com/qUJRCwPoUC — Oppenheimer (@OppenheimerFilm) October 17, 2023 -
ఒపెన్హైమర్తో మన అనుబంధం
జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు జారవిడిచి 78 ఏళ్లు అవుతోంది. ఆధునిక యుగంలో ఇంతటి విధ్వంసకరమైన ఘటన మరోటి చోటుచేసుకోలేదంటే అతిశయోక్తి కాదు. రెండో ప్రపంచయుద్ధం నాటి ఈ ఘటనపై లెక్కలేనన్ని పుస్తకాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. తాజాగా ప్రదర్శితమవుతున్న ‘ఒపెన్ హైమర్’ చిత్రం కూడా ఈ కోవకు చెందినదే. మన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా తయారైన అణుబాంబులు, వాటి సృష్టికర్త జె.రాబర్ట్ ఒపెన్ హైమర్ ఇతివృత్తంతో సాగుతుంది ఈ సినిమా. ఒపెన్‌హైమర్‌కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. జర్మనీలో పుట్టి అమెరికాలో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగిన ఒపెన్ హైమర్‌ను అణుబాంబు పితామహుడని కూడా అంటారు. ఒపెన్‌హైమర్‌కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆయనకు ఉందని చెబుతున్న ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. దీన్ని 20వ శతాబ్దంలో ఆధునిక భౌతిక శాస్త్రం అభివృద్ధి నేపథ్యంలో చూడాలి. విశ్వం మొత్తానికి ఆధారమైన, మౌలికమైన కణాలపై అధ్య యనం సాగిన కాలం అది. అణు కేంద్రకం దాంట్లోని భాగాలను అర్థం చేసుకునే అణు భౌతికశాస్త్ర అభివృద్ధి కూడా ఈ కాలంలోనే వేగం పుంజుకుంది. అణుశక్తితోపాటు అణుబాంబుల తయారీకి దారితీసిన పరిశోధనలివి. ఈ కాలపు భారతీయ శాస్త్రవేత్తలు కూడా చాలామంది ఈ అణు భౌతిక శాస్త్ర రంగంలో కృషి చేశారు. దేబేంద్ర మోహన్ బోస్ (ఇతడి విద్యార్థిని బిభా చౌధురి), మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్, హోమీ జహంగీర్భాభా, దౌలత్సింగ్ కొఠారీ, పియారా సింగ్ గిల్ వంటి మహామహులు వారిలో కొందరు మాత్రమే. వీరు ఆధునిక భౌతికశాస్త్రంలో పేరెన్నికగన్న వూల్ఫ్‌గాంగ్ పౌలీ, నీల్స్ బోర్, లార్డ్ రూథర్‌ఫర్డ్, పాల్ డైరాక్, ఎన్రికో ఫెర్మీ, ఎర్నెస్ట్ ష్రోడింగర్, జేమ్స్ చాద్విక్, జాన్ కాక్‌క్రాఫ్ట్, హిడెకీ యుకవాలతో కలిసి పని చేయడం లేదా వారితో సంబంధబాంధవ్యాలను కలిగి ఉండటం కద్దు. భాభాతో సంబంధం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ వికిరణాలపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే హోమీ భాభాకు ఒపెన్ హైమర్ (కేంబ్రిడ్జ్‌లో సీనియర్. తరువాతి కాలంలో బెర్క్లీలో పనిచేశారు) గురించి ఒక అవగాహన ఉండింది. 1936లో భాభా, వాల్టర్ హైట్లర్ ఉమ్మడిగా ఖగోళ వికిరణ జల్లు (కాస్మిక్ రే షవర్స్) సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా, ఒపెన్ హైమర్ ఓ ఏడాది తరువాత దాదాపుగా అలాంటిదే స్వతంత్రంగా ప్రతిపాదించారు. అప్పట్లో భాభాకు పాశ్చాత్యదేశాల్లోని గొప్ప భౌతిక శాస్త్రవేత్తలతో సంబంధాలు ఉండేవి. ఒకానొక దశలో 1940లో తనను ఒపెన్ హైమర్‌కు పరిచయం చేయాల్సిందిగా భాభా తన మిత్రుడు పౌలీని కోరారు. ఇద్దరూ కలిసి బెర్క్లీలో పరిశోధనలు చేయాలన్నది ఉద్దేశం. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో భాభా భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. భౌతికశాస్త్ర మౌలికాంశాలపై పరిశోధనలు చేసేందుకు ఓ సంస్థను స్థాపించే అవకాశమూ అప్పుడే లభించింది. తరువాతి కాలంలో భాభాకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో కలిసి భారతీయ అణుశక్తి కార్యక్రమాన్ని సిద్ధం చేసి అమలు చేసే అవకాశమూ దక్కింది. అణు రియాక్టర్ నిర్మాణానికి, యురేనియం శుద్ధికి అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని భాభా తనకు పాశ్చాత్య దేశాల్లో ఉన్నసంబంధాల ద్వారానే సంపాదించగలిగారు. ప్రిన్స్టన్ , కావెండిష్ వంటి ప్రసిద్ధ సంస్థల తరహాలో టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) స్థాపనకూ బాబా అంతర్జాతీయ సహ కారం అందేలా రూఢి చేసుకున్నారు. అయితే 1945లో హిరోషిమా, నాగసాకి లపై అణుబాంబులు పడిన తరువాత రాబర్ట్ ఒపెన్ హైమర్ వివాదాస్పద వ్యక్తి అయ్యారు. అయినా టీఐఎఫ్ఆర్లో పరిశోధకుల బృందాన్ని తయారు చేసే విషయంలో భాభా ఆయన సాయం తీసుకున్నారు. ఒపెన్ హైమర్ విద్యార్థి, ఆయనతో కలిసి మన్హాటన్ ప్రాజెక్టులో పనిచేసిన బెర్నార్డ్ పీటర్స్‌కు ఉద్యోగమిచ్చారు. అప్పట్లో ప్రిన్స్టన్లో పనిచేస్తున్న ఒపెన్ హైమర్ సోదరుడు ఫ్రాంక్ ఒపెన్ హైమర్కూ ఉద్యోగం ఆఫర్ చేశారు భాభా. రాబర్ట్‌ను సంప్రదించిన తరువాతే ఫ్రాంక్‌కు ఉద్యోగం ఇవ్వజూపినట్లు చరిత్రకారులు చెబు తారు. ఈ అణుశక్తి కార్యక్రమ ఏర్పాటుకు ఫ్రెంచ్ నోబెల్ గ్రహీత ఫ్రెడెరిక్ జోలియోట్ క్యూరీ సలహాలు కూడా నెహ్రూ స్వీకరించారు. పరోక్ష ప్రేరణ ఒపెన్ హైమర్‌పై విమర్శలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో భాభా చేసిన కొన్ని నియామకాలపై నిరసన వ్యక్తమైంది. ఒపెన్ హైమర్‌కు కమ్యూనిస్టులతో ఉన్న గత సంబంధాలపై కూడా వివాదాలు తలె త్తాయి. ఒపెన్ హైమర్ కూడా తన మాజీ విద్యార్థి పీటర్స్‌ను కమ్యూ నిస్టు సానుభూతిపరుడిగా అభివర్ణించారు. దీంతో పీటర్స్ భారత్‌కు రావడం కష్టమైంది. ఎలాగోలా వచ్చిన తరువాత టీఐఎఫ్ ఆర్‌లో అతడిపై ఇంకోసారి దుమారం రేకెత్తింది. ఇంకోవైపు ఫ్రాంక్ ఒపెన్ హైమర్ కూడా అమెరికా ప్రభుత్వం పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరిం చడంతో భారత్‌కు రాలేకపోయారు. అయితే అమెరికాలో రాబర్ట్ ఒపెన్ హైమర్ మాత్రం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్ (ఐఏఎస్) డైరెక్టర్‌గా కొనసాగుతూ భారతీయ శాస్త్రవేత్తలు చాలామందికి మార్గదర్శకుడిగా వ్యవహరించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో యువ భౌతిక శాస్త్రవేత్తగా ఉన్న అల్లాడి రామకృష్ణన్ కు ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఏడాది స్కాలర్షిప్ మంజూరు చేయడం మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.అల్లాడి భారత్‌కు తిరిగి వచ్చాక ఐఏఎస్ లాంటి సంస్థను స్థాపించాలని ఆశించారు. ఈ ఆలోచనే తరువాతి కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌గా 1962లో మద్రాస్‌లో ఆవిష్కృతమైంది. భారత్‌కు తరచూ... ఆ కాలంలో స్వల్పకాలిక పర్యటనపై భారత్‌కు విచ్చేసే విదేశీ శాస్త్రవేత్తల్లో ఒపెన్ హైమర్ పేరు తరచూ వినిపించేది. పీసీ మహాల నోబిస్ ఆలోచనల రూపమైన ‘షార్ట్ విజిట్స్ ఆఫ్ సైంటిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్’లో భాగంగా ఒపెన్ హైమర్‌తో పాటు నీల్స్ బోర్, నార్బెర్ట్ వీనర్, పీఎంఎస్ బ్లాకెట్, జోసెఫ్ నీధమ్, జేబీఎస్ హాల్డేన్ లాంటి మహామహులు భారత్‌కు వచ్చిపోయేవారు. వీరికి పంపే ఆహ్వాన పత్రికలపై నెహ్రూ స్వయంగా సంతకాలు చేసేవారు. ఇందులో చాలామంది నెహ్రూకు తెలుసు. 1945 అనంతర ఒపెన్ హైమర్ నైతిక దృక్కోణాన్ని నెహ్రూ బహిరంగంగా ప్రశంసించారు. 1959లో భారత జాతీయ సైన్్స కాంగ్రెస్ సమావేశాల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, ఒపెన్ హైమర్ భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందారని ఉల్లేఖించారు. పరి శోధనలు, ఆవిష్కరణలకు కూడా సామాజిక విపరిణామాలు ఉంటా యన్న విషయాన్ని పెద్ద శాస్త్రవేత్తలు గుర్తించేందుకు ఇది ఉపయోగ పడాలన్నారు. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగంతో రెండో ప్రపంచ యుద్ధం నాటకీయంగా ముగిసింది. ఈ ఘటన అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య అణ్వాయుధ పోటీకి దారితీసింది. అదే సమయంలో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. వలసవాద శకం ముగిసిన తరువాత అణుశక్తిని శాంతియుత, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకోవడమన్న అంశం భారత్ లాంటి దేశాలకు ప్రధాన పరిశోధన ఇతివృత్తమైంది. ఈ నవతరం సైన్స్ ను అభివృద్ధి చేయడం భారత్‌కు ప్రథమ కర్తవ్యమైంది. అణుశక్తిని విద్యుదుత్పత్తికి ఉపయోగించుకుంటామని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే 1964లో చైనా అణుబాంబును పరీక్షించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదేళ్ల తరువాత భారత్ కూడా పోఖ్రాన్–1తో అణ్వస్త్ర దేశాల జాబితాలో చేరిపోయింది. కానీ భగవద్గీతకు నెలవైన భారత్ అణు మార్గం పట్టడాన్ని ఒపెన్ హైమర్ మాత్రం చూడలేకపోయారు! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్‌తో లాభాలు... ► సౌర విద్యుత్‌కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్‌పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ సీన్లో ఎలాంటి తప్పులేదు.. మహాభారత్ నటుడు షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఇండియాలోను విడుదల కావడంతో ఈ సినిమాకు ప్రేక్షాదరణ పెరుగుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ సన్నివేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలోని ఓ సీన్లో భగవద్గీత గురించి ప్రస్తావించడంపై ఇండియన్స్ మండిపడుతున్నారు. అలాంటి సీన్స్‌లో భగవద్గీతను చూపించాల్సిన అవసరం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. ఆ సీన్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు నితీశ్ భరద్వాజ్ స్పందించారు. ఆయన శ్రీకృష్ణ, మహాభారతం సీరియల్స్‌లో కృష్ణుడి పాత్ర పోషించారు. అయితే ఆ సన్నివేశంలో ఎలాంటి తప్పులేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాన్ని ఆయన సమర్థించారు. అణుబాంబు సృష్టితో జపాన్‌లో పెద్దసంఖ్యలో ప్రజలు మరణించారని.. ఆ సమయంలో ఆయన ఆందోళనకు గురయ్యారని వివరించారు. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో.. ఆయన చేతుల్లో ఉందన్న నటుడు!) ఇంటర్వ్యూలో నితీష్ భరద్వాజ్ మాట్లాడుతూ..'జపాన్ జనాభాలో మెజారిటీ ప్రజలు నాశనం కావడానికి కారణంఅణు బాంబు. అలాంటి మారణహోమానికి కారణమైన ఓపెన్ హైమర్ పశ్చాత్తాప పడ్డారు. ఆ సంఘటన అతనికి కన్నీళ్లను తెప్పించింది. దీంతో అతని చేసిన తప్పుకు చింతిస్తున్నాడు. గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమవడం నేను చూశా. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. ఆయన కోణం నుంచి ఆ సీన్ చూడాలి. అది శృంగార సన్నివేశమైనప్పటికీ.. అతని ఆలోచనలన్నీ జరిగిన విధ్వంసంపైనే ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశారు. అతనిది మానసిక సంఘర్షణ. ఆ సన్నివేశాన్ని వివాదం చేయకుండా..ఓపెన్ హైమర్ భావోద్వేగం కోణంలో చూడాలని ప్రజలను కోరుతున్నా.' అంటూ సలహా ఇచ్చారాయన. కాగా.. కై బర్డ్, మార్టిన్ J షెర్విన్ రాసిన 2005 జీవిత చరిత్ర అమెరికన్ ప్రోమేథియస్: ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ J రాబర్ట్ ఓపెన్‌హైమర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రంలో రామి మాలెక్, గ్యారీ ఓల్డ్మన్, డేన్ డెహాన్, జోష్ హార్ట్‌నెట్, కెన్నెత్ బ్రానాగ్, మాథ్యూ మోడిన్, కేసీ అఫ్లెక్, ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్, జాసన్ క్లార్క్ ప్రధాన పాత్రలు పోషించారు. (ఇది చదవండి: సినిమాల్లో నటనే కాదు.. అమ్మతనం ఉట్టి పడుతోంది!) -
అణుబాంబు ఆవిష్కర్తకు భారత పౌరసత్వం.. నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించిన ఓపెన్‌హైమర్!
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ‘ఓపెన్‌హైమర్’ సినిమా విడుదల అయిన నేపధ్యంలో అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ జీవితం గురించి తెలుసుకోవానే ఆసక్తి పలువురిలో నెలకొంది. ఇటీవలే విడుదలైన ఒక పుస్తకంలో ప్రముఖ శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్కు భారత్‌తో ముడిపడి ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. భారత దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్కు భారత పౌరసత్వం ఆఫర్ చేశారనే విషయం ఆ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ భారతీయ పార్సీ రచయిత భక్తియార్ కే దాబాభాయి భారత శాస్త్రవేత్త హోమీ భాభా జీవితం ఆధారంగా రచించారు. రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక.. ఈ పుస్తకంలో అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్‌హైమర్- హోమీ బాబాల స్నేహానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. ‘హోమీ జే భాభా: ఏ లైఫ్’ పేరుతో భక్తియార్ కే దాదాభాయి రాసిన ఈ పుస్తకంలో ‘రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌ను భాభా కలుసుకున్నారు. అనంతరం వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. భాభా మాదరిగానే రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ కూడా గౌరవమర్యాదలతో మెలిగిన వ్యక్తి. రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ సంస్కృత భాషను కూడా నేర్చుకున్నారు. దీనితో పాటు ఆయనకు లాటిన్, గ్రీకు భాషలు కూడా వచ్చు’ అని పేర్కొన్నారు. బాంబు తయారీ వరకే తన బాధ్యత.. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ తయారు చేసిన అణుబాంబును రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హీరోషిమా, నాగసాకిలో ప్రయోగించారు. అయితే అంతటి శక్తిమంతమైన బాంబు తయారు చేయడం తగినది కాదని రాబర్ట్ జె ఓపెన్‌హైమర్‌పై విమర్శలు వచ్చాయి. దీనికి ఆయన సమాధానమిస్తూ బాంబు తయారు చేయడం వరకే తన బాధ్యత అని, దానిని ఎలా వినియోగించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడంతో తనకు సంబంధం లేదన్నారు. తాను అమెరికా విడిచిపెట్టబోనంటూ.. అయితే ఆ తరువాత రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ తన వైఖరిని మార్చుకున్నారు. దీనికిమించిన శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు తయారీని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో అతనికి అమెరికా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అప్పటివరకూ అతని ఇచ్చిన రక్షణ వ్యవస్థను కూడా తొలగించారు. ఆ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం సరిగ్గా అదే సమయంలో నాటి భారత ప్రధాని నెహ్రూ.. శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్హైమర్కు భారత పౌరసత్వం ఇవ్వజూపారు. అయితే ఆయన దీనిని తిరస్కరించారు. అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలన్నింటి నుంచి విముక్తి కలిగేవరకూ తాను అమెరికా విడిచిపెట్టబోనని ఓపెన్‌హైమర్ స్వయంగా నెహ్రూకు తెలియజేశారట. రాబర్ట్ జె ఓపెన్‌హైమర్ అమెరికా దేశభక్తుడైనందున కూడా ఈ ఆఫర్ తిరస్కరించారని కూడా నిపుణులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. -
ఒక్క వీకెండ్లో వేలకోట్ల కలెక్షన్స్.. ఏ మూవీకి ఎక్కువ?
వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాల హవా నడుస్తోంది. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'ఓపెన్ హైమర్', 'బార్బీ' సునామీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. జస్ట్ ఒక్క వీకెండ్లో అంటే శుక్ర-శని-ఆదివారాలు కలిపి వేల కోట్ల వసూళ్లు సాధించాయి. ఈ విషయంలో రెండింటి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. మరి ఏ సినిమా టాప్‌లో నిలిచింది. హాలీవుడ్లో ఫాంటసీ కామెడీ సినిమాగా 'బార్బీ' విడుదలైంది. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'బార్బీ ఫ్యాషన్ డాల్స్' పుస్తకం ఆధారంగా తీశారు. దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. తొలి వీకెండ్లోనే ఆ మొత్తాన్ని రాబట్టేసుకుంది. కేవలం మూడు రోజుల్లో 337 మిలియన్ డాలర్ల వసూళ్లు దక్కాయి. మన కరెన్సీ ప్రకారం రూ.2763 కోట్లు అనమాట. (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) మరోవైపు అమెరికా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'ఓపెన్ హైమర్'. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్, హిస్టరీలో అతి ముఖ్యమైన సంఘటనకు పాలిటిక్స్ తో లింక్ చేస్తూ తెరకెక్కించిన ఈ మూవీకి క్రిస్టోఫర్ నోలన్ దర్శకుడు. 100 మిలియన్ డాలర్స్‌తో నిర్మిస్తే తొలి వీకెండే 174 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. మన కరెన్సీ ప్రకారం రూ.1426 కోట్లు అనమాట. ఈ రెండింటి కంటే రెండు వారాల ముందు అంటే జూలై 12న థియేటర్లలోకి వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్'.. తొలి వీకెండ్ లో 235 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించింది. అంటే రూ.1931 కోట్లు. ఇలా ఈ మూడు చిత్రాలు దాదాపు ఆరు వేల కోట్ల వరకు వసూళ్లు సాధించినట్టే. అయితే భారత్‌లో 'ఓపెన్ హైమర్' హవా నడుస్తుండగా, మిగతా చోట్ల మాత్రం 'బార్బీ' టాప్‌లో ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే సినీ ప్రేక్షకులు యాక్షన్, డ్రామా కంటే 'బార్బీ'లో కామెడీకే పట్టం కట్టారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) -
'ఓపెన్‌హైమర్' సినిమాలో ఆ సీన్ తొలగించండి: సమాచార మంత్రిత్వ శాఖ
హాలీవుడ్ సినిమా 'ఓపెన్‌హైమర్' భారతదేశంలో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ ఓపెనింగ్‌ను సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జులై 21 న విడుదలైంది. 'అణుబాంబు పితామహుడు' అని పిలువబడే వ్యక్తి J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ బయోపిక్ కావడంతో భారీ అంచనాలతోనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో నోలన్ క్రియేటివిటీ అద్భుతంగా ఉన్నా.. భారతీయుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. (ఇదీ చదవండి: 'కల్కి' టైటిల్ రిలీజ్‌కు ఎందుకు రాలేదంటే: అమితాబ్) భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన 'సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే' అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేశానని J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ అప్పట్లో చెప్పారు. ఈ వ్యాఖ్యాన్ని కూడా సినిమాలో చూపించారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఒక సన్నివేశం మాత్రం కొంతమంది భారతీయ సినీ ప్రేక్షకులను కలవరపరిచింది. అశ్లీల సన్నివేశంలో భగవద్గీత ప్రస్తావన తీసుకురావడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. అంతేకాకుండా సినిమాను నిషేధించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సమాచార ప్రసార (ఐబి) మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ సీన్‌కు అభ్యంతరం చెప్పకుండా ఎలా సెన్సార్ ఇచ్చారని ఫైర్ అవుతున్నారు. దీంతో తాజాగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వివాదంపై స్పందించింది. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించాలని 'ఓపెన్‌హైమర్' టీమ్‌ను కోరింది. దీంతో నేటి నుంచి ఆ సన్నివేశాన్ని తొలిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. -
Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ
టైటిల్: ఓపెన్‌హైమర్ నటీనటులు: సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మేట్ డెమన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్, జోష్ హార్ట్ నెట్, కేసీ ఎఫ్లెక్ తదితరులు నిర్మాత: ఎమ్మా థామస్ , క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం: క్రిస్టోఫర్ నోలన్ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ సినిమాటోగ్రఫీ: Hoyte van Hoytema విడుదల తేది: జులై 21 ది బాట్మాన్ బిగిన్స్, ది డార్క్ నైట్ , డన్కిర్క్, టెనెట్ వంటి అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన క్రిస్టోఫర్ నోలన్ నుంచి తాజాగా 'ఓపెన్‌హైమర్' చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా జులై 21న విడుదలైంది. ఇది ఒక బయోపిక్. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త 'రాబర్ట్ జె ఓపెన్ హైమర్' జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఓపెన్‌హైమర్ కథేంటంటే.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న యంగ్ ఓపెన్‌హైమర్ (సిలియాన్ మర్ఫీ) పరిచయంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అతను న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తగా క్రమంగా ఎదుగుతుంటాడు. అదే సమయంలో అమెరికా అణు బాంబును తయారు చేసే పనిలో ఉంటుంది. అప్పుడు 1945 రెండో ప్రపంచ యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో శత్రు దేశాలని ఎదుర్కొనేందుకు అణుబాంబు తయారు చేసి పరీక్షించాలని 'మాన్హాటన్ ప్రాజెక్టు'ను అమెరికా ప్రారంభిస్తుంది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మంచి పరిజ్ఞానం ఉన్న సైంటిస్ట్‌గా గుర్తింపు ఉన్న ఓపెన్‌హైమర్‌ను (సిలియాన్ మర్ఫీ) నాయకుడిగా నియమిస్తుంది. అతనికి సహాయంగా లూయిస్ స్ట్రాస్ (రాబర్ట్ డౌనీ జూనియర్)ను భాగస్వామిని చేస్తుంది. అలా అతను ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్‌గా తన జర్నీ ఎలా మొదలైందో డైరెక్టర్ నోలన్ అద్భుతంగా చూపించాడు. అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? హిరోషిమా-నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? అనేది ఈ కథలో తెలుపుతాడు నోలన్. ఈ దాడి తర్వాత ఓపెన్‌హైమర్ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపై అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అతనిపై వచ్చిన విమర్శలను ఓపెన్ హైమర్ భార్య కెథెరిన్ లేదా కిట్టి (ఎమిలీ బ్లంట్) ఎలా ఎదుర్కొంది? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన 'సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే' అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేశానని ఓపెన్‌హైమర్ ఎందుకు వెల్లడించారు? చివరికి ఓపెన్ హైమర్ రియలైజ్ అయ్యింది ఏంటి ? లాంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయి. ఇంటర్వెల్ సమయంలో ఒక రొమాన్స్ సీన్లో భగవద్గీతను చూపిస్తూ వచ్చే సీన్ కొంతమేరకు ఇబ్బందిని కలిగిస్తుంది. దీనిని సెన్సార్ ఎలా అంగీకరించిందనేది ప్రశ్నార్థకం. ఎలా ఉందంటే.. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటి వరకు 6 ఆస్కార్ అవార్డులు, 21 సార్లు అస్కార్ నామినేషన్లకు వెళ్లిన టాప్ డైరెక్టర్. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా 3 గంటల 10 నిమిషాల నిడివితో విడుదలైంది. ఇదొక్కటే కొంచెం మైనస్ అని చెప్పవచ్చు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ప్రేక్షకులకి అంత సులభంగా అర్థం కావు. ఎందుకంటే అతని స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంటుంది. నిడివి ఎక్కువగానే ఉన్నా అతని ఫ్యాన్స్‌ను మాత్రం నిరాశపరచలేదు. ఈ సినిమాలో ఎలాంటి తికమకలు లేకుండా కథను చాలా నీట్‌గా చెప్పుకుంటూ వెళ్లాడు కాబట్టి అందరికీ కనెక్ట్ కావచ్చు. సినిమా ప్రారంభంలో కొంచెం స్లోగానే కథ రన్ అవుతుంది. ప్రజెంట్, పాస్ట్.. ఇలా నడుస్తూ ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉన్నా ఓపెన్ హైమర్ అణుబాంబు తయారీ టీమ్‌లోకి అడుగుపెట్టిన సమయం నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి చాలా ఆసక్తిగా స్టోరీ నడుస్తుంది. అణుబాంబును తయారు చేసిన తరువాత ట్రయల్ విజయవంతం కావడం, ఆపై మొదటిసారి హిరోషిమా-నాగసాకిపై ప్రయోగించడం.. దాని వల్ల కలిగిన విధ్వంసం ఆ శాస్త్రవేత్తను ఎలాంటి మానసిక వేదనకి గురి చేసింది అన్న సన్నివేశాలు బాగా చూపించాడు నోలన్. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్, ఓపెన్ హైమర్ మధ్య నడిచే అప్పటి రాజకీయాలే కాకుండా ఆ సమయంలో వారిద్దరి మధ్య వచ్చే సంభాషణల భావోద్వేగాల సీన్లు బాగుంటాయి. మానవత్వాన్ని ఒక వెపన్‌లో పెట్టి వినాశనం చేస్తున్నాను అని ఓపెన్ హైమర్ వేదన చెందే సన్నివేశంలో 'సిల్లియన్ మర్ఫీ' ఎంతో ఎమోషనల్‌గా నటించారు. ఫిజిక్స్, న్యూక్లియర్ సైన్స్‌పై ఆసక్తితో పాటు అవగాహన ఉన్న వారు ఈ కథకు బాగా రిలేట్ కాగలుగుతారు. ఈ చిత్రంలోని కొన్ని టెక్నికల్ బ్రిలియన్స్ ని ఎంజాయ్ చేయాలంటే అణుబాంబు దాడి గురించి ముందే కొంత అవగాహనతో సినిమాకు వెళ్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో సగటు ప్రేక్షకుడిని అంత సమయం పాటు థియేటర్లో కూర్చోబెట్టడం కొంచెం మైనస్. మొదట్లో ఒక గంటపాటు సీన్లన్నీ చాలా నెమ్మదిగా ఉంటాయి. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంతో కనెక్ట్ అవుతారని గ్యారెంటీ లేదు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్ పాత్రలో 'సిలియాన్ మర్ఫీ' పర్ఫెక్ట్గా నటించాడు. మనం సినిమా చూస్తున్నంత సేపు.. అణుబాంబును తయారు చేసిన వ్యక్తి ఆ సమయంలో ఇంతలా మదనపడ్డాడా..? అని తప్పకుండా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని ఓపెన్‌హైమర్‌గా సిలియాన్ మర్ఫీనే క్యారీ చేశారు. అతనికి భార్యగా నటించిన ఎమిలీ బ్లంట్ పాత్ర సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుంది. తన భర్త తయారు చేసిన బాంబ్ వల్ల కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని ఎలా ఎదుర్కొంది? భర్తకు సపోర్ట్‌గా నిలిచిన విధానం ఆడియన్స్‌ని మెప్పిస్తుంది. ఈ సినిమాలో ఓపెన్హైమర్కు సహాయకుడిగా నటించిన రోల్లో 'రాబర్ట్ డౌనీ జూనియర్' మెప్పించాడు. అటామిక్ కమిషన్ హెడ్‌గా అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రధానంగా 'మేట్ డెమన్' ఎయిర్‌ఫోర్స్ జనరల్ పాత్రలో కావాల్సినంత ఇంటెన్సిటీని తీసుకొచ్చారు. టెక్నికల్ పరంగా చూస్తే.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ టైమ్‌లోని సీన్లను ఈ జనరేషన్‌కు రీచ్ అయ్యేవిధంగా చూపించాడు. దీంతో స్క్రీన్‌పై మంచి ప్రజంటేషన్ కనిపిస్తుంది. సినిమాలో ఒకపైపు రియాలిటీని చూపిస్తూనే.. మరోవైపు ఆర్టిఫిషియాలిటీని కూడా చూపించారు. ఇక ఈ సినిమాలో ఎడిటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పవచ్చు. సినిమాలో చాలా మంది రోల్స్ కనిపిస్తూ పోతున్నా.. పర్ఫెక్ట్ కంటిన్యూటీని ఫాలో అయ్యాడు. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఈజీగా అర్థం అయ్యేలా కథను ఎడిట్ చేశారు. నోలన్ సినిమాలో సౌండ్ వర్క్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా అణుబాంబు పేలుడు సమయంలో వచ్చే సీన్ మెప్పిస్తుంది. ఈ సినిమాకు రియల్ బాంబ్ ఉపయోగించామని చెప్పారు. అది నిజమో కాదో తెలియదు. నోలన్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. ఒకవేళ నార్మల్ ఆడియన్ అయితే స్టోరీ కొంచెం నిడివి ఎక్కువ ఉందని అనిపించక మానదు, అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా కూడా ఉంటాయి. సినిమా అభిమానులకు మాత్రం మంచి అనుభూతి అయితే ఇస్తుంది. ఏదేమైనా ఈసారి హాలీవుడ్ నుంచి ఆస్కార్ బరిలో ఈ సినిమా కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్