
సీలియన్ మర్ఫీ
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆపెన్ హైమర్’ చిత్రంలో మంచి నటన కనబరచి 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్నారు నటుడు సీలియన్ మర్ఫీ. దీంతో సీలియన్ తర్వాతి చిత్రాలపై హాలీవుడ్‌లో ఫోకస్ పెరిగింది. కాగా సీలియన్ నటించనున్న కొత్త చిత్రం సెప్టెంబరులో స్టార్ట్ కానున్నట్లు హాలీవుడ్ సమా చారం.
హాలీవుడ్ హిట్ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’ ఆధారంగా ఓ సినిమా తీయాలనుకుంటున్నారు ఈ సిరీస్ రూపకర్త స్టీవెన్ నైట్. ‘పీకీ బ్లైండర్స్’ ఆధారంగా ఈ సినిమాను సెప్టెంబరులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ‘పీకీ బ్లైండర్స్’ సిరీస్‌లో థామస్ షేల్బేగా నటించిన సీలియన్ మర్ఫీ ఈ సినిమాలోనూ నటిస్తారన్నట్లుగా స్టీవెన్ ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా 2025 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment