
97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ అవార్డులకు సంబంధించి రేసులో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో పది సినిమాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నటుడు, ఉత్తమ నటి రేసులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఈ వేడకలకు వ్యాఖ్యాతలుగా అమెరికన్ నటుడు బోవెన్ యాంగ్, నటి రాచెల్ సెన్నాట్‌లు వ్యవహరించారు.
భారతీయ సినిమాకి నిరాశ
ఆస్కార్ అవార్డ్స్ రిమైండర్ లిస్ట్‌లో నిలిచిన భారతీయ చిత్రాలు ‘కంగువ, ఆడు జీవితం (‘ది గోట్‌లైఫ్), సంతోష్, స్వతంత్రవీర్ సవార్కర్, ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్, గర్ల్స్ విల్ బీ గర్ల్స్, పుతల్’ ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకోలేకపోయాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం ఈ ఏడాది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంపిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈసారి భారతీయ సినిమాకి నిరాశ ఎదురైంది. కానీ, 97వ ఆస్కార్ అవార్డ్‌ల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘అనూజ’(Anuja) మాత్రమే భారత్ నుంచి రేసులో ఉంది.
ఉత్తమ చిత్రం: అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్ నోన్ , కాన్ క్లేవ్, డ్యూన్ : పార్ట్ 2, ఎమిలియా పెరెజ్, ఐయామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, విక్డ్
ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా), బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), జేమ్స్ మ్యాన్ గోల్డ్ (ది కంప్లీట్ అన్ నోన్ ), జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్), కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్)
ఉత్తమ నటుడు: అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), తిమోతీ చాలమెట్ (ది కంప్లీట్ అన్ నోన్ ), కోల్‌మెన్ డొమినింగో (సింగ్‌సింగ్), రే ఫియన్నెస్ (కాన్ క్లేవ్), సెబస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)
ఉత్తమ నటి: సింథియా ఎరివో (విక్డ్), కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్), మికే మాడిసన్ (అనోరా), డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)
ఉత్తమ సహాయ నటుడు: యురా బోరిసోవ్ (అనోరా), కిరెన్ కల్కిన్ (ది రియల్ పెయిన్ ), ఎడ్వర్డ్ నార్తన్ (ది కంప్లీట్ అన్ నోన్ ), గాయ్ పియర్స్ (ది బ్రూటలిస్ట్), జెరీమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్)
ఉత్తమ సహాయ నటి: మోనికా బార్బరో (ది కంప్లీట్ అన్ నోన్ ), అరియానా గ్రాండే (విక్డ్), ఫెసిలిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్), ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్ క్లేవ్), జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్).
Comments
Please login to add a commentAdd a comment