
రెండేళ్ల క్రితం హాలీవుడ్‌లో సంచలన విజయాన్ని అందకున్న చిత్రం ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, ఇప్పుడు ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతుంది. 2023లో విడుదలైన 'ఎనీవన్ బట్ యూ' ఇప్పటికే పలు ఓటీటీలలో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రముఖ దర్శకుడు విల్ గ్లక్ తెరకెక్కించారు. విలియం షేక్స్పియర్ రచించిన మచ్ అడో అబౌట్ నథింగ్ ఆధారంగా ఈ సినిమా స్టోరీని తీసుకున్నారు. ఇందులో సిడ్నీ స్వీనీ , గ్లెన్ పావెల్ జోడి చాలా రొమాంటిక్‌గా నటించారు.
ఆ ఏడాదిలో విడుదలైన అన్ని హాలీవుడ్ చిత్రాల్లో 'ఎనీవన్ బట్ యూ' టాప్‌లో రన్ అయింది. ఆపై ఓటీటీలోనూ ఈ చిత్రానికి భారీగానే వ్యూస్ దక్కాయి. సబ్‌టైటిల్స్‌తో ఉన్న ఈ మూవీ ఇంగ్లీష్‌లో ఉంది. ప్రస్తుతం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అదికూడా ఉచితంగానే చూసేయవచ్చు. అయితే, జీ5,అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది. కానీ అక్కడ రెంటల్ విధానంలో ఉంది. సుమారు ఏడాది పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ చిత్రం రన్ అయింది. ఢీల్ పూర్తి కావడంతో తాజాగా అందులో నుంచి తొలగించారు.

రూ. 210 కోట్ల బడ్జెట్
'ఎనీవన్ బట్ యూ' చిత్రాన్ని రూ. 210 కోట్ల బడ్జెట్‌తో విల్ గ్లక్, జో రోత్, జెఫ్ కిర్షెన్‌బామ్ సంయుక్తంగా నిర్మించారు. కేవలం 103 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1900 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను కోలంబియా పిక్చర్స్, ఓలివ్ బ్రిడ్జ్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లు నిర్మించాయి. అయితే, సోనీ పిక్చర్స్ విడుదల చేసింది. డేటింగ్ కోసం వెళ్లిన ఇద్దరు ప్రేమికులు చిన్న కారణంతో విడిపోయి.. ఒక పెళ్లిలో మళ్లీ కలుస్తారు. ఆ వేడుకను చూసి వారిలో ఎలాంటి ఆలోచన వచ్చింది అనేది ఈ సినిమా ప్రధాన కాన్సెప్ట్. చాలా రొమాంటిక్‌గా, కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.