Romantic
-
Valentines Day : లవ్ బర్డ్స్కోసం ది బెస్ట్ డెస్టినేషన్ ఇదే!
ప్రేమికుల దినోత్సవం లేదా వాలెంటైన్స్ డే (Valentine's Day) ప్రేమికులకు తమ ప్రేమను వ్యక్తీకరించు కోవడానికి, చిరస్మరణీయమైన అనుభవాన్ని పొందడానికి సరైన సమయం. ఫిబ్రవరి వస్తుందంటేనే వాలెంటైన్స్ డే కోసం ఎదురు చూస్తుంటారు ప్రేమికులందరూ. తమ లవర్‌ను సర్ప్రైజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలుచేస్తుంటారు. మరికొందరు పార్ట్నర్కు రొమాంటిక్ అనుభవాన్ని అందించాలని ఉవ్విళ్లూరుతారు. అలాంటి వారికి దుబాయ్ (Dubai) బెస్ట్ డెస్టినేషన్అని చెప్పవచ్చు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న దుబాయ్‌లోని వాలెంటైన్స్ డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఆకర్షణీయమైన స్కైలైన్ భవనాలు బీచ్‌లు, లగ్జరీ స్పా రిట్రీట్స్, విలాసవంతైన రెస్టారెంట్లు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, ప్రైవేట్ యాచ్ క్రూయిజ్ ట్రిప్‌లు చక్కటి భోజనం..ఇలా అనేక రకాల వసతులతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇవి రొమాంటిక్ ఫీలింగ్‌ను అందిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం.షాంగ్రి-లా దుబాయ్ (Shangri-La Dubai)షాంగ్రి-లా దుబాయ్‌లో అసమానమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఐకానిక్ హోటల్ విలాసవంతమైన వసతి సౌకర్యాలు, రొమాంటిక్ డిన్నర్లు లాంటి అద్భుతమైన భోజన సదుపాయాలు ఉంటాయి. బుర్జ్ ఖలీఫా , డౌన్‌టౌన్ దుబాయ్ స్కైలైన్ అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌లో లెవల్ 42 “ప్రైవేట్ డైనింగ్ అబౌవ్ ది క్లౌడ్స్”లో ఉన్న జంటలకు స్పెషల్ అనుభవాన్ని అందిస్తుంది.పలాజ్జో వెర్సేస్ దుబాయ్ (Palazzo Versace Dubai)పాపులర్ జద్దాఫ్ వాటర్‌ఫ్రంట్ మధ్యలో ఉన్న, పలాజ్జో వెర్సేస్ దుబాయ్ ప్రేమికులకు వెచ్చని ఆహ్వానం పలుకుతుంది. లవ్‌బర్డ్స్‌ను మంత్రముగ్ధులనుచేస్తూ శాశ్వతమైన ప్రేమను ప్రసరింపజేస్తుంది. కేక్ ట్రాలీ ఉత్కంఠభరితమైన రొమాంటిక్, సూర్యోదయాలు, సిగ్నేచర్ హై టీ అనుభవంతోపాటు, మెస్మరైజింగ్ వాతావరణంలో సొగసైన గియార్డినో సెట్స్, అద్భుతమైన మ్యూజిక్, ,గమ్మత్తైన వాలెంటైన్స్ విందునిస్తుంది.రిక్సోస్ ప్రీమియం సాదియత్ ద్వీపం (Rixos Premium Saadiyat Island)తెల్లని ఇసుక మధ్య ప్రేమికులు సేదదీరడం అంటే సాదియత్ ద్వీపం ప్రత్యేకమైన స్వర్గధామం అన్నట్టే. విలాసవంతమౌన వసతి సౌకర్యాలు, కొలనులతో కూడిన ఏకాంత ప్రైవేట్ విల్లాలు , అంజనా స్పాలు, టర్కిష్ విందును ఆస్వాదించవచ్చు . లేదంటే క్యాండిల్స్ లైట్స్ వెలుగుల్లో బీచ్‌సైడ్ భోజనాన్ని ఆస్వాదించవచ్చు. దీనికి జతగా అమేజింగ్ మ్యూజిక్, సముద్రతీర అందాలు ఉండనేఉంటాయి. జేడబ్ల్యూ మారియట్ మార్క్విస్ హోటల్ దుబాయ్ (JW Marriott Marquis Hotel Dubai)జేడబ్ల్యూమారియట్ మార్క్విస్ హోటల్ దుబాయ్‌లో రొమాంటిక్ అనుభవాన్ని అందించడంలో ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంది. దీని మూడు సిగ్నేచర్ రెస్టారెంట్లలో ఒకదానిలో వాలెంటైన్స్ డేను జరుపుకోవచ్చు, ప్రతీదీ ఒక్కో విలక్షణమైన ప్రపంచ పాక అనుభవాన్ని అందిస్తుంది. దుబాయ్ ఉత్కంఠభరితమైన దృశ్యాలను తనవితీరా ఆస్వాదించవచ్చు. ఇది చిరస్మరణీయమైన సాయంత్రం కోసం సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.దుబాయ్ క్రీక్ రిసార్ట్ (Dubai Creek Resort)జంటలకు కలలు కనే అనుభవాలతో దుబాయ్ క్రీక్ రిసార్ట్‌లో ఏకంగా నెలరోజులపాటు వాలెంటైన్ డేను జరుపుకోవచ్చు. అమరా స్పాలో సన్నిహిత స్పా రిట్రీట్లు, బోర్డ్‌వాక్ వద్ద సుందరమైన వాటర్‌ఫ్రంట్ బ్రంచ్‌లు , పార్క్ హయత్ దుబాయ్‌లో శృంగార బసలను ఆస్వాదించండి. పూల్ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నా లేదా క్యాండిల్‌లైట్ డిన్నర్ అయినా ప్రతీ క్షణం ప్రేమ కోసంమే అన్నట్టు ఎంజాయ్ చేయవచ్చు.అద్భుతమైన నగర దృశ్యాల నుండి ప్రశాంతమైన సముద్ర తీరప్రాంత విహారయాత్రల వరకు, దుబాయ్‌లో వాలెంటైన్స్ డేని జరుపుకోవడానికి చక్కటి అవకాశం. కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినా ప్రేమను ప్రకటించాలన్నా, భాగస్వామితో ప్రశాంతంగా సమయాన్ని గడపాలన్నా దుబాయ్ ఈజ్ ది బెస్ట్. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే.ఇదీ చదవండి: మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో -
కొత్త జంటలకు ఏకాంతం.. ఆలుమగలకు ప్రశాంతం! ఈ రొమాంటిక్ ప్లేసెస్ గురించి ఎప్పుడైనా విన్నారా? (ఫొటోలు)
-
Ketika Sharma : అందాలతో మత్తెక్కిస్తున్న 'రొమాంటిక్' హీరోయిన్
-
వినోదాల ప్రేమ
కార్తీక్ రత్నం, సుప్యర్ద సింగ్ జంటగా ఆనంద్ బడా దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘లింగొచ్చా..’. ‘గేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. జె.నీలిమ సమర్పణలో యాదగిరి రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ బడా మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘లింగొచ్చా..’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బికాజ్ రాజ్, సహ నిర్మాత: మల్లేష్ కంజర్ల. -
Shriya Saran: రోమ్ వీధుల్లో భర్తతో శ్రియ రొమాన్స్ (ఫోటోలు)
-
యాక్షన్ హెబ్బులి.. ఆగస్టు 4న తెలుగులో రిలీజ్
సుదీప్, అమలా పాల్ జంటగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన కన్నడ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘హెబ్బులి’. ఈ సినిమాను అదే టైటిల్‌తో సి. సుబ్రహ్మణ్యం ఆగస్టు 4న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాంటిక్ సీన్స్ మిళితమై ఉన్న పక్కా కమర్షియల్ ఫిల్మ్ ‘హెబ్బులి’. కన్నడంలో రూ. 100 కోట్లు సాధించింది. తెలుగులోనూ హిట్ అవు తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్ లో ఏం జరిగిందో చూడండి
-
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్లో ఏం జరిగిందో చూడండి..!
-
రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో.. కేసుపై పోలీసుల తంట..!
రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో రెండు పోలీసు స్టేషన్ల మధ్య గొడవ తెచ్చిపెట్టింది. ఆ ఘటన తమ పరిధిలోది కాదంటే తమది కాదంటూ కొట్టిపారేస్తున్నారు పోలీసు అధికారులు. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది? ఎందుకు అది వివాదాస్పదమైందంటే..? వీడియోలో బ్రిడ్జ్‌పై ఓ జంట బైక్‌పై వెళుతోంది. అబ్బాయి బైక్ నడుపుతుండగా.. అతనికి ముందుభాగంలో వ్యతిరేక దిశలో హత్తుకుని కూర్చుంది అమ్మాయి. తేదీ వివరాలు లేని ఈ వీడియో నిరాలనగర్ ఫ్లై ఓవర్‌పై జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపించట్లేదు. ముఖాల ఆధారంగా నిందితులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ఘటన తమ పరిధిలోది కాదని అలీగంజ్, గోమతీ నగర్ పోలీసు స్టేషన్ అధికారులు విభేదించుకుంటున్నారు. గోమతీ నగర్‌కు సమీపంలో ఘటన జరిగినట్లు తెలుస్తోందని అలీగంజ్ స్టేషన్ అధికారి నగేష్ కుమార్ ఉపాధ్యాయ అన్నారు. వీడియోలో కనిపించిన బ్రిడ్జ్ గోమతీ నగర్‌కు సమీపంలోనిది కాదని, అక్కడ వీడియోలు రికార్డ్ చేసే అవకాశమే లేదని స్థానిక స్టేషన్ అధికారి కొట్టిపారేస్తున్నారు. కాగా ఇలాంటి వీడియోనే కొన్ని రోజుల క్రితం హజ్రత్ గంజ్ ప్రాంతంలో జరిగింది. నిందితులను కూడా గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. -
వీడియో: బాయ్‌ఫ్రెండ్‌తో వెకేషన్లో చిల్ అవుతున్న హీరోయిన్..
-
మురికి కాలువలో రొమాంటిక్ ఫోటోషూట్.!
-
భర్తను హత్య చేసేందుకే...ఆ నవల రాసిందా?
Author goes on trial for her spouses Assassinate Case: కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. నిందితులు తాము చేయాలనుకునే నేరం కోసమే ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తారో లేక యాదృచ్చికంగా జరుగుతాయో తెలియదు. కానీ ఇక్కడొక రచయిత విషయంలో అలానే జరిగింది. వివరాల్లోకెళ్తే...నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ రొమాన్స్ కథల స్వీయ రచయిత. అయితే ఆమె ప్రస్తుతం తన భర్త డేనియల్ బ్రోఫీకి సంబంధించిన హత్య కేసుని ఎదుర్కొంటోంది. ఈ మేరకు నాన్సీ 2018లో అరెస్టు అయినప్పటి నుంచి కస్టడీలోనే ఉంది. ఆమె భర్త సౌత్‌వెస్ట్ పోర్ట్‌ల్యాండ్‌లోని ఒరెగాన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్లో విధులు నిర్వర్తించడానికి వెళ్తున్న సమయంలో హత్యకు గురైయ్యాడు. ఆయన్ని ఎవరో తపాకీతో కాల్చి చంపారు. అయితే ఆమె తన భర్త మృతి చెందడానికి కొన్ని వారాల ముందు హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ అనే పేరుతో ఒక నవల రాయడం గమనార్హం. తొలత ఆమె భర్త మరణం పోలీసులకు ఒక మిస్టరీ కేసుగా అనిపించింది. అయితే తదనంతర విచారణల నేపథ్యంలో ఆమె అసలైన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ట్రాఫిక్ కెమెరాల్లో ఆమె భర్త హత్య జరగడానికి ముందు ఆ ప్రాంతంలో తిరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఆమె కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. అయితే న్యాయమూర్తి సీనియర్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ షాన్ ముల్ట్నోమా కౌంటీ సుమారు 10 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ కోసం లాంటి దారుణానికి ఆమె ఒడిగట్టిందని అన్నారు.అంతేకాదు ఆమె అక్రమ సంపాదనతో చాలా లాభపడిందని కూడా అన్నారు. అయితే ఆమె గతంలో ఎలాంటి నేరారోపణలకు పాల్పడలేదన్నారు. ఈ మేరకు ఈ కేసు ఏడు వారాలపాటు విచారణ కొనసాగనుందని న్యాయమూర్తి తెలిపారు. (చదవండి: ఇంజనీరింగ్, ఎంబీఏ చదివారు.. విలాసాల కోసం యూట్యూబ్ చూసి..) -
రొమాంటిక్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు
-
ఈ వారం ఓటీటీ, థీయేటర్లో విడుదలయ్యే చిత్రాలివే
కరోనా ప్రభావం తగ్గి ఆడియన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్ల వైపు కదులుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్ విడుదలై మంచి విజయాన్ని సాధించగా, మరికొన్ని విడుదలైయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక దసరా తర్వాత వెండితెరపై చిన్న సినిమాల హవా కొసాగుతోంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన చిత్రాలు ఇప్పుడు థియేటర్ల బాట పడుతున్నాయి. అలాగే మరి కొన్ని డెరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకోస్తోన్న ఆ చిత్రాలేవో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. వరుడు కావలేను నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి లక్ష్మి సౌభాగ్య దర్శకురాలిగా వ్యవహరించారు. ఈ సినిమా అక్టోబరు 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆకాశ్ పూరీ ‘రొమాంటిక్’ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, ముంబై బ్యూటీ కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 29న రొమాంటిక్ థియేటర్లలో విడుదలకు సిద్దమైంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో అలరించనున్నారు. అనిల్ ఇనమడుగు ‘తీరం’ అనిల్ ఇనమడుగు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘తీరం’. శ్రావణ్ వైజీటీ మరో హీరో. క్రిస్టెన్ రవళి, అపర్ణ కథానాయికలు. యం శ్రీనివాసులు నిర్మంచిన ఈ చిత్రం అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు జంటల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేమ, రొమాంటిక్‌గా తెరక్కించాడు అనిల్. రావణ లంక క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’. బీఎన్‌ఎస్‌రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది, దీంతో అక్టోబరు 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. విహారయాత్ర కోసం వెళ్లి నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశారు? అది హత్య? ఆత్మహత్య? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఈ చిత్రంలో మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జై భజరంగి 2 కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జై భజరంగి 2’. 2013లో వచ్చిన ‘భజరంగి’ చిత్రానికి సీక్వెల్‌గా ఏ. హర్ష ఈ చిత్రాన్ని రూపొందించాడు. నిరంజన్ పన్సారి నిర్మించారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్ విడుదలైంది. ఓటీటీలో జీ5 ►ఆఫత్ ఈ ఇష్క్(హిందీ) అక్టోబరు 29 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ► హమ్ దో హమారే దో(హిందీ) అక్టోబరు 29 అమెజాన్ ప్రైమ్ ► డైబుక్(హిందీ) అక్టోబరు 29 నెట్‌ఫ్లిక్స్ ►లాభం(తమిళం) అక్టోబరు 24 ► ఆర్మీ ఆఫ్ దీవ్స్ , అక్టోబరు 29 -
‘రొమాంటిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
పూరీ జగన్నాథ్ కాలర్ ఎగరేయాలి: విజయ్ దేవరకొండ
‘‘పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ చేసే సినిమాలన్నీ వరంగల్‌లోనే స్టార్ట్ చేయాలి.. ఎందుకంటే వరంగల్‌లో ఏది మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. ‘రొమాంటిక్’ ఘనవిజయం సాధిస్తుంది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాధ్, చార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఆకాశ్ మాటలు విన్నాక తనలో మంచి ఫైర్ ఉందనిపించింది. మీ నాన్న (పూరి జగన్నాద్) కాలర్ ఎగరేయాలి. ఆకాశ్ సినిమా పిచ్చి గురించి పూరి, చార్మీగార్లు నాకు చెప్పేవారు. ప్రతి సినిమా చూస్తాడట.. సినిమాపై పిచ్చి ఉన్న నీలాంటోళ్లు తప్పకుండా సక్సెస్ అవ్వాలి.. సక్సెస్ అవుతావు. ‘రొమాంటిక్’ సినిమా బాగా వచ్చిందని చూసినవాళ్లు చెప్పారు. ఈ సినిమా 100శాతం హిట్ అవుతుంది. విధి అనేది నన్ను, పూరి జగన్నాథ్, చార్మీలను కలిపింది. ‘లైగర్’ సినిమా కోసం వారు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఈ సినిమాతో ఇండియాని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాం’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘నాకు పదేళ్లప్పుడు స్కూల్ తరపున వరంగల్‌కి వచ్చాను. అప్పటి నుంచి నాకు వరంగల్‌తో అనుబంధం ఉంది. ‘రొమాంటిక్’ చిత్రంలో ఆకాశ్, రమ్యకృష్ణ, కేతిక ఇరగ్గొట్టేశారు. మంచి లవ్‌స్టోరీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా సినిమా చూడండి. ఆకాశ్ చాలా మాట్లాడేశాడు.. వాడు చిన్నప్పుడు ప్రతిరోజూ లేవగానే ఓ డైలాగ్ చెప్పి వేషం ఇవ్వమని అడిగేవాడు నన్ను. తను మంచి నటుడు’’ అన్నారు. ‘‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రీ రిలీజ్ వరంగల్‌లో చేశాం.. పెద్ద హిట్ అయింది. అదే సెంటిమెంట్‌తోనే ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఇక్కడే చేశాం. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలని మీరందరూ ఆశీర్వదించాలి’’ అన్నారు చార్మి. అనిల్ పాదూరి మాట్లాడుతూ– ‘‘టెంపర్’ సినిమా సమయంలో ఎన్టీఆర్‌గారు పూరి జగన్నాథ్‌గారికి నన్ను పరిచయం చేశారు. నన్ను నమ్మి ‘రొమాంటిక్’ అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్, చార్మీగార్లకు థ్యాంక్స్. మంచి ప్రేమకథా చిత్రాల్లో ‘రొమాంటిక్’ కూడా ఒకటిగా నిలుస్తుంది’’ అన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. పూరి ఆకాశ్ మాట్లాడుతూ– ‘‘ఎక్కడో నర్సీపట్నంలో పుట్టిన మా నాన్న సినిమా నేపథ్యం లేకున్నా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి పైకి వచ్చారు. ‘పూరి టైమ్ అయిపోయిందిలే.. ఇక సినిమాలు ఏం చేస్తాడు?’ వంటి రకరకాల కామెంట్స్ చూసినప్పుడు బాధ వేసేది. అలాంటి వారందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్‌తో సమాధానం చెప్పారు. అలాగే ‘వీడేం హీరోలే’ అని నన్ను కొందరన్నారు. నన్ను చూసి మీరు గర్వపడేలా ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి కష్టపడతా నాన్నా.. ఏదో ఒకరోజు గర్వంగా మీరు కాలర్ ఎగరవేయాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
‘జబర్దస్త్’ భామ రొమాంటిక్ ఫొటోలు
-
రన్నింగ్ బస్‌లో లిప్‌లాక్.. ‘రొమాంటిక్’గా పూరీ కొడుకు
పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రొమాంటింగ్. ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. అనిల్ పడూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే పూరీ అందిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. జూన్ 18న థియేటర్లలో సినిమా రిలీజ్ కానున్నట్లు సోమవారం హీరో ఆకాష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్లో.. నడుస్తున్న బస్ డోర్ దగ్గర హీరోయిన్ను ఆకాష్ లిప్ లాక్ చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీన్ని బట్టి సినిమా ఎంత రొమాంటిక్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. అయితే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ గతేడాది మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా నిలిచిపోయింది. రమ్య కృష్ణ, మందిరా బేడి, మకరంద్ దేశ్‌పాండే, దివ్యదర్శిని తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రొమాంటిక్ సినిమా టీజర్‌ను పూరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అలాగే పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఆంధ్రాపోరి చిత్రంతో టాలీవుడ్లోకి ఆకాష్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2018లో మెహబూబా చిత్రంతో పలకరించాడు. ఇండియా- పాకిస్తాన్ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. దీంతో ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలని ఆకాష్ ఎదురు చూస్తున్నాడు. View this post on Instagram A post shared by Akash Puri (@actorakashpuri) ఇదిలా ఉండగా అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కూడా జూన్ నెలలోనే విడుదల కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఇకపోతే రొమాంటిక్ జూన్ 18న రిలీజ్ అవుతుండగా.. జూన్ 18న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వస్తున్నాడు. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సీఫీస్ వద్ద పోటీ పడనున్నాయని చెప్పవచ్చు. చదవండి: ‘ఆకాష్’ దొంగల బజార్ ఖరార్ కామ్రేడ్‌గా చరణ్.. ఆచార్య సెట్లో నాన్నతో ఇలా.. -
రొమాంటిక్ మూవీ హీరోయిన్ కేతికా శర్మ ఫోటోలు
-
మీకు మీరే ప్రేరణ అవ్వండి
13 ఏళ్ల వయసులో హీరోయిన్గా ఎంటరై ఓ 13 ఏళ్లు నటిగా వెనక్కి తిరిగి చూసుకోనంత బిజీగా సినిమాలు చేశారు చార్మి. ‘నీ తోడు కావాలి’ (2002) నుంచి ‘జ్యోతిలక్ష్మి’ (2015) వరకూ కథనాయికగా, ప్రత్యేక పాటల్లో, అతిథి పాత్రల్లో చార్మి మెరిశారు. ‘జ్యోతిలక్ష్మి’తో నిర్మాతగా మారారు. ‘పూరి కనెక్ట్స్’ బేనర్లో వచ్చిన జ్యోతిలక్ష్మి రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ‘రొమాంటిక్’ సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండతో ప్యాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా చార్మితో జరిపిన ఇంటర్వ్యూ. ► స్క్రీన్ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ నిర్మాణ రంగంలో తక్కువమంది ఉన్నారు. మీరు యాక్టర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తెరవెనకతో పోల్చితే తెర మీద కనిపించే స్త్రీల సంఖ్య ఎక్కువే. కానీ యాక్టింగ్ అనేది సాధారణ విషయం కాదు. ఎంతో అంకితభావం, ఇష్టం ఉండాలి. దాంతోపాటు ఎంతో త్యాగం కూడా ఉంటుంది. అప్పుడే ఇండస్ట్రీలో ఉండగలుగుతాం. నా యాక్టింగ్ కెరీర్లో నేను చాలా ఎత్తుకి ఎదిగాను, అవార్డులు తీసుకున్నాను. కానీ ‘జ్యోతిలక్ష్మి’ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో నటిస్తూ, నిర్మించాను. ఒకవైపు ప్రొడక్షన్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటూ, ఎవరిని ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకుంటూ మరోవైపు నటనని కూడా బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. అయితే యాక్టింగ్ కంటే ప్రొడక్షన్ చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. ఒక మంచి సినిమా ఇవ్వడానికి నిర్మాత పడే కష్టాలు తెలిశాయి. ఒక స్త్రీగా నిర్మాణం సవాల్ అయినప్పటికీ సంతృప్తినిస్తోంది. అందుకే ప్రొడక్షన్‌ని కెరీర్‌గా చేసుకుని తెరవెనక పని చేస్తున్నాను. దేశంలో మనకున్న అతి తక్కువమంది సక్సెస్ఫుల్ యంగ్ లేడీ ప్రొడ్యూసర్స్‌లో నేను ఒకదాన్ని కావడం ఆనందంగా, గర్వంగా ఉంది. ► డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌గారు సపోర్ట్ చేయడంవల్లే మీరు ప్రొడక్షన్ చూసుకోగలుగుతున్నారా? లేక మీ అంతట మీరు సొంతంగా ప్రొడక్షన్‌ని హ్యాండిల్ చేసే ధైర్యం మీకుందా? పూరీగారు, నేను ఒకర్నొకరం సపోర్ట్ చేసు కుంటాం. మా మంచీ చెడులకు మేం ఒకరికొకరం అండగా నిలబడ్డాం. ఇక నేను ఓన్‌గా ప్రొడక్షన్ చూసుకోగలనా అంటే.. ‘జ్యోతిలక్ష్మి’ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు విజయ్ దేవరకొండతో తీస్తున్న సినిమాతో కలిపి ఐదేళ్లుగా సినిమాలు నిర్మిస్తున్నాను. మరి నాకు ఓన్‌గా ప్రొడక్షన్‌ని హ్యాండిల్ చేసేంత ధైర్యం ఉందో లేదో చెప్పండి (నవ్వుతూ). ► మేల్, ఫిమేల్ ప్రొడ్యూసర్‌కి ఉన్న డిఫరెన్స్? జెండర్ తేడా తప్ప పని విషయంలో ఏ తేడా ఉండదు. పీపుల్ని డీల్ చేసే విషయంలోను, సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలోనూ అంతా ఒకటే. అయితే పెద్ద తేడా ఏంటంటే.. ఆడవాళ్లను నిరుత్సాహపరచడానికి చాలామంది ట్రై చేస్తారు. ఈ బిజినెస్‌కి పనికి రావు అన్నట్లుగా డౌన్ చేస్తారు. అలాంటి సమయాల్లో స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాంటివాళ్లను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి. కేవలం వాళ్లకున్న అభద్రతాభావంవల్లే స్త్రీలను నిరుత్సాహపరచడానికి ట్రై చేస్తారు. ► హీరోయిన్గా ఎదుర్కొన్న సవాళ్లు? ఇప్పుడు నిర్మాతగా ఎదుర్కొంటున్న వాటి గురించి? నా పదమూడేళ్ల వయసులో యాక్టింగ్ కెరీర్‌ని మొదలుపెట్టాను. అప్పటినుంచి నటిగా నా చివరి సినిమా ‘జ్యోతిలక్ష్మి’ వరకు కెరీర్ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ చాలా ఎత్తుపల్లాలు చూశాను. తట్టుకుని ముందుకెళ్లాలంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. మన ప్రతిభే మనల్ని శిఖరానికి చేర్చుతుంది. నటిగా నన్ను ప్రూవ్ చేసుకున్నాక అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టాక చాలామంది ‘నెగటివ్ అడ్వైస్’లు ఇచ్చారు. ప్రొడక్షన్ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చాను. పైగా ఫిమేల్ ప్రొడ్యూసర్. అయితే మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఫైనల్లీ ప్యాన్ ఇండియా మూవీ (‘ఫైటర్’) ప్రొడ్యూసర్‌గా బెస్ట్ స్పేస్‌లో ఉన్నాను. ► నటన, నిర్మాణం ఏది సౌకర్యంగా ఉంది? మీరు ఒక పని చేస్తున్నప్పుడు నేను ‘కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాను’ అనే ఫీలింగ్ వస్తే అక్కడితో లైఫ్ చివరి దశకు చేరుకున్నట్లే. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. జీవితం అంటేనే సాహసం. అది కంఫర్ట్‌గా ఉండేకన్నా చాలెంజింగ్‌గా ఉంటేనే బాగుంటుంది. ► ఫైనల్లీ.. నటిగా ఇండస్ట్రీని చూశారు. ఇప్పుడు నిర్మాతగా చూస్తున్నారు. ఈ రెండింటిలో స్త్రీకి ఏది సేఫ్? ఏది సేఫ్ అని అడుగుతున్నారంటేనే స్త్రీకి ఎక్కడైనా కష్టాలు ఉన్నట్లే. ముఖ్యంగా మన సమాజంలో స్త్రీలకు ఏదో ఒక అసౌకర్య పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. నటన, నిర్మాణం అనేది పక్కన పెడదాం. ప్రతి ఫీల్డ్‌లోనూ స్త్రీలకు సవాళ్లు, కష్టాలు ఉంటాయి. వాటికి భయపడిపోకూడదు. ‘స్ట్రాంగ్‌గా ఉండండి. మీకు మీరే ప్రేరణ అవ్వండి’. -
వేసవిలో రొమాంటిక్
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. అనిల్ పాడూరి దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అనిల్ పాడూరి మాట్లాడుతూ– ‘‘ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. వేసవి సెలవుల్లో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లు మా సినిమాను చూడొచ్చు. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య -
‘ఐలవ్ ఇండియా.. రూపాయి ఖర్చు ఉండదు’
‘దేశాన్ని ప్రేమించటం వేరు.. ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐలవ్ ఇండియా.. రూపాయి ఖర్చు ఉండదు.. ఐ లవ్ యూ.. సరదా తీరిపోద్ది’ప్రస్తుతం ఈ లిరిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు డైలాగ్‌లు రాయడం వరకే పరిమితమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా మరో ముందడుగేసి ఓ పాట రాశాడు తన కొడుకు ఆకాశ్ కోసం. ఆకాశ్ పూరి హీరోగా ముంబై భామ కేతిక శర్మ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘రొమాంటిక్’ చిత్రంలోని ‘నువ్వు నేను ఈ క్షణం’ అనే ఫస్ట్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు పూరి స్వయంగా లిరిక్స్ అందించగా.. చిన్మయి శ్రీపాద ఆలపించారు. సునీల్ కశ్యప్ సంగీతమందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూరి రైటింగ్ స్కిల్స్‌కు నెటిన్లు ఫిదా అవుతున్నారు. పూరి దర్శకత్వంలో వచ్చిన మెహబూబా ఫలితం బెడిసి కొట్టడంతో ఎలాగైనా తన కొడుకుతో హిట్ కొట్టించాలనే కసితో ఉన్నాడు ఈ ఇస్మార్ట్ డైరెక్టర్. దీనిలో భాగంగా కొడుకు ఆకాష్ కోసం పక్కా లవ్ స్టోరీని ప్రిపేర్ చేశాడు. అయితే ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను అనిల్ పాదూరికి అప్పగించాడు. కాగా, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథే అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ‘నువ్వు నేను ఈ క్షణం’ వీడియో సాంగ్ #Romantic An intense love story 💖#NuvvuNenuEkshanam video song out now 👇🏻https://t.co/Hv3gXM2YJN Starring @actorakashpuri & #KetikaSharma Music #SunilKasyap Directed by @anilpaduri A @purijagan @Charmmeofficial Production@PuriConnects #PCfilm — PURIJAGAN (@purijagan) December 21, 2019 -
రొమాంటిక్‌కి గెస్ట్
రామ్ ఇప్పటివరకు అతిథి పాత్రల్లో కనిపించలేదు. వచ్చే ఏడాది ‘రొమాంటిక్’ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. పూరి జగన్నాథ్ అందించిన కథతో నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరి, చార్మి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేతికా శర్మ కథానాయిక. ఇందులో మందిరా బేడీ, దివ్య దర్షినీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ గెస్ట్‌గా నటించారనే వార్త బయటికొచ్చింది. సినిమాలో ఓ సర్ప్రైజ్గా రామ్ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారట రామ్. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. -
గోవాలో...
గోవా మంచి హాలిడే స్పాట్. అది మాత్రమే కాదు.. షూటింగ్స్‌కి కూడా మంచి స్పాట్. అందుకే ‘రొమాంటిక్’ టీమ్ గోవా వెళ్లింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లావణ్య సమర్పణలో రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తున్నారు. అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకుడు. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గోవాలో 30 రోజులపాటు జరగనుంది. ఈ లాంగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సీన్స్, సాంగ్స్ చిత్రీకరించనున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. -
అందమైన జంటల కోసం అందమైన ప్రాంతాలు!
ప్రేమలో పడితే ప్రపంచాన్నే మరచిపోతారు అంటారు. అది నిజమే అన్నట్టుగా ప్రేమించిన చాలా మంది జంటలు వారున్న ప్రదేశం నుండి తాము ప్రేమించిన వారితో కలసి కొత్త ప్రదేశాలకు వెళ్లాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే చిక్కంతా ఆ ప్రాంతాలు ఎక్కడున్నాయి. అక్కడ వారి అభిరుచికి తగ్గట్టుగా ఏం ఉంటాయో తెలుసుకోవడంలోనే వస్తుంది. సాధారణంగా ప్రేమించుకున్న వారు, కొత్తగా పెళ్లైన వారు ఆగ్రాలోని తాజ్‌మహల్, ఊటీ, కొడైకెనాల్, మున్నార్, కశ్మీర్, శ్రీనగర్, డార్జిలింగ్,నైనిటాల్,కులుమనాలీ లాంటి ప్రాంతాలను తమ హాలిడే స్పాట్స్‌గా ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఇవే కాకుండా భారతదేశంలో ప్రేమికులకు ఆహ్లాదం కలిగించే ప్రాంతాలు చాలా ఉన్నాయి.అయితే చాలా మంది ప్రేమికులు,భార్యభర్తలు ఇష్టపడే రోమాంటిక్ ప్రాంతాలు మన భారతదేశంలోనే చాలానే ఉన్నాయి. అండమాన్ దీవులు: ఈ ప్రాంతాన్ని ప్రేమికుల స్వర్గసీమ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండే దీవులు ఎంతో అందంగా, ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఇక్కడికి వెళ్లిన వారు కేవలం ప్రకృతి అందాలను చూడటంతో పాటు వాటర్ గేమ్స్, స్కూబాడ్రైవింగ్లాంటివి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. కన్యాకుమారి:తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రేమికులు వీక్షించడానికి చాలా అందమైన ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశపు దక్షిణ సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతంలో బంగాళఖాతం, అరేబియా సముద్రాలు కలుస్తాయి. సూర్యాస్తమయ సమయంలో బీచ్ ఒడ్డున మీరు ప్రేమించే వ్యక్తితో కూర్చొని ఆ దృశ్యాన్ని చూస్తే ఎప్పటికి ఒక మధురజ్ఞాపకంగా అది మీ జీవితంలో నిలిచిపోతుంది. కూర్గ్: కర్ణాటకలోని కూర్గ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే ఎతైనా జలపాతాలు వాటి చుట్టూ ఉండే కాఫీ తోటల నుండి వచ్చే సువాసనలు మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. వీటితో పాటు గంధపుచెట్ల అడవులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇలాంటి ప్రదేశానికి మీరు ప్రేమించిన వ్యక్తితో వెళితే కచ్ఛితంగా ఎంజాయ్ చేయవచ్చు. జైసల్మీర్: రాజస్తాన్‌లోని ఎడారి ప్రాంతమైన జైసల్మీర్ ప్రేమికులకు బెస్ట్ ప్లేస్ అనే చొప్పవచ్చు. రాత్రిపూట ప్రేమించిన వ్యక్తి ఒడిలో పడుకొని నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ కబురులు చెప్పుకునేందుకు వీలుగా ఇక్కడ టెంట్లను ఏర్పాటు చేస్తారు. ఇవే ఇక్కడి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ప్రశాంతంగా ఒకరి భావాలు ఒకరితో పంచుకోవడంతో పాటు అద్బుతమైన ఎన్నో ప్రాంతాలను చూడొచ్చు. గుల్మర్గ్: పెళ్లైన కొత్తజంట హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్లాలి అని వెతుకుతూ ఉంటే అలాంటి వారికి జమ్మూ కశ్మీర్‌లోని గుల్మర్గ్ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచుకొండల్లో ఆటలు ఆడుకుంటూ చుట్టూ ఉండే పచ్చని ప్రకృతిని చూస్తూ ప్రేమించిన వారితో గడిపే ఆ క్షణాలు కచ్చితంగా అద్బుతంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మరో అంశం తూలిఫ్ పూల తోటలు. వీటిని చూడగానే ప్రేమ జంటలు కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది అని సాంగ్ వేసుకోక మానరు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ రొమాంటిక్ ప్లేస్ లిస్ట్‌లోకి దీనిని కూడా చేర్చేయండి. రణతంబోర్: జంతు ప్రేమికులు ఎవరైనా జంటగా మారితే కచ్చితంగా వారు రాజస్తాన్‌లోని రణతంబోర్‌ను వారి హాలిడే స్పాట్లో చేర్చేయండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే అనేక పశుసంరక్షణ కేంద్రాలను, విభిన్న పక్షిజాతులను చిలుకగోరింకల్లాగా కలసి చూడొచ్చు. వాటితో పాటు జీప్ సఫారీ, ఏనుగు సవారీ వంటి వాటిని ఆశ్వాదించవచ్చు. చిరపుంజి: ఈ ప్రాంతంలో ఎప్పుడూ వర్షం కురుస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ప్రేమించే వారితో అక్కడికి వెళితే కచ్చితంగా చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే చెంతనవుంటే అనే పాట గుర్తురాక మానదు. ఎతైన జలపాతలు, పక్షుల కిలకిలరావాలను, పచ్చిక బయళ్లతో అందంగా ఉండే ప్రకృతిని చూసి పులకించిపోవచ్చు. శ్రీనగర్: మీ హనీమూన్‌కు శ్రీనగర్‌ను ఎంచుకుంటే మీరు ఊహించిన దాని కంటే ఆనందంగా గడుపుతారనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వుండే హౌస్బోట్లలో దాల్ సరస్సులో మీ భాగస్వామి చేయిపట్టుకుని అందాలను వీక్షిస్తుంటే మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే అనుభూతి కలుగుతుంది. అక్కడ ఉండే సరసులు, ఎతైన కొండలతో పాటు అక్కడ ఉండే విభిన్న సంస్కృతి కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. జోద్పూర్: రాజస్తాన్‌లోని జోద్పూర్ హానిమూన్ కపుల్స్‌కు ఒక చక్కటి పర్యాటకప్రాంతంగా చెప్పవచ్చు. రాత్రి పూట నగరాన్ని చూస్తే నీలిరంగు కాంతిలో వెలిగిపోతూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. దీంతో పాటు మెహర్‌ఘర్ కోట, అనేక ప్రాచీన కట్టడాలను చూడొచ్చు. తాము ప్రేమించే వారితో పాటు షాపింగ్ చేస్తూ మంచి మంచి గిఫ్ట్స్ కొనివ్వండానికి ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అనువణువున ఫ్రెంచ్ వారి సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీనిని లిటిల్పారిస్ పేరుతోపిలుస్తారు. ఇక్కడ ఎన్నో కోటలు, మంచి హోటల్స్ , రిసార్ట్స్‌ల్లో మీ పార్టనర్‌తో కలసి ఎంజాయ్ చెయ్యెచ్చు. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వీటిలో మీకు నచ్చిన హాలిడే స్పాట్‌ను ఎంచుకొని వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేయండి. -
హైదరాబాద్‌లోని 10 రొమాంటిక్ ప్రదేశాలు ఇవే!
హైదరాబాద్ : సెలవు రోజుల్లో తమ ప్రియమైన వారితో సరదాగా అలా బయట గడపాలనుకునే వారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా అప్పుడే ప్రేమలో పడ్డ జంట.. ఓ మంచి ప్రదేశంలో ఊసులాడుకోవాలని తహతహలాడుతుంటుంది. ఏదైనా ప్రత్యేక అకేషన్‌కు భాగస్వామిని ఓ మంచి ప్రదేశానికి తీసుకెళుదామకుంటారు. కానీ, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆగిపోతుంటారు. హైదరాబాద్ నగరంలో ప్రేమజంటలు విహరించటానికి అనువైన రొమాంటిక్ ప్రదేశాలకు కొదువలేదు. ఈ ప్రదేశాలు సరదాలనే కాదు అద్భుతమైన జ్ఞాపకాలను మీ ప్రేమకు తోడు చేస్తాయి. 1) వాటర్ ఫ్రంట్ హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్లలో ఇది ఒకటి. హుస్సెన్ సాగర్‌కు సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్ పర్యటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. చక్కటి భోజనంతో పాటు వినసొంపైన సంగీతం వింటూ సాగర్ అందాలను చూస్తూ ఆనందించవచ్చు. 2) నెక్లెస్ రోడ్ రాత్రి వేళ నెక్లెస్ రోడ్ అందాలు చూడటంలో మజానే వేరు. ఇక్కడి రోడ్డు ట్యాంక్‌బండ్ చుట్టూ నెక్లస్ ఆకారంలో ఒంపు తిరిగి ఉన్న కారణంగా ఈ ప్రదేశానికి నెక్లెస్ రోడ్ అని పేరు. ఇక్కడికి దగ్గరలో ఉన్న పురాతన రెస్టారెంట్లు, హోటళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 3) ట్యాంక్ బండ్ ప్రేమపక్షులు నిత్యం సేదతీరే ప్రదేశాలలో ట్యాంక్‌బండ్ ఒకటి. ట్యాంక్‌బండ్ అందచందాలు మనల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. సాయం సంధ్యలలో ట్యాంక్‌బండ్ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. సాగర్‌లో బోటింగ్ చేస్తూ నీటి మధ్యలో ఉన్న ఎత్తైన బుద్ధున్ని చూస్తూ సంతోషంగా గడపొచ్చు. 4) లుంబినీ పార్క్ ఈ లుంబినీ పార్క్ హుస్సేన్ సాగర్‌కు సమీపంలో ఉంది. ఇది సంతవ్సరం పొడవునా పర్యటకులతో రద్దీగా ఉంటుంది. లేజర్ షో, సంగీత ఫౌంటెన్లు ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆకర్షణ. 5) ఎన్టీఆర్ గార్డెన్ హుస్సేన్ సాగర్‌కు సమీపంలో ఉన్న మరో అద్భుతం అని చెప్పొచ్చు. 36 ఎకరాల్లో ఉన్న ఈ పార్కు నగరం మధ్యలో బిర్లామందిర్, నెక్లస్ రోడ్డులకు దగ్గరగా ఉంది. ఇక్కడ ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు మ్యూజియం ఓ ప్రత్యేక ఆకర్షణ. 6) గోల్కొండ ఫోర్ట్ వందల ఏళ్లనాటి ఈ కట్టడం పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి. దేశం నలువైపుల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యటకులు దీన్ని చూడటానికి వస్తుంటారు. చెదిరినప్పటికి కోట అందాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. 7) దుర్గం చెరువు ప్రకృతిలో గడపాలనుకునే జంటలకు ఇదో చక్కటి ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అందాలు మనల్ని ఆకట్టుకుంటాయని చెప్పటంలో అతిశయోక్తిలేదు. ప్రశాంతమైన వాతావరణంలో బోటింగ్ చేస్తూ గడపొచ్చు. లేదా, కొండలు, గుట్టలు మధ్య ఉన్న చెరువును చూస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి వాటికి అవకాశం ఉంది. 8) లియోనియా రిసార్ట్ ఇది శామీర్ పేటలో ఉన్న ఓ ప్రముఖ రిసార్ట్. ప్రియమైన వారితో వీకెండ్‌ను ఎంజాయ్ చేయటానికి అనువైన ప్రదేశం. సకల హంగులతో కూడిన హోటళ్ల సముదాయాలు దీని ప్రత్యేకత. మెడి స్పా, సినిమా థియోటర్లు, లైవ్ ఫర్ఫార్మ్మెన్స్, సర్ఫింగ్ రిడ్జ్, వాటర్ పార్క్ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. 9) అనంతగిరి హిల్స్ హైదరబాద్‌లో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఇది ఒకటి. పచ్చదనం పరుచుకున్న ప్రదేశాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. 3763 ఎకరాల విస్తిర్ణంలో ఉన్న కొండలు, పచ్చని చెట్లు మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తాయి. మూసీ నది జన్మస్థానమైన అనంతగిరి కొండలు సినిమ షూటింగులకు ప్రసిద్ధి. 10) రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫిల్మ్ సిటీగా పేరుగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ మీ జంటకు ఓ కొత్త అనుభవాన్ని, అనుభూతిని ఇస్తుంది. ఓ అధ్బుత లోకంలోకి అడుగుపెట్టినట్లుగా భ్రాంతి కలిగిస్తుంది. సరదాగా గడపాలనుకునే ప్రేమ జంటలకు ఇది అనువైన ప్రదేశం. -
రొమాంటిక్‌లో గెస్ట్
దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి తన కొత్త సినిమా కోసం రొమాంటిక్‌గా మారిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. కేతికా శర్మ హీరోయిన్. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఆల్రెడీ బాలీవుడ్ భామ మందిరా బేడీ కీలక పాత్ర చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత... క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తదుపరి సినిమా ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ బాగా ఉంది. ఆయన నెక్ట్స్ సినిమాను బుధవారం అధికారికంగా ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు కృష్ణవంశీ. అభిషేక్ జాకర్, మధు కలిపు నిర్మించనున్నారు. ఈ సినిమా ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకు రీమేక్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 2004లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. అంటే.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ యాక్ట్ చేయబోతున్నారు. అయితే అప్పుడు గెస్ట్ రోల్. ఇప్పుడు కథానాయిక. -
‘రొమాంటిక్’లో రమ్యకృష్ణ
ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాపై అభిమానులు ముఖ్యంగా యువత ఎంతగానే ఆసక్తి కనబరుస్తుండటంతో ‘రొమాంటిక్’.పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బటయటకువచ్చింది. `బాహుబలి` చిత్రంలో రాజమాత శివగామి నటించి సినీ ప్రేక్షకులను మెప్పించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్లో కనపడనుందని తెలుస్తోంది. మంగళవారం నుంచి జరుగుతున్న షెడ్యూల్లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ పవర్ఫుల్ పాత్ర పోషిస్తుందని సమాచారం. ఇక ఇన్టెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. నరేశ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునైన తదితరులు ఈ చ్రితంలో నటిస్తున్నారు. -
వారెవ్వా క్రేజీ కేతికా.. అదరగొట్టిన ఫస్ట్‌లుక్
టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ మూవీ ఫస్ట్‌లుక్ విడుదలైయింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తున్న తొలిచిత్రంలోనే ఫస్ట్‌లుక్‌లో అందాల ఆరబోతతో ఆదరగొట్టింది. స్టన్నింగ్ ఫోటోతో కుర్రకారుల మతిపోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్‌లుక్ విడుదలైన కొద్ది సమయంలో సోషల్ మీడియాలో ఈ ఫోటో చెక్కర్లుకొడుతోంది. చాలామంది నెటిజన్లు, చిత్ర ప్రముఖులు ఈ ఫోటోపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఈమెకు 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందాలను తెగ ఆరబోస్తూ ఫొటోషూట్లు చేస్తూ ఉంటుంది. ఇంత హాట్ బ్యూటీని వెతికిపట్టుకుని తన కొడుకు పక్కన హీరోయిన్ను చేసేశారు పూరి. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. -
మా సెట్లో ఆడా మగా తేడా లేదు
‘నీ తోడు కావాలి’ అంటూ ఏ తోడూ లేకుండా హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. ఎవరి అండా లేకుండానే సక్సెస్ అయ్యారు. చార్మింగ్ బ్యూటీనే కాదు.. చాలా మంచి ఆర్టిస్ట్ అని కూడా అనిపించుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా పలు భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన చార్మి ఇప్పుడు తనలోని నటిని సెకండ్ సీట్లో కూర్చోబెట్టారు. నిర్మాతను ఫ్రంట్ సీట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రొమాంటిక్’ చిత్రాల నిర్మాణంతో బిజీగా ఉన్నారు. నేడు చార్మి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ► బర్త్‌డేకు స్పెషల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లాన్స్ ఏం లేవు. గోవాలో ‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్ షూట్ జరుగుతోంది. మొన్న రామ్ బర్త్‌డేకు రిలీజ్ చేసిన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే బర్త్‌డే సెలబ్రేషన్స్ అన్నట్టు. ► బర్త్‌డేకు కొత్త నిర్ణయాలేమైనా తీసుకుంటారా? అలాంటివి ఎప్పుడూ పెట్టుకోను. ప్రస్తుతం ఫోకస్ అంతా ‘ఇస్మార్ట్ శంకర్’ మీదే ఉంది. బోలెడు పనులున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి, బిజినెస్ చూసుకోవాలి. మైండ్ మొత్తం సినిమా చుట్టూనే తిరుగుతోంది. ► ప్రొడ్యూసర్‌గా ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు. ఫీమేల్ ప్రొడ్యూసర్స్‌కు షూటింగ్ స్పాట్లో ఉండే చాలెంజెస్ ఏంటి? మా సెట్లో స్త్రీలు, పురుషులు అనే తేడాని ఎప్పుడూ ఫీల్ అవలేదు. మా పీసీ (పూరీ కన్సెక్ట్స్) ఆఫీస్‌లో కూడా ఆ వ్యత్యాసాలేమీ ఉండవు. నేను మ్యాన్‌లా ఆలోచిస్తానని, మ్యాన్‌లా ఉంటానని అలానే వర్క్ చేస్తానని పూరీగారు చెబుతుంటారు– ఇక్కడ మొత్తం ఫ్రెండ్లీ వాతావరణమే ఉంటుంది. నేను బాస్, నువ్వు ఎంప్లాయ్.. అలా ఉండదు. ఇక్కడ అందరూ పనికోసమే వస్తారు, పని మాత్రమే చేస్తారు. ఫోకస్ పనిమీద మాత్రమే ఉన్నప్పుడు ఎక్కువ తక్కువలు ఉండవు. ► హీరోయిన్గా ఉన్నప్పుడు మీకు అన్నీ టైమ్‌కు ఏర్పాటు చేస్తుంటారు. మీరు ప్రొడ్యూసర్ అయిన తర్వాత మీ హీరోహీరోయిన్లను ఎలా చూసుకుంటున్నారు? నేను మా హీరోహీరోయిన్లను చాలా గారం చేస్తుంటాను. నాకు గారం చేయడం అంటే భలే ఇష్టం. హీరోగారు వస్తున్నారు.. అంతా రెడీ పెట్టండి. హీరోయిన్‌కి వ్యాన్ రెడీ ఉందా? ఇలా అన్నీ చూసుకుంటాను. యూనిట్ వాళ్లకు ఫుడ్ సెర్వ్ చేస్తుంటాను. అందరూ సరదాగా రావాలి, కలసి నవ్వుకుంటూ పని చేయాలి. ఇదే మా పాలసీ. ► గారం చేస్తే షూటింగ్ లేట్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది కదా? అస్సలు ఉండదు. వాళ్లు మార్నింగ్ నిద్ర లేవగానే వర్క్‌కి రావాలంటే ఒక ఉత్సాహంతో ఉండాలి. మనం ఇక్కడ బాగా చూసుకుంటే వాళ్లూ అలానే పని చేస్తారు. అబ్బా.. ఇవాళ షూటింగ్‌కి రావాలా? అని బాధపడుకుంటూ రారు. ఆ ఎనర్జీతో వస్తే చాలు.. జరగాల్సిన పనులు టైమ్‌కు జరిగిపోతుంటాయి. మేం డిఫరెంట్ కండీషన్స్‌లో షూట్ చేయాల్సి ఉంటుంది. వారణాసిలో షూట్ చేసినప్పుడు 47 డిగ్రీల ఎండ. డైరెక్ట్ సన్‌లైట్ కింద పనిచేశాం. అందరికీ సన్ ఎలర్జీతో బ్లాక్ ప్యాచ్‌లు వచ్చేశాయి. కానీ ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. ఇదో చాలెంజ్ అన్నట్లు తీసుకొని పని చేశాం. ► హీరోయిన్గా ఉన్నప్పుడు సెట్లో ఏదైనా మార్పు వస్తే బావుండు అనుకున్నది నిర్మాతగా మారిన తర్వాత తీసుకొచ్చింది ఏదైనా ఉందా? ఏదో మార్పు తీసుకు రావడానికో, మార్చడానికో మనం ఇక్కడం లేం. మా లక్ష్యం సినిమాలు చేయడమే. మంచి సినిమాలు చేయాలి, హిట్స్ కొట్టాలి. ఈ జర్నీ జరిగేటప్పుడు అందరూ హ్యాపీగా, ఇబ్బంది లేకుండా ఉండాలి. అంతే. ► నిర్మాతగా మారిన తర్వాత ఎలా ఉంది? అమ్మలా మారినట్టు ఉంది. సినిమా చేయడం బేబీ క్యారీ చేయడంలానే. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటినుంచి డెలివరీ వరకూ జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్మాత అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం అందులో భాగం అయ్యుంటాం. హీరోయిన్గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ మొత్తం సెట్ అయిన తర్వాత మధ్యలో ఎంటర్ అవుతాం. అప్పటికే టీమ్ అంతా ఫిక్స్ అయ్యుంటుంది. అలాగే రేపు రిలీజ్ ఉందంటే ఇవాళో నాలుగు, రేపో నాలుగు ఇంటర్వ్యూలు ఇస్తే చాలు. సినిమా ప్రమోషన్‌కు వారం రోజులు కేటాయిస్తే చాలు అని ఉంటుంది. హీరోయిన్గా ఉన్నప్పుడు 6–7 రిలీజ్లు ఉండేవి. ప్రతి సినిమా హిట్ అవ్వాలనుకుంటాం. ప్రతీ ప్రాజెక్ట్ మీద ప్రేమ ఉన్నా అది ఒక్కోదానికి షేర్ అవుతుంది. నిర్మాతగా ఉన్నప్పుడు మన ఎనర్జీ, రక్తం, చెమట అన్నీ ఇందులోనే పెడతాం. కొన్నిసార్లు టెన్షన్‌తో నిద్ర పట్టదు. రేపు ఏం చేయాలి? అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతాయా? వంటి ఆలోచనలతో సతమతమవుతుంటాం. టెన్షన్ అయితే కచ్చితంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఉంటుంది. దానికి తోడు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మీద అయితే చాలా నమ్మకంగా ఉన్నాం. ► పూరీగారు ఓ సాలిడ్ హిట్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ అంతా చూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఎలా ఉండబోతోంది? 100 పర్సంట్... రాసిపెట్టుకోండి. పూరీగారి దగ్గర నుంచి ఇన్నాళ్లూ ఏదైతే మిస్ అయ్యారో, ఏదైతే కోరుకుంటున్నారో ‘ఇస్మార్ట్ శంకర్’ దానికి మించి ఉండబోతోంది. కావాలంటే రాసిస్తాను. ► మళ్లీ మిమ్మల్ని స్క్రీన్ మీద ఎప్పుడు చూడొచ్చు? నెవ్వర్ సే నెవర్ అంటారు. నటిగా మళ్లీ స్క్రీన్ మీద కనిపించడానికి చాలా టైమ్ ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలు మొత్తం పూరీ కనెక్ట్స్లోఎలాంటి సినిమాలు చేయాలి? అనే దానిమీదే దృష్టంతా. కొత్త కొత్త స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. అందుకే యాక్టింగ్ కొన్ని రోజులు సెకండ్ సీట్లోనే ఉండబోతోంది. ► హీరోయిన్గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారా? నిర్మాతగా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? నిర్మాతగా ఉండటం చాలా స్ట్రెస్ఫుల్. చాలా టఫ్. ఇందాక అన్నట్టు టెన్షన్, నిద్రలేని రాత్రులు. కానీ నిర్మాతగా ఉండటాన్నే ఎంజాయ్ చేస్తున్నాను. మనం ఏం చేసినా జీవితంలో సమస్యలు కామన్. వాటి పరిష్కారం మన చేతుల్లో ఉండటం కామన్. సమస్యలను ఎవరైనా పరిష్కరించుకోవాల్సిందే కదా. నేను అది బాగా చేసుకోగలను. -
యాప్స్....యాప్సోయ్!
మీరు యాప్స్ ప్రియులా? అయితే ఇది చదవాల్సిందే!కాలంతో పాటు సరికొత్త యాప్స్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. వీటి గురించి తెలుసుకుందామా మరి...మ్యాడ్ మూడ్:అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు సుబ్బారావు. మామూలుగానైతే వాళ్లావిడ ద్వారం దగ్గర నిల్చొని చిరునవ్వుతో స్వాగతం పలుకుతుంది.ఈరోజు మాత్రం అలాంటి సీన్ కనిపించలేదు.‘‘శైలూ...’’ అని ఇంట్లోకి వస్తూ ప్రేమపూర్వకంగా అరిచాడు సుబ్బారావు.‘‘ఎందుకలా చెవి కోసిన మేకలా అరుస్తావు. ఏమైంది?’’ అని గద్దించింది శ్రీమతి శైలజ.గతుక్కుమన్నాడు సుబ్బారావు. అయినా ఆ గతుక్కును బయటపడనివ్వకుండా కూల్‌గా... ‘‘ఏం లేదు శైలూ... బయట వాతావరణం కూల్‌గా ఉంది. సన్నగా వర్షం. రొమాంటిక్‌గా ఉంది. ఇప్పుడు నువ్వు పకోడీ చేసి పెడితే తినాలని ఉంది డియర్. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా పకోడీలు తింటే...నా సామిరంగా...’’ అని లొట్టలు వేశాడు సుబ్బారావు.‘‘ఎప్పుడూ తిండి గోలే. ఏం మనిషో ఏందో’’ గట్టిగా విసుక్కుంది శ్రీమతి శైలజ.మళ్లీ గతుక్కుమన్నాడు సుబ్బారావు. అప్పుడు అతనికి వారం క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. సేమ్ టు సేమ్. ఈరోజులాగే ఉంది వాతావరణం. సుబ్బారావు ఇంటికి రాగానే...‘‘యావండీ....బయట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వేడి వేడి పకోడీలు చేసి పెడతాను తింటారా?’’ అని గోముగా అడిగింది. ‘‘అంతకంటే భాగ్యం ఏముంది డియర్. పూర్వజన్మ సుకృతం ఉంటేగాని నీలాంటి భార్య దొరకదు’’ అంటూ మేఘాల్లో తేలిపోయాడు సుబ్బారావు.మరి అలాంటి శైలూకు ఈరోజు ఏం అయింది?ఎందుకిలా బిహేవ్ చేసింది?వాళ్ల అమ్మ ఏమైనా నూరిపోస్తో్తందా? వాళ్ల అక్క ఏమైనా తప్పుదోవ పట్టిస్తోందా... ఇలా పరి పరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు సుబ్బారావు.నిజానికి అతడి అనుమానాల్లో ఏ ఒక్కటీ నిజం కాదు.ఆమె మూడ్ బాగోలేదు...అన్నది మాత్రమే నిజం.ఆమె మూడ్ బాగోలేకపోవడానికి....తలనొప్పి మాత్రమే కారణమన్నది నిజం!భార్య మాత్రమే కాదు భర్త కూడా అప్పుడప్పుడూ అదుపు తప్పిన లారీలా ప్రవర్తించవచ్చు. అకారణంగా అరవవచ్చు. అంతమాత్రాన....అతడికి భార్య మీద ప్రేమ లేదని కాదు....మూడ్ బాగోలేదని!భార్యాభర్తల మధ్య లేనిపోని తగాదాలు రావడానికి సైద్ధాంతిక కారణాలు, వ్యూహాత్మక కారణాలు ఏవీ ఉండవని ‘లకోట బకోట’ స్టడీ సర్కిల్ సర్వే క్లియర్‌గా చెప్పింది.‘ఇప్పుడు నా భార్య మూడ్ ఎలా ఉంది?’ అని భర్త–‘ఇప్పుడు నా భర్త మూడ్ ఎలా ఉంది?’ అని భార్య....సమయానుకూలంగా వ్యవహరిస్తే దంపతుల మధ్య అసలు సమస్యలే ఉండవు అంటుంది ‘లోకోట బకోట’ స్టడీ.‘‘చాల్లేవయ్యా చెప్పొచ్చావు! వాళ్ల మూడ్ ఎలా ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది?’’ అని మీకు డౌటు రావచ్చు!...ఇలాంటి సమయంలోనే మీకు కావాలి సరికొత్త యాప్: మ్యాడ్ మూడ్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మన పార్ట్నర్ మూడ్ ఎలా ఉందనేది మూడు గంటల ముందే తెలుస్తుంది.ఉదా: మీ ఆవిడకు తలనొప్పిగా ఉంది...బీ కేర్ ఫుల్! మీ ఆయన ఆఫీసులో గొడవ పడి ఇంటికి వస్తున్నాడు...బీ కేర్ ఫుల్!డౌన్లోడ్ లింక్: https//mad-mood.app//జంప్ జిలానీ:అప్పు చేయని వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారో చెప్పండి! అప్పు చేయడం తప్పు కాదు. అప్పు ఇచ్చిన వారి నుంచి తప్పించుకోలేకపోవడమే అసలు తప్పు. అదేంటోగానీ ఊళ్లో ఎటు వెళ్లినా అకారణంగా అప్పు ఇచ్చిన వాడే ఎదురుపడుతుంటాడు. దీంతో ఇల్లు దాటి బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. అలాగని అస్తమానం ఇంట్లో కూర్చోలేం కదా. ఇలాంటి కష్టాలు తీర్చడానికి వచ్చిన సరికొత్త యాప్ ‘జంప్ జిలానీ’ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అప్పు ఇచ్చిన వ్యక్తి ఊళ్లోనే ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? మనకు ఎంత దూరంలో ఉన్నాడు....మొదలైన వివరాలు క్షణాల్లో తెలుస్తాయి.డౌన్లోడ్ లింక్:htgt//pdm.app.kd/పెదవి దాటని మాటొకటుందీ:కొందరు ఉంటారు. మాటలొకటి చెబుతాయి. కళ్లు ఒకటి చెబుతాయి.ఉదా:‘‘ ప్రపంచంలో నిన్ను తప్ప ఎవరినీ నమ్మను’’ అంటాడు ఒకడు.కళ్లు మాత్రం...‘‘నిన్ను తప్ప అందరినీ నమ్ముతాను’’ అంటాయి.‘‘చక్కనయ్య చిక్కినా అందమే...మీరు బరువు తగ్గి స్లిమ్ కావడం బాగుంది’’ అంటాడు ఇంకొకడు. కళ్లు మాత్రం...‘‘అస్థిపంజరానికి సూటూ బూటూ వేసినట్లున్నావ్. ఏడ్చినట్లున్నావ్’’ అంటాయి. ఎదుటి వ్యక్తి మనసులో మాటను కనిపెట్టడానికి మనమేమీ దేవుళ్లం కాదు కదా! అలా అని మీరేమీ దేవుళ్లు కానక్కర్లేదు...‘పెదవి దాటని మాటొకటుందీ’ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు... ఎదుటి వ్యక్తి నిజం మాట్లాడుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా? అసలు అతడి మనసులో మాటఏమిటి....మొదలైనవిషయాలు క్షణాల్లో తెలిసిపోతాయి.డౌన్లోడ్ లింక్: htkts//jump gilani.app//సహజంగానే మనం భోజన ప్రియులం. మంచి ఫుడ్ దొరికితే లా....గిం...చేస్తూనే ఉంటాం. మన మీద ప్రేమ వల్లో, మొహమాటం వల్లో ‘తిన్నది చాలు. ఇక ఆపండి’ అని ఎవరు చెప్తారు. ఇలాంటి సమయంలోనే మీకు కావాలి ‘ఛస్తావురోయ్’ యాప్. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే ఎంత తినాలో కాదు...ఎంత తినకూడదో తెలిసిపోతుంది. – యాకుబ్ పాషా -
మైమరపించిన ‘మాంటో’
-
మరి గదిలోకి ఎలా వెళ్లను?
ఇంటికంటే సేఫ్‌ప్లేస్ ఉంటుందా?అమ్మాయికి వీధిలో భద్రత లేదు.స్కూల్లో లేదు. ఆటస్థలంలో లేదు.మరి ఇల్లయినా సేఫ్‌ప్లేస్ అవుతుందా?తల్లిదండ్రులకు చెప్పకపోతే ఇల్లు అన్‌సేఫ్ ప్లేస్‌గానే ఉండిపోతుంది. అమ్మాయిలు చెప్పుకోరు. చెప్పాలనుకున్నా అంత నీచమైంది ఎలా చెప్పాలి?అందుకే తల్లిదండ్రులే ఇంట్లో అమ్మాయితో అన్ని విషయాలు మాట్లాడాలి.. కనుక్కోవాలి. తెలియజేయాలి!! మా మామయ్యలతో తప్ప పరాయి మగవాళ్లతో మాట్లాడలేదు. ఆ టైమ్‌లోనే ఈ సంబంధం వచ్చింది. అమ్మతో చెప్పి ఏడ్చాను పెళ్లి వద్దు నాకు భయం అని. పెళ్లయితే అన్నీ సర్దుకుంటాయి ఏం కాదు అని నచ్చచెప్పింది అమ్మ. ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఎందుకేడుస్తున్నావ్.. అంటూ అమ్మ దగ్గరకుతీసుకుంది. కలొచ్చి.. భయపడి ఉంటది అని నానమ్మ. అలాగే వెక్కుతూ అమ్మను అతుక్కుపోయాను. దూరం నుంచి తాతయ్య.. గుడ్లురుముతూ! ఇప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. పెళ్లయి మూడేళ్లయింది. ఆయనకు మంచి ఉద్యోగం. హైదరాబాద్ సంబంధం కుదిరితే ఎప్పుడంటే అప్పుడు అమ్మను చూసుకోడానికి ఉంటుంది అని ఆశపడ్డాను. దేవుడు నా కోరిక విన్నాడో ఏమో హైదరాబాద్‌నే అత్తిల్లు చేశాడు. మామూలుగా అయితే అలాంటి అత్తగారు.. భర్త.. ఆ ఇల్లు దొరికినందుకు హ్యాపీగా ఉండాలి. కాని నాకు భయం. నా జీవితం నరకం. నా వైవాహిక జీవితం అంటే నరకం. ఆ గది పెళ్లయ్యాక ఏ ఆడపిల్ల అయినా భర్త గదిలోకి వెళ్లాలి. కాని నాకు నా హజ్బెండ్ దగ్గరకు వెళ్లాలంటే భయం. కొత్తలో బెరుకు అనుకొని సర్దుకుపోయాడు. తర్వాత సెక్సువల్ యాక్ట్ పట్ల నాలెడ్జ్ లేదనుకుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. రొమాంటిక్ వీడియోలు చూపించేవాడు. అయినా నాలో మార్పు లేదు. పెళ్లికి ముందు లవ్ ఎఫైర్ ఉందేమోనని అనుమానపడ్డం మొదలుపెట్టాడు. నా ఫ్రెండ్స్‌ని, బంధువులనూ అడిగాడు. నా ఫేస్బుక్, జీ మెయిల్, ఫోన్ అన్నీ చెక్ చేశాడు. ఎఫైర్ ఆనవాలేమీ దొరకలేదు. ఇక నాకు నా మామగారిని చూస్తే వణుకు వచ్చేది. నా చిన్నప్పుడు నేను చూసిన మా తాతగారిలాగే కనపడేవాడు. దాంతో మా మామగారితో సరిగ్గా మాట్లాడేదాన్ని కాను. అసలు ఆయన ఉన్న పరిసరాల్లోకి వెళ్లేదాన్నే కాను. గదిలో తలుపేసుకుని ఉండిపోయేదాన్ని ఎన్ని గంటలైనా. దాంతో మా అత్తగారు వాళ్లు నాకు పొగరని, పెద్దవాళ్లంటే గౌరవం లేదనే అభిప్రాయానికి వచ్చారు. నా ప్రవర్తన అర్థం కాక మరోవైపు దాంపత్య జీవితం లేక నన్ను నా భర్త తన్నాడు. మళ్లీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆవిడ ఏవేవో ప్రశ్నలు అడిగారు. చివరకు నాకు ఫ్రిజిడిటీ ఉందని తేల్చారు ఆవిడ. ఇలా ఎందుకు జరిగింది? మాది జాయింట్ ఫ్యామిలీ. నాకు ఇద్దరు పెద్దనాన్నలు.. ఇద్దరు బాబాయ్‌లు... ఇద్దరు అత్తలు.... పెద్ద ఇల్లు. అప్పుడు నాకు తొమ్మిదేళ్లుంటాయేమో.. ఫోర్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్. ఇంకో పన్నెండు రోజుల్లో చిన్నత్త పెళ్లి. ఆ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఓ మధ్యాహ్నం పూట.. మా వంటిల్లు నానుకుని పెద్ద వసారా ఉంటుంది. అందరూ అక్కడే ఉన్నారు. నేను హాల్లో పడుకున్నా. బాగా నిద్దరలో ఉన్నా. నా మీద బరువుగా ఏదో ఉండటం.. శ్వాస ఆడనట్టు కావడంతో గాబరాపడి లేచాను. నన్నంతా ఆక్రమించుకొని మా తాతయ్య. అక్షరాలా మా నాన్న నాన్న. నేను కళ్లు తెరవగానే తన చేత్తో నా కళ్లు, నోరు మూసి తన నడుముతో నా నడుమును అదమసాగాడు. అరిచే ప్రయత్నం చేసి.. ఆయన చేతిని కొరికి.. రక్కితే అప్పుడు లేచాడు. నేను ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఎందుకేడుస్తున్నావ్.. అంటూ అమ్మ దగ్గరకు తీసుకుంది. కలొచ్చి.. భయపడి ఉంటది అని నానమ్మ. అలాగే వెక్కుతూ అమ్మను అతుక్కుపోయాను. దూరం నుంచి తాతయ్య.. గుడ్లురుముతూ! భయం... భయం... భయమంటే ఏంటో తెలిసింది ఆ రోజు నుంచి. ఒంటరిగా ఉండడమంటే చచ్చేంత వణుకొచ్చేది. నాకు తెలియకుండానే ఇంట్లో తాతయ్య నన్ను చేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆడుకుంటుంటే వచ్చి వెనక నుంచి పట్టుకునేవాడు. ఆ పట్టుకోవడం ప్రేమతో.. పెద్దవాళ్లకు పిల్లల పట్ల ఉండే వాత్సల్యంలా ఉండేది కాదు. నాకు ఇబ్బందిగా.. అసహ్యంగా.. చిరాగ్గా అనిపించేది. ఎప్పుడు నా ఛాతీ మీద.. వెనక హిప్స్ మీద చేతులు వేయడానికి ప్రయత్నించేవాడు. అందరూ ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన ఇంకో రకంగా ఉండేది. ఎప్పటికప్పుడు అమ్మకు చెప్పాలనిపించేది. కానీ తాతయ్య అంటే అందరికీ భయమే. అమ్మ, నాన్నకైతే మరీ భయం. నాన్నకు ప్రైవేట్ జాబ్. శాలరీ తక్కువగా ఉండేది. అందుకే అన్నీ సర్దుకోవాలని నాన్న అమ్మతో చెప్తూ ఉండేవాడు. బహుశా నేను నోర్మూసుకొని భరించడానికీ అదే కారణమేమో. పెద్దమనిషి అయ్యాక.. నైన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడు పెద్దమనిషయ్యా. భోగి రోజు రాత్రి పదకొండు గంటలకు వాకిట్లో ముగ్గులేస్తున్నాం. వంటింటి గూట్లో ఉన్న నీలం రంగు తెమ్మని అత్త పురమాయిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లా. రంగు తీసుకొని అదే పరుగుతో వస్తుంటే తాతయ్య నా చెస్ట్ మీద చేయి వేసి ప్రెస్ చేస్తూ ఆపాడు. గట్టిగా అరిచా. తాతయ్యను తోసేస్తే కిందపడ్డాడు. అందరూ పరిగెత్తుకొచ్చారు. తాతయ్య నడుముకి బాగానే దెబ్బ తగిలింది. హాస్పిటలైజ్డ్ అయ్యాడు. తెల్లవారి ఇంట్లో అంతా కలిసి నాకు క్లాస్ తీసుకున్నారు. అప్పుడు ధైర్యంగా చెప్పా. చిన్నప్పటి నుంచి ఆ ముసలాడి వల్ల నేను పడ్డ బాధను. అనుభవించిన భయాన్ని. అమ్మను పట్టుకొని ఏడ్చేశా. ఎవరూ నమ్మలేదు.. అమ్మా, నాన్న తప్ప. నాన్న తాతయ్యను చంపేస్తానని ఆవేశపడ్డాడు. పెద్దనాన్నలు నాన్నను తిట్టారు. నన్ను అసహ్యంగా ఈసడించుకున్నారు. ‘‘అది మదంతో ఉంది. దానికి పెళ్లి చేసేయ్. ఈడొచ్చే దాక కూడా ఆగేట్టు లేదు. ఎవడినైనా ఎత్తుకొని పోతది’’ అని అత్త నన్ను తిట్టింది. భరించలేని అమ్మ అత్తను చెంప పగలగొట్టింది. మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశారు. నాన్న వెళ్లిపోయాడు.. మామయ్య వాళ్ల హెల్ప్‌తో ఇంకో ఇల్లు చూసుకొని మా ఫ్యామిలీ విడిగా ఉంది. వన్ ఇయర్ అయ్యేసరికి నాన్న మళ్లీ మా నానమ్మ వాళ్ల దగ్గరకు వెళ్లిపోయాడు. తాతయ్య, పెద్ద నాన్నలు ఏవో చెప్పి నాన్నను మార్చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్న మా వంక చూడలేదు. అమ్మమ్మ వాళ్ల హెల్ప్‌తోనే చదువుకున్నా. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు చాలా మంది అబ్బాయిలు వెంటపడ్డారు. నేను ఎవరి వంకా చూసేదాన్ని కాను. ఈవెన్ మేల్ లెక్చరర్స్ అంటే కూడా భయమేసేది. మా మామయ్యలతో తప్ప పరాయి మగవాళ్లతో మాట్లాడలేదు. ఆ టైమ్‌లోనే ఈ సంబంధం వచ్చింది. అమ్మతో చెప్పి ఏడ్చాను పెళ్లి వద్దు నాకు భయం అని. పెళ్లయితే అన్నీ సర్దుకుంటాయి ఏం కాదు అని నచ్చచెప్పింది అమ్మ. కానీ సర్దుకోలేదు. సరికదా.. భయం ఎక్కువైంది. ఆయన దగ్గరికొచ్చే ప్రయత్నం చేస్తే ముసలాడి బిహేవియర్ గుర్తుకొచ్చి ఫిట్స్ వచ్చినట్టు అయిపోయేది. డాక్టర్ నాకు ఫ్రిజిడిటీ అని తేల్చాక నా హజ్బెండ్ మా అమ్మకు కాల్ చేశాడు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్లిపోండని. అప్పుడైనా ఆయనకు జరిగింది చెప్పేయాలనిపించింది. కాని చెప్పలేకపోయా. ఇప్పుడు సైకియాట్రి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ‘‘ఇంకో త్రీ మంత్స్ చూస్తాను. హెల్దీగా వస్తే ఓకే. లేదంటే.. ప్లీజ్ లీవ్మీ. డైవోర్స్ తీసుకుందాం’’ అన్నాడు. ఆ మాటకే నాకేం బాధనిపించలేదు కాని అమ్మే చాలా బాధపడుతోంది. నాకు ఈ పెళ్లి రొమాన్స్ ఏమీ వద్దు. హాయిగా ఉద్యోగం చేసుకొని అమ్మతో ప్రశాంతంగా బతకాలనుంది. అమ్మలేకపోతే ఉండలేను. నా వల్ల కాదు’’ అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూనే ఉంది చాలాసేపటి దాకా. ఎవరు ఓదార్చాలి? ఆ భయం ఎలా పోగొట్టాలి? కనేదాన్నే కాను.. మా ఇంట్లోనే నా తండ్రి లాంటి వాడే నా బిడ్డను అలా చూస్తాడని ముందే తెలిసుంటే అసలు ఆడపిల్లను కనేదాన్నే కాను. కడుపులోనే చంపేసేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ అమ్మాయి తల్లి. – శరాది -
రొమాంటిక్‌గా ఉంటుందనీ...
ఈమధ్యకాలంలో తెలుగులో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సినిమాలోని సన్నివేశాలివి. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా సినిమా చూద్దామని థియేటర్‌కి వచ్చింది. టికెట్స్ దొరకలేదు. ఆ అబ్బాయిదీ అదే పరిస్థితి. కానీ బ్లాక్‌లో రెండు టికెట్లు ఉన్నాయి. రెండూ కలిపి కొంటే తక్కువకే వస్తాయి. ఆ అబ్బాయి, వెళ్లిపోతున్న ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్లి, ‘‘హలో!’’ అని పలకరించాడు. ‘‘నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు!’’ అంది ఆ అమ్మాయి, అబ్బాయి వైపు చూడకుండా. ‘‘నాకూ గర్ల్‌ఫ్రెండ్ ఉందీ!’’ అన్నాడు. ‘‘పేరూ?’’ అనడిగింది. ‘‘ఎన్.వెంకటేశ్వరరావు..’’ ‘‘చీ..’’ అని చిన్నగా నవ్వింది. ‘‘వందకే ఆ రెండు టికెట్లూ తీసుకుందామా? యాభై రూపాయలిస్తాను..’’ \ ‘‘ప్రాబ్లమ్ అది కాదు. సినిమా మొత్తం పక్కపక్కనే!’’ చెప్తూ, చెప్పలేక నవ్వింది. ఆలోచిస్తున్నట్లు నిలబడిపోయాడు. కాసేపటికి ఒప్పుకుంది. ‘‘డబ్బులక్కర్లేదు కానీ.. ఇంటర్వెల్లో నాక్కూడా పాప్‌కార్న్ అండ్ కోక్’’ ఆ అబ్బాయితో మాట్లాడుతూనే పర్స్‌లోంచి డబ్బులు తీసి, బ్లాక్‌లో టికెట్స్ తీసుకుంది. థ్యాంక్స్ అన్నట్టు చూశాడు. మూడు గంటలు గడిచాయి. హాల్లోనుంచి బయటకొచ్చారు. ‘‘సో మీరుండేదీ సీతమ్మధారే కదా?’’ అన్నాడు. అవునంది. ‘‘నేనుండేదీ అక్కడే! మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద డ్రాప్ చేస్తా!’’ అంటూ సిగ్గుపడుతూ అన్నాడు. ఆ అమ్మాయి, ‘‘పర్లేదు. నే వెళ్తా’’ అంది. మళ్లీ ఏమనుకుందో, వెనక్కి తిరిగి, ‘‘సరే పదా! వెళ్దాం..’’ అంది సిగ్గుపడుతూ. ఆ అబ్బాయి మాత్రం ముందుకు కదలకుండా అక్కడే నిలబడ్డాడు. తనలో తానే ఏదో గొణుక్కుంటున్నాడు. చెప్పాలనుకుంటున్న విషయం ఎలా చెప్పాలో తెలీట్లేదు. ‘‘మీకో విషయం చెప్పాలి! నాకు బైక్ లేదు. బస్ ఎక్కొచ్చా’’ అన్నాడు. గట్టిగా నవ్వి.. ‘‘మరి లిఫ్ట్ ఎలా ఇస్తానన్నారు?’’ అడిగింది. ‘‘ఏదో!! రొమాంటిక్‌గా ఉంటుందనీ..’’ బదులిచ్చాడు. ఆ అమ్మాయిని చూస్తూ సరిగ్గా నిలబడి మాట్లాడలేకపోతున్నాడు ఆ అబ్బాయి. మొత్తం ఊగిపోతున్నాడు. నవ్వుతూ, సిగ్గుపడుతూ. ‘‘నా స్కూటీ మీద వెళ్దాం.. పదండీ.!’’ అంది. మూడడుగులు వేశాక అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది. ‘‘మీ దగ్గర స్కూటీ ఉంటే మరీ.. నా బైక్ ఎందుకు ఎక్కుతా అన్నారు?’’ అడిగాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది. ఆ అబ్బాయి నవ్వాడు. ఆ అమ్మాయి స్కూటీపై అబ్బాయి, అమ్మాయి వెళుతున్నారు. ఇద్దరూ ఏం మాట్లాడుకోకుండా కూర్చున్నారు. అబ్బాయి ఇక నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ అడిగాడు – ‘‘మీరుండేది ఎల్ఐసీ అపార్ట్‌మెంట్సే, నేనుండేదీ ఎల్ఐసీ అపార్ట్‌మెంట్సే. కానీ మీ పేరింకా నాకు తెలీలేదండీ..’’. ‘‘ప్రభావతి..’’ ‘‘నైస్ నేమ్’’ ‘‘ఏం బావుందీ! నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీషా ప్రభావతి’’ చిరుకోపంతో చెప్పింది. తనకు అసలు ఆ పేరే నచ్చదని చెప్పింది ఆ అమ్మాయి. ‘‘అయినా పేరుదేముంది? వదిలేసేయండి..’’ ‘‘నీకో విషయం చెప్పనా? నాకసలు ఏ బాయ్‌ఫ్రెండూ లేడు. ఈ ఊర్లో అయితే ఫ్రెండ్స్ కూడా లేరు. మాది ఢిల్లీ. ఫస్ట్ టైమ్ వైజాగ్కొచ్చా. అమ్మమ్మ వాళ్లింటికి.’’ ‘‘మాది హైద్రాబాద్. అత్తయ్య వాళ్లింటికొచ్చా. ఈ సెలవులిక్కడే!’’ ‘‘నీక్కూడా గర్ల్‌ఫ్రెండ్ లేదు కదా!?’’ అడిగింది. ‘‘నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా?’’ ‘‘ఏం చెప్పినా ఫర్వాలేదు. ఏం చెప్తున్నారో చెప్పి చెప్పండి..’’ ‘‘మొన్న మండే వరకూ గర్ల్‌ఫ్రెండ్ లేదండీ.. నిన్న ట్యూజ్‌డే వరక్కూడా గర్ల్‌ఫ్రెండ్ లేదండీ.. ఈరోజు వెడ్నస్డే పొద్దునవరకూ కూడా గర్ల్‌ఫ్రెండ్ .. లే.. దం..డీ..’’ అనేంతలో అపార్ట్మెంట్ వచ్చేసిందని బండి ఆపేస్తూ, ‘‘ఇంక చాలు..’’ అంది ఆ అమ్మాయి. వేసవి సెలవులు అయిపోతున్నాయి. వెంకటేశ్వర్లు, ప్రభావతి... పేర్లు తెలుసుకోవడం దగ్గర్నుంచి, ఇష్టాల్ని పంచుకునేవరకూ, ఆ ఇష్టాలను కలిసి ఆస్వాదించేవరకూ వచ్చేశారు. ఇంక సెలవులు అయిపోతాయనుకునే టైమ్‌లో వెంకటేశ్వర్లు ప్రభావతికి అసలు విషయం చెప్పాలనుకున్నాడు. డిన్నర్‌కి పిలిచాడు. ‘‘ఇంతకీ ఏదో అడగాలన్నావ్?’’ అడిగింది ప్రభావతి. వెంకటేశ్వర్లు చెప్పకుండా జంకుతున్నాడు. ‘‘కమాన్! అడిగెయ్! నేనేమైనా కొడతానా?’’ అంది. వెంకటేశ్వర్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని, ‘‘డూ యూ లవ్ మీ ప్రభా?’’ అనడిగాడు. ‘‘కొడతాను.’’ ‘‘నిజం ప్రభా! నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరి మధ్య ఉన్న పరిచయానికి ఏ పేరు పెడతావ్?’’ ‘‘ఏదొక పేరు పెడితే కానీ ఏమీ లేనట్టా? నాకు నువ్వు నచ్చావ్! అది నిజం. యూ ఆర్ స్పెషల్.. అదీ నిజం. దానికిప్పుడు పేరు పెట్టాలా?’’ ‘‘అంటే నేను జస్ట్ ఫ్రెండ్‌నా?’’ ‘‘పోనీ బెస్ట్‌ఫ్రెండ్ అనుకో!’’ ‘‘ఇప్పుడు మనమేం చేద్దామంటావ్?’’ ‘‘చూద్దాం. టచ్‌లో ఉందాం. లెట్ లైఫ్ అన్ఫోల్డ్ నా!’’ వెంకటేశ్వర్లు చాలాసేపు ఏం మాట్లాడలేదు. కొంచెం కోపాన్ని కొనితెచ్చుకొని, ‘‘అర్థమైంది. ఢిల్లీ కల్చర్ కదా, మాకు కొత్తలే! పార్టీలు, పబ్బులూ, షికార్లూ..’’ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉండగానే, ప్రభావతి కోపంగా అక్కణ్నుంచి లేచెళ్లిపోయింది. ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు. ఆ వెంటనే ఊరు వదిలేసీ వెళ్లిపోయింది.. వెంకటేశ్వర్లుకు కనిపించకుండా. తన ఫోన్ నంబర్ కూడా తెలియనీయలేదు. -
పాలివ్వడం మా జన్మహక్కు
అది అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం. ఒక ఆఫీసుకు ఒక తల్లి తన నాలుగు నెలల బిడ్డతో పాటు పని ఉండి వచ్చింది. ఆఫీసు రిసెప్షన్ ఏరియాలో కూర్చుని పాలు ఇవ్వడానికి పూనుకుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అభ్యంతర పెట్టాడు. ‘మీ వక్షోజాలు కనపడకుండా కప్పుకోండి’ అన్నాడు. ‘బహిరంగంగా పాలు ఇచ్చే హక్కు నాకుంది’ అని చెప్పిందామె. ‘కాని మీరిక్కడ ఇలా ఇవ్వడానికి లేదు. చాటుకు వెళ్లండి’ అన్నాడతను. మరి కాసేపటిలో ఆమెను అక్కడినుంచి పంపించేశాడు. కాని వెళ్లినతల్లి ఊరుకోలేదు. ఈ విషయాన్ని నలుగురికీ చెప్పింది. తనలా బిడ్డల తల్లులైన మరో పదిహేనుమందితో అదే ఆఫీసుకు చేరుకుంది. వాళ్లంతా ఆ ఆఫీసు రిసెప్షన్లో పిల్లలకు అందరూ చూస్తుండగా పాలు ఇవ్వడం మొదలుపెట్టారు. పిల్లల ఏడుపు, తల్లుల నిరసన... వీటి దెబ్బకు ఆఫీసు వారు దిగి వచ్చారు. ‘ఇంతకు మునుపు జరిగింది తప్పే. పాలు ఇవ్వడం మీ హక్కు’ అని క్షమాపణ పత్రం రాసి ఇచ్చారు. ఈ గోలంతా తెలియని పసికూనలు తల్లి పాలను కమ్మగా గుటకలు వేస్తూ కునుకు తీశారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఒక ఊరు.అక్కడి చర్చ్‌లో ఒక బాలింత ప్రార్థనకు వచ్చింది.చర్చ్‌లో తన బిడ్డకు పాలు ఇవ్వబోయింది.కాని దీనిని చర్చ్ బాధ్యులు అంగీకరించలేదు.ఆమె పాలిచ్చే పద్ధతి వల్ల ఇతరుల ఏకాగ్రత భంగమవుతుంది కనుక ఆమెను చర్చ్ నుంచి బయటకు వెళ్లిపోమ్మన్నారు. లేదా లేడీస్ బాత్రూమ్కు వెళ్లి పాలు ఇవ్వమన్నారు. ఇది ఆమెకు చాలా కోపం తెప్పించింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే 1600 మంది దానిని షేర్ చేశారు. ‘పోప్ అంతటివారే స్వయంగా చర్చ్‌లో బిడ్డలకు పాలు ఇవ్వవచ్చునని చెప్పారు. మరి ఎందుకు మమ్మల్ని పాలివ్వకుండా నిరోధిస్తున్నారు?’ అని వారు ప్రశ్నించారు.‘పిల్లలు పాలు తాగడం అంటే వారు భోజనం చేయడం లాంటిది. మనల్ని ఎవరైనా బాత్రూమ్లో భోజనం చేయమని అంటారా? మరి నా బిడ్డ బాత్రూమ్లో ఎందుకు పాలు తాగాలి?’ అని ఆ తల్లి ప్రశ్నించింది.చివరకు ఈ గొడవ మరీ పెద్దదవక ముందే చర్చ్వారు రాజీకి వచ్చారు. తమ చర్చ్‌లో తల్లులు పిల్లలు పాలివ్వవచ్చునని ప్రకటించారు. ఇటీవల అర్జెంటైనాలో మరో సంఘటన జరిగింది. రోడ్డు పక్కన ఒక బాలింత ఫుట్ పాత్ మీద తన బిడ్డకు పాలివ్వబోయింది.దానిని అక్కడి పోలీస్ వారించాడు. ‘పాలిచ్చేటప్పుడు నీ వక్షం కనపడుతోంది. ఇవ్వొద్దు’ అని వారించాడు. అంతేకాదు ‘చెప్పినా వినకుండా ఇచ్చావంటే నిన్ను అరెస్ట్ చేస్తాను’ అని కూడా హెచ్చరించాడు. అర్జెంటీనాలో బహిరంగంగా చనుబాలు ఇవ్వడం నేరం అని చెప్పే చట్టం ఏదీ లేదు. అయినా కాని ఆ పోలీస్ అలా బెదిరించడంతో ఆ బాలింత ఫేస్‌బుక్‌ను ఆశ్రయించింది. అది పెద్ద ప్రకంపననే సృష్టించింది. దాంతో వందలాది మంది తల్లులు అక్కడి పార్కులో తమ బిడ్డలతో సహా వచ్చి సామూహిక స్తన్యమిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలో తల్లిపాలు ఇవ్వడం నామోషీగా భావించే ఒక ధోరణి ఉన్న సందర్భంలో అమెరికా, యూరప్, లాటిన్ అమెరికాలలో స్తన్యమిచ్చే హక్కు కోసం తల్లులు నిరసనలకు దిగడం ఎక్కువయ్యింది. నిన్నగాక మొన్న అంటే నవంబర్ 3వ తేదీన కొలంబియాలోని బొగొటా నగరంలోని ఒక పార్కులో రెండు వేల మంది తల్లులు ఒక పార్కులో చేరి కొన్ని గంటల పాటు బహిరంగంగా (వక్షం కనిపించేలాగా) బిడ్డలకు పాలు ఇస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.‘పిల్లలకు పాలు ఇవ్వడం బూతు కాదు’ అని వారు చేస్తున్న ప్రచారం.‘మర్యాదస్తులు’ పెరిగిపోవడం, ‘సంస్కారాన్ని’ వ్యాఖ్యానించడం ఎక్కువైపోయిన ఈ రోజుల్లో ఒక తల్లి తన బిడ్డకు ఏ ఆచ్ఛాదన లేకుండా పాలు ఇవ్వడం ఒక ‘కుసంస్కారం’గా భావించడానికి ఆయా దేశాలలోని తల్లులు సహించడం లేదు.‘మన నాగరికత ఎంత వరకూ చేరిందంటే స్తన్యానికి మాతృత్వ భావన పోయి కేవలం శృంగారభావన మాత్రమే మిగిలింది’ అని ఒక తల్లి వ్యాఖ్యానించింది.భారతదేశంలో పల్లెల్లో అందరూ చూస్తుండగా పాలివ్వడం తల్లులు, చూపరులు తప్పుగా భావించరు. కాని పట్టణాల్లో, నగరాల్లో ‘బ్రెస్ట్‌ఫీడ్ రూమ్స్’ అని కొన్ని తయారయ్యాయి. లేదంటే చాటుగా ఇచ్చే పరిస్థితి అలిఖితంగానే ఉంది. లేదా మనకు చీరకట్టు వల్ల పవిట ఒక సౌలభ్యం కావడంతో పవిట చాటు నుంచి పాలు ఇచ్చే సౌకర్యం ఉంది. కాని పాశ్చాత్య వస్త్రధారణలో వక్షాన్ని చాటు చేసుకోవడం అన్నిసార్లు సాధ్యం కాదు. వక్షం కనపడుతుండగా పాలు ఇవ్వడానికి బహిరంగ ప్రదేశాలలో కొందరు తప్పు పట్టడం, అభ్యంతరం వ్యక్తం చేయడం తల్లులు సహించలేకపోతున్నారు. పాలివ్వడం మా జన్మహక్కు అంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆగి వెళ్లడం మనిషి అలవాటు చేసుకున్నాడు. తల్లి తన బిడ్డకు పాలు ఇస్తుంటే ఆమెకు సౌకర్యాన్ని కలిగిస్తూ తన దారిన తాను ఎందుకు వెళ్లలేకపోతున్నాడు?‘బిడ్డకు ఆకలి వేసే టైమే పాలిచ్చే టైమ్. అది ఎక్కడ ఎలా ఉంటే అక్కడ ఇచ్చి తీరాల్సిందే’ అని ఒక పసిబిడ్డ తండ్రి పాలిస్తున్న తన భార్యను చూస్తూ అన్నాడు బొగొటా నగరం పార్కులో.బిడ్డ ఆకలితో ఉన్నా వక్షం కనిపిస్తుందన్న భయంతో పాలు పట్టకుండా ఉండటం కంటే దారుణమైన సంగతి మరొకటి లేదని తల్లులు వాదిస్తున్నారు.‘వక్షం కనిపించేలా పాలు ఇచ్చే మా హక్కును ఎవరూ కాదనలేరు’ అని వారు నినదిస్తున్నారు.అయినా కొన్ని రెస్టారెంట్లు, పబ్లిక్ ప్లేసుల నిర్వాహకులు, ప్రయాణ సాధనాల ఆపరేటర్లు ఈ విషయంలో తమ సంస్కార స్థాయిని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సర్వేలు చెబుతున్నాయి.భారతదేశంలోని నగరాలలో ఉన్న తల్లులు ఇంకా ఈ సమస్యను సమస్యగా చెప్పే పరిస్థితిలో లేరు. ‘సాంస్కృతిక రక్షణ’ పెచ్చు మీరితే వారూ గొంతెత్తే రోజు దూరంలో లేదు.ఒక్కటి మాత్రం నిజం– తన బిడ్డకు పాలివ్వకుండా తల్లిని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఉండదు. కరెక్ట్ అవ్వాల్సింది మనమే... తల్లులు కాదు. ఫేస్‌బుక్‌కు బడితెపూజ ఫేస్బుక్లో కొన్నిసార్లు తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చే ఫొటోలను పోస్ట్ చేస్తే ఫేస్బుక్ తన నియమావళిలో భాగంగా వాటిని తొలిగించడం కొంతమంది తల్లులకు నచ్చలేదు. ‘అవి అశ్లీలం కిందకే వస్తాయి’ అనే ఫేస్బుక్ వాదనను వారు తిరగ్గొట్టారు. ‘ఒక డేటింగ్ కంపెనీవాళ్ల యాడ్‌లో అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిని మీరెందుకు తీసేయలేదు’ అని వారు ప్రశ్నించారు. అంతే కాదు వేలాది మంది తల్లులు ఒక విజ్ఞాపనను సంతకం చేసి ఫేస్‌బుక్‌కు పంపారు. దాని సారాంశం ‘బిడ్డలకు పాలు ఇవ్వడం ఆశ్లీలం కాదు’ అని చెప్పడమే. -
ప్రణయ్, సౌరభ్ వర్మ ఓటమి
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు హెచ్ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో ప్రణయ్ 10–21, 22–20, 21–23తో లిన్ యు సియెన్ (చైనీస్ తైపీ) చేతిలో... సౌరభ్ వర్మ 19–21, 16–21తో అన్‌సీడెడ్ లీ చెయుక్ యుయి (హాంకాంగ్) చేతిలో ఓడారు. -
సినిమాల్లో...రెయిన్ ఎఫెక్ట్
హీరోయిన్ పరిగెడుతూ ఉంది. వెనుక విలన్ కత్తితో వెంటాడుతున్నాడు. ఆ సీన్ అలాగే తీస్తే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. కాని ఆ సమయంలోనే వాన పడితే? ఆ ఎఫెక్ట్ రెట్టింపు అవుతుంది. తనను అరెస్ట్ చేసిన ఎస్ఐ మీద పగ తీర్చుకోవడానికి రౌడీ ఎస్ఐ ఇంటి మీదకు అర్ధరాత్రి వచ్చాడు. ఎస్.ఐ భార్య ఒంటరిగా ఉంది. అప్పుడే వాన మొదలయ్యింది. ఇక ప్రేక్ష కుల మనసు రోమాంచితం అవుతుంది. హీరో ఒక శ్మశానంలోకి అడుగు పెట్టాడు. వెంటనే వాన మొదలయ్యింది. సమాధి మీద శిలువ తడవడం మొదలుపెట్టింది. ఇది సృష్టించే ఎఫెక్ట్ చిన్నది కాదు. వాన... సినిమాలో చాలా మేజిక్ చేస్తుంది. గిమ్మిక్ సృష్టిస్తుంది. ప్రేక్షకులను ఒక క్షణంలో రొమాంటిక్ మూడ్‌లోకి అంతలోనే బీభత్సమైన వాతావరణంలోకి తీసుకువెళుతుంది. సినిమాను కనిపెట్టిన హాలీవుడ్ వాళ్లు సినిమాలో రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా ముందే కనిపెట్టారు. అందుకే 1952లోనే ‘సింగింగ్ ఇన్ ది రెయిన్’ వంటి సినిమాలు తీసి హిట్ చేసుకున్నారు. హిందీలో రాజ్‌కపూర్ ‘బర్సాత్’ తీసినా ‘శ్రీ420’లోని ‘ప్యార్ హువా’ పాటలోనే రెయిన్ ఎఫెక్ట్‌ను గొప్పగా ఉపయోగించి ఆ పాట వల్లే కోట్లు సంపాదించలిగాడు. తెలుగులో ‘ఆత్మబలం’లో ‘చిటపట చినుకులు’... ఇప్పటికీ నిలిచి ఉందంటే అందులో వాన... ఆ వానకు హీరో అక్కినేని, తలకు స్కార్ఫ్ కట్టుకున్న హీరోయిన్ బి.సరోజా కలిసి తడుస్తూ వేసిన స్టెప్సే కారణం. దేవదాసు క్లయిమాక్స్ పాతరోజుల్లో వానను ఒక క్లయిమాక్స్‌కు వాడి గొప్ప ఫలితాన్ని సాధించిన సినిమా దేవదాసు. ఆ సినిమా క్లయిమాక్స్‌లో పార్వతి ఉన్న ఊళ్లో దిగుతాడు దేవదాసు. జట్కాలు ఉండవు. ఎడ్ల బండి కట్టించుకంటాడు. కాని ఆకాశం మీద మబ్బులు మూసుకొని వస్తాయి. మబ్బులా అవి? కాదు... దేవదాసును కబళించడానికి వస్తున్న మృత్యుమేఘాలు. ఆ వాన... దేవదాసు అనారోగ్యం... ఆ క్లయిమాక్స్ చూసిన ప్రేక్షకుడి మనసును వికలం చేసేస్తాయి. శోభన్‌బాబు ‘బలిపీఠం’ క్లయిమాక్స్ కూడా ఈ వాన వల్లే భీతావహంగా మారుతుంది. తను చేసిన తప్పును తెలుసుకున్న శారద ఇద్దరు పిల్లలతో అర్ధరాత్రి వానలో భర్తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. ఇల్లెక్కడో తెలియదు. తీవ్రమైన వాన. తడుస్తున్న పిల్లలు. పైగా తన అనారోగ్యం. ఆ భీతావహ సన్నివేశం చూసేవాళ్లను కరిగి ముద్ద చేసేస్తుంది. తడిసిన బట్టలను ఆరేసుకున్నంత సులభంగా ఆ సన్నివేశాన్నైతే మర్చిపోలేరు. ఎన్టీఆర్ ‘భలే తమ్ముడు’ సినిమాలో కెఆర్ విజయ, ఎన్టీఆర్ వెళుతున్న కారు వానలో ఆగిపోతుంది. కావాలనే ఎన్టీఆర్ ఈ పని చేశాడని కెఆర్ విజయ అనుమానిస్తుంది. దాంతో పౌరుషంగా కిందకు దిగిన ఎన్టీఆర్ వానలో తడుస్తూ కారు బయట ఉండిపోతాడు. ఈలోపు దొంగలు కెఆర్ విజయ మీద దాడి చేస్తే ఆమెను కాపాడి నిజాయితీని నిరూపించుకుని తద్వారా ప్రేమను గెలుచుకుంటాడు. ఈ సన్నివేశాన్ని కె.రాఘవేంద్రరావు ‘వేటగాడు’లో తిరిగి ఉపయోగించారు. శ్రీదేవి, ఎన్టీఆర్ పాడుకునే సూపర్‌హిట్ పాట ‘ఆకుచాటు పిందె తడిసె’కు ఈ సన్నివేశమే లీడ్. గాలివానలో వాన నీటిలో... తర్వాతి తరంలో చిరంజీవి వంటి నటులకు వాన సన్నివేశాల దక్కకపోయినా వాన పాటలు ఎక్కువ తారసపడ్డాయి. ‘ఇంటిగుట్టు’ సినిమాలో ‘లేత లేత చీకటి’ అంటూ నళినితో చిరంజీవి రెయిన్ సాంగ్ పాడుకుంటాడు. ఇదే సమయంలో హిందీలో సూపర్ హిట్ అయిన ‘నమక్ హలాల్’ను తెలుగులో ‘భలే రాముడు’గా రీమేక్ చేస్తే హిందీలో హిట్ అయిన ‘ఆజ్ రపట్ జాయేతో’ను తెలుగులో మోహన్‌బాబు- మాధవి ‘చినుకు చినుకు నీకు నాకు వలపు చిచ్చు పెట్టెనే’ అని పాడుకున్నారు. ఇదే మోహన్‌బాబుకు ‘రంగూన్‌రౌడీ’లో ‘వానొచ్చే వరదొచ్చే ఉరకలేక చావొచ్చే’ హిట్ పాట బోనస్‌గా దొరికింది. ఇక శోభన్‌బాబు ‘స్వయంవరం’లో పాడుకున్న ‘గాలివానలో వాన నీటిలో’ పాట ఇప్పటికీ హిట్ పాటగా నిలిచి ఉంది. నూరవరోజు.... తెలుగు కథలు ఈ ధోరణిలో ఉండగా మరోవైపు తమిళ సినిమాలు వానను ఒక ప్రధాన క్యారెక్టర్‌గా తీసుకోవడం ప్రారంభించాయి. మణివణ్ణన్ దర్శకత్వంలో వచ్చిన ‘నూరవరోజు’ సినిమా ప్రారంభంలోనే వానలో ఒక ముసుగు మనిషి ఒక ఆడపిల్ల శవాన్ని బంగ్లాకు తీసుకొచ్చి గోడలో పెట్టి ప్లాస్టర్ చేసే సీన్‌తో ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. ఈ సినిమా క్లయిమాక్స్ కూడా వానలోనే. మణిరత్నం వచ్చి ‘మౌనరాగం’ సినిమాతో ఇదే వానను హీరోయిన్ స్వేచ్ఛా స్వభావాన్ని చూపించాడానికి వాడుకున్నాడు. అజిత్ నటించిన ‘ఆశ.. ఆశ.. ఆశ’ సినిమా అంతటా వాన ఒక బ్యాక్డ్రాప్లా ఉంటుంది. ఇక అజిత్, దేవయాని నటించిన ‘ప్రేమలేఖ’ సినిమా క్లయిమాక్స్ అంతా భారీ వర్షం. కేవలం మనసులతో మాత్రమే ప్రేమించుకుని ముఖాలు చూసుకోకుండా ఉన్న ఆ జంటలో హీరోయిన్ హీరో కోసం వానలో వెతుక్కుంటూ తిరిగే సన్నివేశం గొప్పగా పండింది. కన్నడంలో కేవలం వానను ఒక కేరక్టర్‌గా తీసుకుని తీసిన ‘ముంగారు మలె’ సినిమా 80 లక్షల ఖర్చుకు 80 కోట్లు సంపాదించి చరిత్ర సృష్టించింది. గొడుగుల హత్య... 1985లో రాహుల్ రావైల్ దర్శకత్వంలో సన్నిడియోల్ హీరోగా వచ్చిన ‘అర్జున్’ సినిమాలో గొడుగుల హత్య సీన్ పెద్ద సంచలనం సృష్టించింది. అందులో సన్నిడియోల్ స్నేహితుడిని గుండాలు వానలో చంపుతారు. భోరున కురిసే వానలో వందలాడి గొడుగులను చీల్చుకుంటూ స్నేహితుడు పరిగెడుతుంటే వెనుక కరవాలాలు పట్టుకుని గూండాలు పరిగెత్తే సన్నివేశం ఆ తర్వాతి కాలంలో ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచింది. శివ ఫైట్... రామ్‌గోపాల్ వర్మ వచ్చాక వానను ఒక ఫైట్‌కు రోమాంచితం చేయడానికి ఉపయోగించడం ‘శివ’లో కనిపిస్తుంది. శివ గ్యాంగు మీద భవానీ గ్యాంగ్ అటాక్ చేయాలని వచ్చినప్పుడు అర్ధరాత్రి రెండు టీములూ ఎదురూ బొదురూ వచ్చాక హటాత్తుగా వాన మొదలవుతుంది. ఆ సన్నివేశం తర్వాతే శివ తడిసిన బట్టల్లో ఒక గూండాను భుజాన వేసుకొని భవానీ ఇంటికి వెళతాడు. ‘క్షణక్షణం’లో అడవిలో వాన పడుతుంటే వెంకటేశ్, శ్రీదేవిలతో పరేశ్ రావెల్ వానకు తడవ్వొద్దని సలహా ఇస్తూనే ‘నేను వంద రూపాయలకు కూడా మర్డర్ చేసిన రోజులున్నాయి’ అని చెప్పడం ప్రేక్షకులు మర్చిపోలేరు. తర్వాతి కాలంలో ‘మనసంతా నువ్వే’లో ప్రేమలో విఫలమైన ఉదయ్ కిరణ్‌ని ‘వాన వెలిసే లోపల మనసారా ఏడ్వరా... ఎవరికీ తెలీదు’ అని సునీల్ చెప్పే సన్నివేశం చాలామందికి నచ్చింది. ఇక ‘వర్షం’ సినిమాకు మూలమే వర్షం. వానలో తడుస్తూ పాడుతున్న త్రిషను విలన్ గోపిచంద్ మొదటిసారిగా చూడకపోతే కథే లేదు. జులాయి... లాయి... ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో వానను ఎఫెక్టివ్‌గా వాడుకున్న సినిమా ‘జులాయి’. ఈ సినిమా మొదలే వానతో మొదలై బ్రహ్మాండమైన మూడ్‌ని సెట్ చేస్తుంది. ఇటీవలి సినిమాలు అనేకం వానను ఉపయోగిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే సినిమా ఉన్నంత కాలం వాన ఉంటుంది. లేదా వాన ఉన్నంత కాలంలో సినిమాలో అది కురుస్తుంది.బయట వానగా ఉందా? అయితే మంచి సినిమాకెళ్లి కూచుంటే పోలా? - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి -
ఐదోసారి!
అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ జంటగా విపుల్ అమృత్లాల్ షా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నమస్తే లండన్’. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలై ఘన విజయం సాధించింది. మరోసారి అక్షయ్‌కుమార్, విపుల్ షా కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘నమస్తే ఇంగ్లాండ్’ పేరు ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని కూడా విపుల్ షా స్వీయ దర్శకత్వంలో నిర్మించనుండటం విశేషం. ‘నమస్తే లండన్’ చిత్రానికి ఇది సీక్వెల్ ఎంత మాత్రం కాదని చిత్ర బృందం స్పష్టం చేసింది. అక్షయ్‌కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ఇప్పటికే ‘రౌడీ రాథోడ్’, ‘జోకర్’, ‘వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబయ్ దుబారా’, ‘హాలిడే’ చిత్రాల్లో అక్షయ్, సోనాక్షి జతకట్టారు. ఈ చిత్రాల ద్వారా హిట్ పెయిర్ అనిపించుకున్నారు కూడా. ఇప్పుడు ఐదో సారి జతకట్టారు. ముందు నాలుగు చిత్రాల్లోనూ ఇద్దరి మధ్యా మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఈసారి ఏ రేంజ్లో మేజిక్ చేస్తారో చూడాలి. -
రొమాంటిక్, ఎంటర్టైనర్
యువతకు నచ్చే అంశాలతో పాటు రొమాం టిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. కాశ్యప్, చాందినీ జంటగా కళ్యాణ్ సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీరాం బాలాజీ దర్శకత్వంలో ఎం.జాహ్నవి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. ‘డిజీక్వెస్ట్’ బసిరెడ్డి కెమేరా స్విచ్చాన్ చేయగా దర్శకుడు కిశోర్ పార్థసాని క్లాప్ ఇచ్చారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘కథపై ఆరునెలలు పనిచేశాం. నటీనటులకు మూడునెలలు వర్క్‌షాప్ నిర్వహించాం. మార్చిలో షూటింగ్ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. ‘‘అన్నపూర్ణాస్కూల్లో శిక్షణ పొందిన కశ్యప్‌ను హీరోగా పరిచయం చేస్తు న్నాం. బంటిగారు మంచి పాటలు ఇచ్చారు’’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పావని తదితరులు పాల్గొన్నారు. -
మీ ప్రాధాన్యతా క్రమాన్ని తెలుసుకోండి
2016 జనవరి 16 నుంచి 22 వరకు టారో బాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) మీకిది ఎంతో సంతోషకరమైన వారం. పుష్కలంగా డబ్బందుతుంది. కోరిక నెరవేరుతుంది. ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మీకు అన్ని విధాలైన శుభఫలితాలనిస్తుంది. ఇంటిలో ఉత్తరంవైపు నీటి కుండ లేదా బిందెను ఉంచితే మరిన్ని శుభఫలితాలను పొందవచ్చు. సంపద, సమృద్ధి, అదృష్ట దిశగా మీ ప్రయాణం సాగుతుంది. కలిసొచ్చేరంగు: మబ్బు రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఒక కొత్త అవకాశం మీ తలుపుతట్టి, మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. దాన్ని స్వీకరించండి. త్వరలో మీరు ఒక మార్గదర్శకుని లేదా గురువును కలుసుకుంటారు. వారి అడుగుజాడలలో నడుస్తారు. గెలుపు దిశగా పయనిస్తారు. అలాగే మీరొక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. వారితో రొమాంటిక్‌గా గడుపుతారు. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు జెమిని (మే 21-జూన్ 21) పనికి కాస్తంత విరామం ఇవ్వండి. మానసిక అశాంతి, అస్థిరత నుంచి బయట పడడానికి వినోద లేదా విహార యాత్ర చేయడం వల్ల మీకు స్వాంతన లభిస్తుంది. ఏదైనా నూతన ప్రారంభానికి స్వాగతం చెప్పండి. మీరు చేయాలనుకున్న దానిని శ్రద్ధగా చేయండి. నాయకుడిగా ఎద గండి. పాజిటివ్‌గా ఆలోచించ ండి. కలిసొచ్చే రంగు: తెలుపు క్యాన్సర్ (జూన్22-జూలై 23) జీవితం మీరు అనుకున్నట్లుగా సజావుగా సాగుతుంది. శుభం జరుగుతుంది. మీ సోమరితనం, భావోద్వేగాలు, చొరబాటు ధోరణి వంటివాటిని అదుపు తప్పనివ్వకండి. ఆర్థికపరంగా కష్టపడవలసి ఉంటుంది. దుబారాకు చోటివ్వకండి. మీ చిరకాల స్వప్నం ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. కలిసొచ్చే రంగు: నారింజ లియో (జూలై 24-ఆగస్టు 23) అనుకోని విధంగా బహుమతులు అందుతాయి. అదేవిధంగా కొన్ని అనుకోని సమస్యలు, సవాళ్లు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. ఇది మీకు అడ్వంచరస్‌గా ఉంటుంది. మీ శక్తిసామర్థ్యాలను వెలికి తీసి, సమర్థతను నిరూపించుకునే అవకాశమిది. ఆఫీసు లేదా వృత్తిపరమైన ప్రయాణం ఉండవచ్చు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పశక్తిని నిరూపించుకోవలసిన తరుణమిది. మీ ప్రాధాన్యతా క్రమాన్ని తెలుసుకుని, తగ్గట్టు వ్యవహరించండి. ఇంటి ఆవరణలో లేదా ఆఫీస్‌లో కొత్త పనులు లేదా నిర్మాణాలు తలపెడతారు తద్వారా ప్రయోజనం పొందుతారు. ఎంతోకాలం నుంచి ఉన్న ఒక సంబంధానికి ముగింపు పలకవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఈ నెల మిమ్మల్ని ధనికుల సరసన నిలబెడుతుంది. మీ ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు నెరవేరతాయి. మీ శక్తిసామర్థ్యాలు, మీలో ఉత్సాహం, ఉల్లాసం ఇనుమడిస్తాయి. లవర్‌తో మీ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. నూత్న వాహనం కొంటారు లేదా ప్రయాణం చేస్తారు. ఆశావాదుల సరసనే ఉండేలా చూసుకోండి. కలిసొచ్చేరంగు: నారింజ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) సంతోషం కలిగే వార్తలను అనూహ్యంగా వింటారు. పనిపరంగా, ఆదాయపరంగా, కెరీర్ పరంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలా బాగుంటుంది. మీ ప్రియతములతో మీ బంధం బలపడుతుంది. కుటుంబంలోకి కొత్త సభ్యులు వస్తారు. బంధువుల నుంచి అనూహ్యంగా బహుమతులు అందుతాయి. కలిసొచ్చే రంగు: గులాబీరంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) సాజిటేరియన్స్: మీ కలలను తేలిగ్గా తీసిపారేయవద్దు. నిజమయ్యేలా చేసుకోండి. మీ ఆశయాలు, పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే కొద్దిపాటి విసుగు జనించడం, అనుకోని సమస్యలలో చిక్కుకోవడం జరగవచ్చు. మీ సామాజిక జీవితం మరింత సరదాగా, సంబరంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: గులాబీ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) అన్నివిధాలా విజయాన్ని, ధన సమృద్ధిని ఇచ్చే వారమిది. వ్యాపారంలో మీకు తెలిసిన వారొకరు మీకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వడమేగాక, వాటిని అమలు చేయడానికి ధనసాయం చేస్తారు. మీ అంతరాత్మ సాయంతో తెలివితేటలతో విజయం సాధిస్తారు. ప్రేమికులు, ప్రియతముల నుంచి బహుమతులు అందుతాయి. కలిసొచ్చే రంగు: ఇంద్రధనుసు రంగు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. అవిశ్రాంతంగా గడుపుతారు. చేసే ఉద్యోగం గాక అనుబంధంగా మరో పని ద్వారా ఆదాయాన్ని పొందుతారు. రొమాంటిక్ జీవితానికి స్వస్తి పలక వలసి వస్తుంది. మీ ముక్కుసూటి తనం వల్ల చికాకులు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: ఇటుక రాయి రంగు పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) కొత్త పనులకు శుభారంభం పలుకుతారు. ఇతర విధాలుగా ఆనందాన్ని, ఆదాయాన్ని ఇచ్చే మార్గాలకోసం అన్వేషిస్తారు. మరింత ఓర్పును, సహనాన్ని, శ్రద్ధను చూపవలసిన వారమిది. సహోద్యోగులు మీకు అన్నివిధాలా అండగా నిలుస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. అదృష్టాన్ని అందిపుచ్చుకుంటారు. కలిసొచ్చే రంగు: నీలం. టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కుటుంబమంతా సుఖశాంతులతోనే ఉంటున్నప్పటికీ అనవసరమైన వాదాలకీ చర్చలకీ అవకాశమున్న కారణంగా దంపతిలో ఎవరో ఒకరు వాదానికి సిద్ధపడకుండా ఉండడం ఎంతైనా అవసరం. గ్రహ అననుకూల పరిస్థితుల కారణంగా ఈ చ ర్చల్లో మరో మనిషి చేరే అవకాశం చేరే అవకాశం రావచ్చు. అదే జరిగినట్లయితే మీ ఇంటికి చుట్టూరా గోడలేమీ లేనట్లే! టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఎంతెంతో ఎదురు చూసి- దాదాపు ప్రయోజనం సిద్ధించినట్లే- అని అనుకునే వేళ ఆ కార్యం చేజారిపోవచ్చు- తీవ్ర నిరాశ కలగవచ్చు- బాధపడకండి ఇంతకంటే మంచి అవకాశం వచ్చేదుంది మీకు. అనవసరంగా మీమీద నింద పడడం గాని లేదా మీరే ఒకర్ని శత్రువుగా చేసుకునే పరిస్థితిగాని కనిపిస్తోంది. వీలయినంతవరకు నోటికి పని చెప్పకుండా జాగ్రత్తపడండి. జెమిని (మే 21-జూన్ 21) మీ దాంపత్యంలో అన్యోన్యత లేదని చెప్పలేంగాని అంతటి మైత్రీబంధం ఉండకపోవచ్చు. ఉద్యోగం లేదా వృత్తి లేదా వ్యాపార రీత్యా మీరూ ఆమె దూరదూర ప్రాంతాల్లో ఉండే అవకాశముంది. ఈ ఒంటరితనం జరుగుతున్న కాలంలో ఆమెగానీ మీరు గానీ ఇతరుల సలహాలని విననే వద్దు- విని, కోరి ఇబ్బందుల్ని తెచ్చుకోవద్దు- అపార్థపడనే వద్దు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) కుటుంబంలో వచ్చిన సమస్య పరిష్కారపు దిశగా లేకుండా అయోమయంలో ఉంచిన కారణంగా చిరాకూ ఆందోళనా కలగవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మీయుడూ మాటలాడడంలో నేర్పరీ అయిన వానిద్వారా ధర్మబద్ధంగా రాయబారాన్ని పంపండి. పరిష్కారం ఏవిధంగా ఉండబోతోందో ఆ మార్గం మీకు అర్థమవుతుంది. వాయిదా వేయకండి. లియో (జూలై 24-ఆగస్టు 23) సమయం లేని కారణంగా అప్పటికప్పుడు తోచిన ఓ ఆలోచనని నిర్ణయంగా చేసేస్తారు. భార్య అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. సంతానం రాకపోకలూ, బంధువుల సమాగమాల కారణంగా పని ఉన్నట్టూ, లేనట్టూ ఉంటుంది. మొత్తానికి ఈవారం దాదాపుగా కార్యశూన్యంగానే దొర్లిపోవచ్చు. అయితే బంధు మిత్రజనం ఉన్నారనే ఓ ధైర్యం వస్తుంది మీకు. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఎదురు చూసిన శుభకార్యానికి అవకాశం రావచ్చు. తగినంత ఆర్థిక పరిపుష్టికోసం ఇప్పటినుండే ప్రయత్నాలు ప్రారంభించండి. ఇచ్చిపుచ్చుకోవడం కాగితాలు రాసుకోవడం వంటి ముఖ్యమైన విషయాల్లో నోటిమాటలు వద్దు. భద్రతతో వ్యవహరించని పక్షంలో మొదటికే ఇబ్బంది కలగవచ్చు కాబట్టి భద్రంగా ఉండండి. ఏమైనా శుభకార్యాలోచన జరుగుతుంది. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఏదో తెలియని మానసికాందోళన ప్రారంభం కావచ్చు. అది మీ కుటుంబం పట్ల కావచ్చు. దీన్ని మించిన అధైర్యం మీ సంతానం- విద్య గురించి కలగవచ్చు. ధైర్యంగా ఉండండి. అశుభమంటూ ఏమీ లేదు. మన కంటిలో ఉన్న దోషం వల్ల ఎదుటి వస్తువు మరోలా కనిపిస్తోంది తప్ప, అది వస్తువులో ఉన్న దోషం కాదనే భావాన్ని ప్రతి విషయంలోనూ అన్వయించుకోండి. స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) వాహనాన్ని నడుపుతుంటే అది తన మార్గంలో ప్రయాణిస్తూ నీడనీ ఎండనీ మంచునీ చలినీ.. ఎలా దాటుకుంటూ సాగిపోతుందో, అలా, ఏ నిరుత్సాహమూ లేకుండా మీరు ముందుకు దూసుకుని పోతూ ఉండండి. గ్రహ అననుకూలత కారణంగా మానసిక భయం ఎక్కువగా ఉంటుంది కానీ, విజయం మీదేనని గ్రహించండి. ధైర్యాన్ని చెప్పే వారితో కలిసి గడపండి. శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) ప్రతి పనీ ఎంతో ప్రయత్నిస్తే కానీ పూర్తి కాకపోవచ్చు. ఏ క్షణానికి ఆ క్షణమే ఆశించిన పని ఆగిపోవచ్చనే మానసింకాదోళన ఉండవచ్చు. విజయం సిద్ధించినా పెద్ద ఆనందాన్ని- ఈ ప్రతిషంఘంభనా అవరోధాలూ ఆందోళనా కారణంగా పొందలేకపోవచ్చు. విదేశీ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. స్థానచలనం తప్పనిసరి కావచ్చు. నూతన స్థానం తప్పక లాభిస్తుంది. క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20) అనుకోని ఆదాయం లభిస్తుంది. ఆర్థిక పరిపుష్టికోసం ఇతర ధనాదాయమార్గాలకి అన్వేషణ, ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనలన్నీ సక్రమంగా ఉంటాయి. వృద్ధులూ అనుభవజ్ఞులూ అయిన వాళ్లని సంప్రదించడాన్ని మీరు అవమానంగానూ తక్కువదనంగానూ భావింపని మనస్తత్వం కలవాళ్లు కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో లోటుపాట్లుండవు. ధైర్యంగా ముందుకు సాగండి. అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) తీర్థయాత్రాసక్తి పెరుగుతుంది. సంతానానికి కానీ, మీకు కానీ కలిగిన- కలుగుతున్న అభ్యంతరాలు తొలగిపోవడం కోసం శాంతులూ జపాలూ వంటివి చేయించుకోవచ్చు. మీరనుకున్నదే మీరు సాధించుకునే మనస్తత్వమున్నవారు కాబట్టి ధైర్యంగానో లౌక్యంగానో మీరనుకున్నదే నెరవేర్చుకుంటారు. ఇతరులకి బాధ కలిగించే విధంగా మీ ప్రయోజనం నెరవేతుంది. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) కుటుంబమంతా కలిసికట్టుగా ఉన్న కారణంగా మీకు చెప్పలేనంత అండ ఉన్నదనే మానసిక ధైర్యం కలుగుతుంది. తల్లీతండ్రీ కూడ ఆర్థికంగానో పనిపాటలకో మీ కుటుంబం పట్ల శ్రద్ధని చూపుతుండే కారణంగా ఈ వారం సుఖంగా గడుస్తుంది. సొమ్ముతో సొమ్ముని సంపాదించే (షేర్లవంటివి) వ్యాపారాన్ని వీలయినంత తక్కువ చేయడం మంచిది ఈ వారంలో. -
'మా ఆయన చాలా రోమాంటిక్'
లండన్: తన భర్త డేవిడ్ బెక్కామ్ చాలా రోమాంటిక్ ఫెలో అని ప్రముఖ గాయని, ఫ్యాషన్ డిజైనర్ విక్టోరియా చెప్పింది. ఒకప్పటి ఫుట్ బాల్ ప్లేయర్ అయిన ఆయన చెప్పలేనంత రోమాంటికల్ పర్సన్ అయినా కుటుంబ విషయంలో అతడికి ఉన్న కమిట్ మెంట్‌కే ఎక్కువ మార్కులు వేస్తానని చెప్పుకొచ్చింది. 'డేవిడ్ చాలా రోమాంటిక్. మేము ప్రతి రోజు ఒకరినొకరం ఆశ్యర్యపరుచుకునేందుకు ఏదో ఒకటి చేస్తుంటాం. తొలిసారి నేను డేవిడ్‌ను 20 ఏళ్ల కిందట కలిశాను. ఆ సమయంలో ఫుట్ బాల్ మ్యాచ్ లో ఉన్నాము. మ్యాచ్ ముగిశాక అందరూ తమ స్నేహితులతో కలిసి కూల్ డ్రింక్స్ తాగుతూ కబుర్లు చెప్తుంటే ఒక్క డేవిడ్ మాత్రం తన కుటుంబ సభ్యులతో ఉన్నాడు. అతడి అమ్మ నాన్న, సోదరితో మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడే అర్థమైంది.. అతడు తన కుటుంబానికి ఎంత విలువ ఇస్తాడో అని. నన్ను పెళ్లి చేసుకునేందుకు నా తండ్రి అనుమతి కోరిన తీరు ఇప్పటికీ మర్చిపోలేను. ఓ మోకాలిపై కూర్చుని మరీ మీ కూతురుని నాకు ఇవ్వరా అంకుల్ అంటూ అడిగి ఆశ్చర్యపోయేలా చేశాడు. అతడి గౌరవం చూసి అబ్బుర పోయాం' అంటూ విక్టోరియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విక్టోరియా, డేవిడ్ దంపతులకు నలుగురు పిల్లలు. -
ఓ మై గాడ్!
ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుంది రొమాంటిక్ క్వీన్ కిమ్ కర్దాషియన్ వరుస. ముప్పై నాలుగేళ్ల ఈ రియాల్టీ స్టార్... తాను బరువు పెరగడానికి కారణం దేవుడేనంటూ ఆరోపించింది. గతేడాది జూన్‌లో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది కిమ్. ఆ సమయంలో అమ్మడు యాభై పౌండ్లు (ఇరవై రెండున్నర కేజీలు) బరువు పెరిగిందట. డెలివరీ తరువాత ఆ బరువు తగ్గించుకోవడానికి కిమ్ నానా పాట్లూ పడాల్సి వచ్చిందట. రీసెంట్గా ఓ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ... ‘భగవంతుడు నన్ను శిక్షించాడు. బహుశా ఇంత హాట్‌గా ఉన్నాననేమో’ అంటూ తన గురించి తనే సెక్సీ తారగా కితాబిచ్చేసుకుంది. -
రొమాంటిక్‌గా నటించి ఏడ్చేసింది!
కథ డిమాండ్ చేసిన మేరకు ఒక్కోసారి కథానాయికలు హద్దులు దాటి అంగాంగ ప్రదర్శన చేయాల్సి వస్తుంది. కొంతమంది మాత్రం అలాంటివి చేయమని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. కానీ, ఆ సన్నివేశం ప్రాధాన్యతను దర్శకుడు వివరిస్తే.. అర్ధమనసుతో అంగీకరించేస్తారు. ఇటీవల హన్సిక అలానే చేశారు. ఆర్య సరసన ఆమె ‘మీగామన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఆర్య, హన్సిక పాల్గొనగా ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. ఈ పాట కోసం హన్సికకు చాలా కురచ దుస్తులు డిజైన్ చేయించారట. ఇప్పటివరకూ ఏ చిత్రం కోసమూ హన్సిక అలాంటి దుస్తులు ధరించలేదని సమాచారం. అది మాత్రమే కాదు... ఆర్యతో చాలా రొమాంటిక్‌గా నటించాల్సి వచ్చిందట. ముందు దీనికి ససేమిరా అన్నప్పటికీ, ఆ తర్వాత ఆ పాటకు ఉన్న ప్రాధాన్యతను దర్శకుడు వివరించడంతో హన్సిక ఒప్పుకున్నారు. కానీ, పాట చిత్రీకరణ పూర్తి కాగానే.. ఒక్కసారిగా ఏడ్చేశారట. ‘హన్సిక ఇలా నటించిందేమిటి? అని అభిమానులు తప్పుగా అనుకుంటారేమో’ అని వాపోయిందట. కానీ, అలాంటిదేం జరగదని దర్శకుడు హామీ ఇచ్చినా, అర్ధమనసుతో తలూపారట హన్సిక.