రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో రెండు పోలీసు స్టేషన్‌ల మధ్య గొడవ తెచ్చిపెట్టింది. ఆ ఘటన తమ పరిధిలోది కాదంటే తమది కాదంటూ కొట్టిపారేస్తున్నారు పోలీసు అధికారులు. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది? ఎందుకు అది వివాదాస్పదమైందంటే..?
వీడియోలో బ్రిడ్జ్‌పై ఓ జంట బైక్‌పై వెళుతోంది. అబ్బాయి బైక్ నడుపుతుండగా.. అతనికి ముందుభాగంలో వ్యతిరేక దిశలో హత్తుకుని కూర్చుంది అమ్మాయి. తేదీ వివరాలు లేని ఈ వీడియో నిరాలనగర్ ఫ్లై ఓవర్‌పై జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపించట్లేదు. ముఖాల ఆధారంగా నిందితులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. ఈ ఘటన తమ పరిధిలోది కాదని అలీగంజ్, గోమతీ నగర్ పోలీసు స్టేషన్ అధికారులు విభేదించుకుంటున్నారు. గోమతీ నగర్‌కు సమీపంలో ఘటన జరిగినట్లు తెలుస్తోందని అలీగంజ్ స్టేషన్ అధికారి నగేష్ కుమార్ ఉపాధ్యాయ అన్నారు. వీడియోలో కనిపించిన బ్రిడ్జ్ గోమతీ నగర్‌కు సమీపంలోనిది కాదని, అక్కడ వీడియోలు రికార్డ్ చేసే అవకాశమే లేదని స్థానిక స్టేషన్ అధికారి కొట్టిపారేస్తున్నారు. కాగా ఇలాంటి వీడియోనే కొన్ని రోజుల క్రితం హజ్రత్ గంజ్ ప్రాంతంలో జరిగింది. నిందితులను కూడా గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment