bike ride
-
సాహసం.. శ్వాసగా!
సాక్షి,హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మోటారబుల్ పాస్ వద్దకు ఒంటరిగా బైక్‌పై వెళ్లి రికార్డు సృష్టించాడు మల్కాజిగిరికి చెందిన యువకుడు. దేశంలోని చివరి గ్రామమైన టర్దుక్, పాకిస్తాన్ సరిహద్దు తంగ్ గ్రామం, సియాచిన్ బేస్ క్యాంప్, భూమిపై ఎత్తైన యుద్ధభూమిని సందర్శించి ఔరా అనిపిస్తున్నాడు. మల్కాజిగిరికి చెందిన బత్తిని సాయివంశీ గౌడ్ 26 రోజుల పాటు 8,800 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి రికార్డులు తిరగరాస్తున్నాడు. ఈ నెల 2న ప్రారంభించిన తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు.19,024 అడుగుల ఎత్తులో.. లఢాక్‌లో 19,024 అడుగుల ఎత్తులోని ఉమ్లింగ్ లా పాస్ 11 రోజుల్లో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఎన్నో అడ్డంకులను దాటుకుని, మొక్కవోని దీక్షతో ఉమ్లింగ్లా పాస్ చేరుకుని తెలంగాణ కెరటాన్ని ఎగురవేశాడు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆర్మీ అధికారులు ఎంతో సహాయం చేశారు. -
అమెరికా ఆటల పోటీలో... మన మహిళా పోలీస్
వేసపోగు శ్యామల... హైదరాబాద్, సైఫాబాద్ ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ. ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘2024 పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్’కి ఆహ్వానం అందుకున్నారామె. ఈ నెల 12 నుంచి 21 వరకు యూఎస్ఏలోని ఓహియో రాష్ట్రం, క్లీవ్‌ల్యాండ్‌లో జరగనున్న పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలలో పాల్గొంటున్న సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి నేటి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు.‘‘నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్, కర్నూలు పట్టణంలోని సిమెంట్‌నగర్‌లో. నాన్న మిలటరీ ఆఫీసర్ అమ్మ స్టాఫ్‌నర్స్. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లిని నేను. మా పేరెంట్స్ మమ్మల్నందరినీ బాగా చదివించారు. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక అన్న మిలటరీలో ఉన్నారు. ఒక అక్క, నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం. నా ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ నగరంలోని గోపాల్పురం. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారిణిని. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఖోఖో, కబడీ, త్రో బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్‌లో లెక్కలేనన్ని పతకాలందుకున్నాను. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో జాతీయస్థాయి పతకాలందుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. నేను ఇప్పుడు మీ ముందు ఇంత అడ్వెంచరస్‌గా కనిపిస్తున్నానంటే కారణం ఈ నేపథ్యమే.ఈ ఉద్యోగం ఆడవాళ్లకెందుకు?స్త్రీపురుష సమానత్వ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. మాలాంటి ఎందరో పోలీసింగ్, దేశరక్షణ వంటి క్లిష్టమైన విధులను భుజాలకెత్తుకున్నాం. కానీ సమాజం మాత్రం అంత ముందు చూపుతో లేదన్న వాస్తవాన్ని మా డిపార్ట్మెంట్లోనే చూశాను. ‘ఆఫ్టరాల్ ఉమన్, జస్ట్ కానిస్టేబుల్, యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వస్తారు, వెళ్తారు. జీతం దండగ’ అనే మాటలు మేము వినాలనే అనేవాళ్లు. నాలో కసి ఎంతగా పెరిగిపోయిందంటే... వాహనం కొనేటప్పుడు చిన్నవి వద్దని 350 సీసీ బుల్లెట్ తీసుకున్నాను. ‘ఏ అసైన్మెంట్ అయినా ఇవ్వండి’ అన్నాను చాలెంజింగ్‌గా. నైట్ పెట్రోలింగ్ చేయమన్నారు.అది కూడా సింగిల్‌గా. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా వరుసగా 60రోజులు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు బైక్ మీద హైదరాబాద్ సిటీ పెట్రోలింగ్ చేశాను. ఆ డ్యూటీతో వార్తాపత్రికలు, టీవీలు నన్ను స్టార్‌ని చేశాయి. ‘ఎంటైర్ ఆల్ ఇండియా చాలెంజింగ్ ఉమన్ ఆఫీసర్’ అని అప్పటి సీపీ అంజనీకుమార్ సత్కరించారు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌గా ఏసీపీ రంగారావు చేతుల మీదుగా సత్కారం అందుకున్నాను.బుల్లెట్ పై వస్తా... ఆకతాయిల భరతం పడతా!పోలీసులంటే శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ అడ్రస్ చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, భరోసా, షీ టీమ్స్, తెలంగాణ స్టేట్ పోలీస్ కౌన్సెలింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, కరోనా సమయంలో అనారోగ్యంతో ప్రయాణించవద్దు– వ్యాప్తికి కారణం కావద్దనే ప్రచారం, ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం, ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ... ‘మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నిలబెట్టుకోవడం, కాలరాసుకోవడం రెండూ మన నిర్ణయాల మీదనే ఉంటాయ’ని చెప్పేదాన్ని. గణేశ్ ఉత్సవాల సమయంలో మహిళలను తాకుతూ విసిగించడం, మెడల్లో దండలు అపహరించే పోకిరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మా డి΄ార్ట్‌మెంట్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిల భరతం పట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. సరదాకొద్దీ సోలో రైడ్లుచిన్నప్పటి నుంచి టామ్‌బాయ్‌లా పెరిగాను. బైక్ అంటే నా దృష్టిలో డ్యూటీ చేయడానికి ఉపకరించే వాహనం కాదు. బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. ‘వరల్డ్ మోటార్‌సైకిల్ డే’ సందర్భంగా బైక్ రైడ్ చేశాను. బైకర్లీగ్ విజేతను కూడా. ‘ఉమన్ సేఫ్ రైడర్ ఇన్ తెలంగాణ’ పురస్కారం కూడా అందుకున్నాను. అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే ఇష్టం.గుర్గావ్లో ΄ారాషూట్ డైవింగ్, పారాగ్లైడింగ్ చేశాను. నా సాహసాలకు గాను సావిత్రిబాయి ఫూలే పురస్కారం, సోషల్ సర్వీస్‌కు గాను హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భాలు. మొత్తం నాలుగు మెడల్స్, మూడు అవార్డులు అందుకున్నాను.పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆటల పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పతకాలందుకున్నాను. దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం యూఎస్‌లో జరిగే క్రీడలకు ఆహ్వానం అందింది. వీసా కూడా వచ్చింది. నా దగ్గరున్న డబ్బు ఖర్చయి పోయింది. యూఎస్ వెళ్లిరావడానికి స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రపంచంలోని 50 దేశాల క్రీడాకారులు ΄ాల్గొనే ఈ పోటీలకు వెళ్లగలిగితే మాత్రం భారత్‌కు విజేతగా పతకాలతో తిరిగి వస్తాను’’ అన్నారు శ్యామల మెండైన ఆత్మవిశ్వాసంతో. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్చ్ఠ్బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. -
స్టైలిష్ లుక్‌లో రాహుల్.. లద్దాఖ్‌లో బైక్ టూర్..
లేహ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన పాంగాంగ్ సరస్సు వరకు బైక్ రైడ్ చేపట్టారు. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను ఆగష్టు 20న అక్కడే నిర్వహించనున్నారు. బైక్ రైడ్‌కు సంబంధించిన దృశ్యాలను ఆయన తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు. KTM 390 బైక్‌ను కొనుగోలు చేసినట్లు రాహుల్ గాంధీ ఒకప్పుడు సోషల్ మీడియాలో తెలిపారు. కానీ భద్రతా కారణాల రీత్యా ఆ బైక్‌పై సెక్యూరిటీ బయటకు వెళ్లనీయడం లేదని అన్నారు. అయితే.. ప్రస్తుతం ఆ బైక్‌పైనే ఆయన పాంగాంగ్ సరస్సు వరకు వెళ్లనున్నారు. "ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్ గాంధీ) చెప్పేవారు" అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పంచుకుంది. రాహుల్ లద్దాఖ్ పర్యటన ఆగష్టు 25న ముగియనుంది. Upwards and onwards - Unstoppable! pic.twitter.com/waZmOhv6dy — Congress (@INCIndia) August 19, 2023 దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇటీవలే తమిళనాడు వెళ్లి ఊటీ సమీపంలో గిరిజన తెగలతో కలిసి ఆడిపాడారు. ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో బైక్‌పై పాంగాంగ్ సరస్సు వరకు పర్యటిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్ లద్దాఖ్‌కు రావడం ఇదే తొలిసారి. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) ఇదీ చదవండి: మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి.. కేంద్రానికి అఖిలేష్ కౌంటర్.. -
బుల్లెట్టు బండెక్కి బైక్ రైడింగ్.. హిజాబ్ రైడర్ స్టోరీ ఇదే
ఇట్టే వస్తే రానీ వెంటా,నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా,డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ.. పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, బైక్ ఎక్కే రోజుల నుంచి గేర్ల్మీద గేర్లు మార్చుకుంటూ రయ్యన దూసుకెళ్తున్నారు నేటి తరం అమ్మాయిలు. సెల్ఫ్‌తో బండిని స్టార్ట్‌చేసి సూదూర ప్రాంతాలకు సోలోగా రైడ్ చేస్తూ దునియాని చుట్టేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో రైడింగ్ చేస్తుంటే... మరింత ప్రత్యేకంగా హిజాబ్ ధరించి జాతీయ రహదారులే కాదండోయే దేశాలు దాటి మక్కా దాక బుల్లెట్ మీదే వెళ్తానంటోంది ముఫ్పై ఏళ్ల నూర్ బీ. చెన్నైలోని పల్లవరానికి చెందిన అమ్మాయి నూర్‌బీ. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇది చేయకు! అది చేయకు! అలా ఉండకు! ఇలా ఉండాలి! అంటూ ఎన్నో నిబంధనలు. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించాలి. అయినా నూర్ బీకి మాత్రం బైక్ నడపడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంట్లో అమ్మాయిలు బైక్‌లు అస్సలు నడపకూడదు. అయినా తన ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. కాలేజీలో ఉండగానే మోటర్ సైకిల్ కొనుక్కోవాలనుకునేది. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఐటీ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం వచ్చింది. నెలనెలా వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని బండి కొనుక్కోవడానికి దాచుకునేది. ఇలా జమ చేసిన డబ్బులతో 2021లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌ను కొనుక్కుంది. బండి కొన్న వెంటనే ఉద్యోగం మానేసి రైడింగ్ షురూ చేసింది. ఫస్ట్ రైడ్... ఎన్నాళ్లుగానో వేచిచూస్తోన్న క్షణాలు వచ్చేశాయి. వెంటనే రైడింగ్‌కు ప్రణాళిక రూపొందించుకుంది నూర్. 2021 నవంబర్ 14 తొలి రైడింగ్ గేర్‌ను స్టార్ట్ చేసింది. ఈ రైడ్ గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. బెంగళూరు నుంచి మహారాష్ట్ర, డామన్ డయ్యూ, గుజరాత్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పటికీ మహారాష్ట్రలోని లోనావాలకు చేరుకునేటప్పటికి విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు నూర్. ఐదున్నర అడుగుల ఎత్తున్న నూర్.. హిజాబ్ ధరించి బుల్లెట్ బండి మీద డుగ్గు డుగ్గు అని వెళ్తుంటే ఆమెను అంతా ఆసక్తిగా చూసేవారు. ఆ చూపులు నూర్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. ఈసడింపులు, యాక్సిడెంట్ ఎదురైనప్పటికీ... ప్రపంచం రోజురోజుకీ అప్డేట్ అవుతున్నప్పటికీ కొంతమంది ఇంకా ‘అమ్మాయి ఏంటీ ఇలా చేస్తోంది? ఇదేం విడ్డూరం?’ అని నోరు వెళ్లబెట్టిన వాళ్ల ఈసడింపులు నూర్‌కూ ఎదురయ్యాయి. అయినప్పటికీ రోడ్డు మీద గేర్లు మారుస్తూపోతూనే ఉంది. తన రైడ్‌ను ఎక్కడా ఆపలేదు. ఇదే దూకుడుతో... ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ప్రయాణిస్తూ నేపాల్‌కు వెళ్లాలనుకుంది. బిహార్ సరిహద్దులోకి రాగానే చిన్న యాక్సిడెంట్ జరిగి రైడింగ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు తన మోటర్ సైకిల్‌ను ట్రైన్లో చెన్నై పంపించాల్సిన పరిస్థితి. చాలా బాధ వేసింది. అయినా తప్పలేదు. 2022 మేలో యాక్సిడెంట్ అయితే జూలైలో కోలుకుని బెంగళూరు వచ్చేసింది. ఇంక బండిని అమ్మేయమని అంతా చెప్పారు. అయినప్పటికీ నూర్ రైడింగ్ అపలేదు. జాతీయ రహదారులేగాక అంతర్జాతీయ రహదారులపై రైడింగ్ చేస్తానూ అంటోంది. వచ్చే సంవత్సరం బెంగళూరు నుంచి మక్కా, సౌదీ అరేబియా కూడా వెళ్తానని చెబుతోంది. మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి... ‘‘నేను నోమాడ్ హిజాబీ రైడర్ని. దక్షిణ భారత దేశం నుంచి తొలి సోలోరైడర్ని నేనే అవుతాను. ఉత్తర భారతదేశంలోని గురుద్వారాలు, గుళ్లు, ఆశ్రమవాసులు నా మతం వేరైనప్పటికీ ప్రేమగా భోజన, వసతి సదుపాయాలను కల్పించేవారు. కొన్ని సేఫ్టీరూల్స్ పాటిస్తే తక్కువ బడ్జెట్లో ట్రిప్స్‌ను విజయవంతంగా పూర్తిచేయవచ్చు. సాయంత్రం ఐదు తరువాత ఎటువంటి రైడింగ్ చేయను. తెలియని వ్యక్తులతో అస్సలు మాట్లాడను.పెట్రోల్ బంకులు, ప్రార్థనా స్థలాలు, ఆశ్రమాల్లో రాత్రుళ్లు బస చేస్తూ, ఉదయం రైడింగ్ చేస్తున్నాను. ఈ స్పీడుతో మక్కాను చేరుకుంటాను ’’అని నూర్‌బీ ధీమా వ్యక్తం చేస్తోంది. -
‘థాంక్యూ మోదీజీ’.. కశ్మీర్ యువతి బైక్ రైడ్ వీడియో వైరల్
శ్రీనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ సర్కార్ స్పష్టం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఆర్టికల్ రద్దు అనంతరం, జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక, కశ్మీర్లో ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత శ్రీనగర్‌లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లో ఓ యువతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.. నా కశ్మీర్ అబ్బాయిలకే కాదు.. మనలో కూడా చాలా మారిపోయింది. 370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేసింది. ఇక, ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Today I proudly wanna to say that my #Kashmir has changed a lot not only for the boys but also for Us. It was not possible before abrogation of 370 & 35A. Thank you GOI. pic.twitter.com/5zU9vgUAoL — Nusrat Fatima (@knusrata) August 4, 2023 మరోవైపు.. ఈ వీడియోపై కశ్మీర్ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అని ప్రశ్నించారు. దీంతో, పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు. Action taken under relevant sections of MV Act. Violator also counseled not to repeat such acts. pic.twitter.com/To30U8FaiB — Traffic City Srinagar. (@SSPTFCSGR) August 4, 2023 ఇది కూడా చదవండి: నోర్మూయ్, ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు.. మెట్రోలో లేడీస్ లొళ్లి -
Viral Video: బైక్‌పై పోలీస్ స్టంట్.. షాకిచ్చిన అధికారులు
-
Video: బైక్‌పై లవర్స్ రొమాన్స్.. రహదారిపై హగ్‌లతో రెచ్చిపోయిన జంట
ఈ మధ్య యువత రెచ్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్‌గా ఫీల్ అయిపోయి అసభ్యకర చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తనతో వైరల్‌గా మారి పోలీసులకు దొరికినా కొంతమందిలో మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఘాజియాబాదద్లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై బైక్ మీద విచ్చలవిడి చేష్టలతో కనిపించారు. ఇందిరాపురం సమీపంలోని రద్దీగా ఉండే ఎన్‌హెచ్9 రహదారిపై ప్రమాకరంగా లవర్స్ రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. స్పీడ్‌గా వెళ్తోన్న బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై యువకుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే ఇద్దరూ కనీసం హెల్మెట్ కూడా ధరించలేదు. చదవండి: బావా మరదలు సరదా ఆట! అసలు విషయం తెలియడంతో పెళ్లి క్యాన్సిల్ ఈ ఘటన జూన్ 20 మంగళవారం సాయంత్రం చోటు చేసుకోగా.. దీనిని అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని వీడియో తీశారు. అనంతరం ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పాపులారిటీ కోసం వాహనాలపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారని, బాధ్యత రహితంగా ప్రవర్తించిన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి, పోలీసులను కోరారు. మరోవైపు ఈ ఘటనపై ఘజియాబాద్ కమిషనరేట్ డీసీపీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను పరిశీలించి.. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందిరాపురం ఎస్సైని ఆదేశించారు. #गाजियाबाद में आशिक मिजाज बाइक सवार की वीडियो हुई वायरल इंदिरापुरम के NH 9 का बताया जा रहा है । वो कहते है ना - "हम तो मरेंगे सनम तुम्हे साथ लेके मरेंगे " पर नियम कानून ताक पर रख के ही सफर करेंगे ।@Gzbtrafficpol @uptrafficpolice @sacchayugnews pic.twitter.com/xPmSgzbfmO — Akash Kumar (@Akashkchoudhary) June 20, 2023 ट्विटर से प्राप्त शिकायत का संज्ञान लेते हुए, चालानी कार्यवाही की गई। pic.twitter.com/7HGAhqfkPF — Gzb Traffic police (@Gzbtrafficpol) June 21, 2023 -
బుల్లెట్ బండి నడిపిన వరలక్ష్మి శరత్‌కుమార్.. వీడియో వైరల్
దక్షిణాది హీరోయిన్లలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ది మాత్రం డేరింగ్ అండ్ డైనమిక్ రూట్ అనే చెప్పాలి. అర్ధరాత్రి పోలీసునే చెంపలు వాయించిన రఫ్ బ్యూటీ ఈమె. ఈ విషయాన్ని ఆమె తండ్రి, నటుడు శరత్‌కుమార్‌నే స్వయంగా ఇటీవల ఒక వేదికపై చెప్పారు. ఇక నటిగా వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాది సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు. పాత్ర ఏదైనా ఈమెకు మోల్డ్ అయిపోతారు. పోడా పోడీ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఆ తరువాత తనకు నచ్చినట్లు కాకుండా ప్రేక్షకులు మెచ్చేటట్లు నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో కథానాయకి పాత్రలను అటుంచితే ఛాలెంజింగ్‌తో కూడిన విలనిజం పాత్ర అయితే ఈ విలక్షణ నటిని వెతుక్కుంటూ రావాల్సిందే. ఆ మధ్య సర్కార్ చిత్రంలో అలాంటి పాత్రలోనే విజయ్ను ఢీకొన్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల తెలుగులో వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు పోటీ ఇచ్చారు. ఈమెలో మొండి ధైర్యం కూడా ఉంది. నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సైకిల్ తొక్కడం లాంటి వాటి జోలికి పోలేదట. అయితే ఇప్పుడు ఏకంగా బుల్లెట్ ఎక్కేవారు. సైకిల్ నుంచి స్టెప్ బై స్టెప్ బుల్లెట్ నడపడం వరకు నేర్చేసుకున్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అవుతోంది. దీని గురించి ఆమె పేర్కొంటూ బాల్యంలో కొన్ని కారణాల వల్ల తనకు బైక్ తోలడానికి ఇంట్లో అనుమతి ఇవ్వలేదన్నారు. అయితే బైక్ నడపడానికి భయాన్ని పోగొట్టడానికి ఇది సరైన టైమ్ అని భావించానన్నారు. దీంతో గత వారం బైక్ నడపడానికి తొలి మెట్టు అయిన సైకిల్ తొక్కడం నేర్చుకున్నానని, ఆ తరువాత స్క్రూటీ, ఇప్పుడు బుల్లెట్ కూడా నడుపుతున్నానని చెప్పారు. మొదట్లో కొంచెం కష్టం, బాధ అనిపించినా, భయాన్ని పోగొట్టడానికి ఇదంతా చేసినట్లు చెప్పారు. ఇక్కడ తాను కింద పడ్డాను అన్నది ముఖ్యం కాదని ఎలా లెగిశాను అన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో.. కేసుపై పోలీసుల తంట..!
రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో రెండు పోలీసు స్టేషన్ల మధ్య గొడవ తెచ్చిపెట్టింది. ఆ ఘటన తమ పరిధిలోది కాదంటే తమది కాదంటూ కొట్టిపారేస్తున్నారు పోలీసు అధికారులు. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది? ఎందుకు అది వివాదాస్పదమైందంటే..? వీడియోలో బ్రిడ్జ్‌పై ఓ జంట బైక్‌పై వెళుతోంది. అబ్బాయి బైక్ నడుపుతుండగా.. అతనికి ముందుభాగంలో వ్యతిరేక దిశలో హత్తుకుని కూర్చుంది అమ్మాయి. తేదీ వివరాలు లేని ఈ వీడియో నిరాలనగర్ ఫ్లై ఓవర్‌పై జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపించట్లేదు. ముఖాల ఆధారంగా నిందితులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ఘటన తమ పరిధిలోది కాదని అలీగంజ్, గోమతీ నగర్ పోలీసు స్టేషన్ అధికారులు విభేదించుకుంటున్నారు. గోమతీ నగర్‌కు సమీపంలో ఘటన జరిగినట్లు తెలుస్తోందని అలీగంజ్ స్టేషన్ అధికారి నగేష్ కుమార్ ఉపాధ్యాయ అన్నారు. వీడియోలో కనిపించిన బ్రిడ్జ్ గోమతీ నగర్‌కు సమీపంలోనిది కాదని, అక్కడ వీడియోలు రికార్డ్ చేసే అవకాశమే లేదని స్థానిక స్టేషన్ అధికారి కొట్టిపారేస్తున్నారు. కాగా ఇలాంటి వీడియోనే కొన్ని రోజుల క్రితం హజ్రత్ గంజ్ ప్రాంతంలో జరిగింది. నిందితులను కూడా గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. -
ఒక్క బైక్‌పై ఐదుగురు యువకులు.. ఇదేం సరదా.. దిమాక్ ఉందా..?
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో కొందరు యువకులు అత్యంత ప్రమాదకర విన్యాసం చేశారు. ఒక్క బైక్‌పై ఏకంగా ఐదుగురు ప్రయాణించారు. రాత్రి వేళలో రద్దీగా ఉన్న రోడ్డుపై రయ్ రయ్‌మంటూ ఈ బైక్ వేగంగా దూసుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బైక్ నడిపిన యువకుడితో మిగతా నలుగురిలో ఏ ఒక్కరూ కూడా కనీసం హెల్మెట్ ధరించలేదు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు వీరి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్‌పై ముగ్గురు ఎక్కితేనే ప్రమాదాల బారినపడుతుంటారు, అలాంటిది ఐదుగురు ఎలా ఎక్కారు? అని పలువురు మండిపడ్డారు. शौक़....मनमानी....मजबूरी या फिर जान पर खेलने की आदत....एक बाइक पर फर्राटा भरते 5 युवक....!!#viralvideo राजधानी लखनऊ का।#himanshutripathi @Uppolice @lkopolice @uptrafficpolice @dcptrafficlko pic.twitter.com/m6rLT9VQhc — Himanshu Tripathi (@himansulive) April 9, 2023 ఈ వయసులో సరదా పనులు చేయచ్చు కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ప్రమాదకర విన్యాసాలు చేయడం ఏంటి? మైండ్ ఏమైనా దొబ్బిందా? అని మరికొందరు ఫైర్ అయ్యారు. పొరపాటున ఎదైనా జరిగితే మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి అని ఆలోచించారా? అని మరికొందరు వీరిని ప్రశ్నించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ ఘటనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ఇలాంటి దుస్సాహసాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు.. నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్.. -
నడిరోడ్డుపై రెచ్చిపోయిన లవ్ బర్డ్స్.. బెడిసి కొట్టి..
లక్నో: సోషల్ మీడియాలో అడ్డదిడ్డమైన పోస్టులతో రెచ్చిపోతోంది ఇప్పటి యువత. లైకులు, షేర్ల కోసం ఇష్టానుసారం అప్ లోడ్ చేస్తోంది. అయితే ఫేమ్ అవ్వడం మాటేమోగానీ.. విమర్శలు ఎదుర్కోవడం పరిపాటిగా మారుతోంది. తాజాగా ఏపీ వైజాగ్‌లో ఘటన మర్చిపోకముందే.. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే.. లవర్ అడిగింది రైడ్‌కు తీసుకెళ్లాడట ఓ వ్యక్తి. కానీ, వాళ్లు అక్కడితోనే ఆగలేదు. రెచ్చిపోయారు.. బండి మీద వెళ్తూ.. కౌగిలింతలు, ముద్దులు అంతకు మించి అసభ్య చేష్టలకు పాల్పడింది ఓ ప్రేమ జంట. యూపీ లక్నో హజరత్గంజ్లో జరిగిన ఈ ఘటన.. సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. దారినపోయే కొందరు ఆ వీడియో తీసి ఇంటర్నెట్లో వదిలారు. ఇంకేం.. అడ్డూ అదుపు లేకుండా వైరల్ అయ్యిందా వీడియో. ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాదు.. కాస్త చిరాకు తెప్పించింది ఆ వీడియో. వీడియో ఆధారంగా ఆ బండిని ట్రేస్ చేసిన లక్నో పోలీసులు.. బండి ఓనర్, ఆ వీడియోలోని వ్యక్తి అయిన విక్కీ శర్మను అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, అసభ్య చేష్టలకుగానూ బండిని సీజ్ చేసి.. యువకుడిపై ఐపీసీ సెక్షన్ 294, 279 కింద కేసులు నమోదు చేశారు. ఇక వీడియోలో ఉంది మైనర్ కావడంతో.. ఆ అమ్మాయిని తల్లిదండ్రుల సమక్షంలో వార్నింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు. వీడియోల కోసం క్లిక్ చేయండి -
పిల్ల అడిగిందని రైడ్‌కు తీసుకుపోవడం తప్పు కాదు. కానీ, అతి చేష్టలకు పాల్పడితేనే..
-
జోడో యాత్రలో రాహుల్ బైక్ రైడ్.. వీడియో వైరల్
కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ మధ్యప్రదేశ్‌లో బైక్ రైడ్‌తో సందడి చేశారు. ఈ మేరకు ఆయన హెల్మట్ ధరించి భద్రతా సిబ్బంది నడుమ బ్లూ కార్పెట్‌పై బైక్‌తో రైడ్ చేశారు. అంతకు ముందు రాహుల్ గాంధీ జంతు సంరక్షణ గురించి చర్చించాలనుకున్నఇద్దరు రైడర్లు రజత్ పరాశర్, సార్థక్‌లను కలిశారు. ఈ క్రమంలో ఒక రైడర్ మాట్లాడుతూ...రాహుల్‌గాంధీ అద్భుతమైన వ్యక్తి, అతనిని కలిసినప్పటి నుంచి అతనిపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. ఆయన జంతు ప్రేమికుడు అని తెలుసు. అందువల్లే రాహుల్‌ని కలిసి రోడ్లపై జంతు మరణాలపై చర్చించాలనుకుంటున్నాను అని గాల్వియర్‌కి చెందిన సివిల్ ఇంజనీర్ రజత్ అన్నారు. రజత్ వీధి కుక్కల సంరక్షణ భాద్యతను చేపట్టిన జంతు ప్రేమికుడు. ఈ జోడో యాత్రలో 10 నెలల జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన మార్వెల్ అనే కుక్క కూడా రాహుల్‌తో కలిసి పాల్గొని సందడి చేసింది. రాహుల్ కూడా సదరు జంతుకు ప్రేమికులని, ఆ కుక్కను తన యాత్రలో పాల్గోనమంటూ ఆహ్వానించారు. తన మార్కెల్‌కు ఈ యాత్ర కోసం శిక్షణ ఇచ్చానని, అది తన బైక్ వెనుక సీటులో ఊయల మాదిరిగా సెటప్ చేసిన దాంట్లో సౌకర్యవంతంగా కూర్చొని ఈ యాత్రలో పాల్గొంటుందని చెప్పారు జంతు ప్రేమికుడు రజత్. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ నేతృత్వంలో సుమారు 3500 కి.మీ పాదయాత్ర సెప్టెంబర్‌లో తమిళనాడు నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది దాదాపుగా సగం యాత్ర పూర్తిచేసుకోవడమే గాక ఈ యాత్ర జనవరిలో ముగియనుంది. Watch: Rahul Gandhi's Bike Ride During #BharatJodoYatra In Madhya Pradesh https://t.co/q3qbFKbWh2 pic.twitter.com/yivEsNICea— NDTV (@ndtv) November 27, 2022 (చదవండి: బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్) -
షాకింగ్ వీడియో: ఒకే బైక్‌పై ఏడుగురు ప్రయాణం
ద్విచక్రవాహనంపై ఇద్దరు వెళ్లేందుకే అనుమతి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ముగ్గురు వెళ్తారు. బైక్ ముగ్గురు కూర్చుంటేనే కష్టంగా ఉంటుంది.. ఏకంగా ఏడుగురు ప్రయాణిస్తే..! ఆలోచిస్తే.. అసాధ్యం అనుంకుటున్నారు కదా? అయితే ఒకే బైక్‌పై ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు(నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి) వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాటల్లేవ్.. అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన బైక్‌పై ముందు ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకోగా.. వెనకాల ఇద్దరు మహిళలు కూర్చున్నారు. వారి ఒడిలో ఇద్దరు పిల్లలను పట్టుకున్నారు. కుటుంబం మొత్తాన్ని ఒకే బైక్‌పై తీసుకెళ్లి ఔరా అనిపించాడు ఆ వ్యక్తి. అయితే, బైక్‌పై ఉన్న ఏ ఒక్కరికీ హెల్మెట్ లేకపోవటం గమనార్హం. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.2 మిలయన్ల మంది చూశారు. ఈ విధంగా ప్రయాణించి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు సరైన రవాణా సౌకర్యం లేకపోవటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందేమోనని మద్దతు తెలుపుతున్నారు. ఏడుగురిని ఒకే బైక్‌పై తీసుకెళ్లిన వ్యక్తిని అరెస్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. Speechless 😶 pic.twitter.com/O86UZTn4at — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022 ఇదీ చదవండి: Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు.. -
లండన్ నుంచి కావేరి వరకూ 30 వేల కిలోమీటర్ల బైక్‌యాత్ర
‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలు తిరిగాను. మన దేశంలో గుజరాత్ నుంచి ఏపీ వరకూ వచ్చాను. తొమ్మిది దేశాలు, ఆరు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఏపీ ప్రభుత్వం మట్టి రక్షణకు కట్టుబడి ఉంది. సీఎం వైఎస్ జగన్ దీనిపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు. దావోస్‌లో నేను ఆయనతో చర్చించాను. ఆయన పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వంతో కలిసి ఏపీలో మట్టిరక్షణకు ముందడుగు వేస్తున్నాం. దీనికి అవసరమైన నిధులను వెచ్చించడానికి సిద్ధం’.. అని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో భాగంగా లండన్ నుంచి కావేరి ప్రాంతం వరకూ 30 వేల కిలోమీటర్లు బైక్‌యాత్రను చేస్తున్న సద్గురు కర్నూలుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. – సాక్షి ప్రతినిధి, కర్నూలు సాక్షి : ‘సేవ్ సాయిల్’ యాత్రకు ఎలాంటి స్పందన వస్తోంది? సద్గురు : ఇప్పటిదాకా ప్రతీ దేశం నుండి అద్భుత స్పందన వస్తోంది. నాలుగు నెలల కిందట వరకూ మట్టిపై ప్రస్తావనే లేదు. కానీ, ఇప్పుడు ప్రతీచోట ‘సాయిల్’ అనే పదం ప్రతిధ్వనిస్తోంది. తొమ్మిది దేశాలు మట్టిని రక్షించే ఉద్యమంలో అవగాహన ఒప్పందాలు చేశాయి. ఇప్పటికే 74 దేశాలు మట్టిని రక్షించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. సాక్షి : ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాన్ని ఆశిస్తున్నారు? సద్గురు : ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించాం. ఇప్పటికే మా ప్రధాన సలహాదారు మాజీ యూఎన్ఈపీ డైరెక్టర్ ఎరిక్సోల్హైమ్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సీఎంతో నేను మాట్లాడాను. ఆయన సుముఖంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి చాలా చర్యలు తీసుకోవడం మంచి విషయం. ఇది మరింత వేగంగా జరిగేందుకు ప్రోత్సాహకాలు అందించాలి. సాక్షి : ఏపీలో మాదిరిగా వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక చర్యలపై దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను చైతన్యంచేస్తే బాగుంటుంది కదా? సద్గురు : ఏపీ ప్రభుత్వం చర్యలను తెలుసుకున్నా. సీఎం వైఎస్ జగన్‌తో దావోస్‌లో భేటీ అయ్యా. ఈషా ఫౌండేషన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సాధారణ వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థం కనీసం 3–6శాతం మధ్య ఉండాలి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అది 1 శాతం కంటే తక్కువగా ఉంది. కచ్చితంగా 3–6 శాతం ఉండేలా ప్రభుత్వ పాలసీలలో పొందుపరచాలి. సాక్షి : భావితరాలకు వ్యవసాయంపై ఆసక్తిలేదు. వ్యవసాయ భూములను విక్రయించి ఇతర ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో వ్యవసాయ భూమి ‘రియల్ ఎస్టేట్’ ఉచ్చులో విలవిలలాడిపోతోంది? పరిష్కారం ఏంటంటారు? సద్గురు : మనం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి తీరాలి. అందుకు ప్రోత్సాహకాలు అందించాలి. లేకపోతే తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటాం. ప్రోత్సాహకాలతో రాబోయే 6–8 ఏళ్లలో మట్టిలో కనీసం 3 శాతం సేంద్రియ పదార్థం పెంపొందే దిశగా మనం అడుగులు వేయొచ్చు. సాక్షి : మీ 30వేల కిలోమీటర్ల ప్రయాణంలో మట్టిని రక్షించే చర్యలు ఏ దేశంలో సంతృప్తికరంగా ఉన్నాయి? మన దేశంలో ఏ రాష్ట్రంలో పరిస్థితి? సద్గురు : 2015లో ఫ్రాన్సు ‘4 ఫర్ 1000’ అనే కార్యాన్ని నిర్వహించింది. ఇది ‘మట్టిని రక్షించు’ పాలసీలా ఉంది. కానీ, వాళ్లు మట్టిని ఇతర సమస్యలతో ముడిపెట్టారు. దాంతో ఏడేళ్లు గడిచినా వారు దాన్ని అమలుచేయలేకపోయారు. (క్లిక్: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!) సాక్షి : ‘సేవ్ సాయిల్’ ఉద్యమం భవిష్యత్‌లో ఎలా ఉండబోతోంది? సద్గురు : ఈ ఉద్యమం ప్రజలు స్పందించడం కోసమే. మేం 25–30 శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటుచేస్తున్నాం. వీరు మట్టి పునరుద్ధరణపై సహకారం అందిస్తారు. సాక్షి : ఈ ఉద్యమంలో ప్రభుత్వాలు, ప్రజల బాధ్యత ఏంటి? సద్గురు : మట్టి అనేది భూమి మీది జీవనానికి ఆయువుపట్టు. దురదృష్టవశాత్తు అదిప్పుడు చేజారిపోతోంది. అందరూ మట్టిపై మాట్లాడాలి. స్వచ్ఛమైన నీటికి, స్వచ్ఛమైన గాలికి, మన జీవితాలకి ఆధారం ఆ మట్టే! మట్టి నాణ్యతను సంరక్షించడమే మన పిల్లలకు మనం అందించే గొప్ప వారసత్వం. (క్లిక్: కర్నూలులో జగ్గీ వాసుదేవ్.. ఫొటోగ్యాలరీ) -
బైక్ వెనుక కూర్చొని హెల్మెట్ పెట్టుకోవడం లేదా? ఈ వార్త మీకోసమే!
సాక్షి, ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలని ముంబై ట్రాఫిక్ పోలీసు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో రూ.500 జరిమాన వసూలు చేస్తారు. లేదంటే మూడు నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అందుకు సంబంధించిన అధికారిక సర్క్యూలర్ ముంబై ట్రాఫిక్ పోలీసు శాఖ జారీ చేసింది. అయితే వెనక సీట్లో కూర్చున్న హెల్మెట్ ధరించని వారికి 15 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం పోలీసులు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత పట్టుబడితే బైక్ నడిపే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతోపాటు, జరిమాన వసూలు చేస్తామని హెచ్చరించారు. దీంతో బైక్ నడిపేవారు లేదా యజమానులు ఇప్పటినుంచే అదనంగా ఒక హెల్మెట్ కొనుగోలు చేసుకుని ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. యథేచ్ఛగా నియమాల ఉల్లంఘన కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం 2020 మార్చిలో అమలుచేసిన లాక్డౌన్ వల్ల అనేకమంది వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు పాటించడం మానేశారు. హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపడం, ట్రిపుల్ సీటు డ్రైవింగ్, నో ఎంట్రీ, రాంగ్ రూట్లో వాహనాలు తోలడం, సిగ్నల్స్ జంప్ చేయడం లాంటి అనేక ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షల్ని ఎత్తివేసినప్పటికీ వాహన చోదకులు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు. ఇప్పటికీ హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపటం, సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ సైడ్‌లో వెళ్లడం లాంటి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా బైక్‌లకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నడిపేవారితోపాటు వెనక కూర్చున్న వారికి కూడా తలకు హెల్మెట్ లేకపోవడంవల్ల ప్రాణనష్టం అధికంగా జరుగుతోంది. దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నియమాలు 1988, సెక్షన్ 126, 194–డి ప్రకారం తలకు హెల్మెట్ లేని ద్విచక్ర వాహన చోదకులకు రూ.500 జరిమాన, అలాగే మూడు నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే నియమాలున్నాయి. ఇప్పుడు ఈ నియమాలను అమలు చేయనున్నారు. చదవండి: జ్ఞానవాపి మసీదు కేసు: విచారణ సోమవారానికి వాయిదా దీంతో ఇకనుంచి బైక్ నడిపే వారితోపాటు వెనక సీట్లో కూర్చునే వారు కూడా కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. అందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ముంబై ట్రాఫిక్ పోలీసు శాఖ జారీ చేసిన ఉత్తర్వులో హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని ఇతర ప్ర«ధాన నగరాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో ముంబై అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలను, ప్రాణ నష్టాన్ని నివారించే ప్రయత్నంలో ఉన్నారు. -
50 రోజుల పాటు ఒంటరిగా బైక్ రైడ్.. ఎవరీ అంబికా క్రిష్టన్..?
కోచి(కేరళ)కు చెందిన అంబికా క్రిష్టన్ భర్త శివరాజ్ చనిపోయాడు. అప్పుడు ఆమె వయసు పందొమ్మిది సంవత్సరాలు. మూడు నెలల పసిపాప. ఒక్కసారిగా తనను చీకటి కమ్మేసినట్లుగా అనిపించింది. ఎంత మరిచిపోదామన్నా భర్త జ్ఞాపకాలు తనను విపరీతంగా బాధిస్తున్నాయి. ఒకానొక దశలో అయితే... ‘అసలు నేను బతకడం అవసరమా?’ అనుకుంది. ఆ సమయంలో పాప తనవైపు చూస్తుంది. వెంటనే నిర్ణయాన్ని మార్చుకుంది... పాప కోసమైనా బతకాలని! బికామ్ డిగ్రీ పూర్తిచేసింది. సాయంత్రాలు కంప్యూటర్క్లాస్లకు వెళ్లేది. తాను కాలేజికి వెళ్లే రోజుల్లో స్నేహితులు, ఇంటిపక్క వాళ్లు పాపను చూసుకునేవారు. ఒక సంస్థలో తనకు ఎకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఎంత ఆత్మవిశ్వాసం వచ్చిందో! ఆ తరువాత ఆకాశవాణి రెయిన్బో 107.5లో పార్ట్–టైమ్ జాబ్‌లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ తనలోని సృజనాత్మకతకు పనిచెప్పే అవకాశం లభించింది. ఎంతోమందిని ఇంటర్యూ్య చేసింది. అవి కాలక్షేపం ఇంటర్వ్యూలు కావు...పదిమందికి స్ఫూర్తి పంచే ఇంటర్య్వూలు. ఈ ఉద్యోగం తనకు నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడే నైపుణ్యాన్ని ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక బాధ్యతను నేర్పింది. ఆకాశవాణి రెయిన్బోలో ఉత్తమ ఆర్జేగా పేరు తెచ్చుకున్న అంబికా ఇప్పుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోలోగా ఆల్ ఇండియా బైక్ రైడ్ చేస్తుంది. 50 రోజుల పాటు సాగే ఈ రైడ్ దేశవ్యాప్తంగా ఉన్న 25 రెయిన్బో స్టేషన్లను కనెక్ట్ చేస్తూ సాగుతుంది. ఈ బైక్ యాత్రలో భర్తను కోల్పోయిన సైనికుల భార్యలను కలుసుకుంటుంది. వీరులకు నివాళి అర్పిస్తుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళలతో మాట్లాడుతుంది. వారు మానసికంగా ఒంటరి ప్రపంచంలో ఉంటే...తన జీవితాన్నే ఉదాహరణగా చెప్పి ధైర్యం చెబుతుంది. వారికి తన పరిధిలో చేతనైన సహాయం చేస్తుంది. ఒకప్పుడు ఏ పాప ముఖం చూసి అయితే తాను కచ్చితంగా బతకాలని నిర్ణయించుకుందో...ఆ పాప ఆర్యా ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో మంచి ఉద్యోగం చేస్తోంది. ‘50 రోజుల పాటు ఒంటరిగా బైక్ రైడా! ఎందుకొచ్చిన రిస్క్’ అన్నారు కొద్దిమంది స్నేహితులు. ‘రిస్క్’ అనుకుంటే అక్కడే ఆగిపోతాం. ఆ ఆలోచనను బ్రేక్ చేస్తేనే ముందుకు వెళ్లగలమనే విషయం ఆమెకు తెలియందేమీ కాదు. భర్త చనిపోయిన తరువాత... ‘నీ జీవితం రిస్క్‌లో పడింది. ఎలా నెట్టుకొస్తావో ఏమో’ అనేవారు కొందరు. నిజమే అనుకొని తాను ఆ నిరాశపూరిత భావన దగ్గరే నిస్సహాయకంగా ఉండి ఉంటే ఏమై ఉండేదోగానీ...ముందుకు కదిలింది. చిన్నా చితాక ఉద్యోగాలు చేసింది. సొంతకాళ్ల మీద నిలబడింది. బిడ్డను బాగా చదివించింది. అంబికా యాత్ర వృథా పోదు. ప్రతి ఊరికి తమవైన స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. వాటిని సేకరిస్తూ, పంచుతూ వెళ్లడం ఎంత గొప్పపని! -
Karnataka Lovers Arrest: న్యూసెన్స్ ప్రియుడు అరెస్టు
యశవంతపుర (కర్ణాటక): హద్దులు మీరి బైకుపై ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించిన యువకుడు కటకటాలు లెక్కబెడుతున్నారు. ఆ వీర ప్రేమికున్ని చాజరాజనగర పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లుపేట–చాజరాజనగర మార్గంలో బైకు నంబర్ ఆధారంగా బైకిస్టు ఎస్సి స్వామిని అరెస్ట్ చేశారు. ప్రియురాలితో ముద్దులు పెట్టుకుంటూ బైక్‌పై దూసుకెళ్లిన దృశ్యాలు వైరల్ కావడం తెలిసిందే. దీంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్, న్యూసెన్స్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. చదవండి: (Lovers Hulchul: బైక్‌పై లవర్స్ హల్చల్.. వీడియో వైరల్) -
Lovers Hulchul: బైక్‌పై లవర్స్ హల్చల్
Lovers Hulchul: ప్రేమ జంట నడిరోడ్డుపై రెచ్చిపోయి హల్చల్ చేసింది. బైక్‌పై రైడ్ చేస్తుండగా ఒకరినొకరు హత్తుకుని రోడ్డుపై హంగామా చేశారు. దీంతో రోడ్డుమీద వెళ్లే వాళ్లు వారిని చూసి ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వీరి హల్చల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ప్రేమ పక్షులు తాము రోడ్డుపై ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి.. ఎదురుగా వచ్చే వాహనాలేవీ తమకేవీ అడ్డుకావన్నట్టుగా నడిరోడ్డుపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ప్రియురాలిని కూర్చోపెట్టుకుని ప్రియుడి రెచ్చిపోయాడు. వీరి రైడ్‌ను వారి వెనకాలే వస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇది చదవండి: బెడ్రూమ్లో పక్కింటి వ్యక్తితో భార్య అలా చేస్తూ.. ఆ తర్వాత.. -
శౌర్య యాత్ర.. 40 మంది మహిళలా సైనికులు, ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు..!
నిత్య ఉత్తేజం చే గువేరా ‘మోటర్ సైకిల్ డైరీస్’లో ఒక మాట... ‘ప్రపంచం నిన్ను మార్చే అవకాశం ఇవ్వు. ఆ తరువాత ఈ ప్రపంచాన్ని మార్చే దిశగా ప్రయాణిస్తావు’ ప్రయాణం అనేది పైకి భౌగోళిక అంశాలకు సంబంధించిన విషయంగా కనిపించినప్పటికీ, సూక్ష్మదృష్టితో చూస్తే... అది మనలోకి మనం ప్రయాణించడం. ప్రయాణ క్రమంలో కొత్త విషయాలను నేర్చుకోవడం. మన దగ్గర ఉన్న విషయాలను పంచుతూ వెళ్లడం. రక్తం గడ్డ కట్టే చలిలో జమ్మూ అంతర్జాతీయ సరిహద్దుల్లో డేగకళ్లతో కాపుకాసి, ఉగ్రవాదులకు, అక్రమ చొరబాటుదారులకు చెక్ పెట్టిన మహిళా సైనికుల ధీరత్వం ఇప్పటికీ తాజాగానే ఉంటుంది. ఎర్రటి ఎండల్లో, నాలుక పిడచకట్టుకుపోయే భయానక వేడిలో రాజస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన మహిళా సైనికుల అంకితభావం ఎప్పటికీ గుర్తుంటుంది. విధినిర్వహణలో కాలప్రతికూలతలు, భౌగోళిక ప్రతికూలతలను అధిగమించి ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి విధి అయిన నిర్వహించగలం’ అని నిరూపించారు బీఎస్ఎఫ్ మహిళా సైనికులు. రాజస్థాన్‌కు చెందిన తనుశ్రీ ప్రతీక్ బీఎస్ఎఫ్ చరిత్రలో ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఆఫీసర్‌గా నియామకం అయినప్పడు అది ఒక విశేషం మాత్రమే కాదు, ఎంతోమంది మహిళలకు విశిష్టమైన ఉత్తేజాన్ని అందించింది. మొన్నటి దిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో బీఎస్ఎఫ్ మహిళా దళం ‘సీమ భవాని’ చేసిన అపురూప సాహసిక విన్యాసాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అయితే ఇవేమీ జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోవడం లేదు. ఒక కొత్తదారికి ఊతం ఇవ్వబోతున్నాయి. తాజా విషయానికి వస్తే.. బీఎస్ఎఫ్కు చెందిన నలభైమంది మహిళా సైనికులు దిల్లీ నుంచి కన్యాకుమారి వరకు బైక్ యాత్ర చేపట్టారు. 5,280 కి.మీ ఈ యాత్రకు ‘సీమా భవాని శౌర్య ఎంపవర్మెంట్ రైడ్–2022’ అని నామకరణం చేశారు. అటు అమృత్సర్ నుంచి ఇటు చెన్నై, హైదరాబాద్, అనంతపురం, బెంగుళూరు వరకు స్త్రీ సాధికారికతకు సంబంధించిన ఘట్టాలను పంచుకుంటూ, సానుకూల దృక్పథాన్ని రేకెత్తించడమే ఈ యాత్ర లక్ష్యం. యాత్రలో భాగంగా బృంద సభ్యులు పాఠాశాల, కాలేజీ విద్యార్థులు, ఎన్సీసీ వాలెంటీర్లు, బైక్‌రైడర్స్... మొదలైన వారితో సమావేశం అవుతారు. దిల్లీకి సమీపంలోని ఒక పాఠశాల విద్యార్థులతో సమావేశం అయినప్పుడు... మొన్నటి రిపబ్లిక్‌డే వేడుకల్లో సీమభవాని బృందం చేసిన సాహసకృత్యాలను గుర్తు చేసుకుంది ఒక చిన్నారి. తాను కూడా అలా చేయాలనుకుంటుదట! ‘నువ్వు కచ్చితంగా చేయగలవు’ అని చెప్పినప్పుడు ఆ పాప ముఖం ఎంత సంతోషంతో వెలిగిపోయిందో! మరోచోట ఒక కాలేజీ విద్యార్థిని ‘బీఎస్ఎఫ్లో చేరాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఏం చదవాలి?’... మొదలైన విషయాలను అడిగింది. ఆ అమ్మాయికి అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది రైడర్స్ గ్రూప్. దూరాలను అధిగమించడమే కాదు... దూరాలను తగ్గించడం కూడా ఈ యాత్ర లక్ష్యం. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలపై రాజసంగా కనిపిస్తున్న సీమ భవానీ శక్తులను ఒక్కసారి చూడండి... ఎంత ఉత్తేజకరమైన దృశ్యమో! -
బామ్మ బైక్ రైడ్ వండర్.. 7 కోట్లపైగా వ్యూస్.!
వెబ్ డెస్క్: మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో సదరా ఉంటుంది. కొన్ని వెంటనే తీరవచ్చు.. మరికొన్నింటికి కొంత సమయం పట్టొచ్చు. ఓ వందేళ్లు దగ్గర పడిన బామ్మ బైక్ రైడ్ చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా యమహా R15 అయితే.. ఆ స్టైల్ అదిరిపోతుంది కదా.. తాగాజా ఓ వృద్ధురాలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. బామ్మను చూస్తే ఓ వందేళ్లకు దగ్గర వయసు అనిపిస్తుంది. కానీ స్టైల్‌గా యమహా R15 బైక్‌పై కూర్చుని రైడ్ చేసి ఆశ్చర్యపరిచింది. అంతేకాదండోయ్.. బామ్మ బోసి నవ్వుతో.. రైడ్‌కు మరింత అందం చేకూరింది. ఈ వీడియోను శుభం_5 ఎక్స్ అనే ఇన్‌స్టా యూజర్ పోస్ట్ చేయగా.. 7.8 కోట్ల మంది నెటిజనులు వీక్షించగా.. లక్షల మంది లైక్ కొట్టి కామెంట్ చేస్తున్నారు. ‘‘వావ్ దాది అమ్మ. వందేళ్ల బామ్మ.. వండర్ఫుల్ బైక్ రైడ్ అదిరింది.’’ ‘‘బామ్మ బైక్ నడపడం లేదు. కింద నుంచి ఎవరో తోస్తున్నారు.’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ చిత్రీకరించారో.. తెలియదు కానీ.. బామ్మ బైక్ రైడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by @__shubham__5x -
హైదరాబాద్ నుంచి కశ్మీర్ వరకు కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ ఫై యాత్ర
-
బైక్‌పై భారీయాత్రకు సిద్ధమైన స్టార్ హీరో!
నటుడు అజిత్ ఇటీవల తన రాబోయే తమిళ చిత్రం వాలిమై యొక్క హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తీ చేసాడు. తర్వాత తుది షెడ్యూల్ కోసం "వాలిమై" చిత్ర బృందం మొరాకోకు వెళ్లనున్నారు. ఈ గ్యాప్ లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భారీ బైక్ యాత్రకు సిద్దమయ్యాడు. హీరో అజిత్‌కు బైక్‌లు, రేసింగ్ అంటే ఎంత పిచ్చో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వీలైనంత వరకు తను బైక్ ప్రయాణాల వైపే అజిత్ మొగ్గు చూపుతాడు. ఆ మధ్య తాను షూటింగ్ పూర్తీ అయ్యాక తిరుగు ప్రయాణంలో బైక్ మీద హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరిన సంగతి మనకు తెలిసిందే.(చదవండి: అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా?) తాజాగా ఇప్పుడు అజిత్ చెన్నై నుంచి సిక్కింకు(2400కి.మీ) బైక్‌పై వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నెలాఖరుకు చెన్నై తిరిగి రానున్నాడు. సోలోగా 4500 కి.మీ బైక్ యాత్ర చేయాలని అజిత్ ప్లాన్ చేసుకున్నారు. ఈ రోడ్ ట్రిప్‌లో వారణాసి దగ్గర ఒక అభిమానితో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీక్ అయిన చిత్రంలో అజిత్ బిఎండబ్ల్యూ బైక్ నడుపుతూ శీతాకాలపు బట్టలు ధరించి కనిపించాడు. ఈ పర్యటన నుండి తిరిగి వచ్చిన తరువాత అతను "వాలిమై" తుది షెడ్యూల్ కోసం మొరాకోకు వెళ్లనున్నారు. చిత్రంలో అజిత్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా, ఇందులో కథనాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుంది. టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు. -
పట్టరాని సంతోషంలో ఇద్దరు హీరోయిన్లు!
అందరికీ కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలు నెరవేరితే ఆనందంతో ముఖం కళకళలాడిపోతుంది. ఇప్పుడు హీరోయిన్లు కృతీ సనన్, శ్రద్ధా శ్రీనాథ్ కూడా పట్టరాని సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్లిద్దరూ తమ కల నెరవేర్చుకున్నారు. నాజూకు సుందరి కృతీకి ఎప్పటినుంచో బైక్ నడపాలని కోరిక. బైక్ బరువైనా మోయగలుగుతావా? అని స్నేహితులు సరదాగా అంటే, ‘మీరే చూద్దురుగానీ’ అన్నారామె. అనడమే కాదు.. నేర్చేసుకుని రయ్ రయ్‌మంటూ ద్విచక్ర వాహనాన్ని నడిపేశారు కూడా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘బచ్చన్ పాండే’లో నటిస్తున్నారు కృతీ సనన్. ఈ షూటింగ్ లొకేషన్లో కాస్త గ్యాప్ దొరకడంతో బైక్ నడిపారు. ‘ఇంతకీ బైక్ ఎప్పుడు నేర్చుకున్నావ్?’ అని ఓ ఫ్రెండ్ అడిగితే ‘ఇవాళే మొదలుపెట్టాను. నేర్చేసుకున్నాను’ అన్నారు కృతీ సనన్. దీన్నిబట్టి ఈ బ్యూటీ ఎంత త్వరగా నేర్చేసుకున్నారో ఊహించవచ్చు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ విషయానికి వద్దాం. విహార యాత్రలకు వెళ్లినప్పుడు కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు... ఉపయోగపడేది ఏదైనా చేయాలనుకుంటారు శ్రద్ధా. హాలిడే కోసం ఇటీవల ఓ రిసార్ట్‌కి వెళ్లారామె. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నారు. ‘ఎప్పటినుంచో ఓ కుండ తయారు చేయాలనుకున్నా. ఇదిగో చేసేశా’ అంటూ ఫొటో షేర్ చేశారు శ్రద్ధా శ్రీనాథ్. బైక్ నడిపినందుకు కృతీకి, కుండ తయారు చేసినందుకు శ్రద్ధాకి బోలెడన్ని ప్రశంసలు లభించాయి. (చదవండి: కాలి నడకన తిరుపతి కొండెక్కిన యంగ్ హీరో) -
‘అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయి’
సాక్షి, కర్నూలు : వాలంటరీ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ఊరు ఊరు తిరిగి తెలుసుకొనేందుకు వైఎస్సార్ ఆశయ సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్ బైక్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి, పేదల డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య, వైఎస్సార్ ఆశయ సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉదయగిరి మహమ్మద్ షరీఫ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ('విశాఖ చరిత్రలో ఆ కుటుంబానికి ఓ పేజీ') ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. స్వలాభం కోసం చంద్రబాబు పని చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని, ఇదే ఆచరణకు సిద్ధమౌతున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ షేరిఫ్ చేపట్టిన యాత్రకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు తెలియజేసే విధంగా ఈ ప్రచార యాత్ర ముందుకు సాగాలని సూచించారు. (ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్ ) ప్రజా సంక్షేమ పథకాలను ఊరు ఊరు తిరిగి తెలుసుకొనేందుకు మహ్మద్ షరీఫ్ బైక్ యాత్ర చేపట్టడం సంతోషంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. ఆయనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభినందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని హామీలను అమలు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని, ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారని పేర్కొన్నారు.