వైరల్‌.. జీవాతో ధోని బైక్‌ రైడ్‌ | MS Dhoni Takes Daughter Ziva For A Bike Ride | Sakshi
Sakshi News home page

వైరల్‌.. జీవాతో ధోని బైక్‌ రైడ్‌

Published Mon, Apr 27 2020 1:20 PM | Last Updated on Mon, Apr 27 2020 2:00 PM

MS Dhoni Takes Daughter Ziva For A Bike Ride - Sakshi

కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ విధించడంతో సామాన్యులతో పాటుగా సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సమయాన్ని సెలబ్రిటీలు వారి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపటానికి ఉపయోగిస్తున్నారు. అందుకు సంబంధించి విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి ఎంఎస్‌ ధోని కూడా తన సతీమణి సాక్షి సింగ్‌, కుమార్తె జీవాలతో కలిసి రాంచీలోని ఫామ్‌ హౌస్‌లో ఉంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా జీవాను బైక్‌పై ఎక్కించుకుని ఇంటి పరిసరాల్లోనే రౌండ్‌లు కొడుతున్నారు. 

తాజాగా ధోని తన కుమార్తెను బైక్‌ ఎక్కించుకుని గార్డెన్‌లో చక్కర్లు కొడుతున్న వీడియోను సాక్షి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ధోని ఇల్లు.. ఒక డ్రీమ్‌ హోమ్‌లా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు సాక్షిని కూడా ధోని బైక్‌ ఎక్కించుకోవాలని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో కూడా జీవాను ధోని బైక్‌పై ఎక్కించుకుని గార్డెన్‌లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను సాక్షి.. అభిమానులకు షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి : ఇటలీలో క్రీడా శిక్షణకు గ్రీన్‌ సిగ్నల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement