![Viral Video Uttar Pradesh Five Youths Seen Riding Bike on Busy Road - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/04/9/bike-viral-video.jpg.webp?itok=MW2ckKUD)
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో కొందరు యువకులు అత్యంత ప్రమాదకర విన్యాసం చేశారు. ఒక్క బైక్‌పై ఏకంగా ఐదుగురు ప్రయాణించారు. రాత్రి వేళలో రద్దీగా ఉన్న రోడ్డుపై రయ్ రయ్‌మంటూ ఈ బైక్ వేగంగా దూసుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బైక్ నడిపిన యువకుడితో మిగతా నలుగురిలో ఏ ఒక్కరూ కూడా కనీసం హెల్మెట్ ధరించలేదు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు వీరి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్‌పై ముగ్గురు ఎక్కితేనే ప్రమాదాల బారినపడుతుంటారు, అలాంటిది ఐదుగురు ఎలా ఎక్కారు? అని పలువురు మండిపడ్డారు.
शौक़....मनमानी....मजबूरी या फिर जान पर खेलने की आदत....एक बाइक पर फर्राटा भरते 5 युवक....!!#viralvideo राजधानी लखनऊ का।#himanshutripathi @Uppolice @lkopolice @uptrafficpolice @dcptrafficlko pic.twitter.com/m6rLT9VQhc
— Himanshu Tripathi (@himansulive) April 9, 2023
ఈ వయసులో సరదా పనులు చేయచ్చు కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ప్రమాదకర విన్యాసాలు చేయడం ఏంటి? మైండ్ ఏమైనా దొబ్బిందా? అని మరికొందరు ఫైర్ అయ్యారు. పొరపాటున ఎదైనా జరిగితే మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి అని ఆలోచించారా? అని మరికొందరు వీరిని ప్రశ్నించారు.
మరోవైపు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ ఘటనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ఇలాంటి దుస్సాహసాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చదవండి: పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు.. నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment