సడెన్‌గా పులి ఎంట్రీ..ఛేజ్‌ చేసేంత దూరంలో రైతు! ట్విస్ట్‌ ఏంటంటే.. | UP Farmers Close Encounter With Tiger Goes Viral | Sakshi
Sakshi News home page

సడెన్‌గా పులి ఎంట్రీ..ఛేజ్‌ చేసేంత దూరంలో రైతు! ట్విస్ట్‌ ఏంటంటే..

Published Thu, Feb 6 2025 5:25 PM | Last Updated on Thu, Feb 6 2025 5:47 PM

UP Farmers Close Encounter With Tiger Goes Viral

ఒక్కోసారి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లకపోయినా ఊహించిన విధంగా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తే అదృష్టం ఉంటే తప్ప బయటపడటం అంత ఈజీ కాదు. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ రైతుకి. తప్పించుకునే అవకాశం లేని విత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఆ టైంలో జరిగిన గమ్మత్తైన తమాషా ఆ రైతుకి భూమ్మీద నూకలున్నాయనే దైర్యాన్ని ఇచ్చింది. 

ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని పిలిభిత్‌(Pilibhit)లో ఒక రైతు బైక్‌పై కూర్చొని మరో వ్యక్తితో ఏదో సీరియస్‌గా మాట్లాడుతుంటాడు. ఇంతలో గడ్డిపొదల నుంచి నెమ్మదిగా పులి(Tiger) నక్కి నక్కి వస్తుంటుంది. దీన్ని ఆ ఇరువురు వ్యక్తులు గమనించరు. అయితే పులి మాత్రం దాక్కుంటూ వారిని సమీపిస్తుంటుంది. అమాంతం దాడి చేసేంత దూరంలోకి సమీపించేత వరకు గమనించరు ఆరైతు, సదరు వ్యక్తి. 

ఆ తర్వాత అంత దగ్గరగా పులిని చూసి స్టన్నైపోతారు.  ఆ తర్వాత వెంటనే తేరుకుని ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో బైక్‌ని వెనక్కి తిప్పేందుకు రెడీ అవుతాడు. చెప్పాలంటే పులి వారిపై దాడి చేసేంత దగ్గరలోనే ఉన్నారు వాళ్లు. కానీ ట్వీస్ట్‌ ఏంటంటే ఆ ఉన్నటుండి పులి దాడి చేయకుండా నెమ్మదిగా కూర్చొని అలా సేద తీరుతుంటుంది. 

నిజానికి దాడి చేసేలా సైలెంట్‌గా నక్కి వచ్చింది కాస్తా ఒళ్లు విరుచుకుంటూ కూర్చొంటుంది. దీంతో ఆ ఇద్దరు బతికిపోయంరా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) అధికారి(Indian Forest Service (IFS)) షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

 

(చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్‌ని జస్ట్‌ రూ. 875లకే అమ్మకం..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement