సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ప్రతిఒక్కరూ క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. షార్ట్స్, రీల్స్ చేస్తూ తొందరగా పాపులారిటీ తెచ్చుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ క్రమంలో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా యువత స్టంట్‌ల పేరుతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
తాజాగా ఓ వ్యక్తి తన కారుతో విచిత్రమైన ప్రయోగం చేసి చిక్కుల్లో పడ్డాడు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది. ముందలి గ్రామానికి చెందిన ఇంతేజార్ అలీ అనే వ్యక్తి తన మహీంద్రా థార్ కారు పైకప్పుపై పార సాయంతో మట్టిని నింపాడు. తర్వాత రోడ్డు మీద రాంగ్ రూట్‌లో అతివేగంతో ప్రయాణించాడు. దీంతో గాలికి ఆ మట్టి పైకి ఎగిరింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా వైరల్‌గా మారాయి.
ఈ వీడియోను చూసిన అనేక మంది స్టంట్ చేసిన యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ పుటేజీ అధారంగా యువకుడిని మీరట్ పోలీసులు పట్టుకున్నారు. అతనిక రూ. 25 వేల చలాన్ విధించారు.
मेरठ में THAR पर मिट्टी चढ़ाकर युवक ने दिखाया स्टंट
pic.twitter.com/PqBGtMJ935— Priya singh (@priyarajputlive) November 29, 2024
Comments
Please login to add a commentAdd a comment