గోడలెక్కి అడ్డంగా బుక్కైన పెద్దపులి! | Tiger Viral Video: UP's Pilibhit Officials Caught Giant Cat - Sakshi
Sakshi News home page

వీడియో: గోడలెక్కి అడ్డంగా బుక్కైన పెద్దపులి!

Published Tue, Dec 26 2023 1:40 PM | Last Updated on Tue, Dec 26 2023 1:46 PM

UP Tiger Viral Video: Pilibhit Officials Caught Giant Cat - Sakshi

పులి మనుషుల మధ్యకు వస్తే.. దాని మనోగతం ఎలా ఉంటుందో హ్యూమర్‌ టచ్‌తో భావోద్వేగాలను కలగలిపి Tiger Comes to Town(టైగర్‌ కమ్స్‌ టూ టౌన్‌) ద్వారా అందించారు రచయిత ఆర్కే నారాయణ్‌. అరణ్యా వాసాల్లోకి జనం చేరి.. జనావాసాలుగా మార్చేసుకుని మరీ వన్యప్రాణుల్ని ఇబ్బంది పెడుతుంటే.. అవి ‘రేయ్‌.. ఎవర్రా మీరంతా’’ అని అనుకోకుండా ఉండగలవంటారా?.. 
 
ఉత్తర ప్రదేశ్‌లో ఇవాళ ఓ పెద్దపులిని అధికారులు బంధించారు. దానిని పట్టుకునే సమయంలో అది ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా..  పిలిభిత్ జిల్లా అటవీ ప్రాంతాల్లో పులుల బెడద కొనసాగుతోంది. తాజాగా  ఓ పులి దారి తప్పి అట్కోనా గ్రామంలోకి వచ్చింది. రాత్రంతా గోడల మీదకు ఎక్కుతూ పడుకుని ఉండి పోయింది. వీధికుక్కలు మొరుగుతుండడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

అయితే ఆశ్చర్యంగా అది ఎవరి మీదా.. పశువుల మీద కూడా దాడి చేయలేదు. రాత్రి నుంచే  ఓ ఇంటి గోడ మీద కునుకు తీస్తూ ఉండిపోయింది. దాని ముఖం మీద లైట్లు వేసినా.. అది పట్టించుకోలేదు.  ఉదయం  చుట్టూ జనం చేరినా.. వాళ్లను పట్టించుకోకుండా గోడ మీద ఎక్కి కూర్చుంది.

అయితే పెద్దపులితో ఎప్పటికైనా ప్రమాదమే కదా!. అందుకే దానిని బంధించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అది ఎటూ పోకుండా బారికేడ్లు, వలలు ఏర్పాటు చేశారు.  ఈ లోపు.. దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకునే యత్నం చేశారు. ఆ సమయంలో దానిని తోక పట్టి అధికారులు లాగినా.. అది కొంచెం కూడా ఆక్రోశం ప్రదర్శించలేదు. చివరకు దానిని బోనులో వేసుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


దాని ఆరోగ్య స్థితి.. అది ఎందుకలా ప్రవర్తించింది అనేదానిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పిలిభిత్‌లో అటవీ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ.. నివాసాల్ని నిర్మించుకుంటూ పోతున్న గ్రామస్తుల్ని అటవీ శాఖ అధికారులు వారిస్తూ వస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందనే విమర్శ ఒకటి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement