wall
-
ఆర్ట్‌తో మూగ జీవుల సంక్షేమంపై అవగాహన..!
’ది కైండ్ అవర్’ ఫౌండేషన్ ద్వారా రెండు వందల యాభైకి పైగా వీధి కుక్కలను కాపాడుతోంది లక్నో వాసి మౌలి మెహ్రోత్రా. కళ ద్వారా జంతువుల పట్ల ప్రేమను ప్రజలకు తెలియజేస్తుంది. వీధుల్లో సృజనాత్మక కుడ్యచిత్రాల ఏర్పాటు, కమ్యూనిటీ ఔట్‌రీచ్‌లు, వర్క్‌షాప్‌ల ద్వారా పిల్లలకు బాధ్యతను బోధిస్తోంది.‘జంతు హక్కుల‘ గురించి చెబుతున్నప్పుడు చాలామందిలో ‘ఇది అవసరమా?’ అన్నారు. కానీ, ఎవ్వరి మాటలను పట్టించుకోను అంటోంది మౌలి. నలుగురు తిరిగే వీధుల్లో మూగ జంతువులకు సంబంధించిన చిత్రాలను ఉంచుతుంది. తనలాగే ఆలోచించే శ్రేయోభిలాషుల బృందం నుంచి ఆలోచింపజేసే పెయింటింగ్ తెప్పించి, వీధుల్లో ఏర్పాటు చేస్తుంది.కళ– వృత్తి సమతుల్యత23 ఏళ్ల వయస్సులో మౌళి తన చుట్టూ ఉన్న కుక్కలకు ఆహారం ఇవ్వడం, రక్షించడం, సంరక్షణ చేయడం ప్రారంభించింది. ‘నేను దాదాపు 200 కుక్కల బాధ్యత తీసుకున్నాను. ఒక ఏడాది పాటు ప్రతిరోజూ వాటి సంరక్షణ చూశాను. కానీ ఒంటరిగా చేయలేమని గ్రహించాను. నేను ప్రయాణాలు చేయవలసి వస్తే,.. ఈ పని ఎలా కొనసాగుతుంది? నేను చని΄ోతే ఏమి జరుగుతుందో... అని కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. జంతు సంక్షేమం పట్ల తనలో పెరుగుతున్న నిబద్ధతతో కళలలో వృత్తిని సమతుల్యం చేసుకోవడంలో అన్నీ సవాళ్లే. అందుకే, ఈ అభిరుచిని ఒక సంస్థగా మార్చాలనుకున్నాను. అప్పుడే ప్రతి జంతువుకు మరింత ప్రేమను పంచవచ్చు అనుకున్నాను’ అని ఆమె వివరిస్తుంది.లోతైన అవగాహనమౌళి చేసే ప్రయాణంలో సంస్థను ఎలా నమోదు చేసుకోవాలో తెలియక΄ోయినప్పటికీ, చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి సహాయం కోరింది. ‘నేను దీన్ని రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సొసైటీగానా, ట్రస్ట్గానా లేదా సెక్షన్ 8గా జాబితా చేయాలనుకుంటున్నారా అని అధికారులు అడిగారు. నాకు అవేవీ తెలియవు. కానీ, మెల్లగా అర్ధం చేసుకున్నాను. నల్సార్ యూనివ ర్శిటీ నుంచి లా లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు జంతు సంరక్షణ పట్ల అంకితభావం మరింత పెరిగింది. దీంతో వీటిలో శిక్షణ తీసు కున్నా. ఇది నాకు సబ్జెక్ట్‌లో చాలా లోతైన అవగాహనను ఇచ్చింది. ఈ విషయాలపై పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ఉన్న నేను ఎవరితోనైనా కూర్చున్నప్పుడు చేస్తున్న పని గురించి తప్పు పట్టాలని చూస్తుంటారు. కానీ, వారితో చర్చలు చేయను’ అని వివరిస్తుంది.గోడల నుంచి మనసుల వరకుకైండ్ అవర్ ఫౌండేషన్ పనుల్లో కళను చేర్చడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది మౌళి. అదే వీధి కళ. మౌళి చెబుతున్నట్టుగా వారు నివసించే వ్యక్తులకు విషయం చేరే శక్తివంతమైన వ్యక్తీకరణ ఇది. ‘వారు కుక్కను ఎందుకు చిత్రీకరిస్తున్నారు?‘ అని వీ«ధిలో ఎవరైనా అడుగుతారు. ‘అతను ఈ వీధిలో నివసిస్తున్నాడు కాబట్టి అని మేం చెబుతాం’ అని వివరిస్తుంది మౌళి. మౌళి చిత్రించిన కుక్కల వీధి కుడ్యచిత్రాలు లక్నో చుట్టూ, బయట గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. లక్నోలోని పాత పాడుబడిన ప్రభుత్వ భవనంపై కుక్కను చిత్రించడం ఆమె అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. దీనికి మంచి స్పందన లభించింది. చాలా మంది ప్రజలు పెయింటింగ్‌ను గమనించడం ప్రారంభించారు. రిషికేశ్‌లోని బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్లో మరొక కుడ్యచిత్రం ఏర్పాటు చేసింది.‘నాలుగేళ్ల క్రితం ఆ చిత్రం ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఆ పెయింటింగ్‌ను ప్రజలు ఇష్టపడతారు’ అని చెప్పే మౌళి కుడ్యచిత్రాలతో పాటు, ఫౌండేషన్ వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థులతో కలిసి పనుల్లో నిమగ్నమై ఉంటుంది. ‘‘ఒక పాఠశాలలో మేం పిల్లలతో కలిసి గోడకు పెయింట్ చేశాం. వారు ఆ పనిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పెయింటింగ్‌లో ఉన్న జంతువుల గురించి మేం వారికి నేర్పించాం. వాటిని ఎలా చూసుకోవాలో చెబితే చాలా బాగా అర్ధం చేసుకున్నారు ’అంటూ నాటి విషయాలను గుర్తుచేసుకుంటుంది. వీధి జంతువుల పట్ల బాధ్యతను ్ర΄ోత్సహించడానికి ఫౌండేషన్ స్థానిక సంఘాలతో కలిసి పనిచేస్తుంది. వారు స్థానిక పశువైద్యులతో కలిసి ఆహారం, రెస్క్యూ సేవలు, సంరక్షణనూ అందిస్తున్నారు.పంచుకునే వ్యక్తులతో కలిసి..బాలీవుడ్ నిర్మాత అమన్ విషేరాతో సహా మౌళి నిబద్ధత చాలా మందికి నచ్చింది. ‘ఎప్పటినుండో ఒక షోలో పాల్గొనాలని, జంతు సంక్షేమం కోసం పని చేయాలని ఉందని అడిగాను. అలా మేమిద్దరం కళాకారులం కాబట్టి, ఇతర జీవులు, జంతువుల గురించి పిల్లలకు నేర్పించడంలో కళ నిజంగా సహాయపడుతుందని, మనలాగే వాటికీ భావోద్వేగాలు, బాధలు ఎలా అనుభవిస్తాయో వాస్తవాన్ని గ్రహించాం. ఇప్పుడు పాఠ్యాంశాలు, స్టడీ మెటీరియల్స్, జంతు సంక్షేమం గురించి పిల్లలకు బోధించడానికి పంచుకునే కథలను రూపొందించడానికి కలిసి పని చేస్తున్నాం’ అని వివరించారు. టీమ్‌లోని మరొక సభ్యురాలు మేఘన మాట్లాడుతూ– ‘ఎవరో ఒక కుక్కపిల్లని నా ఇంటి బయట పడేశారు. ఏమి చేయాలో గుర్తించే ప్రయత్నంలో నేను మౌళి గురించి తెలుసుకున్నాను. నాకు ఆ సంస్థ పనులు చాలా బాగా నచ్చాయి. నేను కూడా వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాను’ అని చెబుతుంది. (చదవండి: సోషల్ మీడియా గెలిపించింది..!) -
పాత పద్ధతిలోనే కొత్త డయాఫ్రం వాల్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన సమాంతరంగా కొత్తగా పాత పద్ధతిలోనే డయాఫ్రం వాల్ నిర్మించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరోసారి స్పష్టం చేసింది. పాత డయాఫ్రం వాల్‌ను 15 నెలల్లో నిర్మించారని గుర్తు చేస్తూ.. కొత్త డయాఫ్రం వాల్‌ను ఈ ఏడాది నవంబర్ నుంచి 2025 జూలైలోగా పూర్తి చేయాలని పేర్కొంది.ఒకే సీజన్లో ఆ పనులు చేసేందుకు అదనంగా గ్రాబర్లు, కట్టర్లు, అనుబంధ యంత్ర పరికరాలు, నిపుణులైన సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించింది. డయాఫ్రం వాల్ డిజైన్, నిర్మాణంపై చర్చించేందుకు తక్షణమే వర్క్ షాప్ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ, పీపీఏలకు ఈనెల 20న అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. అందులో కమిటీ సిఫార్సులు ఇవీ.. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు ఎలాంటి ముప్పు లేదు. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీకి అడ్డుకట్ట వేయడానికి టోయ్ (అడుగు భాగం)లో ఫిల్టర్లు వేయాలి. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాం మధ్య సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపు ఎత్తు ఉండేలా సీపేజీ నీటిని గ్రావిటీతో పంపడంతోపాటు పంపులతో ఎత్తిపోయాలి. ⇒ ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి నదీ గర్భం సముద్ర మట్టానికి సగటున 13 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దానిపై ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్ చేసి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి వీలుగా ప్లాంట్ఫామ్ సిద్ధం చేయాలి. పూర్తిగా పొడి వాతావరణంలోనే డయాఫ్రం వాల్‌ను నిర్మించాలి. ⇒ కొత్త డయాఫ్రం వాల్‌ను పాత పద్ధతిలోనే నిర్మించాలి. గ్రాబర్లు, కట్టర్లతో రాతి పొర తగిలే వరకూ నదీ గర్భాన్ని తవ్వుతూ వాటిలో బెంటనైట్ మిశ్రమాన్ని పంపాలి. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపితే బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్, ఒకింత బెంటనైట్ మిశ్రమం కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్‌గా మారుతుంది. అదే డయాఫ్రం వాల్. గత 40 ఏళ్లుగా డయాఫ్రం వాల్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఈ వాల్ ఎక్కడా విఫలమైన దాఖలాలు లేవు. -
చంద్రబాబు తప్పిదం వల్లే.. వాల్ ఢమాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అవగాహనా రాహిత్యం, అస్తవ్యస్థ పనులు మరోసారి బహిర్గతమయ్యాయి. పోలవరం డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కావడానికి, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సాక్షిగా నిర్ధారణ అయింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారని ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు 1,006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారని పేర్కొంది. అయితే నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకపోవడంతో 2017, 2018లో గోదావరి ప్రవాహం డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించిందని గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రమ్‌వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వరద ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్లో ఐదు చోట్ల 693 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బ తిందని స్పష్టం చేస్తూ ఈనెల 12న కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక అందచేసింది. గతేడాది ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిర్వహించిన అధ్యయనంలో నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌వాల్ దెబ్బ తిన్నట్లు తేల్చగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరో 208 మీటర్ల మేర అధికంగా దెబ్బ తిన్నట్లు తేల్చడం గమనార్హం. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో(యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం గత నెల 7న ప్రాథమిక నివేదిక అందచేసింది. పూర్తి నివేదికను ఈనెల 12న సీడబ్ల్యూసీకి సమర్పించింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ..క్రమబద్ధంగా పనులు» గాడి తప్పిన పోలవరం పనులను 2019 తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసింది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. » ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్‌లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించింది.» దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయి. 2018లో జెట్ గ్రౌటింగ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించకుండా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడం వల్లే సీపేజీ (లీకేజీ) అధికంగా ఉంది.వాస్తవాలకు దర్పణంప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యామ్‌లు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యామ్ పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరం ప్రాజెక్టులో మాత్రం చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్ కోతకు గురై దెబ్బతింది.ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్రబాబుదేనని సాగునీటిరంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేయగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా అదే అంశాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం. ప్రణాళికారాహిత్యం వల్లే..» పోలవరం జలాశయం పనులను 2016 డిసెంబర్లో ప్రారంభించారు. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల కోసం కొండ తవ్వకం పనులకు సమాంతరంగా ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ పనులు ప్రారంభించారు. 2017 జూలైలో వరదలు ప్రారంభమయ్యే సమయానికి ఎడమ వైపు నుంచి 1,006 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేశారు. 2017 జూలై తర్వాత వచ్చిన వరద డయాఫ్రమ్‌వాల్ మీదుగానే ప్రవహించింది. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ నాటికి మిగిలిన 390.6 మీటర్ల పొడవున గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేశారు. 2018లోనూ వరద ప్రవాహం డయాఫ్రమ్‌వాల్ మీదుగానే ప్రవహించింది. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల 2018 నాటికే డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది.» 2017లో వరద ప్రవాహం ముగిశాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లను 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. కానీ ప్రవాహ ప్రభావం పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో 2018లో గోదావరి వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతింది. 20 మీటర్ల లోతుతో నిర్మించిన జెట్ గ్రౌటింగ్ వాల్ పటిష్టంగా ఉందో లేదో తెలుసుకోకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించి.. 2019 మార్చి నాటికి పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల గోదావరి కుచించుకుపోయి వాటి మధ్య ప్రవహించాల్సి ఉంటుంది. దీనివల్ల వరద ఉద్ధృతి పెరుగుతుంది. ఆ ప్రభావం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంపై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. దాంతో 2019లో గోదావరి ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో 30 మీటర్ల లోతు వరకూ ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది. డయాఫ్రమ్‌వాల్ పూర్తిగా దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్ కూడా కోతకు గురైంది. జగన్ సర్కారు పనులపై కమిటీ సంతృప్తి» పోలవరం పనులను 2019 నుంచి గాడిలో పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం» వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్ శరవేగంగా పూర్తి» ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహం స్పిల్‌వే మీదుగా మళ్లింపు» దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతంలో జియో బ్యాగ్‌లు ఇసుకతో నింపి పూడ్చివేత» 2023 ఫిబ్రవరికి దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి» స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నట్లు నిపుణుల కమిటీ సంతృప్తి » గతంలో జెట్ గ్రౌటింగ్ గోడలో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీ ఒకే సీజన్లో.. కొత్త డయాఫ్రమ్‌వాల్ » 2024 నవంబర్ 1 నుంచి 2025 జూలై 31లోగా పూర్తి చేయాలి » పాత డయాఫ్రమ్వాల్కి ఎగువన సమాంతరంగా కొత్తది నిర్మించాలి » కేంద్ర జలసంఘానికి అంతర్జాతీయ నిపుణుల నివేదిక సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్కి ఎగువన కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదించింది. డయాఫ్రమ్ వాల్ పనులను వరదలు తగ్గాక అంటే 2024 నవంబర్ 1న ప్రారంభించి 2025 జూలై 31లోగా పూర్తి చేసేలా నిరంతరాయంగా చేయాలని స్పష్టం చేసింది. ఒకే సీజన్లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ కీలక సిఫార్సులివీ...»గోదావరి వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ 693 మీటర్ల పొడవున దెబ్బతింది. మరమ్మతులు చేసినా అది పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తుందో లేదో చెప్పలేం. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా కొత్త డయాఫ్రమ్వాల్ని నిర్మించడమే శ్రేయస్కరం.» ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయి. పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో సీపేజీ అధికంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన నది మధ్యలో ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన సీపేజీ నీటి మట్టం సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపే ఉండాలి. ఆ మేరకు దిగువ కాఫర్ డ్యామ్‌లో ఏర్పాటు చేసిన గ్రావిటీ స్లూయిజ్‌ల ద్వారా సీపేజీ నీటిని బయటకు పంపాలి. గ్రావిటీ ద్వారా పంపడానికి సాధ్యం కాని నీటిని ఎత్తిపోయాలి. ఈ పనులను తక్షణమే ప్రారంభించాలి.» నవంబర్ 1 నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడానికి వీలుగా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ఇసుక తిన్నెలను యధాస్థితికి తెచ్చేలా వైబ్రో కాంపాక్షన్ పనులను పూర్తి చేయాలి. సముద్ర మట్టానికి 3 మీటర్ల ఎత్తు వరకూ ఈ పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలి. » కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.. గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, పనులు చేపట్టడంపై వర్క్ షాప్ నిర్వహించాలి.» 2024లో వరదలు తగ్గి పనులు ప్రారంభించడానికి ముందే పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ వర్క్ షాప్ నిర్వహించాలి. సీడబ్ల్యూïÜ, పీపీఏ, జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతిని«దులు పాల్గొనే ఈ వర్క్ షాప్‌నకు అంతర్జాతీయ నిపుణులు కూడా హాజరవుతారు. -
తప్పిన పెను ప్రమాదం.. ‘సుంకిశాల’లో అసలేం జరిగింది?
సాక్షి, నల్గొండ జిల్లా: సుంకిశాల పంప్ హౌస్ రక్షణ గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. కొన్ని క్షణాలు ముందైనా, ఆలస్యం అయినా భారీగా ప్రాణ నష్టం జరిగేది.పంప్ హౌస్‌లో షిఫ్ట్‌కు 115 మంది వరకు కూలీలు పని చేస్తున్నారు. సాగర్ డెడ్ స్టోరేజ్‌కు చేరిన సమయంలో హైదరాబాద్‌కు తాగునీటిని అందించడానికి సుంకిశాల పథకం చేపట్టారు. పథకంలో భాగంగా సొరంగ మార్గం నిర్మాణ పనులు చేస్తున్నారు. సొరంగంలోకి సాగర్ నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టగా.. సాగర్ నిండటంతో నీటి ఒత్తిడికి రక్షణ గోడ కూలింది. దీంతో సొరంగం పూర్తిగా మునిగిపోయింది. నీటిలోనే క్రేన్, టిప్పర్లు, ఇతర సాంకేతిక సామాగ్రి మునిగిపోయాయి. కోట్లలో నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ నెల ఒకటినే రక్షణ గోడ కూలినా అధిక యంత్రాంగం గోప్యంగా ఉంచారు. ఆగష్టు ఒకటిన ఉదయం ఆరుగంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జలమండలి అధికారులు నీళ్లు నములుతున్నారు.అసలు అక్కడ ఏం జరగలేదన్నట్లు కప్పిపుచ్చుకునే ధోరణిలో అధికార యంత్రాంగం ఉంది. తిరిగి పనులు ప్రారంభం కావాలంటే వచ్చే వేసవి వరకు ఆగాల్సిందే. -
కొత్త డయాఫ్రమ్ వాల్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కొత్త డయా ఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని కేంద్ర జల్ శక్తి శాఖను కోరుతూ తీర్మానం చేసింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో హామీ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. వీటిని కేంద్ర జల్ శక్తి శాఖకు పంపాలని నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు పనులను జూన్ 30 నుంచి జూలై 3 వరకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్ వోరా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గోదావరి వరదల ఉధృతికి గ్యాప్–2లో డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందని, దానికి మరమ్మతులు చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తుందని చెప్పలేమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సూచనకు ఆమోదం తెలిపింది.2023 జూన్ 5నే నిధులు మంజూరు » కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో దక్కించుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో పునాది డయా ఫ్రమ్ వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు.» 2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరదలు.. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయా ఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గరిష్టంగా 36 మీటర్లు.. కనిష్టంగా 26 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి.» వెఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ప్రోటోకాల్ ప్రకారం స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీల పొడవున మళ్లించారు. ఆ తర్వాత దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. కోతకు గురై దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన మేరకు.. 2022 మార్చి 4న అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. » చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్ పునరుద్దరణ, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు. » వాటిని పరిగణనలోకి తీసుకుని.. రెండు దశల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని నిర్ణయించిన కేంద్రం.. వైఎస్ జగన్ జగన్ విజ్ఞప్తి మేరకు తొలి దశ పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, డయా ఫ్రమ్ వాల్ పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.2 వేల కోట్లు వెరసి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు.నాడు వద్దంటూ.. నేడు నిధుల విడుదలకు ప్రతిపాదన» గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తికి అవసరమైనన్ని నిధులు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖను ప్రధాని నరేంద్ర మోదీ అప్పట్లో ఆదేశించారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పలుమార్లు రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో సమావేశమై.. కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మాణంతోపాటు తొలి దశ పూర్తికి రూ.12,157.52 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదించారు. » ఆ నిధులు విడుదల చేయాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే.. 2016 సెప్టెంబర్ 6న పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయం అంటే రూ.15,667.90 కోట్లు ఇవ్వాలని 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. » ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.15,146.28 కోట్లు విడుదల చేసింది. దీనికితోడు రూ.12,157.52 కోట్లు విడుదల చేయాలంటే 2017 మార్చి 15న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ మారుస్తూ తీర్మానం చేయాలి. ఆ మేరకు తీర్మానం చేసి.. నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖ ఈ ఏడాది మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. » అయితే అప్పటికే ఎన్డీఏలో చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ నిధులు ఇస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల చెవిలో ఊదారు. దాంతో అప్పట్లో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేసి.. నిధులు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గంతో సీఎం చంద్రబాబు తీర్మానం చేయించడం గమనార్హం. -
మరో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిందే
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో గోదవరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సూచించింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేసినా, దెబ్బతిన్న ప్రాంతాల్లో ‘యూ’ ఆకారంలో నిర్మించి అనుసంధానం చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తుందని చెప్పలేమని తేల్చిచెప్పింది. ఇప్పటికే గోదావరి వరదలను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌తోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రభుత్వం పూర్తి చేసినందున కొత్త డయాఫ్రమ్ వాల్‌ను సులభంగా నిర్మించవచ్చని నిపుణుల బృందం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నియమించిన యూఎస్ఏకు చెందిన డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్ యాఫ్రి సంస్థ (స్వీడన్) ప్రతినిధులు నాలుగు రోజులపాటు ప్రాజెక్టును పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. బుధవారం మరోసారి సమీక్షించిన అనంతరం నిపుణుల బృందంతో సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. గతంలో వరదను మళ్లించేలా స్పిల్ వే పూర్తి చేయకుండా, ఎగువ కాఫర్ డ్యామ్‌ను చేపట్టి ఇరు వైపులా ఖాళీ వదిలేయడం వల్లే వరద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణులు సీడబ్ల్యూసీ చైర్మన్‌కు తేల్చి చెప్పారు. గ్యాప్–2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల మేర దెబ్బతిందని నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఇచ్చిన నివేదికతో ఈ బృందం ఏకీభవించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించడం శ్రేయస్కరమని సూచించింది.జెట్ గ్రౌటింగ్‌లో లోపం వల్లే లీకేజీలుఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందు జెట్ గ్రౌటింగ్ చేసేటప్పుడు ఆ ప్రదేశంలో ఇసుక సాంద్రతను తప్పుగా అంచనా వేశారని ఈ బృందం తెలిపింది. అందువల్లే తక్కువ లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి, జెట్ గ్రౌటింగ్ చేశారని, దీనివల్లే లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. లీకేజీలకు కారణాలు కనుక్కోవడానికి కాఫర్ డ్యామ్ పైనుంచి 100 నుంచి 150 మీటర్లకు ఒక చోట మొత్తం 17 చోట్ల బోర్ హోల్స్ వేసి పరీక్షలు చేయాలని సూచించామని తెలిపింది. యాఫ్రి సంస్థ ఇప్పటికే నాలుగు చోట్ల పరీక్షలు చేసిందని వివరించింది. ఆ పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తే.. లీకేజీలను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేమని, కొంతవరకు అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. కొంతవరకు లీకేజీలు ఉన్నప్పటికీ కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మాణానికి, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించింది.ముగిసిన అంతర్జాతీయ నిపుణుల పర్యటనఅంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజుల పోలవరం పర్యటన బుధవారం ముగిసింది. వారు బుధవారం విజయవాడ చేరుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి వారి దేశాలకు వెళ్తారు. రెండు వారాల్లో మధ్యంతర నివేదికపోలవరం ప్రాజెక్టు పరిశీలన, అధికారులతో సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సవాళ్లను అధిగమించడం, నిర్మాణాల డిజైన్లపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని నిపుణుల బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థ అంతర్జాతీయ కన్సల్టెంట్ యాఫ్రి సంస్థ సవాళ్లను అధిగమించడానికి చేపట్టాల్సిన నిర్మాణాల డిజైన్లను రూపొందించి తమకు పంపితే.. తాము పరిశీలించి మార్పులుంటే సూచిస్తామని చెప్పింది. యాఫ్రి, తాము ఏకాభిప్రాయంతో నిర్ణయించిన డిజైన్‌ను సీడబ్ల్యూసీకి పంపుతామని తెలిపింది. ఆ డిజైన్‌ను సీడబ్ల్యూసీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోదించాకే దాని ప్రకారం పనులు చేపట్టాలని సూచించింది. ఇందుకు సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా అంగీకరించారు. నిపుణల బృందం మధ్యంతర నివేదిక ఇచ్చాక ఢిల్లీలో మరోసారి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులతో సమావేశం నిర్వహిస్తామని వోరా చెప్పారు. -
నాగర్ కర్నూల్: ఈదురుగాలుల బీభత్సం.. గోడ కూలి నలుగురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: తాడూరు మండలం ఇంద్రకల్లో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం కూలీ కుటుంబాల బతుకులను చేసింది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం అకాలంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి గ్రామంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల షెడ్డు కూలి నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.ఇంద్రకల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మాణానికి 6 మంది కూలీలు వెళ్లారు. గోడలు కడుతుండగా ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది పని ముగించుకొని నిర్మాణంలో ఉన్న గోడ పక్కనే కూర్చున్నారు. తీవ్రమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా గోడకూలి కూలీలపై పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గోడలెక్కి అడ్డంగా బుక్కైన పెద్దపులి!
పులి మనుషుల మధ్యకు వస్తే.. దాని మనోగతం ఎలా ఉంటుందో హ్యూమర్ టచ్‌తో భావోద్వేగాలను కలగలిపి Tiger Comes to Town(టైగర్ కమ్స్ టూ టౌన్) ద్వారా అందించారు రచయిత ఆర్కే నారాయణ్. అరణ్యా వాసాల్లోకి జనం చేరి.. జనావాసాలుగా మార్చేసుకుని మరీ వన్యప్రాణుల్ని ఇబ్బంది పెడుతుంటే.. అవి ‘రేయ్.. ఎవర్రా మీరంతా’’ అని అనుకోకుండా ఉండగలవంటారా?.. ఉత్తర ప్రదేశ్‌లో ఇవాళ ఓ పెద్దపులిని అధికారులు బంధించారు. దానిని పట్టుకునే సమయంలో అది ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా.. పిలిభిత్ జిల్లా అటవీ ప్రాంతాల్లో పులుల బెడద కొనసాగుతోంది. తాజాగా ఓ పులి దారి తప్పి అట్కోనా గ్రామంలోకి వచ్చింది. రాత్రంతా గోడల మీదకు ఎక్కుతూ పడుకుని ఉండి పోయింది. వీధికుక్కలు మొరుగుతుండడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఆశ్చర్యంగా అది ఎవరి మీదా.. పశువుల మీద కూడా దాడి చేయలేదు. రాత్రి నుంచే ఓ ఇంటి గోడ మీద కునుకు తీస్తూ ఉండిపోయింది. దాని ముఖం మీద లైట్లు వేసినా.. అది పట్టించుకోలేదు. ఉదయం చుట్టూ జనం చేరినా.. వాళ్లను పట్టించుకోకుండా గోడ మీద ఎక్కి కూర్చుంది. Tiger was seen in Pilibhit. Pilibhit Tiger Reserve, surrounded by forests, has its own identity among the tourist places of the country. The tiger that came out of the forest gained a foothold in the populated area. The administration should take concrete steps on this #pilibhit pic.twitter.com/pc6v59mY4z — Aasif Ali Official (@aasif_ali__) December 26, 2023 टाइगर कह रहा है अब वह भी इंसानों के साथ रहेगा, वीडियो उत्तर प्रदेश के पीलीभीत जिले का है, टाइगर रिजर्व जंगल से निकलकर रात 2 बजे अटकोना गांव पहुंचा बाघ गुरुद्वारे की दीवार पर बैठकर आराम फरमा रहा है। #tiger #Pilibhit #UP pic.twitter.com/YIDndUsFXd — Sunil Yadav B+ (@sunilyadav21) December 26, 2023 అయితే పెద్దపులితో ఎప్పటికైనా ప్రమాదమే కదా!. అందుకే దానిని బంధించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అది ఎటూ పోకుండా బారికేడ్లు, వలలు ఏర్పాటు చేశారు. ఈ లోపు.. దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకునే యత్నం చేశారు. ఆ సమయంలో దానిని తోక పట్టి అధికారులు లాగినా.. అది కొంచెం కూడా ఆక్రోశం ప్రదర్శించలేదు. చివరకు దానిని బోనులో వేసుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాని ఆరోగ్య స్థితి.. అది ఎందుకలా ప్రవర్తించింది అనేదానిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పిలిభిత్‌లో అటవీ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ.. నివాసాల్ని నిర్మించుకుంటూ పోతున్న గ్రామస్తుల్ని అటవీ శాఖ అధికారులు వారిస్తూ వస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందనే విమర్శ ఒకటి ఉంది. A tiger on a wall. But it’s real. The most difficult thing in such situation is to control humans not the wildlife. Scene is from nearby area of Pilibhit. Via @KanwardeepsTOI pic.twitter.com/IE8eXS1Brm — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 26, 2023 -
‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ..
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని అంటుంటారు. పూర్వకాలంలో ఈ రెండు పనులూ ఎంతో శ్రమ, ఖర్చుతో కూడినవి కావడంతో అలా అనేవారు. అయితే ఇప్పుడు ఈ రెండు పనులు రోబోలు అత్యంత సులభంగా చేసేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో కొందరు.. రోబోలను వివాహం చేసుకుంటున్నారనే వార్తలు వింటున్నాం. కొత్తగా ఇప్పుడు ఇళ్లను రోబోలే స్వయంగా కట్టేస్తున్నాయి. అది కూడా అత్యంత ధృఢంగా.. పురాతన పద్ధతిలో.. ఆధునికత మేళవిస్తూ.. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా ఇంటి నిర్మాణంలో బండరాళ్లను ఒక పద్ధతిలో పేర్చడం అనేది ఎంతో శ్రమతో కూడిన పని. ఇందుకోసం శారీరకంగానే కాదు..మానసికంగానూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రోబో ఈ పనిని చిటికెలో చేసేస్తోంది. ఇంటికి అవసరమయ్యే గోడ నిర్మాణాలను చేపట్టే ఈ రోబోట్ పేరు ‘హీప్’(హెచీఈఏపీ) ఇదొక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్. ఇది వాకింగ్ ఎక్స్కవేటర్ కూడా. దీనిని ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధనా సంస్థ బృందం తయారుచేసింది. ఈ రోబోలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్, కంట్రోల్ మాడ్యూల్, తవ్వకాల ఆర్మ్‌పై లిడార్ సెన్సార్లు ఉన్నాయి. ఈ రోబో తాను చేపడుతున్న తాజా ప్రాజెక్ట్ కోసం నిర్మాణ స్థలాన్ని స్కాన్ చేసి, దాని త్రీడీ మ్యాప్‌ను రూపొందించడం ద్వారా పనిని ప్రారంభించింది. తరువాత ఆ సైట్లో డంప్ చేసిన బండరాళ్లను గోడలో ఎక్కడ ఉంచాలనేది రికార్డ్ చేసింది. అనంతరం ‘హీప్’ ప్రతి బండరాయిని భూమి నుండి పైకి లేపింది. ఇందుకోసం దాని బరువు, గురుత్వాకర్షణ కేంద్రాన్ని అంచనా వేయడానికి, దాని ప్రత్యేక ఆకారాన్ని రికార్డ్ చేయడానికి సాంకేతికతను ఉపయోగించింది. ఒక అల్గారిథమ్ రూపకల్పన అనంతరం 20 అడుగుల ఎత్తు, 65 మీటర్ల పొడవైన రాతి గోడను నిర్మించడానికి ప్రతి బండరాయిని అది చక్కగా ఇమిడిపోయే ప్లేస్‌లో అమర్చింది. ఒక్కో బిల్డింగ్ సెషన్‌కు దాదాపు 20 నుండి 30 బండరాళ్లను వాటి స్థానాల్లో ఉంచింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ నూతన రోబో వ్యవస్థ.. నిర్మాణ రంగాన్ని మరింత సులభతరం చేస్తుంది. బండరాళ్లను తీసుకురావడం మొదలుకొని, వాటితో సరైన గోడను నిర్మించేవరకూ ‘హీప్’ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోబో అధ్యయనానికి సంబంధించిన పత్రం ఇటీవల సైన్స్ రోబోటిక్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈటీహెచ్ జ్యూరిచ్ అందించిన ఈ వీడియోలో ‘హీప్’ గోడ నిర్మాణాన్ని చూడవచ్చు. ఇది కూడా చదవండి: కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం.. -
ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
పురాతన వస్తువులను వేలం పాటల్లో అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం మామూలే ! కానీ, ఒక సాధారణమైన గోడ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయి వార్తలకెక్కింది. వాషింగ్టన్ డీసీలోని ఈ గోడ యజమాని పేరు అలెన్ బర్గ్. ఒకసారి ఈ గోడ పక్కన ఉన్న ఇంటికి నీరు లీక్ అవుతున్నట్లు ఆ ఇంటి యజమాని గమనించాడు. దక్షిణంవైపు గోడకు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల దూలాలు తడిసి శిథిలావస్థకు చేరుకున్నాయని ఇంజినీర్ చెప్పడంతో, ఆ యజమాని అలెన్‌ను తన గోడ భాగాన్ని సరిచేయాలని కోరాడు. అతడు అందుకు నిరాకరించడమే కాకుండా, ఆ యజమానితో గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో ఆ ఇంటి యజమాని సమస్య పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అలెన్‌కు కోటిన్నర రూపాయలు జరిమానా విధించింది. దీంతో ఇప్పుడు అలెన్ తనకున్న ఆ ఒక్క ఆస్తి, ఈ గోడను రూ.నలభై లక్షలకు అమ్మకానికి పెట్టాడు. దాదాపు నాలుగేళ్ల పాటు ఎవరూ కొనక పోవడంతో, తన ఇంటిని కాపాడుకోవడం కోసం ఆ పొరుగింటి యజమానే దీనిని కొన్నాడు. ఏది ఏమైనా ఆలెన్‌కు వాళ్ల తాత ఇచ్చిన ఆ ఒక్క గోడ అతన్ని కోటీశ్వరుడుని చేసింది. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
జేసీ.. జేసీబీ!
తాడిపత్రి: ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణంలో దర్జాగా అసాంఘిక కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవటమే కాకుండా తన అనుచరులతో కలసి కూల్చివేతలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనుల వద్ద వీరంగం సృష్టించారు. జేసీ గ్యాంగ్ కూలగొట్టిన పిల్లర్లను తిరిగి నిర్మించేందుకు ప్రయత్నించిన కార్మికులపై ఆదివారం ఉదయం దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఏం జరిగిందంటే... నాడు–నేడు ఫేజ్ 2 పనుల్లో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను మూడు రోజుల క్రితం చేపట్టారు. జూనియర్ కళాశాల సమీపంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం ఉంది. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో నిర్మాణ పనుల వద్దకు అనుచరులతో కలసి చేరుకున్న జేసీ ‘రేయ్ జేసీబీతో పిల్లర్లను కూలదోయండిరా..’ అంటూ హుకుం జారీ చేశారు. జేసీబీతో కాంక్రీట్ పిల్లర్లను కూలదోశారు. మర్నాడు అక్కడకు వచ్చిన కూలీలను పనులు నిలిపి వేయాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు అడ్డగించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రహరీ నిర్మిస్తున్నామని, అడ్డు తగలడం సమంజసం కాదని చెప్పినా వినిపించుకోలేదు. దీనిపై మేస్త్రీ గురుశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్మాణాలను దౌర్జన్యంగా కూలగొట్టడంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస మల్లికార్జునరెడ్డి, సుబ్బయ్య, వడ్డే మధు, సోమశేఖర్ నాయుడు, దినేష్‌రెడ్డి, పవన్‌నాయుడు, మునిసిపల్ కాంట్రాక్టర్ తిరుపాల్‌రెడ్డి, కుమ్మరి వెంకటేష్, రాంబాబు, గురుజాల శివశంకర్‌రెడ్డి, చరణ్, హరినాథ్‌రెడ్డి, గండికోట కార్తీక్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ తెలిపారు. -
నేడు జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి సమావేశం
-
వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూపరులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ వీడియోలను చూస్తే జనానికి ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయో అంటూ ముక్కున వేలేసుకుంటాం. కొందరు కార్లను హెలీకాప్టర్లుగా మార్చేస్తూ ఉంటే, మరికొందరు ఇటుకలతో కూలర్ తయారు చేస్తారు. @TansuYegen పేరుతో ట్విట్టర్లో ఈ కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో @TansuYegen పేరుతో ట్విట్టర్లో షేర్ అయ్యింది. ఈ వీడియోలో కొందరు కూలీలు గోడ నిర్మించడం కనిపిస్తుంది. ఇద్దరు కూలీలు రెండు కర్ర చెక్కలపై కూర్చుని కనిపిస్తారు. వారు కిందకు మీదకు కదులుతుంటారు. ఈ చెక్కలకు మరోవైపున ఉన్న కూలీలు ఆ చెక్కలను పైకి కిందకు కదుపుతుంటారు. ఒక కూలీ ఇటుక, సిమెంట్లను పైనున్న కూలీకి అందిస్తుండగా అతను వాటిని పైనున్న కూలీకి అందిస్తుంటాడు. వాటిని అందుకున్న ఆ కూలీ గోడను వేగంగా నిర్మిస్తుంటాడు. Everything can be automated.., pic.twitter.com/VOow1m1b55 — Tansu YEĞEN (@TansuYegen) July 6, 2023 సూపర్ ఐడియా అంటూ.. ఈ వీడియోను ఇప్పటివరకూ 2.5 మిలియన్లమందిపైగా నెటిజన్లు వీక్షించారు. చాలామంది దీనిని సూపర్ ఐడియా అంటూ ఆ కూలీలను మెచ్చుకుంటున్నారు. ఈ టెక్నిక్ నిర్మాణ పనిని మరింత వేగవంతం చేస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. కారణం తెలిస్తే షాకవుతారు.. -
డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట సమాంతరంగా మరో వాల్
సాక్షి, అమరావతి: గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్) వద్ద ఏర్పడిన నాలుగు భారీ అగాధాలు పూడ్చి వయబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తేవడం, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించి పటిష్టం చేసే పనులకు రూ.2022.05 కోట్లతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పనులను సక్రమంగా చేపట్టకపోవడం వల్ల 2019లో వచ్చిన వరదలకు ప్రాజెక్టు పలు చోట్ల తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన డ్యామ్‌తో పాటు దిగువ కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ల వద్ద పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో పాటు అదనపు వ్యయమూ అవుతోంది. గోదావరి వరద ఉధృతికి ప్రధాన డ్యామ్ వద్ద ఏర్పడిన భారీ అగాధాల పూడ్చివేత, డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడానికి అయ్యే అదనపు వ్యయాన్ని భరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ గత ఏడాది హామీ ఇచ్చారు. డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం దిగువ కాఫర్ డ్యామ్‌లో దెబ్బ తిన్న ప్రాంతాలను ఇసుకతో నింపిన జియోమెంబ్రేన్ బ్యాగులతో పూడ్చి వయబ్రో కాంపాక్షన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం య«థాస్థితికి తీసుకువచ్చింది. ఆ తరువాత దిగువ కాఫర్ డ్యామ్‌ను 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసింది. నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించిప్రధాన డ్యామ్ అగాధాల పూడ్చివేత, డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చడానికి దేశంలో అత్యున్నత సంస్థ్ధలైన సీడబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఐఐటీ నిపుణులతో 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మేధోమథనం చేయించింది. ఈ బృందం పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. అగాధాలను ఇసుకతో పూడ్చి వయబ్రో కాంపాక్షన్ చేయాలని సూచించింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో నాలుగు చోట్ల 30 శాతం మేర దెబ్బతిందని తేల్చింది. ఆ నాలుగు ప్రాంతాల్లో ‘యు’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి పాత దానికి అనుసంధానం చేయాలని ఆదేశించింది. ఈ పనులకు రూ.2022.05 కోట్లు వ్యయం అవుతుందని తేల్చింది. ఆ మేరకు పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. బాబు సర్కారు నిర్వాకమిదీ.. పోలవరంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకాల వల్లే ఈ అదనపు భారం పడుతోందని అధికారవర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు సర్కారే చేపట్టింది. అసలు చేపట్టాల్సిన పనులు చేపట్టలేదు. సులభంగా చేయగలిగే, అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ పునాది, డయాఫ్రమ్ వాల్‌ను 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. స్పిల్ వేను పునాది స్థాయిలోనే వదిలేశారు. స్పిల్ ఛానల్లో మాస్ కాంక్రీట్ పనులు చేశారు. అప్రోచ్ ఛానల్, ఫైలెట్ ఛానల్లో తట్టెడు మట్టి ఎత్తకుండానే 2018లో ఎగువ, దిగువ కాఫ్ర్ డ్యామ్‌ల పనులను ప్రారంభించారు. నిర్వాసితులకు పునరావాసంపై మాత్రం దృష్టి పెట్టలేదు. భారీ నష్టం గోదావరి నదికి 2019లో భారీ వరదలు వచ్చాయి. పోలవరం వద్ద 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరికి అంత జాగా లేకపోయింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో ఖాళీ ప్రదేశం 800 మీటర్లకు కుంచించుకుపోయింది. దీంతో వరద ఉధృత్తి మరింత తీవ్రమై ప్రధాన డ్యామ్ వద్ద గరిష్టంగా 35 మీటర్లు, కనిష్టంగా 22 మీటర్లు లోతుతో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 600 మీటర్ల వరకు కోతకు గురై 36.5 మీటర్ల లోతుతో భారీ అగాధం ఏర్పడింది. ఇలా చంద్రబాబు నిర్వాకం వల్ల జరిగిన విధ్యంసంతో పోలవరం పనుల్లో జాప్యమే కాకుండా, అదనపు వ్యయాన్నీ భరించాల్సి వస్తోంది. టెండర్లకు రంగం సిద్ధం గోదావరికి వరదలు వచ్చేలోగా ప్రధాన డ్యామ్ వద్ద ఏర్పడిన భారీ అగాధాలను పూడ్చివేత, డయాఫ్రమ్ వాల్‌ను పటిష్టవంతం చేసే పనులను పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఆదేశించిన నేపథ్యంలో తక్షణమే ఆ పనులు చేపట్టడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు.నిబంధనల మేరకు లంసం ఓపెన్ విధానంలో టెండర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన టెండర్లను ఖరారు చేసి రివర్స్ టెండరింగ్‌లో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. పునరావాసంపై బాబు చేతులెత్తేసి.. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మిస్తే తామంతా ముంపునకు గురవుతామని, పునరావాసం కల్పించాలని 103 గ్రామాల ప్రజలు సీడబ్ల్యూసీని ఆశ్రయించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సీడబ్ల్యూసీ ఆదేశించింది. కమీషన్ల కోసం నిర్మాణాన్ని నెత్తికెత్తుకున్న చంద్రబాబు సర్కారు.. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక చేతులెత్తేసింది. ఎగువ కాఫర్ డ్యామ్‌కు కుడి, ఎడమ వైపు 400 మీటర్ల చొప్పున, దిగువ కాఫర్ డ్యామ్ కుడి వైపున 600 మీటర్లు ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. దీంతో గోదావరి ప్రవాహానికి అడ్డంకులేర్పడ్డాయి. -
కోతకు గురైన ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్
సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉద్ధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో ఇరువైపులా కోతకు గురైన ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ సూచించింది. కోతకు గురికాని ప్రాంతంలో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడంపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జలవనరుల శాఖ అధికారులతో భేటీ గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో ఏర్పడిన భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ (బోరు బావి తవ్వి వైబ్రో కాంపాక్షన్ యంత్రంతో అధిక ఒత్తిడితో భూగర్భాన్ని మెలి తిప్పడం ద్వారా పటిష్టం చేయడం) ద్వారా యథాస్థితికి తేవచ్చంటూ ఏడు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు డీడీఆర్పీ తాజాగా ఆమోదం తెలిపింది. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సమస్యలకు డీడీఆర్పీ పరిష్కార మార్గాలు చూపడంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. పోలవరం పనులను ఏబీ పాండ్య నేతృత్వంలోని డీడీఆర్పీ బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ క్రమంలో ఆదివారం రాజమహేంద్రవరంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఎస్కే సిబాల్, పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు నిర్వహించిన ఎన్‌హెచ్‌పీసీ బృందం సమర్పించిన నివేదికను తాజా సమావేశంలో డీడీఆర్పీ ప్రవేశపెట్టింది. సరిదిద్దే మార్గం ఇలా.. ♦ కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ గ్యాప్–2లో ఎడమ వైపున 175 నుంచి 363 మీటర్ల పొడవున అంటే 188 మీటర్ల పొడవు.. కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల పొడవున అంటే 200 మీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. ఈ ప్రాంతంలో ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని డీడీఆర్పీ ఆదేశించింది. ♦డయాఫ్రమ్ వాల్లో 480 – 510 మీటర్ల మధ్య 30 మీటర్ల పొడవున ఒక చోట, 950 – 1,020 మీటర్ల మధ్య 70 మీటర్ల పొడవున మరోచోట 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ తేల్చింది. ఈ రెండు ప్రాంతాల్లో డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడంపై మరింత అధ్యయనం చేసి సీడబ్ల్యూసీ సూచనల మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డీడీఆర్పీ సూచించింది. ♦మిగతా ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్‌కు రెండు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి (కోర్) నింపి దానిపై ప్రధాన డ్యామ్‌ను నిర్మించేలా సీడబ్ల్యూసీ గతంలో డిజైన్‌ను ఆమోదించింది. అయితే డయాఫ్రమ్ వాల్‌కు ఐదు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి నింపి దానిపై ప్రధాన డ్యామ్‌ను నిర్మించాలని డీడీఆర్పీ సూచించింది. దీనివల్ల ఊట నీటిని డయాఫ్రమ్ వాల్ సమర్థంగా అడ్డుకుంటుందని తేల్చింది. రూ.రెండు వేల కోట్లకు పైగా వ్యయం.. గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడం, కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు సుమారు రూ.రెండు వేల కోట్లు వ్యయం అవుతుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకే 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో అదనంగా వ్యయమయ్యే రూ.రెండు వేల కోట్లను మంజూరు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ చేసిన విజ్ఞప్తిపై డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అధికారుల ప్రతిపాదనకే మొగ్గు.. గోదావరి వరద ఉద్ధృతి ప్రభావం వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం కోతకు గురైంది. గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో 35 మీటర్ల లోతుతో, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. కోతకు గురైన ప్రాంతంతోపాటు భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఏడు నెలల క్రితమే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించగా అప్పట్లో డీడీఆర్పీ తోసిపుచ్చింది. దీంతో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపడుతూనే అగాధాలను పూడ్చేందుకు డీడీఆర్పీ సూచించిన మేరకు 11 రకాల పరీక్షలను నిర్వహించారు. ఆ ఫలితాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటితో సంతృప్తి చెందిన డీడీఆర్పీ ఏడు నెలల క్రితం రాష్ట్ర అధికారులు ప్రతిపాదించిన విధానం ప్రకారమే అగాధాలను పూడ్చి యథాస్థితికి తేవాలని ఆదేశించింది. ఈ పనులను గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాలని సూచించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. -
డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్మానవ తప్పిదమే
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరంపై చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలు.. ప్రణాళికా రాహిత్యం.. కమీషన్ల దాహంతోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిందని ఆది నుంచి చెబుతున్న వాస్తవాలను ఎన్‌హెచ్‌పీసీ నివేదిక అధికారికంగా ధ్రువీకరించింది. చంద్రబాబు పాపాలే ప్రాజెక్టుగా శాపాలుగా మారాయని, లేదంటే 2021 నాటికే సీఎం జగన్ పోలవరాన్ని పూర్తి చేసేవారని నీటి పారుదల రంగ నిపుణులు, అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 800 మీటర్లకు కుచించుకుపోవడంతో.. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ చానల్, స్పిల్‌వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా టీడీపీ సర్కారు ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించడం ఘోర తప్పిదమని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) నివేదిక తేల్చి చెప్పింది. ఆ మానవ తప్పిదం వల్లే 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడంతో ఖాళీ ప్రదేశం 800 మీటర్లకు కుచించుకుపోయి ప్రవహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది వరద ఉద్ధృతి తీవ్రతరం కావడానికి దారితీసింది. అందువల్లే ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గ్యాప్–1లో 35 మీటర్లు, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయని ఎన్‌హెచ్‌పీసీ స్పష్టం చేసింది. గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ ఎడమ వైపున 175 మీటర్ల నుంచి 363 మీటర్ల వరకు ధ్వంసం కాగా కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల వరకు పూర్తిగా ధ్వంసమైందని తేల్చింది. 480 మీటర్ల నుంచి 510 మీటర్ల వరకు, 950 మీటర్ల నుంచి 1,020 మీటర్ల వరకు రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని తేల్చింది. ఫలితంగా భూగర్భంలో గోదావరి ప్రవాహాన్ని సమర్థంగా అడ్డుకట్ట వేయలేదని పేర్కొంది. డయాఫ్రమ్ వాల్‌ను పటిష్టం చేసే చర్యలు చేపడితేనే లీకేజీలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపింది. ఎన్‌హెచ్‌పీసీ సమగ్ర అధ్యయనం.. పోలవరం వద్ద భౌగోళిక పరిస్థితుల రీత్యా వరద ప్రవాహాన్ని మళ్లించే స్పిల్‌వేను నదీ తీరానికి కుడి వైపున రాతి నేలపై, 194.6 టీఎంసీలను నిల్వ చేసే ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్‌ను నదికి అడ్డంగా నిర్మించేలా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రాజెక్టు డిజైన్‌ను ఆమోదించింది. ప్రధాన డ్యామ్‌కి పునాదిగా డయాఫ్రమ్ వాల్ వేయాలని పేర్కొంది. డయాఫ్రమ్ వాల్‌ను నిర్మిస్తేనే భూ గర్భంలో గోదావరి ప్రవాహం ఎగువ నుంచి దిగువకు, దిగువ నుంచి ఎగువకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. అంటే లీకేజీ (ఊట నీరు)కి పూర్తిగా అడ్డుకట్ట వేస్తుంది. ఇది ప్రధాన డ్యామ్ చెక్కు చెదరకుండా కాపాడుతుంది. ప్రధాన డ్యామ్‌కు అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్‌ను గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తి చేశాకే చేపట్టాలి. గత సర్కారు అనాలోచితంగా అందుకు విరుద్ధంగా చేపట్టడంతో 2019లో వచ్చిన వరద ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈ క్రమంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. సీడబ్ల్యూసీ సూచనల మేరకు ఎన్హెచ్పీసీకి ఈ బాధ్యతను అప్పగించింది. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 10 వరకూ నాలుగు రకాల పరీక్షలు నిర్వహించిన ఎన్‌హెచ్‌పీసీ సమగ్రంగా విశ్లేషించి రాష్ట్ర జలవనరుల శాఖకు నివేదిక అందచేసింది. ఈ పాపం.. చంద్రబాబుదే పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నాడు సీఎం హోదాలో చంద్రబాబు కోరారు. ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధం కావడంతో 2016 సెప్టెంబరు 6న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారమే నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం విధించిన షరతులకు చంద్రబాబు తలొగ్గారు. రూ.3,302 కోట్ల విలువైన జలాశయం పనులను ‘ఈనాడు’ రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు, ఎడమ కాలువలో రూ.150 కోట్ల పనులను నాటి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు నామినేషన్‌పై కట్టబెట్టారు. వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేశారు. ఈ పాపాల కారణంగానే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వీటిని సరిదిద్ది సవాళ్లను అధిగమిస్తూ ప్రణాళికాబద్ధంగా సీఎం జగన్ పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. -
మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది
పాప్ సింగర్ షకీరా, స్పెయిన్ ఫుట్‌బాల్ స్టార్ గెరార్డ్ పీక్ మధ్య 12 ఏళ్ల బంధం ముగిసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. అప్పటినుంచి షకీరా, పీక్‌లు ఒకే ఇంట్లో ఉంటున్నా వేర్వేరుగా ఉంటున్నారు. పీక్, షకీరాలు కలిసి బార్సిలోనా ఏరియాలో రెండంతస్తుల ఇల్లును కొన్నారు. షకీరా నుంచి విడిపోయిన తర్వాత పీక్ తన తల్లిదండ్రులతో అదే ఇంట్లో పై అంతస్తులో ఉంటున్నాడు. తాజాగా షకీరా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని అడ్డుగా గోడ కట్టించింది. బార్సిలోనా ఏరియాలో ఉన్న షకీరా ఇంటికి సిమెంట్ మిక్సర్ కాంక్రీట్ లారీ రావడం టీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్ని గొడవల మధ్య వాళ్లతో కలిసి ఉండలేనని అందుకే గోడ కట్టిస్తున్నట్లు షకీరా పేర్కొంది. అయితే షకీరా వ్యవహారశైలిపై పీక్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీక్ తల్లి మాంటిసెరాట్ బెర్నాబ్యూ.. గోడను తీసేయాలని షకీరాను అడిగినప్పటికి ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. ఇక గెరార్డ్ పీక్ 2009 నుంచి స్పెయిన్ ఫుట్‌బాల్ టీంకు ఆడుతున్నాడు. గెరార్డ్ పీక్ జట్టులో బ్యాక్ సెంటర్ ఆటగాడిగా ఉన్నాడు. ఇక మాంచెస్టర్ యునైటెడ్, బార్సిలోనా క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: 71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు షార్ట్ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం -
ఉగ్రవాది ఇంటిగోడ బుల్డోజర్తో కూల్చివేత.. వీడియో వైరల్..
శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది అక్రమంగా నిర్మించిన ఇంటిగోడను జమ్ముకశ్మీర్ అధికారులు కూల్చివేశారు. జేసీబీతో ప్రహరీని నేలమట్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కశ్మీర్ అనంతనాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదిని గులాం నబీ ఖాన్‌గా గుర్తించారు. ఈ ప్రహరీని గోడను అక్రమంగా నిర్మించాడని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమమించుకున్నాడని అధికారులు చెప్పారు. అందుకే చర్యలు చేపట్టి గోడను కూల్చివేసినట్లు వివరించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. Jammu and Kashmir Administration demolishes property of Hizbul Mujahideen terrorist commander Gulam nabi Khan @ Amir Khan, in Anantnag's Pahalgam. 🧐🧐👇 pic.twitter.com/TofBRReHlZ — Naren Mukherjee (@NMukherjee6) December 31, 2022 చదవండి: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం -
Viral Video: వామ్మో.. గోడపై పాకుతున్న కొండచిలువ
-
వామ్మో.. గోడపై పాకుతున్న కొండచిలువ.. ఒళ్లు జలదరించే వీడియో
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి రకరకాల వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. నిత్యం ఫన్నీ, షాకింగ్, ఆశ్చర్యపరిచే లక్షల వీడియోలు నెటిజన్లను దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే భయపడకుండా ఉండలేం! తర్వాత ఏం జరగబోతుందో అనే ఉత్కంఠను రేపుతాయి కూడా. తాజాగా అటువంటి ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మెట్ల పక్కనున్న గోడపై ఓ భారీ కొండచిలువ పాకుతూ పైకి వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాంత నంద తన ట్విటర్లో పోస్టు చేశారు. పైకి వెళ్లడానికి ప్రతీసారి మెట్లు అవసరం లేదు’ అనే కాప్షన్‌తో షేర్ చేశారు. 32 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మెట్లకు ఆనుకుని ఉన్న రెయిలింగ్‌పై కొండచిలువ పాకుతూ ఇంటిపై అంతస్తులోకి వెళ్తుండటంకనిపిస్తోంది. ఈ వీడియో చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ట్విటర్లో పోస్టు చేసిన గంటల్లోనే వైరల్‌గా మారింది. దీనికి వేలల్లో వ్యూస్ వచ్చాయి. అనేకమంది నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. కొండచిలువ ఎక్కుతుండటం చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుందని, వీడియో తీసిన వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఓసారి వీక్షించండి. -
ఫ్యాక్ట్ చెక్ : ఏ రంగు కనిపించినా YSRCP రంగేనంటూ ఎల్లో బ్యాచ్ విష ప్రచారాలు
-
అర్ధరాత్రి గోడదూకి.. మహేష్‌బాబు ఇంట్లోకి చొరబడేందుకు యత్నం
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇంట్లో ఓ యువకుడు గోడదూకి గాయాలపాలయ్యాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్‌నెం 81లో నివసించే మహేష్‌బాబు ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి కృష్ణ(30) అనే యువకుడు గోడ దూకి ఇంట్లోకి చొచ్చుకెళ్ళేందుకు యత్నించాడు. పది అడుగుల ఎత్తున్న గోడ మీది నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శబ్ధానికి అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా తీవ్ర గాయాలతో వ్యక్తి కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆరా తీయగా సదరు యువకుడు మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వచ్చి సమీపంలోని ఓ నర్సరీలో పని చేస్తున్నట్లుగా తేలింది. నిందితుడు కోలుకున్నాక లోతుగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. చదవండి: (25 ఏళ్లకే గుండె సమస్యలు..గోల్డెన్ అవర్‌లో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు) -
జైహింద్ స్పెషల్: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు
స్వాతంత్య్రోద్యమంలో గోడ పత్రికలు ఉద్యమకారులకు ఏమాత్రం తక్కువకాని పాత్రను పోషించాయి. బ్రిటిషర్ల దురహంకారాన్ని వేలెత్తి చూపించాయి. గోడల వైపు తలెత్తి చూడటానికే బ్రిటిష్ అధికారులు సంశయించేంతగా మన తెలుగువాళ్లు గోడ పత్రికలపై నిజాలను నిర్భయంగా రాశారు. నాటి గోడపత్రికల ఆనవాళ్లు నేడు లేవు కానీ, ఆనాటి స్వాతంత్య్ర స్ఫూర్తి నేటి అమృతోత్సవాలలో మహా నగరాల గోడలపై వర్ణ చిత్రాలుగా ప్రతిఫలిస్తూ ఉంది. చదవండి: పెనంలోంచి పొయ్యిలోకి పడిన రోజు! యూరప్‌లో జరిగిన ఫ్యూడల్ వ్యతిరేకోద్యమంలో ఆయుధాలుగా ఆవిర్భవించిన పత్రికలు, ఆ సమాజాన్ని ఆధునీకరించడంలో అమోఘమైన పాత్రను నిర్వహించాయి. అలాగే భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా పత్రికలు అక్షరాయుధాలుగా కీలక భూమికను పోషించాయి. వాటిల్లో గోడ పత్రికలు, కరపత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఉద్యమజ్వాలల్ని రగిలించాయి. తొలి గోడపత్రిక ‘నగరజ్యోతి’ దేశంలోనే తొలి గోడ పత్రికగా నెల్లూరులో ‘నగర జ్యోతి’ నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రజలలో స్వాతంత్రేచ్ఛతోపాటు విజ్ఞానాన్ని వెలిగించింది. నెల్లూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తూములూరి పద్మనాభయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి, వలస పాలనకు వ్యతిరేకంగా ఒక రహస్య సైక్లోస్టైల్ పత్రికను నడిపారు. అది బైటపడడంతో బ్రిటిష్ పోలీసులు ఆయనను ఆరెస్టు చేసి, జైల్లో పెట్టి హింసించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక 1932లో నెల్లూరు ట్రంకు రోడ్డులోని తిప్పరాజువారి సత్రం గోడలపై ‘నగరజ్యోతి’ని వెలిగించారు. కాగితాలపై పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాసి సత్రం గోడలకు అంటించేవారు. ఆ కాగితాలను పశువులు తినేయడంతో, ఆ గోడలను బ్లాక్ బోర్డుగా చేసి చాక్‌పీసులతో వార్తలు రాయడం మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించేవారు. స్వాతంత్య్రం రాకముందే తూములూరి పద్మనాభయ్య క్షయ వ్యాధితో మృతి చెందారు. ఓకే పత్రిక... రెండు గోడలు! పద్మనాభయ్యకు సహాయకులుగా పనిచేస్తున్న ముత్తరాజు గోపాలరావు, ఇంద్రగంటి సుబ్రమణ్యం చెరొక గోడపై ‘నగరజ్యోతి’ కొనసాగించారు. వారిద్దరూ గాంధేయ వాదులు. ముత్తరాజు గోపాలరావు వార్తలలో ఆవేశం పాళ్లు ఎక్కువ. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు నాయకుడు కొండయ్యకు ఆశ్రయం కల్పించారని ముత్తరాజు గోపాలరావును పోలీసులు ఆరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇంద్రగంటితో పోటీ పడలేక, ముత్తరాజు గోపాలరావు తన గోడను కూడా ఆయనకు అప్పగించేశారు. ఇంద్రగంటి తాను వాస్తవమని నమ్మినవే వార్తలుగా రాసేవారు. ఇటు విజయవాడ, అటు మద్రాసు నుంచి వచ్చే రైళ్ల కోసం అర్ధరాత్రి అయినా వేచి చూసి, వేరే వారి కోసం వచ్చిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఫ్రీ ప్రెస్, పేట్రియాట్ వంటి పత్రికలను చూసి గబగబా వార్తలు రాసుకునే వారు. ఆ పత్రికలలో వచ్చిన కార్టూన్లను కూడా వేసేవారు. బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ఇంద్రగంటి సుబ్రమణ్యం ‘నగర జ్యోతి’ ద్వారా బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనను అరెస్టు చేసి వేలూరు జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక చివరి వరకు ఖద్దరునే ధరించారు. స్వాతంత్య్రమే తప్ప కుటుంబాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. వార్తలు రాయడానికి చాక్‌పీసుల కోసం తప్ప, తన కోసం ఏనాడూ చేయిచాచలేదు. తాజా వార్తలను అందించడం తప్ప, ఇంద్రగంటికి వేరే వ్యాపకమే లేదు. నయాపైసా ఆదాయం లేకపోయినా, నాలుగు దశాబ్దాలపాటు ‘నగర జ్యోతి’ని ఆరిపోకుండా కాపాడారు. ఇంద్రగంటి 1976 సెప్టెంబర్ 16వ తేదీన తుదిశ్వాస విడిచేవరకు వార్తలను విడవలేదు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వం రెండున్నర ఎకరాలను ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో శాలువాతో సరిపెట్టుకుంది. విద్వాన్ విశ్వంకి జైలు! కవి, రచయిత, పండిత పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు విద్వాన్ విశ్వం బ్రిటిష్ పాలనలో ‘యుద్ధం వల్ల కలిగే ఆర్థిక ఫలితాలు’ అన్న కరపత్రం వేసినందుకు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఖాసా సుబ్బారావు టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన ‘స్వరాజ్య’ పత్రికలో ఎడిటర్‌గా 12 ఏళ్లు పనిచేశారు. మరెందరో చరిత్రకందని పాత్రికేయులు స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్నారు. – రాఘవ శర్మ -
హాస్టల్ గోడ దూకి.. 150 సీసీ కెమెరాల కళ్లుగప్పి..
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి నలుగురు విద్యార్థినులు పారిపోయిన ఘటన చంద్రగిరిలో కలకలకం సృష్టించింది. వెస్ట్ డీఎస్పీ నరసప్ప కథనం మేరకు.. విజయనగరం, విజయవాడ, కడప, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థినులు చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలలో ఉంటూ చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. వీరిలో ఇద్దరు విద్యార్థినులు మైనర్లు. వీరు డిగ్రీ చదువుకుంటూ.. హాస్టల్లో వేదాలు, హిందూ సంప్రదాయాలు నేర్చుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు అమ్మాయిలు హాస్టల్ వెనుక వైపు నుంచి 8 అడుగుల ఎత్తయిన గోడదూకి పారిపోయారు. హాస్టల్ ఇన్చార్జి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ గుర్తించేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, హాస్టల్ నుంచి వెళ్లే మూడు రోజులకు ముందు ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఓ బయటి వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం రెండు సార్లు ఎవరితోనో మాట్లాడినట్లు తెలుస్తోంది. సుమారు 350 మంది ఉన్న హాస్టల్లో 150కి పైగా సీసీ కెమెరాలు, 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా విద్యార్థినులు పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
గోడ కన్నంలో ఇరుక్కున్న దొంగ..