Shakira Builds Wall To Separate House From Ex-Partner Gerard Pique, Deets Inside - Sakshi
Sakshi News home page

Shakira: మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మొహం చూడకూడదని గోడ కట్టించింది

Published Wed, Jan 18 2023 12:17 PM | Last Updated on Wed, Jan 18 2023 1:18 PM

Shakira Builds-Wall To-Separate House From Ex-Partner Gerard Pique - Sakshi

పాప్‌ సింగర్‌ షకీరా, స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ గెరార్డ్‌ పీక్‌ మధ్య 12 ఏళ్ల బంధం ముగిసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. అప్పటినుంచి షకీరా, పీక్‌లు ఒకే ఇంట్లో ఉంటున్నా వేర్వేరుగా ఉంటున్నారు. పీక్‌, షకీరాలు కలిసి బార్సిలోనా ఏరియాలో రెండంతస్తుల ఇల్లును కొన్నారు. షకీరా నుంచి విడిపోయిన తర్వాత పీక్‌ తన తల్లిదండ్రులతో అదే ఇంట్లో పై అంతస్తులో ఉంటున్నాడు. 

తాజాగా షకీరా తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మొహం చూడకూడదని అడ్డుగా గోడ కట్టించింది. బార్సిలోనా ఏరియాలో ఉన్న షకీరా ఇంటికి సిమెంట్‌ మిక్సర్‌ కాంక్రీట్‌ లారీ రావడం టీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది.  ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇన్ని గొడవల మధ్య వాళ్లతో కలిసి ఉండలేనని అందుకే గోడ కట్టిస్తున్నట్లు షకీరా పేర్కొంది. అయితే షకీరా వ్యవహారశైలిపై పీక్‌ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీక్‌ తల్లి  మాంటిసెరాట్‌ బెర్నాబ్యూ.. గోడను తీసేయాలని షకీరాను అడిగినప్పటికి ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. ఇక గెరార్డ్‌ పీక్‌ 2009 నుంచి స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ టీంకు ఆడుతున్నాడు. గెరార్డ్‌ పీక్‌ జట్టులో బ్యాక్‌ సెంటర్‌ ఆటగాడిగా ఉ‍న్నాడు. ఇక మాంచెస్టర్‌ యునైటెడ్‌, బార్సిలోనా క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.

చదవండి: 71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు

షార్ట్‌ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement