Shakira
-
Anant - Radhika Cruise Party : షకీరా ఆట పాట, ఫీజు తెలిస్తే ఫ్యూజులెగిరిపోతాయ్!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్‌ను జూలై 12, 2024న వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో స్టార్-స్టడెడ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఇపుడిక రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. బిలియనీర్ స్టేటస్‌కి తగ్గట్టుగా ఈసారి ఇటలీలో క్రూయిజ్ షిప్లో నిర్వహిస్తుండటం విశేషం.నాలుగు రోజుల ఈవెంట్ల గురించిన వివరాలతో నిండిన రెండవ ప్రీ-వెడ్డింగ్ ఇన్విటేషన్, ప్లాన్, ఫోటోలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. పాపులర్ పాప్ సింగర్, పాటల రచయిత షకీరా అనంత్ రాధిక క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఈవెంట్ కోసం రూ.10-15 కోట్లు చార్జ్ చేయనుందని తెలుస్తోంది.కాగా ఇటలీలో మే 29 నుండి జూన్ 1, 2024 వరకు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ల రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. వెల్కం డిన్నర్, మే 30, 2024న 'రోమన్ హాలిడే' , 'లా డోల్స్ ఫార్ నియెంటె', 'టోగా పార్టీ'. ఆ తర్వాత, మే 31, 2024న ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా కుమార్తె, వేద తొలి ఏడాది పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. కొన్నిఇప్పటికే సల్మాన్‌ఖాన్, అలియా, రణబీర్‌దంపతులు, రణ్వీర్ సింగ్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యామిలీ ఇటలీకి పయనమైన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలతోపాటు, పలువురు ప్రముఖులు దాదాపు 800మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే జామ్‌నగర్ ఈవెంట్ కోసం రూ.1259 కోట్లు, కేవలం కేటరింగ్‌కే ఏకంగా రూ. 210 కోట్లు ఖర్చు చేసిన అంబానీ కుటుంబం ఈ సారి ఎంత వెచ్చిస్తోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. -
బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో షకీరా విగ్రహం ఆవిష్కరణ
గ్రామీ అవార్డు విజేత సింగర్ షకీరా బెల్లి డ్యాన్స్‌కు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు! తన బెల్లి డ్యాన్స్‌తో అభిమానుల ప్రేమను కొల్లగొట్టిన ఈ కొలంబీయన్ సింగర్ క్యాంసం విగ్రహన్ని ఆమె సొంత సిటీ బారన్క్విల్లాలో ఆవిష్కరించారు. బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో ఉన్న 6.5 మీటర్లు (21 అడుగుల) విగ్రహాన్ని బారన్క్విల్లా మేయర్ జైమ్ పుమారెజో, ఆమె తల్లిదండ్రుల సమక్షంలో నగరంలోని మాగ్డలీనా నది తీరంలో మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కాంస్య విగ్రహంలో షకీరా.. పొడవాటి రింగుల జుట్టుతో చేతులు పైకి ఎత్తి బెల్లి డ్యాన్స్ చేస్తున్న పోజ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ విగ్రహ రూప శిల్పి అయిన యినో మార్క్వెజ్ మాట్లాడుతూ..‘అమ్మాయిలు తమ జీవితంలో ఎటువంటి కలలు కంటారో. వాటిని ఎలా సాధిస్తారో షకీరా కాంస్య విగ్రహం ద్యారా తెలుస్తుంది’ అని తెలిపారు. స్థానిక పిల్లలకు సంబంధించి పలు పాటల కాన్సెర్టుల్లో షకీరాను చూశానని మేయర్ జైమ్ పుమారెజో తెలిపారు. షకీరా 2023లో మూడు లాటిన్ గ్రామీ అవార్డులు గెలుపొందారు. oh shakira, don't end the liberty statue like that pic.twitter.com/6w5a5HUaAw — alexander AG7 ERA (@grandesrockwell) December 26, 2023 మరోవైపు ఆమె ‘పైస్ డెస్కాల్జోస్’, ‘బేర్ ఫుట్’ అనే సంస్థల ద్వారా పిల్లల కోసం స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షకీరా మియామిలో ఉంటోంది. తన కాంస్య విగ్రహం ఆవిష్కరణపై మేయర్ కార్యాలయానికి ఆమె ఓ సందేశం పంపారు. ‘నా కాంస్యం విగ్రహం ఆవిష్కరించం పట్ల చాలా గొప్పగా భావిస్తున్న. ‘బారన్క్విల్లా’ సీటీ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సిటీ నాకు సొంత ఇల్లుతో సమానం’ అని షకీరా తెలిపారు. -
జైలుశిక్ష తగ్గించేందుకు రూ.6 కోట్ల ఒప్పందం చేసుకున్న పాప్‌సింగర్
పాప్ స్టార్ షకీరా పన్ను ఎగవేతపై నమోదైన కేసు విచారణలో భాగంగా స్పెయిన్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దానివల్ల తన జైలు శిక్ష తగ్గించుకున్నట్లు తెలిసింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. 2012-2014 మధ్య కాలంలో స్పెయిన్ ప్రభుత్వానికి రూ.131 కోట్లు పన్ను చెల్లించలేదని షకీరాపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన తర్వాత షకీరాకు 8 ఏళ్ల 2 నెలలు జైలు శిక్షతోపాటు రూ.216 కోట్లు జరిమానా విధించారు. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. సోమవారం జరిగిన కోర్టు విచారణలో భాగంగా అధికారులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. స్పానిష్ ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలో విఫలం అయినట్లు ఆమె ఒప్పుకున్నారు. మూడేళ్లు జైలు శిక్ష, రూ.6.3 కోట్లు జరిమానా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. షకీరా కఠిన నిర్ణయం తీసుకున్నారని, తన కెరియర్, పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఈ ఒప్పందం చేసుకున్నారని ఆమె తరఫు వాదించిన న్యాయవాద సంస్థ మిరియం కంపెనీ తెలిపింది. ఆమె తరఫు వాదించేలా అన్ని అంశాలను సిద్ధం చేశామని, కానీ తను అమాయకత్వం వల్ల అధికారులతో ఈ ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 2012-2014 వరకు తను బహమాస్‌లో నివాసం ఉన్నట్లు, పన్ను ప్రయోజనాల కోసం తనను స్పానిష్ నివాసిగా పరిగణించకూడదని షకీరా అభ్యర్థించినట్లు తెలిసింది. కానీ స్పానిష్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. షకీరా 2012లో 242 రోజులు, 2013లో 212 రోజులు, 2014లో 243 రోజులు స్పెయిన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్పెయిన్ చట్టంలోని నియమాల ప్రకారం 183 రోజుల కంటే ఎక్కువ కాలం దేశంలో గడిపిన వ్యక్తులు తమ ఆదాయాలను ప్రకటించి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షకీరా చాలాకాలం స్పెయిన్‌లో నివసించిందని, తన ఆదాయాలను దాచిపెట్టడానికి ప్రయత్నించినట్లు అధికారులు చెప్పారు. -
ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు!
కొలంబియాకు చెందిన 46 ఏళ్ల పాప్ సింగర్ షకీరా గతేడాది స్టార్ ఫుట్‌బాలర్ గెరార్డ్ పీక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో షకీరా తరచుగా ఇద్దరు వ్యక్తులతో క్లోజ్‌గా మూవ్ అవడం కనిపించింది. అందులో ఒకరు ఏడుసార్లు ఫార్ములావన్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ అయితే.. మరొకరు హాలీవుడ్ యాక్షన్ హీరో.. మిషన్ ఇంపాజిబుల్(Mission Impossible) ఫేమ్ టామ్ క్రూజ్. ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యనే లూయిస్ హామిల్టన్ పాల్గొన్న మియామి గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో షకీరా ప్రత్యక్షమయ్యింది. రేసు ముగిసిన తర్వాత హామిల్టన్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లడం చర్చకు దారి తీసింది. వీరిద్దరి మధ్య ఏదో సమ్‌థింగ్ ఉన్నట్లు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. షకీరా మాత్రం మేమిద్దరం(లూయిస్ హామిల్టన్) మంచి ఫ్రెండ్స్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతకముందు ఈ ఇద్దరు యాచ్‌లో షిప్పింగ్‌తో పాటు పలు సందర్భాల్లోనూ చెట్టాపట్టాలేసుకొని తిరగినట్లు సమాచారం. మరోవైపు యాక్షన్ హీరో టామ్ క్రూజ్‌తో కూడా షకీరా ప్రేమాయణం నడుపుతుందని కొంతమంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ షకీరా కంటే టామ్ క్రూజ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా షకీరాతో డేటింగ్‌కు వెళ్లాలని టామ్ క్రూజ్ అనుకున్నాడని.. ఇంతలో వీరి మధ్యలోని లూయిస్ హామిల్టన్ వచ్చి చేరాడు. కాగా లూయిస్ హామిల్టన్‌తో షకీరా కలిసి తిరగడం టామ్ క్రూజ్‌కు నచ్చలేదని.. అందుకే ఈగో డెంట్ అంటూ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ 50 ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్న షకీరా తన అందంతో ఇద్దరు సూపర్స్టార్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం ఆసక్తి కలిగించింది. ఇక ఫార్ములావన్ స్టార్ లూయిస్ హామిల్టన్ 2015 వరకు పుస్సీక్యాట్ డాల్స్ సింగర్ నికోల్ షెర్జింజర్తో రిలేషన్లో ఉన్నాడు. మరోవైపు టామ్ క్రూజ్ మిమి రోజర్స్(1987-1990), నికోల్ కిడ్మన్(1990-2001), కేటీ హోమ్స్(2006-2012)తో రిలేషిన్షిప్ కొనసాగించాడు. చదవండి: #MoeenAli: స్టోక్స్ 'బూడిద'.. టెస్టుల్లోకి తిరిగి వచ్చేలా చేసింది వద్దనుకొని 23 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఆమెతోనే పెళ్లి -
మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది
పాప్ సింగర్ షకీరా, స్పెయిన్ ఫుట్‌బాల్ స్టార్ గెరార్డ్ పీక్ మధ్య 12 ఏళ్ల బంధం ముగిసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. అప్పటినుంచి షకీరా, పీక్‌లు ఒకే ఇంట్లో ఉంటున్నా వేర్వేరుగా ఉంటున్నారు. పీక్, షకీరాలు కలిసి బార్సిలోనా ఏరియాలో రెండంతస్తుల ఇల్లును కొన్నారు. షకీరా నుంచి విడిపోయిన తర్వాత పీక్ తన తల్లిదండ్రులతో అదే ఇంట్లో పై అంతస్తులో ఉంటున్నాడు. తాజాగా షకీరా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని అడ్డుగా గోడ కట్టించింది. బార్సిలోనా ఏరియాలో ఉన్న షకీరా ఇంటికి సిమెంట్ మిక్సర్ కాంక్రీట్ లారీ రావడం టీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్ని గొడవల మధ్య వాళ్లతో కలిసి ఉండలేనని అందుకే గోడ కట్టిస్తున్నట్లు షకీరా పేర్కొంది. అయితే షకీరా వ్యవహారశైలిపై పీక్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీక్ తల్లి మాంటిసెరాట్ బెర్నాబ్యూ.. గోడను తీసేయాలని షకీరాను అడిగినప్పటికి ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. ఇక గెరార్డ్ పీక్ 2009 నుంచి స్పెయిన్ ఫుట్‌బాల్ టీంకు ఆడుతున్నాడు. గెరార్డ్ పీక్ జట్టులో బ్యాక్ సెంటర్ ఆటగాడిగా ఉన్నాడు. ఇక మాంచెస్టర్ యునైటెడ్, బార్సిలోనా క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: 71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు షార్ట్ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం -
వేరే అమ్మాయితో నా మాజీ బాయ్‌ఫ్రెండ్, గుండె పగిలింది: సింగర్
మ్యూజిక్ క్వీన్ షకీరా - ఫుట్‌బాల్ ప్లేయర్ గెరార్డ్ పిక్ ఇద్దరూ ఇటీవలే బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే! అయితే విడిపోయి నెల రోజులైనా కాకముందే గెరార్డ్ మరో అమ్మాయితో లవ్‌లో పడ్డాడు. మోడల్ క్లారా చియాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. వీరిద్దరూ చేతిలో చేయేసి నడుస్తున్న ఫొటోలు, స్విమ్మింగ్ పూల్‌లో ముద్దులు పెట్టుకుంటున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పుడే వేరొక అమ్మాయితో ఇలా తిరుగుతుండటం చూసి తట్టుకోలేకపోయిందీ సింగర్. ఈ ఫొటోలు చూసి తన గుండె పగిలిందంటూ అక్కడి మీడియాతో వాపోయిందట. కాగా షకీరా కంటే గెరార్డ్ పదేళ్లు చిన్నవాడు. షకీరా పాడిన వకా వకా సాంగ్ వీడియోలో గెరార్డ్ ఉన్నాడు. అలా వీళ్లిద్దరికీ పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. 2010 నుంచి డేటింగ్ చేసుకుంటున్నా, ఈ విషయాన్ని షకీరా 2011లో అధికారికంగా వెల్లడించింది. వీరిద్దరికీ 2013లో మిలన్, 2015లో సాషా అని ఇద్దరు కొడుకు జన్మించారు. పాప్ సింగర్‌కు పెళ్లంటే భయం ఉండటంతో వీరు వివాహం చేసుకోకుండానే పదకొండేళ్లుగా కలిసి జీవించారు. ఈ ఏడాది జూన్‌లో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం షకీరా డ్యాన్సింగ్ విత్ మైసెల్ఫ్ అనే టీవీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. (ఫొటో సేకరణ: సీఎన్ఎన్) View this post on Instagram A post shared by TEVERED MX (@teveredmx) చదవండి: హృతిక్ రోషన్.. హీరోయిన్ ప్రైవేట్ ఫొటోలు చూపించాడు ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా? -
Shakira Tax Fraud Case:మ్యూజిక్ క్వీన్ షకీరాకు జైలు శిక్ష ముప్పు
మాడ్రిడ్: కొలంబియాకు చెందిన ప్రఖ్యాత పాప్ గాయని, గ్రామీ అవార్డు గ్రహీత షకీరాకు పన్ను ఎగవేత కేసులో ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు శుక్రవారం చెప్పారు. ఆమె దోషిగా తేలితే కచ్చితంగా జైలు శిక్షతో పాటు 2.4 కోట్ల యూరోల జరిమానా విధించాలని కోరతామన్నారు. 2012– 2014 మధ్య స్పెయిన్ ప్రభుత్వానికి 1.5 కోట్ల యూరోల మేర పన్ను ఎగవేసినట్లు షకీరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెటిల్మెంట్ చేసుకోవాలన్న లాయర్ల సూచనను షకీరా తిరస్కరించారు. షకీరా పన్ను చెల్లింపు బాధ్యతను నెరవేర్చారని ఆమె తరపు ప్రజా సంబంధాల సిబ్బంది వెల్లడించారు. -
Pandora Papers: రహస్య లావాదేవీల కుంభకోణం.. సచిన్‌కు క్లీన్చిట్!
Pandora Papers 2021 Sachin Name: లక్షల మంది ప్రముఖుల గోప్యపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ‘పండోరా పేపర్స్-2021’ స్కాండల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ అధ్యక్షుల మొదలు.. సినీ తారల దాకా లక్షల మంది విదేశీ రహస్య ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన రహస్య డాక్యుమెంట్లను ఇంటర్నేషనల్ కన్సోర్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులకు డాక్యుమెంట్లలో క్లీన్చిట్ దక్కగా.. ఆ పేర్లలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఉన్నారు. Pandora Papers 2021 వ్యవహారంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు పరోక్షంగా క్లీన్చిట్ ఇచ్చింది ఐసీఐజే నివేదిక. సచిన్ విదేశీ పెట్టుబడులు సక్రమేనని, ఈ విషయాన్ని ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు సైతం ధృవీకరించినట్లు ఆయన తరపు అటార్నీ స్టేట్మెంట్ను పండోరా పేపర్స్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు కేవలం సచిన్ పేరును మాత్రమే పత్రాల్లో పేర్కొన్నామని, ఆయన రహస్య లావాదేవీలకు సంబంధించి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని తెలిపింది . ఇక పాప్ సింగర్ షకీరా, సూపర్ మోడల్ మిస్ షిఫ్ఫర్‌లకు సైతం క్లీన్ చిట్ లభించింది. ఏమిటీ పనామా పేపర్స్.. నల్ల ధనవంతుల గుట్టురట్టు! ఇమ్రాన్ సర్కార్‌పై విమర్శలు మరోవైపు అధికారికంగా వెల్లడించని ఆర్థిక లావాదేవీల వివరాలతో కూడిన పండోరా పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. నేతలు, మాజీ నేతలు, అధికారులు, ఇతరత్ర సెలబ్రిటీల పేర్లు మొత్తంగా 91 దేశాల నుంచి(భారత్ నుంచి 300 మంది పేర్లు) అందులో పేర్కొని ఉన్నాయి. మొత్తం పద్నాలుగు రంగాల్లో, దాదాపు 956 కంపెనీల్లో వీళ్లంతా రహస్య పెట్టుబడులు పెట్టడం లేదంటే ఆస్తుల్ని కలిగి ఉన్నట్లు సమాచారం. భారత్ నుంచి ఆరుగురు, పాక్ నుంచి ఏడుగురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ నివేదిక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇరకాటంలో పడేసింది. ఆయన సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, ఆయన కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయని పండోరా పేపర్స్ వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు, పీఎంల్–క్యూ పార్టీ నేత చౌదరి మూనిస్ ఎలాహీకి అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉందని పత్రాల్లో బహిర్గతమైంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాకే దర్యాప్తునకు ముందుకెళ్తామని పాక్ ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలు, 150 మీడియా ఔట్లెట్స్, 600 మంది జర్నలిస్టుల నుంచి సమగ్ర దర్యాప్తు చేపించుకుని ఈ వివరాలను సేకరించి బట్టబయలు చేసినట్లు ప్రకటించుకుంది ఇంటర్నేషనల్ కన్సోర్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించిన 12 మిలియన్ల (1.20 కోట్లు) పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలను సృష్టించారని తెలిపింది. ఇదిలా ఉంటే పండోరా పేపర్స్ వివరాలు కేవలం ఆరోపణలు మాత్రమే. వీటిపై దర్యాప్తు చేయించడం, చేయించకపోవడం సంబంధిత ప్రభుత్వాల ఇష్టం. -
కొడుకుతో పార్క్‌కు వెళ్లిన షకీరా.. ఒక్కసారిగా అడవి పందుల దాడి
కొలంబియన్ పాప్ సింగర్ షకీరా పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమెపై ఇటీవల రెండు అడవి పందులు దాడి చేసినట్లు గాయని సోషల్ మీడియాలో తెలిపింది. ఈ విషయం గురించి చెబుతూ మురికిగా, చిరిగిన తన బ్యాగ్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. కొడుకుతో కలిసి సేద తీరడానికి బార్సీలోనాలోని ఓ పార్క్‌కి వెళ్లగా, ఆ సమయంలో ఒక్కసారిగా రెండు అడవి పందులు అక్కడికి వచ్చి ఆమెపై దాడికి దిగాయని షకీరా తెలిపింది. తన బ్యాగ్‌ని, ఫోన్ నోట కరుచుకుని అడవిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాయని, అంతే కాకుండా అందులోని అన్ని వస్తువులను నాశనం చేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే దాడి అనంతరం చిరిగిపోయిన బ్యాగ్‌ను తీసుకున్న ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చదవండి: ‘గాంధీ’ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షల మంది భారతీయులు: హాలీవుడ్ నటుడు -
మేకప్ లేకున్నా మరింత అందంగా..!
అందంగా ముస్తాబవడం అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ వేడుకలోనైనా తామే ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’గా ఉండాలని కోరుకుంటారు మగువలు. అయితే కొంతమంది సహజంగా ఉండటానికి ఇష్టపడితే.. ఇంకొంత మంది మేకప్‌తో తమ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ విషయంలో హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. వాళ్లు మేకప్ లేకుండా బయటకు వచ్చే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి తమ ఆరాధ్య నటీమణుల నిజ రూపం ఎలా ఉంటుంది, వాళ్లు ఎలాంటి కాస్మొటిక్స్ వాడతారో తెలుసుకోవాలని మహిళా అభిమానులు ఉబలాటపడుతుంటారు. అయితే ‘అందం’గా కనిపించడం మన చేతుల్లోనే ఉంటుందని.. మేకప్‌తో దీనికి సంబంధం లేదని నిరూపిస్తున్నారు ఈ అందగత్తెలు. టీవీ, సినీ, సంగీత ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సుందరీమణులు తమ ‘నేచురల్ లుక్’తో కట్టిపడేస్తూ.. సహజత్వమే నిజమైన అందమని చాటిచెబుతున్నారు. కేటీ హోమ్స్, నటి టీవీ సిరీస్ ‘డాసన్స్ క్రీక్’లో జాయ్ పాటర్(ఫీమేల్ లీడ్)గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ 1997లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా రాణిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్క్రూజ్ను పెళ్లాడిన(ప్రస్తుతం విడిపోయారు) 41 ఏళ్ల ఈ భామకు కూతురు ‘సురి’ ఉంది.‘‘50 మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్( పీపుల్స్ మ్యాగజీన్)’’లో ఒకరిగా నిలవడమే గాకుండా పలు సినీ వేడుకల్లో ప్రేక్షకులందరి చూపును తన వైపునకు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ మేకప్ లేకుండా ఇదిగో ఇలా ఉంటారు. నయోమీ వాట్స్, బ్రిటీష్ నటి ఆస్ట్రేలియన్ డ్రామా ‘ఫర్ లవ్ అలోన్’తో ఎంట్రీ ఇచ్చిన నయోమీ ఎలెన్ వాట్స్ నటిగా, నిర్మాతగా గుర్తింపు పొందారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన 51 ఏళ్ల నటీమణి నేచురల్ లుక్ ఇది. టైరా బాంక్స్, అమెరికన్ నటి బాంక్స్గా సినీ అభిమానులకు సుపరిచితమైన ఈ భామ 15 ఏటనే మోడలింగ్ ప్రారంభించారు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నటిగా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా ఎదిగారు. పలు మ్యాగజీన్ కవర్లపై దర్శనమిచ్చి, పారిస్ ఫ్యాషన్ వీక్‌తో పాటు పలు వేడుకల్లో రెడ్ కార్పెట్లపై హొయలొలికించిన 46 ఏళ్ల ఈ ఆఫ్రికన్- అమెరికన్ విత్ అవుట్ మేకప్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. డయానే క్రూగర్, ఫ్యాషన్ మోడల్ జర్మనీలో జన్మించిన డయానే క్రూగర ఫ్యాషన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి నటిగా మారారు. టీవీ షో ది బ్రిడ్స్తో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న డయానే మేకప్ చేసుకుంటేనే అందంగా కనిపిస్తామనుకోవడం అపోహే అని నిరూపిస్తున్నారు. గ్వేన్ స్టెఫానీ, సింగర్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే గ్వేన్ స్టెఫానీ నటిగానూ తనను తాను నిరూపించుకుంటున్నారు. ‘నో డౌట్’మ్యూజిక్ బ్యాండ్‌లో లీడ్ వోకలిస్టు అయిన ఆమె.. జస్ట్ ఏ గర్ల్, స్పైడర్వెబ్స్, డోన్ట్ స్పీక్ వంటి ఆల్బమ్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 90వ దశకంలో పలు ప్రత్యేక ప్రదర్శనల్లో భారత సంప్రదాయానికి అద్దంపట్టే విధంగా నుదుటిన ‘బిందీ’ ధరించేవారు. ఎక్కువగా ముదరు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో కనిపించే ఈ భామ మేకప్ లేకుండా కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అలీసియా సిల్వర్‌స్టోన్ ది క్రష్‌తో 1993లో తెరంగేట్రం చేసిన అలీసియా సిల్వర్‌స్టోన్ బ్యాట్మన్ అండ్ రాబిన్ వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించారు. మూగజీవాల కోసం పోరాడే ఆమె.. పెటా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. వీగన్ అయిన అలీసియా.. ది కైండ్ డైట్ పేరిట పుస్తకం ప్రచురించారు. 43 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తన కూతురితో కలిసి తీసుకున్న సెల్ఫీ ఇది. బెల్లా హదీద్ ఇక వీరితో పాటు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బెల్లా హదీద్, ఇవా లంగోరియా, మిలా జొవోవిచ్, సల్మా హయేక్, పెనెలోప్ క్రూజ్, పాప్ సంచలనం షకీరా, అడెలె, షరాన్ స్టోన్, క్యాథరిన్ జెటా జోన్స్, క్రిస్టియానా, మార్లిన్ మన్రో తదితర సెలబ్రిటీలకు సంబంధించిన ‘నేచురల్ లుక్’ ఎలా ఉంటుందో ఓ సారి చూసేయండి. ఇవా లంగోరియా మిలా జొవోవిచ్ సల్మా హయేక్, పెనెలోప్ క్రూజ్ పాప్ సంచలనం షకీరా అడెలె షరాన్ స్టోన్ క్యాథరిన్ జెటా జోన్స్ క్రిస్టియానా -
లాక్డౌన్లో పట్టభద్రురాలైన పాప్ సింగర్
లాక్డౌన్లో సరదాగా కోసం తీసుకున్న పురాతన తత్త్వశాస్త్రంలో పట్టా పొందారు పాప్ సింగర్ షకీరా. ఈ విషయాన్ని ఆమె శనివారం సోషల్ మీడియాలో వెల్లడించారు. నాలుగు వారాలు పాటు మాత్రమే తీసుకున్న ఈ కోర్సును పూర్తి కావడంతో ఆమెకు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం గురువారం డిగ్రీ సిర్టిఫికేట్ను ఇచ్చింది. ఈ సర్టిఫికెట్ ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ... ‘నేను ఇప్పుడే నాలుగు వారాల పురాతన తత్త్వశాస్త్రంలో డిగ్రీ పొందాను. నా అభిరుచులు కాస్తా అసాధ్యమైనవే అని నాకు తెలుసు. అయితే పిల్లలతో ఈ కోర్సు చేయడం కష్టమే. అయినా వారు నిద్రపోయాక నేను రాత్రంతా మెలకువతో ఉండి ఈ కోర్సు పూర్తి చేశాను’ అని ట్వీట్ చేశారు. (లాక్డౌన్: ‘వీరిని చూస్తే గర్వంగా ఉంది’) I just graduated from my 4 week Ancient Philosophy course with the University of Pennsylvania (@Penn). I know... my hobbies are very impractical, but it took a lot of hours after the kids were asleep. Thank you Plato and predecessors for all the "fun" over the past month! pic.twitter.com/cFTCXDjliX — Shakira (@shakira) April 23, 2020 ఇక తను అందరి కంటే భిన్నంగా ఆలోచించి లాక్డౌన్లో పట్టభద్రులైన షకీరా తెలివికి అభిమానులు ఫిదా అవుతూ ప్రశంసిస్తూంటే మరికొందరు ఇది మీకు ఇప్పడంత ముఖ్యమా అంటూ విమర్శిస్తున్నారు. ‘‘మీరిలా అనవసరమైన కోర్సును తీసుకుని మీ అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తారని అనుకోలేదు. మీకు పిల్లలు ఉన్నారు కదా. ఈ సమయాన్ని వారికి కేటాయించొచ్చు. మీ సమయాన్ని పిల్లలకు ఇచ్చేదాని కంటే ఇది మీకు ముఖ్యమైనదా. అంటే వారు మీకు అంతా ముఖ్యమైన వారు కాదా?’’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (‘ఆ నూనెతో కరోనా చనిపోతుంది’) ఇక లాక్డౌన్లో ఏంచేయాలో తోచక చాలా మంది ఇంట్లో కొత్త కొత్త వంటకాలు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం, టైమ్ పాస్ కోసం టిక్‌టాక్‌లు, డ్యాన్స్‌లు వంటివి చేస్తున్నారు. అయితే వీటన్నింటిని పక్కన పెట్టి షకీరా కొత్తగా ఆలోచించారు. సరదా కోసం తీసుకున్న నాలుగు వారాల ప్రాచీన తత్త్వశాస్త్రంలో షకీరా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. -
సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!
అది సెలబ్రిటీలకు, యువ రాజులకు స్వర్గధామం. ప్రైవేటు బీచుల మీదుగా వీచే చల్లటిగాలులు, అహ్లాదకరమైన వాతావరణంతో అలరారే పరిసరాల మధ్య అనంద డోలికల్లో తేలిపోతూ కమ్మని సువాసనల మధ్య కమనీయ ముచ్చట్లతో మురిసిపోతూ పసందైన వంటకాల రుచులను ఆస్వాదిస్తూ ‘స్వర్గమే కదా ఇదీ!’ అంటూ తూగే ప్రాంతమది. నిజంగా చెప్పాలంటే సెలబ్రిటీలకు అది ఓ రహస్య స్వర్గం. రసమయ లోకం. అన్యులకు అందని ఆనందాల తీరం. అక్కడి రాయల్ విల్లా నిజంగా రారాజుల విల్లానే. అందుకే ప్రముఖ హాలీవుడ్ సెలిబ్రిటీలు లియోనార్దో డికాప్రియా, మెరిల్ స్ట్రీప్, క్రిస్టినో రొనాల్డో, కైలి మినోగ్, మెల్గిబ్సన్లు తరచు వచ్చి పోతుంటారు. గ్రీస్‌లోని అథేనియా రివీరాలో ఓ ప్రైవేటు ద్వీపకల్పమే ఈ స్వర్గధామం. 72 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమై 16 హోటల్ బీచెస్, 8 ప్రైవేటు బీచెస్, రాయల్ విల్లాలు ఉన్నాయి. బంధు, మిత్రులతో కాకుండా సకల పని వారలతో కలసి వచ్చినా వారందరికి తగిన వసతులు అందుబాటులో ఉన్నాయి. విల్లాలలోనే కాకుండా హోటళ్లలో కూడా విశాలమైన పడక గదులు, విశ్రాంతి గదులతో పాటు, స్వీయ పాకానికి వంట శాలలు, అధునిక మధు శాలలు, వ్యాయామానికి ప్రైవేటు జిమ్ములు ఉన్నాయి. సూర్య చంద్రుల ఆగమ, నిష్క్రమణ సంధ్యా కాంతులకు అనుగుణంగా, అల్పాహార, మధ్యాహ్న, విందు భోజనాలను ఆస్వాదించేందుకు అన్ని దిక్కుల అహ్లాద ఏర్పాట్లు ఉన్నాయి. ఒకటేమిటీ మార్బుల్ బాత్రూమ్లతోపాటు ఇండోర్, అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అవసరాన్నిబట్టి వాటిలోని నీరును వేడినీరుగా కూడా మార్చుకునే వెసలుబాటూ ఉంది. 24 గంటలపాటు వంటవాడు అందుబాటులో ఉండడమే కాకుండా 24 గంటలపాటు సర్వీసు ఉంటుంది. సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా ఈ స్వర్గధామంలో అడుగుపెట్టేందుకు ఓ హెలిపాడ్‌తో పాటు హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా చెప్పుకుంటే అమ్మాయికి అబ్బాయి పెళ్లి ఆఫర్ చేసినప్పుడు హెలికాప్టర్ గుండా పుష్పాభిషేకం కూడా చేస్తారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా! అత్యంత ఖరీదు కాబోలు అనుకుంటే పొరపాటే! ఇక్కడి అన్నింటి కన్నా విలాసవంతమైన 400 చదరపు అడుగుల రాయల్ విల్లాలో ఒక రోజు ఉండేందుకు కేవలం లక్ష రూపాయలే. అతిథుల కోసం సూట్లతోపాటు హోటళ్లలో ఒకటేసి గదులు కూడా ఉన్నాయి. పనివారలు, వ్యక్తిగత సిబ్బంది కోసం ఇతర గదులు ఉన్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఇక్కడి సొంత వంటవాళ్లను వెంట తెచ్చుకుంటారు.‘మామ మియా’ సినిమాను 2008లో ఇక్కడే తీశారు. అప్పుడు ఆ సినీ తారలలోపాటు యావత్ నిర్మాణ సిబ్బంధి ఇక్కడే ఉన్నారు. అందుకనే వివిధ స్థాయిల వ్యక్తులను, వారి అవసరాలను, అభిరుచులను దష్టిలో పెట్టుకొని ఇక్కడ తగిన ఏర్పాటు చేశారు. ప్రముఖ గ్రీక్ ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్స్ ఇక్కడి వసతులను ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. రాల్ఫ్ లారెన్, కామెరిచ్, విల్లా లూమి, మురానో లాంటి ప్రముఖ నిపుణులు ఇక్కడి ఫర్నీచర్‌కు రూపకల్పణ చేశారు. అతిథుల అభిరుచులకు అనుగుణంగా పెద్ద పెద్ద చెట్లను తొలగించి కూడా వాటి స్థానంలో ఎప్పటికప్పుడు ఇతర చెట్లను రీప్లాంట్ చేయడం ఇక్కడ మరో విచిత్రం, విశేషం అని కూడా చెప్పవచ్చు. అందమైన అమ్మాయిలు మరింత అందంగా మెరిసి పోవాలనే ఉద్దేశంతోనేమోగానీ రాయల్ విల్లా నిర్వాహకులు ఇటీవల అమ్మాయిల కోసం 24 క్యారెట్ల బంగారు స్విమ్మింగ్ సూట్లుకు తెప్పించారట! -
భారత అమ్మాయిల విజయం
బ్యాంకాంక్: ఆసియా కప్ అండర్ – 18 హాకీ టోర్నమెంట్లో భారత అమ్మాయిల హవా కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 3–1తో మలేసియా జట్టుపై గెలిచి పూల్ ‘ఎ’లో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ (39వ ని.), లాల్రెమ్సియామి (46వ ని.) గోల్స్ చేయగా... మలేసియాకు నురామిరా షకీరా (40వ ని.) గోల్‌ను అందించింది. -
బిలియన్ దాటిన షకీరా..'వాకా..వాకా'
-
100 కోట్ల మంది చూశారట
'వాకా వాకా..' అంటూ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగించిన పాప్ స్టార్ షకీరా ఇపుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది. 2010 ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీల కోసం రూపొందించిన ఈ గీతాన్ని ఇప్పటివరకు 100 కోట్ల మందికి పైగా వీక్షించారట. ఈ విషయాన్ని కొలంబియన్ సూపర్‌స్టార్ ట్విట్టర్లో షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అభిమానులకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్తూ షకీరా వీడియో పోస్ట్ చేసింది. ఇంతటి ఆదరణ అందించిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్ చేసింది. ఈ పాటతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించింది. పాప్ క్వీన్ గా అంతకుముందే స్టార్డమ్ ను సొంతం చేసుకున్నప్పటికీ 'వాకా వాకా' పాటతో షకీరా మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ ప్రత్యేక గీతాన్ని ఆలపిస్తూ చేసిన డాన్స్ తో ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అప్పట్లో ఈ వాకా వాకా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట విడుదలై ఇన్నేళ్లయినా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. Wow! Waka Waka now has more than a BILLION views! The song and the video that changed my life. https://t.co/0W2ycgt3DI Shak — Shakira (@shakira) January 25, 2016 -
ఆ దీవులకు వాళ్లే రారాజులు...
సాక్షి: వినోద, విహార కేంద్రాలకు నిలయాలు దీవులు. అందుకే అవి పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. వీటిలో కొన్ని స్వతంత్ర దేశాలుగా ఉంటే, మరికొన్ని ఇతర దేశాల ఆధీనంలో ఉన్నాయి. కానీ కొన్ని దీవులు మాత్రం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. అమ్మకానికి పెట్టిన ఎన్నో దీవుల్ని ప్రపంచవ్యాప్తంగా పలువురు సొంతం చేసుకున్నారు. ఆయా దీవుల్లోకి మరెవరికీ ప్రవేశం లేకుండా యజమానులే స్వాధీనంలో ఉంచుకుని, వాటికి రారాజులుగా వెలిగిపోతున్నారు. అలా కొన్ని దీవుల్ని సొంతం చేసుకున్న వారి గురించి తెలుసుకుందాం... రోమన్ అబ్రామోవిక్ (హోలాండ్ దీవి).. ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన దీవుల్లో అతి ఖరీదైన దీవిని సొంతం చేసుకున్నది రోమన్ అబ్రామోవిక్ అనే రష్యా వ్యాపారవేత్త. మిల్‌హౌస్ ఎల్ఎల్సీ, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ సహా రష్యాలోని అనేక సంస్థలకు ఆయన అధిపతి. చాలామంది రోమన్ అబ్రామోవిక్ను ఆధునిక రోమన్ సామ్రాజ్యాధినేతగా అభివర్ణిస్తారు. ప్రపంచంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేందుకే ఆయన ఇష్టపడతారు. ఇంతకీ ఆయన కొనుగోలు చేసిన దీవి ఖరీదెంతో తెలుసా.. మన కరెన్సీ ప్రకారం 2,600 కోట్ల రూపాయలు. ఆ దీవి పేరు హోలాండ్. అయితే ఇతరుల్లా దీన్ని సొంతానికి వాడుకోకుండా సాంస్కృతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దీనితోపాటు ఇతర దీవుల్ని కూడా రోమన్ కొనుగోలు చేశాడు. బిల్‌గేట్స్ (గ్రాండ్ బూగ్ కే).. ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఓ దీవిని సొంతం చేసుకున్నాడు. బెలిజ్ దేశంలోని సముద్ర తీరాన ఉన్న అతిపెద్ద ద్వీపాన్ని ఆయన దాదాపు 166 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ దీవి విస్తీర్ణం మొత్తం 314 ఎకరాలు. ఈ దీవిలోని బీచ్‌లు అతి సుందరంగా ఉంటాయి. పలు రకాల సముద్ర జీవులకు కూడా ఈ దీవి నిలయం. ట్యూనికేట్స్, స్టార్ఫిష్, డాల్ఫిన్లు ప్రధాన ఆకర్షణలు. ఇక్కడి సముద్రపు నీరు చాలా దూరం వరకు పారదర్శకంగా కనిపిస్తుంది. స్కూబాడైవింగ్లాంటి జలక్రీడలకు కూడా ఈ దీవి అనువైనదని సమాచారం. ఈ దీవిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర పర్యాటకులెవరికీ ఇందులోకి ప్రవేశం లేదు. కేవలం బిల్‌గేట్స్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే అప్పుడప్పుడు ఈ దీవిలో సేదతీరుతున్నారు. షకీరా (బాండ్స్ కే).. పాప్గాయనిగా ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న షకీరా కూడా ఓ దీవిని కొనుగోలు చేసింది. అంటే ఆ దీవికి ఆవిడే మహారాణి అన్నమాట. ప్రపంచంలో ఖరీదైన దీవుల్ని సొంతం చేసుకున్నవారి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ షకీరాయే. ఈమె ఫ్లోరిడాకు 125 మైళ్ల దూరంలోని బాండ్స్ కే అనే దీవిని కొనుక్కుంది. దాదాపు 110 కోట్ల రూపాయలతో దీన్ని సొంతం చేసుకుంది. ఈ దీవిలో ఐదు సుందరమైన బీచ్‌లున్నాయి. మరో మూడు సరస్సులు కూడా ఉన్నాయి. వీటితోపాటు కోరల్ రీఫ్స్, చేపల వేటకు అనువైన ప్రాంతాలు, అందమైన ప్రకృతి వంటి ఆకర్షణలెన్నో దీవిలో కనిపిస్తాయి. అయితే షకీరా సొంతంగా సేదతీరేందుకు మాత్రమే కాకుండా దీన్నో టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దీన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇందులోని కొంత భాగాన్ని అమ్మకానికి పెట్టే యోచనలో ఉంది షకీరా. మెల్ గిబ్సన్ (మ్యాగో దీవి).. దీవుల కొనుగోలు విషయంలో అందరికంటే ముందు వరుసలో నిలిచేది హాలీవుడ్ తారలే. వీరిలో మెల్గిబ్సన్ ఒకరు. ఈయన కూడా ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేశారు. దాదాపు 5,400 ఎకరాల విస్తీర్ణం కలిగిన మ్యాగో ఐలాండ్‌ను సొంతం చేసుకున్నారు. జపాన్‌కు చెందిన ఓ సంస్థ నుంచి 2005లో వంద కోట్ల రూపాయలు చెల్లించి ఈ దీవిని కైవసం చేసుకున్నారు. పసిఫిక్ సముద్రంలో ఉన్న అతిపెద్ద దీవి ఇదే. దీన్ని పర్యాటకులకోసం కాకుండా సొంతంగా వాడుకునేందుకే మెల్గిబ్సన్ ప్రాధాన్యమిస్తున్నారు. ఎడ్డీ మర్ఫీ(రూస్టర్ కే).. ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసిన మరో హాలీవుడ్ నటుడు, దర్శకులు ఎడ్డీ మర్ఫీ. అత్యధిక పారితోషికం అందుకుంటున్న తారల్లో ఈయన కూడా ఒకరు. ఎడ్డీ బాల్యమంతా లాంగ్ అనే దీవిలోనే గడిచింది. అందువల్లే ఆయనకు దీవులంటే చాలా ఇష్టం. అందువల్లే 2007లో దాదాపు వంద కోట్లు చెల్లించి రూస్టర్ కే అనే దీవిని కొనుగోలు చేశాడు. ప్యారడైజ్ అనే మరో దీవికి సమీపంలోనే ఉండే రూస్టర్ దీవి ఇప్పటికీ ప్రజలకు ఓ మిస్టరీగానే ఉంది. ఎడ్డీ ఇంతకుముందు కూడా కొన్ని దీవులను కొనుగోలు చేశాడు. వాటన్నింటిలోకి రూస్టర్ చాలా అందమైన దీవి అని సమాచారం. ప్రస్తుతం ఎడ్డీ తన పరివారంతో సేదతీరేందుకు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నారు. అయితే ఈ దీవిని అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయట. బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఇండిగో దీవి).. ప్రపంచ కుబేరుల్లో ఒకడైన వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ కూడా దీవిని కొనుగోలు చేశాడు. బహమాస్ దీవుల సమూహంలోని ఇండిగో ఐలాండ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. దాదాపు 232 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ దీవి మొత్తం విస్తీర్ణం 133 ఎకరాలు. ఈ దీవిని బెర్నార్డ్ సేదతీరేందుకు వినియోగిస్తాడు. అందమైన బీచ్‌లు కలిగిన దీవి పర్వతప్రాంతంలో బెర్నార్డ్ మరింత అందమైన విల్లాను నిర్మించుకున్నాడు. తన అభిరుచికి అనుగుణంగా టెన్నిస్ కోర్టులతో సహా ఇతర వసతులను సమకూర్చుకున్నాడు. ఇది కూడా పూర్తిగా బెర్నార్డ్ వ్యక్తిగత అవసరాలకోసమే వినియోగిస్తుండడంతో ఇతరులకు ఇక్కడికి ప్రవేశం లేదు. -
పసిమొగ్గను చిదిమేశారు!
కక్షలకు బాలుడు బలి వైసీ బండపల్లెలో దారుణం రేగిపండ్లు కోసిస్తానని తీసుకెళ్లి.. బాలుని చంపి గుహలో పడేసిన వైనం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దంపతుల మధ్య ఏర్పడిన చిన్నపాటి విభేదాలు చినికిచినికి గాలివానగా మారి ఓ పసిబిడ్డ నిండు జీవితాన్ని చిదిమేశాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పగ పెంచుకుని.. భర్త తరపు బంధువుల బిడ్డను పొట్టనపెట్టుకున్నారు. ఈ సంఘటన పలమనేరు నియోజకవర్గం వి.కోటలో జరిగింది. వి.కోట: భార్యభర్తల గొడవ, ఇరువర్గాల వుధ్య వైషవ్యుంగా మారి చివరికి.. ఓ బాలుడి దారుణ హత్యకు దారి తీసింది. వి.కోట మండలం వైసి బండపల్లెకు చెందిన మున్వర్‌కు పలవునేరు వుండలానికి చెందిన షకీరాకు 15 ఏళ్ల క్రితం వివాహం అరుుంది. మున్వర్‌కు ఇది రెండో వివాహం. ఈ నేపథ్యంలో వీరి వుధ్య వునస్పర్థలు రావడంతో గత కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. వుున్వర్‌కు అతని బంధువైన రఫీక్ ఇటీవల వురో వివాహం జరిపించాడు. షకీరా భర్తకు వురోపెళ్లి చేశాడని ఆమె బంధువులు రఫీక్‌పై కక్షపెంచుకున్నారు. ఈ నేపథ్యంలో రఫీక్ కువూరుడైన షేక్‌రిజ్వాన్(10)పై వారి కన్ను పడింది. అదే గ్రావూనికి చెందిన బాబారిజ్వాన్తో కలసి బాలుడిని హతవూర్చేందుకు పథకం పన్నారు. గురువారం సాయుంత్రం పాఠశాల పూర్తయిన తర్వాత ఆడుకుంటున్న బాలుడిని సమీప అడవిలో రేగిపళ్లు కోసిస్తానని చెప్పి బాబా రిజ్వాన్ పిలుచుకునిపోయూడు. అయితే బాలుడు రాత్రైనా ఇంటికి చేరుకోకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని బాబా రిజ్వాన్ రేగిపళ్ల కోసం తీసుకెళ్తుండడం చూసిన వ్యక్తులు బంధువులకు సవూచారవుందించారు. గ్రావుస్తులు బాబా రిజ్వాన్‌ను ప్రశ్నించగా తనకు తెలియుదని బుకారుుంచాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయుడంతో తానే బాలుడిని గ్రావు సమీపంలోని దాబాల గుట్ట వద్ద తీసుకెళ్లి తీగలతో గొంతుకు ఉరివేసి హతవూర్చినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు, స్థానికులు కలసి దాబాల గుట్ట వద్దకు చేరుకున్నారు. అతి కష్టం మీద బాలుడి వుృతదేహన్ని గుర్తించి వెలికి తీశారు. సంఘటనా స్థలానికి కుప్పం సీఐ రాజశేఖర్ చేరుకుని వివరాలు ఆరా తీశారు. నిందితుడైన బాబా రిజ్వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరుుతే నిందితుడు బాబా రిజ్వాన్ బాలుడి హత్యకు దారితీసిన కారణాలను ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా చెబుతుండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తనతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా హత్యకు సహకరించినట్లు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే తాను ఆర్థికంగా స్థితివుంతుడు కాకపోవడం వల్లే తనకు పెళ్లి కాలేదని, అందుకే షేక్రిజ్వాన్ను కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించాలని భావించినట్టు బాబా రిజ్వాన్ కొందరు గ్రామస్తులకు చెప్పినట్లు సమాచారం. హత్యకు గురైన బాలుడు షేక్‌రిజ్వాన్ స్థానిక పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. కారణం ఏదేమైనప్పటికీ సంచలనం రేపిన బాలుడి హత్య కేసు వివరాలు పోలీసుల విచారణలో నిగ్గు తేలాల్సి ఉంది. -
వాల్ డిస్నీ మూవీలో షకీరా హల్చల్
లాస్ ఎంజెల్స్: వాకా వాకా . లా..లా..లా..పాటలతో ఫుట్ బాల్ ప్రేమికులతోపాటు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన పాప్ సింగర్ షకీరా ఇపుడు మరో సంచలనానికి నాంది పలికింది. వాల్ డిస్నీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న యానిమేషన్ సినిమా 'జూటోపియా'లో ఓ పాత్రకు తన గొంతును అరువివ్వబోతోంది. తన అద్భుతమైన గొంతుతో గ్రామీ అవార్డును కూడా సొంతం చేసుకున్న షకీరా.. తన అందం, మేనరిజమ్సే ఈ క్యారెక్టర్‌కు స్పూర్తి అట. ఈ అమ్మడి లాగానే చాలా సెక్సీగా, క్యూట్ గా రూపొందుతోంది గాజిల్లే అనే జింక పాత్ర . ఈ జింక పాత్రకే(గాజిల్లే) ఆపాప్ సింగర్ డబ్బింగ్ చెప్పనుంది. గాజిల్లే ఫస్ట్ లుక్‌ను వాల్ డిస్నీ స్టూడియో రిలీజ్ చేసింది. అనాహీం కన్వెన్షన్ సెంటర్లో ఒక వీడియోను శుక్రవారం రిలీజ్ చేసింది. ఈ యానిమేషన్ చిత్రంలోని జంతువుల పాత్రలు అచ్చం మనుషుల్లానే మాట్లాడుకుంటాయట. దీంతోపాటు ఈ సినిమాకోసం ట్రై ఎవ్రీథింగ్ అనే పాటను కూడా పాడనుందట షకీరా. కాగా 2016 మార్చిలో ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. -
మోస్ట్ పాపులర్ యూజర్ ఎవరు?
పొద్దున లేవగానే పళ్లు తోముకోవడం ఎంత సహజమో, ఫేస్ బుక్ చూడడం అంతే సహజంగా మారింది. లైకులు, షేరింగులతో 'ముఖపుస్తకం' తెరవడం నెటిజన్లకు అలవాటుగా మారింది. 11 ఏళ్ల క్రితం ఇంటర్నెట్లోకి దూసుకొచ్చి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఫేస్ బుక్ సోషల్ మీడియాలో అత్యధిక మంది వీక్షించే వెబ్ సైట్ గా ఫేమస్ అయింది. నెలకు దాదాపు 139 కోట్ల మంది ఫేస్ బుక్ వీక్షిస్తున్నారు. ఇక సెలబ్రిటీల ఫేస్ బుక్ పేజీలకు కుప్పలు తెప్పలుగా లైకులు వచ్చిపడుతుంటాయి. అత్యధిక లైకులతో అగ్రస్థానంలో ఉన్న 10 మంది సెలబ్రిటీల పేర్లను సోషల్ మాడియా ట్రాకింగ్ సంస్థ 'ఫ్యాన్ పేజీ లిస్ట్' వెల్లడించింది. పోర్చుగీస్, రియల్ మాడ్రిడ్ సాకర్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డొ అత్యధిక లైకులతో అగ్రస్థానంలో నిలిచాడు. 10,35,76,615 లైకులతో టాప్ లో ఉన్నాడు. సంపాదనలో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. దాదాపు రూ.16 వేల కోట్ల సంపదతో ప్రపంచ సంపన్న ఆటగాళ్ల లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ బెక్ హామ్ అతడి కంటే ముందున్నాడు. కొలంబియా పాప్ సింగర్, బెల్లీ డాన్సర్ షకీరా ఫేస్ బుక్ ను షేక్ చేస్తోంది. 10,07,32, 587 లైకులతో రెండో స్థానం దక్కించుకుంది. సుమారు రూ. 14వేల కోట్ల సంపద కలిగిన షకీరా గోల్డెన్ గ్లోబ్, గ్రామీ అవార్డులకు నామినేట్ అయింది. యూనిసెఫ్ అంబాసిడర్ గానూ ఆమె కొనసాగుతోంది. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' నటుడు విన్ డీసెల్ 93,17,23,15 లైకులతో మూడో స్థానంలో ఉన్నాడు. గ్లామర్ ఫోటోలకు తోడు టిడ్ బిట్స్ జోడించి చేసే ఫేస్ బుక్ పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటాయి. అతడి సంపద సుమారుగా 480 కోట్ల రూపాయలు. ఎమినెమ్ గా సుప్రసిద్ధుడైన అమెరికన్ రాపర్ పేస్ బుక్ లో 91,99,19,71 లైకులు అందుకుని 4వ స్థానంలో నిలిచాడు. నిర్మాత, నటుడు కూడా అయిన ఎమినెమ్ ఆస్తుల విలువ సుమారు రూ. 12 వేల కోట్లు. పాప్ గాయని రిహానా ఫేస్ బుక్ పేజీ అభిమానుల సందేశాలతో సదా నిండివుంటుంది. ఆమె ఫేస్ బుక్ ఖాతాలో 81,54,93,44 లైకులు ఉన్నాయి. పాప్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆమె సంపద దాదాపుగా రూ. 9వేల కోట్లు. 'మోస్ లైక్స్' లిస్ట్ లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. సంపన్న సాకర్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 77,88,14,94 లైకులతో సిక్త్ ప్లేస్ లో ఉన్నాడు. అర్జెంటీనా, ఎఫ్ బీ బార్సిలోనా తరపున ఆడుతున్న మెస్సీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 11 వేల కోట్లు. చనిపోయిన ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ పై అభిమానుల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 75,30,04,78 లైకులతో పాప్ చక్రవర్తికి ఏడో స్థానంలో నిలిపారు అభిమానులు. మైఖేల్ జాక్సన్ సంతోషంగా గడిపిన రోజుల్లో దిగిన ఫోటోలతో అతడి ఫేస్ బుక్ పేజీ నిండివుంటుంది. మరణించిన తరువాత అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన సెలబ్రిటీస్ జాబితాలో టాప్ లో నిలిచాడు. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ 73,69,14,92 లైకులతో 8వ స్థానంలో ఉన్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న విల్ స్మిత్ సంపద సుమారు రూ. 14 వేల కోట్లు. మరణించి 34 ఏళ్లు గడిచినా పాప్ సింగర్ బాబ్ మార్లేకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అతడి పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజీలో 73,51,38,81 లైకులు ఉన్నాయి. అత్యధిక లైకుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. 'జస్టిన్ ఐ లవ్ యూ, జస్టిన్ ఐ హేట్ యూ' సందేశాలతో యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ఫేస్ బుక్ పేజీ నిండిపోయి వుంటుంది. ఫేస్ బుక్ లైకులు అతడి బ్యాంకు బాలెన్స్ ను మించిపోయాయి. 72,72,47,46 లైకులతో పదో స్థానంలో నిలిచాడు. అతడి సంపద రూ. 12 వేల కోట్లు. -
తల్లి కాబోతున్న షకీరా
'వాకా వాకా' అంటూ ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన కొలంబియన్ పాప్ స్టార్ షకీరా.. త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు నిర్ధరించారు. స్పానిష్ సాకర్ స్టార్ గెరార్డ్ పిక్‌తో కలిసి తాను రెండో బిడ్డను కనబోతున్నట్లు ఇటీవలే షకీరా కూడా చెప్పింది. ఇప్పుడు షకీరా తల్లి నిడియా, తండ్రి విలియం కూడా ఈ విషయం చెప్పారు. షకీరాకు ఇప్పటికే మిలన్ అనే 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతగాడికి ఇప్పుడో బుజ్జి తమ్ముడు రాబోతున్నాడు. ఈసారి కూడా షకీరాకు అబ్బాయే పుట్టబోతున్నాడని, దాంతో మిలన్కు ఆడుకోడానికి ఓ బుల్లి తమ్ముడు వస్తాడని అమెరికా పత్రికలు చెప్పాయి. పిల్లాడే పుడతాడన్న విషయం తెలిసినా, పేరు మాత్రం ఇప్పటివరకు ఏమీ అనుకోలేదట. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
ముమైత్‌ఖాన్. ఈ పేరు వింటే ఆరేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఖుషీ అయిపోతారు. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తెలుగు ప్రేక్షకులను.. మమ్మీ డాడీ యారుం వీటిల్ ఇల్లై అంటూ తమిళ తంబిల గుండెల్లో గుబులు పుట్టించిన శృంగార నర్తకి ముమైత్‌ఖాన్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ యావత్ భారతదేశ సినీ అభిమానులను ఉర్రూతలూగించిన మాస్ గ్లామరస్ డాన్సర్. కొన్ని చిత్రాల్లో నాయికగా కూడా నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ 200ల చిత్రాలకు పైగా ఐటమ్‌సాంగ్స్ చేశారు. తాను ఆడటానికే పుట్టానేమో నంటారు. డాన్స్‌కు అడిక్ట్ అయ్యానని చెప్పే ఈ బ్లాక్ బ్యూటీ తాను తొలిసారిగా రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్‌కు అడిక్షన్ అనే పేరును నిర్ణయించారు. ముమైత్‌ఖాన్ అనూహ్యంగా ఈ పాప్ మ్యూజిక్ ఆల్బమ్‌పై మొగ్గు చూపించడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన గాయని షకీరానే స్ఫూర్తి అంటారు. ఈ గాయనీమణి రచయిత్రి మ్యూజిక్ ఆల్బమ్ చూసి తానూ అలాంటి ప్రయత్నం చేయాలనే కోరిక కలిగిందని చెప్పారు ముమైత్‌ఖాన్. ఆ ప్రయత్నంలో భాగమే ఈ అడిక్షన్ ఆల్బమ్ అన్నారు. 9 ఎక్స్ ఓ, ఎంటీవీ లాంటి అంతర్జాతీయ చానళ్లలో ఈ అడిక్షన్ మ్యూజిక్ ఆల్బమ్ పలుసార్లు ప్రచారమై ముమైత్‌ఖాన్‌ను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిందట. అంతేకాదు తొలి ఏషియన్ మ్యూజిక్ ఆల్బమ్‌గా ఈ అడిక్షన్ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉందంటున్నారు ముమైత్‌ఖాన్. ఈ అడిక్షన్ ఆల్బమ్‌ను ముమైత్‌ఖాన్ బుధవారం చెన్నైలో ఆవిష్కరించారు. ఇందులోని పాటలకు ముమైత్‌ఖాన్ ఆడి పాడడం విశేషం. -
వి LIKE షకీరా
-
ఒక్క షకీరా.. పది కోట్ల ఫేస్బుక్ లైక్‌లు
మొన్నటికి మొన్న వాకా వాకా.. నిన్న సాకర్ సంబరాల్లో లా.. లా.. లా.. అంటూ పాటలు పాడి అన్ని దేశాల ప్రేక్షకులను ఉర్రూతలూగించిన షకీరా గుర్తుంది కదూ. మీకే కాదు.. ప్రపంచంలో ఆమెను చాలా చాలామంది గుర్తుపెట్టుకున్నారు. అందుకే, ఆమె కోసం ఫేస్బుక్లో గాలించి గాలించి మరీ ఆమె పేజీకి లైకుల మీద లైకులు కొట్టారు. అలా కొట్టిన లైకులు ఎన్నో తెలుసా.. ఏకంగా పది కోట్లు!! ఫేస్బుక్లో ఇన్ని లైకులు సాధించిన మొట్టమొదటి సెలబ్రిటీగా షకీరా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని పీపుల్ పత్రిక తెలిపింది. ఈ ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, తనలాంటి కళాకారులు ఎదగడానికి, అలాగే ప్రేక్షకులకు బాగా దగ్గర కావడానికి ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతోందని షకీరా చెప్పింది. ఆమె సాధించిన ఈ విజయానికి ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్బెర్గ్ కూడా అభినందించాడు. అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన విజయం సాధించిందని జుకెర్బెర్గ్ అన్నాడు. ఇన్ని కోట్ల మంది తనను మెచ్చుకున్నందుకు గాను తన అభిమానులందరికీ షకీరా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. -
సాకర్ సంబరాల్లో షకీరా జోరు
-
షకీరాకి పోటీగా వస్తున్న ఫుట్‌బాల్ స్టార్
-
షేక్ షేక్ షకీరా !
ముగింపు కార్యక్రమంలో సందడి చేయనున్న పాప్ స్టార్ రియో డి జనీరో: కొలంబియా పాప్ స్టార్ షకీరా ప్రపంచకప్‌లో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గత రెండు ప్రపంచకప్‌లలో తన ఆట, పాటతో సందడి చేసిన షకీరా.. ఈ సారి టోర్నీ ముగింపు ఉత్సవంలో తళుక్కున మెరవబోతోంది. జూలై 13న రియో డి జనీరోలో జరిగే మెగా ఫైనల్‌కు ముందు పాప్ స్టార్ ప్రదర్శన ఇవ్వనుంది. ఫిఫా అధికారిక గీతం ‘లా లా లా’తో ఇప్పటికే హల్చల్ చేస్తున్న కొలంబియా భామ.. బ్రెజిల్ స్టార్ కర్లినో బ్రౌన్‌తో కలిసి ఆడి పాడనుంది. ఇక ఫిఫా మరో అధికారిక గీతాన్ని (‘దార్ ఉమ్ జీటో-వియ్ విల్ ఫైండ్ ఎ వే’) సాంటనా, వెక్లైఫ్తో పాటు బ్రెజిల్ సింగర్ అలెగ్జాండర్ పెరైస్ ముగింపు కార్యక్రమంలో ఆలపించనున్నారు. దీంతో పాటు స్థానిక కార్యక్రమాలు అభిమానులను అలరించనున్నాయి. -
అప్పుడు 'వాకా వాకా'.. ఇప్పుడు 'లా లా లా'..
-
అప్పుడు 'వాకా వాకా'.. ఇప్పుడు 'లా లా లా'..
-
అత్యంత శక్తిమంతమైన తల్లులుగా షకీరా, కిమ్
లండన్: అమెరికన్ నటీమణులు కిమ్ కర్దాషియన్, బియాన్స్ నావెల్స్, బ్రిటన్ మోడల్ విక్టోరియా బెక్‌హామ్, పాప్ గాయని షకీరా ఈ ఏడాది అత్యంత శక్తిమంతమైన 50 మంది తల్లుల జాబితాలో నిలిచారు. ‘మోస్ట్ పవర్ఫుల్ మామ్స్-2014’ పేరుతో ‘వర్కింగ్ మదర్’ మ్యాగజైన్ రూపొందించిన ఈ జాబితాలో క్రిస్టినా ఆగ్వీలిరా, కెర్రీ వాషింగ్టన్, టీనా ఫే, అమీ పోలర్, శాండ్రా బులాక్ వంటి సెలబ్రిటీలూ చోటు దక్కించుకున్నారు. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే వృత్తిపరంగా అత్యుత్తమ సామర్థ్యం చాటడం, వృత్తి జీవితాన్ని, మాతత్వ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రతిభ కనపర్చడం వంటి అంశాల ఆధారంగా స్ఫూర్తిదాయకమైన మహిళలతో ఈ జాబితాను రూపొందించినట్లు మ్యాగజైన్ వర్గాలు వెల్లడించాయి. -
ఈ ప్రపంచ కప్‌కి ‘లా.. లా.. లా’
ఫుట్‌బాల్ క్రీడలో ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్‌కు నాలుగేళ్ల క్రితం క్రీడాకారులను ఉత్సాహపరిచే విధంగా పాప్‌స్టార్ షకీరా ‘వాకా వాకా..’ పాట చేసిన విషయం తెలిసిందే. మొత్తం ప్రపంచాన్ని ఈ పాట ఉర్రూతలూగించింది. ఈ ఏడాది వరల్డ్ కప్ కోసం కూడా షకీరా ఓ పాట తయారు చేశారు. ‘డేర్... లా.. లా.. లా...’ అనే పాటను రికార్డ్ చేశారు. ఇటీవలే ఈ పాట విడుదలైంది. దీనికి ఇతర రచయితలతో కలిసి తను కూడా సాహిత్యం సమకూర్చానని షకీరా పేర్కొన్నారు. ఈ వీడియో సాంగ్‌లో షకీరా వేసిన స్టెప్పులు కనువిందుగా ఉన్నాయని హలీవుడ్ టాక్. ఇందులో ఆమె తనయుడు మిలన్ కూడా కనిపించడం ఓ ప్రత్యేక ఆకర్షణ. దాని గురించి షకీరా మాట్లాడుతూ - ‘‘ఈ పాట బాగా రావాలనే ఆలోచనతో ఈ మధ్య నేను స్టూడియోలో ఎక్కువగా గడిపాను. తిండి, నిద్ర మర్చిపోయి మరీ పని చేశాను. ఓ రోజు మా అబ్బాయి మిలన్ స్టూడియోకి వచ్చాడు. నా ఒళ్లో కూర్చుని, పాట మొత్తం విన్నాడు. ఈ పాటలో తను కూడా కనిపించడం నాకో ప్రత్యేకమైన అనుభూతి ’’ అన్నారు. -
షకీరాకు పాఠాలు నేర్పుతున్న పుత్రరత్నం
పాప్ స్టార్ షకీరా తన తళుకుబెళుకులతో ఊగిపోతూ కుర్రకారుల నుంచి వృద్ధుల వరకు తన పాటలతో ఊరుతలూగిస్తుంది. ఆ 37 ఏళ్ల అమ్మడు తన పుత్ర రత్నం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్లు తెలిపింది. తన 15 నెలల కుమారుడు మిలన్ పిక్ మెబారక్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు వెల్లడించింది. మిలాన్‌ను చూసి తనతో పాటు తన భర్త గ్రిరార్డ్ పిక్ తమ పనులు తామే చేసుకుంటున్నట్లు చెప్పింది. ఖాళీ సమయంలో అధిక భాగం తన కుమారుడితో కలసి ఉండేందుకు తాము ఇష్టపడుతున్నట్లు షకీరా ఆమె భర్త ఈ మేరకు వెల్లడించారని గురువారం కాంటాక్ట్మ్యూజిక్ తెలిపింది. పాప్ స్టార్ షకీరా తన ప్రియుడు గెరార్డ్ పిక్‌తో జత కట్టి జనవరి 22, 2013న మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా ‘మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు. షకీరాకు 60 మిలియన్ల మంది ఫేస్ బుక్ అభిమానులు ఉన్నారు. ఆ పాప్ స్టార్ స్పానిష్ దేశపు ఫుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.