
కొలంబియన్ పాప్ సింగర్ షకీరా పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమెపై ఇటీవల రెండు అడవి పందులు దాడి చేసినట్లు గాయని సోషల్ మీడియాలో తెలిపింది. ఈ విషయం గురించి చెబుతూ మురికిగా, చిరిగిన తన బ్యాగ్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
కొడుకుతో కలిసి సేద తీరడానికి బార్సీలోనాలోని ఓ పార్క్‌కి వెళ్లగా, ఆ సమయంలో ఒక్కసారిగా రెండు అడవి పందులు అక్కడికి వచ్చి ఆమెపై దాడికి దిగాయని షకీరా తెలిపింది. తన బ్యాగ్‌ని, ఫోన్ నోట కరుచుకుని అడవిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాయని, అంతే కాకుండా అందులోని అన్ని వస్తువులను నాశనం చేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే దాడి అనంతరం చిరిగిపోయిన బ్యాగ్‌ను తీసుకున్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
చదవండి: ‘గాంధీ’ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షల మంది భారతీయులు: హాలీవుడ్ నటుడు

Comments
Please login to add a commentAdd a comment