లాక్‌డౌన్‌లో సరదాగా కోసం తీసుకున్న పురాతన తత్త్వశాస్త్రంలో పట్టా పొందారు పాప్ సింగర్ షకీరా. ఈ విషయాన్ని ఆమె శనివారం సోషల్ మీడియాలో వెల్లడించారు. నాలుగు వారాలు పాటు మాత్రమే తీసుకున్న ఈ కోర్సును పూర్తి కావడంతో ఆమెకు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం గురువారం డిగ్రీ సిర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఈ సర్టిఫికెట్ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ... ‘నేను ఇప్పుడే నాలుగు వారాల పురాతన తత్త్వశాస్త్రంలో డిగ్రీ పొందాను. నా అభిరుచులు కాస్తా అసాధ్యమైనవే అని నాకు తెలుసు. అయితే పిల్లలతో ఈ కోర్సు చేయడం కష్టమే. అయినా వారు నిద్రపోయాక నేను రాత్రంతా మెలకువతో ఉండి ఈ కోర్సు పూర్తి చేశాను’ అని ట్వీట్ చేశారు. (లాక్‌డౌన్: ‘వీరిని చూస్తే గర్వంగా ఉంది’)
I just graduated from my 4 week Ancient Philosophy course with the University of Pennsylvania (@Penn). I know... my hobbies are very impractical, but it took a lot of hours after the kids were asleep. Thank you Plato and predecessors for all the "fun" over the past month! pic.twitter.com/cFTCXDjliX
— Shakira (@shakira) April 23, 2020
ఇక తను అందరి కంటే భిన్నంగా ఆలోచించి లాక్‌డౌన్‌లో పట్టభద్రులైన షకీరా తెలివికి అభిమానులు ఫిదా అవుతూ ప్రశంసిస్తూంటే మరికొందరు ఇది మీకు ఇప్పడంత ముఖ్యమా అంటూ విమర్శిస్తున్నారు. ‘‘మీరిలా అనవసరమైన కోర్సును తీసుకుని మీ అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తారని అనుకోలేదు. మీకు పిల్లలు ఉన్నారు కదా. ఈ సమయాన్ని వారికి కేటాయించొచ్చు. మీ సమయాన్ని పిల్లలకు ఇచ్చేదాని కంటే ఇది మీకు ముఖ్యమైనదా. అంటే వారు మీకు అంతా ముఖ్యమైన వారు కాదా?’’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (‘ఆ నూనెతో కరోనా చనిపోతుంది’)
ఇక లాక్‌డౌన్‌లో ఏంచేయాలో తోచక చాలా మంది ఇంట్లో కొత్త కొత్త వంటకాలు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం, టైమ్ పాస్ కోసం టిక్‌టాక్‌లు, డ్యాన్స్‌లు వంటివి చేస్తున్నారు. అయితే వీటన్నింటిని పక్కన పెట్టి షకీరా కొత్తగా ఆలోచించారు. సరదా కోసం తీసుకున్న నాలుగు వారాల ప్రాచీన తత్త్వశాస్త్రంలో షకీరా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment