pop singer
-
ఇండియన్ పాప్ మ్యూజిక్.. టాలెంట్ హంట్ మొదలుపెట్టిన సవన్
ఇండియన్ పాప్ మ్యూజిక్‌లో అద్భుతాలు సృష్టించడానికి ఇండో అమెరికన్ గేయ రచయిత సవన్ కొటేచా (Savan Kotecha) ముందడుగు వేశాడు. యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా , రిపబ్లిక్ రికార్డ్స్, రిప్రజెంటేట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. కొత్త టాలెంట్ వెలికితీయడంతోపాటు దేశంలో పాప్ బ్యాండ్ (Pop Boy Band)ను ఏర్పరచడమే వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఎవరీ సవన్ కొటేచా?సవన్ ఎన్నో పాటలకు రచయితగా పని చేశాడు. ఈయన రాసిన ఎన్నో పాటలు.. అరియానా గ్రాండె, ద వీకెండ్, జస్టిన్ బీబర్, వన్ డైరెక్షన్ (పాప్ బ్యాండ్)లు ఆలపించాయి. పాటలరచయితగా సవన్ 17 సార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అలాగే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలకు సైతం నామినేట్ అయ్యాడు. బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డును అందుకున్నాడు. అదే అసలైన లక్ష్యంతాజాగా సవన్ కొటేచా మాట్లాడుతూ.. భారత్‌లోని యువతలో ఉన్న మ్యూజిక్ టాలెంట్‌ను వెలికితీయడమే తన లక్ష్యమని చెప్తున్నాడు. ఇక్కడి యంగ్ జనరేషన్ అంతా కూడా పాప్ సాంగ్స్ కోసం, సింగర్ల కోసం విదేశాలపై ఆధారపడుతోంది. ఇకమీదట ఆ అవసరం రాకుండా చేయాలన్నదే మా ఉద్దేశ్యం. భారత్‌లో ఓ సరికొత్త పాప్ బ్యాండ్ గ్రూప్ సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాం అని పేర్కొన్నాడు.చదవండి: ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్‌గా డేట్ చెప్పేసిన కంగనా -
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ విడాకులు తీసుకుంది. తన భర్త సామ్ అస్గారితో అధికారికంగా విడిపోయింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరి పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గతేడాది జూలైలో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట .. ఆగస్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరికో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే పెళ్లికి ముందే దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు.కాగా.. బ్రిట్నీ స్పియర్స్‌కి ఇది మూడో వివాహం కాగా.. ఆమె రెండో భర్త కెవిన్ ఫెడెర్‌లైన్‌తో ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. వీరిద్దరు 2004 నుంచి 2007 వరకు కలిసి ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. బ్రిట్నీ స్పియర్స్ మొదట చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను 2004లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే విడిపోయింది. ఆ తర్వాత 2016లో నటుడు అస్గారితో డేటింగ్ చేయడం ప్రారంభించింది. 2021 సెప్టెంబర్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. 2022లో స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. -
ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్
ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ పార్క్ బోరామ్ అనుమానాస్పద మరణం మ్యూజిక్ ప్రపంచాన్ని, ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 30 ఏళ్ల వయసులో దక్షిణ కొరియా గాయని పార్క్ బో రామ్ కన్నుమూసింది. దక్షిణ కొరియాలో గాయనిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న పార్క్ బోరామ్ మరణాన్ని అభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు. నమ్యాంగ్జు పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటర్లు దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఆమె చనిపోయే కొద్ది గంటల ముందు ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించింది. ఆ తరువాత రాత్రి 9:55 గంటలకు రెస్ట్‌రూమ్‌కి వెళ్లింది. 'సింక్పైకి వంగి’, అపస్మారక స్థితిలో చనిపోయి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని పోలీసులు విచారణ చేపట్టారు. Park Boram has passed away at the age of 30. pic.twitter.com/E2PfluIwfc — Kpop Charts (@kchartsmaster) April 11, 2024 దక్షిణ కొరియా సంగీత పరిశ్రమలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. రచయిత కూడా అయిన బో రామ్ తన పదేళ్ల మైలురాయిని చేరుకున్నందుకు గౌరవసూచకంగా ఈ ఏడాది చివర్లో రెండు కొత్త పాటలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆమె మరణంపై పలువురు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. కె-పాప్ సింగర్ పార్క్ బో రామ్ పార్క్ బో-రామ్ 2010లో 17 ఏళ్ల వయస్సులో రియాలిటీ సింగింగ్ ఛాలెంజ్ 'సూపర్ స్టార్ K2'లో కనిపించి మెప్పించింది. తరువాత 'బ్యూటిఫుల్' పాటతో కరియర్ ప్రారంభించింది. ‘రీప్లే 1988’ లాంటి ఆల్బమ్స్‌లో మెలోడియస్ వాయిస్‌తో బాగా పాపులర్ అయింది. 2014 గావ్ చార్ట్ మ్యూజిక్ అవార్డ్స్‌లో, ఆమె ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ถ้าเคยดู reply 1988 คงจะจำเพลงนี้ได้ ตอนนี้เจ้าของเพลงไม่อยู่แล้ว 😢 รู้จักพี่โบรัมตั้งแต่เพลง Beautiful เขาเป็นคนที่เป็นแรงบันดาลใจให้ใครหลายคนในการ ลนน และเดินตามความฝันของตัวเอง เขาเก่งมากๆนะ เป็นอีกครั้งที่วงการเกาหลีต้องสูญเสียคนเก่งๆไป #RIP #ParkBoram #พัคโบรัม pic.twitter.com/sBORRZMBp2 — Miànbāo hé nǎichá 🍞 (@Magic_pink00) April 12, 2024 -
డీప్‌ఫేక్ ఆందోళనకరం
వాషింగ్టన్: ప్రముఖుల ఫొటోలు, వీడియోలను దురి్వనియోగం చేస్తూ కృత్రిమ మేథ(ఏఐ)తో సృష్టిస్తున్న డీప్ ఫేక్ నకిలీ ఫొటోలు, వీడియోల ధోరణి అత్యంత భయంకరమైనదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ప్రఖ్యాత పాప్ గాయని టైలర్ స్విఫ్ట్ నకిలీ అసభ్య ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ప్రముఖుల డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల సృష్టి, వ్యాప్తికి అడ్డుకట్ట పడాల్సిందే. ప్రభుత్వాల, సోషల్‌మీడియా సంస్థల తక్షణ స్పందన అవసరం. సురక్షితమైన, వాస్తవిక సమాచారం మాత్రమే ఆన్లైన్లో లభించేలా సాంకేతికతను, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు నిబంధనలను సవరించి కట్టుదిట్టంచేయాలి. ఇది మనందరి బాధ్యత’’ అని అన్నారు. -
Blackpink Lisa: మోస్ట్ టాలెంటెడ్ రాపర్, సింగర్, డాన్సర్, బ్లాక్‌పింక్ లిసా (ఫోటోలు)
-
హిప్ హాప్ సెన్సేషన్ ఇర్ఫానా,కాలేజీ రోజుల్లోనే పోయేట్రీతో..
కొడైకెనాల్‌కు చెందిన ఇర్ఫానా హమీద్ హిప్ హాప్ సింగర్, ట్రంపెట్ ప్లేయర్. కర్నాటక సంగీతంతో సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది. వీణ నేర్చుకుంది. కాలేజి రోజుల్లో పోయెట్రీ రాసేది. ఇండియన్ హిప్ హాప్లో కొత్త గొంతుగా మంచి పేరు తెచ్చుకుంది. యాంటి–ఫాసిజం నుంచి, తమిళ్–ముస్లిం సంస్కృతి వరకు ఇర్ఫానా సంగీతంలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. నెట్‌ఫ్లిక్స్ వెబ్–సిరీస్ ‘మసాబా మసాబా’ టైటిల్ ట్రాక్ ‘ఐయామ్ యువర్ కింగ్’ పాడింది. ‘కన్నిల్ పెట్టోల్’ ట్రాక్‌తో హిప్ హాప్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంది. మన సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కల్చర్‌పై ‘షీలా సిల్క్’ చేసింది. బాలీవుడ్ పాపులర్ సాంగ్ షీలాకీ జవానీ, ఐటమ్ సాంగ్స్‌కు పేరుగాంచిన సిల్క్ స్మీత పేరులో నుంచి ‘షీలా సిల్క్’ను సృష్టించింది. యూనివర్శల్ మ్యూజిక్ గ్రూప్(యుఎంజీ) గత సంవత్సరం ‘డెఫ్ జామ్ రికార్డింగ్స్’ను మన దేశంలో లాంచ్ చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థతో కలిసి పనిచేస్తుంది ఇర్ఫానా హమీద్. అర్బన్ కల్చర్‌కు సంబంధించిన అంశాల ఆధారంగా సృష్టించే ‘డెఫ్ పోయెట్రీ’ వింటూ పెరిగింది ఇర్ఫానా. ‘హిప్–హాప్ కల్చర్‌పై మన దేశంలోని యువతరానికి ఆసక్తి కలిగించడానికి, వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది. ప్రతి సింగర్‌కు సిగ్నేచర్ సౌండ్ ఉంటుంది. మరి ఇర్ఫానా హమీద్‌కు ఇష్టమైనది?రకరకాల శబ్దాలు, శైలులను ఎక్స్ప్లోర్ చేయడం. View this post on Instagram A post shared by IRFANA (@irfanahameed) View this post on Instagram A post shared by Def Jam Recordings India (@defjamindia) -
స్టార్ సింగర్ ఆత్మహత్య.. ఆ బాధ తట్టుకోలేక!
ప్రముఖ సింగర్, నటి కోకో లీ(48) మరణించింది. పాప్ సింగర్ అయిన ఈమె.. ఆస్కార్ వేదికపై ప్రదర్శన ఇచ్చిన చైనీస్ అమెరికన్ గా గుర్తింపు తెచ్చుకుంది. హాంకాంగ్ లో పుట్టిన ఈమె.. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి, అక్కడే చదువుకుంది. అనంతరం సొంత దేశానికి తిరిగొచ్చేసి సింగర్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఎంతో క్రేజ్ దక్కించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం అభిమానులని కంటతడి పెట్టిస్తోంది. దాదాపు 30 ఏళ్ల పాటు పాప్ సింగర్ కెరీర్ ని కొనసాగిస్తూ వచ్చిన కోకో లీ.. గత కొన్నాళ్ల నుంచి డిప్రెషన్ తో బాధపడుతోంది. ఈ క్రమంలోనే జూలై 2న ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ఆమె కోమాలోకి వెళ్లినట్లు తేలింది. అలా ఆమెని బతికించేందుకు డాక్టర్స్ చాలా కష్టపడ్డారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కోకో లీ బుధవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమె చెల్లెళ్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: కాలు విరగ్గొట్టుకున్న నవదీప్.. ఆ నటి మాత్రం!) 2001లో కోకో లీ పాడిన.. 'ఏ లవ్ బిఫోర్ టైమ్' సాంగ్ ఉత్తమ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ క్రమంలోనే అవార్డుల ప్రదానోత్సవంలో ఈమె స్టేజీ షో ఇచ్చింది. ఈ ఘనత సాధించిన తొలి చైనీస్ అమెరికన్ గా రికార్డు సృష్టించింది. అంతకు ముందు 1996లో సోనీ మ్యూజిక్ తో ఒప్పందం చేసుకున్న మొదటి చైనీస్ గాయనిగానూ నిలిచింది. డిస్నీ 'ములాన్' సినిమాలోని హీరోయిన్ ఫా ములాన్ కు వాయిస్ ఇచ్చింది కూడా ఈమెనే కావడం విశేషం. 90వ దశకంలో పాప్ సింగర్ గా చాలా పేరు తెచ్చుకున్న కోకో లీ.. హాంకాంగ్, మలేసియా, తైవాన్, సింగపూర్, ఆస్ట్రేలియాలో చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ప్రేమ, విశ్వాసం అని తన చేతుల మీద టాటూలు వేయించుకున్న ఫొటోలని తన ఇన్ స్టాలో చివరగా లీ షేర్ చేసింది. 'మీరు ఒంటరిగా లేరు, నేను మీతో ఉంటాను' అని ఫ్యాన్స్ ని ఉద్దేశించి చివరగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడది అది చూసి అందరూ ఎమోషనల్ అవుతున్నారు. I am shocked to learn that #CocoLee passed. Horrible news. What a huge blow to our #Mulan family. 😢💔 She was a vivacious, beautiful and talented artist. My condolences to her family, friends & fans. RIP🙏🏼💔 pic.twitter.com/lf3Bk6a2ml — Ming-Na Wen (@MingNa) July 6, 2023 (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) -
శ్రేయరాగ రాక్‌స్టార్
ఎక్కడి ఒడిశా? ఎక్కడి కొరియా? అయితే కలలు కనేవారికి దూరభారాలు ఉండవు. పట్టుదలతో దూరాలను కరిగించేస్తారు. కలలను నిజం చేసుకుంటారు. ఒడిశాలోని రూర్కెలాకు చెందిన శ్రేయా లెంక ఈ కోవకు చెందిన ప్రతిభాశాలి.... ఇండియా ఫస్ట్ కె–పాప్ ఐడల్‌గా శ్రేయా లెంక చరిత్ర సృష్టించింది. పన్నెండు సంవత్సరాల వయసులో డ్యాన్సర్‌గా శ్రేయ కళాప్రస్థానం మొదలైంది. ఎప్పుడూ పెద్ద కలలే కనేది. ఒక ఫ్రెండ్ ద్వారా శ్రేయకు ‘కె–పాప్’ పరిచయం అయింది. వారి మ్యూజిక్ వీడియోలు తనను బాగా ఆకట్టుకున్నాయి. ‘వీళ్లు ఆర్టిస్టులా? మెరుపు తీగలా?’ అనిపించింది. వారి యూనిక్ స్టైల్, సింగింగ్, డ్యాన్సింగ్ తనకు తెగ నచ్చేశాయి. ఏదో ఒకరోజు వారిలో కలిసి, వారిలో ఒకరిగా కలిసి పనిచేయాలనుకుంది. ‘అది అసాధ్యం’ అని ఎవరు అన్నా సరే శ్రేయ వెనక్కి తగ్గలేదు. ఆమె కల నెరవేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ప్రపంచంలోని వందలాది మందితో పోటీ పడి గెలిచింది. ‘కె–పాప్’ మెంబర్‌గా తన కలను నెరవేర్చుకుంది. దేశం కాని దేశం... సౌత్ కొరియాలోకి అడుగు పెట్టినప్పుడు శ్రేయా లెంకాకు అక్కడి ఆహారం, జీవనవిధానం, భాష...అన్నీ కొత్తగా అనిపించాయి. తాను ఇల్లు విడిచి అంత దూరం వెళ్లడం అదే తొలిసారి. కొత్త విషయాలను ఉత్సాహంగా నేర్చుకుంది. కొత్త జీవనవిధానానికి ఆనందంగా అలవాటు పడింది. చుట్టు పక్కల వాళ్లు కూడా ఎంతో ప్రోత్సాహకంగా ఉండేవాళ్లు. ఇండియాలో అయితే రాత్రి పదిలోపు భోజనం చేసేది. కొరియాలో మాత్రం సాయంత్రం 6–7 మధ్య భోజనం చేస్తారు. మొదట్లో కష్టం అనిపించినా ఆ పద్ధతికి మెల్లగా అలవాటు పడింది. తనలాగే ‘కె–పాప్ ఐడల్’ కావాలనుకునే ఔత్సాహికులకు శ్రేయా లెంకా ఇచ్చే సలహా... ‘మీ కలలను నెరవేర్చుకోవడం విషయంలో రాజీ పడవద్దు. వందసార్లు అపజయం పాలైనా సరే, ఆవగింజంత ఆత్మవిశ్వాసం కూడా కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లు తప్పకుండా ఒకరోజు గెలుస్తారు’ -
రాకెన్ రోల్ క్వీన్ ఇకలేరు
న్యూయార్క్: తన పాట, ఆటతో 1960లు, 70ల్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రాకెన్ రోల్ క్వీన్, పాప్ సింగర్ టీనా టర్నర్ ఇక లేరు. సుదీర్ఘ అనారోగ్యం బారిన పడ్డ 83 ఏళ్ల టీనా జ్యూరిచ్ సమీపంలోని తన నివాసంలో మంగళవారం కన్నుమూశారు. మిక్ జాగర్ మొదలుకుని బేయాన్స్ దాకా రాక్ స్టార్లంతా టీనా వీరాభిమానులేనంటే ఆమె స్థాయి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు! ఎత్తుపల్లాలమయంగా సాగిన ఆమె జీవితం ఆద్యంతం ఆసక్తికరం. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తనను పూర్తిగా గుల్ల చేసిన 20 ఏళ్ల వైవాహిక బంధం తాలూకు దెబ్బను అధిగమించి మరీ పాప్ సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాణి స్థాయిని అందుకున్నారామె. ఏకంగా 12 గ్రామీ అవార్డులు ఆమెను వచ్చి వరించాయి. ఆమె ఆల్బంలు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లకు పైగా అమ్ముడవడమూ ఓ రికార్డే. టీనా స్ఫూర్తిమంతమైన జీవితం ‘వాట్స్ లవ్ గాట్ టు డూ వితిట్’ పేరిట 1993లో సినిమాగా వచ్చింది. భరించలేని బాధనంతా తనలోనే దాచుకుని ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దాన్నే శక్తిమంతమైన ఆయుధంగా మలచుకున్న అంతటి మహనీయ వ్యక్తికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అందులో టీనా పాత్ర పోషించిన నటి ఏంఎలా బాసెట్ అన్నారు. -
ఇండస్ట్రీలో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ సింగర్ సూసైడ్!
ప్రముఖ పాప్ సింగర్ హెసూ(29) ఆత్మహత్య చేసుకున్నారు. కొరియాకు చెందిన హెసూ ఓ హోటల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. చాలా మంది కొరియన్ పాప్ సింగర్స్‌కు మనదేశంలో మంచి ఫాలోయింగ్ ఉంది. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హెసూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. (ఇది చదవండి: ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!) ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1993లో పుట్టిన హేసూ మై లైఫ్, మీ ఆల్బమ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించింది. గాయా స్టేజ్, హ్యాంగౌట్ విత్ యూ, ది ట్రోల్ షో లాంటి ప్రోగ్రామ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ఇది చదవండి: సల్మాన్‌తో రిలేషన్లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్) -
విషాదం.. ప్రమాదంలో ప్రముఖ పాప్ సింగర్ మృతి
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. రష్యా పాప్ సింగర్ సింగర్ దిమా నోవా(34) ప్రమాదంలో మృతి చెందారు. తన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించిన దిమా నోవా రష్యా-ఉక్రెయిన్ యుద్ద సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు చేస్తూ పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తన గాత్రంతో ఎంతో ఆదరణ పొందిన దిమా నోవా ఆకస్మిక మరణంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొనుగోలు.. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. దిమా నోవా అసలు పేరు దిమిత్రి విర్గినోవ్. చిన్ననాటి నుంచే తన గానంతో అలరిస్తున్న దిమా నోవా ‘క్రీమ్ సోడా’ అనే మ్యూజిక్ సంస్థను నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 19న తన సోదరుడు, స్నేహితులతో ఫ్రోజన్ వోల్గా నది దాడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దిమా నోవా, అతడి స్నేహితులు, సోదరుడు మంచు కురుకుపోయారు. చదవండి: అమ్మ ప్రెగ్నెంట్ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి ఈ క్రమంలో ఊపరి ఆడక ఆయన చనిపోయినట్లు రష్యన్ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంగా గాయపడిన తన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మిగిలిన వారు ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కాగా దిమా నోవా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ తన సంగీతం, పాటలతో పుతిన్‌ను విమర్శించేవాడు. ఈ క్రమంలోనే అక్వా డిస్కో అనే పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అప్పట్లో ఈ పాట పెద్ద వివాదం కూడా అయ్యింది. రష్యాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవారు ఈ పాట పాడుతూ నిరసనలు తెలిపేవారు. -
తెరపైకి జాక్సన్ జీవితం
పాప్ సంగీత సామ్రాజ్యానికి రాజుగా వెలిగిన మైఖేల్ జాక్సన్ జీవితంతో ‘మైఖేల్’ పేరుతో బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకుడు. మైఖేల్‌గా ఆయన సోదరుడు జెర్మైన్ కుమారుడు జాఫర్ జాక్సన్ నటించనున్నారు. వెండితెరపై యాక్టర్‌గా జాఫర్‌కు ఇదే తొలి చిత్రం. ‘‘మా అంకుల్ కథలో నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు జాఫర్. ‘‘మైఖేల్ జాక్సన్ లక్షణాలు జాఫర్లో చాలా ఉన్నాయి. మైఖేల్‌గా నటించగల ఒకే ఒక్క వ్యక్తి జాఫర్ అని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన గ్రాహం. ఇక 1958 ఆగస్టు 29న పుట్టిన మైఖేల్ జాక్సన్ 2009 జూన్ 25న మరణించిన విషయం తెలిసిందే. -
నటి నగ్న వీడియో లీక్.. షాకవుతున్న నెటిజన్లు
ప్రముఖ నటి, అమెరికన్ ఫేమస్ పాప్ సింగర్ అయిన మిలే సైరస్ స్నానం చేస్తూ పాట పాడుతున్న ఆమె నగ్న వీడియో స్వయంగా తానే షేర్ చేసి షాకిచ్చింది. త్వరలో తన కొత్త అల్భమ్ను రిలీజ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో తన అల్భమ్ ప్రమోషన్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో మిలే బాత్రూంలో స్నానం చేస్తూ తన కొత్త అల్భంకు సంబంధించిన పాట పాడుతూ కనిపించింది. చదవండి: యశ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పి ట్రోల్స్ బారిన పడ్డ ప్రశాంత్ నీల్, దెబ్బకి ట్విటర్ క్లోజ్! తానే స్వయంగా ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియోపై ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారాల అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఆమెను సమర్థిస్తున్నారు. కాగా మిలే సైరస్కు ఇన్ స్టాగ్రామ్‌లో 192 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌కు అనేక లైక్స్ వస్తాయి. ఇప్పుడు షేర్ చేసిన తన బాత్ రూం వీడియోకు 16 లక్షల పైగా లైక్స్, 15 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. అయితే మిలే సైరస్ ‘పార్టీ ఇన్ ది హోడ్’, ‘కాంట్ బి టేమ్డ్’, ‘7 థింగ్స్’ వంటి అల్భమ్తో పాపులర్ అయ్యింది. చదవండి: శ్రీహాన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పిన సిరి! -
Shakira Tax Fraud Case:మ్యూజిక్ క్వీన్ షకీరాకు జైలు శిక్ష ముప్పు
మాడ్రిడ్: కొలంబియాకు చెందిన ప్రఖ్యాత పాప్ గాయని, గ్రామీ అవార్డు గ్రహీత షకీరాకు పన్ను ఎగవేత కేసులో ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు శుక్రవారం చెప్పారు. ఆమె దోషిగా తేలితే కచ్చితంగా జైలు శిక్షతో పాటు 2.4 కోట్ల యూరోల జరిమానా విధించాలని కోరతామన్నారు. 2012– 2014 మధ్య స్పెయిన్ ప్రభుత్వానికి 1.5 కోట్ల యూరోల మేర పన్ను ఎగవేసినట్లు షకీరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెటిల్మెంట్ చేసుకోవాలన్న లాయర్ల సూచనను షకీరా తిరస్కరించారు. షకీరా పన్ను చెల్లింపు బాధ్యతను నెరవేర్చారని ఆమె తరపు ప్రజా సంబంధాల సిబ్బంది వెల్లడించారు. -
త్వరలో పెళ్లి.. అంతలోనే బ్యాడ్‌న్యూస్ చెప్పిన పాప్ సింగర్
Pop Singer Britney Spears Shares Heartbreaking Note: త్వరలోనే శుభవార్త చెబుతుందనుకున్న పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల తాను తల్లి కాబోతున్నట్లు బ్రిట్నీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగిపోయారు. కానీ, అంతలోనే బిడ్డను కొల్పోయానంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ భావోద్యేగ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘మేం మా బిడ్డను కోల్పోయాం. మా జీవితంలో విషాదంలో నెలకొంది. ఇది తల్లిదండ్రులగా మాకు ఎంతో కఠిన సమయం. చదవండి: సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్ మెడల్! రిలేషల్లో ఒక అడుగకు ముందుకేళ్లి కుటుంబాన్ని విస్తరించుకోవాలని ఎన్నో కలలు కన్నాం. మా తొలి బిడ్డను ఈ లోకానికి పరిచయం చేయాలని ఎంతో ఆత్రుతుగా ఎదురు చూశాం. కానీ అంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. నాకు గర్భస్రావం జరిగింది. ఈ కఠిన సమయంలో మాకు సపోర్టు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే మా ప్రైవసిని కూడా గౌరవిస్తారని కోరుకుంటున్నాం’ అంటూ ఆమె పోస్ట్ షేర్ చేసింది. కాగా బ్రిట్నీ ఇటీవల తన ప్రెగ్నెన్సీ ప్రకటిస్తూ త్వరలోనే తన ఫియాన్సీ సామిని పెళ్లి చేసుకోబుతున్నట్లు ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: కరాటే కల్యాణితో పెట్టుకున్నాడు, బిగ్‌బాస్ ఛాన్స్ పట్టేశాడు! View this post on Instagram A post shared by Britney Spears (@britneyspears) -
త్వరలో పెళ్లి, నగ్న ఫొటోలు షేర్ చేసిన సింగర్
పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ గురించి తెలియనివారుండరు. తన గాత్రంతో కోట్లాదిమంది మనసులు గెలుచుకున్న ఈ గాయని సుమారు 13 ఏళ్ల పాటు తండ్రి సంరక్షణలోనే జీవితాన్ని గడిపింది. దీనిపై కోర్టులో గట్టిగా పోరాడిన బ్రిట్నీ ఎట్టకేలకు కేసు గెలిచి గతేడాది తండ్రి చెర నుంచి విముక్తి పొందింది. ఇదిలా ఉంటే బ్రిట్నీ గతంలో వెకేషన్ సమయంలో దిగిన ఫొటోలను మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. తను గర్భం దాల్చిన తొలినాళ్లలో నగ్నంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 'నా కడుపులో బేబీ ఉన్నప్పుడు, నేను మెక్సికోలో ఉన్న సమయంలో దిగిన పొటో ఇది..' అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది. ఒంటి మీద నూలు పోగు లేకుండా, కేవలం చేతులతో శరీరాన్ని దాచుకుంటూ దర్శనమిచ్చిన ఫొటోలను చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకవుతున్నారు. 'మరీ ఇలా తయారవుతుందేంటి? ఒంటి మీద బట్టలు లేకుండా ఫొటోలు షేర్ చేయడమేంటి?' అని అసహనానికి లోనవుతున్నారు. 'తన మానసిక స్థితి సరిగా లేదేమో, అందువల్లే ఆమె తండ్రి బ్రిట్నీని ఇన్నేళ్లు సంరక్షణలో ఉంచుకున్నాడు కాబోలు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బ్రిట్నీ త్వరలోనే తన ప్రియుడు సామ్‌ను పెళ్లాడబోతోంది. ఇందుకోసం డోనటెల్లా వెర్సాస్ తన పెళ్లి గౌనును తయారు చేస్తున్నాడని తెలిపింది. చదవండి: కంటికి ఆపరేషన్, అందుకే నెలరోజుల నుంచి దూరం.. గ్రాండ్‌గా హీరోయిన్ సంజన సీమంతం, వీడియో వైరల్ -
ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం !
Pop Singer Tarsame Singh Saini Aka Taz Passed Away At Age 54: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ (తర్సామీ సింగ్ సైనీ) 54 ఏళ్ల వయసులో కన్ను మూశారు. జానీ జీగా పేరొందిన తర్సామీ సింగ్ సైనీ గత కొంతకాలంగా హెర్నియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితి విషమించిన ఆయనకు కరోనా కారణంగా శస్త్ర చికిత్స చేసేందుకు ఆలస్యమైందని తెలుస్తోంది. అయితే ఇటీవలే కోమా నుంచి కోలుకున్న తాజ్ శుక్రవారం (ఏప్రిల్ 29) యూకేలో మరణించారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్యార్ హో గయా, నాచేంగే సారి రాత్, గల్లాన్ గోరియన్ వంటి 90వ దశకం హిట్ సాంగ్స్‌కు పేరుగాంచింది తాజ్ గ్రూప్ స్టీరియో నేషన్. ఇది 1996లో ఏర్పడింది. 1989లో హిట్ ది డెక్ ఆల్బమ్‌తో తాజ్ స్టీరియో నేషన్ ప్రజాదరణ పొందింది. యూకేలోని ఇతర భారతీయ కళాకారులతో పాటు తాజ్.. ఆసియా ఫ్యూజన్ సంగీతానికి మార్గదర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. డోంట్ స్టాప్ డ్రీమింగ్, సాంబార్ సల్సా వంటి చిత్రాలలో తాజ్ పనిచేశారు. తుమ్ బిన్, కోయి మిల్ గయా, రేస్ వంటి పాపులర్ హిందీ మూవీస్తోపాటు ఇటీవల వచ్చిన బట్లా హౌజ్ సినిమాలో పాటలు పాడారు. చదవండి: బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పి రిస్క్ తీసుకున్నా:కంగనా చదవండి: వెంకటేష్-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్‌గా ? -
Olivia Rodrigo: ఎమోషనల్, క్యాచీ ఆల్బమ్.. ఓ ఫిల్మ్!
పాట ఎంత మధురంగా ఉంటుందో ఆ పాట వెనుక విశేషాలు కూడా అంతే మధురంగా ఉంటాయి. పద్దెనిమిది సంవత్సరాల అమెరికన్ పాప్ స్టార్ వొలెవియా రోడ్రిగో ‘సోర్’ ఎంత హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. జెన్ జెడ్ పర్స్పెక్టివ్లో వచ్చిన ఈ ఎమోషనల్, క్యాచీ ఆల్బమ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలపై ఒక ఫిల్మ్ రూపొందించారు. డిస్నీ ప్లస్ కోసం చేసిన ఈ మూవీ పేరు... వొలెవియా రోడ్రిగో: డ్రైవింగ్ హోమ్ 2 యూ. ఈ సందర్భంగా ‘సోర్’ ఆల్బమ్‌లోని పాటను కుంచెం పాడుకుందాం.... వెల్, గుడ్ఫర్ యూ/ఐ గెస్ యూ మూవ్డ్ రియల్లీ ఈజీ రిమెంబర్ వెన్యూ సెడ్ దట్/ యూ వాంటెంట్ టు గీవ్ మీ ది వరల్డ్.. -
11వ బిడ్డకు జన్మనివ్వబోతోన్న ప్రముఖ సింగర్
ప్రముఖ అమెరికన్ సింగర్ కేకే వ్యాట్ మరోసారి తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పిల్లలు, భర్తతో కలిసి బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన వ్యాట్ తను 11వ సారి గర్భం దాల్చినట్లు పేర్కొంది. ఈ ఫొటోలో ఉన్న తన పిల్లలంతా బిగ్ బ్రదర్, బిగ్ సిస్టర్ అనే టీ-షర్ట్‌ను ధరించగా ఆమె భర్త జకారియా డేవిడ్ డారింగ్ ‘హియర్ వీ గో’ అనే టీ-షర్ట్‌ను ధరించాడు. ఇక ఈ పోస్ట్‌కు కేకే వ్యాట్.. ‘నేను నా భర్త జకారియా, మా కుటుంబం మరో వ్యక్తిని వ్యాట్ బంచ్కి ఆహ్వానించబోతున్నామనే విషయం మీతో పంచుకోవడానికి గర్వపడుతున్నాను’ అంటూ #11 అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది. అంతేగాక తమ మరో కుమార్తె కాయ్లాను మిస్ అవుతున్నానని, తను భౌతికంగా తమ మధ్య లేకపోయిన తన ఆలోచనలు, ఆత్మ మాతోనే ఉంటాయని పేర్కొంది. కాగా జాకకారియా డేవిడ్ ఆమె మూడవ భర్త. ఆమె మొదటి భర్త రహ్మత్ మోర్టన్ను 1999లో వివాహం చేసుకోగా వీరికి నలుగురు పిల్లలు సంతానం. వారిలో ఓ కుమార్తె మరణించగా.. కీవర్ వ్యాట్ మోర్టన్(21); రహ్జా కే మోర్టన్(20), కే తార్హ్ విక్టోరియా మోర్టన్(13)లు ఉన్నారు. ఇక రెండో భర్త మైఖేల్ ఫోర్ట్‌తో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది వ్యాట్. అతడితో విడాకుల అనంతరం జకారియా డేవిడ్ డారింగ్ను 2018లో మూడో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం కాగా ప్రస్తుతం ఆమె మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇది తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంతమంది పిల్లలతో మీరెలా ఆడుకుంటారు’, 'మీరింక ఫుల్స్టాప్ పెట్టరా?' అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Keke Wyatt (@keke_wyatt) -
ఇండియన్ షకీరా..12 రోజులపాటు బంధించినా వెనక్కి తగ్గలేదు!
కొలంబియా పాప్ సింగర్, డ్యాన్సర్ షకీరా పాడుతూ చేసిన డ్యాన్స్‌ను టీవీలో చూసింది తొమ్మిదేళ్ల తస్లీమా బానో. ఆ డ్యాన్స్ బాగా నచ్చడంతో ఎంతోఆసక్తిగా గమనించి స్టెప్పులను గుర్తుపెట్టుకుంది. ఒకరోజు వాళ్ల ఇంటికి దగ్గరలో జరుగుతున్న కార్యక్రమంలో అందరూ డ్యాన్స్ చేస్తుంటే తస్లీమా కూడా డ్యాన్స్ చేసింది. అది చూసిన ఆమె తల్లిదండ్రులు విపరీతంగా కోపడ్డారు. ‘‘ఇంకోసారి డ్యాన్స్ చేశావంటే ఊరుకోము’’ అని హుకుం జారీ చేశారు. అయినా వినలేదు. దీంతో పన్నెండురోజులపాటు ఒక గదిలో పెట్టి బంధించారు. అయినా తస్లీమా వెనక్కి తగ్గలేదు. తనలోని ప్రతిభతో అందరి మన్ననలు పొందడమేగాక తన తండ్రి మనసు గెలుచుకుని, ఏకంగా ఇండియన్ షకీరాగా ఎదిగింది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో చెందిన నూర్ మహ్మద్, బేగం దంపతుల ముద్దుల కూతురు తస్లీమా భానో. అమ్మవాళ్లు డ్యాన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించడంతో.. మొదట్లో వాళ్లకు ఎదురు చెప్పలేక వెనక్కు తగ్గింది తస్లీమా. ఎనిమిదో తరగతిలో ఉండగా ఒకసారి స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో తస్లీమా డ్యాన్స్పోటీలో పాల్గొంది. మిగతా వారికంటే బాగా డ్యాన్స్ చేయడంతో మొదటి బహుమతి గెలుచుకుంది. అంతేగాక ఆ కార్యక్రమాన్ని చూసిన వారంతా తస్లీమాను చప్పట్లు, అభినందనలతో ముంచెత్తారు.స్కూలు టీచర్లు తనలోని డ్యాన్స్ ప్రతిభను తెగపొగిడేశారు. అక్కడకు వచ్చిన నూర్ మహ్మద్ ఇవన్నీ చూసి.. ‘ఇంతటి ప్రతిభను మేము ప్రోత్సహించకుండా వద్దన్నామా?’ అని గ్రహించి, అప్పటి నుంచి తస్లీమా డ్యాన్స్ చేయడాన్ని ప్రోత్సహించేవారు. కానీ అమ్మకు మాత్రం ఏ మాత్రం ఇష్టం ఉండేదికాదు. అలా తస్లీమా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ‘గోరీ నాఛే’ నుంచి.. ‘గోరీ’గా మారింది తండ్రి ప్రోత్సాహంతో చిన్నచిన్న కార్యక్రమాలలో తన డ్యాన్స్‌లతో అలరించేది తస్లీమా. సాఫీగా సాగిపోతున్న డ్యాన్స్ జర్నీలో ఒక పెద్ద కుదుపు ... 2010లో నూర్‌మహ్మద్ మరణించాడు. హఠాత్తుగా జరిగిన తండ్రి మరణాన్ని తట్టుకోలేక నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన తస్లీమా ఏడాది పాటు డ్యాన్స్ ప్రపంచాన్ని వదిలేసింది. షాక్ నుంచి కోలుకున్నాక మళ్లీ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. రాజస్థానీ పాట ‘లే ఫొటు లే’ తస్లీమాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత చేసిన ‘గోరీ నాఛే నాగోరీ నాఛే’ పాట రాజస్థాన్‌లోనే సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కపాటతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయింది. కొంతమంది స్టార్ల పేర్లు మారినట్టే.. అభిమానులంతా గోరీ నాగోరీగా పిలుస్తూ తస్లీమాపేరునే మార్చేశారు. ఏ ప్రదర్శనకు వెళ్లినా గోరీ అనిపిలుస్తూ.. ముందు ‘నాగోరీ’ పాటకు డ్యాన్స్ చేయాలని డిమాండ్ చేసేవారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక పాపులర్ పాటలకు స్టేజ్ ప్రదర్శనలు ఇస్తూ, ఇతర డ్యాన్సర్ల కంటే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. రాజస్థాన్‌తోపాటు హర్యాణా, ఢిల్లీ, యూపీలలో తస్లీమాకు మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. నటుడు, ర్యాపర్, సింగర్, డ్యాన్సర్, ప్రొడ్యూసర్‌గా హర్యాణాలో పాపులర్ అయిన సన్నీ చౌదరీతో కలిసి కొన్ని డ్యాన్స్ వీడియోలు చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఈ ఏడాది విడుదలైన ‘ఘఘరో’ సాంగ్ ఒక్కరోజులో 16 మిలియన్ల వ్యూస్‌తో రీజనల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రతిభ ఉండాలేగానీ ఎంత పెద్దఅడ్డంకి అయినా మన ‘ఎదుగుదల’ను ఆపలేదని తస్లీమా డ్యాన్స్ జర్నీ స్ఫూర్తినిస్తోంది. -
దుమ్ము రేపుతున్న ఇజ్రాయెల్ పాప్ సింగర్..
Israeli Pop Star Noa Kirel Debuts English Single: సంగీతానికి భాష ఎలాంటి అడ్డుకాదని నిరూపిస్తుంది ఇజ్రాయెల్ పాప్ సెన్షేషన్ నోవా కిరాల్. ఆమె హిబ్రూ పాటల పేర్లు ఇంగ్లీష్‌లో అయితే ఇలా ఉంటాయి...టాకింగ్, వోన్లీ యూ, ఏ ప్లేస్ ఫర్ ఏ చేంజ్, ఆల్మోస్ట్ ఫేమస్, దేర్ ఈజ్ లవ్ ఇన్ మీ, హాఫ్ క్రేజీ. ‘హాఫ్క్రేజీ’ (హిబ్రూలో హజీ మేషుగా) ఆంగ్ల అనువాదంలోని రెండు మూడు చరణాలు ఇలా పాడుకుందాం.... విత్ఔట్ యూ ఐయామ్ హాఫ్ క్రేజీ , జస్ట్ గీవ్ మీ ఏ మినిట్ టూ బ్రీత్ యూ అగేన్, బికాజ్ ది సన్ వాజ్ నాట్ షైనింగ్ ఫర్ మీ లాస్ట్ నైట్, యూ హ్యావ్ లెఫ్ట్ మీ ఎలోన్.... చదవండి: Cauliflower Health Benefits: కాలీఫ్లవర్ తింటే ఇన్ని ఉపయోగాలా.. బోర్ కొడితే ఇలా ట్రై చేయండి! -
ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!
న్యూయార్క్: కొంత మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, వాళ్లు వాడే వస్తువులు వేలంలో చాలా ధర పలకడం మనం విని ఉంటాం. అంతేకాదు ఆ డబ్బుల్ని ఏ సేవ సంస్థలకో ఇవ్వడం లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రముఖ బ్రిటన్ పాప్ సింగర్, రచయిత అయిన అమీ జాడే వైన్ హౌస్ విషయంలో కూడా ఇలానే జరిగింది. వైన్ హౌస్ విషపూరిత ఆల్కహాల్‌ని సేవించి 2011లో అతి చిన్న వయసులో మరణించింది. (చదవండి: 'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక) అంతేకాదు అత్యంత పిన్న వయసులోనే మ్యూసిక్ ఆల్బమ్ సింగర్‌గా, పాప్ గాయనిగా కెరియర్ సాగించి ప్రతిష్టాత్మకమైన ఐదు గ్రామీ అవార్డులు పొందిని గాయని. అయితే ఆమె ఎక్కువ స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక సామాజిక కార్యకర్తగా చాలా చురుగ్గా పాల్గొనేది. దీంతో బ్రిటన్‌లో ప్రఖ్యాతి గాంచిని జూలియన్స్ అనే ప్రముఖ వేలం సంస్థ ఆమె ధరించిన వస్తువులను వేలం వేసి వాటిని ఆమె మరణాంతరం ఏర్పాటు చేసిన వైన్‌హౌస్ ఫౌండేషన్‌కే వెచ్చించాలని ఆ వేలం సంస్థ డైరక్టర్లు నిర్ణయించారు. పైగా ఈ వేలంలో ఆమో ధరించిన వస్తువులు దాదాపు 2 మిలయన్ డాలర్ల వరకు పలకవచ్చని జూలియన్ వేలం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్టిన్ నోలన్ బావిస్తున్నారు. ఈ మేరకు 2006లో వచ్చి బాక్ టు బ్లాక్ అనే అల్బమ్ ఆల్కహాల్, తన నిజ జీవితంలో డ్రగ్స్‌కి బానిసై దాని నుంచి బయట పడటానికి సంబంధించిన ఆల్బమ్ కావడమే కాకుండా పలు అవార్డుల ఆ ఆల్బమ్‌కే వరించడం విశేషం. ఆమె పేరు మీద ఏర్పాటైన ఫౌండేషన్ కూడా డ్రగ్స్ బానిసైన యువత కోసం ఏర్పాటు చేసిందే. (చదవండి: అసంపూర్తిగానే సుదీర్ఘ సైనిక చర్చలు) -
జస్టిస్ ఫర్ లీసా: ట్విటర్లో పెను విధ్వంసం
Justice For Lisa Twitter Trend: అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో నిరూపించే ఘటన ఇది. ఓ పాప్ సింగర్ కోసం కోట్ల మంది కదిలారు. #justiceforlisa.. ఇప్పుడు ట్విటర్లో మోత మోగిపోతున్న హ్యాష్‌ట్యాగ్. లీసా అనే యంగ్ ర్యాపర్‌కు న్యాయం చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ఓవైపు పాత ట్వీట్లు డిలీట్ చేస్తుంటే.. లక్షల కొద్దీ కొత్త ట్వీట్లు పుట్టుకొస్తుండడం విశేషం. ఈ క్రమంలో ఇప్పటికే ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు దాటిపోయాయి మరి! దక్షిణ కొరియా పాప్ గ్రూప్ ‘బ్లాక్‌పింక్’కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ గ్రూప్‌లోని నలుగురు సింగర్స్‌లో లీసా మనోబల్(24) ఒకరు. ఆమె అసలు పేరు ప్రణ్ప్రియా మనోబల్. థాయ్‌లాండ్‌లో పుట్టి, పెరిగిన లీసా.. 2010లో పదమూడేళ్ల వయసుకి వైజీ ఎంటర్టైన్మెంట్ లేబుల్‌లో చేరింది. ఆ తర్వాత దక్షిణ కొరియాకు మకాం మార్చేసి.. 2016 నుంచి బ్లాక్‌పింక్‌లో సింగర్‌గా కొనసాగుతోంది. బ్లాక్‌పింక్‌లో స్టార్డమ్, వరల్డ్‌వైడ్ ఫ్యాన్‌ఫాలోయింగ్, బ్రాండ్ అంబాసిడర్ల లిస్ట్.. ఇలా ఎందులో చూసుకున్నా ఈమెకే క్రేజ్ ఎక్కువ. అలాంటిది.. కొద్దికాలంగా బ్లాక్‌పింక్ ఈవెంట్లకు లీసా పూర్తిగా దూరంగా ఉంటోంది. ఈమధ్య బివిల్‌గరి ఫ్యాషన్వీక్తో పాటు మరికొన్ని షోస్‌కు లీసాను వైజీ ఎంటర్టైన్మెంట్ ప్రమోట్ చేయలేదు. మిగతా ముగ్గురు సింగర్స్ జీసూ, జెన్నీ, రోజ్‌లను మాత్రం ప్రతీదానికి అనుమతిస్తున్నారు. ఈ వ్యవహారంపై లీసా అభిమానుల నుంచి నిరసర వ్యక్తంకాగా.. స్పందించిన వైజీ ఎంటర్టైన్మెంట్ కరోనా నిబంధనల కారణంగానే లీసాను అనుమతించడం లేదంటూ వివరణ ఇచ్చుకుంది. దీంతో అగ్గిరాజుకుంది. లీసాకు మద్దతుగా ఆమె ఫ్యాన్స్.. #justiceforlisa, #YGLetLisaDoHerWork హ్యాష్‌ట్యాగ్‌లను నడిపిస్తున్నారు. స్వదేశం నుంచి ఫ్రాన్స్‌కు లీసాను రప్పించడం, పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆమెకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు అభిమానులు. మిగతా సింగర్స్ విషయంలో లేని ఆంక్షలు, అభ్యంతరాలు.. లీసాకు మాత్రమే ఎందుకని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే గుర్రుగా ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. అయితే బివిల్‌గరి సీఈవో జీన్ క్రిస్టోఫె బాబిన్ స్పందిస్తూ.. కొవిడ్ నిబంధనలు, పైగా ఆమె(లీసా) సొంత ఏజెన్సీ సూచనల మేరకే లీసా దూరంగా ఉంటోందని వెల్లడించారు. తెరపైకి రేసిజం! ఇక ఈ వివాదంలోకి రేసిజం ప్రస్తావన తెస్తున్నారు కొందరు. దక్షిణ కొరియా వ్యాపారవేత్త, వైజీ ఎంటర్టైన్మెంట్ సీఈవో వాంగ్బోక్యుంగ్ జాత్యాహంకారంతో లీసాను పక్కనపెట్టిందనేది వాళ్ల వాదన. లీసా థాయ్‌లాండ్ ర్యాపర్ కావడం వల్లే ఈ వివక్ష అని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో వాంగ్బోక్ మీద RIP పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు వైజీ ఎంటర్టైన్మెంట్ తన షేర్లు పతనం కాకుండా ఉండేందుకు #justiceforlisa ట్వీట్లను డిలీట్ చేయిస్తోందన్న వాదన తెర మీదకు వచ్చింది. దీంతో లీసా ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయి ట్వీట్లేస్తున్నారు. కేవలం మ్యూజిక్ కేటగిరీలోనే ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు రాగా, మొత్తంగా నాలుగు మిలియన్లకు పైనే లీసా మద్దతు ట్వీట్లు పోస్ట్ అయ్యి ఉంటాయని తెలుస్తోంది. #YGLetLisadoHerWork Pinche vieja ojalá y se valla al infierno. pic.twitter.com/GyQzTYeKt0 — lililie🇲🇽 (@Lili_valdezz) October 6, 2021 YG prefers to delete our hashtag instead of giving us a statement as to why they are restricting lisa's work and as far as i remember they never even moved this fast to clean up the mess when lisa was being dragged by antis 🤭 JUSTICE FOR LISA#YGLetLisadoHerWork — ʟᴇᴍᴏɴ (@Lmonart_) October 6, 2021 సింగిల్‌గా దుమ్మురేపింది వైజీ ఎంటర్టైన్మెంట్తో కొద్దికాలంగా ఆమెకు పొసగడం లేదన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ ఊహాగానాల నడుమే ఆమె బ్లాక్‌పింక్ నుంచి బయటకు వచ్చేస్తుందంటూ కథనాలూ వెలువడ్డాయి. కానీ, లీసా ఇప్పటివరకు స్పందించింది లేదు. ఇదిలా ఉండగానే సెప్టెంబర్‌లో లాలిసా పేరుతో సోలో ఆల్బమ్ రిలీజ్ చేసింది లీసా. సౌత్ కొరియాలో ఏడున్నర లక్షల కాపీలు అమ్ముడుపోయి.. రికార్డు సృష్టించాయి. అంతేకాదు యూట్యూబ్ ఒక్కరోజులో 76.3 మిలియన్ల వ్యూస్ రాబట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ రెచ్చిపోతున్న క్రమంలో ఆమె ఇంకా బ్లాక్పింక్లోనే కొనసాగుతుందా? లేకపోతే బయటకు వచ్చేస్తుందా? అనేది చూడాలి. -
లైంగిక వేధింపుల కేసులో పాప్ సింగర్‌ను దోషిగా తేల్చిన కోర్టు
ప్రాశ్చాత్య దేశాల్లో పాప్ సింగర్స్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. సింగర్స్ అంటే పిచ్చి అభిమానంతో ఊగిపోతుంటారు. కొందరు సెలబ్రిటీలు ఆ పాపులారిటీని మంచికి వాడుకుంటుంటే, కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు వాడుతుంటారు. అనంతరం నేరం రుజువై కటాకటా పాలవుతుంటారు. అమెరికా పాప్ సింగర్ రాబర్ట్ సిల్వస్టర్ కెల్లీ (ఆర్ కెల్లీ) విషయంలో అలాగే జరిగింది. ‘ఐ బిలీవ్ ఐ కెన్ ఫ్లై’ పాటతో పాపులర్ అయిన ఆర్.కెల్లీపై 2019లో లైగింక వేధింపుల కేసులు నమోదైయ్యాయి. అప్పటి నుంచి అతను కస్టడీలోనే ఉన్నాడు. అయితే సుదీర్ఘకాలంగా జరిగిన విచారణ తర్వాత సోమవారం (సెప్టెంబర్ 27న) మొత్తం తొమ్మిది అభియోగాల్లో దోషిగా తేల్చింది. తన పాపులారిటీని ఉపయోగించుకుని మహిళలు, బాలికలని వంచించనట్లు కోర్టు తెలిపింది. కెల్లీ తనను బంధించి, డ్రగ్స్ ఇచ్చి, రేప్ చేశాడని ఓ మహిళ లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో అతని బండారం మొత్తం బయట పడింది. దాదాపు రెండు దశాబ్దాలుగా అతను మైనర్ బాలికలు, బాలురను సైతం లైగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ కేసులో తుది తీర్పును కోర్టు వచ్చే ఏడాది మే నెలలో వెలువరించనున్నది. -
ముచ్చటగా మూడోసారి బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్మెంట్.. వైరల్
బ్రిట్నీ స్పియర్స్... పాప్ సాంగ్స్ వినేవారికి ఈ పేరు సుపరిచితమే. తన పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కాగా ఆమెకు బాయ్‌ఫ్రెండ్ సామ్ అస్గారితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటోలు షేర్ చేసింది. బ్రిట్నీ స్పియర్స్ (39)కి వ్యక్తిగత శిక్షకుడు, నటుడు అస్గారి (27)తో 2016లో పరిచయం అయ్యింది. అనంతరం వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఆమె వివిధ కారణాల వల్ల తన తండ్రి సంరక్షణ, నియంత్రణలో ఉండడం వల్ల అతనితో పెళ్లి విషయం ముందుకు కదలలేదు. కానీ ఇటీవలే లాస్ ఎంజెల్స్ కోర్టు తండ్రిని సంరక్షకుడిగా తొలగించడంతో గాయనికి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి వైరల్‌గా మారాయి. అయితే 39 ఏళ్ల బ్రిట్నీకి ఇంతకుముందే కెవిన్ ఫెడెర్‌లైన్‌ను వివాహం చేసుకొని ఇద్దరూ పిల్లలకు తల్లైంది. ఇప్పుడు వారిలో ఒకరికి 14, మరొకరికి 15 ఏళ్లు. అతనితో విడాకుల అనంతరం చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్ని పెళ్లాడింది. అతని నుంచి విడిపోయిన ఈ పాప్ సింగర్ తాజాగా 27 ఏళ్ల అస్గారితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. View this post on Instagram A post shared by Britney Spears (@britneyspears) View this post on Instagram A post shared by Sam Asghari (@samasghari) -
ప్రపంచాన్ని ఊపేసిన ఈ పాట గుర్తుందా?
ఎంటర్టైన్మెంట్ ఎల్లలు లేనిది. భాష తెలియకపోయినా.. కంటెంట్‌ను ఆస్వాదించడమే అందరికీ తెలిసింది. కానీ, ఒక పాటను అంతలా ఆదరించడం.. ఆస్వాదించడం కనిపించింది అప్పుడే. ఆ పాట అతని జీవితాన్ని మలుపు తిప్పింది. కే-పాప్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. హుషారెత్తించే మ్యూజిక్‌తో గ్లోబ్ మొత్తాన్ని చిందులేయించింది. యూట్యూబ్‌లో తొలిసారి మిలియన్లైకులతో గిన్నిస్ బుక్ రికార్డు.. అంతకు మించి ఫస్ట్ బిలియన్ వ్యూస్ పూర్తి చేసుకున్న తొలి ఘనతకు దక్కించుకుంది గంగ్నమ్ స్టైల్. ఇవాళ్టికి ఈ సెన్సేషన్ సాంగ్ రిలీజ్ అయ్యి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. సాక్షి, వెబ్‌డెస్క్: కొరియా పాప్సాంగ్ గంగ్నమ్ స్టైల్.. జులై 12న టీజర్ రిలీజ్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 15న ఆడియోతో పాటు ఒకేసారి యూట్యూబ్‌లో అప్లోడ్ అయ్యింది. అప్పటికే సౌత్ కొరియాలో సింగర్ సై(పార్క్ జెయ్ సాంగ్)కు కొద్దిపాటి ఫేమ్ ఉంది. అయితే రిలీజ్ తర్వాత పాటకు మిక్స్డ్ రివ్యూస్ దక్కాయి. కానీ, నెమ్మదిగా గంగ్నమ్ స్టైల్ మత్తు గ్లోబ్ మొత్తానికి ఎక్కేసింది. సిగ్గుపడే మగవాళ్ల నోట సైతం ‘సెక్సీ లేడీ’ అనే పదం వచ్చేలా చేసి.. హుషారెత్తించింది ఈ పాట. 9 years ago today, Psy's first teaser for 'Gangnam Style' was released. pic.twitter.com/dMWShXGGpW — On This Day in K-Pop (@thisdayinkpop) July 12, 2021 డబుల్ మీనింగ్, కానీ.. ‘ఒప్ప గంగ్నమ్ స్టైల్..’ గగ్నమ్ అనేది సౌత్ కొరియాలో ఒక జిల్లా. కొరియన్ పాప్ సింగర్ సై పుట్టి, పెరిగింది అక్కడే. అందుకే అక్కడి ఆడవాళ్ల లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికే ఆ ఆల్బమ్‌ను కంపోజ్ చేశాడు. ఒప్ప అంటే.. పెద్దన్న, తోపు అనే అర్థాలు వస్తాయి. అక్కడి ఆడవాళ్లను, ముఖ్యంగా తన కంటికి నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్చేసేందుకు చేసే ప్రయత్నాల్ని.. తన విరహా వేదనను వివరిస్తూ సాగే పాట అది. అందుకే అక్కడి ఉన్నతవర్గాలకు చెందిన ఆడవాళ్లకు ఆ పాటను అంకితం చేశాడు. అయితే ఆ పాట లిరిక్స్ పక్కా డబుల్ మీనింగ్. విజువల్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా. కానీ, అర్థాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే.. దానిని సూపర్ హిట్ చేసేశారు జనాలు. అప్పటిదాకా హిందీ, ఇంగ్లీష్, డీజే రీమిక్స్ సాంగ్స్‌తో హోరెత్తిన న్యూఇయర్ వేడుకల్లో కొత్త జోష్ నింపింది గగ్నమ్ స్టైల్. ముఖ్యంగా గుర్రపు స్వారీ స్టెప్పులకు ప్రపంచం మొత్తం ఫిదా అయ్యింది. 30 దేశాల్లో ఛార్ట్‌బస్టర్ దక్షిణ కొరియా వయా అమెరికా నుంచి ప్రపంచం మొత్తం గంగ్నమ్ స్టైల్ పాకింది. రిలీజ్ అయిన అన్ని దేశాల్లోనూ ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. గుర్రపుస్వారీ డ్యాన్స్‌ను ప్రపంచం మొత్తం ఆస్వాదించింది. కొరియా పాప్ మ్యూజిక్ సత్తా ఏంటో ఆ టైంలోనే చాటిన ఈ సాంగ్.. చాలామందికి ఇది కొరియన్ ఆల్బమ్ అని తెలియకుండానే ఎక్కేసింది. పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా, సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ ఊపేసింది. అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సైతం స్టెప్పులేయగా, అప్పటి యూఎన్ఏ సెక్రటరీ బాన్ కీ మూన్ ఐక్యత కోసం ఈ పాటను ప్రచార గీతంగా ఉపయోగించాలని పిలుపు ఇచ్చారంటే అతిశయోక్తి కాదు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆ టైంలో.. ‘‘కొరియన్ వేవ్‌లో ప్రపంచమంతా కొట్టుకుపోతోంద’ని సరదాగా వ్యాఖ్యానించాడు. జకోవిచ్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఇలా.. ఇలా ఆటగాళ్లు, మరెందరో స్టార్లు సైతం చిందులేశారు. సాంగ్ ఆఫ్ యూట్యూబ్ కొరియా పాప్ సింగర్ పార్క్ జెయ్ సాంగ్(సై)(43), యూ జంగ్ హ్యుంగ్ రాసిన సాంగ్. మ్యూజిక్ కూడా వాళ్లదే. చో సూ హ్యున్ డైరెక్షన్. గుర్రపు స్వారీ, కంగారు, పాండా స్టెప్పులను కలగలిపి లీ జు సన్స్టెప్పులు కంపోజ్ చేశాడు. కొరియన్ చెస్ గేమ్ జంగ్గీ తరహాలో మూమెంట్స్.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇక ఈ పాటలో బుడ్డోడు వాంగ్ మిన్వూ, నటుడు యూ జయ్ సుక్, నోహ్ హోంగ్ హుల్, ట్రైన్లో కనిపించే నటి హ్యునా.. ఇలా అందరూ కలిసి పాటను రిచ్‌గా మార్చేశారు. మొదటిరోజు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి. #GangnamStyle #PSY #9YearsofGangnamStyle pic.twitter.com/vLuSxgOwID — ashwik (@ursashwik) July 14, 2021 సౌత్ కొరియా గావోన్ ఛార్ట్ నుంచి ఆగష్టు నాటికి యూట్యూబ్ టాప్ 100 లిస్ట్‌కి అటుపై బిల్బోర్డ్ హాట్ 100 కి చేరింది. సెప్టెంబర్ నాటికి కేవలం ఐదు మిలియన్ల మార్క్‌కు చేరింది. కానీ, ఆ తర్వాత విధ్వంసం మొదలైంది. డిసెంబర్ 21 నాటికి గంగ్నమ్ స్టైల్ బిలియన్ మార్క్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 4 బిలియన్ల వ్యూస్‌కి పైగా.. ఓవరాల్ టాప్ పొజిషన్ సాంగ్ లిస్ట్‌లో ఎనిమిదో పొజిషన్లో కొనసాగుతోంది గంగ్నమ్స్టైల్. పేరడీలు, మిగతా వెర్షన్లు ఇవన్నీ లెక్కేస్తే ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న డెస్పాసిటోను ఎనిమిదేళ్ల క్రితమే గంగ్నమ్ స్టైల్ దాటేసినట్లే లెక్క. సై ఏం చేస్తున్నాడు ‘సై సిక్స్రూల్స్’ పేరుతో రిలీజ్ చేసిన ఆల్బమ్‌లో మొదటి పాటే గంగ్నమ్ స్టైల్. 2012లో సై ఒక వైరల్ స్టార్. కానీ, ఆ ఫేమ్‌ను సై కొనసాగించలేకపోయాడు. కారణం.. సై మిగతా పాప్ సింగర్స్లాగా కాదు. అభిమానం ఎక్కడుంటే.. వెతుక్కుంటూ వెళ్లి మరీ ఉచితంగా ప్రదర్శనలిచ్చేవాడు. బ్రాండ్లు, ప్రమోషన్, సంపాదన కోసం ఏనాడూ పెద్దగా ఆలోచించేవాడు కాదు. గంగ్నమ్స్టైల్ తర్వాత సైకి దక్కిన పాపులారిటీతో ఒక గ్లోబల్ సెలబ్రిటీగా మారిపోయే అవకాశం దక్కినా.. దానికి ఆయన మొగ్గు చూపించలేదు. ఆ తర్వాత నాలుగైదు పాప్ సాంగ్స్ కంపోజ్ చేసినప్పటికీ.. తర్వాత కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో రియాలిటీ షోలను నిర్వహిస్తున్నాడు. పీ నేషన్ పేరుతో కంపెనీ స్థాపించి..కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నాడు. మామూలుగా సై(43) ప్లేస్‌లో వేరే ఎవరు ఉన్నా.. ప్రదర్శనల కోసం, యూట్యూబ్ రికార్డుల కోసం, డబ్బు కోసం పాకులాడేవాళ్లేమో!. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె
వాషింగ్టన్ : పాప్ సింగర్ అరియానా గ్రాండే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కాలిఫోర్నియాలోని మాంటెసిటోలోని తన నివాసంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో తన ప్రియుడు ఎస్టేట్ డాల్టన్ గోమేజ్‌ని పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఈ యంగ్కపుల్. గతేడాది డిసెంబర్లో తన బాయ్‌ఫ్రెండ్ ఎస్టేట్ డాల్టన్‌తో అరియానా గ్రాండే ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి వీరిద్దరు క్లోజ్‌గా ఫోటోలకు ఫోజులిస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. వీరిద్దరి డేటింగ్, విహారయాత్రలకు సంబంధించిన వార్తలు అప్పట్లో మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇక పాపులర్ సింగర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 253మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Ariana Grande (@arianagrande) గత కొద్ది కాలంగా వీరి రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఎప్పుడూ ఏదో ఓ వార్త ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా తన నివాసంలో ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇక అరియానా- ఎస్టేట్ డాల్టన్ పెళ్లి ఎప్పుడు జరిగిందనే దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ గత వారంలో వీరి పెళ్లి జరిగినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. కేవలం 20 మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ తంతు జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ముందే వీరు అమెరికాలో ఓ ఖరీధైన ఇంటిని కొనుగోలు చేశారు. గతంలో కమెడియన్ ప్యాట్ డేవిడ్సన్తో అరియానా ప్రేమాయణం సాగించింది. వీరిద్దరు ఇక పెళ్లి చేసుకోబుతున్నారు అనుకున్న సమయంలో అనూహ్యంగా విడిపోయి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Ariana Grande (@arianagrande) చదవండి : షారుఖ్ ఫైట్స్, డాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయా : నటి ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ -
'అత్యాచారం చేసి నగ్నంగా ఉన్న నన్ను'..
ప్రముఖ పాప్ సింగర్, నటి డెమి లోవాటో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. 2018లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొని ఇంటికి వస్తుండగా, తనపై అత్యాచారం జరిగిందని, చాలా క్లోజ్ ఫ్రెండ్‌గా భావించిన వ్యక్తే తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొంది. పీపుల్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డెమి ఈ విషయాలను వెల్లడించింది. ఆ ఘటన జరిగినప్పుడు తన వయసు కేవలం 15 ఏళ్లేనని, దాని తర్వాత దాదాపు చనిపోదామని నిర్ణయించుకున్నానని, అయితే సన్నిహితుల సహకారంతో దాన్నుంచి బయటపడగలిగానని తెలిపింది. అతి తక్కువ కాలంలో పాప్ సింగర్‌గా డెమి రాణించిన సంగతి తెలిసిందే. 'ఓ రోజు షూటింగ్ ముగించుకొని వస్తుండగా, సిరా మిచెల్ అనే ఫ్రెండ్ నాకు అతిగా హెరాయిన్ (డ్రగ్) ఇచ్చాడు. దీంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాను. దీన్ని అవకాశంగా మార్చుకొని నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పూర్తి నగ్నంగా ఉన్న నన్ను అక్కడే రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. ఈ ఘటన నన్ను మానసికంగా చాలా కుంగిపోయేలా చేసింది. ఎన్నో రోజులు దాని గురించే భాదపడుతూ..ఆఖరికి తిండి, మంచి నీళ్లు కూడా తీసుకునేదాన్ని కాదు. ఇంట్లోనే ఎప్పుడూ చీకటి గదిలోనే ఉండేదాన్ని.స్నేహితులు వచ్చినా కలిసేదాన్ని కాదు. ఆ సంఘటన గురించి మర్చిపోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. లక్కీగా దాన్నుంచి బయటపడగలిగాను' అని డెమి పేర్కొంది. తన టాలెంట్‌తో ఇక్కడిదాకా వచ్చానని, ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు ఏదో ఒక సమయంలో ఇలాంటివి ఎదుర్కొని ఉంటారని ఆ సమయంలో మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని తెలిపింది. అయితే లైంగిక వేధింపులపై డెమి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. చదవండి : (ట్రాన్స్‌జెండర్‌గా మారిన హాలీవుడ్ స్టార్) (దర్శకుడు టవల్ తీసేయమన్నాడు : నటి) -
ఐ యామ్ రెబల్
బాయ్స్.. ఈ ‘ఉమెన్స్ డే’ కి అమ్మాయిలు పాడబోయే ఒక కొత్త సాయుధ గీతాన్ని మీ వీధి మైక్ లో నేషనల్ యాంథమ్ గా వినేందుకు సిద్ధంగా ఉండండి. చూస్తుంటే పాప్ గాయని రాజకుమారి సృష్టించిన ఈ సరికొత్త ‘ఐ యామ్ రెబల్..’ ట్రాక్ పురుషాధిక్యాన్ని అవనతం చేయబోతున్నట్లే ఉంది. ఇండిపెండెన్స్ డే కి ‘మా తుఝే సలామ్’, వినాయక చవితికి ‘జై జై గణేశా’ వినిపించినట్లుగా ఉమెన్స్ డే కి ఇక పై.. ‘ఐ యామ్ రెబెల్’ మార్మోగవచ్చు. ఇదొక జెండర్ ఈక్వాలిటీ జాతీయగీతం అనుకోండి!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం! తెలుగులో ఏమిటి? ఇది తెలుగే కదా! పోనీ తేలిగ్గా ఏమిటి? ‘ఇది నా రోజు. దిస్ ఈజ్ మై డే!’ ఎంత సింపుల్‌గా ఉంది. కరెక్ట్ అర్థం కూడా. ప్రతి‘ఉమెన్స్ డే’కి మనకు వినిపించే మాటలు.. స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం. మరి ఆ మాటలకు అర్థం ఏమిటి? అదే.. తేలికైన భాషలో ఎలా చెప్తాం? పాప్ సింగర్ రాజా కుమారి అయితే చక్కగా, అబ్బాయిలకు అర్థమయ్యేలా చెబుతారు. అబ్బాయిలకా! అమ్మాయిలకు కదా అర్థం కావలసింది. కాదు. అబ్బాయిలకే. స్త్రీ సాధికారతకు, స్త్రీ పురుష సమానత్వానికి రాజా కుమారి చెబుతున్న అర్థం.. ‘ఐ యామ్ రెబల్’. అదే మాటను ఆవిడ కియారా అద్వానీ, బాణి జె లతో కలిసి పాటగా చెబుతున్నారు. ఆటగా చెబుతున్నారు. ఆ పాట, ఆట ఉన్న వీడియో ట్రాకే.. ఐ యామ్ రెబల్. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో విడుదల అయింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఈ ట్రాక్‌ను విడుదల చేశారు రాజా కుమారి. ఆ హిప్–హాప్ ట్రాక్ ఇప్పుడు అమ్మాయిల చేత ‘ఐ యామ్ రెబల్’ అంటూ సాయుధ గీతం పాడిస్తోంది. ఫెమినిస్టు ఉద్యమానికి రాగల కొద్ది రోజుల్లోనే ఈ ట్రాక్ ఒక సిగ్నేచర్ సాంగ్ అయినా కావచ్చు. స్వాతంత్య్ర దినోత్సవానికి.. ‘మా తుఝే సలాం’, వినాయక చవితికి.. ‘జై జై గణేశా..’, ఇప్పుడిక మార్చి ఎయిత్కి ‘ఐ యామ్ రెబల్’!! అంతుందా? ఉంది. ఓసారి ఆ వీడియో చూడండి. 2 నిముషాల 11 సెకన్లు. అందులో మీకు మీరు కనిపిస్తారు. (బాయ్స్.. మీరు కాదు). అమ్మాయలూ.. మీరెలానైతే, ఎంతగానైతే దూకుడు గా ఉండాలనుకుంటారో.. అలాగే మీ ప్రతిరూపం అందులో కనిపిస్తుంది. పాడింది రాజా కుమారి. రాసింది రాజా కుమారి. ఆమె భావాలకు ఫీచరింగ్ ఇచ్చింది కియారా అద్వానీ. మ్యూజిక్ దంచేసింది.. అవును, దంచుడే.. డీజే సా! సంకేత్ అర్జున్వాడే. కియారాతో పాటు చిన్న స్లిప్‌గా వి.జె.బాణి కూడా జర్రున జారి వెళతారు. మొత్తం ముగ్గురమ్మాయిల తీన్మార్! రాజా కుమారి అసలు పేరు శ్వేత. తను ఈ సాంగ్‌ని హిందీలో.. ‘నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నేను రెబెల్’ను అని రాశారు. శ్వేత ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్. ఇక రెండో అమ్మాయి కియా అద్వాని. బాలీవుడ్ నటి. మూడో అమ్మాయి బాణి.. వీజే, మోడల్, టెలివిజన్ హోస్ట్. సమాజంలో స్త్రీలు, ఆడపిల్లల పట్ల ఏవైతే పురుషాధిక్య భావాలు ఉన్నాయో వాటిని ఈ ‘ఐ యామ్ రెబల్’లో ప్రశ్నించారు, ధిక్కరించారు, వెక్కిరించారు.. వీళ్లు ముగ్గురూ. ఇంటర్నేషల్ ఉమెన్స్ డేకి వీధి వీధిలో మోగాల్సిన, మార్మోగాల్సిన స్త్రీవాద జాతీయ గీతం అని మీకు అనిపిస్తే కనుక ఆశ్చర్యం లేదు. అంతగా గర్ల్ పవర్‌ను దట్టించి వదిలారు. పాటను లాస్ ఏంజెలిస్‌లో కొంత, ముంబైలో కొంత షూట్ చేశారు. రాజా కుమారి, కియారా, వి.జె. బాణితో పాటు మరికొందరు అమ్మాయిలు కూడా రెబలియన్లుగా కనిపించి, కవ్వించి, మెరుపులా మాయమైపోతారు. రాజా కుమారి (శ్వేత) -
ఓవర్‌డోస్.. 5 నిమిషాలకు మించి బతకదు
అమెరికన్ పాప్ స్టార్ డెమి లోవాటో త్వరలోనే ఓ డాక్యుమెంట్ సిరీస్‌తో మన ముందుకు రాబోతున్నారు. ‘‘డ్యాన్సింగ్ విత్ డెవిల్’’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంట్‌ని యూట్యూబ్ వేదికగా విడుదల చేయనున్నారు. తాజాగా బుధవారం ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కి సంబధించి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో డెమి లోవాటో బాల్యం నుంచి నుంచి.. 2018లో డ్రగ్స్ ఓవర్‌డోస్ వరకు ఆమె జీవితంలో జరిగిన పలు సంఘటనలు ఉన్నాయి. దాంతో పాటు డెమి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె జీవితంలో చూసిన చీకటి రోజుల గురించి.. వాటి నుంచి ఆమె ఎలా బయటపడగలిగారు అనే విషయాల గురించి వారు మాట్లాడటం ఈ వీడియోలో చూడవచ్చు. డ్రగ్స్ ఓవర్‌డోస్ అవ్వడం వల్ల 2018లో డెమి లోవాటోకి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. డ్రగ్స్ పరిమితికి మించి తీసుకోవడం వల్ల వచ్చి లాస్ ఏంజెల్స్‌లోని తన నివాసంలో స్పృహ తప్పి పడిపోయారు డెమి లోవాటో. సమయానికి సిబ్బంది గమనించడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. హాస్పటిల్‌లో ఉండగానే తనకు మూడు సార్లు స్ట్రోక్ వచ్చిందని డెమి లోవాటో వెల్లడించారు. ఈ సందర్భంగా డెమి లోవాటో మాట్లాడుతూ.. ‘‘25వ ఏట నా జీవితంలో భయానక సంఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల లాస్ ఏంజెల్స్‌లోని నా నివాసం ‘‘హాలీవుడ్ హిల్స్’’లో స్పృహ తప్పి పడిపోయాను. నా పరిస్థితి గమనించిన సిబ్బంది వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నన్ను పరీక్షించిన వైద్యులు 5,10 నిమిషాల కన్న ఎక్కువ సమయం బతకను అని తేల్చారు. ఆ సమయంలో నాకు వెంట వెంటనే మూడు సార్లు స్ట్రోక్ వచ్చింది. తీవ్రమైన హార్ట్ ఎటాక్ వచ్చింది. నా పని అయిపోయింది అనుకున్నారు. కానీ అదృష్టం కొద్ది బతికి బయటపడ్డాను’’ అన్నారు, ‘‘ఆ తర్వాత కూడా చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. నా బ్రెయిన్ డ్యామెజ్ అయింది. ఆ ప్రభావం నా మీద ఇంకా ఉంది. దాని వల్ల నేను సొంతంగా కారు డ్రైవ్ చేయలేకపోతున్నాను. ఇక మెదడు పని తీరు సరిగా లేకపోవడం వల్ల కంటి చూపు సరిగా లేదు. కనీసం న్యూస్ పేపర్ కూడా చదవలేను. ఇలా రెండు నెలలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను. ప్రస్తుతం బుక్ చదవగలను. కానీ రోడ్డు చూస్తూ డ్రైవింగ్ చేయడం చాల కష్టం’’ అన్నారు డెమి లోవాటో. చదవండి: ఆ అపురూపం వెనక కన్నీళ్లెన్నో!? ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి -
62వ ఏట 26 ఏళ్ల లవర్‌తో సింగర్ షికార్లు
ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో పాటు వయసుతో కూడా సంబంధం లేదు. జీవితంలో ఏ వయసులో అయినా ప్రేమ కలగవచ్చు.. లవ్‌లో పడొచ్చు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే.. ప్రముఖ పాప్ సింగర్ ఒకరు లేటు వయసులో తాజాగా మరో సారి ప్రేమలో పడ్డారు. విశేషం ఏంటంటే వయసులో తన కన్నా దాదాపు 36 ఏళ్లు చిన్న వాడైన యువకుడితో పీకల్లోతు ప్రేమలో పడ్డారు సదరు సింగర్. ఇంతకు ఎవరా పాప్ సింగర్.. ఆమె లవ్ స్టోరి విశేషాలు తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.. హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్. పాటతో పాటు తిరుగులేని అందం మడోన్నా సొంతం. ఎవరి గురించి పట్టించుకోకుండా.. తన మనసుకు నచ్చినట్లు జీవిస్తుంటారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తారు. తాజాగా ఇలాంటి ప్రకటనే చేశారు మడోన్నా. 62 ఏళ్ల వయసులో తాను మరోసారి ప్రేమలో పడ్డానని వెల్లడించారు. అవును మీరు చదివింది నిజమే.. 62వ ఏట ఈ పాప్ దివ పీకల్లోతు ప్రేమలో పడ్డారు. అది కూడా తన కంటే 36ఏళ్ల చిన్నవాడితో. వాలంటైన్స్ డే సందర్భంగా లవర్ అహ్లమాలిక్ విలియమ్స్(26)తో కలిసి ప్రపంచాన్ని చుట్టేశారట. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా మడోన్నానే ప్రకటించారు. ‘‘ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నా వాలైంటన్తో కలిసి ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వచ్చాను. ఎంతో అద్భుతమైన జర్నీ. హ్యాపీ వాలైంటన్స్ డే విలియమ్స్ అహ్లమాలిక్’’ అంటూ ప్రియుడితో కలిసి ఉన్న రెండు ఫోటోలని షేర్ చేశారు మడోన్నా. ప్రస్తుతం వీరి ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగ్రాట్స్ చెప్పేవారు కొందరైతే.. పించన్ వచ్చే ఏజ్‌లో నీకు బాయ్‌ఫ్రెండ్ అవసరమా అంటూ విమర్శిస్తున్న వారు ఎందరో. View this post on Instagram A post shared by Madonna (@madonna) ఇక మడోన్నా-విలియమ్స్‌ల లవ్ స్టోరి విషయానికి వస్తే.. ఇతడు బ్యాకప్ డ్యాన్సర్‌గా పని చేస్తుంటాడు. ఐదేళ్ల క్రితం వీరద్దరికి పరిచయం ఏర్పడింది. మడోన్నా ఇచ్చిన రెండు ప్రదర్శనల్లో విలియమ్స్ డాన్సర్‌గా పని చేశాడు. అలా మొదలైన వీరి పరిచయం.. ప్రస్తుతం ప్రేమగా మారింది. ఓ ఏడాది నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మడోన్నా తాను మరో సారి ప్రేమలో పడినట్లు వెల్లడించారు. మడోన్నా విలియమ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతను చాలా మంచి వాడు. నా ఆరుగురు పిల్లలతో చాలా బాగా కలిసిపోయాడు. ముఖ్యంగా నా పెద్ద కుమార్తెకు అతను చాలా మంచి స్నేహితుడు’’ అంటూ చెప్పుకొచ్చారు. విశేషం ఏంటంటే మడోన్నా పెద్ద కుమార్తె.. విలియమ్స్ కన్నా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే చిన్నది. ఇక విలియమ్స్ తల్లిదండ్రులు ఇద్దరు మడోన్నా కన్నా చిన్నవారు కావడం గమనార్హం. విలియమ్స్ తండ్రికి 59, తల్లికి 55 సంవత్సరాలు. వీరిద్దరి కన్నా మడోన్నా పెద్దది. చదవండి: కొత్త ప్రపంచం కోసం ఈ సెలబ్రిటీలు నా కథ నేనే చెబుతా -
పాప్ సింగర్ అరెస్టు..
గన్‌లోడ్ చేసి పోలీస్‌కే గురిపెట్టిన కుర్రాడిని అమ్మాయిలు లైక్ చేస్తే చెయ్యొచ్చు. గవర్నమెంట్ మాత్రం డిస్లైక్ చేస్తుంది. అరెస్టు చేసి జైల్లో పెడుతుంది. పంజాబీ పాప్ సింగర్ శ్రీ బ్రార్ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. నెలక్రితం అతడు విడుదల చేసిన మ్యూజిక్ వీడియో ‘జాన్’.. గన్ కల్చర్‌ను ప్రేరేపిస్తుందన్న ఆరోపణపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కోటీ నలభై లక్షల మంది చూసిన ‘జాన్’లో అంతగా మందుగుండు సామగ్రి ఏముంది?! ముంబై: పంజాబ్ సీఎం తన రాష్ట్రం మీద మాట పడనివ్వరు. తన రాష్ట్రాన్ని మాట అనిపించుకునేలానూ ఉండనివ్వరు. ఇప్పుడేమైందో చూడండి. పంజాబ్‌లో శ్రీ బ్రార్ అనే ర్యాప్ సింగర్ ఉన్నాడు. అతడు ‘జాన్’ అనే వీడియో సాంగ్ చేశాడు. పోలీస్‌ల పైనే గన్స్ ఎక్కుపెడతాడు బ్రార్ అందులో. యూత్ బాగా ఎట్రాక్ట్ అయింది ఆ సాంగ్‌కి! కోటీ నలభై లక్షల వ్యూస్ వచ్చాయి. ఎట్రాక్ట్ అయితే అయ్యారు.. గన్ కల్చర్‌కి అడిక్ట్ అవుతారేమోనని పోలీసులు బ్రార్‌ను అరెస్టు చేశారు. ‘‘మంచి పని చేశారు. అరెస్ట్ చేయాల్సిందే అతడిని’ అని సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఇంత చిన్న విషయంలో సీఎం కల్పించుకోవడం పెద్ద విషయమే. ఆ వీడియోలోని తారాగణంలో, తాత్పర్యంలో ఉన్న ప్రభుత్వ ధిక్కార ధోరణులే అందుకు కారణం. ‘జాన్’ నెల క్రితమే విడుదలైంది. శ్రీ బ్రార్ తోపాటు వీడియోలో బార్బీ మాన్ అనే లేడీ ర్యాపర్, గుర్నీత్ దొసాంజ్ అనే పాప్ ఆర్టిస్ట్ నటించారు. అందులోని మందు గుండు సాహిత్యం మాత్రం బ్రార్దే. ఈ వీడియో సాంగ్‌లో గుర్నీత్ రెండు చేతుల్తో రెండు గన్స్ పట్టుకుని పోలీస్ స్టేషన్లోకి వెళ్తాడు. స్టేషన్‌లోని పోలీసుల్ని టపాటపామని లేపేసి, లాకప్ లాక్‌లను పేల్చేసి తన ‘అక్యూజ్డ్’ ఫ్రెండ్స్‌ని విడిపించుకుని వెళ్తాడు. ఈ హీరోయిజాన్నంతా బార్బీ ఆరాధన భావంతో చూస్తూ ఉంటుంది. ఈ దృశ్యాల వెనుక మన బ్రార్ రాసిన సాంVŠ రన్ అవుతుంటుంది. ‘నో డౌట్.. నో డౌట్ నీకు మీసాలొచ్చాయ్. నీ పొలంలో కొత్త ట్రాక్టర్ గర్జిస్తోంది. ఓ జాట్ కుర్రాడా.. నీకు నువ్వే ఒక బ్రాండ్. నేరాన్ని శ్వాసించే వాళ్లంతా నీ వైపే. అందుకే వాళ్లను విడిపించేందుకు వెళ్తున్నావ్. పోలీసులకు నువ్వేమిటో చూపించు..’ అని పంజాబీలో బార్బీ మాన్ పాడుతుంటుంది. ఈ సాంగ్.. గన్ కల్చర్‌ని ప్రోత్సహించేలా ఉందని శ్రీ బ్రార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు పెట్టింది పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ విక్రమ్ జీత్ దుగ్గల్. హింసను ప్రేరేపించడం, సంఘ విద్రోహశక్తులను పురికొల్పడం, గ్యాంగ్స్టర్లకు ఆశ్రయం ఇమ్మని వీడియోలో ఇన్‌డైరెక్టుగా చెప్పడం.. బ్రార్‌పై ప్రధాన ఆరోపణలు. ‘ప్రిన్స్ ఆఫ్ పటియాలా’ గా 2016లో పాప్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు బ్రార్. చండీగఢ్ కుర్రాడు. కాలేజ్‌లో ఆర్ట్స్ స్టూడెంట్. కరన్ అవుజ్లా, దిల్‌ప్రీత్ థిల్లాన్‌తో కలిసి పాడిన పంజాబీ సాంగ్ ‘యార్ గ్రరీబాజ్’తో ఇతడొకడున్నాడని ఇండీపాప్ సీనియర్ ఆర్టిస్టుల దృష్టిలో పడ్డాడు. పెద్దగా ఆల్బమ్‌లు లేకపోయినా, వచ్చిన కొత్తల్లో చేసిన అరకొర సాంగ్స్.. ఇప్పుడతడిపై వచ్చిన ఆరోపణల్ని పోగొట్టి.. ‘కుర్రాడు మంచివాడే’ అనే ఆలోచన కలిగించేంత బలమైనవి కావు. బ్రార్ ఎన్నో రోజులు జైల్లో ఉండకపోవచ్చు. సీఎం అమరీందర్ సింగ్ శిక్షకు బెదరేలా చేస్తారు కానీ, శిక్ష విధించరని అంటారు. ఇక ‘జాన్’లోని బార్బీ మాన్‌కి బ్రార్‌ని మించిన ప్రొఫైలే ఉంది. ఫిరోజ్ పూర్ అమ్మాయి. పంజాబీ, భాంగ్రా, పాప్‌లో యువతను ఆకట్టుకునే స్వరాభినయం బార్బీది. 2020 జూన్‌లో రిలీజ్ అయిన బార్బీ సింగిల్ ‘తెరీ గలీ’ని ఒక్క నెలలో 2 కోట్ల 90 లక్షల మంది యూట్యూబ్ వ్యూయర్స్ చూశారు. ‘మేరీ సహేలీ’ ట్రాక్‌తో రెండేళ్ల క్రితం మొదలైన బార్బీ కెరీర్ ఇప్పుడు పీక్‌లో ఉంది. బీబీసీ చార్ట్‌లో ఆమె పేరు ఉంది. ఇప్పుడీ ‘జాన్’తోనూ ఆమెకు పేరు వచ్చిందే తప్ప, బ్రార్ సాహిత్యానికి గాత్రమిచ్చినందుకు పంజాబ్ ప్రభుత్వం ఏమీ అనలేదు. -
మారడోనా మృతి.. ట్రెండింగ్‌లో రిప్ మడోన్నా
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా) : ప్రపంచ పుల్‌బాల్ దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా మృతి అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. సాకర్ స్టార్ ప్లేయర్ ఇక లేరనే వార్త పుట్‌బాల్ ప్రియులను శోకసంద్రంలో ముంచింది. కేవలం ఆటలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్న మారడోనా ఇకలేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పుట్‌బాల్ మాంత్రికుడి మరణవార్త ప్రపంచ క్రీడా లోకాన్ని కన్నీటిసంద్రంలో ముంచింది. తమ ఆరాధ్య ఆటగాడి కోసం యావత్ అర్జెంటీనా విలపించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా డీగో అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు. రిప్ మారడోనా అంటూ సాకర్ దిగ్గజానికి కడసారి వీడ్కోలు పలికారు. అయితే కొంత అభిమానులు చేసిన తప్పిదం హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నాకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎంకి పెళ్లి.. సుబ్బి సావుకొచ్చినట్టు మారడోనాకు బదులుగా రిప్ మడోన్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. (గుడ్‌బై మారడోనా) చనిపోయింది మారడోనానా లేక మడోన్నా అన్న విషయంపై క్లారిటీ లేకుండా ఏకంగా రిప్ మడొన్నా అంటూ ట్వీట్ చేయడం ఆరంభించారు. ఇది చూసిన కొంతమంది షాక్అవ్వగా.. మరికొంత మంది అభిమానులు మాత్రం నిజంగానే ఆమె మరణించిందని సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ అభిమాన సింగర్ మృతిని జీర్ణించుకోలేపోతున్నామని విలపించారు. ఆమె పాటలు, వీడియోలో షేర్ చేస్తూ నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘రిప్ మడోన్నా’ అనే ట్వీట్కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. RIP Madonna, you'll be forever in our hearts. Legend. pic.twitter.com/EnMrIUZhRs — icah (@poemtoahoe) November 25, 2020 Rip Madonna gone too soon 😭😭 pic.twitter.com/KMxziKA82y — Trap House (@SugarDaada) November 25, 2020 -
ఆ అపురూపం వెనక కన్నీళ్లెన్నో!?
పాశ్చాత్య పాప్ సంగీతంలో కుర్రకారును ఉర్రూతలూగించడంతో పాటు తన తరానికి విషాదాశ్రుతుషారాల నిషానందిస్తున్న ‘మారియా కేరి’ పేరును పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గాయనిగా, గేయ రచయితగా, మ్యూజిక్ కంపోజర్‌గా, ఆల్బమ్ మేకర్, నటిగా పలు పాత్రలు పోషిస్తున్న ఆమెను ‘గ్రామీ అవార్డు’ ఎప్పుడో వరించింది. న్యూయార్క్‌లోని బెడ్ఫోర్డ్లో 50 ఎకరాల స్థలంలో సువిశాల భవంతిలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వస్తోన్న ఆమె ప్రతి క్రిస్మస్ పండగకు కుటుంబ సభ్యులతోపాటు బంధు మిత్రులతో కలిసి కొలరాడోలోని పర్వత ప్రాంతాలకు వెళ్లడం అలవాటు. మారియా కేరి ఆస్తి విలువ నాలుగువేల కోట్ల రూపాయలు ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆమె ఓ సాధారణ కుటుంబంలోనే జన్మించి ఈస్థాయికి వచ్చారంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో ఆమె తన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో, ఎన్ని కన్నీళ్లను కార్చారో. ఆమె తన జీవిత విశేషాలను వివరిస్తూ రాసిన ‘ది మీనింగ్ ఆఫ్ మారియా కేరి’ పుస్తకం మొన్న సెప్టెంబర్ 29వ తేదీన మార్కెట్లోకి వచ్చింది. (చదవండి : జపాన్‌లో సంచలనం సృష్టించిన ట్విట్టర్ హత్యలు) తన ఆరేళ్ల వయస్సులోనే తన కళ్ల ముందు తన తల్లిని అన్న గోడకేసి బాదిన భయంకర దృశ్యం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో పాటు తన సోదరి తనకు కొకైన్, వాలియమ్ మత్తు మందులను అలవాటు చేసి వేశ్య గృహానికి తనను అమ్మేసేందుకు ప్రయత్నించడం, చిన్నప్పటి నుంచే జాతి విద్వేషాన్ని అనుభవించిన వైనాలను ఆమె తన పుస్తకంలో వివరించారు. తండ్రి నీగ్రో, తల్లి శ్వేత జాతీయురాలికి పుట్టిన మారియా జీవితానుభాలు అన్నీ ఇన్నీ కావు. సోని మ్యూజిక్ ప్రెసిడెంట్ టామ్మీ మొటోలాను 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత ఐదేళ్లకే ఆయనతో విడిపోయారు. ఆ తర్వాత నికీ కానన్‌ను పెళ్ల చేసుకున్న ఆమె ఆయనతో కూడా ఐదేళ్లకే విడిపోయారు. తన మాజీ భర్తలంతా తనను ఓ ఏటీఎం యంత్రంగా చూడగా, బాయ్ ఫ్రెండయిన బేస్ బాల్ ప్లేయర్ డెరిక్ జెటర్ తనను మనిషిగా చూస్తారని ఆమె తన పుస్తకంలో వివరించారు. జెటర్ తల్లి ఐరిష్ యువతికాగా, తండ్రి నీగ్రో అవడమే తమ మధ్య సామీప్యతకు ఓ కారణం కావచ్చని ఆమె చెప్పారు.(చదవండి : కరోనా నియంత్రణలోనే ఉంది: ఉత్తర కొరియా) సరిగ్గా 50 ఏళ్లు నిండిన మారియా కేరిది అపురూపమైన అందం. ఇద్దరు పిల్లలున్న మారియా కేరి ప్రస్తుతం బెడ్‌ఫోర్డ్‌లోని సువిశాల భవంతిలో ఎక్కువగా ఒంటరిగానే గడుపుతున్నారు. అణువణువున సాయుధ అంగరక్షకుల పహరా మధ్య ఆమె గదుల నిండా కుక్క పిల్లలను, పిల్లులను పెంచుకుంటూ చూయింగ్ గమ్ నములుతూ కాలక్షేపం చేస్తున్నారు. -
నా కథ నేనే చెబుతా
హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేస్తారు అనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. అయితే తన బయోపిక్‌ను మడోన్నాయే డైరెక్ట్ చేసుకోనున్నారట. ‘నా కథను నాకంటే ఎవరు బాగా చెప్పగలరు? ఈ సినిమా ఫోకస్ మొత్తం మ్యూజిక్ మీదే ఉంటుంది. సంగీతమే నన్ను నడిపించింది. నా జీవితంలో ఎన్నో సంఘటనలను ఈ సినిమాలో ప్రస్తావిస్తాను’ అని అన్నారు మడోన్నా. గతంలో ‘ఫిల్త్ అండ్ విస్డమ్, డబ్ల్యూ ఈ’ చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారామె. -
'గే'ల కోసం మాట్లాడితే రూ.10 లక్షల ఫైన్
పాప్ గాయని మడోన్నాకు రష్యా ప్రభుత్వం 10 లక్షల రూపాయల జరిమానా వేసిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఎనిమిదేళ్ల క్రితం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్జీబీటీక్యూలకు మద్దతు తెలుపుతూ మాట్లాడినందుకు ప్రభుత్వం 1 మిలియన్ డాలర్ల జరిమానా విధించిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె 2012లో రష్యా టూర్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్జీబీటీక్యూల హక్కుల కోసం మాట్లాడారు. వారికి అందరితోపాటు సమాన గౌరవం, సమాన హక్కులు కల్పించాలని గొంతెత్తి నినదించారు. ఆమె ఉపన్యాసానికి అభిమానుల చప్పట్లతో, ఈలలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అయితే రష్యా ప్రభుత్వానికి మాత్రం ఇది మింగుడుపడనట్లుంది. ఫలితంగా ఆమెకు పది లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ రుసుమును కాస్త తగ్గించిందని మడోన్నా తెలిపారు. కానీ తాను మాత్రం ఇప్పటివరకు పైసా కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. తాజాగా ఆనాటి చేదు సంఘటనను అభిమానులతో పంచుకోవడంతోపాటు, "గే"లకోసం మాట్లాడిన వీడియోను సైతం గాయని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (కరోనాకి అంత సీన్ లేదు!) View this post on Instagram 8 years ago. I was fined 1 million dollars by The government for supporting the Gay community. I never paid.................... #freedomofspeech #powertothepeople #mdna A post shared by Madonna (@madonna) on Jul 19, 2020 at 7:42pm PDT -
పంజాబ్ సింగర్ సిద్ధూపై కేసు నమోదు
ఛండీగడ్ : హింసను ప్రోత్సహించేలా పాటలు పాడుతూ గాల్లో ఫైరింగ్ జరిపిన పంజాబీ పాప్ సింగర్ సిద్ధూ మూసేవాలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా దీనికి సహకరించిన సంబంధిత పోలీసులపై కూడా కేసు నమోదైంది. వివరాల ప్రకారం సంగ్రూర్ బదబార్ గ్రామంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి సంగీత కచేరి ఏర్పాటు చేయడమే కాకుండా హింసను ప్రోత్సహించేలా పాటలు పాడుతూ గాల్లో ఫైరింగ్ జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదస్పదం అయ్యింది. దీంతో విచారణకు ఆదేశించిన డీజీపీ దినకర్ గుప్తా..మూసేవాలకు సహకరించిన డీఎస్పీ సహా ఐదుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగర్ మూసేవాలపై సెక్షన్ 188 కింద కేసు పోలీసులు నమోదుచేశారు. గాయకుడు మంక్రీత్ అలాఖ్తో కలిసి హింసను ప్రోత్సహించేలా పాటలు పాడిన కారణంగా సిద్ధూ మూసేవాలపై గతంలోనే కేసు నమోదైన సంగతి తెలిసిందే. (డ్రగ్స్ కేసులో పంజాబ్ సింగర్ అరెస్ట్ ) -
కరోనాకి అంత సీన్ లేదు!
పాప్ గాయని మడోన్నాకు కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి ఉందట. అందుకే కరోనా నన్ను ఏమీ చేయలేదు.. నా విషయంలో కరోనాకి అంత సీన్ లేదంటున్నారామె. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ లో తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజూ జరిగిన విషయాలను ‘‘క్వారంటైన్ డైరీ’’ పేరుతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకుంటున్నారామె. ఇటీవలే కరోనా గురించి ఓ అప్ డేట్‌ను తన అభిమానులతో పంచుకున్నారు మడోన్నా. ‘‘ఈ మధ్యే కరోనాకి సంబంధించిన టెస్ట్ చేయించుకున్నాను. కరోనాను ఎదిరించే యాంటీబాడీస్ నా శరీరంలో తగినన్ని ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింది. రేపు ఉదయమే కారు తీసుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్లబోతున్నాను. దారిలో కారు అద్దాలు దించి కోవిడ్ గాలి కూడా పీలుస్తాను. అందర్నీ ఇలా చేయమని చెప్పను. అందరూ ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి’’ అని పేర్కొన్నారు మడోన్నా. -
లాక్డౌన్లో పట్టభద్రురాలైన పాప్ సింగర్
లాక్డౌన్లో సరదాగా కోసం తీసుకున్న పురాతన తత్త్వశాస్త్రంలో పట్టా పొందారు పాప్ సింగర్ షకీరా. ఈ విషయాన్ని ఆమె శనివారం సోషల్ మీడియాలో వెల్లడించారు. నాలుగు వారాలు పాటు మాత్రమే తీసుకున్న ఈ కోర్సును పూర్తి కావడంతో ఆమెకు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం గురువారం డిగ్రీ సిర్టిఫికేట్ను ఇచ్చింది. ఈ సర్టిఫికెట్ ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ... ‘నేను ఇప్పుడే నాలుగు వారాల పురాతన తత్త్వశాస్త్రంలో డిగ్రీ పొందాను. నా అభిరుచులు కాస్తా అసాధ్యమైనవే అని నాకు తెలుసు. అయితే పిల్లలతో ఈ కోర్సు చేయడం కష్టమే. అయినా వారు నిద్రపోయాక నేను రాత్రంతా మెలకువతో ఉండి ఈ కోర్సు పూర్తి చేశాను’ అని ట్వీట్ చేశారు. (లాక్డౌన్: ‘వీరిని చూస్తే గర్వంగా ఉంది’) I just graduated from my 4 week Ancient Philosophy course with the University of Pennsylvania (@Penn). I know... my hobbies are very impractical, but it took a lot of hours after the kids were asleep. Thank you Plato and predecessors for all the "fun" over the past month! pic.twitter.com/cFTCXDjliX — Shakira (@shakira) April 23, 2020 ఇక తను అందరి కంటే భిన్నంగా ఆలోచించి లాక్డౌన్లో పట్టభద్రులైన షకీరా తెలివికి అభిమానులు ఫిదా అవుతూ ప్రశంసిస్తూంటే మరికొందరు ఇది మీకు ఇప్పడంత ముఖ్యమా అంటూ విమర్శిస్తున్నారు. ‘‘మీరిలా అనవసరమైన కోర్సును తీసుకుని మీ అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తారని అనుకోలేదు. మీకు పిల్లలు ఉన్నారు కదా. ఈ సమయాన్ని వారికి కేటాయించొచ్చు. మీ సమయాన్ని పిల్లలకు ఇచ్చేదాని కంటే ఇది మీకు ముఖ్యమైనదా. అంటే వారు మీకు అంతా ముఖ్యమైన వారు కాదా?’’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (‘ఆ నూనెతో కరోనా చనిపోతుంది’) ఇక లాక్డౌన్లో ఏంచేయాలో తోచక చాలా మంది ఇంట్లో కొత్త కొత్త వంటకాలు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం, టైమ్ పాస్ కోసం టిక్‌టాక్‌లు, డ్యాన్స్‌లు వంటివి చేస్తున్నారు. అయితే వీటన్నింటిని పక్కన పెట్టి షకీరా కొత్తగా ఆలోచించారు. సరదా కోసం తీసుకున్న నాలుగు వారాల ప్రాచీన తత్త్వశాస్త్రంలో షకీరా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. -
పాప్ సింగర్ జెన్నీఫర్‌పై కేసు
న్యూయార్క్: హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్పై మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో సోమవారం కేసు నమోదైంది. ప్రముఖ న్యూయార్క్ ఫొటో గ్రాఫర్ స్టీవ్ సాండ్స్ తీసిన ఫొటోను అనుమతి లేకుండా జెన్నీ సోషల్ మీడియాలో ఫోస్టు చేసిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేగాక జెన్నీ నుంచి తనకు రూ. 1.14 కోట్ల నష్టాపరిహరాన్ని కూడా ఇప్పించాలని సాండ్స్ కోర్టును విజ్ఞప్తి చేశాడు. (నా భర్త కరణ్‌లా ఉంటే ఇష్టపడను) దీనిపై సాండ్స్ తరపు న్యాయవాది రిచర్డ్ లీబోవిట్జ్ మాట్లాడుతూ.. ‘గాయని జెన్నీఫర్ లోపెజ్ అనుమతి లేకుండ తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారని ఫొటోగ్రాఫర్ సాండ్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేగాక జెన్నీ నుంచి తనకు రూ. 150,000 డాలర్లనష్ట పరిహారంతో పాటు న్యాయవాది ఫీజును కూడా ఇప్పించాలని పిటిషన్లో పేర్కొన్నాడు’ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక జెన్నీఫర్ సోంత నిర్మాణ సంస్థ నుయోరికాన్ ప్రోడక్షన్ బ్రాండ్ ప్రమోషన్ కోసమే తన ఫొటోను వాడుకుందని సాండ్స్ పిటిషన్లో పేర్కొన్నట్లు చెప్పాడు. తన ఫొటోను జెన్నీ 2017 జూన్ 23న తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారని.. దానికి ఇప్పటి వరకూ 650, 000 లైక్‌లు కూడా వచ్చినట్లు కూడా చెప్పాడని రిచర్డ్ పేర్కొన్నాడు. అయితే దీనిపై జెన్నీఫర్ కానీ ఆమె న్యాయవాది కానీ ఇంత వరకూ స్పందించలేదు. (హాలీవుడ్ సంస్థతో బాలీవుడ్ 'ఏరోస్' విలీనం) -
పీఏ బర్త్‌డేకు బెంజ్ గిఫ్ట్..
-
పీఏ బర్త్‌డేకు బెంజ్ గిఫ్ట్..
లండన్ : పీఏ బర్త్‌డే అంటే మహా అయితే కేక్ కట్ చేసి చిన్న పార్టీ ఇవ్వడమే గొప్ప అనుకునే రోజుల్లో పాటల సంచలనం మాడిసన్ బీర్ తన పీఏ 30వ బర్త్‌డే సందర్భంగా మరిచిపోలేని గిఫ్ట్‌ను ఆమెకు బహుకరించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. పీఏ జన్మదినం సందర్భంగా లంచ్ ఏర్పాటు చేసిన మాడిసన్ అనంతరం ఆమెకు న్యూ మెర్సిడెస్ బెంజ్ సీ 300ను కానుకగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. మెర్సిడస్ కారును సొంతం చేసుకోవాలన్న తన పీఏ కలను మాడిసన్ ఇలా నిజం చేశారు. 12 ఏళ్ల పాత కారుతో తన పీఏ ఇబ్బంది పడటాన్ని స్వయంగా వీక్షించిన మాడిసన్ రూ 30 లక్షల విలవైన గిఫ్ట్‌తో ఆమెను షాక్‌లో ముంచెత్తారు. 13 ఏళ్ల వయసులోనే మాడిసన్‌కు గాయనిగా గుర్తింపు లభించింది. యూట్యూబ్ వీడియోలు 20 ఏళ్ల యువ గాయనికి తిరుగులేని బ్రేక్ ఇచ్చాయి. చదవండి : బెంజ్ కంపెనీ నుంచి ‘అవతార్’ కారు -
సింగర్ జస్టిన్ బీబర్‌కు లైమ్ వ్యాధి
తన పాటలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్ ప్రస్తుతం ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే బుధవారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనకు లైమ్ వ్యాధి సోకిందని, అయితే దీనికి చికిత్స తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. పాతికేళ్లు వయసున్న జస్టిన్ బీబర్ ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చారు. ‘చాలా మందికి తెలియదు. జస్టిన్ బీబర్ ఎందుకు ఇలా తయారయ్యాడని అందరూ అనుకుంటున్నారు. నేను లైమ్ వ్యాధితో బాధపడుతున్నానని వారికి తెలీదు. ఇది నాపై దీర్ఘకాలంగా ప్రభావం చూపింది. ఈ వ్యాధి వల్ల నా చర్మం పూర్తిగా పాడైపోయింది. మెదడు పనితీరు మారింది. ఒంట్లో శక్తి తగ్గి, ఆరోగ్యం క్షీణించిపోయింది’ అని పేర్కొన్నారు. అయితే చాలా కాలం ఈ జబ్బుతో పోరాడం చేశానని ప్రస్తుతం దీనిని పూర్తిగా అధిగమించడానికి సరైన చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. కాగా లైమ్ వ్యాధి బొర్రెలియా బర్గ్ డార్ఫరి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇక్సోడ్స్ అనే పేను లాంటి పురుగుల (టిక్స్) ద్వారా వ్యాపిస్తుంది. అమెరికా వంటి దేశాల్లో ఎండకాలంలో బాగా వచ్చే ఈ వ్యాధి సోకడం వల్ల చర్మం ఎర్రగా మారి.. దద్దుర్లు ఏర్పడతాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. ఇక ఓ నివేదిక ప్రకారం సుమారు మూడు లక్షల మంది అమెరికన్లు లైమ్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. -
యువ గాయని మృతి.. సూసైడ్‌గా అనుమానాలు!
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ గూ హరా హఠాన్మరణం చెందారు. దక్షిణ కొరియాకు చెందిన కే-పాప్ బ్యాండ్ ‘కారా’ సభ్యురాలిగా, గాయనిగా పేరొందిన గూ హరా ఆదివారం సియోల్‌లోని తన ఇంట్లో అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా కనిపించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమె తన ఇంట్లో మరణించి ఉండటాన్ని పరిచయస్తులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృతికి కారణాలు తెలియదని, ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చునని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆరు నెలల కిందట కూడా ఆమె తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించారు. అప్పట్లో ఆత్మహత్యయత్నానికి ఆమె ప్రయత్నించినట్టు కథనాలు వచ్చాయి. 2008లో ‘కారా’ బ్యాండ్ గర్ల్‌గా గూ హరా సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పట్లో కారా బ్యాండ్ గ్రూప్ సెన్సేషనల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. క్రమంగా ఈ బ్యాండ్ ప్రభ మసకబారింది. ఈ క్రమంలో గత ఏడాది రివేంజ్ పోర్నోగఫీ బారిన పడిన గూ హరా తన మ్యూజిక్ కెరీర్‌ను అర్ధంతరంగా ఆపేసింది. మాజీ ప్రియుడు తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత వీడియోలను బయటపెడతానని బెదిరించాడు. దీంతో అతన్ని హరా కోర్టుకు ఈడ్చింది. దీంతో కోర్టు అతనికి తాత్కాలిక జైలుశిక్ష విధించింది. ఈ వీడియోల కారణంగానే ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. -
సూసైడ్ జాకెట్‌తో పాక్ పాప్ సింగర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన పాప్ సింగర్, నటి రబి పిర్జాదా (27) డమ్మీ బాంబులు అమర్చిన ‘సూసైడ్ జాకెట్’ తొడుక్కొని ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపుకు నిరసనగా ఆమె ఈ చర్యకు పూనుకుంది. మోదీకి హెచ్చరికగా ట్విట్టర్లో చేసిన ఈ పోస్టు వైరల్ అయింది. దీనిపై కొందరు పాకిస్తాన్ పరువు తీస్తున్నావంటూ తిట్టిపోశారు. అనంతరం ఆమె ఆ ఫొటోను తొలగించారు. గతంలో కూడా ఆమె కొండ చిలువలు, మొసళ్ల దగ్గర ఫొటో దిగి వాటిని మోదీపై వదులుతానని వ్యాఖ్యలు చేసింది. అదికాస్తా వైరల్ కావడంతో పంజాబ్ వణ్యప్రాణి రక్షణ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. -
పాప్ సింగర్‌పై పిడిగుద్దులు..!!
వాంకోవర్: పంజాబ్ పాప్ సింగర్ గురు రాంధవాకు చేదు అనుభవం ఎదురైంది. కెనడాలోని వాంకోవర్‌లో ఆదివారం రాత్రి కచేరీ ఇచ్చి బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతనిపై దాడి చేశాడు. కెనడాలోనే అతిపెద్ద థియేటర్ అయిన క్వీన్ ఎలిజబెత్ థియేటర్లో గురు రాంధవా సంగీత ప్రదర్శన ఇచ్చాడు. అనంతరం ఎగ్జిట్ గుండా బయటకు వెళ్తున్న సమయంలో ఎవరో దుండగుడు అతని మొహంపై పిడిగుద్దులు కురిపించాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పంజాబ్‌కు చెందిన గురు రాంధవా గతంలో చిన్నపాటి కచేరీలు ఇస్తుండేవాడు. ఒకవైపు ఎంబీఏ చదువుతూనే మరోవైపు చిన్న చిన్న షోలు చేస్తుండేవాడు. తన ర్యాప్ పాటలు జనాల్లో క్లిక్ అవటంతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ‘హై రేటెడ్ గబ్రూ, లాహోర్, సూట్’ వంటి పాటలతో తక్కువకాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాంధవా తన మకాన్ని ఢిల్లీకి మార్చాడు. ఆ తర్వాత మ్యూజిక్ కంపోజర్‌గా, పాటల రచయితగా, గాయకుడిగా పలు అవతారాలు ఎత్తాడు. ఇతని పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సంపాదిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాయి. తాజాగా అతను విడుదల చేసిన ‘స్లోలీ స్లోలీ’ పాట ఒక్కరోజులోనే 33 మిలియన్ల వ్యూస్‌ను తెచ్చిపెట్టింది. కాగా ఈ పాటకు అమెరికన్ కంపెనీ గిఫ్టీ విజువల్స్‌ను అందించింది. -
అవిసీ హఠాన్మరణం.. అనుమానాలు!
స్టాక్ హోమ్: ప్రముఖ సంగీత దర్శకుడు, డీజే.. అవిసీ హఠాన్మరణం పాప్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 28 ఏళ్లకే ఈ యువ సంచలనం మృతి చెందటం అనుమానాలకు తావిస్తోంది. ఆయన మృతి వార్తను పబ్లిసిస్ట్ బరోన్ మీడియాకు వెల్లడించారు. ఒమన్‌లో అవిసీ కన్నుమూసినట్లు శుక్రవారం బరోన్ పేరు మీద ఓ ప్రకటన విడుదలయ్యింది. అవిసీ ఎవరు?.. స్వీడన్‌కు చెందిన డీజే అవిసి. అసలు పేరు టిమ్ బర్గిలింగ్. చిన్న వయసులోనే పాప్ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వేక్ మీ అప్ సాంగ్ అతని కెరీర్‌ను మలుపు తిప్పగా.. లెవల్స్ , అండ్ రీసెంట్లీ, లోన్లీ టుగెదర్ ఆల్బమ్‌లతో అవిసి పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. రెండుసార్లు అతని పేరు గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యింది కూడా. పాక్-అమెరికన్ సింగర్ నదిలా అలీతోపాటు పలువురు ప్రముఖ సింగర్లతో రాపర్‌గా కూడా ఆల్బమ్‌లను సృష్టించాడు. నిర్మాతగా కూడా అవిసీ రాణించాడు. మృతిపై అనుమానాలు... అవిసీ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే 2013లో అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నికోటిన్‌కు బానిసై అతను రోగాల బారిన పడ్డాడని పుకార్లు వినిపించాయి. అయితే అదంతా నిజం కాదని ఆ సమయంలో అవిసీ ఖండించాడు. కానీ, 2014లో అతను చాలా మట్టుకు షోలను అర్థంతరంగ రద్దు చేసుకోవటంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. చివరకు ఓ గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవిసీ తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పరోక్షంగా తెలిపాడు. అవిసీ ఎలా చనిపోయాడన్నదానిపై అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది. -
పాట మరిచిపోయింది.. నవ్వుల పాలు
న్యూయార్క్ : ఆమె పాడే పాటలకు వేలాది మంది అభిమానులు.. తను ఇచ్చే మ్యూజిక్ షోలతో అభిమానులకు, ఈవెంట్ ప్రొడ్యూసర్లకు పండగే. ఈ సింగర్ మైకు చేత పట్టి పాట పాడితే అవార్డులు సైతం దాసోహం అవుతాయి. ఆమె ఎవరో కాదు మూడు గ్రామీ పురస్కారాల గ్రహీత, అమెరికన్ పాప్ సింగర్, రచయిత అలిసియా బెత్ మూర్(పింక్). ఓ ఈవెంట్ సంస్థ న్కూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో పింక్ బృందంతో మ్యూజికల్ షోను ఏర్పాటు చేసింది. ఈ షోలో సొంతంగా కంపోజ్ చేసి, ఇప్పటికే ఎన్నో స్టేజిల మీద పాడి విజయవంతమైన పాటను పాడటానికి పింక్ సిద్ధం అయ్యారు. తన టీంతో కలిసి పాట పాడటం ప్రారంభించిన పింక్ మధ్యలో తడబడ్డారు. పాట చరణాలు మరిచిపోయి కోరస్ బృందం సహాయంతో పాట పూర్తి చేశారు. ఆ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు నవ్వుతూ ఉండటంతో పాట పాడటం అయిపోయాక క్షమించండి పాట మరిచిపోయాను అని పింక్ తెలిపింది. -
ఆమె ఒళ్లంతా బంగారం కప్పుకుంటే..!
లాస్ఏంజిల్స్: అందమైన అమ్మాయిని చూస్తే ఎవరైనా.. ‘బంగారు బొమ్మ’ అని అనడం పరిపాటి. అయితే అమ్మాయే బంగారం పోత పోసినట్టుగా ఉంటే..! ఒళ్లంతా బంగారం కప్పుకుంటే..! ఏమంటారు? పసిడి కాంతుల బంగారు రాణి అంటారు. ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతారు..!! ఏంటి.. ఏదో ఫాంటసీ కథలోకి లాగుతున్నారు. అనుకుంటున్నారా!! కానీ ఇది కథ కాదు. నిజంగా నిజం. ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ గాయని బేయాన్స్ నోలెస్ ఇలా బంగారు వస్త్రాలు ధరించి మురిసిపోయారు. అందరినీ మురిపించారు. తన పాదాల చూట్టూ పరుచుకున్న గౌన్ ఆ పరిసరాల్ని బంగారు మయం చేసింది. విశేషమేమంటే.. ఈ బంగారు గౌన్ ని డిజైన్ చేసింది భారతీయ ద్వయం ఫాల్గుణి, షేన్ పీకాక్ లు. ‘వియరేబుల్ ఆర్ట్ గాలా’ రెండో వార్షికోత్సవం సందర్భంగా వీరు తయారు చేసిన బంగారు గౌన్ ని ధరించి, బేయాన్స్ తన పసిడి కాంతుల అందంతో, గోల్డ్ గౌన్‌తో కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ మంత్రముగ్థుల్ని చేసిది. పై నుంచి దిగొచ్చిన రాజకుమారిలా తోచింది. ఇంకాస్త బంగారం.. బేయాన్స్తో పాటు ఆమె కూతురు ఆరేళ్ల బ్ల్యూ ఇవీ కూడా గోల్డ్ గౌన్ ధరించి అల్లరి చేసింది. ఆమెతో కలిసి నడిచింది. తల్లీ కూతుళ్ల బంగారపు కోలాహలం సభికులను కట్టిపడేసింది. భార్యాభర్తలు ఫాల్గుణి, షేన్ పీకాక్‌లు భారతీయ వస్త్ర సంప్రదాయాల్ని హాలీవుడ్ స్థాయికి చేర్చడం నిజంగా గొప్ప విషయం. పది రోజుల్లో రూపుదిద్దుకున్న ఈ బంగారు గౌన్ ఆఫ్రికన్ పురాణాల్లోని కాల్పనిక రాజ్యం ‘వాకండ’ సైనికుల రక్షణ కవచాన్ని పోలి ఉండడం గమనార్హం. అయితే దీని తయారీకి వెచ్చించిన సొమ్మెంతో మాత్రం వెల్లడించలేదు. -
దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు
-
దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు
పటియాలా: 2003లో జరిగిన ‘ఇమిగ్రేషన్ స్కాండల్’ కేసులో పంజాబ్ పాప్ సింగర్ దలేర్ మెహందీని కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శుక్రవారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి దలేర్‌కు రూ.1,000 జరిమానా విధించారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిలుపై విడుదలయ్యారు. అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు సహాయం చేస్తామని చెప్పి దలేర్, షమ్షేర్ మెహందీ తమ వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ బక్షీశ్ సింగ్ అనే వ్యక్తితోపాటు మరో 35 మంది ఫిర్యాదు చేశారు. 1998, 1999ల్లో రెండు బృందాలను అమెరికాకు తీసుకెళ్లిన మెహందీ సోదరులు అందులో 10 మందిని అక్కడే అక్రమంగా వదిలి వచ్చినట్లు ఆరోపణలున్నాయి. మరోసారి శాన్ఫ్రాన్సిస్కోలో ముగ్గురు అమ్మాయిలను వదిలి వచ్చినట్లు ఆరోపణలున్నాయి. 1999 అక్టోబర్‌లో సోదరులిద్దరూ కొందరు నటులతో వెళ్లి న్యూజెర్సీలో ముగ్గురిని అక్కడ వదిలి వచ్చారు. -
ట్రంప్‌ను తిట్టడం మాత్రం ఆపను...
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు చేయటం ఆపబోనని క్రేజీ పాప్ సింగర్ ఎమినెమ్ ఉద్ఘాటించాడు. ట్రంప్ పై తన ఆలోచన ధోరణిని, అభిప్రాయాన్ని ఎవరూ మార్చలేరని అతను అంటున్నాడు. ‘‘నేను ఆయన్ని(ట్రంప్‌ను) విమర్శించటం అస్సలు ఆపను. నా అభిమానులు నాకు దూరమైన సరే.. ట్రంప్‌ను తిట్టడమే నా ధ్యేయం. హిల్లరీ కూడా తప్పులు చేశారని తెలుసు. కానీ, ట్రంప్ లాంటి మూర్ఖుడు కాకుండా వేరే ఎవరు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నా నేను అంగీకరించేవాడిని. ట్రంప్ ఒక చెత్త వ్యక్తి. చెత్త నిర్ణయాలతో అమెరికాను అంతర్జాతీయ సమాజంలో సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాడు. అందుకే అతనంటే నాకు అసహ్యం. ఈ విషయంలో నా సగం మంది అభిమానులు నాకు దూరమైనా.. నా వైఖరి మార్చుకోను’’ అని ఎమినెమ్ స్పష్టం చేశాడు. 45 ఏళ్ల ఈ క్రేజీ పాప్ స్టార్ గతంలోనూ ట్రంప్ పై పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ లాంటి జోకర్‌కు ఓటేసి గెలిపిస్తే.. మనమంతా పిచ్చొళ్లు కావటం ఖాయమని ఎన్నికల ప్రచార సమయంలో ఎమినెమ్ అమెరికన్లను ఉద్దేశించి కామెంట్లు చేశాడు. -
అభిమానికి ఇల్లు కొనిచ్చింది!
మాంచెస్టర్‌లో పాప్‌స్టార్ టేలర్ స్విఫ్ట్ షో జరుగుతోంది. ఆమె పాటలు వినడం కోసం వేలాదిమంది అభిమానులు వచ్చారు. అందులో స్టెఫానీ కూడా ఓ అభిమాని. ఆమె ఓ గర్భిణి. టేలర్ స్విఫ్ట్ షో చూడడానికి మాత్రమే కాక, ఆమెతో చిన్న అపాయింట్మెంట్ కూడా దక్కించుకుంది స్టెఫానీ. అప్పటికే టేలర్ స్విఫ్ట్‌తో స్టెఫీనా తల్లి మాట్లాడి ఉంది. ‘స్టెఫానీని సంతోషపెట్టేలా ఆమెతో మాట్లాడు’ అని మాత్రమే స్విఫ్ట్‌ను అడిగింది స్టెఫానీ తల్లి. షో అయ్యాక స్టెఫానీని తన గదికి పిలిపించుకొని.. ‘నీకేం కావాలో చెప్పు..’ అనడిగింది స్విఫ్ట్. స్టెఫానీ తన బాధ చెప్పుకుంది. ఆ బాధ విన్న టేలర్ స్విఫ్ట్ ఆమెకు ఏ కొన్ని డబ్బులో, ఏదో చిన్న సాయమో చేసి పంపితే అది ఇంత పెద్ద వార్త అయ్యేదే కాదు. స్టెఫానీకి ఓ ఇల్లు కొనుక్కోమని డబ్బులిచ్చి, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసి పంపింది టేలర్. ఇది జరిగిన సమయానికి స్టెఫానీ ఎనిమిది నెలల గర్భిణి. ఇప్పుడామెకు ఓ కూతురు. ‘‘నాకు ఇల్లు లేదు. అప్పుల్లో చిక్కుకొని అమ్మేసుకోవాల్సి వచ్చింది. నా భర్తకు ఉద్యోగం పోయింది. అప్పుడే టేలర్ షో చూడడానికి వెళ్లా. షో అయ్యాక నా గురించి తెలుసుకొని, ఇల్లు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. నేనిది ఊహించలేదు. టేలర్ ఈజ్ లవ్..’’ అని తన కథను షేర్ చేసుకుంది స్టెఫానీ. -
సంచలన విషయాలు వెల్లడించిన సమంత!
ప్రముఖ పాప్ సింగర్, ఒకప్పటి గ్లామర్ గర్ల్ సమంతా ఫాక్స్ తన ఆత్మకథలో సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఫరెవర్’ పేరిట వెలువరించిన తన జీవితకథలో లైంగిక దాడి, మోసం, జాతీయ క్షమాపణ వంటి విషయాలను వెల్లడించారు. కొలంబియాలో డ్రగ్స్ మాఫియా అధినేత పార్టీలో పాటలు పాడేందుకు గతంలో తనకు 50వేల డాలర్లు ఇచ్చారని ఆమె వెల్లడించారు. దక్షిణ అమెరికాలో పాప్ కచేరిలో నిర్వహిస్తున్నప్పుడు ఓ వ్యక్తి తన మేనేజర్ వద్దకు వచ్చి తన కూతురు 21వ పుట్టినరోజు వేడుకల్లో పాటలు పాడాలని నేరుగా 50వేల డాలర్లు ఇచ్చాడని ఆమె తెలిపారు. అతను చాలా ధనికుడై ఉంటాడని, అందుకే తన కూతురి పుట్టినరోజు వేడుకలకు తనను పిలిచాడని అప్పట్లో భావించానని ఆమె పేర్కొన్నారు. అయితే, చుట్టూ మెషిన్ గన్లతో సాయుధులు కాపలా ఉన్న పెద్ద బంగ్లాలోకి తనను తీసుకున్నారని, అక్కడ జరిగిన పార్టీలో తాను పాటలు పాడానని తెలిపారు. అప్పటి బుష్ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటించిందని, అలాంటి సమయంలో డ్రగ్స్ మాఫియా అధినేత ఇంట్లో తాను పాటలు పాడినట్టు ఆమె వెల్లడించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తన మేనేజర్ డేట్స్ ఇవ్వడంలో గందరగోళానికి గురయ్యాడని, దీంతో సంగీత కచేరికి ఒక రోజు ఆలస్యంగా వెళ్లామని గుర్తుచేసుకున్నారు. ఈ సమయంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని, అంతేకాకుండా లక్ష డాలర్లు పరిహారంగా చెల్లించేవరకు నిర్వాహకులు తమను బందీగా పెట్టుకున్నారని ఆమె తెలిపారు. అప్పుడు తన వెంట ఉన్న తండ్రి డబ్బు మొత్తం తీసుకొని ఇంగ్లండ్ వెళ్లిపోయాడని, దీంతో ఉచితంగా ఓ సంగీత కచేరి నిర్వహించి.. ఎలాగోలా డబ్బులు సేకరించి పాస్ పోర్టులు విడిచిపించుకొని.. పనామాకు తిరిగొచ్చామని తెలిపింది. ప్రముఖ పాప్ స్టార్ డేవిడ్ క్యాసిడైతో అర్ధనగ్న ఫొటోషూట్ సందర్భంగా అతను లైంగిక ఉద్దీపనకు గురయ్యాడని, ఆ తర్వాత డిన్నర్ సందర్భంగా రెస్టారెంట్‌లోని టాయ్ లెట్ లో తనపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడని, కానీ తాను తీవ్రంగా ప్రతిఘటించి.. అతన్ని తోసేశానని ఆమె పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో పాప్ కచేరి అనుభవాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ సంగీత కచేరి సందర్భంగా పురుషులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు చొక్కాలు విప్పి డ్యాన్స్ చేశారని, ఇది తనకు చిత్రంగా, కొంచెం ఎబ్బెట్టుగా తోచిందని ఆమె రాసుకొచ్చారు. -
నటనతోపాటు మరో రెండు కోణాలు..
హీరోయిన్ శ్రుతిహాసన్ కొత్త అవసరం ఎత్తనుందా ? ఈ ప్రశ్నకు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అపజయాలతో నట జీవితాన్ని ప్రారంభించిన ఈ నటి ఆ తరువాత తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మలుచుకుంది. టాలీవుడ్ చిత్రం గబ్బర్‌సింగ్‌తో బంపర్ హిట్నుతన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత శ్రీమంతుడు సినిమాతోపాటు తమిళంలో పూజై, సింగం-3 వంటి చిత్రాలతో హిట్ చిత్రాల నాయకి లిస్టులో చేరింది. అలా సంఘమిత్ర వంటి చారిత్రత్మాక చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్న శుత్రిహాసన్ లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. అయితే అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలిగి వివాదాల్లో ఇరుక్కుంది. అదే సమయంలో తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. కారణాలేమైనా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన శ్రుతకి ప్రస్తుతం ఏ ఒక్క భాషలోనూ ఒక్క చిత్రం కూడా లేదు. ఆమెలో నటన అనే కోణం కాకుండా సంగీతం, గాయని అనే మరో రెండు కోణాలున్న విషయం తెలిసిందే. ఈ రెండు రంగాల్లో మొదట్లోనే ప్రతిభను నిరూపించుకుంది. దీంతో ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు లేకపోవడంతో సంగీతం, సింగర్‌గా తన సత్తాను మరోసారి అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచార. అవును శ్రుతిహాసన్ ఇప్పుడు కొత్త పోకడలకు శ్రీకారం చుట్టాలని భావిస్తోందట. ఇప్పుడు చాలామంది పాశ్చాత్య సంగీతంతో ఆల్బమ్‌లను రూపొందించి చేతినిండా సంపాదిస్తున్నారు. శ్రుతిహాసన్ కూడా ఈ బాటలో రాణించాలకుంటోందట. పాశ్చాత్య సంగీతంతో పాటను రూపొందించి అందులో తానే నటించి దేశవిదేశాల వేదికలపై కార్యక్రమాలను నిర్వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. అలా శ్రుతి పాప్ సింగర్ అవతారమెత్తబోతోందట. -
జస్టిన్ బీబర్ ముంబై షో... ఒక్కో టికెట్ రూ.76,000
కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్ పర్యటన కన్ఫామ్ అయ్యింది. మే 10న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఈ షోలో బీబర్ దాదాపు పది పాటలను ప్రదర్శించే అవకాశం ఉంది. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ షో టికెట్స్ కోసం ఫిబ్రవరి 22 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ధరతో ఈ టికెట్స్‌ను అమ్ముతున్నారు. అంతర్జాతీయ స్థాయి వీవీఐపిలు ఈ షోకు హాజరవుతున్న నేపథ్యంలో వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీ టికెట్ ధర రూ.76000 వేలుగా నిర్ణయించారు. ఆ తరువాత వివిధ క్యాటగిరీల్లో రూ.4000 వేల వరకు టికెట్ ధరలను నిర్ణయించారు. ఇప్పటికే వీవీఐపిల కోసం కేటాయించిన టికెట్లు అమ్ముడవ్వగా మిగిలిన కేటగిరిల టికెట్లు కూడా మరికొద్ది గంటల్లోనే అమ్ముడవుతాయని భావిస్తున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్ ఈ షోకు హారవ్వనున్నారు. పర్పస్ వరల్డ్ టూర్ పేరుతో చేపట్టిన జస్టిన్ బీబర్ ఇండియా టూర్‌కు వైట్ ఫాక్స్ ఇండియా టీం ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. -
భారత్‌లో అడుగిడనున్న పాప్ కెరటం.. మేలోనే
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఓ నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ సెన్సేషన్ సింగర్, గ్రామీ అవార్డు విజేత జస్టిన్ బీబర్ భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ వేసవిలోనే అతడు ఇండియాకు వస్తున్నాడు. అధికారిక కార్యక్రమంలోనే భాగంగా ఈ ఏడాది(2017) మే 10న ముంబయికి వస్తున్నాడు. ప్రపంచ టూర్లో భాగంగా ఈ కెనడియన్ పాప్ స్టార్ భారత్‌కు వచ్చి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని వైట్ ఫాక్స్ ఇండియా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అతడు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, దుబాయ్, యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా ప్రదర్శన ఇవ్వనున్నాడు. ముంబయిలో నిర్వహించనున్న పాప్ మ్యూజికల్ షోకు ముందస్తుగా ప్రముఖ ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కో టికెట్ ధర రూ.4000 నుంచి ప్రారంభం కానున్నట్లు వివరించారు. -
పాప్ గాయకుడు జార్జ్ మైకేల్ కన్నుమూత
లండన్: ప్రముఖ పాప్ గాయకుడు జార్జ్ మైకేల్ (53) ఆదివారం బ్రిటన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. నిద్రపోతున్న సమయంలో గుండెపోటు వచ్చి ఆయన మరణించారని జార్జ్ మేనేజర్ తెలిపారు. 1980ల్లో జార్జ్ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. జార్జ్ చనిపోవడం వివరించలేనిదే కానీ అనుమానాస్పదం కాదని థేమ్స్ వ్యాలీ పోలీసులు చెప్పారు. శవ పరీక్ష పూర్తైన తర్వాత మిగతా వివరాలిస్తామన్నారు. 1963లో లండన్‌లో జన్మించిన మైకేల్ ‘వామ్!’పాప్ గ్రూప్‌తో ప్రయాణం ఆరంభించారు. తర్వాత దాన్నుంచి విడిపోయి సొంతంగా ఆల్బమ్‌లు రూపొందించారు. ఆయన నాలుగు దశాబ్దాల కెరీర్లో 10 కోట్లకు పైగా ఆల్బమ్స్ అమ్ముడయ్యాయి. -
చెస్ ఆడే మగవారు అంటే ఇష్టం!
64 గడులున్న చెస్ బోర్డులో వ్యూహాత్మక ఎత్తులతో ఆడేవారంటే.. కొంచెం తెలివైనా వారికిందే లెక్క. కాబట్టి అలాంటివారితో డేటింగ్ చేయడం తనకిష్టమని ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా చెప్పుకొచ్చింది. ఈ మధ్య తన ప్రియుడు టేలర్ కిన్నీతో బ్రేకప్ చేసుకున్న ఈ అమ్మడు తాజాగా 'ఫీమెల్ ఫస్ట్.కామ్'తో ముచ్చటించింది. 'చెస్ ఆడటం నాకు ఇష్టం. ఇదెంతో సరదాగా ఉంటుంది. కాబట్టి చెస్ తెలిసిన వారితో డేటింగ్ చేసేందుకు నేను ప్రాధాన్యమిస్తాను' అని గాగా చెప్పింది. గాగా కొత్త ఆల్బం 'జోఅన్నె'. 19 ఏళ్ల వయస్సులో మరణించిన తన తండ్రి సోదరి (మేనత్త) సంస్మరణార్థం ఈ ఆల్బంను రూపొందించినట్టు గాగా తెలిపింది. ఇందులో ఎన్నో వ్యక్తిగత అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. 'నా జీవితంలో వ్యక్తిగతంగా అందరూ వ్యక్తులు నన్ను మోసం చేసినవారే. చాలామంది నన్ను భ్రమల్లో ముంచెత్తినవారే. ఈ ఆల్బంలోని అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ ఆల్బం సంగీతంలో, పాటల్లో వ్యక్తిగత అంశాలు ఎన్నో ఉన్నాయి' అని గాగా వివరించింది. -
అలాంటి విషయాలపై మాట్లాడను: హీరోయిన్
లాస్ ఏంజెలిస్: తనకు సెలబ్రిటీ స్టేటస్ వద్దని పాప్ సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ వేడుకుంటోంది. ఫేమస్ స్టార్ పర్సనాలిటీగా ఉన్న జెన్నిఫర్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాను వీఐపీగా, వీవీఐపీగా ఉండాలని.. మంచి గుర్తింపు రావాలని తాపత్రయ పడుతుండటం సహజమే. అయితే ఎందుకో పాప్ సింగర్ మాత్రం తన రూటు మార్చుకుంది. దర్శకులు, హీరోల ప్రవర్తన వల్ల మీరు ఫీమెల్ డామినేషన్ పై వ్యాఖ్యలు చేస్తుంటారా అని ప్రశ్నించగా.. ఆ విషయాల గురించి కామెంట్ చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొంది. ఎప్పటినుంచో తనకున్న సెలబ్రిటీ స్టేటస్ తో కెరీర్ నెట్టుకురావడం లేదని, అందుకే స్పెషల్ గుర్తింపును తాను ఫీల్ అవ్వనని స్పష్టంచేసింది. తాను సహజంగానే శ్రమించి పనిచేసే తత్వం గల వ్యక్తినని, వీటితో సక్సెస్ లు సాధించడం తనకు అలవాటుగా మారిందని పేర్కొంది. ఫీమేల్ డామినేషన్ గురించి తాను ఎప్పుడు బహిరంగంగానే అభిప్రాయాలు చెప్పేస్తానని, ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిందేమి లేదని ఓ ప్రశ్నకు బదులుగా జవాబిచ్చింది. షూటింగ్ స్పాట్ కు ఒకవేళ తాను 15 నిమిషాలు లేటుగా వచ్చినట్లయితే ఇంకేప్పుడూ తన జీవితంలో అలా జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది. -
నాకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాడు
లాస్ ఏంజెలిస్: పాప్ సింగర్ తన కుమారుడి విషయంలో తీవ్ర కలత చెందుతోంది. తన కుమారుడు మాక్స్ ఏదో ఒక రోజు గుండెపోటు తెప్పిస్తాడంటూ పాప్ సింగర్ క్రిస్టినా అగ్విలెరా అంటోంది. పార్కర్ కు తన ఎనిమిదేళ్ల కొడుకు మాక్స్ బిగ్ ఫ్యాన్ అని, వాడి డేరింగ్ నెస్ ఎక్కువైనందుకు కాస్త కంగారు పడుతున్నట్లు పేర్కొంది. మాక్స్ ఎప్పుడూ వాడికి ఇష్టం ఉన్న పనులు చేస్తుంటాడు, వారి కెరీర్ కూడా వాడే డిసైడ్ చేసుకుంటాడని చెప్పింది. అగ్విలెరా పాల్గొన్న షో 'ది ఎల్లిన్ డిజెనరెస్ షో' మంగళవారం నాడు భారత్ లోనూ కొన్ని చానల్స్ లో ప్రసారం కానుందని ఆమె తెలిపింది. మాక్స్ పెద్దయ్యాక ఎంటర్ టైన్ మెంట్ కంపెనీ సర్క్యూ డు సొలేల్ లో జాయిన్ అవుతాడేమోనని అభిప్రాయపడింది. పార్కర్.. ప్రమాదకర క్రీడ అయినందున తాను భయపడాల్సి వస్తుందని పాప్ స్టార్ చెప్పుకొచ్చింది. ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ పైకి దూకడం లాంటి పనులు చేయడం ఆ గేమ్ లో ఉంటాయని, ఇప్పటికే వాడు ట్రెయినింగ్ మొదలెట్టాడని అగ్విలెరా తెలిపింది. మాక్స్ చేసే స్టంట్స్, ఇతర యాక్షన్స్ వల్ల వాడికి ఏదైనా జరిగితే తనకు గుండెపోటు వచ్చేలా ఉందని పాప్ సింగర్ ఆందోళన చెందుతోంది. -
'నాకు నేను జంతువులా కనిపిస్తున్నాను'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ తన ఫ్యాన్స్ పై మరోసారి మండిపడ్డాడు. ఇక వారితో ఏ మాత్రం ఫొటోలకు ఫోజు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. 22 ఏళ్ల ఈ పాటల దిగ్గజం ఇన్ స్టాగ్రమ్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తన అభిమానులు వచ్చి అలా ఫొటోలు దిగుతుంటే తనకు తాను జూలో జంతువులా కనిపిస్తున్నానని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అంటూ ఎగబడటం.. వెంటనే ఫొటోల కోసం ఎగబడటం తనకు నచ్చలేదని చెప్పారు. తనను చూసిన వారు కనీసం గుర్తించరని హాయ్ కూడా చెప్పరని.. కేవలం ఫొటోలు మాత్రమే దిగుతారని.. దాంతో తాను జూలో జంతువుగా భావిస్తున్నాని చెప్పారు. అయితే, తన నిర్ణయం అభిమానులకు ఇబ్బంది పెడుతుందని తనకు తెలుసని అయినా తప్పదని చెప్పాడు. -
'ఆ ఆల్బమ్‌కు ప్రేరణ నా లవ్ ఫెయిల్యూరే'
లాస్ఏంజిల్స్: బ్రిటన్ పాప్ సింగర్ రీటా ఓరా తన రాబోయే ఆల్బమ్‌కు ప్రేరణ తన లవ్ ఫెయిల్యూరే అని చెబుతోంది. ఒకప్పుడు స్కాంట్లాండ్ డీజే కాల్విన్ హారిస్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ అమ్మడు అతనికి బైబై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే హారిస్‌తో బ్రేకప్.. తన రాబోయే ఆల్బమ్‌లో రెండు పాటలకు ప్రేరణనిచ్చిందని ఓరా వెల్లడించింది. హ్యారిస్‌తో బ్రేకప్ అనంతరం ప్రముఖ డిజైనర్ టామి హిల్ఫింగర్ కుమారుడు రిక్కితో డేటింగ్ చేసిన ఓరాకు ఆ రిలేషన్ కూడా కలిసిరాకపోవడంతో 2015 చివర్లో అతనితోనూ విడిపోయింది. 'హ్యారిస్‌తో బ్రేకప్ తరువాత చాలా కోపానికి, ఉద్వేగానికి గురయ్యాను. అతనంటే అసహ్యం కలిగింది. ఆ తరువాత మాత్రం నన్ను నీను నియంత్రించుకున్నాను. రాబోయే ఆల్బమ్‌లో ఈ హార్ట్ బ్రేకప్ గురించి రెండు పాటలుంటాయి' అని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రీటా ఓరా తెలిపింది. -
'తప్పులు చేశా.. నన్ను ఆదర్శంగా తీసుకోవద్దు'
లండన్: పాప్ సింగర్స్‌ను ఏ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోరాదని హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టీన్ బీబర్ అన్నాడు. ముఖ్యంగా తనను ఎవరూ ఆదర్శంగా తీసుకోవద్దని, అది ఏ ఒక్కరికి మంచిది కాదని చెప్పారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో తనకు స్టార్ డమ్ అస్సలు ఇష్టం లేదని చెప్పాడు. తనను మరొకరు అనుసరించడం నచ్చదని అన్నాడు. 'నేను నిజంగా జనాలకు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాపై ఏ మాత్రం నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే ప్రతిసారి నేను మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాను. ఇది కొంత ఆందోళనగా అనిపించినా ఈ విషయం చెప్పక తప్పదు. నాకు ఎలాంటి శక్తి లేదు. నేను ఎవరి సమస్యలను తీర్చగల సమర్థుడిని కాదు. నేను పర్ ఫెక్ట్ కాదు. చాలా తప్పులు చేశాను. నా ఉద్దేశం ప్రకారం మనుషులను పూజించడం అనేది మంచి పద్దతి కాదు' అని బీబర్ అన్నాడు. -
ఈ ఏడాదైనా గాగా కాక పుట్టించేనా!?
స్టీఫనీ జోనే ఏంజలీనా జెర్మనాట్టో.. అదేనండీ సొంతపేరు కంటే లేడీ గాగాగా పాపులరైన ఈ పాప్ సంచలనం ఇటీవల వార్తల్లోనే కాక చాట్ బస్టర్ లోనూ స్థానం కోల్పోయింది. గడిచిన మూడేళ్లుగా హిట్ కు దూరంగా ఉన్న అమెరికన్ కలువ.. మళ్లీ మునుపటి ఫామ్ అందుకునేందుకు తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న జరగనున్న గ్రామీ అవార్డు ప్రదానోత్సవం ఆమె కెరీర్ ను మలుపు తిప్పుతుందని ఆశిస్తోంది. క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవలే తనువు చాలించిన మ్యూజిక్ మెస్ట్రో డేవిడ్ బోవీ జ్ఞాపకార్థం గ్రామీ వేదికపై లేడీగాగా ప్రదర్శన ఇవ్వనుంది. వ్యక్తిగతంగానూ డేవిడ్ తనకెంతో ఇష్టమని, ప్రదర్శన ద్వారా ఆయన జ్ఞాపకాలను గుర్తుచేయడం గర్వకారణమని గాగా అంటోంది. గ్రామీ- 2016లో గాగా ప్రదర్శనే హైలెట్ గా నిలుస్తుందని నిర్వాహకుల అభిప్రాయం. ఆ మేరకు తాను కూడా తీవ్ర సాధన చేస్తున్నట్లు వెల్లడించింది గాగా. ఒక వేళ 'డేవిడ్ కు నివాళి'కిగాను అవార్డు లభిస్తే అది గాగా ఖాతాలోచేరే 7వ గ్రామీ అవుతుంది. మొదటిసారిగా 2008లో 'ది ఫేమ్' ఆల్బంతో దూసుకొచ్చిన లేడీగాగా ఆ తర్వాత జస్ట్ డ్యాన్స్, పోకర్ ఫేస్, 2009లో ది ఫేమ్ మూన్ స్టర్, బ్యాడ్ రొమాన్స్, టెలిఫోన్, అలెజాండ్రో వంటి సింగిల్స్ తో అదరగొట్టేసింది. 2011లో విడిదలైన 'బార్న్ దిస్ వే' ఆల్బంతో గాగాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పాడ్డారు. అయితే 2013లో విడుదలైన ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ విజయాలేవీలేవు. 2016 ప్రారంభంలోనే వరంలా వచ్చిన గ్రామీ వేడుకలతోనైనా గాగా మళ్లీ కాక పుట్టిస్తుందేమో చూడాలి. -
'అతనితో ఇంటర్వ్యూ చాలా వరెస్ట్'
లాస్ఏంజిల్స్: యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ప్రపంచంలో పెద్ద స్టార్ సింగర్ కావొచ్చు కానీ, అతనితో తాను చేసిన ఇంటర్వ్యూ మాత్రం ఓ పీడకల అంటోంది చెల్సియా హండ్లర్. టీవీ ప్రజెంటర్ అయిన ఆమె 2015లో బీబర్‌ను ఇంటర్వ్యూ చేసింది. అప్పట్లో అతని వయస్సు 15 ఏండ్లే. కానీ అతను తనను ఫ్లర్ట్ (సరసమాడటానికి) చేయడానికి ప్రయత్నించాడని, దీంతో తాను చాలా అసౌకర్యానికి గురయ్యానని ఆమె తెలిపింది. 'చెల్సియా లేట్లీ' షోలో భాగంగా అతన్ని చేసిన ఇంటర్వ్యూనే తన జీవితంలో చేసిన అత్యంత చెత్త ఇంటర్వ్యూ అని పేర్కొంది. 'అతను తనదైనశైలిలో గిమ్మిక్కులు చేశాడు. అతను మీతో సరసమాడటానికి ప్రయత్నిస్తే ఓ పిల్ల ఆకతాయి అని మీరు తోసిపుచ్చవచ్చు. కానీ నాకు అతను అలా అనిపించలేదు. చాలా అసౌకర్యంగా తోచింది' అని ఆమె చెప్పింది. -
'అమ్మాయి.. ఇకనైనా డేటింగ్‌కు గుడ్ బై చెప్పు'
లాస్ ఏంజిల్స్ : డేటింగ్‌కు దూరంగా ఉండాలని అమెరికా పాప్ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్‌ను ఆమె తండ్రి మందలించారట. 'పర్ఫ్యూమ్' హీరోయిన్ బ్రిట్నీ తన బాయ్ ఫ్రెండ్ చార్లీ ఎబెర్సాల్ నుంచి రెండు నెలల క్రితం విడిపోయింది. క్యాలెండర్లో నెలలు మారుతున్నట్లుగా బ్రిట్నీ బాయ్ ఫ్రెండ్స్ జాబితా కూడా ఎప్పటికప్పుడు మారుతుండటంతో ఆమె తండ్రి ఈ విషయంలో కాస్త సీరియస్‌గా ఉన్నారు. ఇక ఎవరితోనూ డేటింగ్ చేయవద్దంటూ పాప్ సింగర్ కు గట్టిగా చెప్పారు. ప్రియుడు చార్లీ దూరంకావడంతో బ్రిట్నీ మానసికవేదనకు గురవుతుందని జేమీ స్పియర్స్ భావించాడు. దీంతో ఆమెలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి అతడు ప్రయత్నిస్తుండగా, మరో వ్యక్తి తన జీవితంలోకి వస్తే చార్లీని మరిచిపోగలనని తండ్రికి తేగేసి చెప్పిందట. ఈ విషయంలో తండ్రీ కూతుళ్ల మధ్య వాదులాట జరిగినట్టు మీడియా కథనం. కెల్విన్ ఫెదర్లైన్, జాసన్ అలెగ్జాండర్ ల నుంచి బ్రిట్నీ విడాకులు తీసుకున్న తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఆమెతో కాలక్షేపం చేసి చివరకు ఒంటరి దాన్ని చేస్తున్నారని జేమీ స్పియర్స్ఆవేదన చెందుతున్నాడు. -
సింగర్ కు చేదు అనుభవం
లాస్ ఏంజిల్స్ : ఆస్ట్రేలియాకు చెందిన పాప్ సింగర్ కైలీ మినోగ్ కు ఓ కార్యక్రమం సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె తన కొత్త ఆల్బమ్ వీడియో 'అబ్ సోల్యూట్లీ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్ ఎట్ ఆల్' ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కైలీ పాల్గొన్నది. ఈ ఈవెంట్ కు వచ్చిన ఆమె వైట్-బ్లాక్ కలర్ కలిసి ఉన్న ఓ డ్రస్ ఆమె ధరించారు. అయితే ఇందులో భాగంగా ఆమె స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగా కైలీ డ్రెస్ టాప్ భాగం కొంత తొలగిపోయింది. పూర్తిగా డ్యాన్స్‌లో లీనమైన సింగర్ వెంటనే ఈ విషయాన్ని గ్రహించిన ఆమె టాప్ ను సరిచేసుకుంది. చేతులతో ఛాతీ భాగాన్ని కప్పివేసి త్వరగా డ్రెస్ పైభాగంలో ఉన్న జిప్ సవరించుకోవడంతో అవమానాన్ని త్రుటిలో తప్పించుకుంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో ఆమె ఆశ్చార్యానికి లోనయింది. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు ఆమె నవ్వుతూనే ఉంది, కెమెరా వైపు చూస్తూ ఇక ఆపండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న కొందరూ తీస్తున్న వీడియోలో ఈ సన్నివేశం కూడా రికార్డయింది. అనంతరం ఇన్ స్టాగ్రామ్‌లో ఈ వీడియో ఎవరో ఆకతాయి అప్ లోడ్ చేయడంతో ఈ విషయం స్థానిక మీడియాలో హల్ చల్ చేసింది. -
her కేలియే..
పాప్ సింగర్‌గా ఉర్రూతలూగించే పాటలతో అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన రెగ్గి బెంజిమన్.. తన కళను ఓ ప్రయోజనానికి వేదికగా మలచుకున్నాడు. అవనిలో అతివలపై జరుగుతన్న దాడులను అడ్డుకునే లక్ష్యంతో.. ఆమె కోసం.. మిషన్ సేవ్ హర్ సంస్థకు శ్రీకారం చుట్టాడు. బుధవారం హైదరాబాద్‌లో తన ఫౌండేషన్ విధివిధానాలను తెలియజేశాడు. తాను రాసిన ‘సేవ్ హర్’ పాటను పాడి వినిపించారు. ఈ సందర్భంగా బెంజిమన్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... - వాంకె శ్రీనివాస్ మా పేరెంట్స్‌ది మెదక్ జిల్లాలోని నర్సాపూర్. నాన్న రాస్కో బెంజిమన్ పాస్టర్. అమ్మ రోజ్ బెంజిమన్ నర్స్. నేను పుట్టకముందే వాళ్లు కెనెడాకు వెళ్లారు. నేను కెనెడాలోనే పుట్టాను. నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు అమెరికాకు షిఫ్ట్ అయ్యాం. స్కూలింగ్, కాలేజ్ డేస్ అంతా చికాగాలోనే సాగిపోయాయి. నాన్న క్రిస్టియన్ ప్రీచర్ కావడంతో చిన్నతనంలోనే మ్యూజిక్ అబ్బింది. మ్యూజిక్ వాయిస్‌లో డిగ్రీ చేశాను. బిజినెస్ కమ్యూనికేషన్ కోర్స్ కూడా చేశాను. తర్వాత మ్యూజిక్కే పూర్తి టైమ్ కేటాయించాను. నా ఫస్ట్ ఆల్బమ్ 2ఎక్స్ సెంట్రిక్స్కు ఇండియాలో మంచి ఆదరణ లభించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. పాప్ కెరీర్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. నా పాటలు 25 దేశాల్లో వినిపిస్తున్నాయి. ఇండో, అమెరికన్ పాప్ స్టార్‌గా పేరు రావడం ఆనందంగా ఉంది. ఆ ఘటన కదిలించింది.. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రతి రెండు నిమిషాలకు, ఇండియాలో ప్రతి 22 నిమిషాలకు ఒక మహిళ లైంగిక వేధింపులకు గురువుతున్నారు. కెనెడాలో ప్రతి 17 మంది మహిళల్లో ఒకరు, యూకేలో ప్రతి ఐదుగురి ఆడవాళ్లలో ఒకరిపై అత్యాచారం జరుగుతోంది. ఇటీవల ఇండియాలో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి జరిపి.. ఆపై వారిని ఉరి తీయడం నన్ను ఎంతగానో కదిలించింది. ఆ బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడాను. ఇక్కడ మహిళల అక్రమరవాణా కూడా ఆందోళనకర స్థాయిలో సాగుతోంది. తల్లిలా చూడాల్సిన ఆడవారిపై జరుగుతున్న దాడులను ఆపడానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నా. నా ఫ్రెండ్స్‌తో మాట్లాడి ‘మిషన్ సేవ్ హర్’ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టా. ‘సేవ్ హర్’ అనే పాట రాసి.. పద్నాలుగు మంది హాలీవుడ్ సెలబ్రిటీలతో పాడించాను. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తోంది. ఈ పాట విని కొందరైనా.. మారితే చాలు. ఈ ఆల్బమ్‌కు వచ్చే నిధులను ‘సేవ్ హర్ ఫౌండేషన్’కు అందేలా చూస్తున్నాం. స్పెషల్ ఫోకస్... ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్ హర్’ విస్తరించాలని భావిస్తున్నాం. భారత్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. ముంబై, పూణె, ఢిల్లీ, బెంగళూరులలో మా సేవలు ప్రారంభించాలనుకుంటున్నాం. ఇండియాపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించాం. నాకు మంచి పేరెంట్స్‌తో పాటు ఎంతో మంది భారత్ అభిమానులను ఇచ్చిన ఈ పుణ్యభూమికి ఈ రకంగానైనా సేవ చేయాలనుకుంటున్నా. అందరి సహకారం అందుతుందని ఆశిస్తున్నా. -
వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా?
సిడ్నీ: కొన్ని రోజుల క్రితం ఎథినా ఆండ్రొలోస్తో బ్రేకప్ చెప్పిన పాప్ సింగర్ ఎడ్ షీరన్ తాజాగా మోడల్ బార్బరాతో డేటింగ్ చేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు. సిడ్నీలోని మేరీ స్ట్రీట్ లోని బర్జర్బార్ లో వీరిరువురూ కలిసి తీయించుకున్న కొన్ని ఫొటోగ్రాఫ్ లను పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది. ఆ సమయంలో ఎడ్ షీరన్ తెలుపురంగు టీషర్ట్, డెనిమ్ జీన్స్ ధరించిఉన్నారు. టీషర్ట్ పై "గివ్ మీ లవ్" అని రాసుంది. అయితే బార్బరా తనను ఎవరూ గుర్తుపట్టకుండా నలుపురంగు టీషర్ట్, బూడిదరంగు జీన్స్, నలుపురంగు బూట్లు ధరించింది. కారులో కూర్చున్న సమయంలో పాల్విన్ తన చేతిని ముఖానికి అడ్డుగా పెట్టుకుంది. ప్రస్తుతం షీరన్ తన కొత్త ఆల్బమ్ "ఎక్స్" ప్రమోషన్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. -
రిక్కీ... తలకెక్కి...
‘పిచ్చి ముదిరితే రోకలి తలకి చుట్టుకుంటార’’ని పెద్దలంటే... ‘‘అభిమానం ముదిరితే ఆపరేషన్లు చేయించుకుంటార’’ని ఫ్రాన్ మరియానో నిరూపిస్తున్నాడు. అర్జెంటీనాకు చెందిన ఈ 32 ఏళ్ల యువకుడు... పాప్ సింగర్ రిక్కీమార్టిన్కి వీరాభిమాని. ‘పాప్’నే కెరీర్‌గా చేసుకుని తన రోల్ మోడల్ బాటనే ఎంచుకున్నాడు. అయితే రోజు రోజుకూ రిక్కీ అంటే పిచ్చి తలకెక్కిన మరియానో... అచ్చం రిక్కీ ఫేస్‌లా తన ఫేస్ మార్చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి సర్జరీలు చేయించుకోవడం మొదలుపెట్టాడు. నుదురు, ముక్కు, చెంపలు... వగైరాలను లైపోసక్షన్‌తో షేప్‌లు మార్చేసిన ఈ మార్టిన్ మానియాక్... ఇప్పటికే అరడజనుకుపైగా సర్జరీలు చేయించుకున్నాడు. ఓ వైపు నొప్పులు, మరోవైపు ఖర్చులు.. వీటన్నింటినీ పట్టించుకోకుండా... ‘‘కోతలెన్నయినా భరిస్తా...రిక్కీ నేనే అనిపిస్తా’’ నంటున్న మరియానో సైతం ఒక రేంజ్లో పాప్ గాయకుడే. అయినా పాపం తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ తరచు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడట. రిక్కీలా ముఖం మారితేనైనా మారియానో నుదుటి రాత మారుతుందేమో! -
‘లేడీ’.. గప్‌చుప్..!
స్టెఫాని జయోని ఏంజిలినా జర్మనోట్టా... పేరు మార్చుకుని ‘లేడీ గగా’గా ప్రపంచాన్ని ఊపేస్తున్న పాప్ సింగర్ నాటి తన చేదు అనుభవాలను బహిర్గతం చేసి అందరికీ షాకిచ్చింది. తాను పందొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఒకరు బలాత్కారం చేశాడంటూ బోరుమంది. ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన గగా... ‘ఏడెనిమిదేళ్ల కిందటి సంఘటన. కానీ అతడిని ఏమీ చేయలేకపోయాను. ఈ భయంకర పరిస్థితి నుంచి బయట పడటానికి ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ థెరపీలెన్నో తీసుకున్నా. ముఖ్యంగా సంగీతం అన్నింటినీ అధిగమించేలా చేసింది’ అని చెప్పింది. -
ఆ వీడియో వివాదం ముగిసింది!
న్యూయార్క్ : ప్రపంచంలో తిరుగు లేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా ఎప్పటికీ ఆయన చిరంజీవే. ఎంతో మంది వీరాభిమానులను సంపాదించుకున్న మైఖేల్ జాక్సన్ నటించిన 'థ్రిల్లర్' వీడియోను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గతంలో థ్రిల్లర్ వీడియోకు సంబంధించి చోటు చేసుకున్న వివాదం ముగిసిపోవడంతో తిరిగి తెరపై తీసుకురావడానికి సన్నాహాలు ఆరంభించారు. అయితే ఈ వీడియోను త్రీడీ రూపంలో అభిమానుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర దర్శకుడు జాన్ లాండిస్ తెలిపాడు. ' నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ 14 నిమిషాల అల్బమ్ కు జాక్సన్ న్యాయం చేశాడు. ఈ ఆల్బమ్ లో సాంగ్స్ సూపర్ హిట్ కావడమే మరోసారి త్రీడిలో తీసుకురావడానికి కారణం. దీనిపై గతంలో చోటు చేసుకున్న దావా వివాదం సమసి పోయింది. ఆ వీడియోపై న్యాయ పరమైన సమస్యలు తలెత్తడంతో ఆ వివాదం చాలా సంవత్సరాల పాటు నడిచింది. ప్రస్తుతం ఆ వివాదాన్ని సెటిల్ చేసుకున్నాం. 2015 లో ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు రానుంది' అని లాండిస్ తెలిపాడు. ఈ వీడియోను జాక్సన్ అభిమానులు తిరిగి అత్యంత అధునాతనంగా బిగ్ స్ర్కీన్లపై తిలకించే అవకాశం దక్కుతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నాడు. -
లిలీ అలెన్ ఇంట ఇంటర్నెట్ నిషేధం
పాప్ గాయని లిలీ అలెన్ తన ఇంట్లో ఇంటర్నెట్పై, సోషల్ మీడియాపై పూర్తి నిషేధాన్ని అమలు చేస్తోంది. ఇంటర్నెట్లో నానా చెత్తా పోగవుతోందని రుసరుసలాడుతోంది. తన ఇద్దరు కూతుళ్లూ... ఈథెల్, మార్నీలు కాస్త ఎదిగేంత వరకు ఇదే పద్ధతి కొనసాగిస్తానని లిలీ చెబుతోంది. పనులు చేసుకునే మిగిలిన మహిళలతో పోలిస్తే, ఇంట్లో ఇంటర్నెట్ వాడకాన్ని బంద్ చేయడం తనకేమంత కష్టంగా లేదని అంటోంది. -
నా పాట నేనే పాడుకుంటాను
-
బీబర్ ..నిన్ను నువ్వే సరిదిద్దుకో:ఉషర్
లాస్ ఏంజిల్స్: టీనేజి పాప్ సంచలనం జస్టిస్ బీబర్ చేసిన స్వీయ తప్పిదాలనుంచి ఇకనైనా గుణపాఠం నేర్చుకోవాలని అమెరికన్ సింగర్ ఉషర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పలు వివాదాల్లో చిక్కుకున్న బీబర్ జరిగిన పరిణామాలపై అవగాహన పెంచుకుని, వాటిని చక్కదిద్దుకునేందుకు యత్నించాలని సూచించాడు. పదమూడేళ్లకే పాప్ సింగర్ గా కెరీర్ ను ఆరంభించిన బీబర్ సమస్యలకు అతనే కారణమన్నాడు. కనీసం వాటినుంచి బయటకు రావడానికి బీబర్ యత్నించడం లేదన్నాడు. ఇకనైనా వాటిని అధిగమించాలని ఉషర్ హితవు చేశాడు. 'బీబర్ చేసిన స్వీయ తప్పల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అతను ఇంకా చిన్నవాడే. నా నుంచి బీబర్ ఏమైనా సలహాలు అడిగితే తప్పక సహాయం అందిస్తానని' 35 ఏళ్ల ఉషర్ తెలిపాడు. -
కెండల్ జెన్నర్‌తో జస్టిన్ బీబర్ డేటింగ్?
ఓ బేబీ.. బేబీ అంటూ చిన్న వయసులోనే తారాపథానికి ఎదిగిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇప్పుడు కెండల్ జెన్నర్ అనే అమ్మడితో డేటింగ్ చేస్తున్నాడట. వీళ్లిద్దరూ కలిసి ఓ డిన్నర్‌కు వెళ్లి హాయిగా ఆస్వాదిస్తూ తింటూ అందరికీ కనిపించడంతో ఈ కథనాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన మన్హట్టన్లో కెండల్ స్నేహితుడు హైలీ బాల్డ్విన్తో పాటు వీళ్లిద్దరూ కలిసి డిన్నర్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు వీరి డిన్నర్ పార్టీ సాగిందని యూఎస్మాగజైన్.కామ్ తెలిపింది. భోజనం ముగిసిన తర్వాత ముందుగా బీబర్ అక్కడినుంచి వెళ్లిపోతే.. కాసేపటి తర్వాత మిగిలిన ఇద్దరూ వెళ్లారట. బీబర్ అప్పుడప్పుడు తిరిగే సెలెనా గోమెజ్‌తో అతడికి ఇప్పుడు చెడిపోయిందని చెబుతున్నారు. జెన్నర్, ఆమె చెల్లెలు కైలీ జెన్నర్ ఇద్దరూ కలిసి జస్టిన్ బీబర్, అతడి బృందంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారని, తెగ వాగుతున్నారని ఇటీవల సెలెనా చెప్పింది. దీన్ని బట్టి కూడా జస్టిన్ బీబర్ ఇప్పుడు కొత్త స్నేహితురాలిని వెతుక్కుని ఆమెతో డేటింగ్‌కు వెళ్తున్నాడని అంటున్నారు. -
లాస్ ఏంజిల్స్‌లో జస్టిన్ బీబర్ అరెస్టు
టీనేజి పాప్ సంచలనం జస్టిస్ బీబర్‌ను అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్ పర్యటన ముగించుకుని తిరిగి అమెరికా వస్తున్న జస్టిన్ బీబర్ లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి చేరుకున్నాడు. అయితే, అతడి అంగరక్షకులు మాత్రం కస్టమ్స్ గేటు బయట అతడికోసం సాయంత్రం నాలుగు గంటల వరకు వేచిచూస్తూనే ఉన్నారు. అయితే, ఈ కెనడియన్ పాప్ సింగర్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. అసభ్య ప్రవర్తనకు గాను బీబర్‌ను డిపోర్ట్ చేయాలని వైట్‌హౌస్‌లో వారం క్రితం ఓ పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ గొడవ వచ్చింది. జనవరిలో మియామీలో బీబర్‌ను అరెస్టు చేసిన తర్వాత ఈ పిటిషన్ దాఖలైంది. -
మ్యూజిక్ కు జస్టిన్ బీబెర్ గుడ్ బై?
మ్యూజిక్ కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను అని టీనేజ్ పాప్ సంచలనం జస్టిన్ బీబెర్ వెల్లడించాడు. త్వరలో జర్నల్స్ అనే కొత్త ఆల్బమ్ విడుదల తర్వాత మ్యూజిక్ రంగం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను అని తెలిపారు. 'కొత్త ఆల్బమ్ పూర్తయిన తర్వాత రిటైర్ కావాలనుకుంటున్నాను. ఆర్టిస్ట్ గా స్థిరపడాలనుకుంటున్నాను. మ్యూజిక్ రంగంలో ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది' అని ఓ రేడియో కార్యక్రమంలో బీబెర్ వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో తలబిరుసుతనం ఉంది అంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి బీబెర్ చురకలంటించారు. కాని తాను అలాంటి వ్యక్తిని కాదు అని తెలిపారు. -
న్యూజిలాండ్ హోటల్ లో జస్టిన్ బీబర్ కు చేదు అనుభవం
టీనేజ్ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ కు కష్టాలు వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ లోని అక్లాండ్ పట్టణంలో పాప్ సంచలనానికి చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి ఇబ్బందులకు గురిచేయనని కాంట్రాక్టుపై సంతకం చేసిన తర్వాతనే హోటల్ లో ఉండటానికి మేనేజ్ మెంట్ అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా తన సూట్ లోనికి అమ్మాయిలను తీసుకురాకూడదు, విలాసవంతమైన సమావేశం మందిరంలో తినకూడదు అనే షరతులను కూడా విధించిందని బ్రిటన్ వార్త పత్రిక కథనాన్ని వెల్లడించింది. హోటల్ లో విడిది చేసే అతిధులకు, యాజమాన్యానికి ఎలాంటి సమస్యలు కలిగించకూడదని ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. తమ హోటల్ లో బస చేసే వారికి ఎలాంటి హోదాలో ఉన్నా పట్టింపులేదని.. తమ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాలని పాప్ స్టార్ బీబర్ కు హోటల్ యాజమాన్యం స్పష్టం చేసిందని కథనంలో తెలిపింది. అంతర్జాతీయంగా గొప్ప పేరు, ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్ బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో ఓ వేశ్యాగృహంలోని ఓ వేశ్య గృహంలో మీడియా కంటపడటం అక్కడి అభిమానుల ఆగ్రహానికి గురి చేసింది.