న్యూయార్క్: కొంత మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, వాళ్లు వాడే వస్తువులు వేలంలో చాలా ధర పలకడం మనం విని ఉంటాం. అంతేకాదు ఆ డబ్బుల్ని ఏ సేవ సంస్థలకో ఇవ్వడం లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రముఖ బ్రిటన్ పాప్ సింగర్, రచయిత అయిన అమీ జాడే వైన్ హౌస్ విషయంలో కూడా ఇలానే జరిగింది. వైన్ హౌస్ విషపూరిత ఆల్కహాల్‌ని సేవించి 2011లో అతి చిన్న వయసులో మరణించింది.
(చదవండి: 'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక)
అంతేకాదు అత్యంత పిన్న వయసులోనే మ్యూసిక్ ఆల్బమ్ సింగర్‌గా, పాప్ గాయనిగా కెరియర్ సాగించి ప్రతిష్టాత్మకమైన ఐదు గ్రామీ అవార్డులు పొందిని గాయని. అయితే ఆమె ఎక్కువ స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక సామాజిక కార్యకర్తగా చాలా చురుగ్గా పాల్గొనేది. దీంతో బ్రిటన్‌లో ప్రఖ్యాతి గాంచిని జూలియన్స్ అనే ప్రముఖ వేలం సంస్థ ఆమె ధరించిన వస్తువులను వేలం వేసి వాటిని ఆమె మరణాంతరం ఏర్పాటు చేసిన వైన్‌హౌస్ ఫౌండేషన్‌కే వెచ్చించాలని ఆ వేలం సంస్థ డైరక్టర్లు నిర్ణయించారు.
పైగా ఈ వేలంలో ఆమో ధరించిన వస్తువులు దాదాపు 2 మిలయన్ డాలర్ల వరకు పలకవచ్చని జూలియన్ వేలం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్టిన్ నోలన్ బావిస్తున్నారు. ఈ మేరకు 2006లో వచ్చి బాక్ టు బ్లాక్ అనే అల్బమ్ ఆల్కహాల్, తన నిజ జీవితంలో డ్రగ్స్‌కి బానిసై దాని నుంచి బయట పడటానికి సంబంధించిన ఆల్బమ్ కావడమే కాకుండా పలు అవార్డుల ఆ ఆల్బమ్‌కే వరించడం విశేషం. ఆమె పేరు మీద ఏర్పాటైన ఫౌండేషన్ కూడా డ్రగ్స్ బానిసైన యువత కోసం ఏర్పాటు చేసిందే.
(చదవండి: అసంపూర్తిగానే సుదీర్ఘ సైనిక చర్చలు)
Comments
Please login to add a commentAdd a comment