music album
-
ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!
ఇటీవల కాలంలో మన నగరాల్లో కూడా చిన్ని చిన్న మ్యూజిక్ బ్యాండ్లు వచ్చాయి. ప్రజలు వాటిని ఆదరిస్తున్నారు కూడా. అయితే పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కృతి ఎప్పటి నుంచే ఉంది. అక్కడ పాప్ సాంగ్స్‌తో ఉర్రూతలూగించే రాక్ మ్యూజిక్‌కి క్రేజ్ ఎక్కువ. 60ల కాలంలో ఓ ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్ ఉండేది. ఇప్పటికీ వివిధ పాటల ఆల్బమ్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది ఒక ఐకానిక్ మ్యూజిక్ బ్యాండ్. దీని నుంచి విడుదలై ప్రతి మ్యూజిక్ హిట్. అలాంటి ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్ లోగో డిజైన్ చూస్తే కంగుతింటారు. ఆ డిజైన్‌కి ప్రేరణ మన హిందువుల ఆరాధ్య దైవమైన కాళిమాత అట. 1962లో, ది రోలింగ్ స్టోన్స్ పేరుతో బ్రిటిష్ రాక్ బ్యాండ్ స్థాపించారు కొందరూ పాప్ గాయకులు. ఆ బ్యాండ్‌లోని సభ్యులు మిక్ జాగర్, కీత్ రిచర్డ్స్, బ్రెయిన్ జోన్స్, బిల్ వైమాన్, చార్లీ వాట్స్ తదితరులు. బ్రిటన్‌లో 1963 ఆ టైంలో వీరి బ్యాండ్ నుంచి విడుదలైన 'కమ్ ఆన్' అనే మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. దీంతో తమ బ్యాండ్ అని తెలిసేలా ఓ ప్రత్యేక లోగో ఉంటే బాగుంటుందని బ్యాండ్ సభ్యులు భావించారు. కానీ సరిగ్గా ఆ టైంలో ఉన్న యూరోపియన్ పర్యటన ఉండటంతో ఫేమస్ బ్రిటిష్ గ్రాఫిక్ డిజైనర్ జాన్ పాస్చేచే హడావిడిగా యూరప్‌లో ఉండే మిస్టీరియస్ స్టోన్స్నే లోగోగా డిజైన్ చేయడం జరిగింది. అయితే బ్యాండ్‌కి అనతి కాలంలో మంచి పేరు రావడంతో తమ మ్యూజిక్ మ్యాగ్జైన్ కవర్‌పేజీ గ్రాఫిక్‌ని డిజైన్ చేసేలా జాన్ పాస్చేకే మళ్లీ పని పురమాయించారు బ్యాండ్ సభ్యులు. అప్పుడే మంచి లేబుల్‌తో కూడిన లోగో ఉండాలి. అంది తమ బ్యాండ్ దర్పాన్ని, గొప్పతనాన్ని తెలియజేసేట్టు ఉండాలనుకున్నారు బ్యాండ్ సభ్యులు. ఆ దిశగా రాక్ అండ్ రోల్ బ్యాండ్ రోలింగ్ స్టోన్స్ లోగోని ఆవిష్కరించమని పాస్చేకి చెప్పారు. అయితే ఆ బ్యాండ్ సభ్యుల్లో ఒకరైన మిక్ జాగర్‌ని కాళి దేవత రూపం ఎంతగానో ఆకర్షించింది. ఆ రూపం చిహ్నమైన నాలుక, పెదాలనే లోగోగా తీసుకుంటే అనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్నే డిజైనర్ జాన్ పాస్చేకే చెప్పి డిజైన్ చేయించాడు. ఆ బ్యాండ్ ధరించే టీ షర్ట్‌లపై కూడా ఆ లోగోనే ఉంటుంది. ఇక జాగర్‌కి హిందూ దేవత కాళిమాత గురించి ఎలా తెలిసిందంటే..తన తమ్ముడు ద్వారా తెలుసుకున్నాడు. ఆయన భారతదేశ పర్యటనలు చేస్తుంటాడు. అలా అతడు భారత్ నుంచి తెచ్చిన కొన్ని పుస్తకాలను జాగర్‌కి ఇస్తుండేవాడు. అందులో కనిపించిన కాళి మాత రూపం జాగర్‌ని బాగా ఆకర్షించింది. దీంతో ఆమె చిహ్నలతోనే లోగో తయారు చేయాలనే ఆలోచన జాగర్‌కి తట్టడం జరిగింది. ఆయన కోల్‌కతాలో కాళీ పూజలు చేసి వచ్చి మరీ ఈ లోగోని డిజైన్ చేయించుకున్నారట. ఈలోగో కాళిమాత విగతమైన నాలుక, పెదాలతో ఉంటుంది. అయితే అందరూ మత్రం ఆబ్యాండ్ అసలు సభ్యలైన గాయకుడు జాకర్ పెదాలుగా భావిస్తుంటారు. అసలు కాళీమాత అంటే.. ధిక్కారణ, స్థితిస్థాపకత, శక్తిని సూచిస్తుంది. అలానే తమ బ్యాండ్ ఉనికిని చాటుకుంటూ.. ప్రజలను ఆకట్టుకునేలా.. శక్తిమంతమైన మ్యూజిక్‌ని అందించే బ్యాండ్ అని అర్థం ఇచ్చేలా ఈ విధంగా లోగోని డిజైన్ చేయించినట్లు తెలిపారు. అందుకుగానూ డిజైనర్ పాస్చేకి అప్పట్లో సుమారు రూ. 5 వేల రూపాయలకు పైనే చెల్లించారట. అయితే 1976లో ఆ లోగో ఆ బ్యాండ్ అధికారిక చిహ్నంగా మారడంతో పాస్చేకి దాదాపు రూ.27 లక్షలు చెల్లించి మరీ కాపీరైట్ హక్కలును తీసుకుంది ది రోలింగ్ స్టోన్స్ బ్యాండ్.(చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది) -
Video: డ్యాన్స్ షో చూస్తుండగా కూలిన పైకప్పు.. వందలాది మందికి గాయాలు
పాట్నా: బీహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహావీర్ మేళా సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో ఉన్నట్టుండి ఓ ఇంటి పైకప్పు కూలడంతో అనేకమందికి గాయాలయ్యాయి. ఛప్రా నగరంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇషావ్పూర్ బ్లాక్‌లో మహావీర్ అఖారా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్ ప్రదర్శనను చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. వేదిక చుట్టూ, రోడ్డు మీద మొత్తం గుమిగూడారు. వీరిలో చాలా మంది భవనాల పైకప్పులపైకి, రోడ్డుపక్కన బాల్కనీలు, చెట్లపైకి ఎక్కారు. ఈ క్రమంలో వందల మంది ఎక్కడంతో శిథిలావస్థకు చేరిన ఓ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది.పైకప్పు పైన నిలబడి ఉన్న వందలాది మంది వ్యక్తులు కిందపడిపోయారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన జనం గట్టిగా అరుస్తూ పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. The roof collapsed in Chapra, Bihar, injuring 100 people.#Bihar #Chhapra #RoofCollapse @bihar_police @officecmbihar @ChapraZila pic.twitter.com/PvBT1mno4d— Payal Mohindra (@payal_mohindra) September 4, 2024 వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రూఫ్ కూలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మ్యూజిక్ ఫ్రెండ్లీ.. మెట్రో మెడ్లీ..
ప్రపంచ సంగీత దినోత్సవంలో భాగంగా మెట్రో స్టేషన్లు సంగీత ప్రదర్శనలకు వేదికలుగా మారనున్నాయి. ప్రయాణాలను ఆహ్లాదకరమైన అనుభవాలుగా మారుస్తూ... బుధవారం నుంచి శనివారం వరకూ విభిన్న సంగీత ప్రదర్శనలతో ప్రయాణికులను ఆకట్టుకోనుంది. ‘మెట్రో మెడ్లీ’ పేరిట గోథే–జెంత్రమ్ సహకారంతో మ్యూజికల్ ఫెస్ట్ బస్కింగ్ ఫార్మాట్లో ఉంటుంది. దీని కోసం 200 మంది ఔత్సాహిక సంగీతకారుల నుంచి అనుభవజు్ఞలైన నిపుణుల వరకూ 20 గ్రూపులుగా విభజించారు. ఈ కళాకారులు జాజ్ క్లాసికల్ నుండి బాలీవుడ్ హిట్ల వరకూ విభిన్న రకాల సంగీత శైలులను ప్రదర్శిస్తారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకూ, అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, పరేడ్ గ్రౌండ్, ఎంజిబిఎస్, ఉప్పల్ సహా ఏడు మెట్రో స్టేషన్లను ఎంపికచేశారు. సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఔత్సాహిక సంగీత కళాకారులకు బహిరంగ వేదికలను అందించడమే ఈ ప్రదర్శనల లక్ష్యం. -
Taylor Swift: గ్రామీ అవార్డుల్లో రికార్డు
అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా 2024 గ్రామీ అవార్డుల్లో మరోసారి తన సత్తా చాటింది. వరుసగా నాలుగో సారి బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెల్చుకుంది. తన మిడ్నైట్స్ ఆల్బమ్‌కు గాను ఈ అవార్డు దక్కింది. వరుసగా నాలుగు అవార్డులను దక్కించుకున్న తొలి మహిళా సింగర్ 66 ఏళ్ల గ్రామీ అవార్డు చరిత్రలోనే ఇది రికార్డు. ఇది తన జీవితంలో గొప్ప క్షణాలన్ని టేలర్ ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాదు "ది టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్మెంట్" అనే కొత్త ఆల్బమ్‌ను కూడా ఏప్రిల్ 19వ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇక ఎస్జెడ్ఏ ఆర్ అండ్ బి పాట కోసం ఎస్జెడ్ఏ అవార్డును దక్కించుకోవడంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంకా మోనెట్, బిల్లీ ఎలిష్, మైలీ సైరస్ వంటి మహిళా కేటగిరీలో నామినేషన్లలో ఆధిపత్యాన్ని కొనసాగించారు. మూడుసార్లు బెస్ట్ ఆల్బమ్ గెలిచిన సింగర్లలో స్టీవ్ వండర్, పౌల్ సిమన్, ఫ్రాంక్ సినత్రాలు ఉండటం విశేషం.మైలీ సైరస్ ఎట్టకేలకు తొలి సారి గ్రామీ అవార్డును గెలుచుకుంది "ఫ్లవర్స్" అనే సాంగ్ ఉత్తమ పాప్ సోలో అవార్డు సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఎనిమిది సార్లు నామినేట్ అయింది. కానీ అదృష్టం వరించలేదు. కాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 66వ వార్షిక గ్రామీ అవార్డుల సందర్భంగా విక్టోరియా మోనెట్ ఉత్తమ నూతన కళాకారిణిగా అవార్డును స్వీకరించింది. Taylor Swift just took the album of the year trophy from Celine Dion without batting an eye and/or acknowledging that a legendary 🐐 was handing her the award. So cringey for my soul 🫠 pic.twitter.com/J7LggDVQD8— eazy e (@estefs) February 5, 2024 -
రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే!
చదువు పూర్తయి సంగీత పరిశ్రమలో స్థిరపడాలనుకునే వారి తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన ఎదురవుతోంది. ఆ రంగంలో స్థిరపడేవారి ఆదాయమార్గాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే భావన ఉంది. దాంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని భయపడుతారు. కానీ 2022లో దేశంలోని మ్యూజిక్ ఇండస్ట్రీ ఏకంగా రూ.12000 కోట్ల వ్యాపారం సాగించింది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రూ.2.1 లక్షల కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. అయితే అందులో మ్యూజిక్ ఇండస్ట్రీ 6 శాతం వాటా కలిగి ఉంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లోని టాప్ 10 పాటల్లో ఏడు భారతీయులవే కావడం విశేషం. పుష్ప సినిమాలో సునిధి చౌహాన్ పాడిన ‘రారా సామీ’ పాట ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీనికి 1.55 బిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇంద్రావతి చౌహాన్ పాడిన ‘ఊ అంటావా’ పాటను 1.52 బిలియన్ల మంది చూశారు. మ్యూజిక్ కంపోజర్లు, గేయ రచయితలు, సింగర్లకు చెల్లించే డబ్బు 2.5 రెట్లు పెరిగినట్లు తెలిసింది. ప్రత్యేకంగా మ్యూజిక్ ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నవారు, లైవ్‌షోల ద్వారా అర్జిస్తున్నవారు, డిస్కో జాకీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ది మ్యూజిక్ క్రియేటర్ ఎకానమీ: ది రైజ్ ఆఫ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా, 2023 నిర్వహించిన సర్వే ప్రకారం.. 40,000 కంటే ఎక్కువ మంది సంగీత సృష్టికర్తలు ఏటా 20,000-25000 పాటలను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలో అప్పటికే ఉంటున్న పాటలు, మ్యూజిక్ రీమిక్స్ చేస్తున్నవారిని పరిగణలోకి తీసుకోలేదు. వారిని కూడా కలుపుకుంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా పేరున్న సంస్థలు విడుదల చేసే మ్యూజిక్కే ఆదరణ ఉండేదని, కానీ పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా స్థానికంగా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్న వారి కంటెంట్‌కు సైతం మంచి ఆదరణ లభిస్తోందని సర్వే ద్వారా తెలిసింది. ఇదీ చదవండి: రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు? 1957నాటి కాపీరైట్ చట్టంలో 2012లో మార్పులు తీసుకొచ్చారు. రికార్డింగ్‌ని యధాతథంగా కాకుండా అదే పాటను మరొక సింగర్ పాడవచ్చు. వేరొక ట్యూన్‌కి సెట్ చేయవచ్చు. లైవ్‌షోలో పాడవచ్చు. దాంతో వివిధ మార్గాల నుంచి రాయల్టీలు పొందే వీలుంది. -
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ప్రముఖ సింగర్ కూతురు..
ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా? తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియకపోయినా బీటౌన్ ప్రేక్షకులకు మాత్రం ఈమె సుపరిచితమే. సడెన్‌గా చూస్తే.. ఈమె కంగనా రనౌత్, రాధికా ఆప్టేల పోలికలతో ఉన్నట్లు కనిపిస్తుంది. మరో యాంగిల్లో చూస్తుంటే.. హ్యాపీడేస్ ఫేమ్ స్రవంతి లాగానూ అనిపిస్తుంది. తన టాలెంట్ కన్నా గ్లామర్ ట్రీట్‌తో జనాలకు బాగా పరిచయమున్న ఈ బ్యూటీ పేరు అంజలి శివరామన్. తన యూనిక్ స్టైల్‌తో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అంజలి శివరామన్ చక్కని గాయని కూడా. ‘నా నటనకు గానం అనేది ఎంతో ఉపయోగపడింది. క్రమశిక్షణతో ఉండడానికి కారణం అయింది. నన్ను నేను వ్యక్తీకరించుకునే సాధనం అయింది’ అంటుంది అంజలి. సింగర్ చిత్ర అయ్యర్ కూతురైన అంజలికి చిన్నప్పటి నుంచే స్వరాలతో స్నేహం ఏర్పడింది. స్కూల్ ఫంక్షన్ల నుంచి ఫ్యామిలీ ఫంక్షన్ల వరకు అంజలి పాట వినిపించాల్సిందే. పాటలు అంటే ఇష్టం ఉన్నప్పటికీ మ్యూజిక్ క్లాస్‌కు తరచుగా బంక్ కొట్టేది. ఆ తరువాత మాత్రం సంగీత శిక్షణ ప్రాముఖ్యత తెలుసుకొని ప్రతిరోజూ క్లాస్‌కు తప్పకుండా హాజరయ్యేది. ‘సంగీతం నా రక్తంలోనే ఉంది’ అంటుంది అంజలి, అంజలి నోట పాట విన్న వారు...‘అమేజింగ్ వాయిస్’ అనకుండా ఉండలేరు. ‘జాజ్ బ్లూస్ తన స్టైల్ ఆఫ్ మ్యూజిక్’గా చెబుతుంది అంజలి. View this post on Instagram A post shared by 𑁍 𝔸 ℕ 𝕁 𝔸 𝕃 𝕀 𑁍 (@anjalisivaraman) ముంబైలోని ఒక మ్యూజిక్ స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న అంజలి యాదృచ్ఛికంగా నటనరంగంలోకి వచ్చింది. మోడలింగ్, టీవీ కమర్షియల్స్ ద్వారా గుర్తింపు పొందిన అంజలి క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ‘క్లాస్’లో లీడ్‌రోల్ పోషించింది. సుహాని అహుజా పాత్రతో మంచి మార్కులు కొట్టేసింది. View this post on Instagram A post shared by 𑁍 𝔸 ℕ 𝕁 𝔸 𝕃 𝕀 𑁍 (@anjalisivaraman) -
కూతురితో చేతులు కలపనున్న కమల్ హాసన్.. త్వరలోనే..
విశ్వనటుడు కమల్ హాసన్, ఆయన కూతురు.. నటి, గాయని, సంగీత దర్శకురాలు శ్రుతిహాసన్‌ల కాంబినేషన్లో చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ క్రేజీ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే మొదలైంది. కానీ అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇది వారి అభిమానులను తీవ్ర నిరాశ పరిచిందనే చెప్పాలి. అలాంటి వారికి గుడ్‌న్యూస్.. తాజాగా కమల్ హాసన్, శ్రుతి హాసన్ కలిసి ఒక మ్యూజికల్ ఆల్బమ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని శనివారం నాడు మీడియా ద్వారా వెల్లడించారు. శ్రుతిహాసన్‌కు మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు షీ ఈజ్ ఏ హీరో, ఎడ్జ్.. ఇలా రెండు ఆల్బమ్‌లు చేశారు. కాగా మూడవ ఆల్బమ్‌ను తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి చేయబోవడం విశేషం. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు వేడుకలో కమల్ హాసన్ ఈ మ్యూజిక్ ఆల్బమ్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన తన 233వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. మరో పక్క బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షోకు హోస్ట్‌గా వ్యవహరించడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు శ్రుతిహాసన్ తెలుగులో ప్రభాస్ సరసన నటిస్తున్న సలార్ చిత్రాన్ని పూర్తి చేసి హీరో నాని 'హాయ్ నాన్న' చిత్రంలో నటిస్తున్నారు. ఎన్నై కేళుంగళ్ అనే టీవీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి రూపొందించనున్న మ్యూజిక్ ఆల్భమ్ గురించి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. చదవండి: ఏడేళ్లుగా వాయిదా పడుతూ విడుదల రేసులోకి వచ్చిన విక్రమ్ సినిమా -
సాంగ్ రైటర్ కమ్ సింగర్..స్ఫూర్తినిచ్చే పాటలతో అలరిస్తుంది!
టీనేజ్‌లో న్యూయార్క్‌కు వెళ్లిన రవీనా అరోరా సింగర్, సాంగ్ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది ‘స్వీట్ టైమ్’ ‘టెంప్టేషన్’ ‘హానీ’ పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక లైవ్ షోలలో పాశ్చాత్య ప్రేక్షకులను హిందీ సాంగ్స్‌తో అలరిస్తుంటుంది. స్టేజీ మీద ఉన్నట్టుండీ...‘వుయ్ ఆర్ గోయింగ్ టు సింగ్ ఇన్ హిందీ నౌ’ అని ప్రకటిస్తుంది. ఆడిటోరియమ్ కేకలతో నిండిపోతున్న సమయంలో ‘ఏక్, దో, తీన్, చార్, చలోనా, మేరె సాత్’ అంటూ హిందీ పాట అందుకుంటుంది. 60,70లలోని హిందీ చిత్రాల పాటలను పాడుతూ కూడా ఈతరం కుర్రకారును ఆకట్టుకుంటుంది. ‘సంగీతంలో భిన్న ధోరణులను అన్వేషించడం ఇష్టం’ అంటున్న అరోరాకు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలా స్వరం ఇష్టం. భావగర్భితమైన పాట ఇష్టం. రవీనా పాటలు ‘ఆహా, ఒహో’లకు పరిమితమైన పసందైన పాటలు కాదు. ఎన్నో సామాజిక సమస్యలు ఆమె పాటలో భాగమై ఉంటాయి. ‘ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, తమను తాము ప్రేమించుకునేలా, తమను తాము స్పష్టంగా అర్థం చేసుకునేలా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా నా పాట ఉండాలనుకుంటాను’ అంటోంది రవీనా అరోరా. (చదవండి: దర్శకురాలు కావాలనుకుంది..కానీ తండ్రి హఠాన్మరణం ఆమెను) -
‘అదేంటోగానీ.... గుప్పెడు గుండె తిప్పలు పెట్టే.. చెలియా’
సందీప్ అశ్వ, పూజారెడ్డి జంటగా, ఇన్నోస్పైర్ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ‘చెలియా’ మ్యూజిక్ ఆల్బమ్ విడుదలైంది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, మనోజ్ కుమార్ చేవూరి ఆలపించడంతో పాటు సంగీతం అందించారు. ప్రకృతి అందాల మధ్య సాగే ఈ పాట వినసొంపుగా ఉంది. ‘అదేంటోగానీ. గుప్పెడు గుండె తిప్పలు పెట్టే..నీ మైకంలో దిగిపోయా.. చెలియా.. ఏం చేశావో మాయా.. చెలియా.. నీ నవ్వుకూ బానిసనయ్యా.... అంటూ సందర్భానుసారంగా `చెలియా..` అంటూ హై పిచ్‌లో పాడే పాట శ్రోతల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది. పాటకు అనుగుణంగా వాటర్‌ఫాల్స్, మధ్య మధ్యలో ఇద్దరి డైలాగ్‌లు, చూపులతో ప్రేమను వ్యక్తీకరించడం వంటివి యూత్‌ను అలరిస్తాయి. అడుగడుగునా ఆనందాలే.. అన్నట్లుగా సినిమాటోగ్రాఫర్ దర్శకుడు అయిన మణి కుమార్ గూడూరు అంతే చక్కగా కెమెరాలో బంధించారు. -
'ఐ యామ్ ఏ సెలబ్రిటీ' అంటున్న రఘుకుంచె
Raghukunche Celebrity Song: గాయకుడిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా , నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఒక వైపు సంగీత దర్శకుడిగా మరో వైపు నటుడిగా తన అనుభవాలను "ఐ యామ్ ఏ సెలబ్రిటీ" ( I'm A Celebrity) పేరుతో, తనే లిరిక్స్ అందించి , మ్యూజిక్ కంపోజ్ చేసి , తనే పాడిన ,ఒక వినోదాత్మకమైన పాటను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్‌లో హల్చల్ చేస్తుంది. ఐ యామ్ ఏ సెలబ్రిటీపాట విడుదల అయిన సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ.. "ప్రతి మనిషికి సమాజంలో మంచి గుర్తింపు కావాలి అని ఉంటుంది కానీ ,ఆ గుర్తింపు కొందరికే వస్తుంది. కృషి పట్టుదలతో కొందరు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, అందరిని మెప్పిస్తారు , అందుకే సమాజంలో వాళ్ళని ప్రత్యేకంగా గౌరవిస్తారు, ఒక సెలబ్రిటీ హోదా ఇస్తారు. సినిమా రంగం అయిన, పొలిటికల్ రంగం విద్యారంగం అయినా , ప్రజలని మెప్పించగలిగితే చాలు వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఇచ్చేస్తారు. కానీ ఈ సెలబ్రిటీ హోదాని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. విశృంఖలంగా పెరిగిపోయిన సోషల్ మీడియా ప్రభావం వల్ల, ఒక సెలబ్రిటీ స్థాయిలో ఏమి చేసినా క్షణాల్లో అది వైరల్‌గా మారుతుంది . నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ జీవితం కత్తి మీద సాములాగా అయిపోయింది. వాళ్ళు ఏమి చేసినా సోషల్ మీడియా లో అదొక పెద్ద వార్త అవుతుంది , మీమ్ అవుతుంది ,యూట్యూబ్ లో థంబ్ నైల్ అవుతుంది. వీటన్నిటి ఆధారంగానే దీన్ని ఒక వినోదభరితమైన పాటగా మలిచాను. ఐ యామ్ ఏ సెలబ్రిటీ పాట మీకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. మరియు , ఈ పాట కేవలం వినోదం కోసం చేసిన పాట మాత్రమే తప్పా ఎవరినో కించపరచడానికో, లేక తక్కువ చేయడానికో చేసింది కాదు . ఎవరి మనసులనైనా కష్టపెడితే , క్షమించమని ముందుగానే కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. -
హుర్రే... మన గొంతుకి గ్రామీ
‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ అని మన తల్లులు పాడుతారు పిల్లలతో. ‘చిట్టి కన్నయ్యా... లోకం చూస్తావా’ అని పాడింది ఫాల్గుణి షా తన కొడుకుతో. పిల్లలు ఒక్కోసారి ప్రశ్నలను సంధిస్తారు. వాటికి సమాధారాలు ఇదిగో ఇలా అవార్డులను కూడా తెచ్చి పెడతాయి. ‘అమ్మా.. నా క్లాస్‌లో అందరూ ఒకేలా ఎందుకు లేరు’ అని ఫాల్గుణి షా చిన్నారి కొడుకు అడిగాడు. దానికి జవాబుగా ఆమె ఒక మ్యూజిక్ ఆల్బమే చేసింది. గ్రామీ గెలుచుకుంది. ఇది ఒక కొడుకు తల్లికి గెలిచి ఇచ్చిన అవార్డు. ఒక తల్లి తన కొడుకు కోసం గెలుచుకున్న అవార్డు. అమెరికాలో చదువుకుంటున్న తొమ్మిదేళ్ల నిషాద్ ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి వాళ్ల అమ్మను ‘అమ్మా... స్కూల్లో ఎందుకు అందరూ ఒకేలా ఎందుకు లేరు? రంగూ రూపం, అలవాట్లు వేరే వేరేగా ఎందుకున్నాయి?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు తల్లి...‘వేరే వేరేగా ఉండి కలిసి ఉండటమే ప్రపంచమంటే. ఇప్పుడు నీ దగ్గర చాలా రకాల పెన్సిల్స్ ఉన్నాయి. కాని అవన్నీ ఒక పెన్సిల్ బాక్స్‌లో ఇముడుతాయి కదా. అలాగే మనుషులు కూడా కలిసి కట్టుగా ఉంటారు’ అని జవాబు చెప్పింది. కాని సంతృప్తి కలగలేదు. ఇలాంటి ప్రశ్నను ఎందరో పసివాళ్లు తమ తల్లులను అడుగుతూ ఉండొచ్చు. వారికి అందరు తల్లులూ జవాబు చెప్పకపోవచ్చు. వారిని తాను చేరాలి. పాట రూపంలో చేరాలి అనుకుంది. వెంటనే ‘ఏ కలర్‌ఫుల్ వరల్డ్’ పేరుతో ఆల్బమ్ చేసి విడుదల చేసింది. ఇది గ్రామీ మెచ్చడంతో ఏకంగా గ్రామీ అవార్డు వరించింది ఆ తల్లిని. ఆ తల్లి మరెవరో కాదు.. భారత సంతతికి చెందిన ఫాల్గుణి షా. ముంబై గాయని ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోన్న ఫాల్గుణి షా... ముంబైలోని జుహులో ఓ సంగీత కుటుంబంలో పుట్టింది. ఇంట్లో సంగీత వాతావరణం ఉండడం, ఫాల్గుణి తల్లి ఆల్ ఇండియా రేడియోలో సంగీత విద్వాంసురాలిగా పనిచేస్తుండంతో చిన్న వయసు నుంచే ఫాల్గుణికి సంగీతం మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. రేడియోలో వస్తోన్న పాటలను ఎంతో ఇష్టంగా వినేది. ఈ ఇష్టమే సంగీతం నేర్చుకునేలా చేసింది. ప్రముఖ గుజరాతీ గాయకులు కౌముది మున్షి, ఉదయ్ మజుందార్‌ల దగ్గర గుజరాతీ జానపద సంగీతం, గజల్స్‌తోపాటు టుమ్రి కూడా నేర్చుకుంది ఫాల్గుణి. తరువాత సారంగీ మ్యాస్ట్రో సుల్తాన్ ఖాన్ వద్ద హిందుస్థాని సంగీతాన్ని నేర్చుకుంది. సంప్రదాయ గాయకుడు కిశోరి అమేన్ కర్ వద్ద జైపూర్ సంప్రదాయ సంగీతం నేర్చుకుంది. రెండుసార్లు గ్రామీకెళ్లిన ఫాలు సంగీతం నేర్చుకుంటూ పెరిగిన ఫాల్గుణి కరిష్మా బ్యాండ్ నడుపుతోన్న గౌరవ్ షాను పెళ్లి చేసుకుంది. 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లింది. అక్కడ కరిష్మా బ్యాండ్‌లో గాయకురాలుగా చేరింది. ‘ఫాలు’ అనే స్టేజ్ పేరుతో పాటలు పాడుతూ 2007లో ఫాల్గుణి తొలి ఆల్బమ్‌ను విడుదల చేసింది. తరువాత 2013లో ‘ఫోరస్ రోడ్’ పేరిట మరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఈ ఆల్బమ్ తొలిసారి గ్రామీకి షార్ట్ లిస్ట్ అయినప్పటికీ నామినేషన్ కు ఎంపిక కాలేదు. తరువాత 2019లో ‘ఫాలూస్ బజార్’ పేరిట విడుదలైన ఆల్బమ్ మరోసారి గ్రామీకి నామినేట్ అయ్యింది. రెండుసార్లు బెస్ట్ చిల్డ్రన్ ్స మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరిలో గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఫాల్గుణి నిలిచింది. గ్రామీ అవార్డు రానప్పటికీ ఫాల్గుణి సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపుతోనే గత కొన్నేళ్లుగా అమెరికన్ కంపోజర్ ఫిలిఫ్ గ్లాస్, అమెరికన్ మ్యుజీషియన్ సెల్లిస్ట్ యోయో మా, ఏఆర్ రెహ్మాన్ లతో కలిసి పని చేస్తోంది. ఏఆర్ రెహ్మాన్ కు ఆస్కార్‌ను తెచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’ సినిమాకు రెహ్మాన్ తో కలసి ఫాల్గుణి పని చేసింది. ఏ కలర్‌ఫుల్ వరల్డ్ పాటల రచయిత, గాయనిగా రాణిస్తోన్న ఫాల్గుణి ఆల్బమ్స్‌లో ఎక్కువగా భారతీయ సంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్ జోడించి సమకాలిన అంశాల పాటలు ఉంటాయి. ఫాల్గుణి తొమ్మిదేళ్ల కొడుకు నిషాద్ న్యూయార్క్ సిటీలోని ఓ స్కూల్లో చదువుతున్నాడు. ఆ స్కూల్లో వివిధ దేశాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. రోజూ వాళ్లను దగ్గర నుంచి చూస్తోన్న నిషాద్ ఒకరోజు....‘‘అమ్మా మా స్కూల్లో కొంతమంది నల్లగా, మరికొంతమంది తెల్లగా, ఇంకొంత మంది చామనఛాయగా ఉన్నారు. వారి ఆహారపు అలవాట్లు, ఇష్టాలు అన్నీ విభిన్నంగా ఉన్నాయి. అంతా ఒక దగ్గరే ఎలా చదువుతున్నారు?’’ అని ఫాల్గుణిని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా...‘‘ బొమ్మలకు రంగులు నింపే రంగురంగుల కలర్ పెన్సిళ్లు, క్రేయాన్ ్స .. ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నప్పటికీ అన్నీ ఒకే బాక్సులోనే ఉంటాయి. అదేవిధంగా ప్రపంచంలో విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, రూపురేఖలు, నలుపు, తెలుపు, ఎరుపు, చామనఛాయ రంగులు, ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నప్పటికీ ఈ ప్రపంచం లో అంతా శాంతియుతంగా జీవించడం అనేది కూడా క్రేయాన్ ్స బాక్స్లాంటిదే ’’ అని వివరించింది. ఈ వివరణ ఫాల్గునికి నచ్చడంతో ఈ థీమ్‌తో భారతీయ సంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్స్ జోడించి ‘కలర్‌ఫుల్ వరల్డ్ పేరిట (క్రెయాన్ ్స ఆర్ వండర్ ఫుల్)’ ఆల్బమ్? రూపొందించింది. ప్రస్తుతం ఈ ఆల్బమే ఫాల్గుణికి గ్రామీ అవార్డు తెచ్పిపెట్టింది. ఏ విషయాన్ని అయినా తేలిగ్గా తీసిపారేయకుండా కాస్త విభిన్నంగా, లోతుగా ఆలోచిస్తే ప్రపంచం మెచ్చేలా కనెక్ట్ కావచ్చుననడానికి ఫాల్గుణి జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. -
సారేగామా... డివిడెండ్ రూ. 30
మ్యూజిక్ లేబుల్ కంపెనీ సారేగామా ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 38 శాతం ఎగసి దాదాపు రూ. 44 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 32 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ. 150 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కాగా.. క్యూ3లో మొత్తం వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 100 కోట్లను దాటాయి. మ్యూజిక్ విభాగం ఆదాయం రూ. 133 కోట్లుకాగా.. ఫిల్మ్‌లు, టీవీ సీరియల్స్ నుంచి దాదాపు రూ. 16 కోట్లు లభించింది. ఈ కాలంలో కరణ్ జోహార్ రాఖీ రాణీకి ప్రేమ్ కహానీ మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకుంది. విభిన్న భాషలలో 165 సినిమా పాటలను విడుదల చేసింది. షార్ట్ వీడియో యాప్ చింగారీతో గ్లోబల్ మ్యూజిక్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెస్లే, అమెజాన్, ఫోన్‌పే తదితర దిగ్గజాలు తమ బ్రాండ్ ప్రకటనలకు కంపెనీ పాటలను వినియోగించుకుంటున్నట్లు సారేగామా తాజాగా పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సారేగామా షేరు బీఎస్ఈలో 1.3 శాతం నష్టంతో రూ. 5,267 వద్ద ముగిసింది. -
పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!
ఇటీవలకాలంలో పాములకు సంబంధించి వీడియోలు సోషల్ మాధ్యమాల్లో తెగ హల్చల్ చేశాయి. పాములను ముద్దు పెట్టుకోవడం, రబ్బర్ బ్యాండ్‌లా చ్టుటుకున్న వైరల్ వీడియోలు చూశాం. అయితే ఆ పాములు ఏం చేయనంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక గాయని పాముల ఒంటి మీద వేసుకుంటు మ్యూజిక్ షూటింగ్ చేస్తే ఏమయ్యేందో చూడండి. (చదవండి: అప్పడు అత్యంత పిన్న వయసు బాడీబిల్డర్... ఐతే ఇప్పుడు అతను ఎలా ఉన్నాడంటే!!) అసలు విషయంలోకెళ్లితే....జే-జెడ్ లేబుల్ రోక్ నేషన్ సంస్థ సింగర్ మేతాతో ఒక మ్యూజిక్ వీడియోని షూట్ చేసింది. అయితే షూటింగ్లో గాయని నేల మీద పడుకుని పాములు మీద వేసుకుంటూ పాట పాడుతుంది. అయితే ఇంతలో ఏమైదో ఏమో గానీ ఒక నల్లపాము అమాంతం ఆమె ముఖం మీదే కాటే వేసింది. దీంతో ఆమె ఒక్కసారిగి బిత్తరపోయి వాటిని పక్కకు నెట్టి అక్కడ నుంచి నిష్క్రమించింది. దీంతో ఆ గాయని ఈ ఘటనకు సంబంధించిన వీడియో తోపాటు "మీ అందరి కోసం మ్యూజిక్ వీడియోలు షూటింగ్ చూస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా! " అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!) View this post on Instagram A post shared by Maeta (@maetasworld) -
ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!
న్యూయార్క్: కొంత మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, వాళ్లు వాడే వస్తువులు వేలంలో చాలా ధర పలకడం మనం విని ఉంటాం. అంతేకాదు ఆ డబ్బుల్ని ఏ సేవ సంస్థలకో ఇవ్వడం లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రముఖ బ్రిటన్ పాప్ సింగర్, రచయిత అయిన అమీ జాడే వైన్ హౌస్ విషయంలో కూడా ఇలానే జరిగింది. వైన్ హౌస్ విషపూరిత ఆల్కహాల్‌ని సేవించి 2011లో అతి చిన్న వయసులో మరణించింది. (చదవండి: 'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక) అంతేకాదు అత్యంత పిన్న వయసులోనే మ్యూసిక్ ఆల్బమ్ సింగర్‌గా, పాప్ గాయనిగా కెరియర్ సాగించి ప్రతిష్టాత్మకమైన ఐదు గ్రామీ అవార్డులు పొందిని గాయని. అయితే ఆమె ఎక్కువ స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక సామాజిక కార్యకర్తగా చాలా చురుగ్గా పాల్గొనేది. దీంతో బ్రిటన్‌లో ప్రఖ్యాతి గాంచిని జూలియన్స్ అనే ప్రముఖ వేలం సంస్థ ఆమె ధరించిన వస్తువులను వేలం వేసి వాటిని ఆమె మరణాంతరం ఏర్పాటు చేసిన వైన్‌హౌస్ ఫౌండేషన్‌కే వెచ్చించాలని ఆ వేలం సంస్థ డైరక్టర్లు నిర్ణయించారు. పైగా ఈ వేలంలో ఆమో ధరించిన వస్తువులు దాదాపు 2 మిలయన్ డాలర్ల వరకు పలకవచ్చని జూలియన్ వేలం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్టిన్ నోలన్ బావిస్తున్నారు. ఈ మేరకు 2006లో వచ్చి బాక్ టు బ్లాక్ అనే అల్బమ్ ఆల్కహాల్, తన నిజ జీవితంలో డ్రగ్స్‌కి బానిసై దాని నుంచి బయట పడటానికి సంబంధించిన ఆల్బమ్ కావడమే కాకుండా పలు అవార్డుల ఆ ఆల్బమ్‌కే వరించడం విశేషం. ఆమె పేరు మీద ఏర్పాటైన ఫౌండేషన్ కూడా డ్రగ్స్ బానిసైన యువత కోసం ఏర్పాటు చేసిందే. (చదవండి: అసంపూర్తిగానే సుదీర్ఘ సైనిక చర్చలు) -
తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే
అల్లు శిరీష్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన తొలిసారి బాలీవుడ్లో నటించిన ‘విలయాటి షరాబి’ మ్యూజిక్ ఆల్భమ్ 100 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయింది. గతనెల చివర్లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ స్పెషల్ వీడియో సాంగ్ ఇంటర్నెట్కు షేక్ చేసింది. అల్లు శిరీష్, హెలి దరువాలా జంటగా చేసిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది.దీంతో రిలీజ్ అయిన తక్కువ కాలంలోనే వీడియోకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా తమ్ముడు సక్సెస్‌పై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. 'బిగ్ కంగ్రాట్ శిరీష్. నీ పాట వంద మిలియన్ వ్యూస్‌ని సాధించినందుకు గర్వంగా ఉంది' అంటూ అభినందించారు. ఇక ఊహించని ఈ సర్ ప్రైజ్‌కి అల్లు శిరీష్ సైతం ఆనందంలో మునిగితేలుతున్నాడు. ఈ పాట ఇంత సక్సెస్ అవుతుందని ఊహించలేదని, ఈ సాంగ్ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) చదవండి : హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్ అల్లు స్నేహారెడ్డి ఐడియాకి సమంత ఫిదా -
ఆకట్టుకుంటున్న ‘పాప చలో హైదరాబాద్’ సాంగ్
ఇండియా అబ్బాయి తను ప్రేమించిన అమెరికన్ అమ్మాయిని తన మాతృదేశానికి తీసుకు రావాలనే కొరికతో దేశం మారిపోతే లైఫ్ సరదాగా ఉంటుందని నచ్చజెపుతూ ఆ అమ్మాయికి ఇక్కడ ఉంటే బాగుంటుందని కన్విన్స్ చేసి తన మాతృదేశానికి తీసుకురావడానికి చేసిన చిన్న ప్రయత్నమే "పాప చలో హైదరాబాద్"..జెమినీ కన్సల్టింగ్ & సర్వీసెస్ పతాకంపై సింగర్ శ్రీకాంత్ సందుగు పాడిన "పాప చలో హైదరాబాద్" మ్యూజిక్ ఆల్బమ్ ను ఆనంద్ భట్ దర్శకత్వం వహించగా శ్రీని రజినీకాంత్ గంగవరవు నిర్మించారు .ఈ మ్యూజిక్ ఆల్బమ్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి మంచు లక్ష్మి, సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్, లక్ష్మీ దేవినేని , జెమినీ కన్సల్టింగ్ & సర్వీసెస్ చక్రవర్తి ,సింగర్ శ్రీకాంత్ సందుగు తల్లిదండ్రులు రంగాచారి, ఆండాళ్, కుటుంబ సభ్యులు శేషాచారి, శ్రీలత, కృష్ణ కళ, వేణు మాధవ్, శ్రీ వేద్, సింగర్ శ్రీకాంత్ సందుగు ఫ్రెండ్ ప్రవీణ్,అశ్విని, తదితరులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ నటి మంచు లక్ష్మి , సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్ చేతుల మీదుగా "పాప చలో హైదరాబాద్" మ్యూజిక్ ఆల్బమ్ ను విడుదల చేశారు. అలాగే ఆర్.పి పట్నాయక్ రాసిన "అమ్మ పాట" ప్రోమోను విడుదల చేశారు. ఈ పూర్తి పాటను అమ్మలకు డెడికెట్ చేస్తూ మదర్స్ డే సందర్భంగా మే 9న విడుదల చేస్తారు.అనంతరం ప్రముఖ నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ... నా కెరియర్ కూడా యూఎస్ఏ నుంచే స్టార్ట్ అయింది. అయితే మనం యు.యస్ లో ఉండి ఎంత పేరు సంపాదించుకున్నా.. మన మాతృదేశంలో మన పాటను, మన ఫోటోను బిగ్ స్క్రీన్ పై చూసుకొంటే ఆ కిక్కే వేరు. తను నటిస్తూ పాడిన ఈ ఆల్బమ్ శ్రీకాంత్ కు ఏంతో మంచి పేరు తెచ్చిపెట్టాలి. తను ఇంకా ఎన్నో పాటలను ఇక్కడ ఆడియన్స్ కు పరిచయం చేయాలని అశిస్తున్నాను. అమెరికాలో వుండే ఎంతో మంది శ్రీకాంత్ లా ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో తమ ప్రతిభ ను నిరూపించుకోవాలని అన్నారు. సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ.. ఆమెరికాలో జరిగే నా షో లలో శ్రీకాంత్ టీం తప్పక ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే వీరు చేసే ప్రతిదీ కొత్తగా ఉండాలని కొరుకుంటుంటారు. శ్రీకాంత్ అమెరికాలో ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. ఈ రోజు వారు నటిస్తూ పాడిన ఆల్బమ్ ఇండియాలో విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమెరికా వారు పాడిన ఆల్బమ్స్ ఎంతటి విజయం సాదించాయో ఈ రోజు ఇండియాలో విడుదల చేస్తున్న ఈ ఆల్బమ్ కూడా అంతే పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్ ఎప్పుడు అమ్మతో మొదలవుతుంది. అలాగే నా సెకెండ్ ఇన్నింగ్స్ కూడా "అమ్మ పాట" తో మొదలవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలో నేను కమిట్ అయిన సినిమా విషయాలు త్వరలో తెలియ జేస్తాను అని అన్నారు. సింగర్ శ్రీకాంత్ సందుగు మాట్లాడుతూ... చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం.మా కాలేజ్ లో జరిగే ప్రతి ఈవెంట్ లో పాటలు పాడే వాణ్ణి. కానీ నాకు అప్పుడు ఇది ప్రొఫెషన్ గా తీసుకోవాలని ఆరోజు అనుకోలేదు. తరువాత 2004 లో చుదువు రిత్యా అమెరికా వెళ్లడం జరిగింది. అమెరికాలో జరిగిన "పాడుతా తీయగా" మొదటి ఎపిసోడ్ లో సింగర్ గా పాడాను. ఆ పాటకు నాకు చాలా ప్రశంసలు వచ్చాయి. సంగీత విద్వాంసుడు బాలు గారు కూడా నన్ను అప్రిసియేట్ చేయడం జీవితంలో మరచిపోలేను. అలా వారు ప్రశంశించి చెప్పిన మాటలకు మోటివేట్ అయ్యాను. అప్పటినుండి నేను సింగర్ కావాలనే ప్యాసినెట్ తో వర్క్ చేశాను. యు.యస్ లో ఇప్పటి వరకు 450 ప్రోగ్రామ్స్ చేశాను. అక్కడ వుండే ప్రతి అసోసియేషన్ కు,ఆర్గనైజేషన్ కు పాడడం జరిగింది.మ్యూజిక్ అంటే నాకు ఏంతో ఇష్టం నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా చూసుకునేవాన్ని..ఇకనుండి నేను సింగర్ గా పాడిన పాటలు పాట రూపకంగా కాక విజువల్ గా కూడా నేను ప్రేక్షకులకు కనపడాలని కోరికతో ఆర్టిస్ట్ గా చేసి ప్రపంచంలో వుండే తెలుగు వారందరికీ దగ్గరవ్వాలనే కోరికతో.. అమెరికాలోని చికాగో లో హైదరాబాద్ సిటీ గురించి పాడిన "పాప చలో హైదరాబాద్" మ్యూజిక్ ఆల్బమ్ ను నేను పుట్టి పెరిగిన, హైదరాబాద్ లో విడుదల చేస్తే బాగుంటుందని ప్రముఖ నటి మంచు లక్ష్మి, , సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ లను కలవడం జరిగింది.కోవిడ్ టైంలో కూడా వారు నన్ను, నా పాటను బ్లెస్స్ చేయడానికి వచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో వుంటూ యాంకరింగ్ ను ప్రొఫెషన్ గా తీసుకొని అమెరికాలో ఎన్నో పెద్ద, పెద్ద కన్వెన్షన్, అసోసియేషన్స్ లకు హోస్టింగ్ చేసిన ప్యాసినెట్ యాంకర్ సాహిత్య ఈ మ్యూజిక్ ఆల్బమ్ కు ప్రొడక్షన్ ఇంచార్జ్ గా ఉంటూ.. ఈ ఆల్బమ్ బాగా రావాలని తను ఏంతో డెడికెట్ గా వర్క్ చేయడమే కాక ఈ ఈవెంట్ కు తనే ఆర్గనైజ్ చేసి మా ఈవెంట్ సక్సెస్స్ చేసింది. ఆర్.పి పట్నాయక్ రాసిన అమ్మ పాటలో సాహిత్య లీడ్ రోల్ లో నటించింది. ఈ పాటతో తనకు మంచి పేరుతో పాటు,మంచి నటిగా గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.అలాగే నా ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు సమక్షంలో ఈ ఆల్బమ్ లాంచ్ ఈవెంట్ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. జెమినీ కన్సల్టింగ్ & సర్వీసెస్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఇది మా ఫస్ట్ ప్రాజెక్టు ఇలాంటి మంచి పాటతో మేము మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సాంగ్ మంచి విజయం సాధించాలి త్వరలో బాలకృష్ణ గారి ఆశీస్సు లతో జెమిని ఎంటర్ టైన్మెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తాం అని అన్నారు. మాధవ పెద్ది సురేష్ మాట్లాడుతూ... అమెరికాలో వీరు నాకు ఒక ఈవెంట్ చెసినప్పుడు వీరికి మంచి భవిష్యత్తు ఉందని అనుకున్నాను. అనుకున్నట్లే వారు అమెరికాలో ఎన్నో ఆల్బమ్స్ విడుదల చేసి అక్కడ సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు ఇండియాలో కూడా తన పాటల ఆల్బమ్ లాంచ్ ఈవెంట్ కు నన్ను ఇన్వైట్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది.తనకు ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలి అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ శ్రీకాంత్ సందుగు కుటుంబ సభ్యులు, మరియు ఫ్రెండ్స్ అందరూ ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలని కోరుకొంటున్నామని అన్నారు. -
మరో మార్కును చేరుకున్న‘అల వైకుంఠపురములో’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్‌హిట్ అయ్యి అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని పాటలు జియో సావన్‌లో 100 మిలియన్ మార్కుని దాటినట్లు ఆ యాప్ నిర్వాహకులు ప్రకటించారు. అంతే కాకుండా ఈ రికార్డును సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ ఆల్బమ్‌గా నిలిచిందన్నారు. సావన్ జియో సావన్‌గా లాంచ్ అయిన ఆరు నెలల్లోనే 100 మిలియన్ మార్కును దాటడం విశేషం. అన్ని వేడుకల్లో, కచేరీల్లో ఈ చిత్రంలోని పాటలు మారుమోగుతున్నాయి. చిత్రంలోని ‘సామజవరగమన’ పాట సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డులతో సెన్సేషన్ సృష్టించింది. సిరివెన్నెల సీతారామశాస్ర్తి రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసిన సామజవరగమన పాట ఒక్కరోజులోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘సామజవరగమన’తో పాటు దాదాపు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ కావడం ‘అల.. వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. సిరివెన్నల సీతారామశాస్ర్తి, రామజోగయ్య శాస్ర్తి,కృష్ణ చైతన్య, కరసాల శ్యామ,కళ్యాణ్ చక్రవర్తి, విజయ్‌కుమార్ బల్లా పాటలు రాయగా తమన్ అందించిన అద్బుత మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్అయ్యింది. అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలు జియో సావన్‌లో 100 మిలియన్ మార్కును దాటడంపై సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని అల్లుఅర్జున్,త్రివిక్రమ శ్రీనివాస్, అల్లు అరవింద్,రాధాకృష్ణలకు డెడికేట్ చేస్తున్నట్లు తెలిపారు.సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంలోని పాటలు 50 మిలియన్ మార్క్‌ను దాటి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. -
నా అభిమానుల కోసం నిర్వహిస్తున్నా: రాహుల్
సాక్షి, గచ్చిబౌలి : తనకు ఓట్లేసి గెలిపించిన వారి కోసం ప్రత్యేకంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు బిగ్ బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. సోమవారం కొండాపూర్‌లోని సౌండ్ గార్డెన్ కేఫ్‌లో ‘లైవ్ కన్సర్ట్’ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న పీపుల్స్ ప్లాజాలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత విభావరి ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని, తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఓట్లేసిన వారు, అభిమానులు వచ్చే అవకాశం ఉందన్నారు. పునర్నవి, శివ జ్యోతి, శ్రీముఖితో పాటు బిగ్ బాస్–3లోని సభ్యులను ఆహ్వానించానని చెప్పారు. తాను ఓ సాధారణ కామన్ మ్యాన్‌ను అన్నారు. సినిమాలకు పాటలు పాడితే వచ్చే ఆదాయం సరిపోక...2013 నుంచి మ్యాజిక్ వీడియోస్ తీశానన్నారు. లక్షలు ఖర్చు చేస్తే ‘మాకీ కిరికిరి’ అనే పాటకు మొన్నమొన్న గుర్తింపు వచ్చిందన్నారు. సంగీత విభావరిలో పెద్ద స్టేజిపై టాలీవుడ్‌కు చెందిన ఓ సింగర్ సొంత పాటలు సోలోగా పాడబోతున్నాడని చెప్పారు. టాలెంట్ సింగింగ్‌తో థ్యాంక్స్ తెలియజేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు బాగా ఆదరించారని చెప్పారు. బిగ్‌బాస్–3లో తన వ్యక్తిత్వాన్ని పాజిటివ్‌గా ప్రజెంట్ చేసినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. -
శ్రుతీ కొత్త రాగం
కేవలం హీరోయిన్‌గానే కాదు.. సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా శ్రుతీహాసన్ పేరు సంపాదించుకున్నారు. కానీ ఇటీవల సినిమాలను కాస్త తగ్గించి మ్యూజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు ఉన్నారు. అందుకే మ్యూజిక్ ఇన్‌స్ట్రూమెంట్స్‌తో ఆమె ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడు శ్రుతీహాసన్ పాడిన పాట ఒకటి నవంబర్‌లో బయటకు రానుంది. ఈ పాటకు లిరిక్స్ కూడా ఆమెనే రాశారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ నూక్లియాతో ఆమె కలిసి పని చేశారు. ‘‘నూక్లియాతో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఫన్‌గా ఉండే ట్రాక్ కోసం ట్రై చేశాం. ఇలాంటి కొత్త జానర్స్ పట్ల ఒక ఆర్టిస్టుగా నేనెప్పుడూ ఆసక్తిగానే ఉంటాను. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ వరల్డ్‌లో నేను ట్రావెల్ కావడానికి నూక్లియాలాంటి మంచి వ్యక్తి సహాయం చాలా అవసరం’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ హిందీ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారామె. ఇందులో విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నారు. అన్నట్లు.. శ్రుతీహాసన్ పాటలు పాడటం ఇది కొత్త కాదు. ఇప్పుడు కొత్త పాట పాడారంతే. ఓసారి వెనక్కి వెళితే ‘రేసు గుర్రం’లో ‘డౌన్ డౌన్ డుప్పా డుప్పా..’, ‘ఆగడు’లో ‘జంక్షన్లో...’ ఇలా చాలా పాటలు పాడారు. ఆ మాటకొస్తే.. చిన్నప్పుడే ‘హేరామ్’లో తండ్రి కమల్‌హాసన్‌తో కలసి ‘రామ్ రామ్’ పాట పాడారామె. -
యూ టర్న్ గీతాలు రెడీ
తమిళసినిమా: సెలబ్రిటీస్ చిత్ర వివరాలను తెలుసుకోవడానికి వారి అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా ఆ కోవలోకి చేరిన నటి సమంత. వివాహనంతరం అగ్రనటిగా కొనసాగుతున్న అరుదైన హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అంతే కాదు ఇప్పటి వరకూ హీరోలతో నాలుగు ప్రేమ సన్నివేశాలు, నాలుగు పాటలు అంటూ నటించేసిన సమంత వివాహానంతరం హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా మారింది. అవును సమంత ప్రస్తుతం నటిస్తున్న యూ టర్న్ చిత్రం ఆ తరహా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రమే. కన్నడంతో సంచలన విజయం సాధించిన యూటర్న్ చిత్రాన్ని అదే పేరుతో సమంత హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఈ బ్యూటీ మరోసారి పాత్రికేయురాలిగా నటిస్తోంది. ఇప్పటికే మహానటి చిత్రంలో విలేకరిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న యూ టర్న్ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. తాజాగా ఈ చిత్ర గీతాలను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్లు నటి సమంత తన ట్విట్టర్లో పేర్కొంది. యూ టర్న్ చిత్రం విడుదలైన వారంలోనే శివకార్తికేయన్‌తో సమంత నటించిన సీమరాజా చిత్రం తెరపైకి రానుంది. ప్రస్తుతం సమంత విజయ్‌సేతుపతితో సూపర్ డీలక్స్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. అదే విధంగా తెలుగులో భర్త నాగచైతన్యకు జంటగా ఒక చిత్రంలోనూ నటిస్తోంది. ఆ తరువాత ఒక కొరియా చిత్ర రీమేక్‌లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. విశేషం ఏమింటంటే ఇందులో సమంత 80 బామ్మగా కనిపించనుందట. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇలా నటనకు అవకాశం ఉన్న అదే సమయంలో వ్యత్యాసంతో కూడిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ సమంత తన నట దాహాన్ని తీర్చుకుంటోందన్న మాట. -
అవును.. నేను ప్రేమలో ఉన్నాను..
సాక్షి, సిటీబ్యూరో: ‘అవును.. నేను ప్రేమలో ఉన్నాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఇలా అందరినీ ప్రేమిస్తాను. అలాగని మీరంటున్న ప్రేమలో పడనని కాదు. ఎప్పుడు ప్రేమలో పడతామో చెప్పలేం. అది తెలియకుండా జరిగిపోతుంది. ఇప్పుడు మాత్రం ప్రేమలో లేన’ని చెప్పింది షాలినీపాండే. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ.. కుటుంబంతో గడిపే సమయమే చిక్కడం లేదు. ఇక ప్రేమలో పడే సమయం ఎక్కడా? అని సెలవిచ్చింది. తొలి సినిమాతోనే ప్రశంసలందుకున్న షాలిని... ఇప్పుడు ‘నా ప్రాణమే’ పాటతో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో మెరిసింది. వాలెంటైన్స్ డేకి విడుదలైన ఈ ఆల్బమ్ మంచి హిట్స్ సాధించింది. సింగర్‌గానూ అలరించిన షాలిని ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... షాలినీపాండే నేను థియేటర్ (రంగస్థలం) బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. రంగస్థలం, సినిమా రెండు వేర్వేరు. నాటకంలో ప్రత్యక్షంగా ప్రేక్షకుల స్పందన చూస్తూ పాత్రను పండించాల్సి ఉంటుంది. సినిమా పూర్తయి విడుదలైతే గానీ ప్రజల అభిప్రాయం తెలియదు. అయితే దేని గొప్పదనం దానిదే. నా మట్టుకు నాకు అభినయానికి అవకాశమున్న పాత్ర లభిస్తే ఏదైనా ఇష్టమే. ప్రస్తుతం తెలుగులో ‘సావిత్రి’ సినిమాలో ప్రాధాన్యమున్న పాత్ర పోషిస్తున్నాను. ఇంకా కొన్ని చర్చల్లో ఉన్నాయి. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. ఒక భాషా పరిశ్రమలో సెటిలవ్వాలని అనుకోవడం లేదు. ఏ భాషలో అయినా సరే పాత్ర బాగుండాలి. అది నేను చేయాలి అనుకోవాలి. అభినయానికి అవకాశం ఉండాలి. అర్థరహిత పాత్రలు చేయాలనుకోవడం లేదు. నటించడం నాకు ఇష్టం. అలాగే డ్యాన్స్ కూడా పెర్ఫార్మెన్స్లో భాగమేనని నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు టాప్‌లో ఉన్న వారిని చూసి, ఆ పొజిషన్లోకి వెళ్లాలనే లక్ష్యాలు పెట్టుకోను. నాకు రోల్ మోడల్స్ అంటూ లేరు. మాధురి దీక్షిత్, గురుదత్, కమల్‌హాసన్... ఇలా ఎందరినో అభిమానిస్తాను. వారి అభినయాన్ని ఇష్టపడతాను. అయితే ప్రేక్షకులకు నేను షాలినిగా మాత్రమే గుర్తుండాలి. నాకు సొంత ఐడెంటిటీ ఉండాలి. నటన అనేది నాకొక ప్రొఫెషన్ మాత్రమే కాదు... అదొక ఎమోషనల్ థింగ్ ఫర్ మి. నాకు పాటలంటే మహా ఇష్టం. సంగీతం మాత్రం నేర్చుకోలేదు. మా అమ్మగారు క్లాసికల్ సింగర్. ఓ రకంగా ఈ సింగింగ్ టాలెంట్ కొంతం దైవ ప్రసాదం, కొంత అమ్మ నుంచి వచ్చింది. బెంగళూర్‌కి చెందిన లగోరి బ్యాండ్‌ని ముంబైలో తొలిసారి కలిశాను. నాలుగేళ్లుగా వారితో ప్రయాణం సాగుతోంది. విభిన్న భాషల్లో పాటలు విడుదల చేసిన వీరు... వాలెంటైన్స్ డేకి తెలుగులో పాట రూపొందించాలని అనుకున్నారు. తెలుగులో పాడడం అనగానే నేను వెంటనే ఒప్పుకున్నాను. ఈ ఆల్బమ్‌ను బెంగళూర్‌లో సినిమా షూటింగ్‌లు చేసే ప్లేస్‌లో కేవలం ఒక్క రోజులోనే షూటింగ్ చేశారు. ఇందులో నాతో పాటు బ్యాండ్‌కు చెందిన గాయకుడు తేజాస్ మేల్ వాయిస్ ఇచ్చారు. గీత్ బ్యాండ్ మేనేజర్, సినీ గీత రచయిత కృష్ణకాంత్ పాట రాశారు. కరణ్ చావ్లా డైరెక్టర్‌గా వ్యవహరించారు. వ్యక్తిగతంగా ఈ ఆల్బమ్ చాలా ఆనందాన్నిచ్చింది. ఇంకెవరైనా మంచి కాన్సెప్ట్‌తో వస్తే ఇలాంటి ఆల్బమ్స్ చేయడానికి నేను రెడీ. భవిష్యత్తులో సొంత సినిమాల్లో పాడే అవకాశం వస్తే ఫుల్ హ్యాపీ. ఐ లైక్ సిటీ... అర్జున్‌రెడ్డి సినిమా కోసం చాలా రోజులు హైదరాబాద్‌లో ఉన్నాను. ఈ సిటీ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అలాగే నాకు చాలా ఇష్టమైన ప్లేస్‌లు కూడా ఎన్నో ఉన్నాయి. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా నా స్టైలిస్ట్ మేఘనతో చాలా టైమ్ స్పెండ్ చేస్తాను. ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్, చెన్నైకి రాకపోకలు సాగుతున్నాయి. అయితే హైదరాబాద్‌లో సెటిలవుతానా? మరెక్కడైనానా? అనేమీ అనుకోలేదు. సరికొత్త షాలిని... ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో ప్రీతి క్యారెక్టర్ కోసం బరువు పెరిగాను. నిజానికి నేను సన్నగా ఉంటాను. ఆ క్యారెక్టర్‌కి బొద్దుగా ముద్దుగా ఉండడం అవసరం కాబట్టి, దానికి అనుగుణంగా బరువు పెరిగాను. అయితే ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాను. సో... కొత్త పాత్రలో సరికొత్త షాలినీని చూస్తారు మీరు. -
ప్రభుదేవా ఫేస్ ఆఫ్ ఇండియా
తమిళసినిమా: ప్రభుదేవా ఈ పేరు వింటే యువతలో ఉత్సాహం పొంగుతుంది. తామూ సాధించాలనే తపన ఉరకలు వేస్తుంది. 20 ఏళ్లుగా తనదైన నటన, డాన్స్‌తో యువతను ఉర్రూతలూగిస్తున్న ప్రభుదేవా, దర్శక, నిర్మాతగానూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈయన తాజాగా ఒక సంగీత ఆల్బమ్‌ను రూపొందించారు. దాని పేరే ఫేస్ ఆఫ్ ఇండియా. వేల్స్ యూనివర్సిటీ అధినేత కే.గణేశ్‌తో కలిసి ప్రభుదేవా రూపొందించిన ఈ సంగీత ఆల్బమ్‌కు ఏజే దర్శకత్వం వహించారు. దీని గురించి యూనిట్ వర్గాలు తెలుపుతూ గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ మూజికల్ ఆల్బమ్ గ్రామీణ పాటలతో మన దేశంలోని భిన్న సంస్కృతులను, భాషల ప్రాముఖ్యతలను ఆవిష్కరించేదిగా ఉంటుందన్నారు. తరుణ్, వికాశ్, వినోద్, అంజలి జయప్రకాశ్ నటించిన ఈ ఆల్బమ్‌కు దీపక్కుమార్పదీ ఛాయాగ్రహణం అందించారని చెప్పారు. ఈ ఆల్బమ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అదే విధంగా ఆల్బమ్ టీజర్‌ను నటుడు ఆర్జే.బాలాజీ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. -
రెహమాన్ కొత్త ఆల్బమ్ 'ది ఫ్లయింగ్ లోటస్'
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ది ఫ్లయింగ్ లోటస్ పేరుతో కొత్త ఆల్బం ను అందుబాటులోకి తెచ్చారు. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సీటెల్ సింఫోనీ ఆర్కెస్ట్రా మ్యూజిక్ కంపోజిషన్ లో రెహమాన్ కొత్త ఆల్చమ్ తెచ్చారు. రిచార్డో ఆవేర్బాచ్ మార్గదర్శకత్వంలో రెహమాన్ పాడిన 19 నిమిషాల వ్యవధి కలిగిన ఈ పాట సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయనుందని, ప్రధాని నరేంద్రమోదీ గొంతుతో పెద్దనోట్లు రద్దు అంటూ ప్రకటించిన పదాలు ఈ ఆల్బమ్‌లో చోటుచేసుకోవడం ప్రత్యేకత. ఈ సందర్భంగా యూనివర్శిల్ మ్యూజిక్ గ్రూప్ ఇండియా అండ్ సౌత్ ఆసియా సీఈవో దేవరాజ్ సన్యాల్ మాట్లాడుతూ యూనివర్శల్ సంస్థ ఏఆర్ రెహమాన్ తో కలసి ఇటీవల విడుదల చేసిన ఈ ది ఫ్లయింగ్ లోటస్ ఆల్బమ్ కొత్తగా ఉందని, అందరిని సంగీత మాయాజాలంలోకి నెడుతుందని ఆయన ఈ రోజు ప్రకటనలో పేర్కొన్నారు. రెహమాన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రకటన దేశంలో అతిపెద్ద చారిత్రాత్మక ప్రకటన అని అన్నారు. దీనిని స్వాగతించిన వారు, వ్యతిరేకించిన వారు ఉన్నప్పటికీ పాట రూపంలో నమోదు చేసేందుకు సంగీతమాధ్యమాన్ని ఉపయోగించామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యూనివర్శల్ మ్యూజిక్ గ్రూప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. -
బాలీవుడ్ కంపెనీతో పెళ్లిచూపులు హీరో..!
పెళ్లి చూపులు సినిమాతో బిగ్ హిట్ సాధించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో లావణ్య త్రిపాఠితో కలిసి మరో లవ్ స్టోరిని లైన్ లో పెట్టాడు. పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఓ బడా బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయబోతున్నాడు విజయ్. బాలీవుడ్ మ్యూజిక్ కంపెనీ టి సిరీస్ విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లోఒక మ్యూజిక్ ఆల్బం చేయబోతుంది. బాలీవుడ్ టాప్ స్టార్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, సోనమ్ కపూర్ లాంటి వారితో టి సిరీస్ సంస్థ మ్యూజిక్ వీడియోలు రూపొందించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో తెలుగు, హిందీ భాషల్లో మ్యూజిక్ ఆల్బమ్ రెడీ చేస్తోంది. మిక్కి జే మేయర్ సంగీతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాటను అర్మాన్ మాలిక్ గానం చేశాడు. విజయ్ దేవరకొండకు జోడిగా బెంగాలీ నటి కనిపించనుందట. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఈ నెల ఆగష్టు 25 న విడుదలకాబోతుంది. ఈ సినిమాలో విజయ్ దేవేరకొండ కు జంటగా షాలిని హీరోయిన్ గా నటిస్తోంది. -
రెమో కోసం నవ్వొద్దు
రెమో చిత్రం కొసం నవ్వొద్దు అనగానే ఏదేదో ఊహించుకుంటున్నారా? చాలా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం రెమో. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఆయనకు జంటగా కీర్తీసురేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. 24 ఎఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఒక మీడియో ఆల్బమ్‌ను తయారు చేశారు. అందులో పాట పల్లమే సిరిక్కాదే(నవ్వొద్దే). అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు ఇదే చిత్ర నిర్మాత నివీన్ హీరోగా నిర్మిస్తున్న చిత్ర దర్శకుడు రాధాకృష్ణన్ కాన్సెప్ట్‌ను తమారు చేశారు. అర్జున్ కనుంగ, శ్రీనిధి వెంకటేశ్ పాడిన ఈ పాటలో శివకార్తికేయన్, కీర్తీసురేశ్, సంగీతదర్శకుడు అనిరుద్, గాయకులు అర్జున్ కనుంగ, శ్రీనిధి వెంకటేశ్, ఇన్నో చెంగ, యరియ, శశాంక్, విజయ్, కెబజెరిమియా నటించారు. ఈ ప్రచార మ్యూజిక్ వీడియోను తమిళం,ఆంగ్లం భాషల్లో రూపొందించారు. తమిళ వెర్షన్‌ను ఈ నెల 18 సాయంత్రం ఆరు గంటలకు సోనీ చానల్ వైటీ, ట్విట్టర్ ద్వారాను విడుదల చేయనున్నారు. ఒక వారం తరువాత ఆంగ్ల మ్యూజిక్ వీడియోను ఎంటీవీ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.