
ప్రపంచ సంగీత దినోత్సవంలో భాగంగా మెట్రో స్టేషన్లు సంగీత ప్రదర్శనలకు వేదికలుగా మారనున్నాయి. ప్రయాణాలను ఆహ్లాదకరమైన అనుభవాలుగా మారుస్తూ... బుధవారం నుంచి శనివారం వరకూ విభిన్న సంగీత ప్రదర్శనలతో ప్రయాణికులను ఆకట్టుకోనుంది. ‘మెట్రో మెడ్లీ’ పేరిట గోథే–జెంత్రమ్ సహకారంతో మ్యూజికల్ ఫెస్ట్ బస్కింగ్ ఫార్మాట్‌లో ఉంటుంది.
దీని కోసం 200 మంది ఔత్సాహిక సంగీతకారుల నుంచి అనుభవజు్ఞలైన నిపుణుల వరకూ 20 గ్రూపులుగా విభజించారు. ఈ కళాకారులు జాజ్ క్లాసికల్ నుండి బాలీవుడ్ హిట్‌ల వరకూ విభిన్న రకాల సంగీత శైలులను ప్రదర్శిస్తారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకూ, అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, పరేడ్ గ్రౌండ్, ఎంజిబిఎస్, ఉప్పల్ సహా ఏడు మెట్రో స్టేషన్లను ఎంపికచేశారు. సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఔత్సాహిక సంగీత కళాకారులకు బహిరంగ వేదికలను అందించడమే ఈ ప్రదర్శనల లక్ష్యం.