సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండో దశ పనుల్లో భాగంగా ఐదు మార్గాల్లో పనులు జరుగనున్నాయి. మొత్తం ఐదు మార్గాల్లో మెట్రో నిర్మాణం కానుంది. ఆరు కారిడార్లలో 116.4 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మెట్రో నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా రూ.4,230 కోట్లుగా ఉండనుంది.
హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ పనులు జరుగనున్నాయి. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా(30 శాతం) రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా(18 శాతం) రూ.4,230 కోట్లు కేటాయింపులు చేసింది. అలాగే, అప్పుగా రూ.11,693 కోట్లు, ప్రైవేటు సంస్థల నుంచి రూ.1,033 కోట్లు(52 శాతం నిధులు) సేకరించనున్నారు.
కారిడార్లు ఇలా..
కారిడార్-4లో నాగోల్-శంషాబాద్(36.8 కి.మీ)
కారిడార్-5లో రాయదుర్గం-కోకాపేట.
కారిడార్-6లో ఎంజీబీఎస్-చాంద్రాయాణగుట్ట.
కారిడార్-7లోమియాపూర్-పటాన్‌చెరు,
కారిడార్-8లో ఎల్బీనగర్-హయత్‌నగర్.
కారిడార్-9లో ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ.(40 కిలోమీటర్లు).
Comments
Please login to add a commentAdd a comment