ప్రియురాలి తండ్రిపై ప్రేమికుడి కాల్పులు | A Man Shot His Girlfriend Father At Nagole | Sakshi
Sakshi News home page

ప్రియురాలి తండ్రిపై ప్రేమికుడి కాల్పులు

Published Mon, Nov 11 2024 1:41 PM | Last Updated on Mon, Nov 11 2024 1:41 PM

A Man Shot His Girlfriend Father At Nagole

లవర్‌ను తనకు దూరం చేస్తున్నారని దుశ్చర్య
యువతి తండ్రి కంటిలో నుంచి దూసుకెళ్లిన బుల్లెట్‌
నిందితుడు అరెస్టు... ఎయిర్‌గన్, పిస్టల్‌ స్వాదీనం

నాగోల్‌: ప్రేమించిన యువతిని తనకు దూరం చేశారన్న కో పంతో అమ్మాయి తండ్రిపై ఓ యువకుడు కాల్పలకు తెగబడ్డా డు. ఈ దాడిలో అమ్మాయి తండ్రి కన్ను కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సరూర్‌నగర్‌ వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్‌ 14లోని మల్లికారాణి అపార్ట్‌మెంట్‌లో పెరిశెట్టి రేణుక ఆనంద్‌ (57) నివాసం ఉంటున్నారు.

ఆయనకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె పాఠశాలల్లో చదివే సమయంలో తన క్లాస్‌మేట్‌ ఆయన గోగికర్‌ బల్వీర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బల్వీర్‌ ఆమెను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ఆ యువతి దుండిగల్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరటంతో బల్వీర్‌ కూడా అక్కడే చేరాడు. అక్కడ కొంతకాలం వారు కలిసిమెలిసి తిరిగారు. ఈ విషయం ఇంట్లో తెలిసిన యువతి తండ్రి ఆనంద్‌ తన కూతురిని ఇబ్బందులకు గురిచేయవద్దని బల్వీర్‌ను హెచ్చరించాడు.

పగ పెంచుకొని పక్కా ప్లాన్‌తో కాల్పులు
ఆరు నెలల క్రితం బల్వీర్‌ తన స్నేహితుడు గోపికి ఫోన్‌ చేసి తన ప్రేమకు అడ్డు వస్తున్న ఆనంద్‌ను చంపేస్తానని బెదిరించాడు. కొద్దిరోజుల క్రితం ఆనంద్‌ ఇంటివద్దకే వచ్చిన బల్వీర్‌.. ‘నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను’అని గొడవ చేసి ‘ఎన్ని రోజులున్నా నిన్ను చంపేస్తా అని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బల్వీర్‌ తల్లిదండ్రులను పిలిపించిన ఆనందర్‌.. వారి సమక్షంలో బల్వీర్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చి పింపించారు. ఆనంద్‌ తన కూతురిని ఇటీవలే అమెరికాకు పంపించాడు.

దీంతో పగ పెంచుకొన్న బల్వీర్‌ ఆనంద్‌ను హత్య చేయాలని పథకం వేశాడు. షూటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం తెచ్చుకొన్న ఎయిర్‌గన్, షార్ట్‌ గన్‌తో ఆదివారం మధ్యాహ్నం ఆనంద్‌ ఇంటికి వచ్చి ఆయనతో గొడవ పడ్డాడు. వెంటనే ఎయిర్‌గన్‌తో లీగల్‌ పోలీస్, లీగల్‌ పోలీస్‌ అని గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపాడు. బుల్లెట్‌ ఆనంద్‌ కుడికన్నుపై తగిలి తీవ్ర గాయమైంది.

వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిన బల్వీర్‌.. పక్కనే ఉన్న అంబితా శ్రీనిలయం అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆనంద్‌ కారును ధ్వంసం చేసి తన బైక్‌పై పారిపోయాడు. గాయపడిన ఆనంద్‌ను స్థానికులు ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి బల్వీర్‌ను అరెస్టు చేసినట్లు సరూర్‌నగర్‌ సీఐ సైదిరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి ఎయిర్‌గన్, షార్ట్‌గన్‌ (పిస్టల్‌), బైక్, సెల్‌ఫోన్‌ స్వా«దీనం చేసుకొన్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement