nagole
-
రహదారిపై రక్తచరిత్ర
నాగోలు: అది కొత్తపేట– నాగోలు రహదారి.. శుక్రవారం సాయంత్రం.. వాహనాల రొద ఒకవైపు.. జన సంచారం మరో వైపు.. ఇదే సమయంలో అక్కడ వేట కొడవళ్లు విరుచుకుపడ్డాయి. సినీ ఫక్కీలో ఓ గుంపు దారుణంగా దాడికి పాల్పడింది. బాధితుల రోదనలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతమంతా భయాందోళనతో గజగజ వణికిపోయింది. పాత కక్షలతో.. ఒకరిపై గురి పెట్టి వచ్చిన.. తమకు సంబంధం లేని ఇద్దరు యువకులపై వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చైతన్యపురి పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి రెండేళ్ల క్రితం హయత్‌నగర్‌లో జరిగిన పెళ్లి ఊరేగింపు ఏర్పడిన వివాదం నేపథ్యంలో తన స్నేహితుడైన తట్టిఅన్నారంనకు చెందిన బోడ్డు మహేష్ పై బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు గాయాలైన మహేష్ హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కోర్టులో నడుస్తోంది. అయితే.. ఆ తర్వాత వీరిద్దరూ రాజీ కోసం మాట్లాడుకున్నారు. పురుషోత్తం వద్ద మహేష్ కొన్ని డబ్బులు కూడా తీసుకున్నాడు. శుక్రవారం కేసు విషయమై మహేష్ కోర్టుకు రావాల్సి ఉంది. కానీ తాను సూర్యాపేటలో ఉన్నానంటూ కోర్టు కానిస్టేబుల్‌కు చెప్పి పురుషోత్తం హత్యకు పథక రచన చేశాడు. నాగోలు వెళ్లే రోడ్డులోని అమరావతి వైన్స్ వద్ద పురుషోత్తం ఉన్నాడనే పక్కా సమాచారంతో మహేష్ తన స్నేహితులైన బెల్లి భరత్, దాసరి సురేందర్ అలియాస్ సూరి తదితరులు కారు, బైక్‌లపై వచ్చారు. పురుషోత్తంపై వేట కొడవలితో దాడి చేయబోగా అతను తప్పించుకున్నాడు. దీంతో పురుషోత్తం స్నేహితులైన సికింద్రాబాద్ తుకారాం గేట్‌కు చెందిన గడ్డమోయిన రాము, నాగోలు తట్టిఅన్నారంనకు చెందిన పాశం నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు సమీపంలోని ఓ బ్యాంకులో తలదాచుకున్న రాముపై వేట కొడవళ్లతో దాడి చేయడంతో ఆ ప్రాంతమంతా రక్తం మడుగును తలపించింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు చైతన్య పురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావుతో వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు. హిట్ అండ్ రన్.. బీటెక్ విద్యార్థి దుర్మరణం -
ప్రియురాలి తండ్రిపై ప్రేమికుడి కాల్పులు
నాగోల్: ప్రేమించిన యువతిని తనకు దూరం చేశారన్న కో పంతో అమ్మాయి తండ్రిపై ఓ యువకుడు కాల్పలకు తెగబడ్డా డు. ఈ దాడిలో అమ్మాయి తండ్రి కన్ను కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14లోని మల్లికారాణి అపార్ట్మెంట్లో పెరిశెట్టి రేణుక ఆనంద్ (57) నివాసం ఉంటున్నారు.ఆయనకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె పాఠశాలల్లో చదివే సమయంలో తన క్లాస్మేట్ ఆయన గోగికర్ బల్వీర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బల్వీర్ ఆమెను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ఆ యువతి దుండిగల్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరటంతో బల్వీర్ కూడా అక్కడే చేరాడు. అక్కడ కొంతకాలం వారు కలిసిమెలిసి తిరిగారు. ఈ విషయం ఇంట్లో తెలిసిన యువతి తండ్రి ఆనంద్ తన కూతురిని ఇబ్బందులకు గురిచేయవద్దని బల్వీర్‌ను హెచ్చరించాడు.పగ పెంచుకొని పక్కా ప్లాన్‌తో కాల్పులుఆరు నెలల క్రితం బల్వీర్ తన స్నేహితుడు గోపికి ఫోన్ చేసి తన ప్రేమకు అడ్డు వస్తున్న ఆనంద్‌ను చంపేస్తానని బెదిరించాడు. కొద్దిరోజుల క్రితం ఆనంద్ ఇంటివద్దకే వచ్చిన బల్వీర్.. ‘నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను’అని గొడవ చేసి ‘ఎన్ని రోజులున్నా నిన్ను చంపేస్తా అని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బల్వీర్ తల్లిదండ్రులను పిలిపించిన ఆనందర్.. వారి సమక్షంలో బల్వీర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పింపించారు. ఆనంద్ తన కూతురిని ఇటీవలే అమెరికాకు పంపించాడు.దీంతో పగ పెంచుకొన్న బల్వీర్ ఆనంద్‌ను హత్య చేయాలని పథకం వేశాడు. షూటింగ్ ప్రాక్టీస్ కోసం తెచ్చుకొన్న ఎయిర్‌గన్, షార్ట్ గన్‌తో ఆదివారం మధ్యాహ్నం ఆనంద్ ఇంటికి వచ్చి ఆయనతో గొడవ పడ్డాడు. వెంటనే ఎయిర్‌గన్‌తో లీగల్ పోలీస్, లీగల్ పోలీస్ అని గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆనంద్ కుడికన్నుపై తగిలి తీవ్ర గాయమైంది.వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిన బల్వీర్.. పక్కనే ఉన్న అంబితా శ్రీనిలయం అపార్ట్మెంట్లో ఉన్న ఆనంద్ కారును ధ్వంసం చేసి తన బైక్‌పై పారిపోయాడు. గాయపడిన ఆనంద్‌ను స్థానికులు ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి బల్వీర్‌ను అరెస్టు చేసినట్లు సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి ఎయిర్‌గన్, షార్ట్‌గన్ (పిస్టల్), బైక్, సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకొన్నట్లు వెల్లడించారు. -
మెట్రో రెండో దశ పనులకు గ్రీన్‌సిగ్నల్.. కారిడార్-9లో ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండో దశ పనుల్లో భాగంగా ఐదు మార్గాల్లో పనులు జరుగనున్నాయి. మొత్తం ఐదు మార్గాల్లో మెట్రో నిర్మాణం కానుంది. ఆరు కారిడార్లలో 116.4 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మెట్రో నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా రూ.4,230 కోట్లుగా ఉండనుంది.హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ పనులు జరుగనున్నాయి. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా(30 శాతం) రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా(18 శాతం) రూ.4,230 కోట్లు కేటాయింపులు చేసింది. అలాగే, అప్పుగా రూ.11,693 కోట్లు, ప్రైవేటు సంస్థల నుంచి రూ.1,033 కోట్లు(52 శాతం నిధులు) సేకరించనున్నారు.కారిడార్లు ఇలా.. కారిడార్-4లో నాగోల్-శంషాబాద్(36.8 కి.మీ)కారిడార్-5లో రాయదుర్గం-కోకాపేట. కారిడార్-6లో ఎంజీబీఎస్-చాంద్రాయాణగుట్ట. కారిడార్-7లోమియాపూర్-పటాన్చెరు, కారిడార్-8లో ఎల్బీనగర్-హయత్‌నగర్. కారిడార్-9లో ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ.(40 కిలోమీటర్లు). -
హృదయ విదారకం: కుమారుడి మృతదేహం పక్కనే మూడురోజులుగా..!
సాక్షి,నాగోలు : హైదరాబాద్‌లోని నాగోలులో పోలీసులను కంటతడి పెట్టించే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కుమారుడు చనిపోయినా అంధ వృద్ధ తల్లిదండ్రులు గుర్తించకపోవడం కలచి వేస్తుంది. నాగోలు పోలీసుల కథనం ప్రకారం.. నాగోలులో అంధుల కాలనీలో కలువ రమణ, శాంతికుమారి దంపతులు నివసిస్తున్నారు. వారి చిన్న కుమారుడు ప్రమోద్(32) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. మూడు రోజుల క్రితం ప్రమోద్ మద్యం మత్తులో మరణించారు.అయితే కుమారుడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించ లేకపోయారు. ఓ వైపు ఆకలి.. మరోవైపు కుమారుడు చనిపోయిన విషయాన్ని గుర్తించ లేక మూడు రోజుల పాటు ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండిపోయారు. మూడు రోజుల త్వరాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నాగోలు సీఐ సూర్యనాయక్, ఎస్ఐ శివనాగప్రసాద్లు మానవత్వం చాటుకున్నారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండగా.. మంచంపై తల్లిని, కొద్ది దూరంలో తండ్రిని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ఉన్న దంపతుల్ని మాట్లాడించే ప్రయత్నం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో ఇద్దరూ మాట్లాడలేకపోతున్నారు. వెంటనే వాళ్లిద్దరిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. దంపతులకు స్నానం చేయించారు. ఆహారం,మంచినీళ్లు అందించారు.అనంతరం, వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
ఫ్రీ పార్కింగ్ కోసం ధర్నా
-
నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, సాక్షి: నాగోల్‌లోని ఓ ప్రముఖ హోటల్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నెర గ్రాండ్ హోటల్లో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు హోటల్లో జరిగిన ఎంగేజ్మెంట్ పంక్షన్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. -
నాగోల్: నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ యువతి హల్చల్
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో యువత చేసే వీరంగం ఎక్కువైపోతుంది. పగలు రాత్రి తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపైనే మద్యం సేవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఓ యువతి మద్యం మద్యం మత్తులో హల్చల్ చేసింది. నాగోల్ డివిజన్లోని ఫతుల్లాగూడ సమీపంలో శుక్రవారం ఉదయమే ఓ యువతి, యువకుడు కారులో వచ్చి నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ కనిపించారు.రోడ్డుపై మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ అక్కడికి వచ్చే వాకర్స్‌కు ఇబ్బంది కలిగించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని కొంతమంది చెప్పగా.. వారిపై జంట ఎదురుతిరిగింది. మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. పోలీసులకు ఫోన్ చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. అడ్డుకుని దుర్భాషలాడారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే యువతి, యువకుడు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ అడిగిన వారితో గొడవ పెట్టుకున్న యువతీ యువకుడుమద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను బూతులు తిట్టిన యువతిహైదరాబాద్ - నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో… pic.twitter.com/DY6d2hI7Vq— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024 -
Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
నాగోలు: అక్కడ రోడ్డు గుంతలమయంగా మారింది. నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవం లేదు. ఇదే రూట్లో ఓ మహిళ రెండుసార్లు యాక్సిడెంట్‌కు గురైంది. అంతే.. ఆమెకు మండింది. బురద గుంతలో కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. సమస్యకు పరిష్కారం చూపాలని ప్లకార్డులు ప్రదర్శించింది. ఇంకేం.. అటుగా పోయేవాళ్లు స్మార్ట్ఫోన్లతో అదంతా ఫొటోలు, వీడియోలు తీయడంతో ఆమె వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్ పరిధిలోని న్యూ జీవీఆర్ కాలనీకి చెందిన నిహారిక ప్రైవేట్ ఉద్యోగి. అమె ఇద్దరు పిల్లలు బండ్లగూడ పరిధిలోని ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రతి రోజూ ఆమె వారిని బైక్‌పై పాఠశాలకు తీసుకెళ్తుంది. నాగోలు బండ్లగూడ రేడియల్ రోడ్డు కొంతకాలంగా గుంతలమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిహారిక కూడా గతంలో ఇదే రోడ్డుపై అదుపుతప్పి కింద పడింది. దీంతో రేడియల్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు సంబంధిత అధికారులకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా విజ్ఞప్తి చేసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా గురువారం ఆమె స్యూటీపై నాగోలు వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి పిల్లలతో సహా కింద పడింది. స్వల్ప గాయాలు కావడంతో పిల్లలను ఇంటి వద్ద వదిలి ఘటనా స్థలానికి తిరిగి వచ్చి ఆమె రోడ్ల దుస్థితిపై ఏడాదిగా మేయర్, అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ బురదలో కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అమె నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపింది. నాగోలు కార్పొరేటర్ భర్త చింతల సురేందర్ యాదవ్, నాగోలు పోలీసులు అక్కడికి వచ్చి రోడ్ల మరమ్మతుకు నిధులు మంజారుయ్యాయని ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేదని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా, ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ముందుస్తుగా గుంతలను మట్టితో పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పడంతో నిహారిక నిరసన విరమించింది. కోడ్ ముగియగానే పనులు చేపడతాం నాగోలు–ఆనంద్‌నగర్ రోడ్డు మరమ్మతుల కోసం రూ. 4 కోట్లు నిధులు మంజురయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేదు. ఎన్నికల కోడ్ ముగియగానే పనులు చేపడతాం. :::డాక్టర్ తిప్పర్తి యాదయ్య, హయత్‌నగర్ సర్కిల్ డీసీ -
నాగోల్‌లో 2 మెట్రో స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: నాగోల్‌లో కొత్తగా ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఇప్పుడున్న స్టేషన్‌కు సమీపంలో ఎడమవైపున (ఎల్బీ నగర్ వైపు) ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్కైవాక్‌ను నిర్మిస్తారు. రాయదుర్గం, అమీర్‌పేట కారిడార్‌లో నాగోల్‌కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఈ స్కైవాక్ మార్గంలో కొత్తగా నిర్మించే నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు కొత్త కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎయిర్‌పోర్టు మెట్రో రెండో దశలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నాగోల్ –శంషాబాద్ ఎయిర్‌పోర్టు కారిడార్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి పర్యటించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల దూరం ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన సిస్టా ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ అలైన్మెంట్లో నిర్మించనున్న మెట్రోస్టేషన్లు, అలైన్‌మెంట్‌పై అధికారులకు, ఇంజనీరింగ్ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. అలైన్మెంట్ ఇలా...♦ నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో అలైన్‌మెంట్‌ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపనున్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించనున్నారు. ♦ మూసీ దాటిన తరువాత కొత్తపేట వైపున్న రోడ్డుకు కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు సదుపాయంగా ఉండేలా మరో స్టేషన్‌ను నిర్మించనున్నారు. నాగోల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్‌రింగ్‌రోడ్డుకు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్♦ చాంద్రాయణగుట్ట వద్ద విశాలమైన ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రూట్ లో ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, కొత్త టెర్మినల్ స్టేషన్ పనులు ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్‌ఫాంల ఎత్తును సరిచేయాల్సి ఉంటుందన్నారు.ఎల్బీనగర్లో మరో స్కైవాక్.. ♦ కామినేని ఆసుపత్రి వద్ద ఒక స్టేషన్ నిర్మించనున్నారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జంక్షన్లో కొత్తగా ఎల్బీనగర్ ఎయిర్‌పోర్టు స్టేషన్ రానుంది. ఈ మార్గంలో అండర్‌పాస్‌తోపాటు, రెండు ఫ్లైఓవర్లతో మెట్రో కారిడార్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ♦ ఎల్బీనగర్ జంక్షన్‌కు కుడి వైపున కొత్తగా నిర్మించనున్న మెట్రోస్టేషన్ నుంచి ఎడమవైపున ఉన్న మరో స్టేషన్ (మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్)కు మరో విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానం చేయనున్నారు. మియాపూర్, అమీర్‌పేట మీదుగా ఎల్బీ నగర్‌కు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుంచి స్కైవాక్ మార్గంలో ఎల్బీనగర్ కొత్త ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. ♦ బైరామల్‌గూడ, సాగర్‌రింగ్ రోడ్డు కూడలిలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లైఓవర్లు ఉన్నందున ఈ రూట్లో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ జంక్షన్లో మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, అలైన్‌మెంట్‌ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్‌ను నిర్మించనున్నారు. ♦ మైత్రీ నగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లను చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అందుబాటులో ఉండేలా కూడళ్లకు సమీపంలో నిర్మించనున్నారు. -
హైదరాబాద్ నాగోల్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం
-
నాగోల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
68 ప్రమాదాలు.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు! గేదెలకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనతో పాటు వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 ప్రమాదాలు జరిగాయని, గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైళ్లు దెబ్బతిన్నాయని సతీష్‌రెడ్డి అన్నారు. నాగోలులో ఆయన మాట్లాడుతూ, మోదీ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారని, దయచేసి అటువైపు వెళ్లొద్దు.. మీరు పొరపాటున తాకినా రైలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలే ఆ రైళ్లు చాలా వీక్‌గా ఉంటాయి’’ అని గేదెలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకే వందే భారత్ స్కీంను ప్రధానమంత్రి మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్రెడ్డి, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పట్టెడన్నం కోసం..ప్రాణాలే పణంగా!.. గత ఏడాదిలోనే 17 మంది మృతి -
Hyderabad: భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, హైదరాబాద్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లి సముద్రంలో మునిగి నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోలు డివిజన్ బండ్లగూడ అజయ్నగర్లో నివాసం ఉండే రాముని రవీందర్ చిన్న కుమారుడు వంశీకృష్ణ (27) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో పక్క గ్రూప్–1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23న కర్మన్‌ఘాట్‌కు చెందిన యువతితో వివాహమైంది. ఈ నెల 13న భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహారయాత్రకు వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. ఈ నెల 22న ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. అతను సముద్రంలోకి వెళ్లే సమయంలో అక్కడి నిర్వాహకులు సూచించిన ప్రకారం కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు. కానీ వంశీకృష్ణ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు. భార్య అతని రాకకోసం చాలాసేపు ఎదురు చూసినా పైకి రాలేదు. దీంతో సముద్రంలో గల్లంతైనట్లు భావించి అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలికి బయలుదేరి వెళ్లారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంశీకృష్ణ (ఫైల్) -
హైదరాబాద్ మెట్రో.. కేటీఆర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో సేవలకు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బిజీ రూట్‌గా పేరున్న ఎల్బీ నగర్ మార్గంలో హయత్ నగర్ వరకు రూట్‌ను పొడగింపు ఉంటుందని ప్రకటించారు. మంగళవారం నాగోల్-ఫిర్జాదిగూడ లింక్ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హయత్ నగర్ వరకు మెట్రో పొడగింపు ఉండనుందని తెలిపారు. అంతేకాదు.. నాగోల్-ఎల్బీ నగర్ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేసి తీరతామని మంత్రి కేటీఆర్ హమీ ఇచ్చారు. -
నాగోల్ కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరం
-
హైదరాబాద్: బంగారం చోరీ కేసులో మరో ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో దుండగులు ఉపయోగించిన బైక్‌లు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వారు చోరీ చేసిన వాహనాలతోనే దోపిడీకి నిందితులు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఫింగర్ ప్రింట్స్, సీసీ ఫుటేజీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. దుండగులందరూ 25 ఏళ్ల యువకులు కాగా, ముఖం కనిపించకుండా ఫేస్ మాస్క్‌లు ధరించినట్టు బాధితులు చెబుతున్నారు. అయితే, కల్యాణ్ చౌదరి (34) స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ.. ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్‌లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్‌ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్ చౌదరితో పాటు సుఖ్‌దేవ్ గాయపడ్డారు. బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్‌దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
నాగోల్ కాల్పుల బాధితులను పరామర్శించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్
-
నాగోల్ స్నేహపూరి కాలనీలో కాల్పులు
-
హైదరాబాద్: జ్యువెలరీ షాప్‌లో దోపిడీకి పక్కా స్కెచ్? కాల్పులు జరిపి భారీ చోరీ
సాక్షి, చైతన్యపురి/నాగోలు: జ్యువెలరీ దుకాణంలో చొరబడిన దుండగులు షాపు యజమాని సహా మరొకరిపై కాల్పులు జరిపి బంగారు ఆభరణాలతో ఉడాయించిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ పాలి జిల్లా లోటోపి గ్రామానికి చెందిన కల్యాణ్ చౌదరి (34) పదేళ్ల క్రితం స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ.. ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్‌లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్‌ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్ చౌదరితో పాటు సుఖ్‌దేవ్ గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం సుఖ్‌దేవ్ చేతిలోని బ్యాగ్‌ను దుండగులు లాక్కున్నారు. దుకాణంలో నుంచి కాల్పుల శబ్దాలు రావటంతో దుకాణం వద్దకు స్థానికులు కొందరు చేరుకున్నారు. వారిలో కొందరు షాపు షటర్ తీసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆగంతుకులు తుపాకీ చూపించి భయపెడుతూ.. వారు వచ్చిన బైక్‌లపై పరారయ్యారు. స్థానికులు వెంటపడినప్పటికీ ఆర్కేపురం వైపు వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, చైతన్యపురి ఇన్స్పెక్టర్ మధుసూధన్ క్రైం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని నాగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దుకాణం యజమాని కల్యాణ్ చెవికి బుల్లెట్ తగలగా, సుఖ్‌దేవ్‌కు ఒకటి మెడకు, మరొకటి వీపు వెనుక భాగంలో తగిలింది. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సుఖ్‌దేవ్‌ను అనుసరించే వచ్చారా? హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్‌ను అనుసరించే దుండగులు వచ్చి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సుఖ్‌దేవ్ వద్ద ఉన్న నగల బ్యాగ్‌ను మాత్రమే తీసుకుని పారిపోవటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. పక్కా స్కెచ్ ప్రకారమే కాల్పులు జరిపి బంగారంతో ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్‌దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. -
నాగోల్ లో ఫ్లైఓవర్ ప్రారంభించిన కేటీఆర్
-
నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద రూ. 143 కోట్లతో 990 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీంతో నాగోల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నామన్నారు. నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్లాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. లేదంటే బెంగళూరు తరహాలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎఎస్సార్డీపీ కార్యక్రమాన్ని తీసుకుమని.. రూ. 8వేల52 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం 32 ప్రాజెక్టులు పూర్తికగా 16 ఫ్లై ఓవర్లు ఉన్నాయన్నారు. ‘హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు అవి తగ్గిపోయాయి. ఎల్బీనగర్ నియోజకవర్గలో 700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులు పూర్తి చేశాం. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం. ఎల్బీనగర్ ప్రాంతంలో 600 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశాం. భవిష్యత్తు తరాలకు మెరుగైన వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మౌలిక వసతులతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. రాజకీయాలు ఎన్నికల అప్పుడు చేద్దాం. ఇప్పుడు అభివృద్ధి పై ఫోకస్ చేద్దాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. As the #NagoleFlyover is all set for inauguration by @TSMAUDOnline Minister Sri @KTRTRS today, here's a quick recap of all Road over Bridges (RoBs) & Road under Bridges (RuBs) that #Telangana Govt. has built in #Hyderabad in last 8 years.#SRDP #HappeningHyderabad@TelanganaCMO pic.twitter.com/KyIH67gybQ — Telangana Digital Media Wing (@DigitalMediaTS) October 26, 2022 తీరనున్న ట్రాఫిక్ కష్ట్రాలు రెండు వైపుల ప్రయాణించేలా ఉన్న ఫ్లైఓవర్‌ను జీహెచ్ఎంసీ సర్వాంగ సుందరంగా తీర్చదిద్దింది. ఒక్కోవైపు మూడు లేన్లతో ఉన్న ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కావడంతోపాటు నాగోల్ చౌరస్తా వద్ద, బండ్లగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు 75 శాతం పరిష్కారం కానున్నాయి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ల మీదుగా ఉప్పల్ వరకు వచ్చేవారు ఈ ఫ్లైఓవర్‌తో సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇది 16వ ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ ద్వారా పూర్తయిన పనుల్లో ఇది 16వ ఫ్లైఓవర్. ఇప్పటికే 15 ఫ్లైఓవర్లతోపాటు 5 అండర్‌పాస్‌లు, 7 ఆర్ఓబీ/ఆర్‌యూబీలు, దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జి, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ పరిసరాల్లోని నాలుగు జంక్షన్లలో రూ. 448 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. సులభ ప్రయాణం.. 2015 సర్వే మేరకు నాగోలు జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు 7,535 వాహనాలు(పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 12,648కి చేరుకోనుందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.దేవానంద్ తెలిపారు. సిగ్నళ్లు లేని సాఫీ ప్రయాణం వల్ల వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా కావడంతోపాటు వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఎస్సార్డీపీ అధికారులు కె. రమేష్ బాబు, రోహిణి, జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు నాగోలు ప్లైఓవర్‌ను పరిశీలించారు. -
నాగోలు ఫ్లై ఓవర్.. ఎల్బీనగర్– సికింద్రాబాద్ మధ్య ఇక రయ్రయ్
సాక్షి, హైదరాబాద్/నాగోలు: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన పనుల్లో మరో ఫ్లై ఓవర్ నేటినుంచి అందుబాటులోకి రానుంది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఒక్కోవైపు మూడు లేన్లతో ఉన్న ఈ ఫ్లైఓవర్ వినియోగంతో ఎల్బీనగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కావడంతోపాటు నాగోల్ చౌరస్తా వద్ద, బండ్లగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు 75 శాతం పరిష్కారం కానున్నాయని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ల మీదుగా ఉప్పల్ వరకు వచ్చేవారు ఈ ఫ్లైఓవర్‌తో సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇది 16వ ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ ద్వారా పూర్తయిన పనుల్లో ఇది 16వ ఫ్లైఓవర్. ఇప్పటికే 15 ఫ్లైఓవర్లతోపాటు 5 అండర్‌పాస్‌లు, 7 ఆర్ఓబీ/ఆర్‌యూబీలు, దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జి, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ పరిసరాల్లోని నాలుగు జంక్షన్లలో రూ. 448 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నిర్మాణమైన నాగోల్ ఫ్లైఓవర్ ఇవ్వాళటి నుండి అందుబాటులోకి వస్తుంది. ఆరు లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవు ఉంది. @TSMAUDOnline @GHMCOnline pic.twitter.com/a4S5UsKti4 — KTR (@KTRTRS) October 26, 2022 సులభ ప్రయాణం.. 2015 సర్వే మేరకు నాగోలు జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు 7,535 వాహనాలు(పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 12,648కి చేరుకోనుందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.దేవానంద్ తెలిపారు. సిగ్నళ్లు లేని సాఫీ ప్రయాణం వల్ల వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా కావడంతోపాటు వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఎస్సార్డీపీ అధికారులు కె. రమేష్ బాబు, రోహిణి, జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు నాగోలు ప్లైఓవర్‌ను పరిశీలించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్‌ఛానెల్‌తో గుండెను తరలించిన మెట్రో
సాక్షి,హైదరాబాద్: నగరవాసులకు అవసరమైన సహాయం చేయడానికి తామెప్పుడూ ముందే ఉంటామని మరోసారి ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ నిరూపించింది. గతంలో ఫిబ్రవరి 2021లో ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ నుంచి ఓ ప్రాణం కాపాడటానికి గుండెను తరలించాలని ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎస్ఓఎస్కు కాల్ వచ్చిందో అదే తరహాలో మరోసారి కాల్ వచ్చింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో.. సెప్టెంబర్ 26న తెల్లవారుజూమున గ్రీన్ ఛానెల్ ఏర్పాటుచేయడంతో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌కు గుండెను రవాణా చేసింది. కాగా, గుండె తరలింపులో భాగంగా ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ డాక్టర్లు , ఇతర మెడికోలు.. రాత్రి ఒంటి గంట సమయంలో నాగోల్ మెట్రోస్టేషన్ వద్దకు గుండెను తీసుకువచ్చారు. అనంతరం, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి కేవలం 25 నిమిషాల్లోనే గుండెను ప్రత్యేక రైలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్‌కు చేర్చారు. తర్వాత, అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి చేర్చారు. ఈ స్పెషల్ ఆపరేషన్ కోసం లైన్-3 సెక్యూరిటీ అధికారులతో పాటుగా మెట్రో అధికారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగేలా చేశారు. ఈ సందర్భంగా ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రయాణీకుల సేవకు హైదరాబాద్ మెట్రో రైల్ కట్టుబడి ఉంటుంది. అవసరమైన సమయంలో వారికి సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. మా అవసరం ఎక్కువగా ఉన్నవారికి, అవసరమైన సమయంలో తోడుండాలనేది మా సిద్ధాంతం. ఈసారి కూడా మేము గ్రీన్‌ఛానెల్ ఏర్పాటుచేయడంతో పాటుగా వీలైనంత త్వరగా గుండెను తరలించి, ఓ ప్రాణం కాపాడాము. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్ఎంఆర్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము’ అని అన్నారు. కాగా, ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులోనే ఉన్నాయి. ఓవైపు.. క్రికెట్ అభిమానులకు తరలిస్తూనే.. అటు మెట్రో అధికారులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడం విశేషం. మ్యాచ్ సందర్భంగా దాదాపు 20వేల మంది క్రికెట్ ఫ్యాన్స్ మెట్రో ప్రయాణించినట్టు సమాచారం. -
Hyderabad Metro: అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్‌ఛానెల్‌తో గుండెను తరలించిన మెట్రో
-
ఆటో డ్రైవర్ నకిలీ పోలీస్‌గా మారి.. అత్యాచార, చోరీ కేసులున్నాయంటూ
సాక్షి, హైదరాబాద్: నకిలీ పోలీస్ అవతారమెత్తిన ఓ ఆటో డ్రైవర్ సీనియర్ వృద్ధులే లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నాడు. ఈ పాత నేరస్తుడుని ఎల్బీనగర్ పోలీస్‌లు అరెస్టు చేసి 16 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 11.000 నగదు, సెల్ పోన్ ఒక కత్తిని స్వాధీనం చేసుకుని ఆదివారం రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ పోలీస్‌లు తెలిపిన మేరకు..నల్గొండ జిల్లా దేవత్‌పల్లి తండాకు చెందిన రమావత్ నరేష్(30) రామంతపూర్‌లో నివాసం ఉంటూ ఆటో నడుపుతుంటాడు. డబ్బు సరిపోక పోవడంతో నేరాల బాట పట్టాడు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో గత నెల 28 చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్‌ను తన ఆటోలో ఎక్కించుకుని.. నేను చైతన్యపురి పోలీస్ అధికారి అని చెప్పి.. నువ్వు బంగారు గొలుసు దొంగిలించావని బెదిరించాడు.అలా అతని వద్ద ఉన్న బంగారు ఉంగరం, రూ. 20 వేల నగదు దోచుకొని వెళ్లాడు. గత నెల 30న ఎల్బీనగర్ లోని విజయవాడ బస్టాప్‌లో నిలబడిన వ్యక్తిని బెదిరించి రూ. 1500 నగదు దోచుకుని పారిపోయాడు. ఈ నెల 1న నాగోలు చౌరస్తాలో ఓ సీనియర్ సిటిజన్ (62) వ్యక్తి వద్దకు వెళ్లి ఎస్ఐగా బెదిరించి ఆటోలో ఎక్కించున్నాడు. బంగారు ఉంగరాన్ని దోచుకుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీస్‌లు దర్యాపు చేపట్టి శనివారం ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో అనుమానాస్పద తిరుగుతుండగా రమావత్ నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దోపిడీలకు పాల్పడినట్లు ఓప్పుకున్నాడు. అతని వద్ద నుండి రూ.80 వేల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికి వచ్చి..