
స్థానికులు ధ్వంసం చేసిన బైకు
బైక్‌పై కళాశాలకు వెళ్తున్న సూడాన్ విద్యార్థి రోడ్డు దాటుతున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఇద్దరు వాహనదారుల మధ్య వాగ్వాదం జరిగింది.
నాగోలు : బైక్‌పై కళాశాలకు వెళ్తున్న సూడాన్ విద్యార్థి రోడ్డు దాటుతున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఇద్దరు వాహనదారుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు సూడాన్ విద్యార్థిదే తప్పని అతడిపై దాడి చేసి బైక్‌ను ధ్వంసం చేశారు. ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సూడాన్‌కు చెందిన హమ్జాద్ సయ్యద్ ఖలీఫ్ స్నేహితుడితో కలిసి మలక్‌పేటలో ఉంటూ దేశ్‌ముఖ్ గ్రామంలోని సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నం తన స్నేహితుడితో కలిసి బైక్‌పై కళాశాలకు బయలుదేరాడు.
ఎల్బీనగర్ సవేరా వైన్స్ వద్దకు రాగానే రోడ్డు దాటుతున్న మరో వాహనాన్ని ఢీకొట్టాడు. ఇద్దరు వాహనదారుల మధ్య స్వల్పవివాదం జరిగింది. సూడాన్ దేశస్తుడు మలక్‌పేటలో ఉండే తన స్నేహితులకు ఫోన్ చేశాడు. వారు అక్కడికి చేరుకొనే లోపే స్థానికులు సూడాన్ దేశస్తుడిదే తప్పని, అతడిపై దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చేలోపు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా బాధిత సూడాన్ విద్యార్థి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.