
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో యువత చేసే వీరంగం ఎక్కువైపోతుంది. పగలు రాత్రి తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపైనే మద్యం సేవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఓ యువతి మద్యం మద్యం మత్తులో హల్‌చల్ చేసింది. నాగోల్ డివిజన్‌లోని ఫతుల్లాగూడ సమీపంలో శుక్రవారం ఉదయమే ఓ యువతి, యువకుడు కారులో వచ్చి నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ కనిపించారు.
రోడ్డుపై మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ అక్కడికి వచ్చే వాకర్స్‌కు ఇబ్బంది కలిగించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని కొంతమంది చెప్పగా.. వారిపై జంట ఎదురుతిరిగింది. మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. పోలీసులకు ఫోన్ చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. అడ్డుకుని దుర్భాషలాడారు.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే యువతి, యువకుడు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ అడిగిన వారితో గొడవ పెట్టుకున్న యువతీ యువకుడు
మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను బూతులు తిట్టిన యువతి
హైదరాబాద్ - నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో… pic.twitter.com/DY6d2hI7Vq— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024
Comments
Please login to add a commentAdd a comment