Drunk and Drive
-
HYD: మద్యం మత్తులో యువతి హల్చల్.. బైక్‌ను ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన యువతి అతి వేగంతో కారు నడిపి బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. మద్యం సేవించిన యువతి కారు నడిపి కూకట్‌పల్లిలో గురువారం అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవ్ చేసి ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌కు గాయాలు కావడంతో సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా 212 పాయింట్స్ రీడింగ్ నమోదైంది. దీంతో, ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
మందుబాబుల రచ్చ.. జబర్దస్త్ మించిన కామెడీ
-
ఆరంభం అదిరింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ... ఈ ‘ముగ్గురు పోలీసులు’ ఏర్పాటు చేసిన బందోబస్తు, విధించిన ఆంక్షలు ఫలితాలనిచ్చాయి. కొత్త సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జరిగాయి. మొత్తమ్మీద ఒక్క ప్రమాదం కూడా నమోదు కాకుండా జీరో యాక్సిడెంట్ నైట్‌గా చేయడంలో అధికారులు సఫలీకృతమయ్యారు. స్థానిక పోలీసులతో పాటు అదనపు బలగాలూ మంగళవారం రాత్రంతా విధుల్లోనే ఉన్నాయి. నగరంలోని కీలక ప్రాంతాలతో పాటు ఇన్నర్/ఔటర్ రింగ్ రోడ్ల్లోనూ నిరంతరం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. వేడుకలు నిర్వహించే, జరుపుకొనేవారు సైతం ఇతరులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. మద్యం తాగి వాహనాలు పడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం తదితర ఉల్లంఘనలపై ట్రాఫిక్ విభాగాల అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించారు. మొత్తమ్మీద మూడు కమిషనరేట్లలోనూ కలిపి 2,646 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. కొన్నింటికి మినహాయింపు.. గతంలో జరిగిన ప్రమాదాలు, ఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేశారు. ప్రత్యామ్నాయ మార్గం లేని కారణంగా బేగంపేట, డబీర్‌పురా వంటి కొన్ని ఫ్లైఓవర్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. పీవీ నరసింహారావు మార్గ్, ఎన్టీఆర్ మార్గ్‌లతో పాటు హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల వాహనాలను అనుమతించలేదు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేలోనూ కొన్ని ఆంక్షలు కొనసాగాయి. కమిషనరేట్లలోని ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు వాహన చోదకుల వేగాన్ని నియంత్రించారు. పోలీసులు, ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా డిసెంబర్ 31 ప్రశాంతంగా పూర్తయింది. బుధవారం తెల్లవారుజాము 2 గంటల తర్వాత ఫ్లైఓవర్లు, 3 గంటలకు ట్యాంక్‌బండ్, 5 గంటలకు నెక్లెస్‌రోడ్, ఓఆర్ఆర్ల్లోకి సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించారు. చుక్కేసి.. చిక్కేశారు! పోలీసు విభాగం ఎన్ని సూచనలు చేసినా.. ఎంతగా హెచ్చరించినా.. మందుబాబులు మాత్రం మారలేదు. డిసెంబర్ 31 నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం తాగి అనేక మంది వాహనాలు నడిపేశారు. ఈ నేపథ్యంలో మూడు కమిషనరేట్లలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 2,646 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ కమిషరేట్ పరిధిలోనే 1,184 మంది చిక్కారు. సైబరాబాద్‌లో 839 మంది, రాచకొండలో 619 మంది పట్టుబడ్డారు. వీరిలో ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువ మంది ఉన్నారు. మంగళవారం రాత్రి 9 నుంచి బుధవారం తెల్లవారుజాము 5 గంటల వరకు ఈ చెకింగ్స్ నడిచాయి. చిక్కిన మందుబాబుల నుంచి వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. వీరికి కుటుంబం సభ్యుడు లేదా సంరక్షకుడి సమక్షంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆపై వీరిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. 100 ఎంఎల్ రక్తంలో 30 ఎంజీ కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటే దాన్ని డ్రంక్ డ్రైవింగ్‌గా పరిగణిస్తారు. ఈ పరిమాణాన్నే సాంకేతికంగా బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) అంటారు. పంజగుట్ట ట్రాఫిక్ ఠాణా పరిధిలోని వెంగళ్రావునగర్ పార్క్ దగ్గర మంగళవారం రాత్రి 10.53కు చిక్కన ద్విచక్ర వాహన చోదకుడికి ఏకంగా ఈ కౌంట్ 550 వచ్చింది. -
డ్రంకన్ డ్రైవ్ కేసులో యువతికి విభిన్నమైన బెయిల్
బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారకుడైన ఓ యువకుడితో పాటు ఆయన స్నేహితురాలికి న్యాయమూర్తి విభిన్నమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వెస్ట్‌మారేడుపల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే తీగుళ్ల దయాసాయిరాజ్ (27), ఆయన స్నేహితురాలు గత నెల 27న ఫిలింనగర్ సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ఓ విందులో మద్యం తాగారు. అర్ధరాత్రి 2.30 గంటలకు దయాసాయిరాజ్ తన బెంజ్ కారు (టీఎస్ 10ఎఫ్ఎఫ్ 9666)లో స్నేహితురాలిని పక్కన కూర్చోబెట్టుకుని మితిమీరిన వేగంతో వస్తున్నాడు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డునంబర్–45 వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డివైడర్‌తో పాటు విద్యుత్ స్తంభం ధ్వంసమయ్యాయి. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరిద్దరినీ గత నెల 28న న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ప్రతిరోజూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి రిసెప్షన్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఫిర్యాదుదారులకు, బాధితులకు నవ్వుతూ స్వాగతం పలకాలని తీర్పునిచ్చారు. రిసెప్షన్లో కూర్చొనే రెండు గంటల పాటు ముఖానికి మాస్క్ కూడా ధరించవద్దని షరతు విధించారు. బెయిల్ మంజూరైన నాటి నుంచి 15 రోజుల పాటు రోజూ ఠాణాకు రావాలని, రిసెప్షన్లో కూర్చోవాలని, ఆ తర్వాత పోలీసుల సమక్షంలో హాజరైనట్లుగా సంతకం చేయాలని తీర్పునిచ్చారు. దీంతో దయాసాయిరాజ్‌తో పాటు ఆయన స్నేహితురాలు రోజూ ఠాణాకు వచ్చి రిసెప్షన్లో కూర్చుంటున్నారు. -
HYD: పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్.. మందుబాబుల పరుగులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. డీజేలు, డ్యాన్స్‌లతో సందడి చేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. ఇక, పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా మందుబాబులు మళ్లీ రోడ్ల మీదకు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236 కేసులు నమోదు కాగా.. సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్లో 179 కేసులు, నార్త్ జోన్లో 177 కేసులు, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని వెంగళరావు పార్క్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పోలీసుల టెస్టులో భాగంగా అతడికి 550 పాయింట్లు వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. రోడ్ల మీద పోలీసుల తనిఖీలను చూసిన మందుబాబులు బైక్‌లను వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. -
Jubilee Hills: మద్యం మత్తులో కారు నడిపి..
బంజారాహిల్స్: ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి మితిమీరిన వేగంతో చెట్టుకు, డివైడర్‌కు ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. వెస్ట్ మారేడ్‌పల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే తీగుళ్ల దయాసాయిరాజ్ (27) రైల్వే ఆఫీసర్స్ కాలనీలో నివసించే తన స్నేహితురాలు (27)తో కలిసి శనివారం రాత్రి ఫిలింనగర్ సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఓ విందుకు హాజరయ్యాడు. ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు ఆ విందులో పాల్గొని మద్యం తాగారు. దయాసాయిరాజ్ మోతాదుకు మించి మద్యం తాగి ఇంటికి వెళ్లే క్రమంలో తన స్నేహితురాలిని తీసుకుని అర్ధరాత్రి 2.30 గంటలకు ఫంక్షన్ హాల్ నుంచి బెంజ్ కారు బయలుదేరాడు. సినీ నటుడు బాలకృష్ణ ఇంటి వద్దకు రాగానే కారు అదుపు తప్పి డివైడర్‌ను, ఆ తర్వాత చెట్టును ఢీకొని రోడ్డుకు అవతల వైపు బోల్తాపడింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. చెట్టు విరిగిపడి డివైడర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వీరిద్దరినీ స్టేషన్‌కు తరలించారు. ఆదివారం ఉదయం 3 గంటలకు స్టేషన్‌కు తీసుకువచి్చన వీరిద్దరినీ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌కు యతి్నంచగా వీరు సహకరించలేదు. 3 గంటల పాటు పోలీసులను దూషిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఠాణాలో న్యూసెన్స్ చేశారు. మద్యం మత్తులో స్టేషన్లో ఇద్దరూ వీరంగం సృష్టించారు. ఎట్టకేలకు వీరికి శ్వాస పరీక్షలు నిర్వహించగా దయాసాయిరాజ్కు 94 ఎంజీ, యువతికి 73 ఎంజీ రక్తంలో ఆల్కహాలిక్ నమోదైంది. వీరిద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద సెక్షన్ విధించి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
యమ డ్రింకరులు
కొన్నాళ్ల క్రితం కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదురుగా మోటర్ సైకిల్ ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు మృతి చెందాడు. వాహనం నడిపిన యువకుడు బార్లో పని చేస్తాడు. రాత్రి ఫుల్‌గా మద్యం తాగి వాహనాన్ని వేగంగా నడపటంతో ప్రమాదం జరిగింది. కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన కొంతమంది యువకులు స్నేహితుని పుట్టిన రోజు వేడుకలను అలంపూరు గ్రామ శివారులోని ఓ తోటలో జరుపుకున్నారు. అనంతరం కర్నూలుకు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు తుంగభద్ర బ్రిడ్జి దగ్గర ప్రమాదానికి గురైంది.ఏ వాహనమూ వారికి అడ్డు రాలేదు. వేగంగా వెళ్లి బ్రిడ్జికి ఢీకొట్టడం వల్ల ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం కూడా మద్యం మత్తులో వాహనం నడపటమే కారణమని పోలీసులు తేల్చారు. ఇలాంటి ఘటనలతో ఆయా కుటుంబాలు చీకటిలోకి జారుకుంటున్నాయి. కర్నూలు: వారు నడిస్తే.. కాళ్లు రకరకాలుగా అడుగులేస్తాయి. ఇక వాహనాలు నడిపితే యముడు వెనుక వస్తున్నట్లే. మృత్యువుకు ఎదురెళ్తారు. ఎందుకంటే వారి శరీరంలోకి మద్యం వెళ్లింది. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మత్తులో రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. అలా వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలతోనూ ఆడుకుంటున్నారు. మద్యం మత్తులోని యమకింకరులను పోలీసులు పట్టుకుంటున్నా, కోర్టు శిక్షలు విధిస్తున్నా నానాటికీ పెరిగిపోతున్న కేసులు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిత్యం ఎక్కడో చోట మద్యం మత్తులో ప్రమాదాలు చోటు చేసుకుని మరణాలు సంభవిస్తున్నాయి. మద్యం తాగడం ఎంత హానికరమో.. వివరించే ప్రచార చిత్రాలు చాలా చోట్ల కనిపిస్తుంటాయి. పోలీసులు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డ్రంకెన్ డ్రైవ్‌పై అవగాహన కల్పిస్తుంటారు. ఇవి చాలా మందిలో మార్పు తీసుకురాలేకపోతున్నాయి. పండుగలు, ఉత్సవాలు, ఇళ్లలో జరిగే శుభకార్యాల పేరుతో మందుబాబులు తెగ తాగేస్తున్నారు. అదే సమయంలో వాహనాలతో రోడ్లపైకి రావడం ముప్పు తెస్తోంది. ఎక్కువగా 20 నుంచి 45 సంవత్సరాల మధ్య యువకులే తనిఖీల్లో పట్టుబడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 40 నుంచి 55 ఏళ్ల వయస్సు వారు తర్వాత స్థానంలో ఉన్నారు. ఇటీవల కాలంలో 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు వారు కూడా అధికంగానే మద్యం సేవించి తనిఖీల్లో పట్టుబడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చైతన్యపరుస్తున్నా.. లెక్క చేయని యువత మద్యం సేవించి వాహనాలు నడపటం ప్రమాదకరమని పోలీసులు జిల్లాలో నిత్యం ఎక్కడో చోట అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత లెక్క చేయడం లేదు. ఎంతో భవిష్యత్తు ఊహించుకున్న కన్నవారు తేరుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంత ప్రమాదమో ఎక్కడికక్కడ చైతన్యం చేస్తున్నప్పటికీ కొందరు లెక్క చేయడం లేదు. చివరకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వారిపై ఆధారపడినవారిని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. జిల్లాలో ఏటా డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ పకడ్బందీగా తనిఖీలు ముమ్మరం చేశారు. వారిని కూడా తప్పించుకుని వెళ్లిపోయినవారిని లెక్కల్లోకి తీసుకుంటే భయపడేంత స్థాయిలో మద్యం ప్రియులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దొరికిన కొందరు కొన్ని రోజుల పాటు జైలు శిక్షకు కూడా గురవుతున్నారు. ఇన్ని ఘటనలు తమ చుట్టూ జరుగుతున్నా ‘నిషా’లో మునిగిన వారు వాహనాలు నడపటం మాత్రం ఆపడం లేదు. మూడేళ్లలో 2,596 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.జైలు.. జరిమానా మద్యం తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని అందరికీ తెలిసిన విషయమే. ఇలా చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష వేస్తారని కూడా మందు బాబులు తెలుసుకోవాలి. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడవితే మొదటిసారి రూ.10,000 వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండో సారి కూడా ఇదే తప్పు చేస్తే రూ.15,000 వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇలాంటి సంఘటనల్లో ఎవరికైనా ప్రాణాపాయం కలిగితే జైలు శిక్ష కూడా రెండేళ్లు ఉండేది. కొత్త చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే మరణాలకు ఐదు సంవత్సరాల వరకు తప్పనిసరి జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా జరిమానా కూడా ఎక్కువగా వేస్తారు. ఒకవేళ ప్రమాదం చేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి మరణానికి సరైన కారణం చెప్పకపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా అదనపు కఠినమైన శిక్షలు విధించే విధంగా చట్టాన్ని మార్చారు.మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరం మద్యం తాగి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. ప్రమాదానికి గురైతే కుటుంబీకులు ఇబ్బంది పడతారనే విషయాన్ని విస్మరించవద్దు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు నడపటం, ప్రమాదాలకు గురవటం ఆందోళనకరం. చాలా మందిలో మార్పు రావడం లేదు. వారి విలువైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కౌన్సెలింగ్‌లో సూచిస్తున్నాం. – మన్సూరుద్దిన్, ట్రాఫిక్ సీఐ, కర్నూలు -
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా... ఏఐ కెమెరా పట్టేస్తుంది!
మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? ‘రోడ్డు మీద పోలీసుల్లేరు కదా, మనం సేఫ్’అనుకోవడానికి ఇకపై వీల్లేదు. ఎందుకంటే తాగి, లేదా డ్రగ్స్ తీసుకుని వాహనం నడిపే వారిని కదలికలను బట్టి పసిగట్టే కృత్రిమ మేధతో కూడిన కెమెరా వచ్చేసింది. ఇకపై పోలీసులు ప్రతి వాహనాన్నీ ఆపి డ్రైవర్‌ను చెక్ చేయాల్సిన పని లేదు. ఈ ఏకై కెమెరాలు డ్రైవర్ స్థితి ఏమిటన్నది గుర్తించి పోలీసులకు సమాచారమిస్తాయి. వాళ్లు వెంటనే వాహనాన్ని ఆపి డ్రైవర్‌ను చెక్ చేస్తారు. తాగి నడిపేవారిని పట్టుకోవడానికి ఏఐ సాయంతో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి కెమెరా ఇది. అత్యాధునిక హెడ్సప్ పరికరంతో తయారు చేసిన ఈ కెమెరాలను బ్రిటన్ పోలీసులు ప్రయోగాత్మకంగా వాడి చూస్తున్నారు. ఈ కెమెరాలు డ్రైవర్లకు కనిపించవు. వీటిని అక్యూసెన్సస్ అనే సంస్థ తయారు చేసింది. వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్లు వాడే, సీటు బెల్టు పెట్టుకోని డ్రైవర్లను పట్టుకోవడానికి గతంలో పోలీసులు ఈ సంస్థ కెమెరాల ను వాడారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదానికి ఆస్కారం ఆరు రెట్లు ఎక్కువ. అలాంటివారిని ముందే గుర్తించగలిగితే అనేక ప్రాణాలు కాపాడొచ్చనేది అక్యూసెన్సస్ మోటో. కానీ పోలీసులు అంతటా కాపలా కాయలేరు. ‘‘కనుక ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తప్పనిసరి. ప్రమాదాలను తగ్గించడానికి చేపడుతున్న చర్యల్లో ఇదో భాగం’’అంటున్నారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రకాశం జిల్లా కామెపల్లిలో తాగుబోతు వీరంగం
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలకు దిగుతుంటే.. మరోవైపు అదే ట్రాఫిక్ పోలీస్ అధికారి మద్యం తాగి అడ్డంగా బుక్కయ్యాడు. అంతటితో ఆగకుండా తాను మద్యం తాగలేదని బుకాయిస్తూ బ్రీత్ అనలైజర్‌కు సహకరించలేదు. అనంతరం సినిమా రేంజ్ ట్విస్ట్‌తో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న ఏసీపీ సుమన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ చిక్కారు. ఆ సమయంలో యూనిఫామ్‌లో లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. అందుకు ఆయన నిరాకరించాడు. అంతటితో ఆగకుండా తాను కూడా పోలీసు డిపార్ట్మెంట్ అంటూ అక్కడున్న వారిపై మండిపడ్డారు. దీంతో అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే సుమన్‌కు అదుపులోకి తీసుకున్నారు. -
డ్రంకన్ డ్రైవ్‌లో పోలీసులను చూసి సీటు మారిన యువకుడు
బంజారాహిల్స్: డ్రంకన్ డ్రైవ్ జరుగుతున్న విషయం తెలుసుకుని డ్రైవర్ సీటులో నుంచి మారిన ఓ యువకుడు తన స్థానంలో ఓ యువతిని కూర్చోబెట్టగా గమనించిన ట్రాఫిక్ పోలీసు ఇదేమిటని ప్రశ్నించడంతో జరిగిన గొడవలో ఇద్దరు మందుబాబులపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా నడిరోడ్డుపై కారు నిలిపి న్యూసెన్స్‌కు పాల్పడ్డ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..మారేడుపల్లికి చెందిన పర్మార్ సిద్ధార్ధ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా ఆయన స్నేహితుడు పొన్నం శేషశాయి ప్రసాద్ అలియాస్ కిట్టు మరో ముగ్గురు యువతులు కలిసి క్లబ్ రోగ్ పబ్‌లో శుక్రవారం రాత్రి ఒంటిగంట దాకా విందు చేసుకుని తమ కారులో ఇంటికి బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని పార్క్‌హయత్ హోటల్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గోవర్దన్‌రెడ్డి నేతృత్వంలో డ్రంకన్ డ్రైవ్ జరుగుతుండగా ఈ విషయాన్ని కారు నడుపుతున్న సిద్ధార్థ ఎల్వీప్రసాద్ ఆస్పత్రి సమీపంలో గమనించాడు. తాను మద్యం సేవించడంతో డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిపోతాననే ఉద్దేశంతో పక్క సీట్లోకి మారి ఆ సీట్లో ఉన్న యువతిని డ్రైవర్ సీట్లోకి మార్చాడు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు హరికృష్ణ ఈ విషయాన్ని గమనించి వెంటనే ముందున్న ఎస్ఐకి సమాచారం ఇచ్చాడు. దీంతో సిద్ధార్ధకు డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించేందుకు యత్నించగా సహకరించలేదు. అదే సమయంలో సిద్ధార్ధ స్నేహితుడు శేషశాయి ప్రసాద్ వెనకాల ర్యాపిడో బైక్‌పై వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. కారును నడిరోడ్డుపై ఆపి ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ పోలీసు విధులకు అడ్డుపడ్డారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి శనివారం ఉదయం 7 గంటల వరకు..దాదాపు 6 గంటల పాటు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు రోడ్డుపై బైఠాయించి నానా రభస చేశారు. సిద్ధార్ధకు శ్వాస పరీక్ష నిర్వహించగా మద్యం మోతాదు 75 ఎంజీగా తేలింది. ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై బీఎన్ఎస్ సెక్షన్ 110, 292, 132, 221, 351 (2), 126 (2), 324 (2), రెడ్‌విత్ 3 అండ్ 5 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
హైదరాబాద్ ఓఆర్ఆర్పై డ్రంకెన్ డ్రైవ్‌లు.. ఇక అడుగడుగునా నిఘా!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద పోలీసు కమిషనరేట్ రాచకొండలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రానుంది. నిర్భయ, ఐటీఎంఎస్, నేను సైతం కార్యక్రమాల కింద ఏర్పాటైన సుమారు లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలు కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో రాచకొండలో అడుగడుగునా నిఘా ఉండనుంది. ఇప్పటికే కేంద్రం హోం శాఖకు చెందిన సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలను పంపించామని కమిషనర్ జి.సుదీర్ బాబు తెలిపారు. సుమారు 50 మంది సిబ్బంది 24/7 కంట్రోల్ సెంటర్లో విధుల్లో ఉంటారని, జోన్ల వారీగా ప్రత్యేక నిఘా ఉంటుందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే..ఔటర్లో డ్రంకెన్ డ్రైవ్‌లు.. పోలీసులు, అధికారులు రోడ్ల మీద ఉంటేనే ట్రాఫిక్ నియంత్రణలో ఉంటుంది. ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్యల కోసం యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీం (ఆప్ట్)ను ఏర్పాటు చేశాం. ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు, దర్యాప్తులతో పాటు సమాంతరంగా ప్రమాదం జరిగిన తీరు, కారణాలను క్షేత్ర స్థాయిలో విశ్లేషించడం, పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించడం దీని బాధ్యత. ఓఆర్ఆర్పై ప్రమాదాలను, వాహనాల వేగాన్ని తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) నిర్వహిస్తున్నాం.3 షిఫ్ట్‌లలో సిబ్బందికి విధులు.. సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటివరకు రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహించే పెట్రోలింగ్ సిబ్బందికి మూడు షిఫ్ట్‌లను కేటాయించాం. దీంతో 74 పెట్రోలింగ్ వాహనాల సిబ్బందిపై ఒత్తిడి తగ్గడంతో పాటు సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తారు. తగినంత స్థాయిలో నియామకాలు జరిగిన తర్వాత పోలీసు స్టేషన్లలో కూడా మూడు షిఫ్ట్‌ల విధానాన్ని అమలు చేస్తాం.సైబర్ బాధితులకు ఊరట.. క్విక్ రెస్పాన్స్, విజుబుల్ పోలీసింగ్, సాంకేతికత.. ఈ మూడే రాచకొండ పోలీసుల ప్రాధాన్యం. దీంతోనే నేరాలు తగ్గడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవడంతో పాటు బాధితులకు ఊరట కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. గత 7 నెలల్లో రూ.15 కోట్ల సొమ్మును బాధితులకు రీఫండ్ చేశాం. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తే బాధితులకు ఊరట కలగడంతో పాటు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.చదవండి: మైనర్ల డ్రైవింగ్‌పై ఆర్టీఏ కొరడా.. తల్లిదండ్రులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలుపోలీసు ప్రవర్తనపై నిఘా.. ప్రజలతో ట్రాఫిక్ పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుసుకునేందుకు వంద బాడీవార్న్ కెమెరాలను కొనుగోలు చేశాం. కమిషనరేట్‌లోని 12 ఠాణాల్లోని ఎస్ఐ ర్యాంకు అధికారికి వీటిని ధరించి విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. ఈ బాడీవార్న్ కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. దీంతో వారి ప్రవర్తన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసిపోతుంటుంది.మహిళల భద్రత కోసం.. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 2 నెలల్లో ఎల్బీనగర్, భువనగిరిలో భరోసా సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిల్లో తగినంత మహిళా సిబ్బందితో పాటు శాశ్వత కౌన్సిలర్లను ఏర్పాటు చేస్తున్నాం. మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి వాటిపై నిఘా పెట్టేందుకు ఆయా విభాగాల్లో మహిళా సిబ్బందిని పెంచుతున్నాం. మహిళలను వేధింపులు పునరావృతమైతే ఆయా నిందితులపై రౌడీ షీట్లు తెరుస్తున్నాం. ఇందుకోసం ప్రతీ పోలీసు స్టేషన్లో రిజిస్ట్రీ ఉంటుంది. -
ప్రముఖ నటుడు అరెస్ట్.. అదే కారణం!
ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరువనంతపురంలోని మ్యూజియం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నటుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.కాగా.. కారులో బైజూ కుమార్తె కూడా అతనితో ఉన్నట్లు తెలుస్తోంది. బైజు సంతోష్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన మొదట అధవ మణియన్ పిల్ల (1981) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత పుతన్ పనం (2017), మేరా నామ్ షాజీ (2019) చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్నారు. కాగా.. ప్రస్తుతం సంతోశ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం ఎల్2 ఎంపురన్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
నవరాత్రి సందడిలో కారు ప్రమాదం.. 12 మందికి గాయాలు
బరాన్: నవరాత్రి సందడి మధ్య కారు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్రు పట్టణంలోని ఖేద్లిగంజ్ కూడలి వద్ద మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ నవరాత్రి సందడిలో మునిగితేలుతున్న జనాలపైకి కారును పోనిచ్చాడు.ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలుస్తోంది. కానిస్టేబుల్ మనోజ్ గుర్జార్ మాట్లాడుతూ కారు డ్రైవర్ హనీ హెడా నుండి రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో బస్టాండ్ నుండి వేగంగా కారులో వస్తున్నాడన్నారు. ఖేద్లిగంజ్ కూడలిలో అమ్మవారి హారతి కార్యక్రమంలో పాల్గొన్న జనంపైకి కారును పోనిచ్చాడు. ఆ కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టి ఆగిందన్నారు. ఈ ఘటనలో ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం అందుకున్న వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ మెహతా, పోలీస్‌స్టేషన్ హెడ్ రామ్‌ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న భజరంగ్ దళ్ జిల్లా కోఆర్డినేటర్ హిమాన్షు శర్మ, టికం ప్రజాపతి, అడ్వకేట్ హరీష్ గలావ్, ఏబీవీపీ రాహుల్ వర్మ సహా వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర -
Mumbai: మద్యం మత్తులో బస్సు స్టీరింగ్ గిరగిరా తిప్పడంతో..
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో విచిత్ర పరిస్థితుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులోని ఒక ప్రయాణికుడు ఏదో విషయమై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆ ప్రయాణికుడు బస్సు స్టీరింగ్‌ను ఇష్టమొచ్చినట్లు గిరగిరా తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి, పలు వాహనాలను, పాదచారులను ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన లాల్బాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడి చర్యల కారణంగా, బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సు సియోన్‌లోని రాణి లక్ష్మీబాయి చౌక్ వైపు వెళుతోంది. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. -
కరీంనగర్ బస్‌స్టాండ్‌లో అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన
సాక్షి,కరీంనగర్ జిల్లా : కరీంనగర్ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఒక డ్రైవర్ డ్యూటీ ఎక్కే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే అతడు మద్యం తాగినట్లు వచ్చింది. అయితే తాను ఎలాంటి మద్యం సేవించలేదని, అసలు తనకు మద్యం తాగే అలవాటే లేదని డ్రైవర్ చెబుతున్నాడు. దీంతో అద్దె బస్సుల డ్రైవర్లు అంతా కలిసి బస్సులు తీయకుండా బస్‌స్టాండ్‌లో ఆందోళనకు దిగారు. దీంతో బస్స్టాండ్లోనే బస్సులు నిలిచిపోయాయి. ప్రైవేటు బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
గోల్కొండలో దారుణం.. డ్రంక్ & డ్రైవింగ్‌తో చిన్నారి బలిగొన్న యువకులు
హైదరాబాద్: గోల్కొండలో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో కారు బీభత్సం సృష్టించడంతో..చిన్నారి మృతి చెందింది. రాంగ్ రూట్లో ర్యాష్‌గా దూసుకొచ్చన కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న చిన్నారి మృతి చెందింది, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి.కారులోని వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు చెపుతున్నారు. స్పాట్‌కు చేరుకున్న గోల్కొండ పోలీసులు కార్ డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో మద్యం బాటిళ్ళు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గోల్కొండ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో బీటెక్ స్టూడెంట్స్..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థులు కారు డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి మంగళవారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం, కారు డ్రైవ్ చేస్తూ జాబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీభత్సం సృష్టించారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉండటంతో కారు కృష్ణానగర్వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పింది. కారు అతివేగంతో ఫుట్‌పాత్‌పైకి ఎక్కి.. టెలిఫోన్ స్థంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఇక, ప్రమాదాన్ని గమినించిన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన వారిద్దరినీ బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సాకేత్ రెడ్డి, కారులో ఉన్న అతడి స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో కారు డ్రైవ్ చేసిన సాకేత్ రెడ్డికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. మద్యం మోతాదు 146 పాయింట్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. -
అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకుంటారా?
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపించారు. తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించుకుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగబడ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మల్ని సస్పెండ్ చేయించి, వీఆర్‌కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు. అసలు వారిని వదిలేసి డ్రైవర్‌పై కేసుఎస్ఐ, ఏఎస్ఐ స్థాయి అధికారులపై పచ్చ మూక బహిరంగంగా బెదిరింపులకు దిగినా.. వారిపై చర్యలకు ఆదేశించడంలో విశాఖ పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం విశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇంత జరిగినా డ్రంక్ అండ్ డ్రైవ్ చలానా నమోదు మినహా విశాఖ పోలీసులు పచ్చమూకపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇటీవలే త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌పై దాడి జరిగిన ఘటన విశాఖ ప్రజలు మరువకముందే.. ట్రాఫిక్ పోలీసులపై తెలుగు తమ్ముళ్లు పూటుగా తాగి మద్దిలపాలెంలో బరితెగించిన ఘటన చోటుచేసుకోవడం విశాఖ వాసులతో పాటు పోలీసు వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారాన్ని వీడియోలతో సహా ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులకు పంపినట్టు తెలుస్తోంది. అయినా ఉన్నతాధికారులు ఈ ఘటనపై చర్యలకు ఆదేశించకపోవడం చర్చకు దారితీసింది. తెలుగు తమ్ముళ్ల బరితెగింపు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు విశాఖ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బుధవారం రాత్రి కారు డ్రైవింగ్ చేస్తున్న టెక్కలికి చెందిన బొమ్మిలి మురళీపై కేసు నమోదు చేసి మమా.. అనిపించారు. ఈ గొడవకు కారకులైన ఢిల్లీశ్వరరావు తదితరులను పక్కన పెట్టి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం చర్చనీయాంశమైంది. -
HYD: హుషారు తాగుబోతు.. బ్రీత్‌అనలైజర్‌తో పరార్
హైదరాబాద్, సాక్షి: నగరంలో మందు బాబు ఒకడు హుషారుతనం చూపించాడు. డ్రంక్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా పోలీసులకు మస్కా కొట్టి ఏకంగా బ్రీత్అనలైజర్ మెషిన్‌తో ఉడాయించాడు. గురువారం రాత్రి బోయిన్పల్లి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు.. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ మందుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
Video: తప్ప తాగి కారుతో ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లిన డ్రైవర్
హర్యానాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసును కొంతమంది బలవంతంగా కారులోకి ఎక్కించుకొని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని బల్లాబ్‌ఘర్‌లో నడిరోడ్డుపై జరిగింది.బల్లాబ్‌ఘర్ బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డు మధ్యలో కారును ఆపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. ట్రాఫిక్ సబ్- ఇన్స్పెక్టర్ డ్రైవర్ వద్దకు వెళ్లి బండి పత్రాలు అడిగి, చలాన్ రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై డ్రైవర్‌కు పోలీస్‌కు మధ్య వాగ్వాదం మొదలైంది.పేపర్లను పరిశీలించేందుకు సబ్ఇన్స్పెక్టర్ డ్రైవర్ డోర్ ద్వారా కారు లోపలికి వంగగా.. డ్రైవర్ ఒక్కసారిగా యాక్సిలరేటర్‌ను నొక్కి కారును ముందుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ పోలీస్‌తోపాటు కారు అలాగే ముందుకు కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అక్కడున్న వారు, ఇతర ట్రాఫిక్ సిబ్బంది వెంటనే వాహనాన్ని చుట్టుముట్టి అధికారిని రక్షించారు.నిందితుడుని కొంతదూరం వెంబడించి పట్టుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.VIDEO | #Haryana: A cab driver tried to flee when traffic police asked for the documents of the vehicle he was driving in Ballabgarh. He was nabbed by traffic cops after a short chase. The incident reportedly took place yesterday. (Source: Third Party) pic.twitter.com/eJILVSsqMJ— Press Trust of India (@PTI_News) June 22, 2024 -
నాగోల్: నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ యువతి హల్చల్
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో యువత చేసే వీరంగం ఎక్కువైపోతుంది. పగలు రాత్రి తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపైనే మద్యం సేవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఓ యువతి మద్యం మద్యం మత్తులో హల్చల్ చేసింది. నాగోల్ డివిజన్లోని ఫతుల్లాగూడ సమీపంలో శుక్రవారం ఉదయమే ఓ యువతి, యువకుడు కారులో వచ్చి నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ కనిపించారు.రోడ్డుపై మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ అక్కడికి వచ్చే వాకర్స్‌కు ఇబ్బంది కలిగించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని కొంతమంది చెప్పగా.. వారిపై జంట ఎదురుతిరిగింది. మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. పోలీసులకు ఫోన్ చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. అడ్డుకుని దుర్భాషలాడారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే యువతి, యువకుడు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ అడిగిన వారితో గొడవ పెట్టుకున్న యువతీ యువకుడుమద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను బూతులు తిట్టిన యువతిహైదరాబాద్ - నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో… pic.twitter.com/DY6d2hI7Vq— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024 -
Hussain Sagar: ‘90 ఎంఎల్’ ఇస్తేనే బయటకు వస్తా!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడు పడితే అప్పుడు... ఎక్కడ పడితే అక్కడ డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తూ పోలీసులు మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం మద్యం మత్తులో హుస్సేన్‌సాగర్‌లో దిగి పోలీసులకే చుక్కలు చూపించాడు. ‘90’ ఇస్తేనే బయటకు వస్తానంటూ ముప్పతిప్పలు పెట్టాడు. గత నెల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో బుధవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జనవరిలో ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ట్యాంక్‌బండ్ పై నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి దిగాడు. ఇతడు నడుము లోతు నీళ్లు ఉన్న ప్రాంతంలో నిల్చుని ఉండటాన్ని ట్యాంక్‌బండ్‌పై ఉన్న పర్యాటకులు చూపి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అగి్నమాపక శాఖ అధికారులనూ రప్పించారు. ట్యాంక్‌బండ్ మీది నుంచి తాడు వేసిన ఓ కానిస్టేబుల్ అది పట్టుకుని పైకి రావాల్సిందిగా ఆ యువకుడిని కోరాడు. ఆ ప్రాంతం దాటి ముందుకు వెళ్లవద్దని, అది చాలా ప్రమాదకరం అని హెచ్చరించాడు. ఈ విషయాన్ని సదరు యువకుడు పట్టించుకోకపోవడంతో సదరు కానిస్టేబుల్ ‘నీకు ఏం కావాలి?’ అంటూ ఉర్దూలో ఆ యువకుడిని అడిగాడు. దీనికి సమాధానంగా ‘90 (ఎంఎల్ పరిమాణంలో మద్యం) ఇస్తేనే బయటకు వస్తా’ అంటూ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న అనేక మంది దీన్ని వీడియో తీశారు. ఓ నెటిజనుడు బుధవారం దీన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆ రోజు దాదాపు గంట కష్టపడిన తర్వాత పోలీసులు ఆ యువకుడిని బయటకు రప్పించగలిగినట్లు తెలిసింది. -
Hyderabad City Police: హాజరవలేని ఆహ్వానం
సోషల్ మీడియా వైరల్: ఏదైనా విందుకో, వేడుకకో ఎవరైనా ఆహ్వానపత్రిక పంపితే మనం వెళ్లకతప్పదు. కాని ఓ ఆహ్వనపత్రిక మనం హాజరవలేని విధంగా వచ్చిందనుకోండి అదే విడ్డూరం. డిసెంబర్ 31న హైదరాబాద్ సిటీ పోలీస్ హైదరాబాద్ నగరవాసులకు ఇటువంటిదే ఓ ఆహ్వానపత్రిక పంపింది. అదేమిటో మీరూ ఓ లుక్కేయండి. ఈ నూతన సంవత్సర వేడుకలకు మీరు మా అతిధి అవ్వకూడదని ప్రార్ధించండి. కాకపోతే రాష్ డ్రైవర్లకు, తాగి నడిపే వాహనదార్లకు, ఇతర రూల్స్ అతిక్రమించేవారికి మా ఆతిధ్యం ఉచితం. వారికి మాత్రమే స్పెషల్ లాకప్ డీజె షో ఏర్పాటు చేయబడుతుంది. ఇకపోతే మా ఆతిధ్యం స్వీకరించేవారికి రుచికరమైన కాప్ కేక్ , ప్రత్యేకంగా మా డెజర్ట్‌లో పొందుపరిచిన కష్టడీ వడ్డించబడుతుంది. ఆఖరుగా ఈ పార్టీ వేదిక మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అని వినూత్నంగా డిజైన్ చేసిన ఈ ‘హాజరవలేని ఆహ్వానం’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. Please dont be our Guest, our Service is Quite Complicated, Rest on you...#DontDrinkAndDrive#DrunkenDrives pic.twitter.com/9eEvjJhiU5 — Hyderabad City Police (@hydcitypolice) December 31, 2023 చదవండి: Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే? -
Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే?
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సైబరాబాద్‌లో బ్రీత్ అనలైజర్ కౌంట్ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్టు వెల్లడించారు. సైబరాబాద్‌లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. కొత్త ఏడాది సందర్బంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్ , లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. దీంతో, ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, గడిచిన మూడు రోజుల్లో తెలంగాణలో రూ.658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది కూడా చదవండి: న్యూ ఇయర్ వేడుకలు.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం! -
New Year: విశాఖ, విజయవాడలో ఆంక్షలు ఇవే..
సాక్షి, విశాఖ/విజయవాడ: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విశాఖపట్నం, విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈవెంట్స్, బార్స్, రెస్టారెంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతిచ్చారు. రూల్స్ ఎవరు అతిక్రమించినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు.. రేపు ఉదయం ఐదు గంటల వరకు ఫ్లైఓవర్లు, రోడ్లు మూసివేత బీఆర్టీఎస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హనమంత వాక నుంచి అడవివరం జంక్షన్ వరకు ట్రాపిక్ ఆంక్షలు. పెందుర్తి జంక్షన్ నుంచి ఎన్ఏడీ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు మూసివేత. ఈవెంట్స్, బార్స్, రెస్టారెంట్లకు ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి. రూల్స్ ఎవరు అతిక్రమించినా వారిపై చర్యలు. విశాఖ బీచ్ రోడ్లోకి వాహనాలకు అనుమతి నిరాకరణ. విజయవాడలో పోలీసుల ఆంక్షలు విజయవాడ సీపీ మాట్లాడుతూ.. పోలీసు యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంటుంది. డీజేలకు ఎలాంటి అనుమతి లేదు. నగరంలోని ఫ్లైఓవర్లు మూసివేత. బందర్‌రోడ్‌లో వాహనాలకు అనుమతి లేదు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ చేసిన వారిపై కఠిన చర్యలు. -
నేటి అర్ధరాత్రి వరకు మద్యం
హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31వ తేదీ అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చూసి ఉంటాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక బార్లు, క్లబ్బులు, పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నూతన సంవత్సరానికి వీడుకోలు పలికే డిసెంబర్ 31 వేడుకలను పురస్కరించుకొని పలు ఆంక్షలు, మార్గదర్శకాలను జారీచేశారు. పోలీసులు నేటి రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులకు సిద్దం కాగా.. తాగి వాహనాలు నడిపితే బండిని సీజ్ చేయటంతో పాటు రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. -
Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్!
హైదరాబాద్: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా రెండు షిఫ్ట్‌లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేర్వేరు చోట్ల వాహనదారులకు శ్వాస పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, పంజగుట్ట, బోరబండ, ఎస్ఆర్నగర్, మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు ఎనిమిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో డైమండ్ హౌజ్, ఫిలింనగర్ విజేత సూపర్‌మార్కెట్ వద్ద నిర్వహించిన డ్రంక్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 24 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎస్ఆర్నగర్ ఐసీఐసీఐ వద్ద రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు, జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 26 మంది పట్టుబడ్డారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్టడీ సర్కిల్, గ్రీన్ బావర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్‌ల్యాండ్స్ వద్ద, బంజారాహిల్స్ పార్క్ హయత్ వద్ద రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. -
మోత మోగొద్దు!
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో అతిగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డీజే బాక్సులు, బాణసంచాకు అనుమతి లేదని..ఎవరైనా డీజేలు ఉపయోగించినా..బాణసంచా కాల్చినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఈమేరకు రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు ఆదివారం పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్‌లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. ట్రాఫిక్, ఎస్ఓటీ, షీ టీమ్స్, పెట్రోలింగ్ వంటి పోలీసు బృందాలు వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు, నేరాలు జరగకుండా విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ఔట్ డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు అనుమతి లేదని, ఎటువంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెంట్ లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని పేర్కొన్నారు. వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తమ బృందాలు తనిఖీలు చేస్తారని, నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. పబ్‌లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయం లోపు మూసి వేయాలని, మైనర్ యువతకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే వాహన యజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్థరాత్రి యువకులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనాలు నడపకుండా మరియు ఎటువంటి బైక్ రేసులు చేయకుండా ఉండేందుకు నిర్దేశిత సమయం పాటు తాత్కాలికంగా ఫ్లై ఓవర్ లను మూసివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎస్ఓటి డీసీపీ గిరిధర్, డీసీపీ అడ్మిన్ ఇందిర, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
HYD: ఫుల్లుగా తాగి కారు నడిపి.. చెట్టును ఢీ కొట్టి..
సాక్షి, మేడ్చల్: వాళ్లు మైనర్లు.. పైగా మద్యం మత్తులో కారు అతివేగంగా నడిపి ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర చౌరస్తా నుండి యాధ్గార్ పల్లి వైపు వెళ్తున్న బెలీనో కార్ (TS 10 ES 7428) అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భువేష్ (17 ), తుషార (18) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్ని అల్వాల్ బొల్లారం ప్రాంతం కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో ఓ యువతి కూడా ఉండడం గమనార్హం. ప్రమాదానికి గురైన కారు నుంచి మద్యం సీసాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుల్లుగా తాగిన మత్తులో డ్రైవ్ చేసే ప్రమాదానికి వాళ్లు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గాయపడిన పిలిప్స్, రుబిన్‌లతో పాటు వాళ్లతో ఉన్న యువతిని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
ఇకపై మద్యం తాగి దొరికావో.. అంతే సంగతులు! జర జాగ్రత్త భయ్యా!! లేదంటే..
నిజామాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారు కోర్టులో జరిమానా చెల్లించి తప్పించుకునేవారు. జిల్లాలో మద్యం మత్తులో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం నూతన ఆదేశాలను జారీ చేసింది. ఇకపై తాగి వాహనాలు నడిపే వారిపై జరిమానాతో పాటు జైలు శిక్ష, వాహన లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటోంది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మద్యం ప్రియుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మందుబాబులకు కౌన్సెలింగ్.. మద్యం తాగి దొరికిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌లో మద్యం తాగి నడిపిస్తే కలిగే నష్టాలను వాహనాదారుడికి, కుటుంబసభ్యులకు వివరిస్తున్నారు. మద్యం తాగి దొరికిన వారి వివరాలు పీఎస్‌లో నిక్షిప్తమై ఉంటాయి. నగరంతోపాటు మండల కేంద్రంలో కూడా పోలీసులు మధ్యాహ్న సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం తాగి దొరికిన వారిని కోర్టులో హాజరు పర్చడంతో వారికి కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తోంది. కోర్టు నిర్ణయం మేరకు.. మద్యం తాగి దొరికిన వారిపై కోర్టు జైలు శిక్ష విధించడంతోపాటు జరిమానా విధిస్తారు. మొదటి సారి కాకుండా రెండోసారి దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోర్టు రవాణా శాఖకు సిఫార్సు చేస్తోంది. వాహనాదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లను కోర్టు నిర్ణయం మేరకు ఏడాది నుంచి ఆరు నెలల వరకు రద్దు చేసే అవకాశం ఉంది. కోర్టుకు పంపిస్తున్నాం.. తాగి వాహనాలు నడిపి తనిఖీలో పట్టుబడితే వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం. కోర్టు వారికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తోంది. తాగి నడిపితే జరిగే పరిణామాలపై కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు. నగరంలోని ఒకటో టౌన్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా మోతాదుకు మించి తాగినట్లు గుర్తించడంతో రెండు రోజుల జైలు శిక్ష విధించారు. ఇప్పటి వరకు జిల్లాలో మద్యం తాగి పట్టుబడి జైలు శిక్ష కొందరు అనుభవించి వచ్చారు. – చందర్‌రాథోడ్, ట్రాఫిక్ సీఐ, నిజామాబాద్ సంవత్సరంలో కేసులు.. 2021 - 4226 2022 - 11684 2023 - 17004(జనవరి నుంచి సెప్టెంబర్) -
తాగి నడిపితే.. మాములుగా వుండదు..!
మహబూబ్‌నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి జిల్లా పోలీస్ శాఖ డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. జనవరి నుంచి సెప్టెంబర్ 9 వరకు జిల్లాలోని 17 పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 4,809 కేసులు నమోదు చేయగా.. ఇందులో 2,922 మందికి రూ.46.62 లక్షల జరిమానా విధించగా మరో 55 మందికి జైలుశిక్ష విధించారు. ఇటీవల హౌజింగ్‌బోర్డుకు చెందిన రాములు అనే వాహనదారుడికి అత్యధికంగా 16 రోజుల సాధారణ జైలుశిక్ష పడింది. 2021లో 3,057 కేసులు నమోదు చేయగా 3,045 కేసులకు సంబంధించి రూ.38,00,700 జరిమానా విధించగా 12 మందికి జైలుశిక్ష పడింది. అలాగే 2022లో 4,628 కేసులు నమోదు చేసి రూ.36 లక్షల జరిమానా వసూలు చేశారు. ఈ ఏడాది ఇంకా ఐదు నెలలు ఉండగా.. మరో 3 వేల కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు.. బ్రీత్ ఎనలైజర్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌ను పసిగట్టే సెన్సార్ ఉంటుంది. ఇందులో కొన్ని రసాయన పదార్థాలను నిక్షిప్తం చేస్తారు. మద్యం తాగిన వ్యక్తి పరికరంలోకి గాలి ఊదినప్పుడు అతని శ్వాసలో కరిగి ఉన్న ఇథైల్ ఆల్కహాల్ సెన్సార్‌ను చేరుతుంది. ఇది శ్వాసలో ఇథనాల్ ఎంతశాతం ఉందో నమోదు చేస్తోంది. 0–30మిల్లీ గ్రాములు నమోదు సాధారణంగా చెబుతారు. 30 మి.గ్రా ఆపైన నమోదైతే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తారు. ఇలా రెండుసార్లు వాహనం నడుపుతూ దొరికితే లైసెన్స్ రద్దు చేస్తారు. 100 మి.గ్రా., పైగా నమోదైతే జైలుకు పంపుతారు. పోలీస్ నిబంధనల ప్రకారం ఒక యూనిట్ లేదా 100 మి.లీ., రక్తంలో 0.03 శాతం లేదా 30 మి.గ్రా., మించి ఆల్కహాల్ ఉంటే మోటారు వాహనచట్టం 185 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తాగిన మోతాదును బట్టి రూ.2 వేలు జరిమానా, వారం నుంచి పదిరోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని పునరావృతం చేస్తే ఎక్కువ రోజుల జైలుశిక్షతోపాటు రూ.3–5 వేల వరకు జరిమానా విధించవచ్చు. పాయింట్ల కేటాయింపు.. రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానాలు విధించి.. వారికి జీఓ 26 ప్రకారం పాయింట్లు ఇస్తోంది. 24 నెలల్లో 12 పాయింట్లు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దు చేస్తారు. ఏడాదిలో లైసెన్స్ పునరుద్ధరించాక మళ్లీ 12 పాయింట్లు సాధిస్తే రెండేళ్లపాటు తర్వాత మళ్లీ ఇలాగే చేస్తే మూడేళ్లపాటు రద్దు చేస్తారు. ద్విచక్ర వాహనదారుడు మద్యం తాగితే 4 పాయింట్లు, నాలుగు చక్రాల వాహనదారుడు మద్యం తాగితే 4 పాయింట్లు, బస్సు, క్యాబ్ వాహనదారుడు మద్యం తాగితే 5 పాయింట్లు, ఆటోడ్రైవర్ తన పక్కన ప్రయాణికుడిని కూర్చొబెట్టుకోవడం, హెల్మెట్ లేకుంటే, సీటు బెల్టు పెట్టకుంటే ఒక పాయింట్ వేస్తారు. కఠిన చర్యలు తప్పవు.. డ్రంకెన్ డ్రైవ్‌లో రెండోసారి పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. మొదట వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఆ తర్వాతే కోర్టులో హాజరుపరుస్తున్నాం. ప్రస్తుతం డ్రైంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని ట్యాబ్‌లో ఫొటో తీస్తున్నాం. వారు బార్లో తాగారా.. శివారు ప్రాంతాల్లో తాగారా.. ఇలా ప్రతీది నమోదు చేస్తున్నాం. ఒక్కసారి పట్టుబడిన వ్యక్తి మరోసారి పట్టుబడితే సులభంగా తెలిసిపోతుంది. జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపడుతున్నాం. – మహేష్, డీఎస్పీ, మహబూబ్‌నగర్ వినూత్నంగా శిక్షలు.. మొదట్లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువ మోతాదులో తాగి దొరికిన వారికి జరిమానాతోపాటు కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెట్టేవాళ్లు. ప్రస్తుతం చట్టాలకు మరింత పదును పెట్టారు. మోతాదుకు మించి అతిగా తాగిన వారికి 1 నుంచి 7 రోజుల జైలుశిక్ష విధిస్తున్నారు. మళ్లీ మళ్లీ డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వారికి గరిష్టంగా 30 రోజుల వరకు జైలుశిక్ష విధిస్తున్నారు. -
HYD: మద్యం మత్తులో సీఐ కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నడుపరాదని చెబుతూనే కొందరు పోలీసులు మాత్రం తప్పతాగి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ సీఐ ఫుల్లుగా మద్యం సేవించి హైస్పీడ్‌లో కారు నడిపి.. ఎదురుగా వస్తున్న వాహనాలన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో సీఐ శ్రీనివాస్ ఫుల్లుగా మద్యం సేవించి కారును నడిపారు. ఈ క్రమంలో ఎదురుగా కూరగాయల లోడుతో వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో, వాహనం నడుపుతున్న శ్రీధర్.. వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో శ్రీధర్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. కాగా, సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. సీఐ శ్రీనివాస్ వాహనంపై ఇప్పటికే ఆరు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నాయి. ఇక, సీఐ శ్రీనివాస్ మద్యం సేవించి కారు నడుపారన్న నేపథ్యంలో డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్టులో రీడింగ్ 200 దాటినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం... తెలుగు కుటుంబం దుర్మరణం -
గవర్నర్ కాన్వాయ్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు..
లక్నో: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చింది. నోయిడాలో ఓ కార్యక్రమంలో పాల్గొని దిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సెక్యూరిటీ విషయంలో కూడా భద్రతా వైఫల్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఓ సీనియర్ సిటిజన్ ఏకంగా సిద్ధరామయ్య వాహనాన్ని అడ్డగించి నిలదీశాడు. ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న అతిథుల కారణంగా తమ కుటుంబం కొన్నేళ్లుగా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటుందని, దీనిని పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. ఇదీ చదవండి: పార్కింగ్ సమస్య.. ఏకంగా సీఎం సిద్ధరామయ్య కారునే అడ్డగించి -
మందు కాదు..పాలు తాగిన సార్..
-
‘మద్యం మత్తులో.. పాలు తాగాడంట!’
Drunken Drive Funny Viral: మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో శుక్రవారం రాత్రి పెద్ద జోక్ అయ్యింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతుండగా.. కారులో ఓ వ్యక్తి వచ్చాడు. అందరి మాదిరిగానే అతనికి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహించగా.. 94 శాతం రీడింగ్ పాయింట్లు నమోదయ్యాయి. ఏం తీసుకున్నావని పోలీసులు ప్రశ్నించగా.. పాలు తాగానని చెప్పడంతో అక్కడే ఉన్న ఉన్నతాధికారి ఒక్కసారిగా ఘోల్లుమని నవ్వాడు. ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్‌గ్రూపుల్లో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తిని అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే ఐటీ ఉద్యోగిగా.. పోలీసులు అతని ద్వారానే చెప్పించారు. ఆ తర్వాత తమ స్టయిల్లో గట్టిగా నిలదీసేసరికి.. మద్యం సేవించినట్లు అంగీకరించాడు. ఆపై అతనిపై కేసు ఫైల్ చేశారు. -
వీడియో: ‘నేను పాలు తాగిన సార్ అంతే’.. హైదరాబాద్ పోలీసుల రియాక్షన్ చూసేయండి
-
తప్పతాగి..దొంగకు తాళాలిచ్చి.. ఆ తర్వాత..
గురుగ్రామ్: మద్యం సేవించిన తర్వాత చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. ఏం చేస్తారో? ఎందుకు చేస్తారో? తెలియదు. ప్రపంచాన్నే మరిచేంత మైకంలో ఉంటారు. మత్తు నుంచి బయటకు రాగానే అసలు విషయం తెలుసుకుని తలదించుకుంటారు. పూటుగా తాగి గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు. రాత్రి తప్పతాగి.. తన కారును దొంగకు అప్పగించాడు. ఉదయం అసలు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. గురగ్రామ్‌కు చెందిన వ్యక్తి అమిత్ ప్రకాశ్(30). పరిమితికి మించి మద్యం సేవించిన తర్వాత మళ్లీ మద్యం కొనుగోలుకు వెళ్లారు. కేవలం రూ.2000 ఉండే వైన్ బాటిల్‌కు రూ.20 వేలు ఇచ్చాడు. అయితే..బార్ యజమాని తనకు రిటన్లో రూ.18 వేలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. కారులో కూర్చుని వైన్ తాగుతుండగా అపరిచిత వ్యక్తి వచ్చి వైన్ షేర్ చేసుకున్నట్లు చెప్పాడు. ఇద్దరు కలిసి కారులో సుభాష్ చౌక్ వరకు వెళ్లినట్లు తెలిపాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ అపరిచితుడు కారులోంచి దిగిపోమ్మని అడగగానే.. కారు తనదేనని మరిచి దిగిపోయినట్లు పోలీసులకు తెలిపాడు. కారు దిగిపోగానే అపరిచిత వ్యక్తి కారును అపహరించినట్లు ఫిర్యాదు చేశాడు. కారుతో పాటు తన రూ.18000, ల్యాప్‌టాప్ కోల్పోయినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి:ట్రెండ్ సెట్టింగ్ ఐడియా..ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసుల వినూత్న ప్రయోగం.. -
తాగి డ్రైవింగ్ చేస్తే ఇలా ఉంటుంది
-
కారుని ఆపగా..డ్రైవింగ్ సీటులో కుక్క!..కంగుతిన్న ట్రాఫిక్ పోలీసులు
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు రకరకాల ఎత్తుగడలు పన్నడం గురించి విన్నాం. మహా అయితే నేరాన్ని వేరే వారిపై లేదా సాక్ష్యాధారాలు మార్చడం వంటివి చేస్తారు. అంతేగాని జంతువులపై నెపం నెట్టడం చూడటం అరుదు. పట్టుపడకుండా ఉండేలా జంతువుని బుక్ చేసిన వ్యక్తి బహుశా అతడేనేమో. అతన చేసిన పనికి పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన యూఎస్‌లోని కొలరాడోలో చోటే చేసుకుంది. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని కొలరాడో రోడ్డుపై కారు ఓ మాదిరి స్పీడ్‌తో వస్తుంది. ఇంతతో ఓ రహదారి వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రతి వాహనదారుడిని చెక్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఓ కారు వారి వద్దకు వస్తుండటం గమనించి ఆపారు. కామన్‌గా పోలీసులు ఆపిన వెంటనే సదరు వ్యక్తులు కారుదిగి రావడం జరుగుతుంది. ఐతే ఇక్కడ కారు ఆపినా ఎవరూ బయటకు రాకుండా అలానే ఉండటంతో పోలీసులు ఒక్కసారిగా ఏం జరుగుతుందా అని అనుమానం కలిగింది. దీంతో పోలీసులు కారు వద్దకు నేరుగా వచ్చి చూడగా..డ్రైవింగ్ సీటులో కూర్చొన్న కుక్కను చూసి ఒక్కసారిగా పోలీసులకు ఊపిరి ఆగినంత పనిఅయ్యింది. ఈ కారుని కుక్కే డ్రైవ్ చేసుకుని వచ్చిందా అంటూ అయోమయంగా చూస్తుండిపోయారు. కాసేపటికి వారు కారుని పరికించి చూడగా ప్యాసింజర్ సీటులో ఉన్న ఓ వ్యక్తిని గమనించి వెంటనే పోలీసులు ఆరా తీశారు. ఐతే ఆ వ్యక్తి తాను డ్రైవ్ చేయలేదని బుకాయించాడు. ఆ తర్వాత పోలీసలు తమదైన శైలిలో అడగగా సీట్లు మార్చుకున్నట్లు తెలిపాడు. అతను డ్రింక్ చేశాడేమనన్న అనుమానంతో పరీకించగా తాగిన సంకేతాలు కనబర్చాడు. అంతే అతను అరెస్టు నుంచి తప్పించుకోవాలని పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఐతే పోలీసులు అతడినికి కేవలం 20 గజాల దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ కుక్కను జంతువుల సంరక్షణాధికారి పర్యవేక్షణలో ఉంచి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తాను పట్టుపడకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు పోలీసులు ఎదుట అంగీకరించాడు. (చదవండి: దేశం దాటి ప్యాసింజర్లకు సారీ చెప్పిన ఎయిర్‌లైన్స్ అధినేత) -
ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..
తాగిన మైకంలో పలువురు వ్యక్తులు ఏం చేస్తారో కూడా తెలియదు. కొందరికి ఆ సమయంలో తాము ఏం చేశాం అనే స్పృహ కూడా ఉండదు. మత్తులో చిత్తయిన ఓ యువకుడు చేసిన పని అందర్నీ షాక్‌కి గురి చేసింది. అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న జనం ఆ యవకుడిని చూసి ఒకింత ఆశ్చర్యానికి, ఎక్కడ ఆ ఎద్దు తమపైకి దూసుకొస్తుందోననని మరొకింత ఆందోళనకు గురయ్యారు. జల్లికట్టు మాదిరిగా ఆ ఎద్దుపైకి ఎక్కి కూర్చొని వెళ్లడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్ తపోవన్ ప్రాంతంలో జరిగినట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు ట్విట్టర్ వేదికగా.. మే 5న అర్థరాత్రి రిషికేశ్‌లోని తపోవన్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించిన వైరల్ వీడియోని గుర్తించాం. ఆ యువకుడిపై చర్యలు తీసుకున్నాం. జంతువులతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించొద్దని యువతను గట్టిగా హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు. కొందరు నెటిజన్లు ఎద్దును ఇలా హింసించడం సరికాదని ట్వీట్ చేయగా, మరికొందరూ జల్లికట్టు క్రీడతో పోల్చుతూ ట్వీట్లు చేశారు. (చదవండి: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..) -
మిర్యాలగూడ: కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన మందుబాబులు
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడలో గత రాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. డ్రంక్ డ్రైవ్ సందర్భంగా.. పోలీసుల మీదకు కారును పోనిచ్చారు. ఈ క్రమంలో కారును ఆపేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. తప్పతాగిన కొందరు మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల సందర్భంగా హల్ చల్ చేశారు. పోలీసులు చెబుతున్నా వినకుండా ముందుకు కారును పోనిచ్చారు. కానిస్టేబుల్ లింగారెడ్డిని 50 మీటర్ల దూరం ఈడ్చుకుపోయారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. గాయాల పాలైన కానిస్టేబుల్ లింగారెడ్డి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన వన్‌టౌన్ పోలీసులు.. పరారైన వాళ్ల కోసం గాలింపు చేపట్టారు. -
మామిడి కాయల లోడు లారీ బోల్తా
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో స్క్యూ బ్రిడ్జి వద్ద మామిడి కాయల లోడు లారీ బోల్తా పడటంతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం నూజివీడు నుంచి మామిడి కాయల లోడుతో చిత్తూరు వెళుతున్న లారీ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ అదపు తప్పి స్క్యూబ్రిడ్జి తూర్పు భాగంలో కిందపడింది. ఆ సమయంలో బ్రిడ్జి కింద కొందదిటి శివ, మల్లేశ్వరి దంపతుల కుమారుడు సంజీవ్ (3)కు స్నానం చేయించి, బట్టలు వేసేందుకు తల్లి ఇంటిలోకి వెళ్లింది. ఇంతలో పెద్ద శబ్దంతో లారీ బోల్తా పడింది. లారీ బాలుడిపై పడింది. స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసలు సంఘటన స్ధలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కింద పడిన లారీని అర్ధరాత్రికి పైకి తీశారు. దాని కింద ఉన్న సంజీవ్‌ను 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. పిల్లాడి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి క్యాజువాలిటి ముందు నిరసనకు దిగారు. మృతదేహాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఎస్కె ఖాదర్‌బాషా, పటమట, కృష్ణలంక సీఐలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తీవ్ర గాయాలైన లారీ డ్రైవర్ హరిబాబు, క్లీనర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే కారు ఉక్రెయిన్‌కే!!
రిగా(లాత్వియా): డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన కార్లను లాత్వియా అధికారులు ఉక్రెయిన్‌కు పంపిస్తున్నారు. రష్యాతో జరిగే యుద్ధంలో ఉక్రెయిన్‌కు తమ ప్రయత్నం సాయంగా ఉంటుందని అంటున్నారు. ఈ కార్లను నడిపిన మాజీ యజమానుల రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు 0.15% పైనే ఉందట. ఇప్పటికే ఇలా పట్టుబడిన 8 కార్లు ఉక్రెయిన్‌కు పంపామని లాత్వియా దేశ రెవెన్యూ విభాగం తెలిపింది. కొనుగోలు చేసిన, విరాళంగా అందిన కార్లను దెబ్బతిన్న, యుద్ధం జరిగే ప్రాంతాల్లో అత్యవసర సేవలకు వినియోగిస్తామని ఉక్రెయిన్‌కు చెందిన అగెండమ్ గ్రూప్ తెలిపింది. 2022 ఫిబ్రవరి నుంచి ఇలాంటి 1,200 కార్లను అందజేసినట్లు వెల్లడించింది. లాట్వియా రోడ్లపై మద్యం తాగి కార్లలో తిరిగే వారు ‘పేలని కమికాజ్ డ్రోన్లు’వంటి వారని చమత్కరించింది. ‘సాధారణంగా స్వాధీనం చేసుకున్న కార్లను అమ్మేయడమో, విడగొట్టి అమ్మేయడమో చేస్తుంటాం. అయితే, ఉక్రెయిన్ ప్రజలకు సాయం చేయాలనే వీటిని అక్కడికి పంపిస్తున్నాం’అని లాత్వియా అంటోంది. పట్టుబడిన కార్లను వారానికి 25 చొప్పున అగెండమ్కు అందజేస్తామని లాత్వియా అధికారులు హామీ ఇచ్చారు. -
బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం
-
బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సైని కాలుతో తన్ని
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. కారులో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే యువకుడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 94 పాయింట్లు నమోదు కావడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సదరు యువకుడు రెచ్చిపోయి ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్ ఎస్సైతో దుర్భాషలాడాడు. నీకు సెక్షన్లు తెలుసా? ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చరిస్తూ ఎసైను కాలితో తన్నాడు. యువకుడి పక్కన ఉన్న యువతి సైతం రెచ్చిపోయి ప్రవర్తించింది. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ మాట్లాడింది. దీంతో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులపై హద్దుమీరి ప్రవర్తించిన యువకుడిని ఆహా ఓటీటీలో పనిచేస్తున్న గౌరవ్గా గుర్తించారు. -
మత్తు వదలరా.. చెత్త ఎత్తరా.!
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు వినూత్నమైన శిక్ష వేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 52 మందిని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పోలీసులు హాజరు పరిచారు. వారందరితో ఆర్.కె.బీచ్‌లో చెత్తను ఎత్తి బీచ్ శుభ్రం చేయాలని కోర్టు శిక్ష విధించింది. దీంతో మూడో పట్టణ ట్రాఫిక్ సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసులు ఈ శిక్షను అమలు చేశారు. వారితో బీచ్‌లో చెత్తను ఎత్తించారు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా విధిస్తారు. కానీ ఇటువంటి శిక్ష విధించటంతో మందుబాబుల మత్తు దిగిపోయింది. ఇప్పటికైనా అలాంటి వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. -
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో యువతులు!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్లి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న యువతులు కారు నడిపినట్లు తెలుస్తోంది. తాగి రోడ్డుపై షికారు చేస్తూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్రగాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కారు నడిపిన వారిని విచారిస్తున్నారు. చదవండి: ఒక మర్రితో మరిన్ని..! చేవెళ్ల రోడ్డు విస్తరణతో 760 మర్రి చెట్లకు గండం -
అతివేగంతోనే అధిక ప్రమాదాలు
సాక్షి, అమరావతి: దేశంలో అతివేగం వల్లే అత్యధిక రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. 2020తో పోల్చితే 2021లో అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ మేరకు 2021లో రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాలపై కేంద్రం నివేదిక విడుదల చేసింది. దేశంలో ఆ ఏడాదిలో మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 71.7 శాతం ప్రమాదాలు అతివేగం వల్లే జరిగాయి. అంతేకాకుండా 2020తో పోల్చితే ఇవి 11.4 శాతం పెరిగాయి. రోడ్డు ప్రమాదాల మొత్తం మరణాల్లో అతివేగం వల్ల ఏకంగా 69.6 శాతం మృతి చెందగా 72.9 శాతం గాయపడ్డట్టు నివేదిక పేర్కొంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల 2.2 శాతం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల 1.6 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో కూడా జాతీయ రహదారులపై అతివేగం కారణంగా 2021లో 5,167 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 2,155 మంది మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. అలాగే రాష్ట్రంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల జాతీయ రహదారులపై 113 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 13 మంది మృతి చెందారు. -
భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా?
పండుగ సీజన్, న్యూ ఇయర్ లాంటివి వచ్చినప్పుడు భారత్‌లో డ్రైంక్ అండ్ డ్రైవ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. తాగి వాహనాలు నడపడం వల్ల ఒక్కోసారి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి 1న ఢిల్లీ కంఝవాలలో యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మద్యం మత్తులో బండ్లు నడిపి వాళ్ల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు కొందరు. భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు కఠిన శిక్షలే ఉన్నాయి. తాగి బండి నడిపితే రూ.10వేలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష. రెండోసారి ఈ తప్పు చేస్తే రూ.15వేల జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. బ్రిటన్, స్వీడన్ సహా పలు దేశాల్లో ఇలాంటి కఠిన శిక్షలే అమలు చేస్తున్నారు. బ్రిటన్‌లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి అధికారులు ఎంత పెనాల్టీ అయినా విధించవచ్చు. దీనికి పరిమితే లేదు. నిబంధనలు ఇంత కఠినంగా ఉన్నా కొంతమంది వాహనదారులు అసలు లెక్కచేయడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడతామన్న భయం లేకుండా యథేచ్ఛగా మద్యం సేవించి బండ్లు నడుపుతున్నారు. ఎలాగోలా తప్పించుకోవచ్చనో, లేక దొరికినా బయటకు రావచ్చనే ధీమానో తెలియదు గానీ భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలు పండుగ సీజన్లలో, సెలవు దినాల్లో చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆస్ట్రేలియా టెక్నాలజీతో చెక్? మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా.. ఆస్ట్రేలియాలో మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్‌ను కట్టడి చేసేందుకు వినూత్న సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 'ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ సిస్టమ్' పేరుతో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.. ఈ వ్యవస్థ ఉన్న కార్లు స్టార్ అవ్వాలంటే డ్రైవర్ కచ్చితంగా బ్రీత్ ఎనలైజర్ ఊదాలి. అతడు ఆల్కహాల్ సేవించలేదని నిర్ధరించుకున్నాకే కారు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ బ్రీత్ ఎనలైజర్ సాంపిల్‌లో ఆల్కహాల్ ఉన్నట్లు తేలితే కారు స్టార్ట్ అవ్వదు. డ్రైవర్లు చీటింగ్ చేయకుండా బ్రీత్ ఎనలైజర్ సాంపిల్ ఇచ్చే సమయంలో ఫొటో తీసే విధంగా ఈ టెక్నాలజీని రూపొందించారు. ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ వ్యవస్థ ఆస్టేలియాలో సత్ఫలితాలనే ఇచ్చింది. రోడ్డు భద్రతకు ఇది చాలా ముఖ్యమని 2021లో 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. భారత్‌లో కూడా ఇలాంటి సాంకేతికతను తీసుకువస్తే డ్రంక్ డ్రైవ్ ఘటనలను అరికట్టి ప్రమాదాలను నివారించవచ్చని అంతా భావిస్తున్నారు. చదవండి: అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి? -
మైనర్ మందుబాబులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ జరిగిన ‘డిసెంబర్ 31’ వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 1413 మంది హైదరాబాద్ పోలీసులకు చిక్కగా... వీరిలో మైనర్లు 22 మంది ఉన్నారు. రాచకొండలో 446 మంది పట్టుబడితే... మైనర్లు ఐదుగురు ఉన్నారు. సైబరాబాద్‌లోనూ ఇలాంటి సీనే. ఇక్కడే ఓ కీలక విషయాన్ని అటు ట్రాఫి క్, ఇటు శాంతిభద్రతల విభాగంతో పాటు ప్రత్యేక విభాగాలైన టాస్క్ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్‌లు మర్చిపోయాయి. అదే మైనర్లకు సైతం మద్యం లభించడం. వారికి మద్యం ఎలా వచ్చింది? ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం 21ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి మద్యం అమ్మకూడదు. వీరిని బార్లు, పబ్‌లలోకి అనుమతించడమూ నిషిద్ధమే. ‘డిసెంబర్ 31’న చేపట్టిన డ్రంక్ డ్రైవింగ్ పరీక్షల్లో పట్టుబడిన మైనర్లు వైన్ షాపులో ఖరీదు చేసుకుని తాగడమో, బార్‌కు వెళ్లడమో జరిగి ఉండాలి. వీటిలో ఏది జరిగినా ఆయా యాజమాన్యాలపై చర్య తీసుకోవాల్సిందే. 2016 నాటి చిన్నారి రమ్య ప్రమాదంతో పాటు నగరంలో అనేక యాక్సిడెంట్లకు మద్యం మత్తులో ఉన్న మైనర్లు కారణమయ్యారు. అలాంటి సందర్భాల్లో మాత్రమే పోలీసులు మద్యం ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై దృష్టి పెట్టి హడావుడి చేస్తు న్నారు. డిసెంబర్ 31 నాటి డ్రంక్ డ్రైవర్ల విషయంలో మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇదే అనేక సందర్భాల్లో ఉల్లంఘన జరగడానికి కారణమ వుతోంది. అక్కడితో ఆగిపోయిన సీన్ ఇలా పట్టుబడిన మందు‘బాబుల’ నుంచి ట్రాఫిక్ పోలీసులు అప్పటికప్పుడే వాహనం స్వాధీనం చేసుకుంటారు. వీరికి నిర్ణీత తేదీల్లో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. ఆపై ఈ ‘నిషా’చరులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడం ద్వారా న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారు. కేసు పూర్వాపరాలు, మద్యం మోతాదు, నడి పిన వాహనం... ఇలాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకునే న్యాయస్థానం జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధిస్తుంది. ఈ తంతు పూర్తయిన తర్వాత ఆవ్యక్తికి లేదా సంరక్షకుడికి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ‘డిసెంబర్ 31’ నాడు చిక్కిన డ్రంక్ డ్రైవర్ల కథ కూడా అక్కడితోనే ముగిసిపోతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో ప్రతి ఏడాదీ ఇలానే జరుగుతోంది. కానీ... కనిపెట్టడం పెద్ద కష్టం కాదు... డిసెంబర్ 31’న పట్టుబడిన మందుబాబుల్లో 21 ఏళ్ల లోపు వాళ్లకు మద్యం ఎవరు విక్రయించారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వీళ్లు నిర్ణీత సమయంలో కచ్చితంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) జరిగే కౌన్సెలింగ్‌కు, ఆపై ట్రాఫిక్ పోలీసులు సూచించినప్పుడు కోర్టుకు రావాల్సిందే. ఆయా సందర్భాల్లో వారిని విచారించడం ద్వారా వారికి మద్యం ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ తాగారు? తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఇది తెలిసినా పోలీసులు నేరుగా చర్యలు తీసుకోలేరు. ఏదైనా సంస్థపై ఇలాంటి ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటే లైసెన్స్ ఇచ్చిన అథారిటీకే సాధ్యం. దీంతో ఆయా వివరాలను సీసీ కెమెరా ఫుటేజ్, లోకేషన్ వంటి ఆధారాలతో సహా ఎక్సైజ్ శాఖకు అందించి, లైసెన్సు రద్దు/సస్పెన్షన్ సహా చర్యలకు సిఫార్సు చేయవచ్చు. ఇలా చేస్తే మరోసారి ఉల్లంఘన, భవిష్యత్తులో ఘోర ప్రమాదాలు తప్పే అవకాశం ఉంది. అయినప్పటికీ పోలీసులకు ఈ అంశం పట్టట్లేదనే విమర్శలు ఉన్నాయి. మైనర్ డ్రైవింగ్ కూడా తీవ్రమైనదే.. డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్లకు సంబంధించి మరో కీలకాంశమూ ఉంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం సాధారణంగా మైనర్లకు లైసెన్సులు జారీ చేయరు. దీంతో వీళ్లు వాహనం నడపకూడదు, మైనర్ డ్రైవింగ్ చేయడమే కాదు వారికి, లైసెన్సు లేని వారికి వాహనం ఇవ్వడం కూడా నేరమే. ఇలా చేసినందుకు వాహనం ఎవరి పేరుతో రిజిస్టరై ఉందో ఆ యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ‘డిసెంబర్ 31’న చిక్కిన మైనర్ల విషయంలోనూ ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. -
న్యూ ఇయర్ వేళ విషాదం.. హైదరాబాద్‌లో గోదావరివాసులు మృతి
హైదరాబాద్: కొత్త సంవత్సరం తొలి రోజే ఇద్దరు పాదచారులకు చివరి రోజైంది. న్యూ ఇయర్ పార్టీ లో పాల్గొన్న ఇద్దరు యువకులు తెల్లవారుజాము వరకు మత్తులో జోగారు. నిషాలో తమ కారులో ఇంటికి బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ృ2లో వీరి వాహనం అదుపు తప్పి పాదచారులపైకి దూసుకుపోయింది. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాదచారులు అక్కడికక్కడే మరణించగా.. మరికొందరు క్షతగాత్రులయ్యారు. మొత్తం మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతులిద్దరూ గోదావరి వాసులే ఏపీలోని కోనసీమ జిల్లా ర్యాలి గ్రామానికి చెందిన అవిడి శ్రీను (50) నగరానికి వలస వచ్చాడు. పెయింటర్‌గా పనిచేస్తూ కొండాపూర్‌లో భార్య సీత, ముగ్గురు కుమార్తెలతో ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బంజారాహిల్స్ రోడ్ నం.2లోని రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద టీ తాగాడు. కొండాపూర్ వెళ్లడానికి రోడ్డు దాటుతున్నాడు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం జక్కరం గ్రామానికి చెందిన భీమవరపు ఈశ్వరి (55) కూడా అదే సమయంలో రోడ్డు దాటుతోంది. నగరానికి వలస వచ్చిన ఆమె బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో ఉంటోంది. కొన్నాళ్ల క్రితం బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో హెల్పర్‌గా పని చేసి మానేసింది. ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఆమె కుమారుడు అరుణ్‌కుమార్ బాచుపల్లిలో నివసిస్తున్నాడు. తనిఖీలు ముగిసే వరకు ఆగి... న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న విద్యానగర్‌కు చెందిన కొడాలి ప్రణవ్ (21), నాచారంకు చెందిన పోలసాని శ్రీ రావు (21) ఈ విషయం గమనించి తనిఖీలు ముగిసిన తర్వాత కారులో ఇంటికి బయలుదేరారు. మితిమీరిన వేగంతో వస్తున్న కారు రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద రెండు కార్లను ఢీకొని తర్వాత డివైడర్‌ను ఢీకొట్టి గాల్లోకి లేచి పల్టీలు కొట్టి రోడ్డు దాటుతున్న శ్రీను, ఈశ్వరిలను బలంగా ఢీకొట్టింది. దీంతో వీరిద్దరూ గాల్లోకి ఎగిరి పది అడుగుల దూరంలో ఉన్న ఓ ఫొటో స్టూడియో బోర్డుకు తగిలి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమా దంలో ప్రణవ్, శ్రీవర్ధన్‌లకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. -
మందుబాబులకు షాక్.. 5,819 డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు
హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లలో పట్టుబడిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. తాగి వాహనాలు నడిపిన 5,819 మంది వాహనదారుల లైసెన్స్‌లను రద్దు చేసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగా 3,220 మంది లైసెన్సులు రద్దయ్యయాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రవాణా శాఖ తేల్చి చెప్పింది. చదవండి: TSRTC: లాభాల కిక్‌తో 2023లోకి ఆర్టీసీ.. పదేళ్లలో తొలిసారి.. -
తప్పుడు వార్తలు.. తాగి నడిపితే 200 కిమీ దూరం ఎలా వస్తాడు!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తాగి నడపడంతోనే కారు ప్రమాదానికి గురయ్యిందంటూ కొంతమంది సోషల్ మీడియాలో పేర్కొనడం సంచలనం రేపింది. అయితే ఈ వార్తలను పోలీసులు ఖండించారు. పంత్ తాగి కారు నడిపి ఉంటే అంత దూరం ఎలా వస్తాడని.. ఇవన్నీ తప్పుడు వార్తలని.. ఎవరు నమ్మొద్దని.. యాక్సిడెంట్ జరిగిన సమయంలో పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారని పోలీసులు పేర్కొన్నారు. ''మేము 8-10 స్పీడ్ కెమెరాలను పరిశీలించాం. ఒకవేళ పంత్ మద్యం సేవించి ఉంటే ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరం ఒక్క యాక్సిడెంట్ కూడా చేయకుండా కారు ఎలా నడపగలడు? కారు ప్రమాదానికి గురైనప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యుడు వెల్లడించాడు. పంత్ మద్యం సేవించలేదు కాబట్టి కారు లోంచి బయటకు రాగలిగాడు. ఆ టైమ్‌లో తాగినవాళ్లు కారు నుంచి బయటకు రాలేరు. పైగా పంత్‌ను రక్షించిన బస్ డ్రైవర్‌తో కూడా పంత్ మాములుగానే మాట్లాడడం సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. పంత్ తన కారును ఎక్కడా 80 కిలోమీటర్ల వేగ పరిమితికి మించి నడపలేదు. బహుశా నిద్రమత్తు రావడంతో కారు డివైడర్‌ను ఢీకొట్టి ఉంటుంది. అయితే 70 నుంచి 80 కిమీ వేగంతో ఉండడంతోనే కారు గాల్లో పల్టీ కొట్టింది. మా టెక్నికల్ టీమ్ యాక్సిడెంట్ జరిగిన స్థలానికి వెళ్లింది. అక్కడ ఓవర్ స్పీడ్‌కు సంబంధించిన ఆధారాలు ఏవీ లభించలేదు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు'' అని హరిద్వార్ సీనియర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో పంత్ చికిత్స పొందుతున్నాడు. అతనికి ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో పంత్ వచ్చే ఏడాది క్రికెట్ ఆడడం అనుమానమే. చదవండి: WWE: అంతుచిక్కని వ్యాధితో మాజీ రెజ్లింగ్ స్టార్ కన్నుమూత తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్ -
మందుబాబులకు హెచ్చరిక..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఎంతో జోష్‌తో జరుపుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా వేడుకలపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. అటు ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం వేడుకలపై ఫోకస్ పెట్టారు. న్యూ ఇయర్ వేడుకలపై మందుబాబులపై ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టి 26 స్ట్రైకింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈవెంట్లలో డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు. ఇక, డిసెంబర్ 31 సందర్బంగా రాత్రి 12 గంటల వరకు వైన్స్, ఒంటి గంట వరకు బార్లకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కూడా మందుబాబులను హెచ్చరించారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు. ఓఆర్ఆర్, వంతెనలు బంద్ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నం–45, సైబర్ టవర్, ఫోరంమాల్–జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్‌పాస్‌లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదు. -
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలు.. ఇవి అస్సలు మరవద్దు!
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ పార్టీ విషయంలో సభ్యత, భద్రత మరువద్దని నగర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని చెప్తున్నారు. సాధారణ సమయాల్లో హోటళ్లు, పబ్స్, క్లబ్స్‌ను రాత్రి 12 వరకే తెరిచి ఉంచాలి. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఒక గంట అదనంగా అనుమతించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఒంటి గంట తరవాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలివి.. కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. ►వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ►ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీలు నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. ►యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహుతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. ►నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. చదవండి: New Year Celebrations: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో .. ►ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు. ఓఆర్ఆర్, వంతెనలు బంద్ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గలలో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నం–45, సైబర్ టవర్, ఫోరంమాల్–జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్‌పాస్‌లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదు. -
31st నైట్.. మందుబాబులూ జాగ్రత్త..!
-
మద్యం మత్తులో యువతి హల్చల్.. బీర్‌బాటిల్‌తో దాడి.. ఏఎస్సైకి తీవ్రగాయాలు
సాక్షి, విశాఖపట్నం: మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువతి హల్చల్ చేసింది. విశాఖ బీచ్ రోడ్డులో బీరు తాగుతూ యువతి న్యూసెన్స్ చేసింది. దీనిని ప్రశ్నించిన ఏఎస్ఐ సత్యనారాయణపై మద్యం బాటిల్‌తో దాడికి యత్నించింది. అది గురితప్పి పక్కనే ఉన్న గోవింద్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచింది. అనంతరం ఏఎస్సైని కాలితో తన్ని, దాడికి పాల్పడుతూ తీవ్రంగా గాయపరిచింది. పోలీసులు అయితే మీరేం చేస్తారంటూ అసభ్యపదజాలంతో యువతి రెచ్చిపోయింది. నా బాయ్ ఫ్రెండ్‌కి చెప్పి మిమ్మల్ని లేపించేస్తానంటూ బెదిరింపులకు దిగింది. రేపటి నుంచి పోలీసులెవరూ రోడ్డుమీద తిరగకుండా చేస్తానని మద్యం మత్తులో హెచ్చరించింది. ఘటన జరిగిన సమయంలో యువతి ఫుల్‌గా మద్యం సేవించినట్లు గుర్తించారు. గాయపడిన గోవింద్ అనే యువకుడు యువతిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: (భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు..) -
పానీపూరీ తింటున్న చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు.. తాగిన మైకంలో!
లక్నో: మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తాగిన మైకంలో కారును రోడ్డు పక్కన పానీపూరీ తింటున్న ముగ్గురు చిన్నారులపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నోయిడా సెక్టర్ 45లోని సదర్‌పూర్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రియా(6), అను(15), అంకిత(18) అనే ముగ్గురు అక్కచెల్లెల్లు పానీపూరీ(గోల్గప్పా) తినేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద తింటుండగా.. అదే సమయంలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలవ్వగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరేళ్ల రియా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు పోలీసు అధికారి రాజీవ్ బల్యాన్ తెలిపారు. మరో బాలిక అను వెన్నుముకకు గాయాలు అవ్వగా, అంకితకు చిన్న గాయాలైనట్లు పేర్కొన్నారు. అయితే బాధితురాలి తల్లి పక్కన నిల్చున్నందున తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ మద్యం సేవించి అతివేంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. కారు ఢీకొట్టడంతో గప్‌చుప్ బండి బోల్తా పడినట్లు చెప్పారు. అలాగే పక్కనే ఉన్న ఇటుకల గోడ కూడా పడిపోయినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో గుమిగూడిన జనం డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారుని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. తెలంగాణలో మరీ ఇంత ఘోరమా?
(శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి) ఉద్వేగాల నేల తెలంగాణ.. సంతోషం, సంబురం, వినోదం, విషాదం.. ఏదైనా సామూహిక విందు ఇక్కడి కలివిడి జీవితాలకు సంకేతం. నలుగురు కలిసిన సమయంలో విందు, విలాసాల్లో సరదాగా మొదలవుతున్న మద్యం వినియోగం.. తర్వాత అలవాటుగా మారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్న మద్యంతో వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దేశంలో అరుణాచల్‌ప్రదేశ్ 15 లక్షలు జనాభాలో సుమారు 7.60 లక్షల మందికి మద్యం తాగే అలవాటుతో టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ నాలుగు కోట్లకుపైగా జనాభా ఉండగా.. వీరిలో 15– 49 ఏళ్ల మధ్య వయసువారిలో యాభై ఐదు శాతం మంది మద్యం తాగుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019–21) ఇటీవలే వెల్లడించింది. కొత్తగా మద్యం అలవాటు అవుతున్న వారి సంఖ్య జాతీయ సగటు కంటే వేగంగా పెరుగుతోందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా.. తెలంగాణలో మద్యం అలవాటు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా 62 శాతం (15–49 ఏళ్ల మధ్య వయసువారిలో) మేర ఉంది. ఇందులో 7శాతం మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇందులో 54శాతం మంది వారంలో ఒకసారి మద్యం తాగుతుంటే.. 28శాతం మంది నాలుగు రోజులకోసారి, మరో 19 శాతం మంది ప్రతిరోజు తాగుతున్నారు. ఇక మద్యం అలవాటు/వ్యసనంగా మారిన కుటుంబాల్లో 28 శాతం మంది మహిళలు భర్తల నుంచి హింసకు గురవుతున్నారు. 16 శాతం మంది మహిళలు తీవ్రగాయాల పాలవుతున్నట్టు జాతీయ కుటుంబ సర్వే పేర్కొంది. నిషాలో ప్రమాదాలతో.. దేశంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పది రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు, మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో బాధితులు 18– 35 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇక పదిలక్షల జనాభా దాటిన యాభై నగరాల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి.. హైదరాబాద్ 7వ స్థానంలో ఉందని ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ వింగ్ 2020 నివేదిక పేర్కొంది. అమ్మకాలు.. ఆదాయం.. చీర్స్ మద్యం వినియోగం అధికంగా ఉండే రాష్ట్రాలతో పోలిస్తే తలసరి వినియోగంలో తెలంగాణ టాప్‌లో ఉంది. రాష్ట్రంలో 2017–2020 మధ్య మద్యం వినియోగం 18 శాతం పెరిగి రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపించింది. అత్యధికంగా మద్యం విక్రయించిన వైన్స్‌ల వివరాలు చూస్తే తాజా ఎక్సైజ్ ఏడాదిలో.. హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ వైన్స్ రూ.38 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయిస్తే, అశ్వారావుపేటలో రూ.31 కోట్లు, కరీంనగర్లో రూ.29 కోట్లు, కల్వకుర్తిలో ఒక వైన్స్ రూ.20.50 కోట్లు, నిజామాబాద్‌లో ఒక వైన్స్ రూ.19.50 కోట్లు, తొర్రూరులో ఒకవైన్స్ రూ.14.33 కోట్లు విలువైన మద్యాన్ని బాటిలింగ్ యూనిట్ల నుంచి కొనుగోలు చేసి జనానికి విక్రయించాయి. డ్రంకెన్ డ్రైవ్.. ప్రాణాలు తీసింది.. అది 2021 డిసెంబర్ 18. తెల్లవారుజామున రెండుగంటలు.. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న కారు సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో చెట్టును ఢీకొట్టి రెండు ముక్కలైంది. డ్రైవర్ సీట్లో ఉన్న రహీం అనే యువకుడితోపాటు ఎం.మానస, ఎన్.మానస ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. సిద్ధు అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రహీం మద్యం మత్తులో వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై జడ్చర్లకు చెందిన మానస తండ్రి రవీందర్‌ను పలకరిస్తే.. ‘‘ఆరేళ్ల క్రితమే తల్లిని పోగొట్టుకున్న మానసను గారాబంగా పెంచాను. ఆమెకు ఇష్టమైన టీవీ, సినిమా రంగంలోకి వెళ్తానంటే సంతోషపడ్డాను. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటుందని భావించాను. కానీ డ్రంకెన్ డ్రైవ్ నా బిడ్డను నాకు కాకుండా చేసింది. ఇలాంటి శిక్ష ఏ తండ్రికి పడొద్దు..’’అని కన్నీళ్లు పెట్టారు. పెంచిన చేతులతోనే.. అతడి పేరు కిరణ్ (28).. బీరుతో సరదాగా మొదలైన వ్యసనం విస్కీతో విస్తరించింది. ఆపై గంజాయికీ చేరింది. మత్తు లేనిదే ఉండలేక డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం, దాడులు చేయడం దాకా ఉన్మాదం చేరింది. కిరణ్ భార్య వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అక్టోబర్ 10న మత్తులో ఇంటికి వచ్చిన కిరణ్ డబ్బులు కావాలంటూ తల్లి మీద దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రినీ గాయపరిచాడు. ఏమీ దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు కిరణ్ మెడకు తాడు బిగించి చంపేశారు. ఇది సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన విషాద ఘటన. జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాలనుకున్న తల్లిదండ్రులు యాదగిరి, వెంకటమ్మ మద్యం పెట్టిన చిచ్చుతో జైలు జీవితం గడుపుతున్నారు. తల్లి కోసం తండ్రిని.. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ ఉన్నంతలో బాగానే కాలం గడిపారు. భర్త భాస్కర్ (45) ఆటో నడుపుతూ భార్య కరుణారాణి, ఇద్దరు కుమారులు బాలతేజ, తరుణ్ తేజలను పోషించుకుంటూ వచ్చాడు. కానీ భాస్కర్ సరదాగా మొదలుపెట్టిన మద్యం తాగుడు.. తర్వాత అలవాటుగా, వ్యసనంగా మారింది. కొన్నేళ్ల క్రితం మద్యం మత్తులో భాస్కర్ దాడి చేయడంతో భార్య చేయి విరిగింది. తర్వాతా మద్యానికి డబ్బుల కోసం వేధించడం పెరిగింది. ఈ నెల 20న ఆలేరు మండలం తూర్పుగూడెంలో చర్చి పండగతో ఊరంతా సందడిగా ఉంటే.. భాస్కర్ మాత్రం తనకు తాగేందుకు డబ్బులివ్వాలంటూ భార్యపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన కొడుకులను గాయపర్చాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇద్దరు కొడుకులు కత్తితో దాడి చేయగా.. భాస్కర్ చనిపోయాడు. ఆ ఇద్దరు జైలుకు వెళ్లారు. కరుణారాణిపైనా కేసు నమోదైంది. కష్టం చేస్తేగానీ పూటగడవని కుటుంబానికి మద్యం అలవాటు చేసిన గాయం ఎలా మానుతుందంటూ తూర్పుగూడెం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రేమపెళ్లి.. నడిరోడ్డులో ఆలిని నరికేసి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రం భవానినగర్ తండాలో ఉండే జాటోత్ భాస్కర్ 15 ఏళ్ల కింద కల్పన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భాస్కర్ ఒకచోట గుమాస్తాగా, కల్పన ఇళ్లలో పనిచేస్తూ ముగ్గురి ఆడపిల్లల్ని పోషించుకుంటూ వచ్చారు. కానీ, కొంతకాలంగా మద్యానికి బానిసైన భాస్కర్ తాగి వచ్చి డబ్బుల కోసం కల్పనను కొట్టేవాడు. వేధింపులు భరించలేక కల్పన ఈ ఏడాది సెప్టెంబర్ 17న పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై ఆగ్రహించిన భాస్కర్ సెప్టెంబర్ 22న ఉదయం పనికోసం వెళ్తున్న కల్పనను నడిరోడ్డులో కత్తితో పొడిచి చంపాడు. తల్లి హత్యకు గురై తండ్రి జైలుకు వెళ్లడంతో చిన్నారులు అమ్మమ్మ ఇంట్లో భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. భారీగా మద్యం ఆదాయం 2020–21లో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు పదివేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మిగతా జిల్లాల్లో బాట్లింగ్ యూనిట్ల ద్వారా ప్రభుత్వానికి నేరుగా వచ్చిన ఆదాయం ఇదీ .. సులువైన ఆదాయం మద్యం నుంచే.. అది పేరుకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ. కానీ ప్రొహిబిషన్ (నిషేధం) బదులు విస్తరణ శాఖగా మార్చేశారు. మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ప్రభుత్వాలకు సులువుగా వచ్చే ఆదాయం ఇదే. కానీ మద్యం వినియోగంతో పాటు క్రైం రేటు భారీగా పెరుగుతోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను మర్చిపోయామనిపిస్తోంది. – ఎంవీ చంద్రవదన్, ఎక్సైజ్ మాజీ కమిషనర్ డేంజర్ జోన్‌కు చేరువలో ఉన్నాం తెలంగాణ ఇప్పుడు డేంజర్ జోన్‌కు చేరువలో ఉంది. మా అంచనా మేరకు 90శాతం మంది (15 ఏళ్లు పైబడిన వారిలో) పలు రకాల మద్యం తాగుతున్నారు. మొదట తొలుత కల్లు, బీరు, విస్కీ.. అనంతరం గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. పంజాబ్ ఇప్పటికే మద్యం వినియోగం నుంచి డ్రగ్స్ వైపు వెళ్లింది. తెలంగాణలో పరిమితికి మించి మద్య వినియోగం జరుగుతుంది. కొన్నాళ్లకు ఈ మత్తు చాలక గంజాయి, డ్రగ్స్ వైపు వెళ్లటం సహజం. తక్షణం మద్య నియంత్రణ కార్యాచరణ ప్రకటించకపోతే తెలంగాణ మరో పంజాబ్ కావడానికి ఎంతో సమయం పట్టదు. – ఎం పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మద్యం విచక్షణను దూరం చేస్తుంది సరదా కోసం తీసుకునే మద్యం అలవాటుగా మారి మనిషిలో విచక్షణను దూరం చేస్తోంది. మెదడు నుంచి కాలిబొటన వేలి వరకు ప్రభావం చూపుతుంది. ఆహారంలా అవసరంగా మారి.. మద్యం తీసుకోకపోతే మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. – డాక్టర్ ఎ.లక్ష్మీలావణ్య, హైదరాబాద్ -
వైరల్ వీడియో: మద్యం తాగి బస్సు ఎక్కిన వ్యక్తి.. కిందకు తోసేసిన బస్సు కండక్టర్
-
Cyberabad Traffic Police: మద్యం సేవించి వాహనం నడపకండి
-
మందుకొట్టి.. గొడ్డలి పట్టి కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, మెదక్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనం స్వాదీనం చేసుకున్నారన్న కోపంతో ఒక మందుబాబు గొడ్డలితో కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో మంగళవారం జరిగింది. తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి తెలిపిన వివరాలివి. పట్టణంలోని నర్సాపూర్ వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే మున్సిపల్ పరిధిలోని రావెల్లి గ్రామానికి చెందిన మల్లేశ్‌యాదవ్ తన ద్విచక్రవాహనంపై అటు వస్తున్నాడు. పోలీసులు అతని వాహనం ఆపి తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తుడైన మల్లేశ్‌యాదవ్ తన ఇంటికి వెళ్లి.. కాసేపటికి నర్సాపూర్ వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న చోటికి చేరుకున్నాడు. తన బైక్ స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ ఆఫీజ్, హోంగార్డు ఇలియాస్‌పై వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆఫీజ్ తలపై రెండు చోట్ల తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కానిస్టేబుల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లేశ్‌యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: మందుబాబుకు 30 రోజుల జైలు
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడపవద్దని పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసే వాహనదారుల కళ్లు బైర్లుకమ్మేలా కోర్టు తీర్పు వెలువరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రోజుల జైలు శిక్ష విధించింది. వరుసగా నాలుగుసార్లు డ్రంకన్ డ్రైవ్ (డీడీ) కేసులలో గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన సదరు మందుబాబుకు కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. రక్తంలో ఆల్కాహాల్ స్థాయి (బీఏసీ) 50గా ఉంది. ఇక, శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో పట్టుబడిన మరో మందుబాబుకు 22 రోజుల పాటు జైలు శిక్ష ఖరారైంది. ఈయన బీఏసీ 550గా నమోదయింది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత నెలలో 3,835 డీడీ కేసులు నమోదయ్యాయి. 93 మందికి కోర్టు జైలు శిక్షను, రూ.1.21 కోట్లు జరిమానాను విధించింది. కాగా గత నెలలో 18 మంది మైనర్ మందుబాబులు పట్టుబడ్డారు. ఆయా కేసులలో న్యాయస్థానం రూ.22 వేలు జరిమానా ఖరారు చేసింది. మొత్తం 479 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రద్దు కోసం ట్రాఫిక్ పోలీసులు సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)లకు సిఫార్సు చేశారు. అత్యధికంగా 615 డీడీ కేసులు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో నమోదయ్యాయి. ఆయా కేసులలో న్యాయస్థానం రూ.18.52 లక్షలు జరిమానా, మొత్తం 13 మందికి జైలు శిక్షను విధించింది. ఏకంగా 153 మంది వాహనదారుల డీఎల్ రద్దుకు ఆదేశించారు. చదవండి: (మాగుంట కుటుంబంలో విషాదం) -
పగలూ రాత్రీ బాదేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: పోలీసు పనితీరుకు ప్రామాణికమంటూ డీజీపీ కార్యాలయం అమలులోకి తీసుకువచ్చిన వర్టికల్స్ విధానం అటు పోలీసులు, ఇటు నగర వాసులకు నరకం చూపిస్తోంది. ఇందులో నిర్దేశించిన మేరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల కోసం ట్రాఫిక్ విభాగం అధికారులు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా రోడ్డున పడుతున్నారు. అదేమంటే రోడ్డు ప్రమాదాల నిరోధం కోసమే ఇవన్నీ చేస్తున్నామని చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే. డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కావడం తప్ప ఆశించిన స్థాయిలో రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు. పనితీరు మదింపు... శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ వింగ్ సహా ప్రత్యేక విభాగాలను పని తీరును మథించడానికి డీజీపీ కార్యాలయం వర్టికల్స్ విధానాన్ని రూపొందించింది. బీటు కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు ఎవరెవరు, ఏ రకమైన విధులు నిర్వర్తించాలనేది నిర్దేశించింది. వీటిని వీళ్లు ఎంత సమర్థంగా వ్యవహరిస్తున్నారన్నది గుర్తించడానికంటూ వర్టికల్స్ విధానం అమలులోకి తీసుకువచ్చారు. ప్రతి నెలా ఆయా అధికారులు తమ పని తీరును ఈ వర్టికల్స్‌లో నిర్దేశించిన విధంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే డీజీపీ కార్యాలయం ర్యాంకింగ్స్ ఇస్తూ ఉత్తమ అధికారులను గుర్తిస్తోంది. డీడీ తనిఖీలను చేర్చి.. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ వంటి ప్రత్యేక విభాగాలకు సైతం కొన్ని అంశాలను నిర్దేశించారు. ట్రాఫిక్ పోలీసుల విషయానికి వచ్చేసరికే అసలు సమస్య వచ్చిపడుతోంది. వీళ్లు నిర్వర్తించే ప్రతి పనీ నేరుగా నగర వాసులు ఇంకా పక్కాగా చెప్పాలంటే వాహన చోదకులతో ముడిపడి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుల పనితీరును గుర్తించే వర్టికల్స్‌లో పెండింగ్ ఈ–చలాన్ల వసూలుతో పాటు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలను డీజీపీ కార్యాలయం చేర్చింది. ఒక్కో పోలీసుస్టేషన్ ఒక నెలలో ఏ తరహావి, ఎన్ని కేసులు నమోదు చేస్తోందనేది గణిస్తోంది. ఆ ప్రాంతాలు, సమయాల్లో చేస్తే ఒకే... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు గడిచిన కొన్నాళ్లుగా ప్రతి రోడ్డు ప్రమాదాన్నీ అధ్యయనం చేస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో, ఏయే సమయాల్లో, ఏ కారణం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశంపై నివేదికలు రూపొందించారు. వీటి ఆధారంగా డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో, ఆ సమయాల్లో ఈ తనిఖీలు నిర్వహించేలా చేస్తే సరిపోతుంది. అలా కాకుండా అనునిత్యం రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వీటిని నిర్వహిస్తుండటంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి పరిస్థితులను మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి.. ట్రాఫిక్ విభాగం అధికారులు వర్టికల్స్‌ను అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పగలు–రాత్రి తేడా లేకుండా రోడ్లపై డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలన్నీ ప్రధాన రహదారులపై జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. మరోపక్క అసలే అరకొర సిబ్బందితో ఉన్న ట్రాఫిక్ ఠాణాలకు ఈ తనిఖీలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రాత్రి వేళల్లో డ్రంక్ డ్రైవింగ్ చేసిన వాళ్లూ ఉదయం డ్యూటీకి రావాల్సి రావడం.. ఒక్కోసారి మళ్లీ పగటిపూట కూడా ఈ తనిఖీలు చేయాల్సి వస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. పని భారం తప్పించాలంటూ ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. (చదవండి: వాహనదారులకు అలర్ట్ ఈ రూట్స్‌లో వెళ్లకండి.. ట్రాఫిక్ మళ్లింపులు కలవు) -
డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికారో ఇక అంతే.. మీ రక్తం గుంజుడే!
చండీగఢ్: తాగి బండి నడుపొద్దని పోలీసులు ఎంత చెప్పినా వినటం లేదు మందు బాబులు. వేలకు వేలు ఫైన్లు రాసినా దారికి రావటం లేదు. ఈ క్రమంలో ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు పంజాబ్ పోలీసులు. కొత్త ట్రాఫిక్ నియమాలకు శుక్రవారం ఆమోద ముద్ర వేసింది అక్కడి ప్రభుత్వం. ఈ కొత్త నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందు కొట్టి పట్టుబడితే.. రక్త దానం చేయాలి. లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో కొన్ని గంటల పాటు రోగులకు సేవ చేయాలి. కొత్త నిబంధనలు ఇలా.. మందు కొట్టి దొరికిపోయిన వారు తప్పనిసరిగా రక్త దానం చేయాలి. లేదంటే సమీపంలోని ఆసుపత్రిలో కొన్ని గంటలు సేవ చేయాలి. రెండు గంటల పాటు చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి. రవాణా శాఖ నుంచి రీఫ్రెస్ కోర్స్ ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది. మరోవైపు.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేయనున్నారు. అందులో ఓవర్ స్పీడ్, వాహనం నడుపుతూ మొబైల్ వాడటం, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్‌లు వంటివి ఉన్నాయి. ఒక వేల రెండోసారి దొరికితే రెండింతల ఫైన్ వేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసినా.. మొబైల్ వాడినా రూ.5వేల జరిమానా విధిస్తారు. రెండోసారి అది డబుల్ అవుతుంది. అలాగే.. ఓవర్ లోడు వాహనాలకు రూ.20వేల జరిమానా విధించనున్నారు. రెండోసారి అలాగే చేస్తే జరిమానా రెండింతలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు మొదటిసారి రూ.వెయ్యి, రెండోసారి డబుల్ ఉంటుందన్నారు. పంజాబ్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు 13 మంది మరణిస్తున్నారు. 2011 నుంచి 2020 వరకు 56,959 ప్రమాదాలు జరిగాయి. 46,550 మంది మరణించారు. ఇదీ చూడండి: ఆర్ఎల్పీ ఎమ్మెల్యే కారు చోరీ.. పోలీసుల తీరుపై ఆరోపణ! -
నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్
అసలే దట్టమైన నల్లమల అభయారణ్యం.. ఎత్తయిన ఘాట్ రోడ్డు.. భారీ మలుపులు.. వాహనదారుల అజాగ్రత్తలతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే రెండువైపులా భారీగా నిలిచిపోతున్న వాహనాలు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. సంఘటన స్థలానికి అంబులెన్స్, పోలీసు వాహనాలు చేరుకునేందుకు కూడా అష్టకష్టాలు పడాలి.. ఈలోపు క్షతగాత్రుల ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొని ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లలో వాహన ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయడం.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో చెక్ పెడుతున్నారు. పెద్దదోర్నాల: ► శ్రీశైలం వైపు వేగంగా వెళ్తున్న ఓ టూరిస్టు బస్సు ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోయి అదుపుతప్పి తుమ్మలబైలు వద్ద బోల్తాపడిన సంగతి పాఠకులకు విధితమే. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ► మూడు రోజుల కిందట ఓ కారు శ్రీశైలం ఘాట్ రోడ్డులో సాక్షి గణపతి ఆలయ సమీపంలో బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది. అధిక శాతం వాహనదారులకు ఘాట్ రోడ్లపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. అతివేగం కారణంగా జరుగుతున్న అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తోంది. ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని సమస్యాత్మక రోడ్లతో పాటు అత్యంత ప్రమాదకర రోడ్లుగా నల్లమల అభయారణ్యంలోని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లను గుర్తించారు. ఘాట్ రోడ్లలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు లేజర్ స్పీడ్ గన్లతో పరిశీలించి వాహనాల మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా జరిమానాలు విధించేందుకు బ్రీత్ ఎనరైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో వాహనదారులకు పరీక్షలు.. మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు కర్నూలు రహదారిపై వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం వలన అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తేలడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దానివలన ఏ తప్పూ చేయని ఎదుటి వ్యక్తుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఘాట్ రోడ్లపై 40 కి.మీ వేగానికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని, సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వేగంతోనే తరుచూ ప్రమాదాలు.. మితిమీరిన వేగం, వాహనాలను నడిపే సమయంలో నిర్లక్ష్యం కారణంగానే ఘాట్ రోడ్లపై ఎక్కువగా వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు గుర్తించారు. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు రోడ్డులోని రోళ్లపెంట నుంచి మండల కేంద్రం వరకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు రహదారులూ ఘాట్ రోడ్లే. ఈ మార్గాలలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు, భక్తులు వందలాది వాహనాల్లో శ్రీశైలం వెళ్తారు. కొన్నేళ్లుగా ఘాట్ రోడ్లలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని ముఖ్య రహదారులపై ప్రయాణించే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అధికారులు లేజర్ గన్లను వినియోగిస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలకు జరిమానాలు, ఈ–చలానాలు విధిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానికి వెళ్లే రహదారులతో పాటు, అత్యంత క్లిష్టమైన శ్రీశైలం ఘాట్ రోడ్డులో స్పీడ్ గన్లను ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. మితిమీరిన వేగంగా వెళ్తున్న వాహనాలను కంట్రోలు చేసేందుకు స్పీడు గన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వేగ నియంత్రణకు పటిష్ట చర్యలు మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల వలనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందువలన అతివేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు ఘాట్ రోడ్లలో స్పీడ్ గన్లను వినియోగిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించి జరిమానాలు విధిస్తున్నాం. దీనివలన రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలుగుతున్నాం. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం. సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపటం అనర్థదాయకం. - మారుతీకృష్ణ, సీఐ, యర్రగొండపాలెం -
1,518 సివిల్ కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టుల్లో 1,518 సివిల్ కేసుల పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.24,70,81,376 నష్ట పరిహారం అందజేశారు. నగరంలోని సివిల్ కోర్టులలో మొత్తం పది బెంచీలు ఏర్పాటు చేసి ఆదివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించినట్లు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ రేణుకా యారా తెలిపారు. ఈ సందర్భంగా 324 మోటార్ ప్రమాదం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేసులను కూడా పరిష్కరించామని, బాధితులకు రూ.21 కోట్ల నష్టపరిహారాన్ని అందజేశామని వివరించారు. పర్మినెంట్ లోక్ అదాలత్‌లోని ప్రజా సేవల రంగంలోని ప్రీలిటిగేషన్ కేసులు, 1,092 ఎస్బీఐ బ్యాంక్ కేసులను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో రేణుక యారా మాట్లాడుతూ.. కాలయాపన లేకుండా సత్వర న్యాయం పొందటం కేవలం లోకదాలత్ లోనే సాధ్యమవుతుందన్నారు. కక్షిదారులు ఇలాంటి జాతీయ లోక్ అదాలత్‌లో తమ కేసుల సత్వర పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. రెండవ అదనపు చీఫ్ జడ్జి కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుకు అప్పీలు ఉండదని, అంతేకాక అది శాశ్వత పరిష్కారం అవుతుందని వివరించారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.మురళీమోహన్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లో పరిష్కారమైన సివిల్ కేసులలో కక్షిదారులకు వారు చెల్లించిన కోర్టు ఫీజు వాపసు చెల్లిస్తారన్నారు. బార్ అసోసియేషన్ నూతన కార్యదర్శి నాగభూషణం, మాట్లాడారు. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ న్యాయస్థానంలోని లోక్ అదాలత్ బెంచ్‌లకు చీఫ్ జడ్జి రేణుకా యారా, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నిర్మల గీతాంబ, రెండవ అదనపు చీఫ్ జడ్జ్ కె ప్రభాకర్ రావు, అదనపు జిల్లా న్యాయమూర్తులు ఉమాదేవి, అపర్ణ , సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ తదితరులు నేతృత్వం వహించగా.. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో అదనపు చీఫ్ జడ్జి జీవన్ కుమార్ నేతృత్వం వహించారు. రాచకొండలో 99,476 కేసుల పరిష్కారం రాచకొండ కమిషరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న 99,476 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో..93,930 కేసులు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కేసులు కాగా..3,293 కేసులు ఐపీసీ కేసులు, 2.253 డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా సెషన్స్ జడ్జి సీ హరే కృష్ణ భూపతి, రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) సెక్రటరీ ఏ శ్రీదేవి, యాదాద్రి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి వీ బాల భాస్కర్ రావులు లోక్ అదాలత్ లను నిర్వహించి కేసులను పరిష్కరించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అదనపు సిపి జీ సుధీర్ బాబు తదితర పోలీస్ అధికారులు పాల్గొని లోక్ అదాలత్ నిర్వహణను పర్యవేక్షించారు. (చదవండి: మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లపై ఆంక్షలు) -
తప్పతాగి రెచ్చిపోయిన యువతి.. నడిరోడ్డుపై పోలీస్ కాలర్ పట్టుకొని..
మద్యం తాగి వాహనం నడపడం నేరం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా ఎంతో మంది జనాలు దీనిని పట్టించుకోకుండా ఫంక్షన్లు, పార్టీలంటూ ఫుల్‌గా తాగి రోడ్డుపైకి వస్తుంటారు. తాగి నడపడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు అవుతుంటాయి. వీటిని అరికట్టేందుకు పోలీసులు డ్రంక్ డ్రైవ్‌లను పేరుతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన మందుబాబుల ప్రవర్తనల్లో మార్పులు రావడం లేదు. కొంత మంది తాగి బండి నడపడమే కాకుండా.. ఎదురు పోలీసుల మీదే తిరగబడుతుంటారు. అచ్చం ఇలాగే మద్యం మత్తులో ఓ యువతి పోలీసు అధికారితో రెచ్చిపోయి ప్రవర్తించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. ఫుల్‌గా తాగిన ఓ యువతి కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది. తాగిన మైకంలో అందరిని తిడుతూ నానా హంగామా చేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల రాకతో ఆవేశంతో ఊగిపోయిన సదరు యువతి.. తాగిన మత్తులో ఏం చేస్తుందో కూడా తెలియకుండా ప్రవర్తించింది. విధుల్లో ఉన్న పోలీసు పట్ల నడి రోడ్డుపై దురుసుగా ప్రవర్తించింది. ఆయన కాలర్ పట్టుకొని బెదరిస్తూ వాగ్వాదానికి దిగింది. పోలీస్ అధికారి జుట్టు పట్టుకొని తన్నేందుకు ప్రయత్నించింది. అంతటితో ఆగకుండా చివర్లో పోలీస్ ధరించిన మాస్క్నే లాక్కొని పడేసింది. एक और परी की Video Viral है। देखिए कैसे एक पुलिस अधिकारी की वर्दी का कॉलर पकड़ कर खड़ी है और पुलिस वाला बेबस है। क्योंकि जानता है गलती से अगर उसने लड़की को ही हाथ लगा दिया तो क़ानून उसको ही नाप देगा। pic.twitter.com/5AHtj3E2A7 — Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) June 19, 2022 అయితే ఇంత జరుగుతున్న ఆ పోలీస్ అధికారి ఆమెను ఏం అనలేదు. మహిళ కావడంతో అతను సైటెంట్ ఉన్నారు. యువతి మీద మీదకు వస్తుంటే ఆమెను దూరంగా జరిపారు. యువతి ప్రవర్తిస్తున్న తీరును కొంతమంది తమ ఫోన్లో రికార్డు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్ట్ తన ట్విటర్‌లోషేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి కావడంతో ఆ పోలీస్ అధికారి నిస్సహయంగా ఉండి పోయారని లేకుండే మరోలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. చదవండి: Viral Video: హ్యాట్సాఫ్ సార్! స్వయంగా చేతులతో డ్రైయిన్‌ని క్లీన్ చేసిన ఆఫీసర్ -
‘జంపింగ్’ బాబులు జడుసుకునే వార్త
న్యూఢిల్లీ: రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా సిగ్నల్ జంప్ చేసే వాహనదారులు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జంపింగ్ బాబులు జడుసుకునే వార్త కేంద్రం తాజాగా వెల్లడించింది. రెడ్‌లైట్ జంపింగ్ కారణంగా రోడ్డు ప్రమాద మరణాలు 2019తో పోలిస్తే 2020లో 79 శాతం పెరిగాయని తాజా నివేదికలో పేర్కొంది. 'భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు - 2020' నివేదికను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ వల్ల 2020లో 919 ప్రమాదాలు సంభవించగా.. 476 మంది మృతి చెందారు. 2019లో 266 మంది దుర్మరణం పాలయ్యారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ కారణంగా 2020లో 3,099 మంది ప్రాణాలు కోల్పోగా.. 2019లో 2,726 మంది మృత్యువాత పడ్డారు. మద్యం మత్తులో ప్రమాదాలకు గురై 2020లో 1862 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో 2376 మరణాలు నమోదయ్యాయి. మితిమీరిన వేగమే అత్యధిక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. 2020 క్యాలెండర్ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 3,66,138 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 1,31,714 మంది మరణించగా.. 3,48,279 మంది క్షతగాత్రులయ్యారు. అయితే 2019తో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 18 శాతం, మరణాల రేటు 12.8 శాతం తగ్గింది. రోడ్డు ప్రమాద బాధితుల్లో 18-45 ఏళ్ల వయస్సు గల యువకులే 69 శాతం మంది ఉండగా.. మొత్తం మరణాల్లో 18 నుంచి 60 ఏళ్లలోపు వర్కింగ్ వయసులో ఉన్నవారు 87.4 శాతం మంది ఉండడం ఆందోళన కలిగించే అంశం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడానికి కోవిడ్-19 లాక్డౌన్ కారణమని నివేదిక వెల్లడించింది. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, కొత్త మోటారు వాహన చట్టం అమలు చేయడం వల్ల కూడా దుర్ఘటనలు తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనదేశంలో 11 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రహదారి దుర్ఘటనల్లో మరణించిన ప్రతి 10 మందిలో ఒకరు మనదేశానికి చెందినవారు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. (క్లిక్: బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం) 2018లో స్వల్పంగా(0.46 శాతం) పెరగడం మినహా 2016 నుంచి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయం. వరుసగా రెండో ఏడాది ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడం కొంతలో కొంత ఊరట. అదేవిధంగా, గాయపడిన వారి సంఖ్య కూడా 2015 నుండి తగ్గుతూ వస్తోంది. (క్లిక్: లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి) -
మాజీ మంత్రి కొడుకు హల్చల్.. కారులో మందు తాగుతూ రోడ్డుపై..
మద్యం మత్తులో కాంగ్రెస్ మాజీ మంత్రి కొడుకు రెచ్చిపోయాడు. ఫుల్లుగా తాగి వాహనం నడుపుతూ రోడ్డుపై హల్చల్ చేశాడు. మద్యం మత్తులోనే ఓ వ్యాపారి కారును ఢీకొని అతడితో వాగ్వాదానికి దిగి కత్తితో బెదిరించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షాజాపూర్‌కు చెందని కాంగ్రెస్ మాజీ మంత్రి హుకుమా కరాడ కొడుకు రోహితప్ సింగ్ మద్యం మత్తులో రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. తన ఎస్వీయూ(SVU) కారులో మద్యం తాగుతూ రోడ్డు మీద ఉన్న వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీకొట్టాడు. దినేస్ అహుజా అతడి అనుచరులతో కలిసి భోపాల్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, భాదితులు దినేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రోహితప్ సింగ్ మద్యం తాగుతూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై తన కారును ఢీకొట్టడంతో వారు అతడిని ప్రశ్నించగా.. రోహితప్ మరింత రెచ్చిపోయాడు. బాధితులు తాము పోలీస్ స్టేషన్‌కు వెళతాము. నష్ట పరిహారం ఇవ్వాలని కోరడంతో వారు రోహితప్ మరింత రెచ్చిపోయాడు. మరోసారి దినేష్ కారును ఢీకొట్టాడు. దీంతో దినేష్, అతడి అనుచరులు.. రోహితప్ను బయటకు దిగాలని కోరడంతో అతడు వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయినట్టు తెలిపారుకాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు అష్టా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ యాదవ్ తెలిపారు. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. Former minister and senior @INCIndia leader Hukum Singh Karada's heavily drunk son Rohitap who was driving an SUV hit the car of a businessman When asked him to come to the local police, Karada again dashed the car with his SUV @ndtv @ndtvindia pic.twitter.com/quzQf5sh1P — Anurag Dwary (@Anurag_Dwary) May 23, 2022 ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి -
Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే!
బంజారాహిల్స్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో 85 శాతం మంది యువతే ఉంటున్నారు. జైలుకు వెళుతున్న వారిలో సైతం ఎక్కువగా యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రతిరోజు వేర్వేరు చోట్ల శ్వాస విశ్లేషణ పరీక్షలు (బ్రీత్ ఎనలైజర్) నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు. కేసు నమోదు చేస్తే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిసినా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో 85 శాతం మంది 18–40 ఏళ్ల వారే ఉంటున్నట్లు ఇటీవల పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పరిధిలోని ఐదు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 300 పైన నమోదైన వారికి జైలుశిక్ష విధించారు. బీఏసీ 397గా నమోదైన ఓ డ్రైవర్‌కు వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో బీఏసీ 300కు పైగా నమోదైన వాహనదారులు 9 మందికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. చదవండి👉🏻 ఖమ్మంలో వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం 485 మంది కోర్టులో హాజరు.. డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో వాహనం ఆపిన వెంటనే మద్యం తాగిన వాహనదారుడు పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. శ్వాస విశ్లేషణ పరీక్షలో వచ్చిన కౌంట్‌ను జత చేసి న్యాయస్థానానికి పంపిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ బీఏసీ 300 దాటితే వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వీరికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా విధిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 2100 కేసులు నమోదు కాగా ఇందులో 485 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 9 మందికి జైలుశిక్ష పడింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండుసార్లు పట్టుబడ్డ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయింది. పోలీసులు ఎక్కడికక్కడ ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో నాలుగైదు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. చదవండి👉🏼 ‘బీర్’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు? తీరు మారడం లేదు.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని చట్టపరంగా శిక్షించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో విరివిగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడ్డ ప్రతి ఒక్కరి వివరాలు ట్యాబ్‌లో పొందుపరుస్తున్నారు. మందుబాబుల పేరు, వివరాలు నమోదు చేయగానే గతంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి ఉంటే ఆ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రెండుమూడు సార్లు సైతం పట్టుబడిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవల జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడుపుతూ ఎర్రగడ్డకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ట్యాబ్‌లో ఫీడ్ చేయగానే అంతకుముందే పట్టుబడ్డట్లుగా తేలింది. దీంతో ఆయనున న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి డ్రైవింగ్ లైసెన్స్‌రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. దీని ఆధారంగా కోర్టులు రెండు రోజుల నుంచి నెల రోజుల పాటు శిక్షలు వేస్తున్నాయి. చదవండి👉 కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య -
ఆ డ్రైవర్ తొలగింపు చెల్లదు: ఏపీ హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడిపారంటూ ప్రయాణికులు, సహోద్యోగులు చెప్పిన సాక్ష్యం ఆధారంగా ఆర్టీసీ డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. డ్రైవర్‌ను తిరిగి సర్వీసులోకి తీసుకోవడంతోపాటు అతనికి ప్రయోజనాలన్నీ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను 8 వారాల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ విశాఖ ఆర్టీసీ డిపో మే నేజర్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో బస్సు నడుపుతున్నారన్న ఆరోపణలపై విశాఖపట్నంలోని జ్ఞానాపురానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వరరావు అనే డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనిపై వెంకటేశ్వరరావు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ వెంకటేశ్వరరావు తొలగింపును సమర్థిం చింది. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, మద్యం తాగి వాహనం నడిపారన్న విషయంలో ప్రయాణికులు, సహోద్యోగి చెప్పిన సాక్ష్యం ఆధారంగా వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగించడం చెల్లదన్నారు. మద్యం తాగారని నిరూపించేందుకు వైద్య పరమైన సాక్ష్యం ఉండాలని తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ విశాఖపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పైన పేర్కొన్న మేరకు తీర్పునిచ్చింది. -
గచ్చిబౌలి: మద్యం మత్తులో వీరంగం.. పోలీసులపై చిందులు తొక్కిన యువకులు
సాక్షి, గచ్చిబౌలి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాలో ఇంజనీరింగ్ చదివి ఇటీవలే నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును డ్రైవ్ చేస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసుల పై చిందులు వేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేటకు చెందిన కే.విజయ్(30), ఘట్కేసర్కు చెందిన సూర్య(28)లు గురువారం సాయంత్రం విధులు ముగించుకొని కొండాపూర్ ప్రాంతానికి వచ్చారు. కారు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ విజయ్, సూర్యలను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరు యువకులు నిహాల్, లోహిత్‌లుగా గుర్తించారు. మత్తులో ఉన్న వీరు పోలీసులపై తిరగబడడంతో వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటకు చెందిన లోహిత్, కొండాపూర్‌కు చెందిన నిహాల్‌రెడ్డి ఇద్దరు స్నేహితులుగా గుర్తించారు. అమెరికాలో వీరిద్దరు బీటెక్ పూర్తి చేసి ఇటీవలే నగరానికి వచ్చారు. కాగా వీరు ఇరువురు గురువారం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగి సాయంత్రం కొండాపూర్‌లోని నిహాల్ ఇంటికి వస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి వీరి ముందు బైక్‌పై వెళ్తున్న విజయ్, సూర్యల వాహనాన్ని ఢీకొట్టారు. వీరికి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా కారు నడుపుతున్న నిహాల్‌కు 234 ఎంజీ, లోహిత్‌కు 501ఎంజీ వచ్చింది. వీరు మద్యంతోపాటు మత్తు పదార్థాలను తీసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై పార్లమెంటు సభ్యుడి స్టిక్కర్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ చౌరస్తా నుంచి ఆదివారం అర్ధరాత్రి హెల్మెట్ ధరించకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తూ మద్యం సేవిస్తూ దూసుకుపోతున్న ఓ బైక్‌ను అదే రోడ్డు వెంట వెళ్తున్న ఓ వాహనదారుడు ఫొటోలు తీసి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశాడు. అంతే కాకుండా ముగ్గురు యువకులు హెల్మెట్ లేకుండా చేతుల్లో బీరు సీసాలతో రోడ్డువెంట వెళ్లేవారిని న్యూసెన్స్ చేస్తూ పోతున్నారంటూ ఆ వాహనదారుడు ట్వీట్ చేశాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమై ఈ ఘటన ఎక్కడ జరిగిందంటూ ఆరా తీశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఎల్వీ ప్రసాద్ విగ్రహం పక్క నుంచి అంటూ సమాచారం రావడంతో హైదరాబాద్ పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. సదరు వాహనాన్ని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. స్కూటర్ నెంబర్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బైక్ నెంబర్ ఆధారంగా చిరునామా పట్టుకున్నట్లుగా తెలిసింది. వీరిని అదుపులోకి తీసుకొని విచారించే దిశలో పోలీసులు యత్నిస్తున్నారు. పట్టాపగ్గాలు లేకుండా రోడ్డుపై మద్యం సేవిస్తున్న యువకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. Beverage na kodukulu. Triple ride with beers. Scooty meeda kanipinche ammailni kelikkuntaa potnaru ❌ @hydcitypolice pic.twitter.com/3Tw98tI56c — Joyyyyy (@JacksonBr0) May 1, 2022 చదవండి: వనస్థలిపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్ -
ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సులపైన నిఘా కొరవడింది. సాధారణంగా ఒకసారి లైసెన్సు రద్దయ్యాక ఆరు నెలల పాటు సదరు వాహనదారుడు బండి నడిపేందుకు వీలులేదు. 6 నెలల అనంతరం తిరిగి డ్రైవింగ్ లైసెన్సును పునరుద్ధరించుకున్న తరువాత మాత్రమే వాహనం నడిపేందుకు అనుమతి లభిస్తుంది. అయితే ఆర్టీఏ, పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా లైసెన్సుల రద్దు ప్రక్రియ ఉత్తుత్తి ప్రహసనంగా మారింది. నగరంలో రోడ్డు ప్రమాదాలు, మద్యంసేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపైన ఏటా వేల సంఖ్యలో లైసెన్సులు రద్దవుతున్నాయి. కానీ ఇలా రద్దయిన వాహనదారులు యధేచ్చగా రోడ్డెక్కేస్తూనే ఉన్నారు. మరోవైపు మోటారు వాహన నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెస్సు రద్దయినట్లు ఎలాంటి సమాచారం కానీ, హెచ్చరికలు రద్దయినట్లు సదరు వాహనదారులకు అందకపోవడం వల్ల అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. రద్దులోనూ జాప్యం... నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ప్రతి రోజు పదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఇలా వరుసగా డ్రంకెన్ డ్రైవ్‌లలో పట్టుపడిన వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఆర్టీఏను సంప్రదిస్తారు. ఆన్లైన్ ద్వారా ఆర్టీఏ అధికారులకు డేటా అందజేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న లైసెన్సుల వివరాలను ఎప్పటికప్పుడు రవాణాశాఖకు చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంటుంది. ఉదాహరణకు జనవరిలో పట్టుకున్న నిందితుల డేటాను మార్చి నెలలో ఆర్టీఏకు చేరవేస్తున్నారు. దీంతో మార్చి నుంచి 6 నెలల పాటు అమలయ్యే విధంగా ఆర్టీఏ సదరు డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తుంది. కానీ జనవరిలో పట్టుబడిన నిందితులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి యధావిధిగా తిరుగుతున్నారు. మార్చి నుంచి ఆరు నెలల పాటు రద్దయిన సమాచారం కూడా వాహనదారులకు సకాలంలో అందడం లేదు. ఎం–వాలెట్లో చూడాల్సిందే... రద్దయిన డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు ఆర్టీఏ ఎం–వాలెట్లో మాత్రమే నమోదవుతున్నాయి. ఎం–వాలెట్ యాప్ కలిగి ఉన్న వాహనదారులు ఆ యాప్‌లో తమ డ్రైవింగ్ లైసెన్సు ఏ స్థితిలో ఉందో తెలుసుకుంటే మాత్రమే సస్పెండ్ అయినట్లుగా నోటిఫికేషన్ కనిపిస్తుంది. కానీ పోలీసులు, ఆర్టీఏ నిఘా లేకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా యధేచ్చగా రోడ్డెక్కుతున్నారు. (చదవండి: పక్కాగా ప్లాన్ చేసిన దొరికిపోయాడు!....కథ మొత్తం కారు నుంచే..) -
నడిరోడ్డు మీద డ్రగ్ టెస్ట్‌లు! ఎరుపు రంగులో చుక్కలు కనిపించాయంటే..
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన రాష్ట్ర పోలీసులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌ల మాదిరి పోలీసులు నడిరోడ్డుపై డ్రగ్ పరీక్షలు చేయనున్నారు. డ్రగ్స్ వినియోగించినవారిని డ్రగ్ అనలైజర్ల సాయంతో గుర్తించనున్నారు. తొలుత ఒకట్రెండు డ్రగ్ అనలైజర్లను కొనుగోలు చేసి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను అధ్యయనం చేయనున్నారు. అవి ఉపయుక్తంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసి విస్తృతంగా వాటిని వినియోగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎలా పరీక్షిస్తారంటే..? చిన్నసైజు టూత్‌బ్రష్(టెస్ట్ కాట్రిడ్జ్) ఆకారంలో ఉండే ఉపకరణాన్ని అనుమానితులు నోటిలో పెట్టుకొని బ్రష్ చేసినట్లుగా తిప్పాలి. ఆ తర్వాత ఏటీఎంలో కార్డ్ పెట్టినట్లుగా ఆ కాట్రిడ్జ్‌ను డ్రగ్ అనలైజర్ డివైజ్‌లో పెడితే చాలు రెండు నిమిషాల్లో ఫలితాలను దాని స్క్రీన్ మీద చూపిస్తుంది. ఒకవేళ డ్రగ్ తీసుకున్నట్లయితే ఎరుపు రంగులో, లేకపోతే ఆకుపచ్చ రంగులో చుక్కలు కనిపిస్తాయి. అయితే ఇది ప్రాథమిక పరీక్ష మాత్రమే! పరీక్షలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి మూత్రం, రక్తం నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే మరింత స్పష్టమైన నిర్ధారణకు వస్తారు. డ్రగ్ అనలైజర్ గంజాయి, హష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్ వంటి అన్ని రకాల మాదక ద్రవ్యాలను గుర్తిస్తుంది. ఎంత మోతాదులో డ్రగ్ తీసుకున్నారు? తీసుకొని ఎంత సమయమవుతోంది? వంటి వివరాలను స్క్రీన్ మీద చూపిస్తుంది. దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ డివైజ్‌కు జీపీఎస్ కూడా ఉంటుంది. దీంతో ఏ ప్రాంతంలో డ్రగ్ పరీక్షలు నిర్వహించారో సాంకేతిక ఆధారాలుంటాయి. వీటిని ఎవరు వినియోగిస్తారంటే..? డ్రగ్ పరీక్షలను లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేస్తారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నగరంలో ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించిన హాట్స్పాట్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్‌గా తొలుత కొన్ని ప్రాంతాల్లో చేపట్టి, వాటి ఫలితాలను బట్టి విస్తరిస్తామని పేర్కొన్నారు. ఎవరికి టెస్ట్‌లు చేస్తారంటే? కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రగ్ అనలైజర్లను వినియోగిస్తున్నారు. వాటి ఫలితాలను మన రాష్ట్ర పోలీసులు అధ్యయనం చేసి, మెరుగైన ఫలితాలు వస్తున్నాయని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. పట్టుబడిన డ్రగ్ పెడ్లర్ల నుంచి కస్టమర్ల వివరాలను సేకరించి వారికి కూడా పరీక్షలు చేస్తారు. కేస్ స్టడీల ఆధారంగా డ్రగ్స్ çసరఫరా జరిగే ప్రాంతాలను గుర్తిస్తారు. పబ్‌లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలపై నిఘా పెడతారు. ఈ క్రమంలో డ్రగ్స్ తీసుకొని దొరికివాళ్ల డేటాను రికార్డ్‌లోకి ఎక్కిస్తారు. పోలీస్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తప్పించుకోబోయి.. చుట్టుపక్కల గమనించకపోడంతో..
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద పట్టుబడతాననే భయంతో పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఒక యువకుడు రైలుకింద పడి మృతి చెందిన సంఘటన రామనగర తాలూకా బసవనపుర గ్రామం వద్ద చోటుచేసుకుంది. బెంగళూరు సుంకదకట్టె నివాసి దిలీప్ (28) మృతి చెందిన వ్యక్తి. గురువారం రాత్రి దిలీప్, మరో ఆరుగురు యువకులు కారులో బెంగళూరు నుంచి మైసూరుకు మద్యం తాగుతూ బయలుదేరారు. బవనపుర వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా మద్యం తాగుతున్నందుకు అరెస్టు చేస్తారనే భయంతో కారు దిగిన దిలీప్ రోడ్డు పక్కన రైలు పట్టాలపైకి పరుగెత్తాడు. అదే సమయంలో రైలు రావడంతో రైలు కింద పడి మృతి చెందాడు. పోలీసులు ఐదుగురు యువకులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారయ్యాడు. రామనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: భర్తతో దూరం.. వీఆర్వోతో మహిళకు పరిచయం.. ‘నేను మోసపోయానమ్మా’ -
మద్యం మత్తులో యువకుల వీరంగం
-
మద్యం తాగే వాళ్లు భారతీయులే కాదు..
పాట్నా: మద్యం తాగే వాళ్లు అసలు భారతీయులే కాదంట.. మందు తాగే వారందరూ మహా పాపులు అంటూ స్వయంగా ఓ రాష్ఠ్ర ముఖ్యమంత్రే అనడం ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఎవరంటే.. బీహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022ను కఠినతరం చేస్తూ సవరణలు చేశారు. ఈ బిల్లు తాజాగా గవర్నర్ ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం.. ఎవరైనా మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే జరిమానాతో పాటుగా ఒక నెల జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. కాగా, జరిమానా డిపాజిట్ చేసి బెయిల్ పొందే అవకాశం కల్పించారు. అయితే, ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగుతుండగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సందర్బంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. మద్యం సేవించే వారు అసలు భారతీయులే కాదన్నారు. మందు తాగే వారందరూ మహా పాపులు అంటూ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారని అన్నారు. ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా మద్యం సేవించే వారిని తాను భారతీయులుగా పరిగణించను అని వ్యాఖ్యానించారు. మద్యం సేవించడం హానికరం అని తెలిసిన కొందరు సేవిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మద్యం సేవించి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 2021లో చివరి ఆరు నెలల్లో మద్యం కారణంగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. బీహార్‌లో 14-15 మంది పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం కింద చేసిన అరెస్టులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను మాత్రమే విచారించడంతో బీహార్‌లోని న్యాయవ్యవస్థ పనితీరుపై మద్యం చట్టం ప్రభావం చూపుతోందని సుప్రీంకోర్టు గత ఏడాది వ్యాఖ్యానించింది. शराब पीने वाले @NitishKumar के अनुसार हिंदुस्तानी नहीं और वो महापापी और महाअयोग्य और उनके लिए कोई सहानुभूति नहीं @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/bfTB4YU28w — manish (@manishndtv) March 31, 2022 -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు.. మనస్తాపంతో..
దస్తురాబాద్(ఖానాపూర్): డ్రంకెన్‌డ్రైవ్ కేసు నమోదుతో మనస్తాపం చెందిన ఆదివాసీ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని గొడిసిర్యాల గోండుగూడాలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాడవి నాగరాజు (19) ఈనెల 13న జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం చిత్రవేణిగూడంలో ఓ వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం మద్యం తాగాడు. వెంటనే బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో స్థానిక ఎస్సై జ్యోతిమణి వాహనాల తనిఖీ చేపట్టారు. డ్రంకెన్ డ్రైవ్‌లో నాగరాజు మద్యం తాగినట్లు రుజువైంది. పోలీసులు బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం నాగరాజు ఇంటికి చేరగా తల్లిదండ్రులు బైక్ ఏమైందని ప్రశ్నించారు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుకున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో వారు కోపం చేయడంతో అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జన్నారం ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహంతో రోడ్డుపై ఆందోళన పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేయడంతోనే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గురువారం ఉదయం మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ధర్నా చేపట్టేందుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ సీఐ అజయ్‌బాబు సిబ్బందితో గ్రామ పొలిమేరకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. సుమారు ఐదు గంటల పాటు ఆందోళన కొనసాగించగా.. డీఎస్పీ ఉపేంద్రరెడ్డి అక్కడికి చేరుకుని ఆదివాసీ నాయకులతో చర్చించారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు.. గోల్డెన్ చాన్స్!
హిమాయత్‌నగర్‌కు చెందిన ఫార్మా ఉద్యోగి తరుణ్ (పేరు మార్చడమైంది) గతేడాది మార్చిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డాడు. ఆయన బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ బైక్ ఖరీదు సుమారు రూ. 11 వేల వరకు ఉండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ. 10,500 జరిమానా విధిస్తుండటంతో బైక్ ఖరీదు, చలానా ఖరీదు ఒకే స్థాయిలో ఉండటంతో ఆయన బైక్‌ను స్టేషన్లో వదిలేశారు. ఇది ఒక్క తరుణ్ పరిస్థితి మాత్రమే కాదు. చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ద్విచక్ర వాహనదారులు జరిమానా రూ. 10,500 చెల్లించలేక బైక్ ఖరీదు దాదాపుగా అంతే ఉండటంతో అక్కడే వదిలేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో 2019 మార్చి నుంచి 2021 డిసెంబర్ వరకు సుమారు 5,776 వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాయి. ఆయా వాహనాలను సీజ్ చేసి స్టేషన్ల ఆవరణల్లో ఉంచారు. అవికాస్తా దుమ్ముకొట్టుకుపోతున్నాయి. తమ వాహనాలు పాడవుతాయనే ఆందోళన ఉన్నా... అంత జరిమానా కట్టే పరిస్థితి లేక బాధపడని వారుండరు. ► అయితే ప్రభుత్వం వారందరికీ ఓ అవకాశాన్ని కల్పించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులు లోక్‌అదాలత్‌లో తాము మద్యం సేవించి వాహనం నడిపినట్లు అంగీకరిస్తే రూ. 2100 చెల్లించి ఆ కేసు నుంచి బయటపడి తమ వాహనాన్ని తీసుకెళ్లవచ్చు. ఈ అవకాశాన్ని ప్రస్తుతం అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్పించారు. 36 నుంచి 100 బీఏసీ ఉంటే రూ. 2100, 100 నుంచి 200 బీఏసీ ఉంటే రూ. 3100, 200 నుంచి 300 బీఏసీ ఉంటే రూ. 4100 చెల్లించాలి. ► వాహనదారుడు మాత్రం తాను మద్యం సేవించి వాహనం నడిపినట్లు లోక్ అదాలత్‌లో ఒప్పుకోవాల్సి ఉంటుంది. ► ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో 736 వాహనాలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొని వాహనాలను తీసుకున్నారు. ► మనో రంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న నాల్గవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కోర్టులో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. మరికొన్ని రోజులు ఈ అవకాశాన్ని కల్పించారు. సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొని వెళ్తే లోక్ అదాలత్‌లో సమస్యలు పరిష్కరించి వాహనాన్ని రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెల 12 వరకు... ► లోక్ అదాలత్ మార్చి 12వ తేదీ వరకు కొనసాగనుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, లారీలు, డీసీఎంలు ఇలా అన్ని వాహనాలు సీజ్ అయి పోలీస్ స్టేషన్ల ఆవరణలో ఉండగా వీరంతా ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చి పోలీసులను సంప్రదిస్తే పోలీసులే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జరిమానా చెల్లింపజేసి వాహనాన్ని అందజేస్తారు. మంచి అవకాశం చాలా మంది వాహనదారులు వేలాది రూపాయలు చెల్లించుకోలేక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలు తీసుకోలేకపోవడంతో అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో సీజ్ చేసిన వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ► కొన్ని ఖరీదైన కార్లు, ఖరీదైన బైక్‌లు కూడా ఉన్నాయి. వీరందరికీ ఇదొక సువర్ణ అవకాశమనే చెప్పాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అప్పటికే ప్రచారం చేశారు. ► సంబంధిత వాహనదారులకు కూడా లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించి సమాచారం ఇస్తున్నారు. రోజూ వంద నుంచి 200 వాహనాలు ఇలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనాలు విడుదల అవుతున్నాయని సబంధిత వర్గాలవారు చెబుతున్నారు. -
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే అంతే! రెడ్ సిగ్నల్ పడిందో..
సాక్షి, హైదరాబాద్: తాగి వాహనం నడుపుతూ తమతో పాటూ ఇతరుల ప్రాణాలను ముప్పు తెస్తున్న మందుబాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమయ్యారు. పగటి పూట కూడా మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 24 గంటలూ డ్రంకన్ డ్రైవ్ (డీడీ) టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు డీడీలు చేపట్టనున్నారు. రెడ్ సిగ్నల్ పడగానే.. ఇప్పటివరకు ప్రతి రోజూ సాయంత్రం సమయాల్లో, స్పెషల్ డ్రైవ్‌లలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లు చేసేవారు. ప్రధాన ప్రాంతాలు, జంక్షన్లు వద్ద ప్రత్యేకంగా డీడీ పాయింట్లను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేవారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) లెవల్ 30 దాటితే కేసులు నమోదు చేస్తుంటారు. బీఏసీ స్థాయిని బట్టి రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేవారు. చాలా మంది మందుబాబులు డీడీ టెస్ట్‌లు పూర్తయ్యాక ఇంటికి వెళ్లడం చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల వద్దే డీడీలు నిర్వహిస్తే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. సిగ్నల్ పాయింట్ వద్ద డ్యూటీలో ఉండే ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ బ్రీత్ అనలైజర్‌తో రెడీగా ఉంటారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారుల వద్దకు వెళ్లి డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. పెండింగ్ డీడీ కేసుల పరిష్కారానికి.. పెండింగ్‌లో ఉన్న డ్రంకన్ డ్రైవ్ (డీడీ) కేసులను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. డీడీలో చిక్కిన మందుబాబులకు రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుంది. ప్రస్తుతం తొలిసారి డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన మందుబాబులకు రూ.2,001 జరిమానా చెల్లించే వెసులుబాటును కల్పించారు. కేసులు పెండింగ్‌లో ఉన్న ఎప్పటికైనా ప్రమాదమేనని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా మంది డీడీ నిందితులు పెండింగ్ జరిమానాను చెల్లించేందుకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో 70 వేలకు పైగా డీడీ కేసులుంటాయని అంచనా. గతేడాది ట్రాఫిక్ చలాన్ల సంఖ్య కమిషనరేట్ ఎంవీ కేసులు డీడీ కేసులు హైదరాబాద్ 70,03,012 25,453 సైబరాబాద్ 53,50,724 34,746 రాచకొండ 22,64,225 8,121 -
ఏయ్.. నేను ఊదనంటే ఊదను.. పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన మందుబాబు
-
తప్పతాగి అర్థరాత్రి రోడ్డుపై హల్చల్.. హీరోయిన్ అరెస్ట్
టాలీవుడ్ హీరోయిన్ కావ్యా థాపర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిన్న(గురువారం) అర్థరాత్రి తాగి కారు నడిపి యాక్సిడెంట్‌కు కారణమైన ఆమెను పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ మాయ పేరేమిటో, ఏక్ మిని కథ చిత్రాలతో కావ్యా థాపర్ టాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు ఇక బాలీవుడ్లో అవకాశాల కోసం ముంబైలో ఉంటున్న ఆమె గురువారం రాత్రి ఓ పార్టీకి హజరైంది. ఈ నేపథ్యంలో బాగా తాగిన ఆమె అర్థరాత్రి కారు నడుపుతూ ముంబైలోని జెడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద యాక్సిడెంట్ చేసింది. ఆ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆమెను పోలీసులు ప్రశ్నించగా ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు డ్యూటీలో ఉన్న పోలీసులతో గొడవ పడుతూ లేడీ కానిస్టేబుల్స్ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించింది. చదవండి: భీమ్లా నాయక్ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ! మహిళ పోలీసుల కాలర్ పట్టుకుని వారిని అసభ్యకర పదజాలంతో దూషణకు దిగింది. అర్థరాత్రి రోడ్డుపై కావ్యా గొడవ పడుతూ రచ్చ రచ్చ చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను జూహు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంధేరి కోర్టులో శుక్రవారం ఆమెను హాజరుపరచగా.. జ్యూడిషియల్ కస్టడీ విధించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అర్థరాత్రి రోడ్డుపై మద్యం మత్తులో హీరోయిన్ హల్చల్ అంటూ సినీ ఇండస్ట్రీలో కావ్యా థాపర్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. -
మద్యం మత్తులో యువతి కారుతో బీభత్సం.. సెకన్ల వ్యవధిలోనే
హైదరాబాద్: మద్యంమత్తులో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. మెహిదీపట్నంకు చెందిన ఓ యువతి (25) అమీర్‌పేట్‌కు చెందిన అమీర్ సోహేల్ మహ్మ ద్ అబ్దుల్ గురువారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు కారులో వెళ్తున్నారు. కారు డ్రైవింగ్ చేస్తున్న యువతి మొదట బస్టాండ్‌లో ఓ వాహనాన్ని ఢీ కొడుతూ అదే వే గంతో కొద్ది దూరంలో ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అతడి చేతికి గాయమైంది. సెకన్ల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టు బావర్చి ముందు నిల్చున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. అప్రమత్తమైన స్థానికులు కారుని ఆపడంతో ఇరువురు స్థానికులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న ఆర్జీఐఏ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరికి అదుపులోకి తీసుకున్నారు. శ్వాస పరీక్ష చేయగా యువతికి 200, యువకుడికి 550 ఉన్నట్లు తేలింది. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (భార్య మృతితో భర్త ఆత్మహత్య) -
రోడ్డు ప్రమాద నిందితులకు బెయిల్
బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరి మృతికి కారకులైన ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గత నెల 6న తెల్లవారుజామున బజార్ రోహిత్‌గౌడ్, సాయిసోమన్, కోసరాజు వెంకటేష్‌లు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో మద్యం తాగి ఆ మత్తులో కారులో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్– 3లోని రెయిన్బో ఆస్పత్రి వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు ఆస్పత్రి ఉద్యోగులను కారుతో ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అదే రోజు ప్రమాదానికి కారణమైన రోహిత్‌గౌడ్, సాయి సోమన్లపై ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో మరో నిందితుడు కోసరాజు వెంకటేష్ పరారయ్యాడు. అతనిపై ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నిందితుడు పోలీసులకు దొరక్కుండా కోర్టులో లొంగిపోయాడు. ముగ్గురికీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం ముగ్గురూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో హాజరై సంతకాలు చేయాలని షరతు విధించింది. -
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడగానే లైసెన్స్ ఫట్
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను హరించే మందుబాబుల కట్టడికి నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త విధానాలను తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికినవారి డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్)లను రద్దు చేయాల్సిందిగా సంబంధిత రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ)లకు ట్రాఫిక్ పోలీసులు భౌతికంగా లేఖలు పంపించేవారు. కానీ, ఇక నుంచి ఆ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరిగిపోనుంది. ట్రాఫిక్ యాప్‌లో డీఎల్ రద్దు అనే కొత్త ఫీచర్‌ను జోడించారు. దీనిని ఆర్టీఏతో అనుసంధానించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వెంటనే యాప్‌లో డీఎల్ రద్దు ఫీచర్‌ను నొక్కగానే క్షణాల్లో సంబంధిత సమాచారం ఆర్టీఏ అధికారులకు చేరుతుంది. వాళ్లు ఆయా డీఎల్‌ను పరిశీలించి రద్దుచేస్తారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో సమయం ఆదా అవటమే కాకుండా డ్రంకెన్ డ్రైవ్ వాహనదారులకు భయం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 255 డీఎల్లు రద్దయ్యాయి. అత్యధికంగా గతేడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9,981 డీఎల్ రద్దులను ఆర్టీఏకు పంపించగా, 215 డీఎల్లు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్‌లో 25, రాచకొండలో 15 లైసెన్స్‌లు రద్దయ్యాయి. ఔటర్‌పై డ్రంకెన్ డ్రైవ్‌లు రాష్ట్ర, జాతీయ రహదారులతోపాటు ఓఆర్‌ఆర్‌పైనా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో ఓఆర్ఆర్పై కూడా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. డ్రైవింగ్ స్కూల్ వాహనాలకు ఔటర్ రింగ్ రోడ్‌పైకి అనుమతి లేదు. గతేడాది సైబరాబాద్‌లో 3,989 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 759 మంది మరణించారు. సైబరాబాద్ పరిధిలోకి వచ్చే ఓఆర్ఆర్పై 191 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాచకొండ పరిధిలో జరిగిన 2,529 రోడ్డు ప్రమాదాల్లో 618 మంది చనిపోయారు. గతేడాది రాచకొండ పరిధిలోకి వచ్చే ఔటర్‌పై 41 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 19 మంది మరణించారు. 13 రోడ్డు ప్రమాదాల్లో 50 మందికి గాయాలయ్యాయి. పరిమితవేగాన్ని మించొద్దు ఔటర్‌పై వాహనాలను జాగ్రత్తగా నడపాలి. టోల్‌గేట్స్ వద్ద మంచు ఎక్కువ ఉందని, వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించే ఏర్పాట్లు చేశాం. పరిమిత వేగానికి మించితే లేజర్ గన్‌తో చిత్రీకరించి జరిమానాలు విధిస్తున్నాం. – డి. శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్ -
తెగ తాగి.. అడ్డంగా దొరికేశారు.. 4,448 మంది బుక్కయ్యారు
సాక్షి, హైదరాబాద్: అసలే ఇయర్ ఎండ్.. కొత్త ఏడాది ఆరంభ ఘడియ.. జనాల్లో అంతులేని జోష్.. పట్టరాని సంతోషం.. ఇంకేముంది కొందరు తెగ తాగారు. కిక్కు ఎక్కిన తర్వాత కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ రోడ్డెక్కారు.. పోలీసులు ఎదురుపడే సరికి వారికి చుక్కలు కనిపించాయి. అంతే, దెబ్బకు మత్తు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ నిర్వహించిన ప్రత్యేక డ్రంకన్ డ్రైవుల్లో 4,448 మంది పోలీసులకు చిక్కారు. వారంతా రేపో మాపో కోర్టు మెట్లక్కనున్నారు. నిత్యం జరిపే డ్రంకన్ డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కూడా దాటని కేసుల సంఖ్య డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటిన తర్వాత ఏకంగా 4 వేలు దాటడం గమనార్హం. పోలీస్ శాఖ హెచ్చరికలను సైతం ధిక్కరించి మందుబాబులు రోడ్డెక్కడంతో హైదరాబాద్‌లో ఒక్కరోజే 1,200 మంది పట్టుబడి టాప్‌లో నిలవగా, ములుగు పట్టణం ఒక్క కేసు కూడా లేకుండా చివరన నిలిచింది. కమిషనరేట్ల వారీగా... సైబరాబాద్ 870, రాచకొండ 360, వరంగల్ 274, రామగుండంలో 253 చొప్పున, సూర్యాపేట జిల్లాలో 176 చొప్పున కేసులు నమోదయ్యాయి. చదవండి: బంజారాహిల్స్: తూలుతూ.. తేలుతూ.. యువతి రచ్చ.. -
బంజారాహిల్స్: తూలుతూ.. తేలుతూ.. యువతి రచ్చ..
సాక్షి, బంజారాహిల్స్: మోతాదుకు మించి మద్యం సేవించి తూలుతూ.. వాహనాలు నడపడమే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించేందుకు యత్నించిన ట్రాఫిక్ పోలీసుల విధులను అడ్డుకున్నారు. కొన్నిచోట్ల రచ్చరచ్చ చేయగా.. మరికొన్ని చోట్ల మద్యం మత్తులో మహిళలు పోలీసులను కూడా ఖాతరు చేయకుండా నెట్టిపడేశారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్టడీ సర్కిల్ వద్ద పికెట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇక్కడ 30 కేసులు నమోదు చేశారు. గ్రీన్ బావర్చి వద్ద తనిఖీల్లో 12 మంది మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. శుక్రవారం నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని క్లబ్‌లు, పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, కెఫేలు, రిసార్ట్‌లలో మద్యం సేవించి అర్ధరాత్రి 12 దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు శ్వాస పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువతి పోలీసుల విధులను అడ్డుకుంది. బ్రీత్ ఎనలైజర్‌కు ససేమీరా అంది. అయితే ఆమెతో పాటు స్నేహితుడు శ్వాసపరీక్షలకు ముందుకు రాలేదు. పోలీసులపైకి దూసుకెళుతూ అడ్డు వచ్చిన వారిని నెట్టేసింది. అరగంటపాటు రచ్చరచ్చ చేసింది. పోలీసులు వారిద్దరిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. Another #Drunk woman created ruckus on road, in the mid night during the #NewYearEve celebrations, when stopped her vehicle by #JubileeHills traffic police.#Drunkgirls #DrunkandDrive #Liquor #Hyderabad pic.twitter.com/htwk66WEMm — Surya Reddy (@jsuryareddy67) January 1, 2022 జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డైమండ్ హౌజ్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, రోడ్ నం. 45, బీవీబీపీ జంక్షన్లలో నాలుగు చోట్ల రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం మత్తులో వాహనదారులు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. తీవ్ర వాగ్వాదం జరిగింది. నెట్టుకోవడాలు, ఒకరిపై ఒకరు చేయి చేసుకునేదాకా పరిస్థితి అదుపు తప్పింది. ఇక్కడ 50 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.ముత్తు నమోదు చేశారు. చదవండి: దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్..నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే.. 51 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు హిమాయత్‌నగర్: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే సమయంలో మందుబాబులు హల్చల్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష అంటూ పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా మందుబాబుల్లో కనీస స్పందన, భయం లేకపోవడం గమనార్హం. నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, ఎస్ఐ మల్లయ్యలు రెండు టీంలుగా ఏర్పడి లిబర్టీ చౌరస్తా, హిమాయత్‌నగర్ వై జంక్షన్, ఎక్స్ రోడ్స్, వైఎంసీల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. చదవండి: కేకలు, అరుపులు.. జూబ్లీహిల్స్‌లో యువతి హల్చల్ శుక్రవారం రాత్రి 11 నుంచి శనివారం తెల్లవారుజాము 3 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 51 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. కొందరు కారు, ద్విచక్ర వాహనాలపై ఫుల్లుగా తాగి డ్రైవ్ చేయడం గమనార్హం. రోడ్లపై న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారు సైతం పోలీసులకు పట్టుబడ్డారు. 35 మందిపై త్రిబుల్ రైడింగ్ కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ చంద్రమౌళి వివరించారు. A #drunk woman with her friends (#WestBengal) created #nuisance on road, in the mid night during the #NewYearEve when stopped their car by #BanjaraHills police, she pushed the cops and abused the public. #Hyderabad Police booked #DrunkandDrive case against them.#Drunkgirls pic.twitter.com/ZY9vHwOeLU — Surya Reddy (@jsuryareddy67) January 1, 2022 -
విశాఖలో రెండు విషాదకర సంఘటనలు
-
కేకలు, అరుపులు.. జూబ్లీహిల్స్‌లో యువతి హల్చల్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరానికి నగరం సంబరంగా స్వాగతం పలికింది. అయితే మరోవైపు పోలీసులు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు.40 బైక్‌లు, ఏడు కార్లు, ఆటోను సీజ్ చేశారు. 92 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. చాలా చోట్ల మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర ఓ యువతి హల్చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీరంగం సృష్టించింది. పోలీసులను, ప్రయాణికులను దుర్భాషలాడుతూ గొడవకు దిగింది. యువతితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: (Omicron: కఠిన ఆంక్షలకు సీఎం ఆదేశం..థియేటర్లలో 50 శాతం మందికే) -
మద్యం మత్తులో మందుభామ వీరంగం
-
Hyderabad: రాత్రి పది తర్వాత అడుగడుగునా తనిఖీలు
సాక్షి, బంజారాహిల్స్: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పబ్‌లు, క్లబ్‌లు, హోటళ్లలో మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తథ్యమని నగర పోలీస్ కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. పబ్‌లు, క్లబ్‌లకు పేరెన్నికగన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌పరిధిలో కూడా శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత అడుగడుగునా వాహనాల తనిఖీలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్క జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే తొమ్మిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. బంజారాహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు వేర్వేరు చోట్ల తనిఖీలు జరగనున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే ఆరు నెలల జైలుతో పాటు రూ. 10 వేల జరిమానా విధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నారు. చదవండి: (New Year Celebrations: ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు) -
Hyderabad New Year Events: సిటీ పోలీసుల కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులకు సిటీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వీటిలో పాల్గొనే వారికి కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన డిజిటల్ లేదా నేరుగా తెచ్చిన సర్టిఫికెట్‌ను చూసిన తర్వాతే లోపలకు అనుమతించాలంటూ కొత్వాల్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను ఆయన వెల్లడించారు. ►థర్మల్/ఐఆర్ స్క్రీనింగ్ తర్వాత, కచ్చితంగా మాస్కు ధరించిన వారినే లోపలకు అనుమతించాలి. కార్యక్రమం జరిగే చోట భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ►కార్యక్రమం నిర్వహణకు 48 గంటల ముందే నిర్వాహకులు, ఉద్యోగులు, సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయించాలి. ►బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజేకు అనుమతి లేదు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు శబ్ధం వినిపించకూడదు. దీన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. ►ఈవెంట్లతో జరిగే ప్రతి చర్యకు, కష్టనష్టాలకు నిర్వాహకులే బాధ్యత వహించాలి. ►ఎక్సైజ్ విభాగం నిర్దేశించిన సమయానికి మించి మద్యం సరఫరా చేయకూడదు. కపుల్స్ కోసం నిర్దేశించిన పార్టీల్లోకి మైనర్లను అనుమతించకూడదు. బార్ అండ్ రెస్టారెంట్స్‌లో లైవ్ బ్యాండ్స్ నిర్వహించకూడదు. ►మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేలా డ్రైవర్లు/క్యాబ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. ‘డిజిగ్నెటెడ్ డ్రైవర్’ విధానంపై ప్రచారం చేయాలి. ►నిర్వాహకులు కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. రహదారులపై వాహనాలు ఆపేలా చేయకూడదు. ఎంట్రీ, ఎగ్జిట్లు వేర్వేరుగా అవసరమైన స్థాయిలో ఉండాలి. జరిమానా.. జైలు మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహన యజమానులదే బాధ్యత. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అవుతాయి. ఈ విషయాలపై ప్రచారం చేపట్టారు. -
లారీని ఢీకొన్న కారు..
-
మొయినాబాద్ రోడ్డు ప్రమాదం.. మొన్న ప్రేమిక, నేడు సౌమ్య
సాక్షి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మందుబాబుల ఆగడాలు రోజురోజుకీ హద్దు మీరుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు తాగి కార్లు బైకులు నడపడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి తాజాగా వీరి కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. మొయినాబాద్ మండల కేంద్రంలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెళ్ళు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తాజ్ హోటల్ సమీపంలో సౌమ్య, ప్రేమిక, అక్షయ ముగ్గురు యువతులు కనకమామిడి వైపు వెళుతున్నారు. అదే సమయంలో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నకారు, ఎదురుగా వచ్చిన వీరి స్కూటీని ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమిక(16) సంఘటన స్థలంలోనే చనిపోగా.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సౌమ్య(18) కూడా మృతి చెందింది. ప్రస్తుతం అక్షర(14) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు. చదవండి: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కారును లారీ ఢీ కొట్టడంతో.. ఈ ప్రమాదం కారణంగా బాధితుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు బోరున విలపించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మద్యం సేవించి కారును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
మద్యంమత్తులో స్కూటీని ఢీ కొట్టిన కారు
-
HYD: మందుతాగి పట్టుబడితే.. ఇక ఆఫీస్‌లో మీ పని అంతే!
సాక్షి, హైదరాబాద్:మందుబాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన వారి కుటుంబ సభ్యులను పిలిపించి మందలించే పోలీసులు.. తాజాగా డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన ఇద్దరు మందుబాబులు పని చేస్తున్న కంపెనీలకు ఉద్యోగుల ఘనకార్యాన్ని తెలుపుతూ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా రోడ్డు భద్రతపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని ఆ లేఖలో సూచించారు కూడా. ఈ నెల 18 నుంచి 24 వరకు మధ్య రాచకొండ పరిధిలో 413 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రూ.8,47,500 జరిమానా విధించారు. వీరిలో 20 మందికి సంబంధిత కోర్ట్లు జైలు శిక్షను విధించాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 34,042 మందిపై కేసులు నమోదు చేశారు. వీరికి రూ.1,37,28,710 జరిమానా విధించారు. వీటిలో అత్యధికం హెల్మెట్ లేని కేసులే. 19,866 విత్ఔట్ హెల్మెట్ కేసులు కాగా.. వీరికి రూ.36,45,300 జరిమానా విధించారు. వారం రోజుల వ్యవధిలో రాచకొండ పరిధిలో వంద రోడ్డు ప్రమాద కేసులయ్యాయి. వీటిల్లో 15 మంది మరణించగా.. 88 మందికి గాయాలయ్యాయి. చదవండి: కుట్ల నొప్పి తట్టుకోలేని తల్లి.. ఉరినే భరించింది! -
ఘట్కేసర్లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కేసు?
-
Gachibowli Road Accident: 'ఆ అమ్మాయిలు వినలేదు.. మందు తాగారు'
Reason Behind Gachibowli Road Accident: గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు స్పాట్లోనే మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయి సిద్ధూ అనే మరో జూనియర్ ఆర్టిస్ట్ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మద్యం మత్తులో వాహనాన్ని నడిపినందుకే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు వివరించాడు. చదవండి: జూనియర్ ఆర్టిస్టుల దుర్మరణం.. వైరల్ అవుతున్న వీడియోలు 'ఉదయాన్నే షూటింగ్ ఉందని రాత్రి మా ఇంటికి వచ్చారు. సిట్టింగ్ వేశాం. ముగ్గురు మందు తాగారు. నేనెం తాగలేదు. అబ్ధుల్ బ్లాక్ డాగ్ తాగాడు. అమ్మాయిలిద్దరూ బీర్లు తాగారు.మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అన్నారు. ఈ టైంలో ఎందుకు బయటకు వెళ్లడం..డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ప్రాబ్లం అవుతుందని చెప్పాను. అయినా ఆ ఇద్దరు అమ్మాయిలు వినలేదు. టీ తాగుదామని చెప్పారు. తోడు వెళ్లకపోతే బాగోదని నేను కూడా వెళ్లాను. నాకు డ్రైవింగ్ రాదు. అబ్దుల్ కారు నడిపాడు. అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. గచ్చిబౌలి నుంచి స్పీడ్‌గా వస్తుంటే ప్రమాదం జరిగింది. నేను మందు తాగలేదు. నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే జీరో వచ్చింది' అని పేర్కొన్నాడు. చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి A speedy car split into 2 parts after hit a tree, 3 people were dead on the spot and 1 suffered serious injuries at #Gachibowli area in #Hyderabad on Saturday. The deceased are 2 female junior artists and a bank employee.#caraccident#Carsplits2parts #DrunkandDrive pic.twitter.com/ZLWc4VQx2w — Surya Reddy (@jsuryareddy67) December 18, 2021 -
దుండిగల్‌లో తీవ్ర విషాదం: చచ్చినా.. మారరా..?
సాక్షి, హైదరాబాద్: డీకే నగర్లో విద్యార్థిని దేవి.. పంజగుట్ట వద్ద చిన్నారి రమ్య కుటుంబం.. తాజాగా వారం రోజుల క్రితం బంజారాహిల్స్, నార్సింగిల్లో నలుగురు.. ఇవి సంచలనం సృష్టించి.. రికార్డులకెక్కిన ‘డ్రంకన్ డ్రైవింగ్’ ఉదంతాలు. వీటికి తోడు ఆదివారం తెల్లవారుజామున దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మరో ఘోర ప్రమాదమూ ఈ జాబితాలో చేరింది. (చదవండి: మందు కొట్టి.. ఫ్యామిలీని బలిపెట్టాడు) ఈ దుర్ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏటా ఎందరు జైలుకు వెళ్తున్నా, నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా మందుబాబుల్లో మార్పు రావట్లేదు. మద్యం మత్తులోనే వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడంతో పాటు ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు. తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టినా... ► సాధారణంగా రోడ్డు ప్రమాద ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 304 (ఎ) కింద కేసు నమోదు చేస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఎదుటి వారికి ప్రాణనష్టం కలిగించడం ఆరోపణలపై దర్యాప్తు చేసి అభియోగాలు మోపుతారు. (చదవండి: నన్ను అడ్డుకుంటే పొడుచుకుంటా..) ► డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదంతో ఎదుటి వారి మరణానికి కారణమైన వారిపై ఐపీసీలోని సెక్షన్ 304 (పార్ట్–2) కింద కేసు నమోదు చేయడం ప్రారంభించారు. అంటే ఓ వ్యక్తి నిర్లక్ష్యంతో ప్రాణం పోయిందే కానీ ప్రాణం పోతుందని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అర్థం. ఆపై వెంట ఉన్న వారి పైనా ప్రేరేపించడం సెక్షన్ కింద ఆరోపణలు జోడిస్తున్నారు. ► ఇలాంటి కేసుల్లో బెయిల్ సైతం తొందరగా లభించదు. న్యాయస్థానంలో నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల నుంచి జీవిత ఖైదు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ సైతం లభించదు. అయినప్పటికీ మందుబాబుల్లో మాత్రం మార్పు రావట్లేదు. డేటాబేస్‌ను సెంట్రలైజ్డ్ చేయాలి... ► మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రమాదాలకు కారణమైన, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలతో సమగ్ర ఎల్రక్టానిక్ డేటాబేస్ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ► ఈ తరహా ఉల్లంఘనుల్లో అత్యధికం యువత, విద్యాధికులే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగి ప్రమాదాలు చేసిన వారితో పాటు వాహనాలు నడుపుతూ చిక్కిన వారి వివరాలను ఆధార్‌తో సహా పొందుపరచాలి. ఈ వివరాలను క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టం (సీసీటీఎన్ఎస్) ద్వారా వివిధ రకాలైన సేవలు అందించే విభాగాలకు అందుబాటులో ఉంచాలి. ► ఆయా విభాగాలు ఇందులోని వివరాలు సరిచూసుకుని తదుపరి చర్యలు తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. ప్రధానంగా పాస్‌పోర్ట్, వీసా, జాబ్ వెరిఫికేషన్ సమయాల్లో ఇలాంటి కేసులు అడ్డంకిగా మారాలి. అప్పుడే మందుబాబులు కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. -
బంజారాహిల్స్ కారు యాక్సిడెంట్ కేసు: కొంత ‘కాంప్రమైజ్’?..
సాక్షి, హైదరాబాద్: బతుకుదెరువు కోసం ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వలస వచ్చిన దేబేంద్రకుమార్ దాస్, అయోధ్య రాయ్‌లను మద్యం మత్తులో పొట్టనపెట్టుకున్న బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో నిందితులైన బజార్ రోహిత్ గౌడ్, వేదుల సాయి సోమన్‌కు రాజకీయ నాయకుల మద్దతు ఉందని ఆది నుంచీ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరికి శ్వాస పరీక్షల చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించడం.. పరోక్షంగా నిందితులకు సహకరించారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోపక్క పూటుగా మద్యం తాగి ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రహదారులపై వీరవిహారం చేసిన ఈ ‘నిషా’చరుల్ని పట్టుకోవడంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. కొంత ‘కాంప్రమైజ్’?.. ► ఈ కేసు విషయంలో పోలీసుల తీరుతెన్నులు ఆది నుంచీ అనుమానాస్పదంగా మారాయి. కేసు నమోదు విషయంలో మాత్రం పోలీసులు ఏ మాత్రం రాజీ పడలేదు. తీవ్రస్థాయిలో వచ్చిన ఒత్తిళ్లను పక్కన పెట్టి.. కారు నడిపిన రోహిత్‌తో పాటు పక్కన ఉన్న సాయి సోమన్ పైనా కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 304 (2), 109లతో పాటు ఎంవీ యాక్ట్‌లోని 185 కింద ఆరోపణలు చేశారు. ఇంత వరకు అంతా సజావుగానే ఉంది. ► రెయిన్బో ఆస్పత్రి వద్ద ప్రమాదం చేసిన నిందితులు అక్కణ్నుంచి రోడ్ నం.5లో ఉన్న పద్మావతి నిలయం అపార్ట్మెంట్ వరకు పారిపోయారు. అక్కడి సెల్లార్లో కారును దాచి మళ్లీ మరో ప్రాంతానికి వెళ్లిపోతూ గస్తీ పోలీసులకు చిక్కారు. ఈ ప్రమాదంలో యాక్సిడెంట్‌కు కారణమైన కారు కూడా కీలక ఆధారం. దాన్ని దాచేయడానికి ప్రయత్నించిన వీరిపై ఐపీసీలోని సెక్షన్ 201 కింద ఆరోపణలు చేర్చాల్సి ఉంది. పోలీసులు మాత్రం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. రీడింగ్ ఆలస్యంలో ఆంతర్యమేమిటో? ► ఈ కేసు కోర్టులో నిరూపితమై నిందితులకు కఠిన శిక్ష పడాలంటే వాళ్లు మద్యం మత్తులో వాహనం నడిపారని నిరూపించడం అత్యంత కీలకం. ఈ విషయంలోనూ పోలీసులు విచారణ సమయంలో నిందితులకు కలిసి వచ్చేలా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. బుధవారం పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూసినా.. రోడ్ నం.5లో నిందితులతో పాటు కారును అదుపులోకి తీసుకున్న గస్తీ బృందాలు సోమవారం తెల్లవారుజామున 3.15 గంటలకు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. అక్కణ్నుంచి నిందితులను పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చిన వెంటనే శ్వాస పరీక్ష చేసి ఎంత మోతాదులో మద్యం తాగారో తేల్చాలి. దీన్ని న్యాయస్థానానికి సమర్పించే రికార్డుల్లోనూ పొందుపరచాలి. ► పోలీసులు మాత్రం నిందితులకు దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా సోమవారం ఉదయం 7.19 గంటలకు శ్వాస పరీక్ష చేసి రోహిత్‌కు బీఏసీ కౌంట్ 70, సోమన్‌కు 58 వచ్చినట్లు రికార్డు చేశారు. ఈ కౌంట్ 30 లోపు ఉంటే అది ఉల్లంఘన కిందికి రాదు. ఈ కౌంట్ అనేది మద్యం తాగిన వ్యక్తి శరీరంలో ప్రతి గంటకూ తగ్గిపోతుంటుంది. ఈ కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత తీవ్రతగా కోర్టు పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా, నిందితులకు పరోక్షంగా కలిసి వచ్చేలా ఆలస్యంగా పరీక్ష చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి చోటా తనిఖీలు చేయలేం మద్యం తాగి వాహనాలు నడిపే వారితో పాటు హెల్మెట్ లేకుండా వాహనం నడపటం తదితర ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ప్రతి ఇల్లు, జంక్షన్లలో రాత్రి వేళ డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేయలేం. ఇవి ఎన్నో ఇబ్బందులకు కారణమవుతాయి. – బుధవారం విలేకరుల సమావేశంలో కొత్వాల్ అంజనీకుమార్ ఓ ఎమ్మెల్యే ఠాణాకు వచ్చారు.. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే సోమవారం ఉదయం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఆయన కేవలం ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాపై ఎలాంటి ఒత్తిడి చేయడానికి ప్రయత్నించలేదు. దర్యాప్తు పక్కాగా చేస్తున్నాం. – బుధవారం విలేకరుల సమావేశంలో జేసీపీ ఏఆర్ శ్రీనివాస్ చదవండి: Helicopter Crash: ఆయనొక్కరే బతికిబయటపడ్డారు -
ఒకే రోజు 6 డ్రంకన్ డ్రైవ్ ఘటనలు.. నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో మందుబాబుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. మద్యం తాగి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. సోమవారం ఒకేరోజు జరిగిన ఆరు ఘటనల్లో నలుగురు మృత్యువాత పడటం డ్రంకన్‌డ్రైవ్ విషాదానికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇకనుంచి ప్రతి రోజూ రాత్రి వేళ డ్రంకన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కేసుల తీరుతెన్నులు, పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సిటీ ట్రాఫిక్ చీఫ్ విజయ్‌కువర్ మంగళవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు అప్పుటికప్పుడే... ►నగర పోలీసు విభాగం 2011 నుంచి డ్రంక్ డ్రైవింగ్‌కు అడ్డుకట్ట వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ ఏడాది నవంబర్ నుంచి ప్రతి వీకెండ్లోనూ ఈ స్పెషల్‌డ్రైవ్ నిర్వహించే వాళ్లు. ఆ తర్వాత కాలంలో దీన్ని విస్తరిస్తూ వారానికి రెండు లేదా మూడు రోజులు చేపడుతున్నారు. ►తాజా పరిణామాల నేపథ్యంలో ప్రతి రోజూ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా డ్రంకన్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని విజయ్‌కుమార్ ఆదేశించారు. ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ కనీసం రెండు బృందాల చొప్పున ఉండాలని, నిత్యం ఒకే స్పాట్లో కాకుండా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో, కనీసం మూడు గంటల చొప్పున డ్రైవ్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ►రానున్న రోజులతో పాటు ప్రత్యేక సందర్భాల్లో ఈ తనిఖీల సమయంతో పాటు చేసే ప్రాంతాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి తాజా విధానాలు అమలులోకి రానున్నాయి. సిబ్బందితో ఇబ్బంది లేకుండా... ►ప్రతి రోజూ డ్రంకన్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించడానికి ట్రాఫిక్ పోలీసుల్లో ఉన్న సిబ్బంది సంఖ్య ఓ ప్రధాన సమస్యగా మారుతోంది. పగటిపూట రోడ్లపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు బందోబస్తు విధులకే ఉన్న సిబ్బంది చాలట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి రోజూ కొందరు సిబ్బందితో రెండు బృందాలు ఏర్పాటు చేసి రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ చేపడితే ఇబ్బందులు ఉంటాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విధులు నిర్వర్తించిన వాళ్లు మరుసటి రోజు ఉదయం విధులకు హాజరుకాలేదు. ఈ ప్రభావం ట్రాఫిక్ తీరుతెన్నులపై ఉంటుంది. ►ఈ నేపథ్యంలోనే డ్రంకన్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ కోసం పరిమిత సంఖ్యలో ట్రాఫిక్ అధికారులు, అవసరమైన మేర శాంతిభద్రతల విభాగం పోలీసులను వినియోగించనున్నారు. వీరికి సహకరించడానికి సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్– క్వార్టర్స్ నుంచి సిబ్బందిని వెహరించాలని ట్రాఫిక్ చీఫ్ విజయ్‌కుమార్ నిర్ణయించారు. ఆ ‘వేగులపై’ ప్రత్యేక నిఘా.. ►పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా, ఎన్ని తనిఖీలు చేపడుతున్నా ఆ సమాచారం ‘వేగుల’ ద్వారా తెలుసుకుంటున్న ‘నిషా’చరులుగా తమ ప్రయాణ వర్గాలను మార్చుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ►ఇలాంటి మందుబాబులకు సహకరించడానికి కొందరు యువకులు వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉండే ఈ గ్రూపు సభ్యుల తమ ప్రాంతంలో జరిగే డ్రంక్ డ్రైవింగ్‌కు సంబంధించిన సమయం, ప్రాంతం వివరాలను ఇందులో పోస్టు చేస్తున్నారు. ►వేగుల సమాచారంతో ప్రయాణ వర్గం మార్చుకుంటున్న మందుబాబుల వల్ల కొన్నిసార్లు ప్రమాదాలకు ఆస్కారం ఉందని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారి కోసం నిఘా వేసి ఉంచాలని, ఆయా గ్రూపుల్ని గుర్తిస్తే వాటి అడ్మిన్స్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అంశం పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ‘నిషా’ నిందితులకు రిమాండ్ మూడ్రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ బంజారాహిల్స్: మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి ఇద్దరు మృతికి కారకులైన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్ రాఘవేంద్ర కాలేజీకి చెందిన బజార్ రోహిత్‌గౌడ్, కర్మన్‌ఫట్‌లో నివసించే వేదుల సాయి సోమన్ మద్యం తాగి ఆ మత్తులోనే కారు నడపడంతో ప్రవదం చోటుచేసుకుంది. నిందితులిద్దరిపై ఐపీసీ సెక్షన్ 304(2) (నేరపూరిత హత్య), 185 ఎంవీ యాక్ట్ కింద కేసు నవెదు చేశారు. వీరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్త న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వీరిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రవద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మూడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కారులో ప్రముఖ సీరియల్ నటి
Gruhalakshmi Serial Actress Lahari, Collided With Car At Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ సీరియల్ నటి లహరి కారు, బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లహరి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నట్లు తెలిసింది. (చదవండి: ప్రియుడిని పెళ్లాడిన సీరియల్ నటి.. ఫోటోలు వైరల్) ఘటన జరిగిన తరువాత లహరి కారు నుంచి బయటకు దిగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుని.. కార్‌తో పాటు లహరిని కూడా స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో లహరి మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయనున్నారు. చదవండి: ‘గతంలో ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవి కృష్ణతో రిలేషన్!’ -
డ్రంకెన్ డ్రైవ్.. రక్తంలో ఆల్కహాల్‌ని ఎలా లెక్కిస్తారు?
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగినవారి రక్తంలో చేరే ఆల్కహాల్ శాతాన్నే బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్)గా చెప్తారు. సాధారణంగా ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30ఎంజీ (మిల్లీగ్రాములు) కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటే వారికి మత్తు ఎక్కినట్టుగా భావిస్తారు. బీఏసీ 30 కంటే తక్కువగా ఉంటేనే వాహనాలు నడపొచ్చు. ఏమాత్రం ఎక్కువున్నా నడపడానికి వీల్లేదు. బీఏసీ 60కిపైగా ఉంటే వాహనాలపై అదుపుకోల్పోయే అవకాశం ఎక్కువ. అదే 90కిపైగా ఉంటే ప్రమాదకరమని.. 120–150 దాటితే అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారు. బీఏసీ 150 దాటినవారి డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయడానికి, జైలుశిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. చదవండి: (యమ 'డ్రింకరులు' ఫుల్లుగా తాగి.. కిల్లర్స్‌లా..) -
మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఆర్జీఐ ఎయిర్‌పోర్టు దగ్గర ఓ ప్రభుత్వ వాహనం పోలీస్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయనపడిన కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Hyderabad Traffic Challan: ఒకే బైక్‌పై 179 చలాన్లు.. అక్షరాల రూ.42,475 ఫైన్లు, పరుగో పరుగు.. -
యమ 'డ్రింకరులు' ఫుల్లుగా తాగి.. కిల్లర్స్‌లా..
పగలూ రాత్రీ తేడా లేదు.. బైకా, కారా అన్న బాధ లేదు.. తాగామా, ఆ నిషాలో ఊరిమీద పడ్డామా అన్నట్టుగా మందుబాబులు రెచ్చిపోతున్నారు. యమకింకరుల్లా మారి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇక్కడా అక్కడా అని కాదు.. చాలా చోట్ల ఇదే పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలా ఒక్కరోజే నాలుగు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకచోట ఇద్దరు వలస జీవులు అసువులు బాయగా.. మరోచోట భార్యా భర్తలు మృతిచెందారు. మిగతా రెండు చోట్ల ఆరుగురు గాయాల పాలయ్యారు. బంజారాహిల్స్‌లో (బ్లడ్ ఆల్కహాల్ 78).. → ఆదివారం అర్ధరాత్రి 1.35 గంటలకు.. → రోడ్ నంబర్ 2లో రెయిన్బో ఆస్పత్రి ఎదురుగా.. → మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో.. దేవేంద్రకుమార్ (29), అయోధ్యరాయ్ (23) చనిపోయారు. → ప్రమాదానికి కారకులైన రోహిత్ గౌడ్‌కు 78, సోమన్‌కు 58 బీఏసీ (బ్లడ్ ఆల్కాహాల్ కౌంట్) వచ్చింది. గండిపేట్‌లో (బ్లడ్ ఆల్కహాల్ 146) → సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు.. → గండిపేట చౌరస్తా నుంచి కోకాపేట వెళ్లే రహదారి → అతివేగంతో వస్తున్న క్వాలిస్ ఢీకొట్టడంతో కోకాపేటకు చెందిన దుర్గం రాజు (30), మౌనిక (25) దంపతులు చనిపోయారు. → కుమార్తె పుట్టిందన్న ఆనందంతో మద్యం తాగి వాహనం నడిపిన సంజీవ్‌కు ఏకంగా 146 బీఏసీ వచ్చింది. → ప్రమాద సమయంలో రాజు, మౌనిక దంపతులు బైక్‌పై రాంగ్రూట్లో వస్తున్నారు. నార్సింగిలో (బ్లడ్ ఆల్కహాల్ 138) → ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటకు.. → గచ్చిబౌలి–నార్సింగి మధ్య రహదారి → మద్యం మత్తులో బైక్ నడుపుతూ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి గాయాల పాలైన కొల్లూరు యువకులు → బైక్‌పై ఉన్న శివకు 136, మూర్తికి 138 బీఏసీ వచ్చింది. మాదాపూర్‌లో (బ్లడ్ ఆల్కహాల్ 116) → ఆదివారం రాత్రి 11.30 గంటలకు.. → ఇనార్బిట్ మాల్ ఎదురు రహదారిపై.. → వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో నలుగురు హోటల్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు → ప్రమాదానికి కారణమైన నిఖిల్‌రెడ్డికి 116, అఖిల్‌కు 35 బీఏసీ వచ్చింది. ఈ ఇద్దరూ వైద్యులు కావడం గమనార్హం. ఫుల్లుగా తాగి.. కిల్లర్స్‌లా.. యమ‘డ్రింకరులు’యమకింకరులను మించిపోతున్నారు. పగలూరాత్రీ తేడా లేకుండా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాలు తోడేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలోని బంజారాహిల్స్, నార్సింగిల్లో జరిగిన రెండు ఉదంతాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. నిషాకు తోడు మితిమీరిన వేగంతో తేలికపాటి వాహనాలు నడిపి నలుగురి ప్రాణాలను హరించారు. బంజారాహిల్స్ పరిధిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వలస జీవులు అసువులు బాయగా, నార్సింగి ఉదంతంలో భార్యాభర్తలు బలయ్యారు. రెండు ఘటనలకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. – బంజారాహిల్స్, మణికొండ తెల్లారిన బతుకులు.. ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లా గోపాల్పురానికి చెందిన దేవేంద్రకుమార్ దాస్ (29), ఉత్తరప్రదేశ్‌కు చెందిన అయో ధ్య రాయ్ (23) బతుకు తెరు వు కోసం నగరానికి వలసవచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని రెయిన్బో ఆస్పత్రిలో ఒకరు అసిస్టెంట్ కుక్ గా, మరొకరు ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న వీళ్లు తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో టీ తాగేందుకు బయటికి వచ్చారు. ఆస్పత్రి ఎదురుగా ఉన్న డివైడర్ దాటుతుండగా 1.35 గంటల ప్రాంతంలో నాగార్జున సర్కిల్ వైపు నుంచి మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన పోర్షే కారు వీరిని బలంగా ఢీకొంది. ప్రమాదం ధాటికి ఇద్దరూ గాల్లో కి ఎగిరి, డివైడర్ దాటి, మళ్లీ రెయిన్బో ఆస్పత్రి వైపు ఉన్న రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాన్ని నడిపిన ఉప్పల్ రాఘవేంద్ర కాలనీకి చెందిన బజార్ రోహిత్ గౌడ్ (29) ఈఎల్వీ ప్రాజెక్ట్స్‌లో డైరెక్టర్. ఇతడి స్నేహితుడు వేదుల సాయి సోమన్ (27) రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తూ కర్మన్‌ఘాట్‌లో ఉంటున్నాడు. వీరిద్దరికి బంజారాహిల్స్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించగా రోహిత్ గౌడ్‌కు 78, సాయి సోమన్‌కు 58 చొప్పున బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) నమోదైంది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతుల్లో ఒకరైన దేవేంద్రకుమార్‌కు గత ఏడాదే వివాహమైంది. మరో అయిదు రోజుల్లో వివాహ వార్షికోత్సవం కోసం స్వస్థలానికి వెళ్లాలని భావించాడు. ఈ మేరకు సెలవు కూడా తీసుకున్నాడు. ఈలోపే మృత్యువు అతడిని కబళించింది. మూడు చోట్ల మద్యం తాగారు.. ప్రమాదానికి కారణమైన రోహిత్ గౌడ్, సాయి సోమన్ ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు మూడు చోట్ల మద్యం తాగారు. తమ స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల కోసం ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పోర్షే కారులో దుర్గం చెరువు సమీపంలోని ఆలివ్ బిస్ట్రో పబ్‌కు వెళ్లారు. అక్కడ రాత్రి 8 గంటల వరకు స్నేహితులంతా మద్యం తాగారు. రాత్రి 8 గంటలకు అక్కడ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 లోని ఫ్యాట్ పీజీయన్ పబ్‌కు వెళ్లి రాత్రి 11 వరకు మద్యం సేవించారు. పోలీసులకు దొరికిపోతామని.. ఆ సమయంలో ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తే డ్రంక్ డ్రైవింగ్‌లో పోలీసులకు చిక్కుతామ ని భావించారు. దీంతో బం జారాహిల్స్ రోడ్ నం. 6లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ కు వచ్చి అక్కడ అర్ధరాత్రి 12.45 గంటల వరకు మద్యం తాగి సిగరెట్ల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో కారులో తిరిగారు. మరోసారి మద్యం తాగడానికి రోడ్ నం. 2లోని పార్క్ హయత్ హోటల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మద్యం మత్తులో ఉన్న రోహిత్ తన కారును గంటకు 100 కిమీ వేగంతో నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడు. వారిది రాంగ్‌రూట్... అతనిది మద్యం మత్తు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో సోమవా రం మధ్యాహ్నం 1.30 గంట లకు మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రయాణ దూరం తగ్గుతుందనే ఉద్దేశంతో రాం గ్‌రూట్‌లో ప్రయాణించిన భార్యాభర్తల్ని మద్యం మత్తు లో కారు తోలుతూ అతివేగం గా వచ్చి ఓ వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నార్సింగి పరిధిలోని కోకాపేట గ్రామానికి చెందిన దుర్గం రాజు (30), మౌనిక (25) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మౌనిక గ్రామ డ్వాక్రా గ్రూపు రీసోర్స్ పర్సన్‌గా పని చేస్తోంది. సోమవారం ఉదయం వీరిద్దరూ గండిపేటలోని బ్యాంక్‌కు వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు. ►గండిపేట చౌరస్తా నుంచి కోకాపేట వెళ్లేందుకు సీబీఐటీ కళాశాల వరకు వెళ్లి యూ టర్న్ చేసుకురావాల్సి ఉంటుంది. అది దూరం అవుతుందని భావించిన రాజు రాంగ్రూట్లో వెళ్లాడు. అదే సమయంలో శంకర్పల్లి మండలం మోకిలకు చెందిన సీహెచ్ సంజీవ్ మద్యం మత్తులో క్వాలిస్ వాహనంలో నార్సింగి వైపునకు వేగంగా వస్తున్నాడు. ►ఓషియన్ పార్కు సమీపంలోకి రాగానే అదుపు తప్పి ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న రాజు, మౌనికలను ఢీకొట్టాడు. ఆ ధాటికి ఎగిరి రోడ్డుపై పడిన దంపతుల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతం రక్తపు మడుగుగా మారిపోయింది. స్థానికులు ఇద్దరినీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వీరి ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. కుమార్తె పుట్టిందనే ఆనందంలో.. క్వాలిస్ డ్రైవర్‌గా పని చేస్తున్న సంజీవ్ భార్య పుట్టిల్లు కోకాపేట. ఆదివారం రాత్రి కూతురు పుట్టడంతో ఆ సంతోషంలో అర్ధరాత్రి దాటే వరకు అతిగా మద్యం తాగాడు. సోమవారం ఉదయానికీ ఆ నిషా దిగలేదు. ఆ మత్తులోనే కుమార్తెతోపాటు భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వస్తున్నాడు. ఇతడిని అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా బీఏసీ కౌంటు 146 వచ్చింది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మరో ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు మణికొండ: మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వేగంగా పోతూ.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి కింద పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొల్లూరుకు చెందిన శివ, మూర్తి మద్యం తాగారు. ద్విచక్ర వాహనంపై ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలి నుంచి నార్సింగి వైపు వస్తున్నారు. ఔటర్‌రింగ్ రోడ్డు టోల్గేట్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి కింద పడిపోయారు. సమాచారం అందు కున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రై వేటు ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. పాదచారులపై దూసుకెళ్లి.. హఫీజ్‌పేట్: కొండాపూర్ మసీద్‌బండకు చెందిన ముగ్గురు వైద్యులు నిఖిల్‌కుమార్ రెడ్డి (26), అఖిల్ రామకృష్ణరాజు (24), మెండు తరుణ్ (24) ఆదివారం రాత్రి 11.30 గంటలకు గచ్చిబౌలిలోని ఓ బార్‌కు వెళ్లారు. నిఖిల్, అఖిల్ ఇద్దరు మద్యం తాగగా.. తరుణ్ వారితో కాలక్షేపానికి కూర్చున్నాడు. మద్యం సేవించిన అనంతరం ముగ్గురు కలిసి కియా కారు (ఏపీ39డీఆర్7007)లో మాదాపూర్‌లోని ఇనార్భిట్ మాల్ మీదుగా వేగంగా వెళ్తున్నారు. మాదాపూర్‌లోని చెట్నీస్ రెస్టారెంట్లో పని ముగించుకుని వెళ్తున్న నలుగురు సిబ్బందిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. కారుతో ఢీకొట్టిన యువకులే గాయపడినవారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం మేరకు మాదాపూర్ పోలీసులు మద్యం సేవించిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. -
Viral Video: ఇదేం పోయేకాలంరా అయ్యా!
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. వాహనదారులు పట్టించుకోవటం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుకున్నా.. తీరు మార్చుకోకుండా రోడ్లమీదకు వస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: వరి కొనుగోలు కేంద్రాలుండవు: సీఎం కేసీఆర్ వివరాలు.. నగరంలోని పాతబస్తీలో ప్రధాన రహదరిపై మద్యం మత్తులో వాహనం నడుపుతూ కనిపించాడు. తోటి వాహనదారులు ఎంత చెప్పినా వినకుండా.. మద్యం మత్తులో వాహనం నడుపుతూ భయభ్రాంతులకు గురిచేశాడు. చార్మినార్ నుంచి ఫలక్‌నుమా వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: మహిళ ప్రాణాన్ని నిలిపిన పోలీసులు -
డ్రంక్ అండ్ డ్రైవ్: ‘ఒక్క బీర్ మాత్రమే తాగిన సార్.. ఒట్టు’
సాక్షి, పరిగి(వికారాబాద్): ఓ మందు బాబు పరిగిలో హల్చల్ చేశాడు. పోలీసుల డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి ఒక్కబీరు మాత్రమే తాగానని, వదిలిపెట్టాలని పోలీసులను సతాయించాడు. వివరాలు.. పట్టణంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా షాద్‌నగర్‌కు చెందిన భీష్మాచారి కారులో షాద్‌నగర్ వైపు వెళ్తున్నాడు. పోలీసులు కారును ఆపి బ్రీత్ అనలైజర్‌తో తనిఖీ చేసేందుకు యత్నించారు. ఆయన గాలి ఊదినట్లు నటించాడు. దీంతో పోలీసులు గట్టిగా ఊదాలని చెప్పగా ఒక్కబీరు మాత్రమే తాగాను సార్.. ఒట్టు అని చెప్పాడు. చివరకు పోలీసులు తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. ఇతను అంతకు ముందు పరిగిలోని ఓ బార్లో మిత్రులతో కలిసి నిర్వాహకులతో గొడవకు దిగాడు. ఫుడ్‌లో పిన్ వచ్చిందని నానా హంగామా చేశాడని స్థానికులు తెలిపారు. చదవండి: ప్రాణం తీసిన టైర్ ముక్క.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. యువకుడి బలవన్మరణం తలకొండపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తలకొండపల్లిలో సోమవారం జరిగింది. ఎస్ఐ వరప్రసాద్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పాపయ్య, యాదమ్మ దంపతుల పెద్ద కుమారుడు అశోక్(22) అటోమెకానిక్. ఇటీవల పొలం అమ్మి నూతనంగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు. ఈ విషయంలో అశోక్ తల్లిదండ్రులతో గొడవపడి మనస్తాపానికి గురయ్యాడు. వీరి ఇంటికి కొద్దిదూరంలో అశోక్ నానమ్మ చెన్నమ్మ ఇల్లు ఉంది. ఆదివారం చెన్నమ్మ పనినిమిత్తం వేరే గ్రామానికి వెళ్లగా అశోక్ ఆమె ఇంట్లో నిద్రించాడు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన అశోక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం అశోక్ తండ్రి పాపయ్య ఇంటికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: భార్య మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు! -
కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ... మోతాదుకు మించి తాగితే కారు స్టార్ట్ అవ్వదు!!
వాషింగ్టన్: ఇప్పటి వరకు బ్రీత్-స్నిఫింగ్ సెన్సార్లతో తాగి డ్రైవ్ చేసేవాళ్లను పట్టుకోవడం కోసం నిరతరం పోలీసులు అప్రమత్తతో పనిచేస్తుండేవారు. ఇక అలాంటి పరిస్థి అవసరం లేకుండా ఎవరైన డ్రింక్ చేసి కారు నడిపితే ఆ కారు ఆటోమెటిక్‌గా స్టార్ట్ అవ్వకుండా ఆగిపోయేలా అమెరికా కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ ఏర్పాటు చేసేలా రూపొందించనుంది. ఈ సరికొత్త సాంకేతికతో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చు అని అమెరికా అంటోంది. రానున్న సంవత్సరాలలో ఆల్కహాల్ సేవించిన డ్రైవర్లను గుర్తించేలా ఈ కొత్త టెక్నాలజీ కార్లను రూపొందించే యూఎస్ ఫెడరల్ చట్టం విదేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని, పైగా ఏటా వేలాది ప్రాణాలను కాపాడగలమంటూ న్యాయవాదులు విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!) ఇటీవలే జో బిడెన్ ఈ చట్టంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టం కారణంగా క్రిమినల్ కేసులలో యజమానులకు విరుద్ధంగా ప్రభావంతమైన సాక్షులను అందించగలదా అన్నది కాస్త సందేహాలకు తావిచ్చేలా ఉంది. అంతేకాదు ఈ చట్టం పూర్తిస్థాయిలో పనిచేయలంటే కనీసం మూడు సంవత్సారాలు పడుతుంది. అయితే యునైటెడ్ స్టేట్స్లో ఆల్కహాల్-సంబంధిత క్రాష్‌లకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులకు మాత్రం ఇది ఆనందాన్నిచ్చే విషయం. ఈ మేరకు డ్రంక్ డ్రైవింగ్ వ్యతిరేక అడ్వకేసీ గ్రూప్ ఎంఏడీడీ జాతీయ అధ్యక్షుడు అలెక్స్ ఒట్టే మాట్లాడుతూ..." ఈ చట్టం ఒకరకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ముగింపుకి నాంది పలుకుతుంది." అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అత్యధునిక టెక్నాలజీతో కూడిన కారులో డ్రైవర్ ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ ఫర్ సేఫ్టీ (డీఏడీఎస్ఎస్)లో భాగంగా డ్రైవర్ శ్వాసను సంగ్రహించి పరీక్షించేలా ఒక విధమైన సెన్సార్లను పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంతేకాదు డ్రైవర్ కారు బటన్‌ను ఆన్ చేసిన వెంటనే అది వ్యక్తివేళ్ల నుంచి పరారుణ-కాంతిని నేరుగా చర్మం పై ప్రసరించి అక్కడ ఉపరితలం క్రింద ఉన్న రక్తంలోని ఆల్కహాల్ స్థాయిలను కొలుస్తుంది. ఈ క్రమంలో ఆటోమోటివ్ కోయాలిషన్ ఫర్ ట్రాఫిక్ సేఫ్టీ ప్రెసిడెంట్ రాబర్ట్ స్ట్రాస్బెర్గర్ మాట్లాడుతూ..."చాలా యూఎస్ రాష్ట్రాల్లో .08 శాతంకి మించి బ్లడ్‌లో ఆల్కహాల్ ఉంటే కారును స్టార్ట్ చేయకుండా లేదా ముందుకు కదలకుండా నిరోధించగల యాంటీ-చీట్ ఫంక్షన్లను కారులోని సిస్టమ్‌లో ఏర్పాటు చేశాం. పైగా దీనికి కారు తయారీదారుల మద్ధతు కూడా ఉంది" అని అన్నారు. (చదవండి: అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ) -
డ్రంకెన్ డ్రైవ్: వారంలో రూ.కోటిన్నర జరిమానా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ, డ్రంకెన్ డ్రైవ్‌లు, పెండింగ్ చలాన్ల వసూళ్లపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య రాచకొండ పరిధిలో 40,620 కేసులను నమోదు కాగా.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, డ్రంకెన్ డ్రైవ్ కలిపి సుమారు రూ.కోటిన్నర జరిమానా విధించారు. ఇందులో అత్యధికంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 26,475 కేసులు నమోదు కాగా.. రూ.48,98,900 ఫైన్లు విధించారు. ఇద్దరికి జైలు శిక్ష రాచకొండ కమిషరేట్ పరిధిలో వారం రోజుల్లో 49 డ్రంకెన్ డ్రైవ్ కేసులను నమోదయ్యాయి. రూ.4,38,500 జరిమానా విధించారు. 176 మందిని కోర్టులో హాజరుపరచగా ఇద్దరికి జైలు శిక్ష పడింది. అత్యధికంగా వనస్థలిపురంలో 10 కేసులు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాలదారులపై 38 కేసులు బుక్కవగా.. త్రీవీలర్స్పై 2, ఫోర్ వీలర్ వాహనాదారులపై 9 కేసులు నమోదయ్యాయి. 54 రోడ్డు ప్రమాదాలు.. 10 మంది దుర్మరణం.. కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 54 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. వీటిలో పది మంది దుర్మరణం చెందగా.. 50 మందికి గాయాలయ్యాయి. తీవ్రత వారీగా చూస్తే 10 కేసులు ఘోరమైన ప్రమాదాలు కాగా.. 44 సాధారణ రోడ్డు ప్రమాదాలున్నాయి. ఆయా డేటాను విశ్లేషించగా మానవ తప్పిదాలు, రహదారి ఇంజనీరింగ్ లోపాలతోనే జరిగాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, వాహనాలు వాటంతటవే ప్రమాదాలకు గురికావడం కారణాలని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్ తెలిపారు. ఏ విభాగంలో ఎన్ని కేసులంటే.. విభాగం కేసుల సంఖ్య జరిమానా (రూపాయల్లో) హెల్మెట్ లేకుండా 26,475 48,98,900 సీట్‌బెల్ట్ లేకుండా 129 12,900 డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 837 4,11,500 అదనపు ప్రయాణికులు 28 7,200 ఎక్స్ట్రా ప్రొజెక్షన్ 415 41,500 అతివేగం 2,023 20,23,000 సిగ్నల్ జంప్ 96 96,000 ప్రమాదకర డ్రైవింగ్ 14 14,000 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 96 96,000 -
డ్రంక్ అండ్ డ్రైవ్; సీజ్ చేసిన వాహనాలు వెనక్కు...
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు తెలంగాణ హైకోర్టు తీర్పు కాస్తా ఉపశమనాన్నిస్తోంది. గతంలో పట్టుబడిన వాహనాలను సీజ్ చేస్తూ నడిపేవారికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం చలానా చెల్లించే వారు. ఇటీవల హైకోర్టు తీర్పుతో ఈ పద్ధతికి ట్రాఫిక్ పోలీసులు ఫుల్స్టాప్ పెట్టారు. సాక్షి, బంజారాహిల్స్: ఏడాదిగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలను మెల్లమెల్లగా కోర్టుకు తీర్పుకు లోబడి ఇచ్చేస్తున్నారు. గడిచిన రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నా మద్యం సేవించి పట్టుబడ్డ వారి నుంచి వాహనాలను సీజ్ చేయకుండా సమీప ప్రాంతంలో ఉండే వారి బంధుమిత్రులను పిలిపించి ఆ వాహనాలను ఇచ్చి పంపిస్తున్నారు. ► బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు 615 వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సీజ్ చేశారు. ► జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 645 వాహనాలను సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అత్యధిక వాహనాలు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడగా ఆ తర్వాత స్థానం మలక్‌పేటలో పట్టుబడ్డారు. 6,7 స్థానాల్లో వరుసగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఉన్నాయి. ► కోర్టు తీర్పుతో సీజ్ చేసిన వాహనాలను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ప్రకారం యజమానులకు అప్పగిస్తున్నారు. ► సీజ్ చేసిన వాహనాలను అప్పగించే క్రమంలో మార్గదర్శకాలు అనుసరిస్తున్నారు. గత అయిదేళ్లుగా నగరంలో డ్రంక్ అండ్డ్రైవ్ నిర్వహిస్తుండగా ఏటా కేసులు పెరగడమే కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ► వాహనదారులకు కౌన్సెలింగ్‌తో పాటు న్యాయస్థానంలో హాజరుస్తున్నారు. అయినా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఇటీవల కొంత మందిపై చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. (చదవండి: Metro trains: ఆరుకొట్టంగనే మెట్రో రైలు) జూబ్లీహిల్స్ అంటేనే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. ► పబ్‌లు, క్లబ్‌లు, ఖరీదైన రెస్టారెంట్లు, హోటళ్లు జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నాయి. అర్ధరాత్రి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు ఈ ఏరియాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ► శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అయిదు వేర్వేరు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొని ఆ వాహనాలను సీజ్ చేసేవారు. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ► జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఏ నెలకు ఆ నెల కేసులు తగ్గుముఖం పట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది. ► డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబులను కట్టడి చేయడంలో ట్రాఫిక్ పోలీసులు రాత్రి 4 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తుండటంతో చాలా వరకు కేసులు తగ్గుముఖం పట్టాయనే చెప్పొచ్చు.(చదవండి: ఒలెక్ట్రాకు ఎంఎస్ఆర్టీసీ నుంచి 100 బస్సులకు ఆర్డరు) ► నగరంలో మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తక్కువే. ► పబ్‌ల నుంచి యువకులు అర్ధరాత్రి మద్యం సేవించి బయటికి వస్తూ వాహనాలను నడుపుతుండటం దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో తనిఖీలు అర్ధరాత్రి వరకు చేపడుతున్నారు. -
Drunk And Drive: వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్న పోలీసు శాఖ
సాక్షి, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ కొన్ని వాహనాలను పోలీస్ శాఖ శనివారం తిరిగి ఇచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను సీజ్ చేయవద్దని శుక్రవారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన పలు వాహనాలు పోలీసు శాఖ తీరిగి ఇవ్వటాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించింది. గుర్తింపు పత్రాలను తమ వద్ద పెట్టుకుని సదరు వ్యక్తులకు పోలీసులు వాహనాలను ఇస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టు బడిన వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని, వాహనాలు సీజ్ చేసే సమయంలో మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 448–ఎ నిర్ధేశించిన మేరకు వ్యవహరించాలని హైకోర్టు చెప్పింది. తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించే పోలీస్ అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
TS: వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
సాక్షి హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టు బడిన వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనాలు సీజ్ చేసే సమయంలో మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 448–ఎ నిర్ధేశించిన మేరకు వ్యవహరించాలని చెప్పింది. తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించే పోలీస్ అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో తమ వాహనాలను సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 41 పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. మరొకరికి అప్పగించొచ్చు... ‘డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనానికి సంబంధించిన ఆర్సీ చూపిస్తే ఆ వాహనాన్ని విడుదల చేయాలి. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే ఆయన్ను వాహనం నడపకుండా అడ్డుకోవచ్చు. అదే వాహనంలో లైసెన్స్ కలిగి మద్యం సేవించని వారు ఉంటే వారికి వాహనాన్ని అప్పగించవచ్చు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్ మినహా ఎవరూ లేకపోతే వాహనదారుని బంధువులు లేదా సన్నిహితులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఒకవేళ వాహనాన్ని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోతే సమీప పోలీస్‌స్టేషన్‌కు ఆ వాహనాన్ని తరలించి సురక్షితంగా ఉంచాలి. వాహన డ్రైవర్ మద్యం సేవించారన్న కారణంగా ఆ వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసు అధికారులకు లేదు. ఒకవేళ వాహనదారుడిని ప్రాసిక్యూట్ చేయా లని పోలీసులు భావిస్తే వాహనాన్ని సీజ్ చేసిన 3రోజుల్లోగా సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. ఈ మేరకు న్యాయమూర్తులు చార్జిషీట్లను మూడు రోజుల్లో విచారణకు స్వీకరించాలి. కోర్టు విచారణ ముగిసిన వెంటనే సంబంధిత ఆర్టీఏకు సమాచారం ఇచ్చి ఆ వాహనాన్ని పోలీసు అధికారులు విడుదల చేయాలి’అని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే మేనల్లుడు
జైపూర్: జోధ్‌పూర్‌లో స్థానిక ఎమ్మెల్యే దంపతులు పోలీస్‌స్టేషన్‌లో ధర్నాకు దిగారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన తన మేనల్లుడిని విడిచిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోధ్‌పూర్‌లో గత ఆదివారం పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో స్థానిక ఎమ్మెల్యే మీనాకున్వార్ మేనల్లుడు అధిక మోతాదులో మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే మీనా కున్వార్, తన భర్త ఉమైద్ సింగ్‌తో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకుని నేలపై కూర్చోని నిరసనకు దిగారు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘పిల్లలు కొన్ని సందర్భాల్లో తాగుతారు.. అది పెద్ద విషయంకాదన్నారు.. ’తమ మేనల్లుడిని విడిచిపెట్టాలని కోరారు. ఒక ఎమ్మెల్యేకు సరైన గౌరవం ఇవ్వడం లేదని స్టేషన్ అధికారిపై మండిపడ్డారు. ఈ క్రమంలో మానవత్వంతో మాట్లాడాలని సదరు పోలీసు అధికారి కోరారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో.. ఇప్పటికే కొంత మంది అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయిన విషయం గుర్తుంచుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా, చివరకు డీసీపీ అధికారి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. గత ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: భారీ ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వీడియో వైరల్ -
మద్యం మత్తులో పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టాడు
సాక్షి,అలంపూర్( మహబూబ్‌నగర్): మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగి ముప్పతిప్పలు పెట్టాడు. ఎస్ఐ లెనిన్ తెలిపిన వివరాలిలా.. ఆదివారం కర్నూల్‌కు చెందిన కొందరు యువకులు రాజోళిలో బహిరంగంగా మద్యం తాగుతున్నారని సమాచారం అందగా పోలీసులు అక్కడికి వెళ్లారు. గమనించిన కొందరు యువకులు పరారు కాగా మరో యువకుడు లక్ష్మణ్ మాత్రం మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే పోలీసు వాహనం వెనక అద్దాలపై దాడి చేయగా అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎట్టకేలకు యువకుడిని స్టేషన్‌కు తరలించారు. కర్నూల్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నించగా ఆత్మహత్య చేసుకోవడానికి అని సమాధానం ఇవ్వడంతోపాటు పోలీసులపై ఓ క్రమంలో దాడి చేసేందుకు యత్నించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. చదవండి: మమ్మల్ని క్షమించండి.. మీకు భారం కాకూడదనే.. -
యమకింకరులను మించిపోతున్న యమ ‘డ్రింకరులు’
యమ ‘డ్రింకరులు’ యమ కింకరుల్ని మించిపోతున్నారు.. వేళకాని వేళ మద్యం మత్తులో దూసుకుపోతున్నారు.. వాహనాలను నడిపే వీరు సేఫ్‌గానే ఉంటున్నప్పటికీ వెంట ఉన్న వాళ్లు, ఎదుటి వాళ్ల బతుకుల్లో చీకట్లు అలముకొంటున్నాయి.. మొన్న పంజగుట్ట పరిధిలో రమ్య కుటుంబం, హయత్‌నగర్‌ర్ సంజన కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది ‘డ్రింకరులే’. వీరే కాదు.. రికార్డుల్లోకి ఎక్కని, ఎక్కిన ‘నిశా’చరుల బాధితులు ఇంకా ఎందరో ఉంటున్నారు. మందుబాబుల్ని కట్టడి చేయడంలో మాత్రం ప్రభుత్వ విభాగాలు ఆశించిన ఫలితాలు సాధించడంలేదనే ఆరోపణలున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో కష్టసాధ్యంగా నిరూపణ.. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసిన కేసుల్లో ‘నిరూపణలు’ కష్టసాధ్యంగా మారుతున్నాయి. అనేక కేసుల్లో ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు పారిపోవడం జరుగుతోంది. మళ్లీ వీరు చిక్కేప్పటికీ 24 నుంచి 48 గంటలు గడిచిపోతున్నాయి. దీంతో సదరు వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని, అతడు ఆ స్థితిలో డ్రైవింగ్ చేశాడని నిరూపించడం గగనంగా మారుతోంది. ♦ ఈ తరహా కేసుల నమోదు, దర్యాప్తులోనూ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) లేకపోవడం సైతం మందుబాబులకు అనుకూలంగా మారుతోంది. ఈ కారణంగానే పోలీసులు ఒక్కో కేసును ఒక్కో రకంగా నమోదుతో పాటు దర్యాప్తు చేస్తున్నారు. ♦ మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై కఠిన చర్యలు లేకపోవడం సైతం ‘నిశా’చరులు పెరగడానికి ఓ కారణంగా మారుతోంది. ప్రస్తుతం డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్‌ను కేవలం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో చిక్కిన వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఆపై కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ♦ అనేక ఉదంతాల్లో మందుబాబులు న్యా యస్థానాలకు వెళ్లకుండా తమ వాహనాలను వదిలేస్తున్నారు. తక్కువ ఖరీదైన వాహనాల విషయంలోనే ఇలా జరుగుతోంది. ఈ కారణంగానే ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో ఆనక వాహనాలు పడి ఉంటున్నాయి. ♦ ‘నిశా’చరులకు జైలు శిక్షలు, జరిమానాలు పెంచడం, వారి డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేయడం, వారి తో పాటు కుటుంబీకులకూ పక్కా గా కౌన్సెలింగ్ చేయడం తదితర కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితాలు ఉంటాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. ♦ పోలీసు విభాగంలో ఉన్న సిబ్బంది కొరత కారణంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్విరామంగా జరగట్లేదు. సాధారణంగా రాత్రి 9-11 గంటల మధ్యే ఇవి జరుగుతున్నాయి. ఈ విషయం పసిగడుతున్న మందుబాబులు ఆ సమయాలు మార్చి వెళ్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న ప్రమాదాలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. మచ్చుకు కొన్ని ఘటనలు.. 2021 ఆగస్టు 1 రాత్రి 11.30 గంటలు. కెనడాలో ఉన్నత విద్యనభ్యసిస్తూ నగరానికి వచ్చిన అశ్రిత, ఈమె స్నేహితురాలు తరుణి, క్లాస్మేట్స్ సాయి ప్రకాష్, అభిషేక్‌లు ఆదివారం రాత్రి ఓ పబ్ నుంచి బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న అభిషేక్ నడుపుతున్న కారు గచ్చిబౌలి పరిధిలో అదుపు తప్పి ప్రమాదం జరగడంతో అశ్రిత అసువులు బాసింది. ♦ 2021 జూన్ 26.. తెల్లవారుజాము ఒంటి గంట. శ్రవణ్‌కుమార్, నవీన్, ఉదయ్‌కిరణ్, మహేందర్‌రెడ్డి కారులో బయలుదేరారు. కారు నడుపుతున్న ఉదయ్ మద్యం మత్తులో మీర్జా గూడ స్టేజ్ సమీపంలో లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రవణ్, నవీన్ అక్కడిక్కడే చనిపోయారు. ♦ 2021 మే 23.. తెల్లవారుజాము 3 గంటలు.. కపిల్ నాయక్ గచి్చబౌలిలో ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడే మద్యం తాగి ఆ మత్తులో తన బెంజ్ కారు నడుపుకుంటూ వచ్చాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.10లో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టాడు. ♦ 2012 ఏప్రిల్ 5.. తెల్లవారుజాము 2.30 గంటలు బి.వీరరాఘవ చౌదరి మద్యం మత్తులో తన స్నేహితుడు రాకేష్ వర్మను ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్తున్నాడు. అయ్యప్ప సోసైటీ ప్రాంతంలో మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో రాకేష్ వర్మ దుర్మరణం చెందాడు. -
దెబ్బకు మత్తు దిగింది.. తిక్క కుదిరింది
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో చిక్కిన చోదకుల్లో 372 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయని ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. గత నెల 26 నుంచి 30 వరకు జరిగిన ప్రత్యేక డ్రైవ్‌ల్లో మొత్తం 621 కేసులు నమోదు చేశారు. వీటి చోదకులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో హాజరుపరిచారు. చోదకులు తీసుకున్న మద్యం మోతాదు, నడిపిన వాహనం తదితరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఒక రోజు నుంచి 22 రోజుల వరకు జైలు శిక్షలు విధించాయి. జైలుకు వెళ్లిన 372 మందిలో 186 మందికి ఒక రోజు, 101 మందికి రెండు రోజులు, 40 మందికి మూడు రోజులు, 18 మందికి నాలుగు రోజులు, 11 మందికి ఐదు రోజులు, ఇద్దరికి ఆరు రోజులు, అయిదుగురుకి వారం, నలుగురికి ఎనిమిది రోజులు, 10, 12, 16, 18 రోజుల చొప్పున ఒక్కొక్కరికి, మరో వ్యక్తికి 22 రోజుల జైలు శిక్ష పడింది. వీరికి కోర్టులు రూ.15.26 లక్షలు జరి మానా విధించాయి. వీరి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలంటూ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. -
కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ… మద్యం మత్తులో
Drunk And Drive Funny Video: మద్యం తాగి వాహనాలు నడపడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పిన తాగి నడిపే వారిలో మార్పు రావడం లేదు. అయితే తాగి బండి నడిపితే ఎదురయ్యే అనర్థాల గురించి హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కొందరు వాహనదారులు మాత్రం.. అయితే నాకేంటి అన్నట్లు… నిత్యం ఫూటుగా తాగి రోడ్లపైకి వస్తున్నారు. తాజాగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉదయాన్నే మంద్యం తాగి, హెల్మెట్‌ను అద్దానికి తగిలించి, ద్విచక్ర వాహనంపై రోడ్డుమీదకొచ్చాడు ఓ ప్రబుద్ధుడు. మద్యం మత్తులో ఊగుతూ.. తూలుతూ రోడ్డుపై వేగంగా వేళుతున్న కారులు, బైకులకు అడ్డంగా వస్తున్నాడు. రహదారిపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించాడు. ఈ సంఘటన ఇబ్రహీంపల్లి గేట్ వద్ద ఈనెల నాలుగున చోటుచేసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో’ అంటూ ట్విటర్లో షేర్ చేశారు. పోలీస్ టెక్నికల్ టీమ్ ఈ వీడియోకు బ్యాడ్రౌండ్ మ్యూజిక్, ఎమోజీలను జోడించి ‘మద్యం సేవించి వాహనం నడపొద్దు’ అంటూ అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. -
నన్నే ఆపుతారా.. నేను ఎవరో తెలుసా.. అంటూ హల్చల్
సాక్షి, హిమాయత్‌నగర్: నేను సీఐ మనిషినంటూ సినీ ఫక్కీలో ఎస్సైకి ధమ్కీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇద్దరు యువకులు. సోమవారం రాత్రి హిమాయత్‌నగర్ లిబర్టీ సర్కిల్ పరిధిలో విధుల్లో ఉన్న నారాయణగూడ పోలీసులు మాస్క్ లేకుండా బైకుపై వెళ్తున్న ఇద్దరి యువకుల్ని ఆపారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై చందర్‌సింగ్ వద్దకు ఆ యువకులు వచ్చి వాగ్వాదంకు దిగారు. ఏమైంది అని ఎస్సై చందర్ సింగ్ అడిగేలోపే ‘నన్నే ఆపుతారా.. నేను ఎవరో తెలుసా.. నేను మాస్క్ తీయలేదు.. నువ్వు మాట్లాడుతుంటేనే నీకు ఫోన్ వస్తది చూడు’ అంటూ ఎస్సైకి ధమ్కీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పైగా ఆ ఇద్దరూ ఊగుతూ మాట్లాడుతున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేసేలోపే ఆ యువకులకు సీఐ ఫోన్ చేశాడు. ఫోన్ అక్కడున్న ఎస్సైకి ఇవ్వు అనడంతో వాళ్లు ఎస్ఐకి ఫోన్ ఇచ్చారు. జరిగిన విషయం సీఐకి చెప్పేందుకు ఎస్సై చందర్ సింగ్ ప్రయత్నం చేస్తుండగా అదేమీ వినకుండా ‘మా వాళ్లని వదిలేయ్.. ఏమన్నా ఉంటే మీ సీఐతో మాట్లాడతా..’ అని అనడంతో చేసేదేమీ లేక దౌర్జన్యానికి పాల్పడ్డ ఆ ఇద్దరినీ వదిలేశారు. చదవండి: ఛిద్రమైన కుటుంబం.. భర్త మృతితో ఆవేదన చెంది -
అతివేగంతో పల్టీలు కొట్టిన కారు.. కేసు వద్దని ఎమ్మెల్యేల ఒత్తిడి!
సాక్షి, లంగర్‌హౌస్: మద్యం మత్తులో కారు వేగంగా నడపగా.. అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేసి ప్రమాదాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. మలక్‌పేట్‌లో నివాసముండే రషీద్‌ఖాన్(19) విద్యార్థి. స్నేహితులతో మద్యం తాగి వోక్స్ వ్యాగన్ పోలో(ఎపి 29బిపి 3444) కారులో అర్ధరాత్రి దాటాక ముగ్గురు స్నేహితులతో కలిసి లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ ముందు నుంచి రింగ్ రోడ్డు వైపు వేగంగా వెళ్తున్నారు. మొఘల్‌నగర్ రింగ్ రోడ్డు పీవీ నర్సింహరావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్–100 వద్దకు రాగానే కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న రషీద్‌ఖాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేయవద్దని ఇద్దరు పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి రావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ వివరాలను గోప్యంగా ఉంచే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. చదవండి: పల్టీలు కొట్టిన పోలీస్ వాహనం గంటకు 140 కిమీ వేగం.. అందుకే ప్రమాదం -
జూబ్లీహిల్స్: కారుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీభత్సం
సాక్షి, బంజారాహిల్స్: ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ మూడు స్కూటర్లను ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. షేక్‌పేట్, ఆదిత్య టవర్స్ ఉంటున్న పి.వేణు(25) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తు న్నాడు. ఆదివారం రాత్రి హిమాయత్‌నగర్‌లో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. సోమ వారం ఉదయం కారులో అక్కడి నుంచి బయల్దేరి జూబ్లీహిల్స్ మీదుగా షేక్‌పేట ఆదిత్య టవర్స్‌కు వెళుతూ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్‌లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో మూడు బైక్‌లు నుజ్జునుజ్జుకాగా ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత అతను కారుతో అక్కడి నుంచి ఉడాయించాడు. అతడిని వెంబడించిన ట్రాఫిక్ పోలీసులు ఫిలింనగర్‌లోని ఓ సెల్లార్ లో దాక్కున్న వేణును అదుపులోకి తీసుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సునీల్ అనే వ్యక్తి అపోలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. క్రాంతికుమార్, శ్రీనివాస్ అనే వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా 170 బీఏసీ నమోదైంది. బాధితుడు క్రాంతికుమార్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి:కూకట్పల్లి: మద్యం మత్తులో యువకుల హల్చల్.. 5 వేల హెచ్ఎం పోస్టులు భర్తీ చేయనున్నారా! డేంజర్ కీటకాలు.. వాహనాలపై ముప్పేట దాడి -
కూకట్పల్లి: మందులోకి నీళ్లు ఇవ్వాలంటూ..
సాక్షి, కేపీహెచ్‌పీకాలనీ: మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేసిన ఘటన కేపీహెచ్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌పీకాలనీలోని పెట్రోల్ బంక్ సమీపంలో ప్రధాన రహదారిపై సోడాలు అమ్ముకునే వ్యక్తి వద్దకు ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ఇన్నోవా వాహనంలో వచ్చారు. మద్యంలో కలుపుకొనేందుకు నీళ్లు ఇవ్వాలంటూ హంగామా సృష్టించారు. దీంతో సోడాలు అమ్ముకునే వ్యక్తి నీరు ఇచ్చేందుకు నిరాకరించాడు. కోపోద్రిక్తులైన ఆ యువకులు సోడా బండిలోని సోడాలు, మంచినీటి డబ్బాను కింద పడేశారు. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు తాను పోలీస్ అధికారి కొడుకునంటూ ఇన్నోవా వాహనం సైరన్ మోగించి భయభ్రాంతులకు గురి చేయగా, సోడాలు అమ్మే వ్యక్తి 100కు డయల్ చేశారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని అరుణ్, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ ఓ పోలీస్ అధికారి కుమారుడు కాగా, అరుణ్ డాక్టర్. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లి చూపుల కోసం కారు తీసుకెళ్లి.. -
మహిళా కానిస్టేబుల్‌పై దురుసు ప్రవర్తన,వ్యక్తి అరెస్టు
బంజారాహిల్స్: మద్యం మత్తులో ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్‌ను అసభ్య పదజాలంతో దూషించిన యువకుడిపై కేసు నమోదైంది. ఘట్కేసర్ మండలం బోడుప్పల్‌కు చెందిన కొప్పు లవకుమార్(32), ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగి ఇన్నోవా కారులో వెళ్తున్నారు. జూబ్లీహిల్స్‌రోడ్ నెం. 45 చౌరస్తాలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసిన లవకుమార్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ శ్రీలక్ష్మి గుర్తించి మరో కానిస్టేబుల్‌తో కలిసి లవకుమార్ కారును ఆపింది. మత్తులో ఉన్న లవకుమార్ శ్రీలక్ష్మి పై దుర్భాషలాడుతూ పోలీసులపై దాడికి యత్నించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా నెట్టేశాడు. ఎట్టకేలకు పోలీసులు పరీక్షలు నిర్వహించగా బీఏసీ 100 పైనే వచ్చింది. అనంతరం శ్రీలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లవకుమార్‌ను అరెస్ట్ చేశారు. ( చదవండి: విషాదం.. సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ) -
తప్పతాగి పోలీసులనే భయపెడున్న డ్రైవర్లు!
⇔ రెండు నెలల క్రితం మియాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ డీడీ తనిఖీల్లో ఉన్నప్పునడు వనస్థలిపురం పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ కారులో వస్తున్నాడు. అయితే పోలీసులను గమనించిన అతను వేగంగా వాహనాన్ని నడుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎస్ఐ రమేష్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతని వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐపీసీ 332 సెక్షన్ కింద కేసు నమోదుచేసి జైలుకు తరలించారు. ⇔ గత నెలలో జేఎన్టీయూ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడు వేగంగా దూసుకువచ్చి పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐను ఢీకొట్టడంతో కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. ⇔ కేపీహెచ్‌బీ కాలనీ నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్ సమీపంలో శనివారం రాత్రి 11.40 గంటలకు ట్రాఫిక్ పోలీసులు డీడీ తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో అతిగా మద్యం సేవించి కారులో అతివేగంతో వచ్చిన డ్రైవర్ సృజన్ హోంగార్డు ప్రహ్లాద్‌తో పాటు అక్కడే నిలిచి ఉన్న మహిళను ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకొని అక్కడికొచ్చిన ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి అక్కడి ట్రాఫిక్ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న క్రమంలో మరోకారులోవచ్చిన ట్సాక్సీ డ్రైవర్ అస్లామ్ అతివేగంతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో ఎగిరిపడిన మహిపాల్‌రెడ్డి రోడ్డు పక్కనే ఉన్న రాయికి తగిలి కాలు విరిగింది. తలకు తీవ్రగాయాలయ్యాయి. చదవండి: మందుబాబు దూకుడు.. పోలీసుల్నే 'ఢీ' కొట్టాడు ..ఈ మూడు ఘటనలే కాదు...రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఒక్కొసారి వారి ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తున్నాయి. రాత్రి పది దాటిన తర్వాత వివిధ ప్రాంతాల్లో డీడీ తనిఖీలు చేస్తున్న వీరు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నా...డ్రంకన్ డ్రైవర్లు తమను పట్టుకుంటే జరిమానాతో పాటు జైలుకు పంపిస్తారని తప్పించుకునే క్రమంలో ఎదురుగా ఉన్న సిబ్బందిని ఖాతరు చేయకుండా దూసుకెళుతున్నారు. ఫలితంగా పోలీసులు గాయపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇటువంటివారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపుతున్నా అడపాదడపా జరుగుతున్న ఈ ఘటనలు పోలీసులను కలవరపెడుతున్నాయి. ఓవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ...మరోవైపు బారికేడ్లతో రహదారిని దిగ్బంధం చేసి డీడీ తనిఖీలు చేస్తున్న పోలీసులు అడపాదడపా కొంతమంది డ్రంకన్ డ్రైవర్లు చేస్తున్న చేష్టలతో భయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ► ఇక డీడీ తనిఖీల సమయంలో పోలీసులు కొన్ని నిబంధనల్ని విస్మరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ►వాహనచోదకుడు ఆయా పరిస్థితుల్ని బట్టి కచ్చితంగా వాహనాన్ని స్లో చేసుకునే స్ట్రాటజిక్ పాయింట్స్ (రోడ్డు, బ్రేకర్లు, టర్నింగ్ పాయింట్లు) వద్ద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడితే కొంత ఉపయోగం ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. ►వాహనచోదకులను ఆపేందుకు రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నా...వాటి రక్షణలో పోలీసులు ఉండడం లేదు. కొన్నిచోట్లు బారికేడ్ల కన్నా ముందుకెళ్లి వాహనచోదకులను ఆపుతున్న సందర్భాలున్నాయి. ►వాహనచోదకులు హెల్మెట్ వాడినట్టుగానే డీడీ తనిఖీల్లో పాల్గొనే ట్రాఫిక్ పోలీసులు వైట్ క్యాప్‌లు ధరించాలి. దీనివల్ల కొంత ప్రమాదం తప్పే అవకాశం ఉంది. నిబంధనల మేరకు చర్యలు డ్రంకన్ డ్రైవ్ తనిఖీ సమయంలో నిబంధనల ప్ర కారం ఏమేమి రక్షణ చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు వాహనదారులు అతిగా వ్యవహరిస్తే ఐపీసీ 333 సెక్షన్‌తో పాటు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇతర చర్యలు తీసుకుంటున్నాం. మందుబాబుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. – విజయ్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
మందుబాబు దూకుడు.. పోలీసుల్నే 'ఢీ' కొట్టాడు
సాక్షి, కేపీహెచ్‌బీ కాలనీ: మద్యం సేవించి వాహనం నడుపుతూ వచ్చిన వ్యక్తి డ్రంకన్ డ్రైవ్ తనిఖీ విధుల్లో ఉన్న హోంగార్డుతో పాటు ఓ మహిళను ఢీకొట్టాడు. దీంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకొని వివరాలు సేకరిస్తున్న ఏఎస్ఐని అతివేగంతో వచ్చిన మరో ట్యాక్సీ డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆయన రోడ్డు పక్కనే ఉన్న రాయిపై ఎగిరిపడ్డారు. తల, కాలుకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఉదంతమంతా కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్ సమీపంలో కేపీహెచ్‌బీ లా అండ్ ఆర్డర్, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా డ్రంక్ డ్రైవ్ చేపట్టారు. సుమారు 11.40 గంటల సమయంలో బాచుపల్లికి చెందిన సృజన్.. పవన్‌తో కలసి మద్యం సేవించి తన స్నేహితుడైన శ్రీధర్‌ను పికప్ చేసుకునేందుకు నిజాంపేట వైపు టీఎస్03 ఈజెడ్ 9119 నంబర్ గల క్రెటా వాహనంలో బయలుదేరారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న విషయాన్ని గుర్తించి వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ రాజ్‌కుమార్ వారి కారు వద్దకు వచ్చి ఆపాలని సూచించాడు. దీంతో సృజన్ కారును వేగంగా రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు ప్రహ్లాద్‌తో పాటు తనూజ అనే మహిళను ఢీకొట్టాడు. ఎస్ఐ సక్రమ్ అప్రమత్తమై గాయాలైన ప్రహ్లాద్, తనూజను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన సృజన్‌ను అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా 174గా నమోదు కావడం విశేషం. కారులో ఉన్న సృజన్ స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దూసుకొచ్చిన క్యాబ్... ఈ ఘటన గురించి తెలుసుకున్న నైట్ రౌండింగ్ ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. మహిపాల్‌రెడ్డి ప్రమాద వివరాలను నోట్ చేసుకుంటుండగానే అర్ధరాత్రి 12.10 గం. సమయంలో టీఎస్08 యూడీ 2984 నంబర్ గల క్యాబ్‌ను అతి వేగంగా నడుపుతూ అటుగా వచ్చిన అస్లాం అలీ.. మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టాడు. ఆయన ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న రాయిపై పడటంతో కాలు, తలకు తీవ్రగాయాలయ్యాయి. మహిపాల్‌రెడ్డిని కొండాపూర్‌లోని కిమ్స్‌కు తరలించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆస్పత్రికి వెళ్లి మహిపాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన సృజన్, అస్లాం అలీలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 121 మంది
సాక్షి, నాగోలు: రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో గురువారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 121 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్చార్జి డీసీపీ జి.మనోహర్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిలో 10 మందిని జైలుకు పంపించినట్లు ఆయన చెప్పారు. రెండోసారి పట్టుబడిన ఓ ఆటో డ్రైవర్‌కు పెనాల్టీతో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశామన్నారు. మొత్తం రూ.2.32 లక్షల జరిమానా విధించినట్లు డీసీపీ మనోహర్ పేర్కొన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్: పుణే ఫైనాన్సర్ వైస్ ప్రెసిడెంట్ మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపి నగర ఆర్థిక సంస్థ ఉపాధ్యక్షుడి మృతికి కారమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత ఆదివారం జరిగిన ఈ ఘటనకు కారణమైన కారు యజమాని జేమ్స్(30)పై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్టు అయిన సాయంత్రమే నిందితుడు బెయిల్‌పై విడుదల కావడం స్థానికంగా ఆందోళన రేపుతోంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అంకుర్ ఖండేల్వాల్(38) ఆదివారం రాత్రి భార్య రోషిణి, కుమారుడితో కలిసి ఆదివారం ఉదయం 12:30 గంటలకు పక్కింట్లొ జరిగే ఓ కార్యక్రమానికి నడుచుకుంటూ బయలుదేరాడు. అదే సమయంలో జేమ్స్(30) అనే వ్యక్తి ఫుల్‌గా తాగి కారు నడిపాడు. ఈ క్రమంలో కుమార్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో కారు అదుపు తప్పి ఖండేల్వాల్ తాగి గోడను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఖండేల్వాల్ తీవ్రంగా గాయపడగా ఆయన భార్య రోషిణికి స్వల్ప గాయలయ్యాయి. కాగా ఈ ఘటనలో బాధితుడి కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీంతో వెంటనే స్థానికులు బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా ఖండేల్వాల్ చికిత్స పొందుతూ మరణించగా ఆయన భార్య కొలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వీర్ కారు యజమానికి జేమ్స్ ఆ సమయంలో మద్యం సేవించినట్లు ప్రాథమిక పరీక్షలో ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతుడు ఖండేల్వాల్ భార్య ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు జేమ్స్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై ఎస్ఐ సునిల్ జాదవ్ మాట్లాడుతూ.. నిందితుడు జేమ్స్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కుమార్ అనే వ్యక్తి ఇంటి ప్రహారీ గొడతో పాటు అక్కడ పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. దీంతో నిందితుడు జేమ్స్‌పై నిర్లక్ష్యంగా కారు నడపడం, వాహనం చట్టం కింద కేసు నమోదు చేసి ఆదివారం సాయంత్రం కోర్టులో హాజరపరచమన్నారు. అయితే ఆ రోజు సాయంత్రమే కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో అతడిపై వెంటనే చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం దీనిపై చట్టపరమైన చర్య తీసుకునేందుకు సీనియర్ లీగల్ ఆఫీసర్లను కలిసినట్లు ఆయన చెప్పారు. కాగా నిందితుడు జెమ్స్ ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు రక్తాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు ఆయన వెల్లడించారు. -
మందుబాబులు చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా?
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులు చిక్కిన 753 మంది మందుబాబులు గత నెలలో చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.78,94,100. ఫిబ్రవరిలో 3,261 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ చిక్కారని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ మంగళవారం వెల్లడించారు. వీరిలో 768 మందిపై కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశామన్నారు. 15 మందికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన 753 మందికి రూ.78.94 లక్షలు జరిమానా విధించిందన్నారు. జైలు శిక్ష పడిన వారిలో ఒకరికి 15 రోజులు, మరొకరికి 8 రోజులు, ముగ్గురికి వారం, ఎనిమిది మందికి ఐదు రోజులు శిక్షలు పడ్డాయి. మరో ఇద్దరిని కోర్టు సమయం ముగిసే వరకు నిల్చునేలా న్యాయమూర్తి ఆదేశించారు. గత నెలలో చిక్కిన వారిలో మిగిలిన 2493 మంది పైనా త్వరలోనే చార్జ్‌షీట్స్ వేయనున్నట్లు అనిల్‌కుమార్ పేర్కొన్నారు. -
సీసీటీవీ దృశ్యాలు:వనస్థలిపురం ఘోర రోడ్డు ప్రమాదం
-
హైదరాబాద్: తప్పతాగి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభానికి ఢీ
-
వనస్థలిపురంలో కారు బీభత్సం, సీసీటీవీ దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. యువకుడు మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. గౌతమ్ అనే యువకుడు తన స్నేహితులు ఇద్దరితో కలిసి సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీం పట్నం వెళ్తున్నాడు. అప్పటికే అతడు మద్యం సేవించి ఉన్నాడు. ఈ క్రమంలో హస్తినాపురంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు (నెంబర్: TS05FH2356)) డివైడర్ పై నుంచి మరో పక్కకి దూసుకెళ్లింది. గౌతమ్‌తో పాటు కారులో వెనకాల సీట్లో కూర్చున్న అతడి స్నేహితుడు సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మరో స్నేహితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఇక యాక్సిడెంట్ చేసిన గౌతమ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. దీంతో పోలీసులు నగరంలో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై దృష్టి సారిస్తున్నారు. శుక్రవారం రాత్రి పోలీసులు జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ టీవీ చానెల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్‌లు వేసే కమెడియన్ తన్మయి పట్టుపడ్డాడు. అతనితో పాటు కొంత మంది ఈవెంట ఆర్గనైజర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ తనిఖీల్లో ఐదు కార్లు, రెండు ఆటోలు, 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మద్యం మత్తు.. నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో చిక్కి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ‘నిషా’చరుడు సయ్యద్ అమీరుద్దీన్‌కి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసి అరెస్టు చేయించింది. చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు ఆ నిందితుడిని శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు.. అమీరుద్దీన్‌కు 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఓ మందుబాబుపై ఎన్బీడబ్ల్యూ జారీ కావడంతో ట్రాఫిక్ పోలీసుల చరిత్రలో తొలిసారని చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31 రాత్రిని జీరో యాక్సిడెంట్ నైట్‌గా చేయడానికి సిటీ ట్రాఫిక్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అంబర్‌పేటకు చెందిన ప్లంబర్ సయ్యద్ అమీరుద్దీన్ మద్యం తాగి యాక్టివా వాహనంపై వస్తూ చార్మినార్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ అనలైజర్ యంత్రంతో పరీక్షించిన నేపథ్యంలో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 141గా తేలింది. ఈ కౌంట్ 30 దాటితే వారిపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దీంతో చార్మినార్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, వివరాలు నమోదు చేసుకుని, వాహనం స్వాధీనం చేసుకుని పంపారు. ఇలా చిక్కిన మందుబాబులు నిర్ణీత తేదీల్లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఆపై కోర్టుకు వెళ్లి న్యాయమూర్తి విధించిన శిక్ష పూర్తి చేయడం లేదా జరిమానా కట్టడం చేసిన తర్వాత తమ వాహనం తీసుకువెళ్లాలి. అయితే అమీరుద్దీన్ మాత్రం కౌన్సెలింగ్‌కు, కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నాడు. దీంతో చార్మినార్ పోలీసులు అతడిపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. దీని ఆధారంగా కోర్టు అమీరుద్దీన్‌కు రెండుసార్లు సమన్లు జారీ చేసినా అతను బేఖాతరు చేశాడు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన కోర్టు అతడిపై ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. -
డ్రంకెన్ డ్రైవర్‌తో జర్నీనా.. ఆలోచించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సికింద్రాబాద్ క్లబ్ మేనేజర్ గౌతమ్‌దేవ్ గాడాయ్, ఆయన భార్య శ్రావణి శ్వేతలు మాదాపూర్‌లో బైక్‌పై వెళ్తుండగా... మద్యం తాగిన మత్తులో ఎస్యూవీ కారు నడుపుకుంటూ వచ్చిన కాశీ విశ్వనాథ్ రోడ్డు ప్రమాదం చేశాడు. ఈ ఘటనలో గౌతమ్ దుర్మరణం చెందగా, భార్య శ్వేతకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు అతడిపక్కనే కూర్చున్న వ్యక్తికి బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయడంతో మద్యం తాగినట్టుగా తేలింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ పోలీసులు ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇన్నాళ్లూ మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారుకుడైన డ్రైవర్‌పైనే కేసులు నమోదు చేసేవారు. అయితే రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో డ్రంకన్ డ్రైవర్‌తో పాటు అతడి పక్కనే కూర్చున్న మద్యం తాగిన వ్యక్తిపై కూడా 304 పార్ట్ టూ రెడ్‌విత్ 109 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో మాత్రమే ఈ తరçహాలో చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ డ్రంకన్‌డ్రైవ్ చెక్‌లో దొరికిన పక్షంలో ఒక్క డ్రైవర్ పైనే కేసులు నమోదు చేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాల్లో 153 మంది మృతి.. ‘గతేడాది సైబరాబాద్ పరిధిలో 144 రోడ్డు ప్రమాదాలు డ్రంకన్ డ్రైవ్ వల్ల జరిగితే 153 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొందరు వాహనచోదకులే మృతి చెందారు. మరికొందరు ఎదుటి వాహనాల వాళ్లు, పాదచారులు... ఏమాత్రం సంబంధం లేనివారు చనిపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. డ్రంకన్ డ్రైవర్ గురించి తెలిసీ మరీ అతడి వాహనంలోనే కూర్చుంటున్న మద్యం తాగిన ఇతర వ్యక్తిని క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా చేరుస్తున్నాం. వీటివల్ల డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు తగ్గి ఎంతోమంది ప్రాణాలు నిలిచే అవకాశముంద’ని సైబరాబాద్ పోలీసు విభాగాధికారి ఒకరు తెలిపారు. -
తాగి నడిపేవాళ్లు తీవ్రవాదులే..
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడిపేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ‘మద్యం సేవించి బండి నడిపేవాళ్లు రోడ్డుపై ఏంచేస్తారో వాళ్లకే తెలియదు. అందుకే వాళ్లు తీవ్రవాదులతో సమానం. తాగి వాహనం నడుపుతూ సోమవారం ఒక్కరోజే 420 మంది పట్టుబడ్డారు. వాహనదారుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్వోటీ పోలీసులనూ భాగస్వామ్యం చేస్తాం’ అని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సీపీ వ్యాఖ్యానించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సజ్జనార్ మంగళవారం విడుదల చేసి, విజన్ 2021ను ప్రకటించారు. వచ్చే ఏడాది రోడ్డు భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మహిళలు, పిల్లల భద్రతకు పెద్దపీట, సీసీటీవీ కెమెరాల పెంపు, సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. మరో మూడు ఠాణాల్లో ‘డయల్ 100 డొమెస్టిక్’ ‘గృహ హింస ఫిర్యాదులపై తక్షణం స్పందించి చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే జగద్గిరిగుట్ట, మియాపూర్, రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లలో ‘డయల్ 100 డొమెస్టిక్ వయొలెన్స్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ టీమ్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటివల్ల సత్ఫలితాలు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది కేపీహెచ్‌బీ, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్ల ఠాణాల్లోనూ ఈ సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని సజ్జనార్ వివరించారు. సీపీ చెప్పిన మరికొన్ని వివరాలు ►రహదారిపై ఏ చిన్న వాహనం వెళ్లి పెద్ద వాహనాన్ని ఢీకొట్టినా పెద్ద వాహనదారుడిపైనా కేసు నమోదు చేస్తున్నారు. దీనికి స్వస్తి పలికి ఎవరు ప్రమాదం చేస్తారో వారిపైన ఎఫ్ఐఆర్ నమోదును 2021లో పకడ్బందీగా అమలు చేస్తాం. ►జీవో నంబర్ 167 ప్రకారం సైబరాబాద్‌లో సీసీటీవీ కెమెరాల సంఖ్య మరింత పెంచుతాం. ఈ ఏడాది 1,23,000 సీసీ కెమెరాలు బిగించాం. 2021లో దీనికి రెట్టింపు అమరుస్తాం. ►నగరంలోని రహదారులపై వెళ్లే వాహనాలను సీసీటీవీ కెమెరాల ద్వారా సైబరాబాద్‌లోని భారీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించవచ్చు. ఫలితంగా ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పడతాం. నేరం జరిగితే నేరగాళ్లనూ పట్టుకుంటాం. ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే క్లియర్ చేసేలా సూచనలు ఇస్తాం. వచ్చే ఏడాదిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలను కీలకంగా వినియోగించుకుంటాం. ►సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. జనాల్లో అవగాహన కలిగించేందుకు ఎస్సీఎస్సీ సహకారంతో సైబర్ మిత్ర కార్యక్రమం ప్రారంభిస్తాం. అలాగే కొంత మంది పోలీసు సిబ్బందికి సైబర్ నేరాల దర్యాప్తుపై ఎఫ్ఐఆర్ నుంచి నిందితుడికి శిక్ష పడేలా చేసేంత వరకు సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ ఇచ్చాం. వాళ్లు వచ్చే ఏడాది సైబర్ నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తారు. సైబర్ నేరాల కట్టడికి ఏం చేయాలనే దానిపై త్వరలోనే డీజీపీతో సమావేశమవుతాం. -
స్ట్రిక్ట్ ఆర్డర్స్: హద్దు దాటితే చర్యలు తప్పవు
సాక్షి, హైదరాబాద్: తాగి బండి నడిపితే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే వారి పనిచేసే ఆఫీసులకు సమాచారం అందిస్తామని తెలిపారు. మొదటి సారి పట్టుబడితే రూ.10వేలు ఫైన్, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు వెల్లడించారు. రెండో సారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఒక్క డిసెంబర్ నెలలోనే 2,351 కేసులు నమోదయ్యాయని, రాచకొండ కమిషనరేట్‌లో ఈ ఏడాది 3,287 కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. -
వైరల్: బిగ్‌బాస్ నటుడి సాహసం
బిగ్‌బాస్ ఫేం సిధార్థ్ శుక్లాకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడి మీద ఈగ వాలనీయరు అభిమానులు. ఇక తాజాగా సిధార్థ్ శుక్లాకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మా అభిమాన నటుడు ఎంత ధైర్యవంతుడో చూడండి అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పైగా ఈ రోజు సిధార్థ్ శుక్లా పుట్టిన రోజు కావడంతో ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. 13-14 మంది వ్యక్తులు సిధార్థ్ను చుట్టుముట్టి తాగి డ్రైవ్ చేశాడంటూ ఆరోపిస్తూ.. అతడితో గొడవకు దిగారు. ఇంత మంది చుట్టుముట్టినా సిధార్థ్ ఏ మాత్రం భయపడకుండా ఎంతో చాకచక్యంగా వారిని డీల్ చేయడమే కాక.. తనను తాను కాపాడుకుంటారు. ఒక్కడే అంతమందిని ధైర్యంగా ఎదుర్కొవడంతో సిధార్థ్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని ‘షేర్’(సింహం) అంటూ ప్రశంసిస్తున్నారు. (చదవండి: ఏడేళ్ల ప్రేమకు బ్రేక్ పడింది..) They judged him for a 20 seconds video, they called him drunk, this man stood alone among 13-14 people. Guts chahiye, sher hai woh, vo ekela kafii hai in Jese chuzo k liye😏 Agli baar defame karne se pehle soch lena karma is watching🙌#SherSidharthShuklahttps://t.co/8GzAE3ATtw — Sakshi 💓 (@ItsSakshii) December 14, 2020 ఈ క్రమంలో ఓ యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘వారు తాగి డ్రైవ్ చేస్తున్నావంటూ సిధార్థ్తో గొడవపడ్డారు. ఒక్కడిని 13-14 మంది చుట్టుముట్టారు.. వీరందరితో తలపడటానికి ధైర్యం కావాలి.. తనో సింహం. ఇక మొదట షేర్ చేసిన 20 సెకన్ల నిడివి గల వీడియోలో తను తాగి, డ్రైవ్ చేస్తున్నాడంటూ ఆయన పేరు చెడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ వీడియోతో అసలు నిజం బయటకు వచ్చింది. ఇంకో సారి తన పేరు చెడ్డగొట్టాలని భావించేవారు కర్మ అందరిని గమనిస్తూ ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. -
పోలీసులపై దౌర్జన్యం..ఎమ్మెల్సీ కుమారుడి అరెస్ట్
బెంగుళూరు : కర్ణాటక ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ కుమారుడు ఫయాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి వేళ బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఫయాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో ఫయాజ్, అతని స్నేహితులతో కలిసి హెడ్ కానిస్టేబుల్‌పై దాడిచేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేసిన కారణంగా ఫయాజ్‌తో పాటు మరో ఇద్దరు కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (ఏలూరుకు రానున్న కేంద్ర బృందం) -
మద్యం మత్తులో ఎస్ఐపై యువతి దాడి
చెన్నై: మద్యం మత్తులో ఎస్సైపై దాడికి పాల్పడిందో యువతి. అసభ్య పదజాలంతో దూషిస్తూ విరుచుకుపడింది. దీంతో స్థానిక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తమిళనాడులోని తిరువాణ్మయూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తోడ్లా శేషు ప్రసాద్ తన స్నేహితురాలు కామినితో కలిసి శనివారం రోజు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో కామరాజార్ నగర్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై మరియప్పన్ వారి కారును ఆపారు. (చదవండి: బెంగాల్లో మిస్సింగ్.. హైదరాబాద్‌లో ట్రేసింగ్!) బ్రీత్ ఎనలైజర్ టెస్టులో శేషు ప్రసాద్(27), కామిని(28) మద్యం సేవించినట్లు తేలడంతో వారిని పోలీసు స్టేషనుకు రావాల్సిందిగా సూచించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన కామిని మరియప్పన్‌తో వాగ్వాదానికి దిగింది. ఇష్టారీతిన దూషిస్తూ దాడి చేయగా ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తిరువాణ్మయూర్ పోలీసులు, ఐపీసీ 294(బి)(అభ్యంతరకర భాష ఉపయోగించడం), 323(గాయపరచడం), 353(ప్రభుత్వాధికారిని విధులు నిర్వర్తించుకుండా అడ్డుకోవడం, దాడి చేయడం) తదితర సెక్షన్ల కింద ఆదివారం కేసు నమోదు చేశారు. కాగా కామిని సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. -
తాగి నడిపితే తాట తీస్తాం: సజ్జనార్
సాక్షి, రాయదుర్గం: మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన వారికి ఐపీసీ సెక్షన్ 304 పార్ట్–2 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడేలా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో ప్రతి ప్రమాదాన్ని రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్ (ఆర్టీఏఎం) సెల్ పర్యవేక్షిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో వాహనం నడిపేవారికి బీఏసీ పరీక్షలు నిర్వహిస్తామని, ప్రమాదం చేసి పారిపోయేందుకు యత్నించే వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాల సమయంలో ఆల్కాహాల్ టెస్ట్‌లకు నిరాకరించే, సహకరించని వారిపై కూడా ఎంవీయాక్ట్ 205 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు డ్రంకన్‌డ్రైవ్ కారణమని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పబ్‌ల యాజమానులు కూడా తమ పబ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుకుంటూ వెళ్లే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని లేని పక్షంలో వారిపై కూడా తీసుకుంటామన్నారు. 2,061 వాహనాల వేలం రాయదుర్గం: సైబరాబాద్ పోలీసులు వివిధ రకాల 2061 వాహనాలను వేలం వేయాలని నిర్ణయించారు. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఈ వాహనాల చట్టం ప్రకారం బహిరంగ వేలం వేస్తారు. ఈ వాహనాలపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసు కోవచ్చు. నోటిఫికేషన్ తేదీ నుంచి ఆరునెలల లోపు వాహనాలను క్లెయిమ్ చేయాలి. వివరాల కోసం సీఏఆర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ జి వెంకటస్వామి, లేదా సైబరాబాద్ òసెల్ నంబర్ 94910 39164ను సంప్రదించాలని సూచించారు. -
ఆర్నెల్లలో డ్రంకన్ డ్రైవ్ కేసులు.. మూడే!
సాక్షి, అమరావతి: గత ఆర్నెల్లలో రాష్ట్రంలో డ్రంకన్ డ్రైవ్ కేసులు కేవలం మూడు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో రహదారి భద్రత ఉల్లంఘనలపై రవాణా శాఖ రోడ్డు సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి తాజాగా నివేదిక పంపింది. మద్య నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే డ్రంకన్ డ్రైవ్ కేసులు తగ్గిపోయాయని సుప్రీంకోర్టు కమిటీకి నివేదించింది. టోల్గేట్లలో బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలను రవాణా శాఖ ముమ్మరం చేయడంతో కేసులు తగ్గిపోయాయి. ఈ మూడు కేసులు గుంటూరు జిల్లాలో రెండు, కృష్ణా జిల్లాలో ఒకటి నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆర్నెల్ల వ్యవధిలో 2 వేలకు పైగా డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, ఈ దఫా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. రాత్రి 8 గంటల తర్వాత మద్యం అమ్మకాలు లేకపోవడం, ఎక్కడా మద్యం దొరక్కపోవడం ప్రధాన కారణాలుగా రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. (చదవండి: రూ.8,000 కోట్లతో ‘ఉపాధి’) సుప్రీంకోర్టు కమిటీకి పంపిన నివేదికలో ప్రధానాంశాలివే... ఆర్నెల్ల వ్యవధిలో డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన 3,829 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో రెండో దఫా పట్టుబడితే జైలుకు పంపనున్నారు. అతి వేగంతో వెళుతున్న 5,888 మందిపై కేసులు నమోదయ్యాయి. హైవేలపై స్పీడ్ గన్లతో తనఖీలు ముమ్మరం చేశారు. హెల్మెట్ లేకుండా బండి నడుపుతూ 11,686 మంది పట్టుబడ్డారు. కౌన్సిలింగ్‌తో పాటు చలాన్లు విధించారు. ఓవర్ లోడ్‌తో వెళ్లే 5,690 గూడ్స్ వాహనాలపై కేసులు నమోదయ్యాయి. ఓవర్ లోడ్‌తో వెళ్లే 511 ప్రయాణికుల వాహనాలపై కేసులు పెట్టారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తున్న 91 వాహనాల్ని సీజ్ చేశారు. ఆర్నెల్ల వ్యవధిలో రోడ్డు ప్రమాద మరణాలు గతం కంటే తగ్గిపోయాయి. గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రోడ్డు ప్రమాద మరణాలు 4 వేల వరకు ఉంటే ఈ ఏడాది 2 వేలకు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో గత ఆర్నెల్లలో ట్రాఫిక్ ఉల్లంఘనలివే... జిల్లా డ్రంకన్ డ్రైవ్ అతి వేగం డ్రైవింగ్ లైసెన్సు లేని అనంతపురం 0 320 327 చిత్తూరు 0 8 269 తూర్పుగోదావరి 0 30 289 గుంటూరు 2 1 459 కృష్ణా 1 1 101 కర్నూలు 0 147 330 నెల్లూరు 0 1,926 603 ప్రకాశం 0 2 146 శ్రీకాకుళం 0 0 8 విశాఖపట్నం 0 3,446 302 విజయనగరం 0 0 42 పశ్చిమగోదావరి 0 7 722 వైఎస్సార్ కడప 0 0 231 మొత్తం 3 5,888 3,829 -
ఫుల్లుగా తాగి.. పోలీసు బండినే గుద్దాడు
న్యూఢిల్లీ: తాగిన మైకంలో కారు నడుపుతూ ఓ కాలేజీ విద్యార్థి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మరణించగా.. మరో వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఖల్సా కళాశాల సమీపంలో సోమవారం తెల్లవారుజూమున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. (ఎఫ్బీ అలర్ట్.. ప్రాణాలు కాపాడిన పోలీసులు) ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ వజీర్ సింగ్(ఫైల్ ఫోటో) వివరాలు.. మోడల్ సిటీ ప్రాంతానికి చెందిన తుషార్ గుప్తా(19) సింగపూర్‌లో చదవుకొంటున్నాడు. లాక్డౌన్ విధించడంతో ఇండియా వచ్చాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి స్నేహితులను కలిసి తిరిగి తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాడు. వేగంగా కారును నడుపుతూ వచ్చి ‘ప్రకార్ పెట్రోలింగ్ వెహికల్’ని ఢీ కొట్టాడు. ప్రమాద ధాటికి పెట్రోలింగ్ వాహనం 10 అడుగుల మేర గాలిలో ఎగిరి కింద పడింది. అందులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వజీర్ సింగ్ అక్కడిక్కడే మరణించగా.. డ్రైవర్ అమిత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన నిందితుడు తుషార్‌పై ఐపీసీ 279, 337,304 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల ఢిల్లీ పోలీసులు వీధుల్లో నేరాలను అరికట్టడం కోసం రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేశారు. దీనికోసం ‘ప్రకార్ పెట్రోలింగ్ వెహికల్స్’తో నిఘా ఏర్పాటు చేశారు. -
మరణంలోనూ వీడని స్నేహబంధం
కడెం(ఖానాపూర్): వారిద్దరూ ప్రాణ స్నేహితులు. అతిగా మద్యం సేవించి, మితిమీరిన వేగంతో ప్రయాణించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చిన ఈ ఘటన కడెం మండలంలో చోటు చేసుకుంది. మాసాయిపేట్ గ్రామానికి చెందిన పంజాల తరుణ్, దుర్గం గంగాధర్ అనే యువకులు సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట్ గ్రామానికి చెందిన లక్ష్మి–లక్ష్మీనర్సయ్య దంపతులకు ఇద్దరు సంతానం. అలాగే లక్ష్మి–లింగన్న దంపతులకు ముగ్గురు సంతానం. లింగన్న అనారోగ్యంతో మృతి చెందగా, కూతురు అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. పెద్ద కొడుకు ఉపాధి నిమిత్తం ముంబాయిలో ఉంటున్నాడు. చిన్న కొడుకు గంగాధర్ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తరుణ్ నిర్మల్‌లోని జీఎస్ఆర్ కళాశాలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేయగా, గంగాధర్ ఖానాపూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. వీరిద్దరివి నిరుపేద కుటుంబాలు. కరోనా లాక్‌డౌన్‌తో ఇంటి వద్దే ఉంటున్న వీరు గ్రామంలో చిన్నా, చితకా పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడు, వాదోడుగా మెలుగుతున్నారు. సోమవారం గ్రామంలో కూలీ పనికి వెళ్లిన వీరిద్దరూ వచ్చిన డబ్బులతో మద్యం సేవించి బైక్‌పై నచ్చన్ఎల్లాపూర్ నుంచి మాసాయిపేట్ వస్తూ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీకి ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి 11 తర్వాత ప్రమాదం జరగడంతో అర్ధరాత్రి స్థానికులు గమనించిగా ఇద్దరు యువకులు మృతిచెంది రక్తపు మడుగులో పడి ఉన్నారు. మద్యం మత్తు, అతి వేగంతో ఢీకొట్టడంతో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయి, ఘటనా స్థలం నుంచి కొద్ది దూరంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందరితో కలివిడిగా ఉండే యువకులు మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని మంగళవారం ఖానాపూర్ సీఐ జయరాం, ఇన్చార్జి ఎస్సై ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. వ్యక్తిపై పోలీసు కాల్పులు
అట్లాంటా: డ్రంక్ అండ్ డ్రైవ్ ఆరోపణలపై ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అమెరికాలోని అట్లాంటాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వెండీ రెస్టారెంట్ వద్ద ఓ వ్యక్తి పార్కు చేసిన వాహనం కారణంగా ఇతర వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా ప్రతిఘటించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తిని కట్టడి చేసేందుకు పోలీసులు టేజర్ (షాక్ కలిగించడం ద్వారా చేష్టలుడిగేలా చేయడం)ను ప్రయోగించేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి ఆ టేజర్‌ను కూడా లాగేసుకునేందుకు యత్నించాడు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పోలీసు అధికారి ఒకరు అగంతకుడిపైకి కాల్పులు జరిపాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అతను మరణించాడు. -
జరిమానా కాదు.. నేరుగా కోర్టుకే
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే పిలియన్ రైడర్‌కు హెల్మెట్ తప్పనిసరి అని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలకు సైడ్ మిర్రర్లు ఉండాలంటూ విధిస్తున్న ఈ–చలాన్లతో వాహనదారుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. అదే సమయంలో అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లు, యువకుల భరతం పడుతున్నారు. స్నేహితులు, బంధువుల కార్లు, బైక్‌లను తీసుకుని రహదారులపై దూసుకెళ్తూ ఇతరుల వాహనాలను ఢీకొట్టే వారిని కట్టడి చేయడం.. ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 5156 వితవుట్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులు, 425 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. (నెంబర్‌ప్లేట్ కనిపించకుండా ట్యాంపరింగ్..) ఊహించని విధంగా... సైబరాబాద్‌లో విస్తృ్తతంగా వాహనాలను నిలిపి తనిఖీలు చేస్తున్నారు. ఒకే బైక్‌పై ముగ్గురి ప్రయాణించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిని పట్టుకునేందుకు వాహన చోదకులు ఊహించని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లైసెన్స్ లేకుండా బండి నడిపే వారిని ఆపి అక్కడికక్కడే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా సైబరాబాద్‌లో జనవరి నుంచి ఇప్పటివరకు 5,156 కేసులు నమోదుచేశారు. మైనర్లైతే తల్లిదండ్రులను పిలిపించి వారితో మరోసారి వాహనాలను నడపనీయమంటూ లిఖితపూర్వకంగా రాయించుకుని వాహనం ఇస్తున్నారు. ఇలా 425 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదుచేశారు. మేజర్లయితే కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇతర ప్రక్రియలతోపాటు ... లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ దరఖాస్తు నంబరు చూపించాకే వాహనాన్ని ఇస్తున్నారు. జరిమానా కాదు...నేరుగా న్యాయస్థానానికే ద్విచక్ర వాహనం, కార్లు, ఇతర వాహనాలు నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే నేరుగా న్యాయస్థానానికి వెళ్లాల్సిందే. గతంలో లైసెన్స్ లేకుండా నడిపితే పోలీసులు జరిమానా విధించి వదిలేసేవారు. కొద్ది నెలల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకొంటున్నారు. మరుసటి రోజు ఉదయం సదరు చోదకుడు ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని న్యాయస్థానంలో హాజరు కావాలి. వాస్తవానికి మోటార్ వాహన చట్టంలో ఇవన్నీ ఉన్నా.. పోలీసులు, రవాణా శాఖ అధికారులు అవసరమైన సందర్భాల్లోనే వినియోగిస్తున్నారు. ప్రమాదాలు తగ్గుతున్నా.. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎవరినీ ఉపేక్షించడం లేదు. అందరూ లైసెన్సును తప్పక దగ్గర ఉంచుకోవాలని ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కూడళ్ల వద్ద సైన్ బోర్డుల్లోనూ ఈ విషయాన్ని వివరిస్తున్నారు. హెల్మెట్ లేని వారికి జరిమానాను విధిస్తున్నారు. ఉల్లంఘిస్తే కఠిన శిక్షలే.. ♦లైసెన్సు లేకుండా తొలిసారి పోలీసులకు చిక్కితే.. వాహనం స్వాధీనం చేసుకుంటారు. తర్వాతి రోజు న్యాయస్థానంలో వాహనదారుడిపై చార్జిషీట్ దాఖలు చేస్తారు. కోర్టు సమయం పూర్తయ్యేవరకూ న్యాయస్థానం ప్రాంగణంలోనే నిలబడి ఉండాలి. జరిమానా చెల్లించాలి. ♦ రెండోసారి పోలీసులకు దొరికితే.. 48 గంటలపాటు జైల్లో ఉంచుతారు. ♦మూడోసారి చిక్కితే రెండు అంతకంటే ఎక్కువ రోజుల జైలుశిక్షతోపాటుగా భారీగా జరిమానా చెల్లించాలి. దీని ప్రభావం విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లే అవకాశాలపై ఉంటుంది. ♦ ఐదు, అంతకంటే ఎక్కువసార్లు దొరికితే మాత్రం వారం రోజుల జైలుశిక్ష అనుభవించి.. భారీ జరిమానా చెల్లించక తప్పదు. పోలీసుల నివేదిక అధారంగా కోర్టులు జరిమానాను నిర్ణయిస్తాయి. -
సడలింపులు.. ‘తొలి’ కేసు
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నిర్వహించే డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు రాజధానిలోని మూడు కమిషనరేట్ల అధికారులు గణనీయంగా తగ్గించేశారు. లాక్డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిలిపివేశారు. దాదాపు పది రోజులుగా మద్యం విక్రయాలు మొదలైనా..ఈ పరీక్షలు ప్రారంభంకాలేదు. సుదీర్ఘ విరామం తర్వాత మంగళవారం తొలి కేసు నమోదైంది. భారీ స్థాయిలో సడలింపులు అమలులోకి రావడంతో అనుమానిత డ్రైవర్లకు, ప్రమాదాలకు కారణమైన, గురైన వారికి డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు మంగళవారం నుంచి నిఘా ముమ్మరం చేశారు. మధ్యాహ్నం కోఠి వైపు నుంచి వస్తున్న ఖాళీ గూడ్స్ ఆటో పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆటోడ్రైవర్‌కు డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. (బస్సెక్కేందుకు భయపడ్డరు) దీంతో సమీపంలోని సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉన్న బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష చేయగా..అతడు మద్యం తాగినట్లు తేలింది. 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిల్లీ లీటర్ల ఆల్కహాల్ ఉంటే అది ఉల్లంఘన కిందికి వస్తుంది. దీన్ని సాంకేతికంగా బీఏసీ కౌంట్ అంటారు. పుత్లిబౌలి చౌరస్తాలో చిక్కిన ఆటోడ్రైవర్‌కు ఈ కౌంట్ 187 వచ్చింది. దీంతో ఆటోను స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. మరోపక్క మాస్కులు లేకుండా రహదారులపైకి వస్తున్న వారిపైనా పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. మంగళవారం రాజధానిలోని మూడు కమిషనరేట్లలో కలిపి 395 మాస్క్ వైలేషన్ కేసులు నమోదయ్యాయి. మాస్క్ ధరించకుండా బయటకు వచ్చిన వారికి రూ.1000 జరిమానా విధించాలని స్పష్టం చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 51 (బి) ప్రకారం ఈ కేసులు నమోదు చేస్తున్నారు. (గాడ్సే నిజమైన దేశభక్తుడు) -
బెంగళూరులో యువతుల వీరంగం
కర్ణాటక,యశవంతపుర: లాక్డౌన్ సమయంలో పీకాలదాక తాగిన యువతులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులపై వాహనాన్ని దూకించే యత్నించారు. ఈఘటన బెంగళూరులో జరిగింది. లాక్డౌన్ సందర్భంగా పోలీసులు నగరంలో అక్కడక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నలుగురు యువతులు మద్యం సేవించి కారులో ప్రయాణిస్తూ లీలా ప్యాలెస్ సమీపంలో చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. పోలీసులు వాహనాన్ని నిలిపి తనిఖీ చేస్తుండగా తమ వద్ద పాస్ ఉందని, మాకు ఉన్నతాధికారులు తెలుసంటూ యువతులు వాదనకు దిగారు. మద్యం తాగినట్లు అనుమానం రావడంతో బ్రీతింగ్ అనలైజర్‌తో తనిఖీ చేయడానికి యత్నించగా యువతులు పోలీసులపైకి వాహనాన్ని దూకించే యత్నం చేసి ఉడాయించారు. పోలీసులు బైక్‌పై కిలోమీటర్ దూరం వరకు వెంటాడినా ప్రయోజనం లేకపోయింది. యువతులు అత్యంత వేగంగా ప్రయాణించి తప్పించుకున్నారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఫుల్లుగా తాగేసి.. అంబులెన్స్‌ను ఢీకొట్టారు!