
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నాగోలు: రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో గురువారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 121 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్‌చార్జి డీసీపీ జి.మనోహర్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిలో 10 మందిని జైలుకు పంపించినట్లు ఆయన చెప్పారు. రెండోసారి పట్టుబడిన ఓ ఆటో డ్రైవర్‌కు పెనాల్టీతో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశామన్నారు. మొత్తం రూ.2.32 లక్షల జరిమానా విధించినట్లు డీసీపీ మనోహర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment