Hyderabad Crime News
-
రూ. 500 అడిగినందుకు హత్య
రాజేంద్రనగర్: దౌర్జన్యంగా డబ్బులు లాక్కోవడమేగాక తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ వ్యక్తి దినసరి కూలీపై డ్రైనేజీ పై కప్పుతో దాడి చేసి హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మామిడి కిషోర్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుద్వేల్ ప్రాంతానికి చెందిన సాయికుమార్(35) దినసరి కూలీగా పని చేసేవాడు. ఆదివారం అదే ప్రాంతంలో కూలీ పనులు పూర్తి చేసుకుని యజమాని వద్ద డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో అతను బుద్వేల్ కల్లు కంపౌండ్‌లో కల్లు తాగిన అనంతరం తన వద్ద ఉన్న డబ్బులను తీసి లెక్కిస్తున్నాడు. అదే సమయంలో కల్లు కంపౌండ్ నుంచి బయటికి వచ్చిన బుద్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి సాయికుమార్ నుంచి రూ.500 బలవంతంగా లాక్కున్నాడు. దీంతో సాయికుమార్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీనివాస్‌ను కోరాడు. అయితే అతను డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుండటంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సాయికుమార్ శ్రీనివాస్‌ను తోసివేయడంతో కింద పడిన అతను పక్కనే ఉన్న డ్రైనేజీ పై కప్పు మూతను తీసి సాయికుమార్ తలపై మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కొన ఊపిరితో ఉన్న సాయికుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, సాక్షి: నాగోల్‌లోని ఓ ప్రముఖ హోటల్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నెర గ్రాండ్ హోటల్లో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు హోటల్లో జరిగిన ఎంగేజ్మెంట్ పంక్షన్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. -
ముగ్గురి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..
రాజేంద్రనగర్ (హైదరాబాద్): ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవలే ఈ మరణాలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ (38) ఇందిర (36) దంపతులు. వీరికి శ్రేయాన్స్ (4) ఒక్కడే కొడుకు. పాల వ్యాపారం చేసే ఆనంద్ మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడజాగీర్ సన్‌సిటీ ఏరియాలోని యమున అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నాడు. ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ బెట్టింగ్‌ల కారణంగా దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితోపాటు స్నేహితులు వచ్చి ఆన్లైన్లో గేమ్స్ ఆడొద్దని, బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడురోజుల క్రితం మరోసారి ఆనంద్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్టు సమాచారం. ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆనంద్ కూడా తన స్నేహితులతోపాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు బంధుమిత్రులు ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్మెంట్ వచ్చి చూడగా, మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను చంపి.. ఆపై ఆత్మహత్య ! ఘటనాస్థలిని పరిశీలించాక...దంపతులు మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే పెనుగులాటలో భార్య చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొడుకుకు క్రిమిసంహారక మందు తాగించి, ఆనంద్ కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీకొడుకు నోటి నుంచి నురగలు వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇందిర నోటి నుంచి ఎలాంటి నురుగులు రాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఉదయం నుంచే దంపతులు గొడవ పడుతున్నట్టు వాచ్మెన్ పోలీసులు తెలిపాడు. -
Hyd: సీఐ ప్రాణాల్ని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్
హైదరాబాద్, సాక్షి: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణం తీసింది. మరో వ్యక్తిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ఎల్బీ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మృతి చెందగా.. ఎస్సై ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కార్ యూటర్న్ చేస్తు రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఒకరు మృతి చెందగా. మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీగా గుర్తించారు. అలాగే.. గాయపడిన వ్యక్తిని నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కాజా వల్లి మోహినుదిన్గా గుర్తించారు. వీళ్లిద్దరూ మలక్‌పేటలోని క్వార్టర్స్‌లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్లో ఓ ఫంక్షన్‌ను వెళ్లి వస్తుండగా.. ఈ ఘోరం జరిగింది. కారుపై ‘డేంజర్’ ఛలాన్లు ఇదిలా ఉంటే.. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కారు వినుషాశెట్టి అనే పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అంతేకాదు.. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు ఉండడం గమనార్హం. -
బోడుప్పల్లో ఘోరం.. స్టూడెంట్ దుర్మరణం
సాక్షి, క్రైమ్: బోడుప్పల్లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి వేగంగా కారు నడిపి ఒకరిని బలిగొన్నాడు. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. చనిపోయిన యువకుడి ఐడెంటిటీని.. బీటెక్ చదివే విశాల్‌గా గుర్తించారు పోలీసులు. విశాల్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్. పార్ట్ టైం జాబ్ కోసం ర్యాపిడో నడుపుతున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
కన్నీటి ధార
నగరంలో రెండు ఉదంతాల్లో ఆరుగురి మృతి : సంతానాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. వారే తమ లోకంగా బతుకుతున్న కన్నవారు కడుపుకోతకు ఒడిగట్టారు. చంటిపాపల కంటిరెప్పలను శాశ్వతంగా మూసేశారు. పేగు బంధాన్ని తుంచేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. నగరంలో శుక్రవారం చోటుచేసున్న రెండు వేర్వేరు ఉదంతాల్లో నలుగురు చిన్నారులు సహా ఓ తల్లి, ఓ తండ్రి అసువులు బాయడం తీవ్ర విషాదాన్ని నింపింది. రహమత్ నగర్ పరిధి బోరబండలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి.. ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలు, భార్య చనిపోవడంతో ఇంటిపెద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కంటోన్మెంట్ పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి.. తాను విషం తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఒకేరోజు ఆరుగురు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. – రహమత్‌నగర్/కంటోన్మెంట్ ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కష్ట పడి చదివి ఉద్యోగం సాధించారు. పెద్దలు కుదిర్చిన మేనరికం పెళ్లి చేసుకుంది. సొంత మేనబావనే మనువాడింది. వారికి ఇద్దరు మగ పిల్లలు. మేనరికం కారణంగా ఒక బాబుకు బుద్ధిమాంద్యం, మరోబాబుకు అంగవైకల్యం ఏర్పడింది. తమ పిల్లల దీనస్థితి చూసి చలించిపోయేవారు. మేనరికం మూలంగా జరిగిన అనర్థం తలుచుకుంటూ దిగులు చెందేవారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇంట్లో గొడవ జరగడం ఆమెను మరింత కలచి వేసింది. తాను మరణిస్తే.. తమ పిల్లలు దిక్కులేని వారవుతారని భావించి.. పిల్లలను ముందు చంపి.. ఆ తర్వాత తానూ తనువు చాలించిన విషాద ఘటన రహమత్ నగర్ పరిధిలోని బోరబండ డివిజన్ రాజ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దూరుకు చెందిన జ్యోతికి ఆరున్నరేళ్ల క్రితం నగరంలోని బోరబండ డివిజన్ రాజ్‌నగర్‌కు చెందిన ఆమె మేనబావ విజయ్ (కాంట్రాక్టర్)తో వివాహమైంది. కాగా.. జ్యోతి (34) బంజారాహిల్స్ ఎంబీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అర్జున్ (4), ఆదిత్య (2) ఉన్నారు. మేనరికపు వివాహం..పిల్లలకు బుద్ధిమాంద్యం.. మేనరికపు పెళ్లి కారణంగా పెద్దబ్బాయికి బుద్ధిమాంద్యం, చిన్న అబ్బాయికి అంగవైకల్యం ఏర్పడింది. వీరికి చికిత్స సైతం అందిస్తున్నారు. మేనరికం మూలంగా తమ పిల్లలు ఇలా అనారోగ్యం బారిన పడటం జ్యోతిని మానసిక క్షోభకు గురిచేసేది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం జ్యోతితో ఆమె మామ గొడవకు దిగాడు. ఈ ఘటన ఆమెను మరింత కలచి వేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అప్పటికే ఇంట్లో ఉంచిన విషాన్ని పిల్లలకు పాలల్లో తాగించి.. తాను కిటికీకి ఉరి వేసుకుంది. అప్పటికే జ్యోతి మృతి చెందగా, ఇరుపొరుగు వారు పిల్లలను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భార్య, ఇద్దరు కుమారులు చనిపోవడంతో జ్యోతి భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఒకే కుటుంబంలో ముగ్గురు బలవర్మణం చెందడంతో బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ కామల్ల రవికుమార్ పేర్కొన్నారు. స్రవంతి, శ్రావ్య మృతదేహాలు కంటోన్మెంట్ పరిధి ఓల్డ్ బోయిన్పల్లి భవాని నగర్లో ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంతాచారి అనే వ్యక్తికి భార్య అక్షయ, ఇద్దరు కుమార్తెలు స్రవంతి (8), శ్రావ్య (7) ఉన్నారు. సికింద్రాబాద్‌లో సిల్వర్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి భోజనాలు చేసిన తర్వాత శ్రీకాంతా చారి, భార్య కూతుళ్లతో మేడపై ఉన్న గదిలో నిద్రపోయారు. వేకువ జామున 4 గంటల సమయంలో శ్రీకాంతా చారి తన భార్య అక్షయకు సైతం నిద్రమాత్రలు కలిపిన నీళ్లు తాగించేందుకు యత్నించాడు. విషపు నీళ్లను తాగేందుకు ఆమె నిరాకరించింది. కానీ.. అప్పటికే ఆమె నోట్లోకి ఆ నీళ్లు చేరిన కారణంగా స్పృహ కోల్పోయింది. ఉదయం 5 గంటల సమయానికి ఆమెకు మెలకువ వచ్చి చూడగా భర్త, చిన్న కూతురు బెడ్‌పై, చిన్న కూతురు బాత్రూమ్లో విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే కింది పోర్షన్లో ఉండే అత్త, ఆడపడుచులను నిద్ర లేపి విషయం తెలిపింది. వారంతా పైకి వెళ్లి చూసే సరికే ముగ్గురూ పడిపోయి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి వెళ్లి పంచనామా నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా? సిల్వర్ వర్క్ చేస్తూ జీవనం సాగించే శ్రీకాంతా చారికి ఇటీవల బిజినెస్ సరిగా నడవడం లేదని తెలుస్తోంది. ఇదే విషయమై తరచూ బాధపడుతూ ఉండేవాడని మృతుడి భార్య, తల్లి జయమ్మ తెలిపారు. భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు, తండ్రి మృతదేహాలను చూసిన స్థానికులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. -
నాంపల్లి కోర్టు బిల్డింగ్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశా. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన డుసలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేడు(బుధవారం) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు. ఈ క్రమంలో కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సలీముద్దీన్‌ను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఆడుకుంటూ.. అనంత లోకాలకు.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకార.. ఖమ్మం జిల్లాకు చెందిన మూర్తమ్మ కొన్ని సంవత్సరాలుగా సూరారం రాజీవ్ గృహకల్ప 29/27వ బ్లాక్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు తులసీనాథ్ (13) ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు సెలవు కావడంతో తులసీనాథ్ రాజీవ్ గృహకల్ప 27వ బ్లాక్‌లోని భవనంపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ తగాదాలతో బాలుడి తండ్రి కనకరత్నం కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. తల్లి మూర్తమ్మ టైలరింగ్ చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. -
HYD: మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ డ్రగ్స్ మాఫియా కదలికలు పెరిగిపోతుండడం కలకలం రేపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. స్థానికంగా జిమ్ నిర్వహించే ట్రైనర్ నితీష్, రాహుల్‌తో పాటు సోహెల్ అనే ముగ్గురిని ఈ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ చేశారు అధికారులు. జిమ్ ట్రైనరే ఈ డ్రగ్స్‌ని అమ్ముతున్నాడని తెలుసుకున్న అధికారులు.. ఆ ఇంజెక్షన్స్‌ని ఎక్కడి నుంచి తెస్తున్నారు? దీని వెనక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదీ చదవండి: నగరంలో ‘బ్లాక్మెయిల్’ విలేకరుల అరెస్ట్ -
విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్: చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. మస్కిట్ లిక్విడ్ తాడి ఏడాదిన్నర బాలుడు మృత్యువాతపడ్డాడు. వివరాలు.. తారానగర్‌లో నివాసముంటున్న జుబేర్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కొడుకు జాకీర్ ఉన్నాడు. శనివారం బాలుడు ఇంట్లో ఆడుకుంటూ.. పొరపాటున అలౌట్ లిక్విడ్ తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తల్లిదండ్రులు బాలుడి బట్టలపై అలౌట్ లిక్విడ్ వాసన రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. -
HYD: పైసల్లేవ్.. మెట్రో స్టేషన్ నుంచి దూకేసింది!
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పెద్దావిడ మంగళవారం రాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది గమించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలిని మారెమ్మ(70)గా గుర్తించారు. ఆమె స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ గ్రామంగా తేలింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మారెమ్మ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మార్కులు తక్కువొచ్చాయని తల్లి మందలింపు.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మార్కులు తక్కువగా వచ్చాయని తల్లి మందలించడంతో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు..వెస్ట్‌బెంగాల్‌కు చెందిన అసిత్ కుమార్ డెరియ భార్య, పిల్లలతో కలిసి సనత్‌నగర్‌లోని రాజరాజేశ్వరీనగర్‌లో నివాసం ఉంటున్నారు. మాదాపూర్‌లో డెక్కన్ సెరాయి హోటల్లో పనిచేసే కుమార్ ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు బోనాశ్రీ డెరియ (19) గురువారం ఉదయం కేఎల్ఎన్వై పార్కులో వాకింగ్‌కు వెళ్లి తిరిగి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. మార్కులు తక్కువగా ఎందుకు వచ్చాయని తల్లి మందలించి ఆమె కూడా వాకింగ్‌కు వెళ్లి పోయింది. తిరిగి తల్లి ఇంటికి రాగా లోపలి నుండి గడియ పెట్టి ఉంది. తలుపులు ఎంత సేపు తట్టినా లోపల నుండి సమాధానం రాకపోవడంతో తలుపులు తెరిచి చూడగా బోనాశ్రీ సీలింగ్ వ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: బయటపడ్డ వాస్తవాలు.. పేరుకే ప్రిన్సిపాల్.. పెత్తనమంతా డ్రైవర్‌దే -
క్షుద్ర పూజల కలకలం.. కూకట్‌పల్లిలో సగం కాలిపోయిన స్థితిలో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీకాలనీ: శ్మశాన వాటికలో సగం కాలిన స్థితిలో కనిపించిన మృతదేహం స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ఒంటిపై డీజిల్ పోసి దహనం చేసి ఉంటారని భావిస్తున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఆనవాళ్లు గుర్తించలేని విధంగా దగ్ధమైన మృతదేహం ఎవరిదనే సీఐ కిషన్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం హైదర్‌నగర్‌లోని అలీతలాబ్ పక్కన ఉన్న హిందూ శ్మశాన వాటికలో సగం కాలిన మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి 20 మీటర్ల దూరంలో చెప్పులు, ఓ బ్యాగ్, అందులో రగ్గు(బెడ్ షీట్) స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బ్యాటరీ, సిమ్ కార్డు లేని ఓ సెల్ ఫోన్‌ను కూడా గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చునని అతడిని హత్య చేసి దహనం చేసి ఉండవచ్చునని అనుమాన్యం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సైబరాబాద్ క్లూస్ టీంతో పాటు పోలీస్ ప్రత్యేక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అన్నీ అనుమానాలే... శ్మశాన వాటికలో మృతదేహం లభించిన తీరు మొదలు అక్కడి ఆనవాళ్లు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో బియ్యం పిండి వంటివి కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని అనుమానాలు వస్తున్నా పోలీసులు నిర్ధారించడం లేదు. మృతదేహాన్ని శనివారం దహనం చేసి ఉంటారని స్థానికులు పేర్కొంటుండగా పోలీసులు మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దహనం చేసి ఉండవచ్చునని పేర్కొంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. -
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్‌గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఇదీ కేసు.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో మే 28 ఓ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
అమ్నీషియా పబ్ కేసులో నలుగురికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ సామూహిక అత్యాచార కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుమారు 48 రోజుల తర్వాత.. అమ్నీషియా పబ్ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది జువైనల్ జస్టిస్ బోర్డు. జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది జువైనల్ జస్టిస్ బోర్డు. ఇదిలా ఉంటే.. మైనర్ల బెయిల్ పిటిషన్లను రెండుసార్లు తిరస్కరించింది జువైనల్ బోర్డు. అయితే.. ఈసారి మాత్రం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో మైనర్‌ను రూ. 5 వేల పూచీకత్తుపై బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు కేసులో విచారణకు సహకరించాలని, హైదరాబాద్ డీపీవో ముందు ప్రతి నెల హాజరు కావాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. ఎమ్మెల్యే కొడుకు ఇంకా.. అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్‌కు మాత్రం బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక ఈ కేసులో మరో మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి ఇంకా బెయిల్ దొరకలేదు. మొదట జువెనైల్ బోర్డు బెయిల్‌కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. అయితే.. అది ఇంకా పెండింగ్‌లో ఉండడంతో.. ఇంకా జువైనల్ హోంలోనే ఉండాల్సి వచ్చింది. -
Hyderabad: పెళ్లి రోజే విషాదం.. భర్త, కొడుకుతో బైక్‌పై వెళ్తుండగా
సాక్షి, హైదరాబాద్: పెళ్లి రోజు భార్యభర్తలు తమ రెండేళ్ల కుమారుడితో నగరానికి వచ్చి సంతోషంగా గడిపి ద్విచక్ర వాహనంపై తిరిగి వె ళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన మేరకు.. ఆర్సీపురం మండలం వెలిమెల గ్రామానికి చెందిన మందమోళ్ల ప్రభాకర్ (28), ప్రసన్న (25) దంపతులకు రెండేళ్ల కుమారుడు జశ్విత్ ఉన్నాడు. గురువారం పెళ్లి రోజు కావడంతో ద్విచక్ర వాహనంపై ముగ్గురూ ఫోరంమాల్‌కు వచ్చి సంతోషంగా గడిపారు. సాయంత్రం గ్రామానికి తిరిగి వెళ్తుండగా చందానగర్‌లోని కేప్రీ హోటల్ వద్ద కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నపై బస్సు వెళ్లింది. ప్రభాకర్ కుడి చెయ్యిపై వెళ్లడంతో తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్, జశ్విత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్ ఓ ప్రైవేటు పాఠశాలలో గార్డెనింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ఆరుగురిలో ఐదుగురు మైనర్లే!
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ
సాక్షి, హైదరాబాద్: సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన నగర కమిషనర్.. ఈ కేసులో నిందితులు మైనర్లు కాబట్టి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం కుదరని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కేసును లోతుగా దర్యాప్తు చేశాం. ఆరుగురిలో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు. కేసులో మైనర్లు ఉన్నందున పేర్లు చెప్పడం లేదు. మార్చి 28న ఈ వ్యవహారం మొదలైంది. బెంగళూరులో ఉండే ఒక స్టూడెంట్.. స్కూల్ మొదలుకాక ముందు పార్టీ చేసుకోవాలని హైదరాబాద్‌లో స్నేహితులతో ప్లాన్ చేశాడు. అందుకోసం అమ్నీషియా పబ్‌ను ఎంచుకుని.. ఏప్రిల్‌లో పార్టీ గురించి పోస్ట్ చేశాడు. నాన్ ఆల్కాహాలిక్, స్మోకింగ్ పార్టీ కోసం అప్లై చేసుకున్నారు. ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి ద్వారా పబ్‌ను బుక్ చేయించారు. మే 28వ తేదీన పార్టీ గురించి సదరు స్టూడెంట్ మళ్లీ పోస్ట్ చేశాడు. మే 28వ తేదీన మధ్యాహ్నాం బాధితురాలు పబ్‌కు వెళ్లింది. నిందితులు.. పబ్‌లో ముందుగానే పథకం వేసుకున్నారు. ఆమె ఫాలో చేసి ట్రాప్ చేశారు. అదే రోజు సాయంత్రం రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర బాధితురాలిని వదిలిపెట్టారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. భరోసా సెంటర్లో కౌన్సెలింగ్ తర్వాత బాధితురాలు వివరాలు చెప్పింది. ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు నమోదు చేశాం. పబ్, బేకరి వద్ద అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మైనర్ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారు. మైనర్‌తో పాటు సాదుద్దీన్ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించలేకపోయింది. ఆధారాలతో సహా జూన్ 2వ తేదీన నిందితులను గుర్తించాం. జూన్ 3న సాదుద్దీన్‌ను అరెస్ట్ చేశాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మిగతా వాళ్లపై కేసు నమోదు అయ్యింది. సాదుద్దీన్‌తో పాటు నలుగురిని అరెస్ట్‌చేశాం. మరొకరి కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాం. దర్యాప్తు చాలా పారదర్శకంగానే జరిగిందని.. పలు కోణాల్లో దర్యాప్తు చేయడం వల్లే ఆలస్యమైందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో శిక్షలూ కఠినంగానే ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పబ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. -
సచిన్.. నాకు బతకాలని లేదు: కృతి సంభ్యాల్
సాక్షి, హైదరాబాద్: మంచి కంపెనీలో మంచి ఉద్యోగం. అయినవాళ్లను విడిచిపెట్టి.. ఊరు కానీ ఊరులో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఏం కష్టం వచ్చిందో ఏమో.. ఉరి వేసుకుని ప్రాణం తీసుకుంది!. గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిణి కృతి సంభ్యాల్ సూసైడ్ స్థానికంగా విషాదం నింపింది. గచ్చిబౌలిలో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది కృతి సంభ్యాల్. ఆమె స్వస్థలం జమ్ముకశ్మీర్. ఇద్దరిలో కలిసి ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఉంటోంది కృతి. ఈ క్రమంలో రూమ్ మేట్స్ లేని టైం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తన స్నేహితుడు సచిన్ కుమార్‌కు ‘నాకు బతకాలని లేదు’ ఓ మెసేజ్ పంపింది. అది చూసి అప్రమత్తమయ్యాడు సచిన్. సచిన్ హుటాహుటిన ప్లాట్‌కు వచ్చాడు. కానీ, అప్పటికే ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో కృతిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. కృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చేపట్టారు గచ్చిబౌలి పోలీసులు. -
భర్తతో విడాకులు.. 40 ఏళ్ల వ్యక్తిని నమ్మి పంజాబ్‌కు వెళితే...
సాక్షి, హిమాయత్‌నగర్: కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచి వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తిపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు ఖైరతాబాద్‌కు చెందిన దంపతులు గొడవల కారణంగా కోర్టు అనుమతితో వేర్వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న వివాహితకు సోషల్ మీడియా వేదికగా పంజాబ్‌లోని లుథియానాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నెలకు రూ. 2 లక్షల సంపాదన అని, బాగా చూసుకుంటానంటూ వివాహితను నమ్మించాడు. దీంతో వివాహిత అనుమతితో నగరానికి వచ్చిన అతగాడితో ఇద్దరూ కలసి కొంతకాలం సాన్నిహిత్యంగా తిరిగారు. ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో తనకు కొన్ని అవసరాలు ఉన్నాయంటూ వివాహిత నుంచి రూ. 80 వేలు డబ్బు కూడా తీసుకున్నాడు. ఇతడిని వివాహం చేసుకోవాలనే ఆలోచనతో వివాహిత లూధియానాలోని ఇంటికి వెళ్లింది. వ్యక్తి తండ్రి బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, తండ్రికి వస్తున్న పింఛన్‌తోనే కుటుంబ పోషణ నడుస్తుంది. ఒకరిని హత్య చేసి పదేళ్లు జైలులో ఉండి ఇటీవలే విడుదలై వచ్చాడని, మా వాడికి నువ్వంటే ఇష్టమని, నువ్వు పోషించుకునేట్టు అయితే ఇద్దరూ పెళ్లి చేసుకోమనే సమాధానం తల్లిదండ్రులను నుంచి వచ్చింది. దీంతో షాక్‌కు గురైన మహిళ అతగాడిని దూరం పెట్టింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అతగాడు ఇద్దరూ కలసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. బాధితురాలు బుధవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
శిల్పా చౌదరి అరెస్ట్, రిమాండ్‌లో కీలక విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ ముగ్గురు టాలీవుడ్ హీరోలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహం సంచలన రేపుతోంది. ఓ మహిళ చేతిలో అంత ఈజీగా మోసపోయింది ఓ హీరోలు, సెలబ్రెటీలు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల శిల్ప ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. చదవండి: ముగ్గురు టాలీవుడ్ హీరోలకు రూ. 200 కోట్లు కుచ్చు టోపి! తాజాగా వారి రిమాండ్ రిపోర్డును విడుదల చేసిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో శిల్ప పెద్ద మొత్తంలో డబ్బులు గుంజినట్లు సమాచారం. సైబరాబాద్ పరిధిలో అధునాతన హంగులతో శిల్ప దంపతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ పేరుతో దివ్య రెడ్డి నుంచి కోటిన్నర పైగా శిల్పా వసూలు చేసింది. డబ్బులు ఇవ్వకుండా, స్థలాన్ని చూపెట్టకుండా ఇబ్బందులకు గురి చేసింది. చదవండి: బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. వీకెండ్ ఎపిసోడ్స్‌కి భారీ ప్లాన్! దీంతో డబ్బు తిరికి ఇవ్వాలని ఇంటికి వెళ్లిన దివ్యరెడ్డిని తన బౌన్సర్ల బెదిరిస్తూ ఇంటి నుంచి తరిమేసింది. ఎలాగైన తన డబ్బు ఇవ్వాలని గట్టిగా అడిగినందుకు ప్రముఖుల పేర్లు చెప్పి దివ్య రెడ్డిని బెదిరించింది. డబ్బులు ఇవ్వకుండా ఫోన్లో చాలా సార్లు చంపేస్తానంటూ శిల్ప బెదిరింపులకు పాల్పడింది. దీంతో శిల్ప నుంచి ప్రాణభయం ఉందంటూ దివ్యరెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది’ అని పోలీసులు పేర్కొన్నారు. అలాగే శిల్ప బాధితుల్లో దివ్య రెడ్డి మాత్రమే కాకుండా టాలీవుడ్ ముగ్గురు హీరోలు, నగరానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. -
చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
హైదరాబాద్: తెలంగాణలో కలకలం రేపిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీని కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. కాగా, దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ ఉద్యోగులను అలర్ట్ చేశారు. ఇప్పటికే బస్టాండ్, బస్సుల్లో నిందితుడి ఆనవాళ్లు ఉన్న పోస్టర్లను అతికించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నిందితుడిపై పోలీసు శాఖ రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం -
సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి అత్యాచారం కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపను రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడి కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నిందితుడి ఆనవాళ్లను సైతం పోలీసులు విడుదల చేశారు. చదవండి: సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్ నిందితుడి ఎత్తు సుమారు 5.9 అడుగులు ఉంటుందని, పెద్ద జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకొని తిరుగుతాడని తెలిపారు. నిందితుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే అతని రెండు చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందని తెలిపారు. రాజు ఆచూకీ తెలిస్తే 9490616366, 9490616627 నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడు ఇంకా లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆరురోజులైన నిందితుడి ఆచూకీ దొరకకపోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆరేళ్ల గిరిజన బాలికపై హత్యాచారం: పెల్లుబికిన ప్రజాగ్రహం.. -
కాపురంలో ఫోన్‌కాల్ చిచ్చు: వయసైన కూతుళ్లతో తల్లి అదృశ్యం
బహదూర్‌పురా (హైదరాబాద్): ముగ్గురు పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన హైదరాబాద్‌లోని కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... కామాటిపురా మురళీ గుమ్మాస్ ప్రాంతానికి చెందిన కిషన్ శర్మ, పూజ ఆలియాస్ రాగిణి (34) దంపతులు. వీరికి 16 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందట మలక్‌పేట్‌లో నివసించే సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న పవన్ (30)తో పూజ తరచుగా మాట్లాడేది. ఈ విషయమై భర్త కిషన్ శర్మ పవన్‌ను మందలించి, 8 నెలల కిందట కామాటిపురాలోని మురళీ గుమ్మాస్‌కు మకాం మార్చారు. అయితే పవన్ కూడా ఇటీవల తన నివాసాన్ని మురళీ గుమ్మాస్‌కు మార్చాడు. తరచు ఫోన్లో మాట్లాడుతుండడంతో పూజతో కిషన్ శర్మ గొడవ పడగా.. ఈ నెల 16వ తేదీన పూజ తన ముగ్గురు కూతుళ్లు కీర్తి, మోహిని ఆలియాస్ మీనా (14), గోపి (12)తో తిరుపతి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. ఇప్పటవరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కిషన్ శర్మ కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నం. 9490616495లో సంప్రదించాలన్నారు. -
KPHB Colony: డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్.. పెళ్లైన విషయం దాచి
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు యత్నించిన వైద్యుడిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేట రోడ్డులోని నాగార్జున హోమ్స్‌లో నివాసముండే ఓ యువతి గతేడాది బంబుల్ డేటింగ్ యాప్‌లో తన ప్రొఫైల్ ఫొటో అప్లోడ్ చేసింది. ఏఐజీ హాస్పిటల్లో న్యూరో సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్న బంజారాహిల్స్ సుజాత స్టెర్లింగ్ హోమ్స్‌లో నివాసముండే డాక్టర్ అభిరామ్ చంద్ర గబ్బిత (32), ఆమె ఫొటోను చూసి మాటలు కలిపాడు. ఇలా ఒకరికొకరు పరిచయమై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అభిరామ్ చంద్రకు గతంలోనే పెళ్లి జరిగిందని తెలుసుకున్న బాధితురాలు తనను మోసం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులను ఆశ్రయించగా బుధవారం అభిరామ్ చంద్రను రిమాండ్‌కు తరలించారు. -
వీడు మహా కేటుగాడు.. ప్రియురాలితో సహా అజ్ఞాతంలోకి..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో పని చేస్తూ ఆయన సిమ్‌కార్డు కాజేసి, బ్యాంకు ఖాతా నుంచి రూ.13 లక్షలు కాజేసిన కేటుగాడు ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. బోగస్ ఆధార్ కార్డుతో పనిలో చేరిన ఇతగాడు సదరు మాజీ అధికారి అనుమతి లేకుండా ఆయన ఇంటి చిరుమానాతో ఇంకో ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. గతంలో మరో ప్రముఖుడి ఇంట్లోనూ ఇతడు పని చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ మాయగాడి వలలో పడి మోసపోయిన వారి సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మోసగాడి అసలు పేరు ఏమిటనేది ఎవరికీ తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా డోన్ నుంచి పొందినట్లు ఉన్న ఆధార్ కార్డును వినియోగించి ఇతగాడు ఓ కన్సల్టెన్సీ ద్వారా నగరంలో ఉద్యోగాల్లో చేరాడు. అందులో ఇతడి పేరు సురేందర్‌రావుగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సురేందర్‌రావుకు ఉద్యోగం ఇప్పించిన కన్సల్టెన్సీలోనూ పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే అతడు మాజీ ఐఏఎస్ ఇంట్లో సహాయకుడిగా ఉద్యోగంలో చేరడానికి ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి వద్ద దాదాపు రెండు నెలల పాటు పని చేసినట్లు వెలుగులోకి వచ్చింది. మాజీ ఐఏఎస్ వద్ద పని చేస్తున్నప్పుడే ఆయన కొంత కాలంగా వినియోగించని సిమ్‌కార్డు తస్కరించిన అతగాడు తన ఫోన్లో వేసుకున్నాడు. దాని ఆధారంగా కొన్ని యూపీఐ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్నాడు. వీటి ఆధారంగా దఫదఫాలుగా మొత్తం రూ. 13 లక్షలు కాజేశాడు. దాదాపు ఆరు నెలల పాటు ఈ మాజీ అధికారి వద్ద పని చేసిన సురేందర్‌రావు ఆయన ఇంటి చిరునామాతో, తన పేరిట కొత్తగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. డబ్బు కాజేసిన తర్వాత తన తల్లిదండ్రులకు కరోనా వచ్చిందంటూ చెప్పి పని మానేశాడు. అతగాడు పరారైన తర్వాతే డబ్బు పోయిన విషయం యజమాని గుర్తించారు. సురేందర్‌రావుగా చెప్పుకొన్న అతడు తెలుగు, హిందీ మాట్లాడే వాడని బాధిత కుటుంబం చెబుతోంది. అతడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆధార్ కార్డు ఇటీవలే పోస్టులో మాజీ అధికారి ఇంటికి వచ్చింది. ఈ విషయాన్ని వాళ్లు సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. సురేందర్ రావు కాల్ లిస్ట్‌ను పరిశీలించిన పోలీసులు తరచుగా బిహార్‌కు చెందిన తన ప్రియురాలితో మాట్లాడినట్లు గుర్తించారు. కర్నూలు, హైదరాబాద్‌ల్లో ఉన్న వారితో చాలా తక్కువగా సంభాషించినట్లు తేల్చారు. అతడు కన్సల్టెన్సీలో ఇచ్చిన ఆధార్ కార్డులోని చిరునామా బోగస్‌దిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నేరగాడితో పాటు బిహార్‌కు చెందిన అతడి ప్రియురాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సాంకేతిక ఆధారాలను బట్టి వాళ్లు ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు పోలీసుల భావిస్తున్నారు. ఇతగాడు గతంలో చేసిన నేరాలపై కూడా దృష్టి పెట్టిన అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. -
ఏసీబీకి అడ్డంగా దొరికిన మియాపూర్ ఎస్సై
సాక్షి, మియాపూర్: స్టేషన్ బెయిల్ మంజూరు చేయిస్తానని, మరో వ్యక్తి పేరును కేసులో లేకుండా చూస్తానని రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు మియాపూర్ సెక్టార్– 2 ఎస్ఐ యాదగిరి. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. మియాపూర్‌నకు చెందిన షేక్ సలీమ్ పుమా కంపెనీకి చెందిన బ్రాండెడ్ దుస్తులను విక్రయిస్తుంటాడు. వీటితో పాటు ఈ కంపెనీ పేరు వాడుకొని నకిలీ దుస్తులు కూడా అమ్ముతున్నట్లు మియాపూర్ పీఎస్‌లో వారం రోజుల క్రితం సదరు కంపెనీ యజమానులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో షేక్ సలీమ్‌తో పాటు అతని దుకాణంలో పనిచేస్తున్న మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి షేక్ సలీమ్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు అతని షాపులో పనిచేసే ఉద్యోగి పేరు కేసులోంచి తొలగించేందుకు మియాపూర్ సెక్టార్– 2 ఎస్ఐ యాదగిరి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇందులో రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ నెల 3న ఎస్ఐ యాదగిరి రూ.10 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20 వేలు మంగళవారం పోలీస్ స్టేషన్లో షేక్ సలీమ్ తీసుకుంటుండగా ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ బృందం పట్టుకున్నారు. ఎస్ఐని అదుపులోకి తీసుకొని రూ.20 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. ఎస్ఐ యాదగిరి అక్రమ ఆస్తులపై దృష్టి సారించారు. మియాపూర్‌లోని వీడియో కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేశారు. -
తమ్ముడికి ఐస్‌క్రీం ఇప్పించి ఇంటికి వెళ్లమని చెప్పింది.. ఆమె మాత్రం!
సాక్షి, రంగారెడ్డి : తన తమ్ముడికి ఐస్‌క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లోనుంచి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన సంఘటన నార్సింగిలో చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లలితాబాయి, రాందాస్ దంపతులు కుమార్తె స్వాతి బాయి, కుమారుడితో కలసి నార్సింగిలో నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం స్వాతి బాయి(19) తన తమ్ముడికి ఐస్ క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లోనుంచి వెళ్లింది. అతనికి ఐస్‌క్రీం ఇప్పించి ఇంటికి వెళ్లమని చెప్పి కనిపించకుండా పోయింది. రాత్రి ఇంటికి రాకపోవడం, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం లేకపోవటంతో ఆమె తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఆటోలో ఎంజీబీఎస్‌కు వెళ్లినట్టు గుర్తించారు. తల్లి ఫిర్యాదులో ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆదిశగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని.. ఏం కష్టమొచ్చిందో.. బిడ్డను చంపి ఉరేసుకున్న తల్లి -
మహిళ నంబర్‌ను షేర్‌చాట్‌లో పెట్టి కాల్‌గర్ల్‌గా..
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు ఓ మహిళ ఫోన్ నంబర్‌ను షేర్ చాట్‌లో పెట్టి కాల్ గర్ల్‌గా చిత్రీకరించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మగ్గుల మండలం, కలకండ గ్రామానికి చెందిన నాగిల్లా యశ్వంత్ (19) తన బంధువుల వద్ద రూ.2వేల అప్పు తీసుకున్నాడు. డబ్బులు సకాలంలో తిరిగి ఇవ్వకపోవడంతో వారు యశ్వంత్ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు అతడిని మందలించడంతో బాధితురాలిపై భర్తపై పగ పెంచుకున్నాడు. వారి పరుపు తీయాలని ఉద్దేశంతో యశ్వంత్ షేర్‌చాట్‌లో బాధితురాలి ఫోన్ నంబర్‌ను పెట్టాడు. దీంతో బాధితురాలికి నిత్యం ఫోన్లు రావడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు! బంజారాహిల్స్: అర్ధరాత్రి 12 గంటలకు యువతి ఇంట్లోకి వెళ్లి.. -
బంజారాహిల్స్: అర్ధరాత్రి 12 గంటలకు యువతి ఇంట్లోకి వెళ్లి..
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడు వేధింపులకు గురిచేయడమే కాకుండా కిడ్నాప్‌కు యత్నించడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... చావ వినయ్ చౌదరి అనే యువకుడు కొంత కాలం క్రితం యువతితో సహజీవనం చేశాడు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు వినయ్ చౌదరి అక్రమంగా బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె ఫోన్‌ను పగలగొట్టాడు. అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. బలవంతంగా ఆమెను బయటికి ఈడ్చుకొచ్చి కారులోకి తోసి కిడ్నాప్‌కు యత్నించగా ఆమె అరుపులకు ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారు బయటికు వచ్చి నిందితుడిని పట్టుకునేందుకు యత్నించి బాధితురాలిని కాపాడారు. అదే సమయంలో వినయ్ చౌదరి అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు వినయ్ చౌదరిపై ఐపీసీ సెక్షన్ 448, 354, 427,506 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు! -
గెస్ట్ హౌస్‌లో వ్యభిచారం.. ఇద్దరు విటులు, యువతుల అరెస్టు
సాక్షి, గోల్కొండ: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్ హౌస్‌పై గోల్కొండ పోలీసులు దాడి చేశారు. గెస్ట్‌హౌస్ వాచ్‌మెన్‌తో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్ అలియాస్ మున్నాభాయ్ షేక్‌పేట్ ఓయూ కాలనీలో ‘ఎంఎస్పీ గెస్ట్ ఇన్’గెస్ట్ హౌజ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గెస్ట్‌హౌజ్‌ను బాగా ఇంటీరియర్ డెకరేషన్ చేసి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించుకున్నాడు. కాగా ఇతర ప్రాంతాల నుంచి యువతులను తెచ్చి వ్యభిచారం నిర్వహించేవాడు. అయితే బుధవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతో పాటు గెస్ట్‌హౌజ్ వాచ్మెన్ జనైనాజెమ్ ఉద్దీన్ మలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు మున్నాభాయ్ పరారీలో ఉన్నాడు. వాచ్‌మెన్‌తో పాటు పట్టుబడ్డ వి.శ్రీను, గొలుసుల శ్రీనివాస్‌లను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వారి నుంచి రూ.4వేల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు. వ్యభిచార ముఠా సభ్యులపై పీడీయాక్ట్ చైతన్యపురి: సులువుగా డబ్బు సంపాదన కోసం వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులపై సరూర్ నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల మానస, వల్లపు మల్లికార్జున్, పోకల లింగయ్యలు ఒక ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార గృహం నడుపుతున్నారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు వారం రోజుల క్రితం ఇంటిపై దాడి చేశారు. మానస, మల్లికాఖార్జులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న పోకల లింగయ్యను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం -
ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే!
సాక్షి, హైదరాబాద్: సిటీలోని ఉత్తర మండలానికి చెందిన ఓ వ్యక్తి ఓయో హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలని భావించాడు. ఆ సంస్థను సంప్రదించడానికి అవసరమైన నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి నిండా మునిగాడు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఉమేష్ ఇటీవల కరోనా బారినపడ్డాడు. చికిత్స తీసుకున్న అతడికి నెగిటివ్ వచ్చింది. అయితే తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని భావించారు. దీని కోసం తమ ప్రాంతానికి సమీపంలోని ఓయో హోటల్ రూమ్ తీసుకుందామని భావించి ఆ సంస్థ ఫోన్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయగా ఒక నంబర్ లభించింది. అది నకిలీది అని తెలియక ఉమేష్ ఆ నంబర్‌ను సంప్రదించగా.. ఓయో సంస్థ ప్రతినిధుల మాదిరిగా సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. మీకు కావాల్సిన రూమ్ బుక్ చేసుకోవడానికి సహకరిస్తామంటూ క్విక్ సపోర్ట్ (క్యూఎస్) యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. తర్వాత బాధితుడి ఫోన్‌ను హ్యాక్ చేశారు. రూమ్ బుకింగ్ కోసం తమకు రూ.10 పంపాలన్నారు. ఉమేష్ ఆ మొత్తం తన ఫోన్ నుంచి బదిలీ చేస్తుండగా అతడి యూపీఐ వివరాలను క్యూఎస్ యాప్ ద్వారా తస్కరించారు. వీటిని వినియోగించి అతడి ఖాతా నుంచి రూ.3.08 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న ఉమేష్ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గూగుల్‌ను ఆశ్రయించొద్దు ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రముఖ సంస్థల కాల్ సెంటర్ల పేరుతో తమ నంబర్లను గూగుల్‌లో జొప్పిస్తున్నారని, ఈ విషయం తెలియక సంప్రదించిన అనేక మంది మోసపోతున్నారని పేర్కొన్నారు. ఏదైనా సంస్థకు సంబంధించిన ఫోన్, కాల్ సెంటర్ నంబర్లు అవసరమైతే నేరుగా దాని వెబ్సైట్ లేదా యాప్‌లనే సంప్రదించాలని సూచిస్తున్నారు. గూగుల్‌లో ఉన్న వాటిని గుడ్డిగా నమ్మితే నిండా మునుగుతారని హెచ్చరిస్తున్నారు. చదవండి: 128 సార్లు ఓయో హోటల్స్ బుక్ చేసుకున్న ఒకే ఒక్కడు -
దొంగోడి తిప్పలు; భక్తుడిలా గుడికి.. చెట్టుతొర్రలో ఇరుక్కుని..
సాక్షి, శంషాబాద్ రూరల్: ఆలయంలో నగదు చోరీ చేసిన ఓ మైనర్ బాలుడు.. తిరిగి ఆలయం నుంచి బయటకు వస్తూ చెట్టుతొర్రలో ఇరుక్కుపోయాడు. ఆలయ పూజారి వచ్చి గమనించి ఆ బాలుడిని పట్టుకున్నాడు. శంషాబాద్ మండలం ఇందిరానగర్ దొడ్డి ప్రాంతానికి చెందిన బాలుడు(11) సోమవారం మధ్యాహ్నం ఘాంసిమియాగూడలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రధాన ఆలయంలోకి భక్తుడిలా వచ్చాడు. కొబ్బరికాయ చేతిలో పట్టుకొని గుడిలోపలికి వెళ్లాడు. అయితే పూజలు చేస్తున్నట్లుగా నటించి ఏకంగా ఆలయం లోపల టేబుల్ ఖానాలో దాచి ఉంచిన రూ.10వేలను తస్కరించాడు. తిరిగి అదే చెట్టు తొర్రలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ అందులో ఇరుక్కుపోయాడు. అయితే, కొద్దిసేపటి తర్వాత ఆలయానికి వచ్చిన పూజారికి టేబుల్ ఖానాలోని నగదు కనిపించలేదు. దీంతో ఆయన స్థానికులతో కలిసి సీసీ పుటేజ్‌ను పరిశీలించగా.. బాలుడు ఆలయంలోకి వచ్చి చెట్టుతొర్రలోకి వెళ్లినట్లు గుర్తించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా ఆ బాలుడు అందులోనే ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలుడి నుంచి రూ.10 వేలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఈ బాలుడు సెల్‌పోన్ దొంగతనం సంఘటనలో నిందితుడుగా ఉన్నట్లు సీఐ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చదువులో వెనకబడ్డానని.. బీటెక్ విద్యార్థి.. -
గచ్చిబౌలి హోటల్లో వ్యభిచారం... ఆరుగురి అరెస్టు
సాక్షి, గచ్చిబౌలి: పోలీసులు ఓ హోటల్‌పై దాడి చేసి వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఆరుగురు విటులతో పాటు ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకోగా, నిర్వాహకులు మాత్రం పరారీలో ఉన్నారు. గచ్చిబౌలి సబ్ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. యాంటీ ఉమెన్ ట్రాకింగ్ సెల్, గచ్చిబౌలి పోలీసులు బుధవారం రాత్రి సదరు హోటల్‌పై దాడి చేశారు. విటులు బిజ్యూపాయల్(27), దీపక్‌కుమార్ (25), సంగం కిషోర్‌దాల్(24), నితిన్జాషన్ అలియాస్ ఆరుట్ల నిఖిల్ (31), బంది నారాయణ (38), వెంకటేష్‌గౌడ్(58)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ 32,510 నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు, ముంబైకి చెందిన ఇద్దరు, ఢిల్లీకి చెందిన ఒక యువతిని అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోంకు తరలించారు. కాగా, నిర్వాహకులు ప్రభాకర్, సంజయ్, అజయ్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పప్పులో కాలేసిన టెలీకాలర్, కట్‌చేస్తే న్యూడ్ వీడియో కాల్ వదినపై ముగ్గురు మరుదులు అత్యాచారం -
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 121 మంది
సాక్షి, నాగోలు: రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో గురువారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 121 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్చార్జి డీసీపీ జి.మనోహర్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిలో 10 మందిని జైలుకు పంపించినట్లు ఆయన చెప్పారు. రెండోసారి పట్టుబడిన ఓ ఆటో డ్రైవర్‌కు పెనాల్టీతో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశామన్నారు. మొత్తం రూ.2.32 లక్షల జరిమానా విధించినట్లు డీసీపీ మనోహర్ పేర్కొన్నారు. -
తప్పులో కాలేసిన టెలీకాలర్, కట్‌చేస్తే న్యూడ్ వీడియో కాల్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ సంస్థలో టెలీకాలర్‌గా పని చేస్తున్న యువతి చేసిన చిన్న పొరపాటు ఆమెకే శాపంగా మారింది. తన విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి వేధింపులు పాలైంది. వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. ఉత్తర మండల పరిధిలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో టెలీకాలర్‌గా పని చేస్తోంది. వృత్తిలో భాగంగా నిత్యం అనేక మందితో సంస్థ ఫోన్ నుంచి కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే టెలీకాలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ క్లైంట్స్‌కు వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, వివరాలు అందించకూడదనేది ప్రాథమిక సూత్రం. ఓ సందర్భంలో ఈ యువతి ఛత్రినాక ప్రాంతానికి చెందిన చంద్రవేగ్కు ఫోన్ చేసి తమ సంస్థ వ్యాపారం విషయం మాట్లాడింది. ఆ సంస్థకు కస్టమర్‌గా మారే విషయాన్ని తాను పరిశీలిస్తానంటూ చెప్పిన చంద్రవేగ్ కాస్త సమయం కావాలన్నాడు. సమాధానం చెప్పడం కోసం సంప్రదించడానికంటూ ఆమె వ్యక్తిగత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన ఇతగాడు అప్పటి నుంచి ఆమెను రకరకాలుగా వేధించడం మొదలెట్టాడు. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో విచక్షణ కోల్పోయిన ఇతగాడు బాధితురాలికి న్యూడ్ వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు. విసిగివేశారిన బాధితురాలు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు చంద్రవేగ్ నిందితుడిగా గుర్తించారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వదినపై ముగ్గురు మరుదులు అత్యాచారం
సాక్షి, అమీర్‌పేట: భర్త సమక్షంలోనే అతని సోదరులు అత్యాచారం చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయిందింది. వారిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఎస్ఆర్నగర్ పోలీసులను ఆదేశించడంతో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బోరబండ ఇంద్రానగర్‌లో నివాసముంటున్న నర్సింహ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. దీంతోపాటు తన సోదరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు. మరుదులైన కృష్ణ, శ్రీనివాస్, మునీందర్‌లు కూడా వేధించారు. 2017లో భార్యను నిర్భందించి సోదరుల చేత లైంగిక దాడికి సహకరించాడు. బాధితురాలు కోర్టును ఆశ్రయించగా మంగళవారం కేసు నమోదు చేశామన్నారు. -
ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి
సాక్షి, బంజారాహిల్స్: స్కూల్ ఫీజు కట్టడానికి మరుసటి రోజు రమ్మని చెప్పిన ప్రిన్సిపాల్‌పై ఓ విద్యార్థి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 సయ్యద్ నగర్‌లోని ది ఆక్స్ఫర్డ్ మిషన్ హైసూ్కల్లో స్థానికంగా నివసించే ఇలియాస్(19)అనే విద్యార్థి సోమవారం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు వచ్చాడు. అయితే ఫీజు చెల్లించేందుకు రేపు రావాలని స్కూల్ ప్రిన్సిపల్ ఫిర్దోస్ అంజుమ్ సూచించారు. ఇప్పడే కట్టుకోవాలంటూ వాగ్వాదానికి దిగిన ఇలియాస్ కోపంతో ఊగిపోతూ ప్రిన్సిపల్‌ను కొట్టాడు. అప్పుడే వచ్చిన అతడి తల్లి జాఫరున్నీసాబేగం కూడా చెప్పు తీసుకొని ప్రిన్సిపల్ ముఖంపై బాదింది. బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇలియాస్‌తో పాటు అతడి తల్లి జాఫరున్నీసాబేగంపై ఐపీసీ సెక్షన్ 354, 324, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నా కోరిక తీర్చు.. లేదంటే నీ భర్త, కొడుకును..
సాక్షి, బంజారాహిల్స్: తనతో స్నేహం చేయాలంటూ వివాహితను తరచూ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై, అతడికి సహకరించిన మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.1లో నివాసముంటున్న వివాహిత(36) ఓ బ్యూటీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్‌లో మెడికల్ హెడ్‌గా పనిచేస్తోంది. ఇటీవల వరప్రసాద్ అనే క్లైంట్ వెంట క్లినిక్‌కు వచి్చన విశ్వనాథ్ అనే వ్యక్తి ఆమె ఫోన్ నంబర్‌ను సేకరించి తరచూ ఫోన్లు చేస్తున్నాడు. తనతో స్నేహం చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఫోన్ నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. అయినప్పటికీ వెంట్రుకలకు సంబంధించిన సమస్య ఉందంటూ తరచూ క్లినిక్‌కు వచ్చి అక్కడ పనిచేస్తున్న వారితో స్నేహం పెంచుకున్నాడు. బాధితురాలికి సంబంధించిన కుటుంబ వివరాలు, చిరునామాను తెలుసుకున్న విశ్వనాథ్ ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఓ ఫ్లాట్‌ను నాగరాజు అనే వ్యక్తి పేరుతో తీసుకున్నాడు. అక్కడే ఉంటూ బాధితురాలి కుమారుడికి చాక్లెట్లు, బొమ్మలు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే కొడుకుతో పాటు భర్తను అంతం చేస్తానంటూ బెదిరింపులు ప్రారంభించాడు. ఆమె కదలికలపై సమాచారం సేకరించేందుకు కారులో జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చాడు. ఇదిలా ఉండగా ఇటీవల అతడి వేధింపులు ఎక్కువ కావడంతో భర్తకు విషయాన్ని చెప్పింది. దీంతో అతడు నివాసముంటున్న ఫ్లాట్‌కు వెళ్లడంతో అక్కడి నుంచి విశ్వనాథ్ పరారయ్యాడు. కారులో తనిఖీ చేయగా జీపీ ఎస్ పరికరం దొరికింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని మరోసారి విశ్వనాథ్ నీ భార్య జోలికి రాడంటూ సురేష్ అనేవ్యక్తి ఫోన్ చేశాడు. పులి శ్రీకాంత్ పటేల్ అనే రాజకీయ నేత కూడా ఫోన్లు చేస్తూ రాజీకుదుర్చుకుందామని లేకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగాడు. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులు వై.విశ్వనాథ్, సురేష్, శ్రీకాంత్ పటేల్, నాగరాజు అనే వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విషాదం: వంట చేస్తుండగా మంటలంటుకొని..
సాక్షి, చిక్కడపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలంటుకొని చికిత్స పొందుతూ ఓ గృహిణి మృతి చెందిన ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో జరిగింది. ఎస్ఐ కోటేశ్ వివరాల ప్రకారం.. బాగ్‌లింగంపల్లి పాలమూరుబస్తీలో నివాసముంటున్న బి.చిట్టి (24) గురువారం రాత్రి గ్యాస్ పొయ్యి పని చేయకపోవడంతో నాలుగో అంతస్తులో ఉన్న టెర్రస్‌పైన కట్టెల పొయ్యిపై వంట చేయడానికి వెళ్లింది. కట్టెల పొయ్యిలో కిరోసిన్ పోసిన సమయంలో మంటలు ఎక్కువగా వచ్చి బట్టలకు అంటుకున్నాయి. కేకలు వేయడంతో అక్కడే ఉన్న గంగాధర్, సాయిలు ఆమె పై బ్లాంకెట్ కప్పి మంటలు ఆర్పేందుకు యత్నించారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కర్నాటక బళ్లారికి చెందిన చిట్టి సోదరుడు రామ్ అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ శివశంకర్‌రావు పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త రెండో పెళ్లి.. భార్యపై వేధింపులు.. ఆ తర్వాత
సాక్షి, కుషాయిగూడ: భార్య, పిల్లలు ఉండగానే మరో మహిళను వివాహం చేసుకున్న వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం మల్కాజిగిరి కోర్టు తీర్పు చెప్పింది. ఆయనతో పాటు వేధింపులకు పాల్పడ్డ వారికి జరిమానా, జైలు శిక్ష విధించింది. పోలీసుల సమాచారం మేరకు... కాప్రా భవానీనగర్‌కు చెందిన ఎల్.భవాని (గాయత్రి), ప్రేమ్‌కుమార్‌లకు 2002లో వివాహం జరిగింది. ప్రేమ్‌కుమార్ రైల్వే ఉద్యోగి. వీరికి ఇద్దరు సంతానం. ఇదిలా ఉండగా... ప్రేమ్‌కుమార్‌కు పనిచేసే చోట కవిత అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యలో ప్రేమ్‌కుమార్ తన భార్యను వదిలించుకునేందుకు వేధింపుల పర్వానికి తెరలేపి నిత్యం వేధించసాగాడు. భర్తతోపాటు అత్త లాకావత్ లత, ఆడపడుచు లాకావత్ అర్చన సైతం భవానీని వేధింపులకు పాల్పడేవారు. ఇదిలా ఉండగా 2014 జూలై 4న ప్రేమ్‌కుమార్, కవితలు ఎవరికీ తెలియకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే ప్రేమ్‌కుమార్ అదృశ్యంపై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో, కవిత అదృశ్యంపై మల్కాజిగిరి పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వివాహం అనంతరం ప్రేమ్‌కుమార్, కవిత కుషాయిగూడ పోలీస్ట్‌షన్‌కు వచ్చి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో 2016 మే 5న అతిగా మద్యం సేవించిన ప్రేమ్‌కుమార్ మొదటి భార్య లావణ్య పట్ల దురుసుగా వ్యవహరించి, బూతులు తిడుతూ చేయిచేసుకున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లావణ్య పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు రెండో వివాహం చేసుకున్న ప్రేమ్‌కుమార్, కవితతో పాటు వేధింపులకు పాల్పడ్డ లత, అర్చనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐఓ ఎస్ఐ నాగేశ్వర్రావు దర్యాప్తు చేసి కోర్టుకు తగిన ఆధారాలతో చార్జిషీట్‌ను సమర్పించారు. కేసు పూర్వాపరాలు.. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం ప్రేమ్‌కుమార్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 5,500 జరిమానా, మిగతా వారికి ఏడాది జైలు శిక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని పోలీసులు తెలిపారు. -
విషాదం: ఆరు నెలల క్రితం తండ్రి, ఇప్పుడు కొడుకు..
సాక్షి, నాగోలు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేçసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ వాస్తుకాలనీకి చెందిన కీత నితేష్‌సాయి(26) మృత్తి రీత్యా వ్యాపారి. బుధవారం రాత్రి వనస్థలిపురంలో ఉన్న స్నేహితుడిని కలసి బుల్లెట్‌పై వాస్తుకాలనీలో ఉన్న తన ఇంటి రాత్రి 11:45గంటలకు సమయంలో వస్తున్నాడు. మార్గ మధ్యలో ఓంకార్‌నగర్ యూటర్న్ వద్ద మరో ద్విచక్ర వాహనం వచ్చి ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన నితేష్‌సాయిని చికిత్స నిమిత్తం హస్తినాపురంలోని నవీన ఆస్పత్రికి తరలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో చికిత్స పొందుతూ నితేష్‌సాయి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి పెద్దనాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణలు దక్కేవి... హెల్మెంట్ లేక పోవడంతో కింద పడిన నితేష్‌సాయి తలకు తీవ్ర గాయలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హెల్మెంట్ ధరించి ఉంటే నితేష్‌సాయి ప్రాణాలతో బయట పడేవారని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితమే తండ్రి మృతి.. నితేష్‌సాయి తండ్రి మధుసూదన్ ఆరు నెలల క్రితం నాగోలు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంతలోనే కుమారుడు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ ఏక్‌మినార్ మజీద్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీరు మృతి చెందాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మైబెల్లి తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్ సుచిత్ర ప్రాంతంలో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీగూర శివనాగిరెడ్డి (26) ఉప్పల్ రోడ్డులోని ఎన్ఎస్ఎల్ భవనంలో మూడు సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. కార్యాలయంలో ఉన్న ల్యాప్‌టాప్ కోసం ఇంటి నుంచి తన ద్విచక్ర వాహానం (ఏపి 09 సిఎన్ 3009)పై గురువారం ఉదయం బయలు దేరాడు. ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ వద్ద రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ వేగంగా ఢీ కొనడంతో తీవ్ర గాయాల పాలైనాడు. గాయపడిన శివనాగిరెడ్డిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివనాగిరెడ్డి భార్య తీగూర సుశ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట పాపారాయుళ్లు: ప్రతిసారి వాళ్లే ఎలా గెలుస్తున్నారని..
సాక్షి, మేడ్చల్ రూరల్: పోలీసులంటూ పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన ముఠాను మేడ్చల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మజ వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా ముథోల్ కు చెందిన అఖిల్ అహ్మద్ (32) మేడ్చల్ పట్టణంలోని చంద్రానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతని మిత్రులు ఇస్లాంపూర్‌కు చెందిన షేక్ అహ్మద్(21), షేక్ అజీమ్(25) ముగ్గురు తరచూ పేకాట ఆడేవారు. భాదితులు మణికంఠ, శ్రీహరి, సామ్‌సంగ్‌లతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. పలుమార్లు వారితో కలిసి పేకాట ఆడారు. ఎప్పుడు పేకాట ఆడినా మణికంఠ, శ్రీహరి, సామ్‌సంగ్‌లు డబ్బు గెలుచుకునేవారు. అఖిల్ అహ్మద్, షేక్ అహ్మద్, షేక్ అజీమ్‌లు సుమారు రూ.7 నుంచి 8 లక్షల వరకు పోగొట్టుకున్నారు. తరుచూ డబ్బు వాళ్లే ఎలా గెలుస్తున్నారు.. ఏదో చేస్తున్నారు అంటూ వీరి నుంచి డబ్బులు ఎలాగైనా రాబట్టాలని ప్లాన్ చేసుకున్న ముగ్గురు మిత్రులు వారి స్నేహితులైన ఇస్లాంపూర్ కు చెందిన షేక్ అక్బర్(32), నిజామాబాద్‌కు చెందిన గణేశ్(28), షేక్ కైసర్(30) లతో కలిసి నకిలీ పోలీసులమంటూ బెదిరించి డబ్బులు దోచుకోవాలని పథకం వేసుకున్నారు. ఈ నెల 14న మేడ్చల్‌లోని ఆర్ఆర్ లాడ్జిలో రెండు గదులు అద్దెకు తీసుకున్నారు. ప్లాన్‌లో భాగంగా అఖిల్ అహ్మద్ మధ్యాహ్నం మణికంఠ, శ్రీహరి, సామ్‌సంగ్‌లకు ఫోన్ చేసి పేకాట ఆడేందుకు లాడ్జికి పిలువగా వారు సాయంత్రం వచ్చి అఖిల్ అహ్మద్,షేక్ అహ్మద్, షేక్ అజీమ్‌లతో కలిసి ఆరుగురు లాడ్జీలోని ఓ రూమ్‌లో పేకాట ఆడుతున్నారు. కొంతసేపటికి డోర్ చప్పుడు కావడంతో అఖిల్ అహ్మద్ పోలీసులు వచ్చారంటూ అరుస్తూ అక్కడ ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని బాత్రూమ్లో దాక్కున్నాడు. షేక్ అహ్మద్ వెళ్లి తలుపులు తీసాడు. గణేశ్, షేక్ కైసర్‌లు పోలీసులమంటూ గదిలోకి చొరబడి గణేశ్ డమ్మీ గన్‌తో బెదిరించి డబ్బు తీసుకొని వెళ్లిపోయారు. ఆ సమయంలో షేక్ అక్బర్ ఇతరులు ఎవరూ అటు వైపు రాకుండా చూస్తూ లాడ్జ్ వారితో మాటలు కలుపుతూ పని ముగిసాక వెళ్లిపోయాడు. తరువాత అఖిల్ అహ్మద్,షేక్ అహ్మద్‌లు తమకు భయం అవుతుందంటూ బాదితులకు చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి రూ.2.22లక్షల నగదు, 6 సెల్ఫోన్లు, బైక్, డమ్మీ గన్, ఫైబర్ లాఠీ లను స్వాధీనం చేసుకున్నారు. -
రూ. 23,100కే రైల్వే జాబ్!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో రైల్వే ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారితో షైన్.కామ్‌లో రిజిస్టర్ చేయించి, వివిధ చార్జీల పేరుతో రూ. 23,100 వరకు వసూలు చేసి, మోసం చేసే ముఠా సూత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడి ద్వారా నిందితుడిని కోల్‌కతాలో పట్టుకున్న అధికారులు పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన అనంతరం కోర్టు అనుమతితో బుధవారం సైబర్ కాప్స్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా చేతిలో దేశ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మోసపోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్యే 20 మంది వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా... మరో 12 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ⇔ కోల్‌కతా, హుగ్లీలోని చందన్నగర్కు చెందిన హర్ష బర్దన్ మిశ్రా బీసీఏ పూర్తి చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన ఇతగాడు ప్రస్తుతం అక్కడి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఐటీ టెక్నాలజీ గ్రూప్ అండ్ ఏఎస్ ఇన్ఫోసాల్వ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ⇔ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన బినిత పాల్, రిచ, అనితలను ఉద్యోగులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఐదుగురూ కలిసి ఆన్లైన్ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక మందిని ఉద్యోగాల పేరుతో ఎర వేసి మోసం చేస్తున్నారు. ⇔ ఓఎల్ఎక్స్లో రైల్వేతో పాటు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చే వీరు అందులో తమ ఫోన్ నంబర్లను పొందుపరుస్తున్నారు. వీటిని చూసి ఎవరైనా కాల్ చేస్తే.. వారి వివరాలను షైన్.కామ్ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచిస్తున్నారు. ⇔ ఆ తర్వాత రెండు రోజుల్లో నిందితులు బాధితులకు ‘హెచ్ఆర్ రిచ’, ‘హెచ్ఆర్ జాస్మిన్’ పేర్లతో బల్క్ మెసేజ్‌లో పంపుతున్నారు. ఉద్యోగార్థుల్లో అత్యధికులు రైల్వే ఉద్యోగాలే కోరుతుండటంతో ఆ డిపార్ట్మెంట్లో సైట్ సూపరింటెండెంట్ పోస్టులకు అర్హులయ్యారంటూ చెబున్నారు. మరికొందరితో ప్యాంటరీకార్స్లో పోస్టుల పేరు చెప్తున్నారు. ⇔ నెలకు రూ.13,500 నుంచి రూ.15,500 వరకు ప్రారంభ వేతనం ఉంటుందని, ఉద్యోగస్తుడితో పాటు అతడి కుటుంబానికీ రైల్వేలో ఉచిత ప్రయాణం సహా ఇతర సౌకర్యాలు ఉంటాయంటూ నమ్మబలుకుతున్నారు. ఇలా తమ వల్లోపడిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో ప్రాథమికంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ⇔ ఆపై ప్రాసెసింగ్, యూనిఫాం చార్జీల పేర్లు చెప్పి రూ. 23,100 వరకు వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించిన వారు ఎవరైనా ఫోన్లు చేస్తే త్వరలోనే రైల్వే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్, నియామక ఉత్తర్వులు అందుతాయంటూ దాట వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా పదేపదే కాల్స్ చేసి ఉద్యోగం విషయం ప్రశ్నిస్తే కొత్త కథ అల్లుతున్నారు. ⇔ అయితే 95 శాతం మంది రూ. 23,100 కోల్పోయిన తర్వాత వీరికి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రం అదనపు మొత్తం చెల్లించడానికి సిద్ధమంటుంటే... వారి నుంచి మరో రూ.6,900 వరకు వసూలు చేసి వారి నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ⇔ ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వాళ్లల్లో అత్యధికులు పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. నగరానికి చెందిన ముగ్గురు మాత్రం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించి మోసపోయారు. వీరంతా సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ⇔ వీటిని సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలోని బృందం ప్రధాన నిందితుడు హర్ష కోల్‌కతా సమీపంలోని డమ్‌డమ్‌లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడికి వెళ్లే సరికి తన మకాం మార్చేశాడని తేలింది. అయితే అతడు ఓ వ్యక్తితో పదేపదే ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించిన స్పెషల్ టీమ్ అతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో తాను కూడా హర్షకు రూ.30 వేలు చెల్లించి మోసపోయిన కోల్‌కతా వాసినంటూ చెప్పాడు. ⇔ అతగాడికి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఓ కార్యాలయం ఉందని చెప్పి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు. దీంతో హర్షను అరెస్టు చేసిన అధికారులు అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
స్నేహితురాలితో వీడియో కాల్ మాట్లాడుతోందని..
మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ క్రిష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరి భవానీనగర్‌కు చెందిన మేఘనాథ్ కూతురు సుమిత (20) ప్రైవేట్ ఉద్యోగి. తరచూ హబ్సిగూడలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తూవుండేది. ఆమెతో తరచూ వీడియోకాల్ మాట్లాడుతుండడంతో తల్లి మందలించింది.ఈ నెల 1 వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన సుమిత తిరిగిరాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిల్ కలెక్టర్‌ను బెదిరించిన కేసులో.. ఏడాది జైలు నేరేడ్మెట్: విద్యుత్ బిల్లు చెల్లించమని అడిగిన బిల్ కలెక్టర్‌ను కత్తితో బెదిరించిన కేసులో నిందితుడికి మల్కాజిగిరి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్టు బుధవారం నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి పేర్కొన్నారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....పోలీసుస్టేషన్ పరిధిలోని సంతోషిమానగర్‌లో నివాసం ఉంటున్న శంకర్‌రాయ్ ఇంటికి 2018 సంవత్సరం సెపె్టంబర్ 29న బిల్ కలెక్టర్ శ్రీశైలం పెండింగ్ విద్యుత్ బిల్లు వసూలు కోసం వెళ్లాడు. బిల్లు చెల్లించాలని కోరగా నిందితుడు కత్తితో బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే బిల్ కలెక్టర్ ఏఈ రవీందర్‌కు సమాచారం ఇచ్చాడు. ఏఈ వచ్చి బిల్లు చెల్లించాలని లేనిపక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేయగా, నిందితుడు ఆయన్ని బెదిరించాడు. ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిïÙటు దాఖలు చేశారు. బుధవారం తుది విచారణ పూర్తి కావడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ వివరించారు. -
పని మనిషే హత్య చేసింది..
సాక్షి, జిన్నారం(పటాన్చెరు) : కళ్లల్లో కారంచల్లి ఓ వృద్ధురాలి గొంతు నులిమి హత్య చేసిన కేసును బొల్లారం పోలీసులు ఛేదించారు. పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో హత్యకు గల కారణాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. బొల్లారం గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న ఉస్కేబావి అంతమ్మ ఇంట్లో స్వరూప అనే మహిళ పని చేస్తుంది. అంతమ్మ ఇంట్లో ఎప్పుడూ డబ్బు, బంగారు నగలను గమనిస్తున్న స్వరూప వాటిని అపహరించాలని పన్నాగం పన్నింది. ఆదివారం రాత్రి అంతమ్మతో పాటు ఇంట్లోనే స్వరూప నిద్రించింది. అంతమ్మ నిద్రలోకి చేరుకున్న తర్వాత స్వరూప నిద్ర లేచి అంతమ్మ కళ్లల్లో కారం చల్లి గొంతు నులిమి హత్య చేసింది. ఇంట్లో ఉన్న 18 తులాల బంగారంతో పాటు రూ. 6లక్షల నగదును ఎత్తుకెళ్లింది. అంతమ్మ హత్యకు గురి కావటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి ఓ మహిళ సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. అంతమ్మ ఇంట్లో పనిచేస్తున్న స్వరూపను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. తానే హత్య చేసి నగదు, డబ్బును ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకుంది. నగదుతో పాటు బంగారంను స్వాధీనం చేసుకొని స్వరూపను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. 24 గంటల్లో హత్య కేసును ఛేదించేలా దర్యాప్తు జరిపిన సీఐ ప్రశాంత్‌తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు వివరించారు. -
భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని..
సాక్షి, పటాన్చెరు టౌన్ : వివాహేతర సంబంధంతో వరసకు బావతో కలసి భర్తను భార్య హత్య చేయించిన ఘటన మంగళవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. చత్తీస్ఘడ్ రాష్ట్రం... దురుగు జిల్లా..మరోదా గ్రామానికి చెందిన అనిల్ కుమార్ దారు (35) బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం స్నేహితుడు హరినారాయణ (అలియాస్) సంజీవుతో కలసి అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు వచ్చాడు. సమీపంలోని మెడికల్ డివైజ్ పార్క్ సమీపంలో సెంటరింగ్ పని చేసుకుంటూ, అక్కడే నివాసం ఉంటున్నాడు. పది రోజుల క్రితం వరసకు సడ్డకుడు నర్వోత్తంతో కలిసి మృతుడి భార్య భువనేశ్వరి అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ వచ్చింది. భువనేశ్వరి, నర్వోత్తంల మధ్య వివాహేతర సంబంధం ఉంది. భర్త అనిల్ కుమార్‌ను హతమారిస్తే ఇద్దరం సంతోషంగా ఉండవచ్చని మృతుడి భార్య బావ నర్వోత్తంతో చెప్పింది. దీంతో అతను అనిల్ కుమార్‌ను ఆదివారం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సమీపంలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి రాయితో తలపై బాది హత్య చేశాడు. ఒక్కసారిగా అనిల్‌కుమార్ కనిపించకుండా పోవడంతో తోటి కార్మికులు, స్నేహితుడు సంజీవు .. నర్వోత్తంని అడిగారు. ఎవరో వచ్చి బైక్‌పై తీసుకెళ్లారని అబద్ధం చెప్పాడు. అనంతరం కాసేపు వెతికినా అనిల్‌కుమార్ దొరక్కపోవడంతో మరోసారి నర్వోత్తంను గట్టిగా నిలదీశారు. అనిల్‌కుమార్ భార్యకు తనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె చెబితేనే హత్య చేశానని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ భీంరెడ్డి, పటాన్చెరు క్రైం సీఐ శ్రీనివాసులు, అమీన్పూర్ ఎస్ఐలు మురళి, కిష్టారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతుడి భార్య భువనేశ్వరిని, నర్వోత్తంను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్నేహితుడు సంజీవు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? -
రెండు క్రేన్ల ఢీ: ఆపరేటర్ మృతి
సాక్షి, గచ్చిబౌలి: రోడ్డుపై రెండు క్రేన్లు వేగంగా వెళ్తున్నాయి.. ఒక క్రేన్ అదుపుతప్పి ముందు వెళుతున్న క్రేన్‌ను ఢీకొట్టింది. తర్వాత ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో క్రేన్ ఆపరేటర్ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ గోనె సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్ అలియాస్ అనిల్ యాదవ్(26) బాలానగర్ ఫిరోజ్‌గూడలో ఉంటూ క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 12 గంటలకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెజాన్‌లో మెటీరియల్ ఎత్తేందుకు రెండు క్రేన్లు వెళ్లాయి. రాత్రి ఒంటి గంట సమయంలో విప్రో జంక్షన్ సమీపంలో వెనుక వస్తున్న క్రేన్ న్యూట్రల్ కావడం, జంక్షన్లో రోడ్డు డౌన్‌గా ఉండటంతో వేగంగా దూసుకెళ్లి ముందు వెళ్తున్న క్రేన్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్‌ను తాకి బోల్తా కొట్టింది. ఆపరేటర్ అనిల్ యాదవ్ క్రేన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ముందు వెళుతున్న క్రేన్ అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టడంతో ముందు చక్రాలు ఊడిపడ్డాయి. ఆ క్రేన్‌పై ఉన్న ఆపరేటర్ షఫీకి అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు. ఫుట్‌పాత్ వెంట టీఎస్ఐఐసీ అధికారులు ఏర్పాటు చేసిన గ్రిల్స్, ఇనుప స్తంభాలు నేలమట్టమయ్యాయి. సోమవారం ఉదయం మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, గచ్చిబౌలి సీఐ సురేష్ , ట్రాఫిక్ సీఐ నర్సింహారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ-కామర్స్‌లో తెలుగుతో తెలివిగా టోకరా..
సాక్షి, హైదరాబాద్: ఈ-కామర్స్ సైట్లలో వినియోగదారుల వివరాలు సేకరిస్తారు. ప్రైజ్‌మనీ వచ్చిందంటారు. టాటా సఫారీ వాహనం గెలుచుకున్నారని నమ్మబలుకుతారు. ఆపై మోసాలకు తెరలేపుతారు. ఇలా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలవారితో తెలుగులో మాట్లాడి రూ.కోట్లలో మోసం చేసిన పది మంది ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట సైబర్ నేరాల కేసులో అయిదుగురు తెలుగువారు పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టాటా సఫారీ గెలుచుకున్నారంటూ నమ్మించి రూ.95,459 వసూలు చేయడంతో గత ఏడాది సెప్టెంబర్ 1న సైబరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ మోసం వెలుగులోకి వచ్చిందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన సైబర్‌క్రైమ్ ఏసీపీ బాలకృష్ణారెడ్డితో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పోస్టులు పంపించి.. నమ్మించి.. ⇔ బిహార్‌లోని నవాడా జిల్లా మిర్జాపూర్కు చెందిన తరుణ్ కుమార్ అలియాస్ అమిత్ బీసీఏ చదివాడు. కోచింగ్ సెంటర్ పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. స్నేహితులు అలోక్, తిరంజ్‌ల సహకారంతో ఈ-కామర్స్ సైట్లు హెర్బల్ కేర్ గ్రూప్, నాప్టాల్, షాప్‌క్లూజ్‌ల నుంచి కొనుగోలుదారుల వివరాలు సేకరించాడు. భజరంగి, కామ్లేష్ దూబె, యశ్వంత్ ఠాకూర్, సౌరవ్ పటేల్‌లతో కలిసి 53 బ్యాంక్ ఖాతాలు సృష్టించారు. ⇔ బిహర్ షరీఫ్‌లోని ప్రింటింగ్ ప్రెస్ వద్ద స్క్రాచ్ కార్డులు, అప్లికేషన్లు, బ్యాంక్‌ల నకిలీ స్టాంప్‌లు ముద్రించాడు. ఆయా సంస్థల ఎన్వెలప్ కవర్లకు బ్యాంక్ సీల్ వేసి లోపల స్క్రాచ్‌కార్డులు పంపి కస్టమర్లను నమ్మించేవారు. ప్రైజ్‌మనీ, టాటా సఫారీ గిఫ్ట్‌లు వచ్చాయని నకిలీ ఐడీ కార్డులు, లెటర్ హెడ్లను కొనుగోలుదారుల వాట్సాప్ నంబర్లకు పంపించేవారు. అనంతరం నగదు, కారు డెలివరీ అంటూ రిజిస్ట్రేషన్ ఫీజు, డాక్యుమెంట్ చార్జీలు, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ తదితరాలు చెల్లించాలంటూ బురిడీ కొట్టించేవారు. రాంచీ, ఒడిశా కేంద్రాలుగా.. ⇔ 2020 ఆగస్టులో జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని కొకర్‌కాల్ సెంటర్, ఒడిశాలోని రూర్కెలాలో తరుణ్ కుమార్ టెలీ కాలింగ్ కార్యాలయాలు ప్రారంభించాడు. అలోక్, తిరంజల నుంచి సేకరించిన ఈ– కామర్స్ సైట్ల కొనుగోలుదారుల వివరాలను టెలీ కాలర్లకు ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసగించేందుకు తెలుగు భాష వచ్చిన టెలీ కాలర్లను, కర్ణాటక, తమిళనాడు ప్రజలను చీటింగ్ చేసేందుకు కన్నడ, తమిళం మాట్లాడేవారిని నియమించాడు. ⇔ రాంచీకి చెందిన కామ్లేష్ దూబే ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం మంచిర్యాలలోని బెల్లంపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతని స్నేహితులు యశ్వంత్‌కుమార్, సౌరభ్ పటేల్ పిలవడంతో రాంచీకి వెళ్లి వారితో చేతులు కలిపాడు. సైబర్ నేరాలు చేసే క్రమంలో తెలుగువాళ్లు అతిగాస్పందిస్తుండడంతో కామ్లేష్ దూబే సహకారంతో మంచిర్యాలకు చెందిన మచినెల్ల వెంకటేష్, గుర్రం రాకేష్, ప్రశంత్, రాజేందర్‌రెడ్డి, రాజలింగులను రాంచీకి పిలిపించుకొని టెలీకాలర్లుగా నియమించుకుని దందా సాగిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రూ.2 కోట్ల వరకు ఈ ముఠా మోసగించింది. పదిమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మంచిర్యాలకు చెందిన అయిదుగురు ఉన్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. చదవండి: ‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములకు టోకరా.. రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం -
రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ట్రేడింగ్ చేసే వ్యక్తితో పాటు అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ రూ.73 లక్షల మేర నష్టపోయారు. ఇన్వెస్టర్‌తో పాటు ఎన్ఆర్ఐ సోదరుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో రెండు కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన ఓ మహిళ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఈమె వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు కొన్నాళ్ల క్రితం ఫోన్ చేశారు. ఓ మహిళ మాట్లాడుతూ తాను ట్రేడింగ్ వ్యాపారం చేసే ఓ సంస్థ తరఫున మాట్లాడుతున్నానంటూ మాట్లాడింది. ఏ రంగాల్లో, ఎలా ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు వస్తాయో తమకు తెలుసంటూ నమ్మబలికింది. దీనికి రెండుమూడు ఉదాహరణలు చెప్పి మరీ పూర్తిగా బుట్టలో వేసుకుంది. ఆపై ట్రేడింగ్‌లో అంటూ రూ.5 లక్షలను తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. కొన్ని రోజుల పాటు అందులో, ఇందులో ట్రేడింగ్ చేస్తున్నామని, భారీ లాభాలు వచ్చాయంటూ మాటలు చెప్పింది. ఓ రోజు కాల్ చేసిన ఆ కీలేడీ’ తమ వద్ద ఉన్న ట్రేడింగ్ ఖాతాలో ఉన్న మొత్తం రూ. 4 కోట్లకు చేరిందని చెప్పింది. అది మీకు బదిలీ చేయాలంటే కంపెనీ నిబంధనల ప్రకారం ముందుగా తమకు రావాల్సిన బ్రోకరేజ్ చెల్లించాలని షరతు పెట్టింది. ఈ పేరుతో దాదాపు రూ. 60 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేసింది. ఈ మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమెరికాలో నివసిస్తున్న పాతబస్తీకి చెందిన ఓ మహిళ పేరుతో దుండగులు ఐదు క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. వీటి ద్వారా జరిపిన రూ.13 లక్షల లావాదేవీల బిల్లులు ఇక్కడుంటున్న ఆమె సోదరుడికి వచ్చా యి. పూర్వాపరాలు పరిశీలించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రవాస భారతీయురాలైన ఆ మహిళ సోదరుడు, కుమార్తె పాతబస్తీలో నివసిస్తున్నారు. కొన్నేళ్లగా అమెరికాలోనే ఉండిపోయిన ఆమె పేరుతో ఇక్కడి యాక్సస్, ఐసీఐసీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల నుంచి ఐదు క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. ఈ కార్డులు, ఓటీపీలు పంపే కవర్లు నేరుగా నేరగాళ్లకే డెలివరీ అయ్యాయి. రూ.13 లక్షలకు సంబంధించిన బిల్లులు మాత్రం ఆమె సోదరుడి చిరునామాకి చేరాయి. దీంతో తన సోదరిని సంప్రదించిన ఆయన ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. దీంతో సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ముల మృతి
సాక్షి, షాద్‌నగర్ : సరదాగా గడిపేందుకు చేపల వేటకు బయలుదేరారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు సొంత అన్నదమ్ములు.. మరో వ్యక్తి స్నేహితుడు. వీరంతా హైదరాబాద్ రహమత్‌నగర్ హబీబ్ ఫాతీమానగర్ ఫేజ్–1 బస్తీవాసులు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బోరబండకు చెందిన సొంత అన్నదమ్ములు జీషాన్(24), హన్నన్(22). వీరి స్నేహితులైన మలక్‌పేటకు చెందిన సయ్యద్ ఉబేర్(20), బంజారాహిల్స్ నివాసి హరీస్(21) ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. సెలవు రోజు సరదాగా గడపాలనుకున్నారు. తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ కర్నూలు సమీపంలోని తమ బంధువుల ఫాంహౌస్ దగ్గర చేపల వేట కోసం స్విఫ్ట్ కారులో బయలుదేరారు. షాద్‌నగర్ సమీపంలోని అనూస్ పరిశ్రమ ఎదురుగా జాతీయ రహదారిపై వీరి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఎక్కి అవతలి వైపు బెంగళూరు వైపు నుంచి కారు విడిభాగాల లోడుతో నగరానికి వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ప్రమాదంలో అన్నదమ్ములైన జీషాన్, హన్నన్‌తోపాటు సయ్యద్ ఉబేర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన హరీస్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు షాద్‌నగర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతులు అవివాహితులని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రూ.48 లక్షల ‘చమురు’ వదిలింది!
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు ప్రత్యేకమైన ఆయిల్ ఎగుమతి చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ నగర యువతికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.48 లక్షలు స్వాహా చేశారు. ఎట్టకేలకు మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెస్ట్‌జోన్ పరిధిలోని సంజీవ్‌రెడ్డినగర్‌కు చెందిన యువతి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం గానుగ నూనె వ్యాపారం చేస్తోంది. తన విక్రయాలకు సంబంధించి ఆమె ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో ప్రకటన పోస్టు చేశారు. దీనిని చూసి ఆమెకు ఫోన్ చేసిన సైబర్ నేరగాడు ఘనా దేశంలోని వెస్ట్ ఇన్విస్ట్ అనే కంపెనీలో పని చేస్తున్న జాన్సన్‌గా పరిచయం చేసుకున్నాడు. తమ సంస్థ నిత్యం భారత్ నుంచి భారీగా ప్రత్యేకమైన ఆయిల్స్ ఖరీదు చేస్తుందని, దాని వివరాలు తెలిసినా పెట్టుబడిలేక తానేం చేయలేకపోతున్నానని చెప్పాడు. ‘విగా గార్లిక్ లిక్విడ్’గా పిలిచే ఆ ఆయిల్‌ను ఢిల్లీలో తయారు చేస్తున్నారని నమ్మించాడు. వారి వద్ద ఖరీదు చేసి తమ కంపెనీకి విక్రయిస్తే భారీ లాభాలు వస్తాయని చెప్పాడు. సదరు ఢిల్లీ కంపెనీ వారికి మీ నంబర్ ఇచ్చానని, వారే సంప్రదిస్తారంటూ యువతికి చెప్పాడు. ఆ మరుసటి రోజు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్న విజయ అనే మహిళ కాల్ చేసింది. ‘జాన్సన్ మీ వివరాలు పంపించాడంటూ చెప్పి తమ వద్ద విగా గార్లిక్ అయిల్ లీటర్ 6 వేల డాలర్ల (రూ.4.34 లక్షలు) రేటు ఉందని, సగం అడ్వాన్సుగా చెల్లించాలని చెప్పింది’. తొలుత రూ.4.5 లక్షలు చెల్లించిన బాధితురాలు ఓ లీటర్ ఖరీదు చేసింది. దానిని కొరియర్ ద్వారా అందుకున్న ఆమె పరీక్షలు చేయించాలంటూ జాన్సన్ చెప్పడంతో అతడు సూచించినట్లే ఢిల్లీ వెళ్లి కోపి అనే నైజీరియన్‌ను కలిసింది. అయితే పరీక్షలు నిర్వహించడానికి కనిష్టంగా 10 లీటర్లు ఉండాలంటూ అతడు నమ్మబలికాడు. దీంతో మరికొంత మొత్తం చెల్లించిన బాధితురాలు పది లీటర్ల ఆయిల్ ఖరీదు చేసింది. దీనిని పరీక్షించడానికి ఒడిశాకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పిన నేరగాళ్లు మరికొంత మొత్తం వసూలు చేశారు. ఇలా దఫదఫాల్లో రూ.48 లక్షలు చెల్లించిన, జీఎస్టీ తదితర బిల్లులు సైతం తీసుకున్న బాధితురాలికి అనుమా నం వచ్చింది. తన అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ఒడిశా వెళ్లి ఆరా తీయగా మోసంగా తేలింది. అంతా ఓ ముఠాగా ఏర్పడి తన ను మోసం చేశారని గుర్తించిన ఆమె సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ బి.రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. -
విషాదం: కాసేపట్లో ఇంటికి చేరతామనగా
సాక్షి, అల్వాల్: మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం పొట్ట కూటి కోసం పరాయి దేశం నుంచి వచ్చిన భార్యాభర్తల ఉసురుతీసింది. రోజంతా శ్రమించిన ఆ జంట రెండు నిమిషాల్లో ఇంటికి చేరతామనగా అర్ధంతరంగా తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన ఆదివారం రాత్రి అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేపాల్‌లోని డాంగ్ జిల్లా పప్పారి గ్రామానికి చెందిన రూమ్‌లాల్ బండారి (40) మీనాదేవి బండారి (35) ఏడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. వీరి బంధువు బలరామ్ సునార్ సైతం వీరితో కలిసే ఉంటున్నాడు. అల్వాల్ ప్రాంతంలోని దేవుని అల్వాల్ శివాలయం రోడ్డులో స్థిరపడిన ఈ ముగ్గురూ స్థానికంగా పాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. గత ఏడాది లాక్డౌన్లో వీరి వ్యాపారం మూతపడగా.. కొన్ని నెలలు స్వదేశానికి వెళ్లిపోయారు. ఇటీవలే తమ ఇద్దరు పిల్లల్ని తన తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టిన రూమ్‌లాల్ భార్య, బంధువుతో కలిసి తిరిగి అల్వాల్ వచ్చాడు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన వ్యాపారం ముగించుకున్న ముగ్గురూ నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. దేవుని అల్వాల్ శివాలయం రోడ్డు మూల మలుపు వద్దకు వచ్చిన వీరిని వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాస్త దూరంగా ఉన్న వీరి బంధువు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరతారనగా ప్రమాదం బారినడపటం, స్వదేశంలోని వీరి పిల్లలు అనాథలు కావడంతో ఇక్కడి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ టిప్పర్‌ను నిర్లక్ష్యంగా నడిపాడని, మలుపు వద్ద ఎదురుగా వచ్చిన ప్యాసింజర్ ఆటోను తప్పించే ప్రయత్నం చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సడన్ బ్రేక్ వేయడం, లారీలో సగం మొరం లోడు ఉండటంతో అదుపుతప్పి ఎడమ వైపునకు పడిపోయిందని వివరిస్తున్నారు. ఫలితంగా రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్న భార్యాభర్తలు మృత్యువాతపడ్డారని పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు ఈసీఐఎల్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ కె.నర్సింహ్మను (59) అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించగా బీఏసీ కౌంట్ 165గా వచ్చింది. వయోభారంతో ఉన్న ఇతడి డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను ఆరా తీయాలని అధికారులు నిర్ణయించారు. నర్సింహ్మను అరెస్టు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తుపాకీ గురిపెట్టి.. కత్తితో బెదిరించి స్మార్ట్ఫోన్ల స్క్రీన్లపై ఎక్కువ సేపు కరోనా! -
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి
సాక్షి, మూసాపేట (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో దంత విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని గుల్బర్గలో కడపకు చెందిన రేష్మ (20) దంత కళాశాలలో చదువుతోంది. కుటుంబసభ్యులు కాశీ యాత్రకు వెళుతుండటంతో కడపకు బయలుదేరింది. మధ్యలో కేపీహెచ్‌బీ కాలనీ అడ్డగుట్ట కాలనీలోని ఉమెన్స్ హాస్టల్స్‌లో ఉన్న శ్రీజను కలవడానికి శుక్రవారం వచ్చింది. శనివారం రాత్రి శ్రీజ, మమత, అజయ్‌సింగ్, శ్రావణ్కుమార్లతో కలిసి మదీనాగూడలో ఉన్న జీఎస్ఎం మాల్లో సినిమా చూడటానికి వెళ్లింది. రాత్రి సినిమా ముగిసిన తరువాత రేష్మ స్కూటీపై కేపీహెచ్‌బీకాలనీకి వస్తున్నారు. కేపీహెచ్‌బీకాలనీకి వస్తుండగా మధ్యలో మెట్రో పిల్లర్ 660, 661 వద్ద పక్క నుంచి ఇంకో వాహనం వేగంగా వెళ్లింది. దీంతో రేష్మా అదుపు తప్పి కిందపడిపోయింది. వెనకే వస్తున్న లారీ ముందు టైరు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. లారీ డ్రైవర్ కృష్ణ అక్కడే లారీని వదిలేసి పారిపోయాయడు. స్కూటీ ఇచ్చినందుకు అజయ్‌కుమార్, లారీ డ్రైవర్ కృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దారుణం: యువతికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్) (అధికారుల చేతివాటం.. ఓ మహిళా రైతు రూపంలో.. ) -
డబ్బు వివాదం: కుటుంబంతో కలిసి భర్త హత్య
సాక్షి, జిన్నారం(పటాన్చెరు): డబ్బుల విషయంలో వివాదంతో అయినవారే అంతమొందించిన సంఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ముళ్లపొదల్లో పడేసి కాల్చేసిన కేసును పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించడం విశేషం. వివరాలను డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న విజయ్‌సింగ్ (42), మల్లీశ్వరి దంపతులు. 16 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి 14ఏళ్ల కుమార్తె ఉంది. విజయ్‌సింగ్ తన కుమార్తె పేరుపై రూ.లక్షను బ్యాంక్‌లో ఫిక్స్డ్ చేశాడు. నామినీగా మల్లీశ్వరిని ఉంచాడు. నెల రోజుల క్రితం భర్తకు తెలియకుండా మల్లీశ్వరి బ్యాంక్‌లో ఉన్న రూ.లక్షను తెచ్చి తన తమ్ముడైన మంద కృష్ణకు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల తర్వాత విషయం విజయ్‌సింగ్‌కు తెలిసింది. తనకు తెలియకుండా డబ్బులు ఎందుకు ఇచ్చావని నిలదీయడంతో భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. అప్పుగా తీసుకున్న డబ్బును త్వరగా తిరిగిచ్చేయాలని మంద కృష్ణపై విజయ్‌సింగ్ ఒత్తిడి పెంచాడు. డబ్బు తిరిగిచ్చే పరిస్థితి లేకపోవటంతో మందకృష్ణ అక్క మల్లీశ్వరితో కలిసి విజయ్‌సింగ్‌ను హత్య చేయాలని పన్నాగం పన్నాడు. తనను కూడా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నాడని మల్లీశ్వరి, చెల్లెలు తలారి పద్మ, తల్లి మంద లక్ష్మితో కలిసి పథకం వేశారు. ఆదివారం రాత్రి విజయ్‌సింగ్‌కు ఎక్కువగా మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లిన తర్వాత నలుగురూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. రాత్రి 12 గంటల తర్వాత హృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్డు సమీపంలోని ఓ ముళ్ల పొదలో పడేసి తగులబెట్టారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి విచారణ సాగించగా వారు నేరం అంగీకరించారు. ఈ మేరకు నలుగురినీ రిమాండ్‌కు తరలించారు. హత్య ఉదంతం వెలుగు చేసిన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. విలేరుల సమావేశంలో సీఐ ప్రశాంత్, ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మాయిగా ఫేక్ ప్రోఫైల్: సుమంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిలను లోబరుచుకునేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న సుమంత్‌ను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... నకిలీ ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రోఫైల్‌తో అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సుమంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు సుమంత్ విజయవాడకు చెందిన వాడని, హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటూ అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి అయ్యిందంటే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అమ్మాయిలా మారిపోయి మిగతా అమ్మాయిలతో చాటింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడని, ఇంటర్నెట్ నుంచి యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వాటితో నకిలీ ప్రోఫైల్ క్రియోట్ చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: లైంగిక వేధింపులు: అతడు ఆమెగా..) ఇలా అమ్మాయి మాదిరిగా వాళ్లతో చాటింగ్ చేయడంతో అవతల వాళ్లు కూడా అమ్మాయి అనుకొని క్లోజ్‌గా మాట్లాడేవారన్నారు. ఈ క్రమంలో వారంతా తమ బలహినతలను నిందితుడితో చెప్పుకోవడం చేశారని, అది ఆయుధం చేసుకున్న నిందితుడు వారిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించేవాడన్నారు. అమ్మాయిల అశ్లీల ఫొటోలను నెట్‌నుంచి డౌన్లోడ్ చేసి అవి వారికి పంపించి బ్లాక్మెయిల్ చేస్తూ నిందితుడు సుమంత్ కామావాంఛలు తీర్చుకునేవాడని తెలిపారు. కాగా ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు అధికం అవుతున్నాయని, ఇలాంటి వారిని గుర్తించడం కష్టం అన్నారు. యువత అపరిచితులతో చాటింగ్ చేయకూడదని, చాలా జాగ్రత్తలు పాటించడం మంచిదని ఏసీపీ హెచ్చారించారు. -
మెయిల్ ఓపెన్ చేస్తే జేమ్స్ అధీనంలోకి వెళ్లడమే!
సాక్షి, గచ్చిబౌలి: నైజీరియాలో సూత్రధారి..ముంబైలోని మీరా రోడ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన పాత్రధారులు కలిసి 2011 నుంచి దేశ వ్యాప్తంగా సిమ్ స్వాపింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ పంజా విసిరిన ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. తమ పరిధిలో నమోదైన రెండు నేరాల్లో ఈ గ్యాంగ్ రూ.11 లక్షలు స్వాహా చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. వీరి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, రబ్బరు స్టాంపులు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జనార్ పూర్తి వివరాలు వెల్లడించారు. ⇔ ముంబయ్‌లోని మీరా రోడ్‌కు చెందిన అశి్వన్ నారాయణ్ షరేగర్ అక్కడ ఓ డాన్సింగ్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతగాడికి అనేక మంది నైజీరియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళల్లో నేరాలు చేసే వారికి సహకరించడానికి మీరా రోడ్ వాసులు పరిచయం చేస్తుండేవాడు. ⇔ ఒకప్పుడు ముంబైలో ఉండి, ఇప్పుడు నైజీరియాలో ఉంటున్న జేమ్స్‌ను మీరా రోడ్‌కు చెందిన చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లేతో పరిచయం చేశాడు. వీరిద్దరితో పాటు జమీర్ అహ్మద్ మునీర్ సయీద్, షోయబ్ షేక్, ఆదిల్ హసన్ అలీ సయీద్, జునైద్ అహ్మద్ షేక్‌లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ఇలానే పశి్చమ బెంగాల్లోనూ ఓ ముఠా పని చేస్తోంది. ⇔ జేమ్స్ అక్కడ ఉంటూనే దేశంలోని వివిధ నగరాలకు చెందిన సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ఇంటర్నెట్ నుంచి సంగ్రహిస్తాడు. వాటిని ఐటీ రిటన్స్ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపుతాడు. వీటిని అందుకునే సంస్థలు తెరిచిన వెంటనే మాల్వేర్ వాళ్ళ కంప్యూటర్/ఫోన్లోకి ప్రవేశిస్తుంది. దీంతో అది పరోక్షంగా జేమ్స్ ఆదీనంలోకి వెళ్ళిపోతుంది. ⇔ ఆపై వాటిలో ఉన్న ఈ–మెయిల్స్ తదితరాల్లో వెతకడం ద్వారా వారి అధికారిక సెల్‌ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, బ్యాంకు లావాదేవీలను తెలుసుకుంటారు. ఈ వివరాలను అతడు వాట్సాప్ ద్వారా చంద్రకాంత్‌కు పంపిస్తాడు. వీటి ఆధారంగా ఇతగాడు తనకు ఆయా సర్వీస్ ప్రొవైడర్ కార్యాలయాల్లో ఉన్న పరిచయాలను వినియోగించి ఆ బ్యాంకు ఖాతాలతో లింకై ఉన్న ఫోన్ ⇔ ఈ వివరాలను వినియోగించే చంద్రకాంత్ నకిలీ ఆధార్ వంటి గుర్తింపుకార్డులు తయారు చేస్తాడు. ఈ గుర్తింపు కార్డులపై పేర్లు అసలు యజమానివే ఉన్నప్పటికీ... ఫొటోలు మాత్రం జమీర్ లేదా ఆదిల్వి ఉంటాయి. వీటితో పాటు ఆయా సంస్థల పేరుతో నకిలీ లెటర్ హెడ్స్, స్టాంపులు, సీళ్ళు కూడా చంద్రకాంత్ రూపొందిస్తాడు. వీటిని ఒకప్పుడు జమీర్‌కు ఇచ్చి సరీ్వస్ ప్రొవైడర్లకు చెందిన స్టోర్స్‌కు పంపేవాడు. ⇔ గతంలో కోల్‌కతా ముఠాతో పాటు అతడు అరెస్టు కావడంతో ఇప్పుడు ఆ బాధ్యతల్ని జునైద్, ఆదిల్ నిర్వర్తిస్తున్నాడు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టోర్స్‌కు తిరిగే వీళ్ళు ఎక్కడో ఒక చోట నుంచి సిమ్‌కార్డు తీసుకుంటారు. తమ చేతికి చిక్కిన సిమ్‌ను చంద్రకాంత్‌కు అప్పగిస్తారు. ఇతడు ఈ వివరాలను జేమ్స్ వాట్సాప్ ద్వారా చేరవేస్తాడు. మరోపక్క షోయబ్ షేకర్, అష్విన్లు బోగస్ పేర్లు, వివరాలతో భారీగా బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వీటి వివరాలనూ చంద్రకాంత్ ద్వారా జేమ్స్‌కు పంపిస్తారు. ⇔ తన వద్ద ఉన్న నకిలీ సిమ్‌కార్డుల్ని చంద్రకాంత్ తక్కువ రేటుతో కొనుగోలు చేసే ఫోన్లలో వేసుకుంటాడు. ఈ తతంగం మొత్తం అంతర్జాతీయ ముఠా కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే చేస్తోంది. ఆ రోజుల్లో రాత్రి పూట జేమ్స్ ఆ ఫోన్ నెంబర్లతో లింకై ఉన్న బ్యాంకు ఖాతాల ఇంటర్నెట్ బ్యాకింగ్లోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఖాతా నెంబర్ తదితర వివరాలతో పాటు ఫోన్ నెంబర్ తన వద్ద... సిమ్ కార్డు చంద్రకాంత్ ఫోన్లో సిద్ధంగా ఉంటుంది. నెట్ బ్యాంకింగ్‌లో పాస్వర్డ్ మార్చి.. ⇔ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి జేమ్స్ దాని పాస్వర్డ్ మార్చేస్తాడు. అందుకు అవసరమైన పిన్ను తన వద్ద ఉన్న ఫోన్ నెంబర్‌కు అందుకునే చంద్రకాంత్ తక్షణం వాట్సాప్ ద్వారా జేమ్స్‌కు చేరవేస్తాడు. ఇలా పాస్వర్డ్ మార్చే అతగాడు ఆ బ్యాంకు ఖాతాను యాక్సస్ చేస్తూ అందులో ఉన్న మొత్తాన్ని రెండుమూడు దఫాల్లో చంద్రకాంత్ అందించే నకిలీ ఖాతాల్లోకి జమ చేస్తాడు. తాము తెరిచిన నకిలీ ఖాతాల్లోకి వచ్చే ఈ మొత్తాలను అషి్వన్, షోయబ్ డ్రా చేసి చంద్రకాంత్‌కు ఇస్తారు. ⇔ వీళ్ళు, చంద్రకాంత్ 50 శాతం కమీషన్లు తీసుకుంటూ మిగిలిన మొత్తాన్ని హవాలా లేదా బిట్కాయిన్ల ద్వారా జేమ్స్‌కు పంపింస్తాడు. ఈ అంతర్జాతీయ గ్యాంగ్ గత ఏడాది జూన్, అక్టోబర్‌ల్లో సైబరాబాద్ పరిధిలో ఉండే రెండు కంపెనీలకు చెందిన ఖాతాలను టార్గెట్ చేశారు. వాటి నుంచి రూ.11 లక్షలు ఇమ్మీడియట్ మొబైల్ పేమెంట్ సరీ్వసెస్ (ఐఎంపీఎస్) ద్వారా నకిలీ బ్యాంకు ఖాతాల్లోకి మార్చి స్వాహా చేశారు. ⇔ దాదాపు ఆరు నెలల పాటు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలుమార్లు ముంబై వెళ్ళివచ్చారు. ఎట్టకేలకు జేమ్స్, షోయబ్ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. -
బంజారాహిల్స్‌లో దారుణం.. కూతుళ్లపై కన్న తండ్రే
సాక్షి, బంజారాహిల్స్: కన్నతండ్రి కూతురిపాలిట కామాంధుడయ్యాడు. మూడేళ్లుగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ ఎవరికైనా ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లోని బోలానగర్ ఫస్ట్‌లాన్సర్‌లో నివసించే విద్యార్థిని(18)పై ఆమె తండ్రి(42) గత కొంతకాలంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు గత డిసెంబర్ 29న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు గాలింపు చేపట్టి ఆమెను జనవరి 5న ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయావని సోదరి నిలదీయడంతో మహ్మద్ కరీం అనే వ్యక్తి తనను తీసుకెళ్లాడని.. రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పింది. అంతేగాక తండ్రి కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. మూడేళ్లుగా తన సోదరిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, తనపై కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఇద్దరం తండ్రి బాధితులమేనని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వివాహేతర సంబంధం: భర్త దారుణ హత్య
సాక్షి, పంజగుట్ట: ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది. సోమవారం పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బిహార్‌కు చెందిన లక్ష్మణ్ ఝా, ఖుష్బూ దంపతులు మక్తా, రాజ్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాత్రి వేళ సెక్యూరిటీ గార్డుగా, పగలు జ్యూస్‌షాపు నడుపుతూ లక్ష్మణ్ జీవనం సాగిస్తున్నాడు. దీంతో న్యూరాలజీ సమస్య వచ్చింది. ఇతని జ్యూస్ సెంటర్ వద్ద లక్ష్మణ్ దూరపు బంధువు లాల్‌బాబు పనిచేస్తుంటాడు. లక్ష్మణ్‌కు మధ్యాహ్నం టిఫిన్ ఇచ్చేందుకు ఖుష్బుదేవి వస్తుండేది. ఈ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. లాక్డౌన్ అనంతరం లాల్‌బాబు మరోచోట పనిచేయడం ప్రారంభించాడు. అయినా వీరి మధ్య బంధం కొనసాగింది. దీంతో లక్ష్మణ్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్ పడుకున్నాక లాల్‌బాబు ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి లక్ష్మణ్ చేతులు కట్టేశారు. ఖుష్బుదేవి లక్ష్మణ్ ఛాతీపై కూర్చుని చున్నీ మెడకు బిగించి ఇద్దరూ కలిసి గట్టిగా నొక్కి చంపేశారు. ఉదయం లక్ష్మణ్ సోదరుడికి ఖుష్చుదేవి ఫోన్ చేసి నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. మెడపై గాట్లు చూసి అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. -
నిమ్స్‌లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, పంజగుట్ట: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి నిమ్స్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నిమ్స్ ఆసుపత్రి మిలీనియం బ్లాక్ వెనకభాగంలో పార్కింగ్ వద్ద ఉన్న చెట్టుకు సోమవారం ఉదయం ఓ వ్యక్తి లుంగీతో ఉరివేసుకొని వేలాడుతుండటం స్థానికులు గుర్తించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పంజగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. ఆధారాలకోసం చూస్తే ఎలాంటి గుర్తింపు కార్డులు కనిపించలేదు. అతని వయస్సు సుమారు (45) ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: పెళ్లి కావడం లేదని.. మాట్లాడితే మర్డరే ! సాక్షి, సిటీబ్యూరో: సిటీతో పాటు శివార్లలో వరుసగా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. పూటకోచోట విచ్చుకత్తుల వేట చోటు చేసుకుంటుండటంతో అంతా ఉలిక్కిపడుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో ఎనిమిది హత్యలు జరగడంతోపాటు కొన్ని వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల పాటు ఒకే రోజు రెండేసి చొప్పున బయటపడ్డాయి. తాజాగా ఆదివారం రాజేంద్రనగర్‌లో రెండు దారుణ హత్యలు బయటపడ్డాయి. కొన్ని కేసుల్లో నిందితులు చిక్కగా... మరికొన్నింటిలో గుర్తించాల్సి ఉంది. చదవండి: విద్యార్థినిపై మాజీ ఎమ్మెల్యే లైంగిక దాడి! తిన్న వాటికి డబ్బు అడిగినందుకు.. షాకబ్ అలీ కేపీహెచ్‌బీ ప్రాంతంలో తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. ఈ నెల 4న ఇద్దరు వ్యక్తులు ద్రాక్షలు తిని, పైనాపిల్ కొన్నారు. కొన్న దానికే డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుండగా... తిన్న వాటికీ డబ్బు అడిగాడు. దీంతో ఇద్దరూ కలిసి అతడిపై దాడి చేయడంతో చనిపోయాడు. అదే రోజు కూకట్‌పల్లిలోని చెరువులో పూల వ్యాపారి కృష్ణ మృతదేహం లభించింది. ఎక్కడో చంపేసిన దుండగులు గోనె సంచిలో కట్టి తీసుకువచ్చి చెరువులో పడేశారు. మద్యం మానమన్నందుకు... కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్ పరిధిలో స్రవంతితో వెంకటేశ్వర్లు ఏడాదిగా సహజీవనం చేస్తున్నాడు. ఈమెను ఐదున హత్య చేసిన వెంకటేశ్వర్లు డబ్బాలో పార్సిల్ చేసి మృతదేహం మాయం చేయాలని భావించాడు. అది సాధ్యం కాకపోవడంతో తన సొంత ఇంటిలోనే మృతదేహాన్ని వదిలి పారిపోయాడు. మద్యం తాగవద్దని పదేపదే చెప్పడంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ నెల 5న ఈ దారుణం జరిగింది. తాగేందుకు డబ్బు ఇవ్వలేదని... ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే సంతోష్ మద్యానికి బానిస అయ్యాడు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఈ నెల 9న తన తల్లి సంగీతను దారుణంగా చంపేశాడు. ఒకే రోజు మరో రెండు... ఆదివారం నగర శివార్లలో రెండు హత్యలు వెలుగు చూశాయి. డబ్బు కోసం బెదిరిస్తుండటం, ఒకరి సోదరికి వేధిస్తుండటంతో ఇద్దరు పాత నేరగాళ్ళు తమ స్నేహితుడు రియాజ్‌ను హత్య చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘాతుకంలో మృతదేహాన్ని సూట్‌కేసులో తెచ్చి రాజేంద్రనగర్ డెయిరీ ఫామ్ వద్ద పడేశారు. ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రాత్రి 11.45 గంటలకు మరో ఘోరం చోటు చేసుకుంది. అప్పుగా తీసుకున్న రూ.11 లక్షలు, వడ్డీ కోసం ఒత్తిడి చేస్తూ, హోటల్ తన పేరుతో రాసి ఇవ్వమని డిమాండ్ చేస్తుండటంతో ఎంఐఎం నేత ఖలీల్‌ను హతమార్చారు. ఇతడి వద్ద అప్పుతీసుకున్న హోటల్ యజమాని, అతడి వద్ద పని చేసే ఇద్దరితో కలిసి హత్య చేశారు. జూబ్లీహిల్స్, మియాపూర్ పోలీసుస్టేషన్ల పరిధి నుంచి అదృశ్యమైన ఇద్దరు ఈ నెల 7న శవాలుగా తేలారు. జూబ్లీహిల్స్‌లో పని చేసే వెంకటమ్మ గత నెల 30న బయటకు వెళ్ళింది. ఈమె మృతదేహం ఘట్కేసర్లో కాలిన స్థితిలో కనిపించింది. జనప్రియ కాలనీ నుంచి ఏటీఎంకి అంటూ వెళ్ళిన రామకృష్ణ మృతదేహం ఖైత్లాపూర్ డంపింగ్ యార్డ్‌లో దొరికింది. దుండగులు ఒక చెవి, కుడి చేతి రెండు వేళ్ళు కోసేశారు. చట్టం కఠినంగా మారాలి.. అందరిలో మార్పు రావాలి వర్తమాన పరిస్థితులతో పాటు సినిమా ప్రభావంతో ఇటీవల కాలంలో యువతలో యాంటీ సోషల్ పర్సనాలిటీ పెరుగుతోంది. ఈ కారణంగానే చిన్న కారణాలకు చంపేసే వరకు వెళ్తున్నారు. మరోపక్క మద్యానికి బానిసైన వాళ్ళు ఆ మత్తు కోసమూ ఘాతుకాలు చేస్తున్నారు. మత్తు, ఆస్తి కోసమూ అనుమానంతోనో తమ వాళ్ళనే అంతం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగే ఘర్షణల్లో ఎదుటి వారు చనిపోతుండటంతో అవి సాంకేతిక హత్యలుగా మారుతున్నాయి. చట్టం మరింత కఠినంగా మారడంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తేనే ఈ పరిస్థితులు మారేది. – డాక్టర్ రాజశేఖర్, మానసిక నిపుణులు -
సోఫియాను అంటూ హైదరాబాద్ వ్యక్తికి కాల్..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్‌ల పేరుతో అమాయకులకు గాలం వేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. నైజీరియా, ఘనా తదితర దేశాలకు చెందిన ఎక్‌పాల్‌గడ్‌స్టీమ్, అడ్జల్, కిక్కి కాన్ఫిడెన్స్ దావిద్, పి. క్రోమవోయిబో, ఎజిటర్ డానియల్ కొంత కాలంగా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చారు. ఢిల్లీలో మకాం వేసిన వీరు ‘డింగ్ టోన్’ యాప్ ద్వారా అబ్బాయిలతో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన యువకుడికి సోఫియా అమ్మాయి పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మీ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నామని మెసేజ్ పంపారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో లాండ్ అయ్యానని, తన వద్ద 75 వేల విదేశీ కరెన్సీ, గోల్డ్ చైన్, మొబైల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులు ఉన్నాయని, వాటికి సంబందించి కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని చెబుతూ బాధితుడితో డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని మల్కాజిగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు సీపీ తెలిపారు. నిందితుల ఆటకట్టించిన రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ యాదగిరి, అడిషనల్ క్రైమ్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్‌లను సీపీ అభినందించారు. -
కిలాడి లేడీ అరెస్ట్: రూ 8 కోట్లకు టోకరా
సాక్షి, పంజగుట్ట: ఓ వ్యక్తిని సుమారు రూ.8 కోట్ల మేర మోసం చేసిన కేసులో మహిళను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌భవన్ రోడ్డులోని సేథీ టవర్స్‌కు చెందిన పి.విజయ్ ఎన్.రాజు ఇన్వెస్టర్. 2013లో అతని వద్దకు కూకట్పల్లి, వసంత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస రాజు, కేపీహెచ్‌బీకి చెందిన సామల పద్మజ, ఆమె భర్త సామల నర్సిరెడ్డి, సోదరి విజయలక్ష్మి, సురేష్‌బాబులు వచ్చారు. పద్మజ తమకు గోపనపల్లిలోని సర్వేనెంబర్ 124/2 నుండి 124/5 వరకు 6.20 ఎకరాల స్థలం ఉందని, ఆ స్థలంలో విల్లాల నిర్మాణం చేపడతామని చెప్పారు. సదరు స్థలంపై బ్యాంకులో రుణం ఉందని, ఆ రుణం మీరు తీరిస్తే మీకు రెండున్నర ఎకరాల స్థలం ఇస్తామని చెప్పారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారు. దీంతో బ్యాంకుకు సుమారు రూ.5 కోట్లు చెల్లించడమే కాకుండా, రూ.3 కోట్లు వారివద్ద ఇన్వెస్ట్ చేశాడు. వారు బ్యాంకు నుంచి కాగితాలు తీసుకున్నారు. ఆ స్థలంలో విల్లాల నిర్మా ణం చేయకపోగా ఇస్తామన్న రెండున్నర ఎకరాలు కూడా ఇవ్వకుండా మోసం చేశా రు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి పంజగు ట్ట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు సామల పద్మజ మిగిలిన వారిపై కేసు నమోదు చేశారు. గోవాలో ఉన్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపి సామల పద్మజను అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
లోన్ యాప్.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి
సాక్షి, బెంగళూరు: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్‌కు పాల్పడిన లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో యువతిని అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎన్యూ టెక్నాలజీస్ సంస్థ హెచ్ ఆర్ విభాగం మేనేజర్ కీర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ సంస్థకు హెడ్‌గా వ్యవహరించిన సూత్రధారి నాగరాజు సోదరుడు ఈశ్వర్‌ను గత వారమే అరెస్టు చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న కీర్తి కోసం గాలించిన ప్రత్యేక బృందం ఆదివారం పట్టుకోగలిగింది. ఈ ద్ఙారుణ’ యాప్స్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన, ఇండోనేషియా కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన చైనీయురాలు యాన్ యాన్ అలియాస్ జెన్నీఫర్‌తో ఈమె నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఆమెతో వాట్సాప్ ద్వారా తరచు సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంటున్నారు. (చదవండి: లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు) లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో ఇప్పటి వరకు 28 కేసులు నమోదు కాగా... చైనీయుడితో సహా 17 మందిని అరెస్టు చేశారు. 27 బ్యాంకు ఖాతాలతో సహా వర్చువల్ ఖాతాల్లో ఉన్న రూ.100 కోట్లకు పైగా మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. ఈ లోన్ యాప్స్‌కు ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరుల్లో ఉన్న మరికొన్ని కంపెనీలతోనూ లింకులు ఉన్నట్లు గుర్తించారు. వాటి వ్యవహారాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. వీటి ఏర్పాటులో కీలకమైన చైనీయులు వివిధ నగరాల్లో ట్రాన్స్‌లేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు, బ్యాంకు ఖాతాల తెరవడం తదితర సందర్భాల్లో వీరి సేవల్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌లేటర్ ఇంద్రజిత్‌ను గుర్తించిన పోలీసులు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వారి ఆచూకీ కనిపెట్టి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించారు. వీరి ద్వారా చైనీయులు కార్యకలాపాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: ఇన్స్టంట్ లోన్స్‌తో ఈ అనర్థాలు తప్పవు) -
మలక్‌పేట్‌లో కారు బీభత్సం.. వృద్దుడిపై కేసు
సాక్షి, హైదరాబాద్: మలక్ పేట్ డీమార్ట్ ఎదురుగా కారు బీభత్సం సృష్టించింది. 72 ఏళ్ల వృద్ధుడు హోండా సిటీ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సమీపంలోని ఓ టీ కొట్టులోకి దూసుకెళ్లాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో కారు డ్రైవింగ్ చేసిన వృద్ధుడు రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన కారు; చితకబాదిన స్థానికులు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గురువారం అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వైపు వస్తున్న కారు రహదారిపై ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా ప్రమాదానికి కారణం అయిన కారులోని వ్యక్తులను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దాదాపు రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. చదవండి: కలెక్టర్ కారును ఢీ కొట్టిన లారీ -
ఇంటి దొంగలను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర ఇంటి దొంగలను శంషాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లాక్డౌన్లో తరచూ దొంగతనాలకు పాల్పడిన పఠాన్ చాంద్ బాషా, సబేర్‌లను అనే ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని 20 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ గుల్భార్గాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. లాక్డౌన్లో మార్చి నుంచి జూలై వరకు వీరిద్దరూ 15 నేరాలకు పైగా పాల్పడ్డారని, ఇది వరకే వీరిపై తెలంగాణలో 15 పైగా కేసులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు పేర్కొన్నారు. దొంగతనాలకు చాంద్ బాషా స్కేచ్ వేయగా.. దొంగలించిన సోత్తును సాబేర్ డిస్పోస్ చేసేవాడని విచారణలో నిందితులు పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో వారు తాండూరు వద్ద నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇక గుల్బర్గ హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడుకు వచ్చి దొంగతనాలకు పాల్పడేవారని, ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్‌లో తరచూ నిందితులు నేరాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. -
ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఆత్మహత్య
సాక్షి, చిలకలగూడ : కుటుంబ సమస్యల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడగా, బెడ్రూంలో బలవన్మరణం పొందాడు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బౌద్ధనగర్ డివిజన్ అంబర్‌నగర్‌లో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ అంబర్‌నగర్‌కు చెందిన తిరుమల వెంకటేష్ (30), దండె భార్గవి (24) భార్యాభర్తలు. 2015లో వీరికి వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె మోక్షశ్రీ, మూడు నెలల కుమారుడు అన్విక్లున్నారు. పుత్లిబౌలిలోని విద్యుత్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్‌గా వెంకటేష్, కృష్ణజిల్లా జగ్గయ్యపేట పోస్ట్‌ఆఫీస్‌లో పోస్ట్‌ఉమెన్‌గా భార్గవి పనిచేస్తున్నారు. వెంకటేష్ తల్లి మృతి చెందడంతో తండ్రి బాలకృష్ణ మరో పెళ్లి చేసుకున్నాడు. బాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు వెంకటేష్. తన భార్య పిల్లలతో కలిసి తండ్రి ఇంటి ఎదురుగానే మరో ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు నెలవారీ జీతాలను తనకే ఇవ్వాలని, కుటుంబ పోషణ భారమవుతుందని తండ్రి బాలకృష్ణ తరచూ గొడవపడేవాడు. గతనెల 31వ తేదిన వెంకటేష్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. తనకు ఇవ్వకుండా జల్సాలు చేస్తున్నాడని భావించిన తండ్రి డబ్బు కోసం మరింత ఒత్తిడి తెచ్చాడు. దీంతో భార్యభర్తలు తీవ్ర మానసిన వేదనకు గురయ్యారు. నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు. అమ్మా నన్ను క్షమించి, పిల్లలను బాగా చూసుకో అని భార్గవి సూసైడ్‌నోట్ రాసి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య బలవన్మరణాన్ని చూసి తట్టుకోలేని వెంకటేష్ బెడ్రూం దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం మూడు నెలల బాబు గుక్కపట్టి ఏడుస్తున్నా ఇంటి లోపలి నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడం, ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో కిటికీ నుంచి లోపలకు వెల్లి చూడగా భార్యభర్తలు వేర్వేరుగా ఉరికి వేలాడుతు కనిపించారు. మృతుల కుటుంబసభ్యులు ఒకరినొకరు దూషించుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, సెక్టార్ ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డిలు ఘటనస్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. వెంకటేష్ కుటుంబసభ్యులైన తిరుమల బాలకృష్ణ, లక్ష్మీ, రవి, సంతోష్, వజ్రమ్మ, రాణి, భాగ్యలే తన కుమార్తె, అల్లుడు ఆత్మహత్యకు కారణమని మృతురాలు భార్గవి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు, కోడలును డబ్బులు కోసం వేధించలేదని, ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదని మృతుడు వెంకటేష్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. -
బాలికపై యువకుడి లైంగిక దాడి
-
బాలికపై యువకుడి అకృత్యం
సాక్షి, హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ రాజకీయ నాయకుడి కుమారుడైన రోహన్ అనే యువకుడు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి, బలవంతంగా నిద్ర మాత్రలు మింగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.(20 ఏళ్ల వ్యత్యాసం.. ప్రియుడితో కలిసి భర్తను) ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిని నిలదీయడంతో వారిపై కక్షగట్టాడు. తన అకృత్యం గురించి బయటపెడితే బాధితురాలిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో రోహన్ కారణంగా తమకు ప్రాణహాని ఉందంటూ బాధిత బాలిక కుటుబీకులు కుల్సుంపుర పోలీస్ స్టేషన్లో ఆగష్టు 12న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.(‘మహా నగరంలో మాయగాళ్లు’) -
నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యం
చాంద్రాయణగుట్ట: ఇంట్లో గొడవ పడిన ఓ గృహిణి నలుగురు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ కథనం ప్రకారం....నర్కీపూల్‌బాగ్‌కు చెందిన మహ్మద్ అక్బర్, షైనాజ్ బేగం (35) దంపతులు. వీరికి అఫ్రీన్ (13), రెహ్మత్ బేగం (11), మహ్మదా బేగం (9), మహ్మద్ రిజ్వాన్ (8) సంతానం. కాగా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు షైనాజ్ బేగం అత్తతో గొడవపడింది. కొద్దిసేపటికే ఇంట్లో వారికి చెప్పకుండా తన నలుగురు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి వరకు కూడా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వారి కోసం పలుచోట్ల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భర్త అక్బర్ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆచూకీ తెలిసిన వారు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో లేదా.. నం. 9490616823కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
‘ఆమె’ కోసం పాక్ నుంచి వచ్చి బుక్కయ్యాడు..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, సైబర్ క్రైమ్‌కు పాల్పడి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. కేసులో అభియోగపత్రం దాఖలై, విచారణ ప్రారంభమైనా... కోవిడ్ ప్రభావంతో దానికి బ్రేక్ పడింది. దీంతో మళ్లీ ట్రయల్ మొదలై, ముగిసే వరకు డిపోర్టేషన్ ప్రక్రియ ఆగాల్సి వచ్చింది. ‘ఆమె’ కోసం వచ్చి బుక్కయ్యాడు... నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. సదరు మహిళకు ఇద్ద రు కుమార్తెలు. పన్నెండేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఆమెకు అక్కడ పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన సదరు మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. 2011లో ఉస్మాన్ సైతం అక్రమం మార్గంలో హైదరాబాద్‌కు వచ్చాడు. సైబర్ క్రైమ్‌కు పాల్పడి అరెస్టు... ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఇతగాడు అక్రమంగా దేశంలోకి వచ్చాడని తెలుసుకున్న సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షగట్టిన ఇక్రమ్ ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్లైన్లో విక్రయించానంటూ బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానని బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు 2018 జూన్‌లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొంది పాస్‌పోర్ట్ తీసుకున్నాడని, అలాగే కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేశాడని బయటపడింది. ధ్రువీకరించిన పాక్ ఎంబసీ ఆఫీస్.. ఇతగాడిని అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ (2003–08) వరకు చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులతో పాటు పాక్ పాస్‌పోర్ట్‌నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడివద్ద ఉన్నవి బోగస్ పత్రాలని, వాస్తవానికి పాక్ జాతీయుడని నిర్థారించడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విదేశీ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఎంఈఏ పాక్‌కు లేఖ రాశారు. ఆ దేశ రాయ బార కార్యాలయం అతడు తమ జాతీయుడేనంటూ సమాధానం ఇచ్చింది. కోవిడ్‌తో ఆగిన ట్రయల్... దీన్ని ఆధారంగా చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్రమ్‌పై అభియోగపత్రాలు దాఖలు చేశారు. సాధారణంగా నేరం చేసిన వాళ్లను జైలుకు పంపి, నిరూపితం కాని వారిని బయటకు వదిలేస్తారు. అయితే ఇక్రమ్ కేసులో మాత్రం ఈ విధానం చిత్రంగా ఉంది. అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందే. ఎంఈఏ నుంచి ఈ మేరకు అందిన ఉత్తర్వుల మేరకు కోర్టులో కేసు డిస్పోజ్ అయిన వెంటనే అతడిని తీసుకువెళ్లి ఢిల్లీలోని పాక్ ఎంబసీలో అప్పగించాలని యోచించారు. అయితే ఈ ఏడాది మార్చి నుంచి కోవిడ్ ప్రభావం, లాక్డౌన్ తదితరాల నేపథ్యంలో కేసు ట్రయల్ ఆగిపోయింది. ఫలింతంగా ఇక్కమ్ రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉండిపోయాడు. కోర్టులు పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభమై, కేసు విచారణ ముగిసే వరకు ఇక్రమ్ ఇక్కడ ఉండాల్సిందే. -
కలర్ ప్రిడెక్షన్.. మనీ లాండరింగ్!
సాక్షి, సిటీబ్యూరో: ఈ– కామర్స్ సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడెక్షన్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు (ఈడీ) లేఖ రాయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ దందాలో పెద్దయెత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. వివిధ వెబ్సైట్ల ఆధారంగా దందా చేసిన దీని నిర్వాహకులు ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1100 కోట్లు టర్నోవర్ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా నగర పోలీసులు ఈడీని కోరనున్నారు. చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా తమ జాతీయుడు యా హౌను నియమించింది. గుర్గావ్ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి ఈ– కామర్స్ సంస్థల ముసుగులో గ్రోవింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్ యన్ టెక్నాలజీస్ సర్వీస్, లింక్‌యన్ టెక్నాలజీ, డాకీపే, స్పాట్‌పే, డైసీలింగ్ ఫైనాన్షియల్, హువాహు ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌ల పేర్లతో ఆర్‌ఓసీలో రిజిస్టర్ చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో వివిధ ఈ– కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్ ప్రిడెక్షన్ గేమ్‌ను వ్యవస్థీకృతంగా సాగిస్తున్నారు. ఈ గేమ్‌కు సంబంధించిన పేమెంట్ గేట్ వే అయిన పేటీఎం, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో నెట్‌బ్యాంకింగ్ ద్వారానూ చేపట్టారు. బెట్టింగ్‌కు సంబంధించిన తొలుత డాకీ పే సంస్థకు వెళుతోంది. అక్కడి నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలోకి వెళ్లినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హాంకాంగ్, సింగపూర్‌ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్లినట్లు తేల్చారు. ఇలా రూ.1100 కోట్ల టర్నోవర్‌లో రూ.110 కోట్లు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ మార్గాల్లో ఈ నగదు బీజింగ్ టీ పవర్ సంస్థ చేరినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాల నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగాల్సి ఉంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్తో పాటు ఇతర పత్రాలను అందిస్తూ ఈడీకి లేఖ రాస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన నలుగురు నిందితుల్నీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఆ తర్వాతే సమగ్ర వివరాలతో ఈడీకి అధికారికంగా సమాచారం ఇవ్వనున్నారు. -
అక్రమంగా వీసా ప్రాసెసింగ్
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి అర్హతలు, అవసరమైన అనుమతులు లేకుండా వీసా ప్రాసెసింగ్ చేస్తున్న నిందితుడిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇతడిపై గతంలోనూ కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లి వచ్చాడని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు. నగరంలోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన సికిందర్ గతంలో వీడియోగ్రాఫర్‌గా పని చేశాడు. 2012లో దుబాయ్ వెళ్లిన ఇతగాడు అక్కడ కొన్నాళ్ల పాటు పని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి వివిధ దేశాలకు చెందిన వీసాల ప్రాసెసింగ్‌పై అవగాహన వచ్చింది. దీంతో నగరానికి తిరిగి వచ్చిన తర్వాత వీసా ప్రాసెసింగ్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. 2014లో వచ్చిన సికిందర్ ఎలాంటి అర్హతలు, అనుమతులు లేకుండా ఈ దందా ప్రారంభించాడు. అనేక మందికి ఎర వేసి స్టడీ, విజిట్, బిజినెస్ వీసాలు ఇప్పించి పంపాడు. అక్రమంగా చేస్తున్న ఈ దందా నేపథ్యంలో ఇతడిపై గతంలో ఫలక్‌నుమా, ఆర్జీఐ ఎయిర్పోర్ట్, శంషాబాద్, కాలాపత్తర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టు అయిన ఇతగాడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయినా తన పంథా మార్చుకోని సికిందర్ వీసా ప్రాసెసింగ్ దందా కొనసాగించాడు. అక్రమంగా వీసా ప్రాసెసింగ్ చేస్తూ ఒక్కో వీసాకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్ఐలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో దాడి చేసి బుధవారం అరెస్టు చేశారు. నలుగురికి చెందిన పాస్‌పోర్టులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును కాలాపత్తర్ పోలీసులకు అప్పగించారు. -
ఆ రెండూ దొరక్కపోవడంతో...
నగర వ్యాప్తంగా మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా ముమ్మరమైంది. ఓ వైపు పోలీసులు, మరో వైపు ఎక్సైజ్ అధికారులు ఎడాపెడా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్తుకు బానిసైన యువకులు ‘సేఫ్ డ్రగ్స్’ వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. వీరితో పాటు ఫుట్‌పాత్‌లపై బతికే అనాథలు సైతం వీటిని వినియోగిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మత్తు కోసం ‘సేఫ్ డ్రగ్స్’ వినియోగం అధికం అవుతున్న నేపథ్యంలో నగర పోలీసు విభాగం ఈ దందాపై కన్నేసింది. అందులో భాగంగా సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం హిమాయత్‌నగర్‌కు చెందిన జయంత్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి 154 బాటిళ్ల దగ్గుమందు స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండూ దొరక్కపోవడంతో... మాదకద్రవ్యాలు.. ఇతరత్రా ఖరీదైన డ్రగ్స్ కొనలేని ‘మత్తు బానిసలు’ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ‘ఆల్టర్నేటివ్ డ్రగ్స్’లో నిద్రమాత్రలు, వైట్నర్, దగ్గు మందు ప్రధానమైనవిగా మారాయి. అయితే వైద్యులు రాసిన ప్రిస్క్రెప్షన్ లేకుండా స్లీపింగ్ పిల్స్‌ను ఖరీదు చేయడం కష్టసాధ్యం. వైట్నర్ను ఖరీదు చేయడం తేలికే అయినా వినియోగించేప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలు ఉంటాయి. దీంతో అత్యధికంగా ప్లాట్‌ఫామ్స్‌పై నివసించే అనాథలే దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. మత్తుకు బానిసవుతున్న యువత, వైట్నర్ లభించని అనాథలు దగ్గు మందు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీరికి ఈ మందులు మెడికల్ దుకాణాల నుంచే లభిస్తున్నాయి. దగ్గు కరోనా లక్షణాల్లో ఒకటైనా... నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేని అసిమ్టమ్యాటిక్ కేసులతోపాటు ఈ వైరస్ సోకిన వారు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించడం, లక్షణాలున్నా కోవిడ్ అని గుర్తించలేక కొన్ని మందులు వాడుతూ బయట సంచరించడం కూడా కారణాలనే వైద్యులు చెబుతున్నారు. కరోనా లక్షణాల్లో దగ్గు కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గతంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి మెడికల్ షాపుల యజమానులు నేరుగా మాత్రలు అమ్మవద్దని, అమ్మినా ఖరీదు చేసిన వారి వివరాలు వైద్య ఆరోగ్య శాఖకు తెలపాలని స్పష్టం చేసింది. అయినా కొందరు మెడికల్ షాపుల యజమానులు మత్తుకు బానిసైన వారికి దగ్గు మందు విక్రయించేస్తున్నారు. దారుస్సలాంలో అగర్వాల్స్ ఫార్మసీ నిర్వహిస్తున్న హిమాయత్‌నగర్‌కు చెందిన జయంత్ అగర్వాల్ ఈ మందుల్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ శుక్రవారం సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు. శృతిమించితే తీవ్ర పరిణామాలే... అత్యధిక శాతం దగ్గు మందుల్ని డెక్స్‌ట్రోమెథార్ఫిన్, కోడైన్‌లతో తయారు చేస్తారు. కోడైన్‌తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్ని కేవలం ఔషధాల తయారీకి మాత్రమే వినియోగిస్తుంటారు. ప్రధానంగా డెక్స్‌ట్రోమెథార్ఫిన్ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలు అవుతున్నారు. ఇది శృతిమించితే కిడ్నీ, కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు విపరీతంగా పెరిగిపోతాయి. కొన్నిసార్లు మెదడుకు సంబంధించిన తీవ్రరుగ్మతలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు తమ వారి వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలని, అవసరం లేకుండా దగ్గు మందుల వాడకాన్ని నిరోధించాలని పోలీసులు కోరుతున్నారు. ఎలాంటి చీటీ లేకుండా వీటిని విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై నిఘా ముమ్మరం చేశామని, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
శానిటైజర్ ఘటనలో నగరవాసి హమీద్
జీడిమెట్ల: ఏపీలోని ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన కేసులో మూలాలు హైదరాబాద్ శివారులో వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు జీడిమెట్లకు చెందిన సాలె శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ శానిటైజర్‌ను ఎలా తయారు చేయాలి అని యూట్యూబ్‌లో చూశాడు. అనంతరం ముడి సరుకులను జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో ఉన్న హమీద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న పర్ఫెక్ట్ సాల్వెంట్ షాపులో నిషేధిత రసాయనం మిథైల్ క్లోరై‡డ్తో పాటు తదితర రసాయనాలను కొనుగోలు చేశాడు. అనంతరం లాభసాటిగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నకిలీ శానిటైజర్లు సరఫరా చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో 16 మంది తాగిన శానిటైజర్ ఇక్కడ తయారయ్యిదేనని తెలుసుకుని ఏపీ పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో తేల్చేందుకు సన్నద్ధమయ్యారు. కాగా శ్రీనివాస్ ఇంటి వద్దనే శానిటైజర్ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో హమీద్ పాత్ర తేల్చేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పని చేస్తున్న ఇంటికే కన్నం..
కేపీహెచ్‌బీ కాలనీ: తాను పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిందో మహిళ. నగదుతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. మంగళవారం సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ కాలనీలోని ఇందూ ఫారŠూచ్యన్ ఫీల్డ్స్‌లో నివాసం ఉండే శ్రీకాంత్ రెడ్డి ఇంట్లో గుంటూరు జిల్లాకు చెందిన మాచర్ల మేరీ (40) పని చేస్తూ అక్కడే సర్వెంట్ క్వార్టర్లో ఉంటోంది. కొద్ది రోజులుగా ఓ బాలిక కూడా ఈమెతో పాటు పని చేస్తూ అదే క్వార్టర్లో ఉంటోంది. శ్రీకాంత్‌రెడ్డి వ్యాపారంలో వచ్చిన డబ్బును బెడ్రూంలోని కబోర్డులో దాచి పెట్టడం చూసిన వీరు పలుమార్లు కొద్ది కొద్దిగా మొత్తం రూ. 5 లక్షలు దొంగిలించారు. అంతేకాకుండా బంగారు గాజులు, రెండు బంగారు రింగులను కూడా అపహరించారు. దొంగిలించిన డబ్బుతో కొంత బంగారాన్ని కొనుగోలు చేశారు. అయితే బంగారు ఆభరణాలు పోయిన విషయమై మూడు రోజుల క్రితం శ్రీకాంత్‌రెడ్డి పని మనిషిని ప్రశ్నించగా తాను తీయలేదని చెప్పింది. అంతేకాకుండా సర్వెంట్ క్వార్టర్ ఖాళీ చేసి వెళ్లిపోయింది.దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని సోమవారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పనిమనిషి మేరీని విచారించగా నేరం చేసినట్టు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి రూ. 1.7 లక్షల నగదు, 59 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మేరీతో పాటు పని చేసిన మరో బాలికకు జువైనల్ చట్టం కింద నోటీసులు జారీ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
డ్రగ్స్ రాకెట్లో చిరువ్యాపారులు!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో మళ్లీ డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. తాజాగా ఈ రాకెట్లో చిరువ్యాపారులు భాగస్వాములు కావడం సంచలనం సృష్టిస్తోంది. నగరంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇటీవల నిర్వహిస్తున్న వరుస దాడుల్లో ముంబై కేంద్రంగా పని చేస్తున్న బడా డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టయింది. అక్రమార్కులు నగరంలోని కొందరు చిరు వ్యాపారులు, కొందరు నైజీరియన్లు, నిరుద్యోగులకు డబ్బు ఎరవేసి డ్రగ్స్ సరఫరాలో వారి సేవలను వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బోయిన్పల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో టైల్స్ వ్యాపారి హనుమాన్ రామ్ కారును తనిఖీ చేయగా.. రూ.1.20 లక్షల విలువైన ఓపియం డ్రగ్‌ను తరలిస్తున్న వైనం వెలుగుచూసింది. రాజస్థాన్‌కు చెందిన ఇతను పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జీడిమెట్లలో టైల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని ఇలా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసుల విచారణలో ఇతను వెల్లడించడం గమనార్హం. కాగా ఇటీవల కాలంలో నగరంలో తరచు నమోదవుతున్న డ్రగ్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. సిటీలోతరచు డ్రగ్స్ కలకలం.. ఇటీవల నగరంలోని తార్నాక చౌరస్తాలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు రట్టుచేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.64 లక్షల విలువ చేసే 104 గ్రాముల కొకైన్‌తోపాటు ఒక యమహా ఎఫ్‌జడ్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన జడీ పాస్కల్(35),అతని గర్ల్‌ఫ్రెండ్ ఎబిరె మోనికా(30) తార్నాక నాగార్జుననగర్‌లో ఇటీవల ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరికి ముంబై కేంద్రంగా డ్రగ్స్‌రాకెట్ నడుపుతున్న ఎరిక్,బెన్,» బెంగళూరుకు చెందిన బనార్డ్‌లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ జంట వారు సరఫరా చేసిన కొకైన్ ను గ్రాము రూ.8 వేలు చొప్పున నగరంలో పలువురికి విక్రయిస్తోంది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలకు సైతం ఈ జంట మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సెలబ్రిటీలకు సరఫరాపై అనుమానాలు.. నగరంలో సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వీఐపీలు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఇటీవల వరుసగా పట్టుబడుతున్న డ్రగ్స్ రాకెట్ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ముంబై, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బడా డ్రగ్స్ మాఫియా పలువురు నైజీరియన్లకు, చిరువ్యాపారులు, నిరుద్యోగులకు డబ్బును ఎరగా చూపి ఈ వ్యాపారంలోకి దించుతూ..నగరంలో వినియోగదారులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు స్పష్టమౌతోంది. తాజా కేసు ఇలాంటి కోవకే చెందినది కావడం గమనార్హం. ఎక్సైజ్ పోలీసులు నగరంలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటుచేసి సమాచారం అందిన వెంటనే డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేయాలని సిటీజన్లు కోరుతున్నారు. -
భర్త తాగుడుకు భార్య బలి..!
ఉప్పల్: కుటుంబ కలహాలు..చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా గృహిణులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు... తమతో పాటు అభం శుభం తెలియని పసి పిల్లలను కూడా బలి తీసుకుంటున్నారు... నగరంలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు పరిపాటిగా మారాయి. తాజాగా ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ శ్రీనివాసపురం ప్రాంతానికి చెందిన సెమన్ ప్రభాకర్, కర్నూలు జిల్లా బనగానపల్లి, టంగుటూరు ప్రాంతానికి చెందిన మేరీ మార్గెట్ (38)తో 2017లో వివాహం జరిగింది. వీరికి బ్లేస్సి అక్షిత (8 నెలల పాప) ఉంది. ప్రభాకర్ ప్రతి రోజూ మద్యం తాగి వచ్చే వాడు. భార్య ఎంత వారించినా మానేస్తానని చెప్పి మానేయడం లేదు. ఈ కారణంతోనే భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు మొదలయ్యాయి. రోజూ భర్త తాగి రావడంతో పాటు ఇతర సమస్యలతో తీవ్ర మనస్తాపానికి లోనైన మేరీ మార్గెట్, కూతురు చిన్నారి అక్షితను తీసుకొని సోమవారం తాము నివాసం ఉంటున్న భవాని రెసిడెన్సీ 4వ అంతస్తుకు వెళ్లింది. కూతురిని మొదట అక్కడి నుంచి కిందకు విసిరేసి.. ఆ తర్వాత తాను కూడా దూకేసింది. తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఉప్పల్ సీఐ రంగస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఇడియట్’ సినిమాలో అలీ లాగే..
సాక్షి, హైదరాబాద్: ‘ఇడియట్’ సినిమాలో కమెడియన్ అలీ దొంగలించిన బైక్‌లను చాకచక్యంగా ఎత్తుకెళ్తాడు. మార్గంమధ్యలో అడ్డగించిన పోలీసులు ఆ బైక్‌పై ఉన్న ఇసుకను మాత్రమే చూస్తారు కానీ.. బైక్ వివరాలు మాత్రం అడగరు. సరిగ్గా ఇదే తరహాలో ముగ్గురు దొంగలు ఇలాగే దొంగలించిన బైక్‌లను ఎత్తికెళ్లిపోదామనే పన్నాగం పన్ని పోలీసులకు చిక్కారు. ఆసీఫ్‌నగర్ పీఎస్ పరిధిలో ఇటీవల చోరీకి గురైన బైక్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా.. ముగ్గురు దొంగలు దొరికారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. రికవరీ చేసిన 12 ద్విచక్రవాహనాలను, ముగ్గురు నిందితులు ఎం.వెంకటేష్(22), వశీం అక్రమ అలియాస్ వసీం(27), సిరాజ్‌ఖాన్(28)లను సోమవారం మీడియాకు చూపించారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం... దహిల్‌బాగ్ మహబూబ్ కాలనీకి చెందిన పాతనేరస్తుడు ఎం.వెంకటేష్ ఆసీఫ్‌నగర్‌లోని ఓ పెట్రోల్‌బంక్‌లో పని చేస్తున్నాడు. ఇతనిపై 12కు పైగా బైక్ చోరీ కేసులున్నాయి. కొద్దిరోజులు క్రితం బీదర్‌కు చెందిన వశీం అక్రం, సిరాజ్ ఖాన్‌లతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలుకు వెళ్లొచ్చిన వెంకటేష్.. వసీం, సిరాజ్ఖాన్లతో కలిసి బైక్‌ల చోరీకి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో తన వద్ద ఉన్న తాళాలతో పార్క్ చేసిన ఉన్న బైక్ తాళాలను వెంకటేష్ ఓపెన్ చేయడానికి యత్నిస్తాడు. తాళం వేస్తే ఈ విషయాన్ని వసీం అక్రం, సిరాజ్ఖాన్లకు సమాచారం ఇస్తాడు. వారు వచ్చి ఆ బైక్‌లను వేరే ప్రాంతాల్లోని పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేస్తారు. నగరంలో అమ్మితే సమస్యలు వస్తాయని వేరే ప్రాంతాల్లో అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఇలా పట్టేశారు... ‘ఇడియట్’ సినిమాలో అలీ ఏ విధంగా అయితే బైక్‌లను దొంగలించి ఆ బైక్‌లపై బీదర్‌కు ఇసుకను తరలిస్తూ.. పోలీసులకు చిక్కినట్టే.. వీరు కూడా ఇసుక బస్తాలను దొంగలించిన బైక్‌లపై పెట్టుకుని బీదర్ వెళ్లి అమ్మాలని పథకం వేశారు. అయితే..పోలీసులు ఫొటో అండ్ ఎనాస్మెంట్ ద్వారా వీరిని పట్టుకున్నారని కమిషనర్ తెలిపారు. వెంకటేష్‌పై పలు ఠాణాల్లో కేసులు వెంకటేష్ కొన్ని రోజుల పాటు మాత్రమే ఉద్యోగం చేస్తాడు. అతను సాధారంగా చేసేదంతా చోరీలే. ఇలా 2014 నుంచి చోరీలు చేస్తున్నాడు. వెంకటేష్‌పై మంగళ్‌హట్ పీఎస్‌లో 4 కేసులు, ఆసీఫ్‌నగర్ పీఎస్‌లో 3 కేసులు, రాయదుర్గం పీఎస్‌లో 2 కేసులు, లంగర్‌హౌస్, టప్పచబుత్ర పీఎస్‌ల్లో ఒక్కో కేసు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దొంగలించిన 12 ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. కాగా.. 12 బైక్స్‌లో 11 బైక్‌ల సమాచారం మాత్రమే ఉంది. మరో బైక్ ఎక్కడ కొట్టేసింది స్పష్టత లేదు.