
సాక్షి, హైదరాబాద్: చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. మస్కిట్ లిక్విడ్ తాడి ఏడాదిన్నర బాలుడు మృత్యువాతపడ్డాడు. వివరాలు.. తారానగర్‌లో నివాసముంటున్న జుబేర్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కొడుకు జాకీర్ ఉన్నాడు. శనివారం బాలుడు ఇంట్లో ఆడుకుంటూ.. పొరపాటున అలౌట్ లిక్విడ్ తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
గమనించిన తల్లిదండ్రులు బాలుడి బట్టలపై అలౌట్ లిక్విడ్ వాసన రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.