సాక్షి, క్రైమ్ : నగరంలోని చందానగర్ ఏరియాలోని ఏటీఎమ్‌లలో చోరి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీఐసీఐకి చెందిన మూడు ఏటీఎమ్‌లలో ఈ దొంగతనం జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చోరి అయిన సంగతి గుర్తించిన ఏటీఎమ్ సిబ్బంది... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ముసుగు వేసుకుని వచ్చి.. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎమ్‌లను కాల్చి దాదాపు 13లక్షల వరకు దోపిడి చేశారు. పోలీసులు సీసీటీవి పుటేజీ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment