ATM theft
-
అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ట్రావెల్స్ ఆఫీసు మేనేజర్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఇక, ఈ కాల్పులకు పాల్పడిన ముఠాను బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. దీంతో, నిందితుల కోసం పోలీసుల దర్యప్తు కొనసాగుతోంది.అఫ్జల్‌గంజ్ కాల్పుల కలకలం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందినట్లు గుర్తించారు. అడ్డ దారుల్లో రాయ్‌పూర్ పారిపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. నిందితులు అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే, అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారనేది మాత్రం తెలియరాలేదు. దీంతో, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఏం జరిగిందంటే..?కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బీదర్‌లో గురువారం ఉదయం ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్‌ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీదర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు కనిపించారు. దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
కంటైనర్‌లో వచ్చి.. పోలీసులనే ఏమార్చి..
సేలం: కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లో శుక్రవారం వేకువజామున ఒకే సమయంలో మూడు ఏటీఎంలలో చోరీలకు పాల్పడి తప్పించుకు వెళ్తున్న దొంగల ముఠా కోసం కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులు వేట మొదలెట్టారు. ఏటీఎం చోరీల్లో ఆరితేరిన హైటెక్ హర్యానా దొంగలు లగ్జరీ కారు సహా కంటైనర్ లారీలో తప్పించుకెళ్తుండడాన్ని గుర్తించిన నామక్కల్ పోలీసులు సినీ తరహాలో ఛేజింగ్ చేశారు. వారిని పట్టుకునే క్రమంలో పెద్ద ఫైట్ తప్పలేదు. ఏటీఎం దొంగల దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులు గాయపడ్డారు. దీంతో నామక్కల్ పోలీసులు తుపాకీకి పనిపెట్టారు. ఇందులో ఓ దొంగ హతమయ్యాడు. మరొకడు ఆస్పత్రి పాలు కాగా, మరో ఐదుగురు పోలీసులకు చిక్కారు. కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లో వేకువ జామున ఒకే సమయంలో ఒకే ముఠా మూడు ఏటీఎంలలో చోరీకి పాల్పడింది. 2.30 నుంచి నాలుగు గంటల మధ్య ఈ చోరీలు జరిగాయి. గ్యాస్ కట్టర్ల సాయంతో ఏటీఎంలను బద్దలు కొట్టి అందులోని నగదును ఈ ముఠా తమ గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఓ ఏటీఎంలో మోగిన అలారంతో పోలీసులు అలర్ట్ అయ్యా రు. లగ్జరీ కారులో వచ్చి చోరీకి పాల్పడి తప్పించుకు వెళ్తున్న వారి కోసం వేట మొదలెట్టారు. అయితే, హఠాత్తుగా వీరు జాతీయ రహదారిలోకి వెళ్లగానే కనిపించకుండాపోయారు. కంటైనర్‌లో లగ్జరీ కారు తమ రాష్ట్ర సరిహద్దులలోని చెక్ పోస్టులను త్రిస్సూ ర్ పోలీసులు అలర్ట్ చేశారు. అయితే, ఆ లగ్జరీ కారు కనిపించలేదు. మూడు ఏటీఎంలో రూ.65 లక్షల మేరకు నగదును ఈ ముఠా అపహరించుకెళ్లడంతో కేసును త్రిస్సూర్ నగర పోలీసు కమిషనర్ ఇలంగో సవాలుగా తీసుకున్నారు. త్రిస్సూర్ మీదుగా తమిళనాడులోని కోయంబత్తూరుకు, ఇక్కడి నుంచి కర్ణాటక వైపు వెళ్లే మార్గాలను పరిగణించారు. దీంతో తనతో పాటు ఐపీఎస్ బ్యాచ్‌లో శిక్షణ పొంది తమిళనాడు సరిహద్దు జిల్లాలు, కర్ణాటక సరిహద్దు జిల్లాలో పనిచేస్తూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కోయంబత్తూరు, నామక్కల్, ఈరోడ్, సేలం, కృష్ణగిరి మార్గాలలో ఉదయాన్నే రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీవ్ర వేటలో నిమగ్నమైంది. జాతీయ రహదారిలోకి త్రిస్సూర్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ కారు జాడ కాన రాలేదు. అదే సమయంలో గతంలో జరిగిన కేసులను పరిగణించిన పోలీసులు కంటైనర్ లారీలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర రహదారి మీదుగా ప్రవేశం జాతీయ రహదారిలో వెళ్తే తమను పోలీసులు పసిగట్టేస్తారని, రాష్ట్ర రహదారుల్లోని చిన్నచిన్న రోడ్లను అస్త్రంగా చేసుకుని ఈ ముఠా నామక్కల్‌లోకి ప్రవేశించింది. çకుమారపాళయం సమీపంలోని వేప్పడై ప్రాంతంలో తనిఖీల్లో ఉన్న పోలీసులను చూసి ఓ కంటైనర్ లారీ ఆగకుండా వెళ్లింది. ముందుగా, పక్కగా వెళ్తున్న వాహనాలను ఢీకొట్టి ఆ కంటైనర్ దూసుకెళ్లడంతో అనుమానాలు నెలకొన్నా యి. తర్వాత సినీ కైమ్లాక్స్‌ను తలపించే విధంగా ఛేజింగ్ జరిగింది. నామక్కల్ ఎస్పీ రాజేష్ కన్నన్ నేతృత్వంలో పదుల సంఖ్యలో వాహనాలలో కంటైనర్ లారీని ఛేజ్ చేశారు. ఇందుకోసం నామక్కల్– సేలం రహదారిలోకి ఇతర వాహనాలు రాకుండా కాసేపు మూసివేశారు. సేలం జిల్లా సరిహద్దుల్లోకి ఆ కంటైనర్ లారీ ప్రవేశించే సమయంలో చుట్టుముట్టారు. కూలీలుగా వచ్చి లగ్జరీగా తిరుగుతూ పోలీసుల విచారణ మేరకు..కంటైనర్ లారీలో కొందరు, లగ్జరీ కారులో మరి కొందరు హర్యానా నుంచి త్రిస్సూర్‌కు చేరుకున్నారు. ఇక్కడ తమకు ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా ఎస్బీఐ ఏటీఎంలను గురిపెట్టారు. పథకం ప్రకారం ఒకే రోజు ఏటీఎంలలో అపహరించిన సొమ్ముతో కారులో పరారు కావడం, హైవే లేదా, తాము గూగుల్ మ్యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న రూట్లలో తమతో వచ్చిన కంటైనర్‌ను సమీపించారు. తక్షణం ఆ కారును కంటైనర్‌లోకి ఎక్కించేసి ఏమీ ఏరగనట్టుగా ఏదో భారీ లోడ్ వెళ్తున్నట్టుగా డ్రైవర్ ముందుకు దూసుకెళ్లారు. అయితే, కుమార పాళయం వద్ద పోలీసుల హడావుడి చూసి ఆందోళనతో డ్రైవర్ అతివేగంగా దూసుకెళ్లడం, పలు వాహనాలు ధ్వంసం కావడంతో ఈ కంటైనర్‌పై దృష్టి పడింది. ఈ కంటైనర్ ఎస్కే లాజిస్టిక్స్ పేరిట ఉంది. హర్యానా నుంచి త్రిస్సూర్‌కు సరకుల లోడుతో వచ్చింది. అయితే, ఆ లారీ యజమాని సలీమ్ ఖాన్ పేర్కొంటూ తనకు 18 కంటైనర్లు ఉన్నాయని, వాటిని పలు సంస్థలకు అద్దెకు ఇచ్చినట్టు తెలిపారు. అయితే వారు ఎటువంటి పనులకు ఉపయోగిస్తారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశాడు. మూడు రాష్ట్రాల పోలీసుల సకాలంలో సమాచారాన్ని బదిలీ చేసుకోవడంతో ఈ ఎటీఎం దొంగలు పట్టుబడ్డారు. వీరికి ఇతర కేసులతో సంబంధం ఉందా, అని విచారిస్తున్నారు. కేరళ త్రిస్సూర్ పోలీసులు సైతం నామక్కల్‌కు చేరుకుని విచారణ జరుపుతున్నారు. కేరళ త్రిస్సూర్‌లో చోరీకి పాల్పడి, నామక్కల్, సేలం జిల్లా సరిహద్దుల వరకు జరిగిన ఈ ఛేజింగ్, ఎన్కౌంటర్లో ఓ దొంగ హతం, ఇద్దరు పోలీసుల అధికారులు గాయపడడం వంటి సినీ తరహా ఈ క్లైమాక్స్ తమిళనాట పెద్ద చర్చకే దారి తీసింది.కాల్పుల్లో ఒకరు హతం తమ కంటైనర్‌ను పోలీసులు చుట్టుముట్టేయడంతో లోపల ఉన్న దొంగలు అలర్ట్ అయ్యారు. లారీని తనిఖీ చేస్తున్న కుమారపాళయం ఇన్స్పెక్టర్ తవమణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ రంజిత్‌లపై ఆ దుండగులు దాడికి దిగారు. గడ్డపార, బస్తాలను మోయడానికి ఉపయోగించే పొడవైన కొక్కి తరహా ఆయుధాలతో దాడి చేశారు. ఆ ఇద్దరికి గాయాలు కావడంతో ఇతర అధికారులు తుపాకీకి పనిపెట్టారు. పోలీసుల కాల్పులలో ఒక దొంగ సంఘటన స్థలంలోనే హతమయ్యాడు. మరొకడు గాయపడ్డాడు. దీంతో మిగిలిన ఐదుగురు దొంగ లు లొంగిపోయారు. ఈ సమాచారం సేలం డీఐజీ ఈ ఎస్ ఉమ నేతృత్వంలో ఎస్పీలు, డీఎస్పీలు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో విచారించారు. కంటైనర్ లారీలో లగ్జరీ కారు, పెద్ద ఎత్తున నగదు ఉండడంతో సీజ్ చేశారు. గాయపడ్డ పోలీసులను డీఐజీ పరామర్శించారు. పోలీసు కాల్పుల లో మరణించిన దొంగ హర్యానా రాష్ట్రం పుల్వామాకు చెందిన జమీనుద్దీన్‌గా గుర్తించారు. గాయపడ్డ దొంగ అజార్ అలీగా తేల్చారు. పట్టుబడ్డ ఐదుగురిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో వీరంతా పుల్వామా నుంచి వచ్చి ఏటీఎంలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతూ వచ్చినట్టు తేలింది. -
సులభంగా డబ్బు సంపాదించాలని.. యూట్యూబ్ చూసి ఏం చేశారంటే..
పలమనేరు(చిత్తూరు జిల్లా): యూట్యూబ్‌లో చూసి ఏటీఎంలలో డబ్బు చోరీ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను పలమనేరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెనుమూరు మండలం చిన్నమరెడ్డి కండ్రిగ అనే అడవిపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి(41), పొలకల నరేష్(29), మాధవరెడ్డి (25), గుడుపల్లి మండలం యామిగానిపల్లికి చెందిన హరి(21) తిరుపతిలో ఉంటూ స్నేహితులయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు. ఏటీఎంలలో చోరీ ఎలా చేయాలో యూట్యూబ్ చూసి తెలుసుకున్నారు. చదవండి: మొండెం దొరికింది.. తల మిస్టరీ వీడింది అనంతరం చెన్నై వెళ్లి పరికరాలను కొనుగోలు చేశారు. ఎట్టేరిలో రిహార్సల్స్ చేశారు. ఈ నెల 5న నెల్లూరు జిల్లా వేదపాళెం ఏటీఎంలో చోరీకి యత్నించారు. సైరన్ శబ్దం రావడంతో పరారయ్యారు. మరుసటి రోజు పలమనేరులో ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. మళ్లీ ఈ నెల 7వ తేదీ రాత్రి పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయతి్నంచారు. సైరన్ రాకుండా చూసుకున్నారు. ఏటీఎంలో రహస్యంగా అమర్చిన చిప్, మైక్రో కెమెరా ద్వారా సమాచారం ముంబయిలోని ఎస్బీఐ కార్యాలయానికి చేరింది. అధికారులు ఏటీఎం లొకేషన్ ఆధారంగా పలమనేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఏటీఎం వద్దకు వెళ్లేలోపు అక్కడినుంచి ఉడాయించారు. డీఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. వాహనాల తనిఖీతోపాటు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. దుండగులు వెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ నెల 13న పలమనేరు సమీపంలోని గంటావూరు ప్ల్రైఓవర్ వద్ద పోలీసులు వాహనాలు తనికీ చేస్తుండగా కారు వేగంగా వెళ్లింది. పోలీసులు కారును వెంబడించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం అంగీకరించారు. వారిని సీఐ భాస్కర్, ఎస్ఐ నాగరాజు గురువారం అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు ఉపయోగించిన కారు, గ్యాస్ కట్టర్, పరికరాలు, గ్లౌజులను సీజ్ చేశారు. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకున్న స్థానిక ఐడీ పార్టీ పోలీసులు శ్రీనివాసులు, అల్లాఉద్దీన్, ప్రకాష్, శశి, ప్రభాకర్, బాలాజీకి డీఎస్పీ రివార్డులు అందజేసి అభినందించారు. -
నగదు లోడ్ చేసే సిబ్బందే ఏటీఎం లూటీ..!
సాక్షి, నెల్లూరు : ఏటీఎం సెంటర్లలో దొంగతనాలు పెరిగిపోతుండడంతో పట్టణ ప్రాంతాల్లో రాత్రి తొమ్మిది, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి దాటిన తర్వాత ఏటీఎంలలో డబ్బును నింపరాదు అని తాజాగా కేంద్ర హోంశాఖ నిబంధనలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండాల్సిన మనీ లోడింగ్ సిబ్బందే చేతివాటం చూపించారు. ఏటీఎంలలో డబ్బులు లోడ్ చేసే క్రమంలో ఏకంగా 79 లక్షల రూపాయలు నొక్కేశారు. ఈ ఘటన నెల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. సూళ్లూరుపేట, నెల్లూరు పట్టణంలో నగదు లోడ్ చేసే ‘రైటర్స్’అనే సంస్థలో పనిచేస్తున్న జగదీష్, కోటి, మునుస్వామిలు ఈ చోరీకి పాల్పడ్డారనీ, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. -
హైదరాబాద్ ఏటీఎమ్‌లలో చోరి!
సాక్షి, క్రైమ్ : నగరంలోని చందానగర్ ఏరియాలోని ఏటీఎమ్‌లలో చోరి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీఐసీఐకి చెందిన మూడు ఏటీఎమ్‌లలో ఈ దొంగతనం జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చోరి అయిన సంగతి గుర్తించిన ఏటీఎమ్ సిబ్బంది... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ముసుగు వేసుకుని వచ్చి.. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎమ్‌లను కాల్చి దాదాపు 13లక్షల వరకు దోపిడి చేశారు. పోలీసులు సీసీటీవి పుటేజీ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
ఏటీఎం మాయగాడు అరెస్టు
శ్రీకాకుళం సిటీ: డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు వచ్చే వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి ఏటీఎం కార్డు, పిన్‌లను తస్కరిస్తూ నగదు చోరీ చేయడంలో ఆరితేరిన గౌడ రాజారావును నగర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు శనివారం రెండోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. మెళియాపుట్టి మండలం ముక్తంపాలెం గ్రామానికి చెందిన గౌడ రాజా రావు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా శనివారం పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిని విచారించగా శ్రీకాకుళం పట్టణంలో ఏడు, శ్రీకాకుళం రూరల్ ప్రాంతాల్లో రెండు, నరసన్నపేటలో ఒక ఏటీఎం చోరీ కేసులలో రాజారావు పాత్ర ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గౌడ రాజారావు వ్యవసాయ కార్మికుడు. ఏడేళ్ల క్రితం కుమార్తెకు వివాహం చేశాడు. రాజారావు భార్యకు ఫైలేరియా సోకడంతో చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులకు చూపించి భార్యకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఎలాగైనా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో విశాఖపట్నం వెళ్లి కూలీ పనులు సైతం చేశాడు. అయినా పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరకపోవడంతో తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఏటీఎంల వద్దకు వచ్చే అమాయక ఖాతాదారులకు మాయమాటలు చెప్పి మోసగించడం అలవాటుగా చేసుకున్నాడు. రూ.2.50 లక్షల రికవరీ.. శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేటల్లో సుమారు 10 ఏటీఎం కేంద్రాల వద్ద చోరీలకు పాల్పడ్డాడు. డబ్బులు తీయడంలో అవగాహన లేని ఖాతాదారులను గమనించి మాయమాటలు చెప్పి పిన్ తెలుసుకోవడం, ఏటీఎం కార్డులను మార్చడం వంటి పనులు చేసి నగదు కొల్లగొట్టేవాడు. ఇలా మొత్తం రూ.3,12,500 డ్రా చేశాడు. ఎట్టకేలకు శనివారం పోలీసులకు చిక్కాడు. ఇతని వద్ద నుంచి రూ.2.50 లక్షల నగదు, ఐదు ఏటీఎం కార్డులను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ఏటీఎంలో రూ.17 లక్షలు చోరీ
-
ఏటీఏం దోంగను పట్టుకుంటే పాతికవేలు
-
త్రీడీ స్కానర్‌తో ఏటీఎం చోరీ చేస్తూ..
-
త్రీడీ స్కానర్‌తో ఏటీఎం చోరీ చేస్తూ..
బంజారాహిల్స్: శ్రీనగర్‌కాలనీలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలోని డాటాను దొంగిలించేందుకు యత్నిస్తూ ఇద్దరు ఉన్నత విద్యావంతులు పోలీసులకు చిక్కారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... విజయవాడ గాయత్రినగర్‌కు చెందిన యండ్రపల్లి ఆదిత్య(24) బీబీఏ.., విజయవాడ నెహ్రూనగర్‌కు చెందిన తెల్లా సతీష్(29) బీటెక్ పూర్తి చేశారు. బేగంపేట కుందన్ బాగ్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్న వీరిద్దరూ ఈనెల 4న శాలివాహననగర్ ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ప్రవేశించి తమ వద్దనున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏటీఎంలోని డాటాను సేకరించేందుకు యత్నిస్తుండగా సెక్యూరిటీ గార్డ్ గమనించడంతో పరారయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆదిత్య, సతీష్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ల్యాప్‌టాప్, ఐపాడ్, త్రీడీ స్కానర్,రిఫ్లెక్టివ్ షీట్, మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిద్దరూ ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించి క్లోన్డ్ ఏటీఎం కార్డులు వినియోగించి డబ్బు డ్రా చేశారు. ఈ కేసులో 2014 జూన్ లో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చాక వీరు మళ్లీ పాత దందానే కొనసాగిస్తున్నారు. ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేస్తూ త్రీడీ స్కానర్‌తో డాటా క్యాప్చర్ చేసి డబ్బు డ్రా చేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కూడా ఈ తరహాలోనే డాటా చోరీకి యత్నిస్తూ పట్టుబడ్డారు. గతంలో వీరిపై చైతన్యపురి, బేగంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
ఏటీఎం చోరీకి విఫలయత్నం
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ఓ దుండగుడు విఫలయత్నం చేశాడు. ముసుగు ధరించిన సుమారు 35 ఏళ్ల వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి మెషిన్‌ను తెరిచేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. చివరికి వీలు కాక వెనుదిరిగాడు. బ్యాంకు అధికారులు సీసీటీవీ వీడియో ఫుటేజీ పరిశీలించడంతో ఈ విషయం బుధవారం వెలుగు చూసింది. దీంతో వారు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
24 గంటల్లోనే వీడిన మిస్టరీ
ఒక్క రోజులోనే ‘ఏటీఎం’ కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్టు, పిస్తోల్, ఆభరణాలు స్వాధీనం హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన యూసుఫ్‌గూడ ఏటీఎం దోపిడీ కేసును నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. దోపిడీకి పాల్పడిన నిందితుడిని గురువారం అరెస్టు చేసి అతని నుంచి పిస్తోల్‌తో పాటు మూడు ఏటీఎం కార్డులు, బంగారు గొలుసు, చేతి ఉంగరం, ఐదు సెల్ఫోన్లు, బటన్ చాకు, హ్యాడ్ కర్చీఫ్, రూ.4,000 నగదును పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగానే ఆగంతకుడు వైయస్ఆర్ జిల్లా కు చెందిన పెదపల్లి శివకుమార్‌రెడ్డి అని గుర్తించారు. దీనిపై పూర్తి వివరాలను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. మదురానగర్‌లోని లేడీస్ హాస్టల్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీలలిత గత బుధవారం ఉదయం యూసుఫ్‌గూడలోని ఎస్బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా ఆగంతకుడు వచ్చి పిస్తోల్‌తో కాల్పులు జరిపి ఆమె నుంచి బంగారు గొలుసు, ఉంగరం, చెవి కమ్మలు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఏటీఎంలో ఆగంతకుడి ఫుటేజ్‌లను పోలీసులు మీడియాతో పాటు స్థానికులకు, చుట్టుపక్కల పోలీసు స్టేషన్లకు ఎస్ఎంఎస్లు చేశారు. అగంతకుడి ఫొటోలను గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, ఇన్స్పెక్టర్లు సత్యనారాయ ణ, రాజావెంకట్‌రెడ్డి, గంగారామ్‌లను రంగంలోకి దింపారు. అమీర్‌పేట్‌లో సా యిదుర్గా హాస్టల్లోని నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం కోసం నగరానికి వచ్చి.. వైఎస్సాఆర్ జిల్లా వల్లూరు గ్రామానికి చెందిన పెదపల్లి శివకుమార్‌రెడ్డి(24) ఉద్యోగం కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి సాయిదుర్గా హాస్టల్ ఉంటున్నాడు. ఉద్యోగం దొరకకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో 3 నెలల క్రితం ఓ వ్యక్తి సహాయంతో మహారాష్ట్రకు వెళ్లి రూ.25 వేలకు 9 ఎంఎం పిస్తోల్‌ను ఖరీదు చేశాడు. ఏటీఎం సెంటర్ దోపిడీకి ఒకరోజు ముందు అక్కడ రెక్కీ నిర్వహించి మరుసటి రోజు ఉదయం ఈ దోపిడీకి పాల్పడ్డాడు. మరేమైనా నేరాలు చేశాడా? అతని వద్ద శ్రీలలిత ఏటీఎం కార్డుతో పాటు మరో రెండు కార్డులు లభ్యంకావడంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇతనికి పిస్తోల్ ఎవరు ఇప్పించారు, ఈ దోపిడీలో మరెవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్స్‌లో ఉంటున్న వారి వివరాలు సేకరించాలని మహేందర్‌రెడ్డి అన్ని హాస్టల్స్ యాజమాన్యాలను ఆదేశించారు. -
ఏటీఏం చోరీకి విఫలయత్నం, పరారైన దొంగలు
అనంతపల్లి: దోపిడి దొంగల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. దుండగులు యదేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. ఏటీఎంలపై కన్నేసిన దోపిడీ దొంగలు నిత్యం ఎక్కడో ఒకచోట చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లిలో గురువారం దుండగులు ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. అక్కడి స్థానికులు గమనించి అప్రమత్తం కావడంతో దుండగులు కారంచల్లి పరారైనట్టు సమాచారం. -
ATM చోరీకి దొంగ విఫలయత్నం