రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి ఓ దుండగుడు విఫలయత్నం చేశాడు. ముసుగు ధరించిన సుమారు 35 ఏళ్ల వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి మెషిన్‌ను తెరిచేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. చివరికి వీలు కాక వెనుదిరిగాడు.
బ్యాంకు అధికారులు సీసీటీవీ వీడియో ఫుటేజీ పరిశీలించడంతో ఈ విషయం బుధవారం వెలుగు చూసింది. దీంతో వారు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.