attempted
-
వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై టీడీపీ నేతల హత్యాయత్నం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ అలియాస్ కొండపల్లి బుజ్జిపై సోమవారం విజయవాడలో టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్దతుగా పనిచేశాడనే అక్కసుతో ఆయనపై హత్యాయత్నం చేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున నార్త్‌జోన్ ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్యాయత్నం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫార్మా డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణ అలియాస్ బుజ్జి అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ సెక్టార్–1లో నివసిస్తున్నారు. రోజూలానే సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో బ్యాడ్మింటన్ ఆడుకుని ఇంటికి వస్తుండగా సెక్టార్–2 ఆకాష్ అపార్ట్మెంట్స్ వద్దకు వచ్చేసరికి నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వచ్చి ఆయన్ని అడ్డగించి ఒక్కసారిగా దాడిచేశారు. మోహంమీద, శరీరంపైన పిడుగుద్దులతో విరుచుకుపడ్డారు. పక్కనున్న రాయితో కొట్టి హత్యచేసేందుకు ప్రయత్నించారు.చుట్టుపక్కలవారు కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగాగాయపడిన బుజ్జిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. హత్యాయత్నం చేసింది టీడీపీకి చెందిన కాకొల్లు మహేంద్ర, గొట్టుముక్కల వెంకటేశ్వరరాజు, బెజ్జం జయపాల్, షేక్ గౌస్‌బాషాగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ స్పందించాలి: వెలంపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు పోతిన వెంకటమహేష్, తోలేటి శ్రీకాంత్ పరామర్శించారు. అనంతరం వెలంపల్లి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీడీపీ సంకెళ్లలోఉందని విమర్శించారు. నార్త్‌జోన్ ఏసీపీ కార్యాలయం సమీపంలోనే దారుణం జరిగిందన్నారు. దాడులను అరికట్టాలని ఇటీవల సీపీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని చెప్పారు. ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నాడని, సెంట్రల్ నియోజకవర్గంలో 35 మందిపై దాడులు జరిగాయన్నారు. బొండా ఉమా మర్యాదగా ఈ దాడులు ఆపాలని సూచించారు. పోలీసు వ్యవస్థ ఈ దాడులను అరికట్టకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. ఈ దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
హైదరాబాద్‌లో దారుణం.. మాజీ ప్రియురాలి ఇంట్లోకి దూరి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమికులుగా విడిపోయిన తర్వాత తన మాజీ బాయ్ ఫ్రెండ్ అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడంటూ ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు.. పబ్‌లలో గిటారిస్ట్‌గా పని చేస్తున్న లలిత్ సెహెగల్‌కు 2016లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి (36)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ 2021 వరకు స్నేహితులుగా ఉన్నారు. అదే ఏడాది ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి.. ఎవరికి వారే వేర్వేరుగా ఉంటున్నారు. కొంత కాలంగా సదరు యువతి లలిత్ సెహగల్ స్నేహితుడితో సన్నిహితంగా మెలుగుతోందని, ఈ విషయంపై నిలదీసేందుకు గచ్చిబౌలిలోని హాస్టల్లో ఉంటున్న లలిత్ సెహెగల్.. యువతి ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చాడు. చదవండి: పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు అరుపులు కేకలతో గొడవపడ్డారు. ఈ సమయంలోనే తన దుస్తులను చించేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికదాడికి యత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు లలిత్ సెహగల్‌పై ఐపీసీ సెక్షన్ 376 రెడ్‌విత్ 511, 323, 354, 509ల కింద కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ లలిత్ బాగ్ కార్పొరేటర్ ఆఫీస్ లో హత్యాయత్నం
-
ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై..
విజయనగరం ఫోర్ట్: రక్తపరీక్షల కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన మహిళపై ఆస్పత్రి ఉద్యోగి మంగళవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళకు ఈసీజీ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో ఆమె ఈసీజీ గది లోకి వెళ్లగా అక్కడి ఉద్యోగి లైంగికదాడికి యత్నించినట్లు తెలిసింది. చదవండి: వాట్సాప్ కాల్ చేయమంది, అంతలోనే.. దీంతో ఆమె బయటకు పరిగెత్తుకుని వచ్చి బంధువులకు విషయం తెలపడంతో వారు డయల్ 100కు ఫోన్ చేశారు. లైంగిక దాడి యత్నానికి గురైన బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఉద్యోగిని చితకబాదినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే వన్‌టౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టగా సదరు బాధితురాలు ఇక్కడ ఎటువంటి సంఘటన జరగలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం గమనార్హం. -
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినా 2017 PET అభ్యర్థులు
-
తెలుగుదేశం కార్యకర్త దాష్టీకం
కనగానపల్లి/అనంతపురం న్యూసిటీ: కామంతో కళ్లు మూసుకుపోయిన టీడీపీ కార్యకర్త మృగాడిలా మారాడు. తన కోరిక తీర్చాలంటూ ఓ అంగన్వాడీ కార్యకర్తను వేధించాడు. ఆమె లొంగకపోవడంతో బలాత్కరించబోయాడు. ప్రతిఘటించడంతో మానవత్వం మరిచి చెప్పుతో కొట్టి గాయపరిచాడు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఇలాకాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బాధితురాలు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ అంగన్వాడీ కార్యకర్తను కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త తలారి నాగరాజు లైంగికంగా వేధిస్తున్నాడు. ఆరు నెలలుగా అతని వేధింపులను ఆమె మౌనంగానే భరిస్తూ వచ్చారు. విధుల్లో భాగంగా శనివారం సాయంత్రం కేంద్రంలో ఒంటరిగా రికార్డులు రాసుకుంటున్న కార్యకర్తను గమనించిన నాగరాజు లోపలకు చొరబడి అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో కేంద్రం బయటకు లాక్కొచ్చాడు. చెప్పుతో కొడుతూ దుర్భాషలాడాడు. ఘటనలో ఆమె శరీరంపై ఉన్న దుస్తులు చిరిగిపోయి, గాయపడ్డారు. చుట్టుపక్కల వారు గుమిగూడుతుండడంతో నాగరాజు అక్కడి నుంచి జారుకున్నాడు. గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు జిల్లా సర్వజనాస్పత్రికి తరలించారు. పరువు కోసం పాకులాట పట్టించే ప్రయత్నాలు చేపట్టారు. ఓ మహిళపై పార్టీ కార్యకర్త దాడి చేశాడంటే మంత్రికి చెడ్డ పేరు వస్తుందని భావించిన టీడీపీ నాయకులు ముందస్తుగా నాగరాజుని పోలీస్ స్టేషన్‌కు పంపి, అతని ద్వారా అంగన్ వాడీ కార్యకర్తపై కేసు నమోదు చేయించారు. అంగన్వాడీ కేంద్రం ఎదురుగా వెళుతున్న తనపై ఆమె దాడికి ప్రయత్నించిందని ఫిర్యాదులో నాగరాజు పేర్కొన్నట్లు సమాచారం. -
SFI ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి యత్నం
-
ఠాక్రేపై హత్యాయత్నం చేశాం!
ముంబై దాడుల కేసులో నిందితుడు... ఇటీవల అప్రూవర్ గా మారిన పాక్ ఆమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఈ రోజు కోర్టుకు మరిన్ని వివరాలు వెల్లడించాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గతంలో అనేకసార్లు హెడ్లీని విచారించిన ముంబై న్యాయస్థానం తాజాగా మరోమారు విచారణ చేపట్టింది. శివసేన వ్యవస్థాపకుడు బాల ఠాక్రేని చంపేందుకు ఓ వ్యక్తి ఉగ్రవాద దుస్తులు ధరించి ప్రయత్నించాడని, ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని, అయితే అతడు ఆ తర్వాత కస్టడీ నుంచి తప్పించుకు పారిపోయాడని తాజా విచారణలో భాగంగా డేవిడ్ కోల్మన్ హెడ్లీ కోర్టుకు తెలిపాడు. తన పర్యవేక్షకుడు సాజిద్ మీర్ సూచనల మేరకు తాను కూడా శివశేన నాయకుడ్ని చంపే లక్ష్యంతో రెండుమార్లు సేనా భవన్ సందర్శించానన్నాడు. ఠాక్రేను లష్కరే తాయిబా ఎందుకు చంపాలనుకుందో తనకు తెలియకపోయినా.. చంపడమే లక్ష్యం కావడంతో ప్రయత్నం మాత్రం చేశానని క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో హెడ్లీ వెల్లడించాడు. అమెరికన్ చట్టాల్లో ప్రాధేయపడిన వారికి క్షమాభిక్ష పెట్టడం అనేది లేదని, మీరు క్షమించినా లేకపోయినా నేరాన్ని కోర్టు ముందు అంగీకరించి ప్రాధేయపడుతున్నానని హెడ్లీ కోర్టుకు వివరించాడు. ముంబై కోర్టుకు తాను వాగ్మూలం ఇవ్వడం ద్వారా అమెరికా విట్నెస్ ప్రొటెక్షన్ లో తనకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నాడు. అంతేకాక తాను అమెరికా పాస్‌పోర్టులో పేరు మార్చుకునేందుకు అక్కడి అధికారులకు ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వలేదని హెడ్లీ స్పష్టం చేశాడు. -
ఏటీఎం చోరీకి విఫలయత్నం
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ఓ దుండగుడు విఫలయత్నం చేశాడు. ముసుగు ధరించిన సుమారు 35 ఏళ్ల వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి మెషిన్‌ను తెరిచేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. చివరికి వీలు కాక వెనుదిరిగాడు. బ్యాంకు అధికారులు సీసీటీవీ వీడియో ఫుటేజీ పరిశీలించడంతో ఈ విషయం బుధవారం వెలుగు చూసింది. దీంతో వారు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి ఆత్మహత్యాయత్నం
ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : కడుపునొప్పి భరించలేక ఓ యువతి గోళ్లరంగు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఏలూరులో చోటుచేసుకుంది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సత్రంపాడు ఎంఆర్సీ కాలనీకి చెందిన వానపల్లి మౌనిక డిగ్రీ చదువుతోంది. ఆమెకు ఆదివారం ఉదయం విపరీతంగా కడుపునొప్పి రావడంతో ఇంట్లోని గోళ్లరంగును మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కడుపు నొప్పి భరించలేక.. ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : కడుపునొప్పి భరించలేక ఓ వృద్ధురాలు కలుపు నివారణ మందును మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెదవేగి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం తాళ్లగోకవరం గ్రామానికి చెందిన కర్రి గౌరమ్మ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆదివారం ఉదయం విపరీతమైన నొప్పి రావడంతో ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందును తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.