కనగానపల్లి/అనంతపురం న్యూసిటీ: కామంతో కళ్లు మూసుకుపోయిన టీడీపీ కార్యకర్త మృగాడిలా మారాడు. తన కోరిక తీర్చాలంటూ ఓ అంగన్‌వాడీ కార్యకర్తను వేధించాడు. ఆమె లొంగకపోవడంతో బలాత్కరించబోయాడు. ప్రతిఘటించడంతో మానవత్వం మరిచి చెప్పుతో కొట్టి గాయపరిచాడు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఇలాకాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బాధితురాలు తెలిపిన మేరకు..
కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ అంగన్‌వాడీ కార్యకర్తను కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త తలారి నాగరాజు లైంగికంగా వేధిస్తున్నాడు. ఆరు నెలలుగా అతని వేధింపులను ఆమె మౌనంగానే భరిస్తూ వచ్చారు. విధుల్లో భాగంగా శనివారం సాయంత్రం కేంద్రంలో ఒంటరిగా రికార్డులు రాసుకుంటున్న కార్యకర్తను గమనించిన నాగరాజు లోపలకు చొరబడి అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో కేంద్రం బయటకు లాక్కొచ్చాడు. చెప్పుతో కొడుతూ దుర్భాషలాడాడు. ఘటనలో ఆమె శరీరంపై ఉన్న దుస్తులు చిరిగిపోయి, గాయపడ్డారు. చుట్టుపక్కల వారు గుమిగూడుతుండడంతో నాగరాజు అక్కడి నుంచి జారుకున్నాడు. గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు జిల్లా సర్వజనాస్పత్రికి తరలించారు.
పరువు కోసం పాకులాట
పట్టించే ప్రయత్నాలు చేపట్టారు. ఓ మహిళపై పార్టీ కార్యకర్త దాడి చేశాడంటే మంత్రికి చెడ్డ పేరు వస్తుందని భావించిన టీడీపీ నాయకులు ముందస్తుగా నాగరాజుని పోలీస్ స్టేషన్‌కు పంపి, అతని ద్వారా అంగన్ వాడీ కార్యకర్తపై కేసు నమోదు చేయించారు. అంగన్‌వాడీ కేంద్రం ఎదురుగా వెళుతున్న తనపై ఆమె దాడికి ప్రయత్నించిందని ఫిర్యాదులో నాగరాజు పేర్కొన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment