ప్రైవేట్‌ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై.. | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై..

Published Wed, Aug 24 2022 9:19 PM

Attempted Assault On Woman In Private Hospital Vizianagaram - Sakshi

విజయనగరం ఫోర్ట్‌: రక్తపరీక్షల కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చిన మహిళపై ఆస్పత్రి ఉద్యోగి మంగళవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న  ప్రైవేట్‌ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళకు ఈసీజీ చేయించుకోవాలని వైద్యులు  సూచించడంతో ఆమె ఈసీజీ గది లోకి వెళ్లగా అక్కడి ఉద్యోగి లైంగికదాడికి యత్నించినట్లు తెలిసింది.
చదవండి: వాట్సాప్‌ కాల్‌ చేయమంది, అంతలోనే..

దీంతో ఆమె బయటకు పరిగెత్తుకుని వచ్చి బంధువులకు విషయం తెలపడంతో  వారు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. లైంగిక దాడి యత్నానికి గురైన బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఉద్యోగిని చితకబాదినట్టు  తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే వన్‌టౌన్‌ పోలీసులు  ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టగా సదరు బాధితురాలు ఇక్కడ ఎటువంటి సంఘటన జరగలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం గమనార్హం.  

Advertisement
 
Advertisement
 
Advertisement