assaults
-
యువతులను ట్రాప్ చేయడమే నవీన్ వృత్తి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడు, రౌడీషి టర్ నవీన్ టీడీపీ నాయకులతో ఉన్న సంబంధాలను ఆసరా చేసుకొని పాల్పడిన దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరిమీద పడితే వారిపై దౌర్జన్యాలు చేయడమే కాకుండా, యువతులను ట్రాప్ చేసి, వారి డబ్బుల తోనే జల్సాలు చేయడమే అతను వృత్తిగా పెట్టుకొన్నట్లు వల్లభాపురం గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో గుంటూరులో ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పి లొంగతీసుకున్నాడు. తర్వాత తెనాలి మండలం ఈమని గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె డబ్బులతోనే తెనాలిలో ఇల్లు తీసుకుని ఉంటున్నట్లు సమాచారం. ఆరు నెలల క్రితం తెనాలి యువతిని వలలో వేసుకొని, ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.ఆమె ఏటీఎం కార్డు కూడా నవీన్ దగ్గరే ఉందని, ఆమె డబ్బులు పెద్ద ఎత్తున వాడుకున్నాడని, తిరిగి డబ్బులు అడిగినందుకే ఇరువురి మధ్య వివాదం జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి చేసి ఉంటాడని చెబుతున్నారు. కారులో వెళ్తుండగా సడన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడి తలకు దెబ్బ తగిలిందని నవీన్ పోలీసులకు చెబుతున్నాడు. బ్రేక్ వేస్తే తల వెనుక దెబ్బ తగిలే ఆస్కారం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా దాడేనని వారు స్పష్టం చేస్తున్నారు. దాడికి ముందు లైంగిక దాడి జరిగిందా! లేదా!అన్న విషయంపై పరీక్షలు నిర్వహించారు.ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. నవీన్ పథకం ప్రకారమే ఆ యువతిని బయటకు తీసుకువెళ్లి దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నవీన్ ఒక్కడే ఈ పనిచేశాడా? అతని స్నేహితుల హస్తం కూడా ఉందా అన్నదానిపై విచారణ జరుపుతున్నారు. యువతి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నవీన్‌తోపాటు ఇద్దరు స్నేహితులు లైంగికంగా వేధించి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అధికార పార్టీతో అతనికి ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ కేసును నీరు గార్చేందుకు పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.మరింత విషమించిన యువతి ఆరోగ్యం నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. మెదడులో రక్తస్రావం జరుగుతూనే ఉండటంతో అమెను కాపాడేందుకు జీజీహెచ్ వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వడంలేదు. సోమవారం ఉదయం ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, పల్స్ పూర్తిగా పడిపోయినట్లు చెబుతున్నారు. ఆ యువతి ఆరు వారాల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు. -
మరో టీడీపీ కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు
సాక్షి, అనంతపురం జిల్లా: అధికారాన్ని అడ్డం పెట్టకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చిది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో టీడీపీ నేత శ్రీనివాస్ నాయుడు లైంగిక వేధింపులు బయటపడ్డాయి. ఉపాధి హామీ మహిళా కూలీలకు డబ్బుతో ఎర వేస్తున్న టీడీపీ నేత లైంగిక వేధింపుల ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.3 లక్షలు లోన్ ఇప్పిస్తా.. బయటకు రావడానికి వీలు అవుతుందా?. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా.. తన కోరిక తీర్చాలంటూ శ్రీనివాస్ నాయుడు వేధింపులకు గురిచేశాడు. టీడీపీ నేతపై పోలీసులకు బాధితతురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువకుడు.. యువతి మెడపట్టుకొని లాక్కెళ్లి..
రద్దీగా ఉన్న నడిరోడ్డుపై ఓ యువకుడు యువతితో రెచ్చిపోయి ప్రవర్తించాడు. అందరిముందే యువతిపై చేయిచేసుకోవడమే కాకుండా ఆమెను బలవంతంగా మెడ పట్టుకొని కారులోకి ఎక్కించాడు. ఈ అమానుష ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలన్నీంటిని రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో ప్రకారం.. ఢిల్లీలోని మంగోల్‌పురి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనం ఆగింది. ఇంతలో కారులో నుంచి దిగి యువతి బయటకు వెళ్లింది. వెంటనే కారులో నుంచి యువకుడు దిగి యువతి వెనకాలే వెళ్లాడు. రోడ్డు మీద వెళ్తున్న ఆమెపై చేయిచేసుకున్నాడు. షర్ట్ పట్టుక్కొన్ని లాక్కొచ్చాడు. బలవంతంగా కారులోకి నూకేశాడు. కారులో సైతం యువతిపై పిడిగుద్దులు గుద్దాడు. వీరిద్దరితోపాటు కారు వద్ద మరో యువకుడు కూడా ఉన్నాడు. అక్కడ జరిగే తతంగాన్నంతా చూస్తూ ఉన్నాడే తప్ప అతన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. అనంతరం ముగ్గురు క్యాబ్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే క్యాబ్ డ్రైవర్‌తో సహా రోడ్డు మీద ఉన్న ఎవరూ బాధితురాలికి సహాయం చేయడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.చివరికి ఈ విషయం పోలీసులకు చేరడంతో వీడియో ఆధారంగా విచారణ చేపట్టారు. క్యాబ్ హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్యాబ్‌ను చివరిసారి గురుగ్రామ్‌లోని ఐఎస్ఎఫ్సీఓ చౌక్ వద్ద గుర్తించగా.. పోలీసులు అక్కడికి వెళ్లి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు(యువతి, ఇద్దరు యువకుడు) రోహిణి నుంచి వికాస్పురి వరకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లిన్నట్లు తెలిసింది. దారిలో వీరి మధ్య గొడవ జరగ్గా.. ఆమె బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సదరు యువకుడు ఆమెను క్యాబ్‌లోని నెట్టిన్నట్లు డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఆ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Man in Delhi forces a woman into a cab, near Mangolpuri flyover. The vehicle and the driver have been traced. Two boys & a girl had booked Uber from Rohini to Vikaspuri. The girl wanted to leave following an argument, after which the boy pushes her back into the cab. #Delhi pic.twitter.com/s2rkfgnaqh — Vani Mehrotra (@vani_mehrotra) March 19, 2023 -
షాకింగ్ ఘటన.. క్లాస్‌రూంలో బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం
ముంబై(మహారాష్ట్ర): తరగతి గదిలో ఒంటరిగా ఉన్న 8వ తరగతి బాలికపై ఇద్దరు సహ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ముంబైలోని మాతుంగ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. తోటి వారంతా డ్యాన్స్ క్లాస్ కోసం వేరే గదికి వెళ్లి విద్యార్థిని ఒక్కతే క్లాస్‌రూంలో ఉండటాన్ని అవకాశంగా తీసుకుని వానే అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్, పోక్సో తదితర చట్టాల కింద కేసులను నమోదు చేశారు. బాలురను అదుపులోకి జువెనైల్ డిటెన్షన్ కేంద్రానికి తరలించారు. చదవండి: గొంతుకోసి.. వేడినూనెతో ముఖం కాల్చేసి.. -
ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై..
విజయనగరం ఫోర్ట్: రక్తపరీక్షల కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన మహిళపై ఆస్పత్రి ఉద్యోగి మంగళవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళకు ఈసీజీ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో ఆమె ఈసీజీ గది లోకి వెళ్లగా అక్కడి ఉద్యోగి లైంగికదాడికి యత్నించినట్లు తెలిసింది. చదవండి: వాట్సాప్ కాల్ చేయమంది, అంతలోనే.. దీంతో ఆమె బయటకు పరిగెత్తుకుని వచ్చి బంధువులకు విషయం తెలపడంతో వారు డయల్ 100కు ఫోన్ చేశారు. లైంగిక దాడి యత్నానికి గురైన బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఉద్యోగిని చితకబాదినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే వన్‌టౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టగా సదరు బాధితురాలు ఇక్కడ ఎటువంటి సంఘటన జరగలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం గమనార్హం. -
హైదరాబాద్‌లో దారుణం.. ఇల్లు అద్దెకు ఇస్తానంటూ యువతిని బంధించి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి అద్దె పేరుతో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇల్లు అద్దెకు ఇస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లిన యువకుడు.. యువతిని నగ్నంగా బంధించాడు. ప్రతిఘటించిన ఆ యువతి.. గట్టిగా కేకలు వేసింది. అరిస్తే లైంగిక దాడి చేస్తానంటూ యువకుడు బెదిరింపులకు దిగాడు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతున్న కార్పొరేటర్ -
అమ్మమ్మ, మనవడు నిద్రిస్తున్న గదికి గొళ్లెం పెట్టి.. యువతిపై అత్యాచారయత్నం, ఆపై
కాళ్ల (పశ్చిమ గోదావరి): యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఓ మృగాడికి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో ఆమెను నేలకేసి కొట్టిచంపిన కిరాతక ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పల్లిపాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిప్పాల కల్యాణి (19) తన అమ్మమ్మ ఒడుగు దుర్గ వద్ద ఉంటోంది. కల్యాణి తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. నెలసరి కావడంతో కల్యాణి ఆదివారం రాత్రి ఇంట్లోని ఓ గదిలో నిద్రించగా.. ఆమె అమ్మమ్మ దుర్గ మనవడితో కలసి మరో గదిలో నిద్రించింది. చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్.. పెళ్లైన రెండు వారాలకే.. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అదే గ్రామానికి చెందిన తిరుమల సాయిప్రసాద్ అలియాస్ నాని అనే యువకుడు ఆ ఇంట్లోకి ప్రవేశించి దుర్గ, ఆమె మనుమడు నిద్రిస్తున్న గదికి గొళ్లెం పెట్టాడు. ఆ తరువాత కల్యాణి నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అతడిని ప్రతిఘటించిన కల్యాణి కేకలు వేస్తూ పక్క గదిలో నిద్రిస్తున్న అమ్మమ్మను పిలవటంతో నిందితుడు సాయిప్రసాద్ ఆమె తలను నేలకేసి కొట్టి హతమార్చాడు. మనవరాలి కేకలు విని నిద్రలేచిన దుర్గ తన గదిలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తలుపులకు గొళ్లెం పెట్టి ఉండటంతో బయటకు రాలేక బిగ్గరగా అరిచింది. ఆ అరుపులు విని చుట్టపక్కల ఇళ్లల్లోని వారు వచ్చి తలుపులు తెరిచారు. పక్కగదిలోకి వెళ్లి చూడగా కల్యాణి రక్తపు మడుగులో నిర్జీవంగా పడివుంది. నిందితుడు సాయిప్రసాద్ మృతురాలి ఇంటినుంచి పారిపోవడం తాను చూసినట్టు స్థానికుల్లో ఒకరైన వైధాని దుర్గారావు చెప్పాడని కల్యాణి అమ్మమ్మ దుర్గ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు టీడీపీ నేత కుమారుడు నిందితుడు సాయిప్రసాద్ టీడీపీ నేత తిరుమల భాస్కరరావు పెద్ద కుమారుడు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. కాగా, నిందితుడు సాయిప్రసాద్ 9 నెలల క్రితం కూడా ఓ యువతిపై ఇదే తరహాలో అఘాయిత్యానికి ఒడిగట్టాడని గ్రామస్తులు తెలిపారు. రాజీకి యత్నం.. రంగంలోకి పోలీసులు ఈ ఘటనపై గ్రామ పెద్దలు రాజీ కుదిర్చి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇవ్వటంతో కాళ్ల పోలీసులు శ్మశాన వాటిక వద్దకు చేరుకుని దహన సంస్కారాలను అడ్డుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం భీమవరంలోని ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. ఎస్పీ రవిప్రకాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్య జరిగిన ప్రాంతంలో క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. సాయిప్రసాద్‌పై కేసు నమోదు చేశామని, నిందితుడు పరారిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
లొంగకపోతే అంతు చూస్తా.. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి..
శ్రీకాకుళం రూరల్: సింగుపురం పంచాయతీ దేవాంగుల వీధికి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన పి.చిన్నారావు ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో లైంగిక దాడికి ప్రయత్నించిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూరల్ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా పని చేసుకుంటున్న యువతిని గ్రామంలోని జూట్‌మిల్‌లో పనిచేస్తున్న చిన్నారావు కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. చదవండి: ఫేస్బుక్ పరిచయం.. ఇంట్లో పెళ్లి సంబంధాలు.. యువతి మిస్సింగ్ తనకు లొంగకపోతే అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో 12వ తేదీ రాత్రి శ్రీకాకుళం టౌన్‌కు పనిమీద వెళ్లిన యువతి తిరుగు ప్రయాణంలో రాత్రి 9 గంటల సమయంలో సింగుపురం వద్ద గల కొండమ్మ తల్లి చెరువు వద్ద బస్సు దిగింది. అక్కడే కాపుకాసిన చిన్నారావు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయతి్నంచాడు. ఇంతలో జాతీయ రహదారి మీదుగా పలాస వెళ్తున్న ఓ వ్యాన్‌లోని వ్యక్తులు గమనించి ఆమెను కాపాడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. రూరల్ ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్ఎంపీ డాక్టర్ పాడుపని.. తల్లిదండ్రులు లేని సమయంలో..
West Godavari: మండలంలోని పందలపర్రు గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆర్ఎంపీ తిక్కా దుర్గారావును అరెస్ట్ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై షేక్ సుభాని సోమవారం తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాలికతో దుర్గారావు అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆర్ఎంపీపై అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: ఉద్యోగం ఒకరిది.. జీతం మరొకరికి! -
పోర్న్ భూతం: అరచేతిలో ‘అశ్లీలం’..
అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను పోర్న్ భూతం చిదిమేస్తోంది.. అరచేతిలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ అశ్లీల సైట్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.. కల్లాకపటం ఎరుగని పిల్లల మనసులో కల్మషం నింపుతోంది.. ఆన్లైన్ క్లాసుల కోసం అందించిన సెల్‌ఫోన్ పసి హృదయాలపై నీలి చిత్రాల విషం చిమ్ముతోంది.. పోర్న్ వీక్షణం లేత వయసులోనే వ్యసనంగా మారుతోంది. బిడ్డల బంగారు భవితను నిర్ధాక్షిణ్యంగా కాలరాచేస్తోంది.. ముఖ్యంగా నూనూగు మీసాల ప్రాయం మహమ్మారికి బానిసగా మారుతోంది. ఈ తరుణంలో తల్లిదండ్రులు మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరముందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. చదవండి: పిల్లలు పుట్టడం లేదని బొడ్డుపేగు తిన్న వివాహిత.. ఆ తర్వాత.. పలమనేరుకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ నెల 14వ తేదీన ఇద్దరు బాలురు (13, 14 ఏళ్లు) ఓ బాలిక(12)పై లైంగిక దాడికి యత్నించారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం చేపట్టిన విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేరానికి పాల్పడిన పిల్లలు సెల్ఫోన్లో పోర్న్ వీడియోలను చూసేవారని తేలింది. నీలి చిత్రాల వీక్షించే ఈ బాలురు పెడదోవ పట్టినట్లు తెలిసింది. చిత్తూరు కలెక్టరేట్: నేటి సమాజంపై పోర్న్ సైట్లు విష ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా యువతను బానిసలుగా మార్చుకుంటున్నాయి. కట్టుదప్పిన బాల్యాన్ని సులువుగా లొంగదీసుకుంటున్నాయి. ఈ సైట్లను చూసే వారిలో 20 ఏళ్ల లోపు వారే అధికంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 15 ఏళ్ల లోపు వారిలో 70శాతం మంది పోర్న్ మత్తులో చిక్కినట్లు వివరిస్తున్నాయి. పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలను మించి నీలి చిత్రాలను చూడడం పెద్ద వ్యసనంగా మారుతోందని పేర్కొంటున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరి యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక వైద్య నిపుణులు కోరుతున్నారు. టీనేజ్‌లోకి అడుగుపెట్టిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో పిల్లలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని, ప్రత్యేక గుర్తింపు కోసం తహతహలాడుతుంటారని, స్నేహితులకు అధిక ప్రాధాన్యమిస్తుంటారని తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో వారికి సెల్‌ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే పోర్న్‌సైట్లకు సులువుగా అలవాటు పడతారని హెచ్చరిస్తున్నారు. స్నేహ హస్తం అందించాలి టీనేజ్ పిల్లలు వయసు ప్రభావంతో సహజసిద్ధంగా వచ్చే శారీరక, మానసిక పరిణామాలను అర్థం చేసుకోలేక తీవ్రమైన అలజడికి గురవుతారు. ఈ దశలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలవాలి. వారి సమస్యలను ఓపికగా విని అర్థం చేసుకుని పరిష్కరించేందుకు యత్నించాలి. మాట వినడంలేదని కఠినంగా వ్యవహరించకూడదు. వారి తప్పులను గుర్తించి సున్నితంగా హెచ్చరించాలి. లోపించిన పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం వల్లే పిల్లలు కట్టుదాటుతున్నారు. అశ్లీల చిత్రాలను వీక్షించి విపరీత పోకడలకు అలవాటు పడుతున్నారు. ఉన్నత భవిష్యత్‌ను పణంగా పెట్టి పోర్న్ మహమ్మారి వలలో చిక్కుతున్నారు. ఆన్లైన్ మాయలో పడి జీవితాన్ని అంధకారబంధురం చేసుకుంటున్నారు. బ్రౌజింగ్ వ్యసనం ప్రస్తుత సమాజంలో యుక్తవయసు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరగకపోవడం పలు అనర్థాలు హేతువుగా నిలుస్తోంది. పిల్లలను చిన్న తరగతుల్లోనే హాస్టళ్లలో చేరి్పంచడం వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత విద్యావిధానంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లోనూ స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా మారింది. ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లల చేతికి ఫోన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా బ్రౌజింగ్ వ్యసనంగా మారింది. తల్లిదండ్రులు ఏమాత్రం అలసత్వం వహించినా అది పిల్లల భవితకు శాపంగా మారే ప్రమాదముంది. నిబంధనలు పాటించాలి ఇంటర్నెట్ సెంటర్లలోపోలీసు శాఖ సూచించే నియమ నిబంధనలను పాటించాలి. మైనర్లను తల్లిదండ్రులు లేకుండా ఇంటర్నెట్ సెంటర్లలోకి అనుమతించకూడదు. ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. చిన్నారులు, విద్యార్థులు సెల్ఫోన్లకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేకశ్రద్ధ వహించాలి. అత్యవసరమైతే తప్ప మొబైల్ డేటా వేయకపోతే మంచిది. పిల్లలతో ఎక్కువసేపు గడిపేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి. క్రీడలు, సంగీతం వంటి వాటిపై ఆసక్తిని పెంపొందించాలి. ఫోన్ ఇచ్చేటప్పుడు పిల్లలకు అవసరమైన యాప్‌లను మాత్రమే అందుబాటులో ఉంచాలి. ఎడ్యుకేషన్ యాప్స్, పిల్లల కథలు, పాటలు వంటి వాటిని మాత్రమే సెట్ చేసి ఇవ్వాలి. యాప్‌లకు లాక్‌లు పెట్టి ఇస్తే వారు ఏ ఇతర వివరాలను చూసేందుకు వీలు ఉండదు. అవగాహన లోపంతోనే.. అవగాహన లేకనే పిల్లలు పెడదారి పడుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసుల కారణంగా అందరి దగ్గరా సెల్ఫోన్లు ఉంటున్నాయి. దీంతో విద్యార్థులకు సోషల్‌మీడియా చూడడం వ్యసనంగా మారుతోంది. ఈ క్రమంలోనే పోర్న్‌సైట్లకు సైతం అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సెల్‌ఫోన్ ఇచ్చేటప్పుడు అన్వాంటెడ్ బ్రౌజింగ్ చేయకుండా లాక్ చేసివ్వాలి. – జయకుమార్, సైకాలజిస్ట్, మదనపల్లె నెట్ సెంటర్లపై నిఘా నెట్ సెంటర్లపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల విషయంలో తల్లిదండ్రులు నియంత్రణ చర్యలు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్‌లో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు సెల్‌ఫోన్ ఇవ్వకపోవడం మంచిది. ఫోన్లో విద్యార్థులకు అవసరమైన యాప్స్ మాత్రమే అందుబాటులో ఉంచాలి. – రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె -
బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం
అమడగూరు(అనంతపురం జిల్లా): ఓ కామాంధుడు బరి తెగించాడు. 95 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. మండలంలోని ఓ తండాలో మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తండాకు చెందిన వృద్ధురాలి కుటుంబసభ్యులు కూలి పనులకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామాంజులు నాయక్ మద్యం మత్తులో అత్యాచారయత్నం చేశాడు. చదవండి: ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి.. వృద్ధురాలి అరుపులతో వెంటనే చుట్టుపక్కల వారు చేరుకుని నిందితుడిని చితకబాదారు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ విచారణ చేయలేదని బాధితురాలి మనువడు ఆవేదన వ్యక్తం చేశాడు. పలువురు టీడీపీ నాయకులు కేసు వద్దు, రాజీ చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని వాపోయాడు. ఎవరికీ ఇలాంటి అన్యాయం జరగరాదనే ఫిర్యాదు చేశానని, ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని కోరాడు. -
టెన్త్ క్లాస్‌మెట్.. పెళ్లి చేసుకుంటానని యువతిని లొంగదీసుకుని..
పెనమలూరు(కృష్ణా జిల్లా): ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేసిన యువకుడు, అతని కుటుంబసభ్యులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పోరంకి సాలిపేటకు చెందిన యువతి (24)ను టెన్త్‌లో క్లాస్‌మెట్ అయిన అదే గ్రామానికి చెందిన కోలా బలరామ్ కల్యాణ్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్ స్తంభానికి కట్టేసి.. యువతి తొలుత నిరాకరించినప్పటికీ తనను ప్రేమించకపోతే చనిపోతానని కళ్యాణ్ అనడంతో నమ్మిన యువతి అతని ప్రేమను అంగీకరించింది. తదనంతరం అతను ఆమెపై పలుసార్లు లెంగిక దాడి చేశాడు. అయితే అతను, అతని కుటుంబ సభ్యులు కోలా శివ వెంకట మల్లేశ్వరరావు, కోలా నాగజ్యోతి, కోలా కనకశ్రీవాణి పెళ్లికి నిరాకరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెళ్లి చేసుకుంటానని యువతిని లోబరచుకుని..
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): పెళ్లి చేసుకుంటానంటూ యువతిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పెజ్జోనిపేటకు చెందిన యువతి ఒక ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. తోటి విద్యార్థి సుహృద్ ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడి చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆ యువతి ఒత్తిడి చేయడంతో సుహృద్ తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విద్యార్థినిపై గూండాల అమానుషం.. స్నేహితుడి కళ్లెదుటే..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి కళ్లెదుటే యువతిపై ఒక గ్యాంగ్, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వైనం ఆందోళన రేపింది. ఈ సంఘటన అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోమంగళవారం రాత్రి ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ సంఘటన జరిగి దాదాపు 24 గంటలు గడిచినా, నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మైసూర్ నగరానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి దేవాలయం వద్ద దారికాచి ఆరుగురు వ్యక్తుల ముఠా వీరిని చుట్టుముట్టింది. యుతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న నగలు, నగదు ఇమ్మని అడిగారు. దీనికి నిరాకరించడంతో వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆమె ఫ్రెండ్‌ను తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితులిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశామనీ, బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉందని డీసీపీ ప్రదీప్ గుంటితెలిపారు. ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందన్నారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరిశోధనా విద్యార్థినిగా బాధిత యువతిని పోలీసులు గుర్తించారు. తన స్నేహితుడితో కలిసి సంఘటన జరిగిన ప్రదేశం నుంచే రోజూ ఇంటికి తిరిగి వచ్చేదని పోలీసులు వెల్లడించారు. ఇది గమనించే ఈ ముఠా దారుణానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలను వ్యక్తం చేశారు. -
పోలీసోడి పాడుపని.. యువతితో పరిచయం పెంచుకుని..
మైసూరు(కర్ణాటక): పోలీసు ఇన్స్పెక్టర్.. యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మైసూరు నగరంలోని కృష్ణరాజ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధిత యువతి.. ఇన్స్పెక్టర్ మీద ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం... యువతిపైన లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి విజయపుర (బిజాపుర)లో కేఎస్ఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తాయణ్ణ ధనసాగర్. గతంలో ఎస్ఐగా ఉన్న తాయణ్ణ ఫేస్బుక్ ద్వారా మైసూరుకు చెందిన యువతితో పరిచయం పెంచుకుని ఆమెతో రోజూ చాటింగ్ చేసేవాడు. తరువాత ఫోన్ నంబర్ తీసుకుని మాట్లాడేవారు. గోవాకు విహారయాత్రలు.. కొన్నాళ్లకు నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పడంతో యువతి నిజమేనని భ్రమించింది. యువతిని గోవాతో పాటు పలు విహార యాత్రలకు తీసుకెళ్లి శారీరకంగా వినియోగించున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో, నిన్ను పెళ్లి చేసుకోను. నాకు ఇప్పటికే పెళ్లయింది అని చావుకబురు చెప్పాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత యువతి కృష్ణరాజ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై
ముంబై: కామవాంఛతో కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. యువతికి కోరికలు రేకెత్తేలా ఇంజెక్షన్లు.. మందుబిల్లలు ఇస్తూ 8 సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. భర్తకు భార్యనే ప్రోత్సహించడం గమనార్హం. మైనర్‌గా ఉన్నప్పుడు కిడ్నాప్ చేయగా ఇప్పుడు ఆ బాలిక యువతిగా మారింది. ఎట్టకేలకు నిందితుల చెర నుంచి ఆ యువతి బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె ఇంటర్ చదువుతుండేది. 16 ఏళ్లు ఉన్న ఆ బాలికను ఎనిమిదేళ్ల కిందట కొందరు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. బాలికకు కామ కోరికలు కలిగేలా ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. ఆమెపై ఇష్టమొచ్చినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెను బెదిరింపులకు పాల్పడేవారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించి ఆమెను నిర్బంధించారు. ఇలా 8 ఏళ్లుగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీనికి నిందితుడి భార్య కూడా సహకరించేది. చివరకు వారి చెర నుంచి బయటకు వచ్చిన యువతి అంబోలి పోలీసులను సంప్రదించింది. 27 పేజీలతో ఆమె ఫిర్యాదు చేసింది. అయితే నిందితుల్లో ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి చేసేందుకు తనను ఉత్తరప్రదేశ్‌కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. కేసు నమోదు అనంతరం పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో నిందితుడి భార్య కూడా ఉంది. ఆమె తన భర్తకు సహకరించింది. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. బాలిక తప్పిపోయినప్పుడు ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. 8 ఏళ్ల తర్వాత తమ కూతురి ఆచూకీ లభించడంతో ఆమెను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిందితులు బాధిత యువతి కుటుంబానికి తెలిసిన వారిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. -
వైరల్ వీడియో: అసలు నిజం ఇదే..
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరంలో యువకుడి పై దాడి కేసు ఘటనపై రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి, టౌన్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. మీడియాలో వచ్చిన రెండు దృశ్యాలు ఇప్పటివి కావని, అందులో ఒకటి గత ఏడాది నవంబర్ నెలలో మార్కెట్ సెంటర్లో జరిగిందన్నారు. రెండో ఘటన ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగినట్టు వివరాలు సేకరించామని పేర్కొన్నారు. యువకుడిని చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేశామని చెప్పారు. శ్రీకాంత్ అనే వ్యక్తి కారు తీసుకొన్న యుగంధర్ అనే యువకుడు డ్యామేజీ చేశాడని, డ్యామేజీ ఖర్చులు చెల్లించని ఆ యువకుడిపై రాజశేఖర్ అనే మరో యువకుడు విచక్షణా రహితంగా దాడి చేశాడని పేర్కొన్నారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీలు వెల్లడించారు. -
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం
-
నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు
సాక్షి, లక్నో : హత్రాస్ ఘటనపై ఒకవైపు దేశం అట్టుడుకుతూండగానే ఉత్తర ప్రదేశ్‌లో వరుస అకృత్యాలు కలకలం రేపుతున్నాయి. హత్రాస్ నుండి 500 కిలోమీటర్ల దూరంలోని బల్రామ్పూర్ జిల్లాలో మరో దళిత యువతి (22) సామూహిక హత్యాచారానికి బలైపోయింది. మత్తు మందు ఇచ్చి, నడుము, రెండు కాళ్లు విరిచేసి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. మరో ఘటనలో అజమ్‌గర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యచారాం చేశాడో యువకుడు. దీంతో రాష్ట్రంలో నేరస్థుల ఆగడాలు, మహిళల భద్రతపై విమర్శలు చెలరేగుతున్నాయి. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) బల్‌రామ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా ఆమె నుంచి స్పందనలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో వెదకడం ప్రారంభించారు. ఇంతలో రాత్రికి అసాధారణ పరిస్థితిలో ఓ ఆటో రిక్షాలో అపస్మారక స్థితిలో యువతి ఇంటికి చేరింది. చేతికి గ్లూకోజ్ డ్రిప్ ఇంజెక్షన్, ఒంటి నిండా గాయాలు చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆమెను లక్నోకు తీసుకెళ్లమని వైద్యులు సలహా ఇచ్చారు. కానీ మార్గమధ్యలోనే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. వీరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు బలరాంపూర్ ఎస్పీ దేవ్ రంజన్ వర్మ తెలిపారు. అత్యాచారానికి ముందు తమ కూతురికి మత్తు ఇంజెక్షన్‌కు ఇచ్చి మరీ ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని బాధితురాలు తల్లి కన్నీటి పర్యంతమైంది. రెండు కాళ్లను విరిచేసి, శవంలాంటి తన బిడ్డను పంపారని వాపోయింది. ఐతే పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను తోసి పుచ్చారు. పోస్ట్ మార్టం నివేదికలో ఈ విషయాలేవీ తేలలేదని బలరాంపూర్ పోలీసులు గత రాత్రి ట్వీట్ చేశారు. అజమ్‌గర్ ఘటనలో జియాన్పూర్ ప్రాంతంనుంచి ఎనిమిదేళ్ల బాలికను తీసుకువెళ్లిన యువకుడు అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తీవ్ర రక్తస్రావంతో, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. నిందితుడు దినేశ్‌ను అరెస్టు చేశామని అజమ్‌గర్ ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు -
టీడీపీ నేతల దౌర్జన్యం
కాశినాయన: మండల కేంద్రమైన నరసాపురంలో జరిగిన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికిపాల్పడ్డారు. నరసాపురం పంచాయతీలో నరసాపురం, మిద్దెల, మూలపల్లె, నరసన్నపల్లె గ్రామాలు ఉన్నాయి. అందరికీ అనువుగా ఉండటంతో ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో సచివాలయ భవనం నిర్మించాలని, శుక్రవారం శంకుస్థాపన చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ సచివాలయం తమ గ్రామంలోనే నిర్మించాలని టీడీపీ నాయకులు అనిల్ ఉరఫ్ వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, నాగలక్షుమ్మ తదితరులు తమ అనుచరులతో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని గ్రామంలో అడ్డుకుని హాల్చల్ సృష్టించారు. తాము చెప్పిన చోటే సచివాలయం నిర్మించాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ విశ్వనాథరెడ్డి, ఎంపీడీఓ ముజఫర్ రహీం, తహశీల్దార్ శ్రీనివాసులు టెంకాయకొట్టి శంకుస్థాపన చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి వచ్చి అధికారులు, వైఎస్సార్సీపీ నేతలను దుర్భాషలాడారు. సామగ్రిని చిందరవందర చేసి హంగామా సృష్టించారు. పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పినా టీడీపీ నాయకులు మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. చివరకు వారిపై కూడా రుబాబు చేశారు. రెండు గంటల అనంతరం వారు వెనుదిరిగారు. అందరికీ అనువైన ప్రాంతంలో సచివాలయం నిర్మిస్తుంటే అడ్డుకోవడంపై మిద్దెల, నరసాపురం, మూలపల్లె, నరసన్నపల్లె గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓబులాపురంలో.... మండలంలోని రంపాడు పంచాయతీ సచివాలయ భవ భవనానికి ఓబులాపురం వద్ద శుక్రవారం స్థానిక నాయకులు రాజనారాయణరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రాజారెడ్డిల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన నాయకులు హాజరయ్యారు. రంపాడులోనే సచివాలయం నిర్మించాలని కొంతకాలంగా ప్రజలు కోరుతున్నారు. రంపాడుతో పాటు పిట్టికుంట, ఓబులాపురం, ఉప్పలూరు పంచాయతీలోని ప్రజలకు అనువుగా ఉన్న ఓబులాపురం వద్ద నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం శంకుస్థాపన తలపెట్టారు. తొలుత కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో స్థానిక నేతలే భూమిపూజ చేసుకోవాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
తమిళనాడులో మాజీ ఎంపీ వీరంగం
-
మంత్రి ఆది భార్య దగ్గరుండిమరీ..
సాక్షి, జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెదదుండ్లూరులో దళిత కుటుంబాలపై దాడి, ఇళ్ల విధ్వంసం ఘటనలో మంత్రి ఆదినారాయరణ రెడ్డి కుటుంబం ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. మంత్రి ఆది భార్య అరుణతోపాటు మంత్రి సోదరుడి భార్య సైతం దగ్గరుండిమరీ తమ అనుచరులకు ఆదేశాలిస్తోన్న వీడియోలు బహిర్గతమయ్యాయి. వైఎస్సార్సీపీ నేతలను ఇంటికి ఆహ్వానించారన్న కారణంతో నవవరుడు, పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంపత్ ఇంటి మంత్రి అనుచరులు, టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. సుగమంచిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ అభిమానులను కూడా తీవ్రంగా కొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్దదుండ్లూరు, సుగమంచిపల్లిలో సోమవారం కూడా పోలీస్ పికెట్ కొనసాగుతున్నది. (చదవండి: మంత్రి ఆది వర్గీయుల అరాచకం) అనుచరులను పురమాయిస్తూ..: పెద్దదుండ్లూరు గ్రామంలో ఇటీవలే వివాహం చేసుకున్న కానిస్టేబుల్ సంపత్ దంపతులను ఆశీర్వదించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆ పార్టీ కీలక నేతలు ఆదివారం గ్రామానికి తరలివెళ్లారు. ఎంపీ వస్తున్నారన్న సమాచారం అందడంతో ఆయా గ్రామాల్లో తమ ఆధిపత్యానికి సవాలుగా భావించిన మంత్రి వర్గీయులు ధ్వంసరచన చేశారు. ముందుగా రౌడీమూకలను వెంటేసుకుని మంత్రి తనయుడు సుధీర్‌రెడ్డి, మంత్రి భార్య అరుణలు గ్రామంలో బీభత్సం సృష్టించారు. ‘మాకు తెలియకుండా వైఎస్సార్సీపీ నాయకులను ఆహ్వానిస్తారా?’ అంటూ దళిత కుటుంబాలపై దాడికి దిగారు. పెళ్లింటి ముందు వేసిఉన్న షామియానాలను చించిపారేశారు. పక్కనే ఉన్న సుగుమంచిపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైన వీరారెడ్డి, అతని కుటుంబీకులను ఆది వర్గీయులు చావబాదారు. మంత్రి భార్య అరుణ, మంత్రి సోదరుడి భార్య.. సుగమంచిపల్లిలో ఓ ఇంట్లో కూర్చొని అనుచరులను పురమాయిస్తోన్న వీడియో దృశ్యాలు బయటికొచ్చాయి. అర్ధరాత్రి తర్వాత ఎంపీకి అనుమతి..: పెద్దదండ్లూరు వెళ్లకుండా తనను అడ్డుకున్న పోలీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ఎంపీగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కుందని, తనను అడ్డుకోవడం సరికాదని అన్నారు. అయినాసరే పట్టించుకోని పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులపై లాఠీచార్జి చేసి, నేతలను చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎంపీ అవినాష్, వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. (చూడండి: మంత్రి బెదిరిస్తే భయపడం) పోలీసులకు ఫిర్యాదు: పెద్దదుండ్లూరు, సుగమంచిపల్లిల్లో మంత్రి ఆదివర్గీయుల దాష్టీకాలపై బాధితులు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వెంటరాగా, బాధితులు సుబ్బరామిరెడ్డి, సంపత్ జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దళిత కుటుంబంపై దాడి చేయించిన మంత్రి ఆదినారాయణరెడ్డిపై కుల వివక్షవ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే మంత్రిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
అరాచకంలో నేరుగా పాల్గొన్న మంత్రి భార్య
-
రెవెన్యూ అధికారులపై రాళ్ల దాడి
నిజామాబాద్ : కోటగిరి మండలం సుంకిని వద్ద మంజీరా నదిలో రెవెన్యూ అధికారులపై మహారాష్ట్రకు చెందిన 50 మంది రాళ్ల దాడి చేశారు. మంజీర నదిలో తెలంగాణ భూభాగంలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవన్యూ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మహారాష్ట్ర కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీలను బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి సీజ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ అనుచరులు తహసీల్దార్ విఠల్‌తో పాటు రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు రెవెన్యూ అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్ల దాడితో భయపడిపోయి వెనక్కి తగ్గటంతో డోజర్ జేసీబీలను మహారాష్ట్ర కాంట్రాక్టర్ అనుచరులు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అంకెల గారడి
ఈ విషయ ప్రపంచాన్ని నిర్దేశించే మౌళిక సూత్రం అంకెలే. అంకెల్లోని మర్మం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అంకెల మాయ గందరగోళపరుస్తుంది. ఎందుకంటే అంకెలు కేవలం రాసిని తెలిపేవి మాత్రమే కాదు, కొన్ని నిర్దిష్ట, విశిష్ట లక్షణాలను తెలియపర్చే గుర్తులు. జోస్యం చెప్పాలంటే గవ్వలు వేయాలి. పందెంలో పడ్డ అంకెను బట్టి భవిష్యత్తు నిర్ణయమవుతుంది.ప్రతి చర్యా దాని ప్రతిచర్యా సమన్వయంతో జరిగిపోవటానికి మూలం అంకెలే. సకల చరాచర జీవరాశి యొక్క ఉనికికి కదలికలకు అంకెలే ఆధారభూతాలు. అంకెల సంకెల వస్తువులను ఓ క్రమంలో పేర్చటానికి, వాటిని వేరువేరుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఒకసారి మాత్రం అది పలు హత్యలు జరిగిన రంగాన్ని గుర్తించింది.వార్తాపత్రికలు, టీవీ చానళ్లు 9 చెర్రీ లేన్‌లో జరిగిన పలు హత్యల ఉదంతాన్ని కర్ణకఠోరంగా ఊదరగొట్టాయి ముఖ్యాంశాల్లో. ‘పోలీసుల కథనం ప్రకారం’ అంటూ జడ్సన్ కుటుంబం మొత్తం ఈ హత్యల్లో అసువులు బాయటాన్ని దారుణమైన దుర్ఘటనగా ఉదహరించాయి. వార్తల్లోని వాక్యాలు జాన్ జడ్సన్ అనేక కత్తిపోట్లకు గురై మృతి చెందాడని చెప్పాయి. ఆ పదబంధాలు అతని భార్య ఏలిస్ జడ్సన్ ఊపిరాడక చనిపోయినట్లు తెలిపాయి. గుర్తుతెలియని వ్యక్తులు జడ్సన్ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి పోలీసులకి అంతుచిక్కని ఏదో వస్తువు కోసం అణువణువూ గాలిస్తున్నప్పుడు పిల్లలు కూడా ఈ ఘోరానికి బలయ్యారు. ఆరు సంవత్సరాల బెట్సీ అందంగా అలంకరించుకున్న తన గదిలో రక్తపు మడుగులో పడి ఉంది. పసివాడు డేవిడ్ తను కంటున్న అందమైన కల భంగం కాకుండానే ముఖం మీద దిండు అదిమిపెట్టటం వల్ల మరణించాడు. పోలీసులు ఇంతకంటే వివరాలేమీ వెల్లడించలేదు.ఫోరెన్సిక్ నిపుణులకు, ప్రత్యేక విచారణాధికారులకు మాత్రమే శవాల అసలు పరిస్థితి తెలుసు. తండ్రి శరీరాన్ని పాక్షికంగా కప్పి ఉంచారు. తాళ్ళతో కట్టేయబడి, నోట్లో గుడ్డలు కుక్కబడి, అరికాళ్ళ కింద మంటలు పెట్టడం వల్ల చర్మం కాలిపోయి, బేస్మెంట్లో కాళ్ళు చేతులు బార్లా చాపి పడి ఉన్న స్థితిలో శవాన్ని కనుగొన్నామని తమ రిపోర్టులో రాశారు. తల్లి చనిపోయిన విధానాన్నైతే పూర్తిగా వైద్య పరిభాషలోనే చెప్పారు. ఆ భార్యాభర్తల శవాల్ని తెల్లగుడ్డలతో పూర్తిగా కప్పివేశాక కూడా మీడియా కంట పడనివ్వలేదు. ఈ దారుణ మారణకాండ జరిగిన ఇంట్లోని బేస్మెంట్, ఇతర గదులు కూడా సీల్ చేసి పోలీసు కాపలా పెట్టారు. పోస్ట్ మార్టం వ్యాన్‌లో ఎక్కిస్తున్నపుడు పిల్లల శవాల్ని చూసి అదిరిపడ్డారు అక్కడి జనం.విచారణ బృందం ప్రతినిధి ఇంట్లోంచి బయటకు రాగానే మీడియా రిపోర్టర్లు మూకుమ్మడిగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయన అందరినీ ఆగమంటూ చెయ్యెత్తాడు. ఉత్కంఠతో కూడిన నిశ్శబ్దం ఆవరించాక తన గంభీరమైన గొంతుతో ఈ హత్యలకు సంబంధించిన వివరాలు చెప్పాడు ‘‘లభ్యమవుతున్న ఆధారాలను బట్టి ఈ రోజు తెల్లవారుజామున కొంతమంది ఈ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. భర్త మిస్టర్ జాన్ జడ్సన్ని వారు చేతులు వెనక్కి విరిచి పట్టి బేస్మెంట్లోకి తీసుకొచ్చి చిత్రహింసల పాలు చేశారు. కారణం తెలియదు. జాన్ ఎంతకూ రాకపోయేటప్పటికి ఏమైందోనని భార్య ఏలిస్ పడకగదిలోంచి బయటకు వచ్చింది. అపరిచితులను చూసి కంగారుపడింది. దుండగులు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి పెనుగులాడుతున్నా విడువకుండా బేస్మెంట్లోకి ఈడ్చుకెళ్ళారు. అక్కడ ఆమెను గొంతు నులిమి చంపారు. ఆ తరువాత దేనికోసమో ఇల్లంతా వెతికారు. ఆ సమయంలోనే మేలుకున్న చిన్నారి బెట్సీ భయంతో పెడుతున్న కేకలు విని జడ్సన్ కుటుంబంలో మిగిలిన ఇద్దరు పసివాళ్ళని కూడా కనికరం లేకుండా చంపి ఈ కరకు చర్యను ముగించి వెళ్ళిపోయారు. బెట్సీకి ఆరేళ్ళు, డేవిడ్ కి రెండు. తెల్లవారాక వచ్చిన పనిమనిషి ముందుతలుపు తెరిచి ఉండటం, ఏదో పెనుగులాట జరిగిన గుర్తులుండటం చూసి కీడు శంకించింది. లోపల చెల్లాచెదురైన సామాన్ల మధ్య శవాలని చూసి పోలీసులకు వార్త తెలియజేసింది. దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో ఏదైనా ముందంజ వేస్తే అది మీకు తప్పక తెలియజేస్తాం’’ అని చెప్పి ముగించాడు. ఇక ఆపై విలేకర్లు అడిగిన ఏ ప్రశ్నకీ సమాధానం చెప్పకుండా ఆయన హత్య జరిగిన ఇంటి లోపలికి వెళ్ళిపోయి తలుపు మూసేశాడు. 9‘తొమ్మిది’ అంకె సర్వ శక్తిమంతమైనది. అందులో త్రిక త్రయం (మూడు మూళ్ళు) ఉంది. అది సమాప్తికి, సంప్రాప్తికి, సంపూర్ణతకు చిహ్నం. తొమ్మిది దివ్య సంఖ్య. ‘పరిశుద్ధ’ సంఖ్య. ఎందుకంటే ‘9’ తర్వాత ఇక అంకెలు లేవు. ఇదే చివరిది. ఇదే అవధి. మిగిలిన సంఖ్యలన్నీ దీనితోనే ఉండి, దీని చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. భ్రమ(సున్నా) చుట్టూ ఉండే భ్రమణమే తొమ్మిది. తొమ్మిది గ్రహాల తర్వాత గాలి నీరు ఉండవు. అంటే శూన్యానికి ఆరంభం కూడా తొమ్మిదే. ప్రాచీనులు కాళరాత్రి కుమారుడైన కాలయముడిని ప్రసన్నం చేసుకోవటానికి గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసేవారు. తొమ్మిది ప్రళయావతారిణి, భీకర రూపిణి అయిన మహాదుర్గ చిహ్నం. ఇందులో లయం ఉంది. జాన్ జడ్సన్ బతికి ఉన్నప్పుడు ఆదర్శప్రాయుడైన ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్. ఏ పనినైనా పద్ధతిగా చేసేవాడు. అతని వస్త్రధారణ నిర్లోపం. ఇతరులతో ఎప్పుడూ గంభీరంగా మాట్లాడింది లేదు. ఎవరినీ పల్లెత్తు మాట అని ఎరుగడు. సదా నవ్వుతున్నట్టుండే నీలి కళ్ళు, ముఖం మీద చెరగని చిరునవ్వు. నడివయసుకు దగ్గరవుతున్నట్టు తెలిపే చిరుబొజ్జ ఈ మధ్యనే తోడైంది. జాన్ జడ్సన్ హైస్కూల్ రోజుల్నించే తాను ప్రేమించిన ఏలిస్ హాడ్జ్‌ను పెళ్ళి చేసుకున్నాడు. ఏలిస్ అందగత్తే! సొట్టలు పడే బుగ్గలు కొంచెం ఎత్తుగా ఉండి ఆమె అందాన్ని మరింత పెంచేవి. లేత పసుపు రంగు జుట్టుని పొడుగ్గా పెరగనీయకుండా కత్తిరించుకొని చక్కగా దువ్వుకునేది. బంగారు దొన్నెలో వెలిగిపోయే తామరపూవులా ఉండేది ఆమె ముఖం. వయసు మీరుతున్న కొద్దీ కొద్దికొద్దిగా లావైంది కానీ చేస్తున్న సెక్రటరీ ఉద్యోగానికి తగ్గట్టే గౌరవప్రదంగా ఉండేది ఆమె అలంకరణ. జాన్, ఏలిస్ తమ ప్రపంచంలోకి ఒక అందమైన పాపను తెచ్చారు. బెట్సీ అనే పేరు పెట్టారు. కనుపాపగా పెంచారు. సంతోషం మూట గట్టినట్టుండే బెట్సీని ఆరేళ్ళ వయసులో ఓ క్రూరమైన చేయి తుడిచి పెట్టేసింది. రెండేళ్ళ డేవిడ్ ఆ కుటుంబం అనుభవిస్తున్న సంతోషానికి సంపూర్ణతను చేకూర్చాడు – మరణం వరకూ! జాన్ ఆశయాలు తొందరగానే నెరవేరాయి. పదవిలో ఉన్నతి, జీతంలో పెంపు అతనికి జీవితాన్ని మరింత సుఖవంతంగా అనుభవించే అవకాశం ఇచ్చాయి. ఇటీవలే కొనుక్కున్న చెర్రీ లేన్‌లోని తొమ్మిదవ నంబరు ఇంట్లో అతని కుటుంబం చీకూ చింతా లేకుండా ఉన్నారు. ఇంటిని తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకునే సమయం చాలా ఉందనుకొని ఆ ఆనంద నిలయంలో తమ ఉజ్జ్వల భవిష్యత్తు కోసం కలలు కంటూ జీవించారు. ఇంటి ప్రవేశ ద్వారం మీద లతలు తీగలతో చెక్కిన ‘9’ ని ఎంతో గర్వంగా మేకులతో బిగించారు. కానీ సమాపనకు చిహ్నమైన ఆ గుర్తుతో ఇంటి మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ‘ఆరు’ మతాధిపతుల అంకె. దీన్ని తర్కంతో సమానంగా చెప్తారు. మృత్యువులోని శూన్యమే ఈ అనంత విశ్వం అని సూచిస్తుందీ అంకె. ఇదే అంతిమ రహస్యం. ఆత్మ పరమాత్మల ఏక చిహ్నం. పారలౌకికతకు, అద్వైతానికి మరో రూపం ఆరు. పాచికలాటలో ఆరు పడితే గెలుపు. పడలేదా, జూదగాడు చిక్కుల్లో పడ్డట్టే! అదృష్టం, అందం, ఆరోగ్యం, ప్రేమ, అవకాశం, సమన్వయాల్ని సూచించే ఆరు పూర్ణ సంఖ్య. షష్ఠి సర్వదా వరద, సుఖద. విజయప్రాప్తి ఈ అంకె. చెర్రీ లేన్‌లో తొమ్మిదవ నంబరు ఇంటి ఎదురుగా ఉండే ఆరవ నంబరు ఇల్లు కొన్నేళ్ళుగా ఎవరూ సరిగా పట్టించుకోకపోవడంతో పాడుబడింది. దాని చుట్టూ ఉన్న పెరటిలో ఇప్పుడు గడ్డి మోకాలి ఎత్తుకి పెరిగింది. పూల మొక్కలుండాల్సిన చోట ఏపుగా కలుపు మొక్కలున్నాయి. పాదుల్లో రాలిన ఆకుల కుప్పలతో నిండిపోయి, గుబురుగా పెరిగిపోయిన పొదలతో చూడగానే భీతి గొల్పుతుంది. అక్కడ ఎవరూ నివసించటం లేదనిపిస్తుంది. కాని ఎవరికీ తెలియని విషయమేమిటంటే చట్టం కళ్ళు గప్పి సంచరించే అధర్మపరులు, నేరస్థులు కొందరు అప్పుడప్పుడు ఆ ఇంట్లో తలదాచుకుంటుంటారు. అందుకే పోలీసులు అప్పుడప్పుడు ఆ ఇంటిమీద నిఘా పెడుతుంటారు. అలా చివరిగా ఆ ఇంట్లో ఉన్న శరణార్థి చుంచుమొహంతో పొట్టిగా పీలగా ఉండేవాడు. వాడు బ్యాంకుల్ని కొల్లగొట్టే ఆరుగురు దుష్ట రౌడీల ముఠాలో ఒకడు. గుమ్మడికాయలు దొంగిలించి భుజాలు తడుముకున్నాడు. పోలీసుల డేగకన్నుకి దొరికిపోయాడు. అంతే కాదు, తన సహచరుల గురించి చట్టానికి ఉప్పందించాడు. తస్కరించిన డబ్బు దస్కం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. చుంచుగాడు తనకు మాత్రమే తెలిసిన ఒక రహస్య ప్రదేశంలో దాచాడని ముఠాలో మిగతా అయిదుగురు అనుమానించారు. ప్రాథమిక విచారణలో న్యాయమూర్తి నేరారోపణ రుజువు చేయవలసిందిగా గ్రాండ్ జ్యూరీని ఆదేశించాడు. అయితే చుంచుగాడికి భయం పట్టుకుంది. కోర్టులో తను పోలీసులకిచ్చిన వాంగ్మూలాన్ని తోసిపుచ్చాడు. గ్రాండ్ జ్యూరీలో పద్దెనిది మంది సభ్యులున్నారు. తొమ్మిదిమంది అతని మాటలనుబట్టి వీళ్ళు నేరస్థులనీ, మిగతా తొమ్మిదిమంది సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసు కొట్టివేయాలని తేల్చారు. శిక్ష వేయడానికి కనీసం పన్నెండుమంది (ఆరు + ఆరు) ఆమోదం కావాలి కాబట్టి దొంగల ముఠాపై నేరారోపణ ఎత్తివేశారు. రౌడీలు విడుదలయ్యారు. కానీ ఇన్ఫార్మర్గా మారిన తమ ముఠాలో ఆరోవాడైన చుంచుగాడి మీద మిగతావారు పగబట్టారు. వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు గానీ కొన్నాళ్ళకే ఖాళీ ఇనప్పెట్టె వెక్కిరించింది. అది చాలు వారికి చెర్రీ లేన్‌లో ఆరవ నంబరు ఇంటి మీద ఓ కన్నేసి ఉంచడానికి. మురికి బట్టలేసుకున్న ఓ మనిషి అనేక సమయాల్లో ఆ ఇంటికి కాపలా కాస్తుండేవాడు. వాడి కాలి కింద నలిగిపోయిన సిగరెట్ పీకల వల్ల వాడు ఎంతసేపు అక్కడ ఉండి గమనిస్తున్నాడో తెలిసేది. వీధిలో వచ్చే పోయేవారు వాణ్ణి అసహ్యించుకునేవారు. వాడి ముఖం వెడల్పాటి నల్లని చలువ కళ్ళద్దాల వెనుక దాగుండేది. వాడి తల మీద ఉండే బైకర్స్ టోపీ ప్రమాదకారిగా అనిపించేది. దారిన పోయే ప్రమాదాన్ని నెత్తి మీద వేసుకోవటం ఎందుకని ఎవరూ వాడినేమీ అనలేక మనసులోనే తిట్టుకునేవారు. కానీ చెర్రీ లేన్‌లో ఒక భయస్థుడు కూడా ఉండేవాడు. కిటికీ తెరలను చాటు చేసుకొని అప్పుడప్పుడు కాపలావాడి వంక చూసేవాడు. ఆ సాక్షి ఈ రౌడీమనిషి గతంలో కొన్నిసార్లు ఆరో నంబరు ఇంటిని సోదా చేస్తూ కనిపించాడని పోలీసులకి చెప్పాడు కానీ తారీఖులు సరిగా చెప్పలేకపోయాడు. ఆ పాడుపడ్డ ఇంటి మీద ఉన్న ‘6’లో పాములాంటి ఒంపు తుప్పు పట్టిన మేకు కారణంగా ఊడి కిందకు వేలాడింది కొన్నాళ్ళు. చూసేవాళ్ళకి అది తొమ్మిదిలా కనిపించేది. చెర్రీ లేన్‌లో జరిగిన విషాద సంఘటనకు ముందురోజు తీవ్రమైన గాలి వీచడం వల్ల ఉన్న ఒక్క మేకూ ఊడొచ్చేసి వెండి రేకుతో చేసిన ‘6’ నేల మీద పడిపోయింది. యమదూతలు ముగ్గురు గూండాల రూపంలో వచ్చారు. శత్రుశేషాన్ని తుడిచి పారెయ్యడానికి వారికి డబ్బు ముట్టింది. స్వంత ఆలోచన లేని మొదటి రకం కిరాయి గూండాలు వారు. ఆ రోజు పొద్దున్నే ఇంకా చీకట్లు తొలగకముందే చెర్రీ లేన్‌లో ఇళ్ళ నంబర్లన్నీ చూసుకుంటూ తమ వాహనంలో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వచ్చారు. చుంచుగాడు దాగిన ఇంటి గురించి వాళ్ళ దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. అయితే తమ తెలివి తక్కువతనం వల్ల కాపలావాడు గుర్తులు చెప్పడంలో తప్పు చేశాడనుకున్నారు. ‘‘లూయి గాడికి సరిగా చెప్పటమే రాదు. ఫోన్లో ఇల్లు ఎడమ చేతివైపుందని చెప్పాడు. రాత్రి ఎనిమిది వరకూ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్నాడు. తొమ్మిదో నంబరు, ఎడమ వైపు ఇల్లు అన్నాడంతే.మనం వీధికి అటువైపు నుంచి వచ్చేటప్పుడు ఎడమ వైపేమో!’’వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడ్డారు. శషభిషలు పడ్డారు. ‘‘ఎడమ వైపు అసలు తొమ్మిదో నంబరే లేదు కదా’’ అన్నాడొకడు. ‘‘....ఆ పాడుబడిన ఇల్లు తప్ప! దాని మీద అసలు నెంబరే లేదు’’వాళ్ళ కళ్ళు తొమ్మిది కోసం అటూ ఇటూ వెతికాయి. కుడి చేతివైపు తీర్చిదిద్దిన పెరడు ఉన్న ఇంటి మీద అందంగా తొమ్మిదో నంబరు వాళ్ళని మెరుస్తూ ఆకర్షించింది. ‘‘ఆ, అదుగో అదే. పోలీసుల్లేరులే.. పదండి! అబ్బో! మన బాసుల కష్టార్జితం పోసి పెద్ద ఇల్లే కొన్నాడే! ఇంత నోరేసుకొని ఊరంతా డప్పు కొట్టాడుగా బాసులు నేరస్థులని! అదే నోటితో మిగిలిన సొత్తు ఎక్కడ దాచాడో చెప్పిద్దాం’’నిస్సంకోచంగా బండిని ‘తొమ్మిది’ ఇంటి ముందు ఆపి అందులోంచి దిగారు. ‘తొమ్మిది’ బలిదానానికి గుర్తు చెర్రీ లేన్ తొమ్మిదిలో జరిగినట్టుగా. అది శూన్యానికి ఆరంభం అక్కడ జరిగిన హత్యల్లాగా. ఆ ఇల్లు ఇప్పటికీ తన రహస్యం దాచుకుంది. అధికారులు ఈ ఘోరకలికి పరిష్కారం చెప్పలేకపోయారు. ఆరో నంబరు ఇల్లు అగ్ని ప్రమాదంలో ఆహుతైంది. నేలమీద సగం కాలి వంకరపోయిన ‘ఆరు’లో దాని ఛాయలు ఇంకా కదలాడుతున్నాయి. అందులో నివసించిన చుంచుగాడి శవం కాకతాళీయంగా కొన్ని నెలల తరువాత రాళ్ళు నింపిన సంచీలో కుక్కబడి దగ్గర్లోని చెరువు అడుగున దొరికింది. చెర్రీ లేన్‌లో తొమ్మిదో నెంబరు ఇల్లు మూతపడింది. అప్పుడప్పుడూ ఔత్సాహికులు అక్కడకు వచ్చి ఏం జరిగి ఉంటుందో అని అనేక రకాలుగా ఊహాగానాలు చేస్తుంటారు. క్రమక్రమంగా వారి సంఖ్యా తగ్గిపోయింది. బంగారు భవిష్యత్తు ఉంటుందనుకున్న ఆ ఆనంద నిలయం విషాదంలో కూరుకుపోయింది. ఇప్పటికీ జాగ్రత్తగా వింటే ఆ ఇంట్లోంచి వీచే గాలుల్లో ఒక చిన్న పాప అందంగా అలంకరించిన తన పడగ్గదిలోంచి ‘మమ్మీ మమ్మీ’ అని దీనంగా పిలవడం వినిపిస్తుంది. ఆంగ్లమూలం : నార్మన్ ఎ. రూబిన్ (ఇజ్రాయిలీ రచయిత) అనువాదం: మోహిత -
సంచలన కేసు.. షాకింగ్ తీర్పు
సాక్షి, బెంగళూరు : సంచలనం సృష్టించిన మంగళూరు పబ్ కేసులో నిందితులను కోర్టు వదిలేసి అందరిని షాక్‌కు గురిచేసింది. సరైన ఆధారాలు నిందితులకు వ్యతిరేకంగా సమర్పించలేకపోయారని, ప్రత్యక్ష సాక్షులమంటూ కోర్టుకు వచ్చిన వారు సైతం స్పష్టమైన వివరాలు వెల్లడించలేపోయారంటూ కోర్టు వారిని విడిచిపెట్టిన సందర్భంగా తెలిపింది. 2009లో జనవరిలో యూట్యూబ్‌లో వచ్చిన ఓ వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మంగళూరులోని పబ్‌లో చోటుచేసుకున్న అభ్యంతరకర దాడుల దృశ్యాలే ఆ వీడియో. నైతిక విలువలు కోల్పోయి, విలువలకు తిలోదకాలు ఇచ్చి సంస్కృతిని దెబ్బకొడుతున్నారనే కారణంతో శ్రీ రామ్ సేన అనే ఓ వర్గం మంగళూరులోని 'ఆమ్నేసియా-దిలాంజ్' అనే పబ్‌లోకి చొరబడి అందులోని యువతి యువకులపై దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు యువతులపై దాడులకు పాల్పడిన అస్పష్టమైన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్‌తోపాటు మొత్తం 30మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. అయితే, ఆ దాడికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలు ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ సమర్పించలేదని కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు పలువురిని విస్మయానికి గురిచేసింది. అయితే, కోర్టుకు స్పష్టమైన ఆధారాలే ముఖ్యం అని, భావోద్వేగాల ఆధారంగా, అభిప్రాయాల ద్వారా తీర్పులు చెప్పలేమని తెలిపింది. తమకు సమర్పించిన వీడియోల్లో కేవలం నీడలు మాత్రమే కనిపించాయని, వీరే స్పష్టం అనడానికి ఆధారాలు లేవని తెలిపింది. -
చొప్పదండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు
కరీంనగర్‌క్రైం: చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అకారణంగా తనపై దాడి చేశారని పేర్కొంటూ రామడుగు మండలం తిర్మాలాపూర్‌కు చెందిన తడగొండ నర్సిం బాబు టూటౌన్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ నివాసం వద్ద తాను, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ సుంకే రవిశంకర్‌తో కలిసి ఉండగా.. అదే సమయంలో ఎమ్మెల్యే శోభ వచ్చారని, లిఫ్ట్ వద్ద ‘నన్ను కలువకుండా రవిశంకర్‌తో తిరుగుతావా..’ అంటూ అకారణంగా దుర్భాషలాడుతూ.. కుడిచెవి పట్టుకుని లాగి లిఫ్ట్‌లోకి తోశారని పేర్కొన్నారు. ఆ తర్వాత గన్‌మెన్‌తో కలిసి ఎమ్మెల్యే తీవ్రంగా కొట్టారని తెలిపారు. వారినుంచి తప్పించుకుని లిఫ్ట్ నుంచి బయటకురాగా ‘నీ అంతుచూస్తా..’ అంటూ బెదిరించారని, ఎమ్మెల్యేతో తనకు ప్రాణభయం ఉందని కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని టూటౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్ తెలిపారు. -
కుక్కల దాడిలో 40 గొర్రెపిల్లల హతం
డోన్ టౌన్ : కృష్ణగిరి మండలం కర్లకుంట శివారులో ఆదివారం కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు..మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వీరకుమార్ మేపు కోసం మందను కృష్ణగిరి మండలం కర్లకుంటకు తీసుకెళ్లారు. ఉదయం గొర్రెపిల్లలను కల్లం(ముళ్లకంప మధ్య)లో ఉంచి గొర్రెల మేపు కోసం బయటకు తీసుకెళ్లారు. ఇంతలో ఊరకుక్కలు కల్లంలో ఉన్న గొర్రె పిల్లలపై దాడి చేశాయి. ఘటనలో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. మరో పదింటికి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న కాపరులు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు రూ.1.6 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. -
తల్లిదండ్రులపై ‘కృషి’ వెంకటేశ్వరరావు దాడి
సాక్షి, విజయవాడ : కృషి బ్యాంకు కుంభకోణం సూత్రధారి కోసరాజు వెంకటేశ్వరరావుపై ఆయన తల్లిదండ్రులే కేసు పెట్టారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడకు చెందిన కోసరాజు జయసింహ-బేబి సరోజినీలపై వారి కొడుకులైన వెంకటేశ్వరరావు, వేణుగోపాల్‌లు దాడికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఇద్దరు కొడుకులపై పెదపారుపూడి పోలీసులు కేసు నమోదుచేశారు. ఆస్తి విషయంలో తలెత్తిన విబేధాలే దాడికి కారణమని తెలిసింది. కృషి బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు వెంకటేశ్వరరావు. బ్యాంకు డిపాజిటర్లకు ఎక్కువ మొత్తంలో వడ్డీ(16.5 శాతం) ఇస్తానని ఆశలు చూపి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. కుంభకోణం వెలుగులోకి రావడంతో చాకచక్యంగా 2001 జూలైలో భార్యతో కలిసి యూకే పారిపోయాడు. అక్కడ పౌరసత్వం రాకపోవడంతో మళ్లీ థాయిలాండ్‌కు పారిపోయాడు. ఈ విషయం హైదరాబాద్ పోలీసులకు తెలియడంతో బ్యాంకాక్ పోలీసులు, ఇంటర్ పోల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో 2005లో బ్యాంకాక్‌లో వెంకటేశ్వర రావును అరెస్ట్ చేశారు. 2006, జూన్‌లో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. తల్లిదండ్రులపై దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
విదేశాంగ వ్యవహారాలశాఖ ఉద్యోగినికీ అత్తింటిపోరు
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ మహిళలకే కాకుండా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న మహిళలకు కూడా అత్తింటివారి వేధింపులు తప్పట్లేదని కొన్ని సంఘటనలు రుజువు చేసిన విషయం తెలిసిందే. అలాంటిదే తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి మాత్రం విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ తనకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే గుర్గావ్లోని సెక్టార్ 49లో ఉంటున్న ఓ గృహిణి విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె 2016, జూలై 21న రజ్నీష్ గులాటి అనే ఢిల్లీకి చెందిన డాక్టర్‌ను వివాహం చేసుకుంది. ఆయన ముదిత్ విశ్వకర్మ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇటీవల ఆమె గర్భం దాల్చగా తన కడుపులో పెరుగుతుందని ఆడ బిడ్డ అని వెంటనే అబార్షన్ చేసుకోవాలని భర్త దాడి చేశాడు. తన అత్త, మామ, ఆడబిడ్డ అందరూ కలిసి తనను ఇంట్లో నుంచి ఈడ్చి పడేశారని తీవ్ర వేధింపులకు గురిచేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ఎమ్మెల్యే ఆమంచి దౌర్జన్యం
చీరాల: వాడరేవులోని మత్య్సకార మహిళపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దౌర్జన్యానికి దిగారు. నన్నే ఎదిరించి మాట్లాడతావా.. అంటూ ఆమె జీవనోపాధి అయిన చేపల బండిని తీసివేయించి ఆమె బతుకుదెరువును ప్రశ్నార్థకం చేశారు. వివరాలు.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం సాయంత్రం వాడరేవు తీరం వద్ద పర్యటించారు. తీరం వద్ద చెత్తాచెదారం ఉండటంతో అక్కడ బండి మీద చేపలు అమ్ముకుంటున్న మత్య్సకార మహిళ కొండూరి అంజమ్మను పిలిచి చెత్తను ఇక్కడ ఎందుకు వేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తామెందుకు చెత్త వేస్తామని ఆమె తిరిగి ప్రశ్నించింది. అంతేకాకుండా సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఉన్నా తమకేమీ ఉపయోగపడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే నోరు జాగ్రత్తగా పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా.. అసలు బండిపై చేపలు పెట్టుకునేందుకు పంచాయతీ అనుమతి ఉందా... అంటూ ప్రశ్నించారు. ఇక్కడ పెట్టుకున్న బండ్లు లైసెన్సులు లేవని ఆమె అనడంతో ఆవేశానికి గురైన ఎమ్మెల్యే బండిని పంచాయతీ కార్యాలయంలో పెట్టమని రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డిని ఆదేశించారు. నువ్వు కావాలనే గొడవ చేసేందుకు వచ్చావని, నాతోనే వాదన పెట్టుకుంటావా..అంటూ ఎమ్మెల్యే ఆవేశంతో మాట్లాడారు. చేపలబండిని ట్రాక్టర్‌పై తీసుకెళ్లి పంచాయతీ కార్యాలయంలో పెట్టారు. ఆవేదనకు గురైన ఆమె తాము ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గం కావడంతోనే బండి తీసేశారని, మిగిలిన బళ్లను అక్కడే ఉంచారని ఆరోపించింది. సమస్యలపై ప్రశ్నించినందుకు తన పొట్టపై కొట్టారని అంజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. -
ప్రాణం మీదకు తెచ్చిన ప్రైవేటు వడ్డీ
ఒంగోలు టౌన్ : ప్రైవేట్ వడ్డీలు ఓ బడుగుజీవి ప్రాణాల మీదకు తెచ్చాయి. జీవనోపాధి కోసం తీసుకున్న అప్పునకు అసలు, వడ్డీ చెల్లించినా ఇంకా చెల్లించాలని, లేదంటే చంపుతానని బెదిరిస్తుండటంతో తన గోడు అధికారులకు చెప్పుకుందామని అర్జీ చేతపట్టుకుని కలెక్టరేట్‌కు వెళ్లాడు. కలెక్టర్ కార్యాలయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో గురువారం సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు కొత్తపట్నం రోడ్డులోని ఎన్టీఆర్ కాలనీలో కాకర్ల మోషె కుర్చీలకు వైర్లు అల్లుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆదాయం తగ్గిపోవడానికి తోడు మోషె అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో ఒంగోలుకు చెందిన రాపూరి వాసు అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. నెలకు నూటికి ఆరు రూపాయల వడ్డీ చొప్పున రోజువారీ డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. డబ్బులు మొత్తం వడ్డీతో సహా రూ.4 లక్షలు చెల్లించినప్పటికీ ఇంకా కట్టాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. చివరకు దౌర్జన్యానికి కూడా దిగుతున్నాడు. ఖాళీ ప్రామిసరీ నోట్లు, వంద రూపాయల స్టాంపు పేపర్లపై బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నాడు. రెక్కాడితేగాని డొక్కాడని తనకు అప్పు ఇచ్చిన వారికి వడ్డీ సహా చెల్లిస్తే ఇంకా చెల్లించాలంటూ బెదిరిస్తుండటంతో మోషె తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఒకవైపు వడ్డీ వేధింపులు, ఇంకోవైపు అనారోగ్య పరిస్థితులు తట్టుకోలేక పోయాడు. తన సమస్యలను అర్జీ రూపంలో రాసుకుని గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కొద్ది సేపు మెట్ల మీద కూర్చున్న మోషె వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న మోషేను, పక్కన పురుగుల మందు డబ్బాను గమనించి అక్కడున్నవారు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు 48 గంటల పాటుఅబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. చంపుతానని బెదిరిస్తున్నాడు.. తాను తీసుకున్న డబ్బును వడ్డీతో సహా చెల్లించినా ఇంకా చెల్లించాలంటూ రాపూరి వాసు అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని మోషె వాపోయాడు. ప్రామ్సరీ నోట్లు, స్టాంపు పేపర్లపై సంతకాలు చేయించుకోవడంతోపాటు డబ్బు చెలించకుంటే చంపుతానంటూ ఇంటికి వచ్చి బెదిరించాడన్నాడు. దీంతో తనకు మరణమే శరణ్యమని పురుగులమందు తాగినట్లు చెప్పాడు. తన గోడు జిల్లా కలెక్టర్‌కు చెప్పుకోవాలన్న ఉద్దేశంతో కలెక్టరేట్‌కు వెళ్లినట్లు తెలిపాడు. తనను, తన కుటుంబాన్ని వాసు బారి నుంచి కాపాడాలని వేడుకున్నాడు. -
సారీతో సరి
‘దేశం’ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గూండాగిరీ.. ⇒ సర్కారు తీరుపై అంతా విస్మయం ⇒ ఇదేం ప్రజాస్వామ్యం అంటూ అధికార వర్గాల మండిపాటు ⇒ దోషులను కాపాడటానికి స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి ⇒ ‘సారీ’తో వివాదం ముగిసిందని కమిషనర్‌తో చెప్పించిన వైనం సాక్షి, అమరావతి: నడి రోడ్డులో సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నిర్బంధించి.. ఆయనపై గూండాగిరీకి ప్రయత్నించి, అడ్డొచ్చిన ఆయన గన్‌మెన్‌పై దాడికి దిగిన టీడీపీ ఎంపీ కేశినేని బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. అధికారం అండ చూసుకుని నడిబజారులో పేట్రేగిన కేశినేని ట్రావెల్స్ అధినేత, టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి సింపుల్‌గా ‘సారీ’తో సరి పెట్టించింది. విజయవాడ వీధుల్లో ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకుని నోటికొచ్చినట్లు దుర్భాషలాడితే కేసు కూడా పెట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇదేం ప్రజాస్వామ్యమని, ఇలాగైతే రాష్ట్రంలో ఉద్యోగాలు చేయలేమంటూ అధికార వర్గాలు మండిపడుతున్నాయి. దౌర్జన్యం, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించడం భవిష్యత్‌లో ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఇప్పటికీ న్యాయం చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా చంద్రబాబు వనజాక్షినే తప్పు పట్టారని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ తీరు పట్ల ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ నేతలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పౌర సమాజం ప్రభుత్వ తీరును ఎండగడుతోంది. ఆదివారం ఆద్యంతం హై డ్రామా టీడీపీ నేతలు దాడికి పాల్పడి అత్యంత హేయంగా కమిషనర్‌ను దూషించిన సంఘటనపై ఆదివారం ఆద్యంతం పెద్ద హై డ్రామానే నడిచింది. దాడికి పాల్పడిన వారు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత.. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి వివాదాన్ని పూర్తిగా పక్కదారి పట్టించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు పెట్టించిన చంద్రబాబు.. తమ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఏకంగా ఐపీఎస్ అధికారిపై తిట్ల దండకం ప్రారంభించి గన్‌మెన్‌పై ఏకంగా దాడి చేసినా ‘సారీ’తో దారి మళ్లించారు. ఈ ఘటనపై ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ భవన్లో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగుల జేఏసీ సమావేశమైంది. కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గన్‌మెన్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్యే బొండా ఉమ, ఎంపీ కేశినేని నానిలపై కేసులు నమోదు చేయాలని, లేకుంటే పెన్‌డౌన్‌కు సిద్ధమన్నారు. ప్రభుత్వమంటే ఇదేనా? ప్రభుత్వం అంటే గూండాల్లా వ్యవహరించడమా? అని ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? ఉద్యోగులు ప్రశాంతంగా విధులకు హాజరు కావాలా? వద్దా? అని నిలదీసింది. ఓ సీనియర్ ఐపీఎస్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పోలీస్ అధికారులు, వారి సంఘం ఏం చేస్తున్నారని మండిపడింది. సాయంత్రంలోగా కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఆ తర్వాత రవాణా ఉద్యోగులు, అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాంను కలిసేందుకు బయలుదేరారు. సీఎస్‌ను కలిసేందుకు వెళుతుండగా, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు నేరుగా సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. తన పట్ల ఎమ్మెల్యే బొండా ఉమ, కేశినేని వ్యవహరించిన తీరును కమిషనర్.. చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వివాదాలు మంచిది కాదని ముఖ్యమంత్రి.. కమిషనర్‌కు సూచించినట్లు తెలిసింది. కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తన కార్యాలయంలో కూర్చొంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముగ్గురు వచ్చి క్షమాపణలు చెబుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో రవాణా ఉద్యోగులు, కమిషనర్ వెనుదిరిగి రవాణా కార్యాలయానికి చేరుకున్నారు. కొద్ది సేపటికే కేశినేని నాని, బొండా ఉమ, బుద్దా వెంకన్నలు ఆర్టీసీ హౌస్‌కు చేరుకుని కమిషనర్ బాలసుబ్రమణ్యంకు క్షమాపణలు చెప్పారు. వివాదం ముగిసినట్లే: బాలసుబ్రహ్మణ్యం కేశినేని నాని, బొండా ఉమ, బుద్దా వెంకన్నలు వచ్చి క్షమాపణలు చెప్పారని, అవగాహనా రాహిత్యంతోనే వారు అలా వ్యవహరించారని రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరైనా అలానే వ్యవహరిస్తారని, తన సెక్యూరిటీ సిబ్బంది, రవాణా శాఖ అధికారుల నిబద్దతకు గర్వపడుతున్నాన న్నారు. ఒక ట్రావెల్స్ బస్సు ప్రమాదం విషయంలో వివాదం రేగిందని, బస్సులో సాంకేతిక లోపం ఉందని నివేదిక ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని అనుచరుడు పట్టాభి అనే వ్యక్తి ఒత్తిడి చేశారన్నారు. తాము రూల్స్ ప్రకారం నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పిన తర్వాత వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడం సరికాదని, ఇంతటితో వివాదం ముగిసినట్లేనన్నారు. మీ గన్‌మెన్‌పై ఎమ్మెల్యే బొండా ఉమా చేయి చేసుకున్నందున చట్టపరమైన చర్యలు ఏమీ ఉండవా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనకు రక్షణగా నిలిచిన గన్‌మెన్‌కు న్యాయం చేస్తానని, చర్యలు ఎలా ఉంటాయో మీరే చూస్తారంటూ ముక్తాయించారు. తనపై ఇంతలా, ఇలా దాడి జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర చర్చ సీనియర్ ఐపీఎస్ బాలసుబ్రమణ్యం ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పని చేశారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా, ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా చక్కదిద్దగల దిట్టగా ఆయనకు పేరుంది. మావోయిస్టులు, సెటిల్మెంట్ గ్యాంగ్, అరాచక శక్తులకు టెర్రర్ పుట్టించే ట్రాక్ రికార్డు ఉన్న పోలీస్ అధికారి బాలసుబ్రమణ్యంనే కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు టార్గెట్ చేయడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ఐపీఎస్‌పై టీడీపీ దాష్టీకం
‘దేశం’ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వైర విహారం రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ఎంపీ కేశినేని బృందం దుర్భాషలు ⇒ గడ్డి తింటున్నావు... ఎంపీ అంటే లెక్కలేదా? అంటూ తిట్లదండకం ⇒ కొమ్ములొచ్చాయా.. ఏం బతుకు నీదంటూ ఎమ్మెల్యే బొండా చిందులు ⇒ ట్రావెల్స్ కేసులో తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ఎంపీ హుకుం ⇒ కమిషనర్ గన్‌మ్యాన్‌పై దాడి చేసిన బొండా సాక్షి, అమరావతి బ్యూరో / విజయవాడ : ‘నువ్వు గడ్డి తింటున్నావు. గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపి స్తున్నావు. ఎంపీని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్లిపోతున్నావా?... ప్రజాప్రతినిధి అంటే నీకు లెక్కలేదా? నీ సంగతి తేలుస్తా’ అని విజయ వాడ టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని శ్రీనివాస్(నాని) రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డారు. ‘ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా ...? ఏం బతుకు నీది?’ అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కమిషనర్‌ను తూలనాడుతూ చిందులు తొక్కారు. కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్‌బోర్డు చైర్మన్ నాగుల్ మీరా, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ దాదాపు 200 మంది కార్యకర్తలతో కలసి శనివారంనాడు కమిషనర్‌ను విజయ వాడ నడిరోడ్డుపై దిగ్బంధించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యం ను దాదాపు రెండుగంటలపాటు నిలబెట్టిమరీ దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు. పైగా కమిషనరే క్షమాపణ చెప్పాలంటూ ఆయన్ని ఘెరావ్ చేశారు. పోలీస్ డీసీపీ పాల్‌రాజ్, రవాణా శాఖ డీటీసీ మీరా ప్రసాద్‌లతోపాటు పలువురు అధికారులు ఎంతగా ప్రాధేయపడినా వెనక్కితగ్గలేదు. అధికార టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాష్ట్ర రాజధానిలో జరిగిన ఈ ఘటనతో ప్రభుత్వ యంత్రాంగం నిర్ఘాంతపోయింది. కమిషనర్‌పై ఎంపీ ఒత్తిడి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు విజయవాడ ఆటోనగర్ వద్ద ఈ నెల 22న ఓ వ్యక్తిని ఢీకొనడంతో ఆయన మృతిచెందారు. దీంతో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును పోలీసులు సీజ్ చేసి విచారణ కోసం విజయవాడ రవాణాశాఖ ఉప కమిషనర్(డీటీసీ) కార్యాల యానికి పంపారు. రవాణా శాఖ అధికారులు ఆ బస్సు కండిషన్‌ను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ ఫైలును పరిశీలించేందుకు రవాణా శాఖ కమిషనర్ శనివారం విజయ వాడ బందరురోడ్డులోని డీటీసీ కార్యాలయా నికి వచ్చారు. ఇంతలో ఎంపీ కేశినేని నాని ప్రధాన అనుచరుడు పట్టాభి అక్కడకు చేరుకు న్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుపై నివేదికను తాము చెప్పినట్లు రూపొందించాలని పట్టాభి అక్కడి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అప్పటికే దాదాపు తయారైన నివేదికను మార్చి వేసి తాము సూచించినట్లు తయారు చేయాలని కేశినేని ఆదేశించారని కూడా పట్టాభి చెప్పినట్లు సమాచారం. ‘మాకు నిబంధనలు తెలుసు. నివేదిక ఎలా తయారు చేయాలో అలా చేస్తాం. ఇందులో మీరు ఒత్తిడి తేవడం సరికాదు’అని కమిషనర్ తన అభిప్రాయాన్ని అతనికి స్పష్టం చేశారు. నడిరోడ్డుపై కేశినేని వీరంగం... ఈ సమాచారం తెలుసుకున్న కేశినేని నాని తానే నేరుగా రంగంలోకి దిగారు. దాదాపు 200మంది టీడీపీ కార్యకర్తలతోసహా డీటీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే కమిష నర్ తన పని ముగించుకుని వాహనంలో బయలుదేరారు. కేశినేని తన వాహనాన్ని నేరుగా కమిషనర్ వాహనానికి ఎదురుగా నిలిపారు. వెంటనే కిందకు దిగి కమిషనర్ వాహనాన్ని తన అనుచరులతో చుట్టుముట్టి గట్టిగా కేకలు వేయసాగారు. వాహనం దిగిన కమిషనర్‌ను టీడీపీ కార్యకర్తలు అంతా చుట్టు ముట్టి కదలనీయకుండా చేశారు. ‘నేను వస్తు న్నానని తెలిసి వెళ్లి పోతున్నావా...? ఏం టీడీపీ ఎంపీ అంటే ఆ మాత్రం గౌరవం, భయం లేవా...? అంతా నీ ఇష్టమేనా?’ అని కేశినేని తీవ్రస్థాయిలో కమిషనర్‌పై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో కమిషనర్ నిశ్చేష్టులయ్యారు. ఆయనకు కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కేశినేని తీవ్రస్థా యిలో దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. ‘నువ్వు గడ్డి తింటున్నావు. నీ సంగతి తేలుస్తా’ అని పెద్ద పెట్టున కేకలు పెట్టారు. అంతలోనే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ కార్పొరేటర్లు, ఇతర కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారు కూడా కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలతో విరుచుకుపడ్డారు. కేశినేని నాని అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆరెంజ్ ట్రావెల్స్ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి బంధువు అనిల్‌రెడ్డికి చెందిందంటూ సంబంధంలేని ఆరోపణలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయ త్నం చేయడం విస్మయానికి గురిచేసింది. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు జరుగుతు న్నప్పుడు మాత్రం జగన్ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. గన్‌మ్యాన్‌పై ఎమ్మెల్యే బోండా దాడి తన మాట విననందుకు కమిషనర్ తనకు క్షమాపణ చెప్పాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. లేకపోతే అక్కడి నుంచి కదలనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. బొండా ఉమ కూడా తీవ్రస్థాయిలో కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నీకు ఏమైనా కొమ్ములున్నాయా...? నువ్వు ఏమైనా దిగి వచ్చావా? ఏం బతుకు నీది?’ అని విరుచుకుపడ్డారు. అదే ఊపులో బొండా ఉమ.. కమిషనర్ మీదకు రాబోయా రు. దీన్ని గమనించిన కమిషనర్ గన్‌మ్యాన్ ఆయనకు అడ్డంగా వచ్చారు. దీంతో బొండా ఆగ్రహంతో ఆ గన్‌మ్యాన్‌పై దాడి చేశారు. పరిస్థితి దాదాపు అదుపుతప్పి కమిషనర్, ఇతర సిబ్బందిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి సిద్ధపడేంతవరకు వచ్చింది. విజయవాడ రవాణా శాఖ ఉప కమిషనర్ మీరా ప్రసాద్ దాదాపు ఐదారు సార్లు చేతులు ఎత్తి నమస్కరిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలకు క్షమాపణలు చెబుతూ కమిషనర్‌ను వదిలేయాలని ప్రాధేయపడ్డారు. అధికారుల దుస్థితి చూసి అంతా అవాక్కయ్యారు. విజయవాడ పోలీస్ డీసీపీ పాల్‌రాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేశినేని, టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను శాంతించమని ప్రాధేయపడ్డారు. సోమవారం విధుల బహిష్కరణ తమ కమిషనర్‌పైనే టీడీపీ నేతల చౌకబారు విమర్శలు చేయడం, గన్‌మ్యాన్‌పై చేయి చేసుకోవడంపై రవాణా అధికారులు ఆందోళ నకు దిగనున్నారు. ఐజీ స్థాయి అధికారిపైనే ఈ మాదిరిగా వ్యవహరించిన టీడీపీ నేతలు కేశినేని, బొండా ఉమాలపై పోరు బాట పడతామని, ఆదివారం కార్యాచరణ ప్రకటిస్తామని రవాణా అధికారుల సంఘం నేత ఒకరు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ప్రాథమికంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో విధులు బహిష్కరిస్తామని పేర్కొన్నారు. సొంత వ్యాపారం కోసమే గూండా గిరీ.. ట్రావెల్స్ రంగంలో ఉన్న ఎంపీ కేశినేని సొంత వ్యాపారం కోసమే రవాణాశాఖ కమిషనర్‌తో వివాదం పెట్టుకున్నారని రవాణా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణకు చెందిన పోటీ ట్రావెల్స్ ఆరెంజ్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేయాలని కేశినేని నాని, అతని అనుచరులు రవాణా శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేశారు. దీంతో ఆరెంజ్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేశారు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకే కేశినేని దాడులు చేయిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించి ఆలిండియా పర్మిట్లు పొందిన తమ బస్సులపై దాడులు చేయడం సరికాదని ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యం ఏపీ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దృష్టికి తెచ్చింది. తెలంగాణాకు చెందిన తమను ఇలా వేధించడం సరికాదని వారు అభ్యర్థించారని సమాచారం. దాంతో ఏకపక్షంగా కేసులు నమోదు చేయవద్దని అధికారులకు కమిషనర్ సూచించినట్లు సమాచారం. ఈ లోగా విజయవాడలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. ఈ కేసులో తాను చెప్పినట్లు నివేదిక రూపొందించాలని ఎంపీ కేశినేని కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చారనేది విశ్వసనీయ సమాచారం. తాను కలిసేందుకు వస్తానని ఎంపీ ఫోన్లో కోరగా బాలసుబ్రహ్మణ్యం స్పందించలేదని ఆయన వర్గీయులు చెపుతున్నారు. దీంతో కేశినేని మందీమార్బలంతో కలిసి కమిషనర్‌ను కలిసేందుకు ఆర్టీసీ భవన్‌కు వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో కృష్ణా డీటీసీ కార్యాలయానికి వెళ్లి అక్కడే ఉన్న బాలసుబ్రహ్మణ్యంపై నోరు పారేసుకున్నారు. గతంలోనూ ఆరెంజ్ ట్రావెల్స్ వ్యవహారంలో జేసీ ప్రభాకర్, తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ మధ్య పెద్ద దుమారమే నడిచింది. నేను నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తాయి: కమిషనర్ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. కమిషనర్ దగ్గరకు వచ్చి ఎంపీకి క్షమాపణ చెబితే విడిచిపెడతామని చెప్పారు. లేకపోతే పరిస్థితి చెయ్యిదాటిపోతుందని హెచ్చరించారు. దీనిపై కమిషనర్ తీవ్రంగా స్పందించారు. ‘నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా డ్యూటీ నేను చేశా. నేను నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తా యి. మీడియా ముందు మాట్లాడటం ఇష్టం లేదు’ అని అన్నారు. అనంతరం డీసీపీ పాల్‌రాజ్ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఒప్పించి.. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ కార్యాల యానికి తీసుకు వెళ్లారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో చర్చిం చారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ సమస్య పరిష్కారమైందని తెలిపారు. -
అతగాడి అహానికి అతివ బలి
సాంకేతిక యుగంలో మహిళలు.. పురుషుడితో పోటీపడి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అన్ని రంగాల్లోను విజయ కేతనం ఎగరేస్తున్నారు. కానీ పశు బలం ముందు ఓడిపోతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు వేస్తున్నా మృగాళ్ల దాడులు ఆగడం లేదు. అనేక చోట్ల మహిళలు, బాలికలపై ఏదో ఒక రూపంలో హింస కొనసాగుతునే ఉంది. మూడు నెలల క్రితం నగర శివారులో 30 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతాలపై పోలీసుల దర్యాప్తు సాగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ హతులు, హంతకుల వివరాలు లభ్యం కాలేదు. నగరంలో చోటుచేసుకుటున్న దారుణాలకు ఇవి ఉదాహరణ మాత్రమే. నెల రోజుల క్రితం బండ్లగూడ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని తనను ప్రేమించలేదని గొంతుకోసిన సంగతి తెలిసిందే. ఒకవైపు రాష్ర్ట రాజధాని హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకు, మహిళలకు పూర్తి భద్రత, రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం బలమైన చట్టాలను రూపొందిస్తోంది. మరోపక్క మహిళలపై హింస కొనసాగుతూనే ఉంది. చిన్నారుల నుంచి వయోధికుల వరకు ఏదో ఒక రూపంలో హింసకు గురవుతూనే ఉన్నారు. లోకం పోకడ తెలియన అమాయక పాపలను సైతం కాంతో కళ్లు మూసుకుపోయిన కాలనాగులు కాటేస్తున్నాయి. వారికి రక్షణ కల్పిచాల్సినవాడే భక్షణకు దిగుతున్నాడు. నేడు ‘మహిళలపై హింసా వ్యతిరేక అంతర్జాతీయ దినం’ సందర్భంగా ప్రత్యేక కథనం. - సాక్షి,సిటీబ్యూరో ⇒ ఉక్కు చట్టాలు ఉన్నా కొనసాగుతున్న హింస ⇒ వేధింపులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం ⇒ పోలీసులను ఆశ్రయించేందుకు వెనుకంజ ⇒ ‘మహిళలపై హింసా వ్యతిరేక దినం’ ప్రత్యేక కథనం న్యాయమూర్తుల కొరత.. మరోపక్క దాఖలవుతున్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పాత కేసులను పూర్తిచేయాలంటే, న్యాయమూర్తుల సంఖ్య పెరగాలి. ఏ నిష్పత్తిలో జడ్జీల సంఖ్య ఉండాలన్నదానిపై శాస్త్రీయత లేదు. ప్రస్తుతం జనాభా ప్రాతిపాధికనే న్యాయమూర్తుల సంఖ్యను లెక్కిస్తున్నారు. పది లక్షల జనాభాకు 10 నుంచి 15 మంది మాత్రమే న్యాయమూర్తులు ఉన్నారు. అదే అమెరికాలో 150 మంది దాకా ఉన్నారు. 2002 నాటి ఆలిండియా జడ్జీల కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, లా కమిషన్ సూచనల ప్రకారం పది లక్షల సంఖ్యకు 50 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు వేసి తద్వారా మహిళల కేసులను సత్వర పరిష్కారం చేసేందుకు వీలుంది. అయితే అందుకు తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేరు. కొలిక్కిరాని వేల కేసులు జంట పోలీసు కమిషనరేట్లలో 2011 నుంచి ఈ ఏడాది జూలై వరకు వివిధ రూపాల్లో మహిళలు ఎదుర్కొంటున్న హింసపై 14,050 కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 6,732, సైబరాబాద్ కమిషనరేట్‌లో 7,318 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇంకా వేల సంఖ్యలో మహిళలు మౌనంగా హింసను భరిస్తున్నారు. వారిలో మృగాళ్ల హింసను ఎదిరించేందుకు ముందుకు రావడం లేదు. ఏమవుతుందోనని భయపడి కేసులు పెట్టలేకపోతున్నారు. మరోవైపు నిందితుల అరెస్టు, కోర్టు విచారణ, చార్జిషీట్ దాఖలు, శిక్షల అమలు నత్తనడకన సాగుతోంది. అడుగడుగునా కఠిన పరీక్ష.. హైదరాబాద్ మహా నగరం అన్ని రంగాలకు అంతర్జాతీయ వేదిక. మహిళలు అన్నింటిలోను అద్భుతాలు సృష్టిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప నిపుణులుగా రాణిస్తున్నారు. కానీ పురుషాధిపత్య భావజాల ం, విలువల్లో ఆశించిన మార్పులు రాకపోవడం వల్ల ఇప్పటికీ మగాడి చేతుల్లో హింసకు గురవుతున్నారు. బలమైన చట్టాలు ఉన్నప్పటికీ అడుగడుగునా లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హ త్యలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు సమాజంలో అమ్మాయిలకు భద్రత ఉండదనే ఒకే ఒక్క కారణంతో చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకు వెనుకాడుతున్నారు. అంటే ఇంటా, బయటా హింస ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. గృహహింస వ్యతిరేక చట్టం ఉన్నా అత్తింటి ఆరళ్లను ఎదిరించే సాహసం చేయలేకపోతున్నారు. ఒకవైపు మహిళా భద్రతా కమిటీ అనేక చర్యలు చేపట్టింది. సిటీ బస్సుల్లో భద్రత కోసం స్లైడ్ డోర్స్‌ను ప్రవేశపెట్టారు. పోలీసుల ‘షి’ బృందాలు రంగంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో సీసీ కెమెరాల నిఘా ఉంది. అయినా మహిళా ఉద్యోగులు నిర్భయంగా తిరగలేకపోతున్నారు. ఒంటరి ప్రయాణం అంటేనే భయపడుతున్నారు. సోషల్ మీడియా సైతం మహిళల భద్రతకు అనేక సవాళ్లు విసురుతోంది. మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు నగరంలో మహిళల భద్రతపై పూర్తిగా దృష్టి సారించాము. కళాశాలలు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ‘షీ టీమ్స్’ను రంగంలోకి దించాం. గృహహింస, వరకట్న కేసుల విషయంలో కూడా చొరవ తీసుకుంటున్నాం. వరకట్న కేసులలో ఫిర్యాదు రాగానే భార్యాభర్తలు ఇద్దరిని పిలిచి ప్రత్యేక అధికారులతో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఆ తరువాతే కేసు నమోదు చేస్తున్నాం. ఎక్కువ కేసులు కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కారం అవుతున్నాయి. ఇక వరకట్నం కేసులలో తప్పించుకు తిరుగుతున్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేస్తున్నాం. మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలి. - స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్ ప్రతి ఠాణాలోను మహిళా రిసెప్షనిస్టు మహిళలు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఠాణాలోను మహిళా రిసెప్షనిస్టును ఏర్పాటు చేశాము. ముఖ్యంగా హైటెక్ సిటీ, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాలలో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగులకు పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నాం. వారికి 24 గంటల ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఉన్నాయి. ‘అభయ’ ఘటనలో నిందితులకు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నాం. స్కూళ్లలో బాలికలపై వేధింపులను అరికట్టేందుకు ‘చైల్డ్ అబ్యూజ్ మేనేజింగ్ కమిటీ’ (సీఏఎంసీ)లను ఏర్పాటు చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల వేధింపులకు పాల్పడే వారు వెనకంజ వేయక తప్పదు. - రమారాజేశ్వరి, మల్కాజ్గిరి డీసీపీ -
కానిస్టేబుళ్లకు వేధింపులు
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్, రాత్రింబవళ్లు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే యాంటి నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) కానిస్టేబుళ్లు వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆర్ఐ(రిజర్వ ఇన్స్పెక్టర్) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వారం తా విలవిలలాడుతున్నారు. తన సొంత పనులు చేసిపెట్టేవారికే ప్రాధాన్యమిస్తూ మిగిలిన వారిని వేధింపులకు గురిచేస్తున్నాడని ఏఎన్ఎస్ ఆర్ఐ సంకురయ్యపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వేధింపులు ఇలా.: సంకురయ్య రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు రూరల్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ప్రకాశం జిల్లాలో కానిస్టేబుళ్ళను వేధింపులకు గురిచేయడం, ఇష్టానుసారంగా వ్యవహరించినందునే గుం టూరుకు బదిలీ చేసినట్లు విమర్శలున్నాయి. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో 190మంది కానిస్టేబుళ్లు ఏఎన్ఎస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. సంకురయ్య ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని వారంతా వాపోతున్నారు. నెల రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ తన తండ్రి చనిపోయాడని వార్త రావడంతో ఆర్ఐ వద్దకు వెళ్లి సెలవు కావాలని కోరగా, సెలవు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. చివరికి ఆ కానిస్టేబుల్ ఓఎస్డీ వెంకటయ్యను కలిసి సమస్య వివరించడంతో పది రోజుల సెలవు ఇచ్చారు. పల్నాడు ప్రాంతంలో మావోయిస్టుల సమాచారం అందించినా వాస్తవం కాదంటూ కొట్టిపారేస్తున్నాడని కానిస్టేబుళ్లు వాపోతున్నారు. ఆయన ఆగడాలను ఎస్పీ జె.సత్యనారాయణకు వివరించేందుకు ముగ్గురు కానిస్టేబుళ్లు వెళ్ళగా విషయం తెలుసుకున్న ఆర్ఐ వారిని పిలిపించి తీవ్రంగా మందలించడంతోపాటు మెమోలుజారీ చేసినట్లు తెలిసింది. ఓఎస్డీ ఆదేశాలను సైతం బేఖాతరు చూస్తూ... కానిస్టేబుళ్లకు సొంతపనులు అప్పగించడం, చేయనివారిని వేధింపులకు గురిచేయడం, చార్జిమెమోలు జారీ చేయడం పరిపాటిగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నా దృష్టికి రాలేదు : ఓఎస్డీ సిబ్బందిని ఆర్ఐ వేధిస్తున్నట్టు తన దృష్టికి రాలేదని ఓఎస్డీ వెంకటయ్య న్యూస్‌లైన్‌కు చెప్పారు. వాస్తవమని విచారణలో తేలితే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎన్ఎస్ విభాగంలో ఎవరికి సెలవులు అవసరమైనా వెంటనే మంజూరు చేయాలని ఆర్ఎస్ఐ, ఆర్ఐలను ఆదేశించానని తెలిపారు. ఆర్ఐ తీరుపై దృష్టి సారించామన్నారు.