వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెదదుండ్లూరులో దళిత కుటుంబాలపై దాడి, ఇళ్ల విధ్వంసం ఘటనలో మంత్రి ఆదినారాయరణ రెడ్డి కుటుంబం ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. మంత్రి ఆది భార్య అరుణతోపాటు మంత్రి సోదరుడి భార్య సైతం దగ్గరుండిమరీ తమ అనుచరులకు ఆదేశాలిస్తోన్న వీడియోలు బహిర్గతమయ్యాయి. వైఎస్సార్‌సీపీ నేతలను ఇంటికి ఆహ్వానించారన్న కారణంతో నవవరుడు, పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ సంపత్ ఇంటి మంత్రి అనుచరులు, టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. సుగమంచిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమానులను కూడా తీవ్రంగా కొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్దదుండ్లూరు, సుగమంచిపల్లిలో సోమవారం కూడా పోలీస్ పికెట్ కొనసాగుతున్నది.