Minister Adinarayana Reddy
-
మంత్రి ఆది భార్య దగ్గరుండిమరీ..
సాక్షి, జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెదదుండ్లూరులో దళిత కుటుంబాలపై దాడి, ఇళ్ల విధ్వంసం ఘటనలో మంత్రి ఆదినారాయరణ రెడ్డి కుటుంబం ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. మంత్రి ఆది భార్య అరుణతోపాటు మంత్రి సోదరుడి భార్య సైతం దగ్గరుండిమరీ తమ అనుచరులకు ఆదేశాలిస్తోన్న వీడియోలు బహిర్గతమయ్యాయి. వైఎస్సార్సీపీ నేతలను ఇంటికి ఆహ్వానించారన్న కారణంతో నవవరుడు, పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంపత్ ఇంటి మంత్రి అనుచరులు, టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. సుగమంచిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ అభిమానులను కూడా తీవ్రంగా కొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్దదుండ్లూరు, సుగమంచిపల్లిలో సోమవారం కూడా పోలీస్ పికెట్ కొనసాగుతున్నది. (చదవండి: మంత్రి ఆది వర్గీయుల అరాచకం) అనుచరులను పురమాయిస్తూ..: పెద్దదుండ్లూరు గ్రామంలో ఇటీవలే వివాహం చేసుకున్న కానిస్టేబుల్ సంపత్ దంపతులను ఆశీర్వదించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆ పార్టీ కీలక నేతలు ఆదివారం గ్రామానికి తరలివెళ్లారు. ఎంపీ వస్తున్నారన్న సమాచారం అందడంతో ఆయా గ్రామాల్లో తమ ఆధిపత్యానికి సవాలుగా భావించిన మంత్రి వర్గీయులు ధ్వంసరచన చేశారు. ముందుగా రౌడీమూకలను వెంటేసుకుని మంత్రి తనయుడు సుధీర్‌రెడ్డి, మంత్రి భార్య అరుణలు గ్రామంలో బీభత్సం సృష్టించారు. ‘మాకు తెలియకుండా వైఎస్సార్సీపీ నాయకులను ఆహ్వానిస్తారా?’ అంటూ దళిత కుటుంబాలపై దాడికి దిగారు. పెళ్లింటి ముందు వేసిఉన్న షామియానాలను చించిపారేశారు. పక్కనే ఉన్న సుగుమంచిపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైన వీరారెడ్డి, అతని కుటుంబీకులను ఆది వర్గీయులు చావబాదారు. మంత్రి భార్య అరుణ, మంత్రి సోదరుడి భార్య.. సుగమంచిపల్లిలో ఓ ఇంట్లో కూర్చొని అనుచరులను పురమాయిస్తోన్న వీడియో దృశ్యాలు బయటికొచ్చాయి. అర్ధరాత్రి తర్వాత ఎంపీకి అనుమతి..: పెద్దదండ్లూరు వెళ్లకుండా తనను అడ్డుకున్న పోలీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ఎంపీగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కుందని, తనను అడ్డుకోవడం సరికాదని అన్నారు. అయినాసరే పట్టించుకోని పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులపై లాఠీచార్జి చేసి, నేతలను చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎంపీ అవినాష్, వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. (చూడండి: మంత్రి బెదిరిస్తే భయపడం) పోలీసులకు ఫిర్యాదు: పెద్దదుండ్లూరు, సుగమంచిపల్లిల్లో మంత్రి ఆదివర్గీయుల దాష్టీకాలపై బాధితులు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వెంటరాగా, బాధితులు సుబ్బరామిరెడ్డి, సంపత్ జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దళిత కుటుంబంపై దాడి చేయించిన మంత్రి ఆదినారాయణరెడ్డిపై కుల వివక్షవ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే మంత్రిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
అరాచకంలో నేరుగా పాల్గొన్న మంత్రి భార్య
-
సీఎం రమేష్‌పై మంత్రి ఆది సంచలన వ్యాఖ్యలు
-
మంత్రి ఆదినారాయణరెడ్డిపై రామసుబ్బారెడ్డి విమర్శలు
సాక్షి, వైఎస్సార్ కడప : మంత్రి ఆదినారాయణరెడ్డిపై జిల్లాలో రోజురోజుకు ఆగ్రహం వ్యక్తం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. సోమవారం తాజాగా పులివెందుల మినీ మహానాడులో మంత్రి ఆదినారాయణ రెడ్డిపై రామసుబ్బారెడ్డి పలు విమర్శలు చేశారు. రాజకీయాలు ప్రజలకు సేవ చేసేందుకే కానీ, వారిపై పెత్తనం చెలాయించేందుకు కాదని ఆయన ఆదిపై మండిపడ్డారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డామని, అయినా ఏనాడు పార్టీ వీడలేదన్నారు. పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లామని, కొత్తగా పార్టీకి వచ్చిలోన వారిని సీఎం చెబితే గౌరవిస్తున్నామని చెప్పారు. కానీ కొంత మంది స్టేట్మెంట్లు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. నాయకులను, కార్యకర్తలను విమర్శిస్తే పార్టీకే నష్టమని, నేను ఇప్పుడు వారి గురించి మట్లాడితే పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. మాట్లాడే రోజు వచ్చినపుడు మాట్లాడతానని చెప్పారు. ఇక ఆదినారాయణ రెడ్డి జిల్లాలో టీడీపీని బలోపేతం చేయాల్సింది పోయి మంత్రి వర్గాలకు ఆజ్యం పోస్తున్నారని ఆపార్టీ సీనియర్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అనైతికతకు నిలువుటద్ధంగా, అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిగా, మాటపై నిలకడ లేని తత్వం కల్గిన వారు ఎవరైనా ఉన్నారంటే...అది మంత్రి ఆదినారాయణరెడ్డి మాత్రమేనని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
టీడీపీలో పెరుగుతున్న ఆధిపత్య పోరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : అధికార పార్టీలో ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటీవల మంత్రి అఖిలప్రియ- ఏవీ సుబ్బారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని వారికి సర్ది చెప్పారు. మినీ మహానాడు సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయిన విషయం విదితమే. అయితే జమ్మలమడుగులో మరోమారు టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. వైఎస్సార్ జిల్లాలో రామసుబ్బారెడ్డి- మంత్రి ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదాలు తలెత్తాయి. నేతలు పోటా పోటీగా మినీ మహానాడు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం రామసుబ్బారెడ్డి మినీ మహానాడును ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఆదినారాయణ రెడ్డిల విడిగా మినీ మహానాడు ఏర్పాటు చేశారు. దీంతో నేతల మధ్య అధిపత్య పోరు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ విధమైన సమస్యలు టీడీపీకి ఎదురు దెబ్బని చెప్పవచ్చు. -
ఆమాత్యా..! రాజ్యాంగం పట్ల గౌరవం లేదా!!
సాక్షి ప్రతినిధి, కడప: రాజ్యంగ బద్ధంగా నడుచుకుంటానని, రాగద్వేషాలకతీతంగా వ్యవహరిస్తానని ప్రజా శ్రేయస్సుకు పాటుపడతాని ప్రమాణం చేసిన మంత్రివర్యులు రాజ్యంగ విలువకు తిలోదకాలిస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతర్ చేస్తున్నారు. అధికారులు తప్పు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టినా, మొండిగా మంకుపట్టులో ఉన్న టీడీపీ నేతలకు మంత్రివర్యులు అండగా నిలుస్తున్నారు. నైతిక విలువలకు కోల్పోయిన ఆయన మరోమారు తన సహాజ ధోరణిని ప్రదర్శించిన వైనమిది. ప్రొద్దుటూరు మున్సిఫల్ గాంధీఫార్కులో వాటర్ ట్యాంకు నిర్మాణం పట్ల స్థానికులు ఆక్షేపణలు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అభ్యంతరం చెప్పారు. మరో 50 మీటర్లు దూరంలో మూతపడిన పాఠశాలలో నిర్మిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదని, అక్కడ చేపట్టాలని సూచించారు. దాదాపు 2లక్షల జనాభాకు ఉన్న ఒకే ఒక్క పార్కులో వాటర్ ట్యాంకు ఏర్పాటు చేసి, పాదచారులకు ఆటంకం లేకుండా చూడాలని ప్రజాహితం దృష్ట్యా అభ్యర్థించారు. మరోవైపు పార్కులు, పబ్లిక్కు యోగ్యతరమైన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఇంకోవైపు జిల్లా జడ్జి జి శ్రీనివాస్ జోక్యం అనివార్యమైంది. ప్రజాహితం మేరకు పార్కులో ట్యాంకు నిర్మించరాదని హితవు పలికారు. ఇవన్నీ లెక్కపెట్టకుండా మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎవ్వరూ ఎలాంటి ఆటంకాలు సృష్టించినా పార్కులో ట్యాంకు నిర్మిస్తామని ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. మంత్రిగా ఉండి సామాన్యులు మాట్లాడినట్లుగా వ్యవహరించడాన్ని పలువురు తప్పు బడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, జిల్లా జడ్జి జోక్యం కారణంగా పబ్లిక్‌హెల్త్, మున్సిఫల్ కమిషనర్ కాంట్రాక్టరు మరోచోట ట్యాంకు నిర్మిస్తామని రాతపూర్వకంగా విన్నవించినా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాత్రమే పార్కులో ట్యాంకు నిర్మిస్తామని మొండిగా వ్యవహరిస్తున్నారు. అందుకు వత్తాసుగా మంత్రి ఆదినారాయణరెడ్డి నిలుస్తుండడం విశేషం. వివాదస్పద స్థలంలోనే ఎందుకు...? ప్రొద్దుటూరు పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.138కోట్లుతో మైలవరం జలాశయం నుంచి పైపులైను ఏర్పాటు, 3ట్యాంకులు నిర్మించనున్నారు. 2ట్యాంకులు నిర్మాణంలో ఎలాంటి అభ్యంతరం లేదు. పార్కులో నిర్మించే వాటర్ ట్యాంకు పట్ల మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవికతను అర్థం చేసుకోకుండా ప్రజాహితం కోసమే పాలకులు ఉన్నారన్న సంకేతాలు ఇవ్వకుండా టీడీపీ నేత నిర్మించాలన్నారు, కాబట్టి అక్కడే నిర్మిస్తామని ప్రకటించడం ఏమేరకు సబబోనని పలువురు నిలదీస్తున్నారు. వివాదస్పదస్థలంలోనే ట్యాంకు నిర్మిస్తామని మంత్రి ఆది ప్రకటించడంపై ప్రజాస్వామ్యవాదులు ఆక్షేపిస్తున్నారు. చర్యలు చేపట్టడంలో మీనమేషాలులెక్కిస్తున్న పోలీసులు... గాంధీపార్కులో ట్యాంకు నిర్మాణం చేపట్టడం లేదని కమిషనర్, పబ్లిక్‌హెల్త్ విభాగం, కాంట్రాక్టర్ రాతపూర్వకంగా అక్కడ ట్యాంకు నిర్మించలేదని తెలిపారు. రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు 30మీటర్లు వెడల్పుతో, 12అడుగుల లోతు తవ్వి మట్టిని తరలించి విక్రయించుకున్నారు. ఇదేవిషయమై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహారించిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఆధారాలున్నప్పటికీ కేసు నమోదు చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేధించామని, తదుపరి చర్యలు చేపట్టుతామని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. చట్టవిరుద్ధమైన చర్యలు చేపట్టితే ఎవ్వరికైనా ఒక్కలాంటి చర్యలే ఉంటాయని మెసేజ్ ఇవ్వాల్సిన పోలీసు యంత్రాంగంలో డొల్లతనం బహిర్గతమౌతోంది. చట్టవిరుద్ధంగా, సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా వ్యవహారిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మున్సిపల్పార్కులోనే ట్యాంక్ నిర్మిస్తాం– మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రొద్దుటూరు టౌన్ : మున్సిపల్ పార్కులోనే ట్యాంక్ నిర్మించి తీరుతామని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి పార్కులో ట్యాంక్ కోసం తీసిన గొయ్యి వద్దకు మంత్రిని తీసుకొచ్చారు. టీడీపీ కౌన్సిలర్లు ఆ ప్రాంత మహిళలను పార్కులోకి తీసుకొచ్చి తాగునీటి సమస్య ఉందని మంత్రికి చెప్పారు. మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద మైలవరం జలాశయం నుంచి పైపులైన్ పనులను ప్రారంభించామన్నారు. ట్యాంక్ ఎక్కడ కట్టాలన్న విషయం ఇదివరకే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు నీటి సమస్య లేకుండా ఇక్కడ ట్యాంక్ నిర్మించాలని టెండర్లు పిలిచామన్నారు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వచ్చి అడ్డుకున్నారన్నారు. ఎవరు అడ్డుకున్నా పార్కులో ట్యాంక్ నిర్మాణ పనులు ఆగవని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీలో వర్గపోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ
సాక్షి, జమ్మలమడుగు : అధికార టీడీపీలో వివాదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో అధికారపార్టీ నేతల మధ్య మాటల యుద్దం చోటుచేసుకంది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్స్ ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. ‘జమ్మలమడుగులో పోటీ చేసేది తానే అని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో టికెట్స్ ప్రకటించే హక్కు మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు లేదు. పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నారు. లేని పోనీ ప్రకటనలు చేసి నియోజకవర్గంలో వర్గపోరు పెంచుతున్నారు’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. -
ముఖ్యమంత్రిగారు మిత్రద్రోహం చేయడం వల్లే..
-
ఆయనకి అత్తారింటికి దారి ఎటో తెలియదు..
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతలు మూకుమ్మడి ఎదురుదాడి చేయడమే కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగారు. వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించి మంత్రి పదవి చేపట్టిన ఆదినారాయణరెడ్డి ...పవన్‌పై ధ్వజమెత్తారు. ‘పవన్‌కు రాజకీయం ఒక సరదా. రాజకీయాలు సినిమా అనుకుని మాట్లాడుతున్నాడు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అందుకే వేచి చూశాం. పవన్‌కి అత్తారింటికి దారి ఎటో తెలియదు. ఏ అత్త ఇంటికి పోవాలో కూడా తెలియని పవన్...లోకేశ్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలను పవన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కాపులు భయపడుతున్నారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాపులను కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని, ఇప్పుడు పవన్ కల్యాణ్ జనసేనతో కాపులను ఎవరికి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని మంత్రి నారాయణ సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను చూసి కాపులందరు భయపడుతున్నారని అన్నారు. బీజేపీ పవన్‌ను పావులా వాడుకుంటుందని, నాలుగేళ్లు పాటు టీడీపీ అవినీతిపై ఆయన ఎందుకు మాట్లాడలేదన్నారు. పవన్ దీక్ష ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని, ఇన్నాళ్లు ఏం పోరాటం చేశారని ... ఏపీ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. తక్షణమే క్షమాపణ చెప్పాలి ప్రశ్నిస్తాను అంటున్న పవన్ కల్యాణ్.. సోదరుడు చిరంజీవి హోదాపై రాజ్యసభలో ఎందుకు పోరాటం చేయడంలేదో ముందుగా ప్రశ్నించాలని మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. ‘ఎంతోమంది నాయకులను మోసం చేసిన చిరంజీవిని పవన్ ప్రశ్నించాలి. మీ అన్నని మీరు ప్రశ్నించకపోతే ప్రజలే కాలర్ పట్టుకుని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. లోకేశ్ అవినీతి చేశాడు అని దారుణంగా మాట్లాడుతున్న పవన్...చిన్న ఇల్లు కోసం మీకు రెండు ఎకరాలు కావాలి కానీ...రాష్ట్ర రాజధానికి ఇన్ని అవసరం లేదని అంటారా?. పవన్‌కి రాజకీయ కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఇప్పటికైనా లోకేశ్, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి’ అని ఆమె సుజాత డిమాండ్ చేశారు. పవన్‌కు ఒక్కరాత్రిలో జ్ఞానోదయం పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలోప్రజల కోసం ఏమి చెబుతారా అని రాష్ట్రం అంతా వేచి చూసిందని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగల అనిత అన్నారు. అయితే ఒక్క రాత్రిలో ఆయనకు జ్ఞానోదయం అయినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు. సభలో కనీసం జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిమాటలో చంద్రబాబుని తిట్టడమే పనిలా మాట్లాడారని అనిత మండిపడ్డారు. ఇన్నేళ్లలో ఎక్కడా మాట్లాడని పవన్ నిన్న జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ మాట్లాడటం వెనుక ఉద్దేశ్యమేమిటో చెప్పాలన్నారు. కేంద్రం చేతుల్లో పవన్ కీలుబొమ్మగా మారారని, ఆయన ఒకసారి పునరాలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని ఆమె సూచించారు. -
ఆదినారాయణరెడ్డి దొంగా? దొరా?
సాక్షి, హైదరాబాద్ : సంతలో పశువులా అమ్ముడుపోయిన పశు సంవర్థకశాఖమంత్రి ఆదినారాయణరెడ్డికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. చంద్రబాబు వేసిన బిస్కెట్లకు అమ్ముడుపోయి వైఎస్ జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడితే రోడ్డు మీద పిచ్చికుక్కను కొట్టినట్లుగా కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె హెచ్చరించారు. చంద్రబాబు తన అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకోవడానికి ఆంబోతుల్లాంటి మంత్రులను ఉసిగొల్పి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పద్మజ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ నాయకుడు నాలుగేళ్లుగా ఏం చేశాడో చెప్పే ధైర్యం లేక ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు. మాట తప్పడం, వెన్నుపోటు పొడవడం, అవినీతికి పాల్పడే చంద్రబాబు పంచన తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే నాయకులు చేరి దొంగ స్వామీజీల్లా మైక్‌ల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని పద్మజ విమర్శించారు. పార్టీ ఫిరాయించి రాజీనామా చేసే దమ్ము లేని ఆదినారాయణరెడ్డి సెక్రటేరియట్ సాక్షిగా ప్రెస్మీట్లు పెట్టి రామసుబ్బారెడ్డి, నేను చెరో 50 శాతం వాటాలు పంచుకుంటున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థల ద్వారా రూ. 80 కోట్ల స్కాం జరిగితే దాని నుంచి తప్పించుకోవడానికి పార్టీ ఫిరాయించిన సంగతి అందరికీ తెలుసన్నారు. ఇంతకీ ఆదినారాయణ రెడ్డి దొంగా? దొరా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నత తేడా ఉందన్నారు. వంద ఏళ్ల కాంగ్రెస్‌ను ఎదిరించి ప్రత్యేక పార్టీ పెట్టి 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న గుండె ధైర్యం గల వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుకు శరీరం పెరిగింది కానీ మెదడు పెరగలేదని స్పష్టంగా అర్థం అవుతుందని పద్మజ విమర్శించారు. మహిళలపై అత్యాచారాలకు పూనుకునే ఆంబోతులకు వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అన్ని దారులు మూసుకుపోయాయి కాబట్టి ప్రత్యేక హోదా అంశంపై పోరాడుతున్నారన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను పద్మజ ఖండించారు. జగన్‌కు ప్రజల గుండెల్లో ద్వారాలు తెలుచుకుంటున్నాయని, అందుకే చెయ్యిలో చెయ్యి వేసి ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారన్నారు. దాన్ని చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటాలు చేశారని, ప్రస్తుతం ఎంపీలతో రాజీనామాలు, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధపడ్డారన్నారు. జననేత దమ్మూ, ధైర్యాన్ని ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణగదొక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి హోదా సంజీవని అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నాడన్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే పక్క రాష్ట్ర ఎమ్మెల్యేకి అభివృద్ధి కోసం రూ. 50 లక్షలు ఇస్తుంటే ఓటుకు కోట్ల కేసు పెట్టారని అంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు గడుస్తుందని, సంబరాలు చేసుకోవాలని నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారని పద్మజ గుర్తు చేశారు. చంద్రబాబుకు మొట్టమొదటగా పందుల శాఖ ఇచ్చారని, అందుకే ఇలాంటి పందులను చేరదీసి రాష్ట్రం మీదకు ఉసిగొల్పుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన తప్పులకు చెంపలేసుకొని ప్రెస్‌మీట్ పెట్టి ప్రజలను క్షమించమని వేడుకొని ముక్కు నేలకు రాయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆదినారాయణరెడ్డికి బుద్ధి చెప్పడానికి దళిత సామాజిక వర్గమంతా కంకణం కట్టుకొని ఉందన్నారు. వైఎస్ జగన్‌పై అవాకులు పేలితే రోడ్డుపై పిచ్చికుక్కను కొట్టినట్లుగా కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. -
‘అచ్చి’ నువ్వు 9 నెలలు ఓపిక పట్టు..
సాక్షి, విజయవాడ: మంత్రి ఆదినారాయణరెడ్డి సవాల్‌కు తాము రెడీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ప్రతి సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ చరిత్రపై ఎక్కడైనా, ఎప్పుడైనా తాము బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. దొడ్డిదారిన మంత్రి అయిన ఆదినారాయణరెడ్డికి నిజంగా కడప రెడ్డి అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే చంద్రబాబు చరిత్ర, వైఎస్ఆర్ చరిత్రపై చర్చించేందుకు సిద్దమా అని చాలెంజ్ చేశారు. శనివారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మంత్రులు విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి పంది బురదలో దొర్లినట్లు దొర్లుతూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తావా అని నిలదీశారు. విమర్శలు చేసేముందు మంత్రి ఆదినారాయణరెడ్డి తన రాజకీయ చరిత్ర ఏంటో చూసుకోవాలని సూచించారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, అవాకులు, చెవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అచ్చి నువ్వు 9 నెలలు ఓపిక పట్టు.. మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అచ్చి నువ్వు 9 నెలలు ఓపికపట్టు, మీ అన్న చనిపోతే నీకు పదవి వచ్చింది. ఆ తర్వాత నీ బాగోతం అంతా శ్రీకాకుళం జిల్లా ప్రజలు బట్టబయలు చేస్తారు.’ అని అన్నారు. -
ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టే సమభాగం పంచుకోమన్నారు
సాక్షి, అమరావతి: నేను, రామసుబ్బారెడ్డి గతంలో ప్రత్యర్థులం... ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటించాలని కార్యకర్తలకు చెప్పాను... ఇకపై అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమభాగం పంచుకోమని అధికారులు, నాయకులందరి సమక్షంలో సీఎం బహిరంగంగానే చెప్పారని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో ‘సాక్షి’ప్రచురించిన కథనం నేపథ్యంలో ఆయన తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏ పనులు చేసినా చెరో సగం పంచుకోవాలని సీఎం చెప్పారని వెల్లడించారు. తాను, రామసుబ్బారెడ్డి ఎటువంటి ప్రతిపాదనలు పెట్టినా చేస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం తాను నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పానని వివరించారు. కోటి రూపాయల పనులు వస్తే రామసుబ్బారెడ్డి, తాను చెరోసగం తీసుకోవాలని, కార్యకర్తలు సంయమనం పాటించాలని చెప్పానని... దానికే లాభాలు, వాటాలు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఘోరమైన అభూతకల్పనలు సృష్టించారని ఆరోపించారు. సీఎం కార్యాలయ అధికారులు పరిపాలనలో భాగంగానే ముఖ్యమంత్రి చెప్పిన అనేక అంశాలను పర్యవేక్షిస్తారని, వారిని వివాదాల్లోకి లాగటమేమిటని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై సచివాలయం మీడియా పాయింట్లోనే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. కేంద్రమంత్రి హోదాలో సాక్షాత్తు వెంకయ్యనాయుడే ప్యాకేజీ ముగిసిన అధ్యాయమని నాలుగుసార్లు చెప్పారని, అయితే కొన్ని రాష్ట్రాలకు హోదా పొడిగించారు కాబట్టి ఏపీకి కూడా అడుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ తెరుస్తామని, ప్రత్యేక హోదా కోసం పోరాడతామని తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరుతున్నారని, అయితే అడిగినవన్నీ కుదరకపోవచ్చని ఆయన తెలిపారు. -
తాళ్లపొద్దుటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
అవినీతికి అడ్డా చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి : 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమాలను గాలికి వదిలేసింది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కన్నేసింది. ఫిరాయింపులకు పెద్ద ఎత్తున తెరతీసింది. తెలంగాణలో తెలుగుదేశం నేతలు అధికార పార్టీలో చేరితే ప్రజాస్వామ్య విరుద్దం అంటూ గొంతు చించుకున్న టీడీపీ, ఏపీలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో నిశ్శిగ్గుగా ప్రవర్తించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కోట్ల రూపాయలను ఎరగా వేసి కొన్నారు. ఇందుకు ఇటీవల తాను అమ్ముడు పోయానంటూ కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. వస్తే కోట్లు.. లేకపోతే బెదిరింపులు: కోట్ల రూపాయలను ఆశ చూపడం, లొంగితే కొనడం లేకపోతే బెదిరింపులకు పాల్పడటం చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వానికి సర్వసాధారణం. అయితే పార్టీ మారినవారిలో కొందరికి ప్రభుత్వ ప్రాజెక్టులు ఇస్తే మరికొందరికి మంత్రి పదవుల కట్టబెట్టారు. తన మంత్రి వర్గంలో ఏకంగా నలుగురు ఫిరాయింపు మంత్రలు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి అధికార, ప్రతిపక్షంలో ఉండి కత్తులు దూసుకున్న వారు ఒక్కసారిగా ఓకేపార్టీలోకి రావడంతో అసంతృప్తి సెగలు చెలరేగాయి. ఒకే ఒరలో రెండు కత్తులా తయారయింది పరిస్థితి. అయితే వారిని బుజ్జగించడానికి అధినేత నేరుగా రంగంలోకి దిగుతారు. ప్రజా సమస్యలపై ఏరోజు పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించలేని సీఎం, ఫిరాయింపు నేతల కోసం మాత్రం ఏకాంత చర్చల్లో గంటల తరబడి పాల్గొంటారు. వారిని బుజ్జగించడానికి, రాజీ పరచడానికి ప్రత్యేక ప్యాకేజీలు మాట్లాడతారు. ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీ బుట్టా రేణుక వరకూ ఆయన నడిపిన చీకటి రాజకీయం ప్రజలకు తెలిసిందే. దీనికి తోడు ఆయన చేస్తున్న ఈ అరాజకీయానికి ఎల్లో మీడియా సైతం అభివృద్ధి రంగు పులిమి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అయినా సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉండటంతో బాబుగారి ఆటలు సాగలేదు. అలానే అసంతృప్తితో ఉన్న తెలుగుదేశం, ఫిరాయింపు నేతలను బుజ్జగించడానికి ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటిస్తారు. చేసే ప్రతిపనిలో ఇద్దరు వాటాలు పంచుకోవాలంటూ సూచిస్తారు. తోడు దొంగలు ఒకటై ఊళ్లు పంచుకున్న చందాన కమీషన్లలో షేర్లు, పథకాల్లో వాటాలు పంచుకుంటారు. ప్రజల సొమ్మును తెలుగుదేశం నేతలు, మద్దతు దారులు స్వాహా చేస్తారు. చెరో ఆఠానా: తెలుగుశం ప్రభుత్వంలో నాయకులు వాటాలు పంచుకుంటున్నారు అనడానికి ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శం. అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి వందల మంది ప్రజల సాక్షిగా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఆదినారాయణ రెడ్డి ఫిరాయింపుతో జమ్మలమడుగుకు చెందిన మరో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. అయితే వారిని బుజ్జగించడానికి గతంలో ఆర్టీసీ ఛైర్మెన్ పదవిని ఆశ చూపించగా రామసుబ్బారెడ్డి తిరస్కరించారు. అయితే పరిస్థితి చేయిదాటి పోకుండా ఉండేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య రాజీ ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎవరో చెప్పిన మాటలు కాదు మంత్రి ఆదినారాయణరెడ్డి స్వయాన తన నోటితో చెప్పిన విషయాలు. చేసే ప్రతి అవినీతిలో టీడీపీ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి కూడా అర్ధ రూపాయి భాగం ఉందని పేర్కొన్నారు. స్వయానా సీఎం చంద్రబాబు నాయుడే ఐఏఎస్ ఆఫీసర్లని తమతో పాటూ కూర్చోబెట్టి పంచాయతీ చేయించారని తెలపడం బాబు చేస్తున్న, చేసిన అరాజకీయానికి ప్రతీకలు. రామ సుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగినా రామ సుబ్బారెడ్డికి సగం వస్తుంది అంటూ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించడం సైతం ప్రజలు ఆలోచించాల్సిన విషయం. 'వాళ్లు దాంట్లో ఏది విమర్శించినా నేనైతే పట్టించుకోను, మీరెవరూ దయ చేసి విమర్శించమాకండి. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి. ఎస్ఎంఎస్ లు పెట్టండి. నీను మీ ఎమ్మెల్యేని, పక్కకు పోయినప్పుడే మంత్రిని' అంటూ ఆది నారాయణ రెడ్డి పేర్కొనడం రాజకీయాలను అపహస్యం చేయడమే. మంత్రిస్థానంలో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగానే అవినీతిలో వాటాల గురించి మాట్లాడేంతగా దిగజారిపోయారంటే ముఖ్యమంత్రి ఎంతలా అవినీతిని ప్రోత్సహిస్తునారో అర్థం చేసుకోల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎల్లో మీడియా ఎన్నిరోజులు తమ్మిని బమ్మి చేసి చూపినా ఏదో ఒకరోజు ప్రజలకు వాస్తవం తెలియకుండా ఉండదు. ఎందుకంటే నిజం నిప్పులాంటిది. -
టీడీపీలో వర్గపోరు, సీఎం రమేష్ ఆఫీస్‌పై దాడి
సాక్షి, కడప : జిల్లాలో టీడీపీ వర్గపోరు రచ్చకెక్కింది. ఓ కాంట్రాక్ట్ విషయంలో టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే...గండికోట రిజర్వాయర్ పరిధిలో కొండాపురంలో పునరావాస కాలనీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. ఈ టెండర్ల విషయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయులు సిండికేట్ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్... ఆ టెండర్ల ప్రక్రియను నిలిపివేశారు. దీంతో మంత్రి ఆది, రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... సీఎం రమేష్ కార్యాలయంపై దాడి చేసి కంపూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాకుండా సమీపంలో సీఎం రమేష్ చేస్తున్న రోడ్ల పనులను కూడా బలవంతంగా నిలిపివేయించారు. పనులు కొనసాగిస్తే వాహనాలను తగులబెడతామని హెచ్చరికలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక స్థానికంగా ఉన్న తమకు కాకుండా సీఎం రమేష్‌కు కాంట్రాక్ట్ పనులు అప్పగించడంపై స్థానిక టీడీపీ నేతలు చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉప్పు,నిప్పుగా ఉండే మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి టెండర్ల విషయంలో సిండికేట్‌గా మారటం గమనార్హం. -
సీఎం రమేష్ ఆఫీస్‌పై దాడి
-
మంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు
-
మంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు
కడప: వైఎస్ఆర్ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు కలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడే ముందు పార్టీ ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి తన పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో మంత్రి తత్తరపాటుకు గురయ్యారు. ఫిరాయింపు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు విఫలయత్నం చేశారు. రాజీనామా అంశాన్ని ప్రశ్నించడంతో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఫిరాయింపు జెడ్పీటీసీలు బల్లలు చరుస్తూ టీ కప్పులు పగలగొట్టారు. రసాభాసగా సమావేశం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే...ఇది దానికి వేదిక కాదంటూ మంత్రులు చెప్పడం రచ్చకు దారి తీసింది. ఒక దశలో మంత్రి సోమిరెడ్డికి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గృహనిర్మాణంపై రాచమల్లు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రులు సమాధానం చెప్పలేక శాసనసభలో చర్చిద్దామంటూ దాటవేసే ధోరణి అవలంభించారు. అంతేకాక రాచమల్లు ప్రసాదరెడ్డి అర్బన్ ఏరియాకు చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఈ మీటింగుకు రాకూడదని ఎదురుదాడి చేశారు. దీంతోవైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నేలపై కూర్చుని తమ నిరసన తెలిపారు. -
రాజీనామా చేశా: మంత్రి ఆది సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారినప్పుడే రాజీనామాను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపినట్టు తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. స్పీకర్ ఆమోదించకుంటే తామేమి చేయగలమని అన్నారు. తాము రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేయడం తమకు సమస్యేనని ఒప్పుకున్నారు. ఎన్నికలు అనవసరమని రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజీనామాలు ఆమోదించమని స్పీకర్‌ను ఒత్తిడి చేయలేం కదా అని అన్నారు. మంత్రి ఆది వ్యాఖ్యలతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంకటంలో పడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిజంగానే రాజీనామా చేశారా, వీటిని స్పీకర్ ఎందుకు ఆమోదించలేదన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. కాగా, మంత్రి ఆది వ్యాఖ్యలపై స్పీకర్ ఇంకా స్పందించలేదు. -
'అప్పుడే రాజీనామా చేశా'
-
సీఎం రమేష్ Vs మంత్రి ఆది
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నిన్న మొన్న వరకూ తెలుగుదేశం తరపున చక్రం తిప్పిన వ్యక్తి ఆయన. రాష్ట్రానికి సీఎం చంద్రబాబు అయితే జిల్లాకు సీఎం నేను అనే తీరుగా ఉండేది ఆయన వ్యవహారం. గ్రూపు రాజకీయాలు చేయాలన్నా, మనుషులతో బెదిరించాలన్నా జిల్లాలో ఆయన తరువాతే ఎవరైనా. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చెలరేగి పోయాడు. సీనియర్లను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా గ్రూపు రాజకీయాలు నడిపాడు. కానీ ఇప్పుడు ఆనేత వాడి వేడి తగ్గిపోయింది. అధినేత అండతో చక్రం తిప్పిన నేత నేడు అపాయింట్మెంట్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. సీఎం రమేష్ వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశానికి చెందిన ఎంపీ. గతంలో చంద్రబాబుకు సీఎం రమేష్‌కు మంచి అనుబంధమే ఉండేది. అయితే ఇప్పడు అది తగ్గిపోయింది. పార్టీలో ఆయన ప్రాభల్యం కోల్పోయారు. ఇన్నాళ్లు పార్టీకి అన్నీ చేసిన ఆయన్ను పార్టీ పక్కన పెట్టేసింది. ఏరు దాటాక తెప్ప తగలేసిన విధంగా సీఎం రమేష్‌కు తెలుగుదేశం పార్టీ చెక్ పెట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రమేష్ ప్రాభల్యాన్ని తగ్గించింది. రానున్న ఎన్నికల్లో సీఎం రమేష్, ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రొద్దుటూరు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే బరిలో దిగాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రికి సైతం చెప్పకుండా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును ప్రొద్దుటూరుకు పిలిపించి రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇప్పించాడు. అయితే ఇప్పటికే అక్కడ మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుతం తెలుగుదేశంలో కొనసాగుతున్న వరదరాజుల రెడ్డి ఎన్నో రోజులుగా ఆస్థానం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. అంతేకాదు ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇరు వర్గాలు గొడవలకు దిగాయి. అంతే కాదు గతంలో రమేష్, పార్టీలోని ఇతర నాయకులకు ప్రాజెక్టులు దక్కకుండా అణతొక్కారు. దీంతో బెంబేలెత్తిన నాయకులు, వరదరాజల రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. అయతే గత కొంత కాలంగా సీఎం రమేష్‌కు చెక్ పెట్టాలని పార్టీ అధినేత భావిస్తూ వచ్చారు. దానిలో భాగంగానే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. అక్కడ నుంచి రమేష్ పతనం మొదలైంది. పార్టీ అధినేతను కలవాలన్నా అపాయింట్మెంట్ దొరకని పరిస్థతి. అంతేకాదు జిల్లా పార్టీ పగ్గాలను సైతం మంత్రి ఆదికే అప్పగించారు. జిల్లాలో ఏం జరగాలన్నా వయా మంత్రిగారి ద్వారానే జరగాలని ఆదేశించారు. దీనిపై సీఎం రమేష్ కూడా పైకి సరే అన్నా,, సన్నిహితులు దగ్గర మాత్రం తన పరిస్థతి ఏమాత్రం బాగాలేదని, ముఖ్యమంత్రి పట్టించుకోవడం మానేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత సూచనతో నాయకులు ఎవరూ సీఎం రమేష్‌ను ఎవరూ పట్టించుకోవట్లేదన్నది బహిరంగ రహస్యం. అంతకు ముందు వరకూ జిల్లాలో ఏకాంట్రాక్టులు జరిగినా రమేష్ చేయి పడాల్సిందే. ఇప్పడు మాత్రం ఏం కావాలన్నా మంత్రి ఆది దగ్గరకే తెలుగుతమ్ముళ్లు క్యూ కడుతున్నారు. సీఎం రమేష్‌ను పట్టించుకోవడం మానేశారు. దీనిపై సీఎం రమేష్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి ఎంతో చేసిన తనను కాదని ఆదినారాయణ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తుండంతో పార్టీ అధినేతతో పాటు, మంత్రి ఆదినారాయణపై సీఎం రమేష్ రగిలిపోతున్నట్లు సన్నిహితుల సమాచారం. -
ఏమరుపాటుతో పేలుతున్న గన్లు
సాక్షి, అమరావతి: బతుకుదెరువు కోసం ఎంచుకున్న పోలీస్ ఉద్యోగంలో ఏమరుపాటు వారి ప్రాణాలనే తీస్తోంది. రక్షించాల్సిన తుపాకీ వారి ప్రాణాలనే బలితీసుకుంటోంది. మంత్రులు, అధికారుల అంగరక్షకులు (గన్మెన్లు) ఇటీవల మిస్‌ఫైర్ అయ్యి మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి గన్‌మెన్ చంద్రశేఖర్‌రెడ్డి కడపలో గురువారం రివాల్వర్ శుభ్రం చేసుకుంటూ మిస్‌ఫైర్ అయ్యి దుర్మరణం చెందడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ ఏపీ భవన్ నుంచి ఏపీ, తెలంగాణల్లోను ఈ తరహా ఘటనలు పెరగడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఏడాది జనవరి 2న కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు బందోబస్తుకు వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ హంపన్న చేతిలో ఏకే47 గన్ మిస్‌ఫైర్ అయ్యింది. తీవ్రగాయాలైన హంపన్నను ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర వైద్యసేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. గతేడాది జూలైలో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అకాడమిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్న కార్యక్రమంలో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ వాసుదేవరెడ్డి చేతిలో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్లో 2015 అక్టోబర్‌లో 404 గదిలో జరిగిన కాల్పుల్లో పోలీస్ అధికారి ఒకరు గాయపడగా అది మిస్‌ఫైర్‌గా విచారణలో నిర్ధారించారు. గతేడాది జూన్‌లో పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ అనుమానాస్పదంగా మృతిచెందడం అప్పట్లో కలకలం రేపింది. ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి చనిపోయాడని తొలుత భావించినప్పటికీ ఆయన కణతికి దగ్గర్లో కాల్చుకున్నట్టు ఉండటంతో ఆత్మహత్య అయి ఉండొచ్చని అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులు భావించారు. అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నెల్లూరు ఏఎస్పీ శరత్‌బాబు కారుడ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్ రమేష్‌బాబు రివాల్వర్ కాల్పులతో అనుమానాస్పదంగా దుర్మరణం పాలయ్యాడు. ఇలా ఎందుకు జరుగుతోంది.. పోలీసులకు శిక్షణ సమయంలో ఆయుధాలు వినియోగించడంతో పాటు వాటిని భద్రంగా చూసుకోవడంలో కూడా తర్ఫీదు ఇస్తారు. ఏడాదికి ఒకసారి జిల్లా కేంద్రం నుంచి ఒక హెడ్‌కానిస్టేబుల్ (ఆర్మర్) ప్రతీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆయుధాల పనితీరు పరిశీలించి, మరమ్మతులు చేస్తారు. గన్లు, తుపాకులు వెంట తీసుకెళ్లినప్పుడు లోడ్ చేసినప్పటికీ బ్యాక్ లాక్ వేస్తారు. ఫైర్ ఓపెన్ చేయాల్సి వస్తే లాక్ తీసి ఆయుధాలను వినియోగిస్తారు. ఇలాంటి సమయంలో మిస్‌ఫైర్ కావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయని ఒక పోలీస్ అధికారి చెప్పారు. ఇటువంటి ఘటనల్లో ఎక్కువగా ఉద్దేశపూర్వకంగా కాల్పుకోవడం, ఎవరైనా కాల్చడం జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కారణం ఏదైనా మిస్‌ఫైర్‌కు పోలీసుల బతుకు బలైపోతుంటే వారి కుటుంబాలు మాత్రం దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మిస్‌ఫైర్ వ్యవహారంపై పోలీస్ బాస్ దృష్టిపెడితే తమ ఆయుధాలకే బలైపోతున్న పోలీసుల ప్రాణాలు కాపాడినట్టు అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. -
మంత్రి ఆదినారాయణ రెడ్డి గన్‌మన్ మృతి
-
మంత్రి ఆదినారాయణ రెడ్డి గన్‌మన్ మృతి
సాక్షి, కడప: రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి గన్‌మన్ మృతి చెందాడు. కడప రాజారెడ్డివీధిలో నివాసముంటున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి మంత్రి వద్ద గన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో సర్వీస్ గన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉండే హిమాలయా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
‘ఆది’కి రాజకీయ ఇరకాటం
జమ్మలమడుగు కో– ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (టౌన్‌బ్యాంక్)లో జరిగిన రూ. 2 కోట్ల కుంభకోణం మంత్రి ఆదినారాయణరెడ్డిని రాజకీయంగా ఇరకాటంలో పడేసింది. వియ్యంకుడు కేశవరెడ్డి వందలకోట్ల ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఈ వివాదం ఇప్పటికీ మంత్రిని పట్టి పీడిస్తున్న నేపథ్యంలో సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో తన బంధువు జనం సొమ్ము దిగమింగడం మంత్రికి ఇబ్బందిగా మారింది. సాక్షి ప్రతినిధి – కడప జమ్మలమడుగు టౌన్ బ్యాంకు పేరున లావాదేవీలు జరిపిన సమయంలో అనేక కారణాలతో బ్యాంకు దివాలా తీసింది. సహకార శాఖ ఈ బ్యాంకు లైసెన్సు రద్దు చేసినా, ఏదో ఒక విధంగా మళ్లీ నడపాలనే ఉద్దేశంతో క్రెడిట్ సొసైటీ పేరుతో వ్యాపారానికి అనుమతించింది. బ్యాంకు దివాలా తీసిన సమయంలో తాము ముందుండి నడిపిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబం ఖాతాదారులకు నచ్చచెప్పింది.ఈ కారణం వల్లే రాష్ట్ర సహకార శాఖమంత్రి ఆదినారాయణరెడ్డి బంధువు తాతిరెడ్డి హృషికేశవరెడ్డి ఈ సొసైటీ పాలక వర్గానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.మంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగాను, మంత్రి తమ్ముడు శివనాథరెడ్డి డైరెక్టర్‌గాను వ్యవహరిస్తున్నారు. మంత్రి బావ, జమ్మల మడుగు మున్సిపల్ చైర్ పర్సన్ తులసి భర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. మంత్రి కుటుంబం, బంధువర్గం ఆధీనంలో నడుస్తున్న ఈ బ్యాంకులో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు దాకా రూ 2 కోట్లు పక్క దారి పట్టింది. మంత్రి సమీప బంధువు, చైర్మన్ హృషి కేశవరెడ్డి ఈ సొమ్ము దిగమింగారు. నెలరోజుల ముందే వెలుగులోకి టౌన్ బ్యాంకులో లక్షల కొద్దీ డిపాజిట్లు చేసిన వ్యాపారులు నెల రోజుల ముందే అక్రమాల వ్యవహారం గురించి తెలుసుకున్నారు. అయితే ఈ బ్యాంకు లావాదేవీలన్నీ మంత్రి ఆదినారాయణరెడ్డి బంధువు, బ్యాంకు చైర్మన్ హృషి కేశవరెడ్డి కనుసన్నల్లో నడుస్తుండటంతో గొడవ పడితే తమ మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతారని వారు భయపడ్డారు. చైర్మన్‌ను బతిమలాడో, తమ బాధలు చెప్పుకునో ఏదో ఒక రకంగా సామరస్యంగా డబ్బులు వెనక్కు తీసుకోవడం కోసం చాలా సార్లు ఆయన్ను సంప్రదించారు. చూద్దాం, చేద్దాం అంటూ విషయం సాగదీస్తూ రావడంతో ఇక లాభం లేదనుకుని బాధితులు విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై సాక్షి వరుస కథనాలు ప్రచురించడంతో టౌన్‌బ్యాంకు అక్రమాల వ్యవహారం బట్టబయలైంది. అధికారులు స్పందించి చైర్మన్, సీఈవో మీద పోలీసు కేసు పెట్టడంతో పాటు, మంగళవారం చైర్మన్ ఆస్తులను అటాచ్మెంట్ చేశారు. తాము అటాచ్మెంట్ చేసిన ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపరాదని సంబంధిత అధికారులకు లేఖలు పంపారు. చైర్మన్ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింప చేయాలని బ్యాంకర్లను కోరడంతో పాటు హృషి కేశవరెడ్డికి నోటీసులు అందించారు. -
బ్యాంకుకు టోకరా వేసిన మంత్రిగారి బంధువు
-
బ్యాంకుకు టోకరా వేసిన మంత్రిగారి బంధువు
సాక్షి ప్రతినిధి, కడప: సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులే పాలక వర్గంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (టౌన్ బ్యాంకు)లో రూ.2 కోట్ల భారీ కుంభకోణం బట్టబయలైంది. చైర్మన్ హృషి కేశవరెడ్డి, సీఈవో బాలాజీ ఈ సొమ్మును స్వాహా చేయడంతో బ్యాంకు మూతపడే పరిస్థితి వచ్చిందని ఈ నెల 22, 23వ తేదీల్లో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు విచారణ జరిపి అక్రమాలు నిజమేనని తేల్చారు. హృషికేశవరెడ్డి మీద సోమవారం పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆయన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాలకవర్గాన్ని రద్దు చేసి, జమ్మలమడుగు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి సుబ్బరాయుడును ప్రత్యేకాధికారిగా నియమించారు. జమ్మలమడుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడంతో పాటు, రుణాలు మంజూరు చేస్తూ వ్యాపారం చేసింది. సహకార చట్టం కింద నడుస్తున్న ఈ సొసైటీ యాక్సిస్ బ్యాంకులో ఖాతా తెరచి తమ బ్యాంకుకు వచ్చే మొత్తాన్ని అందులో జమ చేసి లావాదేవాలు జరిపింది. మంత్రి ఆదినారాయణరెడ్డి బంధువు తాతిరెడ్డి హృషి కేశవరెడ్డి ఈ సొసైటీ పాలక వర్గానికి చైర్మన్‌గా, మంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, మంత్రి తమ్ముడు శివనాథరెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్రి బావ, జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ తులసి భర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. మంత్రి కుటుంబం, బంధువర్గం ఆధీనంలో నడుస్తున్న ఈ బ్యాంకులో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు దాకా రూ.2 కోట్లు పక్క దారి పట్టాయి. వ్యాపారులు కట్టిన సొమ్మును యాక్సిస్ బ్యాంకులో జమ చేయకుండా చైర్మన్ హృషి కేశవరెడ్డి తన సొంత అవసరాలకు వాడుకున్నారు. హృషికేశవరెడ్డిపై కేసు.. ఆస్తుల అటాచ్‌కు ఆదేశం రూ.1.41 కోట్లు కాజేశాడనేందుకు ఆధారాలు లభించడంతో చైర్మన్ హృషి కేశవరెడ్డిపై సోమవారం డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సహకార చట్టంలోని సెక్షన్ 73 కింద ఆయన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు అటాచ్ చేయాలని జిల్లా సహకార శాఖాధికారి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు సెక్షన్ 51 కింద లోతైన దర్యాప్తు జరపాలని డీసీవో ఉత్తర్వులు జారీ చేశారు. క్రెడిట్ సొసైటీ పాలక వర్గాన్ని రద్దు చేసి జమ్మల మడుగు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి సుబ్బరాయుడును ప్రత్యేకాధికారిగా నియమించారు. కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెందిన రూ.1.41 కోట్లు తనకు చేరినట్లు, మరో రూ.54 లక్షలు సొంతానికి వాడుకున్నట్లు చైర్మన్ హృషి కేశవరెడ్డి విచారణ అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. రూ.5 లక్షలు వాడుకున్నట్లు సొసైటీ సీఈవో బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాము కష్టపడి దాచుకున్న సొమ్ము తిరిగి ఇచ్చేయాలని బాధితులు చైర్మన్ హృషి కేశవరెడ్డిని కలసి కోరారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు, విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి తనకు రూ.కోటి ఇవ్వాలని, ఆయన ఆ సొమ్ము తనకిస్తే ఈ బాకీ తీరుస్తానని చెబుతున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు. విద్యా సంస్థల కేశవరెడ్డి బాకీతో తమకు సంబంధం ఏమిటని, తమ సొమ్ము వెంటనే తమకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సదావర్తి భూములు మళ్లీ సర్కారు పెద్దల చేతికే!
-
సదావర్తి భూములు మళ్లీ సర్కారు పెద్దల చేతికే!
మంత్రి లోకేశ్ స్కెచ్.. మరో మంత్రి ఆది డైరెక్షన్ చెన్నైలో వేలానికి ప్రొద్దుటూరులో మంత్రాంగం - వేలంలో భూములు దక్కించుకున్న టీడీపీ నేత వరద వర్గీయుడు - నాడు పనికిరాని భూములంటూనే నేడు పోటీపడి దక్కించుకున్నారని విమర్శల వెల్లువ సాక్షి ప్రతినిధి, కడప/ప్రొద్దుటూరు: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఎట్టకేలకు పక్కా వ్యూహంతో రెండవసారి వేలంలో కూడా టీడీపీ పెద్దలే దక్కించుకున్నారు. గతంలో తొలిసారి వేలం నిర్వహించి.. ఈ భూములను రూ.22.44 కోట్లకు కారు చౌకగా తమ వారికి ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. వందల కోట్ల విలువ చేసే భూములను కాపు కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నేత రామానుజయకు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర దాగి ఉందని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు ఎక్కారు. ఆ భూములు విలువైనవి కావని, వాటిని కొనేవారెవరూ లేరని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా.. వేలం పాటలో వచ్చిన రూ.22.44 కోట్ల కంటే రూ.5 కోట్లు ఎక్కువగా ఇచ్చిన వారికి ఆ భూములు ఇచ్చేస్తామని కూడా చెప్పారు. హైకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదనంగా రూ.5 కోట్లు చెల్లించగలరా అంటూ అప్పట్లో ఎమ్మెల్యే ఆర్కేను అడిగింది. ఇందుకు ఆయన సమ్మతించడం.. ఆ మేరకు డబ్బు డిపాజిట్ చేయడం విదితమే. ఆ తర్వాత ఈ భూములకు మళ్లీ వేలం నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం, సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించడం తెలిసిందే. కోర్టు ఆదేశం మేరకు సోమవారం చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో నిర్వహించిన వేలం పాటలో ఈసారి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుడిభుజంగా ఉన్న శ్రీనివాసులురెడ్డి రూ.60.30 కోట్లకు 83.11 ఎకరాలను అనూహ్యంగా దక్కించుకున్నారు. వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డితో సహా ఆయన ఈ వేలంపాటకు హాజరై సత్యనారాయణ బిల్డర్స్ సంస్థ పేరు మీద భూములు దక్కించుకోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి ఈ భూములు దక్కించుకున్నారనే విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న జిల్లా వాసులు ఎవరీ శ్రీనివాసులురెడ్డి అని ఆరా తీశారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన సత్యనారాయణ బిల్డర్స్‌లో 8 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో వరదరాజులరెడ్డి కుడిభుజంగా ఉన్న బద్వేలు శ్రీనివాసులురెడ్డి ఒకరు. మాజీ కౌన్సిలర్ అయిన ఇతణ్ని వరదరాజులురెడ్డి సిఫారసుతో గత ఏడాది జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్‌లో ఇతనితోపాటు వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. రూ.60 – 70 కోట్ల వ్యయంతో ఐదు స్క్రీన్లతో సినిమా థియేటర్ వ్యాపార సముదాయంతో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం మున్సిపాలిటీ కొన్ని నిబంధనలను సవరించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణాన్ని వరదరాజులరెడ్డి చేతుల మీదుగానే ప్రారంభించారు. చక్రం తిప్పిన మంత్రి లోకేశ్ భూములు ఎలాగైనా దక్కించుకోవాలని ఉన్న మంత్రి నారా లోకేశ్ డైరెక్షన్.. మంత్రి ఆదినారాయణరెడ్డి సహకారంతోనే టీడీపీ నేత వరదరాజులురెడ్డి కుడిభుజం శ్రీనివాసులురెడ్డి ఈ భూముల వేలం పాటలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచారనే ఆరోపణలున్నాయి. గతంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయను బినామీగా పెట్టుకుని కథ నడిపించిన లోకేశ్.. ఈసారి మంత్రి ఆది ద్వారా వేలం పాటలో పాల్గొనే బృందాన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రొద్దుటూరుకు వచ్చిన మంత్రి ఆదినారాయణరెడ్డి వరదరాజులురెడ్డి కళాశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలోనే సదావర్తి భూముల వేలం పాల్గొనే వ్యూహం రచించారని సమాచారం. వేలంపాటకు వరద కుమారుడు కొండారెడ్డి, ఆయన వర్గీయుడు, రాజుపాళెం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తోట మహేశ్వరరెడ్డి హాజరవ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది. తొలిసారి వేలం నిర్వహించాక తక్కువ ధరకే కట్టబెట్టారని విమర్శలు రావడంతో అవి విలువైన భూములు కాదని సీఎం, మంత్రులు ఊదరగొట్టారు. అవి నిజంగానే విలువైన భూములు కాకపోతే ఇపుడు అంతకు సుమారు మూడు రెట్లు ఎక్కువ ధర ఎందుకు చెల్లిస్తున్నారని, ఈ విషయంలోనే సర్కారు పెద్దల కుట్ర స్పష్టమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ పోరాటం వల్లే పెద్దల నిర్వాకం బట్టబయలైందని పలువురు ప్రజా సంఘాల నేతలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. పోటీ ఉండకూడదని పక్కా వ్యూహం రెండోసారి వేలానికి ప్రముఖ సంస్థలు బరిలోకి రాకుండా ‘పెద్దలు’ పన్నిన వ్యూహం ఫలించింది. సదావర్తి భూములకు తిరిగి వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగానే తమదైన శైలిలో టీడీపీ పెద్దలు చక్రం తిప్పారు. వాస్తవానికి చెన్నైలోని 83.11 ఎకరాల భూములను వేలం వేస్తున్నట్లు చాలా మంది ప్రముఖ బిల్డర్లకు తెలియదు. గడువు ఇచ్చి.. ప్రచారం నిర్వహించలేదు. లేదంటే జాతీయ స్థాయిలో పెద్ద సంస్థలు ముందుకు వచ్చి ఉండేవి. పైగా ఈ భూముల విషయమై చాలా వివాదాలు ఉన్నట్లు తెరపైకి తెచ్చారు. తద్వారా పెద్ద రియల్టర్లు, బిల్డర్లు పాల్గొనకుండా చేశారు. భూములు దక్కించుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేసివ్వబో మంటూ భయపెట్టారు. అంత పెద్ద ఎత్తున వందల కోట్లు పెట్టి భూములు కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ చేసివ్వబోమంటే ఏ సంస్థ ముందుకొస్తుంది? సర్కారు పెద్దలకు కావాల్సింది అదేమరి. ఇదే అదనుగా రెండోసారి ఈ భూములను దక్కించుకుంది. ‘వరద’ కారులో వేలానికి.. చెన్నై : సదావర్తి సత్రం భూముల రెండో విడత వేలంలో అత్యధిక బిడ్డరుగా నిలిచిన సత్యనారాయణ బిల్డర్స్ భాగస్వామి శ్రీనివాçసులు రెడ్డి వెనుక ఉన్నది టీడీపీ పెద్దలే అన్నది స్పష్టమైంది. చెన్నైలో జరిగిన వేలంలో పాల్గొనేందుకు శ్రీనివాసులు రెడ్డి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సొంత కారులో వచ్చారు. ఏపీ 04 బిడి 3355 కారులో అనుచరులతో కలసి వేలం జరిగిన చెన్నై టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రానికి చేరుకున్నారు. ఆ కారు స్వయంగా నంద్యాల వరదరాజులు రెడ్డి పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఈ విషయం సోమవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి
మంత్రి ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్య ముద్దనూరు : జమ్మలమడుగు నియోజకవర్గాన్ని నంద్యాల కన్నా మెరుగ్గా అభివృద్ధి చేస్తా.. అయితే డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ముద్దనూరులో జలసిరికి హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు, పక్కాగృహాలు మంజూరు చేస్తాం..నంద్యాలతో పాటు అభివృద్ధి చేస్తాం. అయితే డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి.. అభివృద్ధి చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేయొద్దు అని ప్రజలతో అన్నారు. నియోజకవర్గంలో ఫ్యాక్షన్ తగ్గిందన్నారు. గండికోట ప్రాజెక్టులోకి ఈ ఏడాది తగినన్ని నీరు వస్తే ముద్దనూరు మండలంలోని పలు చెరువులకు కూడా నీటి సరఫరా చేస్తామని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే గంగాదేవిపల్లె ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, ఈ పథకం మంజూరు కోసం గ్రామస్తులంతా కలసి వస్తే ముఖ్యమంత్రికి వద్దకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన తమకు ఇంతవరకు కూలి డబ్బులు అందలేదని కూలీలు మంత్రికి విన్నవించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోమని అధికారులు చెప్పారని, ఇప్పటివరకు పూర్తయిన ఇంకుడు గుంతలకు బిల్లులు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు.ఇరిగేషన్ ఎస్ఈ గోపాల్‌రెడ్డి, ఈఈ వెంకట్రావు, డీఈ రాజన్‌బాబు, ఏఈ జాన్సన్, డ్వామా ఏపీడీ మొగిలిచెండు సురేష్, ఎంపీపీ కళావతి, ఎంపీటీసీ సభ్యులు రదారెడ్డి, అపర్ణ, రాజు, రామలక్ష్మి పాల్గొన్నారు. -
మాకు తీట పట్టి వచ్చామా..
మహిళలపై మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు ప్రొద్దుటూరు టౌన్: రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి తన నోటి దురుసుతనాన్ని మరోమారు మహిళలపై చూపెట్టారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణ లో శనివారం హౌసిం గ్ ఫర్ ఆల్ స్కీం గృహ నిర్మాణాలకు మంత్రి భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతుండగా డ్వాక్రా మహిళలు లేచి వెళ్లిపోవడం ప్రారంభించారు. సహనం కోల్పోయిన మంత్రి మహిళలను ఉద్దేశించి ‘‘మాకేమైనా తీట పట్టి వచ్చామా.. కూర్చునే ఓపిక కూడా లేదా? అన్ని పథకాలు కావాలంటారే’’ అని మండిపడ్డారు. ‘‘ఇది మాకు కూడా భోజనం సమయమే. మాకు ఆకలవుతోంది.. అందరూ వచ్చి కూర్చోండి’’ అని అనడంతో మహిళలు తిరిగి వచ్చి సీట్లలో కూర్చున్నారు. మంత్రి దురుసుగా మాట్లాడటంపై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి, తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా, మెప్మా సీఓలు, ఆర్పీలు బలవంతంగా ఉదయం తమను పిలుచుకొచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం కావస్తోందని, తమ పిల్లలకు భోజనం పెట్టడానికిఇంటికి వెళతామంటే సీఓలు అడ్డుకున్నట్లు తెలిపారు. కాగా, మంత్రి మహిళలను కించపరుస్తూ మాట్లాడినప్పుడు వేదికపై ఉన్న టీడీపీ నాయకులు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం గమనార్హం. -
మంత్రిపై అ్రట్రాసిటీ కేసుకు డిమాండ్
నెల్లిమర్ల: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ ఉద్యమ వేదిక జిల్లా కన్వీనర్ గంటాన అప్పారావు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక మండలశాఖ అధ్యక్షురాలు భోగాపురపు మంగమ్మతో కలిసి సోమవారం నెల్లిమర్ల తహసీల్దారు చిన్నారావుకు వినతిపత్రం అందించారు. అనంతరం అప్పారావు మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో దళితులను కించపరుస్తూ మంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ఎంతకాలం గడిచినా, ఎన్ని రిజర్వేషన్లు కల్పించినా దళితులు అభివృద్ధి సాధించలేరని మంత్రి మాట్లాడటాన్ని ఖండించారు. దళితులు అన్నివిధాలా అభివృద్ధి చెందారని, ఇప్పటికే 450 మంది దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్ క్యాడర్లో ఉన్నారని అప్పారావు పేర్కొన్నారు. వెంటనే మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వెంటనే ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. -
మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సి)లో ఫిర్యాదు చేశారు. శుభ్రంగా ఉండరు.. చదువు రాదు.. ఎన్ని వసతులు కల్పించినా దళితులు మారరంటూ వారిపై ఇటీవల వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగులో మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దళితులను కించపరిచిన ఆయనపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మేడ కృష్ణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై హెచ్ఆర్సీ స్పందించి అక్టోబర్ 31వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కడప ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. -
దళితులను అవమానిస్తే ఊరుకునేది లేదు
జిల్లామైదాన ప్రాంత గిరిజన సంఘం అధ్యక్షుడు జి.లక్ష్మణ గరివిడి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖమంత్రి సీహెచ్.ఆదినారాయణరెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి వెంటనే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయ్యాలని జిల్లా మైదాన ప్రాంత గిరిజన సంఘం అధ్యక్షుడు గేదెల లక్ష్మణ డిమాండ్ చేశారు. దళితులు చదువుకోరు, శుభ్రంగా ఉండరు, అని మంత్రి వ్యాఖ్యానించడం దళితులను కించపరచడమేనని అన్నారు. దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రచించిన రాజ్యాం గంపై ప్రమాణం చేసిన మంత్రి దళితులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది దళితులు అత్యున్నత పదవుల్లో ఉంటే వారందరికీ చదువు లేకుండా ఉద్యోగాలు ఈ మంత్రి ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఈ దేశ ప్రథమ పౌరుడు కూడా ఓ దళిత కుటుంబీకుడే నని గుర్తుచేశారు. దళితులపై జరుగుతున్న దాడులు చూస్తుంటే ప్రభుత్వం, సహచర మంత్రులు ప్రోత్సహించినట్లుందన్నారు. అనంతరం ఇన్చార్జ్ తహసీల్దార్ డి.చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పేకేటి చంద్రరావు, గట్టు రవి, గేదెల చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ పై దళితుల అగ్రహం
-
యధా రాజా తధా మంత్రి
-
పదవి రాకపోతే రాజకీయం వదిలేస్తా..
► ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా మా సుధీరే ప్రమాణం చేస్తాడు ► ఎమ్మెల్సీ పీఆర్‌కు మంత్రి ఆది పరోక్ష చాలెంజ్ ► జమ్మలమడుగు అధికారపార్టీలో ఆసుపత్రి చైర్మన్ పదవి చిచ్చు ► ఎవరికి వారే పట్టుకోసం తీవ్ర పోరు సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏది ఏమైనా మా సుధీరే ఆస్పత్రి కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అవసరమైతే నేను రాజకీయమైనా వదులుకుంటా’ మంత్రి ఆదినారాయణరెడ్డి మంగళవారం జమ్మలమడుగు ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో తన మనసులోని ఆగ్రహాన్ని ఇలా బయటపెట్టారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌రెడ్డిని ప్రమాణా స్వీకారం చివరి నిమిషంలో వాయిదాపడటంపై మనసులోనే రగిలిపోతున్న ఆదినారాయణరెడ్డి అదే ఆసుపత్రి వేదికగా జరిగిన కార్యక్రమంలో తన ప్రత్యర్థి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పరోక్షంగా ఈ చాలెంజ్ విసిరారు. ఆదేవిధంగా పట్టణంలోని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రికి చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌రెడ్డి ఈనెల ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. తాను పట్టుబట్టిన పనిని ఖచ్చితంగా జరిగే విధంగా చూస్తానని, తన పని జరుగకపోతే రాజకీయాల నుంచి అయిన తప్పుకుంటానని పరోక్షంగా ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. తీవ్రమైన ఆధిపత్యపోరు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిని టీడీపీలో చేర్చుకునే ప్రతిపాదనను మాజీమంత్రి రామసుబ్బారెడ్డి గట్టిగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆయన్ను తీసుకుంటే పార్టీ కూడా వదిలి వెళ్లేందుకు వెనుకాడబోమని కూడా ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పరోక్షంగా సంకేతాలు పంపారు. ఆ తర్వాత ఆదిని మంత్రిని చేయాలనుకున్నప్పుడు ససేమిరా అంగీకరించలేదు. పీఆర్‌కు ఎమ్మెల్సీ పదవి ఎరవేసి చంద్రబాబు ఒప్పించారు. అక్కడి నుంచి జమ్మలమడుగు టీడీపీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది. మంత్రి ఆది, మాజీమంత్రి పీఆర్ మధ్య ఏ మాత్రం సఖ్యత కుదరకపోగా రెండు వర్గాలు ఒకరినొకరు దెబ్బ తీసుకోవడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తూ వచ్చాయి. ఇదే సందర్భంలో పీఆర్ వద్దనుకుని పంపిన మున్సిపల్ కమిషనర్‌ను మంత్రి వెనక్కుతేవడం, తన తమ్ముడు గిరిధర్‌రెడ్డి పేరు ఆసుపత్రి కమిటీ చైర్మన్ పదవికి ప్రతి పాదిస్తే మంత్రి దాన్ని పక్కకు తోసేసి తన కుమారుడు సుధీర్‌ను చైర్మన్ చేసుకోవడం పీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాలన్నింటి మీద నేరుగా సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం మీద ఒత్తిడి తెచ్చి సుధీర్‌రెడ్డి పదవీ ప్రమాణా స్వీకారాన్ని చివరి నిమిషంలో నిలుపుదల చేయించారు. ఆ పదవి తన తమ్ముడు గిరిధర్‌రెడ్డికి ఇప్పించాలని పీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రగలిపోతున్న మంత్రి ఆది తనకు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి తీసుకుని చేతిలో అధికా రం పెట్టుకుని పీఆర్ మంత్రి మీద పోరాటం చేసే వ్యూహం అమలు చేశారు. దీంతో తాను మంత్రిగా ఉండి కొడుక్కు చిన్న పదవి కూడా ఇప్పించుకోలేకపోవడాన్ని ఆదినారాయణరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రి సలహా మండ లి చైర్మన్ పదవి తన కుమారుడికే కావాలని ఆయన కూడా పట్టుబట్టారు. ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం కమిటీ నియామకాన్నే పక్కన పెట్టేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి ఆది మంగళవారం అదే ఆసుపత్రి వేదికగా తన సత్తా ఏమిటో చూపిస్తానని గట్టిగా చెప్పారు. తన కుమారుడు ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా ప్రమాణా స్వీకారం చేయకపోతే రాజకీయం కూడా వదులుకుంటానని చెబుతూ చేతనైతే నిలుపుదల చేయిం చాలని పరోక్షంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. ఈ పరిణామంతో జమ్మలమడుగు తెలుగుదేశం రాజకీయం మరోసారి వేడెక్కబోతోంది. -
ఏపీ మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం
-
ఏపీ మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం
సూర్యాపేట : ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రి ఆది నారాయణరెడ్డికి చెందిన ఇద్దరు గన్మెన్లు, డ్రైవర్‌కు స్వల్పంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండటంతో రహదారి కనపడక కాన్వాయ్‌లోని ఒక వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. గన్మెన్లు, డ్రైవర్‌ను మంత్రి తన వాహనంలో కోదాడ ఆస్పత్రికి తీసుకెళ్ళి చేర్చారు. -
అటకెక్కించారు
కడప అగ్రికల్చర్: రైతులకు మేం చేసినట్లు ఏ ప్రభుత్వం చేయలేదు.. వారికి ప్రతి విషయంలోనూ మేలు చేస్తున్నాం... ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. వారు మాట్లాడే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేదని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు.పథకాలు అటకెక్కితే వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టడమా? లేక వాటినే పునరుద్ధరించడమో చేయాలని, అయితే అటు ప్రభుత్వం, ఇటు మంత్రి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు, కాపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత రైతులు పశుసంపదను ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. అటువంటి పశుసంపదకు ఆపద వస్తే ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని రైతులు, కాపరులు, యజమానులు అంటున్నారు. పశువులు, గొర్రెలకు బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. రెండేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేయక అటకెక్కించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మేతకోసం బయటకు వెళ్లిన పశువులు, గొర్రెలు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే వరకు యజమానికి, కాపరికి నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే కరెంటు తీగ తగలడమో..రోడ్డు ప్రమాదంలోనో, విషపదార్థం తనడం వల్లనో మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల ఖాజీపేట, చాపాడు, ముద్దనూరు, తొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 2500 గొర్రెల దాకా మృత్యువాత పడినట్లు కాపరులు ఆవేదనతో తెలిపారు. రోడ్డుప్రమాదం, సరైన వైద్యం అందకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా 1500 పశువులు, పాడి పశువులు మృతి చెందాయి. వీటికి బీమా ఉంటే ప్రమాదం సంభవించిన సమయంలో ఊరటగా నిలిచేది. ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి, ఆర్ధిక ఇబ్బందుల్లో కూరకుపోతున్నారు. జీవాల బీమాను అటకెక్కించారు. వ్యవసాయదారులు జీవాల పోషణను వృత్తిగా చేపట్టి జీవనం సాగిస్తున్నారు. మేకలు, గొర్రెలు ఆదాయ వనరుగా ఉన్నాయి. జిల్లాలో గొర్రెలు 15.38 లక్షలు, మేకలు 4.98 లక్షలు ఉన్నాయి. ఇందులో దాదాపు 8.50 లక్షల గొర్రెలకు బీమా చేయించారు. ఇందులో 80 వేల గొర్రెలు చనిపోగా రూ. 2.30 కోట్లు అందజేశారు. మిగతా వారు బీమా చేసుకోవడానికి ముందుకు వస్తున్నా పథకం లేకపోవడంతో మదనపడుతున్నారు. పశువులు మృత్యువాత పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం పాడి రైతులు నష్టపోకూడనే ఉద్దేశంతో 2008లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పశువుల, గొర్రెల బీమా పథకాలను తీసుకొచ్చారు. 2014–15 వరకు ఈ బీమాను కొనసాగిస్తూ వచ్చారు. 2015 నుంచి ఈ పథకాన్ని అటకెక్కించారు. జిల్లాలో ఆవులు 1.69 లక్షలు, బర్రెలు 5.96 లక్షలు ఉన్నాయి. ఇందులో 72 వేల పశువులకు రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. మిగతా వాటికి బీమా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పథకం ఎత్తేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో విద్యుత్ తీగలు తగిలి, రోడ్డు ప్రమాదంలోను, ఇతర కారణాల వల్ల దాదాపు 22,261 పశువులు మృతి చెందగా రూ.6.04 కోట్లు రైతులకు బీమా మొత్తాన్ని అందించారు. అయితే రెండేళ్లగా బీమా లేకపోవడంతో పశువులు మృత్యువాత పడుతున్నా రైతులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. -
పత్తి కుంభకోణంలో సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే
♦ పత్తి కొనుగోలు కుంభకోణం కేసు పక్కదారి ♦ విచారణ జరగలేదు.. చార్జిషీట్ పెట్టలేదు ♦ తెరవెనుక టీడీపీ పెద్దల మంత్రాంగం ♦ వివాదాస్పద ఫైలుపై మంత్రి ‘ఆది’ సంతకం ♦ నిందితులైన 26 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేత ♦ కాసుల బేరంలో భాగమేనంటున్న ఉద్యోగ వర్గాలు సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వందలాది కోట్ల రూపాయల పత్తి కొనుగోలు కుంభకోణంలో ఎలాంటి విచారణ జరపకుండానే టీడీపీ సర్కారు కేసును పక్కదారి పట్టించింది. సమయం చూసుకుని సర్కారు పెద్దలు పావులు కదిపారు. తెరవెనుక మంత్రాంగంతో చకచకా ఫైలు కొత్త మంత్రి టేబుల్ మీదకు వచ్చింది. సుమారు రూ.650 కోట్ల సీసీఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉన్నతాధికారులు సహా 26 మందిపై విధించిన సస్సెన్షన్ ఎత్తివేశారు. ఈ వివాదాస్పద ఫైలుపై వ్యవసాయ మార్కెటింగ్, పశు సంవర్థక శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈనెల 12న తొలి సంతకం చేయడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఇదివరకటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మరెందరో ఉన్నతాధికారులపై ఆరోపణలు, సీబీఐ విచారణ, విజిలెన్స్ విభాగం పరిశీలన వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న ఈ ఫైలుపై కొత్త మంత్రి వచ్చీ రాగానే ఆగమేఘాలపై సంతకం చేయడం వెనుక పెద్ద కసరత్తే జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఫైలుపై మంత్రితో సంతకం చేయించారు. మంత్రి ప్రత్తిపాటిని వివాదం నుంచి బయట పడేసేందుకే ముఖ్యమంత్రి ఇలా చేశారని కొందరంటుండగా, ఇదంతా కాసుల బేరంలో భాగమేనని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదీ కుంభకోణం.. పత్తి కొనుగోళ్లకు సంబంధించి 2014 – 15లో పెద్ద ఎత్తున అవకవతకలు జరిగాయి. కేంద్రం ఆధీనంలోని సీసీఐ నోడల్ ఏజెన్సీగా రాష్ట్రంలోని మార్కెటింగ్ కమిటీలతో కలిసి కొనుగోళ్లను కొనసాగించింది. 2014 నవంబర్ 7న మార్కెటింగ్ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇది జరిగింది. నాసిరకం పత్తిని మంచి పత్తితో కలిపి సీసీఐ నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.4050తో కొనుగోలు చేయడం వల్ల దాదాపు రూ.650 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో తొలుత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ స్థాయిలో, తర్వాత రాష్ట్ర విజిలెన్స్ విభాగం ప్రాథమిక దర్యాప్తు చేశాయి. ఈలోగా సీబీఐ (సీసీఐ కేంద్ర సంస్థ కావడంతో) కూడా రంగంలోకి దిగి రాష్ట్రంలో ఎక్కడెక్కడ కొనుగోళ్లు జరిగాయో అక్కడ విచారణ చేసింది. సీసీఐ బయ్యర్లు, రాష్ట్ర మార్కెటింగ్ కమిటీల్లోని అధికారులు, కింది స్థాయి సిబ్బంది కలిసి రైతులకు దక్కాల్సిన సొమ్మును మింగేసినట్టు ఈ మూడు దర్యాప్తుల్లోనూ తేలింది. స్వతహాగా పత్తి వ్యాపారి అయిన ఆనాటి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా ఈ పాపంలో సింహభాగం ఉన్నట్టు నిఘా సంస్థలు ప్రభుత్వాధిపతికి రహస్య నివేదికలను అందించాయి. ఇందువల్లే ప్రత్తిపాటిని మరో శాఖకు మార్చారని సమాచారం. 96 మందికి చార్జి మోమోలు, 26 మందిపై సస్పెన్షన్ ఈ కుంభకోణంపై డిపార్ట్మెంట్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా మార్కెటింగ్ శాఖ గత ఏడాది 96 మందికి చార్జి మెమోలు జారీ చేసింది. వీరిలో నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు వై.రామమోహన్‌రెడ్డి, ఎస్.వెంకట సుబ్బన్న, కె.నాగవేణి, ఎ.రహమాన్ సహా 26 మందిని గత నవంబర్ 20, 21 తేదీలలో సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో విశాఖలోని సీబీఐ అధికారులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిందితులుగా పేర్కొన్న వారిలో సీసీఐ బయ్యర్లు ముగ్గురు, సీసీఐ బ్రాంచ్ మేనేజర్ ఒకరు, పది మంది మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఉన్నారు. చిత్రమేమిటంటే ఈ పది మందిలో ఇద్దర్ని మాత్రమే మార్కెటింగ్ శాఖ సస్పెండ్ చేసింది. మిగిలిన వారిని పట్టించుకోలేదు. సీబీఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన తర్వాత చార్జిషీట్లు వేయాల్సి ఉన్నా ఇంతవరకు అతీగతి లేదు. పక్కా ప్లాన్‌తో విచారణలో జాప్యం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగికి చార్జ్‌మెమో ఇచ్చిన తర్వాత 3 నెలలలోపు ఆ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలి. ఈ కేసులో చార్జ్‌మెమోలు అందుకున్న వారు తమ వివరణైతే ఇచ్చారు గాని దానిపై తదుపరి చర్య ఏమిటో ఇంతవరకు తేలలేదు. సస్సెండ్ చేసిన తర్వాత ఉద్యోగి ఇచ్చే సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని విచారణాధికారిని నియమించాలి. అభియోగ పత్రాల్ని మోపిన తర్వాత తీవ్రమైన ఆరోపణలు లేవని తేలితేనే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి. విచారణ తర్వాత దోషి అని తేలితే చర్య తీసుకోవాలి. ఇవేవీ జరక్కపోతే 6 నెలల లోపు సమీక్ష చేయాలి. ఈ కేసులో ఇలాంటివేవీ జరగలేదు. ప్రభుత్వం కావాలనే ఇంతవరకు విచారణ అధికారిని నియమించలేదు. లోతుగా దర్యాప్తు జరిపితే మంత్రి ప్రత్తిపాటి పాత్ర బయటపడుతుందనో లేక తమ వర్గానికి చెందిన పత్తి వ్యాపారులను కాపాడాలనో చంద్రబాబు ప్రభుత్వం విచారణ ముందుకు సాగకుండా జాప్యం చేసింది. దర్యాప్తు ఆలస్యం కావడం వల్ల ప్రత్తిపాటి పాత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలు లేకుండా చేసిందన్న విమర్శలూ ఉన్నాయి. మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 96 మందికి చార్జి మెమోలు ఇస్తే 26 మందినే సస్పెండ్ చేయడం వివక్ష అనేది ఉద్యోగుల వాదన. (ప్రభుత్వ భాషలో సెలక్టివ్ సస్పెన్షన్) వ్యాపారం చేసింది సీసీఐ వాళ్లని, వాళ్లు సంతకాలు చేసినందున రొటీన్‌గా తామూ చేశామని, ఇందులో తమకు దక్కిందేమీ లేదని మార్కెటింగ్ సిబ్బంది విజిలెన్స్ దర్యాప్తు సందర్భంగా రాత పూర్వకంగా చెప్పారు. రెగ్యులర్ విచారణ అధికారిని ఇంతవరకు ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ర్యాండమ్ పద్ధతిన తమను సస్పెండ్ చేసినప్పుడు ఆనాటి మంత్రిపై కూడా చర్యలు తీసుకోవాలి కదా? అని నిలదీస్తున్నారు. విచారణ జరక్కుండా 6 నెలలకు మించి సస్పెన్షన్‌లో ఉంచడానికి వీలు లేదని, అందువల్లే సస్పెన్షన్లు రద్దయ్యాయని చెబుతున్నారు. సస్పెండ్ అయిన డెప్యూటీ డైరెక్టర్లలో ఒకరైన ఎస్.వెంకట సుబ్బన్న హైకోర్టు నుంచి తీసుకువచ్చిన ఉత్తర్వులే మిగతా 25 మందిని కాపాడాయని భావిస్తున్నారు. తాను త్వరలో పదవీ విరమణ చేయనున్నందున తనను తిరిగి నియమించాలని కోరుతూ సుబ్బన్న కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ ఉత్తర్వులతో పాటు ఆంధ్ర, రాయలసీమ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం ఇచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం 26 మందిపై సస్పెన్షన్ ఉపసంహరించాలని నిర్ణయించిందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వివరించారు. అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నందున వీరు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండదని, పని అప్పగించకుండా సస్పెన్షన్‌లో ఉంచి జీతాలు ఇవ్వడం ఖజానాపై భారం అని భావించి సస్పెన్షన్ ఎత్తివేసిందన్నారు. తప్పు చేసినట్లు తేలితే ఉరితీయండి కడప కార్పొరేషన్: మార్కెటింగ్ శాఖలో సస్పెండ్ అయిన 26 మందికి తిరిగి పోస్టింగులు ఇచ్చిన వ్యవహారంలో తాను తప్పుచేసినట్లు తేలితే ఉరి తీయాలని మార్కెటింగ్, పశు సంవర్థక శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. శనివారం వైఎస్ఆర్ జిల్లా కడపలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సస్పెండ్ అయి తిరిగి పోస్టింగ్స్ తీసుకున్న ఉద్యోగుల ముఖం కూడా తాను చూడలేదన్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ తనతో చర్చించారన్నారు. ఊరికే జీతం ఇవ్వడం సరికాదనే ఉద్దేశంతో వారికి పోస్టింగులు ఇచ్చామన్నారు. అవి జనరల్ పోస్టింగ్స్ కాదని లూప్లైన్లో వేశామని చెప్పుకొచ్చారు.