సాక్షి, వైఎస్సార్ కడప : మంత్రి ఆదినారాయణరెడ్డిపై జిల్లాలో రోజురోజుకు ఆగ్రహం వ్యక్తం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. సోమవారం తాజాగా పులివెందుల మినీ మహానాడులో మంత్రి ఆదినారాయణ రెడ్డిపై రామసుబ్బారెడ్డి పలు విమర్శలు చేశారు. రాజకీయాలు ప్రజలకు సేవ చేసేందుకే కానీ, వారిపై పెత్తనం చెలాయించేందుకు కాదని ఆయన ఆదిపై మండిపడ్డారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డామని, అయినా ఏనాడు పార్టీ వీడలేదన్నారు. పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లామని, కొత్తగా పార్టీకి వచ్చిలోన వారిని సీఎం చెబితే గౌరవిస్తున్నామని చెప్పారు. కానీ కొంత మంది స్టేట్మెంట్‌లు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. నాయకులను, కార్యకర్తలను విమర్శిస్తే పార్టీకే నష్టమని, నేను ఇప్పుడు వారి గురించి మట్లాడితే పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. మాట్లాడే రోజు వచ్చినపుడు మాట్లాడతానని చెప్పారు.
ఇక ఆదినారాయణ రెడ్డి జిల్లాలో టీడీపీని బలోపేతం చేయాల్సింది పోయి మంత్రి వర్గాలకు ఆజ్యం పోస్తున్నారని ఆపార్టీ సీనియర్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అనైతికతకు నిలువుటద్ధంగా, అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిగా, మాటపై నిలకడ లేని తత్వం కల్గిన వారు ఎవరైనా ఉన్నారంటే...అది మంత్రి ఆదినారాయణరెడ్డి మాత్రమేనని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment