rama subbareddy
-
జమ్మలమడుగులో ఉద్రిక్తత : మహేషేరెడ్డి వాహనం ద్వంసం
-
మంత్రి ఆది కుటుంబంలో ఎమ్మెల్సీ చిచ్చు..!
సాక్షి, జమ్మలమడుగు : టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కొత్త సమస్య వచ్చిపడింది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పదవిని ఆది సోదరుడి కుటుంబానికి ఇచ్చేందుకు నిర్ణయం జరిగింది. చంద్రబాబు వద్దనే నారాయణరెడ్డి తన కుటుంబానికే ఎమ్మెల్సీ పదవి అంటూ ప్రకటించారు కూడా. ఇదిలాఉండగా.. షాద్‌నగర్ జంట హత్యల కేసులో ఆది వర్గానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆది బంధువు శంకర్ రెడ్డి ఒకరు. ఈ హత్యలకు కారణం రామసుబ్బారెడ్డి వర్గమేనని సుప్రీం కోర్టులో కేసు కూడా నడుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆది, రామసుబ్బారెడ్డి రాజీ పడటం, దీనిలో భాగంగా శంకర్ రెడ్డి కుటుంబీకులు సుప్రీం కోర్టులో ఉన్న కేసులో రాజీ పడుతున్నట్లు ఒప్పుకోవడం జరిగింది. ఈ రాజీని చంద్రబాబు దగ్గరుండి చేశారని వినికిడి. దీంతో రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని ఆది కుటుంబానికి కాకుండా శంకర్ రెడ్డి కుటుంబానికి ఇవ్వాలనే డిమాండ్ మొదలయింది. నారాయణరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి అనుభవించారని, ఆయన కుమారుడు కూడా జడ్పీటీసీగా ఉన్నదని...మళ్లీ వాళ్ళకే ఎమ్మెల్సీ ఇవ్వడం సరికాదనే వాదన ప్రారంభమయ్యింది. అన్ని పదవులు అన్నదమ్ములకే ఇస్తే...ఇక ఆది వర్గం కోసం పనిచేసి హత్య కావించబడ్డ శంకర్ రెడ్డి కుటుంబానికి ఏం న్యాయం చేసినట్లు అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద రామసుబ్బారెడ్డి వదిలేసిన ఎమ్మెల్సీ సీటు ఆది కుటుంబంలో విభేదాలకు కారణం అవుతోంది. -
మంత్రి ఆదినారాయణరెడ్డిపై రామసుబ్బారెడ్డి విమర్శలు
సాక్షి, వైఎస్సార్ కడప : మంత్రి ఆదినారాయణరెడ్డిపై జిల్లాలో రోజురోజుకు ఆగ్రహం వ్యక్తం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. సోమవారం తాజాగా పులివెందుల మినీ మహానాడులో మంత్రి ఆదినారాయణ రెడ్డిపై రామసుబ్బారెడ్డి పలు విమర్శలు చేశారు. రాజకీయాలు ప్రజలకు సేవ చేసేందుకే కానీ, వారిపై పెత్తనం చెలాయించేందుకు కాదని ఆయన ఆదిపై మండిపడ్డారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డామని, అయినా ఏనాడు పార్టీ వీడలేదన్నారు. పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లామని, కొత్తగా పార్టీకి వచ్చిలోన వారిని సీఎం చెబితే గౌరవిస్తున్నామని చెప్పారు. కానీ కొంత మంది స్టేట్మెంట్లు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. నాయకులను, కార్యకర్తలను విమర్శిస్తే పార్టీకే నష్టమని, నేను ఇప్పుడు వారి గురించి మట్లాడితే పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. మాట్లాడే రోజు వచ్చినపుడు మాట్లాడతానని చెప్పారు. ఇక ఆదినారాయణ రెడ్డి జిల్లాలో టీడీపీని బలోపేతం చేయాల్సింది పోయి మంత్రి వర్గాలకు ఆజ్యం పోస్తున్నారని ఆపార్టీ సీనియర్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అనైతికతకు నిలువుటద్ధంగా, అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిగా, మాటపై నిలకడ లేని తత్వం కల్గిన వారు ఎవరైనా ఉన్నారంటే...అది మంత్రి ఆదినారాయణరెడ్డి మాత్రమేనని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
చంద్రబాబే అవినీతి చేసుకోమని చెప్పారు..
సాక్షి, జమ్మలమడుగు : తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి ఏవిధంగా పాల్పడుతున్నారో, ఓ మంత్రి బహిరంగంగా చేసిన వ్యాఖ్యల్లో స్పష్టమవుతోంది. అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరో టీడీపీ నేతకు అవినీతిలో వాటాలు ఉన్నట్టు వెల్లడించారు. తాను చేసే అవినీతిలో టీడీపీ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి కూడా అర్ధ రూపాయి భాగం ఉందని పేర్కొన్నారు. స్వయానా సీఎం చంద్రబాబు నాయుడే ఐఏఎస్ ఆఫీసర్లని తమతో పాటూ కూర్చోబెట్టి పంచాయతీ చేపించారని తెలిపారు. రామ సుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగినా రామ సుబ్బారెడ్డికి సగం వస్తుంది అంటూ ఆదినారాయణ రెడ్డి అక్కడున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'వాళ్లు దాంట్లో ఏది విమర్శించినా నేనైతే పట్టించుకోను, మీరెవరూ దయ చేసి విమర్శించమాకండి. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి. ఎస్ఎంఎస్ లు పెట్టండి. నీను మీ ఎమ్మెల్యేని, పక్కకు పోయినప్పుడే మంత్రిని' అంటూ ఆది నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు ఎక్కువయ్యాయి. -
చంద్రబాబే అవినీతి చేసుకోమని చెప్పారు..
-
బాబు వద్దకు జమ్మలమడుగు పంచాయితీ
విజయవాడ: జమ్మలమడుగులో టీడీపీ పార్టీ నివురుగప్పిన నిప్పును తలపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి పంచాయతీ చేరింది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచి రామ సుబ్బారెడ్డి ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఆదినారాయణ వల్ల ఫ్యాక్షనిజం మళ్లీ పెరిగిందని కొద్ది రోజుల కిందట రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో రామసుబ్బారెడ్డి వర్గీయులపై ఆదినారాయణ రెడ్డ వర్గీయులు దాడి చేశారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి మాట్లాడారు. -
అంబులెన్స్‌ను ఢీకొన్న లారీ, రోగి మృతి
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లిలో శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న అంబులెన్స్‌ను వెనుక నుంచి లారీ ఢీకొంది. దాంతో అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్ రామ సుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అనారోగ్యంగా ఉన్న రామ సుబ్బారెడ్డిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జిల్లాలోని ధన్వాడ మండలం పస్పులగేట్ వద్ద ఓ లారీ బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.