సాక్షి, కడప: రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి గన్‌మన్ మృతి చెందాడు. కడప రాజారెడ్డివీధిలో నివాసముంటున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి మంత్రి వద్ద గన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో సర్వీస్ గన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్థానికంగా ఉండే హిమాలయా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.