
West Godavari: మండలంలోని పందలపర్రు గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆర్‌ఎంపీ తిక్కా దుర్గారావును అరెస్ట్ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై షేక్ సుభాని సోమవారం తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాలికతో దుర్గారావు అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆర్‌ఎంపీపై అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
చదవండి: ఉద్యోగం ఒకరిది.. జీతం మరొకరికి!