RMP Doctor
-
గర్భ విచ్ఛిత్తికి ఆర్ఎంపీల ప్రోత్సాహం
ఎంజీఎం: ఆర్ఎంపీ, పీఎంపీల వైద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా హనుమకొండ జీఎంహెచ్ ఆస్పత్రి నుంచి వచ్చిన మహిళల ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు నరేష్, ఐఎంఏ అధ్యక్షుడు అన్వర్ ఆదివారం విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన నాలుగు నెలల గర్భిణి అక్టోబర్ 3న మంగపేటకు చెందిన ఆర్ఎంపీ రామును కలవగా, గర్భ విచ్ఛిత్తికి మందులు ఇచ్చాడు. కడుపు నొప్పి రావడంతో మరిన్ని ట్యాబ్లెట్లు ఇవ్వగా.. కొంత ఉపశమనం కలిగినా, మళ్లీ నొప్పి తీవ్రత పెరగడంతో కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఈనెల 1న హనుమకొండ జీఎంహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి గర్భాశయం పగలడంతోపాటు శరీరంలోని రక్తం విషతుల్యమైందని నిర్ధారించారు. గర్భసంచి తొలగించి వెంటిలేటర్ చికిత్స అందించడానికి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీ బృందం గుర్తించింది. ఈ ఘటనపై ములుగు జిల్లా వైదారోగ్యశాఖ అధికారులు, పోలీసులకు సదరు ఆర్ఎంపీపై ఫిర్యాదు చేయనున్నట్టు కౌన్సిల్ సభ్యులు తెలిపారు.సిద్దిపేట జిల్లా అక్కంపేట మండలానికి చెందిన మరో గర్భిణికి సైతం కేశవపూర్‌కు చెందిన రమణాచారి అనే నకిలీ వైద్యుడు గర్భ విచ్ఛిత్తికి మందులు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయస్థితికి చేరుకుందని చెప్పారు. ఆమె ప్రాణాలను కాపాడిన వైద్యులు టీజీఎంసీ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు అతడిపై కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.ములుగులో మెడికల్ స్టోర్ యజమాని సొంత వైద్యం ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన మరో గర్భిణికి జిల్లా కేంద్రం బస్టాండ్ సమీపాన ఉన్న మెడికల్ స్టోర్ యజమాని ఇచ్చిన గర్భ విచ్ఛిత్తి మందులు వేసుకున్నాక..ఆమె స్పృహ కోల్పోవడంతో హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కౌన్సిల్ సభ్యులు తెలిపారు. వైద్యులు సత్వర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.బాధిత మహిళ షాపు పేరు చెప్పకపోవడంతో ములుగు జిల్లా బస్టాండ్ ప్రాంతంలో అన్ని మందుల దుకాణాలను తనిఖీ చేసి సదరు మెడికల్ స్టోర్లపై చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి?
నెక్కొండ/ఎంజీఎం, వరంగల్: కొందరి ఆర్ఎంపీల వైద్యానికి నిత్యం ఏదో ఒక చోట అయాయకులు బలవుతున్నారు. తాజాగా మండలంలోని ముదిగొండకు చెందిన కావటి మణిదీప్ (10) కూడా ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరలైంది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కావటి కోటేశ్వర్, సరిత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మణిదీప్ ఇటీవల కుక్క కాటుకు గురయ్యాడు. దీంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ అశోక్.. ఈ నెల 11వ తేదీన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశాడు. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీనిపై సదరు ఆర్ఎంపీ.. గుట్టుచప్పడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రహస్య ఒప్పంద కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ విషయం వైరల్ కావడంతో తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) వెంటనే స్పందించి సుమోటోగా స్వీకరించింది. దీంతో వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ బృందానికి జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని చైర్మన్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య సోమవారం ఆదేశించారు.కాగా, వరంగల్ టీజీఎంసీ సభ్యుడు శేషుమాధవ్, టీజీఎంసీ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్‌కుమార్, రాష్ట్ర ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి, వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ అన్వర్‌మియా, వరంగల్ హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు కొలిపాక వెంకటస్వామి, తానా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాకేశ్ నేతృత్వంలోని వైద్య బృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనుందని ఆదేశాల్లో పేర్కొంది. -
సూర్యాపేటలో ఘోరం: ఆడపిల్ల అని తెలిసి అబార్షన్, వైద్యం వికటించి..
సూర్యాపేటటౌన్: పుట్టేది ఆడపిల్ల అని తెలిసి భార్యకు ఆర్ఎంపీతో భర్త అబార్షన్ చేయించగా, వైద్యం వికటించి ఆమె మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్‌తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్‌కు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాముతండాకు చెందిన సుహాసిని(26)కి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. సుహాసిని మూడోసారి గర్భవతి కాగా, స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియడంతో హరిసింగ్ సుహాసినికి అబార్షన్ చేయించాలనుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ సలహా తీసుకోగా.. ఏడో నెలలో అబార్షన్ చేయిస్తే తల్లీబిడ్డకు ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పింది. అయినా, సుహాసినిని రెండురోజుల క్రితం బలవంతంగా హరిసింగ్ హుజూర్నగర్ ప్రాంతంలో ఓ ఆర్ఎంపీతో అబార్షన్ చేయించాడు. అయితే వైద్యం వికటించి సుహాసిని పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం కోదాడకు, ఆపై ఖమ్మంకు అక్కడ నుంచి సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా ఆమె మృతి చెందింది. అయితే సుహాసిని మృతిచెందిన విషయాన్ని హరిసింగ్ కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎంజీనగర్ తండాకు తీసుకొచ్చాడని, గ్రామస్తులు గమనించి విషయం తమకు తెలిపారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. సూర్యాపేటటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పంపించారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పీహెచ్డీ చేసిన హరిసింగ్.. హరిసింగ్ నెలరోజుల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడని, ఉన్నత చదువులు చదివిన వ్యక్తే బలవంతంగా అబార్షన్ చేయించి సుహాసిని మృతికి కారణమయ్యాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డాక్టర్‌గా మారొద్దు.. మందులు రాయొద్దు
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకుండా ఎవరూ వైద్యం చేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2010 ప్రకారం ప్రథమ చికిత్స చేసే ఆర్ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్లు అనేక ఆరోప ణలు వస్తున్నాయని... వారి వైద్యం వల్ల కొందరు రోగులు మృతిచెందినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. కాబట్టి ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఆర్ఎంపీలు తమ చికిత్స కేంద్రం ముందు సూచిక బోర్డులపై ఫస్ట్ అయిడ్ సెంటర్ లేదా ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ప్రదర్శించాలని... క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్ హోం, మెడికల్ సెంటర్ లేదా మరే ఇతర పేర్లతో సూచిక బోర్డులను ప్రదర్శించరాదని పేర్కొంది. ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు సర్కారు సూచనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటా మని హెచ్చరించింది. ఆర్ఎంపీలకు సూచనలివీ... ఆర్ఎంపీలు స్వయంగా రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం లేదా ఇంజెక్షన్లు చేయడం వంటివి చేయరాదు. రోగులకు వైద్య మందుల చీటీని (ప్రిస్క్రిప్షన్) రాయకూడదు. రోగులకు సెలైన్ బాటిల్స్ ఎక్కించరాదు. ఇన్–పేషెంట్ వైద్యం చేయకూడదు, ల్యాబ్‌లను నిర్వహించరాదు. అబార్షన్లు, కాన్పుల వంటి హైరిస్క్ చికిత్సలు చేయరాదు. రోగులను ప్రలోభపెట్టి వైద్యం కోసం ఆసుపత్రులకు సిఫార్సు చేయడం లేదా బలవంతంగా పంపించడం చేయరాదు. -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్‌ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్‌పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్‌లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
ప్రాణాలు తీస్తున్న ఆర్ఎంపీలు?! అక్కడ అసలేం జరుగుతోంది?
సిర్పూర్(టి) మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన బూరం చెన్నమల్లు యాదవ్ స్వల్ప జ్వరంతో ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌తో కేవలం ఐదు గంటల్లో ప్రాణాలు కోల్పోయాడు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు సైతం ఇలాగే మృతి చెందాడు. తాజాగా చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామానికి చెందిన వివాహిత దన్నూరి పుష్పలత ప్రాణాలు కోలో్పయింది. ఆమె చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి చెందిన గోంగ్లె బండు– చైతన్య దంపతుల కుమార్తె ఆద్యశ్రీ (4) ఓ ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చింతలమానెపల్లి(సిర్పూర్): గల్లీగల్లీకి వెలుస్తున్న ఆర్ఎంపీ క్లినిక్‌లు, అనుమతి లేని రక్త పరీక్షా కేంద్రాలు.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నాయి. విచ్చలవిడి వైద్యంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పరిధి దాటి వైద్యం చేస్తు న్న కొందరు ఆర్ఎంపీలు పేదల ప్రాణాలు తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మందికి పైగానే ఆర్ఎంపీలు ఉన్నట్లుగా ఆర్ఎంపీ, పీఎంపీల సంఘాల లెక్కలు చెబుతున్నాయి. కనీస పరిజ్ఞానం లేని కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు వైద్యపరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సొంతంగా మందులు రాయడం, ఇంజక్షన్లు వేయడం చేస్తున్నారు. కొద్దినెలల పాటు ఆర్ఎంపీలకు అసిస్టెంట్లుగా పనిచేసిన వారు సైతం గ్రామాల్లో సొంతంగా క్లినిక్‌లు తెరుస్తున్నారు. ధనార్జనే ధ్యేయం.. గతంలో ప్రభుత్వాలు తెచ్చిన నిబంధనలను ఆసరాగా చేసుకుని కొందరు ఆర్ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా క్లినిక్‌ల్లో వైద్యం చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స అందించాల్సి వీరు ఏకంగా ప్రత్యేక భవనాల్లో పడకలు ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో రోగులకు వైద్యం అందిస్తున్నారు. భారీ ఫ్లెక్సీల ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల క్లినిక్, మందుల దుకాణం, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఒకేగదిలో నిర్వహిస్తుండడం గమనార్హం. పరిమితులు దాటి చేస్తున్న వైద్యం రోగులకు ప్రాణ సంకటంగా మారింది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌ల్లోనూ ఆర్ఎంపీ క్లినిక్‌లు ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రాణాలు పోతున్నా చర్యలేవి..? ఆర్ఎంపీలు పరిధి దాటి వైద్యం చేస్తున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ ఓ వైపు ప్రాణా లు పోతున్నా పట్టించుకోరా..?’ అంటూ ప్రజలు నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కిల్లింగ్ ఇంజక్షన్స్.. ఇటీవల బాధితులు మృతి చెందిన ఘటనలు ఆర్ఎంపీలు అందించిన వైద్యంతోనే జరిగినట్లు తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న వారికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. వాంతులు చేసుకోవడం, చలి పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. పరిస్థితి అదుపులోకి రాకపోగా రోగులు నేరుగా కోమాలోకి వెళ్తున్నారు. ఆర్ఎంపీలు చేస్తున్న వైద్యం, వారు ఇస్తున్న ‘కిల్లింగ్ ఇంజక్షన్’ ఏంటన్నది వైద్యాధికారులు తేల్చాల్సి ఉంది. రోగుల ప్రాణాలకు ముప్పు వైద్యం అనేది రోగిని అన్నిరకాలుగా పరీక్షించి అందించాల్సి ఉంటుంది. సరైన పద్ధతిలో వైద్యం అందించకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నవారి వద్దే వైద్యం తీసుకోవాలి. బాధితుల పరిస్థితిని తెలుసుకునే అవకాశం కేవలం నిపుణులకు మాత్రమే ఉంటుంది. – అరుణకొండ రవికుమార్, ఎండీ జనరల్ ఫిజీషియన్, మంచిర్యాల ఎక్కువ డోస్ మందులతోనే.. రోగుల జ్వరం తీవ్రతతతోపాటు ప్లేట్‌లెట్స్‌ను కూడా వైద్యులు గమనించాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే ఫ్లూయిడ్స్, నరాల ద్వారా ఇచ్చే మందులను పరిశీలనలో ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ డోస్ మందులను తీవ్రస్థాయిలో వినియోగించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. – సందీప్ జాదవ్, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు -
తోచిన వైద్యంతో మహిళ ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ భార్య
ఇల్లెందురూరల్: తెలిసీ తెలియని వైద్యంతో డాక్టర్ భార్య చేసిన చికిత్స బెడిసికొట్టింది. ఇంజక్షన్ వేసిన కాసేపటికే ఓ మహిళ కన్నుమూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కొమరారంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని పోలారం గ్రామపంచాయతీ భద్రుతండాకు చెందిన భూక్య కోక్యా (45) జ్వరంతో బాధపడుతూ స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకుంది. జ్వరం తగ్గకపోవడంతో కోడలు ప్రమీల సాయంతో కొమరారంలో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు జి.బన్సీ నిర్వహిస్తున్న కొమరారంలోని విఘ్నేశ్వర ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఎలాంటి అనుభవం లేని వైద్యుడి భార్య వెన్నెల కోక్యాను పరిశీలించి.. అందరికీ వైరల్ జ్వరాలే వస్తున్నాయంటూ ఓ ఇంజక్షన్ వేసింది. కాసేపటికే కోక్యా పరిస్థితి విషమంగా మారగా, భర్త బన్సీకి సమాచారం ఇచ్చింది. అతని సూచన మేరకు వెన్నెల సైలెన్ పెట్టినా ఎలాంటి మార్పు రాలేదు. కోక్యా ఆపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కోడలు ప్రమీల పక్కనే ఉన్న పోచారంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళుతుండగానే మృతి చెందింది. విషయం తెలియగానే పోలారం గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ సరోజిని, గ్రామస్తులు, మృతురాలి బంధువులు భారీగా తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే కొమరారం ఎస్సై గిరిధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని చికిత్సకు సంబంధించిన మందులు స్వాధీనం చేసుకుని బన్సీ, వెన్నెలను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బంధువుల ఆందోళన, దాడికి యత్నం.. ఆసుపత్రిలో విచారించిన ఎస్సై గిరిధర్‌రెడ్డి పిటిషన్ ఇవ్వాలని మృతురాలి కుటుంబసభ్యులను కోరారు. ఇదే విషయాన్ని గ్రామస్తులకు వివరించే ప్రయత్నం చేస్తుండగా కోపోద్రిక్తులైన వారు ఆస్పత్రిపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నా అప్పటికే ముందుభాగంలో అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైద్యుడు బన్సీ,, అతడి భార్య వెన్నెలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రి వెనుక భాగం నుంచి ప్రత్యేక వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. గమనించిన గ్రామస్తులు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి దాడికి యత్నించారు. ఎస్సై గిరిధర్‌రెడ్డి వారికి నచ్చజెప్పి కేసు నమోదు చేశామని, పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నామని వివరించడంతో శాంతించారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి మృతురాలిని శవ పరీక్ష కోసం ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. -
ఆర్ఎంపీలకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది. ఫార్మా కంపెనీలు, వారి ప్రతినిధులు, వైద్య పరికరాల సంస్థల దగ్గర్నుంచి వైద్యులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కానుకలు, డబ్బులు, ఆతిథ్యం స్వీకరించకూడదని నిబంధనలు విధించింది. ఫార్మా కంపెనీలు ఇచ్చే పార్టీల్లో పాల్గొనడం, ప్రయాణ సదుపాయాలను తీసుకోవడం వంటివి చేయకూడదని పేర్కొంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు వృత్తిపరమైన బాధ్యతని కలిగి ఉంటూ ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2నే ఈ నిబంధనల్ని జారీ చేసింది. అంతే కాదు ఫార్మా కంపెనీలు తయారు చేసే మందులు ఇతర పరికరాల వినియోగాన్ని ఆమోదిస్తూ ప్రకటనలివ్వకూడదంది. -
పెయిన్.. కిల్లింగ్! నెల రోజుల్లోనే 20 మంది, ఆర్ఎంపీల వైద్యమే కారణమా..
‘మా మండలంలోని మామిడిగూడ, ముత్నూర్, హర్కాపూర్ గ్రామాల్లో గత నెల రోజుల వ్యవధిలోనే 20 మంది కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. దీనిపై వైద్యారోగ్యశాఖ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఆర్ఎంపీల వైద్యంతోనే అమాయక ఆదివాసీలు కిడ్నీలు చెడిపోయి మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలి.’ ఈ నెల 24న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇంద్రవెల్లి జెడ్పీటీసీ అర్క పుష్పలత చేసిన వ్యాఖ్యలివి. బేల మండలంలో బెంగాల్ డాక్టర్ల వైద్యం అమయాక ప్రజల ప్రాణలమీదకు తెస్తుంది. కాళ్లు, కీళ్ల నొప్పులతో స్థానికంగా ఉన్న బెంగాల్ వైద్యుల వద్దకు వెళ్లగా మోకాళ్లలో హైడోస్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఇవి తీసుకున్న వారి కిడ్నీలు నెల వ్యవధిలోనే చెడిపోయి డయాలసిస్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.’ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సామ రూపేశ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 27న కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ఇది. ఆదిలాబాద్: జిల్లాలో కొంతమంది ఆర్ఎంపీల అచ్చీరాని వైద్యం అమయాక ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. పల్లెవాసులు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే ఎక్కువగా వీరినే ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో వారు మోతాదుకు మించి ఇస్తున్న హైడోస్ ఇంజక్షన్లు బాధితుల కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నెల గడువక ముందే బాధితులు డయాలసిస్‌కు వెళ్లాల్సి వస్తుండడం గమనార్హం. ఆర్ఎంపీల వైద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఫిర్యాదులు అందుతున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆర్ఎంపీల వైద్యమే కారణమా.. జిల్లాలో ఆయా గూడాలు, తండాల్లో ఉండే ఆదివాసీలు, గిరిజనులు అనారోగ్య సమస్యలు వస్తే ఎక్కువగా ఆర్ఎంపీలను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే ఆర్థికస్థోమత లేకపోవడం, ప్రభుత్వాసుపత్రుల్లో సకాలంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో స్థానికంగా ఉన్న వీరే దిక్కవుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది అచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణల మీదకు తెస్తున్నారు. రోగుల జబ్బులు త్వరితగతిన నయం కావాలని హైడోస్ ఇంజక్షన్లు వేస్తున్నారు. మోతాదుకు మించి మాత్రలు ఇస్తున్నారు. వాటిని ఉపయోగించిన రోగులకు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతున్నప్పటికీ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్ఎంపీల వద్ద ఇంజిక్షన్లు తీసుకున్న రోగులు నెల గడవక ముందే కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పెరుగుతున్న బాధితులు జిల్లాలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇందుకు బెంగాళి వైద్యుల వైద్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీరితో పాటు జిల్లా వైద్యారోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేని ఆర్ఎంపీలు సైతం పల్లెల్లో తిరుగుతూ రోగులకు అనధికారికంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొంతమంది ఏకంగా ఆసుపత్రి తరహాలో పడకలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని బేల, ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరడిగొండ తదితర మండలాల్లో ఇలాంటివి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. వీరు మోతాదుకు మించి ఇస్తున్న మాత్రలు, ఇంజక్షన్లతో రోగుల కిడ్నీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్ఎంపీలను ఆశ్రయించిన మరుసటి నెలకు రిమ్స్‌కు వెళ్లితే అక్కడ పరీక్షించిన వైద్యులు కిడ్నీలు చెడిపోయాయని, డయాలసిస్ చేయాలని చెబుతుండటం కలవరానికి గురి చేస్తోంది. పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి లేకుండా ఆర్ఎంపీలు ప్రాక్టీస్ చేయడం చట్టరీత్యానేరం. అలాగే పడకలతో కూడిన వైద్యమందించడం కూడా నిబంధనలకు విరుద్దం. ఇలాంటి వారు ఎక్కడైనా వైద్యం చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. ఇంద్రవెల్లి మండలంలో 20 మంది ఒక నెలలో మరణించారనడం పూర్తిగా అవాస్తవం. గతంలో ధనోరాలో ఇలాంటి పరిస్థితే ఉందని మా దృష్టికి రావడంతో అక్కడ ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశాం. – రాథోడ్ నరేందర్, డీఎంహెచ్‌వో పరిమితికి మించితే ప్రమాదం ఆర్ఎంపీలు యాంటిబయటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ ఇవ్వడానికి వీలు లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే వీరి వద్దకు వచ్చే బాధితులకు పరిమితికి మించి పెయిన్‌కిల్లర్స్, యాంటిబెటిక్స్ ఇస్తుంటారు. నెలల తరబడి వీటిని వాడడంతో బీపీ, షుగర్‌తో పాటు ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ప్రజలు వారికి వచ్చిన జబ్బును నిపుణులైన వైద్యులతో నిర్ధారించుకొని చికిత్స చేయించుకోవాలి. ఆర్ఎంపీలపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. – డాక్టర్ సుమలత, ఎండీ ఫిజీషియన్ -
ఆర్ఎంపీ డాక్టర్ ఉన్మాదం.. నిద్రపోతున్న భార్యను దారుణంగా చంపి.. ఆపై
సాక్షి, హైదరాబాద్: అతని వృత్తి ప్రాణాలను పోసే ఆర్ఎంపీ డాక్టర్. కానీ అందుకు భిన్నంగా భార్యను కత్తితో మెడ కోసి ప్రాణం తీసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి ఏసీపీ జీవీ రమణగౌడ్ కథనం ప్రకారం.. శంకర్పల్లి మండలం జన్వాడలోని ఓ ఇంట్లో ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు తన భార్య సుధారాణి, ఇద్దరు కుమారులతో కలిసి ఉంటూ అనుబంధ గ్రామమైన మియాఖాన్‌గూడలో క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రపోతున్న భార్యను కొబ్బరికాయలు కొట్టే కత్తితో మెడ కోసి హత్య చేశాడు. అనంతరం ఏడేళ్ల పెద్ద కుమారుడు దీక్షిత్ మొహంపైనా దిండు పెట్టి బలంగా ఒత్తాడు. అంతలోనే అతన్ని వదలి కిచెన్‌లోకి వెళ్లి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తేరుకున్న దీక్షిత్ తన తమ్మున్ని తీసుకుని పక్క గదిలోకి వచ్చి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడిపారు. శనివారం ఉదయం పక్కింట్లోని మహిళ వాకిలి ఊడుస్తుండటంతో అలికిడి చప్పుడు విని ఆమెను పిలిచి విషయం చెప్పారు. వెంటనే స్థానికులు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, భార్యాభర్తలిద్దరూ గొడవ పడిన దాఖలాలు కూడా లేవని, హత్యకు, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఏసీపీ చెప్పారు. చదవండి: విశాఖలో షాకింగ్ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని.. -
కలలు.. కల్లలయ్యాయి..
ఎల్కతుర్తి: ఇటీవల బీటెక్ అయిపోయింది. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ మనం ఒకటి తలిస్తే.. విధి మరోటి తలుస్తుందని అంటుటారు.. అదే ఈ యువకుడి విషయం జరిగింది. జ్వరంరాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చూయించుకున్నాడు. అతను ఇచ్చిన ఇంజక్షన్‌తో శరీరం నల్లగా మారడంతోపాటు అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది. మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి విజయ్(22) బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 12న విజయ్‌కి జ్వరం రావడంతో జీల్గులకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్‌ను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యుడు మాత్రలు ఇచ్చాడు. అయినప్పటికి విజయ్‌కి జ్వరం తగ్గకపోవడంతో అదేరోజు సాయంత్రం ఆర్ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ వేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఇంజక్షన్ వేసిన దగ్గర శరీరమంతా నల్లగా మారి ఇబ్బందులు పడ్డాడు. తిరిగి ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లగా మరికొన్ని మాత్రలు ఇచ్చి తగ్గకపోతే రావాలని సూచించాడు. అయినప్పటికి నొప్పి తగ్గకపోవడంతో మరోసారి ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. దీంతో ఆర్ఎంపీ.. విజయ్ చేతికి మరో ఇంజక్షన్ వేసి పంపించాడు. ఆ నొప్పి తీవ్రతరం కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు అశ్రిత్‌రెడ్డి.. విజయ్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, నాలుగు రోజుల తర్వాత రావాలని మందులు రాసి ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన విజయ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఈనెల 14న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. కాగా, ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్తోపాటు వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ అశ్రిత్‌రెడ్డి విజయ్ మృతికి కారకులని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడికి తల్లిండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. మృతుడి తండ్రి రవిందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జక్కుల పరమేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా ఇటీవలే బావుపేటలో ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి బత్తిని సతీష్ అనే వ్యక్తి మృతిచెందిన విషయం మరువకముందే మరో సంఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
స్థానిక కౌన్సిలర్ భర్తపై కత్తితో దాడి చేసిన ఆర్ఎంపీ డాక్టర్
-
వీడియో.. నల్గొండలో దారుణం.. కౌన్సిలర్ భర్తపై ఆర్ఎంపీ కత్తితో దాడి
సాక్షి, నల్గొండ: నల్గొండ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక కౌన్సిలర్ భర్తపై ఓఆర్ఎంపీ డాక్టర్ కత్తితో దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. పట్టణంలోని దేవరకొండ రోడ్డులో 25వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి భర్త శ్రీనివాస్ మీద అదే ప్రాంతంలో ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ అనంతుల యాదయ్య కత్తితో దాడికి దిగాడు. నడిరోడ్డుపై కౌన్సిలర్ వెంట పరుగెత్తి కత్తితో దాడి చేశాడు. వెంటనే అక్కడున్న స్థానికులు గమనించి దాడిని అడ్డుకున్నారు. అనంతరం బాధితుడు శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. కత్తితో వెంబడించడం, దాడి చేయడం వంటి వీడియోలు ..సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
ఆర్ఎంపీలు అబార్షన్లు, ప్రసవాలు చేస్తే ఊరుకోం.. క్రిమినల్ కేసులు తప్పవు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు తప్పుడు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. తప్పుడు వైద్యం, అబార్షన్లు, ప్రసవాలు, కొన్ని రకాల సర్జరీలు చేస్తూ కొందరు ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేగాకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందులను రోగులకు ఇస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానికంగా క్లినిక్‌లు పెట్టుకుని ఎలాంటి రిజిస్టర్ సర్టిఫికెట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న కేంద్రాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక వైద్యం వరకు పరిమితమయ్యే వారిని వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, బుధవారం కొందరు ఆర్ఎంపీ సంఘాల నేతలు శ్రీనివాసరావును కలిసి తమపై అనవసరంగా దాడులు జరపవద్దని కోరారు. ఆస్పత్రులపై కొనసాగుతున్న దాడులు... రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు కొనసాగుతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,058 ఆస్పత్రులను, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన 103 ఆస్పత్రులను సీజ్ చేశారు. 633 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 75 ఆస్పత్రులకు జరిమానాలు విధించారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా.. అత్య«ధికంగా రంగారెడ్డి జిల్లాలో 325, కరీంనగర్ జిల్లాలో 293, హైదరాబాద్‌లో 202, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 144, వికారాబాద్‌లో 109 ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. మెదక్, నల్లగొండ జిల్లాల్లో మాత్రం తనిఖీలు జరగలేదు. కాగా, చిన్న చిన్న లోపాలున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవద్దని, వారికి 15 రోజులపాటు సమయమిచ్చి తదనంతరం సరిదిద్దుకోకపోతే చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. -
‘ఆచార్య’ మూవీ టీంకు షాక్, మెగాస్టార్ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు
Acharya Saana Kastam Song Controversy: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరు తనయుడు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ.. అభిమానుల కోసం వరసగా ఓక్కో అప్డేట్ ఇస్తూ మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. అంతేగాక ఫిబ్రవరి విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం సరైన సమయంలో కోసం ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ టీంకు తాజాగా షాక్ తగిలింది. ఇటీవల విడుదలై ఆచార్య స్పెషల్ సాంగ్ వివాదంలో చిక్కుకుంది. చదవండి: అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఆర్జీవీ, ట్వీట్ వైరల్ ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ‘సానా కష్టం అంటూ సాగే ఈ పాటలో ఓ చోట లిరిక్స్ తమ మనోభవాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఓ చోట ‘ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు’ అని ఉంది. ఇప్పుడు ఇదే లైన్ వివాదానికి దారితీసింది. పాటలోని ఈ లిరిక్స్ ఆర్ఎంపీ వృత్తిని కించపరిచేలా ఉందని, ఆర్ఎంపీ, పీఎంపీల మనోభవాలను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్ అంతేగాక జనగామలోని రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పాట రచయిత, సినిమా దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని, సినిమాలో ఈ పాటను నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఇటీవల పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామ.. ఊఊ ఉంటావా’ సాంగ్‌ను కూడా వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ పాట ఎంతటి రచ్చకు దారితీసేందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూస్తుంటే పుష్ప సాంగ్ మాదిరిగానే ఆచార్య స్పెషల్ సాంగ్ కూడా వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిసోంది. మరి ఇది ఎంతవరకు దారితీస్తోంది చూడాలి. -
వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. 20 రోజుల నరకయాతన.. చివరికి
సాక్షి, అనంతపురం: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామానికి చెందిన మేకల లింగన్న, చెన్నమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఓ కుమార్తె సంతానం. వీరిలో పెద్ద కుమారుడు రామాంజినేయులుకు ఆరేళ్ల క్రితం మహాలక్ష్మి అనే యువతితో వివాహమైంది. హమాలీ పనులతో కుటుంబాన్ని రామాంజినేయులు పోషిస్తున్నాడు. ఇంజెక్షన్ వేస్తే.. వాచిపోయింది కర్నూలు జిల్లా, మద్దికెర మండలం, హంప గ్రామానికి చెందిన రఫీ బతుకు తెరువు కోసం వైటీ చెరువులో ఆర్ఎంపీ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న మేకల రామాంజినేయులు (32) చికిత్స కోసం రఫీ వద్దకెళ్లాడు. ఆ సమయంలో కుడికాలు మక్కికి ఇంజక్షన్ వేసి పంపాడు. రెండు రోజుల తర్వాత ఇంజక్షన్ వేసిన ప్రాంతం పూర్తిగా వాపు తేలింది. మరోసారి రఫీ వద్దకెళ్లి చూపించుకున్నారు. వేడినీటి కాపడం పెడితే తగ్గిపోతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు అలాగే చేశారు. అయితే పరిస్థితి మరింత దిగజారి వాపు మోకాళ్ల వరకూ విస్తరించి ఎర్రగా కందిపోయింది. అయినా ఆర్ఎంపీ సొంత వైద్యాన్ని మానలేదు. డబ్బు కోసం మభ్య పెడుతూ పరిమితికి మించి వైద్యం చేయసాగాడు. ఏడు రోజుల్లో కాలు పూర్తిగా కందిపోయి నడవడానికి సైతం వీలు కాకపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చదవండి: బాలికపై లైంగిక దాడి ... ఆపై వ్యభిచార వృత్తిలోకి దింపి... కాలు తీసేయాలన్నారు.. రామాంజినేయులు పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. కాలు పూర్తిగా దెబ్బతినిందని, శస్త్రచికిత్స చేసి తీసేయాల్సి ఉంటుందన్నారు. దీంతో బాధితుడిని బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. శస్త్రచికిత్సలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే రామాంజినేయులు ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వాయిదా వేశారు. ఇన్ఫెక్షన్ విస్తరించి బత్తలపల్లి ఆస్పత్రిలోనే మంగళవారం ఉదయం రామాంజినేయులు మృతి చెందాడు. పోలీసులకు ఫిర్యాదు రామాంజినేయులు మృతదేహాన్ని గుంతకల్లుకు తీసుకువచ్చిన కుటుంబసభ్యులు.. మృతికి కారణమైన ఆర్ఎంపీ రఫీపై చర్యలు తీసుకోవాలంటూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సదరు ఆర్ఎంపీ నిర్వాకం వల్ల గతంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారని స్థానికులు తెలిపారు. -
ఆర్ఎంపీ డాక్టర్ పాడుపని.. తల్లిదండ్రులు లేని సమయంలో..
West Godavari: మండలంలోని పందలపర్రు గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆర్ఎంపీ తిక్కా దుర్గారావును అరెస్ట్ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై షేక్ సుభాని సోమవారం తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాలికతో దుర్గారావు అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆర్ఎంపీపై అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: ఉద్యోగం ఒకరిది.. జీతం మరొకరికి!