Acharya Saana Kastam Song Controversy: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్‌లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరు తనయుడు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ.. అభిమానుల కోసం వరసగా ఓక్కో అప్‌డేట్ ఇస్తూ మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. అంతేగాక ఫిబ్రవరి విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం సరైన సమయంలో కోసం ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ టీంకు తాజాగా షాక్ తగిలింది. ఇటీవల విడుదలై ఆచార్య స్పెషల్ సాంగ్ వివాదంలో చిక్కుకుంది.
చదవండి: అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఆర్జీవీ, ట్వీట్ వైరల్
ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్‌ఎంపీ డాక్టర్ల సంఘం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ‘సానా కష్టం అంటూ సాగే ఈ పాటలో ఓ చోట లిరిక్స్ తమ మనోభవాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ ఆర్‌ఎంపీ డాక్టర్ల సంఘం తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఓ చోట ‘ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు’ అని ఉంది. ఇప్పుడు ఇదే లైన్ వివాదానికి దారితీసింది. పాటలోని ఈ లిరిక్స్ ఆర్‌ఎంపీ వృత్తిని కించపరిచేలా ఉందని, ఆర్‌ఎంపీ, పీఎంపీల మనోభవాలను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ఆర్‌ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు.
చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్
అంతేగాక జనగామలోని రాష్ట్ర ఆర్‌ఎంపీల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పాట రచయిత, సినిమా దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని, సినిమాలో ఈ పాటను నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఇటీవల పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామ.. ఊఊ ఉంటావా’ సాంగ్‌ను కూడా వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ పాట ఎంతటి రచ్చకు దారితీసేందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూస్తుంటే పుష్ప సాంగ్ మాదిరిగానే ఆచార్య స్పెషల్ సాంగ్ కూడా వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిసోంది. మరి ఇది ఎంతవరకు దారితీస్తోంది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment