
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటేనే అభిమానులకు పండగలా ఉంటుంది. అలాంటిది మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఉండటంతో మెగా అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆచార్య' సినిమా ఎట్టకేలకు శుక్రవారం(ఏప్రిల్29)విడుదలయ్యింది. ‘సైరా నరసింహారెడ్డి’లాంటి సూపర్‌హిట్ తర్వాత సుమారు 4ఏళ్ల తర్వాత చిరు నటించిన సినిమా కావడం, రామ్‌చరణ్ కూడడా ఉండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? సినిమాపై వాళ్ల రివ్యూ ఏంటన్నది 'సాక్షి ఆడియన్స్ పోల్'లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment