Acharya
-
Tangirala Venkata Subbarao తొలితరం జానపథికుడు
జానపద సాహిత్యం కోసం అనంతమైన కృషి చేసినవారు తంగిరాల వెంకట సుబ్బారావు. ఆ సాహిత్యాన్ని సేకరించి, విశ్లేషించి, వేలాది పుటల గ్రంథాలను వెలుగులోనికి తీసుకొచ్చారు. ‘తెలుగు వీరగాథా కవిత్వం’పై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా అందుకొన్నారు. తెలుగులోని వీరగాథా వైశిష్ట్యాన్ని లోకానికి చాటడంలోతంగిరాల సఫలీకృతులైనారు. ఈ సిద్ధాంత గ్రంథంలో వీరగాథల పుట్టుపూర్వోత్త రాలు, వీరగాథా విభజన, శక్తి కథాచక్రం, పలనాటి వీర కథా చక్రం, కాటమరాజు కథాచక్రం, బొబ్బిలి వరుస కథలు, పదాలు, జంగం కథలు, లఘు వీర గాథలు, వీర గాథానుకరణాలు, వీరగాథలో రసం, భాష, ఛందస్సు, వీరగాథల వైశిష్ట్యం వంటి పరిశోధనా విషయాలను కూలంకషంగా చర్చించి వివరించారు. తంగిరాల ‘రేనాటి సూర్యచంద్రులు’ అనే పెద్ద పుస్త కాన్ని ప్రచురించారు. ఇందులో భారతదేశంలో మొదటి స్వాతంత్య్ర పోరాట వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథల్ని సవివరంగా పరిశీలించి తెలుగు వారికి అందించారు. అలాగే రేనాటి సూర్య చంద్రులు రెండవ సంపుటాన్ని ప్రచురించి అందులో రాయలసీమ దాన కర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి సాహిత్యాన్ని విడమరచి చెప్పారు. చదవండి: Aga Khan : ప్రముఖ ఆధ్యాత్మికనేత, దాత ఆగా ఖాన్ కన్నుమూత‘చైతన్య కవిత’ అనే పత్రికను స్థాపించి ఎన్నో ఏళ్ళు దానికి సంపాదకుడిగా పని చేశారు. ‘శ్రీకృష్ణ కర్ణామృతం’ గ్రంథానికి కూడా సంపాదకత్వం వహించారు. రంగ నాథ రామాయణం, సుమతి శతకాలను తంగిరాలతో కలిసి కొంతమంది ఆంగ్లంలోకి అనువదించారు. ‘అంకమ్మ కథలు’ పేరుతో శక్తి కథాచక్రాన్ని ప్రచురించారు. వంద లాది పరిశోధనా వ్యాసాలను రచించారు.తంగిరాల చేసిన సేవలకు గాను 2025 జన వరి 4న ఆయనకు ‘అజో విభోకందాళం ఫౌండేషన్ జీవిత సాఫల్య పురస్కారం’ పొందారు. ఇది జరిగిన ఇరవై ఒకటో రోజే (జనవరి 25) ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగులో జానపద సాహిత్యం ఉన్నన్నినాళ్లూ ఆచార్య తంగిరాల జీవించే ఉంటారు.– ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి ‘ ఏపీ తెలుగు అకాడమీ మాజీ సంచాలకుడు -
పవన్ నవ్వుల పాలు!
సాక్షి ఇంటర్నెట్ డెస్క్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సెప్టెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. లడ్డూలో ఉపయోగించిన నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని చెబుతూ.. ‘కొవ్వు’ కామెంట్లు చేశారాయన. దానికి కొనసాగింపుగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత టీటీడీ బోర్డు చైర్మన్లతోపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పనిలో పనిగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు.ఏపీలో లడ్డూ రాజకీయంపై హైడ్రామా కొనసాగుతున్న తరుణంలోనే.. సుప్రీం కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై స్వతంత్ర దరాప్తు జరిపించాలని కోరారు పిటిషనర్లు. వీటన్నింటిని కామన్‌గా విచారణకు స్వీకరించింది ద్విసభ్య ధర్మాసనం. తొలిరోజు విచారణలో చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: దేవుడికే ఆగ్రహం తెప్పించిన ప్రభుత్వమిది! తిరుపతి లడ్డూ ప్రచారంలో తొలుత జాతీయ మీడియా ఛానెల్స్ సైతం చంద్రబాబు వ్యాఖ్యలనే ప్రముఖంగా ప్రస్తావించాయి. ఆనక.. ఆ వ్యాఖ్యలను నిపుణులతో విశ్లేషించి.. బాబు రాజకీయాల్ని గ్రహించి.. దిద్దుబాటు కథనాలు ఇచ్చాయి. మరోవైపు ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య లడ్డూ వ్యవహారంపై తన బ్రష్‌కు పని చెప్పారు. తొలి నుంచి జరుగుతున్న పరిణామాలను.. చంద్రబాబు, పవన్‌లకు ఎదురవుతున్న అనుభవాలను ఆయన తన కార్టూన్లలో భలేగా చూపించారు. అందులో కొన్నింటిని ఫస్ట్‌పోస్ట్ పబ్లిష్ చేయగా.. మరికొన్నింటిని ఆయన ఓన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశారు. మొత్తంగా.. ఈ లడ్డూ రాజకీయంలో చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంటే, నవ్వులపాలైంది పవనే అనే కామెంట్ ఎక్కడ చూసినా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Satish Acharya (@cartoonistsatish) View this post on Instagram A post shared by Satish Acharya (@cartoonistsatish) Images Courtesy: Satish Acharya -
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
మన లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్న లోకంలో తరచుగా వినబడుతూ ఉంటుంది. దానికి ఒక్కొక్కరు ఒక్కోరకమైన సమాధానాన్ని ఇస్తుంటారు. ఈ ప్రపంచం మాయ అనుకున్న వారు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతామని అంటారు. శూన్యవాదులు మనం శూన్యం (ఏమీ లేని వస్తువు) నుంచి వచ్చాము కనుక శూన్యంలోకే పోతామని అభి్రపాయపడతారు. భౌతికవాదులు మాత్రం కోరుకున్న భౌతిక పదార్థాన్ని పొందడమే లక్ష్యం అంటారు. కొందరు ఆధ్యాత్మిక వేత్తలు మనం భగవంతుని నుంచి వచ్చాము కనుక అతనిలోనే కలిసిపోతామని చెప్తుంటారు. అభ్యుదయవాదులు కొందరున్నారు. వారు ఐహిక సుఖమే పరమ లక్ష్యం అంటారు. మతవాదులున్నారు, వారు పరలోకంలో సుఖపడడమే తమ లక్ష్యం అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మానవ లక్ష్యాన్ని పేర్కొంటారు.అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. కనుక ఇతరప్రాణుల కంటే మానవుడు శ్రేష్ఠుడు. అంతేకాదు, ఇతరప్రాణులకు లేని లక్ష్యం మానవునికి ఉంది. నాల్గు పురుషార్థాలలో అర్థ కామాలను లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళున్నారు. నిజానికి మానవుడు ధనాన్ని సంపాదించి, సుఖపడరాదని ఏ ధర్మ గ్రంథమూ చెప్పదు. అయితే ధర్మబద్ధంగా ధనార్జన చేయాలని, ధార్మిక ప్రవృత్తిలోనే కోరికలను తీర్చుకోవాలని, శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. అందుకే పురుషార్థాలలో మొదట ధర్మాన్నే పేర్కొన్నారు.తనకే కాక, తోటిప్రాణులకు ఏది హితకరమైందో, ఆ కర్మకే ధర్మమని పేరు. ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాన్ని స్వార్థం అంటారు. ఆచారం వ్యక్తిగతమైంది కావచ్చు కాని, ధర్మం సర్వనిష్టమైంది. అందరికీ ఆమోద యోగ్యమైంది. అందుకే పురుషార్థాలను సాధించాలనుకున్న వ్యక్తి మొదట ధర్మపరుడు కావాలి. ధర్మాన్ని దారిబత్తెంగా చేసుకుని ప్రయాణించే వారికి ధన్యప్రాప్తి, సుఖప్రాప్తి కలుగుతాయి. అంతేకాదు, ఆ రెండింటికీ మించి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. అందువల్ల మానవుని లక్ష్యం కేవలం ధనార్జనతోపాటు సుఖ్రపాప్తి మాత్రమే కాదు, మోక్షం సాధించడమే పరమ లక్ష్యమని తెలుస్తుంది.మోక్షం అంటే విడుదల. దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం. అదే మానవుని పరమ లక్ష్యం. బంధనాల్లో చిక్కుకోవడానికి కేవలం కర్మలు చేస్తే చాలు. కాని వాటి నుంచి బయట పడటానికి ధార్మికుడు కావాలి. ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ శరీర తత్వంతోపాటు, ఈ శరీరంలో బంధింపబడిన తానెవరో తెలుసుకోవాలి. అంతేకాదు, మోక్ష ప్రదాతను గుర్తించాలి. శరీరం ఉంది. తాను ఉన్నాడు. శరీరం బంధనం. దాన్ని విడిచిపెడితే మోక్షం. కానీ ఎట్లా విడిచిపెట్టాలి? అందుకు చేయవలసిన పనేమిటి? తెలిస్తే గాని పరమ లక్ష్యాన్ని అందుకోలేం. – ఆచార్య మసన చెన్నప్ప -
చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన
'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీటి వల్ల తనకు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశాడు. షూటింగ్ జరిగిన తర్వాత కూడా తన సీన్స్ ఎందుకు తీసేశారో అర్థం కాలేదని అన్నాడు. ఈ విషయంలో చాలా బాధపడ్డానని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)వైజాగ్‌కి చెందిన కిశోర్ కుమార్.. 'కేరాఫ్ కంచరపాలెం'తో నటుడిగా మారాడు. ఈ సినిమాలో వినాయకుడి బొమ్మలు చేసే మూగవాడిగా నటించింది ఇతడే. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే చిరు 'ఆచార్య', పవన్ 'భీమ్లా నాయక్' చిత్రాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'ఆచార్య సినిమా కోసం 20 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. బాగా చేశానని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు. భుజంపై చేయివేసి మరీ మాట్లాడేవారు. తీరా మూవీ విడుదలయ్యాక నా సీన్స్ కనిపించలేదు. ఎడిటింగ్‌లో తీసేశారు. 'భీమ్లా నాయక్' కోసం ఓ రోజు షూటింగ్‌కి వెళ్లాను. మధ్య గ్యాప్ వచ్చింది. తర్వాత నా బదులు వేరే నటుడిని ఆ పాత్ర కోసం తీసుకున్నారు. ఎందుకలా చేశారో అర్థం కాలేదు. ఈ విషయాల్లో చాలా బాధపడ్డాను' అని నటుడు కిశోర్ కుమార్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ విద్యార్హతపై పూటకో మాట.. పిఠాపురం నామినేషన్లో తేటతెల్లం) -
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్యరంగ అనుబంధ కోర్సులు
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్య రంగానికి అనుబంధంగా కొత్త కోర్సులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తెలిపారు. ఏయూ న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగం, నేషనల్ అసోసియేషన్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అండ్ రేడియేషన్ ఇన్ ఇండస్ట్రీ(నారీ) సంయుక్త ఆధ్వర్యాన గురువారం బీచ్‌రోడ్డులోని ఏయూ సాగరిక కన్వెన్షన్‌లో ‘రీసెంట్ ట్రెండ్స్ ఆన్ ఆప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అండ్ రేడియేషన్ టెక్నాలజీస్’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఉన్నత విద్యాసంస్థలు అన్ని అంశాల్లోనూ భాగస్వాములుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 98 ఏళ్ల ప్రస్థానం కలిగిన ఆంధ్ర వి«శ్వవిద్యాలయంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏయూ ఫార్మసీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, సైకాలజీ వంటి మెడికల్ సంబంధిత కోర్సులను అందిస్తోందని చెప్పారు. ప్రస్తుతం అనేక రంగాల్లో రేడియేషన్ టెక్నాలజీ పాత్ర పెరుగుతోందని, ఈ రంగంలో ఉన్న అద్భుత అవకాశాలను వినియోగించుకునేందుకు యువ పరిశోధకులు కృషి చేయాలన్నారు. డాక్టర్ అబ్రహాం వర్గీస్ మాట్లాడుతూ రేడియేషన్ టెక్నాలజీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అన్ని రంగాలు, పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఈ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువ పరి«శోధకులు, ఆచార్యులు నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వీసీ ప్రసాదరెడ్డి, ‘నారీ’ ప్రధాన కార్యదర్శి పీజే చాండీ, డాక్టర్ అబ్రహాం తదితరులు సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. రేడియేషన్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలతో కూడిన ఎగ్జిబిషన్‌ను అతిథులు, విద్యార్థులు తిలకించారు. బ్రిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రదీప్ ముఖర్జి, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.శ్రీని, సదస్సు చైర్మన్ ఆచార్య దుర్గాప్రసాద్, న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాధిపతి ఆచార్య లక్ష్మీనారాయణ, జాతీయ స్థాయిలో వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. -
పేదరికాన్ని జయించి భాషా సాహిత్యాలలో రాణించిన ఆచార్య రవ్వా శ్రీహరి
నల్లగొండ జిల్లా వెల్వర్తి లోని పేద చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టిన (1943) ఒక కుర్రవాడు యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి సంస్మృత విద్యా పీఠంలో చేరడమే విశేషమైతే అందులోని అంతా బ్రాహ్మణ సహ విద్యార్థులతో పోటీపడి ఉన్నత స్థానంలో నిలవడం మరో విశేషం. కష్టపడి డీవోఎల్, బివోఎల్, బిఏ, ఎంఏ వంటి ఎన్నో మెట్లు ఎక్కి డాక్టరేట్ కూడా చేసి (1973), హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం లో బహుకాలం బోధనచేసి, ద్రావిడ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు కాగలిగాడు (2002), ఉత్తమ పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సంస్కృతంలో,తెలుగులో భాషా సాహిత్యాలపై ఎన్నో పరిశోథనాత్మకమైన రచనలు చేసి 'మహా మహోపాధ్యాయ' అనిపించుకున్న మహనీయుడు ఆచార్య రవ్వా శ్రీహరి ఇక లేరు అన్న వార్త వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులనే కాదు నా లాంటి ఎంతో మంది వారి అభిమానులను కూడా శోక సాగరంలో ముంచింది. అన్నమయ్య పదకోశాన్ని తయారుచేసిన, శ్రీహరి నిఘంటువు రూపొందించిన, నల్లగొండ జిల్లా మండలికాలు అక్కడి ప్రజల భాషపై ఎన్నో గ్రంధాలు రచించిన అంతటి గొప్ప పండితుడు. వరంగల్ కు చెందిన, సహకార శాఖలో నా సీనియర్ అయిన డాక్టర్ ఏ.సురేంద్ర కుమార్ గారి ద్వారా మా అన్న కీశే వేముల పెరుమాళ్ళు గారి ప్రసిద్ధ గ్రంథం 'తెలంగాణ జాతీయాలు' పుస్తకం గురించి విని తెప్పించుకొని చదివి ప్రశంసించడం ఇంకా గొప్ప విషయం. 2005లో 'మానవతా పరిమళాలు' పేరుతో మా అన్నగారి స్మారక సంచిక ప్రచురించి నప్పుడు దానికి సందేశం పంపుతూ ' రాజకీయ రంగంలో ఉంటూ ప్రజాహిత కార్యాల్లో తలమునకలౌతూ కూడా భాషా, సాహిత్య రంగాల్లో కృషి చేయడం ప్రశంసనీయం. పెరుమాళ్ళు గారి 'తెలంగాణ జాతీయాలు' అన్న గ్రంధం భాషా రంగంలో వారు చేసిన కృషికి అద్దం పడుతుంది.తెలంగాణ భాష ప్రత్యేకతను విశిష్ట తను చాటుతుంది కూడా ' అని అభినందించారు. అంతేకాదు 12 సెప్టెంబర్ 2009 నాడు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆ గ్రంధావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -వేముల ప్రభాకర్, రచయిత , రిటైర్డ్ ప్రభుత్వ అధికారి -
మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం
మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం జరిగింది మాత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమా సెట్లో కాదు. గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా సెట్. ఆ చిత్రం కోసం అప్పట్లో హైదరాబాద్ కోకాపేట లేక్ వద్ద ఓ భారీ సెట్ నిర్మించారు. అయితే ఇప్పటి వరకు ఆ సెట్‌ను అలానే ఉంచారు. కాగా నేడు ఆ చిత్రానికి ఎంతో కీలకమైన ధర్మస్థలి టెంపుల్ సెట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో స్థానికులు గమనించి దగ్గరలోని వట్టినాగులపల్లి ఫైర్ స్టేషన్‌కి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పుతున్నారు. ఇక మంటలు ఎలా వ్యాపించాయో తెలియాల్సి ఉంది. ఆచార్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
Recap 2022: స్టార్స్‌కు మాట.. పాట సాయం చేసిన మరో స్టార్ హీరోలు
ఒక స్టార్ హీరో సినిమాకి మరో స్టార్ మాట సాయం చేస్తే.. పాట సాయం కూడా చేస్తే.. ఆ ఇద్దరు స్టార్ల అభిమానులకు పండగే పండగ. 2022 అలాంటి కొన్ని పండగలను ఇచ్చింది. అడగ్గానే కాదనకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి, మాట... పాట పాడిన కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరంజీవి. అది కూడా నాలుగు చిత్రాలకు. 2017లో వచ్చిన రానా ‘ఘాజీ’, మంచు మనోజ్ ‘గుంటూరోడు’ చిత్రాల తర్వాత ఈ ఏడాది లీజైన మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’, బాలీవుడ్ చిత్రం రణ్‌బీర్ కపూర్ ‘బ్రహాస్త్రం’కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫిబ్రవరి 18న విడుదలైంది. రణ్‌బీర్, ఆలియా జంటగా, నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో రూపొందిన ‘బ్రహ్మాస్త్రం’ ట్రయాలజీలోని ‘బ్రహ్మాస్త్రం: పార్ట్ 1 శివ’ సెప్టెంబరు 9న రిలీజైంది. (చదవండి: ఆయన లేకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు: అల్లు అర్జున్) అదే నెల 30న విడుదలైన మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 చిత్రానికీ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగ మార్తాండ’లోని షాయరీ చిరంజీవి వాయిస్‌తో ఆడియన్స్‌కు వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్ టైటిల్ రోల్ చేయగా, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. ఒక నటుడి జీవితం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలను చిరంజీవితో షాయరీగా చెప్పించారు కృష్ణవంశీ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మరోవైపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేశ్‌బాబు. పవన్ కల్యాణ్ ‘జల్సా’ (2008), ఎన్టీఆర్ ‘బాద్షా ’(2013), దివంగత నటుడు కృష్ణ టైటిల్ రోల్ చేసిన ‘శ్రీశ్రీ’ (2016), సందీప్ కిషన్ హీరోగా చేసిన ‘మనసుకు నచ్చింది’ (2018) చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ ఈ ఏడాది ‘ఆచార్య’కు ఇచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజైన సంగతి తెలిసిందే. (చదవండి: ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు) మరోవైపు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తనకు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లాంటి హిట్ అందించిన ఆర్ఎస్జే స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన ‘మిషన్ ఇంపాజిబుల్’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాప్సీ ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న రిలీజైంది. ఇంకోవైపు ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. మార్చి 11న ఈ చిత్రం విడుదలైంది. ఇక వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఇప్పటికే ‘అ!’, ‘హిట్’, ‘హిట్ 2’ సినిమాలను నిర్మించిన నాని ఈ ఏడాది వెబ్ ఆంథాలజీ ‘మీట్ క్యూట్’ నిర్మించారు. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలు. ఈ సినిమా ట్రైలర్‌కు నాని వాయిస్ ఓవర్ అందించారు. సోనీ లివ్‌లో నవంబరు 25 నుంచి ఈ ఆంథాలజీ స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో తాను నిర్మించిన ‘అ!’కు నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఇటీవల విడుదలైంది. ఈ గ్లింప్స్‌కు హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో మరోచోట కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 21న రానుంది. పాటల సందడి.. ఇప్పటికే ఎన్నో పాటలకు గాత్రం అందించిన శింబు ఈ ఏడాది బాగా సౌండ్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ది వారియర్’లోని ‘బుల్లెట్ సాంగ్’ పాడారు. తమిళంలోనూ ఈ పాటను పాడారు శింబు. రామ్, కృతీ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. అలాగే ఈ ఏడాది శ్రోతలను మెప్పించిన మరో పాట ‘టైమ్ ఇవ్వు పిల్ల..’ కూడా శింబు పాడిందే. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ‘18 పేజెస్’ చిత్రంలోని పాట ఇది. వీటితో పాటు నిర్మాతగా హీరో రవితేజ తెలుగులో సమర్పించిన తమిళ చిత్రం ‘ఎఫ్ఐఆర్’ థీమ్ సాంగ్ కూడా శింబు గొంతు నుంచి వినిపించిందే. ఫిబ్రవరి 11న ఈ చిత్రం రిలీజైంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారిసు ’(తెలుగులో ‘వారసుడు) సినిమా కోసం కూడా శింబు పాట పాడారు. ఈ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయ ఆదితి పాడిన తొలి పాట ‘రోమియోకి జూలియట్‌లా’. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన ‘గని’లోని పాట ఇది. ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజైంది. ఇలా మాట.. పాట సాయం చేసిన స్టార్స్ మరికొందరు ఉన్నారు. -
'ఆచార్య' ఫ్లాప్.. స్పందించిన మెగాస్టార్
మొదటిసారి తండ్రి, తనయుల కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. తాజాగా ఆ మూవీ ఫెయిల్యూర్‌పై మెగాస్టార్ స్పందించారు. ఆయన నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. భారీ అంచనాలతో రిలీజైన ఆచార్య బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. ఆచార్యపై చిరంజీవి మాట్లాడుతూ 'సినిమా ఫలితం మన చేతుల్లో ఎప్పుడు ఉండదు. మన పనిలో మనం బెస్ట్ ఇస్తామంతే. ఆచార్య పరాజయం నన్ను బాధ పెట్టలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పిందే మేం చేశాం. ఈ చిత్రంలో చిన్న విచారం ఏంటంటే.. చరణ్ నేను కలిసి మొదటిసారి నటించాం. అది హిట్ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో మేము మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే అంతటి హైప్ ఉండకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు' అని అన్నారు. చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఏప్రిల్29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన 'గాడ్ ఫాదర్' రిలీజ్‌కు సిద్ధమైంది. దసరాకు థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆచార్య ఎఫెక్ట్.. ఎన్టీఆర్ సినిమా విషయంలో కొరటాల కీలక నిర్ణయం!
ఆర్ఆర్ఆర్ తర్వాత ఏంటి ? ఈ ప్రశ్నకి ఆల్రెడీ రామ్‌చరణ్ సమాధానం చెప్పేశాడు. స్టార్ డైరె క్టర్ శంకర్‌తో సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. మరో పాన్ ఇండియా మూవీ సెట్స్ మీదకి వెళ్లిపోయింది.ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ఎన్టీఆర్ మాత్రం ఇంకా కెమెరా ముందుకు రాలేదు. తర్వాత చిత్రం కొరటాల శివతో చేయాల్సి ఉంది. అయితే ఆచార్య ప్లాప్‌తో ఎన్టీఆర్ మనసు మార్చుకున్నారని, కొరటాల సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ మూవీనే స్టార్ట్ అవుతుందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. కొరటాల శివతోనే ఎన్టీఆర్ సినిమా ఉంటుందట. ఈసారి ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌తో రంగంలోకి దిగబోతున్నారట. జనతా గ్యారేజ్‌కి మించి న హిట్ ఇవ్వడానికి కొరటాల స్క్రిప్ట్ సిద్ధం చేసేశాడన్నది ఆ వార్త సారాంశం. (చదవండి: సమంత ఎక్కడ? ఆమె సైలెన్స్‌కు కారణం ఇదేనా?) వాస్తవానికి ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే ఎన్టీఆర్‌తో కొరటాల తీయబోయే సినిమాపై అంచ నాలు పెరుగుతూ వచ్చాయి. అయితే…ఆచార్య ఫ్లాప్‌తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కొరటాల చెప్పిన కథ విషయంలో ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదట. కొన్ని మార్పులు సూచించారట. ఇన్నాళ్లు మార్పులు మీద ఫోకస్ పెట్టిన కొరటాల.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారట. ఆ కథని పూర్తిగా పక్కనపెట్టి మరో కథకి పదును పెట్టారట. (చదవండి: జూ.ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన సమంత? కారణం ఇదేనట!) సముద్రం, షిప్‌లు సినిమాలో కొంత భాగం ఉంటాయట. అలానే మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌లో మూవీ సాగుతోందట. దీంతో…సందేశాత్మక కథకి కమర్షియల్ టచ్ ఇస్తూ సినిమాలు తీసే కొరటాల… ఈసారి యాక్షన్, మాస్ డోస్ పెంచబోతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో …మిర్చికి మించి మసాలా ఉండొచ్చని, అదే జరిగితే మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు ఎన్టీఆర్. దీంతో ఆర్ఆర్ఆర్కు మించిన హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడాయన. ఇటు కొరటాల కూడా ఆచార్యతో ఊహించని ఫ్లాప్‌ని ఎదుర్కొన్నాడు. నిజానికి కొరటాల శివ కెరీర్లో ఇదే ఫస్ట్ ఫ్లాప్. చిరంజీవి, రామ్‌చరణ్‌లను పెట్టుకుని కొరటాల యావరేజ్ మార్క్ కూడా దాటలేకపోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రేంజ్లో ఒక హిట్ ఎన్టీఆర్‌కి, తన పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఒక హిట్ కొరటాలకి అవసరం. అందులోనూ ఇది పాన్ ఇండియా మూవీ. అందుకే యాక్షన్ జానర్ అయితే పాన్ ఇండియా సినిమాకి కరెక్ట్‌గా సెట్ అవుతుందని కొరటాల భావిస్తున్నారట. కథ తుది మెరుగు లు దిద్దుకుంటుందని.. ఎన్టీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే నవంబర్‌లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. -
కొరటాలపై కోపంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, కారణం ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఇంకా అలాగే ఎన్టీఆర్ కలిసి నటించారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ద్వారా వీరిద్దరు కూడా పాన్ ఇండియా హీరోలుగా పాపులర్ అయ్యారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల పాటు ఎన్టీఆర్ కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం వీరు ఇద్దరూ కూడా వారి పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది.ఇక ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది. అయితే కొరటాల దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఇటీవల విడుదలై దారుణంగా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఆచార్య ప్రభావం ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా మీద పడనుంది. (చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన) ఆచార్య సినిమా డిజాస్టర్ వల్ల ఎన్టీఆర్ తో చేయాలనుకున్న సినిమాకు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా జనతా గ్యారేజ్ కు వంటి ఒక మంచి స్క్రిప్ట్ ను కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పట్టాలెక్కి ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వాయిదా పడటంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ వల్ల మూడేళ్ల పాటు ప్రేక్షకులకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ..ఇక ఈ సినిమా ద్వారా తొందరగా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ అది ఇప్పుడు సాధ్యపడేలా కనిపించటం లేదు. ఇక ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరో సినిమా రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. -
ఆర్ఆర్ఆర్, ఆచార్య.. ఫ్రైడే స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలేంటంటే?
స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అటు బాక్సాఫీస్ కూడా బాగానే కలెక్షన్లు దండుకుంటోంది. అయితే థియేటర్లను రఫ్ఫాడించేసిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే వసూళ్లు రాబట్టిన చిత్రాలు సైతం ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇంతకీ ఈరోజు(మే 20) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో చూసేయండి.. ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సినీవర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించిన ఈ చిత్రం తాజాగా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట రూ.100 కడితేనే ఈ సినిమా చూడనిస్తామంది జీ 5. ఈ నిర్ణయంపై అభిమానులు భగ్గుమనడంతో వెనక్కు తగ్గిన సదరు ఓటీటీ సంస్థ తమ సబ్స్క్రైబర్లు ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఒక్క హిందీ వర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఆచార్య చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన మల్టీస్టారర్ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలైంది. ఓ మోస్తరు కలెక్షన్లతో పర్వాలేదనిపించిన ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. భళా తందనాన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం భళా తందనాన. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో 15 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది. జెర్సీ నాని నటించిన హిట్ మూవీ జెర్సీ అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 22న థియేటర్లలో రిలీజైంది. ఇవేకాకుండా 12th మ్యాన్, ఎస్కేప్ లైవ్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుండగా జాంబీవ్లి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరింకెందుకాలస్యం. నచ్చిన సినిమాను ఇప్పుడే వీక్షించేయండి.. చదవండి 👇 ఓ వైపు చెల్లి పెళ్లి, మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ బిగ్‌బాస్ ఓటీటీ విజేతగా బిందు, రన్నర్‌గా అఖిల్! -
ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు..
Upcoming Movies Web Series Release Theatre OTT May 2nd Week: థియేటర్లలో పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు చేసిన రచ్చను 'సర్కారు వారి పాట' కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు సందడి చేశాయి. ఈ క్రమంలో ఈ వారం ఏ సినిమాలు అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పెద్ద సినిమాలు ఏవి థియేటర్లలో అడుగుపెట్టట్లేదు. చిన్న సినిమాలు మాత్రం ఈ వారం సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో లుక్కేద్దామా ! 1. శేఖర్ యాంగ్రీ ఎంగ్ మ్యాన్ రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. మలయాళంలో విజయం సాధించిన 'జోసేఫ్' సినిమాకు రీమేక్‌గా రానుంది. మనసున్న ప్రతి ఒక్కరికీ 'శేఖర్' నచ్చుతాడని, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని డైరెక్టర్ జీవిత ఆదివారం ప్రెస్ మీట్లో తెలిపారు. 2. ధగడ్ సాంబ నవ్వులు పంచేందుకు రెడీ అయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సంపూ, సోనాక్షి జంటగా నటించిన చిత్రం ధగడ్ సాంబ. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఎన్ఆర్ రెడ్డి డైరెక్టర్. 'సంపూర్ణేష్ బాబును ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో చూస్తారు. అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా మూవీ ఉంది.' అని చిత్ర యూనిట్ పేర్కొంది. 3. ధాకడ్ బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఏజెంట్ అగ్నిగా 'ధాకడ్' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే యాక్షన్ సీన్స్‌తో అదరిపోయింది. మరీ ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే. 4. భూల్ భులయా 2 హారర్, కామెడీ నేపథ్యంలో వస్తున్న హిందీ చిత్రం 'భూల్ భులయా 2'. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియరా అడ్వాణీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ డైరెక్షన్ చేశారు. టబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకులను భయంతో నవ్వించనుంది. ఓటీటీలో.. మే 20న ఓటీటీలో ఆర్ఆర్ఆర్, ఆచార్య, భళా తందనాన, 12th మ్యాన్, ఎస్కేప్ లైవ్, జాంబీవ్లీ చిత్రాలు, పంచాయత్ సీజన్ 2, నైట్ స్కై సీజన్ 1 వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. 1. ది ఇన్విజబుల్ మ్యాన్- మే 16 (నెట్‌ఫ్లిక్స్) 2. ది హంట్- మే 16 (నెట్‌ఫ్లిక్స్) 3. వూ కిల్డ్ సారా సీజన్ 3- మే 18 (నెట్‌ఫ్లిక్స్) 4. హనీమూన్- మే 20 (వూట్) చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌కు జీ5 షాక్.. సినిమాకు డబ్బులు చెల్లించాల్సిందే ! రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఫొటోలు వైరల్ -
ఓటీటీలో సినిమాల జాతర.. ఈ శుక్రవారం 13 చిత్రాలు
OTT Releases: 13 Upcoming Movies Web Series On May 20 2022: మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు థియేటర్లలో సందడి చేయగా, ప్రస్తుతం సర్కారు వారి పాట అలరిస్తోంది. ఇదిలా ఉంటే థియేటర్లలో ప్రతి వారం ఏదో ఒక సినిమా సందడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. కరోనా, లాక్డౌన్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల సందడి నెలకొంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ చిత్రాలు అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే శుక్రవారం (మే 20) ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో థియేటర్లలో విడుదలైన మూవీస్తోపాటు నేరుగా ఓటీటీల్లోకి రిలీజ్ అవుతున్నాయి. మరీ ఆ సినిమాలేంటో చూద్దామా ! 1. 12th మ్యాన్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2. ఎస్కేప్ లైవ్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 3. ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం..)- జీ5 4. ఆచార్య- అమెజాన్ ప్రైమ్ వీడియో 5. భళా తందనాన- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 6. జాంబీవ్లి- జీ5 7. చిప్ అండ్ డేల్: రెస్క్యూ రేంజర్స్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 8. పంచాయత్ (సీజన్ 2)- అమెజాన్ ప్రైమ్ వీడియో 9. మై నెక్స్ట్ గెస్ట్- నెట్‌ఫ్లిక్స్ 10. లవ్ డెత్ రోబోట్స్- నెట్‌ఫ్లిక్స్ 11. ది లాడ్జ్- నెట్‌ఫ్లిక్స్ 12. జాకస్ 4.5- నెట్‌ఫ్లిక్స్ 13. నైట్ స్కై సీజన్ 1- అమెజాన్ ప్రైమ్ వీడియో చదవండి: OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆచార్య నుంచి ‘భలే భలే బంజారా’ ఫుల్ సాంగ్ అవుట్
Acharya Movie Bhale Bhale Banjara Full Song Out: చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఏప్రిల్29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఇదిలా ఉంటే విడుదలకు ముందు విడుదలైన ఆచార్య పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: అందుకే చెల్లెలి పాత్రలు చేస్తున్నా: కీర్తి సురేశ్ మణిశర్మ అందించిన సంగీతం, ఆయన కట్టిన బాణీలకు సంగీత ప్రియుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆచార్యలోని ‘భలే భలే బంజారా’ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. నక్సలైట్లుగా ఉన్న ఆచార్య-సిద్ధ బృందంపై రాత్రివేళలో గిరిజన గూడెంలో చిత్రీకరించిన పాట ఇది. అడవీ ప్రాంతంలో ఓ వెన్నెల రాత్రిలో నక్సలైట్స్ సరదాగా ఆడిపాడితే ఎలా ఉంటుందనేది ఈ పాటలో చూపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించారు. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. -
అఫీషియల్: ఓటీటీలోకి వచ్చేసిన ఆచార్య.. ఎప్పుడంటే
చిరంజీవి, రామ్‌చరణ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఏప్రిల్29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. ఈనెల 20న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. అయితే అదే రోజున రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుండటం విశేషం. they call him Acharya because he always teaches them a lesson💥#AcharyaOnPrime, May 20 pic.twitter.com/5l4wnFgLn7 — amazon prime video IN (@PrimeVideoIN) May 13, 2022 -
ఓటీటీలో పాన్ ఇండియా సినిమాల సందడి, మేలో బిగ్ ఫెస్టివల్!
List Of Upcoming OTT Movies In May 2022: మొన్నటి వరకు థియేటర్స్‌లో సందడి చేసిన పాన్ ఇండియా చిత్రాలు.. ఇప్పుడు ఓటీటీలో హల్చల్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ నుంచి కేజీయఫ్ 2 వరకు అన్ని సినిమాలు మేలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో నెటిజన్స్‌లో నయా జోష్ మొదలైంది. ముందుగా మే 11న బీస్ట్ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. విజయ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 13న థియేటర్స్‌లో విడుదలైంది. ఓ షాపింగ్ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను హీరో ఏ విధంగా రక్షించాడు అనేదే బీస్ట్ కథ. ఈ చిత్రానికి తొలిరోజు నుంచే మిశ్రమ స్పందన రావడం, తరువాతి రోజు(ఏప్రిల్ 14) కేజీయఫ్2 విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద బీస్ట్ బోల్తాపడింది. దీంతో అనుకున్నదానికి కంటే ముందే ఓటీటీలో విడుదల చేస్తున్నారు మేకర్స్. మే 11న సన్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో బీస్ట్ ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక మే 13న 2022 బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ది కశ్మీర్ ఫైల్స్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలో ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి ఇక మే20న మరో పాన్ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ ఓటీటీలో విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది. జూన్ 3న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ, ఈ తాజా బజ్ ప్రకారం మే 20 నుంచే జీ అండ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. తొలుత ఈ చిత్రాన్ని పే ఫర్ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు ఈ రెండు ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జూన్ 3నుంచి మాత్రం సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉందనుంది. ఆర్ఆర్ఆర్తో పాటు మరో పాన్ ఇండియా చిత్రం కూడా మే నెలలోనే ఓటీటీలోకి రానుంది. మే 27న అమెజాన్ ప్రైమ్ లో కేజీయఫ్ 2 విడుదల కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది.యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్స్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఒకవేళ నిజంగానే మే 27న ఓటీటీలోకి కేజీయఫ్ 2 వస్తే.. రాకీభాయ్ ఫ్యాన్స్‌కు పండగే. (చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్!) మరో వైపు ఆచార్య ఓటీటీ రిలీజ్ పై కూడా రూమర్స్ మొదలయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఆచార్యకు ఆశించినంత ఆదరణలేకపోవడంతో కాస్త ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎర్లీ ప్రీమియర్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ ఆచార్య ప్రొడ్యూసర్స్ తో 18 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆచార్య ’ సినిమా రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం(ఏప్రిల్ 29)ఈ సినిమా విడుదలయ్యింది. చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్వాప్తంగా 42 కోట్లు గ్రాస్, 31. కోట్లు షేర్ సాధించింది.రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 5.15 కోట్ల షేర్ని రాబట్టింది. (చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ) నైజాంలో రూ.2.20 కోట్లు, , సీడెడ్‌లో రూ. 63 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.53 లక్షలు, ఈస్ట్‌లో రూ. 33 లక్షలు, వెస్ట్‌లో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 50 లక్షలు, కృష్ణాలో రూ. 43 లక్షలు , నెల్లూరులో రూ. 25 లక్షల కలెక్షన్స్‌ని రాబట్టింది. రెండు రోజుల్లో ప్రపంచవ్వాప్తంగా 62.85 కోట్లు గ్రాస్, 41.07 కోట్లు షేర్ సాధించింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆచార్య’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 29) ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ మూవీకి తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఫస్ట్‌డే కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల గ్రాస్, 29.5 కోట్లు షేర్ సొంతం చేసుకుంది. (చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ) నైజాంలో రూ.7.90 కోట్లు, సీడెడ్‌లో రూ.4.6 కోట్లు, ఈస్ట్‌లో రూ.2.53, వెస్ట్‌లో 2.90, గుంటూరులో 3.76, కృష్ణలో రూ.1.90, నెల్లూరులో 2.30 కోట్లను రాబట్టింది. కర్ణాటక ఇతర రాష్ట్రాలలో 1.60 కోట్లు వసూల్ చేసింది. ప్రపంచవ్వాప్తంగా 42 కోట్లు గ్రాస్, 31. కోట్లు షేర్ సాంధించింది. ఆచార్య చిత్రానికి రూ.133 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 134 కోట్ల షేర్ రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం రూ.31.93 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.102.07 కోట్లు షేర్ ను రాబట్టాలి. మిక్స్ డ్ టాక్ తెచ్చకున్న ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మేరకు వసూళ్లను రాబడుతుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆచార్య: థియేటర్ వద్ద సోనూ సూద్ భారీ కటౌట్‌కి పాలభిషేకం
Fans Pouring Milk On Sonu Sood Cutout At Acharya Theatres: సోనూ సూద్.. పెద్దగ పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలో విలన్‌గా కంటే నిజ జీవితంలో రియల్ హీరోగానే అందరికి తెలుసు. కరోనా సమయంలో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించారు. తన సొంత ఖర్చులతో ఎంతోమంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు. అప్పటి నుంచి ఎవరూ ఏ సాయం అడిగినా కాదనకుండ తనవంతుగా చేయూతనిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఫౌండేషన్ పెట్టి అనారోగ్యులకు వైద్య ఖర్చులు, పెద పిల్లలకు చదువు.. ఇలా రకరకాల సామాజిక సేవలు అందిస్తున్నారు. దీంతో సోనూ సూద్ అందరికి రియల్ హీరో అయ్యారు. చదవండి: బాలీవుడ్ నటి జావ్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఈడీ షాక్ ఈ నేపథ్యంలో సోనూ సూద్ మీద అభిమానాన్ని చాటుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఆయన చిరంజీవి, రామ్ చరణ్‌ల మల్టిస్టారర్ ‘ఆచార్య’ మూవీలో ప్రతి కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిన్న(ఏప్రిల్ 29)న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో సోనూసూద్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. అంతేకాదు ఆయన కటౌట్‌కి పాలభిషేకం చేసి.. పెద్ద దండ వేసి, బొట్టు పెట్టి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అంతేకాదు కటౌట్ ముందు టపాసులు పేలుస్తూ సందడి చేశారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీనిపై సోనూసూద్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. The #SonuSood Phenomenon continues as the fans pour their love on the real hero once again! Such feat is rarely achieved by few super stars! @SonuSood pic.twitter.com/1hNurkpZR7 — Harish Kumar (@apparalaharishk) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1701356058.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆచార్య’లో నటించిన ఈ బాలుడు ఎవరో తెలుసా!
సాక్షి,మందమర్రిరూరల్: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ఆచార్య సినిమాలో మందమర్రికి చెందిన బాలుడు మిథున్‌కు నటించే అవకాశం లభించింది. మందమర్రికి చెందిన డాక్టర్ భీమనాథుని సదానందం కుమారుడు శ్రీధర్, సరిత దంపతుల కుమారుడు మిథున్ శ్రేయాష్ హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. మిథున్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆచార్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకగా శ్రీధర్ మిత్రుడు విజయ్‌కుమార్‌కు తెలిసిన వారి ద్వారా సినిమా వాళ్లకి పరిచయం చేశారు. ఆడిషన్లో డైలాగ్‌లు బాగా చెప్పడంతో ఎంపిక చేసుకున్నారు. రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ఏరియాలో జరిగిన షూటింగ్లో పాల్గొన్నాడు. ఆచార్య సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. చిరంజీవి సినిమాలో తమ మనవడు నటించడం సంతోషంగా ఉందని డాక్టర్ సదానందం తెలిపాడు. పట్టణంలోని ప్రైవేట్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో బాలుడిని అభినందించారు. చదవండి: Acharya Movie Review: సాక్షి ఆడియన్స్ పోల్.. 'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ -
ఓటీటీకి ఆచార్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!
Acharya Movie Streaming Soon On This OTT: పలు వాయిదాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ నేడు(ఏప్రిల్ 29) థియేటర్లోకి వచ్చింది. మల్టీస్టారర్ అంటేనే ఆ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొంటాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ ఒకే సినిమాలో కనిపంచడమంటే హైప్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఎన్నో అంచనాల మధ్య నేడు విడుదలైన ఆచార్య మూవీ బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. చదవండి: అందుకే కాజల్ గప్‌చుప్‌గా ఉందా? ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇలా తొలిరోజు హౌజ్‌ఫుల్‌తో దూసుకుపోతున్న ఆచార్య మూవీ త్వరలోనే ఓటీటీలోకి కూడా సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైం సొంతం చేసుకుందట. చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ థియేటర్లో విడులైన మూడు వారాల అనంతరం ఆచార్య ఓటీటీలోకి రానుందని సమాచారం. అంటే మే చివరి వారం నుంచి ఆచార్య ఆమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇందులో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటించగా ఆయనకు జోడిగా పూజా హెగ్డే నటించింది. ఇదిలా ఉంటే ఆచార్య కోసం 20 ఎకరాల్లో భారీ టెంపుల్ సెట్ వేసిన విషయం తెలిసిందే. దానికి ‘ధర్మస్థలి’అని నామకరణం చేశారు. సినిమాలోని సింహభాగం ఇక్కడే షూటింగ్ చేశారని డైరెక్టర్ చెప్పిన సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ.. ఆడియెన్స్ ఏం అంటున్నారంటే..
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటేనే అభిమానులకు పండగలా ఉంటుంది. అలాంటిది మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఉండటంతో మెగా అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆచార్య' సినిమా ఎట్టకేలకు శుక్రవారం(ఏప్రిల్29)విడుదలయ్యింది. ‘సైరా నరసింహారెడ్డి’లాంటి సూపర్‌హిట్ తర్వాత సుమారు 4ఏళ్ల తర్వాత చిరు నటించిన సినిమా కావడం, రామ్‌చరణ్ కూడడా ఉండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? సినిమాపై వాళ్ల రివ్యూ ఏంటన్నది 'సాక్షి ఆడియన్స్ పోల్'లో తెలుసుకుందాం. -
Acharya: అందుకే కాజల్ గప్‌చుప్‌గా ఉందా?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషించాడు. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. చిరంజీవి సరసన కాజల్‌ను తీసుకుని, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిపారు. కానీ ట్రైలర్లో మాత్రం ఆమెను చూపించకపోవడంతో ప్రేక్షకులకు అనుమానం పుట్టుకొచ్చింది. కాజల్ కనిపించకపోవడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. దీనికి కొరటాల శివ స్పందిస్తూ.. కాజల్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతోనే ఆమెను తీసేసినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగుండదని, అంత పెద్ద హీరోయిన్‌తో అలాంటి పాత్ర చేయిస్తే బాగోదనిపించే సినిమాలో నుంచి తొలగించామని తెలిపాడు. అతడు చెప్పిన సమాధానంతో అభిమానులు సంతృప్తి చెందలేదు. కొంత షూటింగ్ జరిపాక తనను ఎలా తీసివేస్తారని ప్రశ్నించారు. దీనిపై కాజల్ ఇప్పటివరకూ స్పందించనేలేదు. నిజానికి ఈ సినిమాలో నటించనప్పటికీ కాజల్ తన పారితోషికాన్ని పూర్తిగా అందుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు కోటిన్నర రూపాయలు తీసుకుంది కాబట్టే ఆచార్య నుంచి తప్పించినా సైలెంట్‌గా ఉండిపోయిందని అంటున్నారు. చదవండి: ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే.. మహేశ్‌బాబు బ్లాక్‌బస్టర్ మూవీ 'పోకిరి' ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ -
‘ఆచార్య’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘ఆచార్య’ నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ దర్శకుడు: కొరటాల శివ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫి: తిరు ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: ఏప్రిల్ 29,2022 మెగాఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆచార్య’. తొలిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రమిది. అందుకే ఈ మూవీ కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూశారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం( ఏప్రిల్ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘ఆచార్య’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆచార్య’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ధర్మస్థలి.. 800 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ టౌన్ అది. పక్కనే జీవధార నది. దానికి అటువైపు పాదఘట్టం అనే చిన్న తండా. అక్కడి ప్రజలకు ధర్మస్థలి టెంపుల్‌తో ఎనలేని సంబంధం ఉంటుంది. ధర్మస్థలిలో ఉండే ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ.. ధర్మంగా ఉంటారు పాదఘట్టం తండా వాసులు. కానీ ధర్మస్థలి మున్సిపల్ చైర్మన్ బసవన్న(సోనూసూద్) చాలా క్రూరుడు. ధర్మస్థలి టెంపుల్లో అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ.. అక్కడి సొమ్మునంతా కాజేస్తాడు. రాజకీయంగా ఎదగడం కోసం.. ధర్మస్థలి అమ్మవారి టెంపుల్‌తో పాటు పాదఘట్టం గ్రామాన్ని కూడా మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్ (జిషు సేన్ గుప్తా)కు అప్పగించే ప్రయత్నం చేస్తాడు. ఇలా ధర్మస్థలిలో అధర్మం పేట్రేగిపోతుండడంతో దాన్ని అడ్డుకోవడానికి ఆ గ్రామానికి వస్తాడు ఆచార్య(చిరంజీవి). బసవన్న గ్యాంగ్ చేసే అరాచకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. అసలు ఆచార్య ఎవరు? ధర్మస్థలిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? ధర్మస్థలితో సిద్ధ(రామ్ చరణ్)కి ఉన్న అనుబంధం ఏంటి? ఆచార్యకి, సిద్ధకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..? కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సక్సెస్ సాధించిన కొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ‘మిర్చి’ మొదలు..‘ భరత్ అనే నేను’వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. అలాంటి దర్శకుడు చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమా తీస్తే.. ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. కొత్త కథని ఆశిస్తారు. కానీ కొరటాల మాత్రం ప్రేక్షకులకు పాత కథే చూపించాడు. అది కూడా అంతగా ఆసక్తిగా సాగలేదు. కథ, కథనం, మాటలు ఇలా ప్రతి అంశంలోనూ కొరటాల తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఒకానొక దశలో అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి కలగక మానదు. కథను పక్కకు పెట్టి.. స్టార్ క్యాస్ట్ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు డైరెక్టర్. మహేశ్ బాబు వాయిస్ ఓవర్‌తో ధర్మస్థలి నేపథ్యాన్ని చెప్పించి కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆచార్య ధర్మస్థలిలోకి అడుగుపెట్టడం.. బసవన్న ముఠా చేసే అరాచాకాలను ఎండగట్టడం, రెండు పాటలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆచార్య చేసే పోరాట ఘట్టాలు చాలానే ఉన్నప్పటికీ... కథపై ప్రేక్షకుడికి అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ ముందు సిద్ధ పాత్ర ఎంటర్ అవుతుంది. దీంతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి పెరుగుతుంది. కానీ అక్కడ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాడు కొరటాల. ఆచార్య, సిద్ధ మధ్య వచ్చే సీన్స్ మినహా మిగతాదంతా సింపుల్‌గా సాగుతుంది. కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు. అయితే నక్సలైట్స్‌గా సిద్ద, ఆచార్య చేసే పోరాట ఘట్టాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక నీలాంబరి(పూజా హెగ్డే), సిద్ధల మధ్య వచ్చే సీన్స్ అయితే కథకు అతికినట్టుగా ఉంటాయి తప్ప..ఎక్కడా ఆసక్తి కలిగించవు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గా, పాత సినిమాల మాదిరి ఉంటుంది. ‘లాహే లాహే’ ‘భలే భలే బంజారా' సాంగ్‌కి రామ్ చరణ్‌తో చిరు వేసే స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించేయడం మెగాస్టార్ ప్రత్యేకత. ‘ఆచార్య’గా తనదైన నటనతో చిరంజీవి అదరగొట్టేశాడు. ఫస్టాఫ్ అంతా కథని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్స్ సీన్స్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. ముఖ్యంగా లాహే లాహే పాటతో పాటు స్పెషల్ సాంగ్‌కి చిరు అదిరిపోయే స్టెప్పులేసి అలరించాడు. ‘భలే భలే బంజారా’ సాంగ్‌కి రామ్ చరణ్‌తో చిరు వేసే స్టెప్పులైతే మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక సిద్ధ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు రామ్ చరణ్. ప్రతి సీన్లోనూ చిరంజీవితో పోటీపడీ నటించాడు. డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండాఫ్‌లో సింహభాగం సిద్ధ పాత్రదే. సిద్ధని ప్రేమించే యువతి, సంగీతం టీచర్ నీలాంబరి పాత్రలో ఒదిగిపోయింది పూజాహెగ్డే. కాకపోతే సినిమాలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిడివి కూడా చాలా తక్కువే. ఇక విలన్‌గా సోనూసూద్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్‌గా జిషు సేన్ గుప్తా, పాదఘట్టంలోని ఆయుర్వేద వైద్యుడు వేదగా అజయ్ చక్కటి నటనను కనబరిచారు. కామ్రేడ్ శంకర్ అన్నగా సత్యదేవ్ చాలా బాగా నటించాడు. ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. సినిమాకి కీలకం. నాజర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం అంతంత మాత్రమేనని చెప్పాలి. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోదు. పాటలు ఓకే. తిరు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ధర్మస్థలి టెంపుల్ టౌన్‌ని తెరపై చక్కగా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆచార్యను వెంటాడుతున్న రాజమౌళి సెంటిమెంట్!
మల్టీస్టారర్ అంటేనే ప్రేక్షకుడు ఎన్నో అంచనాలతో థియేటర్‌కు వెళ్తాడు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ ఒకే సినిమాలో ఉన్నారంటే హైప్ ఏ రేంజ్లో ఉంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరు, చరణ్ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు (ఏప్రిల్ 29న) రిలీజైంది. ఇప్పటికే సినిమా చూసిన పలువురు వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా బాగుందని కొందరు, యావరేజ్, బాగోలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి వల్లే ఆచార్యకు ఇలాంటి ఫలితం వస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆచార్యకు, రాజమౌళికి సంబంధం ఏంటంటారా? మరేం లేదు. రాజమౌళి కెరీర్లో తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. అందులో డౌటే లేదు. ఎంతోమంది హీరోలకు విజయాలను అందించి స్టార్లుగా నిలబెట్టాడు జక్కన్న. అయితే రాజమౌళితో హిట్ అందుకున్న హీరోలు నెక్స్ట్ ఏ సినిమా చేసినా అది ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఉదాహరణకు 2001లో ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన చిత్రం స్టూడెంట్ నెంబర్ 1. ఇది ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన సుబ్బు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే జక్కన్నతో సింహాద్రి తీసి సక్సెస్ కొట్టిన తారక్, ఆ తర్వాత చేసిన ఆంధ్రావాలా పెద్దగా ఆడలేదు. మరోసారి జక్కన్నతో కలిసి యమదొంగ చేశాడు ఎన్టీఆర్. ఇదీ సూపర్ హిట్టే కానీ ఆ తర్వాత చేసిన కంత్రీ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ప్రభాస్‌తో బాహుబలి, బాహుబలి 2 చేసి పాన్ ఇండియా హిట్స్ ఇచ్చాడు రాజమౌళి. కానీ ఆ తర్వాత ప్రభాస్ చేసిన సాహో తీవ్ర నిరాశను మిగిల్చింది. 2009లో రామ్‌చరణ్‌తో మగధీర తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు రాజమౌళి. కానీ ఆ మరుసటి ఏడాది రిలీజైన చరణ్ మూవీ 'ఆరెంజ్' తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇటీవల రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో ఆర్ఆర్ఆర్ తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రాజమౌళి. దీంతో చరణ్, తారక్‌ల తర్వాతి సినిమాల పరిస్థితి ఏంటా? అని అందరూ చర్చలు మొదలుపెట్టారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో చిరంజీవి ఈ సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ తాను అలాంటివి నమ్మనని కుండ బద్ధలు కొట్టేశాడు. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకు ఆ తర్వాతి సినిమా ఫ్లాప్ వస్తుందని అందరూ అనుకుంటారని, ఆ ఊహను ‘ఆచార్య’ తుడిచిపెట్టేస్తుందని భరోసా ఇచ్చారు. మరి చిరు చెప్పినట్లే ఆచార్య ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి. చదవండి: ‘ఆచార్య’ మూవీ ట్విటర్ రివ్యూ -
‘ఆచార్య’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 29)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ‘ఆచార్య’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు భారీ స్పందన రావడం, ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో నిర్వహించడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇక ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ఫస్టాప్ డీసెంట్‌గా ఉందని, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు మెగా ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా ఉంది. బీజీఎం, పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉండడంతో పాటు హిందూ మతం గురించి ఓ చిన్న సందేశం కూడా ఉంది’అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. #Acharya 1st half - Decent and Ordinary 2nd half - 40 minutes are literally for fans and masses, Fights, Bgm, Songs in 2nd half are Super executed, The climax is very emotional and little message about Hindu Dharma 👍🏻 Overall my Rating is 3.5/5@AlwaysRamCharan #AcharyaOnApr29 — Mahi Reviews (@MahiReviews) April 28, 2022 Just come back ... Confidently tell you , extra shirt tesukellandi .. 2nd half their both screen presense , fights, songs and climax boss viswaroopam ... Sure shot hit ..#Acharya #AcharyaOnApr29 — Venky Tiranam (@Venkytiranam) April 28, 2022 First half : Edho ala vellipoyindhi .. #Acharya Slow Paced , no elevations no high Not at all Koratalaaa movie ..😭 pic.twitter.com/aXi2zePm5T — Uday #SVPonMAY12🔔 (@UDAyVarma1882) April 29, 2022 ఫస్టాఫ్ ఏదో అలా వెళ్లిపోయింది. ఎలివేషన్స్లేవు... స్లోగా సాగుతుంది. ఇది కొరటాల సినిమాలా లేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Okka high moment ledu till now 2nd half aina bagundali 😭🤞 Mani sir e range rod 🤧🤧#Acharya https://t.co/SOplnQC0nl — సినిమా పిచ్చోడు (@KPReddy_) April 29, 2022 #Acharya ఫస్ట్ హాఫ్ చూసాక చాలా రోజుల తర్వాత ఒక ప్రసాంతమయిన ఫీలింగ్.. అరుపులు కేకలు మోషన్స్ రావటనట్టు ఎక్స్ప్రెషన్న్స్ ఏమి లేవు.. #ManiSharma బీజీమ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది.. North వాళ్లకు బాగా ఎక్కే అవకాశాలు వున్నాయి. అంతా దేవగట్టం గురించే@kchirutweets ఏ పాత్ర అయిన నీకు 👌 pic.twitter.com/U1PtiasD5c — BaLu (@RCharaaan) April 29, 2022 #Acharya show complete super hit movie 3.5/5... Pakka hit chusi cheppandi.. Chudakunkunda cheppoddu plzzz — RangaSwamyReddy (@rangas312) April 29, 2022 Genuine review :- Frist half story narration Superbbb & #Chiranjeevi garu Dance Grace 👌🔥💥.E age lo kuda ha grace ante Really impressive. #ManiSharma garu music is Highlight.Interval bang aythe Mass Rampage 💥🤙#SIDDHA #Ramcharan acting is so gud upto now.Overall gud #Acharya pic.twitter.com/O1WTExwPBk — 🕊 புதியபறவை 🕊 (@MigaMike) April 29, 2022 #Acharya is terrible. Might have been considered a good actioner had it released a decade ago. Sticks to the most basic revenge template. The writing and characters are so bland that it even renders a performer like Chiranjeevi charmless. Even Mani Sharma couldn't salvage this. — Ram Venkat Srikar (@RamVenkatSrikar) April 29, 2022 Climax takes Charan to another level as an actor and puts #Acharya to a blockbuster. Apart from first 20mins of second half it is full of high moments — Manish Polisetty (@endhukureturns) April 28, 2022 An outright DISASTER.. a pointless story that goes no where, highly outdated. nothing worked for the movie everyone and everything is weakest. Only bhanjara song is good.. don't dare to watch 1/5 #Acharya — Peter (@urstrulyPeter) April 28, 2022 #Acharya Overall a low-grade 1st half with a slightly better but still outdated 2nd half! Apart from a few scenes and enjoyable dances, nothing else works. Outdated screenplay/story with poor BGM and VFX. Kortala’s Weakest Work by far. Rating: 2-2.25/5 — Venky Reviews (@venkyreviews) April 28, 2022 First half is dope 🔥! Idhi kada Megastar ante anattundhi. Not just for fans it is made for every normal cinema goer. Apart from that one scene of Chamak Chandra comedy everything else is fcking fabulous! Dont miss this rebooted Siva Shankar Vara Prasad Rao #Acharya — Manish Polisetty (@endhukureturns) April 28, 2022 -
‘ఆచార్య’లో సత్యదేవ్ అతిథి పాత్ర, గర్వంగా ఉందన్న చిరు
Chirajeevi Praises Actor Satyadev: నటుడు సత్యదేవ్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు. చిరంజీవి తాజా చిత్రం ఆచార్యలో సత్యదేవ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ‘గాడ్‌ఫాదర్’లో కూడా ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. రీసెంట్గా గాడ్‌ఫాదర్‌లో సెట్లోకి అడుగు పెట్టాడు సత్యదేవ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ చిరంజీవితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు సత్యదేవ్ ట్వీట్ చేశాడు. చదవండి: బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! ‘అన్నయ్యా.. నటన జీవితంతో తమాలాంటి ఎదరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్నిచూసే నటుడిగా మారాను. ఈ రోజు ఆచార్య సినిమాలో మీతోపాటు కాసేపైనా నటించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమ శిక్షణ దగ్గర నుంచి చూఇ నేర్చుకునే అవకాశం దక్కింది’ అంటూ సత్యదేవ్, చిరుపై అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక అతడి ట్వీట్‌కు మెగాస్టార్ ఫిదా అయ్యాడు. అతడి ట్వీట్‌కు తన అభిమానిగా సత్యదేవ్‌ను చూసి గర్వపడుతున్నానంటూ చిరు స్పందించాడు. చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్ చెప్పిన హీరో ‘డియర్ సత్యదేశ్. థ్యాంక్యూ. నీలాంటి చక్కటి నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషంగా ఉంది. ఆచార్యలో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. ఇక గాడ్‌ఫాదర్ చిత్రంలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం’ అంటూ చిరు రాసుకొచ్చారు. కాగా మెహన్ రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్ చిత్రం మలయాళం లూసీఫర్ మూవీకి రీమేక్. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సత్యదేశ్ కీ రోల్ పోషిస్తున్నాడు. చిరు తాజా ట్వీట్‌తో సత్యదేవ్ ఇందులో ప్రతికథానాయకుడిగా కనిపంచానున్నాడనే ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. కాగా ప్రస్తుతం గాడ్‌ఫాదర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డియర్ @ActorSatyaDev ..Thank you. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. #Acharya లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..#Godfather సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..So proud of you. God bless! https://t.co/L0R7yw1Tti pic.twitter.com/P4zqp78SbE — Acharya (@KChiruTweets) April 28, 2022 -
టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను స్పీడ్‌గా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే చిరంజీవి, కొరటాల శివ, రామ్ చరణ్‌తో చిట్‌చాట్ నిర్వహించాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ చిట్‌చాట్‌లో హరీశ్ శంకర్ పలు ప్రశ్నలు ఉడగ్గా.. చిరంజీవి ఆసక్తికర సమాధానలు చెప్పారు. చిరంజీవిని డ్యాన్స్‌కు సంబంధించిన ప్రశ్న అడిగాడు హరీశ్ శంకర్. 'మీరిద్దరు (చిరంజీవి, రామ్ చరణ్) కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరని అనుకుంటున్నారు' అని చిరంజీవిని అడిగాడు హరీశ్ శంకర్. ఇందుకు 'చాలా మంది డ్యాన్సర్స్ ఉన్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్, రామ్, నితిన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు' అని చిరంజీవి చెప్పగా రామ్ చరణ్ మధ్యలో కల్పించుకుని 'నా దృష్టిలో తారక్, బన్నీ బెస్ట్ డ్యాన్సర్స్' అని తెలిపాడు. ఇకపోతే 'ఆచార్య' మూవీలో 'బంజారా' పాటకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: 'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య' బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య'
Koratala Siva Interesting Comments On Acharya Movie: ‘‘నా సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాటి తాలూకు ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. నావి సందేశాత్మక సినిమాలు అనుకోను. ఒకవేళ నా సినిమాల వల్ల ప్రభావితమై మంచి పనులు జరిగితే చాలా సంతోషపడతాను’’ అని అన్నారు దర్శకుడు కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 28) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు కొరటాల శివ పంచుకున్న విశేషాలు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ ఉండే ఓ వ్యక్తి ఓ టెంపుల్ టౌన్లోకి వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘ఆచార్య’ కథ రాసుకున్నాను. ఏ సినిమాలో అయినా విలన్‌పై హీరో పోరాడుతున్నాడు అంటే అది ధర్మం కోసమే. అయితే ధర్మం అవసరం అని ‘ఆచార్య’ సినిమాలో అండర్లైన్ చేశానంతే. కాకపోతే కథా నేపథ్యం కాస్త కొత్తగా ఉంటుంది. చదవండి: సిద్ధ పాత్రను పవన్ కల్యాణ్ చేసేవాడు!: చిరంజీవి ఇద్దరి లక్ష్యం ఒక్కటే ధర్మస్థలి అనే టెంపుల్ టౌన్లో సిద్ధ అనే విద్యార్థి (రామ్‌చరణ్ పాత్ర) ఏ సమస్యని అయినా సరే అందంగా డీల్ చేస్తాడు. కానీ ‘ఆచార్య’ (చిరంజీవి పాత్ర పేరు) ఆవేశపరుడు. అయితే ఇద్దరి లక్ష్యం ఒకటే. టెంపుల్ టౌన్లో ఉన్న సిద్ధ ఎందుకు అడవులకు వెళ్లాడు? అడవుల్లో ఉండాల్సిన ‘ఆచార్య’ ఎందుకు టెంపుల్ టౌన్‌కు రావాల్సి వచ్చింది అన్నదే కథ. రెండు కళ్లు చాల్లేదు చిరంజీవిగారు ఏ స్థాయి కమర్షియల్ స్టారో నాకు తెలుసు. ఆయన ఇమేజ్ను తగ్గించకుండా కమర్షియల్ పంథాలోనే ‘ఆచార్య’ కథ చెప్పాం. మాస్ ఎంగేజింగ్ బ్లాక్స్ ‘ఆచార్య’లో చాలానే ఉన్నాయి. తండ్రీ కొడుకులు కాబట్టి చిరంజీవి, చరణ్‌ల మధ్య మంచి సింక్ ఉంది. ఇద్దరూ బాగా చేశారు. ఇద్దరూ నటిస్తుంటే చూడ్డానికి నాకు రెండు కళ్లూ సరిపోలేదు. సిద్ధ క్యారెక్టర్ ఇంట్రవెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఉంటుంది. ఫ్రీగా చేయలేదు ‘ఆచార్య’ సినిమాని ఫ్రీగా చేయలేదు. రిలీజ్ తర్వాత పారితోషికాలు తీసుకుంటాం. ప్రతి సినిమా నాకు టెన్షనే. ఓ పరీక్ష రాసినట్లే. పరీక్ష బాగా రాయకపోతే ఏ సమస్యా లేదు. అదే బాగా రాస్తే మనం అనుకున్న మార్కులు వస్తాయా? రావా? అని టెన్షన్. ‘ఆచార్య’ పరీక్ష బాగా రాశాను. మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఎన్టీఆర్ సినిమా అప్డేట్.. నా తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే.. ఆ రోజు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. 'నేను తెలుసుకున్న పవర్ఫుల్ సోల్స్ క్యారెక్టర్స్‌లో స్వామి వివేకానంద ఒకరు. మీడియా, సోషల్ మీడియా వంటి మాధ్యమాలు లేని రోజుల్లో కూడా ఆయన వల్ల చాలామంది ప్రభావితం అయ్యారు. ప్రపంచం మొత్తం చూసేలా చాలా పెద్ద స్థాయిలో స్వామి వివేకానందగారి మీద ఓ సినిమా చేయాలని ఉంది. కానీ చాలా పరిశోధన చేయాలి. నాకు అంత అనుభవం రావాలి. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ‘గాంధీ’ సినిమాను ఎలా తీశారో అలా తీయాలని ఉంది.' అని కొరటాల శివ పేర్కొన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్!
Anushka Shetty Playing Special Role In Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంకా విడుదలకు రెండు రోజుల ఉండగా ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో హీరోయిన్గా చేసిన కాజల్‌ను తొలిగించిన విషయం తెలిసిందే. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ దీనికి బదులుగా ఓ సీన్ కోసం స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కాస్తా గ్లామర్ టచ్ కోసం చిత్రం బృందం ఓ అతిథి పాత్రకు అనుష్క శెట్టిని స్పంద్రించినట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లేదా ముఖ్య పాత్రలో కనిపించనుందని ఫిలీం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మూడేళ్లుగా అనుష్క వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్రం బృందం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిందట. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. ఇదే నిజమైతే ఆచార్య చూసేందుకు థియేటర్‌కు వచ్చిన స్వీట్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 29 తేదీవరకు వేచి చూడాలి. కాగా ఆచార్య మూవీ ప్రమోషన్ భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న డైరెక్టర్ కొరటాల ఈ మూవీ నుంచి కాజల్‌ను తీసేశామని స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ఆచార్య’పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే డౌట్ వచ్చింది. అదే సమయంలో కరోనా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు బాగా ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదని ఉద్దేశించి ఆమెను తొలగించాం’’ అని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రామ్‌చరణ్ (ఫొటోలు)
-
అమ్మవారిని దర్శించుకున్న రామ్‌చరణ్, ఆలయంలో ఫ్యాన్స్ రచ్చ!
సాక్షి, విజయవాడ: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 29న) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో రామ్ చరణ్, కొరటాల శివ కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అనంతరం రామ్‌చరణ్‌ను చూసేందుకు దుర్గమ్మ ఆలయం లోపలికి దూసుకొచ్చారు. దుర్గగుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలిచ్చారు. మొబైల్ ఫోన్లతో వీడియోలు తీశారు. ఈ క్రమంలో ఆలయంలోని కానుకల హుండీలపై నిలబడ్డారు. పోలీసులు, ఆలయ అధికారుల సమన్వయ లోపం కారణంతో అక్కడ గందరగోళం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యూలైన్లలో నిల్చున్న భక్తులు చాలాసేపు ఇబ్బందులు పడ్డారు. దుర్గ గుడి దర్శనం అనంతరం చరణ్, శివ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Mass @AlwaysRamCharan Fans🔥😎🤙#acharya #AcharyaOnApril29th #RamCharan #SIDDHA pic.twitter.com/Lha6KP7JRe — SIDDHA (@Pavanlucky988) April 27, 2022 చరణ్ బాబు ఎక్కడికైనా వస్తే అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకి పంపుతుంది అనిపించేంత జనసముద్రం🤙🔥 బెజవాడ సన్నిధిలో చరణ్ అభిమానుల సింహ గర్జన 🔥🤙 బెజవాడ గడ్డ 🔥చరణ్ బాబు అడ్డా🔥@AlwaysRamCharan #RamCharan #AcharyaOnApr29 #Acharya pic.twitter.com/fX7LwzHDSK — TeamRC_Chittoor (@RcChittoor) April 27, 2022 Security arrangements should have been better... Man Of Masses #RamCharan Swamy in Vijayawada With Director #KoratalaSiva garu !! Visiting Kanaka durgamma Temple Today ❤️🙏 pic.twitter.com/FgRrydSoKx — Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) April 27, 2022 #RamCharan craze all over 🔥👌🏻 #Acharya promotionspic.twitter.com/LS0FbYUvBM — Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) April 27, 2022 చదవండి: ఆచార్య ఫస్ట్ రివ్యూ: రామ్‌చరణే బాస్! మరి చిరంజీవి? -
ఆచార్య ఫస్ట్ రివ్యూ: రామ్‌చరణే బాస్! మరి చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య. రామ్‌చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించగా సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 29న) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఆచార్య సినిమా అదుర్స్ అంటూ అప్పుడే ఓ రివ్యూ బయటకు వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఆచార్య చూసేశానంటూ సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. అంతేకాదు ఈ చిత్రానికి నాలుగు స్టార్ల రేటింగ్ కూడా ఇచ్చాడు. ఆచార్య మూవీలో రామ్‌చరణ్ బాస్ అని, చిరంజీవి టెర్రిఫిక్‌గా కనిపించారని ప్రశంసించాడు. ఈ సినిమాలో చరణ్ తన పాత్రతో స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకున్నాడని మెచ్చుకున్నాడు. మూవీలో ఎంటర్టైన్మెంట్ మరో లెవల్లో ఉందన్నాడు. ఈ రివ్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'బాబూ, అది చిరంజీవి సినిమారా, అందులో చరణ్ అతిథి పాత్ర, తమరేమో చరణే బాస్ అంటున్నారు, ఇంతకీ సినిమా చూశారా? లేదా?' అని ప్రశ్నిస్తున్నారు. 'ఈయన ప్రతి సినిమాకు నాలుగు స్టార్ల రేటింగ్ ఇస్తాడు, ఇది మామూలేగా' అని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం 'మీరు చెప్పింది నిజమైతే బాగుండు', 'చరణ్, చిరంజీవి గురించి పాజిటివ్‌గా చెప్పినందుకు థ్యాంక్స్' అని కామెంట్లు పెడుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) First Review #Acharya ! #RamCharan is the boss, when it comes to playing to the masses. This film reaffirms this truth. The role provides him ample opportunity to prove his star power and he does it with remarkable ease. #Chiranjeevi is in Terrific form as well. ⭐️⭐️⭐️⭐️ — Umair Sandhu (@UmairSandu) April 26, 2022 చదవండి: ‘ఆచార్య’లో సిద్ధ పాత్రను చరణ్ చేయకపోతే పవన్‌కల్యాణ్ చేసేవాడు -
సిద్ధ పాత్రను పవన్ కల్యాణ్ చేసేవాడు!: చిరంజీవి
Chiranjeevi Interesting Comments On Acharya Movie And Ram Charan" ‘‘ఆచార్య’ సినిమాలో నేను, చరణ్ తొలిసారి కలిసినప్పుడు వచ్చే భావోద్వేగమైన సన్నివేశంలో గ్లిజరిన్ వాడకున్నా మాకు కన్నీళ్లు వచ్చాయి. ఆ సీన్‌కి సెట్లో అందరూ ఉద్వేగానికి లోనై లంచ్ బ్రేక్‌కి కట్ చెప్పినా కదల్లేదు. నటన పరంగా చరణ్ పరిణితి చెందడం పట్ల ఓ తండ్రిగా, సహ నటుడిగా చాలా గర్వపడుతున్నా’’ అని చిరంజీవి అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, పూజా హెగ్డే, సోనూ సూద్ కీలక పాత్రల్లో నటించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో చిరంజీవి మాట్లాడుతూ.. 'చరణ్ నటనను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి ‘ఆచార్య’లో తన నటన కొత్తగా అనిపించలేదు (నవ్వుతూ). నటన పరంగా నేను ఇప్పటి వరకూ చరణ్‌కి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు.. ఎవరు నమ్మినా, నమ్మకున్నా ఇది నిజం. తను ఇన్వాల్వ్ అయి చేస్తే ఒరిజినాలిటీ ఉంటుంది. తనకు తానుగా నేర్చుకుంటూ ఎదుగుతూ ఈ స్థాయికి రావడం హ్యాపీ.' 'చరణ్ ప్రవర్తన చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. డైరెక్టర్ సీన్ ఓకే అని చెప్పిన తర్వాత కెమెరా ముందు నుంచి సంతృప్తిగా పక్కకి వస్తాడు. సీన్ అయిపోయిన తర్వాత కారావ్యాన్‌లోకి వెళ్లకుండా సెట్లో అందరితోనూ కలివిడిగా ఉండటం, భోజనం చేయడం హ్యాపీ. సెట్స్‌లో నేను కూడా అలాగే ఉండేవాణ్ణి. ‘ఆచార్య’లో సిద్ధ పాత్రను చరణ్ చేయకపోతే ప్రత్యామ్నాయం నా తమ్ముడు పవన్ కల్యాణ్. ఎందుకంటే కథలో ఆ ఫీల్‌ని పవన్ 100 శాతం తీసుకువస్తాడు.' '‘ఆచార్య’కి మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ చేస్తుండగా నాకు అన్యాయం చేశాడు చరణ్(నవ్వుతూ). సెట్స్‌కి సురేఖను(చిరంజీవి భార్య) రమ్మని నేను చెబితే, ‘రావొద్దమ్మా’అంటూ చరణ్ రాకుండా చేశాడు. ‘అమ్మ వస్తే నీతో నేను కలిసి ఉండే సమయం తగ్గిపోతుంది. మనం ఇలా షూటింగ్లో ఇన్ని రోజులు గడిపే అవకాశం మళ్లీ రావొచ్చు.. రాకపోవచ్చు.. ఇక్కడ మీతో కలిసి ఉండటం మధురానుభూతి..’ అంటూ సురేఖను సెట్స్‌కి రానివ్వకుండా చేశాడు.' 'నేను నిత్య విద్యార్థిని. నా జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ప్రతి ఒక్కరినీ ఆచార్యగానే భావిస్తా. నేను నటనను ‘అ ఆ’లతో ప్రారంభిస్తే చరణ్ ఏకంగా యూనివర్సిటీకి వెళ్లిపోయాడు. పాత పాత కలిస్తే ఏమవుతుంది మోత తప్ప. నేను పాత కాబట్టి కొత్త దర్శకులతోనే చేస్తున్నా(నవ్వుతూ). కొత్త దర్శకులతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నా.' ఇద్దరూ ఆ చాన్స్ ఇవ్వలేదు : కొరటాల శివ నా ఆలోచనల నుంచి వచ్చిన కథే ‘ఆచార్య’. పూర్తిగా కల్పితమైన స్టోరీ. ‘ఆచార్య’ లో కాషాయం, కమ్యూనిజం నేపథ్యాలను మాత్రమే తీసుకున్నాం. ధర్మం కోసం పాటుపడే ఇద్దరు బలమైన వ్యక్తుల కథ ఇది. ఇందులో సిద్ధ పాత్రకు మహేశ్‌బాబును తీసుకోవాలనుకోలేదు. చిరంజీవి, రామ్‌చరణ్ కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు మానిటర్లో ఎవర్ని చూడాలా అని కన్ప్యూజ్ అయ్యేవాణ్ణి. ఎలాంటి సన్నివేశంలోనూ వారిద్దరూ రీటేక్, రీషూట్‌కి చాన్స్ ఇవ్వలేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించా: రామ్‌చరణ్ ‘ఆచార్య’ లో నాన్న(చిరంజీవి)తో చేయడం నిజంగా ఒత్తిడితో కూడిన పనే. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించా. రాజమౌళిగారు చెప్పినట్టు సెట్స్‌లోకి నేనెప్పుడూ తెల్లకాగితంలా వెళతా. పాత్రని అర్థం చేసుకుని డైరెక్టర్స్‌కి మౌల్డ్ అవుతాను. ‘ఆర్ఆర్ఆర్’ నా సినిమా. ‘ఆచార్య’ నాన్నగారిది. ఇందులో నేను అతిథి పాత్ర చేశా. మా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ బాబుకి థ్యాంక్స్. అడగడంలో తప్పు లేదు: చిరంజీవి కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా కుంటుపడింది. అలాంటప్పుడు చిత్రపరిశ్రమ మేలు కోసం చేయూత ఇవ్వండి అని ప్రభుత్వాలను వేడుకోవడం తప్పు కాదు. సినిమా పరిశ్రమ నుంచి 50కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. ప్రభుత్వాలు కనికరించి టిక్కెట్ ధరల పెంపు జీవోలు ఇచ్చాయి.. ప్రేక్షకులు కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ప్రేక్షకులకు వినోదం అందించడానికి అత్యధిక బడ్జెట్ పెట్టాం.. అనుకోని పరిస్థితుల్లో తీసుకున్న అప్పులకు అంతకంత వడ్డీలు అయ్యాయి. ప్రభుత్వాలకు మేము 42 శాతం పన్నులు కడుతున్నాం. వాటిల్లో నుంచి కొంత ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆచార్య’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సాక్షి, అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆ సినిమా సూపర్ హైబడ్జెట్ కేటగిరీ కిందకు వస్తోంది. దాంతో ఆ సినిమా నిర్మాతల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. సినిమా విడుదల నాటి నుంచి పది రోజుల పాటు టికెట్‌పై రూ.50 పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘ఆచార్య’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
‘ఆచార్య’ మూవీ (ఫొటోలు)
-
'ఆచార్య' టీంకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన చిత్రం ఆచార్య. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆచార్య టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 29 నుంచి మే 5వరకు టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు వారం రోజుల పాటు అనుమతి కల్పించింది. -
సురేఖ షూటింగ్‌కి వస్తానంటే చరణ్ వద్దన్నాడు : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న చిరంజీవి, కొరటాల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చరణ్‌తో కలిసి సినిమా చేయడంపై చిరంజీవి మాట్లాడుతూ..'ఈ సినిమా ద్వారా చరణ్, నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఆచార్య షూటింగ్ కోసం మారేడుమిల్లిలో 12 రోజుల పాటు ఉన్నాం. ఆ సమయంలో ఇద్దరం ఒకే రూం, జిమ్ షేర్ చేసుకున్నాం. ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నా షూటింగ్లో కోస్టార్స్‌గా ఒకే చోట టైం టైం స్పెండ్ చేయడం అన్నది బ్యూటిఫుల్ మూమెంట్. అప్పుడు షూటింగ్ చూసేందుకు వస్తానని సురేఖ చెప్పినా చరణ్ ఒప్పుకోలేదు. డాడీతో నేను ఉంటాను అని రావొద్దన్నాడు. కొడుకుగా చరణ్ ఎంత సంతోషడ్డాడో నేను కూడా అంతే సంతోషించా. తండ్రీ, కొడుకులుగా మా ఇద్దరికీ ఇది ఒక తీపి ఙ్ఞాపకంలా మిగిలిపోతుంది' అని పేర్కొన్నారు. ఆచార్య గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలియాలంటూ పూర్తి వీడియో చూడాల్సిందే. -
‘ఆచార్య’ హిందీ వెర్షన్‌పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
Ram Charan Clarifies On Acharya Hindi Version: రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ చిత్రాల అనంతరం ప్రస్తుతం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున సినిమా ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులతో పాటు సౌత్ ప్రేక్షకులంతా ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదాల అనంతదరం ఏప్రిల్ 29న థియేటర్లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 29న ఆచార్య దక్షిణాది అన్ని భాషల్లోనూ విడుదల అవుతుంది. చదవండి: రాజమౌళి గురించి ఈ విషయం 12 ఏళ్ల క్రితమే చెప్పాను కానీ, హిందీలో మాత్రం విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆచార్య హిందీ వెర్షన్‌పై చరణ్ తాజాగా క్లారీటీ ఇచ్చాడు. రీసెంట్గా జరిగిన ఆచార్య మూవీ ప్రెస్మీట్లో చరణ్ మాట్లాడుతూ.. ‘ఆచార్య మూవీ షూటింగ్ మేం అనుకున్నదానికంటే ఎక్కువ ఆలస్యమైంది. అంతేకాదు నేను ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో ఒకేసారి నటిస్తుండటంతో నాకు చాలా తక్కువ సమయం దొరికింది. దీనికి తోడు కరోనా లాక్డౌన్. అయితే మేం ఆచార్యను హిందీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకు అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఆచార్యను కూడా హిందీలో రిలీజ్ చేయాలని అనుకున్నాం. చదవండి: దొంగతనం షురూ చేసిన బిగ్‌బాస్-5 విజేత సన్నీ కానీ హిందీలో రిలీజ్ చేయాలంటే డబ్బింగ్, పొస్ట్‌ప్రొడక్షన్ పనులకు చాలా సమయంలో పడుతుంది. ఇప్పుడు మా దగ్గర అంత టైం లేదు. అందుకే ఏప్రిల్ 29కి హిందీ వెర్షన్‌ను రెడీ చేయలేకపోయాం’ అని చెప్పుకొచ్చాడు. కానీ ఆచార్య సినిమాను ఖచ్చితంగా హిందీలో రిలీజ్ చేస్తామని, తన పాత్రకు తానే స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పుకుంటానని చరణ్ పేర్కొన్నాడు. కానీ దీనికి కాస్తా సమయం పడుతుందని, దక్షిణాది భాషల్లో విడదుల అనంతరం హిందీ వెర్షన్‌పై దృష్టి పెడతామని, త్వరలోనే నార్త్‌లో ఆచార్య మూవీని రిలీజ్ చేస్తామని రామ్ చరణ్ స్పష్టం చేశాడు. కాగా ఆచార్య మూవీకి చరణ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు..
Upcoming Theatre OTT Movies Web Series In April Last Week 2022: మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సందడి పండుగల కనువిందు చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' వసూళ్ల పరంపర కొనసాగుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత తాజాగా విడుదలయ్యే చిత్రాలపై పడింది సినీ ప్రియుల కన్ను. మూవీ లవర్స్ కోసమే అన్నట్లుగా ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఒక పెద్ద సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. అలాగే ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దామా ! 1. ఆచార్య మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అందులోనూ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌తోపాటు ఆయన కొడుకు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ అంటే.. ఆ అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29 నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు 'ఆచార్య'. 'ధర్మస్థలి' అనే ప్రాంతం చుట్టూ తిరిగే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే. 2. కణ్మనీ రాంబో ఖతీజా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, నయనతారలతో ఆడిపాడేందుకు సిద్ధమయ్యాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. చిరంజీవి 'ఆచార్య' సినిమా కంటే ఒక్క రోజు ముందుగా థియేటర్లలో తన ప్రేమాయణంతో సందడి చేయనున్నాడు ఈ హీరో. అంటే ఏప్రిల్ 28న ఈ మూవీ విడుదల కానుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'కాతు వాక్కుల రెండు కాదల్'ను తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా'గా రిలీజ్ చేస్తున్నారు. 3. రన్ వే 34 బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ కలిసి నటించిన చిత్రం 'రన్ వే 34'. ఈ సినిమాతో సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు అజయ్ దేవగణ్. ఇందులో టాలీవుడ్ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ అలరించనున్నారు. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్, అజయ్ దేవగణ్ పైలట్లుగా నటించగా, అమితాబ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా అలరించనున్నారు. 4. హీరోపంతీ 2 బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన తాజా చిత్రం హీరోపంతీ 2. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తారా సుతారియా హీరోయిన్గా నటించింది. రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియద్వాలా నిర్మించారు. లైలా అనే విలన్ రోల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ తన యాక్టింగ్ మార్క్‌ను చూపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల విడుదలకు సిద్ధంగా ఉంది. ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. నెట్‌ఫ్లిక్స్ గంగుబాయి కతియావాడి-ఏప్రిల్ 26 (తెలుగు) 365 డేస్: దిస్ డే-ఏప్రిల్ 27 (హాలీవుడ్) మిషన్ ఇంపాజిబుల్-ఏప్రిల్ 29 (తెలుగు) ఓ జార్క్-ఏప్రిల్ 29 (వెబ్ సిరీస్) ఆక్వాఫినా ఈజ్ నోరా ఫ్రమ్ క్వీన్స్-ఏప్రిల్ 29 (హాలీవుడ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనుపమ: నమస్తే అమెరికా-ఏప్రిల్ 25 (హిందీ) బ్యారీ-ఏప్రిల్ 25 (వెబ్ సిరీస్, సీజన్ 3) మిషన్ సిండ్రెల్లా-ఏప్రిల్ 29 (హిందీ) జీ5 నెవర్ కిస్ యువర్ బెస్ట్‌ఫ్రెండ్-ఏప్రిల్ 29 (హిందీ) అమెజాన్ ప్రైమ్ వీడియో అన్డన్-ఏప్రిల్ 29 (కార్టూన్ సిరీస్) వూట్ బేక్డ్-ఏప్రిల్ 25 (వెబ్ సిరీస్, సీజన్ 3) ది ఆఫర్-ఏప్రిల్ 28 (వెబ్ సిరీస్) చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆచార్య’ నుంచి కాజల్ అవుట్.. కారణం ఇదేనట
‘ఆచార్య’ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినీ ప్రియుల మదిలో మెదిలిన ఓకే ఒక ప్రశ్న ఈ మూవీలో కాజల్ ఉందా? లేదా? ఉంటే ట్రైలర్లో ఎందుకు చూపించలేదు? ఒకవేళ ఆమె పాత్రని తొలగిస్తే.. కారణం ఏంటి?. తాజాగా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ. ఆచార్య నుంచి కాజల్‌ని తొలగించినట్లు సృష్టం చేశాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు. ‘సినిమా అనుకున్నప్పుడు.. హీరో అన్నాక హీరోయిన్ పక్కా ఉండాలి అనుకున్నాం. అందుకే హీరోయిన్ కోసం ఓ ఫన్నీ క్యారెక్టర్ క్రియేట్ చేశాం. కాజల్‌తో నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా చేశాం. కానీ ‘ఆచార్య’పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే డౌట్ వచ్చింది. అదే సమయంలో కరోనా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు బాగా ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదు. పాటలు పెట్టలేం. ముగింపు సరిగా ఉండదు. అంత పెద్ద హీరోయిన్‌తో అలాంటి పాత్ర చేయిస్తే బాగోదు అనిపించింది. ఆమెను తప్పుగా వాడుకుంటున్నట్లు అనిపించింది. (చదవండి: నా జీవితంలో మర్చిపోలేని రోజులవి: రామ్ చరణ్) అదే విషయాన్ని చిరంజీవిగారికి చెబితే, కథకు ఏది అవసరం అయితే అది చెయ్ అన్నారు. ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకో అని చెప్పారు. కాజల్‌కు ఇదే విషయాన్ని చెప్పాను. ఆమె అర్థం చేసుకున్నారు. అందంగా నవ్వి.. అందరినీ మిస్ అవుతున్నాను. తప్పకుండా ఫ్యూచర్లో కలిసి సినిమా చేద్దామని అన్నారు. అలా కాజల్ పాత్రను తొలగించాం’ అని కొరటాల చెప్పుకొచ్చారు. అయితే లాహేలాహే సాంగ్‌లో కాజల్ ఉంటుందా లేదా? విషయంపై మాత్రం కొరటాల క్లారిటీ ఇవ్వలేదు. సినిమా చూసే తెలుసుకోవాలని చెప్పారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Acharya: నా జీవితంలో మర్చిపోలేని రోజులవి: రామ్ చరణ్
‘‘ఆచార్య’ సినిమాలో నాన్నగారి(చిరంజీవి) ఆచార్య, నేను చేసిన సిద్ధ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నా పాత్ర సెకండాఫ్‌లో వస్తుంది. నాన్నతో కలిసి ఈ సినిమాలో 45నిమిషాల నిడివి ఉన్న పాత్ర చేసేందుకు నాకు 13ఏళ్లు పట్టింది. అలాంటిది ఆయనతో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర అంటే ఇంకా చాలా సమయం పడుతుంది’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో రామ్‌చరణ్ పంచుకున్న విశేషాలు... ► ‘ఆచార్య’ లో మీ పాత్ర ఉంటుందని మీకు ముందే తెలుసా? తెలియదు.. ఎందుకంటే ‘ఆచార్య’ సినిమాకి నేను ఓ నిర్మాతగా ఎంటర్ అయ్యానే కానీ నటుడిగా కాదు. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన చిన్న పాత్ర ఉంటుందని ఆ తర్వాతే తెలిసింది. పైగా ఈ పాత్ర కథకి ఎంతో ముఖ్యం అని కొరటాల శివగారు చెప్పారు. అలాగే ‘ఆచార్య’ నాన్నగారి సినిమా కావడంతో ఓకే చెప్పాను. ► కొరటాల శివ ‘ఆచార్య’ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ‘మిర్చి’ సినిమా తర్వాత నుంచి నేను–కొరటాలగారు ఓ సినిమా చేద్దామనుకున్నాం. కానీ, ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అయినప్పటికీ మా కాంబినేషన్ కుదరలేదనే బాధ నాకెప్పుడూ లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య బలమైన స్నేహ బంధం ఉంది. అందుకే తొందరపడకుండా వీలు కుదిరినప్పుడు మంచి ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. ► ‘ఆచార్య’కి మీరు పచ్చజెండా ఊపాక మీ కోసం కథలో ఏవైనా మార్పులు చేశారా? ఎలాంటి మార్పులు లేవు. అయితే తొలుత నాది, పూజా హెగ్డేది 15 నిమిషాలే అనుకున్నాం. కానీ నా పాత్ర 45 నిమిషాలు ఎలా అయిందో నాకే తెలియడం లేదు. ఆచార్య, సిద్ధ పాత్రలకి చాలా తేడా ఉంటుంది. ఈ పాత్రలు వేరే ఏ హీరోలు చేసినా కూడా హిట్ అవుతాయి. కాకపోతే నాన్నగారు, నేను చేయడం వల్ల మరింత క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో చాలా సన్నివేశాలు సహజంగా ఉంటాయే కానీ ఎక్కడా కావాలని యాడ్ చేసినట్లు ఉండవు. ► సిద్ధ పాత్ర ఎలా ఉంటుంది? ‘ఆచార్య’ లో నాన్నది, నాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు. నేను ‘ధర్మస్థలి’ లోని గురుకులంలోని యువకునిగా కనిపిస్తాను. నాన్నగారు ఒక ఫైటర్‌లా కనిపిస్తారు. మా ఇద్దరి పాత్రలు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. అయితే ధర్మం కోసం ఇద్దరూ ఎలా కలుస్తారు? అధర్మంపై ఎలా పోరాటం చేశారు? అనేది కొరటాలగారు చాలా బాగా చూపించారు. ► ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పుడు ‘ఆచార్య’ కోసం రాజమౌళిని ఎలా ఒప్పించారు? రాజమౌళిగారు ‘బొమ్మరిల్లు’ ఫాదర్లాంటివారు. ఆయన సినిమా అంగీకరించామంటే అది పూర్తయ్యే వరకూ ఆర్టిస్ట్‌ల చేయి వదలరు. కానీ సిద్ధ పాత్ర గురించి కొరటాలగారు రాజమౌళిగారికి చెప్పారు. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను రాజమౌళిగారు గుర్తించి, నేను చేస్తేనే బాగుంటుందన్నారు. పైగా మా నాన్నమీద గౌరవంతో, అమ్మ(సురేఖ) డ్రీమ్ ప్రాజెక్ట్ అని ‘ఆచార్య’ చేసేందుకు నాకు అవకాశం ఇచ్చారు రాజమౌళిగారు. ఇందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ► ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పుడే ‘ఆచార్య’ కి మేకోవర్ కావడం కష్టంగా అనిపించిందా? ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కష్టం అనిపించదు. అటు ‘ఆర్ఆర్ఆర్’ లో రామరాజు పాత్ర కానీ, ఇటు ‘ఆచార్య’ లో సిద్ధ పాత్రకి కానీ మేకోవర్ కావడం కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే నాకు బాగా నచ్చిన పాత్రలు ఇవి.. అందుకే చాలా ఇష్టంగా చేశాను. ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ నా మనసుకి బాగా దగ్గరైన చిత్రాలు. ఆ కోవలో నిర్మించిన ‘ఆచార్య’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ► ‘ఆచార్య’ కి పనిచేస్తున్నప్పుడు చిరంజీవి నుంచి ఏం నేర్చుకున్నారు? ఈ 35 ఏళ్లల్లో నేను చూసిన నాన్నగారు వేరు.. ‘ఆచార్య’ కోసం మారేడుమిల్లి అడవుల్లో 20 రోజులు షూటింగ్ చేసినప్పుడు చూసిన నాన్నవేరు. అయితే మారేడుమిల్లి అడవుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కోసం ఇద్దరం ఒక కాటేజ్‌లో ఉన్నాం. కలిసి వ్యాయామం, భోజనం చేశాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. నా జీవితంలో మర్చిపోలేని రోజులవి. ఆ 20 రోజుల షూటింగ్లో నాన్న నుంచి ఎంతో నేర్చుకున్నా. ► ‘ఆచార్య’ కి మీరు నిర్మాతనా? హీరోనా? కొణిదెల ప్రొడక్షన్స్‌లోనే ‘ఆచార్య’ నిర్మించాలనుకున్నాం. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తో నేను బిజీగా ఉండటం వల్ల ప్రొడక్షన్‌పై పూర్తిగా దృష్టి సారించలేననిపించింది. అప్పుడు నిరంజన్ రెడ్డిగారు ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కూడా మా సొంత బ్యానర్లాంటిదే. అందుకే ఇప్పటికి కూడా నాన్న, నేను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ప్రస్తుతానికి నా దృష్టి నటనపైనే. ‘సైరా, ఆచార్య’ లాంటి బలమైన కథలు వచ్చినప్పుడు కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తాను. ► ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సక్సెస్ అయింది. మరి ‘ఆచార్య’ ని పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్‌కి ఎందుకు ప్లాన్ చెయ్యలేదు? ‘ఆచార్య’ ని దక్షిణాదిలో చేయాలనుకునే కొరటాలగారు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ విడుదలకి మధ్య ఎక్కువ గ్యాప్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలా ప్లా¯Œ ్స ఉంటాయి. సమయం తక్కువ ఉంది. అందుకే తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకుంటున్నాం. ► స్ట్రైట్ బాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? నేనేదీ ప్లాన్ చేసుకోను. ఏ డైరెక్టర్ అయినా నాకు కరెక్ట్ కథ తీసుకొస్తే ఏ భాషలో అయినా చేస్తాను. నేను కావాలనుకుని డిజైన్ చేసిన సినిమాలకంటే డైరెక్టర్స్ ఆలోచించి చేసిన సిని మాలే నాకు సూపర్ హిట్స్ ఇచ్చాయి. ‘ఆరెంజ్’ సరిగ్గా ఆడలేదు కానీ, ఇప్పటికీ నా ఫేవరేట్ సినిమాల్లో అది ఒకటి. ► సౌత్ సినిమాలు పాన్ ఇండియన్ హిట్స్ కావడం ఎలా అనిపిస్తోంది? ఇటీవల వచ్చిన ‘పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2’ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్స్ కావడం చాలా గర్వంగా ఉంది. ఇది వరకు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనే వారు. కానీ, ఇప్పుడు మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ► మీ తర్వాతి చిత్రాలేంటి? శంకర్‌గారి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 60రోజులు షూటింగ్ పూర్తయింది. ఆ సినిమా తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తాను. నానమ్మ ఎప్పుడూ నాన్నవైపే.. ‘ఆచార్య’ సెట్స్‌లో నానమ్మ(అంజనాదేవి), అమ్మ(సురేఖ)ల మధ్య సరదా పోటీ ఉండేది. నా కొడుకు బాగా చేశాడంటే, కాదు.. నా కొడుకు అనేకునేవారు. నానమ్మ ఎప్పుడూ నాన్నవైపే ఉండేవారు. -
అందుకే ‘ధర్మస్థలి’ సెట్ వేయాల్సి వచ్చింది: కొరటాల
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా కోసం 20 ఎకరాల్లో భారీ టెంపుల్ సెట్ వేసిన విషయం తెలిసిందే. దానికి ‘ధర్మస్థలి’అని నామకరణం చేశారు. సినిమాలోని సింహభాగం ఇక్కడే షూటింగ్ చేశారట. ‘ధర్మస్థలి’ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని మొదటి నుంచి ప్రచారం చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా ‘ధర్మస్థలి’ ఎలా సృష్టించారో చెప్పారు దర్శకుడు కొరటాల శివ. ‘సినిమా అనుకున్నపుడే.. ఓ మంచి టెంపుల్ టౌన్ కావాలనుకున్నాం. చాలా ప్రాంతాలు తిరిగాం. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అంశాలు నచ్చాయి.షూటింగ్ కాధ్యం కాదేమో అనిపించింది. చివరకు మేమే ‘ధర్మస్థలి’సృష్టించాలనుకున్నాం. ‘ధర్మం’గురించి చెప్పే కథ కాబట్టి ఆ టౌన్ పేరు కూడా ధర్మస్థలి అని పేరు పెట్టాం. ఆ పేరు మా టీమ్ మొత్తానికి నచ్చింది. నిర్మాతలు కూడా ఓకే అన్నారు. (చదవండి: చరణ్‌కు ఉపాసన అంటే భయమా ? నాన్న అంటే భయమా ?..) దీంతో మా ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ ఎన్నో దేవాలయాలను సందర్శించి, పరిశోధన చేసి సెట్ నిర్మించారు. ఆ సమయంలో మేము పూజలు కూడా చేశాం. దేవాలయాల పవిత్రత దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ‘ధర్మస్థలి’ ఎక్కడ ఉంది? అక్కడి వెళ్దాం అనే అభిప్రాయం అందరిలో వస్తుంది. అదొక అందమైన ప్రదేశం. కోట్ల రూపాయలను ఖర్చు చేసి 20 ఎకరాల్లో సెట్‌ని నిర్మించాం’అని కొరటాల శివ చెప్పుకొచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. All the hard work, devotion & vision behind building one of the India's Largest Set DHARMASTHALI. Watch the #SpiritOfDharmasthali ft #KoratalaSiva. - https://t.co/Sl9y4EmWK6#Acharya #Siddha#AcharyaOnApr29 pic.twitter.com/NIBQiku6Qb — Konidela Pro Company (@KonidelaPro) April 24, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చరణ్‌కు ఉపాసన అంటే భయమా ? నాన్న అంటే భయమా ?..
Anchor Suma Question To Ram Charan In Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం (ఏప్రిల్ 23) యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆహ్లాదకరంగా సాగింది. ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల అభిమానులు పంపిన ప్రశ్నలను అడగ్గా చిరంజీవి, చరణ్, కొరటాల శివ సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌ను సుమ 'ఇంట్లో ఎవరికీ భయపడతారు నాన్నకా? ఉపాసనాకా?' అని ఆసక్తికర ప్రశ్న అడిగింది. దానికి జవాబుగా 'తెలియదు గానీ.. మా నాన్న.. అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటా. బాబాయికైనా, డాడీకైనా, నాకైనా.. మా అందరికీ బాసు మా అమ్మే.' అని తెలిపాడు రామ్ చరణ్. ఈ సమాధానం విన్న చిరంజీవి 'అది నన్ను చూసి నేర్చుకున్నావ్. సుఖపడతావ్. వాళ్లతో పెట్టుకోవద్దు.' అని నవ్వుతూ పేర్కొన్నారు. చదవండి: ఇంతకుముందు చూడని మెగాస్టార్‌ను చూస్తారు: మెహర్ రమేష్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అప్పుడు చాలా అవమానంగా అనిపించింది: చిరంజీవి
‘‘రాజమౌళిగారు ఓ బాట వేశారు. ఇక ఏ డైరెక్టర్ తీసినా సరే అది ఇండియన్ సినిమా అయిపోతుంది. మొన్న సుకుమార్‌గారు తీసిన ‘పుష్ప’ ఇండియన్ సినిమా అయిపోయింది. ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ పాన్ ఇండియన్ అయిపోయింది. అల్లు అర్జున్, యశ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్.. అఫ్కోర్స్ వీరందరి కంటే ముందు ప్రభాస్... పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యారు. కంటెంట్‌లో బలం ఉంటే ఏ ప్రాంతం వారయినా అందరూ పాన్ ఇండియన్ స్టార్సే. అన్నీ పాన్ ఇండియా చిత్రాలే, అందరూ పాన్ ఇండియా డైరెక్టర్సే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలు చెరిగిపోవాలి. భాషతో సంబంధం లేకుండా ఇది ఇండియన్ సినిమా. ప్రతి యాక్టర్ కూడా ఇండియన్ యాక్టర్.. అనేది రావాలి.. వచ్చింది’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ – ‘‘1988లో నాగబాబు ‘రుద్రవీణ’ సినిమా నిర్మించారు. ఆ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకోవడానికి మేం ఢిల్లీ వెళ్లాం. కార్యక్రమానికి ముందు హైటీ ఉంటుంది. ఆ హాలులో ఇండియా సినిమా వైభవం అంటూ కొన్ని సినిమాల పోస్టర్స్, యాక్టర్స్.. అంటూ క్లుప్తంగా కొంత నోట్స్ ఉంది. పృథ్వీ రాజ్‌కుమార్, దిలీప్‌కుమార్, దేవానంద్, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్రగార్ల ఫొటోలు ఉన్నాయి. ఎమ్జీఆర్గారు, జయలలితగారు ఉన్న స్టిల్ వేసి సౌత్ సినిమా అని రాశారు. ఆ తర్వాత ప్రేమ్ నజీర్‌గారి ఫోటో ఉంది. అంతే... కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌గారిది కానీ విష్ణువర్ధన్ గారిది కానీ, మన గొప్ప నటులు ఎన్టీ రామారావుగారు, నాగేశ్వరరావుగార్లు కానీ, తమిళంలో శివాజీ గణేశన్ గారి ఫోటోలు కానీ లేవు. ఆ సమయంలో నేను చాలా హ్యూములిటీకి లోనయ్యాను. చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమా అంటే ఏదో హిందీ సినిమా అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు. ఇటు ప్రాంతీయ సినిమాలకు కూడా సరైన గౌరవం ఇచ్చినట్లు నాకు అనిపించలేదు. ఆ తర్వాత నేను మద్రాస్‌లో కూడా ఈ విషయాలను ప్రెస్‌తో పంచుకున్నాను. కానీ నా ప్రశ్నలకు సమాధానం రాలేదు. ఆ తర్వాత తర్వాత నేను గర్వపడేలా, రొమ్ము విరుచుకునేలా తెలుగు సినిమా హద్దులు, ఎల్లలు చెరిపేసింది. మావన్నీ ఇండియన్ సినిమాలే అని ప్రతి ఒక్కరు గర్వపడేలా, ఆశ్చర్యపోయేలా ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’.. ఇలాంటి సినిమాలు మనం రొమ్మువిరుచుకుని నిలబడేలా చేశాయి. అలాంటి సినిమాల రూపకర్త రాజమౌళి. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళిగారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన రాజమౌళిని సభాముఖంగా అభినందిస్తున్నాను. రాజమౌళిగారు ప్రోత్సహించడం వల్లే ‘ఆచార్య’ సాధ్యమైంది. చరణ్‌ను, నన్ను కలిసి స్క్రీన్‌పై సురేఖ చూడాలనుకుంటున్నారని చెప్పిన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పటికీ చరణ్ ‘ఆచార్య’ చేయడానికి రాజమౌళిగారు ఒప్పుకున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి మా ఇంటి సభ్యుడైపోయారు. ‘డాడీ సినిమాలో నేను కనబడితే చాలు అని!’ శివతో చరణ్ అన్నాడట. నేనంటాను... చరణ్ ఉన్న తర్వాత నేను కనపడతానా? లేదా? అన్న డౌట్ వచ్చింది. రాజమౌళిగారితో సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోలకు, వారి తర్వాతి సినిమాలు ఫ్లాప్స్ అనే టాక్ విన్నాను. అది ‘ఆచార్య’ రూపుమాపుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ మరో హిట్ అవుతుంది’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘మగధీర’ టైమ్‌లో కథ చెప్పినపుడు చరణ్ విషయాలు చిరంజీవిగారే దగ్గరుండి చూసుకుంటారనుకున్నాను. కానీ తర్వాతి కాలంలో చిరంజీవిగారు చరణ్‌కి ఎటువంటి సలహాలు ఇవ్వరని తెలుసుకున్నాను. తన తప్పులను దిద్దుకొని, దర్శకుడు చెప్పిన ప్రతీది నేర్చుకొని, తనకు తానుగా ఎదిగిన వ్యక్తి రామ్‌చరణ్. చిరంజీవిగారు తనతో కలిసి నటించే వ్యక్తులతో, చివరికి ఆయన కొడుకైనా కూడా తానే డామినేట్ చేయాలని కోరుకుంటారు. ఇది చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. చిరంజీవిగారి అభిమానిగా చెబుతున్నా... చిరంజీవిగారు ఎంత బాగా నటించినా నా హీరో చరణే.. సినిమాలో బాగా నటించాడు (నవ్వుతూ). మంచి సందేశాలిచ్చే సినిమాల దర్శకుడు కొరటాల శివ. మాస్ చిత్రంగా ముందుకు వస్తున్న ‘ఆచార్య’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘‘నాన్ కరెప్ట్ ఇండస్ట్రీ ఇండియాలో ఉందంటే అది సినిమా ఇండస్ట్రీనే. సినిమాల ద్వారానే నిజమైన గౌరవం, గుర్తింపు లభిస్తాయి. నేను మా నాన్నగారిని ఇన్నేళ్లుగా చూసి ఎంత నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ, మారేడుమిల్లిలో 20 రోజులు నాన్నగారితో నటించి, దగ్గరగా చూసి నేర్చుకున్న అనుభవాలతో పోలిస్తే ఈ 20 ఏళ్లు నథింగ్ అనిపించింది. నాన్నగారితో నటించడం డబుల్ బొనాంజాలా భావిస్తున్నా. మా నిర్మాతలు పెద్ద పిల్లర్స్‌గా నిలిచారు’’ అన్నారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘1991లో నిర్మల్‌లోని ఓ థియేటర్‌కు వచ్చారు చిరంజీవిగారు. రోడ్లపై ఉన్న ఆ జనసందోహంలో నేనూ ఒకడిని. చిరంజీవిగారిని కలిస్తే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయనతో సినిమా చేయగలిగా. యాక్టర్స్, రెమ్యునరేషన్స్ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అసలు పారితోషికం తీసుకోకుండానే సినిమా చేశారు. సినిమా రానివ్వండి.. వచ్చిన తరవాత తీసుకుంటాము అని నాకు సపోర్ట్ చేసిన నా ఇద్దరు హీరో (చిరంజీవి–చరణ్)లు, దర్శకుడికి థ్యాంక్స్. సినిమాల బిజినెస్ ఆంధ్రాలో ఎక్కువగా ఉండేది. తెలంగాణలో తక్కువ. అలా తెలంగాణలో బిజినెస్ పరంగా కోటి, రెండు కోట్లు, మూడు కోట్లు .. ఇలా సినిమాల కలెక్షన్స్ పెరిగాయి. ఫలితంగా థియేటర్స్ పెరిగాయి. చిరంజీవిగారి సినిమాలతోనే అది జరిగింది. ఈ రోజు తెలుగు సినిమా పాన్ ఇండియా గురించి ఆలోచించగులుతోందంటే కారణం చిరంజీవిగారే’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారి సినిమాల టికెట్ల కోసం కొట్టుకొని చొక్కాలు చించుకున్నాం. ఆయన్ను చూస్తే చాలు, కలిస్తే చాలనుకుంటే ఇప్పుడు ఆయనతో కెమెరా, యాక్షన్ అంటూ సినిమాకి దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. సినిమాకు ‘ఆచార్య’ అని టైటిల్ పెట్టాం. కానీ మాకు చిరంజీవి అనే ఒక ఆచార్య దొరికారు’’ అన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఈ సినిమాలో మాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు: రామ్‌చరణ్ వెబ్ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న మోడల్ -
'ఆచార్య' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
40 గంటలు నిద్ర లేకుండా షూటింగ్ చేశాను: చిరంజీవి
చిరంజీవి ఇంకా అర్ధాకలితోనే ఉన్నారు.. ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు ఉన్న సెలబ్రిటీకి ఆకలా? మెత్తటి పరుపులు ఉన్న స్టార్‌కి నిద్ర లేని రాత్రులా? ఎందుకు? నటన మీద ఉన్న ఆకలి అది.. వృత్తి మీద ఉన్న ప్రేమ అది.. అందుకే మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు మెగాస్టార్. ‘ఆచార్య’ రిలీజ్ సందర్భంగా ‘సాక్షి’కి చిరంజీవి ఇచ్చిన ‘ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ’ విశేషాలు. ► ‘ఆచార్య’ మీ సినిమాలా ఉంటుందా? లేక మీ చెర్రీ (రామ్‌చరణ్) సినిమాలానా? చిరంజీవి: నాలానో, రామ్చరణ్లానో ఉండదు.. కొరటాల శివగారి సినిమాలా ఉంటుంది. ఓ మంచి సందేశాత్మక కథకు మాస్ కమర్షియల్ అంశాలన్నీ కలిపి ప్రేక్షకుల మన్ననలు పొందేలా తన స్టైల్లో తీశారు. ఒక వైవిధ్యమైన నేపథ్యానికి సమకాలీన విషయాలను తీసుకున్నారాయన. నేను, చరణ్ ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి మా నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవి పూర్తిగా ఇచ్చే ప్రయత్నం చేశారు శివగారు. ఆయన్నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలు కూడా ఉంటాయి. ► 150 సినిమాలకు పైగా చేసిన మీరు ఎన్నో కథలు విన్నారు. ఇప్పుడు ‘ఆచార్య’ కథ విన్నప్పుడు ఏమనిపించింది? ఎవరైనా కథ వింటారు. కానీ, నేను కథను వినను.. చూస్తాను. అంటే.. ఇలా ఉంటుంది అని విజువలైజ్ చేసుకుంటాను. అలా కథని చూస్తున్నప్పుడు మనసుని, ఎమోషన్స్‌ని టచ్ చేస్తే చాలు.. వెంటనే ఓకే చెప్పేస్తాను. నా సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ కథ విన్నప్పుడే ఓకే చెప్పినవి తప్ప రెండు మూడుసార్లు విని, రికార్డు చేసుకుని మళ్లీ అవగాహన చేసుకుని ఓకే చెప్పలేదు. స్పాంటేనియస్‌గా నా మనసు స్పందిస్తే వెంటనే ‘యస్’ చెప్పేస్తాను. ‘ఆచార్య’కి నాకు, కొరటాలకి మధ్య ఒకే ఒక మీటింగ్ జరిగింది. కథ వినగానే మంచి అనుభూతి వచ్చింది.. చేద్దామని చెప్పాను. ► ఈ సినిమాలో మీరు, చరణ్ ఉండటం డబుల్ ధమాకా. మీ ఇద్దరి పాత్రలనూ దర్శకుడు బ్యాలెన్స్ చేయగలిగారా? మా ఇద్దర్నీ బ్యాలెన్స్ చేయడం కోసం శివ గారు ఏమీ చేయలేదు. కథకు అనుకూలంగానే మా పాత్రలు మలిచారు. అంతేకానీ బ్యాలెన్స్ గురించి ఆలోచించలేదు. ► నిజానికి చరణ్‌ది చిన్న పాత్ర అనీ, ఆ తర్వాత పెంచారనీ వార్తలు వచ్చాయి.. మరి నిజమేంటి? చరణ్‌ది చిన్న పాత్ర అని ఎందుకు అనుకున్నారో తెలియదు. కానీ ఫస్ట్ నుంచీ తనది ఫుల్ లెంగ్త్ క్యారెక్టరే.. తర్వాత పెంచలేదు. చెప్పాలంటే ఫస్టాఫ్ హీరో నేను.. సెకండాఫ్ హీరో చరణ్. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇచ్చే ఫినిషింగ్ హృద్యంగా ఉంటుంది.. గుండె కదిలేలా ఉంటుంది. నేనీ సినిమాకి ‘యస్’ చెప్పడానికి అదే ప్రధాన కారణం. అది క్లయిమాక్స్‌కి ముందు చూస్తారు. సెకండాఫ్‌లో 50 శాతం చరణ్ ఉంటాడు.. మిగతా 50 శాతం ఇద్దరం కలిసి ఉంటాం. అందుకే డబుల్ ధమాకా అనేది కరెక్ట్ మాట. ► ‘భలే భలే బంజారా..’ పాటలో ‘తగ్గు...’ అని చరణ్‌ని అన్నారు? ఇప్పుడందరూ ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ యుఫోరియాలో ఉన్నారు. ‘నాటు నాటు’ పాటలో కుర్రాళ్లు (రామ్‌చరణ్–ఎన్టీఆర్) వీరకొట్టుడు కొట్టేశారు.. ‘ఓ మై గాడ్’ అనిపిస్తుంది. అందుకని ‘ఆచార్య’లోనూ చరణ్ నుంచి డ్యాన్స్‌లు ఎక్స్పెక్ట్ చేస్తారని, ఆ రకంగా చరణ్ ఉంటే నేను తేలిపోతానని తగ్గు అన్నాను (నవ్వుతూ). ‘నేను ఎంత ప్రయత్నించినా ఆ స్టైల్, మూమెంట్స్‌తో మీరు కొట్టేస్తారు డాడీ’ అని చరణ్ అన్నాడు. ► ‘ఆచార్య’లో ఇటు భక్తి అటు నక్సలిజమ్ని ఎలా మ్యాచ్ చేయగలిగారు? అదే శివ మ్యాజిక్. ఆయన మ్యాజిక్‌తో ‘ఆచార్య’ని అద్భుతంగా మలిచారు. మా సినిమా డ్రమటిక్ డైలాగ్స్‌తో ఫుల్ మాస్‌లా ఉండొచ్చు కానీ ఆయనలా కూడా... అంటే నిండు గోదావరిలో హాయిగా పడవ ప్రయాణంలా ఉంటుంది. కానీ నది కింద కరెంటు హెవీగా ఉంటుంది. ఆ కరెంట్ అన్నది ఈ సినిమాలో కమర్షియల్‌గా కనిపిస్తుంది. ► ‘భలే భలే బంజారా..’ పాట తీస్తున్నప్పుడు మీ అమ్మ (అంజనాదేవి), చరణ్ అమ్మ (సురేఖ) సెట్స్‌లో ఉన్నారు. మీ సతీమణిని ఇంప్రెస్ చేయాలని స్టెప్పులు వేశారా? లేక మీ అమ్మగారిని ఆనందపరచాలనా? తమ బిడ్డలు బాగా చేశారనిపించుకోవాలనే అందమైన పోటీ ప్రతి తల్లి ప్రేమలో ఉంటుంది. మా అబ్బాయి బాగా చేశాడని మా అమ్మ అంటే.. లేదు మా అబ్బాయే బాగా చేశాడని సురేఖ.. ఇలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరి ప్రెజెన్స్‌లో మేమిద్దరం షూటింగ్ చేయడం అనేది మాకు మంచి అనుభూతి. ► మామూలుగా రాజమౌళి తనతో సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరోలు వేరే సినిమా చేసేందుకు ఒప్పుకోరు.. మరి ఒకవైపు ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న చరణ్‌కి ‘ఆచార్య’ చేయడానికి అనుమతి ఎలా లభించింది? ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభమైనప్పుడే ‘ఆచార్య’ కూడా దాదాపు ప్రారంభమైంది. ముందు నా పాత్ర, ఇతర సన్నివేశాలన్నీ పూర్తి చే సి, క్లైమాక్స్ తీసేటప్పుడు చరణ్ వస్తే సరిపోతుందని కొరటాల అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో వైవిధ్యమైన గెటప్పులు ఉన్నాయి కాబట్టి మధ్యలో చరణ్‌ని బయటికి వదల్లేను అని రాజమౌళి అన్నారు. కానీ కరోనా వల్ల, షూటింగ్‌కి ఎక్కువ సమయం పట్టడం వల్ల రాజమౌళి ఒక్కటి ఆలోచించారు. ‘‘ఆచార్య’లోని సిద్ధ పాత్రను ఏ హీరో అయినా చేయొచ్చేమో కానీ నువ్వు (రామ్‌చరణ్) చేస్తే వచ్చే అందం, నిండుదనం వేరుగా ఉంటాయి. పైగా కొరటాలగారు కూడా అడిగారు కాబట్టి నువ్వు ‘ఆచార్య’ చెయ్. నేను అడ్జెస్ట్ చేసుకుంటాను’’ అన్నారు రాజమౌళి. సిద్ధ పాత్ర చరణ్ చేస్తేనే అందం వస్తుంది.. తనే ఎందుకు చేయాలి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ పాత్రలో ఇంకో హీరోని ఊహించుకోలేం. అంటే నటన పరంగా కాదు... మాకున్న బంధం పరంగా కూడా ఆ సినిమా చేయాలి. ► బంధం అంటున్నారంటే సినిమాలోనూ తండ్రీకొడుకులుగా కనిపిస్తారా? ఈ సినిమాలో మాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు. కానీ, ఆ అనుభూతి వస్తుంది. అదే కొరటాల మ్యాజిక్. ‘ఆచార్య’లో నేను కానీ, చరణ్ కానీ.. ఏ ఒక్కరు లేకున్నా వర్కవుట్ కాదు. ► కెరీర్ స్టార్టింగ్‌లో వరుసగా నాలుగైదు సినిమాలు చేసినట్లు ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది? (నవ్వేస్తూ)... ఎనర్జీ అనేది ప్యాషన్ నుంచి వస్తుంది. నా నరనరాల్లో, అణువణువు సినిమా పట్ల ప్యాషన్ ఉంది. ఆ ఇష్టం జీవితకాలం ఉంటుంది.. అది మధ్యలో పోయేది కాదు. నేను ఎప్పుడు మేకప్ వేసుకున్నా, కెమెరా ముందు నిలబడినా, నా ముఖంపై ఆ లైట్లు పడినా ఎనర్జీ అనేది అలా పెల్లుబికి వస్తుంది. ► ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు.. పైగా దాదాపు 40 గంటలు నిద్ర లేకుండా షూటింగ్ చేశారట.. యస్... ఈ మధ్య ఓ రెండు సినిమాల షూటింగ్‌ని వెంట వెంటనే చేశాను. ముంబైలో సల్మాన్ ఖాన్‌తో ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్లో పాల్గొని, మరో సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ‘గాడ్ ఫాదర్’కి ఒక మేకోవర్, ఇంకో సినిమాకి ఇంకో మేకోవర్. పుణె నుంచి వచ్చీ రాగానే ఈ సినిమాకి తగ్గట్టుగా రెడీ అయ్యాను.. షూటింగ్‌కి వెళుతూ ‘అమ్మా.. వెళ్లొస్తాను’ అని అమ్మకు చెప్పాను. ‘ఎందుకు నాన్నా... ఇంత కష్టపడతావు?’ అని అమ్మ అన్నారు. ఒకప్పుడు నేను బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తే.. ‘ఇంత కష్టపడాలా?’ అని అమ్మ అనేవారు. ‘అమ్మా.. ఇంత కష్టపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? కష్టపడాలనే మనస్తత్వం ఉన్నా కూడా మనకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కావాలి కదమ్మా’ అనేవాడిని. ఇప్పుడు కూడా అంతే కష్టపడుతున్నానని ఆమె ఫీలింగ్. ఇప్పుడు అమ్మతో ‘యంగ్‌స్టర్స్‌తో పోటీ పడేలా నాకు వెంట వెంటనే మంచి సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఎంత కష్టపడి చేస్తే నేను అంత హుషారైపోతాను. ద బెస్ట్ ఇస్తుంటాను. నీ ఆశీర్వాదాలు కావాలమ్మా నాకు. అయ్యో.. నా బిడ్డ అని జాలి పడకు’ అంటుంటాను. ‘నేను బాధపడితే నీ ఉత్సాహం తగ్గిపోతుంది అంటున్నావు కాబట్టి నీ కోసం అయితే నేను పైకి అనను రా.. కానీ లోపల ఫీల్ అవుతాను... జాగ్రత్త నాన్న..’ అని అమ్మ అన్నారు. అమ్మల మనసు అంతే.. ఇక ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్ హుషారుగా చేస్తున్నాను కానీ నా కళ్లు పొడిబారిపోతున్నాయి. అప్పటికి 40 గంటల్లో నిద్రపోలేదు. ట్రావెలింగ్.. షూటింగ్‌తో సరిపోయింది. నా కళ్లు పొడిబారడం చూసి, యూనిట్లో అందరికీ గడచిన 40 గంటల్లో నేను నిద్రపోలేదని తెలిసింది.. ఆశ్చర్యపోయారు. అయితే నిద్ర పోతే పోయింది కానీ షూటింగ్ తాలూకు ఎంజాయ్మెంట్ మాత్రం ఫుల్లుగా దక్కింది. ► అమ్మ బాధ చెప్పారు... మరి మీ సతీమణి ఏం అన్నారు? రేఖ కూడా అమ్మలానే అంటుంది. ‘ఏంటండీ ఇప్పుడూ ఇంత కష్టపడాలా... ఇంత బిజీనా’ అని రేఖ అంటే.. ‘రేఖా... నా నుదుటిపై చెమటి బిందువులు మెరవకపోతే నీ మెడలో ఏదీ మెరవదూ’ అన్నాను (నవ్వులు...). ఇక అప్పటినుంచి అవి (నగలు) పెట్టుకున్నప్పుడల్లా మీ చెమటను ముట్టుకున్నట్లు ఉంటుంది నాకు’ అని రేఖ అంటుంటుంది. ఈ మధ్య కూడా నగలు పెట్టుకున్నప్పుడు ఇలానే అని నవ్వింది. ► యాక్చువల్లీ కెరీర్ ఆరంభంలో అవకాశాలు దక్కకపోతే నిద్రలేని రాత్రులు ఉంటాయి.. అయితే స్టార్డమ్ వచ్చాక మీ ‘ప్లాటర్ ఫుల్’ అనే పరిస్థితుల్లోనూ నిద్ర త్యాగం చేసి, సినిమాలు చేస్తున్నారు.. ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం అనే కిక్ ఉంది చూశారు... అది మామూలుగా ఉండదు. సినిమాల్లో అవకాశం వస్తే చాలు.. ఏ త్యాగం చేయడానికైనా సిద్ధం అన్నట్లుగా చాలామంది ఉన్నారు. డబ్బులు కూడా వద్దు.. వెండితెరపై మా బొమ్మ పడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. నా అభిప్రాయం ఏంటంటే ‘ప్లాటర్ ఫుల్’ అయ్యాక కూడా కష్టపడాలనే ఆ ఆకలిని జీవితాంతం ఉంచుకోవాలి. అప్పుడే వందశాతం ఉద్యోగానికి న్యాయం చేసినవాళ్లం అవుతావు. కడుపు నిండిన వ్యవహారంలా జాబ్ చేస్తే అన్యాయం చేసినవాళ్లం అవుతాం. అలా అన్యాయం చేసేవాళ్లకు నేను ఒకే ఒక సలహా ఇస్తా... ‘పని చేయవద్దు. విరమించుకో..’. ఎవరికోసం చేస్తున్నావ్. కడుపు నిండిపోయింది. బ్యాంకు బ్యాలెన్స్ నిండిపోయింది కదా అని ఒక క్రమశిక్షణ లేకుండా లేట్‌గా రావడంతో పాటు నిర్లక్ష్య వైఖరితో పని చేయడం వల్ల బాగా తీయాలన్న డైరెక్టర్ ఉత్సాహం నీరుగారిపోతుంది. అందుకే ఎప్పుడూ అర్ధాకలితోనే ఉండాలి. సినిమా పరంగా, నటన పరంగా వస్తే నేను ఎప్పటికీ అర్ధాకలితోనే ఉంటాను. ‘ఆచార్య’ షూటింగ్ అప్పుడు నేను ఒక్కరోజు కూడా సెట్స్‌కు ఆలస్యంగా వెళ్లలేదు. కొరటాల శివ: ఒకరోజు ‘ఆచార్య’ షూటింగ్‌ని ఉదయం ఎనిమిది గంటలకు సెట్ చేశాం. ‘దారిలో ఉన్నాను.. ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయ్యేలా ఉంది. వేరే షాట్ పెట్టుకుంటారా?’ అని చిరంజీవిగారు ఫోన్ చేశారు. అయితే మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ 7 గంటల 45 నిమిషాలకే సెట్స్‌లోకి వచ్చారు చిరంజీవి: ట్రాఫిక్ క్లియర్ అయింది... వచ్చేశాను.. (నవ్వులు..) ► షూటింగ్ లొకేషన్లో చిన్న ఆర్టిస్టులతో సరదాగా మాట్లాడుతున్నారట... కనీసం మీ ‘కార్‌వ్యాన్’లో కూడా కూర్చోవడంలేదట.. యాక్టర్స్‌గా మన కంఫర్ట్ కోసం కార్‌వ్యాన్ ఉండాలి. ఆ సౌకర్యాలను వినియోగించుకోవాలి. కానీ ఐసొలేట్ అయిపోవడానికి వాడకూడదు. షూటింగ్ గ్యాప్‌లో మనసు విప్పి మాట్లాడితే తోటివారికి దగ్గర కావొచ్చు. అందరికీ దగ్గర కావడానికి టీ బ్రేక్, భోజన సమయం మంచి అవకాశాలు. షాట్ గ్యాప్‌లో ఆర్టిస్టులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సెట్స్‌లో మంచి వాతావరణం ఉంటుంది. జబర్దస్త్ యాక్టర్స్ నాతో మాట్లాడటానికి కొంచెం సిగ్గు, కొంచెం భయంతో ఉంటారు. కానీ సెట్స్‌లో నేనే వారితో మాట్లాడితే వారి మనసు సంతోషపడుతుంది. అలా సెట్స్‌లో ఒక పాజిటివ్ వైబ్ రావడానికి నా వంతు కృషి చేస్తుంటాను. సెట్స్‌లో మేమంతా ఉత్సాహంగా ఉంటే డైరెక్టర్స్‌కు బాగుంటుంది. అంతేకానీ ఓ ఐదు నిమిషాల షాట్ గ్యాప్‌లో కూడా హీరో కార్వేన్లోకి వెళ్లిపోతే మళ్లీ ఆ హీరో షాట్లోకి రావడానికి మరో పది నిమిషాల సమయం పడుతుంది. ఇలా ఒకరోజులో చాలాసార్లు పది నిమిషాలు వృథా అయిపోకూడదు. అదే హీరో అలర్ట్‌గా ఉన్నాడంటే లొకేషన్లో అందరూ అలర్ట్‌గా ఉంటారు. చరణ్ అయితే సెట్లోనే ఓ టెంట్ వేసుకుని లొకేషన్లో అందరితో కలిసిపోయి ఉంటాడు. ఇంటి వంటకాలను అందరికీ రుచి చూపిస్తాడు. నేను, కొరటాల, తిరు (కెమెరామేన్) బ్రేక్పాస్ట్ అయితే మా ఇంటి నుంచే లాగించేవాళ్లం. తిరు అయితే.. సార్.. ఇంతలా టిఫిన్ చేస్తే.. నాకు ఫస్ట్ షాట్‌కే నిద్ర వస్తుంది అనేవారు (ఫుల్ నవ్వులు..) మా సినిమా షూటింగ్‌లు వేడుకల్లా జరుగుతుంటాయి. ► ‘ఆచార్య’లో పాన్ ఇండియా స్టార్ (చరణ్)తో చేశారు.. నిజానికి ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కానీ.. గతంలో మీరు హిందీలో ‘ఆజ్ కా గూండారాజ్’ వంటి సినిమాలు చేసి, అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అయ్యారు కదా.. ఏమంటారు? అంతేగా.. (నవ్వుతూ). అప్పట్లో నేను హిందీలో చాలా సినిమాలు చేశాను. అయితే ఒకప్పుడు ఇండియాలో తెలుగు అనే ఒక ప్రాంతీయ భాషా సినిమా ఉందని మన పక్కనే ఉన్న ముంబై వాళ్లకు కూడా తెలియదు. ‘శంకరాభరణం’ సినిమా వచ్చేవరకూ ఆ పరిస్థితి ఉంది. ‘క్లాసిక్ సినిమా, అద్భుతంగా ఉంది. ఇది తెలుగు సినిమానా?’ అనుకునేదాకా ‘శంకరాభరణం’ తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా మరుగున పడిపోయింది. 80వ దశకంలో ఎప్పుడు చూసినా సరే మద్రాసు సినిమాలు అనేవారు.. మహా అయితే తమిళ సినిమాల గురించి చెప్పుకునేవారు. మలయాళ సినిమా వారు అవార్డులు తెచ్చుకున్నారు తప్ప కన్నడ, తెలుగు సినిమాలకు గుర్తింపే లేని రోజులను చూశాను. చాలా బాధపడ్డాను. ఇప్పుడు రాజమౌళి ఈ హద్దులు, సరిహద్దులను చెరిపేశాడు. సినిమాల పరంగా రాజమౌళి తెలుగుకి ఒక గర్వకారణంలా గౌరవం, గుర్తింపు తీసుకొచ్చాడు. అతని మూలంగా తెలుగులో ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాలు, కన్నడలో ప్రశాంత్ నీల్ తీసిన ‘కేజీఎఫ్’.. వీటి మూలంగా వాళ్ల అస్తిత్వం చెక్ చేసుకునే పరిస్థితిని బాలీవుడ్‌కి కల్పించారు ఈ దర్శకులు. ఆ తర్వాత అందరూ మనవైపు దృష్టి సారించారు. ఇవి ప్రాంతీయ భాషా చిత్రాలు కాదు.. మనమందరం ఇండియన్స్.. ఇది ఇండియన్ సినిమా అనే కీర్తిని తీసుకొచ్చినందుకు రాజమౌళికి హ్యాట్సాఫ్. ► తండ్రీ కొడుకు పోటాపోటీగా నటించి ఉంటారు.. అలాగే ఎక్కువమంది జూనియర్ ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకునే పరిస్థితి ఉండేదేమో.. కొరటాల శివ: టేక్స్ అనేవి చిరంజీవి సార్‌కు ఉండవు. ఒక్కోసారి సార్ పక్కవారి కోసం మళ్లీ చేస్తారు. ఓ షాట్లో ఓ జూనియర్ ఆర్టిస్టు తప్పు చేసినా సరే ఓ దర్శకుడిగా నాకు కంగారు వచ్చేది. ఆ జూనియర్ ఆర్టిస్టు దగ్గరకు మేము పరిగెత్తాలి. కానీ ఈలోపే చిరంజీవి సార్ ఆ ఆర్టిస్టుని దగ్గరకు తీసుకుని ‘నువ్వు ఇలా చేస్తే.. మనం ఇద్దరం సింక్‌లో ఉంటాం’ అని చెప్పేవారు. అంటే.. సార్ వారి కోసమే వన్ మోర్ టేక్ చేసే పరిస్థితి. సినిమా పట్ల చిరంజీవిగారికి ఉన్న ప్రేమ అద్భుతం. చిరంజీవి: ఓ పెద్ద ఫ్రేమ్‌లో మనం ఉన్నప్పుడు ఓ చిన్న తప్పు జరిగినా అది పంటి కింద రాయిలా అనిపిస్తుంది. ‘అయినా.. ఆ చిన్న తప్పును ఎవరు గమనిస్తారండీ.. చాదస్తం’ అని కొందరు అంటారు. కానీ.. ప్రతి ఫ్రేమూ పర్ఫెక్ట్గా ఉండాలి. నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అని డైరెక్టర్లు టేక్ ఓకే చెప్పవచ్చు. కానీ హీరోగా నేనే దర్శకుడి ఇబ్బందిని అర్థం చేసుకుని చొరవ తీసుకుని మళ్లీ చేస్తా అంటాను. అప్పుడు డైరెక్టర్స్ కూడా హ్యాపీగా ఫీలవుతారు. ► ఏపీలో టికెట్ల ధరల గురించి ఏమంటారు? టికెట్ల ధరల విషయంపై ప్రభుత్వం స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్‌లైన్స్ వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. సినిమా బడ్జెట్‌ని బట్టి టికెట్ ధరల పెంపుపై వెసులుబాటు అనేది ఉంటుంది. కచ్చితంగా ‘ఆచార్య’ సినిమాకు ఏదో ఒక వెసులుబాటు ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. జగన్‌గారు (ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి) ఏ గైడ్‌లైన్స్ అయితే ప్రతిపాదించి జీవోగా ఇచ్చారో దాని ప్రకారం అన్ని రకాల సినిమాలకు న్యాయం జరుగుతుంది. ఆ ప్రకారం ఆయన ఇచ్చిన ప్రోత్సాహానికి మరోసారి ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే.. ఏపీలో 20శాతం షూటింగ్స్ చేయాలనే నిబంధనని ప్రభుత్వం పెట్టకముందే మేము మారేడుమిల్లి అడవుల్లో దాదాపు 25 శాతం షూటింగ్ చేశాం. చదవండి 👉 నడిచే నేల, పీల్చే గాలి మీద వారి సంతకం ఉంటుంది, వారి త్యాగాలను మరవద్దు ► భవిష్యత్‌లో రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతారని చాలామంది ఆలోచన.. దీనిపై? అస్సలు ఇన్వాల్వ్ కాను.. ఆ డౌట్ అక్కర్లేదు. ► వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే విషయం గురించి? సినిమా షూటింగ్‌లకు, సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాలుగా చాలా అనుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన లొకేషన్స్ వైజాగ్‌లో ఉన్నాయి. ఎలాగైతే అప్పట్లో చెన్నైలో ఉన్న పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చిందో, ఇప్పుడు హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతూనే, సినీ పరిశ్రమకు మరో శాఖగా వైజాగ్‌లో కూడా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. ఔత్సాహిక కళాకారులు ఉన్నారు. నిర్మాతలు, సాంకేతిక నిపుణుల సంఖ్య పెరుగుతోంది. ఆర్టిస్టులు అటూ ఇటూ వెళ్తారు. 20 శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో జరగాలన్న ప్రభుత్వ ప్రతిపాదన మంచి విషయం. దీనివల్ల చాలా మందికి ఉపాధి, ప్రోత్సాహం లభిస్తాయి. ► మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు సెట్స్‌లో ఎలా చేయాలి? అని ఇంట్లో చరణ్, మీరు మాట్లాడుకునేవారా? చరణ్‌కి సలహాలిచ్చారా? ఇంటికి వెళ్లాక ఇక ఇంట్లో సినిమా అనే మాట వినపడదు. నేనే కాదు.. పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్.. సినిమాల గురించి మాట్లాడుకోం. సినిమా అన్నది సెట్స్ వరకే. అది మా వృత్తి. దాన్ని మేం ఇంట్లోకి తీసుకురాము. కానీ ఆ సినిమా హిట్ అయితే సెలబ్రేషన్స్ మాత్రం ఇంట్లో ఉంటాయి. ఇక సలహాలిచ్చే విషయం గురించి చెప్పాలంటే.. నేను ఏ రోజూ ఎవరికీ నటన విషయంలో సలహా ఇవ్వను. సీన్లో సింక్ కోసం తప్పిస్తే.. ఇలా చేయమని ఎవరికీ సలహా ఇవ్వను. చరణ్‌కు కూడా ఇవ్వను. ఎందుకంటే ఇలా చేయాలని నేను సలహా ఇస్తే వాళ్ల నటన నేను చెప్పినట్లుగా ఉంటుంది కానీ వాళ్లు చేసినట్లుగా ఉండదు. నటన అనేది మన సహజమైన ప్రవర్తన. ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. ఒకరి ఒరిజినాలిటీతో కూడిన ఆర్గానిక్ ఫీల్ పోకుండా ఉండాలంటే వేరొకరు ఒకరికి నటన పరంగా సలహాలు ఇవ్వకూడదన్నది నా సలహా. ► ‘ఆచార్య’ సినిమాకు మహేశ్‌బాబు వాయిస్ ఇవ్వడం గురించి.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇండస్ట్రీలో రావాలి. సరే... ఇలాంటి మంచి వాతావరణం కోసం నువ్వు ఏం చేశావ్ అని నన్నడిగితే... ‘కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. కొన్ని ఈవెంట్స్‌కు నన్ను అతిథిగా రమ్మన్నప్పుడు వెంటనే అంగీకరించాను. నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న ఎస్ఎమ్ఎస్ ఇచ్చినా చాలు. రెస్పాండ్ అవుతాను. కొందరు మా ఇంటికే వచ్చి పోస్టర్లు రిలీజ్ చేయించుకుంటారు. నాకు టైమ్ దొరికితే హెల్ప్ చేస్తాను. ఒక సినిమా గురించి ఇంట్లోనే ఓ బైట్ ఇవ్వడం, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయడం, ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ‘ఓ పిట్టకథ’, రీసెంట్గా ‘మిషన్ ఇంపాజిబుల్..’ ఇలా చాలా సినిమాల ఫంక్షన్స్‌కు వెళ్లాను. ఇలా ప్రోత్సహించడం నా బాధ్యత అనుకుంటాను. ఏదో రకంగా హెల్ప్ చేస్తాను. అందరూ ఫాలో అవుతారని నా ఒపీనియన్. ► మీరు ఇండస్ట్రీ పెద్ద అనేది కూడా ఒక టాపిక్.. దీని గురించి ఏమంటారు? ‘ఇండస్ట్రీ పెద్ద’ అనే మాటను నేను ఎంటర్టైన్ చేయను. నేనే కాదు.. ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీ పట్ల తమ వంతు బాధ్యత వహించి తీరాలి. ఇండస్ట్రీ నుంచి ఎంతో కొంత మనం పొందుతున్నప్పుడు ఎంతో కొంత ఇవ్వడం కూడా ఉండాలి. ఇండస్ట్రీకి ఏం వచ్చినా సరే భుజం కాసేలానో, చేయూత ఇచ్చేలానో, ఆపన్నహస్తం అందించేలానో ఉంటాను.. అది నా బాధ్యత. దానికి పెద్ద అనే ఒక పదవి అవసరం లేదు. ఆయా సమయాలు, పరిస్థితులు, ఆయా సెక్టార్లను బట్టి ప్రతివారూ ఆ బాధ్యత వహించాలి. అది ఏ ఒక్కరో తీసుకునే బాధ్యత కాదు. నా వంతు బాధ్యతగా ఇండస్ట్రీకి ఏ అవసరం వచ్చినా నేను వందశాతం సపోర్ట్ చేస్తా, ముందుకు వస్తాను. ► ఆచార్య గురించి ఫైనల్‌గా..? అన్ని వర్గాల వారికి నచ్చే పసందైన విందు ‘ఆచార్య’ సినిమా. – డి.జి. భవాని var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి 👉🏼 ఇండియాకు వచ్చిన విల్‌స్మిత్.. అతన్ని కలవడమేనా కారణం ? ‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్ డేట్.. వచ్చేది అప్పుడే -
మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జక్కన్న
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. ఇందులో చిరు తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకధీరుడు రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మగధీర' టైమ్‌లో చిరంజీవిగారు కథ విన్నారు. అప్పుడు రామ్ చరణ్ విషయాలన్నీ దగ్గరుండి చిరంజీవిగారే చూసుకుంటారేమో అని అనుకున్నాను. కానీ చరణ్‌కి చిరంజీవిగారు ఎటువంటి సలహాలు ఇవ్వరని నాకు తెలిసింది. చరణ్ నువ్వు ఇలా చెయ్ అలా చెయొద్దు అని చెప్పరు. ఈ సినిమాలో నీ యాక్టింగ్ బాగుంది, నీ యాక్టింగ్ బాలేదని చెప్పరు. ఇప్పటి వరకు తను చేసినవన్నీ చరణ్ తన సొంతంగా నేర్చుకున్నాడు. తను తప్పులు చేస్తే తనే సరిదిద్దుకున్నాడు. డైరెక్టర్లు చెప్పిన దాని నుంచి ప్రతీది నేర్చుకుని తనకు తానుగా ఎదిగాడు. మెగాస్టార్ కొడుకైనా హార్డ్ వర్క్ చేసి ఎదిగాడు. ఇది నాకు కొత్తగా తెలిసింది. ఇలానే ఉండు చరణ్ నువ్వింకా ఎదుగుతావు. ఆయనంత కాకపోయినా తనకు సమానంగా ఉంటావు ఫ్యూచర్లో అని నేను కష్చితంగా చెప్పగలనంటూ జక్కన్న పేర్కొన్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ నాకు ఆయనలోని కాంపటేటివ్నెస్ నచ్చింది. పక్కన ఉన్నది ఆయన కొడుకైనా కూడా నేనే డామినేట్ చేయాలని చిరంజీవి కోరుకుంటారు. ఆ లక్షనం చూడటానికి చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. ఒక అభిమానిగా చిరంజీవి గారే బాగ చేసారని అనిపిస్తారు. కానీ ఒక డైరెక్టర్‌గా నాకు నా హీరోనే మీకంటే బెటర్ సర్ అనడంతో రాజమౌళితో పాటు పక్కనే ఉన్న మెగాస్టార్ సైతం నవ్వుకున్నారు. -
ఇంతకుముందు చూడని మెగాస్టార్‌ను చూస్తారు: మెహర్ రమేష్
Meher Ramesh About Chiranjeevi In Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ మూవీ 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర బృందం. తాజాగా (శనివారం ఏప్రిల్ 23) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, బాబీ, మోహన్ రాజా, మెహర్ రమేష్ అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే పాల్గొన్నారు. చిరంజీవి తదుపరి చిత్రం భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఆచార్యలోని నీలాంబరి వీడియో సాంగ్ లాంచ్ చేశారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ 'మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఒక పండుగల ఉంటుంది. అలాంటిది కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరినీ చూపిస్తున్నారు. ఇది ఫ్యాన్స్‌కి కన్నుల పండగే. ఆచార్య చిత్రంలో నేను ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ చూశాను. మునుపెన్నడూ చూడని మెగాస్టార్‌ను చూస్తారు. బంజారా సాంగ్‌లో చిరు, చరణ్ డ్యాన్స్ ఐఫీస్ట్‌లా ఉంటుంది' అని తెలిపారు. చదవండి: ‘ఆచార్య’ కోసం రంగంలోకి మహేశ్ బాబు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_601242433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
NTR 30: ఆలియా గురించి క్లారిటీ ఇచ్చిన కొరటాల
జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30వ సినిమా. ప్రస్తుతం ఆచార్య సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కొరటాల శివ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమా ఈనెల 29న రిలీజ్ కానుంది. ఆచార్య తర్వాత చిన్న విరామం తీసుకొని ఎన్టీఆర్‌తో సినిమా స్టార్ట్ చేస్తానని స్వయంగా కొరటాల వెల్లడించారు. స్క్రిప్ట్ చాలా వరకు పూర్తయింది. ఎన్టీఆర్‌ను చాలా పవర్ ఫుల్ రోల్లో చూడబోతున్నారు అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఆలియా భట్ నటిస్తుందా అన్న ప్రశ్నకు.. స్క్రిప్ట్‌ని కేవలం ఎన్టీఆర్కే వివరించానని,ఇంకా హీరోయిన్ విషయం ఫైనలైజ్ కాలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుకి ఆలియా నో చెప్పిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. త్వరలోనే ఈ సినిమాలోని హీరోయిన్ను ప్రకటించే అవకాశం ఉంది. -
చాన్స్ లేదు.. వచ్చినా బోల్తా పడ్డాయి.. చిన్న సినిమాలకు విచిత్ర పరిస్థితి!
గత రెండేళ్లు కరోనా కారణంగా థియేటర్స్ సరిగ్గా తెరుచుకోలేదు.దాంతో చిన్న సినిమాలకు విడుదలకు పెద్దగా దారి దొరకలేదు. థర్డ్ వేవ్ తర్వాత ఇండియాలో థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల క్రితం పరిస్థితులు మల్లీ కనిపించాయి. అందుకు తగ్గట్లే పెండింగ్ లో ఉన్న బిగ్ మూవీస్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కు లైన్ క్లియర్ చేసుకున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమా థియేటర్లకు వచ్చాయి. కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని డిజప్పాయింట్ చేశాయి. త్వరలో ఆచార్య , సర్కారు వారి పాట, ఎఫ్ 3 రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే పూర్తిగా తెరుచుకున్న థియేటర్స్,కేవలం బిగ్ మూవీస్, పాన్ ఇండియా సినిమాలకు ఉపయోగపతున్నాయే తప్ప..చిన్న సినిమాలకు మాత్రం దారి దొరకడం లేదు.మొన్నటి వరకు టాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో తెలుగులో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకలేదు.దాంతో కేజీయఫ్ 2 రిలీజైన తర్వాతి వారం థియేటర్స్ రావాలని గంపెడు ఆశలు పెట్టుకున్నాయ్ చాలా చిన్న చిత్రాలు. వీటిల్లో జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, కృష్ణవృందా విహారి సినిమాలు ఉన్నాయి. (చదవండి: నేషనల్ క్రష్‌కి క్రేజీ ప్రాజెక్ట్.. మరో పాన్ ఇండియా చిత్రంలో రష్మిక!) కాని కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర భీకరంగా కంటిన్యూ అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 750 కోట్లు దాటిపోయింది.టాలీవుడ్ లోనూ ఆ ఇంపాక్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంది.అందుకే చిన్న చిత్రాలు రాకీభాయ్ కు ఎదురెల్లే సాహసం చేయలేక వాయిదా వేసుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పేలలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బిగ్ హీరోస్ మాత్రమే బాక్సాఫీస్ ను రూల్ చేస్తూ వస్తున్నారు. ఒక్క డీజే టిల్లు మాత్రమే స్మాల్ మూవీతో బిగ్ కలెక్షన్స్ రాబట్టాడు. సూపర్ మచ్చి, హీరో, గుడ్ లఖ్ సఖి, సెబాస్ఠియన్, ఆడవాళ్లకు మీకు జోహార్లు, స్టాండప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, గని లాంటి చిత్రాలు మినిమం వసూళ్లు లేక డీలా పడ్డాయి. పాన్ ఇండియా సినిమాల మధ్య విడుదలై, ప్రేక్షకులను మెప్పించలేక డీలా పడ్డాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆచార్య’ కోసం రంగంలోకి మహేశ్ బాబు
హీరో మహేశ్‌బాబు ‘ఆచార్య’కి మాట ఇస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. చిరంజీవి–కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్–పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. (చదవండి: అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్-2 ఎడిటర్) కాగా ఈ చిత్రం కోసం మహేశ్‌బాబుని వాయిస్ ఓవర్ ఇవ్వమని కొరటాల శివ కోరారట. అందుకు మహేశ్ అంగీకరించారని తెలిసింది. రెండు రోజుల్లో మహేశ్ వాయిస్ ఓవర్‌ని రికార్డ్ చేయడానికి ప్లాన్ చేశారని సమాచారం. సినిమాకి సంబంధించిన కీలక ఘట్టాలను వివరిస్తారట మహేశ్. కాగా పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జల్సా’ సినిమాకి మహేశ్‌బాబు తొలిసారి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ తర్వాత నాలుగైదు చిత్రాలకు కూడా వాయిస్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ‘ఆచార్య’కు ఇస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అమృత్సర్ షెడ్యూల్ ఓవర్.. బ్యాక్ టూ ఆచార్య ప్రమోషన్: చరణ్
Ram Charan Wraps Up RC15 Amritsar Shooting Schedule: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్‌చరణ్ రేంజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో అతడి యాక్టింగ్‌కు బి-టౌన్ ఫిదా అయ్యింది. దీంతో చరణ్ నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్రీ శంకర్ దర్శకత్వంలో RC15 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు అతడు నటించిన ఆచార్య రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఆర్సీ15 సినిమాషూటింగ్ కొద్ది రోజులుగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో జరుగుతుంది. అయితే తాజాగా ఈ మూవీ అక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చదవండి: హీరోయిన్ శ్రియ బేబీబంప్ డాన్స్ వీడియో చూశారా? స్పెషల్ ప్లైట్‌లో అమృత్సర్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న చరణ్ తన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా చరణ్ ‘శంకర్‌గారి(RC15 సినిమా షూటింగ్) అమృత్సర్ షెడ్యుల్ పూర్తి. బ్యాక్ టూ ఆచార్య ప్రమోషన్స్’ అని పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే ఆచార్య టీం ప్రమోషన్స్‌తో బిజీ కానుందని తెలుస్తోంది. చరణ్ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా RC15లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్, అంజలి ప్రధాన పాత్రలు పోషించనున్నారు. అయితే అమృత్సర్ షెడ్యూల్ నేపథ్యంలో చరణ్ మంగళవారం షూటింగ్ గ్యాప్‌లో కొంత సమయాన్ని అక్కడి బీఎస్ఎఫ్ జవాన్లతో గడిపిన సంగతి తెలిసిందే. వారితో కలిసి కాసేపు ముచ్చటించి, జావాన్లతో భోజనం చేసిన ఫోటోలను చరణ్ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు -
"ఆచార్య" రామ్ చరణ్ కొరటాల శివ స్పెషల్ ఇంటర్వ్యూ
-
నాన్న అలా చేసే సరికి కన్నీళ్లొచ్చాయి : రామ్ చరణ్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. ఇందులో చిరు తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిరు, రామ్ చరణ్ ప్రమోషన్స్ షురు చేశారు. తాజాగా ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న రామ్ చరణ్ తన తండ్రితో కలిసి 'ఆచార్య'లో నటించిన అనుభవాలను పంచుకున్నాడు. తాను ఈ చిత్రంలో నటించడమే కాదు షూటింగ్ జరుగుతున్నంత కాలం ప్రతి నిమిషం తన తండ్రి చిరంజీవితో కలిసి ఉండటం తనకు చాలా భావోద్వేగపూరితమైనదని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాకూ, డాడీకి షూటింగ్‌కి వీలుగా ఉండేలా ఒక డబుల్బెడ్రూం ఇంటిని ఇచ్చారు. అక్కడ దాదాపు 20రోజులు నేను, డాడీ కలిసి నిద్రలేవడం, కలిసి భోజనం చేసేవాళ్లం. ప్రతీ రోజు మార్నింగ్ 5:30 గంటలకు లేచి కలిసి వర్కవుట్ చేశాం. రోజూ కలిసి షూటింగ్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యేవాళ్లం. అలానే సెట్స్‌లో ఇద్దరం కలిసి పని చేశాం. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఒకే కార్లో ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళం. ఈ క్షణాలన్నీ నాకు ఎంతో మధురమైనవి, నాన్నతో ప్రయాణం చేస్తున్న దాని గురించి నా ఫీలింగ్స్‌ను మాటల్లో వర్ణించలేను. ఇక నాకు ఇలా ఉంటే నాన్న అక్కడ ఓ రోజు చరణ్ నీకు అర్ధం కావడం లేదేమో దీని వాల్యూ. ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు. 'ఆచార్య' వల్ల మనకు ఈ అవకాశం వచ్చింది. షూటింగ్‌కి ముందు లేదా తరువాత ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేద్దాం. మళ్లీ నీతో నాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇంత మంచి కథలో మనం కలిసి నటించడం ప్రతిసారీ కుదరదు అన్నాడు. నాన్న నన్ను హత్తుకున్నపుడు నాకు కన్నీళ్లు వచ్చాయంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇలా 'ఆచార్య' చిత్రం తమకు చాలా స్పెషల్ అంటూ తన తండ్రి చిరంజీవిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఇక రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం పాన్ ఇండియా లెవల్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవలే దర్శకుడు శంకర్‌తో చేస్తున్న చిత్రంపై ఫుల్‌గా ఫోకస్ పెట్టి జెట్‌స్పీడ్‌లో షూటింగ్ కొనసాగిస్తున్నాడు చెర్రి. -
‘ఆచార్య’ రీషూట్‌పై స్పందించిన డైరెక్టర్ కొరటాల
Koratala Siva Clarifies Acharya Movie Reshoot: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో వాయిదా అనంతరం ఏప్రిల్ 29న విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీషూట్‌పై ఇటీవల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్యలోని కొన్ని సీన్లను కొరటాల రీషూట్ చేశారు’ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ కొరటాల స్పందించారు. చదవండి: నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేసిన హీరో సిద్ధార్థ్ సినిమా రీషూట్ చేస్తే తప్పు ఏముందని, దాన్ని అంత పెద్ద తప్పుగా ఎందుకు చూస్తున్నారో? అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘ఒక సీన్ రీటేక్ చేస్తున్నామంటే అది మరింత బెటర్ అవుట్‌పుట్ కోసమే కదా. ఒక సన్నివేశాన్ని ఇంతకన్నా బాగా తీయొచ్చని దర్శకుడికి అనిపించినప్పుడు తప్పకుండ రీషూట్‌కు వెళ్లాల్సిందే. అందులో తప్పులేదు. అదే.. అనుకున్న సీన్ బాగా రాకపోయినా అది అలాగే వదిలేస్తే మాత్రం తప్పు అవుతుంది. ఒక సినిమాను రూపొందించేముందు ప్రేక్షకులను వందశాతం సంతృప్తి పరచడమే ధ్యేయంగా పెట్టుకుంటాం. చదవండి: ఆచార్య నుంచి కాజల్ సీన్స్ డిలీట్? అదే కారణమా? అందుకే థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి మంచి అనుభవాన్ని అందించాలంటే రీషూట్‌కు వెళ్లడంలో తప్పులేదు. ఒకవేళ నేను అలా చేయాల్సి వస్తే నిర్మాతలను ఒప్పించి మరి ముందుకు వెళ్తాను’అని ఆయన అన్నారు. ఇక చివరగా ఆచార్య రీషూట్ వార్తలపై స్పందిస్తూ.. అందరు అనుకుంటున్నట్టు ఆచార్య మూవీని రీషూట్ చేయలేదని, ఆ అవసరం కూడా రాలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. -
ఆచార్య నుంచి కాజల్ సీన్స్ డిలీట్? అదే కారణమా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆచార్య. ఇందులో రామ్ చరణ్ సిద్దా అనే కీలక పాత్ర పోషించాడు.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్గా నటించనుండగా, రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. అయితే రీసెంట్గా విడుదలైన ట్రైలర్లో మెయిన్ లీడ్ హీరోయిన్గా నటించిన కాజల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పూజా హెగ్డే మాత్రం రెండు సీన్స్‌లో కనిపించింది. దీంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న సందేహం నెటిజన్లలో కలుగుతుంది. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో నటించలేదని తెలుస్తోంది. కరోనా రావడంతో తొలుత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ షూటింగ్లో పాల్గొనలేదు. బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేయమని నిర్మాతలు అడిగినా కాజల్ నో చెప్పడంతో మేకర్స్ అసహనానికి లోనయ్యారని తెలుస్తుంది. దీంతో కావాలనే ట్రైలర్లో కాజల్‌ని చూపించలేదని తెలుస్తుంది. సినిమాలో కూడా కాజల్ సీన్స్‌ని తొలగించారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. -
మెగా ఫ్యాన్స్‌కి కన్నుల పండుగ.. ఇరగదీసిన చిరు, చరణ్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో సిద్ధ అనే పాత్రలో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ‘ఆచార్య’చిత్రం ఈనెల 29 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా నుంచి `భలే భలే బంజారా` అనే పాటని విడుదల చేశారు. సాధారణంగానే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ల డ్యాన్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతుంటారు. అలాంటిది వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే అది అభిమానులకు పండుగే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి విజువల్ ట్రీట్‌నే ఇచ్చారు మేకర్స్. ఈ పాటలో ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లు పోటీ పడి డ్యాన్స్ చేయడం అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను లెజెండ్ సింగర్ శంకర్ మహదేవన్, టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా, రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. A memorable song for me ♥️ Happy to tap my feet with my energetic @AlwaysRamCharan for #BhaleBhaleBanjara. Hope I dominated him with my grace 😎 ▶️ https://t.co/k3PmmUFkQt#AcharyaOnApr29#SivaKoratala #ManiSharma @NavinNooli @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/yWGdXmZVBq — Acharya (@KChiruTweets) April 18, 2022 -
హైదరాబాద్‌లో ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్, ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 29న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రెడీ అయ్యింది చిత్రయూనిట్. ఏప్రిల్ 23న హైదరాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరపనున్నట్లు మీడియాకు వెల్లడించింది. వేలాది మంది మెగా అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. చదవండి: అక్కడ చూసుకుందాం.. రామ్‌చరణ్‌కు చిరంజీవి సవాల్ -
Acharya: తగ్గాలి చరణ్.. తగ్గేదే లేదు డాడీ.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆచార్య’. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 28న విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం మెగాస్టార్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. తాజాగా ఈ సినిమాలోని ‘భలే భలే బంజారా’ సాంగ్ విడుదల తేదిని ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. అందులో రామ్ చరణ్‌కి చిరంజీవి సవాల్ విసిరాడు. ‘భలే భలే బంజారా’సాంగ్‌కి సెట్లో ఎవరెలా స్టెప్పులేస్తారో చూసుకుందాం అని చాలెంజ్ విసిరాడు. కొరటాల శివ ఈ పాట గురించి చెబతూ.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారని చెప్పాడు. సాంగ్ వినిపించి ఏంటి సార్ పరిస్థితి అని కొరటాల అడగ్గా..‘రేపు నా పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నాను. మీ సాంగ్ చాలా బాగుంది. మణి(మణిశర్మ) ఏమో థియేటర్లలో ఊగదంపుడు, కొట్టి అవతల పడేశాడు. రేపు మాత్రం మేము సెట్స్‌లో ఎలా చేయాలో అనే టెన్షన్ నాకుంది’అని చిరంజీవి అన్నారు. మీరే అలా అంటే ఎలా సర్ అని కొరటాల అనగా.. ‘మాములుగా అయితే అలా అనను. రేపు పొద్దున చరణ్‌తో ఎలా అని ఆలోచిస్తున్నాను. ఆర్ఆర్ఆర్లో ‘నాటు నాటు’పాటకు తారక్, చరణ్ అదగొట్టేశారు. ఇప్పుడు ఆ అంచనాలను అందుకోవాలంటే..కాస్త టెన్షన్‌గా ఉంది’ అని చిరంజీవి అనగా.. మేం ఎంత నాటుగా చేసిన ఆయన(చిరంజీవి)వచ్చి ఆయన గ్రేస్‌తో, ఎక్స్ప్రెషన్తో ఎక్కడా డామినేట్ చేస్తారో అని నా డౌట్’అని చరణ్ అన్నాడు. ఇక చివరల్లో ఇద్దరు చిరంజీవి..‘హేయ్ చరణ్.. ఏంటి సాంగ్‌ని డామినేట్ చేద్దామని చూస్తున్నావా? నీ బాబుని రా నేను’అని చిరు అంటే..లేదు డాడీ.. డామినేట్ చేయను..బట్ తగ్గను’అన్నాను. ఇక్కడ కాదు సెట్లో చూసుకుందాం’అని చిరంజీవి సవాల్ విసిరి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. తండ్రి కొడుకులు కలిసి స్టెప్పులేసే ఈ పాట ఏప్రిల్ 18న విడుదల కానుంది. -
ట్విటర్ అకౌంట్ పేరు మార్చిన చిరంజీవి.. రామ్‌చరణ్ స్పెషల్ వీడియో వైరల్
సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. వ్యక్తిగత, సినిమా విషయాలను తెలియజేయడంతో పాటు ప్రతి పండగకు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. అందుకే అతి తక్కువ సమయంలోనే ట్విటర్లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 1.3 మిలియన్స్‌కి చేరింది. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి తన ట్విటర్ ఖాతా పేరును మార్చాడు. చిరంజీవి కొణిదెల అని ఉండే తన ట్విటర్ అకౌంట్ నేమ్‌ను ‘ఆచార్య’గా మార్చుకున్నాడు. ఇది ఆయన తాజాగా నటించిన సినిమా పేరు. ఈ నెల 29న ఈ మూవీ థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తన ట్విటర్ ఖాతాకు ‘ఆచార్య’అని పేరు మారుస్తూ రామ్‌చరణ్‌కు సంబంధించిన ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !#happyhanumanjayanthihttps://t.co/SiZ2fbdyJ0@AlwaysRamCharan — Acharya (@KChiruTweets) April 16, 2022 మెగాస్టార్ చిరంజీవి స్వతహా ఆంజనేయస్వామి భక్తుడు. నేను హనుమాన్ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వీడియోని షేర్ చేశాడు. అందులో కాటేజీలో రామ్ చరణ్ మేకప్ వేసుకుంటుండగా, ఓ వానరం అక్కడకు వచ్చింది. చరణ్ మేకప్ వేసుకోవడం అయిపోగానే.. ఆ వానరానికి బిస్కెట్లు ఇచ్చాడు. అది సోఫాపైకి ఎక్కి చక్కగా బిస్కెట్లను తినింది. ఆ వీడియోకి ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం’ అనే స్లోకాన్ని నేపథ్య సంగీతంగా యాడ్ చేసి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
నేను వచ్చానని చెప్పాలనుకున్నా.. అదరగొడుతున్న 'ఆచార్య' ట్రైలర్
'సైరా నరసింహా రెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'ఆచార్య'. డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ 'సిద్ధ' అనే పవర్ఫుల్ పాత్రలో అలరించనున్న విషయం తెలిసిందే. అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు 'ఆచార్య' తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 12న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రకటించినట్లుగానే మంగళవారం (ఏప్రిల్ 12)న సాయంత్రం 'ఆచార్య' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలానే చిరంజీవి, రామ్ చరణ్ తమదైన నటనతో అదరగొట్టారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ధర్మస్థలి.. అపధర్మస్థలి ఎలా అవుతది ?, పాదఘట్టం వాళ్ల గుండెలపై కాలు వేస్తే.. ఆ కాలు తీసేయాలట.. వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసే డ్యాన్స్, ఫైటింగ్‌లు అభిమానులకు సూపర్ ఐ ఫీస్ట్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు ఇంకాస్తా పెరిగేలా ఉన్నాయి. చిరంజీవి 152వ సినిమాగా వస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని సోషల్ మీడియాతోపాటు 152 ప్రత్యేకమైన థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు సోమవారం (ఏప్రిల్ 11) ప్రకటించిన విషయం తెలిసిందే. -
'మెగా' ఫ్యాన్స్‌కు 'ఆచార్య' ట్రీట్.. 152వ సినిమా 152 థియేటర్లలో హంగామా..
Chiranjeevi Acharya Trailer Release In 152 Theatres: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది 'ఆచార్య' చిత్రబృందం. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం 'ఆచార్య' కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌ను పెంచిన చిత్ర బృందం ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసి అభిమానులకు ఒక శుభవార్త తెలిపింది. ఆచార్య ట్రైలర్‌ను సోషల్ మీడియాతోపాటు వెండితెరపై కూడా ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. చిరంజీవికి ఇది 152వ సినిమా కావడంతో ముఖ్యమైన 152 థియేటర్లలో 'ఆచార్య' ప్రచార చిత్రాన్ని ప్రదర్శించబోతుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోని కొన్ని థియేటర్లలో ఆచార్య ట్రైలర్ హంగామా చేయనుంది. ఏప్రిల్ 12న సాయంత్రం 5:49 గంటలకు ఈ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ఫుల్ పాత్రలో కనువిందు చేయనున్నాడు. మణిశర్మ సంగీతం అందించిన 'ఆచార్య'లో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. చదవండి: ఆచార్య: కీలక పాత్రలో అనసూయ.. రెమ్యునరేషన్ ఎంతంటే ? The 152nd film of Megastar @KChiruTweets calls for Mega Massive celebrations at 152 screens🤘#AcharyaTrailer will be celebrated in the below screens on 12th April at 5:49 PM 🔥@AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja @SonuSood #ManiSharma @MatineeEnt pic.twitter.com/fdTUz3aWSJ — Konidela Pro Company (@KonidelaPro) April 11, 2022 -
ఇట్స్ అఫిషియల్: చిరంజీవి 'ఆచార్య' ట్రైలర్ వచ్చేది ఆరోజే..
Chiranjeevi Acharya Trailer To Be Released On This Date: 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిచండమే కాకుండా ఇందులో నటిస్తుండటంతో మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ 'సిద్ధ' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' మూవీ ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. చదవండి: ఆచార్య: కీలక పాత్రలో అనసూయ.. రెమ్యునరేషన్ ఎంతంటే ? ఏప్రిల్ 12న ఆచార్య సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ తెలిపారు. ఇదివరకు ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్స్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరింజీవికి సరసన చందమామ కాజల్ హీరోయిన్గా చేయగా, రామ్ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. ఇందులో సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. అలాగే 'ఆచార్య'కు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరు-మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సాంగ్స్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. The date is set for the arrival of the MEGA PHENOMENA 🔥🔥 Witness the Mighty #AcharyaTrailer on 12th April 💥💥#AcharyaOnApr29 Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/84fP1bXa2k — Matinee Entertainment (@MatineeEnt) April 9, 2022 చదవండి: మెగా ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ కూడా రిలీజ్ కానున్న 'ఆచార్య'! -
ఆచార్య: కీలక పాత్రలో అనసూయ.. రెమ్యునరేషన్ ఎంతంటే ?
Anchor Anasuya Key Role In Chiranjeevi Acharya Movie: యాంకర్ అనసూయ భరద్వాజ్ కామెడీ షో, ప్రీ రిలీజ్ ఈవెంట్లతోపాటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. గతేడాది 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మంచి నెగెటివ్ పాత్రలో అలరించింది. పుష్ప సెకండ్ పార్ట్‌లో కూడా తన క్యారెక్టర్ కొనసాగుతుందని, అది కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. తాజాగా 'దర్జా' మూవీతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది ఈ బ్యూటీఫుల్ యాంకర్. ఇదివరకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో అనసూయ యాక్టింగ్ అదరగొట్టింది. చూస్తుంటే అందులో ఫుల్ లెన్త్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా అనసూయ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్, ఆచార్య మూవీస్‌లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న 'ఆచార్య' సినిమాలో కథను మలుపుతిప్పే క్యారెక్టర్లో అనసూయ కనిపించనున్నట్లు సినీ వర్గాల టాక్. ఇందులో అనసూయ మేకోవర్ కూడా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటుందట. ఈ పాత్ర కోసం అనసూయ ఏకంగా రూ. 25 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. మరీ ఈ పాత్రతో అనసూయకు ఏ స్థాయిలో పేరు వస్తుందో వేచి చూడాలి. -
‘ఆర్ఆర్ఆర్’ ఇచ్చిన ఊపుతో టాప్‌గేర్‌లో రామ్ చరణ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక జక్కన్న సినిమా ఇచ్చిన ఊపుతో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. పన్లో పనిగా ఆచార్యను కూడా రిలీజ్‌కు రెడీ చేశారు ఆ చిత్ర బృందం. ‘ఆర్ఆర్ఆర్’తో రామరాజు పాత్ర ద్వారా చరణ్ అదరకొట్టిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి హీరోగా నటించిన ఆచార్యలో చెర్రీ కీలక పాత్ర పోషించాడు. ‘ఆర్ఆర్ఆర్’ సూపర్ సక్సెస్ కావడంతో ఆచార్యపై హోప్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతానికి ఆచార్య నుంచి ఒక టీజర్, రెండు పాటలు మాత్రమే విడుదలయ్యాయి. కాగా సినిమాలో చిరంజీవి-రామ్ చరణ్ కాంబోలో ఒక పాట కూడా చిత్రీకరించారని సమాచారం. ఆ పాట ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అంటుంది మెగా కాంపౌండ్. మూడు గంటల రన్టైమ్తో ఆచార్య ఫైనల్ కాపీ సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ఆచార్య చిత్ర బృందం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక దాని తరువాత శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు చెర్రీ. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. -
ప్రేమ సందేశం రాస్తున్న రామ్‌చరణ్
ఇక్కడున్న ఫోటో చూశారుగా! నీలాంబరి కోసం ప్రేమతో ప్లూటుపై ఏదో ప్రేమ సందేశం రాస్తున్నట్లున్నారు సిద్ధ. ఈ సందేశం నీలాంబరికి ఎలా చేరుతుందనేది ఈ వేసవిలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ నాయికగా నటించిన ఈ చిత్రంలో సిద్ధ పాత్రలో రామ్‌చరణ్, నీలాంబరి పాత్రలో పూజాహెగ్డే నటించారు. ఆదివారం (మార్చి 27) రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ చిత్రంలోని సిద్ధ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. హైదరాబాద్‌లో వేడుకలు రామ్‌చరణ్ బర్త్ డే వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. వరుణ్ తేజ్, మెహర్ రమేష్, బాబీ తదితర చిత్రరంగ ప్రముఖులు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రక్తదానం చేసినవారిని ఈ వేదికపై సత్కరించారు. Team #Acharya wishes our Mega PowerStar @AlwaysRamCharan a very Happy Birthday ❤️ It is already a blockbuster year, can't wait to make it bigger next month😎#AcharyaOnApr29 Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @adityamusic pic.twitter.com/8Xpa2Ilovv — Konidela Pro Company (@KonidelaPro) March 27, 2022 చదవండి: చరణ్.. నన్ను గర్వపడేలా చేశాడు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ -
మెగా ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ కూడా రిలీజ్ కానున్న 'ఆచార్య'!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక వరుసగా తెలుగు చిత్రాలు బాలీవుడ్లో విజయం సాదిస్తుండటంతో ‘ఆచార్య’ను కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ఏంటంటే ఈ చిత్రం హిందీలోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయాన్ని హిందీలో పంపిణీ చేయనున్న 'పెన్ స్టూడియోస్' సంస్థ తెలిపింది. అయితే ఈ సంస్థ నుంచి పలు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. గత శుక్రవారం రవితేజ నటించిన 'ఖిలాడి' చిత్రాన్ని కూడా డబ్ చేసి 'పెన్ స్టూడియోస్' హిందీలో రిలీజ్ చేసింది. ఇక వీటితో పాటు వారి స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా 'గంగూభాయి కతియావాడి' ఈ నెల 25న రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇక 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక వీటితో పాటు 'అటాక్ పార్ట్ 1' జెర్సీ హిందీ రిమేక్ వంటి చిత్రాలు పెన్ స్టూడియోస్ నుంచి వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలానే ‘ఆచార్య’ హిందీ వర్షెన్‌ను కూడా ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఇక దీంతో మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. -
తీపి కబురు.. పెద్ద సినిమాల కొత్త రిలీజ్ డేట్స్ ఇవే!
మంచిది.. ఇలా కదా చేయాల్సింది.. మంచిది... ఇది కదా జరగాల్సింది. మంచిది... ఇంత ఫ్రెండ్లీగా కదా ఉండాల్సింది. సోమవారం కొన్ని మంచి విషయాలను మోసుకొచ్చింది. టాలీవుడ్ పెద్ద నిర్మాతలందరూ మంచి నిర్ణయం తీసుకున్న కబురు తెచ్చింది. పెద్ద సినిమాలు క్లాష్ కాకుండా.. నిర్మాతలు సినిమాల రిలీజ్ డేట్స్‌ని డిసైడ్ చేశారు. సోమవారం ముందు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చాయి. నిర్మాతలు డిసైడ్ అయి, ఇలా విడుదల తేదీలు చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక రిలీజ్ ‘డేట్ లాక్’ చేసుకున్న సినిమాల డేటా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ‘రౌద్రం.. రుధిరం.. రణం’ (ఆర్ఆర్ఆర్) సినిమా గురించి సినీ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. కానీ జనవరి 31 (సోమవారం) ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించి, స్వీట్ షాక్ ఇచ్చింది. ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. కొన్ని కల్పిత అంశాలకు స్నేహం, భావోద్వేగాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇటీవల రాజమౌళి చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా దాదాపు పద్నాలుగు భాషల్లో (విదేశీ భాషలతో కలిపి) విడుదల కానుంది. ఇక ధర్మస్థలి పోరాటాన్ని వెండితెరపై చూసే సమయం ఎప్పుడో తెలిసిపోయింది. చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ చిత్రం ధర్మస్థలి అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే కనిపిస్తారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ను విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం సోమవారం ప్రకటించింది. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు 2022లో ముందుగానే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్రాల జాబితాలో మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ముందు వరుసలో ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది జనవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు (అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల జనవరి 7కి షెడ్యూలైన కారణంగా ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కోరిన మేరకు వాయిదా వేసుకున్నారు). ఆ తర్వాత ఏప్రిల్ 1న ‘సర్కారువారి పాట’ను రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్రనిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్ ఆచంట తెలిపారు. అయితే ఏప్రిల్ 1కి షెడ్యూల్ అయిన ఈ చిత్రం ఆ తేదీకి రావడంలేదు. మే 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తాజాగా ప్రకటించారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయిక. ఇటు మేం ఎప్పుడు వస్తే అప్పుడే నవ్వుల పండగ అని ‘ఎఫ్ 3’ టీమ్ చెబుతూనే ఉంది. ఏప్రిల్ 28న ప్రేక్షకులను నవ్వించాలని ఈ సినిమా టీమ్ ఇటీవల డిసైడ్ అయింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ వంటి సినిమాల కొత్త విడుదల తేదీలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ‘ఎఫ్ 3’ సినిమా విడుదలలో ఏమైనా మార్పు ఉంటుందా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ సినిమాను ఏప్రిల్ 28నే విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ మంచి విజయాన్ని సాధించింది. ‘దిల్’ రాజు నిర్మించారు. ఇక ‘ఎఫ్ 3’ గ్యాంగ్‌లో సునీల్, సోనాలీ చౌహాన్ కూడా చేరారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ‘ఎఫ్ 3’ సినిమాను నిర్మించారు. మరోవైపు పవన్ కల్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కె. చంద్ర దర్శకుడు. ఈ ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. అయితే సోమవారం కొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో తమ సినిమా రిలీజ్‌ను కూడా ‘భీమ్లానాయక్’ టీమ్ ప్రకటించింది. ‘‘మా చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తాం.. ఒకవేళ పరిస్థితులు సహకరించకపోతే ఏప్రిల్ 1న చిత్రం థియేటర్స్‌కు వస్తుంది’’ అని చిత్రనిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. కోవిడ్ సృష్టించిన అయోమయ పరిస్థితుల కారణంగా సినిమాల విడుదలలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలా ఒకేసారి పెద్ద చిత్రాల విడుదల తేదీలు ఖరారు కావడం సినిమాని నమ్ముకున్న అందరికీ తీపి కబురులాంటిది. విడుదల తేదీలు ఆర్ఆర్ఆర్ – మార్చి 25 ఆచార్య – ఏప్రిల్ 29 ఎఫ్ 3 – ఏప్రిల్ 28 సర్కారువారి పాట – మే 12 భీమ్లా నాయక్ – ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 డేట్ డిబేట్ ఇక మరికొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ గురించి డిబేట్స్ (చర్చలు) జరుగుతున్నాయని తెలిసింది. ఈ జనవరి 14న విడుదల కావాల్సిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ థియేటర్స్‌కు రాలేదు. మార్చి 11న ఈ చిత్రం విడుదల కానుందన్నది లేటెస్ట్ టాక్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే వరుణ్ తేజ్ చేసిన ‘గని’ని మార్చి 18న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికంటే ముందుగానే అంటే ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రనిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ద. అలాగే శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహోర్లు’ను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ తేదీకి ‘భీమ్లా నాయక్’ వస్తే, ‘ఆడవాళ్ళు...’ సినిమా రిలీజ్ డేట్ మారొచ్చు. అలాగే ఏప్రిల్ 29న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల కావాల్సింది. కానీ తాజా విడుదల తేదీల ఖరారు దృష్ట్యా ఈ సినిమా రిలీజ్ డేట్ (‘ఆచార్య’, ‘ఎఫ్ 3’ రిలీజ్ కారణంగా) మారే చాన్స్ ఉంది. అలాగే మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్స్‌పై నిర్మాతల మధ్య సానుకూల వాతావరణంలో డేట్ డిబేట్ జరుగుతోంది. -
మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ‘ఆచార్య, భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్స్ కూడా వచ్చేశాయి
ఈ ఏడాది సంక్రాంతి బరిలో రావాల్సిన పాన్ ఇండియా చిత్రాలు, భారీ బడ్జెట్, పెద్ద సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకులు ఈ సంక్రాంతికి చిన్న సినిమాలతో సరిపెట్టుకున్నారు. ఇక కరోనా కేసులు తగ్గుముఖం పడ్డనుండటంతో వాయిదా పడ్డ పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలను వరసగా ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్‌ను జక్కన ప్రకటించగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించింది ఆ చిత్ర బృందం. 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న వస్తుండగా.. చిరు, చరణ్‌ల 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. తొలుత ఫిబ్రవరి 4న రిలీజ్ డేట్‌ను ఖరారు చేసిన ఆచార్య దర్శక-నిర్మాతలు కరోనా కారణంగా ఏప్రిల్ 1 అని నిర్మాతలు లోగడ ఎనౌన్స్ చేశారు. ఇక పలు చర్చల అనంతరం చివరకు విడుదల తేదీని ఏప్రిల్ 29కి నిర్ణయించి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగిన పిమ్మట, పరస్పర అవగాహన, అంగీకారంతో ఓ నిర్ణయానికి వచ్చినట్టు చిత్ర నిర్మాణ సంస్థ వివరించింది. #Acharya on 29th April In Theatres pic.twitter.com/ptYGJnzPoQ — Aakashavaani (@TheAakashavaani) January 31, 2022 చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన 'ఆచార్య' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కించారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్‌పై కూడా తాజాగా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. అంతా బాగుంటే ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, లేదా ఏప్రిల్ 1వ తేదీకి విడుదల చేస్తామంటూ కొద్ది సేపటి క్రితం భీమ్లా నాయక్ మేకర్స్ ట్వీట్ చేశారు. As we have always promised, #BheemlaNayak will be a massive theatrical experience. So, we have to wait for the pandemic to subside for presenting it in the theatres for you all. We intend to release the movie on 25th February or 1st April, whenever the situation improves! pic.twitter.com/7DfEFTF9gp — Sithara Entertainments (@SitharaEnts) January 31, 2022 -
చిరంజీవి ‘ఆచార్య’ మూవీ స్టిల్స్
-
ఊ అంటావా.. ఊహూ అంటావా .. కరోనా
ఊ అంటావా కరోనా.. ఊహూ అంటావా కరోనా... రమ్మంటావా కరోనా.. రావొద్దంటావా కరోనా.. రెండేళ్లుగా సినిమాల విడుదల విషయంలో కరోనా ఇలానే దోబూచులాడుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని, తెరపై ప్రత్యక్షమవడమే ఆలస్యం అనుకునే టైమ్‌లో కరోనా విజృంభించి ‘ఊహూ’ అంటోంది... ‘రావద్దంటోంది’. కరోనా ఎఫెక్ట్‌తో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రావాల్సిన సినిమాలు ఏప్రిల్‌కి వాయిదా పడ్డాయి. అయితే ఆరేడు సినిమాల వరకూ పెద్దవే కావడంతో డేట్ల సర్దుబాబు, థియేటర్ల సర్దుబాటు... ఇలా ఎన్నో సర్దుబాట్లు అవసరం. మరి.. అన్ని సర్దుబాట్లూ చేసుకుని తీరా రిలీజ్ టైమ్‌కి కరోనా ‘ఊ’ అంటుందా... ‘రావొద్దు’ అంటుందా అనేది సమ్మర్లో తెలుస్తుంది. ఇక సమ్మర్లో మెయిన్ సీజన్ అయిన ఏప్రిల్‌లో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం. ఏప్రిల్ ఎండలు పుంజుకునే టైమ్‌కి నెల తొలి రోజే రావడానికి రెడీ అవుతున్నాడు ‘ఆచార్య’. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల కానుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా చేశారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్‌కు ప్రకటించక ముందే ఇదే తేదీని ముందుగా బుక్ చేసుకుంది ‘సర్కారువారి పాట’ చిత్రం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ కథానాయిక. నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల మహేశ్ కాలికి సర్జరీ జరగడం, ఆ తర్వాత కరోనా బారిన పడటం, అలాగే ఈ చిత్రానికి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు కూడా కోవిడ్ బారిన పడటంతో ‘సర్కారువారి పాట’ చిత్రం విడుదల ఆగస్టుకు వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1నే విడుదల చేసే సాధ్యాసాధ్యాలను ఈ చిత్రం యూనిట్ పరిశీలిస్తోందని తెలిసింది. మరి.. ఏప్రిల్ 1నే ‘ఆచార్య’, ‘సర్కారువారి పాట’ విడుదలవుతాయా? ఏదైనా చిత్రం వాయిదా పడుతుందా? మరోవైపు ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యేందుకు ‘కేజీఎఫ్ 2’ ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాఫ్టర్ 1’కు కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ వస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక ఇదే నిర్మాత నిర్మిస్తోన్న మరో భారీ చిత్రం ‘సలార్’ కూడా ఏప్రిల్ 14 విడుదల జాబితాలో ఉంది. ఈ తేదీని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. అయితే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, ‘సలార్’ చిత్రాలకు ఒకే నిర్మాత, ఒకే దర్శకుడు కాబట్టి, పైగా ‘కేజీఎఫ్ 2’తో పోల్చితే ‘సలార్’ షూటింగ్ ఇంకా చాలా ఉంది కాబట్టి ఈ చిత్రం వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతోంది. ‘సలార్’ దసరాకు విడుదలయ్యే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. కాగా ఏప్రిల్ 14నే నాగచైతన్య తెరపై కనిపించనున్నారు. కానీ నాగచైతన్య హీరోగా చేసిన చిత్రంతో కాదు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీ రోల్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న హిందీతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇంకోవైపు సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా çపడిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎఫ్ 3’. వెంకీ–వరుణ్–అనిల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29న థియేటర్స్‌కు రానుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా ఇదే తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఎమ్ఎస్ రాజశేఖర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్. ఇక సమంత నటించిన తొలి మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’ కూడా సమ్మర్ లిస్ట్‌లోనే ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్రనిర్మాతలు ‘దిల్’ రాజు, నీలిమ గుణ తేదీలు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇవే కాదు.. మరికొన్ని మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు కూడా ఏప్రిల్ రిలీజ్‌ను టార్గెట్ చేసుకుంటున్నాయి. మరి.. సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఏప్రిల్ మంచి సీజన్ కదా. ఏప్రిల్ వైపు ‘ఆర్ఆర్ఆర్’ చూపు? ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియన్ మూవీ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం నెక్ట్స్ రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై అన్ని ఇండస్ట్రీస్‌లో చర్చ జరుగుతోంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ని ఏప్రిల్ 29న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకుంటే ‘ఎఫ్ 3’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల విడుదల్లో మార్పు జరిగే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. వేసవిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ అనువాద చిత్రాలు కూడా విడుదలవుతుంటాయి. ఈ వేసవికి కమల్‌హాసన్ ‘విక్రమ్’, విజయ్ ‘బీస్ట్’, దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ముందుగా విజయ్ ‘బీస్ట్’ ఏప్రిల్ 14న విడుదల అవుతుందని కోలీవుడ్ టాక్. రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ ‘విక్రమ్’ కూడా ఏప్రిల్‌లోనే రానున్నట్లు తెలిసింది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్ తదితరులు నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ తొలి పార్ట్ వేసవిలోనే రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఏప్రిల్ 1.. మెగాస్టార్ ఫ్యాన్స్‌కు పండగే
ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన చిరంజీవి ‘ఆచార్య’చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా, ఒమిక్రాన్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ‘ఆచార్య’మూవీని వాయిదా వేయక తప్పడం లేదని శనివారం చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 1న ‘ఆచార్య’మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే సందడి చేయనుంది. This Ugadi, Witness the MEGA MASS on big screens 💥💥#Acharya Grand Release on April 1 🔥#AcharyaOnApril1 Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/DwnYRcakcd — Konidela Pro Company (@KonidelaPro) January 16, 2022 -
'ఆచార్య' సినిమా వాయిదా
-
మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ఆచార్య మూవీ వాయిదా
అందరూ ఊహించిందే నిజమైంది. పాన్ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల జాబితాలో తాజాగా ఆచార్య మూవీ కూడా చేరింది. ఒమిక్రాన్, కరోనా ప్రభావంతో ఈ సంక్రాంతికి థియేటర్లో సందడి చేసే చిత్రాలన్ని వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4వ తేదీకి వస్తుందనుకున్న ఆచార్య మూవీని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘కరోనా, ఒమిక్రాన్ దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది. చదవండి: తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆచార్య మూవీని వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌తో మీ ముందుకు వస్తాం. అందరికి హ్యాపీ సంక్రాంతి. కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి హీరోగా కాగా కొరటాల శివ రూపొందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే సందడి చేయనుంది. The release of #Acharya stands postponed due to the pandemic. The new release date would be announced soon. Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/oVjqcvfl9U — Konidela Pro Company (@KonidelaPro) January 15, 2022 -
సమ్మర్‌పై గురి పెట్టిన స్టార్ హీరోలు
2022.. సమ్మర్ సీజన్ పై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అప్పటికీ థర్డ్ వేవ్ తగ్గి థియేటర్లు తెరుచుకుంటే మాత్రం ఇండియాలో ఉన్న థియేటర్లు అన్ని స్టారాతి స్టార్ల సినిమాలతో కళకళలాడటం ఖాయం. సమ్మర్లో విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేద్దాం. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ చిత్రాలు సమ్మర్ సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఐదేళ్ల క్రితం ఏప్రిల్ 28న విడుదలై సంచలన విజయం సాధించింది బాహుబలి 2. ఇప్పుడు అదే తేదిన ఆర్ఆర్ఆర్ని విడుదల చేసేందుకు ట్రై చేస్తున్నాడట రాజమౌళి. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ కూడా సమ్మర్ సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అలాగే మెగా మల్టీస్టారర్ ఆచార్య కూడా ఫిబ్రవరిలో రిలీజ్ కావడంలేదని,మూవీని సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్నటిస్తున్న సర్కారు వారి పాట కూడా ఎట్టిపరిస్థితుల్లో వేసవి కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి మేకింగ్ లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 కూడా సమ్మర్ సీజన్ లోనే రానుంది. ఈ వేసవికి తెలుగు చిత్రాలు మాత్రమే కాదు. పరభాషా చిత్రాలు కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించబోతున్నాయి. ఏప్రిల్ 14న శాండల్ వుడ్ నుంచి కేజీయఫ్ 2 తో రాఖీ భాయ్ వస్తున్నాడు. సేమ్ డే బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ కొత్త సినిమా లాల్ సింగ్ చెద్దా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో నాగ చైతన్య ముఖ్యమైన పాత్రలో నటించాడు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా లాల్ సింగ్ చెద్దా సందడి చేయడం ఖాయం. ఇక కోలీవుడ్ నుంచి అజిత్ నటించిన వాలిమై, మరో తమిళ స్టార్ విజయ్ నటించిన బీస్ట్, సూర్య కొత్త సినిమా కూడా వేసవి కానుకగానే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రాలు కూడా టాలీవుడ్ లో భారీ స్థాయిలో విడుదలకు ప్రయత్నించబోతున్నాయి. మొత్తంగా రాబోయే సమ్మర్ సీజన్ సీనీ ప్రేమికులకు గొప్ప అనుభూతిని కలిగించనుంది. -
ఆచార్య ఆగితే.. ‘శేఖర్’ వస్తాడట
Chiranjeevi Acharya Movie Updates: ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో ఎలాగూ జనవరి మూవీస్ రిలీజెస్ షెడ్యూల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరిలోనూ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ అభిమానులను మరోసారి డిజప్పాయింట్ చేస్తూ ఆచార్య, ఖిలాడి లాంటి సినిమాలు మరో మంచి రిలీజ్ డేట్ వైపు చూసే ఆప్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ కావాల్సి ఉంది. రెండేళ్లుగా మెగాభిమానలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఇది. ఎట్టకేలకు ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ అవుతోంది. అందుకు తగ్గట్లే కొరటాలశివ సినిమా ప్రమోషన్ ను సాగిస్తున్నాడు. లాహే, నీలాంబరి, సానా కష్టం లాంటి సింగిల్స్ రిలీజ్ చేసాడు. చిరు, చరణ్ లపై స్పెషల్ టీజర్స్ విడుదల చేసాడు. కాని ఇప్పుడు ఈ మెగా మల్టీస్టారర్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. ఫిబ్రవరి 4న ఆచార్య పోస్ట్ పోన్ అయితే ఆ స్థానంలో శేఖర్ వస్తాడట. 2018 మలయాళ బ్లాక్ బస్టర్ జోసెఫ్ మూవీ తెలుగు రీమేక్ ఇది. నిజానికి ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆచార్య పోస్ట్ పోన్ కానుందనే టాక్ బయటికి రావడంతో ఆ డేట్ పై రాజశేఖర్ కన్నేశాడు. -
‘ఆచార్య’ మూవీ టీంకు షాక్, మెగాస్టార్ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు
Acharya Saana Kastam Song Controversy: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరు తనయుడు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ.. అభిమానుల కోసం వరసగా ఓక్కో అప్డేట్ ఇస్తూ మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. అంతేగాక ఫిబ్రవరి విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం సరైన సమయంలో కోసం ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ టీంకు తాజాగా షాక్ తగిలింది. ఇటీవల విడుదలై ఆచార్య స్పెషల్ సాంగ్ వివాదంలో చిక్కుకుంది. చదవండి: అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఆర్జీవీ, ట్వీట్ వైరల్ ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ‘సానా కష్టం అంటూ సాగే ఈ పాటలో ఓ చోట లిరిక్స్ తమ మనోభవాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఓ చోట ‘ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు’ అని ఉంది. ఇప్పుడు ఇదే లైన్ వివాదానికి దారితీసింది. పాటలోని ఈ లిరిక్స్ ఆర్ఎంపీ వృత్తిని కించపరిచేలా ఉందని, ఆర్ఎంపీ, పీఎంపీల మనోభవాలను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్ అంతేగాక జనగామలోని రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పాట రచయిత, సినిమా దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని, సినిమాలో ఈ పాటను నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఇటీవల పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామ.. ఊఊ ఉంటావా’ సాంగ్‌ను కూడా వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ పాట ఎంతటి రచ్చకు దారితీసేందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూస్తుంటే పుష్ప సాంగ్ మాదిరిగానే ఆచార్య స్పెషల్ సాంగ్ కూడా వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిసోంది. మరి ఇది ఎంతవరకు దారితీస్తోంది చూడాలి. -
ఆచార్య నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. చిరుతో రెజీనా స్టెప్పులు
Saana Kastam Lirical Song From Acharya movie Is Out: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా నుంచి ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి రెజీనా స్టెప్పులేసింది. భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా, రేవంత్, గీతా మాధురి ఈ పాటను ఆలపించారు. 'సానా కష్టం వచ్చిందే మందాకినీ... చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగేపోనీ..' అంటూ ఈ పాట సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని లాహె లాహె, నీలాంబరి పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి4న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఆచార్య : 'సానా కష్టం' అంటూ చిరు డ్యాన్స్
Megastar Chiranjeevi Acharya Movie Saanakastam Song Promo Released: మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’.చిరు సరసన కాజల్ అగర్వాల్ నటించింది. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆచార్య టీం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’అనే లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది. 'సానా కష్టం వచ్చిందే మందాకినీ... చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగేపోనీ..' అంటూ ఈ పాట సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని లాహె లాహె, నీలాంబరి పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో లిరికల్ సాంగ్‌ను రేపు(సోమవారం)ఉదయం రిలీజ్ చేయనున్నారు. -
ఆ వార్తల్లో నిజం లేదు, అప్పుడే ఆచార్య వచ్చేది
‘ఆచార్య’ సినిమా విడుదల తేదీ మారుతుందని ప్రచారం జరుగుతున్న వార్తల్లో వాస్తవం లేదని ఆదివారం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషించారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘ఆచార్య’ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా ‘ఆచార్య’ చిత్రం వాయిదా పడనుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపించింది. దీంతో ఈ విషయంపై నిర్మాతలు స్పందిస్తూ – ‘‘ఆచార్య’ సినిమా రిలీజ్‌డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆల్రెడీ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ముందుగా ప్రకటించినట్లే ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు. దీంతో ‘ఆచార్య’ రిలీజ్ ఆన్ ట్రాక్‌లో ఉందని హ్యాపీ ఫీలవుతున్నారు మెగా ఫ్యాన్స్. ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. -
సిద్ధ వచ్చేశాడు.. ఆచార్య కొత్త టీజర్ చూశారా ?
Ram Charan Teaser Out From Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ' పాత్రలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు. టీజర్లో రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య ప్రేమను చూపించారు. ఇంతేకాకుండా ఈ టీజర్లో అనేక విషయాలు పొందుపరిచారు. 'ధర్మస్థలికి ఆపద వస్తే, అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుతుంది' అని రామ్‌చరణ్ డైలాగ్ చెప్పినతీరు ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ ఎండింగ్లో వచ్చే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆచార్య నుంచి ఇదీవరకు వచ్చిన టీజర్, సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా విడుదల చేసిన సిద్ధ పాత్రకు సంబంధించిన ఈ టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుందని చూస్తే తెలుస్తోంది. మెగస్టార్ చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తుంది. ఈ చిత్రంలో 'మ్యాన్ అఫ్ హ్యుమానిటీ' సోనూసూద్ కీలక పాత్ర పోషించారు. అలాగే ఇంతకుముందు రిలీజైన లాహే లాహే.. పాటలో సీనియర్ హీరోయిన్ సంగీత కనిపించిన సంగతి తెలిసిందే. ఇది చదవండి: ఫ్యాన్స్‌కి దీపావళి ట్రీట్ ఇవ్వనున్న ‘ఆచార్య’ టీం -
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' రిలీజ్ అయ్యేది అప్పుడే..!
Chiranjeevi Acharya Movie Release Date: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమాలోని 'లాహే లాహే', 'నీలాంబరి' సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 'లాహే లాహే' పాట అయితే యూట్యూబ్‌లో 60 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. అయితే పాటలు, నటీనటుల లుక్స్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ సినిమా విడుదలపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆచార్య రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఆచార్య సినిమాను ఫిబ్రవరి 04, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) అలాగే ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ నక్సలైట్ సిద్ధగా కనిపించనున్నారు. ఇవాళ సినిమా విడుదల తేది ప్రకటన తర్వాత సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను నవంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనిని 'ధర్మమే సిద్ధ' అంటూ మెగాస్టార్ చిరింజీవి షేర్ చేయగా, 'గుర్తుండిపోయే పాత్ర సిద్ధ. పవర్ఫుల్ టీజర్ రానుంది'. అని రామ్ చరణ్ ట్వీటారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) Siddha is a memorable character for many reasons. Powerful Teaser is on its way!#SiddhasSaga on Nov 28th.#Acharya #AcharyaOnFeb4th Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/gUs7iiJOaK — Ram Charan (@AlwaysRamCharan) November 24, 2021 ఇదిలా ఉంటే తొలుత దర్శకుడు ఆచార్యను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జనవరి 7వ తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు తేదీలకు పెద్దగా గ్యాప్ లేకపోవడంతో డిసెంబర్ 17న ‘ఆచార్య’ విడుదల చేయాలని కొరటాల నిర్ణయించారట. అయితే ఇదే తేదిన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తామని అప్పట్లో మేకర్స్ తెలిపారు. కానీ పుష్ప షూటింగ్‌ను ఇంకా పూర్తి చేసుకోలేదు. డిసెంబర్ 17 వరకు పుష్ప షూటింగ్ పూర్తవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. అందుకే చివరిగా ఫిబ్రవరి 04, 2022ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది చదవండి: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'లాహే లాహే' సాంగ్ -
చిరు స్పీడ్ మాములుగా లేదుగా.. 2022లో బిగ్గెస్ట్ మెగా ఫెస్టివల్!
ఒకప్పుడు మూడు షిఫ్టులు పని చేసి ఏడాదికి ఎన్ని సినిమాలు విడుదలైతే అన్ని సినిమాలు విడుదల చేసిన ఘన చరిత్ర మెగాస్టార్ చిరంజీవి సొంతం. ఇప్పుడు ఈ సీన్ ను మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నారు మెగాస్టార్. 2022లో వీలైతే నాలుగు చిత్రాలు విడుదల చేయాలనుకుంటున్నారట. ఫిబ్రవరిలో కొరటాల దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ రిలీజ్ కానుంది. అలాగే సమ్మర్ లో ‘గాడ్ ఫాదర్’ విడుదలకు ముస్తాబవుతోంది. అదే స్పీడ్ లో భోళాశంకర్, బాబి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నారట. చేతిలో ఉన్న నాలుగు చిత్రాలు కాకుండా మరో రెండు సినిమాలు త్వరలో అనౌన్స్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల మేకింగ్ లో ఒక మూవీ, అలాగే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారట చిరు.ఇదే స్పీడ్ లో మరో నిర్మాణ సంస్థకు డేట్స్ లాక్ చేశారని టాక్. దర్శకుడి పేరు ఖరారు అవ్వగానే ఆ ప్రాజెక్ట్ కూడా లాక్ అవుతుందట. మొత్తంగా 2022 నుంచి మళ్లీ మెగా సందడి మొదలు కాబోతోంది. మెగా స్టార్ ఇదే స్పీడ్ కొనసాగిస్తే, ఏడాదికి మూడు లేదా నాలుగు చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఆచార్య: ‘నీలాంబరి’ ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది
Acharya Movie Neelambari Second Song Out: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రికి జోడిగా పూజ హెగ్దే నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(నవంబర్ 5) సెకండ్ సింగిల్ పేరుతో పూజ హెగ్డేపై సాగే ‘నీలాంబర్’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. దీనితో పాటు సాంగ్ మేకింగ్ సీన్స్‌తో వీడియోను వదిలారు. చదవండి: సమంత మరో సంచలన నిర్ణయం! 'నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి' అంటూ ఈ పాట సాగుతన్న ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా ఆలపించారు. నిన్న(నవంబర్ 4) దీపావళి సందర్భంగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేస్తూ ఫుల్ లిరికల్ సాంగ్ నేడు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో రామ్ చరణ్‌కు జోడిగా పూజ నటిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రి నక్సలైట్‌గా నటిస్తుండగా.. ఆయన ప్రేయసి నీలాంబరిగా పూజా కనిపించనుంది. ఇందులో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్ చేసిన పోరు నేపథ్యంలో సాగే కథ ఇది. చదవండి: దీపావళి సర్ప్రైజ్: తనయులతో జూ. ఎన్టీఆర్, ఫొటో వైరల్ -
ఆచార్య సెకండ్ సింగిల్: ఆకట్టుకుంటున్న ‘నీలాంబరి’ ప్రోమో సాంగ్
Acharya Movie Second Single Promo Out: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రికి జోడిగా పూజ హెగ్దే నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను వదిలారు మేకర్స్. చదవండి: మెగా ఇంట్లో దీపావళి సంబరాలు, ఫొటో షేర్ చేసిన బన్నీ ఈ సందర్భంగా రేపు ఉదయం 11. 7 గంటలకు ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘నీలాంబరి’ అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో చరణ్ సిద్ధ అనే నక్సలైట్‌గా నటిస్తుండగా.. ఆయన ప్రేయసి నీలాంబరిగా పూజా కనిపించనుంది. ఇందులో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్ చేసిన పోరు నేపథ్యంలో సాగే కథ ఇది. చదవండి: దీపావళి ముందే వచ్చింది.. లాలా భీమ్లా అదరగొట్టిందంతే.. -
ఫ్యాన్స్‌కి దీపావళి ట్రీట్ ఇవ్వనున్న ‘ఆచార్య’ టీం
Acharya Second Single Release: సైరా నరసింహారెడ్డి తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవికి జోడిగా కాజల్ నటించగా, మరో జంటగా చరణ్ - పూజ హెగ్డే అలరించనున్నారు. ఫ్యాన్స్‌కి దివాళి ట్రీట్‌గా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగల్‌ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ‘ఆచార్య’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'లాహే లాహే' సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డాన్స్‌లో గ్రేస్ ఏ మాత్రం తగ్గకుండా చిరు స్టెప్స్ ఈ పాటలో ఉన్నాయి. దీంతో ప్రతేక్యంగా చిరు అభిమానులకు ఈ పాట విపరీతంగా నచ్చిందని చెప్పాలి. తాజాగా ఆచార్య చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌గా చరణ్ - పూజ హెగ్డే లపై చిత్రీకరించిన 'నీలాంబరి' గీతాన్ని ఈ నెల 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గతంలో చిరూ - మణిశర్మ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చదవండి: Chiranjeevi Hallowen Look: కొత్త లుక్‌తో భయపెడుతున్న మెగాస్టార్.. షాక్‌లో అభిమానులు! -
మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ఆచార్య విడుదల తేదీ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మెగా ప్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆచార్య మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన ఆ మూవీ రిలీజ్ డేట్‌పై ఇప్పటి వరకు సస్పెన్స్ నెలకొంది. మొదట ఆచార్యను డిసెంబర్ 24న కొరటాల శివ విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ జనవరి 7న విడుదలవుతుండటంతో తన రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. దీంతో డిసెంబర్ 17 ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే ఆ రోజే పుష్ప రిలీజ్ కావడంతో ఆచార్య విడుదల తేదీ చర్చనీయాంశమైంది. ఇక దీనిపై చర్చ జరిపిన మూవీ టీం తాజాగా కొత్త తేదీని ఖరారు చేసి ప్రకటించారు. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ మూవీ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రామ్ చరణ్ ‘ఆచార్య’ విడుదల తేదీని ప్రకటిస్తూ ట్వీట్ చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చెర్రి సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. #Acharya Arrives on 4th Feb22@KonidelaPro @MatineeEnt @KChiruTweets #SivaKoratala pic.twitter.com/VeE9p7PLrg — Ram Charan (@AlwaysRamCharan) October 9, 2021 -
‘ఆచార్య’ వచ్చేది అప్పుడేనా.. అదే రోజున ఫైనలా?
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆచార్య విడుదల విషయం చర్చనీయాంశంగా మారింది. తొలుత దర్శకుడు ఆచార్యను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జనవరి 7వ తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు తేదీలకు పెద్దగా గ్యాప్ లేకపోవడంతో డిసెంబర్ 17న ‘ఆచార్య’ విడుదల చేయాలని కొరటాల నిర్ణయించారట. చదవండి: ‘లవ్‌స్టోరీ’ చిత్రం చూసి భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ సుమ ఇదే తేదీకి చిరు కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే అదే రోజున ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ కానుంది. దీనిపై ఇదివరకే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కానీ పుష్ప షూటింగ్‌ను ఇంకా పూర్తి చేసుకోలేదు. దీంతో ఆ తేదీలోగా షూటింగ్ పూర్తవుతుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. మరీ ఆ తేదీలోగా ‘పుష్ప’ షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుందా? లేదా ఆ డేట్‌ను ‘ఆచార్య’కు కెటాయిస్తారా? అనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. -
మళ్లీ ఆచార్య సెట్లో సందడి చేయనున్న చిరు, చరణ్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ ‘గాడ్‌ఫాదర్’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కాగా ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకోవడంతో ఆయన గాడ్‌ఫాదర్ షూటింగ్‌ను ప్రారంభించారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కూడా పూర్తి కావడంతో శంకర్‌తో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా చిరు, చెర్రిలు మళ్లీ ఆచార్య షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరు గాడ్‌ఫాదర్, చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉండటంతో ఆచార్యలోని రెండు పాటల చిత్రీకరణను కొరటాల వాయిదా వేశారట. చదవండి: అమెరికాలో సందడి చేస్తున్న జగపతి బాబు ఇప్పుడు ఈ పాటలను తిరిగి షూట్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారని, ఇందుకోసం హైదారాబాద్ శివార్లలో ప్రత్యేకంగా సెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సెట్లో చిరు, చరణ్‌లపై ఓ సాంగ్ షూటింగ్‌ను నిర్వహించబోతున్నాడట. మరో పాట షూటింగ్ చరణ్-పూజా హెగ్డేలపై జరగనుందని, వచ్చే వారం ఈ పాట షూటింగ్‌ను జరపనున్నట్లు సమాచారం. ఈ నెల చివరిలోపు రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. కాగా ఈ మూవీలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘ఆచార్య’లో చరణ్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. -
‘ఆచార్య’ అదిరిపోయే వీడియో.. చెర్రీ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే(ఆగస్ట్ 22) నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న, నటించబోతున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికీ చిరు 154 చిత్రంటైటిల్ మోషన్ పోస్టర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి ‘బోళా శంకర్’అని పేరు ఖరారు చేశారు. ఇక తాజాగా ‘ఆచార్య’టీమ్ స్పెషల్ వీడియోలో చిరంజీవికి బర్త్‌డే విషెస్ తెలియజేసింది. (చదవండి: చిరు బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చేసింది..‘భోళా శంకర్’గా మెగాస్టార్) రామ్ చరణ్ తన తండ్రితో కలిసి ఆచార్య సెట్లో గడిపిన సందర్భాలకు సంబంధించి ఈ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఆచార్య షూట్ కోసం తన తండ్రి చిరంజీవిని కారులో స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్లాడు రామ్ చరణ్. ఆ తర్వాత సెట్లో తండ్రితో కలిసి సందడి చేశాడు. ఈ వీడియోని చెర్రీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘మై అప్పా.. మై ఆచార్య’ అంటూ తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక ఆచార్య సినిమా విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. చెర్రి ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చరణ్ సరసన పూజాహెగ్డే కనిపించనుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ఆచార్య మూవీ టీం నుంచి కాల్ వచ్చింది.. కానీ!: మెహబూబ్
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ షోతో కంటెస్టెంట్స్ అంతా ఒవర్‌నైట్ స్టార్ అయిపోతున్నారు. హౌజ్‌లో తమదైన తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతంగా చేసుకుని ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఆ క్రేజ్‌తోనే వరుస ఆఫర్లు కొట్టెస్తున్నారు. గత సీజన్ 4 కంటెస్టెంట్ ఆరియాన గ్లోరీ రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈక్రమంలో సినిమా ఛాన్స్‌లు కొట్టెసింది. అలాగే దివి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. సోహైల్ కూడా హీరోగా బిజీ అయిపోయాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా వెబ్ సిరీస్‌లు, సొంతంగా యూట్యూబ్‌లు ఛానల్ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా మెహబూబ్ దిల్సేకి ఆచార్యలో నటించే ఆఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సింగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా మెహబూబ్ దీనిపై స్పందించాడు. తనకు ఆచార్య టీం నుంచి కాల్ వచ్చిందని, ఆఫీసుకు వెళ్లి కలిశాను అని చెప్పాడు. అక్కడ తన రోల్ ఎంటో వివరించారని, దానిపై కాసేపు చర్చ కూడా జరిగినట్లు తెలిపాడు. అయితే మళ్లీ తనకు ఫోన్ రాలేదని, ఒకవేళ కాల్ వస్తే కళ్లు మూసుకుని షూటింగ్లో పాల్గొంటానని పేర్కొన్నాడు. కాగా బిగ్‌బాస్ సీజన్-4 ఫైనల్ ఎపిసోడ్లో చిరు ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సోహైల్, దివి, మెహబూబ్‌లకు చిరు బిగ్ ఆఫర్లు ఇచ్చాడు. సోహైల్ హీరోగా ఏ సినిమా చేసిన అందులో అతిథి పాత్రలో నటిస్తానని మాట ఇచ్చాడు. దివికి తన నెక్ట్ మూవీలో ఓ పాత్ర ఇస్తానని చెప్పాడు. -
స్టెప్పులేసేందుకు రెడీ అవుతున్న తండ్రీకొడుకులు
Acharya: తండ్రీకొడుకు (చిరంజీవి- రామ్‌చరణ్) ఇక స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రం రెండు పాటలు మినహా పూర్తైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. 'అనుకున్న ప్రకారం టాకీ పార్ట్‌ను జూలై 31కి పూర్తి చేశాం. రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ఆగస్టు 20 నుంచి చిరంజీవి, చరణ్‌లపై ఓ పాట, అలాగే చరణ్- పూజా హెగ్డేలపై మరో పాటను చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరగుతున్నాయి' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. తిరువణ్ణాపుక్కరసు, సంగీతం: మణిశర్మ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైవీ ప్రవీణ్ కుమార్. -
Sonu Sood Birthday: రియల్ హీరోకు మెగాస్టార్ బర్త్‌డే విషెస్
Chiranjeevi Wishes To Sonu Sood : చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక శుక్రవారం(జులై30)న సోనూసూద్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. 'ప్రియమైన సోనూసూద్..మీరు నిజమైన జీవితాన్ని గడుపుతున్నారు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు. మీరు ఇలాగే ఎప్పుడూ తోటివారికి సహాయం చేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే సోనూసూద్' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక కరోనా కాలంలో ఎంతో మందికి సహాయం చేసి సోనూసూద్ రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. కాగా ఆచార్య చిత్రంలో సోనూసూద్ లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో నుదుట బొట్టు పెట్టుకుని పిలకతో సోనూసూద్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. Dear @SonuSood you are living the Real life! There can be no greater satisfaction than helping the needy! Happy Birthday! Many happy returns of the day! Wish your life always be full of grace and fulfilment! — Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2021 -
'సోనూసూద్' లుక్‌ని రివీల్ చేసిన 'ఆచార్య' టీం
రియల్ హీరో సోనూసూద్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు సహా సామాన్యులు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో అన్ని వర్గాల ప్రజలకు చేతనైనంత సాయం చేసి ఎంతోమందికి ప్రత్యక్ష దైవంగా మారాడు సోనూసూద్ బర్త్‌డే సందర్భంగా ఆచార్య టీం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ బర్త్‌డే సందర్భంగా ఆచార్యలో ఆయన లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. నుదుట బొట్టు పెట్టుకుని పిలకతో సోనూసూద్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. తెలుగు నాట ఎక్కువగా విలన్ పాత్రలతో పాపులర్ అయిన సోనూసూద్ ఆచార్య లుక్ ఆకట్టుకుంటుంది. ఇక చిరంజీవి ప్రధానపాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. Team #Acharya wishes the versatile actor & man with a golden heart @SonuSood a very Happy Birthday. Megastar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sVTeANJKh0 — Konidela Pro Company (@KonidelaPro) July 30, 2021 -
‘టాలీవుడ్’కి లీకుల బెడద.. సోషల్ మీడియాలో ‘లుక్స్’ వైరల్
ఆచార్య’లో చిరంజీవి గెటప్ ఎలా ఉంటుంది? మహేశ్‌బాబు లెంగ్తీ డైలాగ్ చెబితే ఎలా ఉంటుంది? ‘ఆర్ఆర్ఆర్’లో ప్రమోషనల్ సాంగ్ లిరిక్ ఏంటి? ఇవన్నీ ఆయా చిత్రబృందాలు అధికారికంగా ఎలానూ చెబుతాయి. అయితే.. చెప్పేలోపే తెలుసుకోవాలని కొందరు ఉత్సాహపడతారు. షూటింగ్ స్పాట్లో చాటుమాటున కెమెరాతో క్లిక్‌మనిపిస్తారు. లేదా.. ఎవరికీ కనబడకుండా దూరంగా నిలబడి వింటారు. క్లిక్మనిపించినదీ.. విన్నదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇలా లీక్ అయిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. -
ధర్మస్థలికి దారులు తెరుచుకున్నాయ్..నెట్టింట రామ్‌చరణ్ పోస్ట్ రచ్చ
acharya movie update: కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పలు రంగాలతో పాటు సిని పరిశ్రమ కూడా ప్యాకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మధ్యలో ఆపేసిన చిత్రాలన్నీ పట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ముగింపు దశలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ఆచార్య’ కు సంబంధించి ఓ ఆసక్తికర పోస్ట్‌ను రామ్‌చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ జోడి కోసం అభిమానుల ఎదురుచూపులు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. ఇదివరకే చిరు చరణ్‌లు వెండితెరపై కనిపించి అలరించిన, అది కేవలం అతిథి పాత్రల వరకే పరిమితంగా ఉండేది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో అభిమానులకు కనుల విందుగా చేయడానికి వీరి కాంబోకు సంబంధించి..చరణ్‌ది దాదాపు 40 నిమిషాలు ఉంటుందని టాక్. ఇంటర్వెల్లో వచ్చే చరణ్ పాత్ర సెకండాఫ్ అంతా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ సినిమా కు అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ను రామ్‌చరణ్ అభిమానుల కోసం సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో ‘ధర్మస్థలికి దారులు మళ్లీ తెరుచుకున్నాయ్.. మేము ఫైనల్ షెడ్యూల్లో ఉన్నాం. త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్తో మీ ముందుంటామని తెలిపారు. View this post on Instagram A post shared by Konidela Production Company (@konidelapro) -
షూటింగ్ రీ స్టార్ట్.. ఆచార్య ఆన్ సెట్స్
కోవిడ్ బ్రేక్ తర్వాత షూటింగ్‌లు ఆరంభమవుతున్న విషయం తెలిసిందే. నేడు ‘ఆచార్య’ షూటింగ్ కూడా ఆరంభం కానుందని సమాచారం. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. ఓ పదిహేను రోజులు షూటింగ్ జరిపితే ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తవుతుందట. ఈ ఫైనల్ షెడ్యూ ల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించనున్నారని తెలిసింది. -
ఆచార్య మరో రికార్డు.. రిలీజ్‌కు ముందే 60 మిలియన్ వ్యూస్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. ఇక రిలీజ్‌కు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. మణిశర్మ స్వరపరచిన 'లాహే లాహే' పాట యూట్యూబ్‌ను ఎంత షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ లిరికల్ వీడియో సాంగ్ మరో మైలురాయిని చేరుకుంది. 60 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. హారిక నారాయణ్, సాహితి చాగంటి ఈ సాంగ్‌ను పాడారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య ఫైనల్ షెడ్యూల్ వచ్చే నెల రెండో వారంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. కేవలం 12 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. చివరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ అయిపోతే ఆచార్య షూటింగ్ పూర్తయినట్లే. దీంతో గుమ్మడికాయ కొట్టేందుకు మూవీ యూనిట్ సిద్ధమవుతుంది. #LaaheLaahe from #Acharya giving everyone some lovely vibes every time it is played 60M+ views & counting... ▶️ https://t.co/N7bdyKWKez Megastar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal @sangithakrish #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/unrrfNOzSM — BARaju's Team (@baraju_SuperHit) June 27, 2021 చదవండి : ఆచార్యకు ప్యాకప్.. చివరి షెడ్యూల్ అప్పుడే -
ఆచార్యకు ప్యాకప్.. చివరి షెడ్యూల్ అప్పుడే
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం 12 రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. వచ్చే నెల రెండో వారం నుంచిఘీ మూవీ తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌పై కొన్ని ముఖ్య సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు సమాచారం. చివరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ అయిపోతే ఆచార్య షూటింగ్ పూర్తయినట్లే. దీంతో గుమ్మడికాయ కొట్టేందుకు మూవీ యూనిట్ సిద్ధమవుతుంది. నిజానికి అంతా సజావుగా సాగితే మే13నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్‌కు ఆటంకం కలిగింది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పటికే పలు ప్రాజెక్టులు సెట్స్‌పైకి వెళ్లాయి. తాజాగా చిరంజీవి నటిస్తున్న ఆచార్య సైతం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీలో కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి : ఇండస్ట్రీకి సేవ చేయడమే నా కర్తవ్యం: మంచు విష్ణు లోకల్ ట్రైన్లో రజనీ అలా.. ఫోటోలు లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ -
కాజల్‌కి ‘ఆచార్య’టీమ్ సర్ప్రైజ్
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. శనివారం (జూలై 19) కాజల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆచార్య’లోని కాజల్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కాజల్ చాలా అందంగా కనిపిస్తోంది. పట్టు పరికిణీ లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా అలరిస్తోంది. కీలక పాత్రల్లో రామ్‌చరణ్, పూజా హెగ్డే కనిపించనున్నారు. ఇందులో దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్ ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. చెర్రి సరసన పూజా హెగ్డే కనిపిస్తారు. ఈ ఏడాది మే 13న విడుదల కావాల్సిన ‘ఆచార్య’ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. Team #Acharya wishes the gorgeous & supremely talented @MsKajalAggarwal a very Happy Birthday ❤️#HappyBirthdayKajal Megastar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @hegdepooja #ManiSharma @ramjowrites @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt pic.twitter.com/YZ1YzHKjxo — Konidela Pro Company (@KonidelaPro) June 19, 2021 చదవండి: హ్యాపీ బర్త్‌డే ‘చందమామ’ : కాజల్ సినీ ప్రయాణంపై స్పెషల్ వీడియో -
ఆ కలానికి మార్పుతేవాలనే తపన ఉంది: చిరంజీవి
Koratala Siva: హీరో అంటే వందమందిని ఒక్కవేటుతో నరికేవాడు కాదు. ఒక్కమాటతో గొడవను శాశ్వతంగా చల్లార్చేవాడేనని తన పాత్రల ద్వారా నిరూపించిన దర్శకుడు కొరటాల శివ. సామాజిక కోణంలో సినిమాలు రూపొందిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు. నేడు(జూన్ 15) కొరటాల శివ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఆ కలానికి, సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకుడికి, ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది. ‘ఆచార్య’ సృష్టికర్త కొరటాల శివకి జన్మదిన శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశాడు. కొరటాల శివ దర్శకత్వంగా చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ చిత్రమిది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రామ్‌చరణ్, పూజా హెగ్డే కనిపించనున్నారు. ఇందులో దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి నటిస్తున్నారు. చదవండి: అలాంటి అరుదైన స్నేహితుడు కొరటాల : ఎన్టీఆర్ పెద్ద మనసు చాటుకున్న విజయ్ సేతుపతి -
Acharya: చిరంజీవి పాట.. సరికొత్త రికార్డు
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య. కాజల్ అగర్వాల్ కథానాయికగా నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. చెర్రి ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ఈ మూవీ నుంచిఆ మధ్య ‘లాహే..లాహే...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సినీ ప్రేక్షకులతో పాటు మెగాస్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇందులో సీనియర్ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్ అగర్వాల్ ఆమెతో కలిసి కాలు కదిపింది. గుడి సమీపంలో సాగే ఈ పాటకు మధ్యలో చిరు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా హారిక నారాయణ్, సాహితి చాగంటి ఆలపించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అదించారు. తాజాగా ఈ లిరికల్ సాంగ్ యూట్యాబ్‌లో 50 మిలియన్ల మార్క్ దాటింది. అలాగే 6 లక్షలకు పైగా లైక్స్ సాధించింది. సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ బ్యాలెన్స్ షూటింగ్ వాయిదా పడింది. లేకపోతే మే 13న సినిమా విడుదల కావాల్సిఉంది. -
Acharya Moive: ఇరవై రోజులే ఉంది!
జస్ట్ 20 రోజులు షూటింగ్ జరిగి ఉంటే ‘ఆచార్య’ చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేసేవాళ్లు. కానీ కరోనా ‘ఆచార్య’ ప్లాన్‌ను కాస్త అటూ ఇటూ చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడిన విషయం తెలిసిందే. లాక్డౌన్ పూర్తయిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొత్తం 20 రోజుల షూటింగ్‌ను నాన్‌స్టాప్‌గా జరిపేలా ప్లాన్ చేస్తున్నారట కొరటాల శివ. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్ ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే కనిపిస్తారు. ఈ ఏడాది మే 13న విడుదల కావాల్సిన ‘ఆచార్య’ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. -
Acharya: చరణ్ ఎంట్రీ అదిరిపోద్దట!
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రామ్‌చరణ్, పూజా హెగ్డే కనిపించనున్నారు. ఇందులో దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి నటిస్తున్నారు. చరణ్‌ది పూర్తి స్థాయి నిడివి ఉన్న కీలక పాత్ర. దాదాపు 40 నిమిషాలు ఉంటుందని టాక్. ఇంటర్వెల్లో వచ్చే చరణ్ పాత్ర సెకండాఫ్ అంతా ఉంటుందని తెలిసింది. సినిమా ద్వితీయార్ధంలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. అంతేకాదు.. ఈ సినిమాలో చరణ్ పాత్ర పరిచయ సన్నివేశం అదిరిపోతుందట. సెకండాఫ్‌లో ముఖ్యంగా చిరంజీవి, చరణ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని సమాచారం. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇంకా రామ్‌చరణ్, పూజాలపై ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ ఏడాది మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. -
సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : సమ్మర్ సినిమాలన్ని వాయిదా
సినిమాలకు బెస్ట్ సీజన్ అంటే నాలుగు... సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి. ఉగాది, క్రిస్మస్లకు కూడా సినిమాలు వస్తుంటాయి. అయితే వసూళ్లకు మొదటి నాలుగు పండగలే ప్రధానం. 2020లో సంక్రాంతి సందడి బాగానే సాగింది. అయితే కరోనా దెబ్బకు సమ్మర్ సంబరం మిస్సయింది. దసరా, దీపావళికి కూడా సినిమా పండగ లేదు. సంవత్సరాంతంలో మెల్లిగా సినిమాల విడుదల ఆరంభమైంది. 2021లో సంక్రాంతి సందర్భంగా వెండితెరకు బోలెడన్ని బొమ్మలు వచ్చాయి. కానీ ఈసారి కూడా సమ్మర్ సంబరం పోయే పోచ్! కరోనా సెకండ్ వేవ్‌తో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. గత సమ్మర్‌కి మార్చి చివర్లో థియేటర్లకు లాక్‌పడింది.. ఈ సమ్మర్ కూడా సందడి మిస్. వేసవి సెలవులంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాసులు కురిపించే రోజులు. పరీక్షలను పూర్తి చేసుకున్న విద్యార్థులు, తమ పిల్లలతో సరదాగా సమయం గడిపేందుకు పెద్దలు ప్రధానంగా ఎంచుకునేది థియేటర్స్‌లో సినిమా చూడడం. అందుకే సంక్రాంతి తర్వాత నిర్మాతలు ఎక్కువగా ఇష్టపడే సీజన్ సమ్మరే. కానీ కరోనా కారణంగా గత ఏడాది సమ్మర్‌కి బాక్సాఫీసు కుదేలయింది. ఈ సమ్మర్‌కి అయినా సినిమాల సందడి ఉంటుందనుకుంటే సెకండ్ వేవ్ కారణంగా ఈసారీ నిరాశే. మార్చి మొదటివారం నుంచి ఏప్రిల్ 9 వరకు థియేటర్స్ వంద శాతం సీటింగ్‌తో నడిచాయి. ఈ సమయంలో ‘వైల్డ్ డాగ్, వకీల్‌సాబ్, రంగ్ దే, జాతిరత్నాలు’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు షెడ్యూల్ అయిన సినిమాల్లో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ (ఏప్రిల్ 16), నాని ‘టక్ జగదీష్’ (ఏప్రిల్ 23), కంగనా రనౌత్ ‘తలైవి’ (ఏప్రిల్ 23), రానా ‘విరాటపర్వం’ (ఏప్రిల్ 30) ఇప్పటికే అధికారికంగా వాయిదా పడ్డాయి. అలాగే మే నెలలో విడుదలకు షెడ్యూల్ అయిన పెద్ద చిత్రాల్లో చిరంజీవి ‘ఆచార్య’ (మే 13) కూడా వాయిదా పడింది. ఇవే కాదు.. వెంకటేశ్ ‘నారప్ప’ (మే 14), బాలకృష్ణ ‘అఖండ’ (మే 28), రవితేజ ‘ఖిలాడి’ (మే 28) చిత్రాలు విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇలా ఈ సమ్మర్ కూడా వెండితెరపై బొమ్మ పడకుండా ముగిసిపోయేలా ఉంది. వెండితెర వెలవెల చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది వేసవికి సినిమా పండగ లేకుండాపోయింది. 2020 మార్చి 13న విడుదలైన సినిమాలు ఓ మూడు నాలుగు రోజులు థియేటర్లలో ఉండి ఉంటాయేమో! ఆ తర్వాత కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల సినిమా థియేటర్లకు లాక్ పడింది. 13న ఓ పది చిన్న సినిమాల వరకూ విడుదలయ్యాయి. వాటిలో ‘బగ్గిడి గోపాల్, మద, అర్జున’ వంటి సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత సినిమాల విడుదలకు బ్రేక్ పడటంతో సమ్మర్ సంబరం మిస్సయింది. ఈసారి కూడా అదే జరిగింది. ఏప్రిల్ 2న నాగార్జున ‘వైల్డ్ డాగ్’, 9న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదలయ్యాయి. ఆ తర్వాత విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ వేసవి కూడా వెండితెర వెలవెలపోవడం సినీప్రియులకు బాధాకరం. నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి.. సినిమాని నమ్ముకున్న అందరికీ బాధాకరమే. ఓటీటీలో సినీ హవా తీసిన సినిమా హార్డ్ డిస్క్లోనే ఉండిపోతే నిర్మాతల హార్ట్ హెవీ అయిపోతుంది. పెరిగే వడ్డీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఈ పరిస్థితుల్లో కొందరు చిన్న నిర్మాతలకు ‘ఓటీటీ’ ప్లాట్‌ఫామ్ ఓ ఊరట అయింది. గతేడాది లాక్డౌన్లో నేరుగా ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతారామం’. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి చిన్న, మీడియమ్ బడ్జెట్ చిత్రాలు బోలెడన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలయ్యాయి. వాటిలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫొటో’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి చిత్రాలులొచ్చాయి. ఇలా ఆ సమ్మర్ నుంచి ఈ సమ్మర్ వరకూ ఓటీటీలో విడుదలై, ఇంటికే వచ్చిన సినిమాలెన్నో. పరిస్థితులు చూస్తుంటే ఇకముందు కూడా ఓటీటీ హవా కొనసాగేలా ఉంది. స్మాల్.. మీడియమ్‌లు కూడా... వేసవిలో పెద్ద సినిమాలే కాదు..పెద్ద సినిమాల మధ్యలో చిన్న, మీడియమ్ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఆ సినిమాలు కూడా ఈసారి వాయిదా పడ్డాయి. అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’, తేజా సజ్జా ‘ఇష్క్’, శ్రీకాంత్ ‘తెలంగాణ దేవుడు’, సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’ వంటి ఆ జాబితాలో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమైన అనసూయ ‘థ్యాంక్యూ బ్రదర్’ అనూహ్యంగా ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మే 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోలోగా.. ధైర్యంగా... గతేడాది వేసవి, దసరా, దీపావళి పండగలు సినిమాల సందడి లేకుండా వెళ్లిపోయాయి. సంవత్సరాంతంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఆరంభమయ్యాయి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి. ఆ బాధ్యతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ తీసుకుంది. సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? వసూళ్లు ఏమాత్రం ఉంటాయి? వంటి సందేహాల నడుమ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి గత మేలో విడుదల కావాల్సింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడి, డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చింది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి స్టార్స్ కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. అప్పటినుంచి మెల్లిగా సినీ పరిశ్రమ తేరుకుని, సినిమాల విడుదలకు ముందుకొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మంచి వసూళ్లతో టాలీవుడ్ కోలుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. -
ఇప్పుడు 5 కోట్లు తీసుకునే పూజా హెగ్డే.. తొలి సంపాదన ఎంతో తెలుసా?
పూజా హెగ్డే.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ హీరోయిన్లలో ఒకరు. ‘ అల వైకుంఠపురములో’ తర్వాత ఈ బుట్టబొమ్మ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో పాటు అఖిల్ లాంటి యంగ్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంది. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో పాటు చిరంజీవి ‘ఆచార్య’లో రామ్‌చరణ్ సరసన నటిస్తోంది. అలాగే ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’లోనూ ఈమే హీరోయిన్. వీటితో పాటు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో నటిస్తోంది. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా దూసుకెళ్తున్న ఈ బుట్టబొమ్మ.. రెమ్యునరేషన్న్ని కూడా అంతే వేగంగా పెంచేసింది. ‘అల వైకుంఠపురము’కు రూ.1.4 కోట్లు తీసుకున్న పూజ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి నూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తోందట. ప్రస్తుతం సౌత్‌లో రెమ్యునరేషన్ విషయంలో నయనతారతో పోటీ పడుతున్న ఈ భామ.. తొలి సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు. ఈ బ్యూటీ తొలిసారిగా జీవా హీరోగా నటించిన ‘మూగముడి’ సినిమాలో హీరోయిన్గా నటించింది. అంతకు ముందు మోడల్‌గా పనిచేసిన పూజా హెగ్డే.. ఈ సినిమా కోసం రూ. 30 లక్షల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. అలా తొలిసారి వచ్చిన సంపాదనతో పూజా హెగ్డే బీఎమ్డబ్లూ్య5 (BMW5) సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఇప్పటికే ఈ కారు పూజా హెగ్డే దగ్గర ఉంది. తొలిసారి తన సంపాదనతో కొన్ని ఆ కారు అంటే పూజాకు ప్రాణం అట. ఆ కారును పూజా హెగ్డే ఎంతో అపురూపంగా చూసుకుంటుందట. ఇక తనకు వచ్చిన డబ్బులను దుబారాగా ఖర్చు చేయకుండా వెంటనే తీసుకెళ్లి వాళ్ల అమ్మ చేతిలో పెట్టేస్తుందట. ఆ డబ్బుతో ఏం చేయాలనే నిర్ణయం వాళ్ల అమ్మదేనని ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డే చెప్పింది. -
ఇట్స్ అఫీషియల్: 'ఆచార్య' వాయిదా
కరోనా వల్ల గతేడాది తెలుగు ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది. కొన్ని నెలలపాటు థియేటర్లు తెరుచుకోనేలేదు. కానీ విచిత్రంగా ఈ ఏడాది ప్రారంభంలో మాత్రం జనాలు సినిమాల మీద ఆసక్తి కనబరుస్తూ థియేటర్లకు తరలి వచ్చారు. ఫలితంగా ఎన్నో సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు దర్శకనిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఇది చూసి సినీ ఇండస్ట్రీకి మళ్లీ పాత రోజులు వచ్చాయని అందరూ సంబరపడిపోయారు. కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఈసారి కరోనా సెకండ్ వేవ్ మరింత విజృంభించడంతో సినిమాకు గడ్డు రోజులు మొదలయ్యాయి. ఈసారి ప్రభుత్వాల కన్నా ముందే తెలుగు ఇండస్ట్రీ స్వచ్ఛందంగా థియేటర్లు మూసేయాలని నిర్ణయించుకుంది. దీంతో పలు సినిమాలు వాయిదాబాట పట్టాయి. ఇప్పటికే నాగచైతన్య 'లవ్‌స్టోరీ', రానా దగ్గుబాటి 'విరాటపర్వం', విశ్వక్సేన్ 'పాగల్' రిలీజ్లు వాయిదా వేసుకోగా తాజాగా మెగాస్టార్ కూడా అదే బాటలో నడిచాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. Keeping in view of the pandemic situation, #Acharya movie will not be releasing on May 13. New Release date will be announced once the situation becomes normal. Wear mask, Stay home & stay safe!#AcharyaPostponed — Matinee Entertainment (@MatineeEnt) April 27, 2021 దీంతో ఈ సినిమా మే 13న రిలీజ్ అవ్వడం లేదు. పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టులో ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ సిద్ధ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, చెర్రీకి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. చదవండి: సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’ ‘ఆచార్య’ టీంకు భారీ షాక్, మెగాస్టార్‌కు సైతం అదే బెడద -
‘ఆచార్య’ టీంకు భారీ షాక్, ఆందోళనలో దర్శకుడు
స్టార్ హీరోల సినిమాలకు క్రేజ్ ఎక్కువ. అందుకే ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకుకోనేందుకు లీక్ వీరు కాచుకుర్చుంటున్నారు. ఏమాత్రం ఛాన్స్ దొరికిన సినిమాల మేకింగ్ నుంచి విడుదల వరకు కీలక పాత్రలను, సన్నివేశాలను, కంటెంట్‌ను లీక్ చేసేస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి లీకు వీరులకు పని మరింత ఈజీ ఆయిపోయింది. దీంతో స్టార్ హీరోలకు, దర్శక-నిర్మాతలకు లీకేజీలు తల నొప్పిగా మరాయి. బాహుబలి నుంచి వకీల్ సాబ్ వరకు ఎన్నో చిత్రాలకు ఈ బెడదా తప్పలేదు. తాజాగా మెగాస్టార్ మూవీకి సైతం లీక్ దెబ్బ తాకింది. దర్శకుడు కొరటాల శివ ఆచార్య మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ మూవీ మేకింగ్ విషయంతో కొరటాల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఓ పాట విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో రోమాంటిక్ సాంగ్ హల్చల్ చేస్తోంది. అయితే ఈ పాట సోషల్ మీడియాలో మారుమోగడం చూసి ‘ఆచార్య’ టీం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎందుకంటే ఈ పాటను చిత్ర బృందం కాకుండా లీక్ వీరులు లీక్ చేశారు. కాగా ఇందులో రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే వీళ్లిద్దరిపై కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఇందులో పూజా పాత్ర పేరు నీలాంబరి అని ఇంతకుముందే చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ పేరు మీదే పాటను తీర్చిదిద్దారు. ఆ నీలాంబరి పాటే ఇప్పుడు ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. ఎవరు, ఎలా లీక్ చేశారన్నది మాత్రం తెలియదు కానీ.. నీలాంబరి అంటూ సాగే ఈ పాట చాలా బాగుందంటు కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాటికి ‘ఆచార్య’ సినిమాలో చరణ్, పూజా హెగ్డే షూటింగ్ అయిపోవాల్సింది కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది. చదవండి: మెగాస్టార్ రికార్డును బద్దలు కొట్టిన బాలయ్య కరోనా దెబ్బకు వెనకడుగు వేస్తున్న మెగాస్టార్ -
మెగాస్టార్ రికార్డును బద్దలు కొట్టిన బాలయ్య
"కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.." ఇదిప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానుల ఫేవరెట్ డైలాగ్. కేవలం డైలాగ్ మాత్రమే కాదు, స్వామీజిగా దర్శనమిచ్చిన బాలయ్య లుక్స్‌కు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. యూట్యూబ్‌లో రికార్డులను సైతం తిరగరాస్తోంది. అఖండ టీజర్ విడుదలైన 25 గంటల్లో 12 మిలియన్ల వ్యూస్ రాగా ఆరు రోజులకే 27 మిలియన్ల వ్యూస్ దాటేసింది. రెండు నెలల క్రితం రిలీజైన మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా టీజర్‌కు మాత్రం ఇప్పటివరకు 19 మిలియన్ల వ్యూసే వచ్చాయి. 'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్ నెల రోజుల్లో 7 మిలియన్ల వ్యూస్ మాత్రమే రాబట్టింది. దీంతో బాలయ్య సినిమా రిలీజ్‌కు ముందే తన హవా చూపిస్తున్నాడని ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. మొత్తానికి హీరోల రికార్డులను ఒక్క టీజర్‌తో బద్దలు కొట్టేశాడు బాలయ్య. కాగా బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో వస్తున్న 'అఖండ' సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చదవండి: Akhanda: అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య -
సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’
ఈ సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటి? ఈ కరోనా ఎటువైపు తీసుకెళుతోంది? కరోనా ఫస్ట్ వేవ్ చాలా నష్టాన్ని మిగిల్చింది. తొలి తాకిడి తట్టుకుని, మెల్లిగా తేరుకుంటున్న సమయంలో... ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్లీ సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’ వేయక తప్పడం లేదు. సెకండ్ వేవ్ ప్రభావంతో తాజాగా అర్ధంతరంగా షూటింగ్ ఆగిన చిత్రాల గురించి తెలుసుకుందాం... కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ చేస్తూ వచ్చారు. కానీ, రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువ అవుతుండడం, ఇదే చిత్రం షూటింగ్లో పాల్గొన్న సోనూ సూద్ కరోనా బారినపడటంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారు. చిత్రీకరణ ఆపాలనే నిర్ణయాన్ని సోమవారం తీసుకుంది చిత్రబృందం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్‌కి పడిన బ్రేక్ కారణంగా ఆ సమయానికి ‘ఆచార్య’ తెరపైకి రావడం కుదరకపోవచ్చు. మరోవైపు ఇంకో పదంటే పది రోజులు మాత్రమే షూటింగ్ చేస్తే, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పూర్తయిపోతుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ తీస్తే సినిమా పూర్తయిపోతుంది. పది రోజుల షూటింగ్ ఎలాగోలా పూర్తి చేయాలనుకున్నారు కూడా! కానీ, ఇప్పుడు మాత్రం షూటింగ్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’ చిత్రాల షూటింగ్ ఆపాలనుకున్న విషయం సోమవారం బయటికొచ్చింది. ఇక, ఇప్పటికే కరోనా వల్ల ఆగిన సినిమాల విషయానికొస్తే... మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. షూటింగ్లో పాల్గొనే ముందు యూనిట్ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజటివ్ నిర్ధారణ అయిందట. వీరిలో హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరు కూడా ఉన్నారు. దీంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ‘సర్కారువారి పాట’ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు బ్రేక్ పడింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. ఇక రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్)కి బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ముంబయ్‌లో గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేశారట. అయితే మహరాష్ట్రలో చిత్రీకరణలను ఆపేయాల్సిందిగా ప్రభుత్వం నిబంధన విధించడంతో ‘ఆర్ఆర్ఆర్’ ప్లాన్ ముందుకు సాగలేదని సమాచారం. ‘ఎఫ్ 2’లో బోలెడంత ఫస్ అందించిన వెంకటేశ్, వరుణ్ తేజ్ మళ్లీ నవ్వించడానికి ‘ఎఫ్ 3’ చిత్రీకరణతో బిజీ అయ్యారు. సరదా సరదాగా సాగుతున్న ఈ సినిమా చిత్రీకరణకు చిత్రదర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా సోకడం వల్ల బ్రేక్ పడింది. ఈ చిత్రం ఆగస్టు 27న రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల పవన్‌కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. అంతే కాదు... ఆయన చిత్రబృందంలో ఇంకా పాజిటివ్ నిర్ధారణ అయినవాళ్లు చాలా ఉన్నారట. దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సీనియర్ కో–డైరెక్టర్ సత్యం కరోనా బారిన పడి కన్నుమూశారు. దీంతో పవన్‌కల్యాణ్–రానా నటిస్తున్న మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్ నిలిచిపోయింది. మరోవైపు వేగంగా షూటింగ్ సాగుతున్న హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాకు కూడా కరోనా బ్రేక్ వేసింది. హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిపివేసినట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిన్నా పెద్ద సినిమాల చిత్రీకరణలు ఆగాయి. మొత్తానికి షూటింగ్స్ తేదీలన్నీ తారుమారవుతున్నాయి. విడుదల తేదీలు తారుమారయ్యే అవకాశం ఉంది. కరోనా చేస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. -
ఆచార్యలో రామ్‌చరణ్ పాత్ర అదే
ధర్మస్థలిలో శత్రుసంహారం చేస్తున్నాడు సిద్ధ. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో ‘సిద్ధ’ అనే ప్రధాన పాత్రను రామ్‌చరణ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా కోసం ధర్మస్థలి విలేజ్ సెట్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో చిత్రబృందం తయారు చేయించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆ సెట్లోనే జరుగుతోంది. రామ్‌చరణ్, సోనూ సూద్ కాంబినేషన్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. మే 13న ‘ఆచార్య’ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆచార్య: సైకిల్ మీద సెట్స్‌కు వెళ్లిన సోనూసూద్
లాక్డౌన్లో వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేసి ఎందరో పాలిట దేవుడిగా మారాడు నటుడు సోనూసూద్. కష్టాల్లో ఉన్న చాలామందికి ఆర్థిక సాయం చేస్తూ రియల్ హీరోగా పేరు గాంచాడు. ఇటీవల అల్లుడు అదుర్స్‌లో కనిపించిన సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా అతడు సినిమా సెట్స్‌కు సైకిల్ మీద వెళ్లాడు. హైదరాబాద్ రోడ్ల మీద సైకిల్ తొక్కుకుంటూ షూటింగ్‌కు వెళ్లిన సోనూసూద్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాలుష్యాన్ని తగ్గించాలన్న సందేశంతో పాటు ఇలా సైక్లింగ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండొచ్చని చెప్పకనే చెప్తున్నారు హీరో సోనూసూద్. అతడి సింప్లిసిటీకి, ఫిట్నెస్ మీద ఉన్న శ్రద్దకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు నెటిజన్లు. ఇక 'ఆచార్య' సినిమా విషయానికి వస్తే దీన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు సినీపండితులు. చదవండి: కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్ స్పెషల్ డ్రైవ్ -
ఉగాది స్పెషల్ పోస్టర్లు: ఫిదా అంటున్న సినీ లవర్స్
ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఆరగిస్తూ ఆ పోస్టర్లేంటో చూసేద్దాం.. ఆయుధమైనా ...అమ్మాయి అయినా ... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. #Acharya ఉగాది శుభాకాంక్షలు!!@AlwaysRamCharan @sivakoratala @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sW24eo5FJl — Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2021 ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది అంటూ ఆచార్య నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ పూజా హెగ్డే కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 13న థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. Ugadi wishes to you and your family ! Stay safe ... take care #Lovestory@sai_pallavi92 @sekharkammula@SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic @niharikagajula pic.twitter.com/lkpmupZ1TM — chaitanya akkineni (@chay_akkineni) April 13, 2021 నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం లవ్‌స్టోరీ. ఉగాది రోజు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా బాట పట్టింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. Looking forward to another fun schedule with the team 🙌! #HappyUgadi#F3Movie#F3OnAug27th@IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official pic.twitter.com/uby6jO2enY — Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021 పండగ రోజు కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాం అంటున్నారు ఎఫ్ 3 యూనిట్ సభ్యులు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఓ రేంజ్లో ఉంటుందని చెప్తున్న ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. #HappyUgadi from Team #Thimmarusu.. Get ready for an entertaining thriller in theatres from May 21!@ActorSatyadev#PriyankaJawalkar @actorbrahmaji @ActorAnkith@smkoneru @nooble451 @SharanDirects@EastCoastPrdns@SOriginals1 @vamsikaka @SricharanPakala @MangoMusicLabel pic.twitter.com/yNTva0xdSW — BARaju (@baraju_SuperHit) April 13, 2021 సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తిమ్మరుసు. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి సత్యదేవ్ లుక్‌ను రిలీజ్ చేశారు. చిక్కుముడులను విప్పేందుకు తీక్షణంగా ఆలోచిస్తున్నట్లున్న కనిపిస్తున్న ఈ లుక్ ఉగాది పచ్చడిలా బాగుందంటున్నారు సినీ లవర్స్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 21న విడుదల కానుంది. Hope this Ugadi brings you peace & abounding happiness ! Let's stay safe while we celebrate the day with our loved ones 🙏#Narappa pic.twitter.com/SxtIuVqQRf — Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021 కుటుంబంతో కలిసి బయటకు పయనమయ్యాడు నారప్ప. ఇంతకుముందు ఉగ్రరూపంలో కనిపించి భయపెట్టిన వెంకటేశ్ ఇందులో మాత్రం ఫ్యామిలీమ్యాన్‌గా ఆకట్టుకున్నాడు. Ugadi wishes from the team of #VirataParvam pic.twitter.com/LVfzsevt8W — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2021 సాయి పల్లవి అచ్చమైన గ్రామీణ యువతిగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం. ఉగాది పర్వదినాన స్పెషల్ పోస్టర్‌తో విందు భోజనం పెట్టింది చిత్రయూనిట్. సాయిపల్లవి కడప మీద ముగ్గు వేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రానా దగ్గుబాటి నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతోంది. Baadshah @KicchaSudeep’s #K3Kotikokkadu Team Wishing everyone a #HappyUgadi Dubbing works are on full Swing, Release in Kannada&Telugu simultaneously!@ArjunJanyaMusic @MadonnaSebast14 @shraddhadas43 #ShivaKarthik @thegcgofficial @shreyasgroup @anandaudioTolly @Mymoviebazaar pic.twitter.com/o73wH0tMz4 — BARaju (@baraju_SuperHit) April 13, 2021 కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం కే3 కోటికొక్కడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు సుదీప్. డబ్బింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయంటోంది చిత్రయూనిట్. అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....!!#TuckJagadish #HappyUgadi@NameisNani @riturv @aishu_dil @IamJagguBhai @DanielBalaje @ShivaNirvana @MusicThaman @praveenpudi @sahugarapati7 @harish_peddi @sahisuresh @Shine_Screens @adityamusic pic.twitter.com/HfT4JUHdRK — BARaju (@baraju_SuperHit) April 13, 2021 ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేసింది టక్ జగదీష్ టీమ్. ఇందులో నేచురల్ స్టార్ నాని సకుటుంబ సపరిమేతవారంగా పండగ వేడుకలు జరుపుకుటున్నట్లుగా ఉంది. అందరూ నవ్వులు చిందిస్తోన్న ఈ లుక్ నాని ఫ్యాన్స్‌కు తెగ నచ్చింది. ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన టక్ జగదీష్‌ను కరోనా వల్ల వాయిదా వేశారు. ఉగాది శుభాకాంక్షలతో త్వరలో మీ ముందుకు వస్తున్నాము! Team #Seetimaarr wishes everyone #HappyUgadi 🌿@YoursGopichand @tamannaahspeaks @SS_Screens #ManiSharma @DiganganaS @bhumikachawlat @adityamusic @_apsara_rani @soundar16 @actorrahman @TarunRajArora pic.twitter.com/iVQZxg1qlb — Sampath Nandi (@IamSampathNandi) April 13, 2021 గోపీచంద్ సిటీమార్ నుంచి మాస్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఐదుగురు ఆడవాళ్లు బైక్ నడుపుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఇది ఊరమాస్‌గా ఉందంటున్నారు నెటిజన్లు. అందరికీ శ్రీ ప్లవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!#SonofIndia🇮🇳 #HappyUgadi pic.twitter.com/kCMO7bidPT — Mohan Babu M (@themohanbabu) April 13, 2021 సన్ ఆఫ్ ఇండియా నుంచి మోహన్‌బాబు లుక్‌ను రిలీజ్ చేశారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను విష్ణు మంచ్ నిర్మిస్తున్నాడు. Thrilling Trilingual flick #Seethayanam movie Team wishes everyone a Happy Ugadi Here's the brand New Poster @akshith_sk @AnahitaBhooshan @DirPrabhakar #RohanBharadwaj #LalithaRajyalakshmi @padmanabhmusic @ColorCloudsEnt @LahariMusic @PulagamOfficial pic.twitter.com/ejlUqOaiML — BARaju (@baraju_SuperHit) April 13, 2021 సీతాయణం నుంచి ఉగాది స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఉగాది శుభాకాంక్షలు 'మే' లో వస్తున్నాం @MeghamshSrihari @SamVegesna @RiddhiKumar_ @ItsMeghaC #RajendraPrasad @VegesnaSatish1 #MLVSatyanarayana @anuprubens@ShreeLyricist@rajeshmanne1 #LakshyaProductions #KothiKommachi pic.twitter.com/7s0ssBACvg — BARaju (@baraju_SuperHit) April 13, 2021 మేలో వస్తున్నామంటున్న కోతి కొమ్మచ్చి.. సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టామంటున్న సర్కారు వారి పాట SuperStar @urstrulymahesh joins #SarkaruVaariPaata 2nd Schedule today with all necessary safety precautions 💥#HappyUgadi 😊@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/kerp3YcaL8 — BARaju (@baraju_SuperHit) April 13, 2021 Team #AndarubagundaliAnduloNenundali Wishes a Very Happy Ugadi ,Filled With laughter, joy and fulfilment! #HappyUgadi#Ali & @ItsActorNaresh #Mouryaani 🎬 : #SripuramKiran 🎼 : @RakeshPazhedam@SivaMallala @IamEluruSreenu pic.twitter.com/DBvbsaIIIV — BARaju (@baraju_SuperHit) April 13, 2021 అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....!! Team #GullyRowdy wishes you A very Happy & safe Ugadi.#HappyUgadi@sundeepkishan @actorsimha #NehaHarirajShetty #GNageswaraReddy #RamMiryala @iamsaikartheek @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp @MangoMusicLabel pic.twitter.com/hHWtPiOcvZ — BARaju (@baraju_SuperHit) April 13, 2021 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు! - #101JillalaAndagadu #HappyUgadi#SrinivasAvasarala @iRuhaniSharma #SagarRachakonda @DopRaamReddy @shakthikanth @bhaskarabhatla #KiranGanti #DilRaju @DirKrish @SVC_official @FirstFrame_Ent #Shirish @YRajeevReddy1 #JSaiBabu pic.twitter.com/f1Z4QDskIf — BARaju (@baraju_SuperHit) April 13, 2021 Here's, the Captivating First Look Poster of #AadiSaiKumar's #BLACK 💥 Team #Black wishes everyone a Happy UGADI 🎋 Written & Directed : #GBKrishna Producer : #MahankaliDiwakar Music : #SureshBobbili DOP : #SatishMuthyala@IamEluruSreenu @dhani_aelay#HappyUgadi2021 pic.twitter.com/fOjTHgBd9x — BARaju (@baraju_SuperHit) April 13, 2021 #HappyUgadi from Team #HouseArrest!! 🎧 #FreeBirds ▶️ https://t.co/y9EjBrWr3L#HouseArrestOnMay7th@Sekhar_Dreamz @anuprubens @boselyricist @Chaitanyaniran @Niran_Reddy @AsrinReddy @Actorysr @IamSaptagiri @ChotaKPrasad @Yuvadop @Primeshowtweets @ARMusic2021 pic.twitter.com/cuNUpXyP1n — BARaju (@baraju_SuperHit) April 13, 2021 -
కరోనా దెబ్బకు వెనకడుగు వేస్తున్న మెగాస్టార్
సెకండ్ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనా దెబ్బకు పలు సినిమాలు రిలీజ్‌ను వాయిదా వేసుకుంటున్నాయి. ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన నాగచైతన్య, సాయిపల్లవిల 'లవ్‌స్టోరీ' సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా టెన్షన్‌తో మెగా అభిమానులందరు థియేటర్‌కు వచ్చే అవకాశాలు లేకపోవచ్చని, కాబట్టి వాయిదా వేయడమే బెటర్ అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో మే 13న విడుదల కావాల్సిన ఆచార్య సరిగ్గా ఆ తేదీకి థియేటర్లలోకి రాకపోవచ్చని అంటున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూన్ 18న విడుదల కానున్నట్లు ఫిల్మీదునియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా 'ఆచార్య'లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: 'ఆచార్య' షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రామ్‌చరణ్ శత్రుసంహారానికి ఆచార్య సిద్ధం! -
ఆచార్య ‘లాహే లాహే’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీలవ ఈ మూవీలోని ‘లాహే లాహే’ పాటను చిత్ర బృదం విడుదల చేసింది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ మారి.. అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఆ పాట తెలుగు లిరిక్స్ మీ కోసం.. పల్లవి: లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. కొండలరాజు బంగరుకొండ కొండజాతికి అండదండ మద్దెరాతిరి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే .. !! లాహే లాహే !! చరణం: మెళ్ళో మెలికల నాగులదండ వలపుల వేడికి ఎగిరిపడంగా ఒంటి ఇబుది జల జల రాలిపడంగ సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విల విల నలిగిండే .. !! లాహే లాహే !! చరణం: కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిరబోసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలెగసిన కుంకమ్ బొట్టు వెన్నెల కాసిందే పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే ఉబలాటంగా ముందటికురికి అయ్యవతారం చూసిన కలికి ఎందా సెంకం సూలం బైరాగేసం ఎందని సనిగిందె ఇంపుగా ఈపూటైన రాలేవా అని సనువుగా కసిరిందే ... !! లాహే లాహే !! చరణం: లోకాలేలే ఎంతోడైన లోకువమడిసే సొంతింట్లోన అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు ఆలుమగల నడుమన అడ్డంరావులె ఇట్టాటి నీమాలు ఒకటోజామున కలిగిన విరహం రెండోజాముకు ముదిరిన విరసం సర్దుకుపోయే సరసం కుదిరే యేలకు మూడో జామాయే ఒద్దిక పెరిగే నాలుగోజాముకు గుళ్లో గంటలు మొదలాయే... !లాహే లాహే ! ప్రతి ఒక రోజిది జరిగే గట్టం యెడముఖమయ్యి ఏకం అవటం అనాది అలవాటిల్లకి అలకలలోనే కిలకిలమనుకోటం స్వయానా చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం సినిమా: ఆచార్య సంగీతం: మణిశర్మ రచన: రామజోగయ్య శాస్త్రి గానం: హారికా నారాయణ్, సాహితీ చాగంటి -
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్.. చిరంజీవి, రానా మూవీలకు బిగ్ షాక్!
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’సినిమాలకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు సిసినిమాలకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వొద్దని హైదరాబాద్ ఆధారిత సంస్థ యాంటీ టెర్రరిజం ఫోరమ్ సెన్సార్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ రెండు సినిమాలు నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నవే. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది జవాన్లు మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత మావోయిస్టులపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.ఈ నేపథ్యలో నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ వస్తున్న ‘ఆచార్య’, ‘విరాటపర్వం’ చిత్రాలకు అనుమతి ఇవ్వొదన్ని యాంటీ టెర్రరిజం ఫోరమ్ తాజాగా సెన్సార్ బోర్డుకు విన్నవించింది. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలు రాకుండా చూడాలని కోరింది. తమ విజ్ఞప్తిని కాదని సినిమాలను విడుదల చేస్తే... కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆచార్య, విరాటపర్వం చిత్రాలపై సెన్సార్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న చిత్రమే ‘ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో చిరు, రామ్ చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మే 13న ఈ సినిమా విడుదలకానుంది. ఇక రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ఉడుగుల వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాటపర్వం’. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రియమణి, నివేదా పెతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ట్విట్టర్లో మెగాస్టార్ ఫాలో అయ్యే ఒకే ఒక వ్యక్తి ఆయనే..
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవి ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా అంటూ ఓ వార్త హైలెట్ అవుతుంది. చిరంజీవి ట్విట్టర్లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి. ఈ విషయాన్ని చెబుతూ ఓ నెటిజన్ రామ్‌జోగయ్య శాస్త్రికి ట్యాగ్ చేశారు. 'సర్, మీరు గమనించారో లేదో చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి మీరు. మీ సుసంపన్నమైన జ్ఞానానికి అది చిరంజీవి గారు మీకు ఇచ్చిన బహుమతి' అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రామ జోగయ్య శాస్త్రి.. 'చిరంజీవి సర్ ప్రేమ, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొండంత సంతోషంగా ఉన్నాను' అని ఆ పోస్ట్‌ను షేర్ చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరంజీవి వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనమంటూ చిరు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా చిరు కొత్త సినిమా 'ఆచార్య'కు రామ జోగయ్య శాస్త్రి పాటలు రాసిన విషయం తెలిసిందే. Forever indebted to the Mega love n blessings dear @KChiruTweets Sir💕 Kondantha santhosham gaa unnanu 🙏 https://t.co/ZRWgfL5jwA — RamajogaiahSastry (@ramjowrites) April 2, 2021 చదవండి : చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్ మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్! -
ఆచార్య ఫస్ట్ సాంగ్: సీనియర్ నటి స్పెషల్ అట్రాక్షన్
మెగా అభిమానులకు సర్ప్రైజ్. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. చెర్రి ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిరంజీవి 152వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ జనవరి 29 విడుదలైన సంగతి తెలిసిందే. రీలిజైన క్షణాల్లోనే టీజర్ లక్షవ్యూస్ సంపాదించి యూట్యూబ్ సంచలనమైంది. బ్యాక్‌గ్రౌండ్‌లో చెర్రి వాయిస్ వస్తుండగా చీరు ఎంట్రీ ఇచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆచార్యలోని మొదటి లిరికల్ సాంగ్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం. ‘లాహే లాహే’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో సీనియర్ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్ అగర్వాల్ ఆమెతో కలిసి కాలు కదిపింది. గుడి సమీపంలో సాగే ఈ పాటకు మధ్యలో చిరు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. కాగా గేయ రచయిత రామజోగయ్య శాస్రీ సాహిత్యం అందించగా.. మణిశర్మ స్వరాలు సమకుర్చారు. సింగర్స్ హరిక నారాయణ్, సాహితి చాగంటిలు ఆలపించిన ఈ పాటకు దినేష్ కొరియోగ్రాఫి అందించాడు. చదవండి: మెగాస్టార్ ఆన్ ద వే.. మే 13కు 'ఆచార్య' రెడీ మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్! -
శత్రుసంహారానికి ఆచార్య సిద్ధం!
ధర్మానికి ధైర్యం తోడైన వేళ శత్రుసంహారానికి ఆచార్య సిద్ధమయ్యాడు. సిద్ధతో సహా ముందుడుగు వేశాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆచార్యగా చిరంజీవి, సిద్ధ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. శనివారం చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో తండ్రీకొడుకులు కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘మీతో కలిసి నటించడంతో నా కల నెరవేరినట్లు ఉంది నాన్నా. ఇంతకన్నా నాకు బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది’’ అని, ‘లాహి లాహి...’ పాటలో వింటేజ్ మెగాస్టార్‌ని చూస్తారని ప్రామిస్ చేస్తున్నాం అని పేర్కొన్నారు రామ్‌చరణ్. అలాగే ‘ఆచార్య’లోని ‘లాహి లాహి...’ అనే పాట లిరికల్ వీడియోను మార్చి 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ పాటకు సంబంధించి చిరంజీవి ఫొటోను విడుదల చేశారు. మే 13న ఈ సినిమా రిలీజ్. -
మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్!
ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా సినిమా విడుదలకు ముందే కొన్ని ముఖ్యమైన సీన్స్ లీకవడం చూస్తుంటాం. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఒక్కొసారి అవి నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కథను హీరో ముందే రివీల్ చేయడంతో నిర్మాతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఆ ప్రముఖ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్లో 152వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. చిరంజీవికి జోడిగా హీరోయిన్ కాజల్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్‌స్టార్ రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పలు సినిమా వేడుకలకు హాజరవుతున్న చిరంజీవి.. తాజాగా రానా, సాయిపల్లవి నటిస్తోన్న విరాటపర్వం ట్రైలర్‌ను మార్చి 18న లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విరాటపర్వం టీంను ప్రశంసిస్తూనే ఆయన ఆచార్య కథను రివీల్ చేసేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘విరాటపర్వం’ టీజర్ చూస్తుంటే ఇది నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ అని తెలుస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే.. నా సినిమా ఆచార్య కూడా నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీనే. అయితే ‘ఆచార్య’ ఒక యూనిక్ ఫిల్మ్ అని భావిస్తున్నాను. అలాంటి సినిమా ఈ మధ్య రాలేదనుకుంటున్నాను. కానీ నక్సల్ కథతోనే ‘విరాటపర్వం’ మూవీ రావడం కొంత నిరాశ కలిగించింది. కానీ ఇది మా ‘ఆచార్య’ కంటే ముందు వస్తుంది కాబట్టి ‘విరాటపర్వం’ హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను. అలాగే మా సినిమాకు ఈ కథ ప్లస్ అవ్వాలని కూడా నేను ఆశపడుతున్నా' అని పేర్కొన్నారు. ఇంతకుముందు దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో అచార్య కథ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో నక్సల్స్ నేపథ్యం కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. వీటిపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా...చిరంజీవి మాత్రం ఆచార్య కథపై తొందరపడి క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనూ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి..తాను నటిస్తున్న కొరటాల శివ సినిమా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ అనౌన్స్ కాకముందే.. ఆ వేడుకలో తాను నటిస్తున్న సినిమా పేరు ఆచార్య అంటూ టైటిల్‌ను రివీల్ చేశారు. చదవండి : బ్రేక్ లేకుండా బిజీబిజీగా మారనున్న మెగాస్టార్ డాక్టర్ రవి శంకర్ నక్సలైట్ రవన్నగా ఎలా మారాడు? -
బ్రేక్ లేకుండా బిజీబిజీగా మారనున్న మెగాస్టార్
‘ఆచార్య’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు తర్వాతి సినిమా చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో ఆయన నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనుకుంటున్నారట చిత్రదర్శకుడు మోహన్ రాజా. ఈ సినిమా కాకుండా బాబీ, మెహర్ రమేష్ దర్శకత్వాల్లో కూడా చిరంజీవి హీరోగా సినిమాలు తెరకెక్కనున్నాయి. సెట్స్‌లో ఒక సినిమా, కమిట్ అయిన మూడు సినిమాలతో చిరంజీవి బ్రేక్ లేకుండా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. చదవండి: యాంకర్ సుమకు అమెరికాలో అరుదైన సత్కారం -
మెగాస్టార్ ఆన్ ద వే.. మే 13కు 'ఆచార్య' రెడీ
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్. ఇతడికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన రాజమండ్రి, ఇల్లందుల షెడ్యూల్ పూర్తి కావడంతో చిరు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే అక్కడ తీవ్రమైన ఎండలకు చిరు ఉక్కిరిబిక్కిరి అయ్యాడని, దీంతో డీహైడ్రేషన్‌కు గురైన ఆయన షూటింగ్‌కు కొద్ది రోజులు బ్రేక్ చెప్పనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ రూమర్లను చిత్రయూనిట్ కొట్టిపారేసింది. చిరంజీవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని స్పష్టం చేసింది. ఖమ్మం, రాజమండ్రి షెడ్యూల్‌ను సైతం విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. నెల రోజుల షూటింగ్లో చిరంజీవి, చరణ్ మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 13న విడుదల కానుంది. కాగా ఆచార్య షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టగానే చిరంజీవి నెక్స్ట్ లూసిఫర్ రీమేక్ చిత్రీకరణలో భాగం కానున్నాడు. Team #Acharya completed a month long schedule in Rajahmundry and Illendu regions of AP and Telangana. Gearing up for a grand world wide release on 13th May, 2021. #MegastarChiranjeevi#AcharyaOnMay13 pic.twitter.com/7kI16YEKTo — BARaju (@baraju_SuperHit) March 10, 2021 చదవండి: -
సింగరేణి బొగ్గు గనుల్లో ‘ఆచార్య’ షూటింగ్
కొత్తగూడెం: చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ చిత్రీకరణ భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో ప్రారంభమైంది. దీంతో చిత్ర బృందం ఇల్లందుకు చేరుకుంది. ఆదివారం ఉదయం ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కోసం మూవీ యూనిట్ ఉపరితల గనిలోకి దిగింది. ఇప్పటికే పలుమార్లు జేకే5 ఉపరితల గని, అండర్ గ్రౌండ్ మైన్స్‌ను తన సాంకేతిక చిత్ర బృందంతో దర్శకుడు కొరటాల శివ పరిశీలించారు. తాజాగా జేకే5 ఉపరితల గని వ్యూ పాయింట్ నుంచి ఉపరితల గనిలోకి దిగి, బ్లాస్టింగ్ పని జరుగుతున్న ఏరియాలు, సినిమాకు అనువైన లొకేషన్లను ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణులతో కలిసి లొకేషన్లను చూశారు. ప్రస్తుతానికి హీరో లేకుండా ఉన్న కొన్ని సన్నివేషాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ రోజు జరిగే షూటింగ్లో హీరో చిరంజీవి పాల్గొంటారా? లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ‘ఆచార్య’ మూవీ చిత్రీకరణ మార్చి 15వరకు ఇల్లందులో జరగనుంది. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన ఓ షెడ్యూల్ తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లిలో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ స్పాట్లో అభిమానులు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత నెలలో ఖమ్మం జిల్లాలోని బొగ్గు గనుల్లో సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను దర్శకుడు కొరటాల శివ కలిసిన విషయం తెలిసిందే. చదవండి: Acharya: మారేడుమిల్లి ఫారెస్ట్‌లో చిరు, చెర్రీ చదవండి: చిరంజీవికి ఆతిథ్యం ఇస్తా -
రామ్‌చరణ్‌ను చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కతున్నసినిమా ఆచార్య. ఇందులో రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో చిరంజీవి, రామచరణ్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ షూటింగ్‌ను రామ్‌చరణ్ పూర్తి చేసుకున్నారు. 20 రోజుల షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ పయనమయ్యాడు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకున్న రామ్‌చరణ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. చెర్రీతో కలిసి సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మరోవైపు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. చదవండి : (మూవీలో చరణ్ అన్న అలా చేయమని చెప్పాడు: వైష్ణవ్) (#pspkrana షూటింగ్ సెట్.. ఫొటో లీక్) -
‘ఆచార్య’ సెట్లో సందడి చేయనున్న మెగా కోడలు
మెగా కోడలు ఉపాసన కామినేని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలైన మామ, భర్త సినిమా షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటే.. కోడలు సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా నిత్యం వార్తల్లో ఉంటారు. అయినప్పటికీ భర్త రామ్ చరణ్ షూటింగ్లో సెట్స్‌లో కూడా అప్పుడప్పుడు దర్శనమిస్తుంది. తాజా ఆమె ‘ఆచార్య’ సెట్లో కూడా సందడి చేసేందుకు పయనమైంది. ఇందుకోసం గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదెరి కొద్ది సేపటి క్రితమే రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చెర్రీ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య షూటింగ్లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కతున్నఈ మూవీలో చెర్రీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ మారెడుమిల్లిలోని అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. అక్కడ చిరంజీవి, రామచరణ్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు నిన్న చెర్రీ షేర్ చేసిన ఓ స్టిల్ చూస్తే తెలుస్తోంది. అంతేగాక రామ్ చరణ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో చెర్రీ ఒకేసారి రెండు మూవీ షూటింగ్లలో పాల్గొంటు ఫుల్ బిజీ ఆయిపోయాడు. చదవండి: ‘సాహో’ డైరెక్టర్‌తో కన్నడ స్టార్ హీరో సుదీప్ మూవీ! ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ షూట్లో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కామ్రేడ్‌గా చరణ్.. ఆచార్య సెట్లో నాన్నతో ఇలా.. -
కామ్రేడ్‌గా చరణ్.. ఆచార్య సెట్లో నాన్నతో ఇలా..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించగా అభిమానులు వేయి కళ్లతో ఎదురు చేస్తున్నారు. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించనున్న విషయం తెలిసిందే. సిద్ధ అనే పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. అక్కడే చిరు, చరణ్‌పై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికోసం భారీగానే టీం కూడా అక్కడికి వెళ్లింది. తాజాగా రామ్ చరణ్ తన ట్విటర్లో షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులోచరణ్ ముందు వైపుకి తిరిగి ఉండగా వెనక నుంచి తన భుజంపై చిరంజీవి చేయి వేసినట్లు కనిపిస్తోంది. చేతికి ఎర్ర రంగు వస్త్రం చుట్టుకొని కనిపిస్తున్న ఈ ఫోటోను పోస్టు చేస్తూ.. తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని అంటున్నాడు. ‘కామ్రేడ్ మూమెంట్.. ఆచార్య సెట్లో నాన్న, కొరటాల శివ గారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను’. అని చరణ్ ఎమోషనల్ అయ్యాడు. ఇదే ఫోటోను కొరటాల శివ షేర్ చేస్తూ.. ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడని పేర్కొన్నాడు. కాగా మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. మరి సినిమాలో వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలియాలంటే మే 13 వరకు వేచి ఉండాల్సిందే.. A Comrade moment! Enjoying every moment with Dad @KChiruTweets & @sivakoratala Garu on #Acharya sets.@MatineeEnt @KonidelaPro pic.twitter.com/FPhSCJf1f1 — Ram Charan (@AlwaysRamCharan) March 1, 2021 చదవండి: ఆచార్య షూటింగ్: వీడియో తీసిన ఫ్యాన్స్! అమ్మ పుట్టినరోజు.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ -
ఆచార్య షూటింగ్: వీడియో తీసిన ఫ్యాన్స్!
సాక్షి, తూర్పుగోదావరి: మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150 చిత్రాల్లో చిన్న చిన్న సీన్లలో లేదా, పాటల్లోనో స్క్రీన్ మీద కనిపించారు చిరంజీవి, రామ్‌చరణ్. కానీ తొలిసారిగా ఈ తండ్రీకొడుకులు పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ప్రస్తుతం ఆచార్య యూనిట్ రాజమండ్రిలో మకాం వేసిన సంగతి తెలిసిందే. మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న షెడ్యూల్లో చరణ్‌పై ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ సైతం పాల్గొన్నారు. షూటింగ్ స్పాట్‌కు చేరుకున్న అభిమానులు వారిని ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేములో చూసిన అభిమానులు సమ్మర్లో సందడి మామూలుగా ఉండదంటున్నారు. ఇక్కడ షూటింగ్ పూర్తైన వెంటనే మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో మరో షెడ్యూల్ ప్లాన్ చేసింది ఆచార్య యూనిట్. ఈ మేరకు ఇల్లందులోని జేకే మైన్స్‌లో షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్. అతడికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆచార్యలో సీన్స్ మాత్రమే కాకుండా లెట్స్ డు కుమ్ముడు అంటూ ఈ తండ్రీకొడుకులు స్టెప్స్ వేస్తారని టాక్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 13న రిలీజ్ కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. పైగా ఈ టీజర్‌కు రామ్‌చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరింత ఆకర్షణగా మారింది. చదవండి: ఆచార్య: తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ -
‘ఆచార్య’లో మంచి పాత్ర పోషిస్తున్నా..
ఆకివీడు: సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని మండలంలోని కళింగగూడెంకు చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్ (గెటప్ శ్రీను) అన్నా రు. స్వగ్రామానికి వచ్చిన ఆయన సోమ వారం విలేకరులతో మాట్లాడారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హిందీ, తమిళం, కన్నడ, మళయాళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతోన్న ‘లైగర్’ చిత్రంలో తాను నటిస్తున్నానని చెప్పారు. చిరంజీవి ఆచార్య చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రాజూ యాదవ్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నానన్నారు. ఖైదీ నెం.150, జాంబీ రెడ్డి చిత్రాల్లో పాత్రలకు పేరువచ్చిందన్నారు. చదవండి: చిత్రం మూవీకి సీక్వెల్ "చిత్రం 1.1 చదవండి: చిరంజీవీ సరసన త్రిష -
ఎయిర్ పోర్ట్‌లో చిరంజీవికి ఘన స్వాగతం
‘ఆచార్య’ షూటింగ్ కోసం మారేడుపల్లికి బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవికి రాజమండ్రి- మధురపూడి ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. చిరు రాక సమాచారం తెలుసుకున్న మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన కి బయలుదేరిన చిరంజీవి.. అభిమానులకు అభివాదం చేస్తూ ఏజెన్సీలో జరగనున్న షూటింగ్‌కు ర్యాలీగా వెళ్లారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనున్న ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఈ క్రమంలో మారేడుమిల్లిలో షూటింగ్ ను షెడ్యూల్ చేశారు. చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్లో కొన్ని సీన్లు మారేడుమిల్లిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు హైదరాబాద్ శివారులో వేసిన టెంపుల్ సెట్లో ఆచార్య షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. చదవండి : ప్యాన్ ఇండియా’ను టార్గెట్ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్ -
ఆచార్య.. చలో రాజమండ్రి
రాజమండ్రికి ప్రయాణం కానున్నారు రామ్‌చరణ్. ‘ఆచార్య’ చిత్రీకరణ కోసం కొన్ని రోజులు అక్కడే ఉండనున్నారని తెలిసింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించడంతో పాటు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు చరణ్. తనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. రాజమండ్రిలో జరిపే షెడ్యూల్లో చరణ్‌పై ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి కూడా పాల్గొంటారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది. చదవండి: నా సిటీనే.. నా బ్యూటీ -
‘ఆచార్య’కు తెలంగాణ మంత్రి బంపరాఫర్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ తెలంగాణ మంత్రిని కలిశారు. ఖమ్మం జిల్లాలో మంత్రిని కలిసి గనుల్లో సినిమా షూటింగ్ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి అనుమతి ఇప్పించారని తెలిసింది. అయితే షూటింగ్ జరిగినన్ని రోజులు చిరంజీవి తన నివాసంలో ఉండాలని మంత్రి కోరారు. ఆయన విజ్ఞప్తితో చిరు మంత్రి నివాసంలో బస చేయనున్నారు. మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో ఆచార్య సినిమా షూటింగ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ మేరకు అనుమతుల కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను దర్శకుడు కొరటాల శివ కలిసి విజ్ఞప్తి చేశారు. అనుమతులు ఇవ్వడంతో పాటు మెగాస్టార్ చిరంజీవికి తానే ఆతిథ్యం ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఇల్లందులోని జేకే మైన్స్‌లో షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని చిత్రబృందం తెలిపింది. మంత్రిని కలిసిన అనంతరం దర్శకుడు కొరటాల శివ మాట్లాడారు. ‘ప్రస్తుతం ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందని… సినిమా షూటింగ్‌లకు జిల్లాలో చాలా అనువైన ప్రాంతాలున్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం ఖమ్మం స్వరూపం నేడు పూర్తిగా మారిపోయింది’ అని తెలిపారు. దీనికి కృషి చేసిన మంత్రి పువ్వాడకు ఈ సందర్భంగా దర్శకుడు అభినందనలు తెలిపారు. అయితే కొన్నిరోజుల కిందట ఆచార్య షూటింగ్‌లోనే చిరంజీవిని, కొరటాల శివను మంత్రి కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. -
‘ఆచార్య’లో కన్నడ స్టార్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య విడుదల కానుంది. ఆ రోజు మెగా అభిమానులకు పండుగ చేసుకోనున్నారు. ఆచార్యలో హీరో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధ అనే పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణలోనిప్పటికే చరణ్ జాయిన్ అయ్యారు. చరణ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. వచ్చే వారంలో చిరంజీవి–చరణ్ కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ ఆరంభమవుతుందని సమాచారం. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్ హీరోయిన్గా నటిస్తున్నారు. చదవండి: ‘ఆచార్య’గా మారిన డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్ తాజాగా ఆచార్యలో మరో స్టార్ హీరో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ నటుడు కిచ్చా సుదీప్ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్ల తెలుస్తోంది. అయితే సుదీప్ తెలుగు సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే నాని హీరోగా వచ్చిన ఈగ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పించిన సుదీప్ ఆ తరువాత ప్రభాస్ నటించిన బాహుబలిలోనూ ఓ పాత్ర పోషించారు. అంతేగాక చిరంజీవి సైరా నర్సింహరెడ్డి సినిమాలో కూడా సుదీప్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆచార్యలో కూడా నటించాల్సిందిగా సినిమా యూనిట్ కోరడంతో.. నటించేందుకు సుదీప్ ఒకే చెప్పినట్లు వినికిడి. కాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించలేదు. చదవండి: బాక్సాఫీస్ వార్: చిరు Vs బాలయ్య.. సై అంటున్న వెంకీ -
లెట్స్ డు కుమ్ముడు!
‘మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150’ చిత్రాల్లో చిన్న చిన్న సన్నివేశాల్లోనో, పాటలోనో స్క్రీన్ మీద కనిపించారు చిరంజీవి, రామ్‌చరణ్. ‘ఆచార్య’లో తొలిసారి పూర్తి స్థాయిలో కలసి నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్. ఇటీవలే చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. వచ్చే వారంలో చిరంజీవి–చరణ్ కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ ఆరంభమవుతుందని సమాచారం. ‘ఖైదీ నంబర్ 150’లో ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ పాటలో కొన్ని స్టెప్పులేసి వెళ్లారు చరణ్. ‘ఆచార్య’లో సీన్స్ మాత్రమే కాదు... లెట్స్ డు కుమ్ముడు అంటూ ఈ తండ్రీకొడుకులు స్టెప్స్ వేస్తారని టాక్. మే 13న ‘ఆచార్య’ రిలీజ్ కానుంది. -
బాక్సాఫీస్ వార్: చిరు Vs బాలయ్య.. సై అంటున్న వెంకీ
కరోనా కారణంగా గతేడాది సినిమాల రిలీజ్‌ను ఆగిపోవడంతో.. అంతా ఈ ఏడాదిపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు షూటింగ్ జరుపుకుంటునే.. విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ ఏడాది టాలీవుడ్లో గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. ముఖ్యంగా బడా హీరోల మధ్య ఈ ఏడాది బాక్సాఫీస్ వార్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఒకే నెలలో నలుగురు బడా హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’(మే13), విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’(మే14), మాస్ మహారాజా రవితేజ‘ఖిలాడి’(మే28) సినిమాల విడుదల తేదీలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈ బాక్సాఫీస్ వార్‌లోకి నందమూరి బాలకృష్ణ కూడా దూసుకొచ్చాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘బీబీ3’ మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. దీంతో చాలా రోజులు తర్వాత టాలీవుడ్ బడా హీరోలు చిరు, బాలయ్య, వెంకటేశ్‌లు కలిసి ఒకే నెలలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 90లలో మాత్రమే సాధ్యమైన ఫీట్ మళ్లీ ఇన్నాళ్టికి కనిపిస్తోంది చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్ సమయంలోనూ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో చిరుతో ఢీ కొట్టారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి చిరుతో బాక్సాఫీస్ వార్‌కు సిద్దమయ్యాడు బాలయ్య బాబు. కాకపోతే ఈ సారి వీరిద్దరి సినిమాల విడుదలకు రెండు వారాల గ్యాప్ ఉండడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఇక చిరంజీవి, వెంకటేశ్ ఒక రోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నారు. ఆచార్య మే 13న విడుదల అవుతుండగా, నారప్ప మే 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య సినిమా రిలీజ్ రోజే రవితేజ ‘ఖిలాడి’ విడుదల కాబోతుంది. వీరిద్దరివి మాస్ సినిమాలే కాబట్టి ఆ మేరకు కలెక్షన్స్ పరమైన షేరింగ్ ఉంటుందని భావిస్తున్నారు. సమ్మర్లో జరగబోయే బాక్సాఫీస్ వార్‌లో ఏ హీరో విజేతగా నిలుస్తాడో చూడాలి మరి. -
‘ఆచార్య’గా మారిన డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్
లాక్డౌన్ సమయంలో ఎన్నో టిక్‌టాక్ వీడియోలు చేసి అలరించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. భార్య, పిల్లలతో కలిసి అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్‌కు స్టెప్పులేసి దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే బాహుబలిలో ప్రభాస్ డైలాగ్ చెప్పి భారత సీనీ ప్రియుల మనసును దోచుకున్నాడు. తర్వాత ఈ స్టార్ క్రికెటర్ రూటు మార్చి రీఫేస్ యాప్‌ను ఉపయోగించి అమితాబ్, బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేశ్‌బాబు, దర్బార్‌లో రజినీకాంత్ సల్మాన్‌ఖాన్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి ఎంతగానో నెటిజన్లను ఆకట్టుకుంది. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ ‘ఆచార్య’గా మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌ను రీఫేస్ యాప్‌తో ఛేంజ్ చేసి చిరంజీవి డైలాగ్స్‌ని డేవిడ్ వార్నర్ చెప్పినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఆచార్య విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ `సిద్ధ` అనే కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత అందించాడు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
‘ఆచార్య’ మూవీ స్టిల్స్
-
ఆచార్యతో మంత్రి అజయ్.. సెట్లో సందడి
‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’గా వస్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఆచార్య షూటింగ్ లొకేషన్లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వాలిపోయారు. చిరంజీవిని కలిసి ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ విషయాలను మంత్రి ట్విటర్లో పంచుకున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆచార్య సినిమా సెట్లో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భారీ సెట్లో జరుగుతున్న షూటింగ్ ప్రదేశంలో మంత్రి కనిపించారు. చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి.. చిరంజీవికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మంత్రికి సినిమా విశేషాలను దర్శకుడు కొరటాల శివ వివరించారు. ఈ మేరకు మంత్రి అజయ్ ట్వీట్ చేశారు. చిరంజీవితో దిగిన ఫొటోలు పంచుకున్నారు. ఆ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అయితే మంత్రి ఎందుకు కలిశారో అనేది తెలియడం లేదు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. చిరంజీవి పక్కన జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆచార్య చిత్ర యూనిట్ తో చిరు హాసం.. Megastar @KChiruTweets గారి చిత్రం ఆచార్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ. ఎం pic.twitter.com/INwVEVjduo — Ajay Kumar Puvvada (@puvvada_ajay) January 30, 2021 -
ఆచార్య: మెగా అభిమానులకు డబుల్ ధమాకా
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నేడు డబుల్ ధమాకా లభించింది. చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి మరో తీపి కబురు అందించింది చిత్ర యూనిట్. ఇంతకముందే(జనవరి 29) ఆచార్య టీజర్‌ను విడుదల చేయగా.. వెంటనే సినిమా విడుదల తేదిని కూడా ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మే 13న ఆచార్య థియేటర్లలో సందడి చేయనున్నట్లు హీరో రామ్ చరణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ట్విటర్లో ‘ ప్రపంచ వ్యాప్తంగా మే 13 నుంచి ఆచార్య థియేటర్లలో విడుదల కానుంది’ అని ట్వీట్ చేశారు. చదవండి: ఆచార్య: తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు మరోవైపు శుక్రవారం విడుదలైన ఆచార్య టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. టీజర్లో చిరంజీవి, రామ్ చరణ్ చెప్పిన డైలాగులు అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక టీజర్.. సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చందమామ కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నెట్టింట్లో ఓ వైపు టీజర్ హవా నడుస్తుండగానే రిలీజ్ డేట్ కూడా కన్ఫార్మ్ చేయడంతో చిరంజీవి అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఒకే రోజు రెండు అప్డేట్లు రావడంతో సినిమా కోసం రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. చదవండి: మెగాస్టారా మజాకా.. నిమిషాల్లో లక్షల వ్యూస్ -
మెగాస్టారా మజాకా.. నిమిషాల్లో లక్షల వ్యూస్
మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజీ ఉన్న హీరో. సినీ ఇండస్ట్రీలో ఆయన క్రియేట్ చేయని రికార్డులు లేవంటే అతిశయోక్తి కాదు. చిరు నుంచి సినిమా వస్తుంది అంటే చాలు.. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే సందడి స్టార్ట్ అవుతోంది. ఒక్కసారి ఆయన అడుగుపెడితే రికార్డుల రచ్చ మొదలవ్వాల్సిందే.ఇప్పుడు కూడా అదే జరిగింది. తాజాగా చిరు నటించిన ‘ఆచార్య’ సినిమా టీజర్ రిలీజ్ అయింది. శుక్రవారం(జనవరి 29) సాయంత్రం 4:05 గంటల విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. విడుదలై 30 నిమిషాల్లోనే లక్షా ఎనభై వేలకు పైగా వ్యూస్ అందుకుంది.అలాగే లక్షన్నరకు పైగా లైకులు సాధించింది. విడుదలైన నిమిషాలకే లక్షల్లో వ్యూస్ వస్తే.. గంటలు, రోజుల్లో మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని మెగా ఫ్యాన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్‌పై అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టింది. ‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు’అంటూ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపించింది. విజువల్స్, చిరు ఫైట్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆచార్య టీజర్: దుమ్ము లేపిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం "ఆచార్య". ఈ సినిమా నుంచి అప్డేట్ ఉండబోతుందని రిపబ్లిక్ డే సందర్భంగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ మరుసటి రోజే టీజర్ డేట్ రివీల్ చేసింది. జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు టీజర్ విడుదల చేస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి అభిమానులు టీజర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తీరా ఆ ఉత్కంఠకు తెరదించే సమయం ఆసన్నమైంది. ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి. ప్రజానాయకుడు ప్రజల మధ్యలో నుంచే పుడతాడన్నట్లుగా పిడికిలి బిగిస్తూ ఎర్ర కండువాను ఎగరేస్తూ జన ప్రవాహం మధ్యలో నుంచి కెరటంలా లేస్తున్నాడు మెగాస్టార్. హీరో వరుణ్‌తేజ్ లీక్ చేసినట్లుగానే టీజర్లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. 'ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు' అని చెర్రీ వాయిస్ ఓవర్ ఇస్తుండగా మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారు. 'పాఠాలు చెప్పకపోయినా అందరూ ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో' అన్న చిరు డైలాగ్ కేక పుట్టిస్తోంది. టీజర్ రిలీజైందో లేదో క్షణాల్లోనే లక్షల వ్యూస్ సంపాదిస్తూ ట్రెండ్ అవుతోంది. (చదవండి: అందుకే బ్రేక్ తీసుకుంటున్నా: కపిల్ శర్మ) కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, ఆయన తనయుడు రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటించనుంది. కాగా ఆ మధ్య 'ఆచార్య' కథ నాదేనంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ, రాజేశ్ మండూరి అనే రచయితలు ఆరోపణలు చేశారు. అందులో ఎటువంటి నిజం లేదని ఆచార్య చిత్రబృందం కొట్టిపారేస్తూ లేఖ విడుదల చేసింది. ఆచార్య కథ కాన్సెప్ట్ ఒరిజినల్‌గా కొరటాల శివ తయారు చేశారని చెప్తూ ఆయన మీద ఆరోపణలు చేయడం సరి కాదని పేర్కొన్న విషయం తెలిసిందే. (చదవండి: ఆచార్య: రామ్ చరణ్‌కు జోడీ కుదిరింది) -
ఆచార్య: 20 నిమిషాల కోసం రూ. కోటి
ముంబై భామ పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో పట్టిందంతా బంగారమే అవుతోంది. గతేడాది అలవైకుంఠపురములో సినిమాతో విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుసపెట్టి ఆఫర్లు వచ్చి వాలుతున్నాయి. ఇప్పటికే పూజా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రభాస్‌తో కలిసి రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తోంది. వీటితోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ ఈ బుట్టబొమ్మ తళుకున్న మెరవనున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించనుండగా..ఆయన తనయుడు రామ్ చరణ్‌కు జోడీగా పూజా నటించనుంది. చదవండి: ఆ హీరోయిన్ కావాలంటున్న త్రివిక్రమ్! ఇదిలా ఉండగా వచ్చే అవకాశాలకు తగ్గట్టుగానే పూజా తన రెమ్యూనరేషన్‌ను కూడా సెట్ చేసుకుంటోంది. ఆచార్య స్క్రీన్ మీద ఆమె పాత్ర కేవలం 20 నిమిషాలే ఉండనుంది. అయితే సమయంతో సంబంధం లేకుండా 20 నిమిషాల పాత్ర కోసం పూజా కోటి రూపాయలు తీసుకోబోతుందటా. వినడానికి కొంచెం ఆశ్యర్యంగానే ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు ఈ భామకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇక ఆచార్యలో అందరూ బడా స్టార్స్ నటిస్తుండటంతో తను కూడా భారీగానే రెమ్యూనరేషనర్ తీసుకోవాలని పూజా భావించి కోటి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు చిత్ర యూనిట్ కూడా సుముఖంగానే ఉండటంతో అక్షరాల కోటి రూపాయలకు ఆమెకు సమర్పించుకోనున్నారు. మరి అంత మొత్తంలో అందుకున్న పూజా క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆచార్య విడుదలయయ్యే వరకు వేచి చూడాలి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. మే 7 విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. -
‘ఆచార్య’ బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ భారీ చిత్రం తాలుకా టీజర్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ ను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ నెల 29 (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేస్తూ..‘తమ ధర్మ స్థలి తలుపులు వచ్చే జనవరి 29న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తెరుచుకుంటాయని’ చిత్రబృందం తెలియజేసింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ `సిద్ధ` అనే కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత అందించాడు. -
ఆచార్య: రేపే బిగ్ అనౌన్స్మెంట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు (జనవరి 26) గణతంత్య దినోత్సవం కావడంతో టీజర్ విడుదల చేస్తారని అందరూ వేయికళ్లతో చూస్తున్నారు. కానీ ఇప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడంతో చిరు అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఓ ఆసక్తికరమైన అప్డేట్ అందించారు. ఆచార్య టీజర్ అప్డేట్ రేపు ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రకటన మెగాస్టార్ కాస్తా వినూత్నంగా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో చిరంజీవి, కొరటాల శివ మధ్య టీజర్ విడుదల ఎప్పుడన్న విషయంపై సరదా సంభాషణ జరుగుతున్నట్లు వివరించారు. చదవండి: గణతంత్ర వేడుకల్లో మెగా ఫ్యామిలీ ఇక మెగాస్టార్ నుంచే టీజర్ విషయం బయటికి రావడంతో రేపటి కోసం అభిమానులు ఈ సారి క్లారిటీగా ఉన్నారు. కాగా చందమామ కాజల్ ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనుండగా అతనికి జోడీగా పూజాహెగ్డే నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక ఆచార్య తర్వాత చిరు మోహన్‌రాజా దర్శకత్వంలో 'లూసీఫర్' రీమేక్‌లో నటించనున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. చదవండి: ఆచార్య: రామ్ చరణ్‌కు జోడీ కుదిరింది So here goes.. @sivakoratala @MatineeEnt@KonidelaPro @AlwaysRamCharan #Acharya pic.twitter.com/YdZ84lkXhL — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2021 -
ఆచార్య: రామ్ చరణ్‌కు జోడీ కుదిరింది
'సైరా నరసింహారెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వంలో చిరు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఆచార్య సెట్స్‌లోకి చరణ్ ఇటీవలే అడుగు కూడా పెట్టేశాడు. ఈ మేరకు డైరెక్టర్ కొరటాల శివ.. ఆచార్య సెట్స్‌లోకి స్వాగతం రామ్‌చరణ్ అంటూ ట్వీట్ చేశారు. మా సిద్ధ సర్వం సిద్ధం అంటూ ఆయన పాత్ర పేరును కూడా వెల్లడించారు. భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెగా అభిమానులతోపాటు ప్రేక్షకుల్లోనూ అంతకంతకూ ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చదవండి: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించబోతోందని తెలుస్తోంది. మొదట రష్మిక మందన్నను అనుకున్నప్పటికీ తనకు డేట్స్ కుదరకపోవడంతో పూజాను సంప్రదించారట.. దీనికి వెంటనే ఒప్పుకున్న బుట్టబొమ్మ ఈ ప్రాజెక్టుపై సంతకం కూడా చేసిందట. ఇక నెక్స్ట్ షెడ్యూల్లో పూజా సెట్స్‌లోకి అడుగు పెట్టనుంది. చరణ్-పూజా హెగ్డే షూట్ ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ పూజా హెగ్డేపై ఓ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ మూవీ చిత్రీకరణ త్వరగా పూర్తిచేసి సమ్మర్ బరిలో నిలపాలని చూస్తోంది యూనిట్. అంతేగాక ఈ చిత్రం టీజర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో జనవరి 26వ తేదీన రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. చదవండి: ఆ హీరోయిన్ కావాలంటున్న త్రివిక్రమ్! -
ఆచార్య: డేట్ ఫిక్స్ చేయమంటున్న చిరు!
'సైరా నరసింహారెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వంలో చిరు హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు టీజర్ విడుదల చేసి అభిమానులను సర్‌పప్రైజ్ చేయాలన్న ఆలోచనలో ఉందట చిత్రయూనిట్. పైగా ఆచార్య కథకు ఆ రోజు రిలీజ్ చేస్తేనే బాగుంటుందని సూచించారట మెగాస్టార్. ఇక ఖైదీ నంబర్ 150లో చిరుతో జోడీ కట్టిన చందమామ కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలైంది. సైరా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వస్తున్న సినిమా కావడంతో ఆచార్య టీజర్ గురించి ప్రేక్షక లోకం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. మరి ఈ టీజర్లో చిరుతో పాటు, చెర్రీని కూడా ఒకే దగ్గర చూపించారంటే సోషల్ మీడియాలో సునామీ రావడం ఖాయం. 'ట్రెండింగ్ ఏ రేంజ్లో చేయాలో మేము చూసుకుంటాం, మీరు జస్ట్ టీజర్ వదలండి చాలు' అంటూ అభిమానులు సంబరాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు. (చదవండి: బైక్‌పై భారీయాత్రకు సిద్ధమైన స్టార్ హీరో!) కాగా ఆచార్య షూటింగ్ గతేడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లగా లాక్డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ పాటలో చిరు స్టెప్స్ అభిమానులతో ఈలలు కొట్టించేలా ఉన్నాయట. ఇక ఆచార్య తర్వాత చిరు మోహన్‌రాజా దర్శకత్వంలో 'లూసీఫర్' రీమేక్‌లో నటించనున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. (చదవండి: జేమ్స్ బాండ్ 007 నటి మృతి) -
అదే జరిగితే మెగా అభిమానులకు పండగే
ప్రస్తుతం టాలీవుడ్లో భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలు, మల్టీ సార్టర్ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రేక్షకులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు మరింత కిక్కెచ్చే న్యూస్ ఒకటి ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ ఇప్పటికే మెగస్టార్ చిత్రాల్లో మెరిశారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఆచార్య చిత్రంలో సిద్ధ పేరుతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలిసిన షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌లు కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారట. మరో సర్ప్రైజ్ ఏంటంటే ఈ చ్రితానికి భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: పవన్‌కు త్రివిక్రమ్ మాట సాయం) ప్రస్తుతం శంకర్ డైరెక్ట్‌గా తెలుగు సినిమా చేయాలని భావిస్తున్నారట. ఇందుకు గాను లాక్‌డౌన్‌లోనే కథలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే పవన్‌కి, చరణ్‌కి స్టోరీ నరేట్ చేశారని.. వారిద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దాంతో బాబాయి- అబ్బాయి ఇద్దరు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యారనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ లీడ్ రోల్ పోషిస్తారని.. పవన్ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇక దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికి.. మెగా అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిలు ఓ మల్టిస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మాళయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని దర్శకుడు సాగర్ కే చంద్ర తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆచార్య: చెర్రీ 'సిద్ధ'మయ్యాడుగా..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సెట్స్‌లో రామ్‌చరణ్ అడుగు పెట్టారట. ఎప్పటిలాగే షూటింగ్ చూడటానికి వచ్చారనుకోకండి.. తనకిచ్చిన పాత్రలో జీవించేయడానికి వచ్చారట. ఈ మేరకు డైరెక్టర్ కొరటాల శివ.. ఆచార్య సెట్స్‌లోకి స్వాగతం రామ్‌చరణ్ అంటూ ట్వీట్ చేశారు. మా సిద్ధ సర్వం సిద్ధం అంటూ ఆయన పాత్ర పేరును కూడా వెల్లడించారు. దీంతో మొత్తానికి రామ్‌చరణ్ మీద షూటింగ్ ప్రారంభమైనట్లు క్లారిటీ వచ్చేసింది. (చదవండి: ‘ఆచార్య’ టెంపుల్ సెట్‌పై చిరు ఆసక్తికర ట్విట్) అలాగే ముందుగా అనుకున్నట్లుగా కాకుండా సినిమాలో ఆయన నిడివిని కూడా పెంచినట్లు సమాచారం. కాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను తేజ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9న థియేటర్లలోకి వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కాబట్టి ఆ సెంటిమెంట్‌ను నమ్ముకుని ఈ సినిమాను కూడా ఆ లక్కీడేట్ నాడే రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉందట చిత్రబృందం. (చదవండి: మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో నాగ్ సందడి) మా ' సిద్ధ ' సర్వం సిద్ధం. Welcoming our #ramcharan garu onto the sets of #Acharya. @AlwaysRamCharan @KChiruTweets #manisharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan @KonidelaPro @MatineeEnt pic.twitter.com/hJaaYDqF1K — koratala siva (@sivakoratala) January 17, 2021