
ఇక్కడున్న ఫోటో చూశారుగా! నీలాంబరి కోసం ప్రేమతో ప్లూటుపై ఏదో ప్రేమ సందేశం రాస్తున్నట్లున్నారు సిద్ధ. ఈ సందేశం నీలాంబరికి ఎలా చేరుతుందనేది ఈ వేసవిలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ నాయికగా నటించిన ఈ చిత్రంలో సిద్ధ పాత్రలో రామ్‌చరణ్, నీలాంబరి పాత్రలో పూజాహెగ్డే నటించారు. ఆదివారం (మార్చి 27) రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ చిత్రంలోని సిద్ధ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది.
హైదరాబాద్‌లో వేడుకలు
రామ్‌చరణ్ బర్త్ డే వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. వరుణ్ తేజ్, మెహర్ రమేష్, బాబీ తదితర చిత్రరంగ ప్రముఖులు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రక్తదానం చేసినవారిని ఈ వేదికపై సత్కరించారు.
Team #Acharya wishes our Mega PowerStar @AlwaysRamCharan a very Happy Birthday ❤️
— Konidela Pro Company (@KonidelaPro) March 27, 2022
It is already a blockbuster year, can't wait to make it bigger next month😎#AcharyaOnApr29
Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @adityamusic pic.twitter.com/8Xpa2Ilovv
చదవండి: చరణ్.. నన్ను గర్వపడేలా చేశాడు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment